పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బ్రహ్మదేవుని గర్వభంగము : 2వ భాగము - బ్రహ్మ పూర్ణిజేయుట

10.1-564-వ.

అదియునుం గాక.

టీక:- అదియునన్ = అంతే; కాక = కాకుండగ.

భావము:- అంతే కాకుండా. . .

10.1-565-క.

చర మృగ భూసుర నర
కుముల జన్మించి తీవు కుజనులఁ జెఱుపన్
జెలిమిని సుజనుల మనుపను
పోయఁగ రాదు నీ విధంబు లనంతా!

టీక:- జలచర = మత్స్యకూర్మాది; మృగ = నరసింహాది; భూసుర = పరశురామాది; నర = రామాది; కులములన్ = వంశములలో; జన్మించితి = అవతరించితవి; ఈవు = నీవు; కుజనులన్ = దుష్టులను; చెఱుపన్ = సంహరించెడి; చెలిమిన్ = సుహృదముతో; సుజనులన్ = మంచివారిని; మనుపనున్ = కాపాడెడి; తలపోయగన్ = ఉహింప; రాదు = శక్యముకాదు; నీ = నీ యొక్క; విధంబులున్ = వర్తనవిధములను; అనంతా = కృష్ణా {అనంతుడు - అంతములేని (కాల ప్రదేశ భావముల పరిమితులకు మీరిన) వాడు, విష్ణువు}.

భావము:- ఓ అనంత కృష్ణా! నీవలనే నీ మార్గాలు కూడా అంతం లేనివి. నీవు దుర్మార్గులను శిక్షించడానికీ, సజ్జనులను ప్రేమతో రక్షించడానికీ జలచరములుగా, మృగములుగా, బ్రాహ్మణులుగా, సాధారణ మానవులుగా ఎన్నో అవతారాలు ఎత్తావు. నీ మార్గాలు ఈవిధంగా ఉంటాయని ఊహించడం అసాధ్యం కదా.

10.1-566-ఆ.

మ్రబ్బుగొలిపి యోగమాయ నిద్రించిన
యో! పరాత్మభూమ! యోగిరాజ!
యే తెఱంగు లెన్ని యెంత యెచ్చోట నీ
హేల లెవ్వఁ డెఱుఁగు నీశ్వరేశ!

టీక:- మబ్బు = అజ్ఞానావరణలో (లోకమును); కొలిపి = కప్పి; యోగ = అవ్యక్తనామ {యోగమాయ - అవినాభావముగా భగవంతుని యందు వెలిగెడి అవ్యక్త నామక ప్రకృతి}; మాయన్ = ప్రకృతి యందు; నిద్రించిన = సుషుప్తిలో ఉండెడి; ఓ = ఓయీ; పరాత్మభూమ = కృష్ణా {పరాత్మభూమ - పరబ్రహ్మము తానే ఐన వాడు, విష్ణువు}; యోగిరాజ = కృష్ణా {యోగిరాజ - పరమయోగులలో శ్రేష్ఠుడు, విష్ణువు}; ఏ = ఏ; తెఱంగులు = పద్ధతులు, విధానములు; ఎన్ని = ఎన్నిఎన్ని; ఎంత = ఎంతవరకు; ఎచ్చోట = ఏఏ చోటులందు; నీ = నీ యొక్క; హేలలు = లీలలు (కలుగునని); ఎవ్వడు = ఎవరు మాత్రము; ఎఱుగున్ = తెలియగలరు; ఈశ్వరేశ = కృష్ణా {ఈశ్వరేశ - ఈశ్వరుల (సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను నియమించెడి బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివాదుల)కు ఈశ (నియామకుడా), విష్ణువు, భగవంతుడు}.

భావము:- ఓ పరమాత్మా! మహాయోగీశ్వరేశ్వరా! శ్రీకృష్ణా! నీ కన్న ఇతరులుగా జీవిస్తున్న జీవులందరూ “ఎవరికివారు “నేను” అని మిగిలినవారిని “వారు” అని అనుకుంటున్నారు. వారందరిలో ఉన్న “నేను” నివాసంగా “నీవు” ఉన్నావు. దానిని దర్శించడానికి సాధన చేసేవారే యోగులు. వారి యోగంగా వారిలో వెలుగుతూ ఉన్నదీ నీవే మిగిలినవారు ఈ నీ యందు మరుపు కలిగి ఉంటారు. “తాము ఉన్నామనే తెలివి” మైకంగా కప్పుతుంది. ఈ మైకాన్నికలిగించి నీవు లోపల ఉంటే వారికి నీవు నిద్రిస్తున్నట్లు ఉంటావు. అలాంటి యోగనిద్రలో ఉన్న నీ లీలలు ఎవరికి తెలుస్తాయి? ఎప్పుడు తెలుస్తాయి? ఎక్కడ తెలుస్తాయి?

10.1-567-సీ.

ది గాన నిజరూప నరాదు; కలవంటి-
దై బహువిధదుఃఖమై విహీన
సంజ్ఞానమై యున్న గము సత్సుఖబోధ-
నుఁడవై తుదిలేక నరు నీదు
మాయచేఁ బుట్టుచు నుచు లే కుండుచు-
నున్న చందంబున నుండుచుండు;
నొకఁడ; వాత్ముఁడ; వితరోపాధి శూన్యుండ-
వాద్యుండ; వమృతుండ; క్షరుండ;

10.1-567.1-ఆ.

ద్వయుండవును; స్వయంజ్యోతి; వాపూర్ణుఁ
వు; పురాణపురుషుఁవు; నితాంత
సౌఖ్యనిధివి; నిత్యత్యమూర్తివి; నిరం
నుఁడ వీవు; తలఁపఁ నునె నిన్ను. ?

