శ్రీరామ

up-arrow

ఇక్కడ చదువరులు చూసుకొనుటకు వీలుగా విడదీసి శీర్షికలుతో పెట్టాము. మొత్తం దస్త్రం కావలసినవారు శీర్షికలో తీసుకొనగలరు

: :తెలుగు భాగవత గ్రంథంలో వాడబడిన పద / పదబంధాలకు టిప్పణిల జాబితా: :


1} అంకపీఠము  - అంక (ఒడి, తొడ) అను పీఠము (ఆసనము, పీట) :-
[3-930-చ.]

2} అంకరహితేందువదనలు  - అంకరహిత (అంక కలంకముచేత) రహిత (విడువబడిన) (నిర్మలమైన) ఇందువదనలు (చంద్రుని వంటి ముఖములు కలవారు), అందమైన స్త్రీలు :-
[10.1-1086-క.]

3} అంకురార్పణ  - నవధాన్యములను మొలకెత్తించి సమర్పించుట ద్వారా చేసెడి వేదోక్త ప్రారంభ కర్మ, కార్యం ప్రారంభము :-
[6-95-వ.]

4} అంకుశము  - ఏనుగును నడపుట యందు, కుంభ స్థలమును పొడచుటకు వాడు చిన్న గునపము వంటి సాధనము :-
[1-344-మ., 3-645-క., 6-389-ఉత్సా.]

5} అంగజుడు  - అంగము (దేహము)నందు పుట్టువాడు, ఇంద్రియములదు పుట్టెడివాడు, మన్మథుడు :-
[5.1-28-ఉ., 9-269.1-తే., 10.1-1013-ఉ., 10.1-1488-మ.]

6} అంగన  - చక్కటి అంగ సౌష్టవము కల ఆమె, అందగత్తె, స్త్రీ :-
[3-734.1-తే., 3-1027-వ., 4-7.1-తే., 4-58.1-తే., 4-659-క., 4-849-వ., 10.1-789-ఉ., 10.1-1714-ఉ.]

7} అంగనామణి  - అంగనలలో మణి వంటి ఆమె, స్త్రీ. :-
[3-916-చ., 3-931-ఉ.]

8} అంగభవకేళి  - అంగభవ (మన్మథుని) కేళి (క్రీడ), సురతము :-
[10.1-1497-మ.]

9} అంగిరసులు  - అంగిరసగోత్రపువారు :-
[9-76-వ.]

10} అంచితదేవతాకులోత్తంసము  - అంచిత (చక్కగా) దేవతా (దేవతల) కుల (సమూహమునందు) ఉత్తంసము (శ్రేష్ఠమైనవాడు), బ్రహ్మ :-
[6-3-ఉ.]

11} అంచితభక్తఫలప్రదాయకుడు  - అంచిత (చక్కటి) భక్తులకు ఫల (సత్ఫలములను) ప్రదాయకుడు (చక్కగా ఇచ్చువాడు), విఘ్నేశ్వరుడు :-
[6-4-ఉ.]

12} అంచితమూర్తి  - పూజనీయమైన స్వరూపము కలవాడు, బ్రహ్మదేవుడు :-
[3-500-ఉ.]

13} అంచితాత్మ  - పూజింపదగిన ఆత్మ (వాడు), శివుడు :-
[4-685.1-తే.]

14} అంజనావతిఆది  - దిగ్గజముల భార్యలు, 1తూర్పు దిగ్గజము ఐరావతము భార్య అభ్రము 2ఆగ్నేయము దిగ్గజము పుండరీకము భార్య కపిల 3దక్షిణము దిగ్గజము వామనము భార్య పింగళ 4నైఋతి దిగ్గజము కుముదము భార్య అనుపమ 5పడమర దిగ్గజము అంజనము భార్య తామ్రపర్ణి 6వాయవ్యము దిగ్గజము పుష్పదంతము భార్య శుభ్రదంతి 7ఉత్తరము దిగ్గజము సార్వభౌమము భార్య అంగన 8ఈశాన్యము దిగ్గజము సుప్రతీకము భార్య అంజనావతి :-
[8-40.1-తే.]

15} అంజనీసుతుడు  - అంజనీదేవి యొక్క పుత్రుడు, ఆంజనేయుడు :-
[5.2-52-ఆ.]

16} అండకటాహము  - అండ (బ్రహ్మాండ) కటాహము (పైడిప్ప) :-
[5.2-75-వ.]

17} అండకుంభము  - బ్రహ్మాండములు కల కుండ, బ్రహ్మాండభాండము :-
[10.1-557.1-తే.]

18} అంతః+యామి  - అంతర్యామి, విసర్గ సంధి, పరమాత్మ :-
[10.2-1203-వ.]

19} అంతఃకరణచతుష్టయము  - 1మనస్సునకు సంకల్పము 2బుద్ధికి నిశ్చయము 3చిత్తమునకు చింతనము 4అహంకారమునకు అహంభావము :-
[3-891-వ., 10.1-119.1-ఆ.]

20} అంతఃకరణము  - మనసు లోపలి ఇంద్రియము, మనోబుద్ధి చిత్తాహంకారములకు మూలమైన ప్రధానము :-
[3-156-వ., 10.1-683-వ.]

21} అంతఃకరణములు  - అంతఃకరణచతుష్టయము, 1. మనస్సు, 2. బుద్ధి, 3. చిత్తము, 4. అహంకారము. :-
[1-130-వ.]

22} అంతఃకరణవాసి  - అంతఃకరణములో నివసించెడివాడు, విష్ణువు :-
[4-705-వ.]

23} అంతఃపురము  - రాణివాసపు స్త్రీలు నివసించు గృహము :-
[10.2-371-వ.]

24} అంతకపురికేగు  - అంతక (యముని) పురి (నగరమునకు) ఏగు (వెళ్ళు), మరణించు :-
[10.2-302-క.]

25} అంతకుడు  - 1. లయ కారణుడు, విష్ణువు, 2. అంతయతి అంత + ణ్వుల్. (కృ.ప్ర.) నశింపచేయువాఁడు. :-
[4-705-వ.]

26} అంతకుమూర్తి  - అంతకు (అంతము చేసెడి) మూర్తి (స్వరూపము), యముడు, హరుడు :-
[6-318.1-తే.]

27} అంతరంగసంగతుడు  - అంతరంగ (ఆత్మలలో) సంగతుడు (కూడి యుండువాడు), విష్ణువు :-
[6-438-చ.]

28} అంతరాత్మ  - లోపల నుండెడి ఆత్మ, విష్ణువు :-
[4-705-వ.]

29} అంతరాళము  - 1. ఎల్లదిక్కులకు నడిమి చోటు, 2. నడిమి భాగము :-
[4-135-వ.]

30} అంతరిక్షంబు  - అంతర్ + ఈక్షంబు రెండు వస్తువుల మధ్యన చూడబడునది, ఆకాశము, space :-
[2-16-వ.]

31} అంతర్థానము  - అదృశ్యము, లోపలి స్థానము, లోపల ధరించునది, లోపల అణగినది. :-
[2-252-వ.]

32} అంతర్యామి  - లోపలంతా వ్యాపించినవాడు, పరమాత్మ, జీవాత్మ :-
[1-61-వ., 2-248-వ., 7-448-వ., 10.2-1215-వ., 10.2-1220-వ., 10.2-1230-వ.]

33} అంతస్థములు  - య ర ల వలు, నడుమనున్నవి, హల్లులు 3 రకాలు. 1. స్పర్శాలు 'క నుండి మ' వరకు ఉన్నవి. 2. ఊష్మాలు 'శ, ష , స, హ' 3. అంతస్థాలు 'య, ర, ల, వ' ఈ అంతస్థాలకు హల్లులుగా ఉంటూ, అచ్చులకు ప్రత్యామ్నాయంగా కూడా వాడబడతాయి. అలా హల్లులకు అచ్చులకు నడిమివి కనుక కూడా అంతస్థాలు అంటారు. వీటి పలుకుబడిలో గాలి నిరోధం తక్కువగా ఉండి వరిపిడి లేకుండా గాలి మధ్యస్థంగా వదలబడుతుంది కనుక అంతస్థములు అంటారు. :-
[12-30-వ.]

34} అంతస్థ్సితగహ్వరి  - అంతః (అంతరంగములో) స్థిత (ఉన్నట్టి) గహ్వరి (గుహ లందుండు వాడు), విష్ణువు :-
[6-33-క.]

35} అంతాదిరహితుడు  - అంతాది (ఆద్యంతములు) రహితుడు (లేనివాడు), విష్ణువు :-
[8-177-క.]

36} అందలము  - పార్శ్వముల మఱుగులేని పల్లకి :-
[10.2-214-వ.]

37} అంధకారపరిపంథి  - చీకటికి శత్రువు, సూర్యుడు :-
[10.1-1615-వ.]

38} అంధకారవైరి  - చీకటికి శత్రువు, సూర్యుడు :-
[1-255-ఆ.]

39} అంధకారారాతి  - చీకటికి శత్రువు, సూర్యుడు :-
[10.1-1137.1-తే.]

40} అంధకూపము  - గ్రుడ్డిగొయ్యి, నరక విశేషము :-
[5.2-136-వ.]

41} అంధతమసము  - అంధ (గుడ్డి) తమసము (చీకటి) :-
[3-83.1-తే.]

42} అంధతామిశ్రము, అంధతామిస్రము   - గాఢాంధకారము, చిమ్మచీఁకటి. అంధ (గ్రుడ్డి) తామిస్రము (చీకటి), నరక విశేషము, తామిశ్రము నరకవిశేషము ఏమున్నదో తెలియని చీకటిమయమైనది. :-
[3-721.1-తే., 5.2-136-వ., 5.2-139-క.]

43} అంధము - అంధతరము అంధతమము :-
[1-446-క.]

44} అంబరీషుడు  - అథిధి సత్కారమున శ్రేష్ఠుడు, సాధు వర్తనమున దూర్వాసుని గెలిచినవాడు :-
[2-204.1-తే.]

45} అంబిక  - సిద్ధవనక్షేత్రమున అంబిక (సర్వ మాతృ రూపిణి) :-
[10.1-61-వ.]

46} అంబికాతనయుడు  - అంబిక (పార్వతీదేవి యొక్క) తనయుడు, విఘ్నేశ్వరుడు :-
[6-4-ఉ.]

47} అంబికాధీశుండు  - అంబిక (పార్వతీదేవి) యొక్క అధీశుడు (భర్త), పరమశివుడు :-
[5.2-111.1-తే.]

48} అంబికావరుడు  - అంబిక (పార్వతీదేవి) యొక్క వరుడు (భర్త), శివుడు :-
[10.2-445-వ., 10.2-1242.1-తే.]

49} అంబుజనాభుడు  - అంబుజము (పద్మము) నాభిన కలవాడు, పద్మనాభుడు, విష్ణువు :-
[3-683-చ., 4-366-వ., 10.2-626-క.]

50} అంబుజనేత్ర  - అంబుజము (పద్మములవంటి) నేత్ర (కన్నులుగలామె), స్త్రీ. :-
[5.1-36-క.]

51} అంబుజబంధువు  - పద్మముల బంధువు, సూర్యుడు :-
[1-248-క.]

52} అంబుజము  - అంబువు (నీటియందు) జము (పుట్టునది), పద్మము :-
[1-505-మ., 3-320.1-తే., 3-336-తే., 4-550-చ., 4-924-చ., 8-202.1-తే.]

53} అంబుజసంభవుడు  - అంబుజ (అంబువు (నీటి)లో పుట్టునది, పద్మము) నందు పుట్టినవాడు, బ్రహ్మదేవుడు :-
[10.1-507-శా.]

54} అంబుజాకరము  - అంబుజ (పద్మముల) ఆకరము (నివాసము), చెరువు, కొలను :-
[10.1-430.1-తే.]

55} అంబుజాక్షుడు  - అంబుజము (పద్మము) వంటి అక్షుడు (కన్నులుగలవాడు), పద్మాక్షుడు, విష్ణువు. :-
[6-441.1-తే., 10.1-572.1-తే., 10.1-1504.1-ఆ., 11-16-మత్త.]

56} అంబుజాతము  - అంబువు (నీరు)నందు జాతంబు (పుట్టునది), పద్మము :-
[3-116-మ., 3-507-వ., 7-342.1-తే.]

57} అంబుజాప్తుడు  - పద్మబాంధవుడు, సూర్యుడు :-
[10.2-1304-ఉ.]

58} అంబుజాసనుడు  - అంబుజము (పద్మము)న ఆసనుడు (ఆసీనుడగువాడు), బ్రహ్మ :-
[8-219-మ.]

59} అంబుజోదరుడు  - అంబుజము (పద్మము) ఉదరుడు (ఉదరమున గలవాడు), విష్ణువు :-
[1-305-క., 6-126-ఉ., 7-150.1-తే.]

60} అంబుదము  - అంబువు (నీరు) ద (ఇచ్చునది), మేఘము :-
[3-420-మ.]

61} అంబుధి  - అంబువు (నీటికి) నిధి, సముద్రము :-
[3-423.1-తే., 6-384-ఉ., 10.1-696-క.]

62} అంబుభృద్వాహుడు  - అంబుభృత్ (మేఘము) వాహుడు (వహించువాడు), ఇంద్రుడు :-
[8-369-శా.]

63} అంబురుహము  - అంబు (నీటిలో) రుహము (పుట్టినది), పద్మము :-
[3-98-చ., 3-799-మ., 10.1-1452-శా., 10.2-617-క.]

64} అంబోజాక్షి  - అంబుజము (పద్మము) వంటి అక్షి (కన్నులు గల స్త్రీ), పద్మాక్షి, స్త్రీ. :-
[10.1-307-క.]

65} అంభశ్చరము  - అంభః (నీటిలో) చరించెడిది, చేప :-
[8-699-వ.]

66} అంభశ్శయుడు  - అంభః (నీట) శయుడు (పరుండు వాడు), మత్స్యావతారుడు, విష్ణువు. :-
[8-729-మ.]

67} అంభోజగర్భుడు  - అంభోజము (పద్మము)నందు గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మ :-
[3-368-మ., 7-160.1-తే., 8-239-మ., 10.1-1236-దం., 10.1-1236-దం.]

68} అంభోజనాభుడు  - జగత్సృష్టికి కారణమైన బ్రహ్మ జనించిన కమలము నాభియందు కలవాడు, విష్ణుమూర్తి :-
[10.2-202.1-ఆ.]

69} అంభోజము  - నీటిలో పుట్టినది, పద్మము :-
[2-178-మ., 3-203-దం., 3-203-దం., 12-28-వ.]

70} అంభోజాకరము  - అంభోజము (పద్మము)ల ఆకరము (నివాసము), సరోవరము :-
[8-111-శా.]

71} అంభోజాతము - నీటిలో జాతము (పుట్టినది), పద్మము :-
[3-565.1-తే.]

72} అంభోజాసనుడు  - అంభోజ (పద్మము) ఆసనుడు (ఆసనముగగలవాడు), బ్రహ్మదేవుడు :-
[7-282-శా.]

73} అంభోధి  - అంభస్ (నీటికి) నిలిచి ఉండునది, సముద్రము :-
[6-195.1-తే., 6-439.1-ఆ.]

74} అంభోధిరాట్కన్యకాకాంత  - అంభోధి (సముద్రు)ని రాట్కన్య (రాకుమారి) యొక్క భర్త, విష్ణువు :-
[3-203-దం.]

75} అంభోనిధి  - అంభస్ (నీరు) కి నిధివంటిది, నీటికి ఉనికిపట్టు, సముద్రము :-
[3-333-క., 10.1-921-శా., 10.1-1236-దం., 10.2-17-మ., 10.2-396.1-తే.]

76} అంభోనిధిమేఖల  - సముద్రములు పరివేష్టించినది (మొలనూలుగా కలది), భూమండలము :-
[10.1-1312-మ.]

77} అంభోనిధిశాయి  - అంభోనిధి (సముద్రము)న శయనించువాడు, విష్ణువు :-
[3-588-ఉ.]

78} అంభోరుహనేత్రుడు  - అంభోరుహ (పద్మముల) వంటి నేత్రుడు (కన్నులుగలవాడు), విష్ణువు :-
[7-279-క.]

79} అంభోరుహము  - అంభః (నీరు) యందు రుహము (పెరుగునది), పద్మము :-
[3-931-ఉ., 4-140.1-తే., 6-142-ఉ.]

80} అంభోరుహవదన  - అంభోరుహ (పద్మము) వంటి వదనముకలామె, స్త్రీ :-
[11-67-క.]

81} అంశుమంతుడు  - కిరణములు కలవాడు, సూర్యుడు :-
[10.2-1001-క.]

82} అంసాంచితకర్ణకుండలాభరణుడు  - అంస (మూపులపై) అంచిత (అలంకరింప బడిన) కర్ణకుండలములు ఆభరణములుగా గలవాడు, విష్ణువు :-
[6-35-క.]

83} అకంపితశిరోభావాలు  - సమముగా నిలిపిన శిరస్సులు కలవి, రాసక్రీడా నాట్య పారిభాషిక పదం :-
[10.1-1084-వ.]

84} అకర్మణుడు  - కర్మములు అంచరించనివాడు, విష్ణువు :-
[4-703.1-తే.]

85} అకలంకగుణాభిరాముడు  - మచ్చలేని సుగుణములతో ఒప్పువాడు, కృష్ణుడు :-
[3-141-క.]

86} అకల్మషచిత్తుఁడు  - అకల్మష (నిర్మలమైన) మనసు కలవాడు, విష్ణువు :-
[3-212-చ.]

87} అకారాదిత్రివర్ణకలితంబు  - అకారము (సృష్టి) + ఉకారము (స్థితి) + పూర్ణానుస్వారము (లయము) కలిగిన ఓంకారము :-
[2-12-వ.]

88} అకుంచితశిరోభావాలు  - నిగుడించిన శిరస్సు కలవి, రాసక్రీడా నాట్య పారిభాషిక పదం :-
[10.1-1084-వ.]

89} అకుంఠిత  - కుంఠిత (మూఢురాలు) కాని యామె, వికాసము కలామె :-
[10.1-1735-వ.]

90} అకృష్టపచ్యాహారులు  - పండించకయే (కృషి చేయకుండా) పచ్య (వండిన) ఆహారములు తీసుకొనువారు :-
[3-388-వ.]

91} అక్షతలు  - క్షతము (బాధ) లేనివి, తడిపి పసుపు కలిపిన బియ్యపు గింజలు. :-
[10.1-260-వ., 10.1-1743-వ.]

92} అక్షయతూణీరము  - తరగని అమ్ములుగల అమ్ములపొది, సంకేతము అనంత వాసనా రూపమైన అహంకార ఉపాధి :-
[4-771.1-తే.]

93} అక్షరుడు  - క్షరము (నాశనము) లేనివాడు, శ్లో. క్షరస్సర్వాణిభూతాని కూటస్థోక్షర ఉచ్యతే (గీత), సర్వ భూతముల నాశము పిమ్మటను యుండువాడు అక్షరుడు, విష్ణువు :-
[3-364-చ., 3-833-క., 3-844-చ., 4-358.1-తే., 10.1-567.1-ఆ.]

94} అక్షహృదయము  - 1 అధికసంఖ్యలలో కల వస్తువులనైనను చూచినంతమాత్రముననే లెక్కింపకయే మొత్తము చెప్పగల శక్తి, 2 జూదమునందలి పాచికలనడకలోని రహస్యము తెలియు విద్య :-
[9-235-ఆ.]

95} అక్షీణము  - క్షీణము (తక్కువ) కానిది, పెద్దది :-
[10.1-704-క.]

96} అక్షీణుడు  - తక్కువకానివాడు, అధికుడు :-
[10.1-1341-శా.]

97} అక్షోహిణి, అక్షౌహిణి  - (1) 21,870 రథములు 21,870 ఏనుగులు 65,610గుఱ్ఱములు 109,350కాల్బలము కల సేనాసమూహము, (2) 10 అనీకిని కల సేన లేదా 270 వాహినులు కల సేన :-
[1-204-వ., 3-130-వ., 9-449-వ., 10.1-1530-క.]

98} అఖిల విశ్వోధ్భవ స్థితి విలయార్థధృత నిత్య విపుల మాయాగుణ విగ్రహుడవు - సమస్తమైన లోకములకు ఉద్భవ (సృష్టి) స్థితి లయముల అర్థ (ప్రయోజనములకు) ధృత (ధరింపబడిన) నిత్య (శాశ్వతమైన) విపుల (విస్తారమైన) మాయా (మాయతోకూడిన) గుణ (గుణములు) విగ్రహుడవు (రూపముకలవాడు), విష్ణువు :-
[4-918.1-తే.]

99} అఖిల  - సమస్తమైన చతుర్దశ భువనములను :-
[10.1-117-క.]

100} అఖిలకారణకారణుడు  - సమస్త కారణములకును కారణము యైనవాడు, విష్ణువు :-
[3-364-చ.]

101} అఖిలజగద్భర్త  - సమస్త జగత్తునకు భర్త (ప్రభువు), విష్ణువు :-
[4-373-ఆ.]

102} అఖిలజేత  - అఖిల (సమస్తమును) జేత (జయించువాడు), విష్ణువు :-
[3-897.1-తే.]

103} అఖిలదేవేశుడు  - ఎల్లదేవతలకు ఈశ్వరుడు, విష్ణువు :-
[7-381.1-తే.]

104} అఖిలదేవోత్తసుడు  - సమస్త దేవతలలోను ఉన్నతుడు, కృష్ణుడు :-
[1-215.1-తే.]

105} అఖిలధర్మదేహుడు  - సమస్త ధర్మముల స్వరూపమైనవాడు, విష్ణువు :-
[4-703.1-తే.]

106} అఖిలధర్ముడు  - సర్వ ధర్మములు తానైనవాడు, శివుడు :-
[4-697-వ.]

107} అఖిలధృతుడు  - సమస్తమును ధరించువాడు, భగవంతుడు :-
[2-272.1-ఆ.]

108} అఖిలపాపహరుడు  - సర్వ పాపములను హరించువాడు, శివుడు :-
[4-697-వ.]

109} అఖిలభావజ్ఞుడు  - సర్వుల తాత్పర్యములు తెలిసిన వాడు, విష్ణువు :-
[10.2-1032-ఆ.]

110} అఖిలమోది  - అఖిల (అందరను) మోది (సంతోషింప జేయువాడు), విష్ణువు :-
[6-333.1-ఆ.]

111} అఖిలలోకఖ్యాతవర్థిష్ణుడు  - సమస్త లోకస్థులచే కీర్తింపబడి అతిశయించు శీలము కలవాడు, విష్ణువు :-
[3-148-మ.]

112} అఖిలలోకేశుడు  - సర్వ జగత్తులకు ఈశుడు, విష్ణువు :-
[11-85-తే.]

113} అఖిలలోకేశ్వరుడు  - అఖిల (సమస్తమైన) లోక (లోకములకు) ఈశ్వరుడు, విష్ణువు :-
[8-18.1-ఆ.]

114} అఖిలలోకేశ్వరేశ్వరుడు  - సమస్తమైన లోకపాలకును ప్రభువు యైనవాడు, విష్ణువు :-
[3-437.1-తే.]

115} అఖిలలోకైకగురుడు  - సమస్తమైన లోకములకు ఒకేఒకడు యైన (అనితరమైన) పెద్ద, హరి :-
[4-163.1-తే.]

116} అఖిలలోకైకవంద్యమానుడు  - సమస్తమైన లోకములకును వందనము చేయతగ్గ వాడైన ఒకేఒక్కడు, విష్ణువు :-
[3-307.1-తే.]

117} అఖిలవిశ్వాత్మకుడు  - సమస్తమైన భువనములకు ఆత్మయైనవాడు, విష్ణువు :-
[3-362.1-తే.]

118} అఖిలవేది  - సమస్తము నెఱిగిన వాడు, విష్ణువు :-
[10.1-1187-ఉ.]

119} అఖిలాండపతి  - 1. సర్వులకు అండ (ఆశ్రయమ) ఐన పతి (ప్రభువు), 2. అఖిల (ఎల్ల) అండ (బ్రహ్మాండములకు) పతి (నాయకుడు), విష్ణువు :-
[10.2-440-తే.]

120} అఖిలాధారుడు  - అఖిలమున (సమస్తమున)కు ఆధారమైనవాడు, విష్ణువు :-
[7-478-మ.]

121} అఖిలాధ్వరాదివిభుడు  - అఖిల (సమస్తమైన) అధ్వర (యజ్ఞము)లకు ఆది (మొదలి, ప్రధాన) విభుడు (ప్రభువు), విష్ణువు :-
[4-509.1-తే.]

122} అఖిలేశ్వరుడు  - సమస్తమునకు ఈశుడు, సర్వేశ్వరుడు, విష్ణువు, అఖిల పంచకృత్యము లన్నిటిని (1సృష్టి 2స్థితి 3లయ 4తిరోధాన 5అనుగ్రహ) చేయుటకు ఈశ్వరుడు (కర్త) :-
[4-572.1-తే., 10.1-389-క., 10.1-406-క.]

123} అగజాధీశుడు  - అగజ (పర్వతునికూతురైన పార్వతి) యొక్క అధీశుడు (భర్త), శివుడు. :-
[7-395-క.]

124} అగణ్యుడు  - 1. గణించుటకు రానివాడు, విష్ణువు. 2. ఇట్టివాడని ఎంచుటకు వాక్కుచేత కాని మనస్సుచేత కాని శక్యము కానివాడు, భగవంతుడు, విష్ణువు, 3. ప్రత్యక్షాది అష్ట ప్రమాణములచేతను ప్రమాణింప (గణింప) శక్యము కానివాడు, విష్ణువు. :-
[3-590-ఉ., 4-917-చ., 10.1-554-క., 10.1-1644-క.]

125} అగమ్యములు  - దారి చిక్కనివి, అర్థము చేసికొనుటకు లొంగనివి, బోధపడరానివి, వేదములు :-
[2-194-చ.]

126} అగస్త్యుడు  - 1. సప్తర్షులలో ఒకడు, 2. మనస్సునకు సంకేతము, 3. కుంభసంభవుఁడు, 4. వ్యు. అగంస్త్యాయతే ఇతి అగ + స్త్య క. (కృ.ప్ర.) వింధ్య పర్వతమును స్తంభింపచేసినవాఁడు. :-
[4-830.1-తే.]

127} అగుణుడు  - గుణములు లేనివాడు, త్రిగుణాతీతుడు, విష్ణువు :-
[4-358.1-తే.]

128} అగ్నిజిహ్వుడు  - అగ్నియే నాలుకగా కలవాడు, భగవంతుడు :-
[3-451.1-తే.]

129} అగ్నిజొచ్చుట  - భర్త దేహము తోపాటు అగ్నిలో ప్రవేశించుట, సహగమనము :-
[5.1-124-ఆ.]

130} అగ్నియొక్కసప్తజిహ్వలు  - 1కాళి 2కరాళి 3విస్ఫులింగిని 4ధూమ్రవర్ణ 5విశ్వరుచి 6లోహిత 7మనోజవ :-
[7-285-వ.]

131} అగ్నిష్టోమము  - 1. వసంత కాలమున ఐదు దినములలో చేయు యాగవిశేషము, 2. అగ్ని+స్తు+మన్, అగ్నీనాం స్తోమః, అగ్నిని స్తుతించుట. ఒక యాగ విశేషము, జ్యోతిష్టోమమనబడు యాగమునకు వికృతియైన యాగము 3. ఈ యాగము చేసినవానికి సోమయాజియని పేరు. :-
[3-388-వ., 3-426-వ.]

132} అగ్నిష్వాత్తులు  - పంచచత్వారింశత అగ్నులలో ఒకరు, వ్యు. అగ్ని + సు + ఆ + దా + క్త షత్వము. (కృ.ప్ర.) శ్రాద్ధాన్నాదికమును లెస్సగా పొందు అగ్నులు? :-
[4-34-వ.]

133} అగ్నిహోత్రము  - 1. హోమగుండము లోని అగ్నియందు వేల్చుట ద్వారా చేయు యాగము, 2. అగ్ని+హు+త్ర, అగ్నయే హూయతే అత్ర, మంత్రములతో ఆధానము చేయబడిన అగ్నిలో ఆహుతులిచ్చుట. అగ్నిహోత్ర సంబంధమైనది; అగ్ని; ఘృతము. :-
[3-451.1-తే.]

134} అగ్నిహోత్రాదిపంచకము  - 1 అగ్నిహోత్రము 2 హవిస్సు 3 వేదిక 4నేయి 5 హోమము చేయువాడు :-
[4-197-మ.]

135} అగ్నీధ్రశాల  - అగ్నిని ధరించు ఋత్విక్కు యొక్క శాల :-
[4-118-వ.]

136} అగ్రజాతుడు  - ముందు పుట్టినవాడు, అగ్ర (ముందుగా) జాతుడు (పుట్టినవాడు), అన్న :-
[10.1-466-క.]

137} అగ్రజుడు  - ముందు పుట్టినవాడు, అగ్ర (ముందుగా) జుడు (పుట్టినవాడు), అన్న :-
[3-42-చ., 4-820-క., 5.1-73-వ., 8-681-వ., 10.1-1687-చ., 10.2-591-క.]

138} అఘనాశకుడు  - పాపమును నాశనము చేయువాడు, విష్ణువు :-
[4-550-చ.]

139} అఘమర్షణము  - అఘము (పాపము)లను మర్షణము (క్షాళనము చేసెడిది) :-
[6-212-వ.]

140} అఘారి  - అఘము (పాపము)లను హరించువాడు, విష్ణువు :-
[3-335-ఉ., 10.1-1175-శా., 10.2-139-చ.]

141} అఘాసురుడు  - కొండచిలువ రాక్షసుడు :-
[10.1-487-వ.]

142} అచిర  - ఎక్కువ కానిది, కొద్ది, చిరకాలము కానిది. కొద్ది సమయముండునది. :-
[3-565.1-తే.]

143} అచ్యుతలోకము  - అచ్యుతుని (వైకుంఠుని) లోకము, వైకుంఠము :-
[4-665-క.]

144} అచ్యుతుడు  - చ్యుతము లేనివాడు, పతనము, నాశము లేనివాడు, స్థిరుడు, విష్ణువు, కృష్ణుడు :-
[1-185-మ., 1-269.1-ఆ., 1-380-మ., 2-68.1-తే., 2-89-వ., 2-92-క., 2-98-క., 2-101-చ., 2-209-చ., 2-214-మ., 2-236-మ., 3-71.1-తే., 3-145.1-తే., 3-201.1-తే., 3-215-వ., 3-215-వ., 3-300-చ., 3-373-మ., 3-552-చ., 3-844-చ., 4-150.1-తే., 4-175-చ., 4-233.1-తే., 4-370.1-తే., 4-385.1-తే., 4-901-క., 4-917-చ., 4-963.1-తే., 5.1-119.1-తే., 5.2-74.1-తే., 6-1-శా., 6-197.1-తే., 6-220-క., 7-160.1-తే., 7-243-క., 8-123-మ., 8-177-క., 8-483.1-తే., 9-82.1-తే., 10.1-236-వ., 10.1-928-వ., 10.1-1136-వ., 10.2-81-ఉ., 10.2-1187-తే., 10.2-1219-మ., 10.2-1313-వ., 11-30-వ., 11-66-చ.]

145} అజగరము  - మేకను మింగునది. కొండచిలువ :-
[11-99-వ.]

146} అజగవ  - అజ (మేకపోతు) గవ (గోవు, ఎద్దు)ల కొమ్ములు కలది :-
[4-462-చ.]

147} అజనాభము  - ఒక రాష్ట్రము పేరు, అజము (మేషము) నాభము (ప్రముఖమైనవి), రాశిచక్రము :-
[5.1-60-వ., 5.1-93-వ.]

148} అజము  - మేకపోతు, అజము కొన్ని పనసలు గల వేదభాగము, అనువాకము :-
[9-568.1-తే.]

149} అజాండభాండము  - అజాండ (బ్రహ్మాండముల) భాండము (పెద్ద కుండ), బ్రహ్మాండభాండము :-
[6-384-ఉ.]

150} అజాండము  - అజుని (బ్రహ్మ) అండము, బ్రహ్మాండము :-
[8-209-క.]

151} అజాతశత్రువు  - శత్రువులు లేనివాడు, ధర్మరాజు :-
[10.2-804-వ.]

152} అజాదిదుర్లభుడు  - అజ (బ్రహ్మదేవుడు) ఆది (మున్నగువారికిని) దుర్లభుడు (అందనివాడు), విష్ణువు :-
[7-478-మ.]

153} అజితుడు  - జయింపబడుటకు రానివాడు, విష్ణువు :-
[3-844-చ., 4-917-చ., 4-963.1-తే.]

154} అజితుసదనము  - అజితు (జయింపరాని వాడు, విష్ణువు) యొక్క సదనము (నివాసము), వైకుంఠము :-
[8-152-క.]

155} అజినము  - లేడి మొదలైన వాని చర్మములు కట్టుకొనుటకు, ఆసనముగాను పనికి వచ్చునవి :-
[3-136-క.]

156} అజుడు  - పుట్టుక లేని వాడు, భౌతిక జన్మము లేనివాడు, బ్రహ్మదేవుడు, విష్ణువు, శివుడు, భగవంతుడు :-
[1-34.1-ఆ., 1-196-క., 2-110-మ., 2-239-క., 2-277.1-తే., 3-99.1-తే., 3-200-క., 3-212-చ., 3-293.1-తే., 3-338-క., 3-371-ఉ., 3-388-వ., 3-506-చ., 3-722-వ., 3-738-వ., 3-861-క., 4-8-క., 4-18.1-తే., 4-53.1-తే., 4-126-తే., 4-359.1-తే., 4-445.1-తే., 5.1-119.1-తే., 6-198-క., 8-147-క., 8-177-క., 8-714-మ., 10.1-559-క., 10.1-975-వ., 10.2-1147-ఉ., 12-22-వ., 12-30-వ.]

157} అజేయుడు  - జయింపరానివాడు, విష్ణువు :-
[4-298-చ.]

158} అటే  - అట (స్త్రీల నుద్దేశించి చెప్పుట), దేశ్యము :-
[10.1-1252.1-తే.]

159} అణిమాది  - అష్టైశ్వర్యములు, అష్టసిద్ధులు, అష్టవిభూతులు అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము అను ఎనిమిది (8). 1 అణిమ అణువుగ సూక్ష్మత్వము నందుట, 2 మహిమ పెద్దగ అగుట, 3 గరిమ బరువెక్కుట, 4 లఘిమ తేలికగనౌట, 5 ప్రాప్తి కోరినది ప్రాప్తించుట, 6 ప్రాకామ్యము కోరిక తీర్చుట, 7 ఈశత్వము ప్రభావము చూపగలుగుట, 8 వశిత్వము వశీకరణము చేయగలుగుట :-
[2-30-వ., 2-222-వ., 3-798-మ., 4-502-వ., 9-431.1-తే., 10.1-537-వ., 11-105-వ.]

160} అణుమాత్రము  - అణువు అంత, బహు కొంచము :-
[4-395-వ.]

161} అణువు  - శ్లో. జాలసూర్యమరీచిస్థం యచ్ఛసూక్ష్మ తమంరజః, తస్య షష్టాష్టమో భాగస్త్వణురిత్యభి ధీయతే. తస్యమష్టాష్టమోభాగః పరమాణుః ప్రకీర్తితః. తా. కిటికీ కన్నం లోనుండి వచ్చెడి సూర్యకిరణంలోని చిన్న దుమ్ము కణంలో ఆరవైలోఎనిమిదవ (షష్ట అరవై కనుక 60x8, 480వ వంతు) పాలు అణువు. ఆ అణువులో ఆరవైఎనిమిదవ పాలు (60x8, 480వ వంతు)పరమాణువు. :-
[10.2-1220-వ.]

162} అతనుడు  - 1. ముక్కంటి చూపుకి భస్మమగుటచే తనువు లేని వాడు, మన్మథుడు, 2. మాయచేత మానుషదేహము ధరించిన ఆ కృష్ణుడు :-
[10.1-8-ఆ., 10.2-327.1-తే.]

163} అతి - అత్యంతరము అత్యంతము :-
[3-232.1-తే.]

164} అతిపూర్ణకాముడు  - పూర్తిగా తీరిన కోరికలు గలవాడు, విష్ణువు :-
[6-327.1-తే.]

165} అతివిఖ్యాతసురార్చితపదాబ్జుడు  - అతి (మిక్కిలి) విఖ్యాత (ప్రసిద్దిచెందిన) సురా (దేవతలచే) అర్చిత (పూజింపబడెడి) పద (పాదములు యనెడి) అబ్జుడు (పద్మములు కలవాడు), కృష్ణుడు :-
[5.2-166-క.]

166} అతిశాంతిమానసుడు  - మిక్కిలి శాంతి స్వభావము గలవాడు,విష్ణువు :-
[4-918.1-తే.]

167} అతులగుణసాంద్రుడు  - అతుల (మిక్కిలి) గుణ (సుగుణముల) సాంద్రుడు (చిక్కదనము కలవాడు), మహాసుగుణశాలి :-
[4-635.1-తే.]

168} అతులదివ్యమూర్తి  - అతుల (సాటిలేని) దివ్యమైన మూర్తి (స్వరూప మైనవాడు), విష్ణువు :-
[4-373-ఆ.]

169} అత్త  - తండ్రి సోదరి (మేనత్త), తల్లి యొక్క సోదరుని భార్య, భార్య / భర్త యొక్క తల్లి. :-
[10.2-106-క.]

170} అదితి  - దేవతల తల్లి, కశ్యపుని భార్య :-
[10.2-150-వ.]

171} అదితిసంతానము  - ఆదిత్యులు దేవతలు :-
[2-150.1-తే.]

172} అద్భుతచరిత్రుడు  - అద్భుతమైన నడవడిక కలవాడు, కృష్ణుడు :-
[10.2-697.1-తే.]

173} అద్రితనయ  - అద్రి (పర్వతరాజు యొక్క) తనయ (పుత్రిక), పార్వతి :-
[6-504-వ.]

174} అద్రినందన  - అద్రి (హిమవంతుడు అను పర్వత రాజు) నందన (కూతురు), పార్వతి :-
[10.2-317-ఉ.]

175} అద్వయుడు  - శ్రు. ఏకమేవాద్వితీయంబ్రహ్మ, ఒక్కడై ఉండి తను తప్పించి రెండవ వస్తువు (స్వేతరము) లేనివాడు పరబ్రహ్మ అనబడును, విష్ణువు :-
[10.1-567.1-ఆ.]

176} అద్వితీయము  - ద్వితీయము (సాటి కాగల రెండవది) లేనిది :-
[2-250.1-ఆ.]

177} అద్వితీయుడు  - సాటిరాగల రెండవవాడులేనివాడు, అంతాతానైనవాడు, విష్ణువు :-
[2-110-మ., 3-272.1-తే., 4-358.1-తే.]

178} అద్వైతత్రయము  - భావాధ్వైతము, ద్రవ్యాద్వైతము, క్రియాద్వైతములు :-
[7-469-వ.]

179} అధరసుధాపానము  - పెదవినుండి స్రవించెడి అమృతములు గ్రహించుట, చుంబనములు, సంగీతాస్వాదన, ఉపదేశములు ఆస్వాదించుట :-
[10.1-1004-మ.]

180} అధరామృతములు  - పెదవినుండి స్రవించెడి అమృతములు, చుంబనములు, గానములు, ఉపదేశములు :-
[10.1-1355.1-తే.]

181} అధర్వుడు  - అథర్వణవేదమున నధికారి, బ్రాహ్మణుఁడు :-
[4-26-వ.]

182} అధికము - అధికతరము అధికతమము :-
[4-624-వ., 8-491-ఆ.]

183} అధిదేవతలు  - అధికారము కల దేవతలు, ఇంద్రియాదుల అధిష్టాన దేవతలు :-
[3-57-వ.]

184} అధీశుడు  - సర్వజగత్తులకు అధి (పై) ఈశుడు (ప్రభువు), విష్ణువు. :-
[7-332-క.]

185} అధీశ్వరుడు  - సర్వోన్నత ఈశ్వరుడు, విష్ణువు, పంచకర్తలైన బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివుల సృష్టి స్థితి లయములను నియమించువాడు, పరమాత్మ :-
[10.2-67-వ., 10.2-110-మ.]

186} అధోక్షజుడు  - ఇంద్రియ జ్ఞానములతో తెలియరాని వాడు, అధః+అక్షజ+వాడు వ్యు. (అక్షజం ఇంద్రియ జ్ఢానము, అధి అధరం, అధి అక్షజ అస్య అధోక్షజ (బహువ్రీహి సమాసము), వేనిని తెలియుటకు ఇంద్రియ జ్ఞానము అసమర్థమైనదో అతడు, విష్ణువు, (ఆంధ్రశబ్దరత్నాకరము) :-
[2-89-వ., 3-213-వ., 3-373-మ., 3-697-వ., 4-366-వ., 4-510-వ., 7-217-వ.]

187} అధ్యాత్మికము  - తాపత్రయము మూడు విధాల తాపములు (తపింపజేసేవి). ప్రారబ్ధం వీటికి కారణమై ఉంటుంది. ఆధ్యాత్మికం ఆత్మకు సంబంధించినవి. శరీరకంగా, మానసికంగా అనుభవించేవి. శోకం, కోరిక, ఆకలి, నిద్ర మొదలైనవి. ఆధిభౌతికం పంచభూతాల నుండి, మిగిలిన ప్రాణుల నుండీ కలిగే బాధలు. జబ్బులు, ప్రమాదాలు. ఆధిదైవికం ప్రకృతివల్ల కలిగే విపరీతాలు. వరదలు, భూకంపాలు, కరువుకాటకాలు, జరా మరణాలు మొదలైనవి. :-
[3-209-క., 3-725-వ.]

188} అధ్వర్వుడు  - అధ్వర్వుడు, ఉద్గాత, బ్రహ్మ, హోత. అను నాలుగు విధముల ఋత్విజులు యందు ఒకడు (ఆంధ్రవాచస్పతం), యజ్ఞమునందు అధర్వణవేదతంత్రము నడపు ఋత్విక్కు (ఆంధ్రశబ్దరత్నాకరం) :-
[4-162-వ., 9-10.1-తే.]

189} అనంగబ్రహ్మ  - అనంగ (దేహములేని) బ్రహ్మ (దేవుడు), మన్మథుడు :-
[6-95-వ.]

190} అనంగుడు  - దేహము లేనివాడు, మన్మథుడు :-
[5.1-28-ఉ.]

191} అనంతము  - దేశ కాల వస్తువులచేత భాగింపరానిది :-
[10.1-537-వ.]

192} అనంతమూర్తి  - అనంతమైన స్వరూపము కలవాడు, విష్ణువు :-
[3-212-చ.]

193} అనంతశక్తి  - అనంతమైన శక్తి కలవాడు, విష్ణువు, 1సర్వజ్ఞత్వ 2సర్వేశ్వరత్వ 3సర్వభోక్తృత్వ 4సర్వపాలకత్వాది సామర్థ్యములు కలిగ ఉండుట, సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వ సర్వభోక్తృత్వ సర్వ నియంతృత్వ సర్వనియామక సర్వాంతర్యామిత్వ సర్వసృష్టత్వ సర్వపాలక సర్వసంహారకాది మేరలేని సమర్థత కలవాడు, విష్ణువు :-
[3-19-చ., 3-506-చ., 10.1-681-వ., 10.2-202.1-ఆ.]

194} అనంతామేయశక్తియుక్తుండు  - అనంతమైన అమేయమైన (పరిమితిలేని) శక్తులు యుక్తి (సమర్థతలు) కలవాడు, విష్ణువు :-
[4-366-వ.]

195} అనంతుడు  - అంతము లేనివాడు, దేశ కాల వస్తు విభాగము లేనివాడు, నాశరహితమైన భగవంతుడు, కాల ప్రదేశ భావముల పరిమితులకు మీరిన వాడు, విష్ణువు :-
[2-98-క., 2-103-క., 2-109-చ., 2-192-మ., 2-209-చ., 2-211-ఉ., 2-236-మ., 2-262-క., 2-277.1-తే., 3-19-చ., 3-99.1-తే., 3-124-చ., 3-212-చ., 3-236-చ., 3-293.1-తే., 3-315-మ., 3-362.1-తే., 3-364-చ., 3-506-చ., 3-510-చ., 3-523-చ., 3-532-మ., 3-588-ఉ., 3-629-చ., 3-836-చ., 3-844-చ., 3-861-క., 3-1024-క., 5.2-128-వ., 6-172-చ., 7-3.1-ఆ., 7-217-వ., 7-353-క., 9-205.1-తే., 9-420-క., 10.1-565-క., 10.1-622-ఉ., 10.1-682.1-తే., 10.1-935-వ., 10.1-941-క., 10.1-1773-క., 10.2-88.1-తే., 10.2-219-చ., 10.2-432-చ., 10.2-959-వ., 10.2-1031-వ., 11-30-వ., 11-66-చ.]

196} అనఘచరితుడు  - పాపములుకాని వర్తనములు కలవాడు, విష్ణువు :-
[3-304.1-తే.]

197} అనఘచరిత్రుడు - పుణ్య వర్తనుడు, కృష్ణుడు :-
[10.2-698-తే.]

198} అనఘచరిత్రుడు  - పుణ్యవంతమైన నడవడి కలవాడు, భృగువు :-
[10.2-1277-క.]

199} అనఘాత్ముడు  - అనఘ (పాపములేని) ఆత్ముడు (ఆత్మ గలవాడు), పుణ్యాత్ముడు :-
[3-186-క., 3-303-క., 3-304.1-తే., 5.2-3-క., 10.1-854-క.]

200} అనఘుడు  - పుణ్యుడు, పాపరహితుడు, పాపములు లేనివాడు, విష్ణువు :-
[2-110-మ., 3-582-క., 3-671-మ., 3-755-మ., 3-833-క., 3-861-క., 3-1024-క., 10.1-1653.1-ఆ., 10.2-102-క.]

201} అనన్యదత్తము  - ఇతరులు ఎవ్వరికిని ఇవ్వబడనిది, అన్యదత్తము (ఇతరులకిచ్చినది) కానిది :-
[3-786.1-తే.]

202} అనన్యపురుషసంచారము  - అనన్య(అనితరమైన) పురుష (వారి) సంచారము (సంచారము గలది), మానవ సంచారం లేనిది. :-
[8-43-వ.]

203} అనన్యప్రేరితుడు  - అన్య (ఇతరులు) అన్య (కానివానిచే) ప్రేరితుడు (ప్రేరేపింపబడువాడు), స్వతంత్రుడు :-
[8-11-వ.]

204} అనలాక్షుడు  - అగ్ని నేత్రము కలవాడు, శివుడు :-
[10.2-407-మ., 10.2-1275-క.]

205} అనవద్యచరిత్రుడు  - మచ్చలేని నడవడిక గలవాడు, విష్ణువు :-
[4-917-చ.]

206} అనవద్యుడు  - నిందనీయుడు కానివాడు, వ్యు. న+అ+వద్+యత్, న అవద్యః నిందనీయః, ప్రశంసింపదగినవాడు, విష్ణువు :-
[4-923-ఉ.]

207} అనాదినిధనుడు  - పుట్టుక చావు లేనివాడు, వ్యు. న విద్యతే ఆదినిధనే యస్య. (న.బ.వ్రీ.) మొదలు తుదలేనివాఁడు పుట్టుకలు చావును లేనివాఁడు. :-
[2-277.1-తే.]

208} అనాదిపురుషుడు  - అనాది (అత్యంత ఆది) నుండి ఉన్న పురుషుడు, విష్ణువు :-
[3-362.1-తే.]

209} అనాదిభగవంతుడు  - అనాది (మొట్టమొదటినుండి) ఉన్న భగవంతుడు (మహిమాన్వితుడు), విష్ణువు :-
[3-506-చ.]

210} అనాధారుడు  - వేరు ఆధారము అవసరములేని వాడు, విష్ణువు :-
[5.2-55-వ.]

211} అనారతడు  - అనారతము (అనవరతము) యుండెడివాడు, విష్ణువు :-
[6-172-చ.]

212} అనారబ్ధములు  - ఇంకనూ ప్రారంభింపబడనివి (ప్రభావము చూపనివి) ఐన పూర్వకర్మఫలములు :-
[1-58-వ.]

213} అనాశ్రయుడు  - ఆశ్రయమే అక్కరలేనివాడు, విష్ణువు :-
[3-145.1-తే.]

214} అనాహత చక్రము - కుంజలినీ షట్చక్రములలోని అనాహత చక్రము హృదయస్థానమందుఉండునది :-
[2-29.1-ఆ.]

215} అనాహతము  - కుండలినీ షడ్చక్రములలో హృదయస్థానము నందలి చక్రము :-
[10.2-1214.1-తే.]

216} అనికేతనుడు  - సంసారము విడిచి నికేతనములు (నివాసములను) విడిచినవాడు, సన్యాసి :-
[4-214-క.]

217} అనిమిషనది  - అనిమిష(దేవతా) నది, గంగ :-
[9-217-క.]

218} అనిమిషనాథనందనుడు  - అనిమిషనాథుడు (దేవతలప్రభువు, ఇంద్రుని) నందనుడు, అర్జునుడు :-
[10.2-1318-చ.]

219} అనిమిషపతి  - అనిమిష (దేవతల)కి పతి, ఇంద్రుడు :-
[4-513-క., 4-539-క.]

220} అనిమిషపతివైరి  - అనిమిషపతి (ఇంద్రుని) వైరి, రావణుడు :-
[9-296-క.]

221} అనిమిషమునియోగిజనావనదక్షుడు  - అనిమిష (దేవతలు) మునులు యోగులు ఐన జనములను అవన (రక్షించుట) యందు దక్షుడు (సమర్థుడు), విష్ణువు :-
[3-705-క.]

222} అనిమిషులు  - నిమిష (కనురెప్పపాటులు) లేనివారు, దేవతలు, మత్యములు :-
[2-142.1-తే., 4-436.1-తే., 6-176-క., 10.1-53-క.]

223} అనిరుద్దుడు  - 1. అడ్డుకొనరానివాడు, 2. విష్ణుమూర్తి చతుర్వ్యూహములలోని అనిరుద్ధుడు (చిత్తమునకు సంకేతము), 3. ప్రద్యుమ్నుని కొడుకు, శ్రీకృష్ణుని పౌత్రుడు. :-
[4-703.1-తే., 10.2-446-క., 11-77-వ.]

224} అనిర్దేశ్యుడు  - ఇట్టివాడు యని నిర్దేశింప (నిశ్చయించి చెప్ప) అలవిగాని వాడు, విష్ణువు :-
[7-217-వ.]

225} అనిలజుడు  - అనిల (వాయు) జుడు (పుత్రుడు), భీముడు :-
[10.2-743-క.]

226} అనిలపుత్రుడు  - వాయుదేవుని కొడుకు, భీముడు :-
[1-388.1-తే.]

227} అనిలము  - నిలబడి ఉండనిది, గాలి :-
[2-277.1-తే.]

228} అనిలసుతుడు  - వాయుపుత్రుడు, హనుమ :-
[9-277-క.]

229} అనీశుడు  - తనకు ఏ ప్రభువు లేని వాడు, సర్వనియామకుడు కనుక మరొకరిచే నియమించుట లేనివాడు :-
[2-109-చ., 10.1-901-క.]

230} అనుజులు - వ్యు. అనుజ అను (పశ్చాత్) జాయతే, తన పిమ్మట పుట్టినది. చెల్లెలు :-
[4-61-క.]

231} అనుపమ  - ఉపమానమునకు అందనిది, గొప్ప :-
[4-81-చ.]

232} అనుమతి  - పూర్ణిమా భేదము, ఒక కళ తక్కువైన చంద్రుడుగల పౌర్ణమి, అంగీకారము తెలుపు :-
[4-25-క., 5.2-62-వ., 6-507-వ.]

233} అనువాదము  - మరలమరలపలుకుట, కీర్తించుట. :-
[5.1-162.1-తే.]

234} అనుసంధ్యలు  - 1.పొద్దుపొడుచుటకు ముందు మూడుగడియల కాలము (ఉదయ సంధ్య) 2.పొద్దుకుంగిన తరువాత మూడు గడియల కాలము (సాయం సంధ్య) :-
[6-307-వ.]

235} అనేకజన్మములు  - పునరపి జననం పునరపి మరణం పునరపి జననీజఠరే శయనం (ఆచార్యోక్తి) అను విధముగ అసంఖ్యాక జన్మలెత్తుట :-
[10.1-1656-ఉ.]

236} అనేకుడు  - శ్రు. ఏకోదేవా బహుధానివిష్టః, ఒక్కడుగాను అనేకులుగాను ఉన్నవాడు దేవుడు :-
[10.1-683-వ.]

237} అన్తకుడు  - లయకారకుడు, విష్ణువు :-
[4-702.1-తే.]

238} అన్ను  - పరవశింప చేయునామె, స్త్రీ :-
[10.1-802-క.]

239} అన్యాపదేశము  - అన్య వస్తు నెపనముగ చెప్పబడునది :-
[10.1-1457-వ.]

240} అన్యోన్యత  - వానిలో అవి అనుకూలించుట, సహాయపడుట :-
[3-205-వ.]

241} అపక్రాంతవ్యోమాచారి  - కాలు పైకి ముందరికి చాచి మరల యథాస్థానమునందు అడుగులుంచుట, రాసక్రీడ యందలి పారిభాషికపదము :-
[10.1-1084-వ.]

242} అపగాత్మజాత  - అపగా (నది) ఆత్మజాత (పుత్రుడు), భీష్ముడు :-
[3-28-క.]

243} అపణము  - అమ్మకూడనిది, అన్నము :-
[4-768-వ.]

244} అపరము  - పరముకానిది, ఇహము, ఈలోకము :-
[3-300-చ.]

245} అపరాజితాంగహారము  - ఉత్సాహవర్ధక సూచకమును, రాసక్రీడ యందలి పారిభాషికపదము :-
[10.1-1084-వ.]

246} అపరిచ్ఛిన్నము  - దేశ కాల వస్తువుల చేత విభాగింపబడనిది :-
[10.1-681-వ.]

247} అపర్యావర్తనము  - అవిచ్ఛిన్నంగా అదే పనినే చేయిస్తూ ఉండడము, నరక విశేషము :-
[5.2-136-వ.]

248} అపవర్గప్రాప్తి  - పరలోకము లభించుట, మోక్షము :-
[10.2-1031-వ.]

249} అపాదములు  - పాదములు లేనివి, పాములు మొదలగునవి :-
[4-853-వ., 11-91-వ.]

250} అపూర్వము  - 1. పూర్వము లేనిది, 2. అద్భుతము, 3. పూర్వమిమాంసా శాస్త్రమున సత్కర్మఫలము అని సంకేతార్థము కలదు :-
[2-213-చ.]

251} అప్పతి  - అప్పు (నీరు) నకు పతి (ప్రభువు), వరుణుడు :-
[6-170-త.]

252} అప్రమేయుడు  - ప్రమేయము (నిరూపణ) కు అతీతమైన వాడు, మేరలకు కొలతలకు అతీతమైనవాడు, అష్టప్రమాణములను మీరినవాడు, విష్ణువు :-
[3-364-చ., 6-333.1-ఆ., 10.2-477-ఆ., 10.2-749-ఆ., 10.2-959-వ.]

253} అప్సరసలు  - దేవవేశ్యలు, 1రంభ 2ఊర్వశి 3తిలోత్తమ 4మేనక ఆది దేవనర్తకిలు :-
[2-274.1-తే., 4-909-వ.]

254} అబల  - బలము లేనామె, స్త్రీ :-
[4-655.1-తే., 4-794.1-తే., 4-845-క., 9-62.1-తే., 9-575-మ., 10.1-184-ఆ., 10.1-1277-వ., 10.2-117-మ., 10.2-181.1-ఆ.]

255} అబుద్ధి  - బుద్ధికి తెలియకుండగ, అప్రయత్నముగ :-
[3-344-వ.]

256} అబ్జగర్భుడు  - అబ్జము (పద్మము) నుండి గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మ :-
[3-30-ఉ.]

257} అబ్జజుడు  - అబ్జము (పద్మము) అందు జుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[2-255-క., 3-378.1-తే., 3-716.1-తే.]

258} అబ్జనాభుడు  - అబ్జము (పద్మము) నాబిన కలవాడు, విష్ణువు :-
[4-160.1-తే., 4-313.1-తే.]

259} అబ్జపాణి  - పద్మమును చేత ధరించినామె, లక్ష్మీదేవి :-
[4-443.1-తే.]

260} అబ్జభవుడు  - అప్ప్ (నీరు) నుండి భవ (పుట్టిన) పద్మము నందు పుట్టినవాడు. బ్రహ్మదేవుడప :-
[3-87-వ.]

261} అబ్జము  - అప్పు (నీటియందు) జము (పుట్టునది), పద్మము :-
[3-503-క.]

262} అబ్జము  - నీటపుట్టునది, అప్పు (నీరు)నందు పుట్టినది, పద్మము :-
[1-388.1-తే., 2-217.1-తే., 3-118.1-తే., 3-282-తే., 3-306-మ., 3-548-ఉ., 3-735-క., 4-730-చ.]

263} అబ్జముఖి  - పద్మములవంటి మోములు కలామె, సుందరి. :-
[10.1-1010.1-తే., 10.2-692.1-తే.]

264} అబ్జలోచనుడు  - పద్మములవంటి కన్నులు కలవాడు, విష్ణువు :-
[3-19-చ.]

265} అబ్జవదన  - అబ్జము (పద్మము)వంటి వదన (మోముగలామె), అందమైన స్త్రీ :-
[6-512-తే.]

266} అబ్జాక్షి  - అంబుజము (పద్మము)ల వంటి కన్నులు కలామె, స్త్రీ :-
[3-965.1-తే.]

267} అబ్జాక్షుడు  - పద్మముల (అబ్జముల) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు :-
[3-203-దం., 3-753.1-తే., 6-421-క., 9-84.1-ఆ.]

268} అబ్జాతము  - అప్పునందు జాతమైనది, పద్మము :-
[10.1-1461-శా.]

269} అబ్జాసనుడు  - అబ్జము (పద్మము) ఆసనముగా కలవాడు, బ్రహ్మదేవుడు :-
[4-142-క., 10.2-627-మ.]

270} అబ్దివిభుడు  - సముద్రమునకు ప్రభువు, వరుణుడు :-
[3-619.1-తే.]

271} అభయకారణుడు  - భక్తులకు భయములేకుండ చేయుటకు హేతువు ఐనవాడు, విష్ణువు :-
[10.1-688-ఉ.]

272} అభయప్రదుడు  - అభయము ఇచ్చువాడు, విష్ణువు :-
[4-900-క.]

273} అభయుడు  - భయము లేని వాడు, భగవంతుడు :-
[2-207-క.]

274} అభవుడు  - పుట్టుక లేనివాడు, శివుడు, విష్ణువు, భగవంతుడు :-
[1-194-క., 2-98-క., 3-198.1-తే., 3-200-క., 3-293.1-తే., 3-897.1-తే., 4-60-క., 4-66-క., 4-104-వ., 4-117-తే., 4-130-క., 4-159-క., 5.1-74.1-తే., 6-172-చ., 6-229-తే., 6-333.1-ఆ., 6-341-తే., 7-89-క., 10.1-99-ఉ., 10.2-254-ఆ., 10.2-320.1-తే., 10.2-529-క., 11-85-తే.]

275} అభిచారకర్మ  - హింసార్థమైన మంత్ర తంత్ర రూపక కర్మము, పంపు, చేతబడి, మారణహోమము :-
[3-686.1-తే., 6-307-వ.]

276} అభిచారము  - హింసార్థమైన మంత్ర తంత్ర రూపక కర్మము, పంపు, చేతబడి, మారణహోమము :-
[10.2-531-తే.]

277} అభిజిత్తు  - 1. ఒకానొక నక్షత్రము ఉత్తరాషాఢ యొక్క నాల్గవ పాదమును, శ్రవణము యొక్క మొదటి పాదమును కలిసినది. 2. లగ్నం/ముహూర్తం ఈ నక్షత్రంతో కూడిన లగ్నము లేదా ముహూర్తము మిట్టమధ్యాహ్నము నుండి పదహారు గడియల కాలము, అభిజిత్ లగ్నము లేదా ముహూర్తము :-
[3-671-మ., 8-506-మ.]

278} అభిజిన్ముహూర్తము  - మిట్టమధ్యాహ్నము 24 నిమిషముల ముందునుండి 24 నిమిషములవరకు గల కాలము, సూర్యోదయమునుండి పద్నాలుగు (14) నుండి పదహారు గడియల కాలము, అభిజిత్ లగ్నము లేదా ముహూర్తము. ఇది సంపూర్ణజయమున సాయపడునది. :-
[7-405-వ.]

279} అభిమన్యుకాంత  - ఉత్తర, అభిమన్యుని భార్య :-
[1-280-వ.]

280} అభిమన్యుడు  - సుభద్ర అర్జునుని పుత్రుడు, విరాట రాకుమారి ఉత్తర భర్త, పరీక్షిత్తు కొడుకు, కురుక్షేత్రంలో పద్మవ్యూహ ప్రవేశం చేసి వీరమరణం పొందిన అసహాయ శూరుఁడు :-
[3-130-వ.]

281} అభిమన్యునందనుడు  - అభిమన్యుని పుత్రుడు, పరీక్షిత్తు :-
[3-234-వ., 3-261-క., 10.2-636-వ.]

282} అభిమన్యునితనయుడు  - అభిమన్యుని పుత్రుడు, పరీక్షిన్మహారాజు. :-
[3-195-క.]

283} అభిమన్యువు  - ఇతడు అర్జునుని పుత్రుడు కాదు, వారికంటే పూర్వపు రాజు :-
[2-204.1-తే.]

284} అభిమన్యుసంభవుండు  - అభిమన్యుని పుత్రుడు, పరీక్షిన్మహారాజు. :-
[1-442-వ.]

285} అభిమన్యుసుతుడు  - అభిమన్యుని పుత్రుడు, పరీక్షిత్తు :-
[5.2-13-క.]

286} అభిమానము  - నేను నాది యనెడి భావములైన అహంకార మమకారములు :-
[7-464.1-తే.]

287} అభిమాని  - అభిమానము (సంరక్షణ ప్రేమ) కలవాడు :-
[4-817-వ.]

288} అభివ్యంగ్యము  - వెలువడు గుర్తులచే తెలియబడునది, అనుభవసారము :-
[4-584-వ.]

289} అభిషేకము  - స్నానము చేయించుట, పట్టాభిషేకము :-
[10.2-946-తే.]

290} అభిషేకముచేయుట  - పట్టాభిషేకము :-
[1-385.1-ఆ.]

291} అభ్యాసి  - మంచి అభ్యాసము చేసినవాడు, చాణూరుడు :-
[10.1-1348-వ.]

292} అభ్రగజము  - అభ్ర (ఆకాశపు, స్వర్గలోకపు) గజము (ఏనుగు), ఐరావతము :-
[6-426-ఉ.]

293} అభ్రగపతి  - అభ్రగము (గగనచరు లైన పక్షులకు) పతి (ప్రభువు), గరుడుడు :-
[8-96-మ.]

294} అభ్రము  - అప్పు (నీటిని) భరించునది, మేఘము :-
[10.1-1582-మ.]

295} అమంద  - మందము (మెల్లని, జడత) తక్కువ కాని :-
[4-17-వ.]

296} అమర + అరాతి (సవర్ణదీర్ఘ సంధి) - దేవతల శత్రువు (బలి) :-
[8-611-మ.]

297} అమరకంటకుడు  - అమరులు (దేవతలు) కు కంటకుడు (శత్రువు), రాక్షసుడు :-
[3-417-క.]

298} అమరకులాగ్రగణ్యుడు  - అమరు (దేవత)ల కులము (గణము)లకు అగ్రగణ్యడు (మొదట లెక్కిందగు వాడు, పెద్దవాడు), బ్రహ్మదేవుడు :-
[3-499-చ.]

299} అమరగణవంద్యమానపాదాబ్జయుగళుడు  - దేవతాసమూహముల చే నమస్కరింపదగ్గ పాదములు అను పద్మముల జంట కలవాడు, విష్ణువు :-
[3-225-తే.]

300} అమరగురుడు, అమరగురువు  - అమరుల (దేవతల) కు గురువు, బృహస్పతి :-
[5.2-89.1-ఆ., 10.1-1436-క.]

301} అమరనాథుడు  - అమర (దేవతలకు) నాథుడు (ప్రభువు), ఇంద్రుడు :-
[6-414.1-తే.]

302} అమరనాయకుడు  - అమరుల (దేవతల) నాయకుడు, ఇంద్రుడు :-
[4-515.1-తే.]

303} అమరభర్త  - అమరుల (దేవతల)కి భర్త (ప్రభువు), విష్ణువు :-
[3-686.1-తే.]

304} అమరలలాముడు  - అమరుల (దేవతల)కు లలాముడు శ్రేష్ఠమైనవాడు, విష్ణువు :-
[3-633-క.]

305} అమరవంద్యుడు  - అమర (దేవతల)చే వంద్యుడు (పూజింపబడు)వాడు, విష్ణువు :-
[3-748-క.]

306} అమరవర్థనుడు  - అమరుల (దేవతల)ను వర్ధనుడు (వృద్ధి చేయువాడు), విష్ణువు :-
[3-627-చ.]

307} అమరవల్లభుడు  - అమరుల (దేవతల)కి వల్లభుడు, ఇంద్రుడు :-
[9-161.1-తే.]

308} అమరవాహిని  - అమర (దేవతల) వాహినీ (నది) ఆకాశగంగ :-
[1-8-ఉ.]

309} అమరవిభుడు  - అమరుల (దేవతల) విభుడు (ప్రభువు), ఇంద్రుడు :-
[4-508.1-తే., 6-443-తే., 8-16.1-ఆ., 9-49-ఆ., 9-161.1-తే., 9-504.1-ఆ.]

310} అమరాధిపుడు  - అమర (దేవతల)కు అధిపుడు (రాజు), ఇంద్రుడు :-
[6-445-చ.]

311} అమరాధీశ్వరుడు  - అమరుల (దేవతల)కు ఆధీశ్వరుడు (ప్రభువు), ఇంద్రుడు :-
[10.1-946-మ.]

312} అమరానోకహము  - దేవతా వృక్షము, కల్ప వృక్షము :-
[10.2-1229.1-తే.]

313} అమరాబంధుడు  - అమర (దేవతల) అబంధుడు (శత్రువు), రాక్షసుడు. :-
[9-164-క.]

314} అమరారి  - అమరులు (దేవతలు)కు అరి (శత్రువు), రాక్షసుడు, హిరణ్యాక్షుడు :-
[3-616-క., 3-623-ఉ., 7-199.1-తే.]

315} అమరావతి - దేవతల ఉనికిపట్టు స్వర్గలోకానికి ముఖ్యపట్టణం, దేవతలపట్టణము :-
[10.2-601-వ.]

316} అమరాహితులు  - అమరుల (దేవతల) అహితులు, రాక్షసులు :-
[9-277-క.]

317} అమరులు  - మరణము లేనివారు, దేవతలు :-
[4-462-చ., 4-557.1-తే., 6-277-క., 6-385-లగ్రా., 7-3.1-ఆ., 7-103-క., 7-259-శా., 7-402-ఆ., 9-161.1-తే., 10.1-1506-మ., 10.2-1147-ఉ.]

318} అమరేంద్రతనయుడు  - ఇంద్రుని పుత్రుడు, అర్జునుడు :-
[10.2-1093-క.]

319} అమరేంద్రవాహుడు  - ఇంద్రుని వాహనముగా కలవాడు, వికుక్షి, శశాదుడు :-
[9-160-చ.]

320} అమరేంద్రాశ  - అమరేంద్రుని (ఇంద్రుని) ఆశ (దిక్కు), తూర్పు :-
[9-259-మ.]

321} అమర్త్యులు  - మరణములేనివారు, దేవతలు :-
[6-326-వ., 8-181-క.]

322} అమలములు  - నిర్మలములు, రాగద్వేషాదులు లేనివి :-
[10.1-553.1-ఆ.]

323} అమలుడు  - పరిశుద్ధుడు, నిర్మలుడు, విష్ణువు :-
[11-77-వ.]

324} అమాత్యుడు  - మంత్రముతో (ఆలోచనతో) కూడి ఉండువాడు, మంత్రి :-
[10.1-1311-క.]

325} అమితుడు  - మేరలేనివాడు. అష్టప్రమాణములకు అందనివాడు, విష్ణువు :-
[10.1-1182-శా.]

326} అమృతకరుడు  - అమృతమయములైన కరములు (కిరణములు) కలవాడు, చంద్రుడు. :-
[8-224.1-తే.]

327} అమృతకళాస్థానశేఖరుడు  - అమృత (అందమైన, అమృతము వంటి) కళా (కళలకు) ఆస్థాన (నివాసమైన చంద్రుని) శేఖరుడు (శిఖ యందు ధరించినవాడు), పరమశివుడు :-
[6-326-వ.]

328} అమృతము  - మృతము (చావును) చేరనీయనిది :-
[10.1-1523.1-ఆ.]

329} అమృతాంధసులు  - అమృతము ఆహారముగా కలవారు, దేవతలు :-
[8-531-శా., 10.1-1167.1-ఆ.]

330} అమృతాంశుడు  - అమృతము వంటి అంశ (వెన్నెల) కలవాడు, చంద్రుడు :-
[4-710.1-తే.]

331} అమృతాశనులు  - అమృతము అశన (తినువారు) దేవతలు :-
[4-167-చ.]

332} అమృతుడు  - అమృతమువంటివాడు, మోక్షమును యిచ్చుట ద్వారా జననమరణ చక్రమునుండి విముక్తి కలిగించువాడు, విష్ణువు :-
[9-205.1-తే., 10.1-567.1-ఆ.]

333} అమేయుడు  - మేయము (మేర, మితి, ఇంతని చెప్పుటకు) లేనివాడు, విష్ణువు :-
[3-293.1-తే., 3-844-చ., 4-298-చ., 6-172-చ., 6-423-ఉ.]

334} అమోఘము  - వ్యర్థము కానిది :-
[1-69-మ.]

335} అయనములు  - ఆయనములు రెండు, 1ఉత్తరాయణము 2దక్షిణాయనము :-
[5.2-86-వ.]

336} అయిదువ  - 5 వన్నెలు (1మెడలో మంగళసూత్రము 2కాలికి పసుపు 3నుదుట కుంకుమ 4చేతికి గాజులు 5కాలివేళ్ళకి మట్టెలు) కలామె, పునిస్త్రీ :-
[9-67-వ.]

337} అయుతము  - పదివేలు :-
[2-3.1-ఆ.]

338} అయోనిజుడు  - గర్భమున పుట్టనివాడు, బ్రహ్మదేవుడు :-
[6-224-వ.]

339} అరణందాసి  - పెండ్లి యందు పెళ్ళికూతురుతో పంపే బహుమతులు, లాంఛనాలలో భాగంగా పంపబడిన దాసి :-
[9-510-ఉ., 9-537-మ.]

340} అరణి  - మధించుట ద్వారా అగ్నిని రగుల్చుటకైన కఱ్ఱపుల్ల, ఘర్షణతో నిప్పును పుట్టించుటకు వాడెడి కఱ్ఱ :-
[3-434-చ., 3-914-వ., 4-619.1-తే., 9-419-వ.]

341} అరణ్యాటము  - అరణ్యములో తిరుగునది, ఏనుగు :-
[8-57-శా.]

342} అరవిందదళాక్షుడు  - అరవింద (పద్మము) ల దళా (రేకుల) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు :-
[3-517-చ.]

343} అరవిందనందనుడు  - అరవిందము (పద్మము) యొక్క నందనుడు (కొడుకు), బ్రహ్మదేవుడు :-
[3-501-వ., 4-167-చ.]

344} అరవిందనయనుడు  - అరవింద (పద్మము)ల వంటి నయనములు కలవాడు, విష్ణువు :-
[3-507-వ.]

345} అరవిందనాభుడు  - పద్మము బొడ్డున కలవాడు, విష్ణువు :-
[3-189.1-తే.]

346} అరవిందభవుడు  - అరవిందము (పద్మము)న భవుడు (పుట్టినవాడు), విష్ణువు :-
[1-71-ఉ., 3-449-తే.]

347} అరవిందలోచనుడు  - అరవిందము (పద్మము)ల వంటి కన్నులు కలవాడు, విష్ణువు :-
[3-156-వ.]

348} అరవిందవాసిని  - పద్మములందు వసించునామె, లక్ష్మీదేవి :-
[10.2-1313-వ.]

349} అరవిందసంభవుడు  - అరవిందము (పద్మము)న సంభవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[3-367-వ., 3-377.1-తే., 3-778-క., 7-93-వ.]

350} అరవిందాక్షుడు  - అరవిందములవంటి కన్నులున్నవాడు :-
[1-393-మ.]

351} అరవిందాక్షుడు  - అరవిందములవంటి కన్నులున్నవాడు, కృష్ణుడు :-
[10.2-1219-మ.]

352} అరవిందానన  - అరవిందము (పద్మము) వంటి ముఖము కలామె, స్త్రీ :-
[3-462-మ.]

353} అరవిందోదరుడు  - అరవిందము (పద్మము) ఉదరమున (కడుపున) కలవాడు, విష్ణువు :-
[3-429-మ., 4-177-మ., 4-283-మ.]

354} అరిషడ్వర్గము  - 1కామ 2క్రోధ 3దంభ 4లోభ 5మద 6మాత్సర్యములనెడి ఆరుగురు శత్రు కూటమి :-
[3-803-వ., 5.1-155-వ., 9-587-క., 11-41-వ.]

355} అరిషడ్వర్గములు  - 1కామ 2క్రోధ 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములనెడి ఆరుగురు శత్రు కూటములు :-
[1-50.1-ఆ., 1-89-ఉ., 1-278-వ., 4-630-మ., 4-649-వ., 6-88-వ., 6-149-క., 7-249-క., 10.1-282-క., 10.1-543-వ., 10.1-1664-వ., 10.2-235.1-తే.]

356} అరుణగభస్తి  - ఎఱ్ఱని కిరణములు కలవాడు, సూర్యుడు :-
[11-48-వ.]

357} అరుణాంభోరుహపత్రలోచనుడు  - ఎఱ్ఱకలువల రేకుల వంటి కన్నులు ఉన్నవాడు :-
[2-237-మ.]

358} అరుణుడు  - సూర్యుని రథసారథి, ఎర్రని వాడు కనుక అరుణుడు, కనుక ముందు రథసారథి రంగుతో అరుణోదయం. ఊరువులు లేకుండా పుట్టాడు కనుక అనూరుడు, గరుత్మంతుని అన్న, తండ్రి కశ్యపుడు. తల్లి వినత, వినత రెండు గుడ్లు ప్రసవించింది. తొందర పడి ఒక గుడ్డు పగులగొట్టింది. దానితో ఊరువులు లేని ఎర్రని అరుణుడు పుట్టాడు. తల్లిని సవితికి దాసీవి అవుతావు అని శాపం ఇచ్చాడు. రెండవ గుడ్డు నుండి గరుత్మంతుడు పుట్టాడు. :-
[10.2-636-వ.]

359} అరుణోదము  - ఒకనది, ఎఱ్ఱని నీరు గలది, మందరపర్వతం నుండి పుట్టినది :-
[5.2-21-ఉ.]

360} అర్కుడు  - ఋక్కులకు అధిదేవత ఐన సూర్యబింబము, కిరణములు కలవాడు, సూర్యుడు :-
[2-86-వ., 10.1-1449-మ.]

361} అర్ఘ్యము  - పూజకొఱకైనది, అష్టార్ఘ్యములు (1పెరుగు 2తేనె 3నెయ్యి 4అక్షతలు 5గఱిక 6నువ్వులు 7దర్భ 8పుష్పము) :-
[10.1-1267-వ., 10.2-92.1-తే., 10.2-393-వ.]

362} అర్చన  - పూజ, ముగ్గు సుగంధము అక్షతలు పుష్పము ధూపము దీపము ఉపహారము (నైవేద్యము) తాంబూలము అని ఎనిమిది విధమైనవి కలది :-
[5.2-71-క.]

363} అర్జునపౌత్రుడు  - అర్జునుని (కొడుకు అభిమన్యుని కొడుకు) మనుమడు, పరీక్షిన్మహారాజు :-
[3-228-క., 3-443-క., 9-21-వ., 10.2-1034-వ.]

364} అర్జునుడివిల్లు  - గాండీవము :-
[10.2-1174-వ.]

365} అర్జునుడు  - తెల్లని వాడు, పాండవ మధ్యముడు, కుంతీదేవి రెండవ కొడుకు :-
[1-371-క., 10.2-354-మ., 10.2-1171-ఉ.]

366} అర్ణవము  - నీటికి నిలయమైనది, సముద్రము :-
[2-267-వ., 10.1-1485-వ.]

367} అర్థచంద్రకరభావము  - అర్థచంద్రునివలె అన్నివేళ్ళు చాచి పట్టునది, శ్లో. అర్ధచంద్రకరస్సోయం పతాకేంగుష్ట సారణాత్, రాసక్రీడా పారిభాషిక పదము. :-
[10.1-1084-వ.]

368} అర్థము  - ప్రయోజనము, ధనము, పదము లేదా పదబంధానికి వివరణ, టీకకు రెండవ భాగము, దీనికి వివరణ టిప్పణి :-
[4-28-వ.]

369} అర్థవిభుడు  - అర్థము (ధనము)నకు విభుడు (ప్రభువు), కుబేరుడు :-
[4-361-తే.]

370} అర్బుదము  - వెయ్యి కోట్లు, 1 తరువాత 10 సున్నాలు :-
[5.1-18-వ.]

371} అర్బుదార్బుదములు  - క్షితి (1 తరవాత 20సున్నాలు) అర్బుదము (1 తరువాత 10సున్నాలు, వేయికోట్లు) అనేకము :-
[4-830.1-తే.]

372} అర్యముడు  - సూర్యుడు, పితృదేవతలలో ఒకడు, ద్వాదశాదిత్యులలో ఒకడు :-
[5.2-47-క.]

373} అర్హులు - అర్హతరులు అర్హతములు :-
[4-572.1-తే.]

374} అలంఘ్యుడు  - ఉల్లంఘించుటకు రానివాడు, శంకరుడు :-
[3-473-వ.]

375} అలకాపురము - కుబేరుని పట్టణము :-
[1-256-వ.]

376} అలకాపురము  - కుబేరుని పట్టణము :-
[10.2-601-వ.]

377} అలఘుడు  - (ఏవిధముగను) తక్కువ కాని వాడు, కృష్ణుడు, విష్ణువు :-
[1-380-మ., 2-109-చ., 3-257-క.]

378} అలఘుమూర్తి  - అలఘు (చిన్నదికాని, పెద్దదైన) మూర్తి (మూర్తిత్వము కలవాడు), గొప్పవాడు :-
[4-36.1-తే.]

379} అలఘులు - అలఘుతరులు అలఘుతములు :-
[3-967-క.]

380} అలరుటమ్ములవిలుకాడు  - పుష్పములు బాణములుగా గల విల్లుగలవాడు, మన్మథుడు :-
[9-609-వ.]

381} అలరుబోడి  - పుష్పము వలె సుకుమారమైన దేహము కలామె, స్త్రీ :-
[10.2-180.1-ఆ.]

382} అలరువిలుతుడు  - అలరు (అరవిందాది పుష్పములు) విలుతుడు (బాణములుగలవాడు), మన్మథుడు :-
[9-27-వ.]

383} అలర్కుడు  - దత్తాత్రేయుని శిష్యుడు, యోగవిద్య ఉపదేశము పొందినవాడు :-
[2-204.1-తే.]

384} అలవాటుకలిమి  - హనుమంతుడు బాలునిగా గెంతి సూర్యుని మింగబోయాడు కదా ఆ అలవాటు వలన సముద్రలంఘనం సుళువుగా దాటాడట. :-
[9-275-క.]

385} అలాతదైవమండలము  - (అలాత) కొరవి తిప్పినట్లు రెండు చేతులను పైకెత్తి ఒకదానికొకటి తగులకుండ కిందికిమీదికి తిప్పుట, రాసక్రీడా పారిభాషిక పదము. :-
[10.1-1084-వ.]

386} అలికి  - అలుకుట చేసి గోడ మట్టిగచ్చు వంటివి మరల మట్టి పేడలతో (గోడలకు సున్నము వేసినట్లు) మెత్తుట :-
[9-321.1-తే.]

387} అలికులవేణి  - (అలికులం) తుమ్మెదల బారును పోలిన వేణి (జడ కలామె), రుక్మిణి :-
[10.2-238-చ., 10.2-263-చ.]

388} అలికులాకులమాలికాభిరాముఁడు  - అలి (తుమ్మెదల) కుల (సమూహము వంటి) అలక ( ముంగురుల) మాలికా (గుంపులచే) అభిరాముడు (చక్కనైన వాడు), విష్ణువు :-
[3-922.1-తే.]

389} అల్ప - అల్పతర అల్పతమ :-
[1-44-చ.]

390} అల్పము - అల్పతరము అల్పతమము :-
[3-263-తే., 12-11-వ.]

391} అల్లుడు  - కూతురు భర్త, మగవారి సోదరి పుత్రుడు, ఆడవారి సోదరుని పుత్రుడు. :-
[10.1-1769-మత్త.]

392} అళికలోచనము  - అళీక (నొసటందుండు) లోచనము (కన్ను), శివుడి మూడవ కన్ను :-
[10.2-534.1-తే.]

393} అవటనిరోధము  - మలమూత్రాది విసర్జకములను బంధిచుట మున్నగు శిక్షలు, నరక విశేషము, అవటము (రంధ్రము)లు నిరోధించి (మూసి) శిక్షించెడి నరకము :-
[5.2-136-వ.]

394} అవతారము  - స్వ స్వరూప భేదము, మరొక రూపములో దిగి వచ్చుట :-
[3-210-క.]

395} అవధూత  - పైపొరలు తొలగినవాడు, బ్రహ్మనిష్ఠతో వర్ణాశ్రమాచారములను విడిచిన సన్యాసి, దిగంబర రూప సన్యాసి, భగవంతుని తన అవధానమున నిలుపుకొన్నవాడు, విడువబడిన ఇహలోకార్థములు గలవాడు :-
[1-523-మ., 2-14-వ., 3-39-క., 5.1-78-వ., 5.1-156-ఉ., 7-217-వ., 11-91-వ.]

396} అవనిజము  - అవని (భూమి) నుండి జము (పుట్టినది), వృక్షము :-
[6-195.1-తే.]

397} అవనినాథుడు  - అవని (భూమి)కి నాథుడు, రాజు. :-
[1-323-తే., 7-468-ఆ.]

398} అవనినాయకుడు  - భూమికి నాయకుడు, రాజు :-
[4-835.1-తే.]

399} అవనివిభుడు  - అవని (భూమి)కి ప్రభువు, రాజు. :-
[8-18.1-ఆ.]

400} అవనిసురుడు  - అవని (బూమికి) సురుడు (దేవత), విప్రుడు :-
[8-466-ఆ., 9-148-ఆ.]

401} అవనీజము  - అవని (భూమి) యందు జము (పుట్టినది), చెట్టు, వృక్షము :-
[3-700-మ., 3-812-క.]

402} అవనీనాథుడు  - అవని (రాజ్యమున)కు నాథుడు, రాజు :-
[2-261-క., 3-20-క., 5.1-9-క., 5.2-57-క., 10.1-517-క., 10.1-929-క., 10.1-1627-మ.]

403} అవనీపతి  - భూమికి ప్రభువు, రాజు :-
[4-814-క.]

404} అవనీవరుడు  - భూమికి వరుడు రాజు :-
[2-262-క., 3-21-క.]

405} అవనీశుడు  - అవనికి (భూమికి) ఈశుడు (ప్రభువు) :-
[2-253.1-తే., 3-174-క., 4-830.1-తే., 10.1-353.1-ఆ., 10.1-1519.1-ఆ.]

406} అవనీశ్వరుడు  - అవని (భూమి)కి ఈశ్వరుడు (ప్రభువు), రాజు :-
[4-767.1-తే.]

407} అవనీసురులు  - భూమికి దేవతలు, విప్రులు :-
[1-315-క.]

408} అవబృథము  - యఙ్ఙము కడపట న్యూనాతిరిక్తదోష పరిహారార్థము చేసెడి కర్మము :-
[4-53.1-తే., 4-534-వ., 9-487-వ., 10.2-800-వ.]

