పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

శ్రీ ఉషాపరిణయము : ఉపోద్ఘాతము

శ్రీరామ

శ్రీ ఉషాపరిణయము

ప్రార్థన

10.2-320-సీ.
శ్రీర! పరిశోషిత ర
త్నార! కమనీయగుణగణాకర! కారు
ణ్యార! భీకరశర ధా
రాకంపితదానవేంద్ర! రామనరేంద్రా!
టీక:-  శ్రీకర = శ్రీరామ {శ్రీ కరుడు - శ్రీ (సంపదలను) కరుడు (కలుగజేయు వాడు), రాముడు}; పరిశోషితరత్నాకర = శ్రీరామ {పరిశోషిత రత్నాకరుడు - పరిశోషిత (ఇంకిపోవునట్లు చేసిన) రత్నాకరుడు (సముద్రము కలవాడు), రాముడు}; కమనీయగుణగణాకర = శ్రీరామ {కమనీయ గుణ గణాకరుడు - కమనీయ (మనోజ్ఞము లైన) గుణగణ (గుణముల సమూహము) లకు ఆకరుడు (నిధి వంటి వాడు), రాముడు}; కారుణ్యాకర = శ్రీరామ {కారుణ్యాకరుడు - కారుణ్య (దయ)కి ఆకరుడు (నిధి వంటి వాడు), రాముడు}; భీకరశరధారాకంపితదానవేంద్ర = శ్రీరామ {భీకర శర ధారాకంపిత దానవేంద్రుడు - భీకర (భయంకర మైన) శర (బాణముల) ధారా (పరంపరలచే) ఆకంపిత (వణికింపబడిన) దానవేంద్రుడు (రాక్షస ప్రభువులు కలవాడు), రాముడు}; రామనరేంద్రా = శ్రీరామ {రామ నరేంద్రుడు - రాముడు అనెడి నరేంద్రుడు (రాజు), రాముడు}.
భావము:-  సంపదలను కలుగజేయు వాడా; సముద్రము ఇంకిపోవునట్లు చేసిన వాడా; మనోజ్ఞములైన గుణగణములకు నిధి వంటి వాడా; దయకి నిధి వంటి వాడా; రాక్షస ప్రభువులను భయంకరమైన బాణపరంపరలచే వణికింప జేసినవాడా; మహారాజా! శ్రీరామ!