టీక:- అదిగాక = అంతేకాకుండ; నిజరూపము = అసలుస్వరూపము(నీది); అనరాదు = అనుట యుక్తము కాదు; కల = స్వప్నము, అసత్యము; వంటిది = లాంటిది; ఐ = అయ్యి; బహు = అనేక; విధ = రకముల; దుఃఖము = దుఃఖములు కలది; ఐ = అయ్యి; విహీన = పూర్తిగాలేని; సంజ్ఞానము = సరి యగు జ్ఞానము కలది; ఐ = అయ్యి; ఉన్న = ఉండునట్టి; జగమున్ = లోకమును; సత్ = సత్యము {సత్యము - సర్వకాలసర్వావస్తలందు వికారములు లేనిది, సత్తు}; సుఖ = నిరతిశయానందము; బోధ = జ్ఞానము {బోధ - పరమాత్మ స్వస్వరూపమై తెలిసి యుండుట, జ్ఞానము}; తనుడవు = దేహముగా కలవాడవు; ఐ = అయ్యి; తుదిలేక = అనంతమవు యై {తుదిలేక - ఆది (సృష్టి) స్థితి అంతము(లయము)లు లేకుండ, అనంతమై}; తనరు = వర్తించెడి; నీదు = నీ యొక్క; మాయ = నీ యందలి ప్రకృతి; చేన్ = వలన; పుట్టుచున్ = జనించుచు; మనుచున్ = వృద్ధిపొందుతు; లేకుండుచున్ = నశించుచు, లయించుచు; ఉన్న = ఉన్నట్టి; చందంబునన్ = విధముగ; ఉండుచుండు = తోచుచుండును; ఒకడవు = ఒంటరివి {ఒకడవు - సజాతీయ విజాతీయ స్వ గత బేధశూన్యుఁడవు, విష్ణువు}; ఆత్ముడవు = ఆత్మగా నుండువాడవు {ఆత్మ - అతతితత్తద్వస్తురూపేణ వ్యాప్నోతీత్యాత్మా ఆతసాతత్యగమనే (వ్యుత్పత్తి), సర్వ వస్తు నామ రూపములతో మరియు అందు అంతట నిండి యున్నట్టిది}; ఇతర = స్వేతర, తనకుభిన్నమైన; ఉపాధి = ఉపాధిత్రయము {ఉపాధిత్రయము - స్థూల సూక్ష్మ కారణోపాధులు}; శూన్యుండవు = లేనివాడవు; ఆద్యుండవు = ఆది(మూల)కారణుడవు {ఆద్యుడ - విశ్వ సృష్టి స్థితి లయములకు మూలకారణుడు, విష్ణువు}; అమృతుండవు = ముక్తిప్రదాతవు {అమృతుడు - మోక్షమును యిచ్చుట ద్వారా జననమరణ చక్రమునుండి విముక్తి కలిగించువాడు, విష్ణువు}; అక్షరుండవు = శాశ్వతుడవు {అక్షరుడు - శ్లో. క్షరస్సర్వాణిభూతాని కూటస్థోక్షర ఉచ్యతే (గీత), సర్వ భూతముల నాశము పిమ్మటను యుండువాడు అక్షరుడు, విష్ణువు}; అద్వయుండవును = రెండవవస్తువులేనివాడవు {అద్వయుడు - శ్రు. ఏకమేవాద్వితీయంబ్రహ్మ, ఒక్కడై ఉండి తను తప్పించి రెండవ వస్తువు (స్వేతరము) లేనివాడు పరబ్రహ్మ అనబడును, విష్ణువు};
స్వయంజ్యోతివి = స్వయంప్రకాశకుడవు {స్వయంజ్యోతి - తన వెలుగుచేతనే ప్రకాశించువాడు, విష్ణువు}; ఆపూర్ణుడవు = అఖండస్వరూపుడవు {ఆపూర్ణుడు - అంతట నిండియుండు వాడు, అఖండ స్వరూపుడు, విష్ణువు}; పురాణపురుషుడవు = ఆదిపురుషుడవు {పురాణపురుషుడు - సృష్టికి ఆది (ముందు)నుండి ఉన్నవాడు, విష్ణువు}; నితాంతసౌఖ్యనిధివి = నిత్యసౌఖ్యప్రదాతవు {నితాంతసౌఖ్యనిధి - నితాంత (క్షీణములేని) సౌఖ్య (ఆనందమునకు) నిధివి (స్థానమైనవాడు), విష్ణువు}; నిత్యసత్యమూర్తివి = శాశ్వతమైనసత్యస్వరూపుడవు {నిత్యసత్యమూర్తివి - నిత్య (శాశ్వతమైన) సత్య (సత్యమే) మూర్తి (తన స్వరూపైనవాడు), విష్ణువు}; నిరంజనుడవు = పరిశుద్ధుడవు {నిరంజనుడు - మచ్చలేనివాడు, పరిశుద్ధుడు}; ఈవు = నీవు; తలపన్ = ఇట్టివాడవనిఊహించుటకు; చనునె = సాధ్యపడునా, కాదు; నిన్ను = నిన్ను.

భావము:- కనుక ఇది నీ అసలు స్వరూపం అని అనటానికి లేదు. ఈ జగత్తు అంతా కల వంటిది, ఎన్నో రకాల దుఃఖాలు కలది “సత్య జ్ఞానం” నష్టపోవడంలో మునిగి ఉంది. అటువంటి జగత్తు అంతా నీ మాయ చేత పుట్టుతూ, ఉంటూ, లేకుండా పోతూ ఉన్నట్లు అనిపిస్తుంది. నీవు మాత్రం సత్తు, నిరతిశయానంద రూపుడవు. ఆది, అంతమూ అంటూ లేనివాడవు; నీవు అనితరుడవు, స్వేతరుడవు కనుక ఒక్కడివే; ఆత్మ స్వరూపుడవు; నీవు మరో శరీరం అక్కరలేని వాడవు; నీవే అంతటికీ మూలమైన వాడవు; అంతము లేని వాడవు; తరిగిపోవడం అంటూ ఉండని వాడవు; నీకు సాటి రెండవవాడు లేడు; నీ యంత నీవు వెలుగుతూ ఉన్నావు; మొదటినుండీ సర్వమూ నీ లోనే ఉన్నవాడవు; ప్రాచీనులలో కెల్లా ప్రాచీనతముడవు అయిన మొట్టమొదటి పురుషుడవు నీవే; నిరంతరమైన సంపూర్ణమైన సుఖమునకు నిధి యైన వాడవు నీవు; సమస్త సృష్టికీ నిత్యమూ ఆధారమైన సత్యము నీవే; షోడశకళాపూర్ణ స్వరూపుడవు నీవు. ఇటువంటి నిన్ను ఉత్తి భౌతిక మనస్సుతో భావించాలంటే సాధ్యమా?

