పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వేగరి వ్యాఖ్యలు : ఆస్ట్రేలియా తెలుగు భాగవతులు

ఆస్ట్రేలియా తెలుగు భాగవతుల స్పందనలు
కందాడ రావు

2015-05-09

కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్।
ఆరూహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్ ॥
మంగళకరమైన పోతన భాగవతపు మామిడి చివుళ్ళు తిని భగవత్ భక్తి అనే మత్తెక్కిన శ్రీ సరిపల్లె కోకిల తన పంచమ స్వరములోనిరంతర విష్ణు చిత్తులైన శ్రీ సాంబ మూర్తి వారిని స్తుతించుట సహజమే !
సామవేదము వారి శ్రీ మహాభారత ప్రవచమును 50 పద్యములలో పొగడిన పెద్దలు సూర్యనారాయణులు , వెనువెంటనే శ్రీ మహా భాగవత భండాగార రక్షకులైన శ్రీ సాంబమూర్తి గారిపైన పద్యముల పూల జల్లు కురిపించుట భారతీయ సనాతన ధర్మ రక్షణకు శుభ శకునము !!
।। శ్రీ రామజయం - దాసోహం రామస్య ।।
. . . .
సరిపల్లి సూర్యనారాయణ,

2015-05-08

పోతనభాగావతాంతర్జాల భక్తి మందిర నిర్మాతలు -- ఊలపల్లి లలితా, సాంబశివుల కు -----అభినందన చిత్త మత్తకోకిల మాలికలు
(షట్పది మత్తకోకిల)
తాపత్రపురాశు లందును తామ్రపత్రపు రాశులన్
మూమూల ల నేడ నున్నను మూలముల్ పదిలమ్ముగా వే లక్షల ఏండ్ల పిమ్మట వెల్కి దీయుచు శ్రద్ధతో
కా ధర్మము పాలు గాకను కాపుగాచిన వారికిన్
చాదేమియు లోక మిచ్చిన చాలి పోదది ఆ ఋణం
గ్రోగావలె వాటి విల్వల కోరిరయ్యదె నా ఋషుల్

(షట్పది మత్తకోకిల)
సాలు సాలుకు మాధ్యమమ్ముల శైలిమార్పుల గైకొనే
వమ్మును మార్పుచెందని శ్వరున్వగు లీలలన్
కేలి కున్నటి వేలినొక్కుల కేను కన్నుల నాడగా
శైజా లలితాంబవామము సాయమీయగ నిత్యమున్
వూపల్లి నివాస సాంబ శివోత్తముల్ మనకిచ్చిరే
పూవానలు గుమ్మరించడె పోతనార్యుడె మెచ్చుచున్

భవదీయుడు
సూర్యనారాయణ సరిపల్లి
. . .
శ్రీ మాతృదేవి లలితాంబా హృదయానందకరా శ్రీ సాంబ శివా !
మన భారతీయ గీర్వాణ సాంస్కృతిక పునరుజ్జీవనమనెడి మహా యజ్ఞములో మీ వంటి ఒక్కొక్క యాజ్ఞికుడు ఒక్కొక్క ఇష్టి పూర్తి చేయవలెనని అమ్మ సంకల్పించినట్లు ఉన్నది. అందువలెననే హయగ్రీవదనుజకర పరిమిళిత నిగమ నివహ విభాగ నిర్ణయ నిపుణులైన శ్రీ వేద వ్యాస మహర్షుల అంశలగునట్లు మీ పైన మరియు మీ తోడుగా పనిచేయు శ్రీ మహా భాగవత యాజ్ఞీకుల పైన ఆ మాతృదేవతా కృప చేసినట్లు నాకు అనిపించుచున్నది. శుభం భూయాత్ ॥
భారత మాతకు జయమగు గాక । శాంతికరము మరియు జగత్కళ్యాణ కారణమైన వైదిక సంస్కృతికి జయమగు గాక !
॥ శ్రీ రామజయం - దాసోహం రామస్య ॥
. . .
ఉమామహేశ్ శనగవరపు,

2015-05-08

స+అంబ శివం గారు ,
మీకు మరియు తెలుగుభాగవతం.ఆర్గ్ బృందానికి పేరు పేరునా మా ఆస్ట్రేలియా భాగవతుల కృతజ్ఞతా పూర్వక నమస్కారములు తెలుప గలరు.
శ్రీ రామజయం
-------------------- క్రింది పద్యముయొక్క మీ టీక తాత్పర్యముల అధ్యయనమయిన తరువాయి నాయందు పెల్లుబికిన భావములు
హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై
రయజాతశ్రమ తోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో
జయముం బార్థున కిచ్చువేడ్క నని నాశస్త్రాహతిం జాల నొ
చ్చియుఁ బోరించు మహానుభావు మదిలోఁ జింతింతు నశ్రాంతమున్.
కర్మయోగి , త్యాగమూర్తి , వీర ప్రతాపుడు , సాధులను కాచే వీరులను నడిపే చిదానంద స్వరూపము, సాక్షాత్తు శ్రీమన్నారాయణుని పూర్ణ స్వరూపమైన శ్రీ కృష్ణ పరమాత్మ ధర్మ సంరక్షణకు చిందించిన చెమట బిందువులు భారతీయ హైందవ సనాతన ధర్మమును, సాధువులను రక్షించును గాక ! జగత్తులో సజ్జనుల శాంతి సుఖములను కాపాడును గాక ! మూర్ఖత్వముతో మతము మరియు కనపడని దేవుని పేరిటమారణహోమము చేయు, సాధువులకు , సామాన్యులకు అశాంతి కలిగించు హింసా ప్రవృత్తులైన దుర్జనులను శ్రీ హరి నామము శాశ్వతముగా హరించును గాక !
. . . . .
సరిపల్లి సూర్యనారాయణ,

2015-05-07

సాంబశివ మహదయా
దండమయా సాంబశివా
ఎవరు నీకు స్ఫూర్తి యయా
ఈ అబ్బుర దస్త్రములు
ఈభగవత్ వితరణములు
మానవాళి సంతరణములు
దండమయా దండమయా !
మీ మహోన్నత అంతర్జాల మాధ్యమపౌరాణిక వితరణలకి మా నమోవాకములు హృదయ పూర్వకాభినందనములు
కృష్ణం వందే జగద్గురుం
. . . .
ఉమామహేశ్ శనగవరపు

2015-05-07

శ్రీ సాంబశివం గారు
మీ ప్రయత్నము దైవ సంకల్పము - మా బోంట్లి వారికి ఆదర్శము
భాగవత గ్రంథాధ్యాయులకు ఆస్ట్రేలియా మెల్బోర్న్ నగర వాస్తవ్యుడొకడు నమో నమః
శ్రీ రామజయం
. . . .