పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

శ్రీ ఉషాపరిణయము : బాణున కీశ్వర ప్రసాద లబ్ధి

10.2-320-సీ.
"దేవ! జగన్నాథ! దేవేంద్రవందిత! ;
వితచారిత్ర! సం పవిత్ర!
హాలాహలాహార! హిరాజకేయూర! ;
బాలేందుభూష! సద్భక్తపోష!
ర్వలోకాతీత! ద్గుణసంఘాత! ;
పార్వతీహృదయేశ! వవినాశ!
జతాచలస్థాన! జచర్మపరిధాన! ;
సురవైరివిధ్వస్త! శూలహన్త!

10.2-320.1-తే.
లోకనాయక! సద్భక్తలోకవరద!
సురుచిరాకార! మునిజనస్తుతవిహార!
క్తజనమందిరాంగణపారిజాత!
నిన్ను నెవ్వఁడు నుతిసేయ నేర్చు నభవ!"
టీక:-  దేవ = శివా; జగత్ = సర్వలోకములకు; నాథ = ప్రభువైనవాడ; దేవేంద్ర = దేవేంద్రునిచే; వందిత = స్తుతింపబడువాడ; వితత = గొప్ప; చారిత్ర = చరిత్ర కలవాడ; సంతత = సదా; పవిత్ర = పవిత్రమైన వాడా; హాలాహల = హాలాహలము అను విషమును; ఆహార = తినువాడ; అహిరాజ = సర్పరాజు; కేయూర = భుజకీర్తులు కల వాడ; బాలేందు = బాలచంద్రుడు; భూష = ఆభరణముగా కలవాడ; సత్ = మంచి; భక్త = భక్తులను; పోష = కాపాడువాడ; సర్వ = ఎల్ల; లోక = లోకములకు; అతీత = అతీతమైన వాడా; సద్గుణ = సుగుణముల; సంఘాత = సమూహము కలవాడా; పార్వతీ = పార్వతీ దేవి యొక్క; హృదయ = హృదయమునకు; ఈశ = ప్రభువైనవాడ; భవ = సంసారబంధములు; వినాశ = తొలగించువాడ; రజతాచల = వెండికొండ, కైలాసపర్వతం; స్థాన = నివసించువాడ; గజ = ఏనుగు; చర్మ = చర్మమును; పరిధాన = కట్టుకొనువాడ; సురవైరి = రాక్షసులను {సురవైరి - దేవతల శత్రువు, రాక్షసుడు}; విధ్వస్త = సంహరించువాడ; శూల = త్రిశూలమును; హస్త = చేతపట్టుకొనువాడ;
లోక = లోకములకు; నాయక = ప్రభువా; సత్ = మంచి; భక్త = భక్తులు; లోక = అందరికి; వరద = వరములిచ్చువాడ; సు = మంచి; రుచిర = ప్రకాశించు; ఆకార = స్వరూపము కల వాడ; ముని = ఋషులైన; జన = వారి; స్తుత = స్తోత్రములందు; విహార = విహరించువాడ; భక్త = భక్తులు; జన = అందరికి; మందిర = ఇంటి; అంగణ = ముంగిళ్ళ యందలి; పారిజాత = కల్పవృక్షము వంటి వాడ; నిన్నున్ = నిన్ను; ఎవ్వడు = ఎవరు మాత్రము; నుతి = స్తోత్రము; చేయన్ = చేయుటను; నేర్చును = శక్తికలవాడు; అభవ = శివా {అభవ - పుట్టుక లేని వాడు, శివుడు}.

భావము:-  “ఓ దేవా! జగన్నాథా! దేవేంద్ర వందితా! పరిశుద్ధ చారిత్రా! పరమ పవిత్ర! హాలాహల భక్షకా! నాగభూషణ! చంద్రశేఖర! భక్తజనసంరక్షకా! సర్వలోకేశ్వరా! పార్వతీపతి! కైలాసవాసా! గజచర్మధారీ! రాక్షసాంతకా! త్రిశూలధారీ! భక్తజనుల ముంగిటి పారిజాతమా! జన్మరహితుడా! నిన్ను ఎవరు మాత్రం స్తుతించ గలరు?”