10.1-568-వ.

దేవా! యిట్టి నీవు జీవాత్మ స్వరూపకుఁడవు, సకలాత్మలకు నాత్మయైన పరమాత్మ స్వరూపకుఁడవు నని యెవ్వ రెఱుంగుదురు, వారు గదా గురు వనియెడు దినకరునివలనఁ బ్రాప్తంబైన యుపనిషదర్థజ్ఞానం బను సునేత్రంబునంజేసి సంసార మిథ్యాసాగరంబుఁ దరించిన చందంబున నుండుదురు; రజ్జువందు రజ్జువని యెఱింగెడి యెఱుక లేకుండ, న య్యెఱుంగమి నది సర్పరూపంబయి తోఁచిన పిదప నెఱింగిన వారివలన రజ్జువు రజ్ఝువని యెఱుంగుచుండ, సర్పరూపంబు లేకుండు కైవడి, నాత్మ యప్పరమాత్మ యని యెవ్వ రెఱుంగరు వారి కయ్యెఱుంగమివలన సకల ప్రపంచంబు గలిగి తోఁచు; నాత్మ యప్పరమాత్మ యని యెవ్వరెఱుంగుదురు, వారి కయ్యెఱుకవలనఁ బ్రపంచంబు లేకుండు నజ్ఞాన సంభావిత నామకంబులైన సంసార బంధ మోక్షంబులు, జ్ఞాన విజ్ఞానంబులలోనివి గావు; కావునఁ గమలమిత్రున కహోరాత్రంబులు లేని తెఱంగునఁ, బరిపూర్ణ జ్ఞానమూర్తి యగు నాత్మ యందు నజ్ఞానంబులేమిని బంధంబును సుజ్ఞానంబు లేమిని మోక్షంబు లే; వాత్మవయిన నిన్ను దేహాదికంబని తలంచియు, దేహాదికంబు నిన్నుఁగాఁ దలంచియు, నాత్మ వెలినుండు నంచు మూఢులు మూఢత్వంబున వెదకుచుందురు; వారి మూఢత్వంబుఁ జెప్పనేల? బుద్ధిమంతులయి పరతత్వంబు గాని జడంబును నిషేధించుచున్న సత్పురుషులు తమ తమ శరీరంబుల యంద నిన్నరయుచుందు రదిగావున.