409} అవస్థాత్రయము  - 1జాగరణ(మెలకువ) 2స్వప్న(కల) 3సుషుప్తి (నిద్ర) అను అవస్థ (స్థితి) అభాసములు మూడు :-
[1-459.1-తే., 6-484-వ., 7-237-వ., 10.2-1079.1-తే., 11-52-వ., 12-24-వ.]

410} అవస్థాష్టకము  - 1కౌమారము (5సం.) 2పౌగండము(10సం.) 3కైశోరము(15సం.) 4బాల్యము (16సం), 5తారుణ్యము (25సం.) 6యౌవనము (50) 7వృద్ధము (70) 8వర్షీయస్త్వము (90), పాఠ్యంతరములు కలవు :-
[7-213-వ., 10.1-487-వ., 10.1-488.1-ఆ.]

411} అవాంతరప్రళయము  - రెండు కల్పముల నడిమి కాలము, కల్పము లేదా అవాంతర కల్పము బ్రహ్మదేవునికి పగలు, బ్రహ్మదేవుని పగులు పిమ్మట వచ్చే రాత్రి ప్రళయము లేదా అవాంతర ప్రళయము అంటారు. :-
[2-222-వ.]

412} అవాఙ్మానసగోచరుడు  - వాక్కు (వర్ణించుటకు) మానస (ఊహించుటకు) అగోచరుండు (అందనివాడు), విష్షువు :-
[5.2-55-వ.]

413} అవికల్పితుడు  - వికల్పము (భ్రాంతి, మారుదల) లేనివాడు, విష్ణువు :-
[7-217-వ.]

414} అవికారుడు  - వికారములు (మార్పులు) లేని వాడు, విష్ణువు :-
[3-844-చ., 4-298-చ.]

415} అవితథానుభూతి  - అవితథ (అసత్యము కాని, యథార్థమైన, వ్యర్థము కాని) అనుభూతి యైన వాడు, ఆత్మానుభూతి యైన వాడు) :-
[6-213-తే.]

416} అవిద్ధఅంగహారము  - మనసునందు నాటుటను సూచించునవి. , రాసక్రీడా పారిభాషిక పదము. :-
[10.1-1084-వ.]

417} అవిద్య  - విద్య (తత్త్వజ్ఞానమున)కు ఇతరమైనది. ఆత్మతత్త్వ విద్యకు అన్యమైనది, మాయ :-
[4-540-వ., 5.1-69-వ.]

418} అవిద్యాపంచకమిశ్రమములు  - అవిద్య అనబడు ఐదింటి గుంపు, అవి 1) మోహం, 2) మహామోహం, 3) అంధతామిస్రం, 4) తామిస్రం, 5) చిత్త విభ్రమం :-
[3-367-వ.]

419} అవిస్త్రృతము  - విస్త్రృతము (పెద్దది) కానిది, చిన్నది :-
[3-560-చ.]

420} అవీచిరయము  - మానకవీచి ఎత్తైన కొండపైనుండి విసరి శిక్షించుట, నరక విశేషము :-
[5.2-136-వ.]

421} అవ్యక్తుడు  - చూడ వీలుకానివాడు, భగవంతుడు, వ్యక్తము (తెలియ) శక్యము కానివాడు, విష్ణువు :-
[2-98-క., 6-333.1-ఆ., 11-77-వ.]

422} అవ్యభిచారి  - (అది తప్ప) మరియొకదానియందు చరించనిది :-
[1-58-వ.]

423} అవ్యయానందుడు  - అవ్యయము (తగ్గిపోని) ఆనందము కలవాడు వాడు, విష్ణువు :-
[4-191.1-తే., 4-714-తే.]

424} అవ్యయుడు  - వ్యయము (తరుగు) లేనివాడు, భగవంతుడు, నాశములేనివాడు, విష్ణువు :-
[2-68.1-తే., 2-98-క., 2-277.1-తే., 4-359.1-తే., 6-172-చ., 6-333.1-ఆ., 7-217-వ., 8-121.1-ఆ., 10.2-130-ఆ., 10.2-749-ఆ., 10.2-1217-ఉ., 11-76-ఆ.]

425} అవ్యాహతంబులు  - అవ్యవహితములైనవి, వ్యవహితము (వ్యవధానమైనవి, తేడాకలవి) కానివి :-
[10.2-1220-వ.]

426} అశని  - దిక్కులంతము వరకు భుజించగలది, వజ్రాయుధము :-
[10.2-940-మస్ర.]

427} అశ్వశిరస్కుడు  - హయగ్రీవుడు, అశ్వనితో మొదలగు కాలమానవిశేషము :-
[4-26-వ.]

428} అశ్వహృదయము  - గుఱ్ఱముయొక్క మనోగత భావములు తెలిసికొనగల విద్య :-
[9-235-ఆ.]

429} అష్టఐశ్వర్యములు  - 1అణిమ 2మహిమ 3గరిమ 4లఘిమ 5ప్రాప్తి 6ప్రాకామ్యము 7ఈశత్వము 8వశిత్వము, మరొక విధానము, 1దాసీజనము 2భృత్యులు 3పుత్రుల 4మిత్రులు 5బంధువులు 6వాహనము 7ధాన్యము 8ధనము :-
[10.2-247-తే.]

430} అష్టకాశ్రాద్దము  - వైశ్వదేవ సంబంధమైన సప్తపాక యజ్ఞములలో ఒకటి, మాఘబహుళ షష్టి సప్తమి అష్టమి మూడు తిథులందు పితృదేవతల గూర్చి చేయునది :-
[9-156.1-తే.]

431} అష్టదిక్పాలకులు  - అష్టదిక్పాలకులు 1 ఇంద్రుడు తూర్పు దిక్కునకు 2 అగ్ని ఆగ్నేయ దిక్కునకు 3 యముడు దక్షిణ దిక్కునకు 4 నిరృతి నైఋతి దిక్కునకు 5 వరుణుడు పడమటి దిక్కునకు 6 వాయువు వాయవ్య దిక్కునకు 7 కుబేరుడు ఉత్తర దిక్కునకు 8 ఈశానుడు ఈశాన్య దిక్కునకు పరిపాలకులు :-
[3-467.1-తే., 6-282-వ., 10.1-340-క., 10.2-131-మ., 10.2-231-మ., 10.2-439-వ., 10.2-583.1-తే., 10.2-764.1-తే.]

432} అష్టదిగ్గజములభార్యలు  - 1అభ్రము తూర్పు దిగ్గజము ఐరావతము భార్య 2కపిల ఆగ్నేయము దిగ్గజము పుండరీకము భార్య 3పింగళ దక్షిణము దిగ్గజము వామనము భార్య 4అనుపమ నైఋతి దిగ్గజము కుముదము భార్య 5తామ్రపర్ణి పడమర దిగ్గజము అంజనము భార్య 6శుభ్రదంతి వాయవ్యము దిగ్గజము పుష్పదంతము భార్య 7అంగన ఉత్తరము దిగ్గజము సార్వభౌమము భార్య 8అంజనావతి ఈశాన్యము దిగ్గజము సుప్రతీకము భార్య :-
[11-105-వ.]

433} అష్టదిగ్గజములు  - 1ఐరావతము తూర్పు దిగ్గజము 2పుండరీకము ఆగ్నేయము దిగ్గజము 3వామనము దక్షిణము దిగ్గజము 4కుముదము నైఋతి దిగ్గజము 5అంజనము పడమర దిగ్గజము 6పుష్పదంతము వాయవ్యము దిగ్గజము 7సార్వభౌమము ఉత్తరము దిగ్గజము 8సుప్రతీకము ఈశాన్యము దిగ్గజము :-
[7-198.1-ఆ., 11-105-వ.]

434} అష్టపాశములు  - 1పశుపాశము 2భవపాశము 3బంధపాశము 4మోహపాశము 5ఆశాపాశము 6కర్మపాశము 7దుఃఖపాశము 8కేశపాశము, పాఠ్యంతరము, 1దయ 2శంక 3భయము 4లజ్జ 5జుగుప్స 6కులము 7శీలము 8జాతి :-
[10.2-156-వ.]

435} అష్టభోగములు  - 1నిథి 2నిక్షేపము 3జల 4పాషాణ 5అక్షీణ 6ఆగామి 7సిద్ధ 8సాధ్యములు మరియొకవిధమున 1గృహము 2శయ్య 3వస్త్రము 4ఆభరణము 5స్త్రీ 6పుష్పము 7గంధము 8తాంబూలము :-
[1-491-ఉ., 2-38-వ., 7-372.1-ఆ.]

436} అష్టమదములు  - 1కులము 2విద్య 3సంపద 4ఆచారము 5కీర్తి 6భోగము 7దాతృత్వము 8జ్ఞానము ల వలని గర్వములు :-
[10.2-232.1-ఆ.]

437} అష్టవసువులు  - 1ద్రోణుడు 2ప్రాణుడు 3ధ్రువుండు 4అర్కుండు 5అగ్ని 6దోషుండు 7వస్తువు 8విభావసువు (ఇంకొక క్రమము) 1ఆవుడు 2ధ్రువుడు 3సోముడు 4అధ్వరుడు 5అనిలుడు 6ప్రత్యూషుడు 7అనలుడు 8ప్రభాసుడు :-
[2-38-వ., 6-254-వ., 11-105-వ.]

438} అష్టవిధవివాహములు  - 1బ్రాహ్మము 2దైవము 3ఆర్షము 4ప్రాజాపత్యము 5ఆసురము 6గాంధర్వము 7రాక్షసము 8పైశాచము. ఇవికాక, క్షత్రియ కన్యకు స్వయంవరం అను విధానము కూడ ఉన్నది. :-
[10.1-1683-వ.]

439} అష్టవిభూతులు  - 1అణిమ 2మహిమ 3గరిమ 4లఘిమ 5ప్రాప్తి 6ప్రాకామ్యము 7ఈశత్వము 8నశిత్వము :-
[3-880-మ.]

440} అష్టసిద్ధులు  - 1అణిమ 2మహిమ 3గరిమ 4లఘిమ 5ప్రాప్తి 6ప్రా కామ్యము 7ఈశత్వము 8వశిత్వము :-
[7-316-క.]

441} అష్టాంగములు  - 1పాదములు 2మోకాళ్ళు 3తొడలు 4కడుపు 5హృదయము 6వక్షస్థలము 7ముఖము 8తల :-
[6-299-వ.]

442} అష్టాంగయోగమార్గములు  - 1 యమము 2 నియమము 3 ఆసనము 4 ప్రాణాయామము 5 ప్రత్యాహారము 6 ధారణ 7 ధ్యానము 8 సమాధి అని ఎనిమిది (8) :-
[2-222-వ., 3-180.1-తే., 3-282-తే., 3-489-తే.]

443} అష్టాంగయోగములు  - 1 యమము 2 నియమము 3 ఆసనము 4 ప్రాణాయామము 5 ప్రత్యాహారము 6 ధారణ 7 ధ్యానము 8 సమాధి అని ఎనిమిది (8) :-
[5.1-101-వ., 10.2-1218-చ.]

444} అష్టాక్షరీమంత్రము  - ఓంనమోనారాయణాయ అనెడి 8 అక్షరములు గల ఓంకారముతో ప్రారంభించి శిరస్సుతో మొదలిడి అష్టాంగవిన్యాసముతో చేసెడి మంత్రము :-
[6-299-వ.]

445} అష్టాదశపురాణములు  - 1బ్రాహ్మము 2పాద్మము 3వైష్ణము 4శైవము 5భాగవతము 6నారదీయము 7మార్కండేయము 8ఆగ్నేయము 9భవిష్యత్తు 10బ్రహ్మకైవర్తము 11 లైంగము 12వారాహము 13స్కాందము 14వామనము 15కౌర్మము 16మాత్స్యము 17గారుడము 18బ్రహ్మాండము :-
[10.1-2-వ.]

446} అష్టాదశసిద్ధులు  - అణిమాది ఎనిమిది (8) గౌణసిద్ధులు పది (10) అణిమాది 1అణిమ 2మహిమ 3లఘిమ 4గరిమ 5ప్రాప్తి 6ప్రాకామ్యము 7ఈశత్వము 8వశిత్వము; గౌణములు 1వాయు భక్షణం, 2దూరశ్రవణం, 3దూరదర్శనం, 4కామగమనం, 5కామరూపం, 6పరకాయప్రవేశం, 7దివ్యదర్శనం, 8సంకల్పసిద్ధి, 9వశీకరణం, 10స్వచ్చంద మరణం. :-
[11-105-వ.]

447} అష్టావరణలు  - 1.పృథివి, 2.జలము, 3.వాయువు, 4.అగ్ని, 5.ఆకాశము, 6.మనసు, 7.బుద్ధి, 8.అహంకారములు, పాఠ్యంతరము, 1. పృథివి, 2. అప్పు, 3, తేజము, 4. వాయువు, 5. ఆకాశము, 6, అహంకారము, 7. మహత్తత్వము, 8. ప్రకృతి. :-
[2-270-క., 10.1-91.1-తే.]

448} అష్టైశ్వర్యములు  - 1అణిమ 2మహిమ 3గరిమ 4లఘిమ 5ప్రాప్తి 6ప్రాకామ్యము 7ఈశత్వము 8నశిత్వము :-
[3-856.1-తే., 3-919-వ., 3-958-వ., 4-93-వ., 6-39.1-తే., 6-343-వ.]

449} అసంభవము  - జన్మరాహిత్యము, ముక్తి, మరల సంభవము (జనన్మించుట) లేనిది :-
[1-381-వ.]

450} అసమనయనాద్రి  - అసమనయనుని (శివుని) అద్రి (పర్వతము), కైలాసపర్వతము :-
[10.1-1563-లవి.]

451} అసమబాణుడు  - బేసిసంఖ్యగల (ఐదు, 1అరవిందము 2అశోకము 3చూతము 4నవమల్లిక 5నీలోత్పలము లేదా 1ఉన్మాదన 2తాపన 3శోషణ 4స్తంబన 5సమ్మోహనము) బాణములు కలవాడు, మన్మథుడు :-
[10.1-1101-వ., 10.2-1168-ఆ.]

452} అసమశరుడు  - బేసిసంఖ్యగల (ఐదు, 1అరవిందము 2అశోకము 3చూతము 4నవమల్లిక 5నీలోత్పలము లేదా 1ఉన్మాదన 2తాపన 3శోషణ 4స్తంబన 5సమ్మోహనము) బాణములు కలవాడు, మన్మథుడు :-
[3-507-వ.]

453} అసమానలోచనుడు  - అసమాన (ఎగుడు దిగుడు)గా లోచనుడు (కన్నులు ఉన్నవాడు), శివుడు :-
[5.2-38.1-ఆ.]

454} అసి  - ముప్పది అంగుళములకు ఎక్కువ ఉండు కత్తి, ఆయుధములు ముప్పది రెండింటిలో నొకటి, (ఆంధ్ర వాచస్పతము) :-
[10.2-1335-మ.]

455} అసిక్ని  - అంతఃపురమున పనిచేసెడి పడుచుస్త్రీ :-
[6-224-వ.]

456} అసితేక్షణ  - నల్లని కన్నులుకలామె, అసిత (నల్లనివాడైన కృష్ణుని యందు) ఈక్షణ చూపుకలామె), కృష్ణునిసేవించుట యందు రుచికలామె :-
[4-830.1-తే.]

457} అసిపత్రవనము  - అసి (కత్తులే) పత్ర (ఆకులు)గా కలిగిన వనము, నరకవిశేషము :-
[5.2-136-వ., 5.2-142-వ.]

458} అసురఖండనుడు  - అసురులను సంహరించు వాడు, కృష్ణుడు :-
[10.2-3-ఉ.]

459} అసురరాజతనయడు  - అసుర (రాక్షస) రాజ (రాజు యైన హిరణ్యకశిపుని) తనయుడు (పుత్రుడు), ప్రహ్లాదుడు :-
[7-118-ఆ.]

460} అసురాంతకుడు  - అసుర (రాక్షసు)లకు అంతకుడు (నాశము చేయువాడు), విష్ణువు :-
[3-630-చ., 3-697-వ., 7-347-ఉ.]

461} అసురారి  - అసురులు (రాక్షసులు)కి శత్రువు, విష్ణువు :-
[3-301-మ., 7-122.1-తే., 9-82.1-తే., 10.1-75.1-తే.]

462} అసురుడు  - సుర (దేవత) కానివాడు, రాక్షసుడు :-
[3-667-వ., 3-697-వ., 3-697-వ., 3-722-వ., 4-340-క., 5.2-100-క., 7-3.1-ఆ., 7-23-క., 8-179-క., 10.2-166-ఉ.]

463} అసురేంద్రారాతి  - రాక్షసులకు ఆరాతి (శత్రువు), కృష్ణుడు :-
[3-163-మ.]

464} అసురేంద్రుడు  - అసురుల (రాక్షసుల)కు ఇంద్రుడు (ప్రభువు), హిరణ్యకశిపుడు, రావణుడు :-
[7-94-క., 9-291-వ.]

465} అసువులు  - పంచప్రాణములు 1 ప్రాణము 2 అపానము 3 న్యాసము 4 ఉదానము 5 సాన వాయువులు :-
[3-425.1-తే.]

466} అస్తమించు  - కనబడకుండగ పోవు, మరణించు. :-
[3-83.1-తే.]

467} అస్తోకము  - స్తోకము (అల్పము) కానిది :-
[10.2-159-శా., 10.2-564-శా.]

468} అస్త్రము - మంత్ర ప్రయోగముగల మహిమగల ఆయుధములు :-
[10.2-871-క.]

469} అస్త్రము  - మంత్రములచేత యంత్రములచేత ప్రయోగింప బడెడి ఆయుధములు అస్త్రములు, సామాన్యమైన ఆయుధములు (కత్తి, గద, బాణము మొ.) శస్త్రములు :-
[10.2-178-మ.]

470} అస్థిమాలాధరుడు  - అస్థి (ఎముకలు) మాలలను ధరించువాడు, శివుడు :-
[3-467.1-తే.]

471} అస్థిరము - అస్థిరతరము అస్థిరతమము :-
[3-441-చ.]

472} అహంకారత్రయములు  - సాత్విక, రాజస, తామస అహంకారములు :-
[2-112-వ.]

473} అహంకారదూరుడు  - అహంకారములు లేనివాడు, విష్ణువు :-
[6-327.1-తే.]

474} అహికులాంతకుడు  - అహి (సర్పముల) కుల (సమూహమునకు) అంతకుడు (యమునివంటివాడు), గరుడుడు :-
[10.1-703.1-తే.]

475} అహికులారాతి  - అహి (సర్పముల) కుల (సమూహమునకు) ఆరాతి (శత్రువు), గరుడుడు :-
[10.1-707-వ.]

476} అహిపతిభూషుడు  - అహిపతి (నాగేంద్రుడు) భూషుడు (అలంకారముగా కలవాడు), శివుడు :-
[10.2-1271-చ.]

477} అహిరాట్టు  - అహి (సర్పము) లందు రాట్టు (రాజు), ఆదిశేషుడు :-
[4-199-మ.]

478} ఆంగీరసుడు  - అంగిరసుని కొడుకు, బృహస్పతి :-
[10.2-1117-ఉ.]

479} ఆంజనేయుడు  - పరమ భాగవతుడు, భగవంతుని సేవయే కాని తనకు కావలసిన దేమియును లేని మొదటి భక్తుడు :-
[2-204.1-తే.]

480} ఆంబికేయుడు  - వ్యు. అంబికాయాః అపత్యమ్‌ అంబికా + ఢక్‌. (త.ప్ర.). ఆంధ్రశబ్దరత్నాకరం, అంబికయొక్క పుత్రుడు, ధృతరాష్ట్రుడు :-
[10.2-573-వ., 10.2-766.1-ఆ.]

481} ఆకాశదేవతలు  - స్వర్లోక దేవతలు :-
[2-38-వ.]

482} ఆకాశము  - అంతట నిండి ఉండి అన్నిటిని అంటియు అంటక ఉండునది ఆకాశము :-
[10.2-441-వ.]

483} ఆకాశాది  - 1ఆకాశము 2తేజము 3వాయువు 4జలము 5పృథ్వి అను పంచభూతములు :-
[3-896-వ., 3-903-వ.]

484} ఆకూతి  - ఆకూతములు కలది మంచి తలంపులు, ఆశయము,లు, సంకల్పములు కలది :-
[2-117.1-తే., 4-3.1-తే., 4-390-వ., 8-7-వ.]

485} ఆఖండలనందనుడు  - ఆఖండలుడు (ఇంద్రుడు) యొక్క నందనుడు, అర్జునుడు :-
[10.2-143-ఉ., 10.2-1174-వ.]

486} ఆఖండలుడు  - పర్వతములను భేదించిన వాడు, శత్రువులను ఖండించు వాడు, ఇంద్రుడు :-
[1-361-క., 3-595-ఉ., 7-33-క., 10.1-1084-వ.]

487} ఆఖ్యంబునకున్  - ఆఖ్యంబు + కున్ ఆఖ్యంబునకున్. నుగాగమ సంధి... కున్ పరమగుట వలన నుగామమయింది. :-
[10.2-947-క.]

488} ఆగమవినుతుడు  - ఆగమ (వేదముల)చే వినుతుడు (కీర్తింపబడువాడు), విష్ణువు :-
[6-327.1-తే.]

489} ఆగమాంతవిదితధ్రువపుణ్యరమావతంసము  - ఆగమాంత (వేదాంతములో) విదిత (తెలుపబడి) ధ్రువ (నిశ్చయమైన) పుణ్యము యొక్క రమా (శోభను) వతంసము (శిరస్సున ధరించినవాడు), బ్రహ్మ :-
[6-3-ఉ.]

490} ఆగామి ప్రారబ్ధ సంచిత - సంచితం అంటే కూడబెట్టుకొన్నది. ప్రారబ్ధం అంటే కూడబెట్టుకొన్న దానిని అనుభవంలోకి తెచ్చుకోవడం. ఆగామి అంటే ఈ జన్మలో చేసే పనులతో కూడబెట్టుకొనబోయేది (అంటే, సంపాదించుకొంటున్నది) :-
[10.2-1123.1-తే.]

491} ఆచంద్రసూర్యము  - సూర్య చంద్రులున్నంత వరకు ఉండునది, ఎప్పటికి ఉండునది :-
[10.2-68.1-తే.]

492} ఆచక్రవాళాచలచక్రము  - అచల (పర్వతముల) చక్రము (గుంపుల) పర్యంతము కల చక్రవాళము (మండలము), భూమండలము :-
[10.2-400.1-తే.]

493} ఆచమనము  - మంత్రపూర్వకముగ అరచేత జలము తీసుకొనెడి వైదిక ధర్మము :-
[6-311-వ.]

494} ఆచారము  - ఆచరించవలెనని నియమింపబడిన విధానములు, 1విధి 2నిషేధములు అని ద్వి విధములు :-
[3-775-మ., 4-51.1-తే., 5.1-121-మ., 11-91-వ., 12-20-వ.]

495} ఆచ్చాదించి  - ఆపాదించి, లేనిది ఉన్నట్లు చెప్పు ఆరోపణ :-
[1-428-వ.]

496} ఆజానుబాహుడు  - ఆజాను (మోకాళ్ళ వరకు కల) బాహువు (చేతులు కలవాడు), సుందరుడు :-
[10.2-380.1-తే., 11-12.1-తే.]

497} ఆజ్ఞాచక్రము  - కనుబొమల మధ్య స్థానమున, భృకుటి వద్ద ఉండునది. (ఇది దేహమందు ఉండు ద్విదళాది పద్మాకారంలో షట్చక్రములలో ఒకటి. అవి, 1.మూలాధారం గుద స్థానంలో, 2. స్వాధిష్టానం మేహనం వద్ద, 3.మణిపూరం నాభి వద్ద, 4.అనాహతం హృదయాబ్జము వద్ద, 5.ఆజ్ఞాచక్రం నిటలం వద్ద, 6,సహస్రారం మూర్ధం వద్ద బ్రహ్మ రంధ్రం వద్ద) :-
[2-29.1-ఆ.]

498} ఆజ్యపులు  - పంచచత్వారింశత (49) అగ్నులలోని వారు, ఆజ్యము (నేతి)ని తాగు అగ్నులు.? :-
[4-34-వ.]

499} ఆఢ్యుడు  - లక్ష్మీదేవి యనే సంపద గలవాడు, సంపన్నుడు :-
[1-187-క., 2-277.1-తే., 2-279-మ., 3-212-చ., 3-315-మ., 3-364-చ.]

500} ఆతతాయి  - ఇంటికి నిప్పెట్టేవాడు, విషము పెట్టేవాడు, కత్తి పట్టుకొని నరికేవాడు, ధనము దోచుకొనే వాడు, నేల నపహరించువాడు, ఇతరుల భార్యను చెరపట్టేవాడు వీరు ఆరుగురుని ఆతతాయి అంటారు :-
[1-171-ఉ.]

501} ఆత్తచక్రుడు  - ఆత్త (పొందిన) చక్రుడు (చక్రము ఆయుధముగా కలవాడు), శ్రీకృష్ణుడు :-
[10.1-7-క.]

502} ఆత్మ - అతతితత్తద్వస్తురూపేణ వ్యాప్నోతీత్యాత్మా ఆతసాతత్యగమనే (వ్యుత్పత్తి), సర్వ వస్తు నామ రూపములతో మరియు అందు అంతట నిండి యున్నట్టిది, పరమాత్మ, విష్ణువు :-
[4-703.1-తే., 10.1-567.1-ఆ., 10.1-1236-దం.]

503} ఆత్మకుడు  - స్వరూపుడు :-
[10.2-1204.1-తే.]

504} ఆత్మజ  - ఆత్మ (తనకు) జ (పుట్టినది), కూతురు :-
[9-8.1-తే.]

505} ఆత్మజుడు  - ఆత్మ (తనకు) జుడు (పుట్టినవాడు), పుత్రుడు :-
[3-395.1-తే., 5.1-121-మ., 7-308-చ., 8-16.1-ఆ.]

506} ఆత్మజులు  - ఆత్మన్ (తనకు) పుట్టినవారు, సంతానము :-
[7-55-మ., 9-418-ఉ.]

507} ఆత్మద్వాదశలక్షణములు  - 1. శాశ్వతమైనది, 2. నాశనం లేనిది, 3. శుద్ధుడు, 4. క్షేత్రజ్ఞుడు, 5. గగనాదులకు ఆశ్రయుడు, 6. క్రియాశూన్యుడు, 7. స్వయంప్రకాశం, 8. సృష్టికి కారణం, 9. వ్యాపించు స్వభావం కలది, 10. సంగం లేనిది, 11. పరిపూర్ణమైనది, 12. ఏకలుడు :-
[7-237-వ.]

508} ఆత్మనాథుండు  - ఆత్మ (నాయొక్క) నాథుడు (ప్రభువు), విష్ణువు :-
[3-198.1-తే.]

509} ఆత్మభవులు  - తనకు పుట్టినవారు, పుత్రులు :-
[9-483-ఉ.]

510} ఆత్మమయుడు  - ఆత్మరూపమున నుండువాడు, విష్ణువు :-
[7-108-ఉ.]

511} ఆత్మవస్తుసంపన్నుఁడు  - ఆత్మ అనెడి వస్తువు యొక్క సమృద్ధి కలవాడవు, పరమాత్మ :-
[10.1-120-క.]

512} ఆత్మవిదులు  - పరమాత్మ విద్య తెలిసినవారు, ఆధ్యాత్మికవేత్తలు. జ్ఞానులు :-
[3-546.1-తే.]

513} ఆత్మశక్తిత్రయంబు  - ఆత్మయొక్క మూడుశక్తులు 1ఆజ్ఞాశక్తి 2 సంకల్పశక్తి 3మంత్రశక్తి :-
[6-217-వ.]

514} ఆత్మసంభవుడు  - ఆత్మలలో సంభవుడు (పుట్టువాడు), మన్మథుడు :-
[6-446.1-తే.]

515} ఆత్మారామత్వము  - తన యందు తానే క్రీడించుట కలిగి యుండుట :-
[10.1-683-వ.]

516} ఆత్మారాముడు  - ఆత్మ యందే రమించెడి వాడు :-
[10.1-1099-వ.]

517} ఆత్ముడు  - ఆత్మస్వరూపుడు, విష్ణువు :-
[9-170.1-తే.]

518} ఆత్ములు  - ఆత్మ కలవారు, జీవులు :-
[5.1-176-క.]

519} ఆత్మేశ్వరుడు  - ఆత్మ (తమయొక్క) ఈశ్వరుడు (దేవుడు), విష్ణువు. :-
[7-314-శా.]

520} ఆత్యంతికప్రళయము  - మోక్షము. జీవి పరమాత్మలో ఐక్యమగును కనుక దీని తరువాత జీవికి జననమరణాలుండవు :-
[12-24-వ.]

521} ఆదికవినన్నయ  - మహాభారతం ఆంధ్రీకరించిన కవిత్రయంలో ప్రథముడు :-
[6-11.1-తే.]

522} ఆదిత్యాదులు - 1. ఆదిత్యులు, వసువులు, రుద్రులను ముగ్గురు. (ఋగ్వేద సంహిత, డా. దాశరథి రంగాచార్య), 2. వేదంగజ్యోతిషకర్తలు :-
[2-38-వ.]

523} ఆదిత్యుడు  - అదితికి కశ్యపునివలన పుట్టినవాడు, సూర్యుడు :-
[12-45-వ.]

524} ఆదిత్యులు  - అదితి పుత్రులు, దేవతలు, ద్వాదశాదిత్యులు ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట, పూషుడు, అర్యముడు, భగుడు, వినస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు :-
[7-90-శా.]

525} ఆదిదేవుడు  - సృష్టికి పూర్వమునుండి స్వయంప్రకాశముతో ఉండువాడు, విష్ణువు :-
[5.2-74.1-తే., 10.2-1313-వ.]

526} ఆదిధరణివిభుడు  - మొట్టమొదటిరాజు, ఇంద్రియమూలములను నియమించువాడు, పృథుచక్రవర్తి :-
[4-460.1-తే.]

527} ఆదినారాయణుడు  - ఆది (సృష్టికి ముందు) నారములు (నీటి) యందు వసించెడివాడు, సూర్యుడు :-
[5.2-86-వ.]

528} ఆదిపురుషుడు  - సృష్టికి మొదటినుండి ఉన్న పురుషుడు (కారకుడు), విష్ణువు :-
[1-218-వ., 4-936-వ., 5.2-115-వ., 6-333.1-ఆ., 6-343-వ., 9-15-వ.]

529} ఆదిమధ్యాంతశూన్యుడు  - ఆది (పుట్టుక, మొదలు) మధ్య (బతుకు, నడుమ) అంత (చావు, చివర)లు లేనివాడు, విష్ణువు :-
[2-277.1-తే.]

530} ఆదిమధ్యాంతహీనుడు  - ఆది (పుట్టుక, మొదలు) మధ్య (బతుకు, నడుమ) అంత (చావు, చివర)లు లేనివాడు, విష్ణువు :-
[10.2-429.1-ఆ.]

531} ఆదిమపురుషుడు  - ఆదిమ (సృష్టికి మూలము యైన) పురుషుడు (పురుషోత్తముడు), విష్ణువు :-
[6-421-క.]

532} ఆదిమపూరుషుడు  - ఆదిమ (సృష్టికి మూలము యైన) పూరుషుడు (పురుషోత్తముడు), విష్ణువు :-
[6-216-ఉ.]

533} ఆదిమూర్తి  - సృష్టికి ఆదిన ఉన్నవాడు :-
[2-101-చ.]

534} ఆదివిష్ణుడు  - మూలాధారమైన సర్వవ్యాపకుడు, విష్ణువు :-
[10.1-343-ఆ.]

535} ఆద్యంతభావశూన్యుడు  - ఆది అంతములను భావములు లేనివాడు, భగవంతుడు :-
[2-217.1-తే.]

536} ఆద్యంతవికారదూరుడు  - అది (మొదలు) కాని అంతము (నాశనము) కాని వికార (మార్పులు) కాని దూరుడు (లేనివాడు), విష్ణువు :-
[2-236-మ.]

537} ఆద్యంతవికారశూన్యుఁడు  - అది (మొదలు) కాని అంతము (నాశనము) కాని వికార (మార్పులు) కాని శూన్యుడు (లేనివాడు), విష్ణువు :-
[3-599-ఉ.]

538} ఆద్యంతవిహీనుడు  - ఆది (పుట్టుక) అంతము (మరణము) లేనివాడు, విష్ణువు :-
[2-110-మ.]

539} ఆద్యంతశూన్యుడు  - ఆది (పుట్టుక) అంతము (మరణము) లేనివాడు, విష్ణువు :-
[3-99.1-తే., 3-293.1-తే., 3-861-క.]

540} ఆద్యుడు  - ఆది (మొదట) నుండి ఉన్నవాడు, విశ్వ సృష్టి స్థితి లయములకు మూలకారణుడు, విష్ణువు, శివుడు :-
[2-109-చ., 3-236-చ., 3-844-చ., 3-861-క., 4-105-శా., 4-298-చ., 7-3.1-ఆ., 7-217-వ., 10.1-567.1-ఆ., 10.1-819-శా.]

541} ఆధ్యాత్మ - ఆధ్యాత్మిక ఆత్మకు సంబంధించిన జ్ఞానము :-
[2-282-వ.]

542} ఆనందపరిపూర్ణుడు  - ఆనందమునకు పరిపూర్ణ రూపుడు, విష్ణువు :-
[3-145.1-తే.]

543} ఆనందమాత్రుడు  - ఆనందము తానే ఐన వాడు, విష్ణువు :-
[4-359.1-తే.]

544} ఆనకదుందుభి  - పుట్టినప్పుడు దివ్యమైన ఆనక (తప్పెట్లు) దుందుభి (భేరీలు) మోగిన వాడు, వసుదేవుడు :-
[3-104-క., 10.1-51-వ., 10.1-1505-క., 10.2-1123.1-తే.]

545} ఆనకదుందుభిభార్య  - వసుదేవుని భార్య, దేవకి :-
[10.2-1137.1-తే.]

546} ఆనర్తమండలము  - పశ్చిమ సముద్ర తీరమున ద్వారక సమీపమున గల దేశము, కృష్ణుని ద్వారక ఆనర్త మండలము లో ఉన్నది :-
[1-243-వ.]

547} ఆనర్తము  - పశ్చిమ సముద్ర తీరమున ద్వారక సమీపమున గల దేశము, కృష్ణుని ద్వారక ఆనర్త మండలము లో ఉన్నది :-
[10.1-1718-వ.]

548} ఆపగాతనూభవుడు  - ఆపగా (ఉదకముచే పోవునది, గంగకు) శంతనుని వలన పుట్టినవాడు, భీష్ముడు :-
[10.2-573-వ.]

549} ఆపన్నభక్తజనార్తివిఖండనుడు  - ఆపన్న (శరణువేడిన) భక్త (భక్తులైన) జన (వారి) ఆర్తిన్ (దుఃఖములను) విఖండనుడు (పూర్తిగా తొలగించెడివాడు), విష్ణువు :-
[8-483.1-తే.]

550} ఆపూర్ణుడు  - అంతట నిండియుండు వాడు, అఖండ స్వరూపుడు, విష్ణువు :-
[10.1-567.1-ఆ.]

551} ఆప్తకాములు  - పొందబడినకోరికలు కలవారు, నిరాశులు :-
[10.1-1077.1-ఆ.]

552} ఆప్తుడు  - సర్వహితుడు, విష్ణువు :-
[10.2-697.1-తే.]

553} ఆప్తోర్యామి  - దినమును యామములు గా విభజించి చేయు కర్మములు :-
[3-388-వ.]

554} ఆభిమన్యుడు - అభిమన్యుని పుత్రుడు, పరీక్షిత్తు :-
[10.2-1338-క.]

555} ఆయుర్వేదము  - ఆయువు (ప్రాణము, ఆరోగ్యము) నకు సంబంధించిన శాస్త్రము, వైద్యవిద్య :-
[3-388-వ.]

556} ఆయుర్వేదాదులు  - ఉపవేదములు ఋగ్వేదమునకు ఆయుర్వేదము, యజుర్వేదమునకు ధనుర్వేదము, సామవేదమునకు గాంధర్వము, అధర్వణవేదమునకు స్థాపత్య శస్త్ర వేదములు ఉపవేదములు :-
[2-222-వ.]

557} ఆర్తజనపోషణుడు  - ఆర్తి కల జనులను పోషించు (కాపాడు) వాడు, విష్ణువు :-
[3-588-ఉ.]

558} ఆర్తజనబాంధవుడు  - ఆర్తి (బాధలనుండి విముక్తికై ప్రాధేయపడుట) కల జనులకు బంధువు, విష్ణువు :-
[3-194-చ.]

559} ఆర్తపోషణుడు  - ఆర్తులను (దుఃఖమును పొందినవారిని) పోషణుడు (రక్షించువాడు), కృష్ణుడు :-
[5.2-167-మత్త.]

560} ఆర్తశరణ్యుడు  - ఆర్తులైనవారికి శరణు యిచ్చువాడు, విష్ణువు. :-
[7-334-క.]

561} ఆర్యామహాదేవి  - ఆర్య శ్రేష్ఠురాలు, పార్వతి, మహాదేవి పార్వతి :-
[10.1-1727-మ.]

562} ఆర్యావర్తము  - ఆర్యులు తిరిగెడి ప్రదేశము, వింధ్య హిమాచలముల మధ్యప్రదేశము :-
[5.1-64-వ., 9-156.1-తే.]

563} ఆలంగితధారుణి  - ఆలింగనము చేసికొన్న నేల కలామె, నేలపై పడిపోయినామె :-
[10.2-240-మ.]

564} ఆలవాలము  - మొక్క మొలచుటకు చేయు పాదు, పుట్టిల్లు, స్థానము :-
[3-203-దం.]

565} ఆలీఢము  - విలుకాడు కుడికాలు ముందరికి చాచి బాణములు వేయుటకైన నిలుకడ (మానము) :-
[10.2-180.1-ఆ.]

566} ఆలీఢాదులు  - పంచమానములు, 1ఆలీఢము 2ప్రత్యాలీఢము 3సమపదము 4విశాఖము 5మండలము అనెడి ఐదు విలుకాని పద విన్యాసములు :-
[10.2-180.1-ఆ.]

567} ఆవిర్ముఖుడు  - స్పష్టమైన ముఖము కలవాడు, చంద్రుడు :-
[4-853-వ.]

568} ఆవృతములు  - కప్పివేయునవి :-
[3-297-వ.]

569} ఆశువేగము  - ఆశుగము(వాయు) వేగము :-
[4-771.1-తే.]

570} ఆశ్రమధర్మములు  - 1బ్రహ్మచర్య 2గార్హస్త్య 3వానప్రస్థ 4సన్యాస అనెడి చతురాశ్రమముల ధర్మములు :-
[4-147.1-తే.]

571} ఆశ్రమము  - బ్రహ్మచర్యాది, మానవునికి బ్రహ్మచర్యాది వంటివే భగవంతునికి అనంత అవతారములు అనంత ఆశ్రమములు ? :-
[3-150-వ.]

572} ఆశ్రమములు  - చతురాశ్రమములు, 1 బ్రహ్మచర్య 2 గార్హస్థ 3 వానప్రస్థ 4 సన్యాస ఆశ్రమములు :-
[3-459-వ., 3-775-మ., 4-421-వ., 5.2-86-వ.]

573} ఆశ్రయము  - 1 అండ,ప్రాపు, 2. పుట్టుట నిలుచుట వృద్ధి పొందుట క్షీణుంచుట నశించుటలకు ఆధారముగ ఉండుట :-
[10.1-1472.1-తే.]

574} ఆశ్రితరక్షకుడు  - ఆశ్రయించినవారిని రక్షించువాడు, కృష్ణుడు :-
[3-146-మత్త.]

575} ఆశ్రితవరదుడు  - ఆశ్రయించినవారికి కోరికలు తీర్చు వాడు :-
[10.2-1032-ఆ.]

576} ఆశ్వినులు  - నాసత్యుడు, దస్రుడు అను పేర్లు కల అశ్వనీదేవతల పుత్రులు, దేవవైద్యులు :-
[2-86-వ.]

577} ఆసనము  - పద్మాసనాది, యోగక్రియాచరణాదులకై ప్రత్యేక ఆకారములలో అవయవములను ఉంచుకొనుస్థితి :-
[3-180.1-తే.]

578} ఆసురి  - (అసుర సంబంధ) రాక్షసపు లక్షణములు కలది :-
[4-768-వ.]

579} ఆస్కందితజానువర్తన  - మోకాళ్ళను సమముగా నేలమోపి నటించుట, రాసక్రీడా పారిభాషికపదము :-
[10.1-1084-వ.]

580} ఇంచువిలుకాడు  - ఇంచు (ఇక్షు, చెరకు) విలుకాడు (విల్లు కలవాడు), మన్మథుడు :-
[10.2-24-వ.]

581} ఇందిందిర  - వ్యు. పద్మసంపదలతో కూడి యుండునది, లక్ష్మీదేవి, తుమ్మెద, (విద్యార్థి కల్పతరువు) :-
[2-227.1-తే., 3-1047-వ., 8-42-మ., 8-447-వ., 9-603-క., 9-603-క., 10.1-597-వ., 10.1-1465-మ., 10.2-243-క., 10.2-495.1-తే., 10.2-1310.1-తే.]

582} ఇందిర  - లక్ష్మీదేవి, ఆమె అవతారం రుక్మిణి :-
[3-49-చ.]

583} ఇందిరాకామినీమణి  - ఇందిర (లక్ష్మీ) యనెడి కామినీ (స్త్రీలలో) మణివంటియామె, లక్ష్మీదేవి :-
[4-963.1-తే.]

584} ఇందిరాచిత్తచోరుడు  - ఇందిర (లక్ష్మీదేవి) చిత్తము (మనసు)ను చోరుడు (దొంగిలించినవాడు), విష్ణువు. :-
[3-423.1-తే., 3-573.1-తే., 4-203.1-తే.]

585} ఇందిరాధీశ్వరుడు  - ఇందిర (లక్ష్మీదేవి) అధీశ్వర (భర్త) అయినవాడు, విష్ణువు :-
[3-436-ఉ., 5.1-98.1-తే.]

586} ఇందిరానాథుడు  - ఇందిర (లక్ష్మీదేవి) నాథుడు (భర్త), లక్ష్మీపతి, విష్ణువు :-
[10.2-1137.1-తే.]

587} ఇందిరామనోహరుడు  - ఇందిర (లక్ష్మీదేవి) మనోహరుడు (భర్త), విష్ణువు :-
[3-508-చ.]

588} ఇందిరారమణుడు  - ఇందిర (లక్ష్మీదేవి)కి రమణుడు (మనోహరుడు), విష్ణువు :-
[6-188.1-ఆ.]

589} ఇందిరావరుడు  - ఇందిర (లక్ష్మీదేవి) వరుడు (భర్త), విష్ణువు :-
[3-629-చ., 3-761-చ., 4-917-చ.]

590} ఇందిరావిభుడు  - ఇందిర (లక్ష్మీదేవి) విభుడు (భర్త), విష్ణువు :-
[10.2-774-క.]

591} ఇందిరాసుందరీరమణుడు  - ఇందిరా (లక్ష్మీ) సుందరీ (దేవియొక్క) రమణుడు (భర్త), విష్ణుమూర్తి :-
[3-156-వ., 3-507-వ.]

592} ఇందిరేశుడు  - ఇందిర (లక్ష్మీదేవి) ఈశుడు (భర్త), విష్ణువు :-
[10.2-749-ఆ.]

593} ఇందీవరేక్షణ  - ఇందీవరము (నల్లకలువల వంటి) ఈక్షణ (కన్నులుగలామె), స్త్రీ :-
[4-794.1-తే., 10.1-1031.1-ఆ.]

594} ఇందుకళాధరుడు  - ఇందుకళ (చంద్రవంక) ధరించిన వాడు, శివుడు :-
[10.2-324-ఉ.]

595} ఇందుకులోద్భవుడు  - ఇందు (చంద్ర) కుల (వంశము) ఉద్భవుడు (పుట్టినవాడు), పరీక్షితుడు :-
[5.2-120-క.]

596} ఇందుజూటుడు  - ఇందు (చంద్రుని) జూటుడు (జటాజూటమున కలవాడు), శంకరుడు :-
[8-547-ఆ.]

597} ఇందుధరసుందరి  - ఇందుధరుని (శివుని) యొక్క సుందరి (భార్య), పార్వతి :-
[10.1-1743-వ., 10.1-1747-వ.]

598} ఇందునిభానన  - చంద్రుని వంటి మోము కలామె, చంద్రముఖి, అందగత్తె, స్త్రీ :-
[10.1-214-మాని., 10.1-1031.1-ఆ.]

599} ఇందుమకుటుడు  - చంద్రుడు తలపై ఉన్నవాడు, శివుడు :-
[10.2-1245-తే.]

600} ఇందుముఖి  - ఇందు (చంద్రుని) వంటి ముఖి (ముఖముగలామె), చంద్రవదన, స్త్రీ :-
[6-255.1-తే., 10.1-83-ఆ., 10.2-232.1-ఆ.]

601} ఇందుమౌళి  - ఇందు (చంద్రుడు)ని మౌళి (సిగ)లో కలవాడు, శివుడు :-
[4-152-చ.]

602} ఇందువదన  - ఇందు (చంద్రుని) వంటి వదన (ముఖముగలామె), స్త్రీ :-
[10.2-177.1-తే., 10.2-804-వ.]

603} ఇంద్రతనూభవుడు  - ఇంద్రుని కొడుకు, అర్జునుడు :-
[10.2-728-ఉ.]

604} ఇంద్రమానిని  - ఇంద్రుని భార్య, శచీదేవి :-
[9-509-క.]

605} ఇంద్రసభామండపము  - సుధర్మామండపము :-
[1-350.1-తే.]

606} ఇంద్రసూనుడు  - ఇంద్రుని పుత్రుడు, అర్జునుడు :-
[1-346-క.]

607} ఇంద్రస్పృక్  - ఇంద్రుడు రక్షించెడి ప్రదేశము :-
[5.1-64-వ.]

608} ఇంద్రాదివంద్యుడు  - ఇంద్రుడు మొదలగు వారిచే నమస్కరింపబడువాడు, విష్ణువు :-
[3-203-దం.]

609} ఇంద్రారి  - ఇంద్రుని అరి (శత్రువు), వృత్రుడు :-
[6-432-ఆ.]

610} ఇంద్రావరజుడు  - ఇంద్రుని యొక్క తమ్ముడు, విష్ణువు :-
[5.2-12-క.]

611} ఇంద్రియప్రపంచము  - పంచేంద్రియములు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అను ఇంద్రియములు :-
[2-259-తే.]

612} ఇంద్రియములు ఆరు  - మనసు, పంచేంద్రియాలు కలిసి 6 :-
[1-69-మ., 1-329-వ., 4-626-వ.]

613} ఇంద్రియవిషయములు  - శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు :-
[2-12-వ.]

614} ఇంద్రియషట్కము  - 1శ్రోత్రము 2త్వక్కు 3చక్షుః 4జిహ్వ 5ఘాణము వీనిచేరికగల 6మనస్సు :-
[10.1-1664-వ.]

615} ఇంద్రియసంగ్రహము  - పంచేంద్రియములు (1కళ్ళు 2ముక్కు 3చెవులు 4నాలిక 5చర్మము) మరియు 6మనస్సు :-
[4-849-వ.]

616} ఇంద్రియసంచారములు  - వినుట చూచుట మొదలైనవి, ఇంద్రియ విషయములు :-
[10.1-1650-వ.]

617} ఇంద్రియాదులు  - ఇంద్రియములు మనసు దేహము :-
[6-416-వ.]

618} ఇంద్రియేశుడు  - ఇంద్రియములకు ప్రభువు, జీవుడు :-
[4-602-తే.]

619} ఇంద్రుడు  - ఇంద్రియములకు అధిపతి, దేవేంద్రుడు, అదితి సంతానము పన్నెండుగురులో ఒకడు :-
[5.1-74.1-తే.]

620} ఇక్షుచాపుడు  - చెఱుకు విల్లు వాడు, మన్మథుడు :-
[3-288-వ.]

621} ఇక్ష్వాకుడు  - సూర్య వంశపు మహారాజు, శ్రీరాముని పూర్వీకుడు :-
[2-204.1-తే.]

622} ఇజ్య  - ప్రయోజనము బట్టి యజ్ఞము చేయవలసిన క్రమము, పూజా విధానము :-
[3-388-వ.]

623} ఇడస్పతి  - విష్ణువు, సూర్యుడు (ఆంధ్రశబ్ధార్థచంద్రిక) :-
[4-6-వ.]

624} ఇతరవస్త్వంతరాపరిచ్ఛిన్నుండు  - ఇతరమైన వస్తువులుగా అపరిచ్ఛిన్నుడు (విడదీసి తెలిసికొనలేని వాడు), విష్ణువు :-
[3-874-వ.]

625} ఇతరసంకల్పార్థము  - సరికాని ఆలోచనలవలన కలిగినది, అసత్యము, చిత్తభ్రమ :-
[10.1-342-మ.]

626} ఇతిహాసము  - (ఇతి+హా+ఆసీత్) ఇది ఈ విధముగా జరిగినది, పూర్వరాజుల చరిత్రము గలది, భారతము మొదలగునవి :-
[1-73.1-ఆ., 2-222-వ., 3-388-వ., 8-629.1-తే.]

627} ఇదమిత్థము  - ఇదమ్ (ఇది) ఇత్థము (ఇట్లు) అని తెలియుట, విశదముగా తెలియుట :-
[10.2-1148-మ.]

628} ఇద్దమూర్తి  - పరిశుద్ధస్వరూపుడు :-
[3-99.1-తే.]

629} ఇద్ధచరితుడు  - ఇద్ధ (ప్రసిద్ధిచెందిన) చరిత (నడవడిక) కలవాడు, విష్ణువు. :-
[3-724-తే.]

630} ఇద్ధమనోరథహేతుభూతోదారగుణనాముడు.  - ఇద్ధ (ప్రసిద్ధమైన) మనోరథ (శ్రేయస్సులకు)హేతుభూత (కారణమైన) ఉదార (ప్రసాదించెడి) గుణ (సుగుణములకు)నాముడు (పేరుబడ్డవాడు), విష్ణువు :-
[4-918.1-తే.]

631} ఇద్ధరూపి  - ప్రసిద్ధమైన రూపములు కలవాడు. సర్వాధిష్ఠానమైనవాడు :-
[8-78.1-ఆ.]

632} ఇద్ధసనందాదిసిద్ధసంసేవితుడు  - ఇద్ధ (ప్రసిద్ధులైన) సనంద (సనందుడు) ఆది (మొదలైన) సిద్ధ (సిద్ధులచే) సంసేవితుడు (చక్కగా సేవించబడుతున్నవాడు), శివుడు :-
[4-138.1-తే.]

633} ఇధ్మవాహకుడు  - ఇధ్మము (సమిధ)లను వాహకుడు (మోసెడివాడు), సమిత్పాణి :-
[4-831-క.]

634} ఇధ్ముడు  - సమిధలు కలవాడు :-
[4-6-వ.]

635} ఇనతనయుడు  - ఇన(సూర్యుని) తనయుడు(పుత్రుడు), కర్ణుడు :-
[3-34-క.]

636} ఇపుడు+కైకొని  - ఇపుడుఁగైకొని, గసడదవాదేశ సంధి :-
[10.2-1236-క.]

637} ఇభకులోత్తమయాన  - ఏనుగులన్నిటికన్న ఉత్తమమైన నడక కలామె, స్త్రీ :-
[10.1-1031.1-ఆ.]

638} ఇభజిద్వీర్యుడు  - ఏనుగును జయించు సింహమువంటి పరాక్రమము కలవాడు :-
[1-363-మ.]

639} ఇభదైత్యారాతి  - ఇభ (గజ) దైత్య (అసురుని) సంహరించినవాడు, శంకరుడు :-
[4-105-శా.]

640} ఇభలోకేంద్రుడు  - ఇభ (ఏనుగుల) లోక (సమూహమునకు) ఇంద్రుడు (పతి), గజేంద్రుడు :-
[8-47-మ.]

641} ఇరుసు  - చక్రము తిరుగనాధార మైన గుండ్రటి కమ్మి :-
[10.1-251-క.]

642} ఇలబిల  - భూరంధ్రము, తృణబిందువునకు అలంబసయందు పుట్టిన కూఁతురు. మగఁడు విశ్రవసుఁడు. కొడుకు కుబేరుఁడు. :-
[4-26-వ.]

643} ఇలాతనూజ  - భూమియందు జనించినామె, సీత :-
[9-270-ఉ.]

644} ఇలావర్తము  - గో భూమి :-
[5.1-64-వ.]

645} ఇలావృతము  - ఇల (భూమి)చేత ఆవృతము (చుట్టబడినది), సముద్రము ఏసరిహద్దున లేనిది :-
[5.2-17-వ.]

646} ఇలేశుడు  - ఇల (రాజ్యము)నకు ఈశుడు (ప్రభువు), రాజు. :-
[7-462-క., 10.1-649-క., 10.1-711-క., 10.1-895-క., 10.1-1023-క., 10.1-1413-క.]

647} ఇల్లాలు  - ఇల్లు నందు యుండెడి ఆలు, భార్య :-
[6-136-క., 8-461.1-ఆ.]

648} ఇషుడు  - ఇషువు (బాణము) కలవాడు :-
[4-390-వ.]

649} ఇష్టఫలప్రదుడు  - ఇష్ట (కోరినకోరికలు) ఫల (తీరుటను) ప్రదుడు (కలిగించువాడు), విష్ణువు :-
[6-438-చ.]

650} ఇష్టము  - అగ్నిహోత్రాదికర్మము :-
[2-222-వ.]

651} ఇష్టాపూర్తములు  - పంచమహాయిష్టులు షడ్విధపూర్తములు ఆచరించుట, ఇష్టము అగ్నిహోత్రాది కర్మము, పూర్తము వాపీకూప తటాకారామ దేవాలయ నిర్మాణం, దానములు4. :-
[10.2-465-వ.]

652} ఇష్టి  - కోరికల సాదనకై చేయు యజ్ఞములు :-
[4-34-వ.]

653} ఇష్టుడు  - ఇష్టమైనవాడు, విష్ణువు :-
[3-523-చ.]

654} ఈశ  - ఈశ్వరుడు, విష్ణువు :-
[3-203-దం., 3-569-తే., 3-580-తే.]

655} ఈశాన  - రుద్రకోటిక్షేత్రమున ఈశాన (ఐశ్వర్యములు కలామె) :-
[10.1-61-వ.]

656} ఈశానుడు  - ఈశాన్యదిక్కునకు అధిపతి, పరమ శివుడు :-
[10.1-104-వ.]

657} ఈశుడు  - నైజముచేతనే ఐశ్వర్యములు గలవాడు, ప్రభువు, శివుడు, విష్ణువు, భగవంతుడు :-
[2-98-క., 3-184-వ., 3-212-చ., 3-213-వ., 3-362.1-తే., 3-436-ఉ., 3-844-చ., 3-1019-మ., 3-1024-క., 4-62-క., 4-131.1-తే., 4-298-చ., 4-701-వ., 4-917-చ., 6-414.1-తే., 7-274-మ., 10.1-4-క., 10.1-95-క., 10.1-121-ఆ., 10.1-123.1-ఆ., 10.1-245-క., 10.1-553.1-ఆ., 10.1-563-క., 10.1-684-క., 10.1-954.1-తే., 10.1-1182-శా.]

658} ఈశ్వరుడు  - సర్వనియామకుడు, స్వభావము చేతనే ఈశత్వము కలవాడు, పంచకృత్యములను (1సృష్టి 2స్థితి 3లయ 4తిరోధాన 5అనుగ్రహములు) చేయుటకు కర్తృత్వము కలవాడు, విష్ణువు, శివుడు, భగవంతుడు :-
[1-213-ఆ., 2-109-చ., 2-207-క., 2-226-వ., 2-269-వ., 2-272.1-ఆ., 3-72-మ., 3-200-క., 3-313-చ., 3-434-చ., 3-524-వ., 3-545-చ., 3-571-చ., 3-991.1-తే., 3-1025-వ., 4-54-వ., 4-130-క., 4-347.1-తే., 4-358.1-తే., 7-217-వ., 7-239-వ., 7-359-ఉ., 7-447-ఆ., 10.1-412-వ., 10.1-549-మ., 10.1-569-శా., 10.1-960-వ., 10.1-1180.1-ఆ., 10.2-102-క., 10.2-219-చ., 10.2-529-క., 11-77-వ.]

659} ఈశ్వరేశుడు  - ఈశ్వరుల (సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను నియమించెడి బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివాదుల)కు ఈశుడు (నియామకుడు), విష్ణువు, భగవంతుడు. :-
[10.1-566-ఆ.]

660} ఈశ్వరేశ్వరుడు  - ఈశ్వరుల (సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను నియమించెడి బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివాదుల)కు ఈశ్వరుడు (నియామకుడు), విష్ణువు, భగవంతుడు. :-
[3-523-చ., 4-367.1-తే.]

661} ఈషణత్రయము  - 1దారేషణ 2ధనేషణ 3 పుత్రేషణలు అనెడి ఆత్రములు, 1. దారేషణ దార (భార్య) యందు ఈషణ (త్వర, ఇచ్చ), 2. ధనేషణ ధన (సంపద) యందు ఈషణ (త్వర, ఇచ్చ). 3. పుత్రేషణ పుత్ర (సంతానము) యందు ఈషణ (త్వర, ఇచ్చ) :-
[4-618-వ., 11-41-వ., 11-91-వ.]

662} ఉంకువ  - తమకన్యను భార్యగా ఇస్తున్నందుకు అల్లుడు మామ కిచ్చెడి ద్రవ్యము, శుల్కము, కన్యాశుల్కము :-
[10.1-1708-ఉ.]

663} ఉగ్రపరేతభూమివాసుడు  - ఉగ్ర (భయంకరమైన) పరేత (శ్మశాన) భూమి యందు వాసుడు (వసించువాడు), శివుడు :-
[3-467.1-తే.]

664} ఉగ్రము - ఉగ్రతరము ఉగ్రతమము :-
[4-788-చ., 10.1-1563-లవి., 10.2-21-క.]

665} ఉగ్రసేనుడు  - కృష్ణుని తాత, కంసుని తండ్రి :-
[3-52-క., 3-99.1-తే.]

666} ఉగ్రాక్షుడు  - ఉగ్రమైన కన్నులు కలవాడు, శివుడు :-
[10.1-1761-వ.]

667} ఉగ్రుడు  - భయంకరుడు, శంకరుడు :-
[4-105-శా.]

668} ఉచథ్యుడు  - స్తుతింపదగినదివాడు, అంగిరా శ్రద్ధాభ్యాం జాతః బృహస్పతే రగ్రజః] అంగిరస ముని, శ్రద్ధల యొక్క కుమారుడు. బృహస్పతి అన్న, ఉతథ్యుడు. :-
[4-26-వ.]

669} ఉచ్ఛైశ్రవము  - ఇంద్రుని వాహనము, సాగరమథనంలో పుట్టిన తెల్లని గుఱ్ఱము :-
[12-48-వ.]

670} ఉజ్జ్వలతులసీకురంగమదవాసనవాసితదివ్యదేహుడు - ఉజ్జ్వలమైన తులసి యొక్క కురంగ మదము (కస్తూరి యొక్క) సువాసనలచే వాసిత (పరిమళించుతున్న) దివ్య (భవ్యమైన) దేహుడు (శరీరముగలవాడు), కృష్ణుడు :-
[5.2-165-చ.]

671} ఉజ్జ్వలపంకేరుహపత్రలోచనుడు  - ప్రకాశవంతమైన పద్మదళాలవంటి కన్నులు గలవాడు, విష్ణువు :-
[12-36-మ.]

672} ఉజ్జ్వలము - ఉజ్జ్వలతరము ఉజ్జ్వలతమము :-
[6-318.1-తే.]

673} ఉట్టి  - పాలు పెరుగు లాంటివి పిల్లులకు అందకుండుటకై పైన వేళ్ళాడదీసెడి తాళ్ళతో చేసిన సాధనము :-
[10.1-310-మత్త., 10.1-361-ఆ.]

674} ఉడురాజబింబముఖి  - ఉడురాజు (నక్షత్రములరాజు, చంద్రుని) బింబము వంటి ముఖము కల స్త్రీ :-
[10.2-674.1-తే.]

675} ఉడువీథి  - నక్షత్రములు తిరిగెడి ప్రదేశము, ఆకాశము :-
[10.2-941-ఉ.]

676} ఉత్కంఠము  - నేర్చుకొనుటాది యందలి వేగిరపాటు :-
[9-624-క.]

677} ఉత్కలిక  - ఉత్ కలిక అతిశయించుట, ఉత్కంఠ, తహతహ. :-
[2-151-చ.]

678} ఉత్కళ  - ఉత్కల, నిర్వహకురాలు, ధురీణురాలు :-
[5.2-10-వ.]

679} ఉత్తమచరితుడు  - ఉత్తమమైన నడవడిక కలవాడు, యముడు. :-
[10.1-1428-క.]

680} ఉత్తమశ్లోకచరితుడు  - మంచిగా కీర్తింపబడు వర్తన కలవాడు, విష్ణువు :-
[3-225-తే.]

681} ఉత్తమశ్లోకుడు  - ఉత్తములచేత శ్లోకుండు (స్తుతింపబడువాడు), విష్ణువు :-
[1-241.1-తే., 2-7.1-ఆ., 3-202-వ., 4-371-వ., 4-445.1-తే., 5.1-4-వ.]

682} ఉత్తమాంగము  - ఉత్తమమైన అంగము (అవయవము), తల :-
[3-395.1-తే.]

683} ఉత్తముడు  - మంచివాడు :-
[4-219.1-తే.]

684} ఉత్తర  - అభిమన్యుని భార్య, పరీక్షిన్మహారాజు తల్లి, విరాటరాజు కూతురు :-
[3-130-వ.]

685} ఉత్తరకర్మలు  - మరణము తరువాత చేసెడి క్రియలు :-
[6-467-వ.]

686} ఉత్తరకొడుకు  - ఉత్తర యొక్క పుత్రుడు, పరీక్షిత్తు :-
[6-194-క.]

687} ఉత్తరాత్ముజుడు  - ఉత్తర యొక్క ఆత్మజుడు, పరీక్షిత్తు :-
[5.2-3-క.]

688} ఉత్తరానందనుడు  - ఉత్తర యొక్క కొడుకు, పరీక్షిత్తు :-
[1-516-వ., 4-968-వ.]

689} ఉత్తానపాదుడు  - స్వాయంభువమనువు రెండవ పుత్రుడు, ఉత్తాన (ఎత్తిన) పాదుడు (పాదము గలవాడు), ముందుకు సాగుట మొదలు పెట్టినవాడు :-
[4-217-తే.]

690} ఉత్పాతము  - దుఃఖరోగప్రదములు, 1దివ్యము (అపూర్వ గ్రహ నక్షత్రములు పుట్టుట) 2అంతరిక్షము (పరివేషము ఇంద్రధనుస్సును కలుగుట కొఱవియు పిడుగును పడుట) 3భౌమము (అపూర్వములైన చరాచర వస్తువులు కలుగుట) :-
[10.2-95-వ.]

691} ఉత్సృష్టము  - సృష్ట (పుట్టించుటకు) ఉత్ (వ్యతిరేకమైనది), వ్యు. సృజ విసర్గే ఉత్‌ + సృజ్‌ + క్త. (కృ.ప్ర.), విడువబడినది :-
[5.1-120-వ.]

692} ఉదంకుడు  - పరమ భాగవతుడు, పైల మహర్షి శిష్యుడు, చాలాకాలము తక్షకునిపై పగబట్టిన వాడు, జనమేజయునిచే సర్పయాగము చేయించెను :-
[2-204.1-తే.]

693} ఉదయాద్రి  - పొద్దుపొడుచు కొండ, తూర్పు దిగంతము నందలి పర్వతము, పురోగమనమునకు ప్రతీకాత్మకము :-
[4-460.1-తే.]

694} ఉదవసానము  - తొలగించుట, విడుచుట, ఉత్ (నీరు) తో అవసానము (పూర్తి అగునప్పుడు చేయునట్టిది), ఉద్వాసనము :-
[4-210.1-తే.]

695} ఉదాత్తతేజోనిధి  - గొప్పతేజస్సునకు నిధివంటివాడు, విష్ణువు :-
[3-544-వ.]

696} ఉదాత్తమానసుడు  - గొప్ప మనస్సు కలవాడు, శుకుడు :-
[10.1-1104-మత్త.]

697} ఉదారము - ఉదారతరము ఉదారతమము :-
[3-940-తే.]

698} ఉదారయశోనిధి  - ఉదార (అధికమైన) యశః (కీర్తి)కి నిధి సముద్రము వంటివాడు, విష్ణువు :-
[10.2-81-ఉ.]

699} ఉదారి  - ఉదారమైన స్వభావము కలవాడు, విష్ణువు :-
[3-335-ఉ.]

700} ఉదాసీనుడు  - దేని యందును జోక్యము చేసికొననివాడు, తగులము లేనివాడు, విష్ణువు :-
[3-874-వ.]

701} ఉదితవిద్యాతపోయోగయుక్తుడు  - ఉద్భవించిన విద్యలు తపస్సు యోగములుతో కూడినవాడు, శివుడు :-
[4-138.1-తే.]

702} ఉద్గాత  - యజ్ఞములందు సామవేదగానములను నడపువాడు :-
[8-536.1-తే.]

703} ఉద్దాముడు  - స్వతంత్రుడు, అడ్డపాటులేనివాఁడు, విష్ణువు :-
[12-1-క.]

704} ఉద్ధము - ఉద్ధతరము ఉద్ధతమము :-
[6-317-మ.]

705} ఉద్ధవుడు  - కృష్ణునికి తండ్రి వరుసైన వాడు, కృష్ణభక్తి పరుడు, శ్రీ కృష్ణునకు పరమాప్తుఁడగు యాదవుఁడు., బృహస్పతి శిష్యుఁడు. వసుదేవుని తమ్ముఁడైన దేవభాగుని కొడుకు. :-
[2-204.1-తే.]

706} ఉన్నతి  - అభివృద్ధి, ఔన్నత్యము, పొడువు :-
[4-28-వ.]

707} ఉన్మూలనముచేయుట  - మూలాల నుండి నాశనము చేయుట :-
[12-45-వ.]

708} ఉపదేశము  - సాధికారముగ అనువర్తనకు నేర్పుట, హితవచనము, మంత్రాదులుపదేశించుట :-
[5.2-53.1-ఆ., 8-517-వ.]

709} ఉపదేశించు  - సాధికారముగ అనువర్తనకు నేర్పుట, మంత్రాదులుపదేశించుట :-
[9-78-వ.]

710} ఉపద్రష్ట  - (సర్వ)సాక్షి, విష్ణువు, వ్యు. దృశిర్‌ ప్రేక్షణే ఉప + దృశ్‌ (ష్‌) తృచ్‌. (కృ.ప్ర.), దగ్గఱనుండి కనిపెట్టువాడు. :-
[3-198.1-తే.]

711} ఉపపన్నసకలశక్తియుతుడు  - ఉపపన్న (ఎదుట సిద్ధమైన) సకల (సమస్తమైన) శక్తులు కలవాడు, విష్ణువు :-
[4-359.1-తే.]

712} ఉపవనము  - దేవాలయాదులకు భవనములకు సంబంధించిన వనము లేదా తోట, ఆరామము :-
[3-37.1-తే.]

713} ఉపవాసములు  - భక్తితో, నిష్ఠతో ఆహారమును నియమించుటలు :-
[2-214-మ.]

714} ఉపవేదములు  - 1 ఆయుర్వేదము 2 ధనుర్వేదము 3 గాంధర్వము 4 స్థాపత్యము :-
[3-388-వ.]

715} ఉపాఖ్యానము  - 1. ఇతిహాసము, జరిగినదానికి సంబంధించిన కథనము, 2. కథలోని కథ. . :-
[3-1051-వ., 4-384-వ.]

716} ఉపాథేయము  - ఉపాథి (జీవనమునకు ఆధారమైన) భూతము (సాధనము) :-
[3-468-క.]

717} ఉపాదానకారణము  - కుండకు మట్టి బట్టకు దారము ఉపాదానకారణములు :-
[7-360-వ.]

718} ఉపాధిత్రయము  - స్థూల సూక్ష్మ కారణోపాధులు :-
[10.1-567.1-ఆ.]

719} ఉపాధులు  - 1సమిష్ట వ్యష్టి స్థూల సూక్ష్మ కారణదేహములు 2జాగ్రత్త స్వప్న సుషుప్తి అనెడి మూడవస్థలు 3విశ్వ తైజస ప్రాజ్ఞ విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత నామములు మొదలైన వ్యాపారములు :-
[10.1-1504.1-ఆ.]

720} ఉపాధ్యాయుడు  - వేదమును చదివించువాడు :-
[4-557.1-తే.]

721} ఉపాయనము  - కానుక, సాధనకి ఉపయోగించునది. :-
[4-460.1-తే.]

722} ఉపేంద్రుడు  - ఇంద్రుని తమ్ముడు, ఆదిత్యుడైన విష్ణుమూర్తి, వామనుడు :-
[2-86-వ., 8-681-వ., 10.1-236-వ., 10.2-408-శా., 10.2-728-ఉ., 10.2-822.1-తే.]

723} ఉభయమలములు  - స్థూలమలము (నిరుపయోగ ఆహార భాగములు) సూక్ష్మమలము (యోగసాధనలో విడిచే మలము) :-
[2-269-వ.]

724} ఉభయలోకములు  - ఇహలోక పరలోకములు :-
[12-45-వ.]

725} ఉమ  - అనత్యీత్యుమా అవసంరక్షణే (వ్యుత్పత్తి), రక్షించునామె, పార్వతి :-
[8-249-క., 10.1-1744-ఉ., 12-39-వ.]

726} ఉమానాయకుడు  - ఉమ (పార్వతీదేవి) యొక్క నాయకుడు (భర్త), శివుడు. :-
[10.2-322-మ.]

727} ఉమేశుడు  - పార్వతీదేవి భర్త, శివుడు :-
[10.2-352-మ., 10.2-832-క.]

728} ఉరగపతి  - ఉరగము (పాముల)కు పతి, ఆదిశేషుడు :-
[3-323-క.]

729} ఉరగము  - ఉర (రొమ్ము)చే గము (గమనము గలవి), పాము :-
[6-193-క., 6-385-లగ్రా.]

730} ఉరగాదిఫుడు  - ఉరగముల (సర్పముల)కు అధిపతి, ఆదిశేషుడు :-
[12-6-క.]

731} ఉరగాలయము  - ఉరగ (పాముల) ఆలయము (నివాసము), పాతాళము :-
[9-162-చ.]

732} ఉరుక్రముడు  - మిక్కిలి ఆక్రమించిన వాడు, నాభి మేరుదేవిల యందు సంభంవించిన విష్ణుమూర్తి అవతారము. అదితి కశ్యపుల సంతానమైన ద్వాదశాదిత్యులలో పన్నెండవ వాడు, వామనుడు, విష్ణువు :-
[3-204.1-తే., 4-628-చ., 6-507-వ., 7-357.1-తే., 11-77-వ.]

733} ఉరుగాయుడు  - ఉరు (పెద్ద) కాయుడు (దేహము కలవాడు), త్రేతయుగంలో ఉరుగాయుడు అను మహావిజ్ఞానులుచే నుతింపబడు వాడు, విష్ణువు :-
[11-77-వ.]

734} ఉరువిక్రముడు  - ఉరు (అత్యధికమైన) పరాక్రమము కలవాడు, విష్ణువు :-
[3-1022-చ.]

735} ఉరువు - ఉరుతరము ఉరుతమము :-
[9-599.1-తే.]

736} ఉరోభాగకౌస్తుభప్రియమణి  - ఉరోభాగ (వక్షస్థలమున) కౌస్తుభ (కౌస్తుభమనెడి) ప్రియ (ఇష్టమైన) మణి (మణి గలవాడు), విష్ణువు :-
[6-34-క.]

737} ఉర్వరాధిపుడు  - ఉర్వర (భూమికి) అధిపుడు (ప్రభువు), రాజు :-
[9-351-మత్త.]

738} ఉర్వీజము  - ఉర్వి (భూమి యందు) జములు (పుట్టునవి), వృక్షములు :-
[10.1-851-మ.]

739} ఉర్వీనాథుడు  - ఉర్వి (భూమికి) నాథుడు (ప్రభువు), రాజు. :-
[8-118-క., 10.1-456-క., 10.1-801-క.]

740} ఉర్వీభృత్  - భూమిని భరించువాడు, విష్ణువు :-
[3-290-మ.]

741} ఉర్వీరమణుడు  - భూమికి భర్త, విష్ణువు. :-
[11-104-క.]

742} ఉర్వీరుహము  - ఉర్వి (భూమి)యందు పుట్టునది, చెట్టు :-
[9-333.1-ఆ.]

743} ఉర్వీవరుడు  - ఉర్వి (భూమి)కి వరుడు, రాజు :-
[4-529-క.]

744} ఉర్వీవిభుడు  - ఉర్వీ (భూమికి) ప్రభువు, రాజు :-
[9-203-శా.]

745} ఉర్వీశుడు  - ఉర్వి (భూమి)కి ఈశుడు, రాజు :-
[9-237.1-తే., 9-262-మ.]

746} ఉర్వీశులు - భూమి పతులు, రాజులు :-
[1-64-మ.]

747} ఉర్వీశ్వరుడు  - ఉర్వి (భూమి)కి ఈశ్వరుడు (ప్రభువు), రాజు. :-
[7-102-శా., 10.1-1109-మ.]

748} ఉల్కు  - ఆకాశముననుండి పడెడి తేజః పుంజము :-
[6-405-శా.]

749} ఉల్బణుడు  - ఉబ్బిన వాడు, అతిశయించినవాడు, వసిష్ఠునికి ఊర్జ అనే భార్యవల్ల కలిగిన ఏడుగురు ఋషులలో ఒకడు. :-
[4-26-వ.]

750} ఉల్ముకము  - మండుతున్న కొఱవి :-
[4-390-వ.]

751} ఉల్లసద్విభవనేత  - ఉల్లసత్ (వికాసవంత మైన) విభవ (వైభవములు గల) నేత (ప్రభువు), బ్రహ్మ :-
[6-278-ఉ.]

752} ఉశన  - కోరిక, ఉశనస్ స్మృతి, భార్గవునికి ఉశన అనే భార్యవల్ల కవి జన్మించాడు. ఈయనే శుక్రుడు. :-
[4-26-వ.]

753} ఉశీనరదేశము  - గాంధార దేశము, ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ :-
[7-40-వ.]

754} ఉష్ణకరుడు  - వేడిమి (ఎండ)ను కలిగించెడి వాడు, సూర్యుడు :-
[10.2-311-తే.]

755} ఉష్ణమరీచి  - వేడిగల మరీచి (వెలుగులు కలవాడు), సూర్యుడు :-
[10.2-821-వ.]

756} ఉష్ణాంశుడు  - ఉష్ణము కల అంశ కలవాడు, సూర్యుడు :-
[10.2-137-శా.]

757} ఊక  - ధాన్యాదులపై పొట్టు లేక పొల్లు. చిట్టు తవుడు కలిసిన సన్ననూక, తవుడు అంటే ధాన్యము మరపట్టినప్పుడు వచ్చు మెత్తని పొడి. వీనిని కుడితిలో కలిపి పశువులకు ఆహారంగా ఇస్తారు. :-
[5.1-129-వ.]

758} ఊతులు  - కర్మమముల వాసనలు (దూర ప్రభావములు) భవిష్య ప్రాప్తంబులకు ఊతములైనవి కనుక ఊతులు :-
[2-262-క.]

759} ఊర్జ  - కార్తీకమాసము, పూనిక; బలము; ఊపిరి వెలికిఁబుచ్చుట, కర్దముని కూతురు, వసిష్ఠుని భార్య. వీరి పుత్రులు ఏడుగురు ఋషులు. :-
[4-26-వ.]

760} ఊర్జితపుణ్యుడు  - ఊర్జిత (వృద్ధి పొందిన, పోగు పడిన) పుణ్యుడు, విఘ్నేశ్వరుడు :-
[6-4-ఉ.]

761} ఊర్జుడు  - ఊర్జ (పూనిక, ఉత్సాహము) కలవాడు, ధ్రువుని మనుమడు, వత్సరుడు భార్య సర్వర్థి ల కుమారుడు. :-
[4-390-వ.]

762} ఊర్ణ  - అల్లిక, సాలెగూడు, కనుబొమల ముడి యందలి సుడి, గయుని కొడుకైన చిత్రరథుని భార్య ఊర్ణ. వారి కొడుకు సమ్రాట్టు. :-
[5.2-10-వ.]

763} ఊర్ణనాభి  - బొడ్డున అరటినార వంటి దారము కలది, సాలెపురుగు :-
[11-99-వ.]

764} ఊర్ధ్వకటాహము  - బ్రహ్మాండము యొక్క పై కప్పు :-
[5.2-32-వ.]

765} ఊర్ధ్వరేతస్కుడు  - ఊర్ధ్వ (పైకి ప్రసరించెడి) రేతస్కులు (రేతస్సు గలవారు), బ్రహ్మచారులు, సనకాదులు :-
[3-367-వ., 4-648.1-తే., 5.1-16-వ., 5.1-54-వ., 9-40.1-తే.]

766} ఊర్మిషట్కములు  - 1ఆకలి 2దప్పిక 3శోకము 4మోహము 5ముసలితనము 6మరణము అను ఆరు కలతలు, ఊర్మి అంటే నొప్పి, బాధ. :-
[3-893.1-తే.]

767} ఊష్మములు  - శ ష స హలు :-
[12-30-వ.]

768} ఊసరవెల్లి  - మూడువన్నెలుగల తొండ, బింబకము. ముదిరిన తొండ, తొండజాతి తొండకన్న పెద్దది ఐన జంతువు, ఇది రంగులు మార్చుకొనును అని ప్రతీతి, :-
[10.2-454.1-తే.]

769} ఋక్కులు  - ఋగ్వేదము నందలి స్తోత్ర మంత్రములు :-
[3-760-చ., 12-30-వ.]

770} ఋణత్రయము  - 1దేవఋణము 2పితృఋణము 3ఋషిఋణము :-
[3-856.1-తే., 10.1-1392.1-తే., 10.2-1125-క.]

771} ఋణము  - చేసిన మేలుకు ఇంకా తీర్చని ప్రతిఫలము :-
[10.2-1004-చ.]

772} ఋతము  - శాశ్వతముగా నిలిచే సత్యము :-
[8-624-వ.]

773} ఋతువులు  - వసంతాది 1వసంతఋతువు 2గ్రీష్మఋతువు 3వర్షఋతువు 4శరదృతువు 5హేమంతఋతువు 6శిశిరఋతువు :-
[5.2-86-వ.]

774} ఋత్విక్కు  - యజమానినుండి ధనము తీసుకొని యజ్ఞము చేయించువాడు, వీరు 1బ్రహ్మ 2ఉద్గాత 3హోత 4అధ్వర్యుడు 5బ్రహ్మణాచ్ఛంసి 6ప్రస్తోత 7మైత్రావరుణుడు 8ప్రతిప్రస్థాత 9పోత 10ప్రతిహర్త 11అచ్చావాకుడు 12నేష్ట 13అగ్నీధ్రుడు 14సుబ్రహ్మణ్యుడు 15గ్రావస్తుతుడు 16ఉన్నేత :-
[9-170.1-తే.]

775} ఋభువులు  - దేవతలు, దేవతలకు కూడ యజింపదగిన దేవుళ్ళు, చాక్షుషమన్వంతరమున దేవతలు, వ్యు, ఋ+భూ+డ కృ.ప్ర., స్వర్గమున ఉండువారు. :-
[4-104-వ.]

776} ఋషి  - శాస్త్రకారుఁడగు ఆచార్యుఁడు, మంత్ర ద్రష్ట. , వ్యు. ఋషీ గతౌ :-
[3-1007-వ.]

777} ఋషిఋణము  - వేద శాస్త్రాధ్యయనముల ద్వారా తీర్చుకొనునది :-
[6-252-వ.]

778} ఎండకన్నెఱుగని  - ఎండ (సూర్యకిరణముల) కన్ను (చూపునుకూడ) ఎఱుగని (తెలియని), మిక్కిలి సుకుమారమైన :-
[8-471.1-ఆ.]

779} ఎండమావులు  - మధ్యాహ్న సమయమున ఎడారాదుల యందు నీటిచాలు వలె కనబడు నీడలు, భ్రాంతులు, మృగతృష్ణ, మరీచిక :-
[7-358-మత్త., 10.2-752-చ.]

780} ఎఱ్ఱన  - మహాభారతం ఆంధ్రీకరించిన కవిత్రయంలో మూడవవాడు :-
[6-11.1-తే.]

781} ఎలనాగ  - యౌవనమున ఉన్నామె, లేతవయస్కురాలు, పడతి :-
[10.1-73.1-ఆ., 10.1-1714-ఉ.]

782} ఏకదంతుడు  - ఏక (ఒకటే) దంతుడు (దంతము గలవాడు), విఘ్నేశ్వరుడు :-
[6-4-ఉ.]

783} ఏకదశేంద్రియములు  - 5జ్ఞానేంద్రియములు (1కన్ను 2ముక్కు 3నాలుక 4చెవి 5చర్మము) 5కర్మేంద్రియములు (1కాళ్ళు 2చేతులు 3నోరు 4గుహ్యేంద్రియము 5గుదము) మరియు 1మనసు మొత్తం 11 :-
[4-889-వ., 10.1-236-వ., 10.1-572.1-తే.]

784} ఏకపత్నీవ్రతుడు  - జీవితములో ఒకే భార్య అనెడి వ్రతదీక్ష కలవాడు, శ్రీరాముడు :-
[9-337-వ.]

785} ఏకపాదతానకము  - ఒంటికాలితో అడుగులు వేయుట, రాసక్తీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

786} ఏకపాదులు  - ఒకటే మూలము కలవి, చెట్లు :-
[4-853-వ., 11-91-వ.]

787} ఏకము - ఏకతరము ఏకతమము :-
[6-184-మం]

788} ఏకము  - సజాతీయ విజాతీయ స్వ పర భేదరహితమైనది, రెండవది లేనిది, అద్వితీయము :-
[10.2-1122-వ.]

789} ఏకరశ్మి  - ఒకే కళ్ళెం (పగ్గము) గలది మనసునకు, సంకేతము :-
[4-771.1-తే.]

790} ఏకవీరుడు  - ఏకైకశూరుడు, మంచినిష్ఠ కలవాడు :-
[4-460.1-తే.]

791} ఏకసారథి  - ఒకడే నడిపే వాడు కలది, బుద్ధికి, సంకేతము :-
[4-771.1-తే.]

792} ఏకాంతి  - ఏక (ఒకే) అంతి (అంత్య ఫలము, ముక్తి) మాత్రము కోరెడివాడు, ఆత్మనిష్ఠాపరుడు :-
[7-371-వ.]

793} ఏకాంతికము  - ఆత్మపరమాత్మల ఏకత్వ అనుభవమున ఉండుట, అనన్యభక్తి, అనన్యచింత :-
[3-203-దం.]

794} ఏకాంతులు  - ఉన్నది భగవంతుడు ఒక్కడే అన్న స్థితి లో ఉన్నవారు :-
[1-388.1-తే.]

795} ఏకాకి  - శ్రు. ఏకమేవాద్వితీయం బ్రహ్మః, బ్రహ్మ :-
[10.1-1236-దం.]

796} ఏకాక్షము  - పోలుకఱ్ఱ, ప్రధానము, మాయకు సంకేతము :-
[4-771.1-తే.]

797} ఏకాగ్రము  - ఒకే దాని యందు కేంద్రీకరింప బడినది :-
[2-226-వ., 2-252-వ.]

798} ఏకాదశరుద్రులు  - 1అజుడు 2ఏకపాదుడు3అహిర్బుద్న్యుడు 4త్వష్ట 5రుద్రుడు 6హరుడు 7శంభుడు 8త్రయంబకుడు 9అపరాజితుడు 10ఈశానుడు 11త్రిభువనుడు (మరొక క్రమము) 1అజైకపాదుడు 2అహిర్బుథ్న్యుడు 3త్వష్ట 4రుద్రుడు 5హరుడు 6త్రయంబకుడు 7వృషాకపి 8శంభుడు 9కపర్ది 10మృగవ్యాధుడు 11శర్వుడు (కశ్యపబ్రహ్మ వలన సురభి యందు జన్మించినవారు) :-
[2-38-వ., 5.2-122.1-ఆ., 11-105-వ.]

