పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

శ్రీ ఉషాపరిణయము : మిగతా భాగం - శివ కృష్ణులకు యుద్ధమగుట

10.2-419-చ.
కుముదంబు లుల్లసితచామర ఫేనము లాతపత్ర భా
సునవపుండరీకములు శోణితతోయము లస్థి సైకతో
త్కము భుజాభుజంగమనికాయము కేశకలాప శైవల
స్ఫుణ రణాంగణం బమరెఁ బూరిత శోణనదంబు పోలికన్.
టీక:-  శర = బాణములు అను; కుముదంబులున్ = తెల్లకలువలు; ఉల్లసిత = ప్రకాశించుచున్న; చామర = వింజామరలు అను; ఫేనములు = నురుగలు; ఆతపత్ర = గొడుగులు అను; భాసుర = ప్రకాశించుచున్న; నవ = నవనవ లాడుతున్న; పుండరీకములున్ = తెల్లతామరలు; శోణిత = రక్తము అను; తోయములు = నీళ్ళు; అస్థి = ఎముకలు అను; సైకత = ఇసుక తిన్నెల; ఉత్కరమున్ = సమూహములు; భుజ = చేతులు అను; భుజంగమ = పాముల; నికాయమున్ = సమూహములు; కేశ = శిరోజముల; కలాప = సమూహములు అను; శైవల = పాచి; స్ఫురణన్ = స్ఫురించుచుండుటచేత; రణ = యుద్ధ; అంగణంబు = క్షేత్రము; అమరెన్ = ఒప్పి ఉన్నది; పూరిత = నిండుగా ఉన్న; శోణ = రక్తపు; నదంబు = ఏరులు కలదాని; పోలికన్ = వలె.
భావము:-  బాణాలు కలువపూలుగా; చామరాలు నురుగు తెట్టెలుగా; గొడుగులు తెల్లతామరలుగా; రక్తము నీరుగా; ఎముకలు ఇసుకతిన్నెలుగా; భుజాలు సర్పాలుగా; కేశాలు నాచుగా రణరంగం ఒక రక్తపుటేరులా ఆ సమయంలో భాసించింది.

10.2-420-వ.
అట్టియెడ బాణుండు గట్టలుకం గృష్ణునిపైఁ దనరథంబుఁ బఱపించి, యఖర్వబాహాసహస్ర దుర్వారగర్వాటోప ప్రదీప్తుండై కదిసి.
టీక:-  అట్టి = ఆ; ఎడన్ = సమయము నందు; బాణుండు = బాణుడు; కట్ట = మిక్కుటమైన; అలుకన్ = కోపముతో; కృష్ణుని = కృష్ణుని; పైన్ = మీద; తన = తన యొక్క; రథంబున్ = రథమును; పఱపించి = తోలించి; అఖర్వ = విస్తారమైన; బాహా = చేతులు; సహస్ర = వేయింటితో (1000); దుర్వార = వారింపరాని; గర్వ = అహంకారపు; ఆటోప = సంరంభముతో; ప్రదీప్తుండు = మిక్కిలి ప్రకాశించువాడు; ఐ = అయ్యి; కదిసి = సమీపించి.
భావము:-  అప్పుడు బాణాసురుడు మిక్కిలి కోపంతో తన రథాన్ని ముందుకు నడిపించి, సహస్ర బాహువులు ఉన్నాయనే అహంకారంతో, శ్రీకృష్ణుడిని ఎదుర్కొన్నాడు.