10.2-321-వ.
అని స్తుతియించి.
టీక:-  అని = అని; స్తుతియించి = కీర్తించి.
భావము:-  ఈ విధంగా అనేక రకాల బాణుడు శివుడిని స్తుతించి...

10.2-322-మ.
"నిలో నన్ను నెదిర్చి బాహుబలశౌర్యస్ఫూర్తిఁ బోరాడఁ జా
లి వీరుం డొకఁ డైనఁ బందెమునకున్ లేఁడయ్యె భూమండలి
న్నయంబున్ భవదగ్రదత్తకరసాస్రంబు కండూతి వా
యునుపాయంబునులేద యీభరము నెట్లోర్తున్నుమానాయకా!
టీక:-  అని = యుద్ధము; లోన్ = అందు; నన్నున్ = నన్ను; ఎదిర్చి = ఎదిరించి; బాహుబల = భుజబలము; శౌర్య = పరాక్రమము; స్ఫూర్తిన్ = ప్రకాశముతో; పోరాడన్ = యుద్ధము చేయుటకు; చాలిన = శక్తి కలిగిన; వీరుడు = పరాక్రమవంతుడు; ఒకడు = ఒక్కడు; ఐనన్ = అయినప్పటికి; పందెమున్ = పందెమున; కున్ = కైనను; లేడు = లేనివాడు; అయ్యెన్ = అయ్యెను; భూమండలిన్ = మొత్తం భూలోక మంతట; అనయంబున్ = సతతము; భవత్ = నీ చేత; అగ్ర = ముందుగా, తొల్లి; దత్త = ఇయ్యబడిన; కర = చేతులు; సహస్రంబున్ = వేయింటి యొక్క; కండూతి = దురద, తీట; పాయు = తొలగునట్టి; ఉపాయంబున్ = ఉపాయము; లేద = లేకపోయెను; ఈ = ఈ; భరమున్ = బరువును; నేన్ = నేను; ఎట్లు = ఏ విధముగ; ఓర్తున్ = తట్టుకొనగలను; ఉమానాయకా = శివా {ఉమా నాయకుడు - ఉమ (పార్వతీదేవి) యొక్క నాయకుడు (భర్త), శివుడు}.
భావము:-  బాణుడు ఇలా అన్నాడు “ఓ పార్వతీపతీ! యుద్ధంలో నన్ను ఎదిరించి నిలిచి తన బాహుబలాన్ని ప్రదర్శింప జాలిన వీరాధివీరుడు ఒక్కడు కూడా ఈ భూమండలంలో ఎంత వెతికినా కనిపించడం లేదు. నీవు ప్రసాదించిన ఈ నా వెయ్యి చేతులు రణకండూతి తీర్చుకొనే ఉపాయం ఏదీ లేదయ్యా. ఈ కండూతి తీరని భారం ఎలా ఓర్చుకోగల నయ్యా? ఈశ్వరా!

10.2-323-సీ.
హుంకార కంకణ క్రేంకార శింజినీ;
టంకార నిర్ఘోషసంకులంబు
చండ దోర్దండ భాస్వన్మండలాగ్ర ప్ర;
కాండ ఖండిత రాజమండలంబు
శూలాహతక్షతోద్వే కీలాల క;
ల్లోల కేళీ సమాలోకనంబు
శుంభ దున్మద కుంభి కుంభస్థలధ్వంస;
సంభూత శౌర్య విజృంభణంబు

