పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వేగరి వ్యాఖ్యలు : 2020-2021

క్రీ.శ. 2020-21 సంవత్సరములలో ఈవేగరి ద్వారా తెలుగుభాగవతానికి వచ్చిన స్పందనలలో ఎంచినవి

తారీఖు స్పందనలు అతిథి
2021-11-15భాగవతము లోని ప్రతి స్కందం ని చక్కగా గాన యుక్తంగా టీకా తాత్పర్య సహితంగా వివరించి ఆన్లైన్లో పెట్టినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు . మీ కృషి అద్భుతం . మీ సాంకేతికత కృషి మాకు ఎంతో ఉపయోగపడింది. మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ. మీకు నమస్సులు. M. అలేఖ్య గారు.
2020-11-18. . . మీరు ప్రచురించిన పోతన భాగవతము నేను రోజూ కొంచెం కొంచెము చదువుకుంటాను. మాధుర్యము కదా, చప్పరించుకుంటూ చదివి తరువాత వీలుకుదిరనప్పుడు నెమరు వేసుకుంటాను. మీ ప్రచురణ, వివరణ, నేటికి తేలికయిన సామాజిక మాధ్యములో మీరు వుంచటం, మాలాంటి వారికి ఎంతో మానసిక వికాసాన్ని కలిగిస్తున్నాయి. మీకు వేల నమస్కారాలు. ... విద్యార్థి సుభాషు.
2020-11-09. . . మీ పోతన భాగవతము app చూసి నేను ముగ్ధుణ్ణయ్యాను.ఎంతో శ్రమపడి మీరు పూర్తి భాగవతాన్ని , పద్యాలు, వచనం, ఇంకా ప్రతి పదానికీ అర్ధం, భావం, మరియు పద్యాన్ని ఎలా చదవాలో వివరించే ఆడియో, అన్నింటినీ ఒకే app లో పొందుపరచిభాగవతప్రియులందరికీ , ఎక్కడ కూర్చొని అయినా చదువుకోవడానికి , మరియు వినడడానికీఅనువుగా , ఒకసారి download చేసుకున్న తర్వాత app offline లో కూడా పనిచేసే విధంగారూపొందించి, భాగవత సేవ , తద్వారా భగవత్సేవ చేస్తున్న మీకు శతకోటి నమస్కారాలు ... ముసునూరు పూర్ణచంద్రరావు .
2020-01-30పూజ్యులు శ్రీ. పోతనామాత్యులగారి భాగవతం అంతర్జాలంలో పెట్టినందుకు.... నిత్యం పటిస్తూ... ఎంతో ఆధ్యాత్మిక తృప్తి చెందుతున్నాను... "అంబ నవాంబుజోజ్వల కరాంబుజ..." పద్యం రోజుకు కనీసం పదిసార్లు ఐనా నెమరువేసుకుంటున్నాను. అందులో ఎంతో సంతృప్తి ఉంది... ఇప్పటి ఈ ఆధునిక జీవితంలో పడి సతమతమౌవుతున్న నాలాంటి వారికి .. ఈ మహత్కార్యం ఎంతో ఉపయోగపడుతోంది మఱియు ఆధ్యాత్మిక స్వాంతనం చెందుతున్నాము... పంతుల నరసింహ శర్మ, (సినీ నిర్మాత)