799} ఏకాదశవృత్తులు  - పంచజ్ఞానేంద్రియములు పంచకర్మేంద్రియములు అహంకారము యనెడి వ్యాపారములు పదకొండు (11) :-
[5.1-155-వ.]

800} ఏకాదశేంద్రియములు  - పంచజ్ఞానేంద్రియములును, 1కన్నులు 2ముక్కు 3చెవులు 4నాలుక 5చర్మము పంచకర్మేంద్రియములు, 6కాళ్ళు 7చేతులు 8వాక్కు 9పాయువు 10ఉపస్థు మరియును 11మనస్సు :-
[3-1025-వ., 4-855-వ., 11-52-వ.]

801} ఏకానైకము  - ఒకేఒకడు, శ్రు. ఏకోదేవా బహుధాని విష్టః. :-
[10.2-1122-వ.]

802} ఏడుజానలమేను  - దేహి (ఏ మనిషి అయినా) తన జానతో ఏడుజానల పొడుగు ఉండును అన్నది ఒక సాముద్రికశాస్త్ర ప్రమాణము. :-
[10.1-557.1-తే.]

803} ఏణ  - పెద్ద కన్నులు కల నల్ల ఇఱ్ఱి, జింక :-
[9-446-మ.]

804} ఏణీలోచన  - ఏణి (లేడివంటి) లోచన (కన్నులు కలామె), అందగత్తె :-
[10.1-1749-వ., 10.2-170-శా.]

805} ఏరూపైనపొందువాడు  - జలచర స్థలచర ఉభయచర జంతు మానవాది ఎట్టి ఆకృతులైనను సూక్ష్మ స్థూలాది రూపములైనను చేపట్టువాడు, విష్ణువు :-
[10.2-202.1-ఆ.]

806} ఏలతగులన్  - ఎందుకు కూడుట, కూడకూడదు :-
[10.2-232.1-ఆ.]

807} ఐరావతము  - ఇంద్రుని వాహనమైన తెల్లఏనుగు :-
[6-359-వ.]

808} ఐళుడు  - ఇళ (బుధుని భార్య) యొక్క పుత్రుడు, పురూరవుడు :-
[2-204.1-తే., 9-375-ఆ.]

809} ఒకడు  - ఏకమేవాద్వితీయంబ్రహ్మ (శ్రుతి), సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనివాడు బ్రహ్మ, అద్వితీయుడు :-
[10.1-567.1-ఆ.]

810} ఒక్కచందముకలది  - ఎప్పటికిని ఒకే విధముగా ఉండునది, షడ్భావవికారములు లేనిది :-
[10.1-126.1-ఆ.]

811} ఒక్కడు  - ఏకమేవాద్వితీయంబ్రహ్మ (శ్రుతి), సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనివాడు బ్రహ్మ, అద్వితీయుడు :-
[10.1-1503-వ.]

812} ఒగ్గములు  - అవపాతములు ఏనుగులు మొదలగునవి పడుటకు పైన కఱ్ఱలు కంపలు కప్పి లోపల వెలితిగ నుండు గోతులు :-
[1-455-క.]

813} ఒడలెఱుగరాదు  - గర్వము వలన ఒళ్ళు తెలియదు :-
[9-507-క.]

814} ఒడ్డోలగము  - ఒడ్డు (నిండైన) ఓలగము (సభ) :-
[6-491-వ.]

815} ఓలములు  - మాటులు వేట కోసము ఏర్పరచిన మరుగు ప్రదేశములు. :-
[1-456-క.]

816} ఓషధులు  - ఓషధయః ఫలకాంతాః, పంట పండగనే చనిపోవునవి. ఓషధులు, ధాన్యము, అరటి మొదలగునవి :-
[1-199-వ., 2-89-వ., 6-197.1-తే., 7-467-వ., 8-175.1-ఆ., 8-706.1-ఆ., 12-11-వ.]

817} ఔత్తరేయుండు  - ఉత్తర యొక్క కుమారుడు, పరీక్షితు :-
[2-52-వ.]

818} ఔప  - అభాస, సత్యమనిపించు అసత్యపువి :-
[2-196-మ.]

819} కంజదళాక్షుడు  - కం (నీట) జ (పుట్టిన) (పద్మము) వంటి అక్షమున్ (కన్నులు) ఉన్న వాడు, భగవంతుడు, విష్ణువు, కృష్ణుడు :-
[2-211-ఉ., 6-401-క., 11-17-క.]

820} కంజము  - కం నందు(నీట) పుట్టినది :-
[3-277-చ., 3-780-వ., 10.1-1236-దం., 10.2-821-వ.]

821} కంజాక్షుడు  - కంజము (పద్మముల)వంటి అక్షుడు (కన్నులుగల వాడు), విష్ణువు :-
[5.2-9.1-ఆ., 6-498-తే., 7-170.1-ఆ., 10.2-119-మ.]

822} కంజాతకిజల్కపుంజరంజితపీతకౌశేయవాసుడు  - కంజాత (పద్మముల)యొక్క కింజల్క (కేసరముల) పుంజ (సమూహము) వలె రంజిత (రంజిల్లుతున్న) పీత (పచ్చని) కౌశేయ (పట్టువస్త్రము)లను ధరించినవాడు, విష్ణువు :-
[3-924.1-తే.]

823} కంజాతగర్భుడు  - కం (నీరు) అందున జాత (పుట్టినది, పద్మము) అందు గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[3-284-మ., 7-86-వ.]

824} కంజాతపత్రనేత్ర  - కంజాతము (తామర) పత్ర (ఆకులు) వంటి నేత్ర (కన్నులు ఉన్నామె), స్త్రీ :-
[4-797-క.]

825} కంజాతపత్రేక్షణ  - కంజాతము (తామర) పత్ర (ఆకులు) వంటి ఈక్షణ (కన్నులు ఉన్నామె), స్త్రీ (ఈక్షణ అంటే చూపు అని కూడా ఉంది, పద్మం జ్ఞానానికి సంకేతం కనుక, జ్ఞానదృష్టి లేదా కలామె అనుకోవచ్చు) :-
[10.2-355-మ.]

826} కంజాతభవాండము  - కం (నీటిలో) జాత (పుట్టినదాని, (పద్మం) లోపుట్టిన వాని (బ్రహ్మ) అండము, బ్రహ్మాండము :-
[1-1-శా.]

827} కంజాతభూదేవేంద్రాదిసమస్తదేవమకుటోద్దీప్తోరురత్నప్రభావ్యావిద్ధాంఘ్రిసరోజుడు - కంజాతభూ (నీటపుట్టునట్టి పద్మమున జనించినవాడు, బ్రహ్మదేవుడు) దేవేంద్రుడు ఆది (మొదలగు) దేవమకుట (దేవతల కిరీటములందు) ఉద్దీప్త (మిక్కిలి ప్రకాశిస్తున్న) ఉరు (పెద్ద) రత్నముల ప్రభా (కాంతులు) వ్యావిద్ధ (విశేషముగా పరచబడిన) అంఘ్రి (పాదములనెడి) సరోజుడు (పద్మములుగలవాడు), హరి :-
[6-1-శా.]

828} కంజాతము  - కం (నీటిలో) జాతము (పుట్టినది), పద్మము :-
[3-203-దం., 10.2-68.1-తే.]

829} కంజాసనుడు  - కంజము (పద్మము) ఆసనముగా కలవాడు, బ్రహ్మదేవుడు :-
[3-368-మ.]

830} కంజేక్షణ  - కంజ (పద్మము)వంటి ఈక్షణ (కన్నులు కలామె), స్త్రీ :-
[10.1-1130-శా.]

831} కంజోదరుడు  - కంజము (పద్మము) ఉదరమున గలవాడు, విష్ణువు :-
[7-94-క.]

832} కంటకులు  - ముండ్లవంటి వారు, క్షుద్ర శత్రువులు :-
[1-360-క.]

833} కంఠీరవము  - కంఠమున శబ్దము కలది, భీకరమైన కంఠధ్వని కలది, సింహము :-
[9-595-క., 10.1-639-ఉ., 10.1-1558-వ., 10.1-1615-వ.]

834} కంఠేకాలుడు  - కంఠము నల్లగానున్నవాడు, శంకరుడు :-
[9-615-క.]

835} కండి  - ఇరుసుపై తిరిగెడి మధ్య రంధ్రముగల గుండ్రముగానుండి ఆకులుద్వారా చక్రమునకు కలపబడి యుండెడిది :-
[10.1-251-క.]

836} కంతునిగురువు  - కంతుడు (మన్మథుడు) యొక్క గురువు (తండ్రి), విష్ణువు :-
[6-54-క.]

837} కందర్పుడు  - కం (ఆనందముచేత) దర్పించువాడు (అతిశయించువాడు), సుఖం తత్ర ద్రపో యస్య, బవ్రీ., సుఖ విషయమున గర్వము కలవాడు, మన్మథుడు :-
[1-237-మ., 10.2-13-వ.]

838} కందుకబంధము  - పూలచెండ్లు ఎగరవేయునట్లు ఎగురుతుగాని పూలచెండ్లను ఎగురవేయుచుగాని హస్త విన్యాసాదులు కనుపింపజేయుట, రాసక్రీడ ఆడుటలోని పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

839} కంధి  - కం (నీటికి) నిధి, కడలి. :-
[9-275-క.]

840} కంపితశిరోభావాలు  - కిందమీదలుగా కదలించు శిరస్సులు కలవి, రాసక్రీడ ఆడుటలోని పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

841} కంబుకరుడు  - కంబు (పాంచజన్యము యనెడి శంఖమును) కరుడు (చేత ధరించెడివాడు), విష్ణువు :-
[6-530-తో.]

842} కంసజింఘాంసునంశము  - కంసజింఘ (కంసునిశత్రువైన కృష్ణుని) యొక్క అంశము (అంశ అయినవాడు), బ్రహ్మ :-
[6-3-ఉ.]

843} కంసధ్వంసి  - కంసుని చంపినవాడు, కృష్ణుడు :-
[10.2-58-మ.]

844} కంసమర్దనుడు  - కంసుని శిక్షించినవాడు, కృష్ణుడు :-
[10.1-1467.1-తే.]

845} కంసవిదారి  - కంసుని విదారి (సంహరించివాడు), కృష్ణుడు :-
[5.2-166-క.]

846} కంసారి  - కంసునకు శత్రువు, కృష్ణుడు :-
[1-273-వ., 10.1-1704.1-తే., 10.2-78-మ., 10.2-164-మ., 10.2-186-వ., 11-77-వ.]

847} కంసాసురసంహారుడు  - కంస (కంసు డనెడి) అసుర (రాక్షసుని) సంహారుడు (సంహరించిన వాడు), కృష్ణుడు :-
[6-35-క.]

848} కంసుడు  - కృష్ణని మేనమామ :-
[2-190-చ.]

849} కంసునిసోదరులు  - 1న్యగ్రోధుడు 2కహ్వుడు 3సునామకుడు 4శంకుడు 5సుభుడు 6రాష్ట్రపాలుడు 7విసృష్టుడు 8తుష్టిమంతుడు :-
[10.1-1382-శా.]

850} కకుత్స్థుడు  - ఎద్దుమూపుపై విహరించిన వాడు, కకుత్స్థుడు, శశాదుడు అను పేర్లు గల సూర్యవంశపు రాజు, వికుక్షి కొడుకు, ఇక్ష్వాకుని మనుమడు :-
[9-160-చ.]

851} కజ్జికాయలు  - తీపితినుబండారము (కొబ్బరి కోరు బెల్లం పాకంలో పట్టించినది లస్కోరా, లౌజు అంటారు. పిండి పూరీలా గుండ్రంగా వత్తి ముందు చేసుకున్న లస్కోరా మధ్యలో పెట్టి సగానికి మడుస్తారు. రెండు పొరలు కలవటానికి అందంగా నొక్కులు నొక్కుతారు. అప్పుడు కాగుతున్న నూనెలో వేయిస్తారు. కొద్దిగా పొంగుతాయి. వాటిని కజ్జికాయలు అంటారు) :-
[10.1-458-క.]

852} కటకాముఖకరభావము  - వలయము ముఖమువలె కపిత్థ హస్తమందు తర్జనిని మధ్యామాంగుష్టములతో పట్టునది, శ్లో. కపిత్థ తర్జనీచోర్ధ్వం మిశ్రితాంగుష్ట మధ్యమా, కటకాముఖహస్తోయం కీర్తితో భరతాదిభిః, రాసక్రీడ ఆడుటలోని పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

853} కటితటహతకమలజాండఘటి  - కటి (మొల) తట (భాగమున) హత (కట్టబడిన) కమలజాండ (బ్రహ్మాండము అను) ఘటి (గంటకలది), ఆదివరాహము :-
[3-698-క.]

854} కటిభ్రాంతకరణము  - నడుముమాత్రము కదలించుట, రాసక్రీడ ఆడుటలోని పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

855} కడతేర్చు  - (జీవితము) కడ (చివరకు) చేర్చు, చంపు :-
[7-330-ఉ.]

856} కడపటిచేత  - ఎల్ల పనులకు చివరి పని, చావు :-
[10.2-752-చ.]

857} కడలుకొను  - కడ (చివర) వరకు కొను (తీసుకుపోవు), మిక్కిలి వ్యాపించు :-
[4-35.1-తే.]

858} కడుపుబొక్కు  - కడుపు (గర్భపు), పొక్కు (శోకము), గర్భశోకము :-
[8-484-ఆ.]

859} కత్తివాతియమ్ము  - కత్తివంటి పదును గల బాణము :-
[10.1-1771-వ.]

860} కనకాక్షుడు  - హిరణ్యాక్షుడు బంగారు కళ్ళు ఉన్న వాడు, బంగారం రజోగుణ సంకేతం కనుక రజోగుణ దృష్టి కలవాడు. :-
[2-115-మ.]

861} కనకాచలేంద్రము  - కనక (బంగారు) ఆచల (కొండలలో) ఇంద్రము (గొప్పది), మేరుపర్వతము :-
[8-49.1-ఆ.]

862} కన్నీరుమున్నీరుగా  - కన్నీరు (దుఃఖమువలన కలిగెడి కంటినీరు) మున్నీరు (సముద్రమువలె) కాన్ అగునట్లు, అత్యధికముగా కన్నీరుకార్చుచు :-
[10.1-14.1-తే.]

863} కన్యక  - కన్యాకుబ్జక్షేత్రమున కన్యక (సకల జనులచేత కోరబడెడియామె), అవివాహిత :-
[10.1-61-వ., 10.1-850-వ.]

864} కపిత్తకరభావము  - వెలగపండు ఆకృతిని బొటకనవేలు తర్జని తప్ప తక్కినవాటిని ముడిచి బొటకనవేలు ఇంచుక వంచి దానిపై తర్జనిని మోపి పట్టునది, శ్లో. అంగుష్టమూర్ధ్ని శిఖరేవక్రితాయది తర్జనీ, కపిత్థాఖ్యకరస్సోయం తన్నిరూపణముచ్యతే., రాసక్రీడ ఆడుటలోని పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

865} కబళాహారము  - తినెడి ఆహారము, పూలతేనె :-
[8-24-వ.]

866} కమండలము  - జలమును సన్నని ధారగా పోయుటకు వీలై జల భక్షణ, యోగ క్రియాదులకు అనుకూలమైన తొండము ఉండు కలశము, జలపాత్ర :-
[11-77-వ.]

867} కమఠము  - జలమునందు వసించునది, తాబేలు :-
[8-203-మ.]

868} కమనీయగుణగణాకరుడు  - కమనీయ (మనోజ్ఞము లైన) గుణగణ (గుణముల సమూహము) లకు ఆకరుడు (నిధి వంటి వాడు), రాముడు :-
[10.2-1-క.]

869} కమనీయభుజంగమరాజమండలీమండనుడు  - కమనీయ (మనోహరమైన) భుజంగమ (సర్ప) రాజ (రాజుల) మండలీ (సమూహములచే) మండనుడు (అలంకరింపబడినాడు), శివుడు :-
[6-2-ఉ.]

870} కమనీయము  - మనోహరమైనది,4 కామ్యతే కమనీయం వా, కోరబడునది; అందముగా నున్నది. :-
[2-21.1-తే.]

871} కమనీయలోకమంగళదాయకుడు  - కమనీయ (మనోహరమైన) లోక (విశ్వజనీన) మంగళ (శుభములను) దాయకుడు (ఇచ్చువాడు), శివుడు :-
[4-138.1-తే.]

872} కమనీయవలయకరకీలితకంకాళి  - కమనీయ (మనోహరమైన) వలయ (కంకణములు) కర (చేతు లందు) కీలిత (అలంకరింపబడిన) కంక (పుఱ్ఱెల) ఆళి (సమూహములు గలామె), పార్వతి :-
[6-7-క.]

873} కమలగర్భుడు  - కమలమున గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మ :-
[3-738-వ., 6-282-వ.]

874} కమలగృహము  - పద్మములకు నిలయము, సరస్సు :-
[10.1-1732.1-ఆ.]

875} కమలజాండము  - కమల (పద్మము)న జ (పుట్టినవాడు) (బ్రహ్మ) అండము, బ్రహ్మాండము :-
[3-698-క., 5.2-77-ఆ., 10.1-482-ఆ.]

876} కమలజుడు  - కమలమున (పద్మమున) జుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[2-246-క., 3-930-చ., 4-569.1-తే., 4-943.1-తే., 8-682-క.]

877} కమలదళాక్షి  - కమల (పద్మముల) దళ (రేకుల) వంటి అక్షి (కన్నులు కలామె), స్త్రీ :-
[4-401-చ., 8-236-క.]

878} కమలదళాక్షుడు  - కమలముల దళ (రేకుల) వంటి అక్షుడు (కన్నులుగలవాడు), విష్ణువు. :-
[3-571-చ., 4-922-చ.]

879} కమలదళాయతేక్షణుడు  - కమల (తామర) దళ (రేకులవంటి) ఆయత (విశాలమైన) ఈక్షణుడు (కన్నులు కలవాడు), కృష్ణుడు :-
[10.2-147-చ.]

880} కమలదళేక్షణుడు  - తామర రేకులవంటి కన్నులు కలవాడు, కృష్ణుడు :-
[10.1-1358-క.]

881} కమలనయన  - కమలముల వంటి నయనములు (కన్నులు) ఉన్నామె, స్త్రీ. :-
[3-1040-తే.]

882} కమలనయనుడు  - కమలముల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు :-
[3-573.1-తే., 6-122-ఆ.]

883} కమలనాభుడు  - కమల (పద్మము) నాభుడు (నాభి యందు కలవాడు), విష్ణువు :-
[1-50.1-ఆ., 1-102.1-ఆ., 1-482-ఆ., 2-51.1-ఆ., 3-123.1-తే., 4-254.1-తే., 10.1-17-ఆ., 10.1-1692.1-ఆ.]

884} కమలనేత్రుడు  - కమలముల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు :-
[6-181-తే.]

885} కమలపత్రనయనుడు  - కమల (తామర) పత్ర (ఆకు)ల వంటి నయనుడు (కన్నులు ఉన్నవాడు), విష్ణువు :-
[3-805-తే.]

886} కమలబంధువు  - పద్మాలకు మిత్రుడు, సూర్యుడు :-
[1-74-వ.]

887} కమలభవాండము  - కమలభవ (బ్రహ్మ) అండము, బ్రహ్మాండము :-
[10.1-1299-క.]

888} కమలభవుడు  - కమలము (పద్మము)న భవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[3-90-క., 4-144-తే., 10.1-14.1-తే., 12-24-వ.]

889} కమలమిత్రుడు  - పద్మము లకు మిత్రుడు, సూర్యుడు :-
[10.1-568-వ.]

890} కమలలోచన  - పద్మముల వంటి కన్నులు కలామె, స్త్రీ :-
[4-837-తే.]

891} కమలలోచనుడు  - కమలములవంటి కన్నులుగలవాడు, విష్ణువు :-
[1-58-వ., 3-652-వ., 4-126-తే., 9-133-ఆ.]

892} కమలసంభవుడు  - కమలమున సంభవుడు (జన్మించినవాడు), బ్రహ్మదేవుడు :-
[2-226-వ., 3-276-తే., 3-725-వ., 5.1-26-వ., 5.1-74.1-తే., 6-178.1-తే., 8-505-వ.]

893} కమలహితుడు  - కమలములకు ప్రీతిపాత్రుడు, సూర్యుడు. :-
[3-451.1-తే., 8-154.1-తే.]

894} కమలాకరము  - కమలమలకు ఆకరము (పుట్టుచోటు), సరస్సు :-
[3-1044-ఉ., 4-693-మ.]

895} కమలాకాంతుడు  - కమల (లక్ష్మీదేవి) భర్త, విష్ణువు :-
[3-88-మ.]

896} కమలాక్షుడు  - కమలముల వంటి అక్షుడు (కన్నులుగలవాడు), విష్ణువు :-
[1-237-మ., 1-450-క., 2-217.1-తే., 3-546.1-తే., 3-681-క., 6-397.1-ఆ., 7-169.1-తే., 7-240.1-తే., 8-203-మ.]

897} కమలాధీశుడు  - కమల (లక్ష్మీదేవి) భర్త, లక్ష్మీపతి విష్ణువు. :-
[3-58-మ., 3-155-క., 8-611-మ.]

898} కమలాధీశ్వరుడు  - కమల (లక్ష్మీదేవి) అధీశ్వరుడు (భర్త), విష్ణువు :-
[3-494-క., 4-929-మ.]

899} కమలానన  - పద్మములవంటి అననము (ముఖము) కలామె, స్త్రీ :-
[3-457-చ., 3-474-క., 3-484-చ., 4-789-క.]

900} కమలాప్తకులనాథుడు  - కమలాప్త (సూర్య) వంశపు రాజు, రాముడు :-
[9-286-ఆ.]

901} కమలాప్తుడు  - కమల (లక్ష్మీదేవికి) ఆప్తుడైనవాడ, విష్ణువు, కమలములకు మిత్రుడు, సూర్యుడు :-
[8-92-ఉ., 10.1-410-క.]

902} కమలామనోహరుడు  - కమల (లక్ష్మీదేవికి) మనోహరుడు (భర్త), విష్ణువు. :-
[10.1-688-ఉ.]

903} కమలాలయ  - కమలములు ఆలయముగ కలది, లక్షీదేవి :-
[2-232-క.]

904} కమలాలయము  - కమలములకు స్థానము, సరస్సు :-
[1-406.1-ఆ.]

905} కమలాసననందనుడు  - బ్రహ్మదేవుని కొడుకు, భృగువు :-
[10.2-1274-ఉ.]

906} కమలాసనుజులు  - కమలాసనుడు (బ్రహ్మదేవుడు)కి జులు (పుట్టినవారు), బ్రహ్మపుత్రులు :-
[4-214-క.]

907} కమలాసనుడు  - కమలమును ఆసనముగా కలవాడు, బ్రహ్మదేవుడు :-
[1-445.1-తే., 3-397-క., 3-422-వ., 5.2-125-వ., 6-170-త., 6-241-చ., 7-84-వ., 7-305-వ.]

908} కమలుజుడు  - కమలమునందు జుడు (పుట్టినవాడు), బ్రహ్మ :-
[3-848-క., 6-277-క.]

909} కమలేక్షణ  - కమలములవంటి కన్నులు కలామె, అందగత్తె, స్త్రీ :-
[10.1-269-ఉ.]

910} కమలేశుడు  - కమల (లక్ష్మీదేవి) యొక్క ఈశుడు (భర్త), విష్ణువు :-
[7-170.1-ఆ.]

911} కమలోదరుడు  - కమలము ఉదరమున కలవాడు, విష్ణువు :-
[3-591-క., 4-896-క.]

912} కరగ్రహణము  - చేతిని గ్రహించి, వివాహము చేసికొనుట :-
[4-42.1-తే.]

913} కరణత్రయము  - త్రికరణములు 1మనస్సు 2వాక్కు 3కాయము :-
[11-42-క.]

914} కరతలామలకము  - కరతల (అరచేతిలోని) అమలకము (ఉసరికాయ) వలె సులభముగ అందునది, తెలియునది :-
[10.2-482-క.]

915} కరభము  - ముంజేయి, 1. మనికట్టునుండి చిటికెనవేలు మొదలుదాక గల చేతి వెలుపల భాగము, 2. కర (ఏనుగు) భ (చేయి, తొండము) :-
[2-158.1-తే.]

916} కరభాజనులు - 1 హరి, 2 కవి, 3 అంతరిక్షుడు, 4 ప్రబుద్ధుడు, 5 పిప్పలాహ్వయుడు, 6 అవిర్హోత్రుడు, 7 ద్రమిళుడు, 8 చమనుడు, 9 కరభాజనుడు యను వీరు వృషభరాజు నూఱుగురి కుమారులలో ఆకాశగమనాది సిద్ధులను పొందిన చివరివారు :-
[11-35-వ.]

917} కరభోరువు  - కరభమును (చేతిచిటికెనవేలికి మణికట్టునకు నడిమి భాగమును) పోలిన ఊరువు (తొడలు కలిగినామె) (ఆంధ్రవాచస్పతము, విద్యార్థికల్పతరువు), అందగత్తె, ఏనుగుతొండము వంటి తొడలు గలది . శ్రీహరి నిఘంటువు :-
[10.1-1496-క.]

918} కరాగ్రస్థగిరి  - కర (చేతి) అగ్రస్థ (పైన ఉన్న) గిరి (కొండ (గోవర్దనగిరి) గలవాడు), కృష్ణుడు :-
[6-33-క.]

919} కరికులేంద్రుడు  - కరి (ఏనుగు) కుల (సమూహమునకు) ఇంద్రుడు (ప్రభువు), గజేంద్రుడు :-
[8-97-వ.]

920} కరిపాలకుడు  - ఏనుగును పాలించువాడు, మావటి :-
[10.1-1316-వ.]

921} కరిరాజశుభప్రదుడు  - కరిరాజు (గజేంద్రుని)కి శుభ (శుభములు) ప్రదుడు (ఇచ్చెడివాడు), విష్ణువు :-
[6-530-తో.]

922} కరివరదుడు  - కరి (గజేంద్రుని)కి వరదుడు (వరము ప్రసాదించినవాడు), హరి :-
[4-166-చ., 6-187-క.]

923} కరుణాంబుధి  - కరుణకు సముద్రమైన వాడు, కృష్ణుడు :-
[1-242-ఉ.]

924} కరుణాకరుడు  - కరుణ (దయ)కు ఆకరుడు (నిలయము) ఐనవాడు, విష్ణువు, శ్రీకృష్ణుడు :-
[3-155-క., 3-166-క., 3-748-క., 5.1-182-క., 6-530-తో.]

925} కరుణాపాథోనిధి  - దయకు సముద్రము వంటివాడు, విష్ణువు :-
[2-236-మ.]

926} కరుణావర్ధిష్ణుడు  - కారుణ్యము వృద్ధి యగు స్వభావము గల వాడు, విష్ణువు :-
[8-105-మ.]

927} కరుణాసముద్రుడు  - సముద్రము అంత దయ కలవాడ, శివుడు :-
[4-161.1-తే.]

928} కరుణాసాగరుడు  - దయాసముద్రుడు, శ్రీకృష్ణుడు :-
[5.1-1-క.]

929} కరువలిసుతుడు  - కరువలి (వాయువు) సుతుడు, భీముడు :-
[10.2-732-క.]

930} కరేణుకావిభుడు  - కరేణుక (ఏనుగుల) విభుడు (ప్రభువు), గజేంద్రుడు :-
[8-115-మ.]

931} కర్ణధారుడు  - కర్ణము (చుక్కాని) ధారుడు (పట్టువాడు), పడవ నడుపు వాడు, మార్గదర్శి, తరింపజేయువాడు :-
[1-52-క., 1-325-ఉ., 3-459-వ., 10.2-1227-చ.]

932} కర్ణమూలము  - చెవిగూబ :-
[3-700-మ.]

933} కర్త - కారణభూతుడైనవాడు, విష్ణువు :-
[10.1-876-మ.]

934} కర్తరీముఖకరభావము - కత్తెరవలె చిటికినవేలు తర్జనివేలు తప్ప మిగిలినవి ముడిచి పట్టునది, శ్లోఅన్యైవచాపిహస్త తర్జనీచ కనిష్టకా బహిః ప్రసారితేద్వేత్స కరః కర్తరీముఖః :-
[10.1-1084-వ.]

935} కర్తృ  - చేయునది (కర్త) :-
[3-201.1-తే.]

936} కర్బురసూత్రసమావృతాంసము  - కర్బుర (బంగారు) సూత్ర (యజ్ఞోపవీతము)చే సమావృత (చక్కగా కలిగిన) అంసము (మూపు గలవాడు), బ్రహ్మ :-
[6-3-ఉ.]

937} కర్బురుడు  - కర్బర, కర్బుర (పాపము, చిత్ర వర్ణము) కల వాడు, రాక్షసుడు :-
[10.2-405-చ.]

938} కర్మ  - ఆ అభిలాషలకు తగిన నడవడులు :-
[10.1-537-వ.]

939} కర్మజీవులు  - కర్మబద్ధులైన జీవులు, మానవులు :-
[3-845.1-తే.]

940} కర్మత్రయము  - 1ఆగామి (భవిష్యత్తులో ఫలితము అనుభవించ వలసిన కర్మవిశేషము) 2సంచిత (ప్రోగుచేయఁబడినది, పూర్వజన్మలలో చేసి అనుభవించవలసిన కర్మవిశేషము) 3ప్రారబ్ధ కర్మములు (జన్మము నెత్తించెడు కర్మవిశేషము.) :-
[10.2-1071.1-తే.]

941} కర్మఫలబోధన  - కర్మలను అనుసరించి స్వర్గ లోకాది ఫలితములు చెప్పునది :-
[2-20-వ.]

942} కర్మములు  - కార్యము (ఫలితము, పని) వలని కారణము (కారణము, పని), ఫలితములు అనుభవించక తప్పని పనులు. :-
[2-222-వ.]

943} కర్మవసుధ(కర్మభూమి)  - శ్లో. గాయంతి దేవాషు కిలగీతకాని ధన్యాస్తు యే భారతభూమిభాగే, స్వర్గాపవర్గాస్య ఫలార్జనాయ భవంతి భూయః పురుషాస్సురాత్వాత్. అను ప్రమాణముచేత కర్మభూమి అంటే భారతభూమి, భరతఖండము :-
[10.1-1656-ఉ.]

944} కర్మవిస్తారకాయుడు  - వేదకర్మలను విస్తరింపజేయువాడు, విష్ణువు :-
[4-702.1-తే.]

945} కర్మవిహీనుడు  - కర్మముల (బంధము) లేని వాడు, నిష్కాముగా కర్మ చేసినను అది వానికి అంటదు అందుచేత వాడు కర్మవిహీనుడు (నిష్కామకర్ముడు) :-
[10.1-886-క.]

946} కర్మశ్రేష్ఠుడు  - కర్మములు (పనిచేయుట) యందు ఉత్తముడు :-
[4-26-వ.]

947} కర్మసాక్షి  - సకల ఇంద్రియ వ్యాపారములను సాక్షిగా చూచుచుండువాడు, ఆత్మ :-
[10.2-88.1-తే.]

948} కర్మసాధనుడు  - వేదకర్మలకు సాధనమైనవాడు, విష్ణువు. :-
[4-702.1-తే.]

949} కర్మసూత్రము  - ప్రతికర్మ (పని)కి ఫలితం ఉంటుంది :-
[4-573-వ., 4-581-ఉ.]

950} కర్ముడు  - కర్మములు చేయువాడు, మానవుడు :-
[10.1-886-క.]

951} కర్మేంద్రియములు - 1నోరు 2చేతులు 3కాళ్ళు 4గుదము 5ఉపస్థు, పాఠ్యంతరము 1వాక్, 2పాణి, 3పాద, 4పాయు, 5ఉపస్థులు :-
[1-403-వ., 2-112-వ., 4-849-వ., 6-88-వ., 7-237-వ.]

952} కర్షణవృత్తి  - పొలము దున్ని జీవించెడి జీవిక, కర్షకవృత్తి, గృహస్తాశ్రమ విశేషము :-
[7-410.1-ఆ.]

953} కఱకంఠకార్ముకవిఖండనఖేలనుడు  - కఱకంఠ (శివుని) కార్ముక (ధనుస్సును) విఖండన (విఱుచుట అనెడి) ఖేలన (క్రీడ గలవాడు), రాముడు :-
[4-974-చ.]

954} కఱకంఠసతి  - కఱకంఠుని భార్య, పార్వతి :-
[2-285-ఉ.]

955} కఱకంఠుడు  - నల్లని కంఠము కలవాడు, శివుడు :-
[2-285-ఉ.]

956} కలకంఠము  - కల (చక్కని), కంఠ, (కంఠములు గలది), కోయిల :-
[3-767-క.]

957} కలకంఠి  - కోకిల వంటి కంఠస్వరము కలామె, స్త్రీ :-
[10.1-75.1-తే., 10.1-327.1-ఆ., 10.1-396-క., 10.1-1066-క., 10.2-1025.1-తే.]

958} కలడు  - దేవుడు త్రికాలములు భూత భవిష్యత్ వర్తమానము లందు ఉన్నాడు, భగవంతుడు శాశ్వతంగా ఉన్నాడు :-
[10.1-683-వ.]

959} కలభగామిని  - కలభ (ఏనుగుగున్న వంటి) నడక కలామె, స్త్రీ :-
[10.1-360-వ.]

960} కలభములలోవిశేషములు  - 1బాలము 2పోతము 3విక్కము :-
[8-35-మ.]

961} కలశజుడు  - కలశము నందు జుడు (పుట్టినవాడు), అగస్త్యుడు :-
[8-123-మ.]

962} కలహంస  - కలకలారావము చేయు హంసలు, ధూమ్రవర్ణములైన ముక్కు కాళ్ళు రెక్కలు కలిగి మంచి స్వరముతో కలకలారావము చేయు హంసలు :-
[3-507-వ., 10.2-153.1-తే., 10.2-1323-వ.]

963} కలి  - 1. కలికాలపురుషుడు, 2. కలికాలము, 3. పాపము కలిగంచుటకు కారణభూతము ఐన కాలము, 4. జగడము :-
[2-198-మ., 4-215-వ.]

964} కలికలుషసుముదపహరణ  - కలియుగమున కలుగు కలుష (పాపములను) సు (మిక్కిలి) ముద (సంతోషముతో) అపహరణ (తొలగించువాడు), కల్కి :-
[11-72.1-తే.]

965} కలిలో  - నాలుగింట ఒక వంతు (1/4 వంతు) ధర్మము ఉండును :-
[3-350-వ.]

966} కలువడములు  - స్తంభమునకు వేలాడదీసిన (బంగారు) కలువపూల దండ :-
[10.1-1719.1-ఆ.]

967} కల్కి  - కలిని (కలి అన చెడు, పాపము కారణభూతుడు) చెడుపు వాడు, కపటస్వభావము కలవాడు. కల్క్యవతారము :-
[2-197-వ., 2-198-మ., 10.1-1236-దం.]

968} కల్పము - బ్రహ్మకు ఒక పగలు అయిన కాలము కల్పము :-
[1-237-మ.]

969} కల్పము - బ్రహ్మకు ఒక పగలు అయిన కాలము, 14 మన్వంతరములు జరిగిన బ్రహ్మకు ఒక పగలు, అదే కల్పము (సృష్టి) అవాంతరకల్పము. అంతే కాలము బ్రహ్మకు రాత్రి, అదే అవాంతర ప్రళయము. రెండును కలిపిన ఒక బ్రహ్మదినము. అటువంటి 360 బ్రహ్మ దినముల కాలము బ్రహ్మోదయము నుండి బ్రహ్మాస్తమయము మహాకల్పము లేదా కల్పము. మహా ప్రళయము (అంతే కాలము) బ్రహ్మ అస్తమయము నుండి బ్రహ్మ ఉదయం వరకు. :-
[2-222-వ.]

970} కల్పవృక్షము  - కల్ప (భావించిన వానిని యిచ్చెడి) వృక్షము (చెట్టు) :-
[6-326-వ.]

971} కల్పవృక్షములలోరకములు  - 1మందారము 2పారిజాతము 3సంతానము 4కల్పవృక్షము 5హరిచందనము :-
[6-326-వ.]

972} కల్హారము  - సౌగంధికము, ఇంచుక ఎఱుపు తెలుపు కలిగి మిక్కిలి పరిమళము కలిగిన కలువ :-
[8-49.1-ఆ.]

973} కళ  - 1. ముప్పది కాష్ఠల కాలము, 2. చంద్రుని కళలు పదహారులోనిది :-
[2-188.1-తే., 10.2-430-వ.]

974} కళానిధి  - 16 కళలు కలవాడు, చంద్రుడు :-
[10.1-110-క., 12-48-వ.]

975} కళావతి  - కళలు తెలిసినామె, స్త్రీ :-
[10.2-188-వ.]

976} కళాస్థానములు  - బొటకనవేలు, స్తనము, చెక్కిలి, ముఖము మున్నగు కళాస్థానములు. వాని శక్తి చంద్రకళలను అనుసరించును. మరియొక విధముగ చతుషష్టి మన్మథ కళలు :-
[10.1-1495-ఉ.]

977} కళిందకన్య  - కళిందపర్వతుని పుత్రిక, యమునానది :-
[10.1-1227-క.]

978} కళిందితనయ  - కళింద పర్వతమునకు పుట్టినది, యమునానది :-
[10.1-1479-శా.]

979} కళేబరము  - ప్రాణము విడిచిన శరీరము :-
[4-652-వ., 4-844-చ.]

980} కవి  - 1. రూపములు అల్లువాడు, 2. శుక్రధాతువు, 3. రూపములను వ్యాపింపజేయువాడు, 4. ఉశనసుడు, 5. శుక్రుడు. 6. కవిత్వము చెప్పువాడు :-
[4-6-వ., 4-26-వ.]

981} కవియోగివంద్యుడు  - కవులచేతను యోగులచేతను వంద్యుడు (కీర్తింపబడువాడు), విష్ణువు :-
[8-92-ఉ.]

982} కవ్యము  - కవ్యములు ( పితృదేవతలకు సమర్పించు పిండములు (అన్నములు) :-
[3-738-వ., 4-502-వ., 7-455-వ.]

983} కవ్వడి  - కవ + వడి, రెండు చేతులలోను వడి కలవాడు, అర్జునుడు :-
[10.2-1287-క.]

984} కవ్వము  - పెరుగు చిలికెడు సాధనము :-
[8-200-ఉ.]

985} కశ్యప  - 1. మునివిశేషము, 2. మీనము, 3 కశ్యపప్రజాపతి మరీచి భార్య కళ యొక్క పుత్రుడు :-
[4-7.1-తే.]

986} కశ్యపపుత్రుడు  - కశ్యపుని పుత్రుడు, హిరణ్యకశిపుడు :-
[7-92-శా.]

987} కశ్యపునిసోదరుడుశివుడు  - రుద్రులును ప్రజాపతులును బ్రహ్మదేవుని దేహమునుండే పుట్టిరి కనుక పరమశివుడు కశ్యపుడు అన్నదమ్ములు అనుటకు తగినది అందుచేత శివుడు దితికి మరిది అనుట చెల్లినది :-
[3-462-మ.]

988} కహ్లారము  - కొంచెము ఎరుపు తెలుపు కలిగి మిక్కిలి పరిమళము కలిగిన కలువపువ్వు, సౌగంధికము :-
[10.2-153.1-తే.]

989} కాంచనము, బంగారము  - రజోగుణమునకు సంకేతము :-
[4-771.1-తే.]

990} కాంచనలోచనుడు  - బంగారము వంటి కన్నులు ఉన్నవాడు, బంగారము రజోగుణ సంకేతం కనుక రజోదృష్టి కలవాడు, హిరణ్యాక్షుడు? :-
[3-611-చ.]

991} కాండర్షులు  - వేద కాండములను అధ్యయనము చేసినవారు :-
[1-499-వ.]

992} కాంత  - మనోహరమైన ఆమె, కాంక్షిప దగి నామె, స్త్రీ :-
[4-783-క., 5.1-92-మ., 10.1-798-వ., 10.1-1101-వ., 10.2-265-ఉ.]

993} కాంతాలయము  - కాంత (భార్య) ఉండెడి ఆలయము (ఇల్లు), నివాసము :-
[8-177-క.]

994} కాంతిధరుడు  - కాంతి (ప్రకాశమును) ధరుడు (ధరించువాడు), విష్ణువు. :-
[6-530-తో.]

995} కాకోదరము  - 1కుటిల గమనము గల ఉదరము (పొట్ట)గలది 2 కాకివంటి పొట్టగలది. సర్పము (విద్యార్థికల్పతరువు,పుట313) :-
[12-26-వ.]

996} కాచుట  - 1. పశువులను మేపుటకు తీసుకు వెళ్ళి అక్కడ వాటికి ఏ ప్రమాదములు రాకుండ అవి తప్పిపోకుండ చూచుట, 2. కాపాడుట :-
[3-106-క.]

997} కాత్యాయని  - వ్యుత్పత్తి, కతి అయనాని మోక్షమార్గాస్సంతీతి విచారయతీతి కత్యయనః, కత్యయనస్సాపత్యంస్త్రీ కాత్యాయనీ. మోక్షమార్గములెన్ని కలవని విచారించువాడు కత్యయనుడు (బ్రహ్మవేత్త),వాని యందు పుట్టినామె కనుక కాత్యాయనీ బ్రహ్మవిద్య, బ్రహ్మవిద్యాస్వరూపిణీః. :-
[10.1-809-క.]

998} కాదంబము  - ధూమ్రవర్ణము కల ముక్కు కాళ్ళు కల హంస :-
[10.1-491-మ.]

999} కాదంబరి  - కదంబ రసముచే చేయబడిన మద్యము :-
[10.2-499.1-తే.]

1000} కాదంబిని  - కదంబ వృక్షములను పుష్పించుట కలిగి ఉండునది, మేఘము :-
[10.2-441-వ.]

1001} కానిక,కానుక  - 1.రాజ దర్శనార్థము తెచ్చెడిది 2.బహుమానము :-
[10.2-6-వ.]

1002} కామక్రోధాదిశత్రువులు  - అరిషడ్వర్గములు, 1కామ 2క్రోధ 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములు :-
[4-96-వ.]

1003} కామక్రోధాదులు  - అరిషడ్వర్గములు, 1కామ 2క్రోధ 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములు :-
[5.1-87-క., 7-117.1-ఆ.]

1004} కామదుఘములు  - కామధేనువులు వంటివి, కామదుఘ కామధేనువు :-
[4-582-వ.]

1005} కామధేనువు  - కామ (కోరినవి యిచ్చెడి) ధేనువు (ఆవు) :-
[3-288-వ., 6-326-వ., 9-230-వ.]

1006} కామపాలుడు  - వ్యు. కామాన్ పాలయతి, కామ+పాల+అణ్, కృ.ప్ర., భక్తుల కోరికలను తీర్చి పాలించువాడు, బలరాముడు. :-
[10.2-543-చ.]

1007} కామము  - 1. వస్తువులు ధనము స్త్రీలాదులు కావాలనెడి చిత్తవృత్తి, 2. ఇంద్రియ విషయములైన ఆహార నిద్రా భయ సంగమ పుష్ప చందనాదుల యెడ లాలస, విషయాసక్తి, 3. శబ్దాదు లందు గల రాగద్వేష రూపములైన అభిలాషలు కలిగి ఉండుట :-
[10.1-537-వ., 10.1-1655-క., 10.1-1659-ఆ.]

1008} కామముఖషట్కము  - అరిషడ్వర్గములు, 1కామ 2క్రోధ 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములు :-
[1-126-ఉ.]

1009} కామాది  - అరిషడ్వర్గములు, 1కామ 2క్రోధ 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములు :-
[7-371-వ., 9-152-ఆ., 10.1-1046-మ.]

1010} కామాదులు  - అరిషడ్వర్గములు, 1కామ 2క్రోధ 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములు :-
[7-460-వ.]

1011} కామారాతి  - కాముని (మన్మథుని) కి శత్రువు, శివుడు :-
[3-461-మ.]

1012} కామితమునిరాజయోగికల్పద్రుముడు  - కామిత (కోరి ఆశ్రయించిన) ముని (ఋషులకు) రాజ (రాజులకు) యోగి (యోగులకు) కల్పద్రుముడు (కల్పవృక్షము వంటివాడు), విష్ణువు :-
[12-1-క.]

1013} కామిని  - ప్రియ సంగము నందు మిక్కిలి ఆశ కలామె, స్త్రీ. :-
[1-409-ఉ., 3-1008-తే., 4-65-చ., 4-768-వ., 4-776-వ., 4-810-వ., 4-849-వ., 5.1-35-శా., 7-342.1-తే., 10.1-80-ఉ., 10.1-777-మ., 10.1-791-మ., 10.1-1281-క., 10.1-1437-శా., 10.2-262-వ.]

1014} కాముడు  - కామమును ప్రేరేపించు వాడు, మన్మథుడు :-
[3-377.1-తే.]

1015} కాయ  - చెట్టునకు కాయు కాయ, 2.కాయము చెట్టు :-
[3-39-క.]

1016} కారణభూతము  - కార్యకారణన్యాయములో కారణము ఐ ఉండునది :-
[10.1-1503-వ.]

1017} కారణభూతులు  - సృష్టి స్థితి లయాదులకు కారణమైనవారు :-
[10.1-1503-వ.]

1018} కారణము  - దానికి (కార్యమునకు) హేతువు (కర్మ?), ప్రపంచసృష్టికి కారణములు ఐన అవ్యక్తము మహత్తు అహంకారము పంచతన్మాత్రలు పంచభూతములు :-
[3-201.1-తే., 10.2-1204.1-తే., 10.2-1230-వ.]

1019} కారణవిగ్రహము  - ప్రయోజనార్థమైన జన్మ :-
[5.1-156-ఉ.]

1020} కారణాత్మ  - కారణభూతమైన ఆత్మ, విష్ణువు :-
[4-704-తే.]

1021} కారణావస్థలు  - అవ్యక్త మహదాదులు :-
[10.2-1230-వ.]

1022} కారుణ్యనిధి  - కారుణ్యము (దయ)కు నిధి వంటివాడు, బ్రహ్మదేవుడు. :-
[7-75-క.]

1023} కారుణ్యాకరుడు  - కారుణ్య (దయ)కి ఆకరుడు (నిధి వంటి వాడు), రాముడు :-
[10.2-1-క.]

1024} కార్చిచ్చు  - అడవి తగులబడునప్పటి పెద్ద నిప్పు, దావాగ్ని, దహించు అగ్ని :-
[2-180-మ., 2-180-మ.]

1025} కార్యకారణనియమము  - ప్రతి కార్యమునకు కారణము ప్రతి కారణమునకు కార్యము ఉంటుంది ఇది సృష్టి నియమము :-
[10.2-1230-వ.]

1026} కార్యకారణసంబంధము  - సృష్టిలో కార్యము కారణములకు అవినాభావ (విడదీయరాని) సంబంధము కలదు అన్నది ప్రమాణము :-
[10.1-558-త.]

1027} కార్యభూతములు  - కార్యకారణ సూత్రములోని కార్యరూపులు అయినవి. :-
[3-202-వ.]

1028} కార్యము  - చేయబడినది (క్రియ), కార్యకారణములలో అదృశ్య శరీరము కారణము అయిన దాని కార్యము, కారణము వలన కలుగునది, ప్రపంచము :-
[2-252-వ., 3-201.1-తే., 3-738-వ., 3-1028.1-తే., 10.2-1204.1-తే., 10.2-1230-వ.]

1029} కార్యలింగం  - ప్రారబ్దలింగ శరీరము ప్రకృతి లక్షణముల ద్వారా కలిగినది ప్రారబ్దము. ప్రారబ్దం వలన కలిగిన లింగ దేహం :-
[1-381-వ.]

1030} కాలకంఠుడు  - నల్లని కంఠము కలవాడు, శివుడు :-
[10.1-905-వ., 10.1-1321-వ., 10.2-440-తే.]

1031} కాలకన్యక  - కాలము వలన జన్మించెడియామె, ముసలితనము :-
[4-817-వ.]

1032} కాలకేయులు  - మారీచునకు కలక యందు కలిగిన 1,400 అసుర సంతతి :-
[8-182-వ.]

1033} కాలగళుడు  - కాల (నల్లని) గళుడు (కంఠము గలవాడు), శివుడు :-
[6-362-క.]

1034} కాలచకితుడు  - కాల ప్రభావమున కలుగు మరణాదులకు భయపడువాడు, కాలముచేత వెరచువాడు :-
[10.1-1631.1-ఆ.]

1035} కాలచక్రము  - అఖండమై నిమేష ఘటిక దిన మాస సంవత్సరాది కాలావయవము లనెడి భేదములచే చక్ర భ్రమణయుక్తమైన కాలము :-
[10.1-681-వ.]

1036} కాలత్రయము  - 1భూత 2భవిష్య 3వర్తమాన కాలములు :-
[3-997-వ., 8-227-ఆ.]

1037} కాలపరవశుడు  - కాలప్రభావమునకు లోనైనవాడు, మరణించినవాడి :-
[9-218-క.]

1038} కాలపరిణామస్థితి - కాలస్థితి మాఱి ప్రపంచ వృత్తితో కూడి అహంకార రూపముగా పరిణమించునట్టి స్థితి :-
[10.1-537-వ.]

1039} కాలపుత్రిక  - అవసాన కాలమున జనించునది :-
[4-811-క.]

1040} కాలము  - నిమేషము మొదలు ప్రళయము తుదిగాఁ ప్రవాహరూపమున గలది, సర్వము కలిగించెడిది కాలము :-
[10.1-8-ఆ., 10.1-684-క.]

1041} కాలయవనుడు  - కృష్ణనిచే ప్రేరేపితుడై అతని వెన్నంటి ముని చూపు వలని అగ్నిలో మరణించినవాడు :-
[2-190-చ.]

1042} కాలవశత  - కాలమునకు లొంగుట, చావు :-
[9-73.1-తే.]

1043} కాలశాంఖికుడు  - సమయము తెలుపుటకై చాటింపు వేయువాడు, సమయసూచకుడు :-
[10.1-1306.1-తే.]

1044} కాలసూత్రము  - ఇనప తంతులుగలది, నరక విశేషము :-
[5.2-136-వ., 5.2-141.1-ఆ.]

1045} కాలాంజనము  - 1. కాలము అనెడి అంజనము, ఎట్టి కష్టమైన మరపునకు పంపు అంజనము, 2. చక్కటి దృష్టికి తోడ్పడునది :-
[5.1-118-వ.]

1046} కాలాహ్వయుడు  - కాలము అని పేర్కొనబడు వాడు, విష్ణువు :-
[3-366-క.]

1047} కాలుపురి  - కాలు (యముని) పురి (పట్టణము), నరకము :-
[9-162-చ.]

1048} కాళి  - భయంకర రూపమున ఉన్న శక్తిస్వరూపిణి, కాళికాదేవి :-
[5.1-130-క.]

1049} కాళిందనందన  - కాళింద పర్వతమునందు పుట్టినది, యమునానది :-
[10.1-1101-వ.]

1050} కాళింది  - కళింద పర్వతుని పుత్రిక, యమునానది :-
[10.1-1228-వ.]

1051} కాళిందీజలవర్ణుడు  - కాళిందీ (యమునా నది) యొక్క జల (నీటి) వలె నల్లని వర్ణుడు (రంగు దేహము కలవాడు), కృష్ణుడు :-
[10.1-632-క.]

1052} కాళిదాసు  - మేఘసందేశం, రఘువంశం, కుమారసంభవం మున్నగునవి వ్రాసిన మహా గొప్ప పండితుడు, ఇతనిని మించిన కవి లేడు :-
[6-11.1-తే.]

1053} కావిడి  - రెండు కొసలలోను వస్తువు లుంచుకొనెడి చిక్కములు కల భుజమున మోపుకొన వీలగు అడ్డకఱ్ఱ ఉండే పరికరము :-
[10.1-455-వ.]

1054} కావ్యము(ప్ర)  - కబ్బము (వి), కవిత్వము :-
[10.1-351-క.]

1055} కావ్యుడు  - భృగువు పుత్రుడైన కవి యొక్క పుత్రుడు, శుక్రుడు :-
[8-609-ఆ., 8-680.1-తే.]

1056} కాశి  - ప్రకాశింపజేయునది, వారణాశి పట్టణము :-
[10.1-1411-వ.]

1057} కాశ్యపుడు  - కశ్యపునికి సంబంధించినవాడు, కశ్యప ప్రజాపతి వంశంలో ఉలూక మహర్షికి పుత్రునిగా జన్మించినవాడు, ఔలూక్యుడు, కణాద మహర్షి, అణుసిద్ధాంతం కార్యకారణ సిద్ధాంతం వంటి అత్యుద్భతమైన ప్రతిపాదించిన మహానుభావుడు :-
[8-136-వ.]

1058} కాష్ఠ  - పదునెనిమిది రెప్పపాటుల కాలము,2. కఱ్ఱ :-
[10.2-430-వ.]

1059} కాసారము  - కః (నీరు)చేత శ్రేష్ఠమైనది, చెరువు :-
[10.2-153.1-తే.]

1060} కాసు  - 1.రాగినాణెము, దమ్మిడిలో (రూపాయిలో 64వ వంతు కాని కానిలో 3వ వంతు దమ్మిడి) సగము ద్రవ్యమానము, 2.కాసున్నర ఐతే తులము, 12 అణాల బంగారము తులామానము, కాసులపేరు అను కంఠాభరణము నందలి బిళ్ళ :-
[10.2-965.1-తే.]

1061} కింకిణీయుతమేఖలాకీర్ణజఘనుడు  - కంకిణీ (గజ్జలు) యుత (కలిగిన) మేఖలా (వడ్డాణము) తో ఆకీర్ణ (కూడిన) జఘనుడు (నడుము కలవాడు) :-
[3-922.1-తే.]

1062} కింపురుషులు  - నరుని ముఖము అశ్వ దేహము కల దేవయోనివారు, దేవగాయకులు :-
[2-274.1-తే.]

1063} కిటీశుడు  - కిటి (వరాహము, పంది) రూపమున ఉన్న ఈశుడు (ప్రభువు), విష్ణువు :-
[3-425.1-తే.]

1064} కిన్నెరలు  - అశ్వ ముఖము నర దేహము కల దేవయోనివారు, దేవగాయకులు :-
[2-274.1-తే.]

1065} కిరి  - అడవి పంది, వరాహము :-
[3-647-క.]

1066} కిరిపతి  - కిరి (వరాహము) పతి (ప్రభువు), వరాహావతారుడు :-
[6-304-చ.]

1067} కిశోరవయస్సు  - బాల్యమునకును యౌవనమునకును మధ్య వయసు, అవస్థాష్టకములో మూడవది 10 నుండి 15 సంవత్సరముల వరకు :-
[3-817-వ.]

1068} కీకట  - గ్రామ ప్రదేశము :-
[5.1-64-వ.]

1069} కీడుకన్ను  - అదురుట ద్వారా కీడు సూచించు కన్ను, మగవారికి ఎడమకన్ను స్త్రీలకు కుడికన్ను :-
[10.1-649-క.]

1070} కీర్తనీయతీర్థయశోమహనీయమూర్తి  - కీర్తనీయ (పొగడదగిన) తీర్థ (పుణ్యవంతమైన) యశస్సు కల మహనీయ మూర్తి (స్వరూపము కలవాడు), విష్ణువు :-
[3-924.1-తే.]

1071} కీర్తనీయమహారణుడు  - కీర్తనీయ (ప్రశంసనీయమైన) మహా (గొప్ప) రణుడు (యుద్ధము చేయువాడు), విష్ణువు :-
[6-529-త.]

1072} కీర్తిపూరణుడు  - తన కీర్తిచే విశ్వమంతను పూరణుడు (నింపినవాడు), విష్ణువు :-
[6-529-త.]

1073} కీలి  - కీలలు కలవాడు, అగ్ని :-
[1-293-వ.]

1074} కుంచితచూడ్కులు  - సగము మూయబడిన చూపులు, రాసక్రీడా పారిభాషిక పదము. :-
[10.1-1084-వ.]

1075} కుంజరపాలకుడు  - ఏనుగు కావలివాడు, మావటి :-
[10.1-1320-క.]

1076} కుంజరపాలుడు  - కుంజరము (ఏనుగు)ను కాచువాడు, మావటి :-
[10.1-1317-శా.]

1077} కుంజరము  - వ్యు. కుంజః (ప్రశస్తః) అస్తిఅస్య కుంజ+రః, త.ప్ర., మేలైన దంతము చెక్కిలి పై భాగము కలది, ఏనుగు, ఆంధ్రశబ్దరత్నాకరము :-
[8-124-క.]

1078} కుంజరుడు  - ఏనుగు వంటివాడు, శ్రేష్ఠుడు :-
[3-251-క.]

1079} కుండలి  - కుండలాకార శరీరము కలది, సర్పము :-
[10.2-502-మ.]

1080} కుండలీకరణబంధము  - ఒంటికాలితో నిలిచి చక్రాకారముగ గిరుక్కున తిరుగుచు హస్త విన్యాసాదులను కనబరచునది, కుండలాకారముగ అందరి చేతులు పైకెత్తుకొని లయ తప్పక నటించునది, , రాసక్రీడా పారిభాషిక పదము. :-
[10.1-1084-వ.]

1081} కుండలీశ్వరుడు  - కుండలీ ఆకారము కలవాని (సర్పములకు) ప్రభువు, శేషుడు :-
[10.2-1252-వ.]

1082} కుంతిభోజనందన  - కుంతల దేశ రాజైన భోజుని కూతురు, కుంతీదేవి :-
[10.2-694-వ.]

1083} కుంతీభోజతనయ  - కుంతల దేశ రాజైన భోజుని కూతురు, కుంతీదేవి :-
[3-63-తే.]

1084} కుంతీసుతాగ్రజుడు  - కుంతీ (కుంతి యొక్క) సుత (పుత్రులలో) అగ్రజుండు (పెద్దవాడు), ధర్మరాజు :-
[1-345-వ., 10.2-765-వ.]

1085} కుంభకము  - ప్రాణవాయువు ముక్కుద్వారా లోనికి తీసుకొని నిలబెట్టుట, ప్రాణాయామ పారిభాషిక పదము :-
[3-921-వ.]

1086} కుంభకర్ణుడు  - కుండలవంటి చెవులు కలవాడు, రావణుని తమ్ముడు :-
[4-26-వ.]

1087} కుంభజుడు  - కుంభమున పుట్టిన వాడు, అగస్త్యుడు, ద్రోణుడు :-
[1-189.1-తే., 6-439.1-ఆ., 10.2-766.1-ఆ.]

1088} కుంభజుడు  - కుంభములో (ద్రోణిలో) పుట్టినవాడు, ద్రోణుడు, కౌరవ పాండవులకు గురువు :-
[1-79.1-ఆ.]

1089} కుంభసంభవుడు  - కుంభమున పుట్టిన వాడు, అగస్త్యుడు, ద్రోణుడు :-
[6-192-వ., 10.2-1117-ఉ.]

1090} కుంభి  - కుంభస్థలము కలది, ఏనుగు :-
[9-118-చ., 9-444-మ., 10.1-1321-వ., 10.1-1562-వ.]

1091} కుంభినీచక్రభర్త  - కుంభినీ (భూ) చక్ర (మండలమునకు) భర్త (నాథుడు), రాముడు :-
[7-481-మాలి.]

1092} కుంభినీధరములు  - కుంభిని (భూమిని) ధరములు (మోసెడివి), కులపర్వతములు :-
[7-285-వ.]

1093} కుంభినీధరుడు  - వరహావతారములో కుంభిని (భూమండలమును) ధరుడు (ధరించిన వాడు), విష్ణువు :-
[5.2-45-ఆ., 10.2-406-వ.]

1094} కుంభినీధవుడు  - కుంభినీ (భూదేవి కి) (వరాహాతారమున) ధవుడు (భర్త), విష్ణువు :-
[7-169.1-తే.]

1095} కుంభీనసము  - విషజ్వాలలుగ్రక్కెడి పాము, ఆదిశేషుడు :-
[7-285-వ.]

1096} కుంభీపాకము  - కుంభము (కుండల)లో వేసి పాకము (వండుట), నరకవిశేషము :-
[5.2-136-వ., 5.2-140-వ.]

1097} కుక్షింభరుడు  - పొట్టపోసుకొనుట మాత్రము తెలిసినవాడు :-
[3-990-వ.]

1098} కుచేలుడు  - పాడైన చేలము కలవాడు :-
[10.2-980-మ.]

1099} కుజనవినాశుడు  - కుజనులను (దుష్టులను) వినాశుడు (నాశనము చేయువాడు), శివుడు. :-
[4-62-క.]

1100} కుజము  - కు (భూమి) అందు జములు (పుట్టినవి), వృక్షములు :-
[3-838.1-తే., 4-940-చ., 6-198-క.]

1101} కుటజము  - కు (భూమి) అందు జములు (పుట్టినవి), వృక్షములు :-
[8-208-వ.]

1102} కుతలోద్ధర్త  - కుతలము (భూమి)ని ఉద్ధర్త (ఉద్దరించినవాడు), విష్ణువు :-
[3-678-మ., 10.1-876-మ.]

1103} కుదురు  - కుదురుగా నిలుచుటకు ఏర్పరచెడి పీఠము, కుండ కదలకుండ కుండ క్రింద పెట్టెడి గుండ్రని చుట్ట :-
[8-199-క., 10.1-354-వ.]

1104} కుబేరదిక్తటము  - ఉత్తరపు (దిక్పాలకుడు కుబేరుని దిక్కు) దిక్కు (దిక్కు తటము), ఉత్తరపు దిక్కు :-
[4-112-చ.]

1105} కుబేరుడు  - గుహ్యకుల నాయకుడు, ధనాధిపతి, ఉత్తర దిక్పాలకుడు, గుటకవేయుటకు మ్రింగుటకు నాయకుడు, :-
[4-26-వ.]

1106} కుమారవర్గము - సనకాదులు, 1సనకుడు 2సనందనుడు 3సనత్కుమారుడు 4సనత్సుజాతుడు అను బ్రహ్మకుమారులైన దేవర్షులు :-
[3-1019-మ., 6-458.1-తే., 6-500-ఉ., 10.2-1048-చ.]

1107} కుమారశేఖరుడు  - పిల్లలో శ్రేష్ఠుడు, కృష్ణుడు :-
[10.1-306-వ.]

1108} కుమారుడు  - కుచ్ఛితం స్వేతర బుద్ధిం మారయతి మాశయతీతి కుమారః (వ్యు), [కుమార+ఘఞ్, కుమారయతి క్రీడతి] ఆడుకొనువాడు. పిల్లవాడు. :-
[10.1-1253-మ.]

1109} కుముద  - మానసక్షేత్రమున కుముద (భూమికి సంతోషమును కలుగజేయునామె, భూలోకులకు ఆనందము కలిగించెడియామె, రాక్షసులను నవ్వుచునే (వంచనతో కూడిన) చంపెడి యామె) :-
[10.1-61-వ.]

1110} కుమ్మరిసారె  - కుండలు చేయువాని చక్రము :-
[10.2-400.1-తే.]

1111} కుయ్యాలించి  - కుయ్యి (కూయి, మొఱ) ఆలించి (విని), మొఱ విని :-
[2-148-మ.]

1112} కురంగము  - వ్యు. కు+రంగ్+అచ్, కౌ రంగతి, భూమిపై ఆనందంగా పరుగెత్తునది. లేడి, జింక. :-
[5.2-30-వ.]

1113} కురంగలోచన  - లేడివంటి బెదురుచూపులు కల స్త్రీ. :-
[10.2-265-ఉ.]

1114} కురంగాక్షి  - లేడివలె బెదురుచూపులు కల వనిత :-
[9-610-శా.]

1115} కురరము  - 1. లకుమిక పిట్ట, 2. గోరువంక :-
[5.2-30-వ.]

1116} కురుకుంజరుడు  - కురువంశానికి ఏనుగు వంటి (పెద్ద) వాడు, భీష్ముడు :-
[1-216-వ.]

1117} కురుకులేశ్వరుడు  - కురు వంశమునందలి ప్రభువు, దుర్యోధనుడు :-
[10.2-818-ఆ.]

1118} కురుక్షేత్రము  - హస్తినాపురమునకు దగ్గరలోని ఒక ప్రదేశము, కౌరవ పాండవులు యుద్ధము చేసిన చోటు :-
[3-130-వ., 7-451-వ.]

1119} కురుసత్తముడు  - కురువంశమున శ్రేష్ఠుడు, ధర్మరాజు :-
[10.2-701-చ.]

1120} కులదీపకుడు  - కుల (వంశమును) దీపకుండు (ప్రకాశింప జేయువాడు), ప్రహ్లాదుడు :-
[7-157-వ.]

1121} కులదేవత  - వంశస్థుల ప్రధాన ఆరాధ్య దైవము :-
[5.2-32-వ.]

1122} కులపర్వతములు  - సప్తపర్వతములు 1 మహేంద్రగిరి 2 మలయపర్వతము 3 సహ్యాద్రి 4 శుక్తిమంతము 5 ఋక్షవంతము 6 వింధ్యపర్వతము 7 పారియాత్రము, మహేంద్రోమలయస్సహ్యశ్శుక్తిమాన్ గంధమాదనః. వింద్యశ్చపారియాత్రాశ్చసప్తై తే కులపర్వతాః :-
[3-603-తే., 5.2-18-క., 7-451-వ.]

1123} కులవిరహితుడు  - సమస్తము తానగుటచేత జాతి విభజన లేనివాడు, కృష్ణుడు :-
[10.1-901-క.]

1124} కులాద్రీంద్రము  - కులపర్వతములలో శ్రేష్ఠమైనది, కైలాస పర్వతము :-
[3-431-మ.]

1125} కులిశహస్తుడు - కులిశము హస్తమున కలవాడు, ఇంద్రుడు :-
[1-398.1-ఆ.]

1126} కువలయజనవినుత  - కువలయ (భూమండలము యొక్క) జన (సర్వ ప్రజలచేత) వినుత (స్తుతింపబడువాడు), శ్రీరాముడ :-
[10.1-1790-క.]

1127} కువలయదళనీలవర్ణకోమలదేహుడు  - కువలయ (నల్లకలువ) యొక్క దళ (రేకులవంటి) వర్ణ (రంగు కలిగిన) కోమల (మృదువైన) దేహుడు (శరీరము కలవాడు), శ్రీరాముడు :-
[10.1-1790-క.]

1128} కువలయనాథశిరోమణి  - కు (భూమి) వలయ(మండలమును) నాథ (ఏలువారిలో) శిరోమణి (తలమీది మణివలె శ్రేష్ఠమైన వాడు), శ్రీరాముడు :-
[10.1-1790-క.]

1129} కువలయభరణోద్ధాముడు  - కువలయము (భూమి)ని భరణ (మోయుట) అందు ఉద్దాముడు (అధికుడు), విష్ణువు :-
[3-633-క.]

1130} కువలయరక్షాతత్పరుడు  - కు (భూమి) వలయ (మండలమును) రక్షా (కాపాడుట యందు) తత్పరుడు (ఆసక్తి కలవాడు), శ్రీరాముడు :-
[10.1-1790-క.]

1131} కువలయాక్షి  - కువలయము (కలువ)ల వంటి కన్నులు ఉన్నామె (స్త్రీ) :-
[3-817-వ.]

1132} కువలయాపీడము  - కు (భూ) వలయ (మండలమును) పీడము (భాధించునది), కంసుని ఏనుగు పేరు :-
[10.1-1315-క., 10.1-1627-మ.]

1133} కువలయాబ్జాకరము  - కువలయ (కలువల) అబ్జ (తామరల) కు ఆకరము (ఉనికిపట్టు), సరస్సు. :-
[10.1-1602-క.]

1134} కువలయేశుడు  - కువలయము (భూమి)కి ఈశుడు (ప్రభువు), రాజు. :-
[9-31-ఆ.]

1135} కువలయేశ్వరుడు  - కువలయము (భూమండలము)నకు ఈశ్వరుడు, రాజు :-
[10.2-92.1-తే.]

1136} కుశలు  - దర్భలు, 1. కు+శీ+డ, కౌ శేతే, భూమిలో వుండునది. దర్భ. 2. క+తో+డ, కుం పాపం శ్యతి నాశయతి, పాపమును నశింప చేయునది. దర్భ. :-
[5.2-63.1-తే.]

1137} కుశస్థలి  - 1. మధురాపురము జరాసంధుని దాడి పిమ్మట కృష్ణునకు ఇది ముఖ్యపట్టణము అయి ఉండెను. 2 దీని శ్రీరాముని కొమరుఁడు ఐన కుశుఁడు నిర్మాణము చేసెను ఇది వింధ్యపర్వత ముఖమున (కోసలమున) ఉండును ఆంధ్రశబ్దరత్నాకరము, 3. తొలుత ఇది ఆనర్తునిచే నిర్మింపఁబడి ఆనర్తదేశములకు రాజధాని అయి ఉండినట్లు తెలియవస్తున్నది, 4. రైవతదుర్గము ఉండిన ఒక పట్టణము. :-
[10.2-970-చ.]

1138} కుశావర్తము  - దర్భలు లేదా నేర్పరులు కల దేశము, భారతవర్షము నందలి దేశము :-
[5.1-64-వ.]

1139} కుసుంభము  - కుంకుమ పువ్వు, వ్యు. కు+సుభి+అచ్+నుమ్, కౌ పృథివ్యాం సుంభతి శోభతే, భూమిలో ప్రకాశించునది. కుసుమ; కుంకుమ పూవులు :-
[5.2-30-వ.]

1140} కుసుమబాణుడు  - పూలబాణముల వాడు, మన్మథుడు :-
[9-177-ఉ.]

1141} కుసుమశరుడు  - పూలబాణముల వాడు, మన్మథుడు :-
[10.1-1040-ఆ., 10.1-1713.1-ఆ.]

1142} కుసుమాస్త్రుడు  - పూలబాణముల వాడు, మన్మథుడు :-
[9-308-ఉ.]

1143} కుహువు  - అమావాస్యా భేదము, చంద్రకళ కానరాని యమావాస్య. :-
[5.2-62-వ.]

1144} కుహూ  - అమావాస్యా భేదము, చంద్రకళ కానరాని యమావాస్య. :-
[4-25-క., 6-507-వ.]

1145} కూటస్థము  - దేహము అనెడి గూటిలో ఉండెడిది, ఆత్మ :-
[4-540-వ.]

1146} కూటస్థుడు  - సర్వదేహములందు సర్వకాల సర్వావస్తలందు ఒక్కవిధముగ జీవుడుగా వసించెడివాడు :-
[2-84-వ., 4-459-వ., 7-361-క., 10.1-682.1-తే., 10.2-88.1-తే.]

1147} కూపారము  - దాటరానిది, కడలి :-
[10.1-6-క.]

1148} కూబరద్వయము  - 1.బండి నొగలు, 2. శోక, మోహములకు సంకేతము :-
[4-771.1-తే.]

1149} కూబరము  - రథములకు బండ్లకాడికి ఆధారముగ ముందుండెడి పొడవాటి చట్రము, నొగ :-
[10.1-1558-వ.]

1150} కూర  - వంటకు పనికొచ్చే శాకాహారముు, కాయగూర :-
[3-39-క.]

1151} కూర్మము  - తాబేలు, వ్యు. కుత్సితః ఊర్మిః యస్య, వృషోదరాదిః, బవ్రీ., అల్ప వేగము కలది :-
[2-143-వ.]

1152} కూశ్మాండ  - పిశాచభేదము :-
[2-274.1-తే., 6-307-వ.]

1153} కృకలాసము  - కంఠముతో ఆడునది, ఊసరవెల్లి, తొండ :-
[10.2-456-ఉ.]

1154} కృతకము  - స్వతసిద్ధం కాక మానవులచే చేయబడినది, కృత్రిమమైనది :-
[10.2-275-వ.]

1155} కృతకృత్యుండు  - చేయవలసినది నెరవేర్చినవాడు, ధన్యుడు :-
[4-304-క.]

1156} కృతఘ్నుడు  - చేసిన మేలు మరచు వాడు :-
[2-133-వ.]

1157} కృతలో  - పూర్తి ధర్మము ఉండును, నాలుగు పాదములు, ధర్మము నాలిగింట నాలుగు (4, 4) వంతులు కలిగి ఉండును :-
[3-350-వ., 3-350-వ.]

1158} కృతాంతుడు  - అంతము చేసెడివాడు, యముడు :-
[6-370-వ., 10.1-1334-మ.]

1159} కృతార్థుడు  - కృత (నెరవేరిన) అర్థుడు (ప్రయోజనము గలవాడు), ధన్యుడు :-
[3-780-వ., 5.2-53.1-ఆ.]

1160} కృత్తికాదినక్షత్రత్రయంబు  - 1కృత్తిక 2రోహిణి 3మృగశిర యనెడి మూడు నక్షత్రములు :-
[5.2-97-వ.]

1161} కృత్య  - సంహారార్థము ప్రయోగింపబడిన క్షుద్రదేవత :-
[9-102-చ., 10.2-533-వ.]

1162} కృపాకల్పుడు  - దయ ఆభరణముగా కలవాడు, విష్ణువు :-
[10.1-1236-దం.]

1163} కృపాగుణభూషణుడు  - దయాగుణమే అలంకారముగ కలవాడు, విష్ణువు :-
[3-548-ఉ.]

1164} కృపాపయోనిధి  - దయ అను సముద్రము (పయోనిధి) వంటివాడు, విష్ణువు :-
[3-212-చ.]

1165} కృపాపాత్రుడు  - దయకు పాత్రుడు, దీనుడు :-
[3-288-వ.]

1166} కృపాపాథోధి  - దయకు పాధోథి (సముద్రము) వంటి వాడు, విష్ణువు :-
[3-373-మ.]

1167} కృపాపారీణుడు  - దయ సంపూర్ణముగా కలవాడు, శ్రీకృష్ణ :-
[5.1-181-మ.]

1168} కృపామయలోచనుడు  - కృప (దయ) మయ (తో) కూడిన లోచనుడు (కన్నులు కలవాడు), విష్ణువు :-
[3-571-చ.]

1169} కృపాలుడు, కృపాళిడు  - అనుగ్రహించు స్వభావము కలవాడు, కృష్ణుడు, శివుడు :-
[4-697-వ., 10.1-845-క.]

1170} కృపావాసుడు  - కృప (దయ)కు ఆవాసుడు (నివాసమైనవాడు), విష్ణువు. :-
[6-1-శా.]

1171} కృపాస్పదుడు  - దయకు నివాసమైనవాడు, విష్ణువు :-
[6-327.1-తే.]

1172} కృపి  - కృపాచార్యుని చెల్లెలు, ద్రోణుని భార్య, అశ్వత్థామ తల్లి :-
[1-160-వ.]

1173} కృపీటభవము  - కృపీట (ఉదకమున) భవము (పుట్టినది), అగ్ని :-
[11-97-వ.]

1174} కృశానుడు  - తనను తాకినవానిని కృశింపజేయువాడు, అగ్ని :-
[10.1-1236-దం., 10.1-1556-చ., 10.2-441-వ.]

1175} కృశోదరి  - అణగిన కడుపు కల స్త్రీ. :-
[10.2-349-ఉ.]

1176} కృషీవలుడు  - వ్యవసాయము చేయువాడు, రైతు :-
[10.1-1562-వ.]

1177} కృష్ణ  - హస్తినాపురక్షేత్రమున కృష్ణ (సృష్టి స్థితి సంహారము తిరోధానము అనుగ్రహము అనెడి పంచ (5) కృత్యములు చేసెడి యామె, మహామునుల మనసులను ఆకర్షించెడి యామె) :-
[10.1-61-వ.]

1178} కృష్ణపక్షము  - నల్ల (చీకటి) రాత్రులు ఉండు పక్షము, అమావాస్య ముందటి రోజులుకల పక్షము :-
[3-346-వ., 7-448-వ.]

1179} కృష్ణుడు  - 1. నల్లనివాడు, 2. భక్తుల హృదయములు ఆకర్షించువాడు, 3. శ్లో. కృషిర్భూవాచకశ్శబ్దో నశ్చ నిరృతివాచకః, పూర్ణానంద పరబ్రహ్మ కృష్ణ ఇత్యభీయతే., పూర్ణానంద పరబ్రహ్మము, కృష్ణుడు, నల్లనివాడు, 4. కృఞకరణే అను ధాతువుచేత సృష్టిస్థితిలయములను చేయువాడు, 5. శ్లో. కృషిర్భూవాచకశ్శబ్దోనశ్చ నిర్వృతివాచకః, తయోరైక్యాత్పరంబ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే (ప్రమాణము), అజ్ఞానబంధమును తెంచివేయువాడు, కృష్ణుడు :-
[1-201-శా., 1-207-క., 1-228-వ., 2-192-మ., 2-217.1-తే., 3-116-మ., 3-154-క., 4-703.1-తే., 4-920-ఉ., 5.2-165-చ., 6-342-ఆ., 10.1-190-క., 10.1-901-క., 10.1-942-ఆ., 10.1-1556-చ., 10.2-477-ఆ., 10.2-749-ఆ., 10.2-1137.1-తే.]

1180} కృష్ణునిపట్టణము  - ద్వారక :-
[10.2-365-క.]

1181} కేక  - నెమలి కంఠధ్వని :-
[10.2-1323-వ.]

1182} కేకి  - కేకవేయునది నెమలి :-
[2-50.1-ఆ.]

1183} కేవలుడు  - సమస్తమూ కేవలము తానే అయిన వాడు :-
[2-110-మ.]

1184} కేశవుడు  - విష్ణువు. వ్యు1. కేశాః ప్రశస్తాః అస్య కేశ+ వ, త.ప్ర., చక్కని వెంట్రుకలు కలవాడు, వ్యు2. కేశమ్ (కేశి రాక్షసమ్) వాతి హంతి, కేశ+వా+క, కృ.ప్ర. కేశుడు అను రాక్షసుని సంహరించినవాడు, విష్ణువు, 3.కశ్చ ఈశశ్చ కేశౌ అజ రుద్రౌ కేశాస్తః సంబంధిత్వేన అస్య కేశ+వ, త.ప్ర., బ్రహ్మ శివుడు సంబంధులై ఉన్నవాడు :-
[2-228.1-తే., 3-400-మ., 3-401-చ., 3-436-ఉ., 3-510-చ., 3-550-చ., 4-918.1-తే., 6-174-ఉ., 7-188-శా., 7-268-క., 9-82.1-తే., 10.1-236-వ., 10.2-477-ఆ.]

1185} కేశి  - కంసుని వద్ద ఉన్న కేశి అను పేరు గల గుఱ్ఱము రూపు రాక్షసుడు :-
[2-190-చ., 10.1-1627-మ.]

1186} కేసరి  - జూలు కలది, సింహము :-
[12-48-వ.]

1187} కైంకర్యము  - సేవ, కింకర+యఞ్, కింకరస్య సేవకస్య భావః కర్మ వా :-
[3-507-వ.]

1188} కైకసి  - సుమాలి కూఁతురు. విశ్రవసుని రెండవభార్య. ఈమెయందు రావణ, కుంభకర్ణ, విభీషణులను, శూర్పణఖయును పుట్టిరి. :-
[4-26-వ.]

1189} కైటభారి  - కైటభాసురుని శత్రువు, విష్ణువు :-
[2-51.1-ఆ.]

1190} కైరవహితుడు  - కలువలకు ఇష్టుడు కలువల రాయుడు చంద్రుడు :-
[2-155.1-తే.]

1191} కైలాసము  - శివుని స్థానము, కైలాసపర్వతము, వ్యు. కే+లస్+అణ్, కే జలే లాసః దీప్తిః యస్య, కేలసః స్ఫటికః తం ఇవ శుభ్రః, స్ఫటికమువలె శుభ్రంగా తెల్లగా నున్నది. కైలాసపర్వతము. :-
[9-112-వ.]

1192} కైవల్యపదము  - కేవలము తానే భగవంతుడు అగు స్థితి, పరమపదము, మోక్షము :-
[4-540-వ., 10.1-973-మ., 11-33-వ.]

1193} కైవల్యము  - కేవలము తానే భగవంతుడు అగు స్థితి, పరమపదము, మోక్షము :-
[1-192-వ., 2-11-క., 3-203-దం., 3-304.1-తే., 3-507-వ., 8-137-క., 10.2-1337-మ., 11-43-వ.]

1194} కైశోరము  - మంచిచెడ్డలు చెప్పినను తెలిసికోజాలని దశ (10 నుండి 15 ఏళ్లవరకు) :-
[10.1-1392.1-తే.]

1195} కొంగు  - వంటిమీది వస్త్రపు చివర, వస్త్రపు చెఱగు, చెంగు, పైట :-
[3-470-క.]

1196} కొండరాచూలిపెనిమిటి  - కొండ (పర్వత) రా(రాజు) చూలి(పుత్రిక యైన పార్వతి) యొక్క పెనిమిటి(భర్త) :-
[6-490.1-తే.]

1197} కొమరాలు  - కొమరు (మనోజ్ఞత) రాలు (కల స్త్రీ), సుందరి :-
[3-787-తే., 9-72-ఆ.]

1198} కోడలు  - కొడుకు పెండ్లాము :-
[10.2-106-క.]

1199} కోణపుడు - నైరృతిదిక్పాలకుడు, నైరృతుడు, మూలఱేఁడు, నిరృతి :-
[2-38-వ.]

1200} కోదండము  - ధనుస్సులలో విశేషము, వెదురు విల్లు :-
[10.2-17-మ.]

1201} కోవిదవంద్యుడు  - కోవిదుల (పండితుల)చే వంద్య (నమస్కరింపబడువాడు), విష్ణువు. :-
[7-361-క.]

1202} కోసలక్షోణిభర్త  - కోసల అనెడి క్షోణి (రాజ్యాని)కి భర్త (రాజు), రాముడు :-
[11-126-మాలి.]

1203} కోసలక్ష్మాభృత్సుత  - కౌసల్య, కోసల అనెడి క్ష్మా (రాజ్యాని)కి భృత్ (రాజు) సుత, కోసల రాకుమారి :-
[2-155.1-తే.]

1204} కోసలేంద్రుడు  - కోసలదేశ రాజు, నగ్నజిత్తు :-
[10.2-141-వ.]

1205} కౌంతేయాగ్రజుడు  - కుంతి పెద్ద కొడుకు, ధర్మరాజు :-
[1-324-వ.]

1206} కౌమారము  - బాల్యము తరువాత యౌవనమునకు ముందు దశ, బాల్యం; కౌమారం, యౌవనం, వార్ధక్యం. అను అవస్థా చతుష్కములో రెండవది :-
[3-109-ఉ.]

1207} కౌమారాఖ్యలు  - సనకుడు, సనందనుడు, సనత్ కుమారుడు, సనత్ సుజాతుడు :-
[1-63-వ.]

1208} కౌరవముఖ్యుడు  - కురువంశపు రాజులలో ముఖ్యమైన వాడు, పరీక్షిత్తు. :-
[10.1-632-క.]

1209} కౌరవుడు  - కురువంశపు వాడు, దుర్యోధనుడు :-
[10.2-579-ఉ.]

1210} కౌరవులు  - కురువంశపువారు, ధృతరాష్ట్రుని కుమారులు వందమంది (100) :-
[10.2-560.1-తే.]

1211} కౌరవేంద్రుడు  - కురువంశపు రాజు, దుర్యోధనుడు :-
[1-353-శా.]

1212} కౌరవేశ్వరుడు  - కురువంశపు రాజు, పరీక్షిత్తు :-
[2-9.1-ఆ.]

1213} కౌరవ్యవంశాగ్రణి  - కురువంశమునకు పెద్దవాడు, ధృతరాష్ట్రుడు. :-
[3-24-మ., 10.2-1334-మ.]

1214} కౌశికుడు  - కుశికుని మనుమడు, విశ్వామిత్రుడు :-
[9-192.1-తే.]

1215} కౌషారవి  - కుషారవుని పుత్రుడు, మైత్రేయుడు :-
[2-282-వ.]