టీక:- దేవా = భగవంతుడా {దేవుడు - వ్యు. దీవ్యతి ఇతి దేవః, భూత భవిష్యద్వర్తమాన కాలములందు వెలుగుచుండువాడు, విష్ణువు}; ఇట్టి = ఇటువంటి; నీవు = నీవు; జీవాత్మస్వరూపకుడవు = క్షేత్రజ్ఞుడవు {జీవాత్మస్వరూపకుడు - సకల జీవులలోన ఉండెడి ఆత్మయే తన రూపైన వాడు, శ్లో. ప్రకృతింపురుషంచైవక్షేత్రం క్షేత్రమేవచ, ఇందంశరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే, ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతితద్విదః, క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత (భగవద్గీత), అర్జునా క్షేత్రమనగా ప్రకృతి ప్రకృతి అనగా దేహము దానిని తెలియువాడు క్షేత్రజ్ఞుడు ఆ క్షేత్రజ్ఞుడను నేనని తెలియుము, విష్ణువు}; సకల = సమస్తమైన; ఆత్మల = జీవాత్మల {జీవాత్మ - జీవులలో నుండెడి జీవి (ఆత్మ)}; కున్ = కి; ఆత్మ = శరీరివి; ఐన = అయినట్టి; పరమాత్మ = పరమాత్మ; స్వరూపకుడవు = తనరూపమైనవాడవు; అని = అని; ఎవ్వరు = ఎవరైతే; ఎరుంగుదురు = తెలియుదురో; వారు = వారే; కదా = కదా; గురువు = గురువు {గురువు - శ్లో. గుశబ్దస్త్వంధకారస్స్యా ద్రుశబ్దస్తన్నివర్తకః, అంధకార నివృత్తి త్వాద్గురు రిత్యభిధీయతే, అజ్ఞానాంధకార నివారకుడైన కారణాచార్యుడు}; అనియెడి = అనెడి; దినకరుని = సూర్యుని {దినకరుడు - దినమును కలిగించు వాడు, సూర్యుడు}; వలన = వలన; ప్రాప్తంబు = లభించినది; ఐన = అయినట్టి; ఉపనిషత్ = వేదాంత; అర్థ = సారపు; జ్ఞానంబు = అపరోక్ష జ్ఞానము; అను = అనెడి; సు = మంచి; నేత్రంబునన్ = కన్నుల; చేసి = వలన; సంసార = సంసారమనెడి {సంసారము - శరీరేంద్రియాదులు నేననుట సంసారము}; మిథ్యా = అనృత; సాగరంబున్ = సముద్రమును; తరించిన = దాటిన; చందంబునన్ = విధమున; ఉండుదురు = ఉండెదరు; రజ్జువు = తాడు; అందు = ఎడల; రజ్జువు = తాడు; అని = అని; ఎఱింగెడి = తెలుసుకొనెడి; ఎఱుక = జ్ఞానము; లేకుండన్ = లేక; ఆ = ఆ యొక్క; ఎఱుంగమిన్ = అజ్ఞానముచేత; అది = అది; సర్ప = పాము; రూపంబు = రూపము; అయి = కలిగి; తోచినన్ = కనపడిన; పిదపన్ = ఆ తరువాత; ఎఱింగినవారి = తెలిసినవారి; వలన = వలన; రజ్జువు = తాడు; రజ్జువు = తాడే; అని = అని; ఎఱుంగుచుండన్ = తెలుస్తుండగా; సర్ప = పాము; రూపంబు = రూపము; లేకుండు = ఉండని; కైవడిన్ = విధముగనే; ఆత్మ = జీవుడు; ఆ = ఆ; పరమాత్మ = పరబ్రహ్మము {పరమాత్మ - సర్వోత్కృష్టమైన ఆత్మ, సచ్చిదానంద పరబ్రహ్మము}; అని = అని; ఎవ్వరు = ఎవరైతే; ఎఱుంగరు = తెలియరో; వారి = వారల; కిన్ = కు; ఆ = అట్టి; ఎఱుంగమి = అజ్ఞానము; చేత = వలన; సకల = సమస్తమైన; ప్రపంచంబు = లోకములు; కలిగి = ఉన్నట్లు; తోచున్ = కలబడును; ఆత్మ = జీవుడే; ఆ = ఆ; పరమాత్మ = పరబ్రహ్మము; అని = అని; ఎవ్వరు = ఎవరైతే; ఎఱుంగుదురు = తెలిసినవారో; వారి = వారల; కిన్ = కు; ఆ = ఆ; ఎఱుక = జ్ఞానము; వలన = వలన; ప్రపంచంబు = ప్రపంచము; లేకుండున్ = అసత్తు అని తెలియును; అజ్ఞాన = తన్నుతానెరుగపోవుటచేత; సంభావిత = కలిగినవి; నామకంబులు = అనెడి పేరుగలవి; ఐన = అయినట్టి; సంసార = సంసారముతో; బంధ = బంధములు; మోక్షంబులు = విడుదలలు; జ్ఞాన = వేదాంతాధ్యాయజన్యజ్ఞానము; విజ్ఞానంబులు = అనుభవజన్యజ్ఞానములకు; లోనివి = చెందినవి; కావు = కావు; కావునన్ = అందుచేత; కమలమిత్రున్ = సూర్యుని {కమల మిత్రుడు - పద్మము లకు కావలసినవాడు, సూర్యుడు}; కున్ = కి; అహోరాత్రంబులు = రాత్రింబగళ్ళనెడితేడా; లేని = లేకపోయిన; తెఱంగునన్ = విధముగనే; పరిపూర్ణ = సంపూర్ణమైన; జ్ఞాన = తను తనేననెడి జ్ఞానమే; మూర్తి = స్వస్వరూపమైనది; అగు = ఐన; ఆత్మ = ఆత్మ; అందున్ = ఎడల; అజ్ఞానంబు = అజ్ఞానము; లేమిని = లేకపోవుటచేత; బంధంబును = బంధములు; సుజ్ఞానంబు = ఎరుక; లేమిని = లేకపోవుటచేత; మోక్షంబున్ = విడుదలగుటలు; లేవు = ఉండవు; ఆత్మవు = పరబ్రహ్మమవు; అయిన = ఐనట్టి; నిన్ను = నిన్ను; దేహా = శరీరము; ఆదికంబు = మొదలగునవి; అని = అని; తలంచియు = ఎంచుకొనినను; దేహ = శరీరము; ఆదికంబు = మొదలగునవి; నిన్ను = నీవే; కాన్ = అయినట్లుగా; తలంచియున్ = భావించి; ఆత్మ = ఆత్మ; వెలిన్ = వేరేగా; ఉండున్ = ఉండును; అంచున్ = అనుచు; మూఢులు = తెలివిలెనివారు; మూఢత్వంబునన్ = మూర్ఖముగా; వెదుకుచుందురు = శోధించుచుంటారు; వారి = వారల యొక్క; మూఢత్వంబున్ = తెలివితక్కువను; చెప్పనేల = తలచుట ఎందుకు; బుద్ధిమంతులు = ఆత్మజ్ఞానము కలవారు; అయి = ఐ; పరతత్వంబు = పరబ్రహ్మము; కాని = కానట్టి; జడంబును = చైతన్యముకానిదానిని; నిషేధించుచున్న = వదలివేయుచున్న; సత్పురుషులు = విజ్ఞానులు; తమతమ = వారి యొక్క మాత్రమే; శరీరంబుల = దేహములు; అందే = లోనే; నిన్ను = నిన్ను; అరయుచుందురు = చూచుచుందురు; అదిగావున = అందుచేత.

భావము:- ఓ దేవా! శ్రీకృష్ణా! ఇట్టి నీవు జీవాత్మస్వరూపుడ వని; ఆత్మలు అన్నింటికీ ఆత్మ యైన పరమాత్మ స్వరూపుడ వని గ్రహించ గలిగినవారు, గురువు అనే సూర్యుని వలన ఉపనిషత్తుల జ్ఞానం అనే కన్నును పొందినవారు. అటువంటివారు సంసార మనే ఈ మాయాసముద్రాన్ని దాటినట్లు కనిపిస్తారు. అది త్రాడే అను జ్ఞానం లేనప్పుడు, దానిని చూస్తే అది పాములా కనిపిస్తుంది. తరవాత తెలిసినవారి వలన అది త్రాడే అని తెలుసుకున్న తర్వాత ఇంక పాము అనే రూపం ఉండదు. అలాగే తనలో నున్న ఆత్మయే పరమాత్మ అని తెలియని వారికి, ఈ ప్రపంచ మంతా ఉన్నట్లుగా కనిపిస్తుంది. తరువాత తాను ఆత్మ అని ఆత్మయే పరమాత్మ అని తెలిసిన తరువాత వారికి “అజ్ఞానం కారణంగా ఈ ప్రపంచమంతా తనకు కనిపించినదే తప్ప నిజంగా అక్కడ ఏమీ లే” దని తెలుస్తుంది. సంసారబంధము అనేది అజ్ఞానం వలన పుట్టినది. మోక్షం అనేది కూడా అజ్ఞానం వలననే పుట్టినదే. ఈ బంధ మోక్షాలు జ్ఞాన విజ్ఞానాల లోనికి చేరవు. సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమణం వలన మనకు రాత్రింబవళ్ళు ఉన్నాయి గానీ సూర్యునికి రాత్రి పగలు లేవు అలాగే సంపూర్ణు డైన, జ్ఞాన స్వరూపు డైన ఆత్మకు అజ్ఞానం లేనందువలన బంధ మోక్షాలు ఉండవు. ఆత్మ వైన నిన్ను శరీర మని శరీరాదులు నీ వని భావించేవారు శరీరానికి బయట ఎక్కడో ఆత్మ ఉంటుంది అనుకునేవారు మూఢులు. అంటే మోహం చెందిన వారు. అ మోహంలోనే పడి ఆత్మ కోసం వెతుకులాడుతూ ఉంటారు. వారి మూఢత్వం ఇంత అని చెప్పడ మెందుకు. జడపదార్ధంలో కూడా పరమాత్మనే దర్శనం చేసేవారు బుద్ధిమంతు లైన సత్పురుషులు. వారు తమ శరీరాల లోనే నిన్ను చూడగలుగుతారు. అందుచేత. . .

