పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : కాళిందుని విన్నపము (రక్షాకరం)

  1
"లఁకలు మా ప్రచారములు మా ముఖముల్ విషవహ్ని ఘోరముల్;
లులము; రోషజాతులము; ర్వుల; మే మొక మంచివారమే?
ళినదళాక్ష! ప్రాణులకు నైజగుణంబులు మాన నేర్చునే?
వెయవె? మా వికారములు వింతలె? మే లొనరించి తీశ్వరా!

  2
వివిధ భావాకార వీర్యబీజాశయ-
వయోనియుతముగా గము లెల్ల
నీవ చేసితి మున్న; నే మా జగంబులో-
హజకోపనులము ర్పములము;
దుర్వారమైన నీ తోరంపు మాయ నే-
మెఱిఁగి దాఁటెడు పని కెంతవార;
మంతకుఁ గారణ ఖిలేశ్వరుండవు-
ర్వజ్ఞుఁడవు నీవు లజనయన!

  3
నిచె దేనిని మన్నించి నుపు నన్ను
నిగ్రహించెద వేనిని నిగ్రహింపు;
మింక సర్వేశ! మాయిమ్ము లెందుఁ గలవు
చిత్తమందున్న క్రమమునఁ జేయఁదగును.

  4
నా పుణ్య మేమి చెప్పుదు?
నీ పాదరజంబుఁ గంటి నే; సనకాదుల్
నీ పాదరజముఁ గోరుదు
రే దమం దున్ననైన నిఁక మేలు హరీ!"

  5
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత దశమస్కంధ పూర్వభాగ అంతర్గత కాళిందుని విన్నపము (రక్షాకరం)అను స్తుతి