పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

జాలగూడు వ్యాఖ్యలు : 2018

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :


క్రీ.శ. 2018 సంవత్సరంలో తెలుగుభాగవతం.ఆర్గ్ కు వచ్చిన స్పందనలు ఎంచినవి:-

తారీఖు స్పందనఅతిథి
2018-11-04 పోతన భాగవతం చూసాను. ఇది అద్భుతమైన కృషి. ఇటువంటిది ఇప్పటివరకు ఎవరూ చేయలేదని అనుకుంటున్నాను. (అవునండి. నిజమే నండి). రచయిత కాలాంచేసినా అతని రచన రూపంలో ప్రచారంలో ఉన్నంతకాలం జీవించే ఉంటాడు. ఎవరు అట్టి ప్రచారం చేస్తున్నారో వారు కూడా ఆ రచయిత అంతటి గొప్పవారే. . . . బొల్లాప్రగడ భాస్కరరావు
2018-11-03 భాగవతంపై అద్భుతమైన ప్రయత్నం. ఒక చక్కటి విజ్ఞాన సర్వస్వంలా తయారు చేసారు.... డా. వివి రామారావు.
2018-07-09 భాగవతం డబ్బుకు లోటు లేని సమయంలో కూడా కొని చదువ లేకపోయినాను, ..... చదువ గలుగు చున్నాను... ఇలానే రామాయణం మహాభారతం చేయగలరు. కొమ్మి శెట్టి వెంకటేశ్వరరావు.
2018-07-06 తెలుగు ఆధ్యాత్మిక,భక్తీ సాహిత్యం లో తలమానిక గన్న పోతన మహా భాగవతాన్ని భక్తులకి మీరు ఇంటర్నెట్ ద్వారా అందించి ఎంతో సేవ చేస్తున్నారు.. కస్తూరి రామచంద్ర రావు.
2018-06-26 ఇది చాలా అద్భుతంగా ఉంది... మన సంస్కృతి మూల స్తంభాలను నవతరాలకు అందిస్తున్న తీరు చాలా గొప్పగా ఉంది...జైశ్రీరామ్. కె. మోహన చంద
2018-06-26 మహాకవి పోతన భాగవతం ఒక అద్భుతం, పరమాద్భుతం. ఆ అద్భుత కావ్యంలోని మొత్తం పద్యాలను స్పష్టమైన పదోచ్చారణతో మీ వెబ్‍సైట్ ద్వారా సాహితీప్రియులకు అందించిన తీరు కూడా అంత అద్భుతం. ఆపైన టీకా, తాత్పర్యాలను అక్షర రూపంలో పొందుపర్చడం అపురూపం. మీ వెబ్‍సైట్‍ని..... డా. జొన్నలగడ్డ రాజగోపాలరావు, రామలక్ష్మి
2018-06-21 .... గొప్ప క్రియాశీల ఆలోచన. దాని అద్భుతమైన కార్యాచరణ..... వేంకట అనంత రామ్
2018-04-29 .... కాలం మరిచిపోతున్న మన భాగవతాన్ని మీరు ఇలా ఇప్పటి సాంకేతికతకు అనుగుణంగా అందించడం చాలా ప్రశంసనీయం..... ప్రవీణ్
2018-04-26 ఈ మీ కృష్ణికి అనేక ధన్యవాదములు సుప్రజ, చెన్నై
2018-03-19 చాలా చాలా సంతోషం అండి. ఈ గ్రంథం పఠనంతో నా జీవితం సఫలమౌతుంది అనుకుంటున్నాను. ఆంధ్ర మహా భారత గ్రంథం కూడా ఇలా అందుబాటులోకి తీసుకువస్తారని ఆశిస్తున్నాను. రాజమౌళి.
2018-02-13 పద్యము, భావము, టీకా అన్ని ఇచ్చారు. నిజంగా మీ ప్రయత్నం అపూర్వం. ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే మీకు !!శతకోటి పాదాభివందనాలు !!! దేవులపల్లి గౌతం, సింగపూరు.
2018-1-21 తెలుగు జాతి దీనికి సర్వధా రుణపడి ఉండాలి. ఈ మేలు ఎన్నటికీని మరచిపొలేనిది. ఈ భాషా సేవ అపురూపము అపూర్వము. మీరు ఆధునిక brown గా చిరకాలం వర్ధిల్లుధురు గాక!సదా మీకు శత కోటి వందనాలు. శుభం భూయాత్. ...గోపిరెద్ది రామిరెడ్డి. తెలుగు పండితులు. కొణిదేడు, పాణ్యం మండలము, కర్నూలుజిల్లా,ఆం.ప్ర.
2018-1-17 తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరు ఈ గ్రంథాలయం చదివి, దీనిలో ఉన్న గొప్పదనాన్ని ఆస్వాదించి తీరాలి...నందిరాజు విజయ భాస్కర రావు.
2018-1-11అద్భుతం. నిజంగా ఇది తెలుగులకు పెద్ద వరప్రసాదం.ఎఎల్. ప్రసాదు.