10.1-569-శా.

దేవా! నీ చరణప్రసాదకణలబ్ధిం గాక లేకున్న నొం
డేవెంటం జను నీ మహామహిమ నూహింపంగ నెవ్వారికిన్?
నీ వారై చనువారిలో నొకఁడనై నిన్ గొల్చు భాగ్యంబు నా
కీవే యిప్పటి జన్మమం దయిన నొం డెం దైన నో! యీశ్వరా!

టీక:- దేవా = కృష్ణా {దేవా - స్వయంప్రకాశకుడు, విష్ణువు}; నీ = నీ యొక్క; చరణ = పాదముల; ప్రసాద = అనుగ్రము యొక్క; కణ = రేణువైన; లబ్ధిన్ = దొరకుటచేత; కాక = తప్పించి; లేకున్న = లేకపోతే; ఒండేవెంటన్ = మరింకేవిధముగనైన; చనున్ = వీలగునా, కాదు; నీ = నీ యొక్క; మహా = గొప్ప; మహిమన్ = మహత్మ్వమును; ఊహింపగన్ = ఊహించుటకైనను; ఎవ్వారికిన్ = ఎవరికైనను; నీ = నీకు; వారు = చెందినవారు; ఐ = అయ్యి; చను = వర్తించెడి; వారి = వారలలో; లోన్ = అందు; ఒకడను = ఒకానొకడను; ఐ = అయ్యి; నిన్ = నిన్ను; కొల్చు = సేవించెడి; భాగ్యంబున్ = అదృష్టమును; నా = నా; కున్ = కు; ఈవే = ఇమ్ము; ఇప్పటి = ప్రస్తుత; జన్మము = పుట్టుక; అందున్ = లోన; అయినన్ = అయినప్పటికి; ఒండు = మరొకటి (జన్మము); ఎందు = దేనిలో; ఐనన్ = అయినప్పటికి; ఓ = ఓ; ఈశ్వరా = శ్రీకృష్ణా {ఈశ్వరుడు - సర్వ కర్త, విష్ణువు}.

భావము:- ఓ శ్రీకృష్ణ ప్రభూ! నీ మహోన్నత మహిమను ఊహించా లంటే నీ పాద ధూళికణ ప్రాప్తి వలన మాత్రమే సాధ్యం తప్ప మరి ఎవరికి సాధ్యం కాదు. నీవారుగా జీవించ గల ధన్యులలో నేను ఒకడిగా ఉండి నిన్ను సేవించుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించు. ఈ జన్మలో కాకపోతే మరో జన్మలో నైనా సరే ఆ మహాభాగ్యం నాకు ప్రసాదించు.

10.1-570-త.

క్రతుశతంబునఁ బూర్ణ కుక్షివి; గాని నీ విటు క్రేపులున్
సుతులునై చనుఁబాలు ద్రావుచుఁ జొక్కి యాడుచుఁ గౌతుక
స్థితిఁ జరింపఁగఁ దల్లులై విలసిల్లు గోవుల గోపికా
తుల ధన్యత లెట్లు చెప్పగఁ జాలువాఁడఁ గృపానిధీ!

టీక:- క్రతు = యజ్ఞములు; శతంబునన్ = నూటివలనను (100); పూర్ణకుక్షివి = నిండిన కడుపు గలవాడవు {పూర్ణకుక్షివి - నిండిన కడుపు కల వాడవు, తృప్తుడవు}; కాని = కానట్టి; నీవు = నీవు; ఇటు = ఈ విధముగ; క్రేపులున్ = దూడలుగ; సుతులున్ = బాలురుగ; ఐ = అయ్యి; చనుబాలు = స్తన్యము; త్రావుచున్ = తాగుచు; చొక్కి = సోలి, మైమరచి; ఆడుచున్ = క్రీడించుచు; కౌతుక = కుతూహలము కలిగిన; స్థితిన్ = విధముగ; చరింపన్ = మెలగుచుండగ; తల్లులు = తల్లిపాత్రలు పోషించుచు; ఐ = ఉండి; విలసిల్లు = ప్రకాశించెడి; గోవుల = ఆవుల యొక్క; గోపికా = యాదవ; సతుల = ఇల్లాళ్ళ యొక్క; ధన్యతన్ = కృతార్థత్వములు; ఎట్లు = ఏ విధముగా; చెప్పగజాలు = స్తుతించగలిగిన; వాడన్ = వాడిని; కృపానిధీ = దయాసాగరా.

భావము:- ఓ కృపానిధీ! కృష్ణా! నీవు యజ్ఞపురుషుడవు; వందల కొద్దీ యజ్ఞాలు నీ కడుపులో దాగి ఉన్నాయి; అయినా నీవు ఈ విధంగా లేగలుగా, గోపాలురుగా రూపాలు ధరించి ఉన్నావు; గోవుల వద్ద గోపికల వద్ద నీవు పాలు త్రాగి పరవశిస్తూ, ఆటలుఆడుతూ, ఎంతో ఉత్సాహంతో సంచరిస్తున్నావు; నీకు తల్లులు కాగలిగిన ఆ గోవులు గోపికలు ఎంత పుణ్యం చేసుకున్నారో ఎలా చెప్పగలను; నీవు కరుణామయుడవు కనుకనే ఆ గోవులు గోపికలు అంత ధన్యత్వాన్ని అందుకోగలిగారు.

10.1-571-క.