1216} కౌస్తుభకలితముక్తాహారయుతకంఠుడు  - కౌస్తుభ (కౌస్తుభము అను మణి) కలిత (కూడిన) ముక్త (ముత్యాల) హార (హారములుతో) యుత (కూడిన) కంఠుడు (కంఠము కలవాడు), విష్ణువు :-
[3-922.1-తే.]

1217} కౌస్తుభభూషణాంగుడు  - కౌస్తుభమణిచే భూషణ (అలంకరింపబడిన) అంగుడు (దేహము కలవాడు), కృష్ణుడు :-
[5.2-165-చ.]

1218} కౌస్తుభము  - విష్ణుమూర్తి వక్షస్థలమున ధరించెడి కౌస్తుభము అను పేరుగల ఒక మణి, వృత్పత్తి కుం (భూమిమ్) స్తుభ్నాతి కుస్తుభః సముద్రః కుస్తుభే భవః కుస్తుభః+ అణ్ కౌస్తుభః భూమిని ఆవరించి ఉన్నది అగుటచే సముద్రము కుస్తుభము అనబడును, అందు పుట్టినది కౌస్తుభము :-
[6-219.1-ఆ., 10.2-212.1-ఆ.]

1219} కౌస్తుభముఖోద్యద్భూషణాలంకరిష్ణు  - కౌస్తుభము మొదలగు ముఖ్యమైన మిక్కిలి ప్రకాశిస్తున్న భూషణములచే అలంకరింపబడినవాడు, విష్ణువు :-
[3-148-మ.]

1220} క్రతుధ్వంసి  - క్రతు (యాగమును (దక్షుని)) ధ్వంసము చేసినవాడు, శివుడు :-
[10.2-408-శా.]

1221} క్రతువు  - యజ్ఞాదులు జరపబడు విధానము, యజ్ఞము :-
[4-26-వ.]

1222} క్రవ్యాదకులాంతకుడు  - క్రవ్యాద (రాక్షస) కులమునకు అంతకుడు (యముడు), విష్ణువు :-
[10.2-166-ఉ.]

1223} క్రవ్యాదుడు  - క్రవ్యము (మాంసము) ఆదుడు (భుజించువాడు), రాక్షసుడు :-
[7-96-క., 10.1-1171-ఉ., 10.2-166-ఉ.]

1224} క్రిమిభోజనము  - అసహ్యకర క్రిములను భుజింపజేయుట, నరక విశేషము :-
[5.2-136-వ.]

1225} క్రియ  - జరుపు పని :-
[4-26-వ.]

1226} క్రూరజంతువులు  - ఇతర జంతువులను చంపి తినెడి పులి మున్నగు జంతువులు :-
[10.1-500-మ.]

1227} క్రొవ్విరులు  - సరిక్రొత్త పూలు, క్రొత్త+విరులు :-
[9-388-త.]

1228} క్రోధుడు  - కోపము గల వాడు :-
[4-215-వ.]

1229} క్లేశములు  - చిత్తవృత్తులనుండి జనించునవి యైదు 1ప్రమాణము (త్రివిధప్రమాణములు అవి 1ఇంద్రియగోచరము 2అనుమానము 3శబ్దప్రమాణము) 2విపర్యయము (ప్రమాణాతీతమైనది) 3మిథ్య (ఉన్న స్థితికి వేరుగ దర్శించుట) 4నిద్ర (గుర్తించెడి సామర్థ్యము లోపించుట) 5స్మృతి (ప్రమాణము లేనప్పటికిని గుర్తించుట) :-
[4-918.1-తే.]

1230} క్షణదాచర  - క్షణద (ప్రజలకు తీరికను వేడుకను ఇచ్చునది, రాత్రి) చర (చరించువాడు), రాక్షసుడు :-
[10.2-592-క.]

1231} క్షత్రబంధువు  - బ్రష్టులైన క్షత్రియులకు వాడు జాతీయము :-
[1-465-వ., 10.2-1282.1-తే.]

1232} క్షత్రియుడు  - క్షతము (దెబ్బ) వలన రక్షించువాడు వాని సంతానము, రాజులు :-
[9-42-వ.]

1233} క్షపాచరులు  - క్షప (రాత్రి) తిరుగువారు, రాక్షసులు :-
[3-111-మ.]

1234} క్షమానాథుడు  - భూమికి పతి, రాజు :-
[10.1-1525-శా.]

1235} క్షమాపకుడు  - క్షమ (భూమి)కి అపకుడు (తండ్రి), రాజు :-
[9-262-మ.]

1236} క్షమాసురుడు  - క్షమ (భూమికి) సురుడు (దేవత), బ్రాహ్మణుడు :-
[9-230-వ.]

1237} క్షారకర్దమము  - క్షార (అతికారపు) కర్దమము (బురద)ను భుజింపజేసెడి శిక్షలు, నరక విశేషము :-
[5.2-136-వ., 5.2-158-వ.]

1238} క్షితిజము  - క్షితి (నేల)లో జము (పుట్టినది), చెట్టు :-
[3-160-మ.]

1239} క్షితిజాతము  - క్షితి (నేల)లో జాతము (పుట్టినది), చెట్టు :-
[7-153-చ.]

1240} క్షితినాథోత్తముడు  - భూమికి భర్తలలో శ్రేష్ఠుడు, పరీక్షిన్మహారాజు :-
[1-511-మ.]

1241} క్షితిపతి  - రాజ్యమునకు ప్రభువు, రాజు :-
[2-3.1-ఆ.]

1242} క్షితిపాలుడు  - భూమిని పాలించువాడు, రాజు :-
[3-43-చ.]

1243} క్షీరాన్నము  - పాలతో ఉడికించిన అన్నము, పరవాన్నము :-
[10.1-1300-క.]

1244} క్షుద్రము - క్షుద్రతరము క్షుద్రతమము :-
[4-881-వ.]

1245} క్షుద్రసంహారుడు  - క్షుద్రులను సంహరించువాడు, శివుడు :-
[4-161.1-తే.]

1246} క్షేత్రజ్ఞుడు  - బుద్ధి మొదలగువానికి ద్రష్ట ఐ ఉండువాడు :-
[2-27.1-తే., 3-902-క., 7-448-వ.]

1247} క్షేత్రపాలుడు  - శరీరములు అనెడి క్షేత్రములను పాలించువాడు, విష్ణువు :-
[4-702.1-తే.]

1248} క్ష్మాజము  - క్ష్మ (భూమి)నుండి పుట్టినది, చెట్టు :-
[4-954-మ.]

1249} క్ష్మాదేవతాభర్త  - క్ష్మాదేవతా (బ్రాహ్మణులలో) భర్త (శ్రేష్ఠుడు), పరశురాముడు :-
[10.1-100-మ.]

1250} క్ష్మాపకుమారులు  - క్షమప (రాజు) కుమారులు, రాకుమారులు :-
[9-231-మ.]

1251} క్ష్మారమణవినుతపాదాంభోరుహమహితావతారుడు - క్ష్మారమణ (రాజుల చేత) వినుత (కొలచునట్టి) పాద (పాదములు అను) అంభోరుహ (పద్మములుగల) మహిత (మహిమాన్వితమైన) అవతారుడు (అవతారము కలవాడు), శ్రీరాముడు :-
[10.2-1341-క.]

1252} ఖండితభవుడు  - ఖండింపబడిన జన్మలు కలవాడు, జన్మరాహిత్యము పొందినవాడు :-
[1-390-క.]

1253} ఖగనాథుడు  - పక్షుల ప్రభువు, గరుత్మంతుడు :-
[10.1-1682-మ.]

1254} ఖగవాహుడు  - ఖగ (పక్షి, గరుత్మంతుడు) వాహుడు (వాహనముగా కలవాడు), విష్ణువు :-
[10.2-270-క.]

1255} ఖగేంద్రుడు  - ఖగము (పక్షులలో) ఇంద్రుడు (ఇంద్రుని వంటివాడు), గరుత్మంతుడు :-
[6-307-వ., 8-190-క., 10.1-703.1-తే., 10.1-1173-ఉ., 10.2-168-మ.]

1256} ఖగేశ్వరుడు  - ఖగము (పక్షులలో) ఇంద్రుడు (ఇంద్రుని వంటివాడు), గరుత్మంతుడు :-
[3-62-మ., 10.2-147-చ.]

1257} ఖచరులు  - ఖ (ఆకాశమున) చరులు (తిరుగువారు), దేవతలు :-
[6-176-క., 11-83-క.]

1258} ఖట్వాంగుడు  - సూర్యవంశ చక్రవర్తి, శ్రీరాముని తాత అజుడు ఆయన తాత రఘువు ఆయన తాత ఈ ఖట్వాంగుడు, ఖట్వాంగము (శివుని గద) ఐన వాడు. :-
[2-9.1-ఆ., 9-253-వ., 9-257-మ.]

1259} ఖద్యోతము  - ఖత్ (ఆకాశమున) జ్యోతము (ప్రకాశించునది), సూర్యుడు, మిణుగురు పురుగు, నల్లగుడ్డుకు సంకేతము :-
[4-768-వ., 7-274-మ.]

1260} ఖద్యోతుడు  - ఖత్ (ఆకాశమున) జ్యోతము (ప్రకాశించునది), సూర్యుడు :-
[4-853-వ., 9-263-క.]

1261} ఖర - ఖరతర ఖరతమ :-
[7-293-క.]

1262} ఖరకరుడు  - ఖర (తీవ్రమైన) కరుడు (కిరణములు గలవాడు), సూర్యుడు :-
[2-164-క., 6-17.1-తే., 9-298-క., 10.1-1291-క., 10.1-1321-వ.]

1263} ఖరఖురపుటి  - ఖర (వాడి) యైన ఖుర (గిట్టలు) యొక్క పుటి (నేర్పుగల నడక కలది), ఆదివరాహము :-
[3-698-క.]

1264} ఖరగతి  - కేవల భారవాహక కృత్యములచేత గాడిదలవలె :-
[10.2-259-క.]

1265} ఖరదూషణప్రముఖగాఢతమఃపటలప్రచండభాస్కరుడు - ఖర (వాడియైన, ఖర అనెడి రాక్షసుడు) దూషణ (దూషించదగినది, దూషణుడు అనెడి రాక్షసుడు) ప్రముఖ (మొదలగు) గాఢ (గాఢమైన) తమః (చీకట్ల) పటల (తెరలకు) ప్రచండ (భయంకరమైన) భాస్కరుడు (సూర్యుని వంటివాడు), రాముడు :-
[4-974-చ.]

1266} ఖరము - ఖరతరము ఖరతమము :-
[6-73-చ., 7-285-వ.]

1267} ఖరుడు  - గాడిదరూపి అసురుడు :-
[2-190-చ.]

1268} ఖర్వట  - ఒకప్రక్క గ్రామము ఒక ప్రక్క పట్టణము కలిగినది, కొండను ఆనుకొనిన గ్రామము, పేట :-
[7-36.1-ఆ.]

1269} ఖలప్రహారి  - దుర్జనులను శిక్షించువాడు, కృష్ణుడు :-
[10.2-139-చ.]

1270} ఖలవిదారి  - దుర్జనులను సంహరించువాడు, కృష్ణుడు :-
[10.1-1704.1-తే.]

1271} ఖురదళితమేరుగిరి  - ఖురము (గిట్టలతో) దళిత (అణచబడిన) మేరుగిరి కలవాడు, ఆదివరాహమూర్తి :-
[3-647-క.]

1272} ఖురళీబంధము  - (ఖురళి (సాము గారడీలు) చెట్టాపట్టాలు వేసుకున్నట్లు చేతులను కూర్చుకొని గిరగిర తిరుగునది, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

1273} ఖేచరములు  - ఆకాశమున తిరుగునవి, పక్షులు :-
[3-344-వ.]

1274} ఖేచరి  - ఖః (ఆకాశమున, కనబడకుండగ) చరి (తిరుగునామె), అదృశ్య గమనము గల స్త్రీ :-
[10.1-212.1-తే.]

1275} ఖేచరులు  - ఖః (ఆకాశమున) చరులు (సంచరించెడివారు), దేవతలు :-
[6-418-చ., 9-301-క., 10.1-1348-వ.]

1276} ఖేట  - పంటకాపులుండుపల్లె, పాలెము :-
[7-36.1-ఆ.]

1277} ఖ్యాతి  - ప్రసిద్ధి, వాసి, 1. దక్షప్రజాపతి కూఁతురు, భృగువుయొక్క భార్య, ఈమెకు ధాత, విధాత అని ఇరువురు కొడుకులును, లక్ష్మి అను కూఁతురును కలిగిరి. :-
[4-26-వ.]

1278} గంగాకలాపుడు  - గంగ (గంగదేవి)ని కలాపుడు (భూషణముగ కలవాడు), శివుడు :-
[4-149.1-తే.]

1279} గంగానందనుడు  - గంగాదేవి పుత్రుడు, భీష్ముడు :-
[1-206-వ.]

1280} గంగావతరణకరణము  - ముఖ కవళికలచేత ప్రవాహాది సూచకమైన అభినయంబులు చూపుట, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

1281} గండభేరుండము  - రెండు తలలు మూడు కన్నుల కలిగి ఏనుగును తన్నుకుపోగల పక్షి :-
[9-595-క.]

1282} గంధగజదానవభంజనుడు  - గంధ (మదించిన) గజదానవ (గజాసురుని) భంజనుడు (సంహరించినవాడు), శివుడు :-
[6-2-ఉ.]

1283} గంధగమన  - ఏనుగు వంటి నడక కలామె, స్త్రీ :-
[9-622-క.]

1284} గంధర్వము  - 1. వట్రువు (వర్తులము, గుండ్రంగా చుట్టుకొని ఉండునది) తోక దొడ్డ కడుపుగల దుప్పి, 2. కడఁతి, మరణమునకును పునర్జన్మమునకును మధ్యకాలమున యాతనాశరీరమును ధరించిన ప్రాణి. :-
[10.2-112-మ.]

1285} గంధర్వులు  - గానములు పాడుటలో విశిష్టులు, దేవయోని విశేషము, గంధ (వాసనలు) మోయువారు (అహోరాత్రులు సంకేతము) :-
[2-274.1-తే.]

1286} గంధర్వులు  - గానములు పాడుటలో విశిష్టులు, దేవయోని విశేషము, గంధ (వాసనలు) మోసుకొచ్చెడివారు (అహోరాత్రులు సంకేతము) :-
[4-819-వ.]

1287} గంధర్వోత్తములు  - చిత్రసేనాదులు :-
[10.1-107-క.]

1288} గంధవాహుడు  - గంధ (వాసనను) వాహుడు (మోసుకొని వెళ్ళువాడు), వాయుదేవుడు :-
[3-535-చ., 4-29.1-తే., 4-646-మత్త., 11-99-వ.]

1289} గగనకేశుడు  - గగన (ఆకాశమే) కేశుడు (శిరోజములు కలవాడు), శివుడు :-
[4-63-క.]

1290} గగనచరనది  - ఆకాశమునందు వర్తించు నది, గంగ :-
[11-72.1-తే.]

1291} గగనముఖములు  - పంచభూతములు, 1గగనము 2వాయు 3జలము 4తేజము 5పృథ్వి :-
[3-893.1-తే.]

1292} గజగమన  - గజ (ఏనుగు వలె ఒయ్యారమైన) గమన (నడక కలామె), స్త్రీ :-
[10.1-813-వ.]

1293} గజగామిని  - గజ (ఏనుగు వలె ఒయ్యారమైన) గామిని (నడచునామె), స్త్రీ :-
[4-747-వ.]

1294} గజజాతులు  - త్రివిధగజములు, 1భద్రము 2మందము 3మృగము :-
[6-386-వ.]

1295} గజనామధేయపురము  - గజ (హస్తిన అను) నామధేయ (పేరు కల) పురము (పురము) హస్తినాపురము :-
[1-438-క.]

1296} గజపురవల్లభుడు  - గజపురము (హస్తినా పురము)నకు వల్లభుడు (రాజు), పరీక్షిత్ :-
[6-444-వ.]

1297} గజభేదములు  - 1భద్రము 2మందము 3మృగము :-
[8-19-క.]

1298} గజరాజవరదుడు  - గజరాజు (గజేంద్రుని) వరదుడు (కాపాడినవాడు), విష్ణువు :-
[11-49-క.]

1299} గజరిపుపీఠము  - గజ (ఏనుగు) రిపు (శత్రువు, సింహము) పీఠము (ఆసనము), సంహాసనము :-
[1-438-క.]

1300} గజరిపువు  - గజము (ఏనుగు)నకు రిపువు (శత్రువు), సింహము :-
[7-71-క.]

1301} గజవైరిపరాక్రముడు  - గజవైరి (సింహ) పరాక్రముఁడు (పరాక్రమము కలవాడు), సింహపరాక్రముడు :-
[1-438-క.]

1302} గజేంద్రము  - గజము (ఏనుగు)లలో ఇంద్రము (శ్రేష్ఠమైనది), ఐరావతము :-
[6-387-మ.]

1303} గడియ  - 24 నిముషముల కాలము, 2 గడియలు 1 ముహుర్తము, 60 విగడియలు 1 గడియ :-
[2-11-క.]

1304} గడుపుచుండును  - సమయమును నడుపుచుండును, నడుపుచుండును :-
[5.2-83-వ.]

1305} గణనాతీతుడు  - ఎంచుటకు అతీతమైన వాడు, కృష్ణుడు. :-
[1-196-క.]

1306} గణేశుడు  - సర్వ గణములకు ఈశుడు (అధిపతి), విఘ్నేశ్వరుడు :-
[6-4-ఉ.]

1307} గతత్రపుడు  - గత (పోయిన) త్రపుడు (సిగ్గు కలవాడు) :-
[4-42.1-తే.]

1308} గతవిగ్రహుడు  - గత (తొలగిన) విగ్రహము (విరోధము) కలవాడు, విష్ణువు :-
[3-524-వ.]

1309} గతాగతతానకము  - తాళమానమును మీరక పోకరాకలు చేయుచు నటించుట, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

1310} గతి  - గమనము, పోక :-
[4-26-వ.]

1311} గతులు  - సంగీతమునందలి ధ్వని భేదములు :-
[10.2-801.1-తే.]

1312} గద  - చేత పట్టుకొన వీలైన పొడవైన కడ్డీ దాని చివర పెద్ద బరువైన గుండ్రటి తల కలిగిన ఆయుధవిశేషము, గుదియ :-
[10.2-165-వ.]

1313} గదాగ్రజుడు - గదా (గదను ధరించినవాడు, బలరాముడు) అను అగ్రజుడు (అన్నకలవాడు), శ్రీకృష్ణుడు :-
[4-652-వ.]

1314} గదాచక్రాంబుజాద్యంకితుడు  - గద చక్రము పద్మములు అలంకారముగా కలవాడు, విష్ణువు. :-
[12-36-మ.]

1315} గదాధారణుడు  - కౌమోదకి అను గదను ధరించువాడు, విష్ణువు :-
[10.2-49-క.]

1316} గదాసికోదండశంఖసుదర్శనాంకుడు  - గదను అసి (కత్తిని) కోదండ (విల్లు)ను శంఖమును సుదర్శనము (చక్రము)ను అంకుడు (పార్శ్వమున కలవాడు), కృష్ణుడు :-
[5.2-167-మత్త.]

1317} గమనించునది  - గమనము చేసెడిది, నడచెడిది :-
[5.2-81-వ.]

1318} గయాశీర్షము  - గయాసురుని శిరస్సుగల పుణ్యప్రదేశము, గయ :-
[7-451-వ.]

1319} గయాసురుడు  - గయాక్షేత్రములు ఇతని శరీరమున నిర్మింపబడి యందు పితృదేవతలు తరించుచున్నారు :-
[2-204.1-తే.]

1320} గరితలు  - ఉత్తమురాండ్రు, స్త్రీలు :-
[10.1-327.1-ఆ.]

1321} గరుడ  - ఒక జాతి పక్షి, గరుత్మంతుడు ఈ జాతికి చెందినవాడు. :-
[2-274.1-తే.]

1322} గరుడగమనుడు  - గరుడవాహనము పై తిరుగువాడు, విష్ణువు :-
[4-291.1-తే., 10.2-167-వ., 10.2-212.1-ఆ.]

1323} గరుడధ్వజుడు  - గరుడ చిహ్నము ధ్వజమున కలవాడు, విష్ణువు :-
[3-1051-వ.]

1324} గర్జన  - సింహపు అరుపు :-
[7-291.1-తే.]

1325} గర్భసంపదలు  - గర్భ (గర్భమున పుట్టినవారి క్షేమములు అనెడి) సంపద (సౌభాగ్యము) :-
[5.2-108-తే.]

1326} గర్భాది  - 1పుట్టుట 2ఉండుట 3పెరుగుట 4మారుట 5క్షీణించుట 6నశించుట :-
[7-214.1-ఆ.]

1327} గవాదులు  - గో + ఆదులు, పశువులు :-
[3-215-వ.]

1328} గాంగానందనుడు  - భీష్ముడు, గంగ యొక్క పుత్రుడు :-
[1-208-వ.]

1329} గాంగేయుడు  - భీష్ముడు, గంగ యొక్క పుత్రుడు :-
[1-79.1-ఆ., 1-189.1-తే., 1-207-క., 1-368-మ., 10.2-766.1-ఆ.]

1330} గాండివము  - అర్జునుని ధనుస్సు పేరు :-
[10.2-143-ఉ.]

1331} గాండీవి  - గాండీవము అను విల్లు కలవాడు, అర్జునుడు :-
[1-417-క., 10.2-1307.1-తే.]

1332} గాంధర్వము  - గంధర్వులు చేయునది (గానము) నకు సంబంధించిన విద్య, సంగీతము :-
[3-388-వ.]

1333} గాంధారక్షితినాథుకూఁతురు  - గాంధార (గాంధార) క్షితి (దేశ) నాథు (రాజు) కూఁతురు (పుత్రిక), గాంధారి :-
[1-318-శా.]

1334} గాంధారి  - గాంధార దేశపు రాజగు సుబలుని కుమార్తె :-
[10.2-83-వ.]

1335} గాంధారేయుడు  - గాంధారి యొక్క కొడుకు, దుర్యోధనుడు :-
[10.2-94-క.]

1336} గాధి  - విశ్వామిత్రుని వంశమునకు మూల పురుషుడు :-
[2-204.1-తే.]

1337} గాయకుడు  - బిరుదులను ఉగ్గడించి కీర్తించుచు జీవించువాడు, గానము చేయువాడు, మాగధుడు :-
[10.1-724-క.]

1338} గిరిభిత్  - గిరి (పర్వతములు) భిత్ (భేదించినవాడు), ఇంద్రుడు :-
[10.1-923-మ.]

1339} గిరిభూజప్రముఖవాసుడు  - ససర్వనామా సచ విశ్వరూపా (శ్రుతి) చేత కొండలు చెట్లు మున్నగు సమస్తమును తానైనవాడు :-
[10.1-901-క.]

1340} గిరిభేది  - పర్వతములను భేదించినవాడు, ఇంద్రుడు :-
[10.1-926-వ.]

1341} గిరివిహారణుడు  - గిరి (పర్వతమును) విహారణుడు (ఎత్తి రక్షించినవాడు), కృష్ణుడు :-
[6-529-త.]

1342} గిరివ్రజము  - జరాసంధుని పట్టణము :-
[10.2-718-వ.]

1343} గిరిశుడు  - గిరి (కైలాసగిరిపైనున్న) ఈశుడు (ప్రభువు), శంకరుడు :-
[3-61-చ., 4-47-వ.]

1344} గిరీశుడు  - గిరి (కైలాసగిరిపైనున్న) ఈశుడు (ప్రభువు), శంకరుడు :-
[8-547-ఆ.]

1345} గీక  - ఏనుగు యొక్క అరుపు, ఘీంకారము :-
[6-408-క.]

1346} గీర్వాణులు  - మాటయే బాణముగా గలవారు, , శాపరూపమగు వాక్కు (బాణముగా) గలవారు, దేవతలు :-
[6-271-క., 7-397-వ.]

1347} గుండిగ  - వెడల్పుగా నోరు ఉండెడి పెద్ద లోహపాత్ర :-
[8-699-వ.]

1348} గుజ్జెనగూళ్ళు  - పిల్లలు చిన్నచిన్న గిన్నెలలో ఆహారపదార్థములు తయారుచేసుకొని ఆడుకొను ఆట. :-
[10.1-1690.1-తే.]

1349} గుణక్షోభము  - స్వభావము యొక్క కలతపాటు, త్రిగుణసమతావస్థ యైన అవ్యక్త చలన స్థితి :-
[10.1-537-వ.]

1350} గుణత్రయము  - త్రిగుణములు సత్త్వ రజస్ తమస్ అను మూడుగుణములు :-
[1-386-వ., 3-718.1-తే., 4-855-వ., 7-237-వ., 7-306-మ., 8-624-వ.]

1351} గుణత్రయమువృత్తులు  - 1సత్వగుణము (శాంతవృత్తి) 2రజోగుణము (ఘోరవృత్తి) 3తమోగుణము (మూఢవృత్తి) :-
[7-7-వ.]

1352} గుణనిధి  - గుణములకు స్థానమైన వాడు, విష్ణువు :-
[3-218-క.]

1353} గుణమండనుడు  - సుగుణములు అలంకారముగా కలవాడు, విష్ణువు :-
[3-572-చ.]

1354} గుణమయియగునాత్మమాయచేవిరహితుడు - త్రిగుణములతో నిండిన ఆత్మమాయ (తన యొక్క మాయ) వలన విరహితుడు (అసలు లేకుండెడివాడు), విష్ణువు :-
[4-366-వ.]

1355} గుణము  - అల్లెత్రాడు, లక్షణము :-
[1-415-వ.]

1356} గుణములు  - ఆ నడవడులకు తగిన స్వభావములు కలిగి ఉండుట, సత్త్వాది, జ్ఞానాది, ఐశ్వర్యాది, సంధియాదులు, మాధుర్యాది వంటివి :-
[10.1-537-వ.]

1357} గుణరత్ననిధి  - సుగుణము లనెడి మణులకు నిధి వంటి వాడవు, కృష్ణుడు. :-
[10.1-907-క.]

1358} గుణరత్ననిధీ  - సర్వజ్ఞత్వము సర్వేశ్వరత్వము సర్వభోక్తృత్వము మున్నగు గుణములలో రత్నముల (శ్రేష్ఠమైనవాని)కి నిధివంటివాడు లేదా రత్ననిధి (సముద్రము వంటివాడు), విష్ణువు. :-
[10.1-577-క.]

1359} గుణవంతుడు  - సుగుణములు (శమము దమము ఉపరతి తితిక్ష ఆది గుణములు) కలవాడు, సజ్జనుడు :-
[3-124-చ., 10.2-441-వ.]

1360} గుణవర్జితము  - గుణము (శ్రేష్ఠత్వము) వర్జితంబు (పోయినది), పాడైపోయినది :-
[7-438.1-ఆ.]

1361} గుణవిభ్రాజిష్ణుడు  - గుణములచే విశేషముగ ప్రకాశించు వాడు, విష్ణువు :-
[2-236-మ.]

1362} గుణవిరహితుడు  - త్రిగుణాతీతుడు :-
[10.1-901-క.]

1363} గుణవ్రజము  - సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వ సర్వపాలకత్వ సర్వస్రష్టత్వ సర్వసంహారకత్వ సర్వభోక్తృత్వాది గుణముల సముదాయము :-
[10.1-553.1-ఆ.]

1364} గుణసాగరుడు  - సుగుణములకు సాగరుడు (సముద్రము వంటివాడు), రాముడు :-
[4-974-చ.]

1365} గుణస్తోమధాముడు  - గుణస్తోమ (సుగుణములకు) ధాముడు (నెలవైనవాడు), రాముడు :-
[8-1-క.]

1366} గుణహారుడు  - గుణ (సుగుణములు) హారుడు (అలంకారముగా కలవాడు), విష్ణువు :-
[8-483.1-తే.]

1367} గుణాఢ్య  - సుగుణములచే ఉత్తమురాలు, స్త్రీ. :-
[10.1-325-క.]

1368} గుణాఢ్యుడు  - సుగుణములు అనెడి సంపద గలవాడు, విష్ణువు :-
[4-917-చ., 8-743-క.]

1369} గుణాతీతుడు  - త్రిగుణములకు అతీతమైనవాడు, విష్ణువు :-
[3-203-దం.]

1370} గుణాధీశుడు  - త్రిగుణములు అధీనమున యుంచుకొనెడి వాడు, విష్ణువు :-
[4-963.1-తే.]

1371} గుణాశ్రయుడు  - త్రిగుణములకు ఆశ్రయమైనవాడు, శ్రీకృష్ణుడు :-
[5.1-1-క.]

1372} గుణి  - సుగుణముల స్వరూపమైనవాడు, విష్ణువు :-
[6-34-క.]

1373} గురు - గురుతరము గురుతమము :-
[3-98-చ., 6-262-క., 9-298-క., 10.1-824.1-ఆ.]

1374} గురు – గురుతరము – గురుతమము - :-
[4-495-క.]

1375} గురు - గురుతరము గురుతమము :-
[5.1-183-మాలి.]

1376} గురుకలుషకుంజరహరి  - గురు (పెద్ద పెద్ద) కలుష (పాపము లనెడి) కుంజర (ఏనుగులను) హరి (సంహరించెడి వాడు), విష్ణువు :-
[6-33-క.]

1377} గురుజనబుధసంతాపనివారణమతి  - గురుజన (గొప్పవారి) బుధ (జ్ఞానుల) సంతాపములను నివారణ (పోగొట్టెడి) మతి (మనసు గలవాడు), విష్ణువు :-
[6-32-క.]

1378} గురుడు  - పెద్దవాడు, విష్ణువు :-
[6-327.1-తే.]

1379} గురుతనము - గురుతరము గురుతమము :-
[10.1-69-క.]

1380} గురుతనయుడు  - గురువు ద్రోణుని పుత్రుడు, అశ్వత్థామ :-
[3-130-వ.]

1381} గురుతము - గురుతరము గురుతమము :-
[10.1-1284-క.]

1382} గురుతరభవదూరుడు  - గురుతర (మిక్కిలి భారమైన) భవ (సంసారబాధలను) విదూరుడు (తొలగించువాడ), శ్రీకృష్ణ :-
[5.1-183-మాలి.]

1383} గురుదేవహీనుడు - గురు (తనకంటె పెద్దవాడు), దేవ (తనకు మించిన దైవము) హీనుడు (లేనివాడు), సర్వోన్నతుడు, శ్రీకృష్ణుడు :-
[10.1-901-క.]

1384} గురునందనుడు  - గురువు (ద్రోణుని) కొడుకు, అశ్వత్థామ :-
[1-158-వ.]

1385} గురుపుత్రులు  - శుక్రాచార్యుని కుమారులు, చండామార్కులు :-
[7-208-వ.]

1386} గురుబుధజనతోషి  - గురు (గొప్ప) బుధ (జ్ఞానము కల) జన (వారికి) తోషి (సంతోషము కలిగించు వాడు), శ్రీరాముడు :-
[10.1-1791-మాలి.]

1387} గురుబుధసుఖకర్త  - గురు (గురువులకు) బుధ (జ్ఞానులకు) సుఖ (సౌఖ్యమును) కర్త (ఏర్పరచినవాడు), రాముడు :-
[7-481-మాలి., 11-126-మాలి.]

1388} గురుభుజుడు  - అధికమైన భుజబలము కలవాడు, కృష్ణుడు :-
[10.2-891-చ.]

1389} గురువు - 1 కన్నతండ్రి 2 పెంచినతండ్రి 3 ఉపాధ్యాయుడు 4 బృహస్పతి 5 కులముపెద్ద 6 తండ్రితోడ పుట్టిన వాడు 7 తాత 8 అన్న 9 మామ 10 మేనమామ 11 రాజు 12 కాపాడినవాడు, గురువు శ్లో. గుశబ్దస్త్వంధకారస్స్యా ద్రుశబ్దస్తన్నివర్తకః, అంధకార నివృత్తి త్వాద్గురు రిత్యభిధీయతే, అజ్ఞానాంధకార నివారకుడైన కారణాచార్యుడు :-
[1-85.1-ఆ., 3-31-ఉ., 3-222-ఉ., 3-457-చ., 4-730-చ., 9-471-క., 10.1-568-వ.]

1390} గురువు  - కౌరవ. పాండవులకు గురువు ఐన ద్రోణాచార్యుడు :-
[3-20-క.]

1391} గురుశిష్యన్యాయము  - గురువు (నేర్పువాడు)ను శిష్యుడు (నేర్చుకొనువాడు) సేవించవలెననెడి గౌరవించవలెనెడి న్యాయము :-
[10.1-1414-క.]

1392} గురుసన్మనోవాగగోచరుడు  - మిక్కిలి మంచివారి మనస్సులకు వాక్కులకు సైతము అగోచరుడు (అందనివాడు), విష్ణువు. :-
[4-918.1-తే.]

1393} గురుసమరవిహారుడు  - గురు (గొప్ప) సమర (యుద్ధమున) విహారుడు (వీరవిహారము సలిపెడి వాడు), రాముడు :-
[4-976-మాలి.]

1394} గురుసుతుడు  - గురువు (ద్రోణాచార్యుని), సుతుడు (పుత్రుడు), అశ్వత్థామ :-
[1-145-వ., 10.1-7-క.]

1395} గుహుడు  - తన సైన్యమును రక్షించుకొనువాడు, కుమారస్వామి :-
[10.2-402-చ.]

1396} గుహ్యకసాధ్యరక్షోయక్షనాథకుబేరసేవితుడు  - గుహ్యకసాధ్యరక్షోయక్షలకునాయకుడైన కుబేరునిచే సేవింపబడువాడు, శివుడు :-
[4-138.1-తే.]

1397} గుహ్యకుడు  - యక్షుల భేదము, గుహ+ణ్వుల్, గూహతి నిధిం రక్షతి, నిధిని రక్షించువాడు. కుబేరుని సేవకుడు; దేవయోని విశేషము. :-
[2-274.1-తే.]

1398} గుహ్యకేశ్వరుడు  - గుహ్యకులు ప్రభువు, కుబేరుడు, ఉత్తర దిక్పతి :-
[10.2-773-చ.]

1399} గూఢుడు  - సాధరణముగ వ్యక్తము కాక యుండువాడు :-
[1-76-వ.]

1400} గృహము(ప్ర)  - గేహము (వి) :-
[10.1-1488-మ., 10.1-1688-క.]

1401} గృహమేధి  - గృహస్థాశ్రమ ధర్మమున కట్టుబడినవాడు, గృహస్థుడు :-
[10.2-1329.1-తే.]

1402} గృహస్థధర్మము - చతురాశ్రమములలోని గార్హపత్యాశ్రమంలో ఉండువారి ధర్మములు :-
[10.2-1328-ఉ.]

1403} గొంతి  - కుంతి కుంతల దేశ ఇంతి :-
[1-210-ఉ.]

1404} గొంది  - (పాపులు చొరబడుటకు వీలుకాని) సందు, వీథి, మూల :-
[3-508-చ.]

1405} గొబ్బిళ్ళుగోరాడు  - గొబ్బిళ్ళు (బాలక్రీడావిశేషము) వలె గోరాడు (ఎగురుకుంటు ఆడు). :-
[8-35-మ.]

1406} గోకులమందారుడు  - గోకులమునకు మందారుడు (కల్పవృక్షము వంటివాడు), కృష్ణుడు :-
[5.2-1-క.]

1407} గోకులము  - గోపాలుర ఆవాసము, వ్రేపల్లె :-
[10.1-59.1-ఆ.]

1408} గోకులవిస్తారుడు  - గోకులమునకు వృద్ధికారకుడు, శ్రీకృష్ణుడు :-
[5.1-1-క.]

1409} గోగతి  - ఎడతెగని కృషి క్రియలచేత వృషభముల వలె, ఎద్దులా పనిచేయుట :-
[10.2-259-క.]

1410} గోచీ  - గుహ్యావయవములు కనబడకుండ కట్టుకొను సన్నని పొడవైన గుడ్డ, కచ్చడము, కౌపీనము. :-
[9-688-తే.]

1411} గోచీబిగియగట్టు  - స్త్రీ సౌఖ్యమునకు బాగా దూరముగా నుండు :-
[9-688-తే.]

1412} గోత్రభిత్సూనుడు  - పర్వతముల రెక్కలను భేదించువాని (ఇంద్రుని) సూనుడు (కొడుకు), అర్జునుడు :-
[10.2-731-ఉ.]

1413} గోపకుమారశేఖరుడు  - గోపక వంశము పుట్టినవారిలో శ్రేష్ఠుడు, కృష్ణుడు :-
[10.2-449-మ.]

1414} గోపకుమారుడు  - (నంద) గోపుని యొక్క కుమారుడు, కృష్ణుడు :-
[6-52-ఉ., 10.1-1348-వ.]

1415} గోపకులేంద్రుడు  - గోపకుల వంశము నందు శ్రేష్ఠుడు, కృష్ణుడు :-
[10.1-1174-ఉ.]

1416} గోపచమూవిభుడు  - గోపకుల సేనకు అధిపతి, కృష్ణుడు :-
[10.1-1139-ఉ.]

1417} గోపతి  - 1. గోవులకు అధిపతి, కృష్ణుడు, వ్యు. గో+పతి, గవాం పశూనాం పతిః, పశువులకు పతి. :-
[6-32-క.]

1418} గోపదరేణు  - పశువుల కాళ్ళచే రేగిన దుమ్ము, గోధూళి :-
[10.1-628-ఉ.]

1419} గోపద్వజుడు  - గోప (వృషభము) ధ్వజము (జండా) గా గలవాడు, శివుడు :-
[7-399-క.]

1420} గోపవీరుడు  - గోపకులలో వీరుడు, నందుడు :-
[10.1-1445-క.]

1421} గోపశేఖరుడు  - గోపకులలో శేఖరుడు (శ్రేష్ఠుడు), కృష్ణుడు :-
[10.1-763-క.]

1422} గోపసింహుడు  - గోపకులలో శ్రేష్ఠుడు, కృష్ణుడు :-
[10.1-1146-ఆ.]

1423} గోపాలకుడు  - గోవులను పరిపాలించెడివాడు, శ్రీకృష్ణుడు, యాదవుడు, గోపాలకమున (అమరపురమున) వసించు వాడు, దేవత. :-
[3-106-క., 5.1-181-మ., 10.1-59.1-ఆ.]

1424} గోపాలగ్రామణి  - గోపాలురలో ముఖ్యుడు, కృష్ణుడు :-
[10.1-1322-ఉ.]

1425} గోపాలచక్రవర్తి  - గోపకులకు మహారాజు, కృష్ణుడు. :-
[10.1-770.1-తే.]

1426} గోపాలశేఖరుడు  - పశువుల కాపరులలో శ్రేష్ఠుడు, కృష్ణుడు :-
[10.1-919-వ.]

1427} గోపాలసుందరుడు  - గోవులను పాలించెడి సుందరమైనవాడు, కృష్ణుడు :-
[10.1-1076-వ.]

1428} గోపాలుడు  - గోవులను పాలించువాడు, గొల్ల, కృష్ణుడు :-
[3-106-క., 10.1-1550-క.]

1429} గోపికాచిత్తచోరుడు  - గోపికల చిత్తములను దొంగిలించినవాడ, శ్రీకృష్ణ :-
[5.1-183-మాలి.]

1430} గోపీమనోవిహారుడు  - గోపికల మనస్సు లందు విహరించువాడు, కృష్ణుడు :-
[10.2-1045-క.]

1431} గోపీవల్లభుడు  - గోపికలకు ప్రియుడు, కృష్ణుడు :-
[1-275-క.]

1432} గోవత్సము  - ఒక సంవత్సరములోపు ఆవు దూడ :-
[10.1-481-శా.]

1433} గోవర్దనధరుడు  - గోవర్దనపర్వతము మోసినవాడు, కృష్ణుడు :-
[10.1-926-వ.]

1434} గోవర్ధనగిరి  - గో (గోవులు, జీవులు, ఇంద్రియములు) వర్ధనము (వర్ధిల్లజేయు) గిరి (ఉన్నతమైనది, పర్వతము) :-
[10.1-915-క.]

1435} గోవిందమూర్తి  - గోవులకు ఒడయుడు, గోవులను పాలించు వాడు, గో (ఆవులకు, జీవులకు) విందుడు, పాలించువాడు, విష్ణువు :-
[10.1-973-మ.]

1436} గోవిందుడు  - గోవులకు ఒడయుడు, గోవులను పాలించు వాడు, గో (ఆవులకు, జీవులకు) విందుడు, పాలించువాడు, విష్ణువు, కృష్ణుడు. :-
[1-49-మ., 1-176-వ., 1-188-వ., 1-202-వ., 1-351-శా., 1-375-శా., 1-530-గ., 2-11-క., 2-265.1-తే., 3-55-మ., 3-96-క., 3-258-క., 3-315-మ., 3-553-క., 3-623-ఉ., 3-743-వ., 3-751-వ., 4-171.1-తే., 4-191.1-తే., 5.1-181-మ., 8-99-వ., 9-82.1-తే., 10.1-236-వ., 10.1-508-వ., 10.1-760-శా., 10.1-769-వ., 10.1-850-వ., 10.1-1059-క., 10.1-1197-వ., 10.1-1223-మ., 10.1-1726-శా., 10.2-49-క., 10.2-478-వ., 10.2-625-క., 10.2-749-ఆ., 11-30-వ.]

1437} గౌరి  - గౌరవర్ణము కలామె, పార్వతి :-
[10.1-1729-ఉ., 10.2-318-వ., 12-38-చ.]

1438} గౌరీదయితుడు  - పార్వతీదేవి (గౌరి) ప్రియుడు (దయితుడు), శివుడు :-
[3-227-క.]

1439} గౌరీపతి  - గౌరీదేవి యొక్క భర్త, శివుడు :-
[3-30-ఉ.]

1440} గౌరీశుడు  - గౌరీదేవి భర్త, శంకరుడు :-
[4-48-మ., 10.1-1710-మ.]

1441} గౌరీశ్వరుడు  - గౌరీదేవి భర్త, శంకరుడు :-
[10.1-1107-క.]

1442} గ్రంథసంఖ్యలు  - గ్రంథములలోని శ్లోకముల పరిమాణములు, (గణన సంఖ్య) :-
[12-48-వ.]

1443} గ్రథనము  - ముడి పెట్టబడినది, గ్రుచ్చుట, కూర్చుట :-
[1-58-వ.]

1444} గ్రహము  - 1.గ్రహ అధిదేవత, 2.జ్యోతిషాధిపతులు, 3.పట్టెడివి, పిశాచబేధము :-
[2-274.1-తే., 6-307-వ., 6-307-వ.]

1445} గ్రామకము  - 1.మోటుతనము, 2.సురతము :-
[4-768-వ.]

1446} ఘటపటాదికన్యాయము  - ఘటపటాదిక న్యాయము అను తర్కశాస్త్రవిషయము ప్రకారము త్రికరణములు (మూడు కారణములు) 1 ఉపాదానము (ఇతర వస్తువ, మన్ను, పత్తిదారము) 2 సమవాయము (చేసిన కూర్పు, కుండ, వస్త్రము) 3 నిమిత్త (పనివాడు, ప్రేరకుడు, కుమ్మరి, నేతవాడు) :-
[3-345.1-తే.]

1447} ఘటపటాదికములు  - ఘట (కుండ) పట (బట్ట) ఆదిక (మున్నగునవి), సమస్తమైన పదార్థములు :-
[10.2-1072.1-తే.]

1448} ఘట్టితపాదకర్మలు  - రెండు అడుగులను చేరబెట్టుట, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

1449} ఘన - ఘనతర ఘనతమ :-
[4-510-వ., 6-327.1-తే.]

1450} ఘన - ఘనతర ఘనతమము :-
[7-464.1-తే.]

1451} ఘన - ఘనతరము ఘనతమము :-
[5.2-149-ఆ.]

1452} ఘన  - పొడవు వెడల్పు లోతు మిక్కిలి యున్నది, పెద్దది :-
[5.2-65.1-ఆ.]

1453} ఘనచతుర్భాహువు  - గొప్పవైన చేతులు నాలుగు కలవాడు, విష్ణువు :-
[3-145.1-తే.]

1454} ఘనజనకవరనృపజామాతృవరేశుడు  - ఘన (గొప్ప) జనకవరనృప (జనకమహారాజు యొక్క) జామాతృ (అల్లుళ్ళలో) వరేశుడు (ఘనత వహించినవాడు), రాముడు :-
[12-1-క.]

1455} ఘనజననస్థితిప్రళయకారణభూతుడు  - గొప్ప సృష్టి స్థితి లయములకు కారణమైనవాడు, విష్ణువు :-
[4-892-చ.]

1456} ఘనతరకిరి  - ఘనతర (మిక్కిలి గొప్పదైన) కిరి (వరాహావతారు డైన వాడు), విష్ణువు :-
[6-33-క.]

1457} ఘనము - ఘనతరము ఘనతమము :-
[3-444-క., 3-948.1-తే., 7-238.1-తే., 8-202.1-తే., 10.1-667-క., 10.1-902-ఆ., 10.1-1014.1-ఆ., 10.1-1014.1-ఆ., 12-12-క.]

1458} ఘనము – ఘనతరము - ఘనతమము :-
[10.2-139-చ.]

1459} ఘనములు  - 1.పోడవు, వెడల్పు, ఎత్తుగలవి, 2. గొప్పవి, 3. ఏదైనా సంఖ్యను దానితోనే గుణించగా వచ్చెడి రెండవ సంఖ్య, మొదటి సంఖ్య యొక్క ఘనము. :-
[9-230-వ.]

1460} ఘనమూలము  - ఏ సంఖ్యనైతే దానిని దానితోనే 2 సార్లు గుణించినప్పుడు వచ్చెడి రెండవ సంఖ్య యొక్క ఘనమూలము ఆ సంఖ్య :-
[9-230-వ.]

1461} ఘనరుచిరశరీరి  - ఘన (మేఘము) వంటి రుచిర (ఛాయ, రంగు కలిగిన) శరీరి (దేహము కలవాడు), విష్ణువు :-
[4-16-చ.]

1462} ఘనవాహుడు  - ఘన (మేఘము)లపై వాహ (విహరించువాడు), ఇంద్రుడు :-
[9-288-క.]

1463} ఘనసాంఖ్యయోగీశ్వరుడు  - ఘన (గొప్ప) సాంఖ్యయోగులకు ఈశ్వరుడు, విష్ణువు :-
[4-703.1-తే.]

1464} ఘనసింధువు  - ఘనమైన సింధువు (సముద్రము), మహాసముద్రము :-
[1-200-ఉ.]

1465} ఘనుడు  - ఘనమైన వర్తనము గలవాడు, విష్ణువు, కృష్ణుడు :-
[2-142.1-తే., 3-844-చ., 3-844-చ., 4-298-చ., 10.2-102-క.]

1466} ఘీంకారము  - ఏనుగు అరుపు, గీక :-
[8-119-క.]

1467} ఘోటకము  - భూమి యందు పొరలునది, గుఱ్ఱము :-
[10.1-1558-వ., 10.1-1757-వ.]

1468} ఘోటకవదనుడు  - గుఱ్ఱపుముఖము గలవాడు, హయగ్రీవుడు, విష్ణువు :-
[7-361-క.]

1469} ఘోరదైతేయశోషి  - ఘోర (క్రూరమైన) దైతేయ (రాక్షసులను) శోషి (నశింపజేయు వాడు), శ్రీరాముడు. :-
[10.1-1791-మాలి.]

1470} ఘోరదైత్యప్రహారి  - ఘోర (భయంకర మైన) దైత్య (రాక్షసులను) ప్రహారి( సంహరించినవాడు), రాముడు. :-
[4-976-మాలి.]

1471} ఘోషకామినీప్రాణవల్లభుడు  - గోపికాస్త్రీల ప్రాణముతో సమానమైన ప్రియుడు, కృష్ణుడు :-
[10.1-1532-వ.]

1472} చంచత్సూకరాకారుడు  - చంచత్ (చరిస్తున్న) సూకర (వరాహ) ఆకార (స్వరూపము) కలవాడు, విష్ణువు :-
[3-431-మ.]

1473} చంచరీకము  - పూలయందు చరించునది, తుమ్మెద. :-
[10.1-1456-చ.]

1474} చంచలములు  - మిక్కిలి చలించెడివి, అస్థిరములు :-
[7-241-వ.]

1475} చండ - చండతరము చండతమము :-
[10.2-283-చ.]

1476} చండకరతనయుడు  - చండకర (తీవ్రమైన కిరణములు గల సూర్యుని) తనయుడు, యముడు :-
[6-166-క.]

1477} చండకిరణుడు  - తీవ్రమైన కిరణములు కలవాడు, సూర్యుడు :-
[10.1-850-వ.]

1478} చండతరభండనుడు  - చండతర (మిక్కిలి భయంకరముగ) భండనుడు (యుద్ధము చేయువాడు), శివుడు :-
[6-2-ఉ.]

1479} చండప్రభారాశి  - తీవ్రమైన కాంతుల సమూహము కలవాడు, అగ్ని :-
[10.1-1648-మ.]

1480} చండభమార్గము  - సూర్యుని మార్గము, ఆకాశము, పైవైపు, చండ (భీకరమైన) భ (ఆకాశ, నక్షత్ర) మార్గము :-
[8-47-మ.]

1481} చండమరీచి  - భయంకరమైన ప్రకాశము కలవాడు, సూర్యుడు :-
[10.1-905-వ.]

1482} చండవేగ  - భయంకరమైన వేగము కలవాడు :-
[4-810-వ.]

1483} చండాంశుడు  - చండ (తీవ్రమైన) అంశుడు (కిరణములు కలవాడు), సూర్యుడు :-
[6-524-క., 8-533-శా.]

1484} చండిక  - అమరకుండకక్షేత్రమున చండిక, చండుడను దనుజుని సంహరించిన దేవి, పార్వతి శరీరమునుండి పుట్టిన దేవి, దుర్గ :-
[10.1-61-వ., 10.2-73-క.]

1485} చంద్రకళాధర  - చంద్రవంకను ధరించినవాడు, శివుడు :-
[4-167-చ.]

1486} చంద్రకేతువు  - 1.చంద్రుని గుర్తుకలవాడు, 2. వత్సరునికి భార్య సర్వర్థి యందు కలిగిన ఆరుగురు కొడుకులలో రెండవ వాడు, 3. లక్ష్మణుని రెండవ కొడుకు. :-
[4-390-వ.]

1487} చంద్రఖండపరిమండితమస్తకుడు  - చంద్రఖండ (చంద్రకళచే) పరిమండిత (చక్కగా అలంకరింపబడిన) మస్తకుడు (శిరస్సు గలవాడు), శివుడు :-
[6-2-ఉ.]

1488} చంద్రచూడుడు  - చంద్రకళ చూడామణిగా కలవాడు, శివుడు :-
[8-220-క.]

1489} చంద్రజూటుడు  - చంద్రుడు శిఖయందు కలవాడు, శివుడు :-
[10.2-747.1-తే.]

1490} చంద్రధరుడు  - చంద్రుని ధరించినవాడు, శివుడు :-
[4-216-క.]

1491} చంద్రబింబానన  - చంద్రబింబము వంటి ముఖము కల స్త్రీ :-
[10.2-604-తే.]

1492} చంద్రమండలశ్రీలు  - చంద్రమండలము యొక్క శ్రీలు (కాంతులు), వెన్నెల :-
[6-260.1-తే.]

1493} చంద్రముఖి  - చంద్రునివంటి మోము కల స్త్రీ :-
[1-237-మ.]

1494} చంద్రమౌళి  - చంద్రుడు శిఖయందు కలవాడు, శివుడు :-
[10.2-532-తే.]

1495} చంద్రశాల  - ఏడంతస్తులమీది ఒంటిస్తంభపు మేడ, పైమేడ, వలభి, శిరోగృహము. :-
[10.2-1323-వ.]

1496} చంద్రశేఖరుడు  - చంద్రవంక సిగదండగ కలవాడు, శివుడు :-
[4-117-తే.]

1497} చంద్రాదులు  - 1చంద్రుడు మనసునకు, 2దిక్కులు చెవికి, 3గాలి చర్మమునకు, 4సూర్యుడు కంటికి, 5వరుణుడు నాలుకకు, 6అశ్వినులు ముక్కునకు, 7అగ్ని వాక్కునకు, 8దేవేంద్రుడు హస్తమునకు, 9విష్ణువు పాదమునకు, 10మృత్యువు గుదమునకు, 11ప్రజాపతి గుహ్యమునకు అధిదేవతలు :-
[10.1-572.1-తే.]

1498} చంద్రార్థధరుడు  - అర్థచంద్రుని ధరించువాడు, శివుడు :-
[4-443.1-తే.]

1499} చంద్రావతంసుడు  - చంద్రుని వతంసుడు (సిగబంతిగా కలవాడు), శివుడు. :-
[3-561.1-తే.]

1500} చంద్రాస్య  - చంద్రుని వంటి ముఖము కలామె, స్త్రీ :-
[1-363-మ., 10.2-178-మ.]

1501} చంద్రికారుచిరశరీరి  - చంద్రిక (వెన్నెల) వంటి రుచిర (రంగు కలిగిన) శరీరి (దేహము కలవాడు), శివుడు :-
[4-16-చ.]

1502} చక్రద్వితయము  - సంకేతం పాపపుణ్యములు :-
[4-771.1-తే.]

1503} చక్రధరుడు  - చక్ర (చక్రాయుధమును) ధరుడు (ధరించువాడు), విష్ణువు :-
[6-131-ఆ., 10.2-130-ఆ.]

1504} చక్రపాణి  - చక్రము చేతిన ధరించిన వాడు, విష్ణువు :-
[2-210-ఉ., 4-460.1-తే., 10.2-414-వ.]

1505} చక్రమండలకరణము  - పాదములను కుడియెడమలుగా మార్చి ఉంచుకొని రెండుమోకాళ్ళను కౌగలించుకొనుట, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

1506} చక్రవర్తి  - రారాజు, రాజ చక్రము సమూహమును ఏలురాజు, భూమండలమంతా అధికారము వర్తించువాడు, సార్వభౌముడు :-
[9-183-వ.]

1507} చక్రవాకుడు  - సుడిగాలివాడు, తృణావర్తుడు :-
[10.1-1331.1-తే.]

1508} చక్రవాళబంధము  - తాళమాత్రపు కాలములోపల నృత్యమండలమును చుట్టివచ్చి హాస విన్యాసాదులను చూపునట్టిది, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

1509} చక్రసమీరదైత్యుడు  - చక్రసమీర (సుడిగాలి) దైత్యుడు (రాక్షసుడు), తృణావర్తుడు :-
[10.1-271-శా.]

1510} చక్రస్థుడు  - గ్రహాదులు తిరుగు చక్రము (జ్యోతిష్చక్రము)న తిరుగువాడు :-
[3-346-వ.]

1511} చక్రహస్తుడు  - చక్రాయుధము హస్తుడు (చేతిలో గలవాడు), విష్ణువు :-
[7-169.1-తే., 10.2-560.1-తే.]

1512} చక్రాంకహస్తుడు  - చక్రాయుధము హస్తుడు (చేతిలో గలవాడు), విష్ణువు :-
[10.1-1648-మ.]

1513} చక్రాయుధుడు  - చక్రాయుధము ధరించువాడు, విష్ణువు, కృష్ణుడు :-
[1-58-వ., 3-253-క., 5.1-175-వ., 8-100-మ., 10.2-101-క., 10.2-198-మ.]

1514} చక్రి  - చక్రాయుధము ధరించువాడు, విష్ణువు, కృష్ణుడు :-
[1-212-ఉ., 1-279-తే., 1-353-శా., 1-376-శా., 1-404-క., 1-445.1-తే., 1-525-మ., 2-51.1-ఆ., 2-155.1-తే., 7-18-శా., 7-25-శా., 7-170.1-ఆ., 7-275-క., 7-287-ఉ., 7-345-క., 7-399-క., 8-107-మ., 9-82.1-తే., 10.1-52.1-ఆ., 10.1-168-మ., 10.1-236-వ., 10.1-945-వ., 10.1-973-మ., 10.1-1577-ఉ., 10.1-1682-మ., 10.2-49-క., 10.2-165-వ.]

1515} చక్రిసూనుడు  - కృష్ణుని కొడుకు, ప్రద్యుమ్నుడు :-
[10.2-21-క.]

1516} చక్రీశ్వరుడు  - చక్రి (సర్పములకు) ఈశ్వరుడు (ప్రభువు), ఆదిశేషుడు :-
[10.2-591-క.]

1517} చక్షురాది  - జ్ఞానేంద్రియములు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము :-
[2-267-వ.]

1518} చక్షుస్సు  - కన్నుయైనవాడు :-
[4-390-వ.]

1519} చటులము - చటులతరము చటులతమము :-
[10.1-737-క.]

1520} చటులము - చటుల తరము చటులతమము :-
[3-983.1-తే.]

1521} చతురంగబలము  - 1రథములు 2ఏనుగులు 3గుఱ్ఱములు 4పదాతిదళము అనెడి నాలుగు అంగములు (విభగములు) కల సేన :-
[10.1-1708-ఉ.]

1522} చతురంగబలములు  - 1రథములు 2ఏనుగులు 3గుఱ్ఱములు 4పదాతిదళము అనెడి నాలుగు అంగములు (విభగములు) కల సేన :-
[1-31-ఉ., 1-243-వ., 3-691-చ., 10.2-541.1-తే., 10.2-687-వ.]

1523} చతురంగము  - 1రథములు 2ఏనుగులు 3గుఱ్ఱములు 4పదాతిదళము అనెడి నాలుగు అంగములు (విభగములు) కల సేన :-
[1-204-వ.]

1524} చతురంగములు  - దేహమురీత్యా 1పంచభూతములు 2జ్ఞానేంద్రియములు 3కర్మేంద్రియములు 4అంతరంగచతుష్కము అనెడి నాలుగు అంగములు కలది (ఇంకొక విధముగ) యుద్ధ సేన రీత్యా 1గజ 2తురగ 3రథ 4పదాతులను నాలుగు విభాగములు కల సేన :-
[10.1-1658-క.]

1525} చతురంతఃకరణములు  - మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. :-
[1-59-క., 3-204.1-తే., 10.1-683-వ.]

1526} చతురంతయానము  - పల్లకీ, చతుర్దోలము (తెలుగు పర్యాయపద నిఘంటువు, జిఎన్ రెడ్డి), నలుగురు మోయు ఉయ్యాలవంటి వాహనము (ఆంధ్ర శబ్దరత్నాకరము) :-
[3-1046.1-తే., 10.2-1027.1-తే.]

1527} చతురనటమూర్తి  - చతుర (మిక్కిలినేర్పుగల) నటుని వంటి మూర్తి (స్వరూపము కలవాడు), కృష్ణుడు :-
[10.1-770.1-తే.]

1528} చతురాత్మతత్త్వము  - చతుర్వ్యూహముల (1వాసుదేవుడు 2సంకర్షణుడు 3అనిరుద్ధుడు 4ప్రద్యుమ్నుడు) సృష్టికి చతురహంకారములను (1మనస్సు 2బుద్ధి 3చిత్తము 4అహంకారము) ప్రసాదించిన తత్త్వము :-
[3-1033.1-తే.]

1529} చతురానననందనుడు  - చతురానన (చతుర్ముఖ బ్రహ్మ యొక్క) నందనుడు, నారదుడు :-
[10.2-623-క.]

1530} చతురాననాండము  - బ్రహ్మాండము, చతురానన (బ్రహ్మ) అండము :-
[9-230-వ.]

1531} చతురాననుడు  - చతుర్ముఖబ్రహ్మ, వ్యు. చత్వారి ఆననాని అస్య, బ.వ్రీ. నాలుగు ముఖములు కలవాడు, :-
[3-224-క., 3-275.1-తే., 3-292-వ., 3-720.1-తే., 3-1018-వ., 4-152-చ., 8-170-శా., 8-502-వ., 8-672.1-తే., 10.1-542-శా.]

1532} చతురామ్నాయవపుర్విశేషధరుడు  - చతుర (నాలుగు) ఆమ్నాయ (వేదము)లను వపుర్ (శరీర) విశేష (ప్రత్యేకతలు) వలె ధర (ధరించిన వాడు), విష్ణువు :-
[3-431-మ.]

1533} చతురాశ్రమములు  - 1బ్రహ్మచర్యము 2గార్హపత్యము 3వానప్రస్థము 4సన్యాసము అనెడి నాలుగు ఆశ్రమములు :-
[1-58-వ., 1-216-వ., 1-484.1-ఆ., 3-189.1-తే., 3-253-క., 4-51.1-తే., 7-408.1-ఆ., 10.1-96-క., 10.2-1122-వ., 11-106-క., 12-11-వ.]

1534} చతురాస్యజీవకోశము  - చతురాస్య (బ్రహ్మ) జీవకోశము (అండము), బ్రహ్మాండము :-
[9-113.1-ఆ.]

1535} చతురాస్యుడు  - నాలుగు (చతుర) ముఖము (అస్యము)లవాడు, బ్రహ్మదేవుడు :-
[3-226-క., 3-281-మ.]

1536} చతురుపాయప్రవీణుడు  - చతురుపాయములు (1సామ 2దాన 3భేద 4దండములు) అందు సమర్థుడు, కృష్ణుడు :-
[10.2-697.1-తే.]

1537} చతురోపాయములు  - 1సామ 2దాన 3భేద 4దండోపాయములు :-
[10.1-1533-మ.]

1538} చతుర్దశభువనములు  - సప్త ఊర్ధ్వలోకములు (1భూలోకము 2భువర్లోకము 3సువర్లోకము 4మహర్లోకము 5జనలోకము 6తపోలోకము 7సత్యలోకము) సప్త అధోలోకములు (1అతలము 2వితలము 3సుతలము 4రసాతలము 5మహాతలము 6తలాతలము 7పాతాళము) అను పద్నాలుగు లోకములు :-
[3-337-తే., 10.1-941-క.]

1539} చతుర్దశమనువులు  - 1స్వాయంభువుడు 2స్వారోచిషుడు 3ఉత్తముడు 4తామసుడు 5రైవతుడు 6చాక్షుసుడు 7వైవస్వతుడు 8సూర్యసావర్ణి 9దక్షసావర్ణి 10బ్రహ్మసావర్ణి 11ధర్మసావర్ణి 12భద్రసావర్ణి 13దేవసావర్ణి 14ఇంద్రసావర్ణి :-
[6-224-వ., 8-6-క., 9-3.1-తే.]

1540} చతుర్దశరత్నములు(విద్యలు)  - 1ఋగ్వేదము 2యజుర్వేదము 3సామవేదము 4అధర్వణవేదము 5శిక్ష 6వ్యాకరణము 7ఛందస్సు 8నిరుక్తము 9జ్యోతిషము 10కల్పము 11మీమాంస 12న్యాయము 13పురాణము 14ధర్మశాస్త్రము :-
[9-704-మ.]

1541} చతుర్దశేంద్రియములు  - ఐదు జ్ఞానేంద్రియములు (కన్ను ముక్కు చెవి నాలుక చర్మము) ఐదు కర్మేంద్రియములు (కాళ్ళు చేతులు నోరు గుహ్యేంద్రియము గుదము) నాలుగు అంతరింద్రియములు (మనస్సు బుద్ధి చిత్తము ఆహంకారము) :-
[10.1-119.1-ఆ., 10.1-405.1-తే., 10.1-1472.1-తే., 10.1-1472.1-తే., 10.1-1779-వ.]

1542} చతుర్దిశలు  - నల్దిక్కులు, 1తూర్పు 2దక్షిణము 3పడమర 4ఉత్తరము :-
[9-510-ఉ.]

1543} చతుర్భద్రబంధము  - నాలుగు మూల లందును వెనుక మొగముగా నిలిచి హస్త విన్యాసదులను కనుపింప చేయునది, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

1544} చతుర్భాహుడు  - నాలుగు చేతులు గలవాడు, విష్ణువు :-
[2-237-మ.]

1545} చతుర్భుజుడు  - నాలుగు చేతులు గలవాడు, విష్ణువు :-
[1-218-వ., 10.1-236-వ.]

1546} చతుర్ముఖత్వము  - చతుర్ముఖు (నాలుగు ముఖముల వాని, బ్రహ్మదేవుని) తత్వము (పదవి), బ్రహ్మత్వము :-
[4-699-వ.]

1547} చతుర్ముఖబంధము  - నాలుగు వైపులకు ముఖములను తిప్పి లయబద్ధముగా తిరుగుచు హస్త విన్యాసాదులను కనుపింప చేయునది, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

1548} చతుర్ముఖుడు  - చతుః (నాలుగు, 4) ముఖములు కలవాడు, బ్రహ్మదేవుడు :-
[2-252-వ., 3-375-ఉ., 3-388-వ., 3-839-వ., 4-127-వ., 4-530-వ., 4-943.1-తే., 6-258-వ., 10.1-547-వ., 11-105-వ., 12-30-వ.]

1549} చతుర్యుగములు  - 1కృత 2త్రేత 3ద్వాపర 4కలియుగములు నాలుగు :-
[12-22-వ.]

1550} చతుర్వర్ణములు  - 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్ర :-
[1-30-ఉ., 1-58-వ., 1-484.1-ఆ., 3-189.1-తే., 3-253-క., 10.2-1122-వ., 11-74.1-తే.]

1551} చతుర్వింశతితత్త్వములు  - అష్టప్రకృతులు (1అవ్యకత్తము 2బుద్ధి 3అహంకారము పంచ తన్మాత్రలు అను 4శబ్దము 5స్పర్శము 6దృక్కు 7ఘ్రాణము 8రసనము) మరియును షోడశ వికృతులును (పంచ భూతములు (1పృథివి 2జలము 3అగ్ని 4వాయువు 5ఆకాశము) పంచ జ్ఞానేంద్రియములు (6చర్మము 7కన్ను 8ముక్కు 9చెవి 10నాలుక) పంచ కర్మేంద్రియములు (11వాక్కు 12చేతులు 13కాళ్ళు 14గుదము 15ఉపస్థు) మరియు16మనస్సు) పంచ వింశకము (25వది) కాలము (పురుషుడు) పాఠ్యంతరమున దశేంద్రియములు (10) విషయ పంచకము (5) భూత పంచకము (5) అంతఃకరణ చతుష్టయము (4) :-
[3-891-వ., 7-330-ఉ., 10.1-537-వ.]

1552} చతుర్వింశతితత్త్వశాసకుడు  - 24 తత్త్వములను పాలించెడివాడు, విష్ణువు :-
[7-330-ఉ.]

1553} చతుర్విద్యలు  - 1ఆన్వీక్షకి (ఇందు విజ్ఞానము తెలుప బడును) 2త్రయి (ఇందు ధర్మాధర్మములు తెలుపబడును) 3వార్త (ఇందు అర్థానర్థములు తెలుపబడును) 4దండనీతి (ఇందు నయానయములు తెలుపబడును) :-
[9-531.1-తే.]

1554} చతుర్విధఋత్విక్కులు  - యజ్ఞ నిర్వహణకు కావలిసిన నలుగురు ఋత్విక్కులు 1 హోత 2 అధ్వర 3 ఉద్గాత 4 బ్రహ్మ :-
[3-388-వ.]

1555} చతుర్విధజన్మలు  - 1అండజములు 2స్వేదజములు 3జరాయుజములు 4ఉద్భిజ్జములు అనెడి విధానములైన జన్మలు కల ప్రాణులు :-
[10.2-1072.1-తే.]

1556} చతుర్విధపురుషార్థములు  - 1ధర్మ 2అర్థ 3కామ 4మోక్షములు, 1ధర్మము (విధి నిర్వహణ) 2అర్థము (ప్రయోజనము) 3కామము (ఫలితము) 4మోక్షము (అంతిమ లక్ష్యము) :-
[4-244-క., 4-249.1-తే., 4-670-వ., 10.1-1392.1-తే., 10.2-249-వ., 10.2-1328-ఉ.]

1557} చతుర్విధఫలప్రదాయక  - చతుర్విధ (నాలుగు విధములైన) ఫల (పురుషార్థములను, 1ధర్మ 2అర్థ 3కామ 4మోక్షములను) ప్రదాయక (చక్కగా నిచ్చువాడు), విష్ణువు :-
[4-195-చ.]

1558} చతుర్విధబలములు  - చతురంగబలములు రథ గజ అశ్వ పదాతి దళములు అను నాలుగు సైన్య విభాగముల పాఠ్యంతరమున చతుర్విధబలములు బాహు మనో ధన మరియు బంధు బలములు :-
[3-129.1-తే.]

1559} చతుర్విధభక్తియోగములు  - 1ఆర్తునకైనభక్తియోగము 2జిజ్ఞాసువుకైనభక్తియోగము 3అర్థార్థికైనభక్తియోగము 4జ్ఞానికైనభక్తియోగము :-
[3-1027-వ.]

1560} చతుర్విధభూతసర్గము  - చతుర్విధ భూత సృష్టి 1 అండజములు గ్రుడ్డు నుండి పుట్టునవి, పక్షులు, పాములు మున్నగునవి; 2 స్వేదజములు స్వేదముల (ఉక్క మొదలగునవి) వలన కలుగునవి పురుగులు మున్నగునవి; 4 ఉద్భిజములు నేలను పగుల్చుకుని పొడమునవి, చెట్లు, తీగెలు మొ. 4 జరాయుజములు (తల్లి గర్భకోశము నందలి) మావి నుండి జనించునవి, జంతువులు, మానవులు మున్నగునవి. :-
[8-155-వ.]

1561} చతుర్విధభూతసృష్టి  - చతుర్విధ భూత సృష్టి 1 అండజములు గ్రుడ్డు నుండి పుట్టునవి, పక్షులు, పాములు మున్నగునవి; 2 స్వేదజములు స్వేదముల (ఉక్క మొదలగునవి) వలన కలుగునవి పురుగులు మున్నగునవి; 4 ఉద్భిజములు నేలను పగుల్చుకుని పొడమునవి, చెట్లు, తీగెలు మొ. 4 జరాయుజములు (తల్లి గర్భకోశము నందలి) మావి నుండి జనించునవి, జంతువులు, మానవులు ము. :-
[4-480-క.]

1562} చతుర్విధయోగాభ్యాసములు  - మంత్ర లయ హఠ రాజ యోగాభ్యాసములు :-
[10.1-1474-ఆ.]

1563} చతుర్విధశృంగారములు  - 1వస్త్రములు 2భూషణములు 3చందనము 4పుష్పము అను నాలుగు రకముల అలంకారములు :-
[10.2-674.1-తే.]

1564} చతుర్విధాంతకరణములుఅధిదేవతలు  - 1 చిత్తము వాసుదేవుడు 2 అహంకారము సంకర్షణుడు 3 బుద్ధి ప్రద్యుమ్నుడు 4 మనసు అనిరుద్ధుడు :-
[3-57-వ.]

1565} చతుర్విధాన్నంబులు  - భక్ష్య భోజ్య లేహ్య చోష్యములు అనెడి నాలుగువిధముల ఆహారములు :-
[4-510-వ.]

1566} చతుర్విధాన్నములు - భక్ష్య భోజ్య లేహ్య చోష్యములు అనెడి నాలుగువిధముల ఆహారములు :-
[4-510-వ.]

1567} చతుర్వేదములు  - 1ఋగ్వేదము 2యజుర్వేదము 3సామవేదము 4అధర్వణవేదము :-
[10.1-573-శా., 10.1-1412-శా., 11-107-వ., 12-30-వ.]

1568} చతుర్వ్యూహములు  - 1వాసుదేవ 2ప్రద్యుమ్న 3సంకర్షణ 4అనిరుద్ధ రచనావిశేషములు, ఇంకొక విధముగ వాసుదేవాదులు (1వాసుదేవుడు 2అచ్యుతుడు 3అనంతుడు 4గోవిందుడు) :-
[3-892-క., 10.1-1236-దం., 12-39-వ.]

1569} చతుషష్టివిద్యలు  - అరవైనాలుగు విద్యలు, ఇతిహాసము, గంధవాదము, దృష్టివంచనము, నాటకము, జలవాదము, చిత్రక్రియ, జూదము, వాక్స్తంభము, దారుక్రియ, అవధానము, మోహనము, అదృశ్యకరణము, రత్నశాస్త్రము, కాలవంచనము, కృషి, దహదము, అంజనము, వేట, రసవాదము, చోరకర్మము, అలంకారము, జలస్తంభము, మృత్తికక్రియ, కామశాస్త్రము, ఆకర్షణము, అంబరక్రియ, వాచకము, మారణము, పశుపాలనము, సాముద్రికము, ఐంద్రజాలము, మిత్రభేదము, పాకశాస్త్రము, మణిమంత్రౌషధాదికసిద్ధి, కావ్యము, ఖనివాదము, అశ్వక్రియ, కవిత్వము, ఖడ్గస్తంభము, చర్మక్రియ, లిపికర్మము, వశీకరణము, వాణిజ్యము, శాకునము, ఉచ్చాటనము, అసవకర్మము, మల్లశాస్రము, పాదుకాసిద్ధి, ఆగమము, ధాతువాదము, సర్వవంచనము, గానము, అగ్నిస్తంభము, లోహక్రియ, దేశభాషలిపి, వాయస్తంభము, వేణుక్రియ, సర్వశాస్త్రము, విద్వేషము, దౌత్యము, రథాశ్వగజకౌశలము, పరకాయప్రవేశము, వ్యసాయము, ప్రశ్నము, :-
[10.1-1413-క.]

1570} చతుష్పాదులు  - నాలుగు కాళ్ళు కలవి, జంతువులు పశువులు మున్నగునవి :-
[4-853-వ., 11-91-వ.]

1571} చదువులముదుకడు  - చదువుల (వేదజ్ఞానమునందు) ముదుకడు (వృద్ధుడు), బ్రహ్మ :-
[8-716-క.]

1572} చపలత  - రాగద్వేషాదులచే పనుల యందు కలుగు తబ్బిబ్బు :-
[9-658-క., 10.1-874-క., 10.1-1348-వ.]

1573} చమరము  - దీనినుండి చామరములు చేయబడును, సవరపు మెకము :-
[9-595-క.]

1574} చయనం  - యజ్ఞకుండానికి ఇటుకలు పేర్చడం, ఒక్కొక యజ్ఞానికి ఒక్కొక విధమైన యజ్ఞ కుండం అవసరమవుతుంది. అలాగే ఒక్కొక వేద శాఖవారికి ఒక్కొక పద్ధతి ఉంటుంది. పారమార్థిక పదకోశము (పొత్తూరి వేంకటేశ్వర రావు) :-
[3-388-వ.]

1575} చరాచరప్రచయనేత  - చరాచర (సమస్తమైన జీవుల) ప్రచయ (సమూహముల)కును నేత, బ్రహ్మదేవుడు :-
[3-500-ఉ.]

1576} చరాచరవిభుడు  - కదల గలవి లేనివి రెంటికి ప్రభువు, విష్ణువు :-
[10.1-218-శా.]

1577} చర్వితచర్వణము  - తిన్నదే మరల తినుట, చేసినదే మరల మరల చేయుట :-
[7-181-ఉ.]

1578} చలనమందకుండుట  - నిశ్చల శ్థితి :-
[3-75-తే.]

1579} చల్లడము  - తొడలకు సగమువరకు వచ్చునట్లు కట్టుకొనెడి వస్త్రవిశేషము, పాఠ్యంతరమున మోకాలివరకు గోచిపోసి కట్టుకోనెడి వస్త్ర కవచము, గుడిగి :-
[10.1-430.1-తే., 10.1-1342-క.]

1580} చాక్షుషమన్వంతరము  - చాక్షుషుడను మనువు కాలం కనుక చాక్షుషమన్వంతరము :-
[1-63-వ.]

1581} చాచి(ప్ర)  - సాచి (వి) :-
[10.1-1558-వ.]

1582} చాచు(ప్ర)  - సాచు (వి) :-
[10.1-1565-శా.]

1583} చాణూరముష్టికాదులు  - కంసుని వద్ద మల్లురు :-
[10.1-1627-మ.]

1584} చాతురాశ్రమములు  - బ్రహ్మచర్య, గృహస్త, వానప్రస్త, సన్యాస. :-
[1-82-వ., 1-405-క.]

1585} చాతుర్ధర్మములు  - 1బ్రహ్మచర్యములు 2గృహస్థధర్మములు 3వానప్రస్థధర్మములు 4 సన్యాసధర్మములు :-
[3-789-క.]

1586} చాతుర్మాసములు  - నాలుగు నెలలచొప్పున యుండెడి త్రికాలములు (ఎండాకాలము, వర్షాకాలము, చలికాలము) :-
[5.1-95.1-తే.]

1587} చాతుర్మాస్యము  - యోగులు ప్రతి సంవత్సరము ఆషాఢశుద్ధము మొదలు కార్తికశుద్ధము వఱకు నాలుగు నెలలు ఒకే ప్రదేశమున ఉండు దీక్ష :-
[1-103-వ., 3-754-వ.]

1588} చాతుర్వర్ణములు  - 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్ర వర్ణములు :-
[1-82-వ., 1-216-వ., 1-405-క., 4-51.1-తే., 7-408.1-ఆ., 7-419-వ., 11-106-క., 12-11-వ.]

1589} చాతుర్హోతలు  - బ్రహ్మ, హోత, అధ్వర్యుడు, అగ్నీధ్రుడు :-
[2-94.1-తే.]

1590} చాతుర్హోత్రరూపుడు  - చాతుర్హోత్రము (బ్రహ్మ, హోత, అధ్వర్య, అగ్నీధ్ర అను చాతుర్హోతల తంత్రములు) స్వరూపమైనవాడు, విష్ణువు :-
[4-705-వ.]

1591} చాపము  - విల్లు, సూర్యుడు గమనము చేసెడి మార్గము :-
[4-460.1-తే.]

1592} చాపాచార్యుడు  - విలువిద్యకొరకైన గురువు, ద్రోణుడు :-
[3-28-క.]

1593} చామరము  - చమరీమృగముకుచ్చుతో చేయబడి గాలి విసురుటకు ఉపయోగపడెడి సాధనము, తెల్లగా ఉండును కనుక వింజామరము :-
[9-319.1-ఆ.]

1594} చామీకరకుంభస్తనులు  - చామీకర (బంగారు) కుంభ (కుండలవంటి) స్తనులు (స్తనములు కలవారు), స్త్రీలు :-
[10.2-149-క.]

1595} చారణులు  - ఒకజాతి ఖేచరులు, దేవగాయక జాతి వారు, వ్యు. చారయతి కీర్తనమ్ చర (ణిత్)+ల్యు, కీర్తిని నలుగడలకు వ్యాపింప జేయువారు. :-
[2-274.1-తే., 10.1-107-క.]

1596} చారు - చారుతర చారుతమ :-
[1-53-క., 4-458.1-తే., 4-484.1-తే.]

1597} చారు - చారుతరము చారుతమము :-
[5.1-132-క., 10.1-1750-మ.]

1598} చారుముఖి  - చారు (చక్కనైన) ముఖి (ముఖము, గుర్తింపు) కలామె, స్త్రీ :-
[10.1-980.1-ఆ.]

1599} చారులక్ష్మీవిలాసుడు  - చారు (అందమైన) లక్ష్మీ (లక్ష్మీకళతో) విలాసిల్లెడివాడ, శ్రీకృష్ణ :-
[5.1-183-మాలి.]

1600} చింతామణి  - చింత (చింతించినవానిని యిచ్చెడి) మణి (రత్నము) :-
[6-260.1-తే., 6-326-వ., 10.1-1738-మ.]

1601} చిట్టి  - 1. చిట్టకము కలవి, 2. లీలమాత్రపు, చిన్న :-
[8-619-ఆ.]

1602} చితి  - శవదహనార్థమైన కట్టెల పోగు :-
[4-844-చ.]

1603} చిత్  - తత్వజ్ఞానపరితమైన :-
[10.1-537-వ.]

1604} చిత్+శక్తి  - చిత్ + ఛక్తి (ఛత్వసంధి), చిత్ + ఛక్తి చిచ్ఛక్తి (శ్చుత్వసంధి) :-
[3-198.1-తే.]

1605} చిత్తజగురువు  - చిత్తజు (మన్మథుని) గురువు (తండ్రి), విష్ణువు :-
[11-27-క.]

1606} చిత్తజన్ముడు  - మనసున పుట్టువాడు, మన్మథుడు :-
[10.1-1280.1-ఆ.]

1607} చిత్తజాతజనకము  - చిత్తజాత (మన్మథుని) జనకము, కోరిక :-
[10.1-1321-వ.]

1608} చిత్తజాతజనకుడు  - చిత్తజాత (మన్మథుని) జనకుడు, కృష్ణుడు :-
[10.1-1321-వ.]

1609} చిత్తజుడు  - మనసున పుట్టువాడు, మన్మథుడు :-
[3-452-చ.]

1610} చిత్తము  - ఇంద్రియములతో కూడిన మనస్సు, సంశయ రూపము :-
[2-16-వ., 10.1-682.1-తే.]

1611} చిత్తాదివర్తనములు  - 1చిత్తము 2అహంకారము 3మనస్సు 4బుద్ధి రూపములైన చతురంతఃకరణముల చలన కర్తవ్య సంకల్ప నిశ్చయ వ్యాపారములు నిర్వహించునవి :-
[10.1-683-వ.]

1612} చిత్తి  - ద్రవ్యము (పదార్థము)ను కూడబెట్టునది, చిత్తము తానైనది :-
[4-26-వ.]

1613} చిత్తేశుడు  - మనసునకు ప్రభువు, భర్త :-
[10.1-1707-మ.]

1614} చిత్రకేతుడు  - రంగురంగుల కేతనము(జండా) కలవాడు :-
[4-26-వ.]

1615} చిత్రము  - చిత్తమును రమింప జేయునది, మనోజ్ఞమైనది :-
[7-6-క.]

1616} చిదచిదాత్మకుడు  - చిత్ ఆచిత్ ఆత్మకుడు, చేతనా అచేతనములు తానే అయిన వాడు :-
[2-109-చ.]

1617} చిదచిదానందమయుడు  - చిత్ (చైతన్యవంతములు) అచిత్ (జడములు) సర్వములోను మయుడు, విష్ణువు :-
[4-367.1-తే.]

1618} చిదచిదానందస్వరూపకుడు  - సచేతన అచేతన ఆనందములు తన స్వరూపమే అయిన వాడు, భగవంతుడు :-
[2-277.1-తే.]

1619} చిదాత్మకుడు  - చేతనా రూపమైన ఆత్మ కలవాడు, జ్ఞాని :-
[1-67-వ.]

1620} చిదానందమయుడు  - చిత్ (చైతన్యవంతమైన) ఆనందముతో మయుని (నిండినవానిని), విష్ణువు :-
[4-963.1-తే.]

1621} చిన్మయాకారుడు  - చిత్ (చైతన్యముతో) మయ (కూడిన) ఆకార (స్వరూపము కలవాడు), జ్ఞాన స్వరూపుడు, కృష్ణుడు, విష్ణువు :-
[4-171.1-తే., 10.2-1150-క.]

1622} చిన్మయాత్మకుండు  - చిత్ (చైతన్యముతో) మయ (కూడిన) ఆకార (స్వరూపము కలవాడు), జ్ఞాన స్వరూపుడు, కృష్ణుడు, విష్ణువు :-
[2-272.1-ఆ.]

1623} చిన్మయుడు  - చిత్ (చైతన్యముతో) మయ (కూడిన) ఆకార (స్వరూపము కలవాడు), జ్ఞాన స్వరూపుడు, కృష్ణుడు, విష్ణువు :-
[2-237-మ.]

1624} చిమ్మనక్రోవి  - జలక్రీడ లందు నీళ్ళు చిమ్ము గొట్టము :-
[10.2-804-వ.]

1625} చిమ్ముట  - కొమ్ములతో పొడిచి దూరముగ తోయుట, జలాదులను విస్తారముగా జల్లుట :-
[1-416-శా.]

1626} చిర - చిరతర చిరతమ :-
[4-451-క.]

1627} చిరదయాకరుడు  - చిర మిక్కిలి దయ (కృప)ను ఆకరుడు (ఇచ్చువాడ), విష్ణువు :-
[3-753.1-తే.]

1628} చిరదయాకారుడు  - చిర మిక్కిలి దయ (కృప)ను ఆకరుడు (ఇచ్చువాడ), విష్ణువు :-
[4-203.1-తే.]

1629} చిరభాగ్యోదయుడు  - చిర (మిక్కిలి) భాగ్య (భాగ్యములను) ఉదయుడు (కలిగించువాడు), విష్ణువు :-
[3-574-మ.]

