పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : *** గోపికలు కృష్ణుని అల్లరి చెప్పుట (మధుర భక్తి)

   1
"“బాలురకుఁ బాలు లే వని
బాలింతలు మొఱలుపెట్టఁ కపక నగి యీ
బాలుం డాలము చేయుచు
నాకుఁ గ్రేపులను విడిచె నంభోజాక్షీ!"

2
"పడఁతీ! నీ బిడ్డడు మా
వలలో నున్న మంచి కాఁగిన పా లా
డుచులకుఁ బోసి చిక్కిన
వలఁ బో నడిచె నాజ్ఞ లదో లేదో?"

3
"మీ పాపఁడు మా గృహముల
నా పోవఁగఁ బాలు ద్రావ గపడ కున్నన్
గోపింపఁ బిన్నపడుచుల
వాపోవఁగఁ జిమ్ముకొనుచు చ్చెం దల్లీ!"

4
"పుట్టి పుట్టఁడు నేడు దొంగిలఁ బోయి మా యిలు జొచ్చి తా
నుట్టి యందక ఱోలు పీఁటలు నొక్క ప్రోవిడి యెక్కి చై
పెట్టఁ జాలక కుండ క్రిం దొక పెద్ద తూఁ టొనరించి మీ
ట్టి మీఁగడపాలు చేరలఁ ట్టి త్రావెఁ దలోదరీ!"

5
"ఆడం జని వీరల పెరు
గోక నీ సుతుఁడు ద్రావి యొక యించుక తాఁ
గోలి మూఁతిం జరిమినఁ
గోలు మ్రుచ్చనుచు నత్త గొట్టె లతాంగీ!"

6
"వా రిల్లు చొచ్చి కడవలఁ
దోరంబగు నెయ్యిఁ ద్రావి తుది నా కడవల్
వీరింట నీ సుతుం డిడ
వారికి వీరికిని దొడ్డ వా దయ్యె సతీ!"

7
"""వేలుపులఁటె; నా కంటెను
వేలుపు మఱి యెవ్వ""రనుచు వికవిక నగి మా
వేలుపుల గోడపై నో
హేలావతి! నీ తనూజుఁ డెంగిలిఁ జేసెన్."

8
"వెన్నఁ దినఁగఁ బొడగని మా
పిన్నది యడ్డంబు వచ్చి పిఱిఁదికిఁ దివియన్
న్నొడిసి పట్టి చీఱెనుఁ
జిన్ని కుమారుండె యితఁడు? శీతాంశుముఖీ!"

9
"ఇమ్మగువ దన్ను వాకిటఁ
గ్రుమ్మరుచోఁ జీరి నిలిపికొని పే రడుగం
గెమ్మోవిఁ గఱచి వడిఁ జనె
మ్మా! యీ ముద్దుగుఱ్ఱఁ ల్పుఁడె? చెపుమా."

10
"చేబంతి దప్పి పడెనని
ప్రాల్యముతోడ వచ్చి వనము వెనుకన్
మా బిడ్డ జలక మాడఁగ
నీ బిడ్డఁడు వలువఁ దెచ్చె నెలఁతుక! తగునే?"

11
"ఇచ్చెలువఁ జూచి ""మ్రుచ్చిలి
చ్చుగ నుఱికించుకొనుచు రిగెద; నాతో
చ్చెదవా?""యని యనినాఁ
డిచ్చిఱుతఁడు; సుదతి! చిత్ర మిట్టిది గలదే?"

12
"కొడుకులు లేరని యొక సతి
డు వగవఁగఁ దన్ను మగనిఁగాఁ గైకొనినం
గొడుకులు గలిగెద రని పైఁ
డినాఁ డిది వినుము శిశువు నులే? తల్లీ!"

13
"""తలఁగినదానం దల""మనఁ
లఁగక యా చెలికి నాన లయెత్తఁగ ""నీ
లఁగిన చోటెయ్యది""యని
యూఁచెన్ నీ సుతుండు గవె? మృగాక్షీ!"