10.2-421-మ.
యేనూఱు కరంబులన్ ధనువు లత్యుగ్రాకృతిం దాల్చి త
క్కయొక్కొక్కట సాయకద్వయము వీఁకంబూన్చు నాలోన నం
హస్తుండు తదుగ్రచాపచయ విధ్వంసంబు గావించి కొం
తత్సారథిఁ గూలనేసి రథముం క్కాడి శౌర్యోద్ధతిన్.
టీక:-  ఒక = ఒకానొక; ఏనూఱు = ఐదువందల (500); కరంబులన్ = చేతులతో; ధనువులన్ = విల్లులు; అతి = మిక్కిలి; ఉగ్ర = భయంకరమైన; ఆకృతిన్ = రీతితో; తాల్చి = ధరించి; తక్కకన్ = తప్పిపోకుండా; ఒక్కొక్కటన్ = ఒకోదానిలోను; సాయక = బాణముల; ద్వయమున్ = జంటను; వీకన్ = ఉత్సాహముగా; పూన్చు = సంధించు; ఆలోనన్ = ఆలోపల; నందకహస్తుండు = కృష్ణుడు {నందకము - విష్ణువు యొక్క కత్తి}; తత్ = అతని {నందక హస్తుడు - నందకము చేతిలో ధరించినవాడు, కృష్ణుడు}; ఉగ్ర = భయంకరమైన; చాప = ధనుస్సుల; చయ = సమూహము యొక్క; విధ్వంసంబున్ = విరగగొట్టుటను; కావించి = చేసి; కొంజక = సంకోచింపకుండా; తత్ = ఆ యొక్క; సారథిన్ = రథము నడపువానిని; కూలనేసి = పడగొట్టి; రథమున్ = రథమును; చక్కాడి = ముక్కలు చేసి; శౌర్య = వీరత్వము; ఉద్ధతిన్ = ఉధృతితో.
భావము:-  బాణాసురుడు తన ఐదువందల చేతులతో ఐదువందల ధనుస్సులను ధరించి తక్కిన ఐదువందల హస్తాలతో రెండేసి చొప్పున బాణాలను సంధించబోతుంటే, అంతలోనే, శ్రీకృష్ణుడు అవక్రవిక్రమంతో విజృంభించి ఆ ధనుస్సులను ధ్వంసం చేసాడు; సంకోచించకుండా సారథిని సంహరించాడు; బాణుని రథాన్ని నుగ్గునుగ్గు గావించాడు.

10.2-422-తే.
ప్రళయ జీమూత సంఘాత యద భూరి
భైరవారావముగ నొత్తెఁ బాంచజన్య
ఖిలజనులు భయభ్రాంతుయి చలింపఁ
డఁగి నిర్భిన్న రాక్షసీర్భముగను.
టీక:-  ప్రళయ = ప్రళయకాలపు; జీమూత = మేఘముల; సంఘాత = సమూహమువలె; భయద = భయమును కలిగించెడి; భూరి = మిక్కిల అధికమైన; భైరవ = భీకరమైన; ఆరావము = ధ్వని; కను = కలుగునట్లు; ఒత్తెన్ = ఊదెను; పాంచజన్యమున్ = పాంచజన్యమను శంఖము {పాంచజన్యము - విష్ణుమూర్తి శంఖము}; అఖిల = ఎల్ల; జనులు = వారు; భయ = భయముచేత; భ్రాంతులు = తత్తరిల్లినవారు; అయి = అయ్యి; చలింపన్ = తడబడగా; కడగి = పూని; నిర్భిన్న = విచ్ఛిన్నమైన; రాక్షసీ = రాక్షస స్త్రీల; గర్భము = గర్భములు; కన్ = కలుగునట్లు.
భావము:-  అలా చేసిన శ్రీకృష్ణుడు, ప్రళయకాలం నాటి మేఘగర్జనం అంత గట్టిగా తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు. ఆ శంఖారావం వినిన సమస్త జనులు భయభ్రాంతులు అయ్యారు. రాక్షస స్త్రీల గర్భాలు భేదిల్లాయి.

10.2-423-వ.
అట్టి యవక్ర విక్రమ పరాక్రమంబునకు నెగడుపడి బాణుండు లేటమొగంబు వడి చేయునదిలేక విన్ననయి యున్నయెడ.
టీక:-  అట్టి = అటువంటి; అవక్ర = వంగని; విక్రమ = ప్రతాపముతోటి; పరాక్రమంబున = పరాక్రమమున; కున్ = కు; నెగడుపడి = దిగ్భ్రమ చెంది; బాణుండు = బాణుడు; లేటమొగంబు = దైన్యము, పెడముఖము; పడి = పొంది, పెట్టి; చేయునది = చేయగలిగినది; లేక = లేక; విన్నన = చిన్నబోయినవాడు; అయి = ఐ; ఉన్న = ఉన్నట్టి; ఎడన్ = సమయము నందు.
భావము:-  శ్రీకృష్ణుని భయంకర పరాక్రమానికి దైన్యము చెంది, బాణాసురుడు ఏమీచేయలేక చిన్నబోయి ఉండగా.....

