పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బ్రహ్మదేవుని గర్వభంగము : ముఖపత్రం

పోతన తెలుగు భాగవతము

బ్రహ్మదేవుని గర్వభంగము

ప్రార్థన

1-230-మా. వీరభద్ర విజయము

నిమభువనదీపా! నిర్మలానందరూపా!
ణితగుణధీరా! ప్రతర్క్యప్రకారా!
నజలధిహారా! ఖండరాజద్విహారా!
ముగుదమదనమూర్తీ! యోగిహృద్యాంతవర్తీ!

టీక :- నిగమము = వేదము; అప్రతి = సాటిలేని; అర్క్య = పూజింపబడు; ప్రకారా = విధము కలవాడా.

భావము :- వేదశాస్త్రాలకు మార్గదర్శనుడా! నిర్మలానంద స్వరూపము గలవాడా! లెక్కలేనన్ని ధీరగుణములు గలవాడా! సాటిలేని విధమున పూజింపబడువాడా! ఆకాశము సముద్రము హారముగా గలవాడా! చంద్రరేఖ అలంకారముగా గలవాడా! అర్థనారీశ్వరా! యోగుల హృదయాలలో నివసించేవాడా!

3-265-మత్త.వీరభద్ర విజయము
నావాహనరంజనా! మదనాగవిద్విషభంజనా!
నాదానవఖండనా! మునినాథ సాగరమండనా!
యోగిరాజసమానచిత్త పయోజ షట్పద వేషణా!
నాభూషితభూషణా! శరణాగతామరపోషణా!

టీక నాగము = సింహము; నాగము = పాము; నాగము = ఏనుగు; మండనుడు = నుతింబడువాడు; పయోజ = తామర; షట్పదము = తుమ్మెద.

భావము> సింహ వాహిని యైన దుర్గను రంజింప చేయువాడా! పాము విషమును విరిచేవాడా! గజాసురుని అంతమొందించినవాడా! మునినాథ సమూహములచే నుతింపబడువాడా! యోగిరాజుల మనస్సనే తామరలపై వాలు తుమ్మెద వంటి వాడా! పాములను అలంకారముగా ధరించేవాడా! శరణుకోరు దేవతలను పోషించేవాడా!