స్తుతులు స్తోత్రాలు : :: విష్ణు స్తుతులు::
అదితి కృత హరి స్తుతి (శుభ కరము)
1
యజ్ఞేశ! విశ్వంభరాచ్యుత! శ్రవణ మం-
గళనామధేయ! లోకస్వరూప!
యాపన్న భక్త జనార్తి విఖండన!-
దీనలోకాధార! తీర్థపాద!
విశ్వోద్భవస్థితి విలయకారణభూత!-
సంతతానంద! శశ్వద్విలాస!
యాయువు దేహంబు ననుపమ లక్ష్మియు-
వసుధయు దివముఁ ద్రివర్గములును
2
వైదికజ్ఞాన యుక్తియు వైరిజయము
నిన్నుఁ గొలువని నరులకు నెఱయఁ గలదె
వినుతమందార! గుణహార! వేదసార!
ప్రణత వత్సల! పద్మాక్ష! పరమపురుష!
3
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత అష్టమ స్కంధ అంతర్గత అదితి కృత హరి స్తుతి (శుభ కరము)