పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : :: రామ స్తుతులు::
పోతనామాత్యకృత షష్ఠ్యంతములు (సంకల్ప సిద్ధికరం)

  1
హారికి, నందగోకులవిహారికిఁ జక్రసమీరదైత్య సం
హారికి, భక్తదుఃఖపరిహారికి, గోపనితంబినీ మనో
హారికి, దుష్టసంపదపహారికి, ఘోషకుటీపయోఘృతా
హారికి, బాలకగ్రహమహాసురదుర్వనితాప్రహారికిన్.

  2
శీలికి, నీతిశాలికి, వశీకృతశూలికి, బాణ హస్త ని
ర్మూలికి, ఘోర నీరదవిముక్త శిలాహతగోపగోపికా
పాలికి, వర్ణధర్మపరిపాలికి, నర్జునభూజయుగ్మ సం
చాలికి, మాలికిన్, విపుల క్ర నిరుద్ధ మరీచి మాలికిన్.

  3
క్షంకుఁ, గాళియోరగవిశాలఫణావళినర్తనక్రియా
రంకు, నుల్లసన్మగధరాజ చతుర్విధ ఘోర వాహినీ
హంకు, నింద్ర నందన నియంతకు, సర్వచరాచరావళీ
మంకు, నిర్జితేంద్రియసమంచితభక్తజనానుగంతకున్.

  4
న్యాయికి, భూసురేంద్రమృతనందనదాయికి, రుక్మిణీమన
స్థ్సాయికి, భూతసమ్మదవిధాయికి, సాధుజనానురాగ సం
ధాయికిఁ, బీతవస్త్రపరిధాయికిఁ, బద్మభవాండభాండ ని
ర్మాయికి, గోపికానివహ మందిరయాయికి, శేషశాయికిన్.

  5
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత ప్రథమ స్కంధ అంతర్గత పోతనామాత్యకృత షష్ఠ్యంతములు (సంకల్ప సిద్ధికరం)