1630} చిరము - చిరతరము చిరతమము :-
[3-887-క., 4-587.1-తే., 4-839-క., 7-15-క., 8-492-వ.]

1631} చిరము - చిరతరము చిరతమము :-
[3-957-క.]

1632} చిరశుభాకారుడు  - చిర (మిక్కిలి) శుభమైన ఆకారము కలవాడు, విష్ణువు :-
[3-304.1-తే., 3-423.1-తే., 3-573.1-తే.]

1633} చీకటిగొంగ  - చీకటికి గొంగ (శత్రువు), సూర్యుడు :-
[9-8.1-తే.]

1634} చీనిచీనాంబరము  - చీనీ (చైనా దేశమునుండి వచ్చిన) చీనాంబరము (చైనాగుడ్డ, పట్టువస్త్రము) :-
[4-58.1-తే.]

1635} చీరజిక్కు  - చీర చాలలేదు, కడుపు వచ్చెను :-
[8-493-క.]

1636} చుంచు  - పిలక, బలము, నేర్పరితనం , చుంచుప్ ప్రత్యయం ("తేనవిత్తః చుంచుప్ చణపౌ"అని కౌముదీ సూత్రం) :-
[10.1-419-క.]

1637} చుక్కలత్రోవ  - చుక్కలు (నక్షత్రములు) త్రోవ (తిరుగు స్థలము), ఆకాశము :-
[8-509-క.]

1638} చుఱచుఱ  - కోపముతో చుఱచుఱమను నిప్పులాంటి చూపులు, నిప్పులు కాలుటయందలి ధ్వన్యను కరణము, :-
[10.1-619-క.]

1639} చెంగల్వ  - చెన్ను (ఎఱ్ఱదనము కలిగిన) కల్వ (కలువపువ్వు) :-
[10.1-804-క.]

1640} చెచ్చెర  - చెర (వేగము) వంతమైన చెరన్ (వేగము), శీఘ్రము. :-
[3-515-మ.]

1641} చెఱకువింటిజోదు  - చెరుకుగడ విల్లుగా కలవీరుడు, మన్మథుడు :-
[9-540-వ.]

1642} చెఱకువింటివాడు  - చెరుకుగడ వింటివాడు (విల్లుగ గలవాడు), మన్మథుడు :-
[9-391-వ.]

1643} చెఱకువిలుతుడు  - చెరకుగడ ధనుస్సుగా కలవాడు, మన్మథుడు :-
[10.1-1747-వ.]

1644} చెలువ  - చెలువు (అందము, చక్కదనము) అ (కలామె), అందగత్తె :-
[4-910.1-తే., 10.1-1475-మ.]

1645} చేతోజాతుడు  - చిత్ (మనసున) జాత (పుట్టువాడు), మన్మథుడు :-
[9-549-శా.]

1646} చేతోవిభుడు  - చేతస్ (చిత్తమునకు) విభుడు, భర్త :-
[10.1-810-క.]

1647} చేదీశుడు  - చేది దేశపు ప్రభువు, శిశుపాలుడు :-
[10.1-1707-మ.]

1648} చేపట్టు  - చేయి పట్టు, స్వీకరించు :-
[3-31-ఉ.]

1649} చైద్యవసుధావరుడు  - చేదిదేశపు రాజు, శిశుపాలుడు :-
[10.2-1218-చ.]

1650} చైద్యుడు  - చేదిదేశపురాజు,శిశుపాలుడు :-
[3-123.1-తే., 7-11-ఉ., 10.1-973-మ., 10.1-1682-మ., 10.1-1698-ఉ., 10.1-1706-ఉ., 10.2-231-మ., 10.2-794-వ.]

1651} చోద్యము  - చోదన (తోలుట) చేయబడినది, ఆశ్చర్యము :-
[2-213-చ.]

1652} చోష్యములు  - దంతములతో నమిలి రసము పీల్చి పిప్పి పాఱవేయునవి, చెఱకు మొ.వి :-
[4-510-వ.]

1653} చౌలము  - చూడాకర్మ, ఉపనయనమునకు ముందు జరిపెడి కేశసంస్కారము :-
[5.1-121-మ.]

1654} జంగమములు  - కదలిక ఉన్న జీవులు, జంతువులు :-
[1-435-వ., 3-432.1-తే., 3-1019-మ.]

1655} జంగమములు  - తిరుగునది, చరిష్ణువు, జంతువులు, పక్షులు :-
[3-997-వ.]

1656} జంఘాలుడు  - పిక్క గట్టి కల వాడు, మిక్కిలి వేగంగా నడచువాడు. :-
[1-412-శా.]

1657} జంతువు  - పుట్టుక కలది, వ్యు. జన్+తు, జన్యతే శరీరాది ధారణేన ప్రాదుర్భవతి, శరీరాదులు ధరించి పుట్టునది. జీవుడు; ప్రాణి. :-
[1-326-వ.]

1658} జంభవిరోధి  - జంభాసురునికి శత్రువు, ఇంద్రుడు :-
[4-464-చ.]

1659} జంభవైరి  - జంభాసురునికి శత్రువు, ఇంద్రుడు :-
[4-442.1-తే., 4-467.1-తే.]

1660} జంభాంతకుడు  - జంభాసురుని సంహరించిన వాడు, ఇంద్రుడు. :-
[10.1-946-మ.]

1661} జంభారి  - జంభాసురుని అరి (శత్రువు), ఇంద్రుడు :-
[6-397.1-ఆ., 6-420-వ., 8-690-మ., 11-67-క.]

1662} జగతీజము  - జగతి (నేల) యందు జము (పుట్టినది), చెట్టు :-
[4-610-చ., 10.1-791-మ.]

1663} జగతీనాథుడు  - జగతి (భూమికి) నాథుడు (పతి), రాజు. :-
[6-152-మ., 8-213-క.]

1664} జగతీరుహము  - భూమిపై పుట్టునది, చెట్టు :-
[10.2-545-క.]

1665} జగతీశుడు  - జగతి (భూమి)కిన్ ఈశుడు (ప్రభువు), రాజు :-
[4-407-క., 10.2-84.1-ఆ.]

1666} జగతీసురుడు  - భూలోకమునకు దేవుడు, బ్రాహ్మణుడు :-
[10.1-1701.1-ఆ.]

1667} జగత్  - జాయతే గచ్చతి ఇతి జగత్ (వ్యుత్పత్తి), జనన లయములు గల పదునాలుగు లోకములు :-
[10.1-1236-దం.]

1668} జగత్పతి  - లోకములకు ప్రభువు, కృష్ణుడు, విష్ణువు :-
[1-190-మత్త., 2-236-మ.]

1669} జగత్పరిపాలనుడు  - జగత్ (విశ్వము)ను పరిపాలించువాడు, విష్ణువు :-
[3-572-చ.]

1670} జగత్పవిత్రుడు  - సకల భువనములను పవిత్రము చేయువాడు, విష్ణువు :-
[3-284-మ.]

1671} జగత్ప్రాణుడు  - సర్వలోకములకు ప్రాణము రూపమున ఉండువాడు, వాయువు :-
[10.1-1060-మ., 10.1-1162-శా., 10.1-1341-శా.]

1672} జగత్రయము  - ముల్లోకములు, 1స్వర్గలోకము 2మర్త్యలోకము 3పాతాళలోకము :-
[6-425-వ.]

1673} జగదంతర్యామి  - విశ్వము అందు అంతను వ్యాపించినవాడు, శంకరుడు :-
[3-473-వ.]

1674} జగదధీశ్వరుడు  - జగత్ (లోకము) లన్నిటికి అధీశ్వరుడు (సర్వోత్కృష్ట అధిపతి), విష్ణువు :-
[10.1-350-ఆ.]

1675} జగదభిరాముడు  - జగత్ (లోకములకు) అభి (మిక్కిలి) రాముడు (అందమైనవాడు), రాముడు :-
[8-1-క.]

1676} జగదవనవిహారుడు  - జగత్తును అవన (రక్షించుట)కై విహరించువాడు, రాముడు :-
[9-735-మాలి., 12-53-మాలి.]

1677} జగదాత్ముడు  - జగత్తు తన స్వరూపమైన వాడు :-
[2-93-ఉ., 3-373-మ., 3-439-ఉ.]

1678} జగదాధారుడు  - జగత్తునకు ఆధారభూత మైనవాడు, విష్ణువు. :-
[4-579-క., 10.1-675-క.]

1679} జగదీశుడు  - జగత్తు (లోకముల)కు ఈశ (ప్రభువు), విష్ణువు :-
[4-555.1-తే., 6-344-క., 6-438-చ., 7-193-ఉ., 8-477-మ., 10.1-622-ఉ., 10.1-1180.1-ఆ.]

1680} జగదీశ్వరుడు  - జగత్తునకు ఈశుడు (ప్రభువు), శ్రు. యతోవా ఇమాని భూతాని జాయంతే ఏనజాతాని జీవంతి యత్ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి, లోక స్థితి లయ కారణుడు, ఆదిశేషుడు, విష్ణువు :-
[4-276-చ., 7-108-ఉ., 7-334-క., 10.1-860-క., 10.1-869-వ.]

1681} జగదేకకీర్తి  - లోకముల అంతటిచేతను కీర్తింపబడువాడు, విష్ణువు :-
[3-423.1-తే.]

1682} జగదేకనాథుడు  - లోకములన్నిటికి ప్రధానతరమైన ప్రభువు, విష్ణువు :-
[11-36-క.]

1683} జగదేకప్రభువు  - విశ్వము సమస్తమునకు ప్రధాన ప్రభువు, విష్ణువు :-
[3-220-క.]

1684} జగదేకమాన్యచరితుడు  - భువనము లంతకును3 గౌరవింప దగినవాడు, విష్ణువు :-
[3-293.1-తే.]

1685} జగద్గీతకీర్తి  - లోకముచే గానము చేయబడిన కీర్తికలవాడ, విష్ణువు :-
[3-203-దం.]

1686} జగద్గురుడు = సకల లోకాలనుకాపాడువాడు, విష్ణువు - :-
[8-152-క.]

1687} జగద్గురుడు  - జగత్తు (విశ్వము) అంతటికి గురువైనవాడు (పెద్దవాడు), విష్ణువు :-
[5.2-74.1-తే.]

1688} జగద్గురువు  - జగత్తు (విశ్వము) అంతటికి గురువైనవాడు (పెద్దవాడు), విష్ణువు :-
[6-494-వ.]

1689} జగద్భరితుడు  - జగత్తును భరించెడివాడు, విష్ణువు :-
[2-110-మ., 4-963.1-తే.]

1690} జగద్భరితుడు  - విశ్వమును భరించు వాడు :-
[5.1-95.1-తే.]

1691} జగద్భర్త  - జగత్తు నకు భర్త (ప్రభువు), శంకరుడు :-
[3-473-వ.]

1692} జగద్వినుతయశుడు  - విశ్వమున వినుత (ప్రసిద్ధమైన) యశస్సు కలవాడు, శివుడు :-
[4-138.1-తే.]

1693} జగన్నాథుడు  - జగత్ (భువనములకు) నాథుడు (ప్రభువు), విష్ణువు :-
[3-203-దం., 6-221-వ., 7-12-మ., 8-659.1-తే., 9-226-మ., 11-57.1-తే.]

1694} జగన్నియంత  - లోకములను నియమించువాడు, భగవంతుడు :-
[2-272.1-ఆ.]

1695} జగన్నిర్మాత  - జగత్తును నిర్మాత (సృష్టించినవాడు), బ్రహ్మ :-
[7-85-మ.]

1696} జగన్నివాసుడు  - జగత్ (విశ్వము)లకు నివాసుడు (నివాసమైనవాడు), విష్ణువు :-
[3-31-ఉ., 3-718.1-తే., 3-924.1-తే., 11-66-చ.]

1697} జగన్నుతచారిత్రుడు  - జగత్ (లోకములచే) నుత (కీర్తింపబడు) చారిత్రుడు (చరిత్ర కల వాడు), శివుడు :-
[4-149.1-తే.]

1698} జగన్మాత  - జగత్తు (లోకముల)కు మాత (తల్లి), పార్వతి :-
[6-499-వ.]

1699} జట  - వేదము చెప్పుటలో విశేషము జట, ఘన :-
[8-539-క.]

1700} జఠరాగ్ని  - కడుపులోని ఆహారమును జీర్ణముచేయు అగ్ని :-
[4-26-వ.]

1701} జడము X చైతన్యము - :-
[2-139-వ.]

1702} జడిపించు  - జళిపించు, ఆడించు :-
[1-432-వ.]

1703} జనకజ  - జనకునికి పుట్టినామె, సీత :-
[9-266-క.]

1704} జనకనందన  - జనకుని పుత్రిక, సీత :-
[9-269.1-తే.]

1705} జనకవచోలబ్ధవిపినశైలవిహారుడు  - తండ్రి మాటవల్ల లభించిన అరణ్యాలలో పర్వతాలలో సంచారము కలవాడు, రాముడు :-
[9-734-క., 12-52-క.]

1706} జనకసుతాహృచ్చోరుడు  - జనకునిపుత్రిక సీత హృదయము దోచుకొన్నవాడు, రాముడు :-
[9-734-క., 12-52-క.]

1707} జనకాత్మజ  - జనకుని పుత్రిక, సీత :-
[2-162-చ.]

1708} జనకాత్మభవాననపద్మమిత్రుడు  - జనకాత్మభవ (సీతాదేవి యొక్క) ఆనన (ముఖము అను) పద్మమునకు మిత్రుడు (సూర్యుడు), శ్రీరాముడు :-
[10.2-1340-చ.]

1709} జనకాదిమహీశ్వరాతిశయసంచారుడు  - జనకుడు మున్నగు రాజర్షులను మించిన ప్రవర్తన కలవాడు, రాముడు . :-
[9-734-క.]

1710} జనకామితమందారుడు  - ప్రజల కామితములు తీర్చు కల్పవృక్షము వంటివాడు, రాముడు :-
[9-734-క., 12-52-క.]

1711} జనకుడు  - జననమునకు కారణమైనవాడు, తండ్రి, జనపథాధిపతి, ఒకానొక రాజు, సీతాదేవి తండ్రి :-
[3-219-తే., 4-101.1-తే., 10.2-1184-వ.]

1712} జననసంస్థితిసంహారచతురచిత్తుడు  - జనన (సృష్టి) సంస్థితి (స్థితి) సంహార (లయ) చతుర (నైపుణ్యము కల) చిత్తుడు (చిత్తముకలవాడ), విష్ణువు :-
[8-702.1-తే.]

1713} జననస్థితిలయకారణులు  - జనన సృష్టి; స్థితి స్థితి; లయ లయములకు; కారణులు కారణభూతులు, బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, పరమశివుడు. :-
[4-9-క.]

1714} జననాథుడు  - జన (ప్రజల) కు నాథుడు (ప్రభువు), రాజు :-
[4-3.1-తే., 4-432-వ., 5.1-113.1-ఆ., 5.2-101.1-ఆ., 8-121.1-ఆ., 10.1-280.1-ఆ., 10.2-113-క.]

1715} జననాదికనిత్యదుఃఖచయసంహారుడు  - పుట్టుక మొదలైన నిత్యము కలిగెడి దుఖ సముదాయములను తొలగించువాడు, రాముడు. :-
[12-52-క.]

1716} జననాయక  - జనులకు నాయకుడు, రాజు :-
[4-67-క., 7-8-క.]

1717} జనని  - జన్మను ఇచ్చిన ఆమె, అమ్మ :-
[3-1004-క.]

1718} జనపతి  - జనులకు (ప్రజలకు) పతి (ప్రభువు), రాజు :-
[4-783-క.]

1719} జనపాలుడు  - జనులను పాలించు వాడు, రాజు :-
[1-78-వ., 4-528-క., 4-973-క., 6-192-వ.]

1720} జనభర్త  - జనుల ప్రభువు, రాజు :-
[9-541-ఉ.]

1721} జనయిత్రి  - జననమును ఇచ్చినామె, తల్లి :-
[3-998-క.]

1722} జనలోకేశ్వరుడు  - జన(ప్రజలు) లోక (అందర)కు ఈశ్వరుడు(ప్రభువు), రాజు :-
[7-44-మ.]

1723} జనవరుడు  - జన (ప్రజల)కు వరుడు (పతి), రాజు :-
[4-603-క., 6-63-క.]

1724} జనవరేణ్యుడు  - జనులచే వరేణ్యుడు (పూజింపదగినవాడు), రాజు. :-
[3-123.1-తే., 4-615-తే., 4-854.1-తే., 7-297.1-తే., 10.2-84.1-ఆ.]

1725} జనవిభుడు  - జన (ప్రజల)కు విభుడు (ప్రభువు), రాజు :-
[4-748-క., 6-446.1-తే., 8-739-ఆ., 9-90-క.]

1726} జనాధిపసూనుడు  - జనాధిప (రాజు యొక్క) సూనుడు (పుత్రుడు), రాకుమారుడు :-
[4-940-చ.]

1727} జనార్దనుడు  - 1.సం.విణ.లోక హింసకరుడు, వ్యు. 2. (జనైః అర్ద్యతే యాచ్యతే జన + అర్ద + ల్యూట్) కృ. ప్ర. జనులచే పురుషార్థ విషయమై కోరబడువాడు. 3. వ్యు. (జనాన్ అర్దయతి) (సమస్త)జనులకును అర్దనుడు (గమ్యమైన వాడు), విష్ణువు. 4. వ్యు. జనన మరణాద్యర్థియతీ నాశయతీతి, జనన మరణములను పోగొట్టు వాడు, (వాచస్పతము), జనులను రక్షించువాడు, విష్ణువు :-
[3-627-చ., 3-666-చ., 3-759-వ., 3-833-క., 4-877.1-తే., 7-217-వ., 7-386-మ., 8-477-మ., 10.1-1145-ఉ., 10.1-1488-మ., 11-77-వ., 12-18-వ.]

1728} జన్మకర్మములు  - ఆగామికర్మములు (పుణ్య, పాపపు పనులు ఫలితము ఇంకను ప్రారంభింపబడనివి) సంచితకర్మములు (కూడబెట్టబడి ఫలితము ప్రారంభింపబోవునవి) ప్రారబ్ధ కర్మములు (ఫలితము ప్రారంభించినవి), జన్మహేతువులైన కర్మములు, జన్మసంశ్రయములు :-
[10.1-1450.1-ఆ.]

1729} జన్మలెత్తు  - పునర్జన్మలు పొందుట. :-
[10.1-1711.1-ఆ.]

1730} జన్మసంశ్రయములు  - జన్మపొందుటకు హేతువులైన ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మములు :-
[10.1-1504.1-ఆ.]

1731} జపము  - నియమించుకొని మరల మరల స్మరించుట, ఏకాగ్రమననము :-
[2-62-చ., 4-684-వ., 10.2-1198-వ.]

1732} జమదగ్నిరాముఁడు  - జమదగ్ని యొక్క కొడుకైన రాముడు, పరశురాముడు :-
[10.2-1037.1-తే.]

1733} జమునిగూడు  - జముని (యముని) కూడు (కలియు), మరణించు :-
[7-326-క.]

1734} జయంతుడు  - జయించు వాడు, విష్ణువు, ఇంద్రుని పుత్రుడు, వ్యు. జీ+ఝచ్, జయతి అసౌ. జయించు వాడు :-
[11-77-వ.]

1735} జయవిజయులు  - వైకుంఠమున విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు :-
[3-524-వ., 3-579-తే.]

1736} జయుడు  - జయము కలవాడు :-
[4-390-వ.]

1737} జరాతనయుడు  - మగధ దేశపురాజు, బృహద్రథుని కొడుకు నిలువుగా చీలిన రెండు ముక్కలుగా పుట్టుటచే తల్లి పారవేయగా జర అను రాక్షసిచేత రెండు భాగములు అతకబడి బతికిన వాడు, జరాసంధుడు :-
[10.1-1627-మ., 10.2-713-చ.]

1738} జరాసంధుడు  - మగధ దేశపురాజు, బృహద్రథుని కొడుకు నిలువుగా చీలిన రెండు ముక్కలుగా పుట్టుటచే తల్లి పారవేయగా జర అను రాక్షసిచేత రెండు భాగములు అతకబడి బతికిన వాడు, జరాసంధుడు :-
[3-129.1-తే., 10.1-1524-వ.]

1739} జరాసుతుడు  - మగధ దేశపురాజు, బృహద్రథుని కొడుకు నిలువుగా చీలిన రెండు ముక్కలుగా పుట్టుటచే తల్లి పారవేయగా జర అను రాక్షసిచేత రెండు భాగములు అతకబడి బతికిన వాడు, జరాసంధుడు :-
[3-92-చ.]

1740} జలచరము  - నీటతిరుగునది, చేప మొసలి మున్నగు జంతువులు :-
[6-257.1-తే., 8-695-వ., 11-99-వ.]

1741} జలజగర్భుడు  - జలజ (పద్మము) అను గర్భమున పుట్టిన వాడు, బ్రహ్మదేవుడు :-
[2-241-ఆ., 3-716.1-తే.]

1742} జలజనాభుడు  - జలజ (పద్మము) నాభుడు (బొడ్డున కలవాడు), విష్ణువు :-
[2-263-తే., 10.2-260-ఆ.]

1743} జలజనేత్ర  - జలజము (పద్మము) వంటి కన్నులు ఉన్నామె, స్త్రీ. :-
[4-69.1-తే.]

1744} జలజనేత్రుడు  - జలజము (పద్మము)ల వంటి నేత్రములు (కన్నులు) కలవాడు, విష్ణువు :-
[3-790-ఆ., 9-161.1-తే., 10.1-592.1-ఆ., 10.1-592.1-ఆ.]

1745} జలజబంధుడు - జలజము (పద్మము)నకు బంధుడు, సూర్యుడు :-
[9-8.1-తే.]

1746} జలజభవసుతుడు  - జలజభవ (బ్రహ్మదేవుని) సుతుడు, నారదుడు :-
[10.2-626-క.]

1747} జలజభవాదిదేవమునిసన్నుతుడు  - జలజభవ (బ్రహ్మ) ఆది (మొదలైన) దేవతలు, మునులు చే (సన్నుతుడు) స్తుతింపబడువాడు, కృష్ణుడు :-
[5.2-165-చ.]

1748} జలజభవుడు  - జలజము (పద్మము)న భవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[3-779-క., 4-442.1-తే., 8-228-క.]

1749} జలజము  - జలమున పుట్టునది, పద్మము :-
[2-188.1-తే., 3-77-క., 3-573.1-తే.]

1750} జలజలోచన  - పద్మముల వంటి కన్నులామె, స్త్రీ :-
[10.2-603-తే.]

1751} జలజాక్షి  - పద్మముల వంటి కన్నులామె, స్త్రీ :-
[10.1-1692.1-ఆ.]

1752} జలజాక్షుడు  - జలజ (పద్మముల) వంటి కన్నులు ఉన్నవాడు, కృష్ణుడు, విష్ణువు :-
[1-265-క., 3-311.1-తే., 4-206-క., 4-367.1-తే.]

1753} జలజాతనేత్రుడు  - జలజాతము (పద్మముల)వంటి నేత్రములు గలవాడు, విష్ణువు :-
[6-485-శా.]

1754} జలజాతప్రభవుడు  - జలజాత (పద్మమున) ప్రభవుడు (ఉద్భవించినవాడు), బ్రహ్మ :-
[7-386-మ.]

1755} జలజాతభవుడు  - జలజాత (పద్మము యందు) భవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[1-294.1-తే.]

1756} జలజాతము  - జలమున పుట్టినది, పద్మము :-
[3-307.1-తే.]

1757} జలజాతములు  - జలమున పుట్టునవి (జాతంబులు), పద్మములు :-
[3-220-క.]

1758} జలజాతాక్షుడు  - జలజాత (పద్మములవంటి) అక్షుడు, కృష్ణుడు, విష్ణువు :-
[1-244-మ., 1-259-ఉ., 3-663-క., 3-704-చ., 6-171-క., 8-604-మ., 12-36-మ.]

1759} జలజాప్తుడు  - జలజ (పద్మము) నకు ఆప్తుడు, సూర్యుడు :-
[3-275.1-తే.]

1760} జలజేక్షణుడు  - జలజముల వంటి ఈక్షణములు (కళ్ళు)కలవాడు, విష్ణువు. :-
[10.1-592.1-ఆ., 10.1-592.1-ఆ.]

1761} జలదశ్యాముడు  - జలదము (మేఘము) వలె శ్యాముడు (నల్లగ ఉన్నవాడు), విష్ణువు. :-
[3-633-క.]

1762} జలధరము  - జలమును ధరించునది మేఘము. :-
[2-184-తే., 10.1-112.1-తే.]

1763} జలధి  - జలము (నీటి)కి నిధి (నివాసము) ఐనది, సముద్రము :-
[3-615-క., 3-637.1-తే., 4-29.1-తే., 8-215-క., 8-224.1-తే., 8-706.1-ఆ., 8-719-వ., 9-323-ఆ., 10.1-340-క., 10.1-559-క., 10.1-1321-వ., 10.2-4-వ.]

1764} జలధికన్య  - జలధి (సముద్రము) యొక్క కన్య (పుత్రిక), లక్ష్మీదేవి :-
[6-6-క.]

1765} జలధిపతి  - జలధి (సముద్రము)నకు అధిపతి, వరుణుడు :-
[4-426-క.]

1766} జలధిసుత  - అమృత మథన కాలమందు సముద్రమున పుట్టిన దేవి, లక్ష్మీదేవి :-
[11-72.1-తే.]

1767} జలనిధి  - జలము (నీటి)కి నిధి (నివాసము) ఐనది, సముద్రము :-
[2-164-క., 3-8-క., 3-79-వ., 4-222-క., 5.2-15-క., 10.1-1607-క.]

1768} జలపతి  - నీటికి అధిపతి, వరుణుడు :-
[4-442.1-తే.]

1769} జలప్రాశనము  - నీరు ఆహారముగా తీసుకొనుట, :-
[10.1-1113-వ.]

1770} జలరాశి  - ఎక్కువ జలము రాశిగా ఉన్నది, సముద్రము :-
[3-420-మ.]

1771} జలరుహగర్భుడు  - జలరుహము (పద్మము)న గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[4-492-చ.]

1772} జలరుహజాతాండము  - బ్రహ్మ (జలరుహజాత) అండము, బ్రహాండము :-
[3-206-క.]

1773} జలరుహనాభుడు  - జలరుహ (పద్మము) బొడ్డున కలవాడు, విష్ణువు :-
[3-173.1-తే.]

1774} జలరుహము  - జలమున పుట్టినది, పద్మము :-
[3-158-క.]

1775} జలరుహాక్షుడు  - జలరుహము (పద్మము) వంటి అక్షుడు (కన్నులు గలవాడు), విష్ణువు :-
[6-342-ఆ.]

1776} జలవేలాకీర్ణము  - జలముతో తీరంవరకు ఎడములేక నిండియున్నది, సముద్రము :-
[3-182-మ.]

1777} జలాదివిలక్షణత్రయము  - జలము వాయువు అగ్ని :-
[3-896-వ.]

1778} జలాదులు  - 1పృథ్వి 2జలము 3 అగ్ని 4 వాయువు 5ఆకాశము 6అహంకారము 7మహత్తు అనునవి :-
[3-897.1-తే.]

1779} జలాశయము  - జలమునకు ఆశ్రయము ఐనది, సరస్సు :-
[3-815-తే.]

1780} జలేశుడు  - నీటికి ప్రభువు, వరుణుడు :-
[8-224.1-తే.]

1781} జల్పనము  - ఉపయుక్తముకాని, పెక్కు మాటలాడుట, వదరుట, వాచాలత్వము :-
[8-531-శా.]

1782} జవనికాంతరితుడు  - తెర వెనుక నుండి ఆడించెడి వాడు :-
[10.2-1122-వ.]

1783} జాంబవతీనందనుడు  - జాంబవతి అందు కృష్ణునికి జన్మించిన వాడు, సాంబుడు :-
[10.2-561-వ.]

1784} జాంబూనదము  - మేరుపర్వత సమీపమున ఉన్న నేరేడుపండ్ల రసముచే పాఱిన నది యందు పుట్టినది, బంగారము :-
[10.2-201-వ.]

1785} జాడ  - పోయిన దారి చూపు చిహ్నములు, ఆనవాళ్ళు :-
[10.2-60-మ.]

1786} జాతకర్ణుడు  - ఒక మహర్షి, ఇతఁడు శాకల్యుని శిష్యుఁడు, పుట్టుకచే కర్ణునివంటివాడు, సూర్యవంశంలోని అగ్నివేశుడు అను దేవదత్తుని కుమారుడు. కానీనుడు అనబడి జాతకర్ణుడు అను పేర మహర్షిగా విలసిల్లాడు. :-
[9-42-వ.]

1787} జాతకర్మ  - వ్యు. జ్యాతే కర్మ, షోడశకర్మములలో శిశువు పుట్టినప్పుడు చేయు కర్మము :-
[9-347-వ., 9-623-వ., 10.1-173-వ.]

1788} జాతవేదుడు  - పుట్టిక తోనే వేదములను తెలుసుకున్న వాడు, అగ్నిదేవుడు :-
[8-155-వ.]

1789} జాతులు  - సంగీతము నందలి పారిభాషిక పదము, తాళ భేదములు :-
[2-188.1-తే.]

1790} జామదగ్న్యుడు  - జమదగ్ని పుత్రుడు, పరశురాముడు :-
[9-476-ఆ.]

1791} జాయ  - పెండ్లాము, భార్య, వ్యు. జాయతే అస్యామ్ల జనీ ప్రాదుర్భావే జనీ + యక్, కృ.ప్ర., పతి ఈమె యందు పుత్ర రూపంగా మరలా పుట్టుటచే ఈ వ్యవహారము :-
[10.2-492.1-తే.]

1792} జారుడు  - పరస్త్రీ సంగమము చేయువాడు, వ్యభిచారి :-
[10.1-969-మ.]

1793} జితాత్మకసాధువు  - చిత్తమనెడి ఆత్మను జయించిన సాధు స్వరూపుడు, ఆత్మకము (స్వరూపము అను బంధము) జయించిన సాధుస్వరూపుడు, విష్ణువు :-
[4-704-తే.]

1794} జితారి  - జయింపబడిన శత్రువులు కలవాడు, అర్జునుడు. :-
[1-352-క.]

1795} జితాశ్వుడు  - జిత (జయించిన) అశ్వము కలవాడు, పృథుని కొడుకు :-
[4-519-వ.]

1796} జితేంద్రియులు  - ఇంద్రియములను జయించినవారు :-
[11-36-క.]

1797} జిష్ణుడు  - జయశీలము గలవాడు, కృష్ణుడు. :-
[1-207-క., 8-94-ఆ., 10.1-109-క., 10.1-187-ఉ., 10.1-579-క., 10.1-948-వ.]

1798} జిష్ణువు  - జయశీలము గలవాడు, కృష్ణుడు. :-
[4-702.1-తే., 8-105-మ., 10.1-1182-శా., 10.2-906-క.]

1799} జిహ్మగము  - వంకరగా పోవునది, సర్పము :-
[6-259.1-తే.]

1800} జీవతృప్తుడు  - జీవమనెడు తృప్తము (పురోడాశము, యజ్ఞార్థమైన ఆపూపము) కలవాడు, విష్ణువు :-
[4-702.1-తే.]

1801} జీవన్ముక్తి  - జీవించి యుండగనే కలిగెడు ముక్తి :-
[3-1041-క., 6-347-వ.]

1802} జీవన్మృతుడు  - జీవించియున్నను మరణించినవాడు, జీవచ్చవము :-
[5.1-145.1-తే.]

1803} జీవాత్మ  - జీవులలో నుండెడి జీవి (ఆత్మ) :-
[5.1-155-వ., 10.1-568-వ.]

1804} జీవాత్మస్వరూపకుడు  - సకల జీవులలోన ఉండెడి ఆత్మయే తన రూపైన వాడు, శ్లో. ప్రకృతిం పురుషంచైవ క్షేత్రం క్షేత్రమేవచ, ఇందం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే, ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతితద్విదః, క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వ క్షేత్రేషు భారత (భగవద్గీత), అర్జునా క్షేత్రమనగా ప్రకృతి, ప్రకృతి అనగా దేహము, దానిని తెలియువాడు క్షేత్రజ్ఞుడు, ఆ క్షేత్రజ్ఞుడను నేనని తెలియుము, విష్ణువు :-
[10.1-568-వ.]

1805} జీవితేశుడు  - జీవితమునకు ఈశుడు (ప్రభువు), భగవంతుడు :-
[6-480.1-తే.]

1806} జీవుడు  - జీవము ఉన్నవాడు, మానవుడు :-
[2-266.1-తే.]

1807} జీవులు  - జీవనము (జ పుట్టుక, న మరణములకు మధ్య కాలము) కలవారు, సకల ప్రాణులు. :-
[2-222-వ.]

1808} జుఱ్ఱుట  - ఇష్టముతో కూడిన ఆత్రుత కలిగి పీల్చుకొనుచు తినుట యందలి శబ్దానుకరణము జుఱ్ఱు. అట్టి జుఱ్ఱు అని శబ్దము తో పీల్చుకొనుచు తినుట జుఱ్ఱుట :-
[4-386-క.]

1809} జేగీయమానము  - జయజయ ధ్వానములు కలది, కొనియాడబడునది :-
[10.2-439-వ.]

1810} జేన, జాన  - బాగా సాచిన బొటకనవేలు చిటికినవేలుల చివర్ల మధ్య దూరము, (సుమారు 10 అంగుళము లుండును), అంగుష్ట, బెత్త, జాన, మూర, బార లేదా నిలువు అను కొలమానము లోని జాన, 7 జానలు 1.మనిషి నిలువు/ఎత్తు 2.బార కు సమానము అని శాస్త్ర ప్రమాణము :-
[2-91.1-ఆ., 10.1-557.1-తే.]

1811} జైవాతృకుడు  - దీర్ఘాయువు, చంద్రుడు :-
[9-664-క.]

1812} జోకనార్చు  - జోకను (ఉత్సాహముతో) అర్చు (అరచుట), గర్జించు :-
[6-321-మత్త.]

1813} జ్ఞానక్రియారూపుడు  - తత్త్వజ్ఞానము వేదక్రియలు స్వరూపము యైనవాడు, విష్ణువు :-
[4-705-వ.]

1814} జ్ఞానపురుషుండు  - జ్ఞానమే పురుషరూపము అయినవాడు, విష్ణువు :-
[3-1025-వ.]

1815} జ్ఞానము  - పరావిద్య, ఆధ్యాత్మికమైన విషయములను తెలుపునది :-
[3-845.1-తే.]

1816} జ్ఞానేంద్రియములు - 1చెవులు 2కళ్ళు 3నాలుక 4చర్మము 5ముక్కు :-
[7-237-వ.]

1817} జ్ఞానేంద్రియములు  - 1త్వక్ 2చక్షుస్ 3శోత్ర 4జిహ్వ 5ఘ్రాణములు, పాఠ్యంతరము 1చెవులు 2కళ్ళు 3నాలుక 4చర్మము 5ముక్కు :-
[1-403-వ., 2-112-వ., 6-88-వ.]

1818} జ్ఞానోదయము  - జ్ఞానము కలిగి ఉండుట :-
[5.1-155-వ.]

1819} జ్యోతిశ్చక్రము  - గ్రహనక్షత్రాదులైన జ్యోతిర్మండల భ్రమణము గల చక్రము, అంతరిక్షము :-
[4-379-వ., 5.2-86-వ.]

1820} ఝంఝా  - ఝంఝం అని చప్పుడు చేస్తు వీస్తున్న గాలి, ఝంఝామారుతము :-
[3-462-మ.]

1821} డగ్గుతిక  - దుఃఖాదులచే నోట మాట వెడలుటలోని ఇబ్బంది, గొంతు బొంగురు పోవుట :-
[10.1-1445-క.]

1822} డాకిని  - దాగి ఉండు స్త్రీ పిశాచభేదము :-
[2-274.1-తే., 10.1-1757-వ., 10.2-405-చ.]

1823} డాపలజన్నమరినవేల్పు  - డాపల (ఎడమ ప్రక్కన) చన్ను (స్తనము) అమరిన (చక్కగా నున్న) వేల్పు (దేవుడు), శివుడు :-
[6-177-క.]

1824} డామరము  - కొల్ల మొదలగు దేశోపద్రవము, హావడి, ఉపద్రవము :-
[12-20-వ.]

1825} డిండిమము  - రాయడిగిడిగిడిమను వాద్యవిశేషము :-
[10.2-801.1-తే.]

1826} డొక్కరము  - మూపుమీద మోకాళ్ళు మోపి చేతులతో అణచిపట్టుట, మల్లపోరు పారిభాషిక పదం :-
[10.1-1348-వ.]

1827} డోలాపాదవ్యోమాచారి  - కాలు పైకి ఎత్తి ఊపిఊపి అడుగు లుంచుట, రాసక్రీడా పారిభాషిక పదం :-
[10.1-1084-వ.]

1828} తంగేటిజున్ను  - అందుబాటులో ఉన్న వస్తువు, తంగేడు చెట్టు యందున్న తేనెపట్టు యొక్క జున్ను (తేనె) :-
[6-190-ఆ.]

1829} తండ్రులు  - అయిదుగురు, తన్ను గన్నవాడు, ఉపనయనము జేసినవాడు, చదువు చెప్పిన వాడు, విపత్తున కాపాడినవాడు, అన్నము పెట్టి పోషించినవాడు :-
[1-253-ఉ.]

1830} తంత్రరూపకుడు  - సృష్టిస్థితిలయాధికమైన తంతులు తంత్రము, అట్టి తంత్రము తన రూపమైన వాడు :-
[2-98-క.]

1831} తక్రము  - పాతిక పాలు నీరు చేర్చిన మజ్జిగ, ఆంధ్ర వాచస్పతము :-
[8-464-ఆ.]

1832} తగరు  - తగళ్ళు(బహువచనం), గొఱ్ఱెలు :-
[9-394-మ.]

1833} తటస్థుడు  - కార్యకారణముల ప్రభావము తనపై లేనివాడు, సాక్షి :-
[10.1-1779-వ.]

1834} తత్త్వము  - విచారించు జ్ఞానము, లక్షణము, ఉన్నయదార్థస్థితి, తత్త్వశాస్త్రము, మొత్తం సృష్టి యొక్క యదార్థ స్థితి :-
[2-250.1-ఆ., 2-252-వ.]

1835} తత్త్వములు  - ప్రకృతి మహత్తాదు లిరువదినాల్గు, (అ.) అష్టప్రకృతులు (భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము), వీనిలో చివరి మూడింటికి కారణమైన విక్షేపశక్తి, పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ విషయములు (శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము), పాఠ్యంతరము, (ఆ.) పంచభూతములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు [చూ. పంచ ఇంద్రియములు], పంచప్రాణములు, చతుర్‌ అంతఃకరణములు, పాఠ్యంతరము, (ఇ) అష్టప్రకృతులు, షోడశ వికారములు :-
[1-63-వ., 10.2-1211.1-తే.]

1836} తత్త్వయోగము  - ఆత్మతత్త్వమునకు సంబంధించిన యోగము :-
[5.1-158-ఆ.]

1837} తత్త్వరూపుడు  - పరతత్త్వమే రూపుడు (తన స్వరూపమైనవాడు), కృష్ణుడు :-
[5.2-167-మత్త.]

1838} తత్త్వసంహిత  - ఒక వేదాంత విషయము, తత్త్వమును (స్వస్వరూపమును) గురించిన విషయములను సంహిత (చక్కగ కూర్పబడినది) :-
[3-759-వ.]

1839} తను - తనుతర తనుతమ :-
[7-285-వ.]

1840} తనుమధ్య  - తను (సన్నని) మధ్య (నడుముగలామె), అందగత్తె :-
[6-521-వ., 9-413-మ., 10.1-300-క., 10.1-363-వ., 10.1-839-వ., 10.1-863-క., 10.1-1752-మ.]

1841} తనువివరములు  - తను (శరీరమునందలి) వివరములు (రంద్రములు), నేత్రములు రెండు, శోత్రములు రెండు, నాసారంధ్రములు రెండు, నోరు ఒకటి, మలమూత్ర విసర్జక రంధ్రములు రెండు, మొత్తం ఈ తొమ్మిది దేహము నందలి రంధ్రములు, నవరంధ్రములు :-
[10.1-738-క.]

1842} తనూజ  - తనువు (శరీరము) నుండి జ (పుట్టినది), కుమార్తె :-
[6-224-వ., 9-521-శా.]

1843} తనూజాత  - తనువు (శరీరము) నుండి జ (పుట్టినది), కుమార్తె :-
[4-35.1-తే.]

1844} తనూజుడు  - తనువున పుట్టినవాడు, కొడుకు :-
[4-44-వ., 4-313.1-తే., 7-349-మ., 10.1-712-శా., 10.2-454.1-తే.]

1845} తనూభవ  - తనువు (దేహము)న భవ పుట్టినది, పుత్రిక :-
[4-73-క., 4-92-మ., 4-95-చ.]

1846} తనూభవుడు  - శరీరమున పుట్టినవాడు, పుత్రుడు :-
[5.1-61-చ., 9-633-వ., 10.2-12-మత్త., 10.2-527.1-తే., 11-35-వ.]

1847} తనూసంభవుడు  - శరీరమున పుట్టినవాడు, పుత్రుడు :-
[10.1-1416-శా.]

1848} తన్మాత్రలు  - దాని లక్షణము లేదా తత్త్వము, శబ్ద స్పర్శ రస, రూప గంధములు :-
[1-62.1-తే., 3-202-వ.]

1849} తన్వంగి  - తనువు (సన్నని) అంగి (దేహము కలది), స్త్రీ, (తన్వి తనివి, తృప్తి). :-
[10.1-75.1-తే., 10.2-175-శా.]

1850} తన్వి  - తనువు (సన్నని దేహము కలది), స్త్రీ, (తన్వి తనివి, తృప్తి గల స్త్రీ). :-
[5.1-32-క., 6-501-క., 10.2-181.1-ఆ.]

1851} తపనీయాద్రి  - తపనీయము (బంగారు) అద్రి (పర్వతము), మేరుపర్వతము :-
[5.2-39-క.]

1852} తపనుడు  - తపింపజేయు వాడు, సూర్యుడు :-
[5.1-18-వ., 10.2-115-ఉ.]

1853} తపసిరాచూలు  - ఋషి యొక్క రాకుమారి, శకుంతల :-
[9-623-వ.]

1854} తపస్సు  - స్వధర్మమును నడపుట, కాయిక వాచిక మానసికము లనెడి త్రివిధనిష్ఠ :-
[2-62-చ., 2-64-మ., 10.1-1474-ఆ., 10.2-1198-వ., 10.2-1266-క.]

1855} తప్తకాంచనరుచిరశరీరి  - తప్తకాంచనము (పుటము వేసిన బంగారము) వంటి రుచిర (రంగుకలిగిన) శరీరి (దేహము కలవాడు), బ్రహ్మదేవు :-
[4-16-చ.]

1856} తప్తోర్మి  - తెర్లుతూ కాగుతున్న నూనెలలో కాగించుట, నరక విశేషము :-
[5.2-136-వ.]

1857} తమము  - తమోగుణము వలె చూడగలిగినను తగువర్తన తెలియని పరిస్థితి, చీకటి, తమోగుణావరణ :-
[3-721.1-తే., 4-460.1-తే.]

1858} తమస్వినీచరుడు  - తమస్ (చీకటి, రాత్రి) వేళ చరుడు (తిరుగువాడు), రాక్షసుడు :-
[7-308-చ.]

1859} తమ్మికంటి  - తమ్మి (పద్మ) కంటి (అక్షుడు), విష్ణువు :-
[10.1-479-వ.]

1860} తమ్మిచూలి  - తమ్మి (పద్మమున) చూలి (పుట్టినవాడు), బ్రహ్మ :-
[7-384-వ.]

1861} తమ్మిచూలిరేయి  - తమ్మిచూలి (బ్రహ్మదేవుని)కి రేయి (రాత్రి), ప్రళయపురాత్రి :-
[8-707-వ.]

1862} తమ్ములయిల్లు  - తమ్మి (పద్మము)లకు ఇల్లు (నివాసము), సరస్సు :-
[10.1-492-వ.]

1863} తరంగిణి  - నీటి అలలుగలది, నది :-
[8-695-వ.]

1864} తరణి  - 1) చీకటిని తరింప (దాట)జేయువాడు, సూర్యుడు, 2) నీటిని దాటించెడి వాహనము, ఓడ, పడవ. :-
[9-431.1-తే., 10.1-340-క., 10.1-757-వ., 10.1-1321-వ.]

1865} తరలాక్షి, తరళాక్షి  - తరల (చలించెడి) అక్షి (కన్నులుగలామె), స్త్రీ :-
[3-966.1-తే., 9-514.1-ఆ., 10.1-59.1-ఆ., 10.2-370.1-తే., 10.2-498-మ., 10.2-1071.1-తే.]

1866} తరళనేత్ర  - తరళ (చలించెడి) నేత్రి (కన్నులుగలామె), స్త్రీ :-
[6-506.1-ఆ.]

1867} తరళము - తరళతరము తరళతమము :-
[3-808.1-తే., 7-285-వ.]

1868} తరళేక్షణ  - తరళ (చలించెడి) అక్షి (కన్నులుగలామె), స్త్రీ :-
[4-751.1-తే., 9-425-ఆ.]

1869} తరి  - (నీటిని) దాటించునది, ఓడ :-
[10.1-1361-క.]

1870} తరుచరము  - తరువుల (చెట్లపై) చరించునది, కోతి :-
[10.2-553-క.]

1871} తరుచరసైన్యపాలనుడు  - తరుచర (వానర) సైన్య (సేనలను) పాలనుడు (పరిపాలించువాడు), రాముడు :-
[7-482-చ.]

1872} తరుణారుణాంభోజనేత్రుఁడు  - లేత ఎఱ్ఱకలువల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు :-
[3-673-తే.]

1873} తరుణి  - తరుణ వయసున కలామె, యువతి :-
[3-461-మ., 3-465-క., 3-781-మ., 3-818-క., 3-835-మ., 3-932-క., 3-977-క., 3-1010-క., 4-73-క., 4-81-చ., 4-751.1-తే., 4-755-చ., 4-816-క., 5.1-31-క., 7-417-క., 10.1-326-ఆ., 10.1-786-క., 10.1-969-మ., 10.1-1280.1-ఆ., 10.2-142-ఉ., 10.2-1171-ఉ.]

1874} తరుణుడు  - తరుణ వయసున కలవాడు,యువకుడు :-
[10.1-833-క.]

1875} తర్కము  - శాస్త్రములు (నియమన గ్రంథములు) ఆరింటిలోనిది, 1తర్కము 2వ్యాకరణము 3ధర్మము 4మీమాంస 5వైద్యము 6జ్యోతిషము. కార్యకారణ సంభందములను పరీక్షించు నియమానుసరణి శాస్త్రం తర్కము :-
[8-629.1-తే.]

1876} తర్జనము  - తర్జని (చూపుడువేలు) చూపి బెదిరించుట :-
[4-713-చ., 5.2-138-వ., 6-383-వ.]

1877} తర్ణకము  - అప్పుడే పుట్టిన దూడ :-
[10.1-1199-వ.]

1878} తలకొని  - తల (ముందు) భాగమును తీసుకొని, నాయకత్వము వహించి :-
[3-309.1-తే.]

1879} తలవాకిలి  - తల (ముఖము)నకు వాకిలి (ముందుగుమ్మము), నోరు :-
[10.1-537-వ.]

1880} తలోదరి  - తలమైన (పల్చని) ఉదరి (ఉదరము కలామె), సుందరి :-
[3-729-చ., 3-787-తే., 4-846-క., 10.1-23-క., 10.1-310-మత్త., 10.2-330-చ., 10.2-1064-చ., 10.2-1165.1-తే.]

1881} తవిలిసంసారహారిమేధస్కుడవు  - తవిలి (తగులుకొన్న) సంసార (భవబంధములను) హారి (హరించునట్టి) మేధస్కుడవు (బుద్ధిబలము గలవాడవు), విష్ణువు :-
[4-918.1-తే.]

1882} తవుడు  - ధాన్యము దంచినప్పుడు వచ్చెడి మెత్తటిపొడి, రాలే ధాన్యము పైపొట్టు, చిట్టు. :-
[5.1-129-వ.]

1883} తాండవధురీణుడు  - తాండవము అను నృత్యమున మిక్కిలి నేర్పరి, శివుడు :-
[10.2-312-క.]

1884} తాండవము,లాస్యము  - 1. తాండవము ఉద్ధృతమైన నృత్యము, శివుడు (పురుషుడు) చేయు నాట్యము, 2. లాస్యము మృదుమధురమైన నృత్యము, లాస్యము పార్వతీదేవి (స్త్రీ) చేయు నాట్యము :-
[10.1-777-మ.]

1885} తాంబూలచర్వితము  - తాంబూలము (కిళ్ళీ) చర్వితము (నమలబడి మెత్తగా ఐనది), తమ్మ :-
[10.1-1062.1-ఆ.]

1886} తాంబూలము  - తమలపాకులు యందు వక్కలు సున్నము ఇష్టానుసారముగ ఇతర సుగంధద్రవ్యాదులు కలిపి ఆరగించునది. :-
[4-635.1-తే., 10.1-1283-వ., 10.1-1745-వ.]

1887} తాత్పర్యము  - దాని యందే లగ్నమగుట, ఏకాగ్రత :-
[7-350-మ.]

1888} తానము  - సంగీతమున స్వరముల ప్రస్తార విశేషము, సంగీత పారిభాషిక పదము :-
[9-350-వ.]

1889} తాపత్రయము  - 1ఆధ్యాత్మిక 2ఆధిదైవిక 3ఆధిభౌతిక రూపములైన తాపములు (బాధలు, ఇక్కట్లు) :-
[1-36.1-తే., 1-110-వ., 2-61-ఉ., 3-203-దం., 3-797-వ., 3-874-వ., 3-938-క., 3-997-వ., 4-241-వ., 7-171.1-తే., 7-356-వ., 10.1-958-ఉ., 10.1-1664-వ., 10.1-1704.1-తే., 10.2-431.1-తే., 10.2-1209-చ.]

1890} తాపము  - తపింప జేయునది, బాధ, ఇక్కట్టు :-
[2-61-ఉ.]

1891} తాపసపుంగవుడు  - తాపసులలో శ్రేష్ఠుడు, మైత్రేయుడు :-
[3-148-మ.]

1892} తాపసమందారుడు  - తపస్సు చేయువారికి కల్పవృక్షము వంటివాడు, విష్ణువు :-
[10.1-1272-క.]

1893} తాపసమానసకేళి  - తాపసుల మానస (మనసు లందు) కేళి (విహరించెడి యామె), పార్వతి :-
[6-7-క.]

1894} తాపసస్తుతిపారణుడు  - తాపసుల యొక్క స్తుతులకు పారణుడు (పాత్రమైనవాడు), విష్ణువు. :-
[6-529-త.]

1895} తాపసస్తోత్రసీముడు  - ఋషుల స్తోత్రములుకు మేర (లక్ష్యము) ఐనవాడు, శ్రీరాముడు :-
[10.2-1342-మాలి.]

1896} తాపసాభీష్టకరుడు  - తాపసుల అభీష్టము (కోరికలు) కరుడు (తీర్చువాడు), శివుడు :-
[4-138.1-తే.]

1897} తామరకంటి  - పద్మములవంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు :-
[3-146-మత్త.]

1898} తామరచూలి  - పద్మసంభవుడు, బ్రహ్మదేవుడు :-
[10.2-278-తే.]

1899} తామరసగర్భుడు  - పద్మము నందు పుట్టినవాడు, బ్రహ్మదేవుడు :-
[7-171.1-తే.]

1900} తామరసభవుడు  - పద్మములో పుట్టిన వాడు, బ్రహ్మదేవుడు. :-
[3-325-క.]

1901} తామరసవిలోచనుడు  - తామర (పద్మముల) స(వంటి) వి(విశిష్ట) లోచనుండు (కన్నులు కలవాడు), విష్ణువు :-
[3-212-చ.]

1902} తామరసాక్షుడు  - తామరల వంటి కనులు కలవాడు, కృష్ణుడు :-
[1-445.1-తే., 10.2-81-ఉ.]

1903} తామరసాభలోచనుడు  - తామరల వంటి కనులు కలవాడు, కృష్ణుడు :-
[10.2-1180-ఉ.]

1904} తామరసాసనుడు  - పద్మము ఆసనముగా కలవాడు, బ్రహ్మదేవుడు :-
[3-103-చ., 10.2-631-క.]

1905} తామసుడు  - నాలుగవ మనువు :-
[8-138-క.]

1906} తామిశ్రము, తామిస్రమము  - చీకటి ఏమియును తెలియని జంతుప్రాయము, చీకటిలోకము, నరక విశేషము :-
[3-721.1-తే., 5.2-136-వ., 5.2-138-వ.]

1907} తారక  - నక్షత్రము, నక్షత్రాదులందు ఉండు విడివిడి గోళము, ఆకాశమందలి జ్యోతిర్మయగోళము :-
[3-346-వ.]

1908} తారకాధిపవదనలు  - తారకాధిప (చంద్రుని వంటి) వదనలు (మోము కలవారు), స్త్రీలు :-
[10.2-223.1-తే.]

1909} తారమల్లికాపాండురవర్ణుడు  - తార (తారక లేదా వెండి) వంటి మల్లికా (మల్లెపూల) వంటి పాండుర (తెల్లని) వర్ణుడు (రంగు దేహము గలవాడు), శివుడు :-
[6-2-ఉ.]

1910} తారాధిపనిభవదనలు  - తారాధిపుడు (చంద్రుని) నిభ (వంటి) వదనము కలామె, స్త్రీ :-
[10.1-1090-క.]

1911} తారాధిపవంశుడు  - తారాధిప (చంద్ర) వంశమువాడు, కృష్ణుడు :-
[10.1-1090-క.]

1912} తారాధిపుడు  - తారకలకు అధిపుడు (ప్రభువు), చంద్రుడు :-
[5.1-7.1-తే., 10.1-1299-క.]

1913} తారాధ్వముబద్దము  - తారలకు అధ్వము (త్రోవ), ఆకాశము; బద్దము హద్దు పరిమితికలది, ఐనన్ ఐనా సరే,; అపరిమితమైన ఆకాశం పరిమితమైనది అగుట అంటే కుంచించుకుపోవుట జరిగినప్పటికి, గమనిక బద్దలైనన్ అన లేదు బద్దమైనన్ అన్నారు కనుక ముక్కలవ్వడం కాడు కుంచించుకుపోవడమే సరి} :-
[8-595-క.]

1914} తారేశుడు  - తారలకు ఈశుడు (భర్త), చంద్రుడు :-
[10.1-481-శా.]

1915} తార్క్షనందనుడు  - తార్క్షు ని (కశ్యపుని) కొడుకు, గరుడుడు :-
[8-638-వ.]

1916} తాలాంకుడు  - తాడిచెట్టు జండాపై కలవాడు, బలరాముడ :-
[10.2-291-క., 10.2-483.1-తే., 10.2-574.1-తే.]

1917} తిక్కన  - మహాభారతం ఆంధ్రీకరించిన కవిత్రయంలో రెండవవాడు :-
[6-11.1-తే.]

1918} తితిక్ష  - ఓర్పు, క్షమ, శీతోష్ణాది ద్వంద్వ సహనము, వ్యు. తిజ క్షమయామ్+ (స్వార్థే) సన్ + అచ్ టాప్, కృప్ర., :-
[4-28-వ.]

1919} తిథులు  - చంద్రుని 15 కళల పారిభాషిక పదములు 1పాడ్యమి 2విదియ 3తదియ 4చవితి 5పంచమి 6షష్ఠి 7సప్తమి 8అష్టమి 9నవమి 10దశమి 11ఏకాదశి 12ద్వాదశి 13త్రయోదశి 14చతుర్దశి 15పున్నమి లేక అమావాస్య :-
[5.2-86-వ., 11-105-వ.]

1920} తిమి  - నూరు యోజనముల పొడవుగల చేప, పెద్దచేప :-
[6-326-వ.]

1921} తిమింగలము  - తిమిని మింగెడు చేప :-
[6-326-వ.]

1922} తియ్యవిలుకాడు  - తియ్యని (చెరకుగడ) విల్లుగా కలవాడు, మన్మథుడు :-
[10.1-1059-క.]

1923} తిర్యక్కులు  - జంతువులు, పక్షులు, నం,విణ, అడ్డముగా పోవునవి, :-
[1-61-వ., 1-192-వ., 2-274.1-తే., 3-338-క., 3-344-వ., 3-353-క., 3-715-వ., 3-905-క., 5.2-75-వ.]

1924} తిలకిని  - తిలకము ధరించుస్త్రీ, నుదుటి తిలకము వలె శ్రేష్ఠమైన స్త్రీ :-
[10.1-1732.1-ఆ.]

1925} తిలకుడు  - నుదుటి తిలకము వలె శ్రేష్ఠమైన వాడు. :-
[3-235-క., 3-391-క.]

1926} తిలోదకములిచ్చుట  - బంధు మరణాంతర కర్మ :-
[1-176-వ.]

1927} తీర్థపదాంబుజాతుడు  - తీర్థ (పుణ్య గంగానదికి నిలయమైన) పద (పాదములు అనెడి) అంబుజాతుడు (పద్మములు కలవాడు), కృష్ణుడు :-
[5.2-165-చ.]

1928} తీర్థపాదుడు, తీర్థపాదుడు  - పుణ్యతీర్థము (గంగ) పాదమున కలవాడు, విష్ణువు, తీర్థములవలె పవిత్రమైన పాదములు కలవాడు :-
[2-89-వ., 3-824-వ., 4-382.1-తే., 4-610-చ., 8-483.1-తే.]

1929} తీవబోడి  - పూలతీగ వంటి దేహము కలామె, అందగత్తె :-
[3-786.1-తే.]

1930} తుంగము  - పొడవైనది, తురంగ అని పాఠాంతరము ఉంది, తురంగము, త్వరితముగలది :-
[9-230-వ.]

1931} తుచ్ఛము - తుచ్ఛతరము తుచ్ఛతమము :-
[10.1-1772-క.]

1932} తుదకుతుది  - అంతమునకు అంతమైనవాడు, అనంతుడు :-
[6-338-క.]

1933} తుదిలేక  - ఆది (సృష్టి) స్థితి అంతము(లయము)లు లేకుండ, అనంతమై :-
[10.1-567.1-ఆ.]

1934} తురంగము  - త్వర యైన గమనము కలది, గుఱ్ఱము :-
[10.1-1558-వ.]

1935} తురగదానవుడు  - గుఱ్ఱము రూపున గల రాక్షసుడు, కేశి. :-
[10.1-1172-ఆ.]

1936} తురగము  - త్వరగా పోవునది, గుఱ్ఱము :-
[10.1-1532-వ.]

1937} తుర్యము  - తురీయము, నాలుగవది, 1. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధములను చతుర్విధ తత్త్వములలోనూ నాలుగవదైన అనిరుద్ధుడు, 2. జాగ్రత్ సుషుప్తి నిద్ర లనెడి అవస్థాత్రయము తరువాతి అవస్థ తృతీయము, దీనిపైన ఉన్మని (యోగుల అవస్థా విశేషము) :-
[3-57-వ.]

1938} తులసీదళదాముడు  - తలసీ దళముల దామము (దండను) ధరించువాడు, విష్ణువు :-
[3-490-ఉ., 4-264-ఉ.]

1939} తుష్టి  - సంతృప్తి, ఏదైనా ఇక చాలు అనే మానసిక స్థితి :-
[4-28-వ.]

1940} తుహినకిరణుడు  - తుహిన (మంచువలె చల్లని) కిరణములు కలవాడు, చంద్రుడు :-
[10.1-800-క.]

1941} తుహినధాముడు  - తుహిన (మంచువంటి చల్లదనమునకు) ధాముడు (నివాసమైనవాడు), చంద్రుడు :-
[9-265-క.]

1942} తుహినమయూఖశేఖరుడు  - చల్లని కిరణములు కలవాడు (చంద్రుడు) శిఖ యందు కలవాడు, శివుడు :-
[10.2-1271-చ.]

1943} తూర్పుముట్టియున్ననుత్తరభాగము  - ఈశాన్యము :-
[9-206-వ.]

1944} తూర్యత్రయము  - 1నాట్యము 2గీతము 3వాద్యములు అనెడి మూడు, 1తంత్రీ (తతవాయిద్యములు) 2చర్మ (అవనద్ద వాయిద్యములు) 3ఊదెడి (సుషిర వాద్యములు) అను మూడు రకముల వాద్యములు :-
[10.1-1310.1-ఆ.]

1945} తృణప్రాయము  - తృణము (గడ్డిపరక)తో ప్రాయము (సమానము), అతితేలికైనది :-
[6-282-వ.]

1946} తృణములు  - విత్తనమునాటక పండెడి గడ్డి చేమ మున్నగునవి :-
[8-175.1-ఆ.]

1947} తృణీకరించు  - తృణముగా నెంచు, లెక్కచేయకుండు :-
[10.2-1102-చ.]

1948} తెగజూచు  - తెగునట్లు (చనిపోవునట్లు) చూచు, చంపు :-
[10.1-1572-క.]

1949} తెనుగుగుణమగు  - తెలుగు(దేశీయ) పదాల ప్రయోగం ఎక్కువ వుంటే నచ్చుతుంది :-
[1-20-క.]

1950} తెఱవా  - తెఱ (దాపరికము లేని) వా (వాక్కు కలామె), తెఱవు (స్వచ్ఛమైన, చక్కని) వా (వాక్కుగల ఆమె), తెఱకువ (వివేచన కల) వా (వాక్కుగల ఆమె), స్త్రీ :-
[8-463-మ., 10.2-1023-తే.]

1951} తెలవాఱెడివేళ  - తెలవారుఝాము తెల్లగా వారు (అవ్వు) సమయము, సూర్యదయానికి ముందు సమయం :-
[10.2-1002-క.]

1952} తెలికపిండి  - నువ్వులు మొదలగువాని నుండి నూనె తీసినప్పుడు వచ్చెడి అచ్చులు లేదా పొడి :-
[5.1-129-వ.]

1953} తెలియరానివాడు  - శ్రు. నతత్ర చక్షుఃగచ్ఛతి నవాగ్గచ్ఛతి నోమనః, నీవు ఇట్టివాడవు అని చూపులచేత మాటలచేత ఊహలచేత తెలియ శక్యము కాదు, ఆత్మ, భగవంతుడు :-
[10.1-577-క.]

1954} తేజోబలాఢ్యుడు  - తేజము బలము మిక్కిలిగా కలవాడు, విష్ణువు :-
[4-702.1-తే.]

1955} తేజోభిన్నంబులు  - 1.భూర్భువస్సువర్లోకములు అనెడి ద్రవ్య శక్తి ప్రజ్ఞా మయలోకములు, 2.వసు రుద్ర ఆదిత్య లోకములు, 3.దేహము ప్రాణము మనస్సు :-
[4-849-వ.]

1956} తొగలసంగడికాడు  - తొగ (కలువ)ల సంగటికాడు (స్నేహితుడు), చంద్రుడు :-
[10.1-297.1-ఆ.]

1957} తొయ్యలి  - తోయలి, తాయ్య (సంతానపాలనయోః) కాశ ధా, తాయీ (కనునది, పెంచునది), స్త్రీ :-
[10.1-1495-ఉ.]

1958} తొలిబిడ్డడు  - మొదట (సృష్టికే మొదట) పుట్టినవాడు, బ్రహ్మ :-
[2-240-చ.]

1959} తోయజదళాక్షుడు  - పద్మదళముల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు :-
[10.1-951-మ.]

1960} తోయజనయన  - పద్మములవంటి కన్నులు కలామె, స్త్రీ :-
[10.1-816-క.]

1961} తోయజనాభుడు  - తోయజము (పద్మము) నాభి (బొడ్డు)న కలవాడు, విష్ణువు :-
[3-245-క., 3-551-చ., 3-650-క., 10.1-1562-వ.]

1962} తోయజనేత్ర  - తోయజము (పద్మము) వంటి నేత్రములు కలామె, స్త్రీ. :-
[4-793-క.]

1963} తోయజనేత్రుడు  - (తోయజ) పద్మముల వంటి నేత్రములు కల వాడు కృష్ణుడు. :-
[1-252-క.]

1964} తోయజము  - తోయము (జలము) లందు జము (పుట్టినది), పద్మము :-
[3-309.1-తే.]

1965} తోయజసంభవుడు  - తోయజము (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు :-
[3-275.1-తే., 3-387-క.]

1966} తోయజహితుడు  - తోయముజ (పద్మము)లకు హితుడు (ఇష్టుడు) సూర్యుడు :-
[2-155.1-తే.]

1967} తోయజాక్షుడు  - తోయజ (పద్మముల వంటి) అక్షుడు (కన్నులుగలవాడు), విష్ణువు :-
[8-14.1-ఆ.]

1968} తోయజేక్షణుడు  - తోయజము (తెల్లతామరల)లవంటి కన్నులు కలవాడు, విష్ణువు :-
[10.1-128-మత్త.]

1969} తోయధి  - తోయము (నీటి)కి నివాసము, సముద్రము :-
[3-158-క.]

1970} తోయరాశి  - తోయము (నీరు) రాశిగా కలది, కడలి :-
[10.1-640-శా.]

1971} తోయరుహాప్తుడు  - తోయరుహ (పద్మము)లకు ఆప్తుడు, సూర్యుడు :-
[3-44-ఉ.]

1972} తోయరుహాయతాక్షుడు  - తోయరుహము (నీట పుట్టినదైన పద్మమువలె) ఆయత (విశాలమైన) అక్షుడు (కన్నులు కలవాడు), కృష్ణుడు :-
[10.2-410-ఉ.]

1973} తోయరుహోదరుడు  - తోయరుహము (పద్మము) ఉదరుడు (గర్భమున గలవాడ), విష్ణువు :-
[4-920-ఉ.]

1974} తోరణము  - వరుసగా కట్టిన ఆకులు పూలు వంటివి కట్టిన పొడుగైన తాడు :-
[10.1-1310.1-ఆ., 10.1-1783-వ.]

1975} తోషుడు  - తుష్టి కలవాడు, యజ్ఞునకు భార్య దక్షిణ యందు కలిగిన యామ అను పన్నెడుగురు దేవతలలో పెద్దవాడు. :-
[4-6-వ.]

1976} త్రయాధీశ్వరుడు  - త్రయ (వేదత్రయము)లకు అధిపతి, విష్ణువు :-
[3-99.1-తే.]

1977} త్రయీమయదివ్యశరీరుడు  - త్రయి (వేద) మయమైన దివ్య దేహము కలవాడు, వరాహమూర్తి, విష్ణువు :-
[3-436-ఉ.]

1978} త్రయోదశరాగద్వేషములు  - 1రాగము 2ద్వేషము 3కామము 4క్రోధము 5లోభము 6మోహము 7మదము 8మాత్సర్యము 9ఈర్ష్య 10అసూయ 11దంభము 12దర్పము 13అహంకారము. :-
[1-192-వ.]

1979} త్రికరణములు  - మనోవాక్కాయములు మూడు :-
[6-43-క., 11-54-వ.]

1980} త్రికాలములు  - 1భూత 2భవిష్య 3వర్తమాన కాలములు :-
[6-9-చ., 10.1-89.1-ఆ.]

1981} త్రికూటము  - మూడు శిఖరములు గల పర్వతము :-
[5.2-30-వ.]

1982} త్రిగుణములు  - 1శాంతవృత్తిగల సత్వగుణము 2ఘోరవృత్తిగల రజోగుణము 3మూఢవృత్తిగల తమోగుణము అనెడి; మూడుగుణములు :-
[1-61-వ., 1-236-వ., 3-184-వ., 3-203-దం., 3-246.1-తే., 3-252-క., 3-972-వ., 3-1025-వ., 4-64-వ., 4-889-వ., 5.2-126.1-తే., 6-85.1-తే., 6-88-వ., 7-217-వ., 7-217-వ., 7-360-వ., 8-85.1-తే., 10.1-91.1-తే., 10.1-405.1-తే., 10.1-684-క., 10.1-1180.1-ఆ., 10.1-1182-శా., 10.1-1450.1-ఆ., 10.1-1472.1-తే., 10.1-1495-ఉ., 10.2-441-వ., 10.2-1204.1-తే.]

1983} త్రిగుణాత్మకము  - త్రిగుణములు కలది, సత్వగుణముచేత ఇంద్రియాధిదేవతలను రజోగుణముచేత ఇంద్రియములను తమోగుణముచేత పంచమహాభూతములను కలిగినది :-
[10.1-118-క.]

1984} త్రిగుణాత్మకహంకృతులు  - రాజసాహంకృతి తామసాహంకృతి సాత్వికాహంకృతి :-
[10.1-682.1-తే.]

1985} త్రిగుణాత్మకుడు  - రజోగుణముచే సృష్టి సత్వగుణముచే స్థితి తమోగుణముచే లయము చేయువాడు, భగవంతుడు, విష్ణువు :-
[10.2-791-క.]

1986} త్రిజగత్కల్యాణుడు  - త్రిజగత్ (ముల్లోకములకు) కల్యాణ (శుభము చేకూర్చువాడ), శ్రీకృష్ణ :-
[5.1-181-మ.]

1987} త్రిజగత్తు, లోకత్రయము  - భూః భువః సువః లోకములు, ముల్లోకములు :-
[10.1-1506-మ.]

1988} త్రిజగత్తులు  - భూ ఊర్థ్వ అథో లోకములు ఇంకోవిధముగ భూ భువర్ సువర్ లోకములు :-
[3-327-క.]

1989} త్రిజగత్పావనుడు  - ముల్లోకములను పవిత్రము చేయకలవాడు, పరమ శివుడు :-
[3-465-క.]

1990} త్రిజగత్సంపత్కరుడు  - ముల్లోకములకు సంపదలను కలుగజేయువాడు, విష్ణువు :-
[10.2-1014-క.]

1991} త్రిజగములు  - 1స్వర్గ భూ(మానవ) పాతాళలోకములు, 2.భూ భూవః సువః లోకములు :-
[6-467-వ.]

1992} త్రిదండి  - మనోదండము (శిక్షించుట) వాగ్దండము కర్మదండము అను మూడు దండములు కల సన్యాసి :-
[10.2-1166-వ.]

1993} త్రిదశరిపులు  - రాక్షసులు (దేవతల శత్రువులు) :-
[6-257.1-తే.]

1994} త్రిదశారి  - త్రిదశులు (దేవతలు) కు అరి (శత్రువు), రాక్షసుడు :-
[3-681-క.]

1995} త్రిదశుడు  - వ్యు. త్రిస్యః దశాః అస్య,, బ.వ్రీ., త్రిదశపరిమాణ వయస్కుడు, బాల్య కౌమార యౌవన వార్ధకములనెడి నాల్గు వయోదశలలో మూఁడవ దశలోనే ఉండువాడు. ఎప్పుడును 30 ఏండ్లవయసువారివలె (యౌవనమున) ఉండువాడు, వేల్పు, దేవత :-
[4-394.1-తే., 8-685-ఆ.]

1996} త్రిదశేంద్రుడు  - త్రిదశు (దేవత)ల ఇంద్రుడు, దేవేంద్రుడు :-
[10.1-132-క.]

1997} త్రిదివము  - ముల్లోకములు భూఃభువస్సువః లో మూడవది, స్వర్గము :-
[4-321-తే., 8-558-వ., 8-681-వ.]

1998} త్రినయనుడు  - శివస్వరూపుడు, విష్ణువు :-
[6-343-వ.]

1999} త్రినాభుడు  - మూడు (లోకములు) నాభి యందు కలవాడు, విష్ణువు :-
[8-503.1-తే.]

2000} త్రిపాద  - మూడుకాళ్ళు కలవి :-
[11-91-వ.]

2001} త్రిపురఘస్మరుడు  - త్రిపురములను భస్మము చేసినవాడు, శివుడు :-
[4-471-క.]

2002} త్రిపురశాసనుడు  - త్రిపురములను కూల్చినవాడు, శంకరుడు :-
[4-14-చ.]

2003} త్రిపురసంహరుడు  - త్రిపురములను నాశనము చేసినవాడు, శివుడు :-
[6-178.1-తే., 10.2-319-తే.]

2004} త్రిపురసంహారకరుడు  - త్రిపురములను నాశనము చేసినవాడు, శివుడు :-
[4-131.1-తే.]

2005} త్రిపురసంహారకుడు  - త్రిపురములను నాశనము చేసినవాడు, శివుడు :-
[3-467.1-తే., 4-117-తే.]

2006} త్రిపురుషాధీశ్వరుడు  - త్రిపురుష (1క్షరపురుషుడైన వ్యక్తి 2అక్షర పురుషుడైన జీవుడు 3అంతర్యామియైన పురుషోత్తముడు) తానే అయిన ప్రభువు :-
[4-915-క.]

2007} త్రిపృష్ట  - త్రి (మూడు అడుగులు) పృష్ట (అడుగబడినవి కలవాడ), వామనుడు, విష్ణువు :-
[8-503.1-తే.]

2008} త్రిభంగి  - మువ్వంకల భంగిమ, మూడు వంకరలు (1కుడికాలు మీద ఎడమకాలు వంకరగా బొటకనవేలు నేలను తాకునట్లు పెట్టుటచేనగు భంగిమ 2తల ఎడమపక్కకు వాల్చుటచేనగు భంగిమ 3కుడి చేతిని వంచి వేణువు రంధ్రము లందు వేళ్ళూనుట యందలి భంగిమ అనెడ మూడు భంగిమలు) కలుగునట్లు వేణుమాధవుడు నిలబడెడి భంగిమ :-
[3-118.1-తే., 10.1-1084-వ.]

2009} త్రిభంగితానకము  - త్రిభంగిమలు (తల చేయి కాలుల యందు మూడు రకాల భంగిమలు)తో నటనము చేయుట, రాసక్రీడలోని పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

2010} త్రిభువనజయరూఢుడు  - త్రిభువన (ముల్లోకములను) జయ (జయించుట) రూఢుడు (నిశ్చయముగా గలవాడు), విష్ణువు :-
[8-503.1-తే.]

2011} త్రిభువనాత్మభవుడు  - త్రిభువన (ముల్లోకములును) ఆత్మన్ (తానే అయ్యి) భవుడు (దివ్యమైనవాడు), విష్ణువు :-
[6-343-వ.]

2012} త్రిమస్తకుడు  - త్రి (మూడు) మస్తక (శిరములు గలవాడు) :-
[7-29-వ.]

2013} త్రిమూర్తులు  - 1బ్రహ్మ 2విష్ణు 3మహేశ్వరుడు :-
[6-333.1-ఆ., 7-88-వ., 7-274-మ., 8-154.1-తే., 8-227-ఆ., 10.1-294-క., 10.1-1306.1-తే., 10.2-1279.1-తే., 11-113-వ.]

2014} త్రిలింగములు  - (అ) 1.స్థూలశరీరము, 2.సూక్ష్మశరీరము, 3.కారణశరీరము అను మూడు, (ఆ) త్రిగుణములు పంచభూతములు ఇంద్రియాదులు, (ఇ) 1స్త్రీలింగము 2పుల్లింగము 3నపుంసకలింగము :-
[2-84-వ., 7-274-మ.]

2015} త్రిలోకపతి  - ముల్లోకములకు భగవంతుడు, విష్ణువు :-
[6-32-క.]

2016} త్రిలోకమనోహరానుభావుడు  - తిలోక (ముల్లోకములకు) మనోహరమైన అనుభవముల యిచ్చువాడు, విష్ణువు :-
[6-343-వ.]

2017} త్రిలోకములు  - ముల్లోకములు, 1 భూ 2 భువర్ 3 సువర్ లోకములు అధిదేవతలు ఇంద్రియములు విషయములు అనెడి రూపములైన, 1స్వర్గ 2మర్త్య 3పాతాళ లోకములు :-
[3-347-క., 7-6-క., 10.1-1241-క., 10.2-260-ఆ.]

2018} త్రిలోకశరణ్యుడు  - ముల్లోకములకు రక్షకుడు, విష్ణువు :-
[10.2-752-చ.]

2019} త్రిలోకారాధితుడు  - ముల్లోకములచేత ఆరాధింపబడు వాడు, విష్ణువు :-
[10.2-128-క.]

2020} త్రిలోచనుడు  - త్రి (మూడు) లోచనుడు (కన్నులుగలవాడు) :-
[4-695-మ., 7-29-వ.]

2021} త్రివక్ర  - మువ్వంకలామె, వంకరమెడ, దొడ్డికాళ్ళు, గూనినడుము అను మూడు వంకరలను త్రివక్రములు అంటారు. అలా మూడు వంకరలు కల స్త్రీ. :-
[10.1-1278-ఉ.]

2022} త్రివర్గము  - ధర్మము అర్థము కామము అనెడి మూడు (3) వర్గములు :-
[4-368-వ., 4-625.1-తే.]

2023} త్రివిక్రమదేవుడు  - త్రివిక్రమావతారము ధరించిన దేవుడు, వామనుడు :-
[6-302-క.]

2024} త్రివిక్రమము  - మూడడుగులతో ముల్లోకములను కొలువగల పరాక్రమము (సామర్థ్యము) :-
[2-200-చ., 5.2-31-క., 5.2-112.1-ఆ., 8-503.1-తే.]

2025} త్రివిక్రముడు  - మూడడుగులతో ముల్లోకములను కొలువగల పరాక్రమము (సామర్థ్యము) కల వాడు, వామనావతారుడు, విష్ణువు :-
[6-343-వ., 10.1-236-వ.]

2026} త్రివిధకర్మములు  - పుణ్య పాప మిశ్ర కర్మలు :-
[5.2-55-వ., 10.1-1664-వ.]

2027} త్రివిధగజజాతులు  - 1భద్రము 2మందము 3మృగము, భద్రగజమును దేవాలయాలాదులలో కొలువులకు ఊరేగింపులకు వాడుటకు యోగ్యమైనది, మందము యుద్ధకాలమున వాహనముగా వాడుటకు యోగ్యమైనది మృగము అడవిలో తిరుగునది, దీనిని మచ్చికచేయుట కష్టము :-
[10.1-1721-మ.]

2028} త్రివిధదుఃఖములు  - 1ఆదిభౌతికము 2అధ్యాత్మికము 3అధిదైవికము :-
[4-861-చ.]

2029} త్రివిధపాపములు  - 1అంహ (దోషము) 2ఆగము (తప్పు) 3ఏనస్సు (అపరాధము), (దోషము చేయుటలోని పొరపాటు, తప్పు అతిక్రమించి చేయునది, దోషము చేయరానిది చేయుట) :-
[10.1-484-క., 10.2-789-వ.]

2030} త్రివిధములు - 1 అధ్యాత్మము2 అధిభూతము 3 అధిదైవము :-
[3-209-క.]

2031} త్రివిధసృష్టి  - 1 కాలము 2 ద్రవ్యము 3 గుణము అను ఒకదాని పైనొకటి ఆధారపడు మూడు విధములు అయిన సృష్టి :-
[3-344-వ.]

2032} త్రివిష్టపము  - త్రిదివము, భూర్భువస్సువః అను మూడవలోకము, వ్యు. తృతీయం విష్టపము త్రివిష్టపము, స్వర్గలోకము, ముల్లోకములలో మూడవది :-
[4-277-వ., 7-330-ఉ.]

2033} త్రివిష్టపముఖ్యజగన్నివాసకుడు  - త్రివిష్టప (స్వర్గము) మొదలగు జగత్ (లోకములలో) నివాసకుడు (వసించెడివాడు), విష్ణువు. :-
[7-330-ఉ.]

2034} త్రిశంకుడు  - 1తండ్రికి బాధకలిగెడి కార్యము చేయుటచేతను 2గురుధేనువును వధించుట చేతను 3అప్రోక్షిత మాంసమును భక్షించుట చేతను త్రివిధ హృదయ శంకువులుగల ఇతనికి ఈ పేరు వసిష్ఠునిచే పేరుపెట్టబడెను. విశ్వామిత్రుడు ఇతనికొరకు త్రిశంకు స్వర్గము సృష్టించెను. :-
[9-192.1-తే.]

2035} త్రిశక్తులు  - ఇవి మూడు (3) విధములు, ఒక్కొకటి మరల మూడు (3) రకములు అవి 1 ఇచ్చాది ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు, 2 ఉత్సాహాది ఉత్సాహము, ప్రభుత్వము, మంత్రము, 3 సత్వాది సత్వము, రజస్సు, తమస్సు :-
[2-58-మ., 2-101-చ.]

2036} త్రిశూలము  - శివుని ఆయుధము, మూడు మొనలు గల ఆయుధ విశేషము. :-
[5.1-147.1-తే.]

2037} త్రిషవణస్నానములు  - ముప్పొద్దుల చేయు స్నానములు, మూడు సవనముల ముందు చేయు స్నానములు :-
[5.1-99-వ.]

2038} త్రిసంధ్యలు  - త్రి (మూడు, ఉదయ మద్యాహ్న సాయంకాల) సంధ్యలు :-
[7-421-వ.]

2039} త్రుటి  - సుమారు 0.39 మిల్లిసెకన్లు, 300 నిమేషములు, నిమేషము 3 లవములు, లవము 3 వేధలు. వేధ 100 త్రసరేణువులు, త్రుటి 3 త్రసరేణువులు :-
[10.1-529-వ.]

2040} త్రేతలో  - నాలుగింట మూడు వంతుల (3, 4) ధర్మము ఉండును :-
[3-350-వ.]

2041} త్రేతాగ్నులు  - 1గార్హపత్యము (గృహస్థునికి సంబంధించినది) 2దక్షిణాగ్ని (పితృదేవతలకి ఉద్దేశించినది) 3ఆహవనీయము (యజ్ఞమున ఇవ్వ యోగ్యమైనది) అను శ్రౌతాగ్నులు మూడు :-
[1-85.1-ఆ., 4-104-వ., 4-673.1-తే., 8-536.1-తే., 9-333.1-ఆ., 9-419-వ., 10.1-805-ఆ., 10.2-718-వ.]

2042} త్రైజగన్నుతుడు  - త్రైజగత్ (ముల్లోకముల)చేత నుతుడు (స్తుతింపబడువాడు), రాముడు. :-
[7-482-చ.]

2043} త్రైలోక్యపాలకుడు  - త్రైలోక్య (ముల్లోకములను) పాలకుడు, విష్ణువు :-
[4-702.1-తే.]

2044} త్రైలోక్యసుందరుడు  - మూడులోకములకు సుందరుడు, విష్ణువు :-
[2-237-మ., 3-99.1-తే.]

2045} త్రైవర్గములు  - 1 భూభువస్సువ ర్లోకములు మూడు వర్గములు 2 ద్రవ్యము శక్తి ప్రకాశము అను మూడు వర్గములు 3 ధర్మార్థకామములు అను మూడు వర్గములు... :-
[3-1021-వ.]

2046} త్రైవర్గికములు  - 1 భూభువస్సువ ర్లోకములు మూడు వర్గములు 2 ద్రవ్యము శక్తి ప్రకాశము అను మూడు వర్గములు 3 ధర్మార్థకామములు అను మూడు వర్గములు... :-
[3-354-క.]

2047} త్రైవిధ్యము  - 1సుఖమయ 2సుఖదుఃఖ మిళితమయ 3దుఃఖమయములైన మూడు విధముల ఫలితములు, ఇంకొకవిధమున 1హర్ష 2శోక 3భయములు :-
[6-88-వ., 6-162-తే.]

2048} త్ర్యవస్థలు  - 1జాగ్రత్త 2స్వప్నము 3సుషుప్తి :-
[6-224-వ.]

2049} త్వష్ట  - 1.విశ్వకర్మ, ద్వాదశాదిత్యులలోనొకడు, 2.అదితి సంతానము పన్నెండుగురులో ఒకడు, 3.త్వష్ట కుమారుడు విశ్వరూపుడు ఇంద్రునివలన హతుడగుటకు కోపించి, హోమంలో వృత్రాసురుని సృష్టించాడు. 4.ఏకాదశ రుద్రులలో కూడ ఒక త్వష్ట కలడు. :-
[4-443.1-తే., 6-506.1-ఆ.]

2050} దంచు  - బియ్యము మొదలగువాని కొరకు వడ్లు ఆదులను రోకళ్ళతో దంచుట :-
[3-401-చ.]

