పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బ్రహ్మదేవుని గర్వభంగము : పూర్ణి

పూర్ణి

img-10.1-1791-మాలి.

*10.1-1791-మాలి.

సిజనిభ హస్తా! ర్వలోక ప్రశస్తా!
నిరుపమ శుభమూర్తీ! నిర్మలారూఢ కీర్తీ!
హృదయ విదారీ! క్తలోకోపకారీ!
గురు బుధజన తోషీ! ఘోరదైతేయ శోషీ!

టీక:- సరసిజనిభహస్తా = శ్రీరామా {సరసిజనిభహస్తుడు - సరసిజ (పద్మము) నిభ (వంటి) హస్తుడు (అరచేతులు కలవాడు), శ్రీరాముడు}; సర్వలోకప్రశస్తా = శ్రీరామా {సర్వలోకప్రశస్తుడు - సర్వ (సమస్తమైన) లోక (లోకములలోను) ప్రశస్తుడు (శ్లాఘింపబడువాడు), శ్రీరాముడు}; నిరుపమశుభమూర్తీ = శ్రీరామా {నిరుపమశుభమూర్తి - నిరుపమ (సాటిలేని) శుభ (మేళ్ళు కలిగించెడి) మూర్తి (ఆకృతి కలవాడు), శ్రీరాముడు}; నిర్మలారూఢకీర్తీ = శ్రీరామా {నిర్మలారూఢకీర్తి - నిర్మల (పరిశుద్ధమైన) ఆరూఢ (నిలకడైన) కీర్తి (కీర్తి కలవాడు), శ్రీరాముడు}; పరహృదయవిదారీ = శ్రీరామా {పరహృదయవిదారి - పర (విరోధుల) హృదయ (గుండెలను) విదారి (చీల్చెడి వాడు), శ్రీరాముడు}; భక్తలోకోపకారీ = శ్రీరామా {భక్తలోకోపకారి - భక్తులను లోక (ఎల్లరకు) ఉపకారి (ఉపకారము చేయువాడు), శ్రీరాముడు}; గురుబుధజనతోషీ = శ్రీరామా {గురుబుధజనతోషి - గురు (గొప్ప) బుధ (జ్ఞానము కల) జన (వారికి) తోషి (సంతోషము కలిగించు వాడు), శ్రీరాముడు}; ఘోరదైతేయశోషీ = శ్రీరామా {ఘోరదైతేయశోషి - ఘోర (క్రూరమైన) దైతేయ (రాక్షసులను) శోషి (నశింపజేయు వాడు), శ్రీరాముడు}.

భావము:- పద్మాల వంటి హస్తములు కలవాడా! ఎల్లలోకాలలోను శ్రేష్ఠతమమైన వాడా! సాటిలేని మంగళ స్వరూపము కలవాడా! స్వచ్ఛమైన వన్నెకెక్కిన కీర్తి కలవాడా! శత్రువుల గుండెలను ఖండించు వాడా! భక్త సమూహానికి మేలు చేయువాడా! పెద్దలను, పండితులను సంతోషపరచేవాడా! భయంకరులైన రక్కసులను నాశనము చేయువాడా! శ్రీరామచంద్రప్రభూ! వందనములు.

ఉపాఖ్యానంత గద్యము.

ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసనమంత్రి పుత్ర సహజపాండిత్య
పోతనామాత్య ప్రణీతం బయిన శ్రీమహాభాగతం బను మహాపురాణ దశమ
స్కంధ పూర్వాశ్వాసము నందలి చల్దు లారగించుట, క్రేపుల వెదక
బోవుట, బ్రహ్మ వత్స బాలకుల దాచుట, వత్స బాలకుల రూపు
డగుట, బలరాము డన్న రూ పెరుగుట, బ్రహ్మ తర్కించు
కొనుట, బ్రహ్మ పూర్ణిచేయుట, పులినంబునకు తిరిగి
వచ్చుట, కృష్ణుడు ఆత్మీయు డగుట అను కథలు
గల బ్రహ్మదేవుని గర్వభంగము అనెడి
ఉపాఖ్యానం సుసంపూర్ణం అగుట

ఓం నమో భగవతే వాసుదేవాయ!!
ఓం! ఓం! ఓం!
ఓం! శాంతిః! శాంతిః! శాంతిః!
సర్వే జనా స్సుఖినో భవతు!!
-X-