పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ముఖ పుస్తక వ్యాఖ్యలు : 2020

 తెలుగుబాగవతం.ఆర్గ్ కు చెందిన విషయాలపై ముఖపుస్తకం (FaceBook)లో 2020లో వచ్చిన వాటిలో ఎంచిన స్పందనలు

తారీఖు స్పందనఅతిథి
2020-01-26  ఈరోజు ఏడు కొండలు-ఏడు కాండలు అనే శ్రీభాష్యం వారి పుస్తకం చదివాక, ఈ పద్యం "శాంతున కపవర్గ సౌఖ్య సంవేదికి;..." కనబడింది. అక్కడ వారు చెప్పిన క్రమం ఇక్కడా కనబడింది అనిపించింది. శబ్దప్రమాణమైన వేదం, ధర్మం, సత్యజ్ఞానం, సాకారఆత్మస్వరూపం, పరతంత్రభావన, పాపనాశనం, బ్రహ్మాత్మకజ్ఞానపరిపూర్తి, ఇవన్నీ వరుసగా వచ్చినట్లు తోచాయి. పోతన బ్రహ్మజ్ఞానం తెలిసి అందించిన మహాముని.రెంటచింతల చంద్ర. ముఖపుస్తకం