2051} దండ,దామము  - దారమునందు గుచ్చి రెండు పక్కల కలపకుండా ఉండునది దామము, రెండు పక్కల కలిపేసినది దండ. :-
[10.2-1098-చ.]

2052} దండధరుడు  - దండించు బాధ్యతను ధరించిన (స్వీకరించిన) వాడు, యముడు :-
[1-389-వ., 1-394.1-ఆ., 3-449-తే., 6-168-వ., 7-381.1-తే., 10.1-1593-ఆ.]

2053} దండధరునినగరి  - యముని పట్టణము, యమపురి, సంయమని :-
[10.1-1593-ఆ.]

2054} దండపాణి  - దండించు బాధ్యతను చేపట్టినవాడు, యముడు, దక్షిణ దిక్పతి :-
[10.2-773-చ.]

2055} దండప్రణామము  - సాష్టాగ నమస్కారము, దండము వలె భూమిపై పడి నమస్కరించుట :-
[1-499-వ., 1-521-వ., 6-499-వ., 7-86-వ., 7-162-వ., 9-212-వ., 10.2-588-వ.]

2056} దండము  - 1. జపతపాదులందు చేతిని ఆనించుకొనెడి పైన చిన్న అడ్డకఱ్ఱ యుండెడి కఱ్ఱ, 2. దండించుటకైన కఱ్ఱ, 3. సామాన్యార్థంలో కఱ్ఱ, 4, నమస్కారము, 5. చతురుపాయముల లోనిది, 6.రాజశిక్ష, 7. కప్పము, 8. దుడ్ఢుకఱ్ఱ :-
[7-421-వ., 7-429-వ., 11-77-వ.]

2057} దండరచితకరణము  - దేహము కఱ్ఱవలె బిగదీయుట, రాసక్రీడ యందలి పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

2058} దండలాతదైవమండలము  - బాణాకఱ్ఱ తిప్పునట్లు రెండు చేతులు చేర్చి మీదికెత్తి గిరగిర తిప్పుట, రాసక్రీడ యందలి పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

2059} దండవన్నమస్కృతులు  - దండము (కఱ్ఱ)వలె పడి నమస్కరించుటలు :-
[4-279-తే.]

2060} దండి  - 1. దండము ధరించువాడు, బ్రహ్మచారి, 2. దండించు (శిక్షించు) వాడు, 3. దండాయుధ ధారి, యముడు :-
[10.1-1236-దం., 10.1-1558-వ.]

2061} దండితారిసమూహుడు  - దండిత (శిక్షింపబడిన) అరి (శత్రువుల) సమూహము గలవాడు, కృష్ణుడు :-
[5.2-167-మత్త.]

2062} దంతవక్త్రుడు  - శిశుపాలుని తమ్ముడు, ననకాదుల శాపంవలన జయవిజయులు పొందిన మూడవ మఱియు తుది జన్మము శిశుపాల దంతవక్త్రులు :-
[2-190-చ., 7-13-వ.]

2063} దంతావళపాలకులు  - దంతావళము (ప్రశస్తమైన దంతములు కలది, పెద్ద ఏనుగు)ను పాలకులు (కాచువారు), మావటీలు :-
[10.1-1323-వ.]

2064} దంతావళము  - ప్రశస్తమైన దంతములు కలది, పెద్ద ఏనుగు :-
[10.2-214-వ.]

2065} దంతి  - దంతములు కలిగినది, ఏనుగు :-
[10.1-1323-వ.]

2066} దంతిపురనాథుడు  - దంతిపురము (హస్తినాపురము) నకు నాథుడు (రాజు), పరీక్షిత్తు :-
[6-54-క.]

2067} దంతిముఖుడు  - దంతి (ఏనుగు) ముఖుడు (ముఖము గలవాడు), విఘ్నేశ్వరుడు :-
[6-4-ఉ.]

2068} దంతియూథము  - దంతి (ఏనుగు) యూథము (వీరుడు), గజేంద్రుడు :-
[7-350-మ.]

2069} దందశూకము  - 1. కుత్సితమైన దంశము (కరచుట) కలది, సర్పము, 2. పాములచే శిక్షింపజేయు నరక విశేషము :-
[5.2-136-వ., 5.2-158-వ., 11-99-వ., 12-28-వ.]

2070} దంభుడు  - దబాయింపు, అధర్మ శాఖలు అందు అధర్మునకు భార్య మృష, వారి కుమారుడు దంభుడు, కుమార్తె మాయ. అధర్మ సంతానం కనుక వారిద్దరూ దంపతులయ్యారు. వారిద్దరినీ సంతానం లేని నిరృతి దత్తు చేసుకున్నాడు. ఆ దంపతుల కుమారుడు లోభుడు, కుమార్తె నికృతి. :-
[4-215-వ.]

2071} దంష్ట్రావిభిన్నశత్రుమహోరస్తటి  - దంష్ట్రా (కోరలచే) విభిన్న (బద్ధలుకొట్టబడిన) శత్రువు యొక్క మహా (గొప్ప) ఉరస్తటి (వక్షస్థలము కలది), ఆదివరాహము :-
[3-698-క.]

2072} దంష్ట్రి  - దంష్ట్రములు (కోరపళ్ళు) గలది వరాహము యొక్క రూపము ధరించినవాడు, వరహావతారుడు, విష్ణువు :-
[7-376.1-తే.]

2073} దక్షిణ  - 1.యజ్ఞాదుల యందు క్రియలు చేసినవారికి ఇచ్చెడు ధనాదులు, 2.ఉత్తరం దిక్కుకు ఎదురు దిక్కు దక్షిణం, 3.రుచి ప్రజాపతి మనుపుత్రి ఆకూతిలకు పుట్టిన కుమార్తె దక్షిణ, కుమారుడు యజ్ఞుడు. యజ్ఞుడిని మాతామహుడు స్వాయంభువమనువు దత్తత తీసుకున్నాడు. :-
[4-367.1-తే., 10.2-957-వ.]

2074} దక్షిణదిశాధినాయకుడు  - దక్షిణపు దిక్కునకు అధినాయకుడు (ప్రభువు), యమధర్మరాజు :-
[6-163-క.]

2075} దక్షుకూతురు  - దక్షుని కూతురు, సతి :-
[8-220-క.]

2076} దధ్యంచుడు  - దధి (పెరుగు) అంచుడు (కారణుడు), దధన (ధీ) శక్తి ఐనవాడు :-
[4-26-వ.]

2077} దనుజకరటివరహర్యక్షుడు  - దనుజులు (రాక్షసులు) అను కరటి (ఏనుగు)ల వర (రాజు)కు హర్యక్షుడు (సింహము వంటివాడు). విష్ణువు :-
[3-705-క.]

2078} దనుజకుంజరుడు  - దనుజ (రాక్షసులలో) కుంజరుడ (ఏనుగువలె గొప్పవాడు), హిరణ్యకశిపుడు :-
[7-154-క.]

2079} దనుజకులాంతకుడు  - దనుజ (రాక్షస) కులము (వంశము)ను అంతము చేయువాడు, విష్ణువు :-
[3-444-క.]

2080} దనుజఘస్మరుడు  - రాక్షసులను సంహరించువాడు, విష్ణువు :-
[10.1-1171-ఉ.]

2081} దనుజదండి  - రాక్షసులను దండించువాడు, కృష్ణుడు :-
[10.1-1142-ఆ.]

2082} దనుజదమనుడు  - దనుజ (రాక్షసులను) దమనుడు (శిక్షించువాడు), విష్ణువు :-
[10.1-884-వ.]

2083} దనుజదర్పావహుడు  - దనుజ (రాక్షసు)ల దర్పము (గర్వము) ను అపహరించువాడు, హరి :-
[3-640-క.]

2084} దనుజపరిపంథి  - దనుజు (రాక్షసు)లకు పరిపంథి (శత్రువు) , విష్ణువు :-
[3-667-వ.]

2085} దనుజభంజనుడు  - దనుజ (రాక్షసులను) భంజనుండు (సంహరించువాడు), విష్ణువు :-
[7-193-ఉ.]

2086} దనుజభేది  - దనుజ (రాక్షసులను) భేది (శత్రువు), విష్ణువు :-
[4-553.1-తే.]

2087} దనుజమర్దనుడు  - దనుజులు (రాక్షసులను) మర్దనుడు (సంహరించువాడు), హరి :-
[6-73-చ., 6-423-ఉ., 7-114-వ.]

2088} దనుజరాజకుమారుడు  - దనుజు (రాక్షసు)ల రాజ (రాజు యొక్క) కుమారుడు (పుత్రుడు), ప్రహ్లాదుడు :-
[7-133-వ.]

2089} దనుజవిభేధి  - దనుజ (రాక్షసుల)కు విభేధి (శత్రువు), విష్ణువు :-
[3-683-చ.]

2090} దనుజవిరోధి  - రాక్షసుల శత్రువు, విష్ణువు :-
[10.2-107-చ.]

2091} దనుజహరుడు  - రాక్షసులను సంహరించువాడు, విష్ణువు. :-
[3-145.1-తే.]

2092} దనుజాంతకుడు  - రాక్షసుల పాలిటి యముని వంటివాడు, విష్ణువు :-
[10.1-1369-వ., 10.1-1541-ఉ., 10.2-19-క.]

2093} దనుజాధిపమంత్రి  - రాక్షసరాజు యొక్క పురోహితుడు, శుక్రుడు :-
[9-539-ఉ.]

2094} దనుజాధిపుడు  - దనుజు (రాక్షసు)లకు అధిపుడు (రాజు), హిరణ్యకశిపుడు :-
[7-134-ఉ.]

2095} దనుజాధీశచమూవిదారుడు  - రాక్షస రాజుల సైన్యాలని భేదించువాడు, కృష్ణుడు :-
[10.2-207-మ.]

2096} దనుజాధీశవిదారి  - దనుజా (రాక్షస) అధీశ (రాజులను) విదారి (చంపువాడు), విష్ణువు :-
[10.2-80-మ.]

2097} దనుజారి  - దనుజు (రాక్షసు)లకు అరి (శత్రువు) , విష్ణువు, కృష్ణుడు :-
[1-247-శా., 3-394-క., 3-666-చ., 3-679-వ., 3-837-క., 6-157-ఉ., 10.1-732-మ.]

2098} దనుజులు  - కశ్యపునకు దనువు యందు కలిగిన సంతానము, రాక్షసులు :-
[7-402-ఆ.]

2099} దనుజేంద్రవైరి  - రాక్షసురాజులకు శత్రువు, విష్ణువు :-
[10.1-353.1-ఆ.]

2100} దనుజేశ్వరుడు  - దనుజుల (రాక్షసుల)లో ఈశ్వరుడు (ప్రభువు), హిరణ్యాక్షుడు :-
[3-702-తే.]

2101} దమఘోషసుతుడు  - (కృష్ణుని మేనత్త) శ్రుతశ్రవస భర్త, శిశుపాలుని తండ్రి :-
[10.2-786-క.]

2102} దమము  - 1 క్లేశములను ఓర్చుట, బహిరింద్రియ నిగ్రహము, 2. జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను వశపరచుకొనుట :-
[10.1-1474-ఆ., 11-54-వ.]

2103} దయానిధి  - కృపకు సముద్రము వంటివాడు, విష్ణువు :-
[3-599-ఉ.]

2104} దయానువర్తి  - దయతో అనుకూలముగా వర్తించువాడు, విష్ణువు :-
[3-423.1-తే.]

2105} దయాపయోధి  - దయారసముచేత సముద్రుడు, శ్రీరాముడు :-
[10.2-1340-చ.]

2106} దయాబ్ధి  - దయకు సముద్రమైనవాడు, విష్ణువు. :-
[8-728-క.]

2107} దయాసముద్రుడు  - కృప యనెడి సముద్రుగల వాడు, విష్ణువు :-
[8-18.1-ఆ.]

2108} దయాసాంద్రుడు  - దయ దట్టముగ కలవాడు, విష్ణువు :-
[2-237-మ.]

2109} దయాసింధుడు  - దయాసముద్రుడు, కృష్ణుడు :-
[1-248-క.]

2110} దరహాసము  - చిరునవ్వు, మందస్మితము :-
[10.2-1255-చ.]

2111} దరహాసామృతపూరితాస్యుడు  - చిరునవ్వు అను అమృతముతో నిండిన ముఖము కలవాడు, విష్ణువు :-
[2-237-మ.]

2112} దర్పకారాతి  - దర్పక (మన్మథుని) ఆరాతి (శత్రువు), శివుడు :-
[10.2-1242.1-తే.]

2113} దర్భాస్తరణంబులన్  - దర్భ + ఆస్తరణంబులన్, సవర్ణదీర్ఘ సంధి, దర్భలతో చేసిన ఆసనము :-
[10.2-1190-మ.]

2114} దర్వీకరము  - తెడ్డునుబోలు పడగ కలది, పాము :-
[12-48-వ.]

2115} దర్శనాది, పంచతన్మాత్రలు  - 1శబ్దము 2స్పర్శ 3 దర్శనము (చూపు) 4ఘ్రాణము (వాసన) మరియు 5రస (రుచి) వాని మూల తత్వములు (5) :-
[7-467-వ.]

2116} దర్శనీయమనోరథదాయుడు  - దర్శనీయ (ఊహించు కొనగలిగిన) మనోరథ (కోరిక)లను దాయుడు (ఇచ్చువాడు), విష్ణువు :-
[3-924.1-తే.]

2117} దర్శనీయుడు - దర్శనీయతరుడు దర్శనీయతముఁడు. :-
[4-251.1-తే.]

2118} దర్శనుడు  - సాక్షీభూతముగ చూచువాడు :-
[10.1-117-క.]

2119} దర్శము  - అమావాస్య, అమావాస్యనాఁడు చేయఁదగిన యిష్టి, దర్శయజ్ఞము :-
[6-507-వ.]

2120} దళత్పంకేరుహాక్షుడు  - వికసించిన పద్మముల వంటి కన్నులు కలవాడు, విష్ణువు. పంకేరుహము బురదలో పుట్టునది :-
[2-236-మ.]

2121} దళత్పద్మనేత్రుడు  - దళత్ (వికసించిన) పద్మముల వంటి నేత్రములు కలవాడు, విష్ణువు :-
[3-284-మ.]

2122} దళదరవిందసుందరపత్రనేత్రుడు  - విచ్చుకొన్నపద్మముల రేకులవంటి నేత్రములు కలవాడు, విష్ణువు :-
[3-145.1-తే.]

2123} దళదరవిందసుందరపత్రరుచిరాక్షుడు  - దళత్ (విచ్చుకొనుచున్న) అరవింద (పద్మముల) సుందర (అందమైన) పత్ర (రేకుల వంటి) రుచిర( ప్రకాశమైన) అక్షుడు (కన్నులు కలవాడు) , విష్ణువు :-
[3-922.1-తే.]

2124} దళితపంకేరుహాక్షుడు  - దళిత (వికసించిన) పంకేరుహ (పద్మముల) వంటి అక్షుడు (కన్నులు గలవాడు), విష్ణువు :-
[6-415-తే.]

2125} దశ  - 1.అవస్థ, చతురావస్థలు, బాల్యము, కౌమారము, యౌవనము, వార్థక్యము, ఇంకోవిధముగ 2. అష్టధశలు పిండ, శైశవ, బాల్య, కౌమార, యౌవన, ప్రౌఢ, వార్థక్య, మరణ దశలు. 3. సంఖ్య పది :-
[3-109-ఉ.]

2126} దశకంఠుడు  - పది కంఠముల వాడు, రావణాసురుడు :-
[10.2-68.1-తే.]

2127} దశకంధరుడు  - పది కంఠముల వాడు, రావణాసురుడు :-
[9-304-క., 10.2-1241-వ.]

2128} దశగ్రీవుడు  - దశ (పది) గ్రీవుడు (కంఠములు కలవాడు), రావణుడు :-
[5.2-115-వ., 9-269.1-తే.]

2129} దశదిక్కులు  - నాలుగు (4)దిక్కులు (1తూర్పు 2దక్షిణము 3పడమర 4ఉత్తరము) నాలుగు (4) మూలలు (5ఈశాన్యము 6ఆగ్నేయము 7నైరృతి 8వాయవ్యము) 9పైన 10 కింద :-
[4-371-వ., 8-614-క.]

2130} దశదిశలు  - నాలుగు (4)దిక్కులు (1తూర్పు 2దక్షిణము 3పడమర 4ఉత్తరము) నాలుగు (4) మూలలు (5ఈశాన్యము 6ఆగ్నేయము 7నైరృతి 8వాయవ్యము) 9పైన 10 కింద :-
[1-287-వ., 5.1-82-వ., 6-307-వ., 7-285-వ., 7-373-వ., 9-360-చ., 10.1-266-వ., 10.1-716-వ., 10.1-1299-క.]

2131} దశముఖుడు  - పదిముఖములు కలవాడు, రావణుడు :-
[9-265-క.]

2132} దశరథతనయుడు  - దశరథుని పుత్రుడు, రాముడు :-
[9-230-వ.]

2133} దశరథరాముడు  - దశరథుని యొక్క కుమారుడైన రాముడు (ఆనందింప జేయువాడు), రాముడు. :-
[8-1-క.]

2134} దశరథసూనుడు  - దశరథుని పుత్రుడు, రాముడు :-
[9-304-క.]

2135} దశవదనవిదళనుడు  - దశవదను (పదితలలవాడు, రావణాసురు)ని విదళన (సంహరించినవాడు), రాముడు :-
[11-72.1-తే.]

2136} దశవిధగుణములు  - 1కామ 2క్రోధ 3లోభ 4మోహ 5మద 6మాత్సర్య 7దంభ 8దర్ప 9ఈర్ష్యా 10అసూయలు అనెడి గుణములు :-
[10.1-939.1-తే.]

2137} దశవిధపవనములు  - పంచవాయువులు (1ప్రాణము 2అపానము 3ఉదానము 4వ్యానము 5సమానము) మరియు పంచోపవాయువులు (1నాగము 2కూర్మము 4కృకరము 4దేవదత్తము 5ధనంజయము) :-
[7-464.1-తే.]

2138} దశవిధమన్మథావస్థలు  - 1చూచుట 2తలచుట 3కోరుట 4కాచుట 5చిక్కిపోవుట 6అరుచిపుట్టుట 7సిగ్గువిడుచుట 8నడచుట 9మూర్చిల్లుట 10ప్రాణముపోవుట :-
[10.1-1495-ఉ.]

2139} దశానన  - దశ (పది) ఆనన (ముఖములు) కలవాడ, రావణుడు, దశకంఠుడు :-
[2-285-ఉ., 3-1-క.]

2140} దశావరణలు  - 1 పృథివి 2 వాయువు 3 అప్పు 4 తేజస్సు 5 ఆకాశము 6 అహంకారము 7 మనోమయ 8 జ్ఞానమయ 9 మహత్త్వము 10 ప్రకృతి :-
[3-363-వ.]

2141} దశేంద్రియములు  - జ్ఞానేంద్రియములు ఐదు (కన్ను ముక్కు చెవులు నాలుక చర్మములు) కర్మేంద్రియములు ఐదు (కాళ్ళు చేతులు నోరు గుదము గుహ్యములు) :-
[10.1-682.1-తే., 10.2-1203-వ., 11-62-వ.]

2142} దహనుడు  - దహింపజేయు వాడు, అగ్ని :-
[10.2-122-వ.]

2143} దాంతి  - బ్రహ్మచర్యాది తపఃక్లేశములను ఓర్చుకొనుట :-
[12-20-వ.]

2144} దాక్షాయణి  - దక్షునికూతురు, మూర్తిదేవి, సతి :-
[2-125-క., 4-34-వ., 4-211-వ., 7-409-వ.]

2145} దానవకులవైరి  - దానవులందరికి శత్రువు, విష్ణువు :-
[1-111-క.]

2146} దానవకులసంహారుడు  - రాక్షసులను సంహరించువాడు, కృష్ణుడు :-
[10.2-1045-క.]

2147} దానవఘస్మరుడు  - దానవ (రాక్షసుల) ఘస్మరుడు (నాశకుడు), విష్ణువు :-
[8-197-క.]

2148} దానవచమూజైత్రుడు  - రాక్షసుల చమూ (సైన్యములను) జైత్రుడు (జయించువాడు), విష్ణువు :-
[3-284-మ.]

2149} దానవనాథుడు  - రాక్షస రాజు, నరకుడు :-
[10.2-187-క.]

2150} దానవరిపుడు  - రాక్షసుల శత్రువు, విష్ణువు :-
[10.1-1424-క.]

2151} దానవలోకేశుడు  - దానవ (రాక్షసుల యొక్క) లోకమునకు ఈశుడు (ప్రభువు), హిరణ్యాక్షుడు :-
[3-700-మ.]

2152} దానవవిద్విట్  - దానవులు(రాక్షసులు) విద్విట్ (ద్వేషించువాడు), విష్ణుమూర్తి :-
[6-500-ఉ.]

2153} దానవవిభుడు  - దానవ (రాక్షస) విభుడు (రాజు), హిరణ్యకశిపుడు :-
[7-139-శా.]

2154} దానవహంత  - దానవ (రాక్షసుల)ను హంత (సంహరించువాడు), విష్ణువు :-
[3-653-చ., 10.1-1173-ఉ.]

2155} దానవాంతకుడు  - దానవుల (రాక్షసుల)ను అంతకుడు (సంహరించినవాడు, యముడు), విష్ణువు :-
[3-836-చ.]

2156} దానవారాతి  - దానవుల (రాక్షసుల)కు ఆరాతి (శత్రువు), విష్ణువు :-
[5.2-112.1-ఆ.]

2157} దానవుడు  - దనువునందు కశ్యపునకు పుట్టినవాడు, బలి :-
[10.2-1141-మ.]

2158} దానవులశత్రువు  - దానవులకు శత్రువు, హరి :-
[1-100-చ.]

2159} దానవులు  - దనువుకశ్యపుల పుత్రులు, రాక్షసులు :-
[7-29-వ., 8-182-వ., 8-668-క., 10.2-155-ఉ.]

2160} దానవేంద్రుడు  - దానవ (రాక్షసుల)కు ఇంద్రుడు (ప్రభువు), హిరణ్యకశిపుడు :-
[7-84-వ., 7-98-వ.]

2161} దామెన  - పశువులను కట్టెడి తాడు, పలుపుతాడు :-
[6-169.1-ఆ.]

2162} దామోదరుడు  - వనమాల ఉదరమున కలవాడు, శ్లో. దామాని లోకానామాని తానియస్యోదరాంతరే, తేన దామోదరో దేవశ్శ్రీధరస్త్వం సమాశ్రితః. వ్యాస వచనము, దామములు అనగా లోకములు పదునాలుగు ఉదరమున కలవాడు, దామము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు :-
[4-443.1-తే., 10.1-1223-మ., 10.2-49-క., 10.2-533-వ., 10.2-753-ఉ.]

2163} దాయాదులు  - పిత్రార్జితమును పంచుకొనెడివారు :-
[5.1-171-వ.]

2164} దార  - వ్యు. దౄ వాదారణే , దౄ (ణిచ్) ఆర్ టాప్, కృ.ప్ర., అన్నదమ్ముల నుండి వేఱుపఱచునది, భార్య :-
[8-81.1-ఆ.]

2165} దారకుడు  - కృష్ణుని రథసారథి :-
[10.2-515-వ., 10.2-669.1-తే., 10.2-873-ఆ., 10.2-886-వ.]

2166} దార్తరాష్ట్రలు  - కాళ్ళు, ముక్కు ఎఱ్ఱగాను, మిగతా శరీరం తెల్లగా నుండే హంసలు :-
[1-39-వ.]

2167} దావాగ్ని  - దావము (అడవి) అందలి అగ్ని, కారుచిచ్చు :-
[3-850.1-తే.]

2168} దాశరథి  - దశరథుని పుత్రుడు, శ్రీరాముడు :-
[3-304.1-తే.]

2169} దాసదుఃఖనాశి  - భక్తుల దుఃఖములను నశింపజేయువాడు, విష్ణువు :-
[10.2-749-ఆ.]

2170} దాసవిహారుడు  - దాస (దాసుల యందు) విహారుడు (విహరించెడివాడు), కృష్ణుడు :-
[5.2-167-మత్త.]

2171} దిక్కరులు  - అష్టదిగ్గజములు భూమి మోయు చుండు దిక్కులందలి ఎనిమిది (8) ఏనుగులు 1తూర్పు ఐరావతము 2 ఆగ్నేయుం పుండరీకము 3 దక్షిణం వామనము 4నైరృతి కుముదము 5పడమర అంజనము 6వాయవ్యం పుష్పదంతము 7ఉత్తరం సార్వభౌమము 8ఈశాన్యం సుప్రతీకము :-
[3-603-తే.]

2172} దిక్కులరాజులు - దిక్పాలకులు  అష్టదిక్పాలకులు 1 ఇంద్రుడు తూర్పు దిక్కునకు 2 అగ్ని ఆగ్నేయ దిక్కునకు 3 యముడు దక్షిణ దిక్కునకు 4 నిరృతి నైఋతి దిక్కునకు 5 వరుణుడు పడమటి దిక్కునకు 6 వాయువు వాయవ్య దిక్కునకు 7 కుబేరుడు ఉత్తర దిక్కునకు 8 ఈశానుడు ఈశాన్య దిక్కునకు పరిపాలకులు :-
[7-261-క.]

2173} దిక్పాలకులు  - అష్టదిక్పాలకులు 1 ఇంద్రుడు తూర్పు దిక్కునకు 2 అగ్ని ఆగ్నేయ దిక్కునకు 3 యముడు దక్షిణ దిక్కునకు 4 నిరృతి నైఋతి దిక్కునకు 5 వరుణుడు పడమటి దిక్కునకు 6 వాయువు వాయవ్య దిక్కునకు 7 కుబేరుడు ఉత్తర దిక్కునకు 8 ఈశానుడు ఈశాన్య దిక్కునకు పరిపాలకులు :-
[4-42.1-తే., 6-260.1-తే.]

2174} దిక్పాలవరులు  - అష్టదిక్పాలకులు 1 ఇంద్రుడు తూర్పు దిక్కునకు 2 అగ్ని ఆగ్నేయ దిక్కునకు 3 యముడు దక్షిణ దిక్కునకు 4 నిరృతి నైఋతి దిక్కునకు 5 వరుణుడు పడమటి దిక్కునకు 6 వాయువు వాయవ్య దిక్కునకు 7 కుబేరుడు ఉత్తర దిక్కునకు 8 ఈశానుడు ఈశాన్య దిక్కునకు పరిపాలకులు :-
[4-460.1-తే.]

2175} దిక్పాలురు - అష్టదిక్పాలకులు  అష్టదిక్పాలకులు 1 ఇంద్రుడు తూర్పు దిక్కునకు 2 అగ్ని ఆగ్నేయ దిక్కునకు 3 యముడు దక్షిణ దిక్కునకు 4 నిరృతి నైఋతి దిక్కునకు 5 వరుణుడు పడమటి దిక్కునకు 6 వాయువు వాయవ్య దిక్కునకు 7 కుబేరుడు ఉత్తర దిక్కునకు 8 ఈశానుడు ఈశాన్య దిక్కునకు పరిపాలకులు :-
[4-170-వ., 7-357.1-తే.]

2176} దిగంబరుడు  - దిక్కులే అంబరము (బట్టగా) కలవాడు, నగ్నుడు, అవధూత. :-
[5.1-54-వ., 5.1-78-వ., 7-21-వ.]

2177} దిగిభము  - దిక్ + ఇభము, దిగ్గజము :-
[10.1-1351-క.]

2178} దిగీశులు - దిక్పాలకులు  అష్టదిక్పాలకులు 1 ఇంద్రుడు తూర్పు దిక్కునకు 2 అగ్ని ఆగ్నేయ దిక్కునకు 3 యముడు దక్షిణ దిక్కునకు 4 నిరృతి నైఋతి దిక్కునకు 5 వరుణుడు పడమటి దిక్కునకు 6 వాయువు వాయవ్య దిక్కునకు 7 కుబేరుడు ఉత్తర దిక్కునకు 8 ఈశానుడు ఈశాన్య దిక్కునకు పరిపాలకులు :-
[7-206-శా.]

2179} దిగ్గజములు  - అష్టదిగ్గజములు భూమి మోయు చుండు దిక్కులందలి ఎనిమిది (8) ఏనుగులు 1తూర్పు ఐరావతము 2 ఆగ్నేయుం పుండరీకము 3 దక్షిణం వామనము 4నైరృతి కుముదము 5పడమర అంజనము 6వాయవ్యం పుష్పదంతము 7ఉత్తరం సార్వభౌమము 8ఈశాన్యం సుప్రతీకము :-
[3-413.1-తే., 5.2-73-వ., 7-285-వ.]

2180} దిగ్గజరాజు  - దిగ్గజములలో శ్రేష్ఠమైనది, ఐరావతము :-
[3-688-క.]

2181} దిగ్గజేంద్రము  - దిగ్గజములలో శ్రేష్ఠమైనది, ఐరావతము :-
[10.1-1174-ఉ., 10.1-1331.1-తే.]

2182} దిగ్విజయము  - అన్ని దిక్కులందలి భూమండలమును జయించుట :-
[1-396-వ., 9-433-వ.]

2183} దిఙ్మండలశుండాలములు  - అష్టదిగ్గజములు దిక్ (దిక్కుల) చివర మండల (స్థలము లందలి) శుండాలములు (ఏనుగులు), దిగ్గజములు :-
[6-218.1-ఆ.]

2184} దితిజుడు  - దితికి పుట్టినవాడు, దైత్యుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు :-
[3-420-మ., 3-684-క., 3-688-క.]

2185} దితితనూజుడు  - దితికి పుట్టినవాడు, దైత్యుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు :-
[7-95.1-తే.]

2186} దితినందనుడు  - దితికి పుట్టినవాడు, దైత్యుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు :-
[7-93-వ.]

2187} దితిపుత్రుడు  - దితికి పుట్టినవాడు, దైత్యుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు :-
[7-99-మ.]

2188} దితిసంతానకులాటవీమహితసందీప్తప్రభాశుక్రము  - దితి యొక్క సంతానము (పుత్రుల) కుల (సమూహము) అను అటవీ (అడవి)ని మహిత (గొప్ప) సందీప్త (బాగా వెలిగిపోయిన) ప్రభా (కాంతులు) కల శుక్రము (అగ్నిహోత్రము), విష్ణుచక్రము :-
[3-678-మ.]

2189} దితిసంభవుడు  - దితికి పుట్టినవాడు, హిరణ్యాక్షుడు :-
[3-689-మ.]

2190} దితిసుతనిరాకరిష్ణుడు  - దితియొక్క పుత్రులైన రాక్షసులను తిరస్కరించువాడు, విష్ణువు :-
[10.1-109-క.]

2191} దితిసుతుడు  - దితి యొక్క సుతుడు (పుత్రుడు), హిరణ్యాక్షుడు :-
[3-674-క., 7-110-మ., 9-161.1-తే.]

2192} దినకరకోటిసందీప్తతేజుడు  - దినకర (సూర్యులు) కోటి (కోటి మందితో సమానమైన) సందీప్తుడు (ప్రకాశము కలవాడు), విష్ణువు :-
[3-922.1-తే.]

2193} దినకరుడు  - దినమునకుకారణుడు, సూర్యుడు :-
[2-31.1-ఆ., 8-546-వ., 10.1-568-వ., 10.1-937-క., 10.2-441-వ.]

2194} దినక్షయము  - ఒకదినమున మూడు తిథులు కలుగుట, తద్వార సూర్యోదయానికి ఉన్న మొదటి తిథి ఆ నాటి తిథి అవుతుంది, మూడవ తిథి మరునాటి సూర్యోదయానికి ఉంటుంది కనుక ఆనాటి తిథి. మధ్యలో ఉన్న తిథికి వేరే దినము లేనందున దానిని దిన క్షయం అంటారు :-
[7-448-వ.]

2195} దిననాథుడు  - పగళ్ళకు అధిపతి, సూర్యుడు :-
[10.1-717.1-ఆ.]

2196} దిననాయకుడు  - దిన (పగలు)కి నాయకుడు, సూర్యుడు :-
[4-641-క., 4-956-క.]

2197} దినభాగములు  - (పగలు, రేయి ముహుర్తములు) 2 X 15 (ఒక్కోటి 48 ని. లకు సమానము) 1 రౌహిణేయము 2 విరించము 3 సోమము 4 నిరృతి 5 మహేంద్రము 6 వరుణము 7 భటము 8 రౌద్రము 9 శ్వేతము 10 మైత్రము 11 శారభటము 12 సావిత్రము 13 విజయము 14 గాంధర్వము 15 కుతపము :-
[2-12-వ.]

2198} దినశేషము  - ఆనాటికి మిగిలిన సమయము, రాత్రి :-
[3-169-క.]

2199} దినేశుడు  - దిన + ఈశుడు, గుణ సంధి, పగలుకు ప్రభువు, తత్పురుష సమాసము, సూర్యుడు :-
[3-1054-మాలి., 9-718-క., 10.2-1225-ఆ.]

2200} దిలీపుడు  - సూర్య వంశపు మహారాజు, శ్రీరాముని పూర్వీకుడు, ఇతని మునిమనవడు దశరథుడు :-
[2-204.1-తే.]

2201} దివసాగమదళదరవిందదళాక్షుడు  - దివస ఆగమ (ప్రాతః కాలము నందు) తళత్ (ఇంచుక వికసించిన) అరవింద (తామరల యొక్క) దళ (రేకుల వంటి) అక్షుడు (కన్నులు కలవాడు), కృష్ణుడు :-
[10.2-246-క.]

2202} దివాకరుడు  - దివమునకు ఆకరుడు (చేయువాడు), సూర్యుడు :-
[4-374-వ., 11-12.1-తే.]

2203} దివిజకాంతామణులు  - దేవరమణులు, అప్సరసలు. :-
[2-126-క.]

2204} దివిజరాజు  - దివి (స్వర్గమున) జులు (చెందినవారు) దేవతలు వారి రాజు, ఇంద్రుడు :-
[6-386-వ., 6-531-గ., 7-373-వ.]

2205} దివిజరిపువిదారుడు  - దివిజరిపు (రాక్షసు)లను విదారుడు (సంహరించినవాడు), శ్రీరాముడు :-
[8-744-మాలి.]

2206} దివిజాంతకుడు  - దివిజు (దేవత)లను అంతకుడు (చంపువాడు), రాక్షసుడు :-
[10.1-474-మ.]

2207} దివిజాధీశుడు  - దివిజుల (దేవతల)కు అధీశుడు (ప్రభువు),ఇంద్రుడు :-
[3-113-మ., 3-227-క.]

2208} దివిజాధీశ్వరుమాత  - దివిజాధీశ్వరుని (ఇంద్రుని) మాత, అదితి :-
[8-506-మ.]

2209} దివిజానీకవిరోధి  - దివిజ (దేవతా) అనీక (సేనల) కు విరోధి (శత్రువు), హిరణ్యకశిపుడు :-
[7-85-మ.]

2210} దివిజారి  - దివిజుల (దేవతల)కు అరి (శత్రువు), రాక్షసుడు :-
[3-633-క.]

2211} దివిజారిహరుడు  - దేవతశత్రువు (రాక్షసు)లను సంహరించువాడు, విష్ణువు. :-
[10.2-1212-క.]

2212} దివిజులు  - దివి (స్వర్గమున) జులు (జనించినవారు), దేవతలు :-
[3-1-క., 3-92-చ., 3-702-తే., 6-176-క., 6-275-క., 7-95.1-తే., 8-182-వ.]

2213} దివిజేంద్రుడు  - దివిజ (దేవత)లకు ఇంద్రుడు, దేవేంద్రుడు :-
[7-328-క.]

2214} దివౌకః+స్వామి  - దివౌకః (స్వర్గవాసుల) స్వామి (ప్రభువు), ఇంద్రుడు :-
[8-611-మ.]

2215} దివ్యదృష్టి  - భూతభవిష్యద్వర్తమానములు చూడగల దృష్టి, అతీంద్రియ విషయములను తెలుసుకొనగల జ్ఞానము :-
[7-219-వ.]

2216} దివ్యము - దివ్యతరము దివ్యతమము :-
[2-121.1-తే.]

2217} దివ్యవాణి  - దివ్యమైన వాణి గలామె, సరస్వతి :-
[6-17.1-తే.]

2218} దివ్యసంవత్సరము, దివ్యవత్సరము  - 1 మానవ సంవత్సరము, దేవతలకు ఒక దినము, దివ్యదినము. ఉత్తరాయణము పగలు దక్షిణాయణము రాత్రి అట్టి దినములు 30 ఐన 1 దివ్యమాసము అవి 12 అయిన 1 దివ్యసంవత్సరము 1000 దివ్య సంవత్సరములు బ్రహ్మకు 1 రాత్రి లేదా పగలు ఇవి రెండుకలిపిన బ్రహ్మకు 1 దినము ఆ రాత్రి భాగము ప్రళయము పగలు భాగము కల్పము అగును. బ్రహ్మ ఆయువు 100 బ్రహ్మవత్సరములు ఇదే బ్రహ్మకల్ప మందురు :-
[3-281-మ., 4-11.1-తే., 6-484-వ., 7-360-వ.]

2219} దివ్యాంబరాభరణాలంకృతుడు  - దివ్యమైన వస్త్రములు ఆభరణములచే అలంకరింపబడినవాడు, శ్రీకృష్ణ :-
[5.1-181-మ.]

2220} దిశలు  - అష్టదిక్కులు 1తూర్పుదిక్కు 2 ఆగ్నేయమూల 3దక్షిణదిక్కు 4నైరృతిమూల 5పడమరదిక్కు 6వాయవ్యమూల 7ఉత్తరదిక్కు 8ఈశాన్యమూల :-
[3-603-తే.]

2221} దిశాధిపులు - దిక్పాలకులు  అష్టదిక్పాలకులు 1 ఇంద్రుడు తూర్పు దిక్కునకు 2 అగ్ని ఆగ్నేయ దిక్కునకు 3 యముడు దక్షిణ దిక్కునకు 4 నిరృతి నైఋతి దిక్కునకు 5 వరుణుడు పడమటి దిక్కునకు 6 వాయువు వాయవ్య దిక్కునకు 7 కుబేరుడు ఉత్తర దిక్కునకు 8 ఈశానుడు ఈశాన్య దిక్కునకు పరిపాలకులు :-
[6-385-లగ్రా.]

2222} దీక్షితుడు  - సోమముగల యజ్ఞమునందు దీక్ష వహించువాడు :-
[10.1-854-క.]

2223} దీనలోకాధారుడు  - దీనులైనవారికి ఆధారుడు (ఆధారముగా నుండువాడు), విష్ణువు :-
[8-483.1-తే.]

2224} దీనవత్సలుడు  - దీనులయెడవాత్సల్యముగలవాడు, విష్ణువు :-
[4-963.1-తే.]

2225} దీనార్తినిర్మూలనుడు  - దీనుల ఆర్తిని నిర్మూలించువాడు, విష్ణువు :-
[12-36-మ.]

2226} దీపందర్శయామి  - వెలిగించిన దీపమును చూపుట అనెడి దేమునికి చేసెడి సేవ :-
[10.1-808-వ.]

2227} దీపాంకురము  - దీపమునుండి అంకురించునది, దీపపుకాంతి, దీపకళిక :-
[3-1048.1-తే.]

2228} దీమము  - పశుపక్షులను పట్టుటకు పెంచిన సజాతీయ పశుపక్షులు, పెంపుడుజంతువు. ఎర చేపలు మున్నగు వానిని పట్టుకొనుటకు పెట్టెడి వానపాము, మాంసం వంటి వాటి ఆహారం :-
[10.1-967.1-ఆ.]

2229} దీర్ఘము - దీర్ఘతరము దీర్ఘతమము :-
[4-540-వ., 7-355-మ.]

2230} దుందుమారుడు,ధుంధుమారుడు  - ఈ రెండు పాఠ్యంతరములు కువలయాశ్వునికి వర్తించి ఉన్నాయి దుందు కాష్ఠదీపిక, చక్రారారపు దివిటీ, సూర్యారాయాంద్ర నిఘంటువు (ధుంధువు అని పాఠ్యంతరం, ధుంధుమారము అంటే ఆరుద్ర పురుగు అని నిఘంటువు) :-
[9-164-క.]

2231} దుఃఖభంజనుడు  - దుఃఖములను భంజన (నాశము చేయువాడు), విష్ణువు :-
[6-342-ఆ.]

2232} దుఃఖవారణుడు  - దుఃఖములను నివారించెడివాడు, విష్ణువు :-
[6-529-త.]

2233} దుగ్దార్ణవము  - దుగ్ద (పాల) అర్ణవము (నీటికిస్థానమైనది, సముద్రము), పాలసముద్రము :-
[12-48-వ.]

2234} దుగ్ధజలధిజాతశుండాలము  - దుగ్ధజలధిన్ (పాలసముద్రమునందు) జాత (పుట్టిన) శుండాలము (ఏనుగు), ఐరావతము :-
[7-285-వ.]

2235} దురంతము  - అంతమును చూచుటకు కష్టమైనది :-
[2-202-చ.]

2236} దురదుర  - వేగవంతమైన గమనము యొక్క ధ్వన్యనుకరణము :-
[10.2-161-క.]

2237} దురన్తుడు  - దురితములను అంతముచేయువాడు, విష్ణువు :-
[4-702.1-తే.]

2238} దురన్వయక్రమణుడు  - అన్వయ (ఘటింప) రాని (శక్యముగాని) క్రమణుడు (ప్రవర్తన గలవాడు), విష్ణువు :-
[7-148-శా.]

2239} దురితతారణుడు  - పాపములనుండి తరింపజేయువాడు, విష్ణువు :-
[6-529-త.]

2240} దురితధ్వాంతపతంగుడు  - దురిత (పాపములు అనెడి) ధ్వాంత (చీకటికి) పతంగుడు (సూర్యుని వంటివాడు), రాముడు :-
[4-975-క.]

2241} దురితపయోనిధితరుడు  - దురితములు (పాపములు) అను పయోనిధి (సముద్రము)ని తరుడు (దాటించువాడు), విష్ణువు :-
[3-647-క.]

2242} దురితవిదూరుడు  - దురితముల (పాపములు) విదూరుడు (పోగొట్టువాడు), విష్ణువు :-
[3-748-క., 3-861-క.]

2243} దురితార్ణవతారణుడు  - దురితములు (పాపములు) అను ఆర్ణవము (సముద్రము) తారణుడు (దాటించువాడు), బ్రహ్మదేవుడు :-
[3-499-చ.]

2244} దురుక్తి  - నింద, చెడుగా పలుకుట :-
[4-215-వ.]

2245} దుర్గ  - కాశీక్షేత్రమున దుర్గ (వనాది దుర్గమ స్థావరములు కలది, ఎరుగుటకు చాలా కష్టమై నామె) :-
[10.1-61-వ.]

2246} దుర్గము  - దాటరానిది, వెళ్ళరానిది, కోట :-
[10.2-157-మ.]

2247} దుర్దాంతము - దుర్దాంతతరము దుర్దాంతతమము :-
[6-183-క.]

2248} దుర్భరభవవిదూరుడు  - దుర్ (చెడ్డ) భవ (జన్మము) భవ (కలుగుటను) విదూర (మిక్కిలి దూరము చేయువాడు), కృష్ణుడు. :-
[10.2-257.1-తే.]

2249} దుర్భవభయవిదూరడు  - భయంకరమైన భవము (సంసారము) వలని భయమును పూర్తిగా దూరము చేయువాడ, విష్ణువు. :-
[3-304.1-తే.]

2250} దుర్మద  - దుర్ (చెడ్డది) మద (మదము) కలది :-
[4-768-వ.]

2251} దుర్మదాసురమారణుడు  - దుర్మద (అదికమైన గర్వముగల) అసురులను మారణుడు (సంహరించెడివాడు), విష్ణువు :-
[6-529-త.]

2252} దుర్లభుడు  - పొందరాని వాడు, విష్ణువు :-
[10.1-1497-మ.]

2253} దుర్వారబలుడు  - వారింపశక్యముకాని బలము కలవాడు, శివుడు :-
[4-138.1-తే.]

2254} దుర్వాసుడు  - ఒకముని, అత్రి అనసూయలకు రుద్రుని అంశమున పుట్టిన కొడుకు. ఇతని సోదరులు సోముడు, దత్తాత్రేయుడు. ఇతడు మహాకోపిష్ఠుడు. ఇతని శాపకథలు అనేకములు కలవు. :-
[8-148-క.]

2255} దుశ్శాసనుడు  - దుర్యోధనుని తమ్ముడు, దుః (అతిగా, చెడుగా) శాసన (ఆజ్ఞాపించుట) చేయువాడు :-
[3-34-క., 9-230-వ.]

2256} దుష్కృతము  - దుః (పాపపు) కృతము (పని), అపరాథము :-
[4-397-క.]

2257} దుష్కృతహరుడు  - దుష్కృతములు (పాపములు) హరించువాడు (పోగొట్టువాడ), శ్రీకృష్ణ :-
[5.1-182-క.]

2258} దుష్టమదాసురేంద్రనాశంకరుడు  - దుష్ట (చెడ్డ) మదా (మదముగల) అసురేంద్ర (రాక్షసరాజులను) నాశనము చేయువాడు, శివుడు :-
[10.2-315-ఉ.]

2259} దుష్టమదాసురేంద్రసంహరణుడు  - దుష్ట (చెడ్డ) మదా (మదముగల) అసురేంద్ర (రాక్షసరాజులను) సంహరణుడు (చంపువాడు), శ్రీరాముడు :-
[10.2-1340-చ.]

2260} దుష్టలోకసంహరుడు  - దుష్టులు లోక (సర్వులను) సంహరుడు (సంహరించెడి వాడు), విష్ణువు :-
[6-173-చ.]

2261} దుష్టవినాశుడు  - చెడును (పాపులను) నాశనము చేయువాడు, విష్ణువు :-
[4-703.1-తే.]

2262} దుష్టవిమర్దనుడు  - దుష్టుల (చెడ్డవారి)ని విమర్దనుడు (శిక్షించువాడు), విష్ణువు :-
[3-627-చ.]

2263} దుష్టశిక్షకుడు  - దుష్టులను శిక్షించువాడును, శంకరుడు :-
[3-473-వ.]

2264} దుష్టానీకవిదళనాకుంఠుడు  - దుష్ట (రాక్షసుల) అనీక (సైన్యమును) విదళన (చీల్చివేయుటయందు) అకుంఠుడు (అనర్గళుడు), శివుడు :-
[7-393-క.]

2265} దుస్తరము - దుస్తరతరము దుస్తరతమము :-
[10.1-1144-చ.]

2266} దూడ  - ఆవు/గేదె పిల్ల, పెయ్య, లేగ, లేగదూడ :-
[1-341-క.]

2267} దృఢచ్యుతుడు  - దృఢ అచ్యుతుడు, జారనట్టి దీక్షకలవాడు, సత్యలోకాది భోగములనుండి చ్యుతుడు (జారినవాడు), ఐహికాముష్మిక భోగముల ఎడ విరాగము కలవాడు :-
[4-831-క.]

2268} దేవ  - దివికి సంబంధించిన వాడు, స్వయం ప్రకాశకుడు, స్వతంత్రుడు, భగవంతుడు, దేవుడు, విష్ణువు, శివుడు :-
[3-152-చ., 4-159-క., 4-704-తే., 8-503.1-తే., 10.2-530-క.]

2269} దేవఋణము  - వేదోక్త కర్మలనాచరించుట ద్వారా తీర్చుకొనునది, దేవ, పితృ, మనుష్య ఋణములను ఋణత్రయముల లోనిది :-
[6-252-వ.]

2270} దేవకిరీటరత్నరుచిదీపితపాదసరోజుఁడు  - దేవతల కిరీటముల కాంతులచే ప్రకాశిస్తున్న పాదములు అనెడి పద్మములు కలవాడు, విష్ణువు :-
[4-263-ఉ.]

2271} దేవకీదేవి - శ్రీకృష్ణుని కన్నతల్లి. :-
[10.1-106.1-తే.]

2272} దేవకీనందనుడు  - దేవకీదేవి పుత్రుడు, కృష్ణుడు :-
[1-188-వ.]

2273} దేవకీసుతుడు  - దేవకీదేవి పుత్రుడు, కృష్ణుడు :-
[10.1-1692.1-ఆ.]

2274} దేవకుల్య  - 1.దేవనది, గంగానది 2. మరీచి కళల కుమార్తె పూర్ణిమ జన్మాంతరంలో విష్ణుపాదనది ఐన గంగ అయి పుట్టింది. గంగ కూతురు దేవకుల్య, కుమారుడు విరజుడు. :-
[4-7.1-తే.]

2275} దేవచక్రవర్తి  - దేవతలకి చక్రవర్తి, విష్ణువు. :-
[3-311.1-తే.]

2276} దేవచూడామణి  - దేవుళ్ళలో శిరోమణి (అత్యుత్తముడు), విష్ణువు. :-
[3-301-మ.]

2277} దేవజ్యేష్ఠుడు  - దేవతలలో పెద్దవాడు, బ్రహ్మ :-
[9-108-శా.]

2278} దేవతాగ్రేసరుడు  - దేవతలలో గొప్పవాడు, విష్ణువు :-
[3-590-ఉ.]

2279} దేవతాచక్రవర్తి  - దేవతలకు చక్రవర్తి, విష్ణువు :-
[3-203-దం.]

2280} దేవతానగరి  - దేవతల రాజధాని, అమరావతి :-
[8-100-మ.]

2281} దేవతానీకగోబ్రాహ్మణార్తిహరణుడు  - దేవత దేవతల, అనీక సేనలకును, బ్రాహ్మణ బ్రాహ్మణులకును, గోగణ గోవులమందకును, ఆర్తి బాధలను, హరణా హరించువాడు, కృష్ణుడు :-
[1-201-శా.]

2282} దేవతానోకహంబు  - దేవతా అనోకహంబు, దేవతావృక్షము :-
[2-155.1-తే.]

2283} దేవతాపతి  - దేవతల యొక్క పతి (ప్రభువు), ఇంద్రుడు :-
[6-270.1-తే.]

2284} దేవతావిభవదాత  - దేవత (దేవతల యొక్క) విభవ (వైభవములను) దాత (సమకూర్చెడి వాడు), బ్రహ్మ :-
[6-278-ఉ.]

2285} దేవతాహ్లాదగరిష్ఠుడు  - దేవతా (దేవతలకు) ఆహ్లాద (సంతోషమును కలిగించువారిలో) గరిష్ఠుడు (శ్రేష్ఠుడు), విఘ్నేశ్వరుడు :-
[6-4-ఉ.]

2286} దేవదేవుడు  - దేవుళ్ళకు దేవుడు, విష్ణువు. బ్రహ్మదేవుడు, శివుడు :-
[3-94.1-తే., 3-203-దం., 3-219-తే., 3-500-ఉ., 3-574-మ., 3-861-క., 3-897.1-తే., 4-276-చ., 4-373-ఆ., 4-918.1-తే., 6-131-ఆ., 6-330-తే., 7-75-క., 7-169.1-తే., 7-381.1-తే., 8-547-ఆ., 8-659.1-తే., 9-73.1-తే., 10.2-201-వ., 10.2-1014-క., 10.2-1032-ఆ.]

2287} దేవద్వేషి  - దేవతల యెడ ద్వేషముగల వాడు, హిరణ్యకశిపుడు, రాక్షసుడు :-
[7-102-శా., 8-178-క.]

2288} దేవధాని  - దేవతల యొక్క ధాని (ఆశ్రయము), అమరావతి :-
[8-458-వ.]

2289} దేవనదీతనయుడు  - గంగదేవి పుత్రుడు, భీష్ముడు :-
[1-205-క.]

2290} దేవనాయకుడు  - దేవతలకు నాయకుడు, ఇంద్రుడు :-
[6-436.1-ఆ.]

2291} దేవపతినందనుడు  - ఇంద్రుని పుత్రుడు, అర్జునుడు :-
[10.2-743-క.]

2292} దేవపుంగవుడు  - దేవ (దేవతలలో) పుంగవుడు (శ్రేష్ఠుడు), ఇంద్రుడు :-
[6-270.1-తే.]

2293} దేవమంత్రి  - దేవతలకు మంత్రి, బృహస్పతి :-
[3-46-చ.]

2294} దేవమయుడు  - సమస్త దేవతలు తానైనవాడు, విష్ణువు :-
[10.1-52.1-ఆ.]

2295} దేవయాన, పాలపుంత  - అంతరిక్షమున ప్రకాశవంతమైన దారివలె నుండు తారల వరుస :-
[5.2-97-వ.]

2296} దేవలోకోపకారుడు  - దేవలోక (దేవత లందరికి) ఉపకారుడు (ఉపకారము చేయువాడు), శ్రీరాముడు :-
[8-744-మాలి.]

2297} దేవవంద్యుడు  - దేవతలచే వంద్యుడు (స్తుతింపబడువాడు), శివుడు, విష్ణువు :-
[8-222.1-ఆ., 8-659.1-తే.]

2298} దేవవిభుడు  - దేవతలకు విభుడు (ప్రభువు), ఇంద్రుడు :-
[3-62-మ., 6-269-ఉ.]

2299} దేవవిభునిసుతుడు  - దేవవిభుని (ఇంద్రుని) సుతుడు (పుత్రుడు), అర్జునుడు :-
[10.2-1165.1-తే.]

2300} దేవశరణ్యుడు  - దేవ (దేవతలకు) శరణ్యుడు (కాపుదల యైనవాడు), విష్ణువు :-
[7-459-ఉ.]

2301} దేవసత్రము  - దేవ (దివ్యమైన) సత్రము (యాగము) :-
[7-472-వ.]

2302} దేవహూ  - దేవతలను పిలుచుట, ఎడమ చెవికి సంకేతంగా పురంజయోపాఖ్యానంలో వాడబడింది :-
[4-768-వ.]

2303} దేవహూతి  - దేవుని హూతి (పిలుపు), ప్రియవ్రతుని కూఁతురు. కర్దమ ప్రజాపతి భార్య. కపిలుని తల్లి. ఈమె తన పుత్రునివలన భక్తియోగమునుఎఱిఁగి తత్వజ్ఞానము పడసెను. :-
[8-7-వ.]

2304} దేవాదిదేవుడు  - దేవుళ్ళకే ఆది దేవుడు, పరమ శివుడు, విష్ణువు :-
[3-203-దం., 3-465-క.]

2305} దేవాదులు  - కర్మమములు గుణములును అనుసరించి కలుగు ఉన్నత అధమ ధారణములు ఐన శరీరములు కలవారు :-
[2-222-వ.]

2306} దేవాధిదేవుడు  - దేవతలకే అధిదేవత, విష్ణువు :-
[4-191.1-తే.]

2307} దేవాధీశుడు  - దేవతలకు ప్రభువు, విష్ణువు :-
[4-201-మ.]

2308} దేవాధీశ్వరుడు  - దేవ (దేవత లందరికి) అధీశ్వరుడు (అధిపతి), బ్రహ్మదేవుడు :-
[6-198-క.]

2309} దేవారాతి  - దేవతలకు ఆరాతి (శత్రువు), రాక్షసుడు :-
[3-658-మ., 3-671-మ.]

2310} దేవారి  - దేవతలకు అరి, రాక్షసుడు :-
[10.2-952-స్రగ్ద.]

2311} దేవాహితుడు  - దేవతలకు అహితుడు (శత్రువు), హిరణ్యకశిపుడు, , రాక్షసులు :-
[7-256-శా., 7-396-క.]

2312} దేవుడు  - దివయంతి దేవా, స్వయంప్రకాశుడు, వ్యు. దీవ్యతి ఇతి దేవః, భూత భవిష్యద్వర్తమాన కాలములందు వెలుగుచుండువాడు, విష్ణువు, శివుడు, దేవతలు :-
[3-467.1-తే., 3-545-చ., 3-546.1-తే., 10.1-568-వ., 10.1-569-శా., 10.1-580-వ., 10.1-944-మ., 10.2-67-వ., 10.2-260-ఆ., 10.2-1204.1-తే., 10.2-1214.1-తే.]

2313} దేవేంద్రునిపురము  - ఇంద్రుని యొక్క పట్టణము, స్వర్గమునకు ముఖ్యపట్టణము, అమరావతి :-
[10.2-214-వ.]

2314} దేవేశుడు  - దేవతలలో శ్రేష్ఠుడు, కృష్ణుడు, విష్ణువు :-
[1-179-మ., 10.2-50-మ.]

2315} దేవేశ్వరుడు  - దేవతలకు దేవుడు,విష్ణువు :-
[9-115-శా.]

2316} దేవోత్తముడు  - దేవతలలో ఉత్తముడు, విష్ణువు. :-
[3-431-మ., 3-849-వ., 9-342.1-తే.]

2317} దేశము  - 1దేశీయ 2లాట 3ఆంధ్ర 4కోసలోత్తర 5పాటల 6మహారాష్ట్ర 7వంగ 8గౌళ 9కామరూప 10ఉత్కళ ఆది జన్మస్థానప్రత్యేకతలు :-
[10.1-1495-ఉ.]

2318} దేహంబుబాసిపోవు  - శరీరమును విడిచిపోవుట, మరణించుట :-
[5.1-123-క.]

2319} దేహత్రయము  - 1స్థూలశరీరము 2సూక్ష్మశరీరము 3కారణశరీరములు :-
[10.2-1203-వ.]

2320} దేహధారి  - శరీరము ధరించినవాడు, పురుషుడు, జీవుడు :-
[9-213.1-తే., 10.1-1761-వ., 10.1-1779-వ.]

2321} దేహము  - వ్యు. దహయింతి ఇతి దేహ, నశించేదె దేహము :-
[10.2-721-క.]

2322} దేహములు  - స్థూల సూక్ష్మ కారణ దేహములు :-
[10.1-1779-వ.]

2323} దేహాంతరగతుడు  - మరియొక దేహమునకు పోవువాడు, మరణించిన వాడు :-
[4-825.1-తే.]

2324} దేహాంతరోత్పత్తి  - దేహము (శరీరము) అంతర (మరియొక దానిలో) ఉత్పత్తి(పుట్టుట), పునర్జన్మ :-
[6-476-వ.]

2325} దేహాభిమానులు  - దేహమే తానను అభిమానము కలవారు :-
[10.1-1779-వ.]

2326} దేహి  - దేహము (శరీరమును) ధరించినవాడు, జీవుడు :-
[1-326-వ., 2-88-మ., 4-858.1-తే., 5.1-69-వ., 7-46-ఉ., 10.1-887-వ.]

2327} దైతేయధ్వంసి  - రాక్షసులను నాశము చేయువాడు, విష్ణువు :-
[10.2-408-శా.]

2328} దైతేయవంశాగ్రణి  - దైతేయ (దితిజులైన రాక్షస) వంశమునకు అగ్రణి (గొప్పవాడు), హిరణ్యకశిపుడు. :-
[7-251-శా.]

2329} దైత్యకులముఖ్యుడు  - దైత్య (రాక్షస) కుల (వంశమునకు) ముఖ్యుడు, హిరణ్యకశిపుడు :-
[7-137-ఉ.]

2330} దైత్యకులశాసనుడు  - దైత్య (రాక్షస) కుల (వంశమునకు) శాసనుడు (శిక్షించువాడు), హరి :-
[3-704-చ.]

2331} దైత్యజలనిధిచంద్రడు  - దైత్య (రాక్షస) కుల మనెడి జలనిధి (సముద్రమునకు) చంద్రుడు (చంద్రుని వంటివాడు), హిరణ్యకశిపుడు :-
[7-177-క.]

2332} దైత్యతనయుడు  - దైత్య (రాక్షసుడైన హిరణ్యకశిపుని) పుత్రుడు, ప్రహ్లాదుడు :-
[7-117.1-ఆ.]

2333} దైత్యదానవరాజమహాగహనదహనుడు  - దైత్యల యొక్క, దానవుల యొక్క రాజులు అనే గొప్ప అడవిని దహించినవాడు, శ్రీరాముడు :-
[8-743-క.]

2334} దైత్యధ్వంసి  - రాక్షసులను సంహరించువాడు, విష్ణువు :-
[10.2-198-మ.]

2335} దైత్యపతి  - రాక్షసరాజు, రావణాసురుడు :-
[9-360-చ.]

2336} దైత్యభంజనుడు  - రాక్షసులను సంహరించువాడు, విష్ణువు :-
[11-95.1-తే.]

2337} దైత్యభేదనుడు  - రాక్షసులను సంహరించిన వాడు, కృష్ణుడు :-
[3-42-చ.]

2338} దైత్యభేది  - రాక్షసులను సంహరించువాడు, విష్ణువు :-
[3-86-క.]

2339} దైత్యవరేణ్యుడు  - దైత్య (రాక్షసులలో) వరేణ్యుడు (శ్రేష్ఠుడు), హిరణ్యకశిపుడు :-
[7-158-ఉ.]

2340} దైత్యవల్లభుడు  - దైత్యుల (రాక్షసుల) కు వల్లభుడు (ప్రభువు), హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు :-
[3-703-మ., 7-178-వ.]

2341} దైత్యవిభేది  - రాక్షసుల శత్రువు, విష్ణువు :-
[10.2-432-చ.]

2342} దైత్యవీరుడు  - దైత్యుల (రాక్షసుల)లో వీరుడు, హిరణ్యాక్షుడు :-
[3-701-క.]

2343} దైత్యానుజ  - దైత్యుడు (రావణాసురుడు) యొక్క అనుజ (సోదరి), శూర్పణఖ :-
[10.1-1463-శా.]

2344} దైత్యారి  - దైత్యులు (రాక్షసుల)కు అరి (శత్రువు), విష్ణువు, కృష్ణుడు :-
[1-184-మ., 3-72-మ., 3-335-ఉ., 3-1016-మ.]

2345} దైత్యుడు  - దితి కశ్యపుల పుత్రుడు, రాక్షసుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, . . . :-
[3-418-వ., 3-647-క., 3-657-చ., 3-665-మ., 3-671-మ., 3-697-వ., 3-698-క., 4-75-మ., 4-330-క., 5.2-42.1-తే., 5.2-108-తే., 5.2-119-వ., 6-277-క., 7-3.1-ఆ., 7-29-వ., 8-175.1-ఆ., 8-668-క., 10.1-52.1-ఆ., 10.1-123.1-ఆ., 10.2-155-ఉ., 12-48-వ.]

2346} దైత్యేభ్యుడు  - దైత్య (రాక్షసు)లను ఇభ్యుడు (పాలించువాడు), హిరణ్యకశిపుడు :-
[7-129-శా.]

2347} దైత్యేశ్వరుడు  - దైత్య (రాక్షసుల)కు ఈశ్వరుండు (ప్రభువు), హిరణ్యకశిపుడు :-
[7-86-వ.]

2348} దైవచూడామణీ  - దైవములలో శిరోమణి వంటివాడు, విష్ణువు. :-
[4-181-మ.]

2349} దైవజ్ఞులు  - దివి (గ్రహనక్షత్రములను) అధ్యయనము చేసి శుభాశుభమును చెప్పువారు, జ్యోతిష్కులు :-
[1-428-వ.]

2350} దైవతము  - దేవసంబంధి, దేవుడు :-
[10.1-887-వ.]

2351} దైవమండలము  - చేతులను ఆకాశముకేసి చాచి నటించుట, రాసక్రీడ లోని పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

2352} దైవమాయ  - దైవ ప్రేరణ వలన భగవంతునితో అనుబంధము నందు అభాస, అవిద్య :-
[10.1-1779-వ.]

2353} దైవము - దైవతరము దైవతమము :-
[7-454-ఆ., 10.1-462-క.]

2354} దైవోపహతులు  - దైవముచే దెబ్బతిన్నవారు, నష్టజాతకులు :-
[3-181-వ.]

2355} దోష  - రాత్రి, దోషవర్తనకు అనుకూలమైన కాలం :-
[4-390-వ.]

2356} దోషాకరుడు  - దోషవర్తనకు అనుకూలమైన రాత్రిని (దోష) కలిగించువాడు, చంద్రుడు :-
[10.1-1297-ఉ.]

2357} దోషాచరుడు  - దోష (రాత్రులందు, పాపములందు) చరుడు (తిరుగువాడు), రాక్షసుడు :-
[7-269-వ., 10.1-1174-ఉ.]

2358} దోసిలి  - పాత్రవలె వంపబడి చేర్ఛిన అరచేతుల జంట, దోయిలి :-
[8-695-వ.]

2359} దౌర్భాగ్యవశత  - దుర్భగత్వమున వశ మగుట, మర్మావయవములు చెడిపోవుట :-
[4-812.1-తే.]

2360} దౌష్యంతి  - దుష్యంతుని పుత్రుడు, భరతుడు :-
[9-635-వ.]

2361} ద్యుమత్సఖుడు  - ద్యుమత్ (వెలుగు) అనెడి సఖుడు (స్నేహితుడు), పురంజయోపాఖ్యానంలోని పాత్ర :-
[4-768-వ.]

2362} ద్రవిడాధినాథులైననేడ్వురువీర్యునికొడుకులు  - శ్రవణము కీర్తనము మొదలైన ఏడువిధములైన భక్తిమార్గములు :-
[4-830.1-తే.]

2363} ద్రవిణము  - బంగారము, [దృ+ఇనన్, ద్రవతి గచ్ఛతి ద్రూయతే ప్రాప్యతే వా] పోవునది; పొందబడునది. ధనము. :-
[4-640-వ.]

2364} ద్రుపదరాజనందన  - ద్రౌపది, ద్రుపదరాకుమారి :-
[1-530-గ.]

2365} ద్రుపదాత్మజ  - ద్రుపదమహారాజు ఆత్మజ (పుత్రిక), ద్రౌపది :-
[10.2-783-క.]

2366} ద్రుపదునిసుత  - దృపద మహారాజు పుత్రిక, ద్రౌపది :-
[1-159-క.]

2367} ద్రుహిణతనూభవుడు  - ద్రుహిణ (బ్రహ్మదేవుని) యొక్క కొడుకు, భృగువు :-
[10.2-1271-చ.]

2368} ద్రోణజుడు  - ద్రోణాచార్యుని కుమారుడు, అశ్వత్థామ :-
[1-151-శా.]

2369} ద్రోణతనయుడు  - ద్రోణాచార్యుని కుమారుడు, అశ్వత్థామ :-
[1-185-మ., 1-186-వ.]

2370} ద్రోణనందనుడు  - ద్రోణాచార్యుని కుమారుడు, అశ్వత్థామ :-
[1-147-వ., 1-183-వ., 1-189.1-తే.]

2371} ద్రోణునినందనుడు  - ద్రోణాచార్యుని కుమారుడు, అశ్వత్థామ :-
[1-184-మ.]

2372} ద్రౌపది  - ద్రుపద రాజు కూతురు, పాంచాలి, పాండవుల భార్య :-
[1-168-వ., 3-15-తే., 10.2-1081-తే.]

2373} ద్వాదశరాశులు  - 1మేషము (మేక) 2వృషభము (ఎద్దు) 3మిథునము (దంపతులు 4కర్కాటకము (పీత) 5సింహము 6కన్య (పడచు) 7తుల (త్రాసు) 8వృశ్చికము (తేలు) 9ధనుస్సు (విల్లు) 10మకరము (మొసలి) 11కుంభము (కుండ) 12మీనము (చేప) :-
[5.2-86-వ., 8-114-క.]

2374} ద్వాదశాక్షరవిద్య  - ఓంనమోభగవతేవాసుదేవాయ అనెడి 12 అక్షరములుగల మంత్ర అనుష్టానము :-
[6-299-వ.]

2375} ద్వాదశాదిత్యులు  - 1వివస్వతుడు 2అర్యముడు 3పూషుడు 4త్వష్ట 5సవిత 6భగుడు 7ధాత 8విధాత 9వరుణుడు 10మిత్రుడు 11శుక్రుడు 12ఉరుక్రముడు అనెడు పన్నెడుమంది అదితి పుత్రులు, పాఠ్యంతరం 1ఇంద్రుడు 2ధాత 3పర్జన్యుడు 4త్వష్ట 5పూషుడు 6అర్యముడు 7భగుడు 8వివస్వంతుడు 9విష్ణువు 10అంశుమంతుడు 11వరుణుడు 12మిత్రుడు :-
[6-258-వ., 9-9-వ., 11-105-వ., 12-48-వ.]

2376} ద్వాదశావయవములు  - 1నుదురు 2మెడ 3రొమ్ము 4బొడ్డు 5 6మూపులు 7 8మోచేతులకీళ్ళు 9 10మణికట్టులు 11 12మోకాళ్ళు :-
[10.1-235-శా.]

2377} ద్వాదశాహము  - ద్వాదశ (పన్నెండు) అహములు (పగళ్ళు) చేయు ఒక విధమైన యాగము :-
[3-426-వ.]

2378} ద్వాదశీవ్రతము  - ప్రతి ఏకాదశినాడు ఉపవాసముండి కార్తీక శుక్ల ద్వాదశిగడియలలో పారణము ఉద్వాసన చేసెడి వ్రతము :-
[9-90-క.]

2379} ద్వాపరలో  - నాలుగింట రెండు వంతులు (2, 4) ధర్మము ఉండును :-
[3-350-వ.]

2380} ద్విగుణితము  - రెండుచేత గుణింపబడినది, రెట్టింపు, రెండు :-
[5.2-61-క.]

2381} ద్విజరాజు  - బ్రాహ్మణులకు ప్రభువు, చంద్రుడు :-
[10.1-1408-క.]

2382} ద్విజిహ్వుడు  - రెండు నాలుకల వాడు, పురుష సర్పము, రెండు రకముల మాట్లాడు వాడు, మోసగాడు :-
[2-179-చ.]

2383} ద్విజుడు  - పుట్టుక ఉపనయనము అనెడి ద్వి (రెండు) జుడు (జన్మములు గలవాడు), బ్రాహ్మణుడు :-
[1-356-క., 4-51.1-తే., 4-592-వ., 7-409-వ., 7-425-వ., 10.1-1408-క., 10.1-1408-క., 10.1-1506-మ.]

2384} ద్విపము  - తొండము నోరు రెంటితోను పానము చేయునది, , రెంట త్రావుడు, రెండు రకముల తాగునది ఏనుగు :-
[2-190-చ., 10.1-1155-శా.]

2385} ద్విపరార్థ  - రెండుపదార్థముల ప్రమాణముగలది, భూత భవిష్య లక్షణముగలది, కాలము :-
[9-110-మ.]

2386} ద్విపాత్పశువులు  - ద్వి (రెండు) పాత్ (కాళ్ళ) పశువులు (జంతువులు), పశుప్రాయులు :-
[5.1-127-వ.]

2387} ద్విపాదులు  - రెండు పాదములు కలవి, మానవులు పక్షులు :-
[4-853-వ., 11-91-వ.]

2388} ద్విరేఫము  - (తన పేరైన భ్రమరమునందు) రెండు రేఫలు (రకారలు) కలది, రేఫ (రకారము) వంటి రెక్కలు రెండు కలది, తుమ్మెద :-
[3-223-మ., 10.1-1734-మ.]

2389} ద్వీపము  - సప్తద్వీపములలోనిది :-
[10.1-702-వ.]

2390} ద్వైతభ్రమ  - రెండు ఉన్నట్లు అనిపించు భ్రాంతి :-
[1-381-వ.]

2391} ద్వైపాయనసఖుడు  - వేదవ్యాసుడు మైత్రేయుడు సాందీపని యీ ముగ్గురును పరాశరమహర్షి శిష్యులు, బాల్యసఖులు :-
[3-147-వ.]

2392} ధనంజయుడు  - ధనమును (అశ్వమేధ యజ్ఞమునకు వలసిన ధనమును) జయించినవాడు, అర్జునుడు :-
[1-371-క., 3-61-చ.]

2393} ధనదుడు  - ధనము నిచ్చువాడు, దాత, కుబేరుడు :-
[1-39-వ., 4-364-తే., 8-114-క.]

2394} ధనదువీడు  - ధనదుడు (ధనమును ఇచ్చు వాడు, కుబేరుని) వీడు (పట్టణమ), అలకాపురి :-
[10.1-1593-ఆ.]

2395} ధనాధిపుడు  - ధనమునకు అధికారి కుబేరుడు :-
[2-189-మ.]

2396} ధనురాచార్యుడు  - కౌరవపాండవులకు ధనుర్విద్య బోధించిన ఆచార్యుడు, ద్రోణుడు :-
[10.2-573-వ.]

2397} ధనుర్ధరుడు  - ధనుస్సును ధరించినవాడు, విలుకాడు :-
[4-325-చ.]

2398} ధనుర్విద్య  - ధనుః (విల్లు) కు సంబంధించిన విద్య, విలువిద్య :-
[3-388-వ.]

2399} ధన్యుడు  - ధన్యమైన (సార్థకమైన) తత్త్వము కలవాడు, విష్ణువు :-
[3-293.1-తే.]

2400} ధన్యులు - ధన్యతరులు ధన్యతములు :-
[6-497.1-తే.]

2401} ధన్వి  - ధనుస్సు ధరించు వాడు, అర్జునుడు :-
[1-212-ఉ.]

2402} ధరణిదివిజులు  - ధరణి (భూమి)కి దివిజులు (దేవతల), బ్రాహ్మణులు :-
[4-587.1-తే.]

2403} ధరణిదుహితృరంతుడు  - ధరణీ (భూదేవి) దుహితృ (కుమార్తె) యైన సీతతో రంతుడు (క్రీడించువాడు), రాముడు :-
[7-481-మాలి., 11-126-మాలి.]

2404} ధరణిధవుడు  - ధరణి (భూమి)కి ధవుడు (భర్త), రాజు :-
[4-750-క.]

2405} ధరణిధారణుడు  - ధరణిన్ (భూమిని) ధారణుడు (ధరించినవాడు), విష్ణువు :-
[6-529-త.]

2406} ధరణిపుడు  - ధరణిని ఏలెడివాడు, రాజు :-
[3-124-చ., 9-336-క.]

2407} ధరణివరలలాముడు  - ధరణివర (రాజులలో) లలాముడు (శ్రేష్ఠుడు), శ్రీరాముడు :-
[10.2-1342-మాలి.]

2408} ధరణివిభుడు  - ధరణి (భూమి)కి విభుడు, రాజు :-
[4-392.1-తే., 4-544.1-తే.]

2409} ధరణిసురుడు  - ధరణి (భూమిమీది) సురుడు (దేవత), బ్రాహ్మణుడు :-
[1-209-ఆ., 9-137-ఆ.]

2410} ధరణీకాంతుండు  - భూమికిభర్త రాజు, పరీక్షిత్తు :-
[1-458-వ.]

2411} ధరణీతనూజుడు  - ధరణీ (భూమికి) తనూజుడు (పుత్రుడు), అంగారకుడు :-
[5.2-89.1-ఆ.]

2412} ధరణీదివిజుడు  - భూమికి దేవుడు, బ్రాహ్మణుడు :-
[3-216-క.]

2413} ధరణీదేవుడు  - ధరణీ (భూమికి) దేవుడు, విప్రుడు :-
[1-72-మ., 7-461-మ.]

2414} ధరణీధరములు  - భూమిని మోయునవి, పర్వతములు :-
[10.1-1558-వ.]

2415} ధరణీధరుడు  - ధరణి (భూమిని, మందర పర్వతమును) ధరుడు (మోయువాడు), కృష్ణుడు :-
[5.2-165-చ.]

2416} ధరణీధవుడు - ధరణి (భూమికి) ధవుడు (భర్త), రాజు :-
[4-494-క.]

2417} ధరణీధవుడు  - ధరణి (భూమికి) ధవుడు (భర్త), రాజు :-
[4-503-క.]

2418} ధరణీనాథుడు  - ధరణి (భూమి)కి నాథుడు, రాజు. :-
[4-469-క., 5.1-94-క., 7-117.1-ఆ., 9-716-క., 9-724-ఆ.]

2419} ధరణీనాయక  - భూమికి నాయకుడు, రాజు :-
[3-24-మ.]

2420} ధరణీపతి  - రాజ్యమునకు ప్రభువు, రాజు. :-
[10.1-1376-క.]

2421} ధరణీరుహంబులు  - ధరణి (భూమి)నుండి పుట్టినవి, చెట్లు :-
[4-943.1-తే.]

2422} ధరణీవల్లభుడు  - ధరణీ (భూమికి) వల్లభుడు (భర్త), రాజు :-
[5.1-6-క., 5.1-15-మ., 5.1-85-మ., 5.2-5-క.]

2423} ధరణీవిభుడు  - రాజ్యమునకు ప్రభువు, రాజు :-
[10.1-1518-ఉ.]

2424} ధరణీశుడు  - ధరణి (భూమి)కి ఈశుడు, రాజు :-
[4-427-క., 4-617.1-తే., 7-10-ఆ., 10.1-1786-క.]

2425} ధరణీశోత్తముడు  - భూమినేలు వారిలో శ్రేష్ఠుడు, మహారాజా :-
[2-24-మ.]

2426} ధరణీశ్వరుడు  - ధరణి (భూమికి) ప్రభువు, రాజు :-
[9-166.1-ఆ., 9-346.1-ఆ., 10.1-1645-క.]

2427} ధరణీసురుడు  - భూమికి దేవతలు బ్రాహ్మణుడు :-
[1-186-వ., 2-94.1-తే., 3-558-క., 8-606-వ.]

2428} ధరణీసురోత్తముడు  - భూమికి దేవ శ్రేష్ఠుడు, బ్రాహ్మణోత్తముడు :-
[3-563-చ.]

2429} ధరాచక్రప్రదక్షిణశాలి  - భూమిచుట్టునుతిరుగువాడు, దేహసంబంధిలన్నిటిని చుట్టబెట్టుట చేయువాడు :-
[4-460.1-తే.]

2430} ధరాజము  - ధర (నేల)ను జము (పుట్టినది), చెట్టు :-
[10.1-229-క.]

2431} ధరాదివిజుడు  - ధర (భూమి)కి దివిజుడు (దేవుడు), బ్రహ్మణుడు :-
[3-351-క., 3-562-ఉ.]

2432} ధరాదేవత  - భూమిపైని దేవత, విప్రుడు :-
[3-570-ఉ.]

2433} ధరాదేవుడు  - భూమిపైని దేవుడు, విప్రుడు :-
[10.2-1025.1-తే.]

2434} ధరాధినాథుడు  - ధర (భూమిక్) అధినాథుడు (పైఅధికారి), రాజు :-
[7-454-ఆ.]

2435} ధరాధిపుడు  - భూమికి ప్రభువు, రాజు :-
[3-11-చ., 3-130-వ., 10.2-819-చ.]

2436} ధరాభృల్లలాముడు  - ధరాభృత్ (రాజులలో) లలాముడు (శ్రేష్ఠమైనవాడు), రాముడు :-
[8-1-క.]

2437} ధరామరుడు  - భూమిపైని అమరుడు (దేవుడు), విప్రుడు :-
[3-253-క., 7-415-ఉ., 10.1-170-ఉ., 11-103-వ.]

2438} ధరావరులు  - ధర (భూమి)కి వరులు, రాజులు :-
[4-563-క.]

2439} ధరాసుతుడు  - ధరా (భూదేవి యొక్క) సుతుడు (కొడుకు), నరకుడు :-
[10.2-168-మ.]

2440} ధరాసుపర్వుడు  - ధర (భూమి) పైన సుపర్వుడు (దేవుడు), బ్రాహ్మణుడు :-
[4-585-మ.]

2441} ధరిత్రీపాలకుడు  - భూమిని పాలించువాడు, రాజు :-
[1-472-క.]

2442} ధరిత్రీశుడు  - భూమికి ప్రభువు, రాజు :-
[10.1-3-క.]

2443} ధరిత్రీసురుడు  - ధరిత్రి (భూమి)కి సురుడు (దేవుడు), బ్రాహ్మణుడు :-
[1-502-ఉ.]

2444} ధర్మజుడు  - యమధర్మరాజు కొడుకు, ధర్మరాజు :-
[1-194-క., 1-206-వ., 1-212-ఉ., 1-226-ఆ., 1-228-వ., 1-322-వ., 1-332-వ., 1-349-వ., 3-59-తే., 10.2-354-మ., 10.2-712-చ.]

2445} ధర్మతనూభవుడు  - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు :-
[3-19-చ.]

2446} ధర్మతారణుడు  - ధర్మమును తారణుడు (కాపాడెడివాడు), విష్ణువు :-
[6-529-త.]

2447} ధర్మదేవత  - ధర్మమునకు అధిదేవత :-
[3-350-వ.]

2448} ధర్మనందనపౌత్రుడు  - యమధర్మరాజు పుత్రుని మనుమడు, పరీకిన్మహారాజు :-
[1-426-వ., 1-428-వ.]

2449} ధర్మనందనుడు  - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు :-
[1-168-వ., 1-216-వ., 1-232-వ., 1-234-వ., 1-278-వ., 1-289-వ., 1-301-వ., 1-320-వ., 1-530-గ., 3-130-వ., 7-13-వ., 7-26-వ., 7-70-వ., 7-388-వ., 7-479-వ., 10.2-687-వ.]

2450} ధర్మనిత్యానువర్తి  - ధర్మమును ఎల్లప్పుడు ఆచరించు వాడు, శ్రీరాముడు. :-
[8-744-మాలి.]

2451} ధర్మపత్ని  - అగ్నిసాక్షిగా పెండ్లాడిన భార్య :-
[4-834-వ.]

2452} ధర్మపాలనుడు  - ధర్మమును పాలించెడివాడు, యమధర్మరాజు. :-
[6-165-ఉ.]

2453} ధర్మపాలుడు  - ధర్మమును కాపాడెడివాడు, విష్ణువు :-
[4-703.1-తే.]

2454} ధర్మపుత్రుడు  - యమధర్మరాజు కొడుకు, ధర్మరాజు :-
[1-177-శా., 1-289-వ., 1-299-వ., 1-347-క.]

2455} ధర్మమార్గానుగంతుడు  - ధర్మమార్గ (ధర్మమార్గమును) అనుగంతుడు (అనుసరించువాడు), రాముడు :-
[7-481-మాలి., 11-126-మాలి.]

2456} ధర్మము  - వేదధర్మము :-
[1-30-ఉ., 4-421-వ.]

2457} ధర్మసుతుడు  - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు :-
[1-279-తే., 3-130-వ.]

2458} ధర్మసూతి  - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు :-
[3-97-చ.]

2459} ధర్మసూనుడు  - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు :-
[1-205-క.]

2460} ధర్మాత్ముడు  - ధర్మస్వరూపుడు, విష్ణువు :-
[4-703.1-తే., 9-170.1-తే.]

2461} ధర్మాది  - 1ధర్మ 2అర్థ 3కామ 4మోక్షములు అనెడి చతుర్విధపురుషార్థములు :-
[4-256-వ.]

2462} ధర్మాదులు  - 1ధర్మ 2అర్థ 3కామ 4మోక్షములు అనెడి చతుర్విధపురుషార్థములు :-
[4-625.1-తే.]

2463} ధర్మార్థకామములు, పురుషార్థములు  - కామాది, 1ధర్మ 2అర్థ 3కామ 4మోక్షములు యైన పురుష ప్రయోజనములు, పురుషులు సాధించదగిన ప్రయోజనములు, కర్తవ్యములు :-
[7-445-వ., 7-461-మ., 8-83.1-ఆ.]

2464} ధర్ముడు  - ధర్మమే తానైనవాడు, విష్ణువు :-
[11-77-వ.]

2465} ధవళధరాధరము  - ధవళ (తెల్లని) ధరాధరము (పర్వతము), కైలాసపర్వతము :-
[7-285-వ.]

2466} ధవళబహుళకీర్తి  - స్వచ్ఛమైన గొప్ప కీర్తి కలవాడు, శ్రీరాముడు :-
[8-744-మాలి.]

2467} ధవళము - ధవళతరము ధవళతమము :-
[10.2-177.1-తే.]

2468} ధవళేక్షణ  - ధవళ (తెల్లని, స్వచ్ఛమైన) ఈక్షణ (చూపులు ఉన్నామె), స్త్రీ :-
[4-750-క.]

2469} ధాత  - సమస్తమును ధరించు వాడు, బ్రహ్మదేవుడు, అదితి సంతానము పన్నెండుగురులో ఒకడు, సూర్యుడు :-
[1-253-ఉ., 3-352.1-తే., 3-500-ఉ., 3-738-వ., 3-739.1-తే., 4-26-వ., 6-507-వ., 8-735.1-తే., 12-41-వ.]