రిపూర్ణంబుఁ బురాణముఁ
మానందంబునైన బ్రహ్మమె చెలికాఁ
రు దరుదు నందఘోష
స్థిజనముల భాగ్యరేఖ చింతింపంగన్

టీక:- పరిపూర్ణంబున్ = అంతట నిండి ఉన్నది; పురాణంబున్ = సృష్ట్యాదినుండి ఉన్నది; పరమానందంబున్ = నిరతిశయ సుఖ రూపము; ఐన = అయినట్టి; బ్రహ్మమె = పరబ్రహ్మమే స్వయముగా; చెలికాడు = స్నేహితుడు; అరుదరుదు = అత్యద్భుతము; నంద = నందుని యొక్క; ఘోష = వ్రేపల్లెలో; స్థిర = నివసించెడి; జనములు = వారి యొక్క; భాగ్యరేఖ = అదృష్టము; చింతింపగన్ = తరచిచూసినచో.

భావము:- అంతా తన యందు ధరించినది; అన్నిటికి మొదటిది; పరమానంద స్వరూపము అయిన పరబ్రహ్మమే; ఈ నందగోకులం లోని జనులకు చెలికాడు అయినా డట; ఆహ! ఇది ఎంత అపురూప మైన విషయం. వీరి భాగ్యరేఖ ఎంత అద్భుత మైనదో ఊహించడం కూడా విధాత నైన నాకే సాధ్యం కావడం లేదు.

10.1-572-సీ.

కదశేంద్రియాధీశులు చంద్రాదు-
లేను ఫాలాక్షుండు నిట్లు గూడఁ
దుమువ్వురము నెడడక యింద్రియ పాత్ర-
ముల నీ పదాంభోజముల మరంద
మృతంబుగాఁ ద్రావి మర నేకైకేంద్రి-
యాభిమా నులుమయ్యు తి కృతార్థ
భావుల మైతిమి; రఁగ సర్వేంద్రియ-
వ్యాప్తులు నీ మీఁద వాల్చి తిరుగు

10.1-572.1-తే.

గోప గోపికాజనముల గురు విశిష్ట
భాగ్య సంపదఁ దలపోసి ప్రస్తుతింప
లవిగా దెవ్వరికి నైన నంబుజాక్ష!
క్తవత్సల! సర్వేశ! రమపురుష!

టీక:- ఏకాదశేంద్రియ = ఏకదశేంద్రియములకు {ఏకదశేంద్రియములు - జ్ఞానేంద్రియములు (5) కర్మేంద్రియములు (5) మరియు మనస్సు మొత్తం (11)}; అధీశులు = అధిదేవతలు; చంద్ర = చంద్రుడు {చంద్రాదులు - 1చంద్రుడు మనసునకు, 2దిక్కులు చెవికి, 3గాలి చర్మమునకు, 4సూర్యుడు కంటికి, 5వరుణుడు నాలుకకు, 6అశ్వినులు ముక్కునకు, 7అగ్ని వాక్కునకు, 8దేవేంద్రుడు హస్తమునకు, 9విష్ణువు పాదమునకు, 10మృత్యువు గుదమునకు, 11ప్రజాపతి గుహ్యమునకు అధిదేవతలు}; ఆదులు = మున్నగువారు; ఏనున్ = బ్రహ్మదేవుడనునేను {బ్రహ్మ - బుద్ధీంద్రియమునకు అధిదేవత}; ఫాలాక్షుండును = పరమశివుడు {శివుడు - అహంకారేంద్రియమునకు అధిదేవత}; ఇట్లు = ఇలా; కూడన్ = కలుపుకొనినచో; పదమువ్వురము = పదముగ్గురము (13); ఎడపడక = ఎడతెగక; ఇంద్రియ = ఇంద్రియములు అనెడి; పాత్రములన్ = పాత్రల యందు; నీ = నీ యొక్క; పద = పాదములు అనెడి; అంభోజముల = పద్మము లందలి; మరంద = మకరందము అనెడి; అమృతంబున్ = అమృతమును (దుఃఖరహితస్థితి); కాన్ = ఐనట్లు; త్రావి = తాగి (స్వీకరించి); అమరన్ = ఒప్పియుండి; ఏకైక = ఒకే; ఇంద్రియ = ఇంద్రియములకు; అభిమానులము = అభిమానించువారము; అయ్యున్ = అయినప్పటికి; అతి = మిక్కిలి; కృతార్థ = ధన్యమైన; భావులము = కలిగినవారము; ఐతిమి = అయినాము; పరగన్ = ప్రసిద్ధముగా; సర్వ = ఎల్ల; ఇంద్రియ = ఇంద్రియముల యొక్క; వ్యాప్తులున్ = వర్తనలను; నీ = నీ; మీదన్ = అందే; వాల్చి = ఉంచి; తిరుగు = మెలగెడి.
గోప = యాదవులు, గొల్లలు; గోపిక = గోపికలు, గొల్లస్త్రీలు; జనముల = అందరి; గురు = గొప్ప; విశిష్ట = శ్రేష్ఠమైన; భాగ్య = అదృష్టము అనెడి; సంపద = కలిమి; తలపోసి = విచారించి; ప్రస్తుతింపన్ = స్తోత్రముచేయుటకు; అలవి = శక్యము; కాదు = కాదు; ఎవ్వరి = ఎవరి; కిన్ = కి; ఐనన్ = అయినప్పటికి; అంబుజాక్ష = పద్మాక్షా, కృష్ణా {అంబుజాక్షుడు - అంబుజము (పద్మము) వంటి అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు}; భక్తవత్సల = కృష్ణ {భక్తవత్సలుడు - భక్తుల ఎడ వాత్సల్యము కలవాడు, విష్ణువు}; సర్వేశా = కృష్ణ {సర్వేశుడు - సర్వులకు నియామకుడు, విష్ణువు}; పరమపురుష = కృష్ణ {పరమపురుషుడు - పురుషులలో (కారణభూతులలో) ఉత్తముడు (మూలమైనవాడు), విష్ణువు}.

