పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ముఖ పుస్తక వ్యాఖ్యలు : 2017

తారీఖు స్పందనఅతిథి
2017-12-14(Ramana Gadepalli) మా ఇంట్లో భాగవత పారాయణం చేసి రుక్మిణీ కళ్యాణం చేయించిన నాలుగు నెలలకే మా అబ్బాయికి ఇంకా గోత్ర నామాలతో కళ్యాణంలో కూర్చున్న 42మందికి సంవత్సరం లోపల వివాహం జరిగింది, మా ఊరంతా ఇప్పుడు ఈ విషయాన్ని నమ్ముతున్నారు,
ఓంనమో భగవతే వాసుదేవాయ.
శ్రీమతి గడ్డేపల్లి రమణ
2017-10-09, , , , ప్రవాసాంతర్జాలారణ్యవాస ప్రారబ్దులమైన మాకు ఈ అరణ్యవాసంలో పోతన భాగవతమును ... అది ఒక ఆండ్రాయిడ్ ఆప్ అనకూడదు అది ఒక నైమిశారణ్య బుుషిసత్సంగంగా మాకు ప్రాప్తింపజేసిన సూతులు ..... మిత్రులు శనగవరపు ఉమామహేశ్ గారు అన్నట్లు మా తపస్స్వాధ్యాయ మండలి ...... "సరిపల్లె సూర్యనారాయణ
2017-05-13 మహోపాధ్యయులు ఆచార్య చొప్పకట్ల సత్యన్నారాయణ వారి పోతన గారి మనోచిత్రణం టపా పై స్పందన సందర్భంగా మాన్య పరమ భాగవతులు శ్రీ జాజి శర్మగారి సిఫారసు :- "అంతటి పోతన గారి భాగవతం ..... అంతర్జాలం లో ఎంతో శ్రమకోర్చి నిక్షిప్తం చేశారు. ఈ జాలగూడు (వెబ్సైటు) అందరూ బుక్ మార్క్ (పుట గుర్తగు) చేసుకుని , భాగవతం చదువుతూ జన్మ ధన్యం చేసుకోగలరు. telugubhagavatam.org జాజి శర్మ
2017-02-27 కాళియ మర్దన ఘట్టంలోని ఈ నాగ సతుల ప్రార్థన పురుషసూక్తంతో సమానంగా ఉన్నది. ఎంత ఉపనిషత్ సార మున్నదో! నాకు వ్యథ కలిగినప్పుడు ఈ భాగాన్ని నేను చదువుతూ ఉంటాను, శ్రీకృష్ణ భగవాన్ చేసిన వారి ప్రార్థన స్వతసిద్ధంగా ధ్యాన, వేదసార సమృద్ధం; ఎంతో ధీశక్తి, స్వాంతనలను రూఢిగా ఇస్తుంది!శ్రీమతి ఉషా కృష్ణ మూర్తి {వీరిది పండిత కుటుంబం. వీరికి సంగీత సాహిత్యాలలో ప్రవేశం ఉన్నది. వీరు ఉన్నత సంస్కారులు}