పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : ద్వారకావాసుల స్తుతి (ఆత్మార్పణం)

  1
"నీపాదాబ్జము బ్రహ్మపూజ్యము గదా, నీ సేవ సంసార సం
తాధ్వంసినియౌఁ గదా, సకలభద్రశ్రేణులం బ్రీతితో
నాపాదింతు గదా ప్రపన్నులకుఁ గాలాధీశ! కాలంబు ని
ర్వ్యాపారంబు గదయ్య చాలరు నినున్ ర్ణింప బ్రహ్మాదులున్.

  2
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత ప్రథమ స్కంధ అంతర్గత ద్వారకావాసుల స్తుతి (ఆత్మార్పణం)