భావము:- సర్వేశ్వరా! పరమపురుషా! పుండరీకాక్షా! చంద్రుడు మొదలైన పదకొండు ఇంద్రియాలకు అధిపతులు, నేను, శివుడు ఈ పదముగ్గురమే నీ యందు ఏమరుపాటు చెందకుండా ఉన్న వారము. మేము మా మా ఇంద్రియాలు అనే పాత్రలలో నీ పాదపద్మముల నుండి పుట్టిన మకరందాన్ని అమృతం వలె త్రాగుతున్నాము. కనుకనే ఒక్కక్క ఇంద్రియానికి వేరువేరుగా అధిపతులం అయ్యాము. ఎంతో ధన్యులం అయ్యాము. అలాంటిది అన్ని ఇంద్రియాల ప్రవృత్తులూ నీ పైననే ఉంచుకో గలుగుతున్న గోపికల భాగ్యం ఎంత గొప్పదో ఎంత విశిష్ట మైందో దానిని గురించి ఆలోచించడానికి గాని స్తోత్రం చేయడానికి గాని ఎవరికీ సాధ్యం కాదు. నీవు భక్తుల యెడల వాత్సల్యం కలవాడవు కనుకనే గోపగోపికా జనాలకు ఇంతటి భాగ్యం లభించింది.

10.1-573-శా.

లా బ్రహ్మపదంబు? వేదములకున్ వీక్షింపఁగారాని ని
న్నీలోకంబున నీ వనాంతరమునం దీ మందలోఁ గృష్ణ యం
చాలాపాది సమస్త భావములు నీ యందే సమర్పించు నీ
వ్రేలం దొక్కని పాదరేణువులు పై వేష్ఠించినం జాలదే?

టీక:- ఏలా = ఎందులకు; బ్రహ్మ = బ్రహ్మదేవు డనెడి; పదంబు = పదవి, అధికారస్థానము; వేదముల్ = చతుర్వేదముల కైనను {చతుర్వేదములు - 1ఋగ్వేదము 2యజుర్వేదము 3సామవేదము 4అధర్వణవేదము}; వీక్షింపగాన్ = దర్శించుటకు; రాని = శక్యముగాని; నిన్ను = నిన్ను; ఈ = ఈ; లోకంబునన్ = లోకము నందు; ఈ = ఈ యొక్క; వన = అడవి; అంతరము = లోపల; అందున్ = అందు; ఈ = ఈ; మంద = గొల్లపల్లె; లోన్ = లోపల; కృష్ణ = కృష్ణుడా; అంచున్ = అనుచు; ఆలాప = ముచ్చటలాడుట; ఆది = మున్నగు; సమస్త = ఎల్ల; భావములున్ = వ్యాపారములు; నీ = నీ; అందే = ఎడలనే; సమర్పించు = భక్తిగా నడపించెడి; ఈ = ఈ; వ్రేలన్ = గోపాలుర; అందున్ = లో; ఒక్కని = ఏదో ఒకని; పాద = కాలి; రేణువులు = దుమ్ముకణములు; పైన్ = మీద (శరీరముమీద); వేష్ఠించినన్ = కమ్ముకొన్నను; చాలదే = సరిపోదా, సరిపోతుంది కదా.

భావము:- వేదాలు నిన్నుగురించి చెబుతాయే గాని. నిన్ను దర్శించ లేవు కదా. అటువంటి నిన్ను ఈ భూలోకంలో ఈ అడవిలో ఈ గోకులంలో సహచరుడుగా పొందగలిగారు. ఈ గోపకులు “కృష్ణా! కృష్ణా!” అంటూ మాటల దగ్గర నుంచీ అన్ని భావాలు నీ యందే సమర్పించుకుంటున్నారు. ఈ గొల్లలలో ఒక్కడి పాదరేణువులలో ఒక్క కణం నా శిరస్సు పైన ధరించగలిగితే చాలదా? ఈ బ్రహ్మ పదవి ఎందుకయ్యా నాకు.

10.1-574-మ.

నిను హింసించిన పూతనాదులకు మున్ నీ మేటి సంకేత మి
చ్చి నీకుం బుర దార పుత్ర గృహ గో స్త్రీ ప్రాణ దేహాదు లె
ల్లను వంచింపక యిచ్చు గోపకులకున్ క్షింప నే మిచ్చెదో?
ని సందేహము దోఁచుచున్నది ప్రపన్నానీకరక్షామణీ!

టీక:- నినున్ = నిన్ను; హింసించినన్ =చంపవచ్చిన; పూతన = పూతన; ఆదులు = మొదలగువారి; కున్ = కి; మున్ = ఇంతకుముందు; నీ = నీ యొక్క; మేటి = గొప్ప; సంకేతము = పరమపదమును; ఇచ్చిన = ప్రసాదించినట్టి; నీ = నీ; కున్ = కు; పుర = పట్టణము; దార = భార్యలు; పుత్ర = కొడుకులు; గృహ = నివాసములు; గో = ఆవులు; శ్రీ = సంపదలు; ప్రాణ = పంచప్రాణులు; దేహ = శరీరములు; ఆదులు = మున్నగునవి; ఎల్లను = సర్వము; వంచింపక = వెనుదీయక; ఇచ్చు = సమర్పించెడి; గోపకుల్ = యాదవుల; కున్ = కు; లక్షింపన్ = విచారించినచో; ఏమి = ఏమిటి; ఇచ్చెదో = ప్రసాదించెదవో; అని = అని; సందేహము = అనుమానము; తోచుచున్నది = కలుగుచున్నది; ప్రపన్నానీకరక్షామణీ = శ్రీకృష్ణా {ప్రపన్నానీకరక్షామణి - ప్రపన్న (ప్రపత్తిని [భక్తులు చేయు శరణాగతిని] పొందిన వారి) అనీక (సమూహమును, గుంపును) రక్షా (రక్షించునట్టి) మణి (శ్రేష్ఠుడు), విష్ణువు}.

భావము:- భక్తులకు అందరికి రక్షామణివైన ఓ కృష్ణా! నిన్ను చంప దలచి వచ్చిన పూతన మొదలైన రాక్షసులకే అద్భుతమైన మోక్షాన్ని ప్రసాదించావు. అటువంటి నీకు గోపకు లందరూ తమ ఊరిని, భార్యలను, పుత్రులను, ఇండ్లను, గోవులను, స్త్రీలను, ప్రాణాన్ని, శరీరం మొదలైన వాటిని అన్నింటినీ సందేహం లేకుండా సమర్పణ చేసుకున్నారు. అటువంటి వారికి ఆ మోక్షం కన్నా ఇంకా ఎక్కువైనది ఏమి ఇస్తావో అని నాకు సందేహం కలుగుతూ ఉంది.