10.2-424-సీ.
త్తఱిఁ గోటర ను బాణ జనయిత్రి;
సుతుఁగాచు మతము సన్మతిఁదలంచి
వీడి శిరోజముల్‌ వ్రేలంగ నిర్ముక్త;
రిధానయై మురాసువిభేది
యెదుర నిల్చినఁ జూడ దిఁజాల రోసి ప;
రాఙ్ముఖుఁడై యున్న నువు వేచి
ల్లడించుచు బాణుఁడుల్లంబు గలగంగఁ;
లచీర వీడ యావులు నవ్వ

10.2-424.1-తే.
వ్యకాంచనమణిభూషములు రాలఁ
బాదహతి నేలఁ గంపింపఁ బాఱి యాత్మ
పురము వడిఁజొచ్చె నప్పుడు భూతగణము
లాకులతతోడ నెక్కడే రుగుటయును.
టీక:-  ఆ = ఆ; తఱిన్ = సమయమునందు; కోటర = కోటర; అను = అనెడి; బాణ = బాణుని; జనయిత్రి = తల్లి; సుతున్ = పుత్రుని; కాచు = కాపాడెడి; మతమున్ = పద్ధతిని; సన్మతిన్ = గట్టి ఆలోచనతో; తలచి = ఆలోచించి; వీడి = విడిపోయిన; శిరోజముల్ = తలవెంట్రుకలు; వ్రేలంగన్ = వేళ్ళాడుతుండగా; నిర్ముక్త = విడిచిన; పరిధాన = పైవస్త్రములు కలది; ఐ = అయ్యి; మురాసురవిభేది = కృష్ణుని {మురాసురవిభేది - మురాసురుని సంహరించిన వాడు, కృష్ణుడు}; ఎదురన్ = ఎదుట; నిల్చినన్ = నిలబడగా; చూడన్ = చూచుటకు; మదిన్ = మనసునందు; చాలన్ = మిక్కిల; రోసి = అసహ్యించుకొని, రోతపడి; పరాఙ్ముఖుడు = పెడముఖమువాడు {పరాఙ్ముఖుడు - పక్కకు తిప్పిన ముఖము కలవాడు, పెడముఖమువాడు}; ఐ = అయ్యి; ఉన్నన్ = ఉండగా; అనువు = అనుకూలతను; వేచి = కనిపెట్టి; తల్లడించుచున్ = సంకట పడుతు; బాణుడు = బాణుడు; ఉల్లంబున్ = మనస్సు; కలగంగన్ = కలత చెందగా; తలచీర = తలపాగా; వీడన్ = ఊడిపోగా; యాదవులు = యాదవులు; నవ్వన్ = నవ్వగా; నవ్య = సరికొత్త; కాంచన = బంగారపు; మణి = రత్నాల; భూషణములు = ఆభరణములు; రాలన్ = రాలిపోగా; పాద = అడుగులు; ఆహతిన్ = వేయుటచే, తాకిడికి; నేల = భూమి; కంపింపన్ = అదురుతుండ; పాఱి = పారిపోయి; ఆత్మ = తన; పురమున్ = నగరమునకు; వడిన్ = వేగముగా; చొచ్చెన్ = ప్రవేశించెను; అప్పుడు = అప్పుడు; భూతగణములు = శివగణములు; ఆకులత = కలతపాటు; తోడన్ = తోటి; ఎక్కడేన్ = ఎక్కడికో; అరుగుటయును = పోగానే;
భావము:-  బాణుడు అలా కృష్ణవిజృంభణకు ప్రతికృతి చేయలేకపోతున్న ఆ సమయంలో, బాణాసురుడి తల్లి అయిన కోటర, తన కుమారుడిని రక్షించుకో దలచి వీడినజుట్టుతో వివస్త్రయై శ్రీకృష్ణుని ఎదుట నిలబడింది. ఆమెను చూడడానికి అసహ్యించుకుని మాధవుడు ముఖము త్రిప్పుకున్నాడు. ఆ సమయంలో బాణాసురుడు తలపాగ వీడిపోగా; భూషణాలు రాలిపోగా; యాదవులు పరిహసిస్తుండగా; తన పట్టణానికి పారిపోయాడు. అప్పుడు భూతగణాలు కూడా యుద్ధరంగం వీడిపోయాయి.