2470} ధాతుగణము  - 1.భ్వాది, 2.అదాది, 3.జుహోత్యాది 4.దివాది 5.సునోత్యాది 6.తుదాది 9.రుధాది 7.తనోత్యాది 8.క్రాది 9.చురాది (ఇవి సంస్కృత ధాతువుల గణములు) :-
[10.1-592.1-ఆ.]

2471} ధాతుభేదములు  - 1వాత 2పైత్య 3శ్లేష్మ ప్రకృతులు :-
[10.1-1495-ఉ.]

2472} ధాతువు  - ఒక రకమైన మణిసిల (కొండ మీది ఒక రకమైన ఎఱ్ఱమన్ను, ఖనిజము :-
[10.2-275-వ.]

2473} ధాత్రీధరము  - భూమిని ధరించునది, పర్వతము :-
[10.1-1290-మ.]

2474} ధాత్రీపతి  - భూమికి పతి, రాజు :-
[3-20-క.]

2475} ధాత్రీశుడు  - ధాత్రి (భూమి)కి ఈశుడు (ప్రభులు), రాజు :-
[7-43-మ.]

2476} ధాత్రీశ్వరుడు  - ధాత్రి (భూమి)కి ఈశ్వరుడు, రాజు. :-
[1-375-శా., 1-419-మ., 7-18-శా., 7-478-మ.]

2477} ధాత్రీసురుడు  - ధాత్రీ (భూమికి) సురుడు (దేవత), బ్రాహ్మణుడు. :-
[5.1-174.1-తే., 8-533-శా.]

2478} ధాత్రీసురోత్తముడు  - ధాత్రీసుర (భూమిపైనిదేవతల వంటివాడైన బ్రాహ్మణ) ఉత్తముడు (శ్రేష్ఠుడు) :-
[7-351-మ.]

2479} ధారణ  - భగవంతుని తప్ప మఱియొకటినెఱుఁగమి (ఇది యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, మననము, సమాధి అను అష్ట యోగాంగములలో నొకటి) :-
[2-13-క.]

2480} ధారణావతి - ధారణా భగవంతునిఁ దప్ప మఱియొకటి నెఱుఁగమి, (ఇది యోగాంగములలో నొకటి), (ఇది యోగాంగములలో నొకటి) :-
[1-218-వ.]

2481} ధారపోయు  - దానముచేయుట, దానముచేసెడి క్రియలో నీటిధారను దాత చేతినుండి గ్రహీత చేతిలో పడునట్లు పోసెడి విధి :-
[8-607-శా.]

2482} ధారాధరములు  - నీటిధారలను కలిగి ఉండునవి, మేఘములు :-
[10.1-1753-వ., 12-37-వ.]

2483} ధారిణి  - భూమి, అన్నింటిని ధరించునది. భూమి :-
[4-34-వ.]

2484} ధారుణీశ్వరుడు  - ధారుణి (భూమి)కి ఈశ్వరుడు, రాజు :-
[5.1-92-మ., 5.1-106-చ.]

2485} ధార్తరాష్ట్రుడు  - ధృతరాష్ట్రుని కొడుకు, దుశ్శాసనుడు :-
[1-189.1-తే.]

2486} ధార్తరాష్ట్రులు  - ధృతరాష్ట్రుని కొడుకులు, కౌరవులు :-
[1-190-మత్త., 3-3-ఉ., 10.2-572-తే.]

2487} ధీనిధులు  - ధీ (బుద్ధి, జ్ఞానము) నకు నిధులు (స్థానము) అయినవారు, జ్ఞానులు :-
[2-209-చ., 3-920-క.]

2488} ధీమణి  - ధీమంతులు (జ్ఞానము కలవారి) అందు మణి వంటి వాడు (లేదా) బుద్ధి యను మణి కలవాడు. :-
[1-55-మ.]

2489} ధీయుక్తి  - బుద్ధితో కూడిన నేర్పు కలిగినది, యోగము :-
[4-631-మ.]

2490} ధీరజనోత్తముడు  - ధీర (మహాశౌర్యవంతమైన) జన (వారిలో) ఉత్తముడు (శ్రేష్ఠుడు), కృష్ణుడు :-
[10.1-1049-ఉ.]

2491} ధీరుడు  - 1మిక్కిలి ధీరత్వము కలవాడు, 2విష్ణువు, 3 ధారణ కలవారు :-
[3-145.1-తే., 3-203-దం.]

2492} ధీరోత్తముడు  - ధీరులు (జ్ఞానులు)లో ఉత్తముడు, విష్ణువు :-
[4-579-క.]

2493} ధీవిలసిత  - బుద్ధివికాసము కలామె, బుద్ధిమంతురాలు :-
[10.1-858-క.]

2494} ధురంధరుడు  - భారము మోయు వాడు, పరిపాలించువాడు, శ్రేష్ఠుడు :-
[9-510-ఉ.]

2495} ధూపము వేయుట  - సుగంధ మూలికలను నిప్పులపై తపింప జేయుట వలన కలుగు సువాసనల పొగ పట్టించుట, అగరవత్తులు పొగను చూపుట అనెడి దేమునికి చేసెడి సేవ :-
[4-558-వ., 10.1-808-వ., 10.2-601-వ.]

2496} ధూమకేతువు  - ధూమము (పొగ)ను కేతువు (గుర్తుగాగలది), అగ్ని, తోకచుక్క :-
[9-135-ఆ.]

2497} ధూమ్రకేశుడు  - ధూమ్ర (పొగవంటి) కేశుడు (శిరోజములు కలవాడు) :-
[4-640-వ.]

2498} ధృతమందరుడు  - కూర్మావతారంలో మందర పర్వతమును ఎత్తినవాడు, విష్ణువు :-
[2-26-వ.]

2499} ధృతమతి  - ధరించిన బుద్ధి కలామె :-
[2-119-చ.]

2500} ధృతరాష్ట్రసూనుడు  - ధృతరాష్ట్రుని కొడుకు, దుర్యోధనుడు :-
[10.1-1515-మ.]

2501} ధృష్టుడు  - అనుకూలుఁడు, దక్షిణుఁడు, ధృష్టుఁడు, శఠుఁడు. అను చతుర్విధశృంగార నాయకులలో నొకఁడు, ధృష్టుడు దోషములు బయటపడిననూ భయపడడు, అనుకూలుడు ఒకనాయికయందే అనురాగము కలవాడు, దక్షిణుడు పెక్కురు భార్యలను సమముగా ప్రేమించువాడు, శఠుడు నాయికకు దక్క ఇతరులకు తెలియకుండునట్లు అపరాధములు చేయువాడు :-
[4-775.1-తే.]

2502} ధేనుకాసురుడు  - గాడిద రూపమున ఉన్న అసురుడు :-
[2-190-చ.]

2503} ధైర్యమండనులు  - ధైర్యమును అలంకారముగా కలవారు, ధీరులు. :-
[10.1-1448-క.]

2504} ధ్యానము  - మనసును ఏకాగ్రము చేసి అంతఃకరణ శుద్ధి సాధించుట :-
[4-684-వ., 10.2-1198-వ.]

2505} ధ్రువుడు  - విష్ణువును గూర్చి ఐదేండ్ల బాలునిగనే తపస్సుచేసి ధ్రువతారగా ధ్రువపదమును పొందిన చిరంజీవి :-
[3-448-క.]

2506} ధ్వజినీకాంతుండు  - (విష్ణుమూర్తి యొక్క) ధ్వజినీ (సేనా) కాంతుడు (నాయకుడు), విష్వక్సేనుడు :-
[8-98-మ.]

2507} నంద  - శుక్లపక్షమునుండి మొదటి ఐదు తిథులు (పాడ్యమి విదియ తదియ చవితి పంచమి) :-
[5.2-62-వ.]

2508} నందకధరుడు  - నందకము అను కత్తిని ధరించువాడు, విష్ణువు :-
[3-19-చ., 3-434-చ., 6-121-క.]

2509} నందకము  - విష్ణుమూర్తి ఖడ్గము పేరు, సంతోషించునది, సంతోషపెట్టునది, అలరించునది,. వ్యు. టునది సమృద్ధౌ నంద+ ణ్యుల్, కృ.ప్ర. :-
[1-39-వ., 10.2-421-మ.]

2510} నందకహస్తుడు  - నందకము చేతిలో ధరించినవాడు, కృష్ణుడు :-
[10.2-421-మ.]

2511} నందగోపకుమారుడు  - నందగోపుని యొక్క కుమారుడు, కృష్ణుడు :-
[1-188-వ., 5.1-1-క., 5.2-1-క.]

2512} నందగోపసుందరి  - గోపాలుడైన నందుని భార్య, యశోద :-
[10.2-1064-చ.]

2513} నందతనయుడు  - నందుని కొడుకు, కృష్ణుడు :-
[10.1-784-క., 10.1-903-శా.]

2514} నందతనూజుడు  - నందుని పుత్రుడు, కృష్ణుడు :-
[3-96-క.]

2515} నందతపఃఫలము  - నందుని యొక్క తపస్సునకు ఫలితముగ లభించినవాడు, కృష్ణుడు :-
[10.1-1249-ఉ.]

2516} నందనందననందనుడు  - నందుని కొడుకు యొక్క (కృష్ణుని) కొడుకు, సాంబుడు :-
[10.2-562-తే.]

2517} నందనందనుడు  - నందుని కొడుకు, సంతోషమునకే సంతోషము కలిగించువాడు, కృష్ణుడు :-
[10.1-451-వ., 10.1-1015.1-ఆ., 10.1-1100-క., 10.1-1524-వ., 10.2-275-వ., 10.2-615-వ.]

2518} నందనవనము  - స్వర్గములోని ఇంద్రుని ఉద్యానవనము :-
[10.1-1615-వ., 10.2-214-వ.]

2519} నందితనందుడు  - ఆనందింప జేయబడిన నందుడు కలవాడు, కృష్ణుడు :-
[10.2-625-క.]

2520} నందితాత్మ  - ఆనందమున ఉన్న ఆత్మ కలవాడు, శుకుడు. :-
[10.1-350-ఆ.]

2521} నందుపట్టి  - నందుని పుత్రుడు, కృష్ణుడు :-
[10.1-1321-వ.]

2522} నంద్యావర్తబంధము  - అరవైనాలుగు అక్షరముల కాలముగల నంద్యావర్తము అనెడి తాళమానమునకు సరిపడ నృత్యమండలమును చుట్టివచ్చి హస్త విన్యాసాదులను కనుపింప చేయునది, రాసక్రీడ యందలి పారిభాషిక పదము. :-
[10.1-1084-వ.]

2523} నక్తంచరుడు  - నక్తము (రాత్రి) చరుడు (చరించువాడు), రాక్షసుడు :-
[7-392-వ., 10.1-736-వ.]

2524} నక్షత్రములు  - అశ్విని ఆది నక్షత్రములు (తారకల సమూహములు) ఇవి 27 :-
[1-521-వ., 3-346-వ.]

2525} నఖక్షతములు  - గిల్లుటచేత చర్మముపై ఏర్పరచు గోటి గుర్తు, ఒక శృంగార క్రియ :-
[10.1-755-క.]

2526} నగచరుడు  - కొండలమీద చరించువాడు, వానరుడు :-
[10.2-542-క.]

2527} నగచరేంద్రముఖ్యుడు  - నగచర (కొండల మీద తిరిగెడిది, భల్లూకము) లలో ఇంద్ర (శ్రేష్ఠులలో) ముఖ్యమైనవాడు, జాంబవంతుడు :-
[10.2-64-క.]

2528} నగచాపుడు  - మేరుపర్వతమును చాపము (ధనుస్సు)గా పట్టినవాడు, శివుడు :-
[4-121-క.]

2529} నగజాత  - నగ (పర్వతుని) జాత (పుట్టినామె), పార్వతి :-
[10.1-1742.1-ఆ.]

2530} నగధరుడు  - నగ (గోవర్ధన పర్వతమును) ధరుడు (ధరించినవాడు), కృష్ణుడు :-
[10.1-1553-వ., 10.1-1700-వ., 10.1-1767-వ., 10.2-270-క., 10.2-886-వ., 11-118-వ.]

2531} నగభేది  - పర్వతాల గర్వమణచినవాడు, ఇంద్రుడు :-
[9-205.1-తే.]

2532} నగారాతిగజేంద్రము  - నగ (పర్వతములకు) ఆరాతి (శత్రువు) ఐన ఇంద్రుని గజశ్రేష్ఠము, ఐరావతము :-
[10.1-1750-మ.]

2533} నడ్వలము  - 1.పక్వానికి వచ్చిన పైరు, 2.కిక్కసకసవు గల దేశము, 3.చక్షుర్మనువు భార్యా ఉల్ముకుని తల్లీ, నడ్వల. :-
[4-390-వ.]

2534} నతమందారుడు  - మొక్కినవారికి కల్పవృక్షము వంటివాడు, కృష్ణుడు :-
[10.2-207-మ.]

2535} నతాఖిలామృతాహారి  - నమస్కరిస్తున్న సమస్త దేవతలు (అమృతాహారులు) కలవాడు, విష్ణువు :-
[3-335-ఉ.]

2536} నదము  - పడమరకు ప్రవహించు నది :-
[1-199-వ., 2-89-వ., 2-178-మ., 3-38-క., 5.2-55-వ., 10.2-948-వ.]

2537} నది  - తూర్పునకు ప్రవహించు నదము :-
[1-199-వ., 2-89-వ., 2-178-మ., 5.2-55-వ.]

2538} నదీలలామ  - నదులలో లలామ (శ్రేష్ఠురాలు), యమున. :-
[10.2-504-తే.]

2539} నభస్వతి  - నభస్ (ఆకాశము) వంటి రూపము కలది, విజితాశ్వుని రెండవ భార్య నభస్వతి, వీరి కొడుకు హవిర్ధానుడు. :-
[4-675-క.]

2540} నభస్సు  - ఆకాశము తానైనవాడు, విష్ణువు :-
[4-702.1-తే.]

2541} నభోమణి  - నభస్ (ఆకాశమునకు) మణి (మణి వంటి వాడు), సూర్యుడు :-
[6-142-ఉ.]

2542} నమత్సంత్రాత  - నమత్ (మ్రొక్కువారిని) సంత్రాత (చక్కగాకాపాడువాడు), బ్రహ్మ :-
[7-85-మ.]

2543} నమస్కరించుటలు+చేయక  - నమస్కరించుటలుసేయక, గసడదవాదేశ సంధి :-
[10.2-1269-క.]

2544} నమస్కారము  - న మహః (నేను నీకు ఇతరుడను కాను) అని తెలుపుకొను ప్రక్రియ, చేతులు జోడించుటాది, గౌరవసూచక క్రియ :-
[10.1-1654-వ.]

2545} నముచి  - ఒక దానవుడు, ఇంద్రునిచేతిలో మరణించినవాడు, విప్రచిత్తి కొడుకు. స్వర్భానుని కూఁతురు అగు ప్రభ భార్య, న+ముచ్+కి, న ముంచతి పరపదార్థాన్ దుష్టాచారం వా, ఇతరుల వస్తువులను వదలిపెట్టనివాడు. దొంగ; దుష్టాచారము కలవాడు. ఒక రాక్షసుడు. :-
[7-29-వ.]

2546} నమ్రైకరక్షుడు  - నమ్రత ఏక (ఒక్కటితోనే) రక్షణుడు ఇచ్చువాడు, విష్ణువు :-
[3-203-దం.]

2547} నయచరితుడు  - నీతిగల నడవడిక కలవాడు, ధర్మరాజు. :-
[10.2-714-తే.]

2548} నయవేది  - నీతి తెలిసినవాడు, కృష్ణుడు :-
[10.2-697.1-తే.]

2549} నరకాసురుడు  - భూమాత పుత్రుడు, సత్యభామ చేత హతుడు అయిన అసురుడు :-
[2-190-చ.]

2550} నరదేవాసురయక్షరాక్షసమునీంద్రస్తుత్యుడు  - మానవులు దేవతలు దైత్యులు యక్షులు రాక్షసులు మునులలో ఇంద్రుని వంటివారుచేత స్తుతింపబడువాడు, శ్రీకృష్ణడు :-
[5.1-181-మ.]

2551} నరదేవుడు  - నరులకు దేవుడు, రాజు :-
[1-291-వ., 5.1-26-వ.]

2552} నరనాథుడు  - నరులకు నాథుడు (పాలించువాడు), రాజు :-
[3-217-క., 4-397-క., 4-765-క., 4-864.1-తే., 5.1-61-చ., 6-60.1-ఆ., 8-135.1-తే., 9-6-ఆ., 9-239-మ.]

2553} నరనాథోత్తముడు  - నరనాథు (రాజు)లలో ఉత్తముడు, మహారాజు :-
[9-140-మ.]

2554} నరనాయకుడు  - నరుల (మానవుల)కు నాయకుడు, రాజు :-
[4-449-క., 4-470-క.]

2555} నరనారాయణులు  - పూర్వం ధర్మునికి భార్య మూర్తికి నరనారాయణులుగా విష్ణువు అవతరించాడు, వారే ఇప్పుడు ద్వాపరయుగంలో అర్జునుడు కృష్ణుడుగా అవతరించారు, :-
[10.2-114-వ.]

2556} నరపతి  - నరులకు ప్రభువు, రాజు :-
[5.1-61-చ., 5.1-179-చ.]

2557} నరపాలకుడు - నరులను పాలించువాడ, రాజు :-
[4-420-క.]

2558} నరపాలుడు  - నరులను పాలించువాడు, రాజు :-
[4-424-చ., 11-52-వ.]

2559} నరభోజనుడు  - నర (మానవులను) భోజనుడు (తినెడివాడు), రాక్షసుడు :-
[7-304-క., 10.2-1262-క.]

2560} నరలోకేశుడు  - నరలోక (నరలోకుల) కు ఈశుడు (ప్రభువు), రాజు. :-
[7-301-క.]

2561} నరవరుడు  - నరులకు వరుడు (భర్త), రాజు :-
[3-43-చ., 3-216-క., 5.1-6-క., 6-57-క., 10.1-1220-క., 11-57.1-తే.]

2562} నరవరేణ్యుడు  - నరులలో వరేణ్యుడు (మన్నింపదగినవాడు), రాజు. :-
[5.1-113.1-ఆ., 8-706.1-ఆ.]

2563} నరవరోత్తముడు  - నరవరుల (రాజుల)ల ఉత్తముడు, మహారాజు :-
[10.1-1612.1-తే.]

2564} నరవాహనుడు  - నరుని వాహనముగ కలవాడు, నిరృతి, కుబేరుడు :-
[4-426-క.]

2565} నరవిభుడు  - మానవుల ప్రభువు, రాజు :-
[9-152-ఆ.]

2566} నరసఖుడు  - అర్జునునకు సఖుడు, కృష్ణుడు :-
[1-201-శా.]

2567} నరసింహుడు  - నరుడు సింహము రూపములు కూడి యున్న విష్ణు అవతారుడు, హిరణ్యకశిపుని వధించి, ప్రహ్లాదుని పాలించిన వాడు. :-
[7-371-వ.]

2568} నరహరి  - నరసింహావతారము ఎత్తినవాడు, హరి :-
[6-33-క., 6-57-క.]

2569} నరుడు  - నరనారాయణులలో నరుడు, అర్జునుడు :-
[1-371-క.]

2570} నరునిసఖుడు  - నరుడు (అర్జునుడు) యొక్క సఖుడు, కృష్ణుడు :-
[6-23-ఆ.]

2571} నరేంద్రచంద్రముడు  - నరేంద్రు (రాజు) లను తారలలో చంద్రునివంటివాడు, మహారాజు. :-
[7-459-ఉ.]

2572} నరేంద్రచంద్రుడు  - నరేంద్రులు (రాజులు) అనెడి తారలలో చంద్రునివంటివాడు, మహారాజు :-
[9-128-వ.]

2573} నరేంద్రముఖ్యుడు  - నరేంద్రుడు (రాజు)లలో ముఖ్యుడు, మహారాజు. :-
[9-45.1-తే.]

2574} నరేంద్రాగ్రణి  - నరేంద్రు (రాజు)లలో అగ్రణి (అధికుడు), మహారాజు. :-
[9-146-శా.]

2575} నరేంద్రు+కున్  - నరేంద్రునకున్, నుగాగమ సంధి :-
[10.2-1265-వ.]

2576} నరేంద్రుడు  - నరులకు ఇంద్రుడు, రాజు. :-
[1-346-క., 1-390-క., 1-428-వ., 1-502-ఉ., 2-2-వ., 2-261-క., 4-2-వ., 4-421-వ., 4-626-వ., 4-885-వ., 5.1-3-క., 5.1-178-వ., 5.2-30-వ., 6-449-వ., 7-7-వ., 7-156-క., 8-2-వ., 9-2-వ., 9-52-క., 10.1-110-క., 10.1-459-క., 10.1-1204-క., 10.1-1402-క., 10.2-7-క., 12-2-వ.]

2577} నరేంద్రుడు  - నరులలో ఇంద్రుని వంటి వాడు, రాజు :-
[1-437-వ., 4-853-వ., 6-192-వ.]

2578} నరేంద్రోత్తముడు  - ఉత్తముడైన నరుల కింద్రుడు రాజు, మహారాజు. :-
[1-368-మ.]

2579} నరేశ్వరాసనము  - రాజుకి ఐన పీఠము, సింహాసనము :-
[10.1-1398-చ.]

2580} నరేశ్వరుడు  - నరులకు ప్రభువు, రాజు :-
[1-465-వ., 3-30-ఉ., 9-418-ఉ., 10.1-1107-క.]

2581} నలకూబరుడు  - కుబేరుని కొడుకు. మణిగ్రీవుడు ఇతని సోదరుడు. గొప్ప అందగాళ్ళు. నారదశాపంతో జంట మద్ది చెట్లుగా అయి కృష్ణబాలుని వలన శాపవిముక్తి పొందారు :-
[10.1-391-వ.]

2582} నలినగర్భుడు  - నలినము (పద్మము)న గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[3-320.1-తే., 3-377.1-తే.]

2583} నలినజుడు  - నలిన (పద్మము) నందు జుడు (పుట్టిన వాడు), బ్రహ్మ :-
[2-221.1-తే.]

2584} నలినదళాక్షుడు  - నలినము (పద్మము) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు :-
[3-332-క.]

2585} నలిననయన  - నలినము (పద్మము)ల వంటి నయన (కన్నులుగలామె), స్త్రీ :-
[4-943.1-తే.]

2586} నలిననాభుడు  - నలినము (పద్మము) నాభియందు కలవాడు, విష్ణువు, కృష్ణుడు :-
[10.2-697.1-తే., 10.2-1073-తే.]

2587} నలినభవుడు  - నలినము (పద్మము)న భవ (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[3-268-తే., 4-941-క.]

2588} నలినముఖి  - నలిన (పద్మమువంటి) ముఖి (ముఖము కలామె), స్త్రీ :-
[6-446.1-తే.]

2589} నలినసఖుడు  - నలిన (పద్మములకు) సఖుడు (స్నేహితుడు), సూర్యుడు :-
[12-23.1-తే.]

2590} నలినాక్షుడు  - నలినము (పద్మము)లవంటి అక్షుడు (కన్నులు ఉన్నవాడు), విష్ణువు :-
[3-290-మ., 3-294.1-తే., 3-567-క., 3-844-చ., 10.1-97.1-తే.]

2591} నలినాయతాక్షి  - నలిన (పద్మముల వంటి) ఆయత (పెద్ద) అక్షి (కన్నులు ఉన్నామె), స్త్రీ :-
[3-951-క.]

2592} నలినాసననందనులు  - నళినాసన (బ్రహ్మదేవుని) నందనులు (పుత్రులు), నారదుడు మరియు సనకసనందనాదులగు యోగులు :-
[2-255-క.]

2593} నలినాసనుడు  - నలినము (పద్మము)న ఆసీనుడు (ఉండువాడు), బ్రహ్మదేవుడు :-
[3-588-ఉ.]

2594} నలినోదరుడు - నలినము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు :-
[3-772.1-తే.]

2595} నలినోదరుడు  - నలినము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు :-
[4-944-క., 11-77-వ.]

2596} నలుదిక్కులు  - 1తూర్పు 2దక్షిణము 3పడమర 4ఉత్తరము :-
[3-538.1-తే., 10.1-1199-వ., 10.1-1241-క., 10.2-638-తే.]

2597} నలుమొగములప్రోడ  - నలు (నాలుగు 4) మొగముల (ముఖములుగల) ప్రోడ (పెద్ద), బ్రహ్మ :-
[7-80-వ.]

2598} నలువ  - నలు (నాలుగు) వ (మోములుగలవాడు), చతుర్ముఖుడు, బ్రహ్మ :-
[8-171-క., 9-72-ఆ., 10.1-88-వ., 12-22-వ.]

2599} నల్లనయ్య  - నల్లని అయ్య, కృష్ణుడు :-
[10.1-145-వ.]

2600} నళినదళాక్షి  - నళినము (పద్మము) దళ (రేకుల) వంటి అక్షి (కన్నులుగలామె), స్త్రీ :-
[4-848-క.]

2601} నళినదళాక్షుడు  - నళిన (తామర) దళ (రేకులవంటి) అక్షుడు (కన్నులు కలవాడు), కృష్ణుడు :-
[10.1-692-చ., 10.1-775-క., 10.1-1045-క.]

2602} నళిననయన  - పద్మముల వంటి కన్నులు కలామె, స్త్రీ, గోపిక. :-
[10.1-1474-ఆ.]

2603} నళిననేత్ర  - నళినము (పద్మముల) వంటి నేత్రములు గలామె, స్త్రీ. :-
[5.1-37-ఆ.]

2604} నళిననేత్రుడు  - పద్మములవంటి కన్నులు కలవాడు, విష్ణువు :-
[4-286.1-తే.]

2605} నళినలోచనుడు  - నళినము (పద్మముల) వంటి లోచనుడు (కన్నులు కలవాడు), విష్ణువు :-
[10.1-130-త., 10.1-600.1-ఆ.]

2606} నళినాక్షుడు  - నళినము (పద్మము) వంటి అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు :-
[2-105-ఉ., 4-203.1-తే., 7-124.1-ఆ., 10.1-560.1-తే.]

2607} నళినాప్తుడు  - నళినము (పద్మము)లకు ఆప్తుడు (బంధువు), సూర్యుడు :-
[9-455-క.]

2608} నళినాయతాక్షుడు  - నళిని (కమలముల) ఆయత (వలె విశాలమైన) అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు, కృష్ణుడు :-
[4-169-ఉ., 10.2-1281.1-తే.]

2609} నళినాసనజనకుడు  - నళినాసనుని (బ్రహ్మ యొక్క) జనకుడు, విష్ణువు :-
[11-108-క.]

2610} నవకంజదళాక్షుడు  - నవ (కొత్త, తాజా) కంజము (పద్మము)ల దళము (రేక)ల వంటి అక్షులు (కన్నులు) ఉన్నవాడు, విష్ణువు :-
[3-530-ఉ.]

2611} నవగ్రహములు  - 1సూర్యుడు 2చంద్రుడు 3అంగారకుడు 4బుధుడు 5బృహస్పతి 6శుక్రుడు 7శని 8రాహువు 9కేతువు :-
[10.2-573-వ., 11-105-వ.]

2612} నవతోయజనేత్రుడు  - నవ (అప్పుడే పూసిన) తోయజ (పద్మములవంటి) నేత్రుడు (కన్నులు కలవాడు), కృష్ణుడు :-
[10.2-1109-ఉ.]

2613} నవద్రవ్యములు  - పృథ్వ్యాది, 1పృథివి 2అప్పు 3తేజము 4వాయువు 5ఆకాశము 6కాలము 7దిక్కు 8ఆత్మ 9మనస్సు :-
[2-84-వ., 2-86-వ., 10.1-1779-వ.]

2614} నవనిధులు  - 1పద్మము 2మహాపద్మము 3శంఖము 4మకరము 5కచ్చపము 6ముకుందము 7కుందము 8నీలము 9వరము :-
[1-39-వ., 6-326-వ., 8-114-క.]

2615} నవనీతము  - నవోద్ధృతము, క్రొత్తగా అప్పుడే తీసిన వెన్న :-
[10.1-1334-మ.]

2616} నవనీరజగంధి  - తాజా పద్మముల వంటి సువాసనలు ఉన్నామె, పద్మినీ జాతి సుందరి, రుక్మిణి :-
[10.1-1698-ఉ.]

2617} నవనీరజనేత్రుడు  - నవ(కొత్త, తాజా) నీరజ (ఫద్మము) వంటి నేత్రములు కలవాడు, విష్ణువు :-
[3-364-చ.]

2618} నవపద్మదళాక్షుడు  - నవ (లేత) పద్మముల వంటి అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు :-
[3-590-ఉ.]

2619} నవపద్మముఖి  - నవ (తాజా) పద్మమువంటి ముఖముగలామె, అందగత్తె. :-
[9-577-క.]

2620} నవపద్మలోచనుడు  - నవ (లేత) పద్మముల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు :-
[10.2-747.1-తే.]

2621} నవపుండరీకాక్షుడు  - కొత్త (తాజా) పుండరీకము (పద్మము) లవంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు :-
[3-407.1-తే.]

2622} నవప్రజాపతులు  - నవబ్రహ్మలు, భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్టుడు, మరీచి :-
[2-112-వ., 2-199-వ., 4-872.1-తే., 6-196-తే., 8-681-వ.]

2623} నవబ్రహ్మలు  - ప్రజాపతులు తొమ్మండుగురు, భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్టుడు, మరీచి :-
[11-105-వ.]

2624} నవరంధ్రములు  - కళ్ళు రెండు (2) ముక్కురంధ్రములు (2) నోరు (1) చెవులు (2) రహస్యావయవము (1) గుదము(1) :-
[10.1-91.1-తే.]

2625} నవరత్నములు  - తొమ్మిది జాతుల మణులు, 1 మౌక్తికము (ముత్యము) 2 పద్మరాగము (కెంపు) 3 వజ్రము 4 ప్రవాళము (పగడము) 5 మరకతము (గరుడ పచ్చ, పచ్చ) 6 నీలము 7 గోమేధికము 8 పుష్యరాగము 9 వైడూర్యము :-
[3-518.1-తే., 3-538.1-తే., 4-315.1-తే., 10.1-840-క., 10.2-600.1-తే., 10.2-697.1-తే.]

2626} నవరసములు  - 1శృంగారము 2హాస్యము 3కరుణము 4వీర్యము 5రౌద్రము 6భయానకము 7భీభత్సము 8అద్భుతము 9శాంతము, పాఠ్యంతరములు కలవు :-
[2-68.1-తే., 10.1-762.1-తే., 10.1-788-ఉ., 10.1-1054-తే.]

2627} నవలతాతన్వి  - నవ (లేత) లత వంటి తన్వి (దేహము కలామె), అందమైన స్త్రీ :-
[10.2-235.1-తే.]

2628} నవవర్షములు  - భారతాది, 1భారతము 2రమ్యకము 3కింపురుషము 4హరి 5భద్రాశ్వము 6కురువు 7హిరణ్మయము 8ఇలావృతము 9కేతుమూలము :-
[5.2-37-క.]

2629} నవవిధప్రపంచము  - నవవిధసృష్టి కలది, 6 ప్రాకృత సృష్టులు (1 మహత్తు 2 అహంకారము 3 భూతసృష్టి 4 ఇంద్రియసృష్టి 5 దేవగణ 6 తామససృష్టి) మఱియు 3 వైకృతసృష్టులు (7 స్ఠావరములు 8 తిర్యక్కులు 9 ఆర్వాక్ స్రోతము (నరులు)) అను 9విధముల సృష్టులు కలది :-
[3-248-క.]

2630} నవవిధభక్తి  - 1సఖ్యము 2శ్రవణము 3దాసత్వము 4వందనము 5అర్చనము 6సేవ 7ఆత్మలోననెరుక 8సంకీర్తనము 9చింతనము, పాఠ్యంతరము, 1శ్రవణము 2కీర్తనము 3స్మరణము 4పాదసేవనము 5అర్చనము 6వందనము 7దాస్యము 8సఖ్యము 9ఆత్మనివేదనము :-
[7-167-మ., 10.2-249-వ.]

2631} నవవిధసంబంధములు  - 1పితృపుత్ర సంబంధము 2రక్ష్యరక్షక సంబంధము 3శేషిశేష సంబంధము 4భర్తృభర్త సంబంధము 5జ్ఞాతృజ్ఞేయ సంబంధము 6స్వస్వామి సంబంధము 7శరీరిశరీర సంబంధము 8 ఆధారాధేయ సంబంధము 9భోక్తృభోగ్య సంబంధము :-
[7-356-వ.]

2632} నవవిధసర్గములు  - 1మహత్సర్గము 2అహంకారసర్గము 3భూతసర్గము 4ఇంద్రియసర్గము 5దేవసర్గము 6తమస్సర్గము 7వనస్పత్యాదిసర్గము 8 తిర్యక్సర్గము 9మనుష్యసర్గము ఇవికాక కుమారసర్గము ఒకటుంది అదికూడ వానిలోని భాగమే :-
[3-972-వ.]

2633} నవవిధసృష్టి  - ప్రాకృతసృష్టి (1 మహత్తు 2 అహంకారము 3 భూతసృష్టి 4 ఇంద్రియసృష్టి 5 దేవగణ 6 తామససృష్టి) మరియు వైకృతసృష్టి (7 స్ఠావరములు 8 తిర్యక్కులు 9 ఆర్వాక్ స్రోతము (నరులు)) :-
[3-344-వ.]

2634} నవీనోజ్జ్వలనీలమేఘనిభగాత్రుడు  - నవీన (సరికొత్తగా) ఉజ్జ్వల (ప్రకాశిస్తున్న) నీలమేఘముల నిభ (వంటి) గాత్రము (శరీరము) కలవాడు, విష్ణువు :-
[3-284-మ.]

2635} నవోఢోల్లసదిందిరాపరిచరిష్ణుడు  - నవోఢ (కొత్తపెళ్ళికూతురు) వలె ఉల్లసత్ (ఉల్లాసము గల) ఇందిరా (లక్ష్మీదేవికి) పరిచరిష్ణుడు (పరిచారునిగా ఉండు వాడు. కలిసి విహరించు వాడు), విష్ణువు :-
[8-105-మ.]

2636} నవ్యము - నవ్యతరము నవ్యతమము :-
[3-550-చ.]

2637} నాకలోకము  - స్వర్గము, దుఃఖము లేని లోకము :-
[2-112-వ.]

2638} నాకవాసులు  - నాకము (స్వర్గలోకము)న వాసులు (నివసించెడివారు), దేవతలు :-
[8-168-మత్త.]

2639} నాకారాతులు  - నాకా (స్వర్గవాసులైన దేవతలకు) ఆరాతులు (శత్రువులు), రాక్షసులు :-
[10.2-159-శా.]

2640} నాకుజుడు  - నాకువు (పుట్ట)లో పుట్టినవాడు, వాల్మీకి :-
[10.2-1117-ఉ.]

2641} నాకుట  - నాలుకతో రుచి చూచు, రాయుటాదులు చేయుట. :-
[10.1-523-చ.]

2642} నాకులు  - నాక (స్వర్గ) లోకమున ఉండు వారు, దేవతలు :-
[3-323-క.]

2643} నాకౌకసుడు  - వేల్పు, దేవత, వ్యు. నాకః ఓకస్ అస్య, బ.వ్రీ., స్వర్గము ఉనికిగా గలవాడు :-
[10.2-1154.1-తే.]

2644} నాగ  - పాము రూపమున వచ్చిన అఘాసురుడు :-
[2-190-చ.]

2645} నాగపాశము  - వరుణుని ఆయుధము, (ఇది ప్రయోగింపబడిన వాని చలనములు బంధింపబడును) :-
[10.2-385-క.]

2646} నాగబంధము  - పాముల వలె పెనవైచుకొనుచు నర్తించుచు లయ తప్పక అంగ విన్యాసాదులను చూపునది, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

2647} నాగరజనులు  - నగరములోనుండెడి జనులు, పౌరులు, సంస్కారవంతులు :-
[9-346.1-ఆ.]

2648} నాగసూదనుడు - నాగు (పాము)లను చంపువాడు, గరుత్మంతుడు, గరుడుడు :-
[4-16-చ.]

2649} నాచనసోమన  - ఉత్తర హరివంశం వ్రాసిన మహాకవి :-
[6-11.1-తే.]

2650} నాడి  - నరముల కూడలి స్థానము :-
[2-30-వ.]

2651} నాడు+ఒదిగి  - నాడొదిగి, ఉకార సంధి :-
[10.2-1237-క.]

2652} నాథదైవత  - నాథ (భర్తయే) దైవత (భగవంతునిగ గలది), పతివ్రత :-
[7-233-శా.]

2653} నాదము  - ఓంకారము ఉచ్చారణలో బిందువు తరువాత పలికెడి అనునాదరూపము నాదము :-
[7-467-వ.]

2654} నానావిధైకమత్యుపలక్షణమహితుడు  - నానావిధైక (అనేక విధములైన) మతి (బుద్దులకు) ఉపలక్షణ (ఉపలక్ష్ణణమైన) మహితుడు (గొప్పవాడు), విష్ణువు :-
[3-198.1-తే.]

2655} నామములు  - గుణాదులను వర్ణించుచు సంకేతముగా ఉండు పేర్లు, శ్రీరామ, గోవింద నారాయణ మున్నగునవి :-
[10.1-1653.1-ఆ.]

2656} నారదుడు  - బ్రహ్మదేవుని మానస పుత్రుడు, నరస్యేదంనారం నారంవిజ్ఞానానందదాతీతి నారదః అని వ్యుత్పత్తి, అవినాశమైనదానికి (ఆత్మ) చెందినది నారం (బ్రహ్మ) అట్టి బ్రహ్మజ్ఞానమును కలుగజేయువాడు నారదుడు అనబడును, బ్రహ్మవేత్త :-
[10.1-397-వ., 10.1-411-క.]

2657} నారసములు  - నారినుండి వెలువడునవి, బాణములు :-
[1-369-చ.]

2658} నారాచము  - నరసమూహము ఆచమించునది, అచ్చము ఇనుప బాణము :-
[10.1-1757-వ.]

2659} నారాయణదేవుడు - నారాయణుడు అను దేవుడు, విష్ణువు :-
[10.1-1654-వ.]

2660} నారాయణాశ్రమము  - నరనారాయణులు తపముచేసిన ప్రదేశము :-
[7-451-వ., 10.2-1203-వ.]

2661} నారాయణి  - సుపార్శ్వక్షేత్రమున నారాయణి (సర్వులందు విజ్ఞానరూపమున ఉండునామె) :-
[10.1-61-వ.]

2662} నారాయణుడు  - 1.నారములందు వసించు వాడు, శ్లో. ఆపో నారా ఇతి ప్రోక్తాః ఆపోవై నరసూనవః, అయనంతస్యతా ప్రోక్తాః స్తేన నారాయణ స్మృత్యః. (విష్ణుపురాణము), 2. నారాయణశబ్ద వాచ్యుడు, వ్యు. నారం విజ్ఞానం తదయనమాశ్రయో యస్యసః నారాయణః, రిష్యతే క్షీయత యితరః రిజ్క్షయే ధాతుః సనభవతీతి నరః అవినాశ్యాత్మాః, నరసమూహమున నివాసముగలవాడు, విష్ణువు, :-
[1-61-వ., 1-202-వ., 1-214-వ., 1-232-వ., 1-388.1-తే., 1-513-వ., 1-530-గ., 2-84-వ., 2-89-వ., 2-112-వ., 2-173.1-తే., 2-205-మ., 2-238-వ., 2-272.1-ఆ., 2-277.1-తే., 3-131.1-తే., 3-196-వ., 3-244-వ., 3-272.1-తే., 3-344-వ., 3-507-వ., 3-720.1-తే., 3-722-వ., 3-839-వ., 3-873-తే., 3-897.1-తే., 3-1007-వ., 3-1026.1-తే., 3-1047-వ., 4-126-తే., 4-163.1-తే., 4-233.1-తే., 4-963.1-తే., 5.2-115-వ., 7-239-వ., 7-240.1-తే., 7-271-శా., 8-97-వ., 8-122-మ., 8-479-క., 10.1-53-క., 10.1-236-వ., 10.1-559-క., 10.1-560.1-తే., 10.1-1236-దం., 10.1-1450.1-ఆ., 10.1-1654-వ., 10.2-49-క., 10.2-1187-తే., 10.2-1313-వ., 11-56-వ., 11-77-వ.]

2663} నాలవపాదంబు  - కలియుగము యొక్క చివరి (4వ) పాదము. 432000 సంవత్సరాలలో చివరి 108000 సంవత్సరములు.. :-
[12-13-వ.]

2664} నాలుగవఅవస్థ  - తురీయము, క్రింది అవస్థాత్రయములు జాగృత మెలకువ, సుషిప్తి నిద్ర స్వప్న కల, :-
[1-459.1-తే.]

2665} నాలుగష్టలు  - మార్గశిర పుష్య మాఘ ఫాల్గుణ మాసములందలి కృష్ణపక్షమునందలి అష్టమితిథులు, శ్రాద్ధభేదంబులు :-
[7-448-వ.]

2666} నాలుగుదిక్కులు  - 1తూర్పు 2దక్షిణము 3పడమర 4ఉత్తర దిక్కులు :-
[4-58.1-తే., 4-163.1-తే.]

2667} నాలుగుమోములనలువ  - నాలుగు ముఖములు కల బ్రహ్మ,, చతుర్ముఖ బ్రహ్మ :-
[9-8.1-తే.]

2668} నాహుషుడు  - నహుషుని పుత్రుడు, యయాతి :-
[9-562-శా.]

2669} నిండుపున్నమిచంద్రునిపదహారుకళలు  - 1అమృత 2మానద 3పూష 4తుష్టి 5పుష్టి 6రతి 7ధృతి 8శశిని 9చంద్రిక 10కాంతి 11జ్యోత్స్న 12శ్రీ 13ప్రీతి 14అంగద 15పూర్ణ 16పూర్ణామృత :-
[10.1-1-క.]

2670} నికషాత్మజుడు  - నికష అను రాక్షసికి పుట్టినవాడు, నైరృతి, నైరృత దిక్పతి :-
[10.2-773-చ.]

2671} నికుంచితకరణము  - అవయవములను ముడుచుకొనుట, రాసక్రీడా పారిభాషిక పదం :-
[10.1-1084-వ.]

2672} నికుంచితశిరోభావాలు  - వంపబడిన శిరస్సు కలవి, రాసక్రీడా పారిభాషిక పదం :-
[10.1-1084-వ.]

2673} నికృతి  - వంచన, తిరస్కారము, కపట భేదం :-
[4-215-వ.]

2674} నిఖిలదేవాత్ముడు  - నిఖిల (సమస్తమై) దేవ (దేవతలు) ఆత్ముడు (తానైనవాడు), విష్ణువు :-
[8-466-ఆ.]

2675} నిఖిలధరావరనుతసుగుణధాముడు  - నిఖిల (సమస్తమైన) ధరావర (రాజుల) చేత నుత (స్తోత్రము చేయబడిన) గుణములకు ధాముడు (నిలయ మైనవాడు), శ్రీరామ :-
[4-1-క.]

2676} నిఖిలధర్ముడు  - సమస్తమైన ధర్మములు తానైనవాడు, విష్ణువు :-
[4-703.1-తే.]

2677} నిఖిలపావనుడు  - నిఖిల (సమస్తమును) పావనుడు (పవిత్రము జేయువాడు), విష్ణువు :-
[7-193-ఉ.]

2678} నిఖిలబీజుడు  - సర్వప్రాణ సహిత రహితలకు మూల జన్మ స్థానము యైన వాడు, విష్ణువు :-
[10.1-942-ఆ.]

2679} నిఖిలరూపకుడు  - సమస్త రూపములు తానే అయినవాడు :-
[2-89-వ.]

2680} నిఖిలస్తుత్యుడు  - సర్వులచే స్తుతింపబడువాడు, కృష్ణుడు :-
[1-180-క.]

2681} నిఖిలాధిపతి  - నిఖిల (సమస్తమునకు) అధిపతి (ప్రభువు), విష్ణువు. :-
[8-132-క.]

2682} నిఖిలాధీశుడు  - నిఖిల (సమస్తమునకు) అధీశుడు (పై అధికారి), విష్ణువు. :-
[8-731-క.]

2683} నిఖిలేశుడు  - సర్వ లోకములకు ఈశుడు, విష్ణువు :-
[10.2-49-క.]

2684} నిఖిలైకనేత  - సమస్తమునకు కల ఏకైక అధినేత, శంకరుడు :-
[3-465-క.]

2685} నిగమచయాంతవేద్యుడు  - నిగమ (వేద) చయ (సముదాయముల) అంత (సర్వస్వము వలన, వెంబడి) వేద్యుడు (తెలియబడువాడు), (వేదాంతవేద్యుడు), విష్ణువు :-
[3-506-చ.]

2686} నిగమవినుత  - వేదములచే స్తుతింపబడు వాడు, విష్ణువు :-
[3-311.1-తే.]

2687} నిగమస్తుత  - వేదములచే స్తుతింపబడు వాడు, విష్ణువు :-
[3-310-క.]

2688} నిజతాండవఖేలనుడు  - నిజ (స్వకీయమైన) తాండవమను నాట్యమును ఖేలనుడు (ఆడు వాడు), శివుడు :-
[10.2-315-ఉ.]

2689} నిజభక్తత్రాణపారాయణు  - తనభక్తులను కాపాడుటలో బహునేర్పరిని, విష్ణువు :-
[2-237-మ.]

2690} నిజభక్తవరదుడు  - సత్యమైన తన భక్తులకు వరములను ఇచ్చెడి వాడు, విష్ణువు :-
[4-963.1-తే.]

2691} నిజాలంకారుడు  - నిజ (తననుతనే) అలంకారుడు (అలంకరించుకొన్నవాడు), గర్వముగలవాడు :-
[8-182-వ.]

2692} నిటలతటాక్షుడు  - నిటలతట (నుదట భాగమున) అక్షుడు (కన్ను గలవాడు) శివుడు :-
[8-171-క.]

2693} నిటలాంబకుడు  - నిటలము (నుదురు) అందు అంబకము (కన్ను) కలవాడు, శివుడు :-
[3-1052-చ., 10.2-324-ఉ., 10.2-406-వ., 10.2-1274-ఉ.]

2694} నిటలాక్షుడు  - నిటలమున (నుదుట) అక్షి (కన్ను) కలవాడు, శంకరుడు :-
[4-47-వ., 10.2-592-క.]

2695} నిట్టూర్పు  - నిడు (దీర్ఘమైన) ఊర్పు (శ్వాస), మనసులోని శ్రమకు సంకేతము :-
[1-358-వ., 8-93-వ.]

2696} నితంబిని  - గొప్ప పిరుదులు కలామె, స్త్రీ :-
[1-29-ఉ., 10.1-1121-చ.]

2697} నితాంతసౌఖ్యనిధి  - నితాంత (క్షీణములేని) సౌఖ్య (ఆనందమునకు) నిధివి (స్థానమైనవాడు), విష్ణువు :-
[10.1-567.1-ఆ.]

2698} నిత్యకర్మలు  - సంధ్యావంద నాది విహిత కర్మలు :-
[10.1-766-వ.]

2699} నిత్యకల్యాణనిధి  - శాశ్వతమైన మేలులకు నిధివంటివాడు, విష్ణువు. :-
[10.2-49-క.]

2700} నిత్యఖేలనుడు  - నిత్య (శాశ్వతమైన) ఖేలనుడు (వర్తన) కలవాడు, విష్ణువు. :-
[3-572-చ.]

2701} నిత్యనైమిత్తికములు  - నిత్యమును చేయునవి మరియు నిమిత్తము (అవసరము) అనుసరించి చేయవలసినవి అగు పూజాదికములు :-
[3-959.1-తే.]

2702} నిత్యప్రళయము  - నిత్యము ప్రాణులకు కలుగుతుండెడి నిద్ర, మరణము :-
[12-24-వ.]

2703} నిత్యమంగళాకరుఁడు  - శాశ్వతమైన శుభప్రదమైన ఆకారము కలవాడు, విష్ణువు :-
[3-212-చ.]

2704} నిత్యలక్ష్మీవిహారుడు  - నిత్య (శాశ్వతమైన) లక్ష్మీదేవి (సంపదలు) తో విహారుడు (వర్తించువాడ), విష్ణువు. :-
[3-304.1-తే., 3-753.1-తే., 4-171.1-తే.]

2705} నిత్యశుద్ధము  - నిత్యము (భూత భవిష్య వర్తమానము లందు) శుద్ధము (శుద్ధమైనది, పంచమలములైన ఆణవ కార్మిక మాయిక మాయేయ తిరోధానములు లేనిది) :-
[10.1-1472.1-తే.]

2706} నిత్యశోభనయుతుడు  - శాశ్వతమైన శుభములతో కూడి ఉండువాడు, విష్ణువు :-
[3-236-చ.]

2707} నిత్యసత్యమూర్తి  - నిత్య (శాశ్వతమైన) సత్య (సత్యమే) మూర్తి (తన స్వరూపైనవాడు), నిత్యమైన సత్యమైన స్వరూపుడు విష్ణువు :-
[10.1-567.1-ఆ.]

2708} నిత్యస్వతంత్రుడు  - శాశ్వతమైన స్వతంత్రుడు, విష్ణువు :-
[4-963.1-తే.]

2709} నిత్యాత్మీయలోకము  - శాశ్వతమైనట్టి తనది (విష్ణునిది) అయినట్టి లోకము, వైకుంఠము :-
[10.1-962-మ.]

2710} నిత్యానందసంధాయి  - నిత్యమైన ఆనందమును కూర్చెడివాడు, విష్ణువు :-
[4-177-మ.]

2711} నిత్యానుకంపానిధి  - శాశ్వతమైన దయకు నిలయమైనవాడు, కృష్ణుడు. :-
[1-201-శా.]

2712} నిత్యుడు  - నిత్యప్రకాశమానుడు :-
[2-23-వ., 2-110-మ.]

2713} నిధులు  - ఇక్కడ ఎనిమిది చెప్పబడినవి (1మత్స్య 2కూర్మ3పద్మ 4మహాపద్మ 5శంఖము 6ముకుందము 7కచ్ఛపము 8నీలము) తొమ్మిదవది వరము తప్పించి, నవనిధులు పాఠ్యంతరము (1పద్మము 2మహాపద్మము 3శంఖము 4మకరము (మొసలి) 5కచ్ఛపము (తాబేలు) 6ముకుందము 7కుందము (పంది) 8నీలము 9వరము (ఖర్వము)), పాఠ్యంతరము (1. కాళము 2. మహాకాళము 3. పాండుకము 4. మాణవకము 5. నైసర్పము 6. సర్వరత్నము 7. శంఖము 8. పద్మము 9. పింగళము.) :-
[10.1-1613-వ.]

2714} నిన్ను – కలిదోష నివారక సమర్థుడైన నిన్ను - :-
[1-52-క.]

2715} నిబిడము - నిబిడతరము నిబిడతమము :-
[5.1-118-వ.]

2716} నిభృతాత్మ  - వృద్ధిక్షయములులేని స్థిరమైన ఆత్మ, విష్ణువు :-
[4-703.1-తే.]

2717} నిమేషము  - క్షణములో మూడోవంతు కాలము, ( 1.2 sec.) :-
[12-20-వ.]

2718} నియతేంద్రియుడు  - నియత (నియమింపబడిన) ఇంద్రియుడు (ఇంద్రియములుగల వాడు), ఏకాగ్రచిత్తుడు :-
[8-153-వ.]

2719} నియమము  - బహిరింద్రియ నిగ్రహము, అష్టాంగయోగములలోని శరీరముకంటె భిన్నమైన మృజ్జలాదులు సాధనములుగా కలిగి నిత్యముగా ఆచరింపదగిన ఒక యోగాంగము (ఇది దశవిధము 1తపము 2సంతోషము 3ఆస్తికత్వము 4దానము 5భగవదర్చన 6వేదాంతశ్రవణము 7లజ్జ 8మతి 9జపము 10వ్రతము :-
[2-253.1-తే., 4-618-వ., 8-629.1-తే.]

2720} నిరంకుశము  - అంకుశములేని (ఏనుగు వలె), హద్దులులేనిది :-
[4-412-చ.]

2721} నిరంజనుడు  - మచ్చలేనివాడు, కంటికి పొరలులేనివాడు, పరిశుద్ధుడు :-
[2-279-మ., 4-179.1-తే., 10.1-567.1-ఆ.]

2722} నిరగ్నులు  - పంచచత్వారింశత (49) అగ్నులలోని వారు, మంటలేక నుండు అగ్నులు? అగ్నిహోత్రమునకు కాని అగ్నులు? :-
[4-34-వ.]

2723} నిరతిశయుడు  - మించినది లేనివాడు, విష్ణువు :-
[4-179.1-తే.]

2724} నిరపేక్షణ  - దేనియందును కుతూహలము లేకుండుట. :-
[1-386-వ.]

2725} నిరపేక్షుడు  - దేనిని కోరని వాడు :-
[2-279-మ.]

2726} నిరయము  - నరకము, దుర్గతి :-
[4-215-వ.]

2727} నిరర్గళము  - గళములు లేనిది, అడ్డులేనిది :-
[2-32-వ.]

2728} నిరవద్యుడు  - నిందలేని వాడు, వంకలు పెట్టుటకురానివాడు, విష్ణువు, భగవంతుడు :-
[2-279-మ., 4-179.1-తే.]

2729} నిరీహయోగిజనవర్గసుపూజితుడు  - నిర్ (లేని) ఈహ (కోరికలు కల) యోగి (యోగులైన) జన (వారి) వర్గ (సమూహము)చే పూజితుడు, విష్ణువు :-
[4-175-చ.]

2730} నిరుత్తరుడు  - జవాబు చెప్పనివాడు, మౌని :-
[1-381-వ.]

2731} నిరుపమ  - ఉపమానము లేనట్టి, సాటిలేని :-
[2-59-వ.]

2732} నిరుపమగుణహారుడు  - నిరుపమ (సాటిలేని) గుణ (సుగుణము లనెడి) హారుడు (దండను ధరించినవాడు), రాముడు :-
[4-976-మాలి.]

2733} నిరుపమఘనగాత్రుడు  - నిరుపమ (సాటిలేని) ఘన (గొప్ప, మేఘముల వంటి) గాత్రుడు (శరీరము కలవాడు), శ్రీకృష్ణుడు :-
[5.1-183-మాలి.]

2734} నిరుపమనయవంతుడు  - నిరుపమ (సాటిలేని) నయవంతుడు (నీతిగలవాడు), రాముడు :-
[7-481-మాలి., 11-126-మాలి.]

2735} నిరుపమశుభమూర్తి  - సాటిలేని శుభమూర్తి, భగవంతుడు :-
[2-262-క., 10.1-1791-మాలి.]

2736} నిరృతి  - 1. అభాగ్యము, 2. ఋతము (సత్యమైనది) లేనివాడు, 3. అష్టదిక్పాలకులలో ఒకడు, నైరృతి మూల (దక్షిణపశ్చిమ)ను ఏలెడి దిక్పాలకుడు :-
[3-378.1-తే., 4-215-వ.]

2737} నిర్గుణత్వము  - శాంతరూపైన సత్వగుణము ఘోరరూపైన రజోగుణము మూఢరూపైన తమోగుణము ఐన త్రిగుణములు లేకపోవుట, మూటికి అతీతముగ వుండుట :-
[10.1-681-వ.]

2738} నిర్గుణము  - శాంతరూపైన సత్వగుణము ఘోరరూపైన రజోగుణము మూఢరూపైన తమోగుణము ఐన త్రిగుణములు లేకపోవుట, మూటికి అతీతముగ వుండుట :-
[10.1-553.1-ఆ.]

2739} నిర్గుణుడు  - త్రిగుణాతీతుడు, శాంతరూపైన సత్వగుణము ఘోరరూపైన రజోగుణము మూఢరూపైన తమోగుణము ఐన త్రిగుణములు మూటికి అతీతముగ వుండువాడు, శివుడు, విష్ణువు :-
[2-110-మ., 3-473-వ., 4-195-చ., 4-704-తే., 7-368-వ.]

2740} నిర్జరగంగ  - నిర్జర (ముసలితనములేనివారి, దేవతల) గంగానది, దేవగంగ :-
[10.1-951-మ.]

2741} నిర్జరధాని  - దేవతల రాజధాని, అమరావతి :-
[8-473-మ.]

2742} నిర్జరలోకము  - నిర్జరుల (దేవతల) లోకము, స్వర్గము :-
[12-18-వ.]

2743} నిర్జరారాతి  - నిర్జర (ముసలితనము లేనివారి, దేవతల) ఆరాతి (శత్రువు), రాక్షసుడు :-
[7-80-వ., 8-667.1-ఆ.]

2744} నిర్జరారాతిహంత  - నిర్జరారాతి (దేవతలశత్రువులగు రాక్షసులను) హంత(చంపినవాడు), రాముడు :-
[7-481-మాలి., 11-126-మాలి.]

2745} నిర్జరులు  - జర (ముసలితనము లేనివారు), దేవతలు :-
[2-151-చ., 7-302-క., 8-646.1-తే., 10.1-726-మ., 10.1-1398-చ., 10.2-1332-క.]

2746} నిర్జితశ్వాసేంద్రియాత్ముడు  - 1.నిర్జిత (జయింపబడిన) శ్వాసేంద్రియ(శ్వాస వాయువులు) (ప్రాణాయామము అందు నేర్పు) ఆత్ముడు (కలవాడు), 2.ప్రాణాయామ నిష్ణాతుడు :-
[3-501-వ.]

2747} నిర్దయాపరిపాల్యవధూరక్షకుడు  - నిర్దయ (దయలేని) పరిపాల్య ( పరిపాలింపబడు) వధువులకు రక్షకుడు (రక్షించువాడు), శంకరుడు :-
[3-473-వ.]

2748} నిర్దళితాసమబాణుడు  - నిర్దళిత (చంపబడిన) అసమబాణుడు (మన్మథుడు) కలవాడు, శివుడు :-
[10.2-312-క.]

2749} నిర్ద్వంద్వండు  - సుఖదుఃఖ శీతోష్ణాది ద్వంద్వములను అధిగమించినవాడు :-
[4-11.1-తే.]

2750} నిర్భేదనుండు  - ముక్కలుచేయుటకు వీలకానివాడు, విష్ణువు :-
[3-874-వ.]

2751} నిర్మంథరము  - మంథరము (మెల్లగా సాగుట) లేకుండునది :-
[10.1-1722-ఉ.]

2752} నిర్మలజ్ఞానపాత్రుడు  - నిర్మల (స్వచ్ఛమైన) జ్ఞానముచే పాత్రుడు (తగినవాడు), శ్రీకృష్ణుడు :-
[5.1-183-మాలి.]

2753} నిర్మలనవరత్ననూపురవిరాజితుడు  - నిర్మల (స్వచ్ఛమైన) నవరత్నములు పొదిగిన నూపుర (అందెలు)తో విరాజిల్లువాడు, కృష్ణుడు :-
[5.2-165-చ.]

2754} నిర్మలాత్ముడు  - నిర్మల (స్వచ్ఛమైన) ఆత్ముడు (స్వరూపుడు), పంచమలములు లేని పరబ్రహ్మ స్వరూపుడు, విష్ణువు. :-
[4-179.1-తే., 7-354.1-తే., 10.1-682.1-తే.]

2755} నిర్మలానందకారుడు  - నిర్మల (స్వచ్ఛమైన) ఆనంద (ఆనందమును) కారుడు (కలిగించెడివాడు), రాముడు :-
[4-976-మాలి.]

2756} నిర్మలారూఢకీర్తి  - నిర్మల (పరిశుద్ధమైన) ఆరూఢ (నిలకడైన) కీర్తి (కీర్తి కలవాడు), శ్రీరాముడు :-
[10.1-1791-మాలి.]

2757} నిర్వక్పేశస్కరులు  - నిర్వక్ (మూగవాడు) పేశస్కరుడు (నేర్పుకలిగించేవాడు), పురంజనోపాఖ్యానంలో కాళ్ళు, చేతులకు సంకేతంగా వాడబడెను. :-
[4-768-వ.]

2758} నిర్వక్రము  - వంకరలేనిది, స్పష్టమైనది :-
[10.2-101-క.]

2759} నిర్వాణసంధాయికుడు  - మోక్షమును కలింగించువాడు, కృష్ణుడు :-
[1-201-శా.]

2760} నిర్వికారత్వము  - షడ్విధ వికారములు లేకపోవుట (1గర్భములో ఉండుట 2పుట్టుట 3పెరుగుట 4ముదియుట 5కృశించుట 6చనిపోవుట) :-
[10.1-681-వ.]

2761} నిర్వికారము  - వికారము (మార్పు) లేనిది :-
[3-571-చ.]

2762} నిర్వికారుడు  - షడ్వికారములు (మార్పులు) నిర్ (లేని వాడు), షడ్విధ వికారములు లేనివాడు, విష్ణువు :-
[4-179.1-తే., 4-702.1-తే.]

2763} నిర్వేదము  - 1. తత్వజ్ఞాన దుఃఖ ఈర్ష్యాదుల చేత గలుగు హేయత్వ బుద్ధి, 2. తత్వం తెలిసి నిరాశచేసికొనుట. 3. దుఃఖము. 4. వైరాగ్యము. :-
[12-30-వ.]

2764} నిలాయన,నిలయన  - దాగుడుమూతలు ఆటలు :-
[10.1-1183-వ.]

2765} నిలింపపతి  - నిలింపుల (దేవతల)కు పతి (ప్రభువు), ఇంద్రుడు :-
[10.1-891-వ.]

2766} నిలింపవైరి  - నిలింప (దేవతా) వైరి (శత్రువు), రాక్షసుడు :-
[7-227-ఉ.]

2767} నిలింపారాతి  - నిలింప (దేవతల) ఆరాతి (శత్రువు), హిరణ్యకశిపుడు :-
[7-93-వ.]

2768} నిలింపాహితజిష్ణు  - నిలంప (దేవతల)కు అహిత (శత్రువులు) అగు రాక్షసులను జయించు శీలము కలవాడు, విష్ణువు :-
[3-148-మ.]

2769} నివాతకవచుడు  - బాణములచే ఛేదింపబడని కవచము కలవాడు, ఒక దైత్యుడు. :-
[1-366.1-ఆ.]

2770} నివాతము  - బాణములచే భేదింపరానిది :-
[8-182-వ.]

2771} నివాళించుట  - ఒక సత్కార సేవ, హారతిచ్చుట, హారతి గ్రహీత ఎదురుగా మంగళహారతి పళ్ళెరములను ప్రదక్షిణగా చుట్లుతిప్పి తరువాత నివాళించెడివారి కుడిఅరచేతులతో అందలి ధూపమును గ్రహీత వైపునకు చూపుట, హారతి పట్టుట :-
[4-558-వ.]

2772} నివృత్తుడు  - ప్రవృత్తులు లేనివాడు, విష్ణువు :-
[4-703.1-తే.]

2773} నిశాంతము  - నిశ (రాత్రి, ప్రళయము) అంతము (చివర), కల్పము ఉదయించబోవు సమయము :-
[8-732-వ.]

2774} నిశాకరుడు  - నిశ (రాత్రి) ఆకరుడు (ప్రకాశించువాడు), చంద్రుడు :-
[3-498-ఉ., 11-99-వ.]

2775} నిశాచరనాథపుత్రుడు  - నిశాచర రాజు (రాక్షస రాజు యైన హిరణ్యకశిపుని) పుత్రుడు, ప్రహ్లాదుడు :-
[7-385-ఉ.]

2776} నిశాచరభేది  - రాక్షసులను హింసించువాడు, విష్ణువు :-
[10.1-1187-ఉ.]

2777} నిశాచరశత్రువు  - రాక్షసుల శత్రువు, విష్ణువు :-
[10.2-45-క.]

2778} నిశాచరసంహరుడు  - నిశాచర (రాక్షసులను) సంహరుడు (చంపినవాడు), రాముడు :-
[7-482-చ.]

2779} నిశాచరుడు  - నిశ (రాత్రి) చరించువాడు (తిరుగువాడు) రాక్షసుడు :-
[2-146-మ., 6-429-ఉ., 7-76-శా., 7-193-ఉ., 9-162-చ., 10.1-1058-ఉ.]

2780} నిశాటవిపాటన  - నిశాట (రాత్రించరుల, రాక్షసుల)ను విపాటన (పడగొట్టువాడు), విష్ణువు :-
[10.1-579-క.]

2781} నిశాటుడు  - నిశ (రాత్రి) ఆటుడు (చరించువాడు), రాక్షసుడు :-
[2-190-చ., 3-625-క., 6-276-చ., 7-326-క., 10.1-464-క., 10.1-1171-ఉ., 10.2-17-మ., 10.2-151-శా.]

2782} నిశానాయకుడు  - నిశ (రాత్రి)కి నాయకుడు, చంద్రుడు :-
[4-371-వ.]

2783} నిశాపతి  - రాత్రికాలమునకు అధిపతి, చంద్రుడు :-
[10.1-966-క.]

2784} నిశీథ  - అర్థరాత్రి కాలము, వ్యు. ని+శీ+థక్, నిశేరతే అత్ర, నితరాం శేరతే అత్ర, దీని యందు పడుకొందురు. :-
[4-390-వ.]

2785} నిశ్శ్రీకములు  - శ్రీకములు (శుభములు) లేనివి :-
[8-148-క.]

2786} నిశ్శ్రేయస్సు  - (ఇక పొందవలసిన) శ్రేయస్సులు లేనిది, ముక్తి :-
[1-148.1-ఆ.]

2787} నిషదము  - మేరు పర్వతం చుట్టూ ఉండే పర్వతాలలో ఒకటి, వ్యు. ని+సద్+అచ్, నిషీదంతి నిశ్చింతతయా నివసంతి అత్ర దేశః, ఇక్కడ చింత లేకుండ వుందురు. :-
[5.2-30-వ.]

2788} నిష్కంటకము  - కంటకము (ముల్లు)లు లేనిది, అడ్డులేనిదారి :-
[7-220-ఉ.]

2789} నిష్కము  - పాతకాలపు టంకము (డబ్బు బిళ్ళ), బిళ్ళ రూపు ధనము, బంగారు నాణెము, మాడ అని కొందరు, 108 మాడలు అని కొందరు, పది రూకలు (వెండినాణెములు) అని కొందరు :-
[10.2-605-వ., 10.2-965.1-తే.]

2790} నిష్కళంకుడు  - కళంకములు లేనివాడు, విష్ణువు :-
[2-279-మ., 4-179.1-తే., 10.1-942-ఆ.]

2791} నిష్కాముడు  - కామము లేనివాడు, కోరికలు లేకుండుటయే ధర్మముగా కలవాడు,శివుడు :-
[3-297-వ., 3-473-వ.]

2792} నిష్కించనుడు  - వెలితి లేని వాడు, భగవంతుడు :-
[2-279-మ.]

2793} నిష్క్రియారంభుడు  - క్రియలందు సంకల్పములు లేనివాడు, విష్ణువు :-
[4-179.1-తే.]

2794} నిష్ఠుర - నిష్ఠురతర నిష్ఠురతమ :-
[6-53-క.]

2795} నిష్ఠురము - నిష్ఠురతరము నిష్ఠురతమము :-
[10.2-880-చ.]

2796} నిస్తంద్రుడు  - మత్తులేనివాడు, మేల్కొని ఉన్నవాడు, తందర (తూగు, కునికిపాటు) నిః (లేని) వాడు, :-
[3-912-వ.]

2797} నిస్త్రింశము  - నరహరి గోర్లు, నిస్త్రింశః (ముప్పది మానములకంటె పెద్దవైన కత్తుల) వంటివి, నిస్త్రింశ (కనికరము లేనిది) ఐనవి :-
[7-330-ఉ.]

2798} నిస్సంగమము  - సంగము (బంధనాలు) (తగులములు) (వ్యసనములు) లేనిది :-
[2-217.1-తే.]

2799} నిస్సంగులు  - సంగములు అన్నింటిని విసర్జించినవారు, విరాగులు :-
[5.1-51-వ.]

2800} నిస్సాణ  - చర్మవాద్య విశేషము, రెండుప్రక్కల వాయించే పెద్ద డప్పు వంటి వాయిద్య విశేషము, నామాంతరాలు మావలి, లోహ్టి. దీనిని ముఱియా మున్నగు జాతుల వారు వాడుతున్నారు. :-
[10.1-1557-మ.]

2801} నీడము  - రథముపై రథికుడు కూర్చుండు చోటు, నాటు బండికి తొట్టె, హృదయమునకు సంకేతంగా వాడబడింది :-
[4-771.1-తే.]

2802} నీమొదలిటెంకి  - నీ (భగవంతుని యొక్క) మొదలి (మూల) టెంకి (నివాసము), వైకుంఠము, పరమపదము :-
[10.1-552-క.]

2803} నీరజగర్భుడు  - నీరజ (పద్మమున) గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మ :-
[3-243-చ., 10.2-50-మ.]

2804} నీరజదళనేత్రుడు  - తామర రేకుల వంటి కన్నులు కలవాడు, విష్ణువు :-
[10.2-49-క.]

2805} నీరజనాభుడు  - నీరజము (పద్మము) నాభుడు (బొడ్డున గలవాడు), విష్ణువు. :-
[6-340-క., 11-106-క.]

2806} నీరజనివాసము  - పద్మముల చోటు, సరస్సు :-
[9-607-శా.]

2807} నీరజనేత్ర  - నీరజ (కమలముల) వంటి నేత్ర (కన్నులు కలామె), స్త్రీ. :-
[10.1-1276-క.]

2808} నీరజబంధుడు  - నీరజము (కలువపూల)కు బంధువు ఐనవాడు, సూర్యుడు :-
[10.1-754.1-ఆ.]

2809} నీరజభవుడు  - నీరజము (పద్మము)న భవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[4-509.1-తే.]

2810} నీరజలోచనుడు  - (నీరజము) పద్మము వంటి కన్నుల ఉన్న వాడు :-
[1-255-ఆ.]

2811} నీరజాక్షుడు  - నీరజ (పద్మము)లవంటి అక్షుడు (కన్నులుగలవాడు), విష్ణువు :-
[1-189.1-తే., 9-129.1-తే.]

2812} నీరజాతేక్షణ - నీరజాతము (కమలము) వంటి ఈక్షణ (కన్నులు కలామె), స్త్రీ, సత్యభామ :-
[10.2-183.1-తే.]

2813} నీరజేక్షణుడు  - నీరజ (పద్మములవంటి) ఈక్షణుడు (కన్నులు కలవాడు), కృష్ణుడు :-
[10.1-929-క.]

2814} నీరదశ్యామాంగుడు  - నీరదము (మేఘము) వంటి శ్యామాంగ (నల్లని దేహము గలవాడు), విష్ణువు. :-
[5.1-50-క.]

2815} నీరధి  - నీరు కి నిధి, కడలి, సముద్రము :-
[10.2-13-వ.]

2816} నీరరాశి  - నీరు రాశిగాగలది, కడలి, సముద్రము :-
[8-554.1-ఆ.]

2817} నీరాటము  - నీటిలో చరించునది, మొసలి :-
[8-19-క., 8-57-శా.]

2818} నీరేజగర్భుడు  - నీరేజము (పద్మము) నందు పుట్టిన వాడు, బ్రహ్మదేవుడు :-
[3-383-మ.]

2819} నీరేజపత్రేక్షణుడు  - నీరేజము (పద్మము) రేకుల వంటి కన్నులు ఉన్న వాడ, విష్ణువు :-
[3-203-దం., 10.1-408-శా.]

2820} నీరేజభవుడు  - నీరేజము (పద్మము) నందు భవుడు (పుట్టినవాడు), బ్రహ్మ :-
[6-489-క.]

2821} నీరేజముఖి  - నీరేజము (పద్మము) వంటి ముఖి (ముఖము గలామె),స్త్రీ :-
[6-204-క.]

2822} నీలకంఠము  - నీలముగా నున్న మెడ కలది, నెమలి :-
[10.2-180.1-ఆ.]

2823} నీలకంఠుడు  - నల్లని కంఠము కలవాడు, శంకరుడు :-
[4-105-శా.]

2824} నీలకంధరుడు  - నీల (నల్లని) కంధర (కంఠము) కలవాడు, శివుడు. :-
[4-65-చ.]

2825} నీలగళుడు  - నీల (నల్లని) గళ (గొంతుక) కలవాడు, శివుడు :-
[4-94-ఉ.]

2826} నీలనీరదనీలనీలోత్పలశ్యాముడు  - నీల (నల్లని) నీరద (మబ్బు వలెను) నీల (నల్లని) నీలోత్పల (నల్లకలువ వలెను) శ్యాముడు (నల్లగా ఉన్నవాడు) , విష్ణువు :-
[3-922.1-తే.]

2827} నీలనీరదశ్యామవర్ణుడు  - నల్లని మేఘమువలె నల్లని రంగుకలవాడు, విష్ణువు :-
[3-145.1-తే.]

2828} నీలలోహితుడు  - నీలము ఎరుపు రంగులు కలసి ఉన్నవాడు, రుద్రుడు, పరమ శివుడు :-
[3-367-వ., 3-368-మ., 4-149.1-తే., 11-105-వ.]

2829} నీలలోహితునిఏకాదశమూర్తులభార్యలు - 1 ధీ 2 వృత్తి 3 అశన 4 ఉమ 5 నియుతి 6 సర్పి 7 ఇల 8 అంబిక 9 ఇరావతి 10 సుధ 11 దీక్ష :-
[3-370-వ.]

2830} నీలవర్ణుడు  - నీలమైన రంగుగల దేహము గలవాడు, హరి :-
[6-1-శా.]

2831} నీలవేణి  - నల్లని శిరోజములు కలామె, స్త్రీ :-
[10.2-120-వ.]

2832} నీలోహితునిఏకాదశనామములు - 1 మన్యువు 2 మనువు 3 మహాకాలుడు 4 మహశ్చివుడు 5 ఋతధ్వజుడు 6 ఉరురేతసుడు 7 భవుడు 8 కాలుడు 9 వామదేవుడు 10 ధృతవ్రతుడు 11 నీలలోహితుడు :-
[3-370-వ.]

2833} నీవారము  - విత్తక పండెడు దూసర్లు లోనగు తృణధాన్యము, నివ్వరి ధాన్యం :-
[9-618-క.]

2834} నుతభక్తలోకమనోనేత్రవర్ధిష్ణుడు  - నుత (కీర్తింపబడిన) భక్తలోకముల మనోనేత్రమును వర్ధిష్టుడు (పోషించువాడు), విష్ణువు :-
[3-924.1-తే.]

2835} నుతవాణీసత్యధిభూభవవృత్రాసురరిపుదేవజాలుడు - నుత (పొగడబడుతున్న వాణీసత్యధిభూ (బ్రహ్మ) భవ (మహేశ్వరుడు) వృత్రాసురరిపు (ఇంద్రుడు) దేవజాలుడు (మున్నగుదేవతల సమూహము) కలవాడు, రాముడు :-
[11-1-క.]

2836} నూతనఫుల్లాబ్జలోచనుడు  - కొత్తగా విరిసిన పద్మములవంటి కన్నులు కలవాడు, విష్ణువు :-
[10.1-232-క.]

2837} నృప  - నృ (నరులను) ప (పరిపాలించువాడు), రాజు. :-
[1-373-క., 1-379-క., 3-97-చ., 6-419-క., 7-426-క., 9-153-క.]

2838} నృపతి  - నృ (నరులకు) ప్రభువు, రాజు :-
[3-16-క., 4-461-క., 9-427-క.]

2839} నృపముఖ్యుఁడు  - నరపాలకులలో ముఖ్యమైనవాడు, పరీక్షిత్తుడు :-
[1-443-ఉ.]

2840} నృపవరుడు  - నృప (రాజు)లలో వరుడు (శ్రేష్ఠుడు), మహారాజు :-
[7-418-క.]

2841} నృపసత్తముడు  - నరులను పాలించు వారిలో శ్రేష్ఠుడు మహారాజ, పరీక్షిత్తు :-
[1-427-ఉ.]

2842} నృపాత్మజ  - నృప (రాజైన మనువు) యొక్క ఆత్మజ (కూతురు), దేవహూతి :-
[3-919-వ.]

2843} నృపాలకాంతలు  - రాజుల భార్యలు, రాణులు :-
[10.2-1114-వ.]

2844} నృపాలకుడు  - నృ (నరులను) పాలకుడు (పరిపాలించెడివాడు), రాజు :-
[1-290-చ., 5.1-61-చ., 6-157-ఉ.]

2845} నృపాలుడు  - నృ (నరులకు) పాలుడు (పాలించెడివాడు), రాజు :-
[3-11-చ., 3-26-చ., 3-33-తే., 4-300-మ., 4-751.1-తే.]

2846} నృపుడు  - నృ (నరులను) పాలించువాడు, రాజు :-
[1-360-క., 1-372-క., 1-398.1-ఆ., 1-425-క., 1-476-క., 3-124-చ., 6-376-క., 8-6-క., 8-123-మ., 8-495-క., 8-682-క., 10.1-66-క., 10.1-446-క., 10.1-1313-క.]

2847} నెమ్మొగము  - నెఱ (అందమైన) + మొగము (ముఖము) :-
[10.2-183.1-తే.]

2848} నెలత  - చంద్రునివలె చల్లని యామె, స్త్రీ :-
[8-466-ఆ.]

2849} నెలలు  - పన్నెండు, 1చైత్రము 2వైశాఖము 3జేష్ఠము 4ఆషాడము 5శ్రావణము 6బాధ్రపదము 7ఆశ్వయుజము 8కార్తీకము 9మార్గశిరము 10పుష్యమి 11మాఘము 12ఫాల్గుణము :-
[5.2-86-వ.]

2850} నేత(పు)  - నేత్రి (స్త్రీ) :-
[3-467.1-తే.]

2851} నేలపాలు  - 1.మట్టిలోకి పాలు చెందునట్లు, కలియునట్లు, 2.వ్యర్థము :-
[3-380-ఉ.]

2852} నైమిత్తికప్రళయము  - తాత్కాలమైన నాశనము, సృష్టి ఆగుటవలన కలుగునది, బ్రహ్మ పగలు వచ్చునది, మరియొక విధముగ బ్రహ్మ పగలు తరువాత వచ్చెడి సర్వనాశనము :-
[12-22-వ., 12-24-వ.]

2853} నైశ్రేయస్సు  - నిశ్రేయస్సు (మిక్కిలి శ్రేయస్సు, ముక్తి) ను కలిగించునది :-
[3-507-వ.]

2854} నొగ  - రథములకు బండ్లకాడికి ఆధారముగ ముందుండెడి పొడవాటి చట్రము, కూబరము, ఏడికోల :-
[10.1-1558-వ.]

2855} పంకజగర్భుడు  - పంకజ (పద్మమున) గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మ. :-
[7-383-క.]

2856} పంకజజన్ముడు  - పంకజ (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు :-
[3-324-క.]

2857} పంకజనయనుడు  - పంకజము (పద్మము)వంటి నయనుడు (కన్నులు గలవాడు), విష్ణువు :-
[6-239.1-ఆ.]

2858} పంకజనాభుడు  - పంకజము (పద్మము) నాభిన కలవాడు, విష్ణువు :-
[1-188-వ., 3-360-క., 4-702.1-తే., 10.1-1708-ఉ., 11-92-ఉ.]

2859} పంకజనేత్రుడు  - పంకజము (పద్మము) లవంటి నేత్రములు కలవాడ, విష్ణువు :-
[3-423.1-తే.]

2860} పంకజము  - పంకము (నీరు, బురద) యందు జము (పుట్టునది), పద్మము :-
[2-221.1-తే., 3-429-మ., 3-845.1-తే., 4-582-వ., 4-832-తే., 7-297.1-తే.]

2861} పంకజలోచనుడు  - పద్మములవంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు :-
[4-189-చ.]

2862} పంకజసంభవుడు  - పంకజము (పద్మము)న సంభవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[3-739.1-తే.]

2863} పంకజసఖుడు  - పంకజ (పద్మముల) సఖుడు (స్నేహితుడు), సూర్యుడు :-
[10.1-1308-క.]

2864} పంకజాకరము  - పంకజము (పద్మములకు) ఆకరము (నివాసము), సరోవరము :-
[8-108-వ.]

2865} పంకజాక్షి  - పంకజము (పద్మము)లవంటి అక్షి (కన్నులుగలామె), స్త్రీ :-
[4-753.1-తే.]

2866} పంకజాక్షుడు  - పంకజము (పద్మము) వంటి అక్షుడు (కన్నులుగలవాడు), విష్ణువు :-
[6-400-ఉ.]

2867} పంకజాతభవుడు  - పంకజాతము (పద్మము) న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు :-
[3-385-చ.]

2868} పంకజాతము  - పంక (నీరు, బురద) జాతము (పుట్టినది), పద్మము :-
[3-720.1-తే., 4-552-చ.]

2869} పంకజాతాక్షుడు  - పంకజాతము (పద్మము) వంటి కన్నులు ఉన్న వాడు, విష్ణువు :-
[3-566.1-తే.]

2870} పంకజాసనుడు  - పంకజము (పద్మము)న ఆసీనుడు (ఉన్నవాడు), బ్రహ్మదేవుడు :-
[3-227-క., 3-334-వ., 3-359.1-తే., 3-739.1-తే., 4-14-చ., 9-230-వ.]

2871} పంకజోదరుడు  - పంకజము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు :-
[3-242-చ., 3-437.1-తే., 3-703-మ., 3-897.1-తే.]

2872} పంకరుహగర్భుడు  - పంకరుహము (పద్మము) నందు గర్భుడు (పుట్టిన వాడు), బ్రహ్మదేవుడు :-
[3-375-ఉ.]

2873} పంకరుహజాతుడు  - పంకరుహము (పద్మము)నందు పుట్టిన వాడు, బ్రహ్మదేవుడు :-
[3-545-చ.]

2874} పంకరుహము  - పంక (బురద)లో రుహము (పుట్టునది), పద్మము :-
[2-155.1-తే., 2-239-క., 3-49-చ., 3-534-చ.]

2875} పంకరుహసంభవుడు  - పద్మజుడు, పంకరుహము (పద్మము)నందు పుట్టిన వాడు, బ్రహ్మదేవుడు :-
[10.2-773-చ.]

2876} పంకరుహసఖుడు  - పద్మమునకు సఖుడు సూర్యుడు :-
[2-155.1-తే.]

2877} పంకరుహాక్షి  - పంకరుహము(పద్మము) వంటి అక్షి(కన్నులు గలామె), స్త్రీ :-
[6-452-ఉ.]

2878} పంకరుహోదరుడు  - పంకరుహ(పద్మము) ఉదరుడు విష్ణువు :-
[2-101-చ., 3-194-చ.]

2879} పంకేజపత్రేక్షణుడు  - పంకేజము (పద్మము) యొక్క పత్ర (రేకు) ల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు :-
[3-1016-మ.]

2880} పంకేజలోచనుఁడు  - పద్మముల వంటి కన్నులుగలవాడు, విష్ణువు :-
[4-300-మ.]

2881} పంకేరుహగర్భాండము  - పంకేరుహగర్భుని (పద్మమునందు పుట్టినవాని, బ్రహ్మ) అండము, బ్రహ్మాండము :-
[10.1-1308-క.]

2882} పంకేరుహనాభుడు  - పంకేరుహము (పద్మము) నాభి (బొడ్డు)న కలవాడు, విష్ణువు :-
[3-931-ఉ.]

2883} పంకేరుహభవుడు - పంకేరుహ (పద్మము) నందు భవుడు (పుట్టిన) వాడు :-
[2-217.1-తే.]

2884} పంకేరుహమిత్రుడు  - పంకేరుహము (పద్మము)నకు మిత్రుడు, సూర్యుడు :-
[4-352-ఉ.]

2885} పంకేరుహము  - పంకే (బురద)లో రుహము (పుట్టునది), పద్మము :-
[3-937-వ., 5.2-69.1-ఆ., 10.2-647-ఉ.]

2886} పంకేరుహాకరము  - పంకేరుహ (పద్మముల)కు ఆకరములు (నివాసములు), కోనేళ్ళు. :-
[3-37.1-తే.]

2887} పంకేరుహాక్షుడు  - పంకేరుహము (పద్మము) వంటి కన్నులు కలవాడు, విష్ణువు :-
[4-292-తే.]