10.1-575-క.

దేము కారాగేహము
మోము నిగళంబు; రాగముఖరములు రిపు
వ్యూములు భక్తితో ని
న్నూహింపఁని యంతదడవు నో! కమలాక్షా!

టీక:- దేహము = శరీరము; కారాగేహము = చెరసాల వంటిది; మోహము = అత్యాసక్తి, వలపు {మోహము - శరీరాదులు నేను అనుకోనుట}; నిగళంబు = సంకెళ్ళు; రాగముఖరంబులు = రాగద్వేషములు {రాగద్వేషములు - 1రాగము 2ద్వేషము 3కామము 4క్రోధము 5లోభము 6మోహము 7మదము 8మాత్సర్యము 9ఈర్ష్య 10అసూయ 11దంభము 12దర్పము 13అహంకారము}; రిపు = శత్రు; వ్యూహములు = సేనలు; భక్తి = అనన్యభక్తి; తోన్ = తోటి; నిన్ను = నిన్ను; ఊహింపని = తలచని; అంత = అంత; తడవునే = సేపు; ఓ = ఓ; కమలాక్షా = పద్మాక్షా, కృష్ణా.

భావము:- కమలముల వంటి కన్నుల కల కృష్ణా! భక్తితో నిన్ను స్మరించనంత కాలమూ ఎవరికైనా శరీరము కారాగారము; మోహము అనేది సంకెళ్ళూ; రాగద్వేషాదులు శత్రువ్యూహాలూ; అవుతాయి.

10.1-576-ఆ.

శ్రయించు జనుల కానందసందోహ
మీఁ దలంచి వివిధ హేలతోడ
ప్రపంచకుండ య్యుఁ బ్రపంచంబు
వెలయఁజేయు దీవు విశ్వమూర్తి!

టీక:- ఆశ్రయించు = నిన్ను ఆశ్రయించునట్టి; జనుల్ = వారల; కిన్ = కు; ఆనంద = సంతోషములు; సందోహము =సమాహారము; ఈన్ = ఇయ్యవలె నని; తలచి = భావించి; వివిధ = అనేక రకముల; హేల =లీలల; తోడన్ = తోటి; అప్రపంచకుండవు = ప్రపంచాతీతుడవు; అయ్యున్ = అయినప్పటికిని; ప్రపంచంబున్ = జగత్తును; వెలయజేయుదువు = అలర జేయుదువు; ఈవు = నీవు {విశ్వము - శ్రు. విశ్వశబ్దస్య ఓంకారోభిధీయతే, శ్లో. ఓమితి బ్రహ్మ ఓమితీదగం సర్వం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ (ఉపనిషత్) శ్రు. ఓం భూః ఓంభువః ఓంగంసువః ఓంమహః ఓంజనః ఓంతపః ఓంగం సత్యం}; విశ్వమూర్తి = శ్రీకృష్ణా {విశ్వమూర్తి - విశ్వ (జగత్తు, ఓంకార) మూర్తి (స్వరూపుడు), విష్ణుసహస్రనామాలు 717వ నామం}.

భావము:- విశ్వమంతటా అంతర్యామిగా ఉన్న ఓ విశ్వమూర్తీ! నీకు ప్రపంచం అంటూ నిజంగా లేదు అయినా నిన్ను భక్తితో ఆశ్రయించిన జనులకు ఆనందాన్ని ప్రసాదించటానికి ఎన్నో విలాసాలతో ఈ ప్రపంచాన్ని సృష్టించి, నడుపుతూ ఉంటావు.

10.1-577-క.

ఱిఁగిన వార లెఱుంగుదు
రెఱుఁగన్ బహు భాషలేల? నీశ్వర! నీ పెం
పెఱుఁగ మనోవాక్కులకున్
గుఱిచేయం గొలది గాదు గుణరత్ననిధీ!

టీక:- ఎఱిగినవారలు = బ్రహ్మవేత్తలు {బ్రహ్మవేత్తలు - శ్రు. బ్రహ్మై వేద బ్రహ్మవిద్భవతి, బ్రహ్మవేత్తలు బ్రహ్మమే (నీ స్వరూపులే) ఐయున్నారు}; ఎఱుంగుదురు = తెలిసికొందురు; ఎఱుగన్ = తెలిసికొనుటకు; బహుభాషలు = ఇన్నిమాటలు; ఏలన్ = ఎందుకు; ఈశ్వర = సర్వనియామకా; నీ = నీ యొక్క; పెంపున్ = ఘనతను; ఎఱుగన్ = తెలిసికొనుటకు {తెలియరానివాడు - శ్రు. నతత్ర చక్షుఃగచ్ఛతి నవాగ్గచ్ఛతి నోమనః, నీవు ఇట్టివాడవు అని చూపులచేత మాటలచేత ఊహలచేత తెలియ శక్యము కాదు}; మనస్ = మనసు; వాక్కుల = మాటల; కున్ = చేతను; గుఱిచేయన్ = లక్షించుటకు, అందుకొన; కొలది = శక్యము; కాదు = కాదు; గుణరత్ననిధీ = కృష్ణా {గుణరత్ననిధీ - సర్వజ్ఞత్వము సర్వేశ్వరత్వము సర్వభోక్తృత్వము మున్నగు గుణములలో రత్నముల (శ్రేష్ఠమైనవాని)కి నిధివంటివాడు లేదా రత్ననిధి (సముద్రము వంటివాడు), విష్ణువు}.

భావము:- శ్రీకృష్ణ పరమశ్వరా! సర్వోత్తమ గుణాలకు నిధి వంటివాడా! నిన్ను తెలియవలె నంటే అది ఎలాగో జ్ఞానులకే తెలుసు. ఇన్ని మాట లెందుకు. నీ గొప్పతనం తెలుసుకోవడానికి మనస్సు గాని వాక్కు గాని ఉపయోగించడం కష్టంగా ఉంది.