పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బ్రహ్మదేవుని గర్వభంగము : చూళిక

చూళిక

  మన జాతీయమహాకవి బమ్మెఱ పోతన వారి గంటం సహజంగానే అక్షర శిల్పాలు చెక్కడంలో బహువిన్నాణి. నల్లనయ్యను చెప్పడమన్నా, చిన్నపిల్లలను చెప్పడమన్నా చెర చెరమని సాగిపోతుంది. ఆ సోయగాలు ఈ ఘట్టంలో ప్రస్ఫుటంగా ఆస్వాదించ వచ్చు.

  కృష్ణబాలుడు పెద్దవుతున్నాడని, తోటి గోపబాలురతో లేగలను కాయడానికి బలరామునితో కలిసి పంపసాగారు. ఒకనాడు, రాముడు రాలేదు కాని, చిందులువేసే లేగలతో చుక్కలలో చెన్నుమీరిన చంద్రునిలా విహరిస్తూ కాపలా కాస్తున్నాడు. మిత్రులతో కలిసి కబుర్లాడుకుంటూ తినే చద్దన్నాలు అనగానే ఎవరికి నూరూరదు. చిన్ని కృష్ణుడు చెలికాండ్రతో వనంలో చల్ది తింటున్నాడు. అక్కడ పోతన వర్ణనల సహజ సౌందర్యం అద్భుతం అనితరసాధ్యం.

 ఈ చక్కదనాలు చూసి అహంకారంతో ఈ చిన్ని కుఱ్ఱాడు పూతనాదులను సంహరించాడా అంత గొప్పవాడా వీని గొప్పదనం పరీక్షిద్దామని. కనుమార్చి లేగలను. చెలులను మాయ చేసి దాచాడు.

  చతురనటమూర్తి, అన్ని లేగలు, అందరు చెలికాండ్ర రూపులు తానే ధరించి. మెలగ సాగాడు. బ్రహ్మకు తృటికాలం అంటే మానవకాలం ఏడాది అవుతోంది, ఆయన చూడడానికి వచ్చాడు. బాలలు అక్కడే ఆడుతూ పాడుతూ ఉన్నారు. లేగలు మేతలు మేస్తున్నాయి.

  దానితో తెలివి తెచ్చుకుని, ఈ గొల్లపిల్లాడు తన కన్నతండ్రి అని గ్రహించి, స్తుతించి, తను దాచిన పిల్లలను, దూడలను తిరిగి ఇచ్చేస్తాడు. వారు తమ తమ ఇళ్ళకు వెళతారు. అందరు తల్లులకు తండ్రులకు కృష్ణుడు మరింత ఆత్మీయుడు అవుతాడు.

  ఇది ఎంతో రసవత్తరంగా సాగుతుంది. రండి సాధనచేసి ఆస్వాదిద్దాము.

- భాగవత గణనాధ్యాయి.