పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : శివజ్వరం చేసిన కృష్ణస్తుతి (జ్వర హరం)

  1
"వ్యయు, ననఘు, ననంతశక్తిని, బరు-
యినట్టి బ్రహ్మ రుద్రామరేంద్ర
రుల కీశ్వరుఁ డైనవాని, సర్వాత్మకు-
జ్ఞానస్వరూపు, సమానరహితు,
రదుని, జగదుద్భస్థితి సంహార-
హేతుభూతుని, హృషీకేశు, నభవు,
బ్రహ్మచిహ్నంబులై రఁగు సుజ్ఞాన శ-
క్త్యాదుల నొప్పు బ్రహ్మంబు, నీశు,

  2
జు, షడూర్మిరహితు, నియోగమాయా వి
మోహితాఖిలాత్ము, ముఖ్యచరితు,
హితతేజు, నాదిధ్యాంతహీనునిఁ,
జిన్మయాత్ము నిను భజింతుఁ గృష్ణ!

  3
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత దశమస్కంధ ఉత్తరభాగ అంతర్గత శివజ్వరం చేసిన కృష్ణస్తుతి (జ్వర హరం)