10.2-323.1-తే.
లుగు నుద్దామ భీమ సంగ్రామ కేళి
న పరాక్రమ విక్రమక్రమము గాఁగ
రపలేనట్టి కరములు రము దుఃఖ
రము లగుఁ గాక సంతోషరము లగునె?
టీక:-  హుంకార = హుమ్మనిబలంగావేయుట; కంకణ = చేతికడియాల; క్రేంకార = క్రేమ్మను శబ్దము; శింజినీ = వింటితాటి; టంకార = టమ్మను శబ్దముల; నిర్ఘోష = ధ్వనుల; సంకులంబు = కోలాహలము; చండ = భయంకరములైన; దోర్దండ = కఱ్ఱల్లాంటి చేతులందు; భాస్వత్ = ప్రకాశించుచున్న; మండలాగ్ర = కత్తుల యొక్క; ప్రకాండ = సమూహముల చేత; ఖండిత = నరకబడిన; రాజ = రాజుల; మండలంబు = సమూహముల చేత; శూల = శూలాయుధములచే; ఆహత = కొట్టబడుటచేత; క్షత = గాయములనుండి; ఉద్వేల = కారుతున్న; కీలాల = నెత్తురును; కల్లోల = యుద్ధ; కేళీ = క్రీడ యందు; సమాలోకనంబు = చూచుట; శుంభత్ = మిక్కిలి; ఉన్మద = మదము కల; కుంభి = ఏనుగుల; కుంభస్థల = కుంభస్థలములను; ధ్వంస = భేదించుటచేత; సంభూత = పుట్టిన; శౌర్య = శూరత్వము యొక్క; విజృంభణంబు = రేగుట, ఉప్పొంగుట; కలుగు = కలిగినట్టి; ఉద్దామ = గంభీరమైన; భీమ = భయంకరమైన; సంగ్రామ = యుద్ధ; కేళి = క్రీడను; ఘన = గొప్ప; పరా = శత్రువులను; ఆక్రమ = ఆక్రమించుట; విక్రమ = శూరత్వము యొక్క; క్రమము = వరుసగా; కాగన్ = కలుగునట్లు; జరపలేని = చేయలేని; అట్టి = అటువంటి; కరములున్ = చేతులు; కరము = మిక్కిలి; దుఃఖ = దుఃఖమును; కరములు = కలుగించునవి; కాక = కాకుండా; సంతోష = సంతోషమును; కరములు = కలుగించునవి; అగునె = అవుతాయా, కావు.
భావము:-  దిక్కులుదద్దరిల్లే హూంకారాలు, చేతి కడియాల కణకణ ధ్వనులు, ధనుష్టంకారాలు చేసే కోలాహలంతో నిండినదీ; చండప్రచండ బాహుదండాలలో ప్రకాశించే ఖడ్గాలతో ఖండింపబడిన శత్రు రాజుల శిరస్సులు కలదీ; శూలపు పోట్లకు శరీరాల నుండి జలజల ప్రవహించే రక్తధారలతో భయంకరమైనదీ; మదించిన ఏనుగుల కుంభస్థలాలను బద్దలుకొట్టే వీరవిజృంభణం కలదీ అయిన భీకర యుద్ధరంగంలో పరాక్రమాన్ని ప్రదర్శించలేనట్టి వట్టి చేతుల వలన ఉపయోగము ఏముంటుంది చెప్పు. అలాంటి చేతులు నా వంటి వీరులకు దుఃఖము కలిగించేవి అవుతాయి కాని సంతోషము కలిగించేవి కావు కదా.

10.2-324-ఉ.
కా మదీయ చండభుజర్వ పరాక్రమ కేళికిన్ సముం
డీ నిఖిలావనిం గలఁడె యిందుకళాధర! నీవు దక్కఁగా;"
నా నిటలాంబకుండు దనుజాధిపు మాటకుఁ జాల రోసి లో
నూనిన రోషవార్ధి గడ లొత్తఁ గ నిట్లని పల్కె భూవరా!
టీక:-  కాన = కనుక; మదీయ = నా యొక్క; చండ = భయమకరమైన; భుజగర్వ = బాహుబలము; పరాక్రమ = వీరత్వముల యొక్క; కేళికిన్ = విలాసములకు; సముండు = సమానుడు; ఈ = ఈ; నిఖిల = ఎల్ల; అవనిన్ = భూలోకము నందు; కలడె = ఉన్నాడా; ఇందుకళాధర = శివా {ఇందుకళాధర - ఇందుకళ (చంద్రవంక) ధరించిన వాడు, శివుడు}; నీవున్ = నీవు; తక్కగాన్ = తప్పించి; ఆ = ఆ; నిటలాంబకుండు = శివుడు {నిట లాంబకుడు - నిటల (నుదుట) అంబకుడు (కన్ను కలవాడు), శివుడు}; దనుజాధిపున్ = బాణాసురుని; మాట = మాటలు; కున్ = కు; రోసి = అసహ్యించుకొని; లోన్ = మనసులో; ఊనిన = నాటుకొనన; రోష = కోపము అను; వార్ధి = సముద్రము; కడలు = గట్లు; ఒత్తుకొనగన్ = ఒరుసుకొనగ (ఉప్పొంగగా); పల్కెన్ = చెప్పెను; భూవరా = రాజా.
భావము:-  ఓ ఇందుధరా! నా ఈ ప్రచండ బాహుదండాల పరాక్రమకేళిని ఎదిరించగల వీరుడు ఈ ప్రపంచం మొత్తంలో నీవు తప్ప మరెవ్వరూ లేరు.” అంటున్న బాణుడి ప్రగల్భపు మాటలకు ఫాలనేత్రుడు అసహ్యించుకుని, లోపలి రోషం పొంగిపొరలగా ఆ దోషాచరుడితో ఇలా అన్నాడు. పరీక్షిన్నరవరా!