14
"వ్రాలఁగ వచ్చిన నీ సతి
""చూలాలం దలఁగు""మనుడు ""జూ లగుటకు నే
మూలంబు జెప్పు""మనె నీ
బాలుఁడు; జెప్పుదురె సతులు? ర్వేందుముఖీ!"

15
"మగువా! నీ కొమరుఁడు మా
వా రటు పోవఁ జూచి మంతనమునకుం
గఁ జీరి పొందు నడిగెను
ముల మున్నిట్టి శిశువు దువంబడెనే?"

16
"మ్మి నిదురబోవ నా పట్టిచుంచు మా
లేఁగతోఁకతోడ లీలఁ గట్టి
వీథులందుఁ దోలె వెలది! నీ కొమరుండు;
రాచబిడ్డఁ డైన వ్వ మేలె?"

17
"నా ట్టి పొట్ట నిండఁగఁ
బై డి నీ పట్టి వెన్న బానెం డిడినాఁ;
డూపిరి వెడలదు; వానిం
జూపెద నేమైన నీవ సుమ్ము లతాంగీ!"

18
"తెవ యొకతె నిద్రింపఁగ
నెఱిఁ గట్టిన వలువ వీడ్చి నే టగు తేలుం
పించి నీ కుమారుఁడు
వెచుచు నది పఱవ నగియె విహితమె? సాధ్వీ!"

19
"నా కొడుకును నా కోడలు
నేతమునఁ బెనఁగ బాము నీతఁడు వైవం
గో లెఱుంగక పాఱినఁ
గూఁ లిడెన్ నీ సుతుండు గుణమె? గుణాఢ్యా!"

20
"రుణి యొకతె పెరుగుఁ ద్రచ్చుచోఁ దుది వంగి
వెన్నదీయ నొదిఁగి వెనుకఁ గదిసి
గువ! నీ సుతుండు గపోఁడుములు చేయ
సాఁగినాఁడు తగదె? క్కఁజేయ."

21
"లకంఠి! మా వాడ రితల మెల్ల నీ-
ట్టి రాఁగల డని పాలు పెరుగు
లిండ్లలోపల నిడి యే మెల్లఁ దన త్రోవఁ-
జూచుచో నెప్పుడు చొచ్చినాఁడొ?
లుపుల ముద్రల తాళంబులును బెట్టి-
యున్న చందంబున నున్న వరయ;
నొక యింటిలోఁ బాడు నొక యింటిలో నాడు-
నొక యింటిలో నవ్వు నొకటఁ దిట్టు;"

22
"నొకట వెక్కిరించు నొక్కొకచో మృగ
క్షి ఘోషణములు రఁగఁ జేయు
నిట్లు చేసి వెనుక నెక్కడఁ బోవునో
కాన రాఁడు రిత్త డవ లుండు."

23
"కడు లచ్చి గలిగె నేనిం
గుడుతురు గట్టుదురు గాక కొడుకుల నగుచున్
డుగుల వాడలపైఁ బడ
విడుతురె రాకాంత లెందు? విమలేందుముఖీ!"

24
"ఓ మ్మ! నీ కుమారుఁడు
మా యిండ్లను బాలు పెరుగు ననీ డమ్మా!
పోయెద మెక్కడి కైనను
మా న్నల సురభులాన మంజులవాణీ!”
<<<<<<<హరి హ రాభేదము చూపుట (ముందరి ఘట్టం)
యశోద గోపికల నొడంబరచుట (తరువాయి ఘట్టం) >>>>>>>> "

25
అని మఱియు ననేకవిధంబుల బాలకృష్ణుండు చేయు వినోదంబులు దమ యందుఁ జేయు మహాప్రసాదంబు లని యెఱుంగక దూఱుచున్నయట్టి గోపికలకు యశోద యిట్లనియె.

  26
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత దశమస్కంధ పూర్వభాగ అంతర్గత గోపికలు కృష్ణుని అల్లరి చెప్పుట (మధుర భక్తి ప్రదం) అను స్తుతి