2888} పంకేరుహాప్తుడు  - పంకేరుహ (పద్మముల)కు ఆప్తుడు, సూర్యుడు :-
[10.2-403.1-తే.]

2889} పంకేరుహోదరుడు  - పంకేరుహము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు :-
[3-1016-మ.]

2890} పంక్తి  - 1.పది, 2.దశ, 3.వరుస, 4.వచనములో పంక్తి పద్యంలో పాదం :-
[2-160-క.]

2891} పంచకర్తలు  - బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివులు అను ఐదుగురు పురుషులు (కారణభూతులు, కర్తలు) :-
[10.2-441-వ.]

2892} పంచకర్మేంద్రియములు  - 1కాళ్ళు 2చేతులు 3నోరు 4గుదము 5మర్మావయవము, (1వాక్ 2పాణి 3పాద 4పాయు 5ఉపస్థులు) :-
[3-204.1-తే., 4-485-వ., 7-363.1-తే.]

2893} పంచకళలు  - 1సత్తు 2చిత్తు 3ఆనందము 4నిర్మలము 5పరిపూర్ణము :-
[10.2-248.1-తే.]

2894} పంచకోశములు  - 1అన్నమయకోశము 2ప్రాణమయకోశము 3మనోమయకోశము 4 విజ్ఞానమయకోశము 5ఆనందమయకోశము :-
[3-921-వ., 10.2-1211.1-తే.]

2895} పంచక్రోధాదులు  - 1కామం 2క్రోధం 3భయం 4నయం 5భక్తి :-
[7-19-వ.]

2896} పంచజనుడు  - 1. పంచజనుడు సాందీపుని పుత్రుని ప్రభాసతీర్థములోనికి తీసికొనిపోయిన రాక్షసుడు. వానిని కృష్ణుడు చంపి గురుదక్షిణగా ఆ కుమారుని తెచ్చి ఇచ్చెను, ఆ పంచజనుని దేహమునుండి వచ్చిన శంఖము పాంచజన్యము, వ్యు. పాంచ+జన్య, పంచజనే దైత్యభేదే భవః 2. పంచజన ప్రజాపతి ఈయన పుత్రిక అసిక్ని దక్షుని భార్య. 3. ప్రహ్లాదుని తమ్ముడు సంహ్లాదుని కొడుకు, 4 మనుష్యుడు, వ్యు. పంచభిః భూతైః జన్యతే పంచ+జన+ఘుఞ న వృద్ధిః, కృ.ప్ర. :-
[2-190-చ., 3-122-ఉ., 6-224-వ.]

2897} పంచజ్ఞానేంద్రియములు  - 1కన్ను 2చెవి 3ముక్కు 4నాలుక 5చర్మము :-
[3-204.1-తే., 5.1-155-వ., 10.1-91.1-తే.]

2898} పంచతన్మాత్రలు  - 1శబ్దము 2స్పర్శ 3 దృక్కు (చూపు) 4ఘ్రాణము (వాసన) మరియు 5రస (రుచి) వాని మూల తత్వములు (5) :-
[2-112-వ., 2-238-వ., 2-259-తే., 3-204.1-తే., 3-718.1-తే., 4-889-వ., 5.1-93-వ., 7-237-వ., 7-366-వ., 10.2-203-వ., 10.2-1211.1-తే.]

2899} పంచత్వము  - పంచభూతములకు తిరిగి చెందుట, మరణము :-
[4-104-వ., 10.1-464-క.]

2900} పంచపాండవులు  - పాండురాజు సంతానము, 1ధర్మరాజు, 2భీముడు, 3అర్జునుడు, 4నకులుడు, 5సహదేవుడు :-
[1-186-వ.]

2901} పంచప్రస్థము  - పంచేద్రియము ప్రవృత్తులకు సంకేతం :-
[4-772-వ.]

2902} పంచప్రాణములు  - 1. ప్రాణము (హృదయమున నుండునది), 2. అపానము (గుదమున నుండునది), 3. సమానము (నాభి మండలమున నుండునది), 4. ఉదానము (కంఠమున నుండునది), 5. వ్యానము (శరీరమంతట వ్యాపించి యుండునది). :-
[4-853-వ., 4-855-వ., 10.1-236-వ., 10.1-405.1-తే., 10.1-1236-దం., 10.1-1472.1-తే., 10.1-1779-వ., 10.2-1203-వ.]

2903} పంచప్రాణవాయువులు  - 1. ప్రాణము (హృదయమున నుండునది), 2. అపానము (గుదమున నుండునది), 3. సమానము (నాభి మండలమున నుండునది), 4. ఉదానము (కంఠమున నుండునది), 5. వ్యానము (శరీరమంతట వ్యాపించి యుండునది). :-
[3-899-తే.]

2904} పంచబంధనములు  - పంచప్రాణములకు సంకేతం. :-
[4-771.1-తే.]

2905} పంచబాణుడు  - 1ఉన్మాదన 2తాపన 3శోషణ 4స్తంభన 5సమ్మోహనములను ఐదు (5) బాణములు కలవాడు, పాఠ్యంతరమున 1అరవిందము 2అశోకము 3చూతము 4నవమల్లిక 5నీలోత్పలము అను ఐదు (5) పూలబాణములు కలవాడు, మన్మథుడు :-
[1-272-మత్త., 10.1-798-వ., 10.2-11-వ.]

2906} పంచబుద్దులు, పంచతన్మాత్రలు  - 1శబ్దము 2స్పర్శ 3 దృక్కు (చూపు) 4ఘ్రాణము (వాసన) మరియు 5రస (రుచి) వాని మూల తత్వములు (5) :-
[5.1-155-వ.]

2907} పంచభక్ష్యములు  - 1భక్ష్యము (కొరికి తినగలిగినవి, అరిసెలు, జంతికలు వగైరా) 2భోజ్యము (పిడుచగా తిన గలిగినవి, కూర అన్నము వగైరా) 3లేహ్యము (నాకి చప్పరించ గలవి, తేనె, తిమ్మనం వగైరా) 4చోష్యము (జుఱ్ఱుకో దగినవి, పెఱుగు వగైరా) 5పానీయము (తాగ గలిగినవి, పాలు, పళ్ళరసములు వగైరా) ఐన ఆహార పదార్థములు :-
[10.1-859-వ.]

2908} పంచభల్లుడు  - ఐదు (పూల) బాణములు కలవాడు, మన్మథుడు :-
[10.1-968-వ.]

2909} పంచభూతగుణములు  - (1)శబ్దాది, శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, (2) 1.భూమి (తన్మాత్ర గంధము, గుణములు శబ్ద స్పర్శ రూప రస గంధములు) 2.జలము (తన్మాత్ర రసము, గుణములు శబ్ద స్పర్శ రూప రసములు) 3తేజస్సు (తన్మాత్ర రూపము, గుణములు శబ్ద స్పర్శ రూపములు) 4.వాయువు (తన్మాత్ర స్పర్శ, గుణములు శబ్ద స్పర్శలు) 5,ఆకాశము (తన్మాత్ర శబ్దము, గుణము శబ్దము) :-
[10.1-1779-వ.]

2910} పంచభూతములు  - 1.భూమి 2.జలము 3తేజస్సు 4.వాయువు 5,ఆకాశము "పృథివ్యాపస్తేజో వాయురాకాశమితి భూతాని"[గౌతమన్యాయసూత్రములు 1 1 13] :-
[1-386-వ., 2-68.1-తే., 3-309.1-తే., 3-363-వ., 3-1025-వ., 4-355-వ., 4-849-వ., 7-237-వ., 7-469-వ., 8-216-వ., 8-235-క., 8-614-క., 10.1-66-క., 10.1-89.1-ఆ., 10.1-405.1-తే., 10.1-682.1-తే., 10.2-160-వ., 10.2-203-వ.]

2911} పంచభూతములు  - 1నభస్ (ఆకాశము) 2వాయు (గాలి) 3కుంభిని (భూమి) 4సలిల (నీరు) 5తేజస్ (అగ్ని) :-
[3-204.1-తే.]

2912} పంచమలములు  - 1ఆణవ 2కార్మిక 3మాయిక 4మాయేయ 5తిరోధానములు అనెడి ఆధ్యాత్మవిధ్యార్జనలో కలిగెడి మలములు :-
[10.1-682.1-తే., 10.1-766-వ.]

2913} పంచమహాపాతకములు  - 1స్వర్ణస్థేయము 2సురాపానము 3బ్రహ్మహత్య 4గురుపత్నీగమనము 5ఇవి చేయువారి తోడి స్నేహము, పంచమహాపాతకములు :-
[6-146.1-తే.]

2914} పంచమహాభూతములు  - 1నభస్ (ఆకాశము) 2వాయు (గాలి) 3కుంభిని (భూమి) 4సలిల (నీరు) 5తేజస్ (అగ్ని) :-
[3-1005-వ., 4-485-వ., 6-327.1-తే., 7-217-వ., 10.1-126.1-ఆ., 10.1-1472.1-తే.]

2915} పంచమహాయజ్ఞములు  - 1వేదపఠనము (దేవ యజ్ఞము) 2వైశ్వదేవాది హోమము (బ్రహ్మ యజ్ఞము) 3అతిథి పూజ (అతిథి యజ్ఞము) 4పితృతర్పణము (పితృ యజ్ఞము) 5భూతబలి (భూత యజ్ఞము), పంచ ఇష్టులు :-
[10.2-465-వ., 10.2-619.1-తే.]

2916} పంచమహావాద్యములు  - 1. భేరి, 2. కాహళము, 3. పటహము, 4. శంఖము, 5. జయఘంట. :-
[5.1-133-వ.]

2917} పంచమాతలు  - 1రాజు భార్య 2అగ్రజుని భార్య 3గురు భార్య 4భార్య జనని 5స్వజనని :-
[2-38-వ., 9-348-క.]

2918} పంచయజ్ఞములు  - 1వేదపఠనము (దేవ యజ్ఞము) 2వైశ్వదేవాది హోమము (బ్రహ్మ యజ్ఞము) 3అతిథి పూజ (అతిథి యజ్ఞము) 4పితృతర్పణము (పితృ యజ్ఞము) 5భూతబలి (భూత యజ్ఞము), పంచ ఇష్టులు :-
[7-415-ఉ.]

2919} పంచవన్నెలు  - 1శుక్లము (తెలుపు) 2కృష్ణము (నలుపు) 3పీతము (పసుపు పచ్చ) 4హరితము (ఆకుపచ్చ) 5రక్తము (ఎరుపు) :-
[10.2-346-వ.]

2920} పంచవింశతితత్త్వములు  - పంచభూతములు (1 5), పంచజ్ఞానేంద్రియములు (6 10) పంచకర్మేంద్రియములు(11 15) పంచతన్మాత్రలు(16 20) మనసు(21) బుద్ధి(22) చిత్తము(23) అహంకారము(24) పురుషుడు(25). పాఠ్యంతరము, 1 అవ్యక్తము 2మహత్తు 3అహంకారము 4మనసు 5నుండి14జ్ఞానేంద్రియకర్మేంద్రియములు పది 15నుండి19 తన్మాత్రలు ఐదు 20నుండి24మహాభూతములు ఐదు 25పురుషుడు :-
[6-225.1-ఆ., 6-234-మత్త.]

2921} పంచవిక్రమము  - పంచేంద్రియ ఇంద్రియముల వ్యాపారములకు సంకేతము. :-
[4-771.1-తే.]

2922} పంచశరాకారుడు  - పంచశరుని (మన్మథుని) వంటి ఆకారము కలవాడు, కృష్ణుడు :-
[10.1-1281-క.]

2923} పంచశరుడు  - అయిదు (పుష్ప) బాణములు కలవాడు, మన్మథుడు :-
[1-241.1-తే., 3-126.1-తే., 3-378.1-తే.]

2924} పంచశిలీముఖుడు  - పంచ (ఐదు, 5) శిలీముఖములు (బాణములు) గలవాడు, మన్మథుడు :-
[6-446.1-తే.]

2925} పంచాగ్నులు  - 1దక్షిణాగ్ని కామాగ్ని వెన్నెముక దిగువ భాగమునకు (దక్షిణము)నకు చెందినది 2గార్హపత్యము ఆకలి ఉదరస్థానమైనది 3ఆహవనీయము జ్ఞానాగ్ని తలలోనుండును 4సథ్యము ప్రాణాగ్ని వక్షముననుండును 5అవసథ్యము ఆత్మాగ్ని ప్రకృతి నుండి తనను వేరుగ గుర్తింపజేయునది :-
[4-648.1-తే.]

2926} పంచాయుధగేహము  - పంచాయుధుని (మన్మథుని) గేహము (నివాసము), స్త్రీల రహస్యేంద్రియము, ఉపస్తు :-
[10.1-840-క.]

2927} పంచాయుధుడు  - (అ) 1ఉన్మాదన 2తాపస 3శోషణ 4స్తంభన 5సమ్మోహనములను ఐదు (5) బాణములు కలవాడు, (ఆ) 1అరవిందము 2అశోకము 3శోషణ 4స్తంభన 5సమ్మోహనములను ఐదు (5) పూలబాణములు కలవాడు, మన్మథుడు :-
[10.2-26-మ.]

2928} పంచారామములు  - పంచ (ఐదు) ఆరామములు, ఇంద్రియ గోచర మగు విషయములకు సంకేతము, తోటలు :-
[4-849-వ.]

2929} పంచాశుగుడు  - 1అరవిందము 2అశోకము 3చూతము 4నవమల్లిక 5నీలోత్పలము అనెడి ఐదు బాణములు కలవాడు, మన్మథుడు :-
[10.1-787-మ., 10.1-1281-క.]

2930} పంచాశ్వములు  - పంచజ్ఞానేంద్రియములు :-
[4-771.1-తే.]

2931} పంచాస్యము  - తెరచిననోరు గల మృగము, తెఱనోటిమెకము, సింహము :-
[3-419-మ., 10.1-1378-శా.]

2932} పంచితిలు(క్రియ)  - గోవు మూత్రము విడుచు :-
[1-412-శా.]

2933} పంచేంద్రియములు  - కళ్ళు చెవులు ముక్కు నోరు చర్మము :-
[1-459.1-తే.]

2934} పంచేంద్రియములు  - పంచ జ్ఞానేంద్రియములు, 1కన్ను 2చెవులు 3ముక్కు 4నాలిక 5చర్మము, (త్వక్చక్షుశ్శ్రోత్రజిహ్వాఘ్రాణము లనెడి యైదింద్రియములు) :-
[4-485-వ., 7-117.1-ఆ., 8-44.1-తే., 8-65-శా., 9-122-క.]

2935} పంచేషుడు  - పంచ ఇషుడు, పంచబాణుడు, మన్మథుడు :-
[10.1-1488-మ.]

2936} పక్వకషాయుడు  - పరిపక్వము చెందిన విషయాభిలాషములు కలవాడు, విషయములపై కోరికలు లేనివాడు :-
[4-834-వ.]

2937} పక్షములు  - 1శుక్లపక్షము 2కృష్ణపక్షము అని మాసమునకు రెండు పక్షములు :-
[5.2-86-వ.]

2938} పక్షిరాట్పత్రుడు  - పక్షులకురాజు (గరుత్మంత్రుడు) యొక్క పత్రుడు (వాహనముగా కలవాడు), విష్ణువు. :-
[3-284-మ.]

2939} పక్షీంద్రుడు  - పక్షులకు ఇంద్రుడు (శ్రేష్ఠుడు. ప్రభువు), గరుడుడు :-
[8-98-మ., 10.1-1377-శా.]

2940} పగ్గములు  - గుఱ్ఱము మున్నగువాని కళ్ళెమునకు తగిలించెడి తోలుటకైన తాళ్ళు :-
[10.1-20.1-ఆ.]

2941} పచ్చవిలుకాడు  - పచ్చని (చెఱుకుగడ) విల్లు కలవాడు, మన్మథుడు :-
[9-47-క.]

2942} పటు - పటుతరము పటుతమము :-
[1-374-చ., 7-173-చ., 8-121.1-ఆ.]

2943} పటువు - పటుతరము పటుతమము :-
[10.1-1622-క.]

2944} పట్టము  - రాజ్యాభిషేక కాలమున నుదట కట్టెడు పట్టీ :-
[1-385.1-ఆ.]

2945} పట్టాభిషేకము  - రాజ్యాధికారము స్వీకరించు సమయమున చేసెడి పట్టము కట్టుట అభిషేకము మొదలైన కర్మములు, రాజ్యాధికారదత్తము :-
[4-409.1-తే.]

2946} పతంగ  - సూర్యుడు, పక్షి, వ్యు. పత్+గమ్+డ, పతన్ ఉత్ప్లవన్ గచ్ఛతి] ఎగురుతూ వెళ్లునది. :-
[5.2-30-వ.]

2947} పతంగపుంగవవిహారుడు  - పతంగ పుంగవ (పక్షులలో ఉత్తముడు గరుత్మంతుడు) పై విహారుడు (విహరించెడి వాడు), విష్ణువు :-
[6-173-చ.]

2948} పతకము  - మెడలోని హారమునకు వేళ్ళాడు బిళ్ళ :-
[10.1-1587.1-తే.]

2949} పతగరాజు  - పతంగ (పక్షుల)కు రాజు, గరుత్మంతుడు :-
[5.2-119-వ.]

2950} పతత్రి  - రెక్కలు గలది, పక్షి వ్యు. పత్+అత్రిన్, పతన్ గచ్ఛతి, ఎగురుతూ వెళ్లునది. పక్షి. :-
[5.2-62-వ.]

2951} పతాకకరభావము  - జండావలె బొటకనవేలు తప్ప తక్కినవేళ్ళన్నియు చాచి పట్టునది, శ్లో. అంగుళ్యఃకుంచితైంగుష్టా స్సంశ్లిష్టాః ప్రసృతాయది, సపతాకకరఃప్రోక్తోనృత్యకర్మవిశారదైః.. రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

2952} పతాకాత్రితయము  - 1సత్త్వ 2రజః 3 తమః అనెడి త్రిగుణములు (సంకేతము) :-
[4-771.1-తే.]

2953} పతిదైవతశీలసమంచిత  - పతియే దైవముగ భావించెడి శీలము గలామె, పతివ్రత :-
[4-836-క.]

2954} పతివ్రత  - పతినే దైవముగా వ్రతముగా నిష్ఠకలయామె, పతిదైవత శీల సమంచిత, పతియే దైవతముగా ధరించెడి శీలము (స్వభావము)తో చక్క నామె :-
[4-662-వ., 4-837-తే., 7-416.1-ఆ., 10.2-267-ఉ.]

2955} పత్నీశాల  - యజమాని భార్య యొక్క శాల :-
[4-118-వ.]

2956} పదకొండుయింద్రియములు  - 5 జ్ఞానేంద్రియములు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. 5 కర్మేంద్రియములు పాయుము, ఉపస్తు, చేతులు, కాళ్ళు, నోరు మరియు మనస్సు :-
[2-68.1-తే.]

2957} పద్మకల్పము  - 1. ప్రస్తుతము జరుగుచున్న శ్వేతవరాహ కల్పమునకు ముందరి కల్పము, 2. జీవుడు గర్భమున పడినది మొదలు బొడ్డు కోయుటవరకు గల సమయము పద్మకల్పము తరువాతది శ్వేతవరాహకల్పము :-
[3-150-వ.]

2958} పద్మకోశకరభావము  - తామరమొగ్గవలె ఐదువేళ్ళను కొంచెము వంచి ఎడము కలవిగా చేసి అరచేయి పల్లముగ ఏర్పడునట్లు పట్టునది, శ్లో. అంగుళ్యో విరాళాః కించిత్కుంచితాస్త నిమ్నగాః, పద్మకోశాభిధో హస్తస్తన్నిరూపణముచ్యతే., రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

2959} పద్మగంధి  - పద్మముల వంటి దేహ పరిమళము కల స్త్రీ :-
[10.2-212.1-ఆ.]

2960} పద్మగర్భుడు  - పద్మము జన్మస్థానముగా కలవాడు, బ్రహ్మదేవుడు :-
[2-242-తే., 4-9-క., 12-48-వ.]

2961} పద్మజుడు  - పద్మమున జన్మించినవాడు, బ్రహ్మదేవుడు :-
[3-332-క., 3-339-వ., 3-405-క., 3-725-వ.]

2962} పద్మదళనేత్రుడు  - పద్మముల రేకుల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు, విష్ణువు :-
[4-712.1-తే.]

2963} పద్మదళాక్షుడు  - పద్మముల రేకుల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు, విష్ణువు :-
[10.1-94-క., 10.1-1251-క., 10.2-200-క., 10.2-209-ఉ., 10.2-760-క.]

2964} పద్మనయన  - పద్మములవంటి కన్నులు స్త్రీ :-
[9-64-ఆ.]

2965} పద్మనయనుడు  - పద్మముల రేకుల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు, విష్ణువు :-
[10.1-1692.1-ఆ.]

2966} పద్మనాభుడు  - పద్మము నాభి (బొడ్డు)న కలవాడు, విష్ణువు :-
[1-206-వ., 1-396-వ., 3-921-వ., 4-150.1-తే., 10.2-749-ఆ.]

2967} పద్మనేత్రులు - కమలములవంటి కన్నులు కలవారు, బలరాముడు మరియు కృష్ణుడు :-
[10.1-1201-మ.]

2968} పద్మపత్రనేత్రుడు  - తామర ఆకుల వంటి కన్నులు కలవాడు, విష్ణువు, కృష్ణుడు, బలరాముడు :-
[4-370.1-తే.]

2969} పద్మపత్రలోచనుడు  - పద్మ (తామర) పత్ర (ఆకుల)వంటి లోచనుడు (కన్నులు గలవాడు), విష్ణువు :-
[4-892-చ.]

2970} పద్మపత్రాక్షుడు  - పద్మముల రేకులవంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు :-
[3-203-దం.]

2971} పద్మబంధుడు  - పద్మములకు బంధువు, సూర్యుడు :-
[1-243-వ.]

2972} పద్మబాంధవుడు  - పద్మములకు బంధువు, సూర్యుడు :-
[3-498-ఉ., 10.2-636-వ.]

2973} పద్మభవకుమారుడు  - పద్మభవ (బ్రహ్మదేవుని) కుమారుడు, నారదుడు :-
[10.2-625-క.]

2974} పద్మభవాండము  - పద్మభవ (బ్రహ్మ) అండము, బ్రహ్మాండము :-
[10.1-1541-ఉ.]

2975} పద్మభవుడు  - పద్మమున పుట్టినవాడు, బ్రహ్మదేవుడు :-
[3-316-తే., 10.2-131-మ.]

2976} పద్మమాలికాలంకృతుడు  - పద్మ మాలికలతో అలంకరింపబడిన వాడు, కృష్ణుడు :-
[1-188-వ.]

2977} పద్మలోచనుడు  - పద్మముల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు, విష్ణువు :-
[1-148.1-ఆ., 1-188-వ., 3-315-మ., 3-393-చ., 3-631-చ., 3-646-తే., 3-836-చ., 4-917-చ., 7-106-ఉ.]

2978} పద్మసంకాశచరణుడు  - పద్మముల వలె ప్రకాశించు పాదములు గలవాడు, కృష్ణుడు :-
[1-188-వ.]

2979} పద్మసంభవుడు  - పద్మమున సంభవించిన (పుట్టిన) వాడు, బ్రహ్మదేవుడు :-
[3-150-వ., 3-376-తే., 3-667-వ., 3-702-తే., 3-720.1-తే., 3-1055-గ., 4-132-వ.]

2980} పద్మాకారబంధము  - తామరరేకుల వలె పేర్పుగాను వలయాకారముగాను నిలిచి పరస్పర హస్త విన్యాసాదులు చూపునది, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

2981} పద్మాక్షి  - పద్మముల వంటి కన్నులు కలామె, స్త్రీ :-
[10.1-790-మ.]

2982} పద్మాక్షుడు  - పద్మముల వంటి కన్నులు ఉన్న వాడు, కృష్ణుడు, విష్ణువు :-
[2-180-మ., 2-196-మ., 2-221.1-తే., 3-126.1-తే., 3-294.1-తే., 3-362.1-తే., 3-400-మ., 4-177-మ., 7-171.1-తే., 8-483.1-తే., 10.1-714-మ.]

2983} పద్మాపతి  - పద్మ (లక్ష్మీదేవి) భర్త, విష్ణువు :-
[3-248-క.]

2984} పద్మాయతాక్షుడు  - పద్మముల వలె విశాలమైన కన్నులు కలవాడు, విష్ణువు :-
[10.2-440-తే., 10.2-516.1-తే.]

2985} పద్మాలయ  - పద్మములను నివాసముగా కలామె, లక్ష్మీదేవి :-
[3-532-మ.]

2986} పద్మావిభుడు  - పద్మ (లక్ష్మీదేవి) భర్త, విష్ణువు. :-
[3-355.1-తే.]

2987} పద్మాసనము  - కాళ్ళుమడిచి కూర్చొనుటలో పద్మము వంటి ఆకారము కల (విశిష్టమైన) ఆసనము :-
[3-180.1-తే.]

2988} పద్మాసనుడు  - పద్మము ఆసనముగా గలవాడు, బ్రహ్మదేవుడు :-
[5.1-7.1-తే., 5.1-8-వ., 5.1-40-వ.]

2989} పద్మినీవల్లభుడు  - పద్మములకు ప్రియుడు, సూర్యుడు . :-
[9-719-వ.]

2990} పద్మోదరుడు  - పద్మము ఉదరమున (కడుపున) కలవాడు, విష్ణువు, కృష్ణుడు :-
[3-674-క., 3-686.1-తే., 4-900-క., 10.2-680-క.]

2991} పన్నగతల్పుడు  - పన్నగము (ఆదిశేష సర్పము) తల్పము (పాన్పుగాగల వాడు), విష్ణువు :-
[7-106-ఉ.]

2992} పన్నగపతిశాయి  - పన్నగపతి (ఆదిశేషుని) పై శాయి (శయినించువాడు), విష్ణువు :-
[6-177-క.]

2993} పన్నగరాజశాయి  - పన్నగరాజు (ఆదిశేషుని) శాయి (శయ్యగా కలవాడు), విష్ణువు :-
[6-12-ఉ.]

2994} పన్నగశాయి  - పన్నగ (శేషసర్పము) పైన శాయి(శయనించువాడు), విష్ణువు :-
[7-193-ఉ.]

2995} పన్నగాంతకుడు  - పన్నగము (పాము) లకు అంతకుడు (యముని వంటి వాడు), గరుడుడు :-
[10.1-708.1-తే., 10.2-747.1-తే.]

2996} పన్నగాకల్పుడు  - పన్నగ (సర్పాలచే) ఆకల్పుడు (ఆలంకరింపబడినవాడు), శివుడు :-
[10.2-358.1-తే.]

2997} పన్నగాధీశతల్పుడు  - పన్నగాధీశుడు (ఆదిశేషుడు) తల్పుడు (పాన్పుగా కలవాడు), విష్ణువు :-
[10.1-1236-దం.]

2998} పన్నగాధీశులు  - ఆదిశేషుడు అనంతుడు వాసుకి మున్నగు సర్పరాజులు :-
[10.1-291.1-తే.]

2999} పన్నగేంద్రుడు  - పన్నగ (సర్పము)లకు రాజు, వాసుకి, శేషుడు :-
[10.1-1747-వ., 10.2-248.1-తే.]

3000} పయస్యము  - పయస్సు (పాల) నుండి వచ్చినది, నెయ్యి :-
[3-451.1-తే.]

3001} పయోజగర్భుడు  - పయోజము (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు :-
[2-247-చ., 4-144-తే.]

3002} పయోజభవుడు  - పయోజము (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు :-
[8-533-శా.]

3003} పయోజసన్నిభపదుడు  - పయోజ (పద్మము) సన్నిభ (సమానమైమ) పదుడు (పాదములు గలవాడ), విష్ణువు :-
[4-920-ఉ.]

3004} పయోజాసనార్చితుడు  - బ్రహ్మచేపూజింపబడువాడు, విష్ణువు :-
[3-58-మ.]

3005} పయోదశ్యాముడు  - పయోద (మేఘము వంటి) శ్యామ (నల్లనివాడు), రాముడు :-
[8-1-క.]

3006} పయోధరము  - 1. పయః (పాలను) ధరించునది, కుచము, 2. పయః (నీటిని) ధరించునది, మేఘ ము :-
[10.1-1747-వ.]

3007} పయోధరాకారుడు  - పయోధరము (మేఘముల వలె) నల్లని ఆకారుడు (దేహము కలవాడు), కృష్ణుడు :-
[10.1-644-ఉ.]

3008} పయోధి  - పయస్ (నీటి)కి నిధి, కడలి :-
[3-437.1-తే., 3-459-వ., 10.1-144-క.]

3009} పయోధినాథుడు  - పయస్ (నీటి)కి అధి (నివాసమైనది) (సముద్రము)నకు నాథుడు (ప్రభువు), వరుణుడు. :-
[3-617-చ.]

3010} పయోభక్షణము  - పయస్ (నీరు) భక్షణము (నీరు ఆహారముగా తీసుకొనెడి వ్రతము), విష్ణు ప్రీతి కోసం పన్నెండు రోజులు చేసే ఒక వ్రతం :-
[8-480-వ.]

3011} పయోరాశి  - పయస్(నీటి)ని రాశిపోసినది, మహాసముద్రము :-
[3-355.1-తే., 8-210-వ., 8-706.1-ఆ.]

3012} పయోరుహగర్భాండము  - పయోరుహగర్భ (బ్రహ్మ) అండము, బ్రహ్మాండము :-
[3-184-వ.]

3013} పయోరుహగర్భుఁడు  - పయోరుహము (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు :-
[3-279-ఉ.]

3014} పయోరుహనాభుడు - పద్మము బొడ్డున గల వాడు, విష్ణువు :-
[10.2-455-చ.]

3015} పయోరుహపత్రలోచనుడు  - పయోరుహ (తామర) పత్ర (ఆకుల) వంటి లోచనుడు (కన్నులున్నవాడు), విష్ణువు. :-
[4-552-చ.]

3016} పయోరుహము  - పయస్ (నీట) పుట్టినది, పద్మము :-
[3-275.1-తే.]

3017} పయోరుహహితుడు  - పయస్ (నీటి) యందు రుహ (పుట్టినవి) పద్మములకు హితుడు (ఇష్టుడు), సూర్యుడు :-
[4-330-క.]

3018} పయోరుహాక్షి  - పయోరుహము (పద్మము)లవంటి కన్నులు గలామె, స్త్రీ :-
[4-786-ఆ.]

3019} పయోరుహోదరుడు  - పయోరుహము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు. :-
[4-187-చ.]

3020} పయోవిహారి  - జలములలో విహరించువాడు, విష్ణువు :-
[3-335-ఉ.]

3021} పయోవ్రతము  - నీరుమాత్రము తీసుకొనెడి ఉప్పోషము, నిరాహార వ్రతము, జలము లేదా పాలు మాత్రము ఆహారముగా చేయు వ్రతము. :-
[9-10.1-తే.]

3022} పరంజ్యోతి  - పరము (అత్యుత్తమ) ప్రకాశమైన స్వరూపము, సర్వాతీతమైన ప్రకాశము, పరబ్రహ్మము, విష్ణువు :-
[3-203-దం., 3-203-దం., 3-373-మ., 3-861-క., 3-942.1-తే., 5.1-155-వ.]

3023} పరకాష్ఠ  - అవధి, అవధి వంటివాడు, పతాక స్థాయి, అత్యధికుడు :-
[3-89.1-తే.]

3024} పరతంత్రుడు  - పరులచే నడపబడువాడు :-
[3-244-వ.]

3025} పరబ్రహ్మ  - సర్వాతీతమైన విశ్వకారణభూతుడు, విష్ణువు, అఖండ పరిపూర్ణ సచ్చిదానంద పరబ్రహ్మ (శో. బహిర్బ్రహ్మ వృద్ధై బృహతేర్ధాతోః అర్థానుగమాత్ దేశతః కాలతః వస్తుతః అపరిచ్ఛిన్నం యద్వస్తు తద్బ్రహ్మేతి భాష్యం), నజాయతే మ్రియతేవా కథాచిన్నాయంభూత్వా భవితా వా నభూయః, అజోనిత్యశ్శాశ్వత్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే (శ్రుతి ప్రతిపాద్య బ్రహ్మతత్వము) :-
[3-1025-వ., 3-1025-వ., 4-468-వ., 10.1-681-వ., 10.1-1449-మ.]

3026} పరబ్రహ్మమయుడు  - పరబ్రహ్మముయైనవాడు, విష్ణువు :-
[4-359.1-తే.]

3027} పరబ్రహ్మస్వరూపుడు  - పరబ్రహ్మ యొక్క స్వరూపము అయినవాడు, విష్ణువు :-
[3-839-వ.]

3028} పరమకళ్యాణుడు  - పరమ (అత్యున్నతమైన) కళ్యాణుడు (శ్రేయస్సు కలిగించువాడు), విష్ణువు :-
[6-343-వ.]

3029} పరమపదము  - సర్వోత్కృష్ట స్థానము, మోక్షము :-
[10.1-871-క.]

3030} పరమపదవాసుడు  - పరమపదము (వైకుంఠము)న వాసుడు (వసించెడివాడ), విష్ణువు, శ్రీకృష్ణ :-
[5.1-182-క.]

3031} పరమపరుడు  - పరమైనవానికిని పరమైన (ఉన్నతమైన) వాడు, పరాత్పరుడు :-
[3-68-క.]

3032} పరమపుణ్యుడు  - ఉత్కృష్టమైన పుణ్యవంతుడు, విష్ణువు :-
[10.2-108.1-తే.]

3033} పరమపురుషుడు  - సర్వాతీతమైన పురుషయత్నము కలవాడు, విష్ణువు. :-
[2-238-వ., 2-239-క., 3-215-వ., 3-308.1-తే., 3-365-క., 3-874-వ., 3-1025-వ., 4-191.1-తే., 4-280-వ., 4-408-వ., 4-478-క., 4-733-క., 6-124.1-ఆ., 6-342-ఆ., 7-217-వ., 8-483.1-తే., 8-675-వ., 10.1-129-తే., 10.1-572.1-తే., 10.1-681-వ., 10.1-975-వ.]

3034} పరమమంగళుడు  - పరమ (అత్యుత్తమమైన) మంగళుడు (శుభకరుడు), విష్ణువు :-
[6-343-వ.]

3035} పరమమునిగేయుడు  - అత్యుత్తమైన మునులచే కీర్తింపబడువాడు, విష్ణువు :-
[4-286.1-తే.]

3036} పరమహంస  - 1.సర్వ పరిత్యాగము చేసి జ్ఞానమార్గమున చరించు సన్యాసి, ఆనందాత్మను నేను అని ఎరుక కలిగిన వాడు పరమహంస. (పరం ఆనందాత్మా అహం అస్మీతిహన్తి గచ్ఛతి జనాతీతి పరమహంసః శబ్ద కల్పద్రువం). 2.యతులకు వాడేపదం. :-
[1-63-వ., 2-239-క., 3-534-చ., 4-703.1-తే.]

3037} పరమహంసము  - పరమ హంస యైనవాడు, బ్రహ్మ :-
[6-3-ఉ.]

3038} పరమాణుకారణవాదులు  - పరమాణు స్వరూపుడే పరబ్రహ్మ జగత్తుకి మూలకారణభూతుడు అనెడివారు :-
[10.2-1220-వ.]

3039} పరమాణువు  - కిటికీలోంచి పడెడి సూర్య కిరణమునందు కనబడెడి రేణువునంద ఆరవ భాగము అణువు. ఇది కంటికి కనబడదు. అట్టి దానిలో ఆరవ భాగము పరమాణువు అనెదరు. :-
[10.1-557.1-తే.]

3040} పరమాత్మ  - ఏకమేవాద్వితీయంబ్రహ్మ (శ్రుతి), ఏకము కనుక సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనిది అద్వితీయము కనుక ఇతరము (తనుకానిది) లేనిది పరమాత్మ :-
[2-28-వ., 2-110-మ., 2-267-వ., 3-1032-వ., 4-286.1-తే., 4-459-వ., 7-371-వ., 10.1-568-వ., 10.1-1779-వ., 10.2-477-ఆ.]

3041} పరమాత్మకుడు  - పరమ (అత్యన్నతమైన) ఆత్మ కలవాడు, విష్ణువు :-
[3-668-ఉ.]

3042} పరమాత్మత్రైవిధ్యము - దేహము (మొదటివాడు) దేహి (జీవుడు, రెండవవాడు), దేహములో (సర్వాంతర్యామి, మూడవవాడు) తానై యుండుట :-
[6-172-చ.]

3043} పరమాత్ముడు  - సర్వమునందు ఆత్మ యై ఉండి సర్వాత్మలు తానైన వాడు, విష్ణువు, శివుడు :-
[2-209-చ., 3-198.1-తే., 3-212-చ., 3-473-వ., 3-874-వ., 3-1025-వ., 4-358.1-తే., 11-56-వ., 11-77-వ.]

3044} పరమానందుడు  - పరమానంద స్వరూపుడు, విష్ణువు :-
[3-96-క.]

3045} పరము  - పరలోకము :-
[3-300-చ.]

3046} పరముడు  - సర్వమునకు పరమైనవాడు (అతీతమై ఉండువాడు), విష్ణువు :-
[3-293.1-తే., 3-400-మ., 3-523-చ., 3-1024-క., 4-367.1-తే., 6-173-చ., 6-213-తే., 6-229-తే., 7-376.1-తే., 7-447-ఆ., 8-477-మ.]

3047} పరమేశుడు  - సమస్తమునకు పరమమైన ఈశ్వరుడు, కృష్ణుడు :-
[2-96-క., 2-99-క., 3-30-ఉ., 3-257-క., 3-510-చ., 3-844-చ., 3-861-క., 4-298-చ., 4-892-చ., 4-917-చ., 6-342-ఆ., 7-459-ఉ., 10.1-622-ఉ., 10.1-1449-మ.]

3048} పరమేశ్వరుడు  - పరమమైన ఈశ్వరుడు, సర్వోత్కృష్టమైన మరియు సర్వుల (బ్రహ్మాది పిపీలకపర్యంతము)ను నియమించు వాడు, కృష్ణుడు, విష్ణువు, శివుడు :-
[1-183-వ., 1-218-వ., 2-26-వ., 2-152-వ., 2-174-వ., 2-252-వ., 3-202-వ., 3-215-వ., 3-423.1-తే., 3-473-వ., 3-473-వ., 3-591-క., 3-856.1-తే., 3-956-చ., 3-1055-గ., 5.1-54-వ., 6-217-వ., 7-109-వ., 7-147-వ., 7-217-వ., 7-371-వ., 7-397-వ., 8-11-వ., 8-479-క., 9-15-వ., 10.1-887-వ., 10.1-958-ఉ., 10.1-1503-వ., 11-26-వ., 11-62-వ.]

3049} పరమేష్టి  - అత్యున్నతమైన సంకల్పశక్తుడు, పరమము (ఉత్తమమైన) ఇష్టి (యజ్ఞము) అయినవాడు, బ్రహ్మదేవుడు :-
[2-30-వ., 2-58-మ., 2-222-వ., 2-231.1-తే., 3-367-వ., 3-1055-గ., 4-54-వ., 7-88-వ., 8-158-వ., 10.1-540-ఉ., 10.2-209-ఉ., 11-83-క.]

3050} పరమేష్ఠితనయుడు  - బ్రహ్మపుత్రుడు, నారదుడు :-
[10.2-629-ఆ.]

3051} పరమేష్ఠిసుతుడు  - బ్రహ్మదేవుని కొడుకు, నారదుడు :-
[10.2-617-క.]

3052} పరలోకక్రియలు  - మరణానంతరము జీవి, పై లోకములకేగుటకు చేసెడి విధులు, కార్యక్రమము, ఉత్తరక్రియలు :-
[1-228-వ., 10.2-95-వ.]

3053} పరలోకగతుడు  - పరలోకమునకు పోవువాడు, మరణించినవాడు :-
[4-823.1-తే., 4-829-వ.]

3054} పరశుధరుడు  - పరశువు (గొడ్డలి)ని ధరించినవాడు, పరశురాముడు :-
[11-72.1-తే.]

3055} పరహృదయవిదారి  - పర (విరోధుల) హృదయ (గుండెలను) విదారి (చీల్చెడి వాడు), శ్రీరాముడు :-
[10.1-1791-మాలి.]

3056} పరాక్రమము  - పర (గొప్ప) క్రమము (విధానము), శౌర్యము, వ్యు. పరా+క్రమ్+ఘఞ్, పరాక్రమ్యతే అనేన, దీనిచే ఆక్రమించబడును. పరాక్రమము; దాటి వెళ్లుట. :-
[3-973-క.]

3057} పరాఙ్ముఖుడు  - పక్కకు తిప్పిన ముఖము కలవాడు, పెడముఖమువాడు, విముఖుడు :-
[10.2-424.1-తే.]

3058} పరాజితకంసుఁడు  - ఓడింపబడిన కంసుడు కలవాడు, కృష్ణుడు :-
[10.2-206-ఉ.]

3059} పరాత్పరుడు  - పరముకన్న పరమైన వాడు, అన్నిటికి ఉన్నతమైన వాడు, విష్ణువు :-
[3-100-వ., 3-220-క.]

3060} పరాత్మభూముడు  - పరబ్రహ్మము తానే ఐన వాడు, విష్ణువు :-
[10.1-566-ఆ.]

3061} పరాపరుడు  - పరము, అపరము తానైనవాడు, పర (ఇతరము) అన్నది అపరము (ఇతరము లేని) వాడు, తాను తప్పఇతరము లేనివాడు, పరాత్పరుడు, కృష్ణుడు, విష్ణువు :-
[3-31-ఉ., 3-91-వ., 3-166-క., 3-364-చ., 4-357-వ., 4-920-ఉ.]

3062} పరాయత్తము  - ఆయత్తమునకు పరమైనది, వికలము :-
[1-381-వ.]

3063} పరావృత్తశిరోభావాలు  - వెనుకకు తిప్పిన శిరస్సులు కలవి. రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

3064} పరాశరప్రియసూతి  - పరాశరుని ప్రియమైన సంతానము, వ్యాసుడు :-
[3-185-త.]

3065} పరాశరమునిమనుమడు  - పరాశరుని (పుత్రుడు వ్యాసుడు అతని పుత్రుడు) మనుమడు, శుకయోగి :-
[3-228-క., 9-5-వ.]

3066} పరాశరసుతుడు  - పరాశరుని పుత్రుడు, వేదవ్యాసుడు :-
[3-189.1-తే.]

3067} పరాశరాత్మజుడు  - పరాశరుని పుత్రుడు, వ్యాసుడు. :-
[1-89-ఉ., 6-9-చ.]

3068} పరాశరుడు  - 1. ఒక మహర్షి, 2. వ్యాసుని తండ్రి, 3. వసిష్ఠుని మనుమడు. 4. పడవలో నది దాటుతూ దాశరాజు కూతురు సత్యవతిని మోహించి ఆమెకు యోజనగంధిత్వము మఱియి సద్యోగర్భమున వ్యాసుని పుత్రునిగ అనుగ్రహించెను. :-
[2-204.1-తే.]

3069} పరిఘ  - ఇనుపకట్ల గుదియ :-
[6-406-ఆ.]

3070} పరిచ్ఛిన్నంగహారము  - భిన్నభావములను సూచించునవి, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

3071} పరిధి  - సూర్యుని చుట్టు చంద్రుని చుట్టును ఏర్పడు కాంతి వలయము, పరివేషము. హద్దు, ఎల్ల :-
[10.2-183.1-తే.]

3072} పరిపంథి  - పరి (ఎదుటి) పంథి (పక్షమువాడు), శత్రువు :-
[7-376.1-తే.]

3073} పరిబర్హము  - వ్యు. (పర్హ బర్హ పరిభాషణ హంసాచ్ఛాదనేషు, పరి బర్హ ఘఞ) :-
[4-62-క.]

3074} పరిభ్రాంతుండు  - జననమరణములలో తిరుగు తున్నవాడు, సంసారి :-
[10.1-1503-వ.]

3075} పరిమాణవిరహితుడు  - అణోరణాయాన్మహతో మహీయాన్ (శ్రుతి) చేత ఇంతవాడు అంతవాడు అని నిర్ణయింపరానివాడు, కొలతలకు అతీతమైన వాడు, అవికారుడు, కృష్ణుడు :-
[10.1-901-క.]

3076} పరిరక్షితశిక్షితభక్తమురుడు  - పరిరక్షిత(చక్కగా కాపాడ బడెడి) శిక్షిత (శిక్షింప బడిన) భక్త (భక్తులు) మురుడు (మురాసుర ఆదులు) గల వాడు, విష్ణువు :-
[6-530-తో.]

3077} పరివాహితశిరోభావాలు  - ఇరుపక్కలకు చామరములు వీచునట్లు వంచిన శిరస్సులు కలవి, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

3078} పరివేషము, గుడికట్టుట  - ఆకాశమునందు సూర్యుని / చంద్రుని చుట్టు ఏర్పడెడి ప్రకాశవంతమైన తెల్లని వలయము :-
[10.1-754.1-ఆ.]

3079} పరిశోషితరత్నాకరుడు  - పరిశోషిత (ఇంకిపోవునట్లు చేసిన) రత్నాకరుడు (సముద్రము కలవాడు), రాముడు :-
[10.2-1-క.]

3080} పరుడు  - పరబ్రహ్మము, సమస్తమునకు పరము (అతీతము) యైనవాడు, పరా పశ్యంతి మధ్యమ వైఖరీ అనెడి వాక్కులకు అందనివాడు, విష్ణువు :-
[2-173.1-తే., 2-279-మ., 3-143-క., 3-145.1-తే., 3-198.1-తే., 3-373-మ., 3-629-చ., 3-836-చ., 3-841-క., 4-195-చ., 4-233.1-తే., 4-347.1-తే., 4-917-చ., 4-936-వ., 10.1-236-వ., 10.1-404-క.]

3081} పరేతనాయకుడు  - పరేత (మరణించినవారి, భూతముల)కి నాయకుడు, యముడు :-
[6-82-ఉ.]

3082} పరేశుడు  - పర (సర్వ అతీతమైన బ్రహ్మమునకు) ఈశుడు (ప్రభువు), విష్ణువు :-
[2-214-మ., 3-236-చ., 3-238-చ., 3-490-ఉ., 3-930-చ., 4-920-ఉ.]

3083} పరేశ్వరుడు  - పర (సర్వ అతీతమైన బ్రహ్మమునకు) ఈశ్వరుడు (ప్రభువు), విష్ణువు :-
[3-221-తే.]

3084} పరోక్షజ్ఞానము  - ప్రపంచ కల్పనాది రూపము కలది :-
[10.1-681-వ.]

3085} పర్జన్యుడు  - 1ఉరిమెడువాడు, మేఘుడు, 2పృషు – వర్షణే – పృష + అన్య – జః అంతాదేశః, కృ.ప్ర., 3. వాన కురిపించువాడు, 4. భక్తుల కోరికలను వర్షించు వాడు., 5ఇంద్రుడు :-
[1-233.1-ఆ., 8-634-వ., 10.1-880.1-తే.]

3086} పర్ణశాల  - పర్ణ (ఆకుల) శాల (ఇల్లు), ఆశ్రమము, :-
[9-56-ఆ.]

3087} పర్వతము  - సంధులు కలది, కొండ :-
[10.1-340-క.]

3088} పర్వతరిపుడు  - పర్వతముల శత్రువు (వాటి రెక్కలు వజ్రాముతో ఖండించుట చేత), ఇంద్రుడు :-
[8-148-క.]

3089} పర్వము  - పండుగ, పంచపర్వములు, 1అష్టమి 2చతుర్దశి 3కుహువు (చంద్రకళ కానరాని అమావాస్య) 4పూర్ణిమ 5రవిసంక్రాంతి :-
[10.2-937-చ.]

3090} పర్వేందుముఖీ  - పర్వ (పౌర్ణమినాటి) ఇందు (చంద్రునివంటి) ముఖి (మోముకలామె), స్త్రీ. :-
[8-235-క., 10.1-320-క.]

3091} పలలాశి  - మాంసము తినువాడు, రాక్షసుడు :-
[10.1-1178-క.]

3092} పల్వలుడు  - ఇల్వలుడు అను రాక్షసుని కొడుకు పల్వలుడు, బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మునుల కోరిక మేర పల్వలుని సంహరించాడు. :-
[2-190-చ.]

3093} పవనతనయుడు  - వాయుపుత్రుడు, హనుమంతుడు :-
[9-291-వ.]

3094} పవననందనుడు  - వాయుదేవుని పుత్రుడు, భీముడు :-
[1-172-వ.]

3095} పవనము  - పరిశుద్ధము చేయునది, గాలి :-
[10.1-1582-మ.]

3096} పవనాశుడు  - పవనము (గాలి)ని అశనుడు (తినువాడు), పాము, ఊపిరికి సంకేతం :-
[4-750-క.]

3097} పవనుడు  - పరిశుద్ధము చేయువాడు, వాయుదేవుడు :-
[10.1-1556-చ.]

3098} పవమానతనయుడు  - వాయుదేవుని కొడుకు, భీముడు :-
[10.2-668-వ.]

3099} పవమానసఖుడు  - పవమాన (వాయుదేవుని) సఖుడు (స్నేహితుడు), అగ్నిదేవుడు :-
[3-214.1-తే., 4-838-క.]

3100} పవమానుడు  - వాయుదేవుడు, వ్య. పూఞ్+శానచ్, పవమానః పునాతి పవిత్రీ కరోతి, పవిత్రము చేయునది. గాలి; గార్హపత్యాగ్ని. :-
[4-34-వ.]

3101} పవి  - ఎల్లపుడు చరించునది, కులిశము, వజ్రము :-
[9-68-క.]

3102} పవిత్రుడు  - పవిత్రతేతానైనవాడు, విష్ణువు :-
[4-917-చ.]

3103} పశుఘ్నుడు  - పశువులను చంపి జీవించువాడు, కటికవాడు :-
[10.1-5-క.]

3104} పశుపతి  - పశు (పాశబద్దులు) లకు పతి (ప్రభువు), పాశములచే బంధించబడిన సకల జీవులను పాలించు అధిపతి, శివుడు :-
[3-472-క., 4-59-క., 4-130-క., 10.2-528-క., 10.2-832-క.]

3105} పశువులు  - 1. పాశబద్ధమగునవి, పెంపుడు జంతువులు, ఆవులు మొదలగునవి. 2. సంసార బంధనాలచే బద్దులు, జీవులు, వ్యు, పశ్+కు, పాశ్యతే బధ్యతే అసౌ, బంధింపబడినది. గ్రామ్య పశువు. :-
[2-16-వ., 2-49.1-తే., 3-306-మ., 3-501-వ., 3-754-వ.]

3106} పశుసోమములు  - పశువులను బలిచ్చెడి సోమములు (యజ్ఞములు) :-
[5.1-95.1-తే.]

3107} పశ్చాత్తాపము  - పశ్చాత్ ((చేసిన) తరువాత తాపము (బాధ) పొందుట :-
[3-367-వ.]

3108} పాంచజన్యము  - విష్ణుమూర్తి యొక్క శంఖము, పంచజన అను దైత్యునికి సంబంధించిన శంఖము. :-
[8-116-శా., 10.1-1433-వ., 10.1-1541-ఉ., 10.2-422-తే., 10.2-518-చ., 10.2-1108-చ.]

3109} పాంచభౌతికము = పంచభూతములతో చేయబడినది, జీవుని దేహము - :-
[7-51.1-ఆ.]

3110} పాంచభౌతికము  - శరీరము దేహము పంచ భూతములైన నీరు గాలి నిప్పు మన్ను ఆకాశము లనుండి తయారైనది. కనుక పాంచభౌతికము :-
[2-223.1-తే.]

3111} పాంచాల  - 1. పంచేంద్రియములు ప్రసరించ గలుగు ప్రదేశములకు (విషయములకు) సంకేతము. 2. భారతదేశములోని ఒక దేశము :-
[4-768-వ., 4-819-వ.]

3112} పాంచాలతనూజ  - పాంచాలదేశ రాకుమారి, ద్రౌపది :-
[10.2-104-క.]

3113} పాంచాలపుత్రిక  - పాంచాలదేశ రాకుమారి, ద్రౌపది :-
[1-365.1-తే.]

3114} పాంచాలి  - పాంచాల దేశ రాకుమారి , పాండవులు ఐదుగురకు భార్య కనుక పంచ భర్తృక, ద్రౌపది :-
[1-176-వ., 1-186-వ., 1-365.1-తే., 10.2-694-వ., 10.2-1082-వ.]

3115} పాండవపౌత్రుడు  - పాండవుల యొక్క మనుమడు, పరీక్షిన్మహారాజు :-
[1-448-ఆ., 1-508-వ., 7-479-వ.]

3116} పాండవాగ్రజుడు  - పంచపాండవులలో పెద్దవాడు, ధర్మరాజు :-
[10.2-768-ఆ.]

3117} పాండవులు  - పాండురాజు పుత్రులు, పంచపాండవులు, 1ధర్మరాజు 2భీముడు 3అర్జునుడు 4నకులుడు 5సహదేవుడు :-
[1-176-వ., 1-199-వ., 1-396-వ., 1-396-వ., 3-12-వ., 3-21-క., 10.1-1519.1-ఆ.]

3118} పాండవేయుడు  - పాండవవంశస్తుడు, పరీక్షిత్తు :-
[8-200-ఉ.]

3119} పాండవోత్తముడు  - పాండువంశము నందు ఉత్తముడు, పరీక్షిత్తు :-
[9-342.1-తే.]

3120} పాండుతనయుడు  - పాండురాజు పుత్రుడు, అర్జునుడు :-
[1-371-క.]

3121} పాండునందనులు  - పాండురాజు పుత్రులు, పంచపాండవులు :-
[3-32-ఉ., 3-98-చ., 3-131.1-తే.]

3122} పాండునీలరుచిశంకరవర్ణనిజాంగుడు  - పాండు (తెలుపు) నీల (నలుపు) రుచి (కాంతులచే) శంకర (శుభము కలుగ జేయుచున్న) వర్ణ (రంగులు కల) నిజ (తన) అంగుడు (దేహము కలవాడు), శివుడు :-
[10.2-315-ఉ.]

3123} పాండునృపనందనుడు  - పాండురాజు కొడుకు, ధర్మరాజు :-
[10.2-701-చ.]

3124} పాండుభూవరసుతాగ్రజుడు  - పాండురాజు పెద్ద కొడుకు, ధర్మరాజు :-
[10.2-820-చ.]

3125} పాండుభూవరసుతుడు  - పాండురాజు యొక్క కొడుకు, ధర్మరాజు :-
[10.2-812-చ.]

3126} పాండురాజు  - పాండవుల తండ్రి, ధృతరాష్ట్రుని తమ్ముడు :-
[3-11-చ.]

3127} పాండుసుతులు  - పాండురాజు పుత్రులు, పంచపాండవులు :-
[3-42-చ.]

3128} పాండ్యభూమీశుడు  - పండా (నిశ్చయబుద్ధి) కలవాడు (పాండ్యుడు) వారిదేశము పాండ్యము, పాండ్యదేశపురాజు, మలయకేతనుడు :-
[4-830.1-తే.]

3129} పాంథుడు  - పథమున పోవువాడు, బాటసారి :-
[10.1-967.1-ఆ.]

3130} పాకశాసనుడు  - వృత్రాసురుని సోదరుడగు పాకాసురుని చంపినవాడు, ఇంద్రుడు :-
[5.2-112.1-ఆ., 11-69-వ.]

3131} పాకారి  - వృత్రాసురుని సోదరుడగు పాకాసురుని శత్రువు, ఇంద్రుడు :-
[7-224-శా.]

3132} పాకారిప్రముఖవినుతభండనుడు  - (పాకాసురుని శత్రువైన ఇంద్రుడు) మున్నగువారి చేత వినుత (పొగడబడిన) భండనుడు (యుద్ధము కలవాడు), రాముడు :-
[10.1-1-క.]

3133} పాటలగంధి  - పాదిరిపూలవంటి దేహ సువాసన కలిగిన స్త్రీ :-
[10.1-896-క., 10.1-1122-క.]

3134} పాఠకుడు  - వంశావళి వర్ణించుచు జీవించువాడు, పద్యములు చదువు వారు, వంది :-
[1-396-వ., 1-396-వ., 10.1-724-క.]

3135} పాఠాంతరం - పుట్టంబుట్టశిరంబున్ మొలువ = శిరస్సు మీద పుట్టపుట్టి ఉన్నవాడను కాదు (వాల్మీకిని కాదు) :-
[1-7-శా.]

3136} పాఠీననయన  - చేపవంటి కన్నులు కలామె, స్త్రీ :-
[10.1-1072-క.]

3137} పాతకములు  - 1స్వర్ణస్థేయము 2సురాపానము 3బ్రహ్మహత్య 4గురుపత్నీగమనము 5ఇవి చేయువారి తోడి స్నేహము, పంచమహాపాతకములు :-
[6-140-ఆ.]

3138} పాతకహరుడు  - పాతక (పాపములను) హరుడు (హరించువాడు), కృష్ణుడు :-
[5.2-166-క.]

3139} పాతివ్రత్యము  - పతివ్రత యొక్క శీలము, పతిభక్తి కలిగి ఉండుట. :-
[3-806.1-తే.]

3140} పాథోనిధి  - పాథస్ (జలము)నకు నిధి (ఆవాసము) వంటిది, సముద్రము :-
[3-775-మ.]

3141} పాదపము  - వేళ్ళతో నీరుతాగునది, చెట్టు :-
[2-21.1-తే., 10.1-413-క.]

3142} పాద్యము  - పాదముల కొఱకైనది, జలము మున్నగునవి :-
[10.1-1267-వ., 10.2-92.1-తే.]

3143} పానీయము  - పానము (తాగుట)కు అనుకూలమైన ద్రవపదార్థములు :-
[7-123-శా.]

3144} పాపఘ్నుడు  - పాపములను పోగొట్టు వాడు, విష్ణువు :-
[2-214-మ.]

3145} పాపజాతి  - దుష్కృత వంశస్థులు, రాక్షసులు :-
[10.1-219-క.]

3146} పాపనికాయము  - మనోవాక్కాయకర్మల చేత చేయబడిన పాపములు :-
[10.1-1119-మ.]

3147} పాపమోచనుడు  - పాపమునుండి మోచనుడు (ముక్తిని ప్రసాదించువాడు), విష్ణువు. :-
[3-571-చ.]

3148} పాపఱేడు  - పాప (సర్పము)లకు ఱేడు (రాజు), ఆదిశేషుడు :-
[10.1-143-వ.]

3149} పాపశోషణుడు  - పాపములను శోషణము (ఆవిరి) చేయు వాడు, విష్ణువు :-
[3-588-ఉ., 10.2-1340-చ.]

3150} పాపాత్ముడు  - పాపపు ఆత్మ (మనసు) కలవాడు, పాపి :-
[5.2-137-క.]

3151} పాయసము  - పాలతో వండినది, పరమాన్నము :-
[10.1-889.1-తే.]

3152} పారగులు  - పారము (తుది) చూసినవారు, పండితులు :-
[4-684-వ.]

3153} పారతంత్రము  - పరునిచే (భగవంతునిచే) నడుపబడుట :-
[3-297-వ.]

3154} పారమేష్ఠ్యము  - పరమేష్ఠి (బ్రహ్మ) యొక్క స్థానము, అన్నిటికన్న ఉత్తమమైన పదవి. బ్రహ్మపదము :-
[6-267-ఆ.]

3155} పారలౌకికము  - ఆముష్మికము, పరలోక సంబంధమైనది. :-
[2-12-వ.]

3156} పారాయణము  - వేదాదులను నియమముతో చదువుట, నిష్ఠగా పూని ఒక పూజా కార్యక్రమము వలె చదువుట, మరల మరల చదువుట :-
[6-38-క.]

3157} పారావారము  - అపారమైన తీరము కలది, పార (దాటుటకు) అవారము (రానిది), సముద్రము :-
[6-424-క., 10.1-1532-వ.]

3158} పారాశర్యనందనుడు  - పారాశర్యుడు (పరాశరుని కుమారుని, వ్యాసుని) నందనుడు (కుమారుడు), శుకుడు :-
[10.2-636-వ.]

3159} పారాశర్యుడు  - పరాశరుని పుత్రుడు, వ్యాసుడు :-
[1-90-వ., 12-29-క.]

3160} పారిజాతవృక్షము  - 1. కోరినకోరికలు తీర్చెడి దేవతావృక్షము, కల్పవృక్షము. 2. పాల్కడలిలో పుట్టినది (ఆంధ్ర శబ్ధాకరము) :-
[10.2-215-మ.]

3161} పారిబర్హము  - పారిబర్హము, పెండ్లి కానుకలు (సర్వారాయాంధ్ర నిఘంటువు) :-
[3-792-వ.]

3162} పార్థివుడు  - పృథివికి సంబంధించినవాడు, రాజు :-
[3-806.1-తే., 4-808-ఆ.]

3163} పార్థివేంద్రుడు  - పార్థివుల (రాజుల)లో ఇంద్రునివంటివాడు, రాజు. :-
[4-629.1-తే., 5.1-119.1-తే., 5.2-4-ఆ., 9-344-ఆ.]

3164} పార్థివేశ్వరుడు  - రాజులలో ఈశ్వరుడు, రాజు. :-
[5.1-143-చ.]

3165} పార్థివోత్తముడు  - పార్థివులు (రాజుల)లో ఉత్తముడు, రాజు :-
[4-460.1-తే., 4-541.1-తే.]

3166} పార్థుడు  - పృథ (కుంతీదేవి) కొడుకు, పాండవ మధ్యముడు, కుంతీదేవి రెండవ కొడుకు, అర్డునుడు :-
[10.2-1165.1-తే.]

3167} పార్థుడు  - పృథు (కుంతి) కొడుకు, అర్జునుడు. :-
[1-147-వ., 1-371-క., 2-204.1-తే., 10.2-115-ఉ., 10.2-1288-మ.]

3168} పార్వతీపతి  - పార్వతికి భర్త శివుడు :-
[2-101-చ.]

3169} పార్వతీహృదయకైరవకైరవమిత్రుడు  - పార్వతి మనస్సు అను కైరవ (తెల్ల కలువకు) కైరవమిత్రుడు (చంద్రుడు వంటి వాడు), శివుడు :-
[10.2-315-ఉ.]

3170} పార్శ్వగపాదకర్మములు  - పార్శ్వము లందు పొందునట్లు బొటనవేలితో నేలరాయుచు అడుగు లుంచుట, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

3171} పార్శ్వవర్తులు  - పార్శ్వమున (పక్కన) ఉండువారు, కూడ నుండువారు, కొలువున నుండువాలు :-
[4-557.1-తే.]

3172} పార్షదుడు  - పార్శ్వమున (పక్కన) ఉండువాడు, కూడ నుండువాడు, కొలువున నుండువాడు, సేవకుడు :-
[4-374-వ., 5.2-74.1-తే.]

3173} పాలకుప్ప  - పాలు+కుప్ప, సముద్రము :-
[8-207-ఆ.]

3174} పాలితప్రకటధాత్రీచక్రము  - పాలిత (పాలింపబడుతున్న) ప్రకట (ప్రసిద్దమైన) ధాత్రీచక్రము (భూమండలము) కలది, విష్ణుచక్రము :-
[3-678-మ.]

3175} పాలేటిరాచూలి  - పాలసముద్రుని రాకుమారి, లక్ష్మీదేవి :-
[10.1-1031.1-ఆ.]

3176} పాళీలు  - మల్లవిద్యావిశేషము :-
[10.1-1334-మ.]

3177} పావకుడు  - పవిత్రము చేయువాడు, అగ్ని :-
[4-34-వ., 10.2-121-క., 10.2-518-చ.]

3178} పావని  - వాయువు కొడుకు, భీముడు :-
[10.2-728-ఉ.]

3179} పాశి  - పాశములు ఆయుధముగా కలవాడు, వరుణుడు, పడమటి దిక్పతి :-
[10.2-773-చ.]

3180} పాషండాదులు  - పాషండ కాపాలిక బౌద్ధ చార్వాక జైన శైవ శాక్త గాణాపత్యాది మతస్థుల మార్గములు :-
[10.1-1504.1-ఆ.]

3181} పాషాండమతములు  - పాషండ కాపాలిక బౌద్ధ చార్వాక జైన శైవ శాక్త గాణాపత్యాది మతస్థుల మార్గములు :-
[2-196-మ.]

3182} పాషాండులు  - వేదోక్త ధర్మములకు దూరమైనవారు, పాషండ కాపాలిక బౌద్ధ చార్వాక జైన శైవ శాక్త గాణాపత్యాది మతస్థులు :-
[5.1-175-వ.]

3183} పింజ  - బాణము వెనుక నారిని సంధించుటకైన రెక్కలవంటివి :-
[10.2-853-చ.]

3184} పింజపింజకఱవగా  - పింజ (బాణమునకు వెనుక చివర) పింజను తగులుతూ వెళ్ళేలా (బాణములు వేగంగా వేయుట) :-
[4-334-మ.]

3185} పింజపింజతోదాకుట  - ప్రతిబాణము పింజతోను ఇంకో బాణము తాకుతుండుట :-
[10.2-436-ఉ.]

3186} పిండము  - (నిందా పూర్వకముగ) భోజనము, తద్దినము రోజు గుండ్రముగ చేయు ముద్దలు :-
[1-314-క.]

3187} పితలు  - పంచచత్వారింశత (49) అగ్నులలోని వారు, కవ్యవాహనులు, పిత్రుదేవతల కవ్యములను తీసుకుపోవు అగ్నులు? :-
[4-34-వ.]

3188} పితామహుడు  - తండ్రికి తండ్రి తాత, అందరి తండ్రులను పుట్టించినవాడు, బ్రహ్మ :-
[2-199-వ., 3-370-వ., 6-252-వ., 10.1-1648-మ.]

3189} పితృఋణము  - ప్రజాసృష్టి ద్వారా తీర్చుకొనునది :-
[6-252-వ.]

3190} పితృదేవతలు  - వసురుద్రాది రూపులైన అగ్నిష్వాత్తుడు కవ్యవాహనుడు మొదలైనవారు (పాలపర్తి నాగేశ్వర్లు శాస్త్రులు వారి దశమ స్కంధము), 2. దేవతలవలె మాన్యులైన పితరులు. (ఆంధ్ర శబ్ధరత్నాకరము) :-
[10.1-173-వ.]

3191} పితృపతి  - పితరుల ఱేడు, యముడు :-
[5.2-47-క.]

3192} పితృపితామహాది  - తండ్రి తాత మొదలగు వారినుండి వచ్చెడివి, వంశపారంపర్యము :-
[5.1-97-వ.]

3193} పితృహూ  - పితృదేవతలను ఆహ్వానించెడిదికి సంకేతము, కుడిచెవి :-
[4-768-వ.]

3194} పినాకుడు  - పినాకము అను విల్లు ధరించువాడు, శివుడు :-
[3-323-క.]

3195} పిప్పలుడు  - పిప్పలాచార్యుడు తత్వశాస్త్రవేత్త :-
[2-204.1-తే.]

3196} పిశాచము  - దేవయోని విశేషము, దేహమున మాంసముపై ఆధార పడి వర్తించు శక్తులు, పిశాచ బేధము :-
[2-274.1-తే., 6-307-వ., 10.2-405-చ.]

3197} పిశితాశనుడు  - పిశితము (మాంసము) అశనుడు (ఆహారముగా కలవాడు), రాక్షసుడు :-
[10.2-1254-వ.]

3198} పీట  - కూర్చొనుటకైన క్రింద కోళ్ళు గల బల్ల, పీటలలో కొన్ని రకాలు నేల పీట, ఎత్తు పీట, ముక్కాలి పీట, పీఠ (ప్ర) పీట (వి) :-
[10.1-310-మత్త.]

3199} పీఠార్ధము  - అర్ధసింహాసన మిచ్చుట అను గౌరవము. :-
[1-366.1-ఆ.]

3200} పీతకౌశేయవాసుడు  - పచ్చని పట్టువస్త్రము ధరించినవాడు, విష్ణువు :-
[3-145.1-తే.]

3201} పీతాంబరధారి  - పచ్చని వస్త్రములు ధరించువాడు, హరి :-
[1-218-వ.]

3202} పీతాంబరుడు  - పచ్చని బట్టలు ధరించు వాడు, కృష్ణుడు, విష్ణువు :-
[10.2-406-వ.]

3203} పీతావాసుఁడు - పచ్చని పట్టువస్త్రము ధరించిన వాడు, విష్ణువు :-
[2-237-మ.]

3204} పుంఖానుపుంఖము  - పుంఖము (బాణము వెనుక పింజె) తరువాత పుంఖముగ, ఎడతెరపిలేని బాణ ప్రయోగము :-
[9-454-మ.]

3205} పుండరీకనయనుడు  - తెల్లతామరల వంటి కన్నులు కలవాడు, విష్ణువు :-
[2-214-మ., 10.1-968-వ.]

3206} పుండరీకనేత్రుడు  - తెల్లతామరల వంటి కన్నులు కలవాడు, విష్ణువు :-
[10.2-1318-చ.]

3207} పుండరీకలోచనుడు  - తెల్లతామరల వంటి కన్నులు కలవాడు, విష్ణువు :-
[3-225-తే., 3-398-చ.]

3208} పుండరీకాక్షుడు  - పుండరీకము (తెల్లతామర)ల వంటి కన్నులు కలవాడు, విష్ణువు :-
[1-214-వ., 1-235.1-ఆ., 1-396-వ., 2-49.1-తే., 2-107-వ., 2-174-వ., 2-186-వ., 2-199-వ., 2-228.1-తే., 2-238-వ., 2-248-వ., 2-253.1-తే., 3-79-వ., 3-100-వ., 3-150-వ., 3-184-వ., 3-205-వ., 3-263-తే., 3-309.1-తే., 3-334-వ., 3-344-వ., 3-344-వ., 3-507-వ., 3-649-వ., 3-667-వ., 3-673-తే., 3-697-వ., 3-787-తే., 3-824-వ., 3-1000-వ., 3-1007-వ., 3-1051-వ., 3-1055-గ., 4-135-వ., 4-193.1-తే., 4-468-వ., 5.1-4-వ., 5.1-42-వ., 5.1-180-వ., 5.2-115-వ., 6-168-వ., 6-486.1-తే., 11-18-వ., 11-77-వ.]

3209} పుండరీకాయతాక్షుడు  - పుండరీకములు (తెల్లతామర) వలె ఆయత (విశాలమైన) అక్షుడు (కన్నులుగలవాడు), విష్ణువు :-
[4-963.1-తే.]

3210} పుండ్రేక్షుకోదండుడు  - పుండ్ర (నలుపు కలసిన ఎఱ్ఱ చెఱకు) ఇక్షు (చెరకుగడ)ను కోదండుడు (విల్లుగా ధరించినవాడు, మన్మథుడు :-
[6-446.1-తే.]

3211} పుంశ్చలి  - పురుషుని చూచి చలించునట్టి ఆడుది, రంకుటాలు :-
[6-225.1-ఆ.]

3212} పుంసవనము  - గర్భచిహ్నము తెలిసాక పుత్ర సంతానము గావలె నని చేసెడి కర్మము (శుభకార్యము) :-
[6-521-వ.]

3213} పుక్కలి  - బుగ్గల లోపల భాగం :-
[10.2-333-చ.]

3214} పుట్టించెదవు - చతుర్ముఖబ్రహ్మ రూపమున రజోగణముచే సృష్టించెదవు :-
[10.1-1180.1-ఆ.]

3215} పుడమిఱేడు  - పుడమి (భూమి)కి ఱేడు (ప్రభువు), రాజు :-
[9-48-వ.]

3216} పుణ్యజనానురాగసంధాత  - పుణ్యజన (పుణ్యాత్ము లైన మానవులకు, దేవతలకు) అనురాగ (ప్రేమను) సంధాత (కలిగించెడివాడు), బ్రహ్మ :-
[6-278-ఉ.]

3217} పుణ్యయోగిజనభావవిజేత  - పుణ్య (పావనమైన) యోగి జనముల భావ (హృదయములను) విజేత (జయించినవాడు), బ్రహ్మ :-
[6-278-ఉ.]

3218} పుణ్యరక్షానుసారుడు  - పుణ్యాత్ములను కాపాడెడివాడు, శ్రీరాముడు :-
[8-744-మాలి.]

3219} పుణ్యవిచారుడు  - ధర్మవిచారము కలవాడు, శ్రీరాముడు. :-
[10.2-1341-క.]

3220} పుణ్యవిస్పారుడు  - పుణ్యములకు విస్పారుడు (అధికముగా కలవాడు), విష్ణువు :-
[6-126-ఉ.]

3221} పుణ్యశ్రవణకీర్తనుడు  - పుణ్యవంతమై వినదగ్గ కీర్తనలు కలవాడు, కృష్ణుడు :-
[4-468-వ.]

3222} పుణ్యశ్లోకుడు  - పుణ్యవంతులచే శ్లోకుడు (కీర్తింపబడువాడు), విష్ణువు :-
[1-102.1-ఆ., 8-21-క.]

3223} పుణ్యాకరుడు  - పుణ్యములకు ఆకరుడు (నివాసమైనవాడ), శ్రీకృష్ణ :-
[5.1-181-మ.]

3224} పుణ్యాత్మకుడు  - పరిశుద్ధమైన మనసు కలవాడు, విష్ణువు. :-
[10.1-995-మ.]

3225} పుణ్యాహవాచనము  - దైవాది కర్మ ప్రారంభమున మంగళార్థము చేయు కర్మ :-
[10.1-891-వ.]

3226} పుణ్యుడు  - పుణ్యతరుడు పుణ్యతముడు :-
[3-487-క., 3-801.1-తే., 3-962-క., 3-969.1-తే.]

3227} పుణ్యుడు  - పుణ్యమే తానైనవాడు, విష్ణువు :-
[4-702.1-తే., 9-115-శా.]

3228} పుత్రకామేష్టి  - పుత్రుడు కామ (కావలెనని కోరి చేసెడి) ఇష్టి (యజ్ఞము) :-
[4-399-తే.]

3229} పుత్రశోకము  - పుత్రులు పోయిన దుఃఖము :-
[10.2-1155-క.]

3230} పుత్రికాధర్మము  - ఈ పుత్రిక యందు జన్మించువాడు నా పుత్రుడు కాగలడు అను నియమముతో కన్యాదానము చేయుట, పుత్రుడు పుట్టాక మాతామహునకు దత్తత ఇవ్వవలెనను నియమముతో కన్యాదానము చేయుట. :-
[4-3.1-తే.]

3231} పురంజనుడు  - పురమున (దేహమున) వసించెడివాడు (ఉండెడివాడు), జీవుడు, ఆత్మ :-
[4-742.1-తే., 4-756-వ., 4-763-క., 4-768-వ., 4-821-వ.]

3232} పురందరసుందరి  - పురందరుడు (ఇంద్రుడు) యొక్క సుందరి (భార్య), శచీదేవి, తత్పురుషసమాసము :-
[3-1047-వ.]

3233} పురందరసుతుడు  - పురందరుని (ఇంద్రుని) సుతుడు (పుత్రుడు), అర్జునుడు. :-
[10.2-1165.1-తే.]

3234} పురందరుడు  - శత్రు పురములను నశింపజేయు వాడు, వ్యు. పూర్ దౄ(ణిచ్) ఖచ్ ముమ్ నిపా, ఇంద్రుడు :-
[4-167-చ., 10.1-953-వ., 12-36-మ.]

3235} పురంధ్రి  - గృహమును ధరించునామె, గృహిణి, పుర+ధృ+ఖచ్, పురం గేహం రూపాది గుణసంపన్నం వపుర్వా దధాతి, రూపగుణాది సంపదలచే శరీరమును ధరించునది. స్త్రీ. :-
[10.1-1580-ఉ.]

3236} పురదాహుడు  - త్రిపురములను దహింపజేసినవాడు, శివుడు :-
[4-16-చ.]

3237} పురభంజనుడు  - త్రిపురసంహారుడు, శివుడు :-
[10.1-275-క.]

3238} పురము  - 1. దేహము, 2. పట్టణము :-
[4-819-వ.]

3239} పురవైరి  - త్రిపురాసురుని వైరి, శంకరుడు :-
[4-41-తే., 9-22.1-తే.]

3240} పురసూదనుడు  - పురములను కూల్చినవాడు, శంకరుడు :-
[4-8-క.]

3241} పురహరుడు  - త్రిపురములను కూల్చినవాడు, శివుడు :-
[4-159-క., 5.2-38.1-ఆ., 5.2-117-చ., 10.2-529-క., 10.2-1262-క.]

3242} పురాంతకుడు  - పురములను నాశముచేసిన వాడు, శివుడు :-
[4-23-ఉ., 10.2-318-వ.]

3243} పురాణదశలక్షణములు  - సర్గాది, 1సర్గము 2విసర్గము 3స్థానము 4పోషణము 5ఊతులు 6మన్వంతరములు 7ఈశానుకథలు 8నిరోధము 9ముక్తి 10ఆశ్రయము :-
[12-30-వ.]

3244} పురాణపంచలక్షణములు  - సర్గాది, 1సర్గము 2ప్రతిసర్గము 3వంశము 4మన్వంతరము 5వంశానుచరితము :-
[12-30-వ.]

3245} పురాణపురుషుడు  - ఆది పురుషుడు, పురాణములు స్తుతించు పురుషుడు, విష్ణువు, వ్యు. పురాణ+పురుష, పురాణైః ఉపస్తుత్యః పురుషః :-
[3-1000-వ., 6-192-వ., 6-258-వ., 10.1-567.1-ఆ., 10.2-67-వ.]

3246} పురాణపూరుషుడు  - ఆది పురుషుడు, పురాణములు స్తుతించు పురుషుడు, విష్ణువు, :-
[6-422-ఉ., 6-438-చ.]

3247} పురాణము  - పురాతన చరిత్రము, 1సర్గ (సృష్టి) 2ప్రతిసర్గ (ప్రతిసృష్టి) 3(మను)వంశము 4మన్వంతరము 5వంశానుచరితము అను పంచలక్షణములు కలవి ఇవి 18 :-
[2-222-వ., 3-388-వ., 8-629.1-తే., 11-107-వ.]

3248} పురాణయోగిసంసేవితపాదపద్ముడు  - పురాణ (పూర్వపు) యోగి (యోగులచే) సంసేవిత (చక్కగాసేవింపబడిన) పాద (పాదములు యనెడి) పద్ముడు (పద్మములు గలవాడు), విష్ణువు :-
[7-459-ఉ.]

3249} పురాణయోగులు  - సనక సనందన సనత్కుమార సనత్సుజాతాది మహర్షులు :-
[10.1-128-మత్త.]

3250} పురాణలక్షణములు  - పురాణదశలక్షణములు సర్గాది, 1సర్గము 2విసర్గము 3స్థానము 4పోషణము 5ఊతులు 6మన్వంతరములు 7ఈశానుకథలు 8నిరోధము 9ముక్తి 10ఆశ్రయము; పురాణపంచలక్షణములు సర్గాది, 1సర్గము 2ప్రతిసర్గము 3వంశము 4మన్వంతరము 5వంశానుచరితము :-
[1-21-మ.]

3251} పురాతనమౌని  - బహుపాత కాలపు ముని, నారాయణఋషి ఐనవాడు, విష్ణువు :-
[10.2-607-క.]

3252} పురాపురుషుడు  - పురాణపురుషుడు, విష్ణువు :-
[4-702.1-తే.]

3253} పురారాతి  - త్రిపురములకి ఆరాతి (శత్రువు), శంకరుడు :-
[9-230-వ.]

3254} పురారి  - త్రిపురాసురులకు శత్రువు, శివుడు :-
[10.2-311-తే., 10.2-530-క., 10.2-1255-చ.]

3255} పురుషభూషణుడు  - పురుషులలో భూషణుడు (శ్రేష్ఠుడు), విష్ణువు :-
[10.1-994-ఉ.]

3256} పురుషవరేణ్యుడు  - పురుషోత్తముడు, కృష్ణుడు :-
[10.2-1185-చ.]

3257} పురుషశ్రేష్ఠుడు  - పురుషులలో శ్రేష్ఠుడు, విష్ణువు :-
[1-271-మ., 3-835-మ.]

3258} పురుషసూక్తము  - పురుష (పురుషోత్తముని విరాడ్రూపము తెలిపెడి) సూక్తము (సు(మంచి) ఉక్తము (మాటలు), మంత్రములు), మరింకొకవిధముగ ఒక విశిష్ఠమైన విష్ణు స్తోత్రము, పురుష (శాస్త్రమును అనుసరించి, పరమపురుషుని గురించి) సూక్తము, పంచసూక్తములు 1నారాయణసూక్తము 2శ్రీసూక్తము 3భూసూక్తము 4నీలసూక్తము 5 పురుషసూక్తము :-
[10.1-14.1-తే., 10.2-440-తే.]

3259} పురుషాధముడు  - మానవులలో అధముడు, అల్పుడు :-
[10.1-1636-ఉ.]

3260} పురుషాధీశుడు  - పురుషులకు అధీశుడు (ప్రభువు), విష్ణువు :-
[3-306-మ., 4-733-క.]

3261} పురుషార్థములు  - కామాది, 1ధర్మ 2అర్థ 3కామ 4మోక్షములు యైన పురుష ప్రయోజనములు, పురుషులు సాధించదగిన ప్రయోజనములు, కర్తవ్యములు :-
[2-89-వ., 4-295-వ., 4-626-వ., 4-916-వ., 5.1-89-వ.]

3262} పురుషుడు  - 1.శరీరములు అను పురములలో నుండు వాడు, 2.మానవుడు, 3.లోకైకపురుషుడు, 4.విష్ణువు, వ్యుత్పత్తి. పురీ శరీరేశేత ఇతి పురుషః, సకల జీవశరీరముల యందు వసించువాడు పురుషుడు :-
[1-187-క., 3-259-తే., 7-453-వ., 10.1-942-ఆ., 11-77-వ.]

3263} పురుషుడు  - 1.శరీరములు అను పురములలో నుండు వాడు, 2.మానవుడు, 3.లోకైకపురుషుడు, 4.విష్ణువు, వ్యుత్పత్తి. పురీ శరీరేశేత ఇతి పురుషః, సకల జీవశరీరముల యందు వసించువాడు పురుషుడు 5. జీవసాక్షియైన బ్రహ్మ :-
[10.1-8-ఆ.]

3264} పురుషోత్తముడు  - పురుషులలో ఉత్తముడు, విష్ణువు :-
[2-238-వ., 3-151-క., 3-200-క., 3-271-వ., 3-365-క., 3-373-మ., 3-407.1-తే., 3-544-వ., 3-625-క., 3-1024-క., 4-963.1-తే., 5.1-95.1-తే., 6-192-వ., 7-169.1-తే., 7-371-వ., 8-163-క., 10.2-115-ఉ., 10.2-1031-వ.]

3265} పురుహూతుడు  - యజ్ఞములందు ప్రచురమైన పిలుపు కలవాడు, పురువు అనెడి రక్కసుని చంపినవాడు, ఇంద్రుడు :-
[8-561-క., 10.1-887-వ.]

3266} పురోడాశము  - యాగార్థమైన అపూపము (పిండితో చేసిన పిడచలు లేదా ముద్దలు) :-
[4-162-వ.]

3267} పురోహితుడు  - పుర (ఊరు) + హితుడు (కోరువాడు), శుభాశుభ వైదిక కర్మములను చేయించుచు మేలుకీడులను తెలుపు ఆచార్యుడు, ఒజ్జ :-
[10.2-527.1-తే.]

3268} పులుకడిగిన  - స్వచ్చమైన, పులు (ఆమ్లముతో) (రత్నమాలిన్యము) కడిగిన ముత్యాలు ఆదులు ఉండునంత స్వచ్ఛమైన :-
[10.1-1101-వ., 10.2-676-క.]

3269} పులోముడు  - ఒక దైత్యుడు, ఇంద్రుని మామ (భార్య శచీదేవి తండ్రి) :-
[7-29-వ.]

3270} పుళిందులు  - పుళింద దేశపు, ఒక అడవిజాతి మానవులు, గిరిజనులు :-
[3-38-క.]

3271} పువ్విలుతుడు  - పుష్పములు బాణములుగాఁగల ధనుస్సు కలవాడు, మన్మథుడు :-
[9-417-మ.]

3272} పువ్వుటంపