పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : పృథ్వి చేసిన కృష్ణ స్తుతి (అభయ ప్రదం)

  1
"అంభోజనాభున కంభోజనేత్రున-
కంభోజమాలాసన్వితునకు
నంభోజపదున కనంతశక్తికి వాసు-
దేవునకును దేవదేవునకును
క్తులు గోరినభంగి నే రూపైనఁ-
బొందువానికి నాదిపురుషునకును
ఖిల నిదానమై యాపూర్ణవిజ్ఞానుఁ-
యినవానికిఁ, బరమాత్మునకును,

  2
ధాతఁ గన్న మేటితండ్రికి, నజునికి,
నీకు వందనంబు నే నొనర్తు
నిఖిలభూతరూప! నిరుపమ! యీశ! ప
రాపరాత్మ మహిత! మితచరిత!

  3
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత దశమస్కంధ ఉత్తరభాగ అంతర్గత పృథ్వి చేసిన కృష్ణ స్తుతి (అభయ ప్రదం)