10.2-325-క.
"విను మూఢహృదయ! నీ కే
మెప్పు డకారణంబ ధారుణిపైఁ గూ
లును నపుడ నీ భుజావలి
దునియఁగ నా యంత వానితో నని గల్గున్. "
టీక:-  విను = వినుము; మూఢ = తెలివితక్కువ; హృదయ = మనసు కలవాడ; నీ = నీ యొక్క; కేతనము = జండాకఱ్ఱ; ఎప్పుడున్ = ఎప్పుడైతే; అకారణంబు = కారణము లేకుండ; ధారుణి = భూమి; పైన్ = మీద; కూలునున్ = పడిపోవునో; అప్పుడ = అప్పుడే; నీ = నీ యొక్క; భుజ = బాహువుల; ఆవలి = వరుసలు; తునియగన్ = తెగగొట్టగ; నా = నాతో; అంత = సమానుడైన; వాని = వాడి; తోన్ = తోటి; అని = యుద్ధము; కల్గున్ = సంభవించును.
భావము:-  “ఓ మూఢహృదయా! తొందరపడకు నీకేతనం అకారణంగా ఎప్పుడు భూమిపై కూలిపోతుందో, అప్పుడు నీకు నా అంత వాడితో నీ భుజాలు తెగే యుద్ధం జరుగుతుందిలే.”

10.2-326-వ.
అని పలికిన నట్లు సంప్రాప్తమనోరథుండై నిజభుజవినాశకార్య ధురీణుం డగు బాణుండు సంతుష్టాంతరంగుం డగుచు నిజనివాసంబు నకుం జని, తన ప్రాణవల్లభల యుల్లంబులు పల్లవింపఁ జేయుచు నిజధ్వజనిపాతంబు నిరీక్షించుచుండె, తదనంతరంబ.
టీక:-  అని = అని; పలికినన్ = చెప్పగా; అట్లు = ఆ విధముగ; సంప్రాప్త = లభించిన; మనోరథుండు = కోరిక కలవాడు; ఐ = అయ్యి; నిజ = తన; భుజ = చేతులు; నాశ = నశించెడి; కార్య = పనిని; ధురీణుండు = పూనిన వాడు; అగు = ఐన; బాణుండు = బాణాసురుడు; సంతుష్ట = తృప్తిచెందిన; అంతరంగుడు = మనసు కలవాడు; అగుచున్ = ఔతు; నిజ = తన; నివాసంబు = గృహమున; కున్ = కు; చని = వెళ్ళి; తన = తన యొక్క; ప్రాణవల్లభల = భార్యల; ఉల్లంబులున్ = మనసులు; పల్లవింప = చిగురింప; చేయుచున్ = చేయుచు; నిజ = తన; ధ్వజ = జండాకఱ్ఱ; నిపాతంబున్ = పడిపోవుటను; నిరీక్షించుచుండెన్ = ఎదురుచూచు చుండెను; తదనంతరంబ = అటుపిమ్మట.
భావము:-  ఆ పరమేశ్వరుని పలుకులు విని బాణాసురుడు తన కోరిక తీరబోతున్నందుకు చాలా సంతోషించాడు. తన సౌధానికి వెళ్ళిపోయాడు. తన ప్రియురాండ్రతో కూడి ఆనంద డోలికలలో తూగుతూ, ఎప్పుడు తన రథం మీది జండాకొయ్య నేలకొరుగుతుందా అని ఎదురుచూడసాగాడు. అటుపిమ్మట...