పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఋషభోపాఖ్యానము : మున్నుడి

కథా సూచన

 తపోధనుల, రాజశ్రేష్ఠుల చరిత్రలు శుభకరములు, సంతోషదాయకములు. చక్కటి సజ్జీవన మార్గదరశకత్వం చేయుట లో అత్యంత ముఖ్యమైనవి. కనుకనే, మన పురాతన ప్రామాణిక గ్రంథాల యందు ఉల్లేఖించబడినవి.

స్వాయంభువ మనువు పుత్రుడు ప్రియవ్రతుడు. ఈయనకు భార్య బర్హిష్మతి యందు కలిగిన పుత్రులలో జ్యేష్ఠుడు అగ్నీధ్రుడు. ఈయన జంబూద్వీప అధిపతి, భార్య పూర్వచిత్తి. వీరి పెద్ద కుమారుడు నాభి. ఈయన నాభివర్షాధిపతి, భార్య మేరుదేవి. వీరికి పుట్టిన వాడు మన కథా నాయకుడు ఋషభుడు. ఈయన భార్య జయంతి, శతమన్యుని పుత్రిక. వీరి వందమంది లో ప్రథమ పుత్రుడు మూడు జన్మలలో మోక్షం పొందిన భరత చక్రవర్తి. 

గొప్ప రాజోత్తముడు, తపోధనుడు అయిన ఆ ఋషబుని చరిత్ర మన భాగవత సాధనలో చదువుకుందాం.

ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై>
పరమామ్నాయము లెల్ల వందిగణమై బ్రహ్మాండ మాగారమై
సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై
వరుసన్ నీఘనరాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణా!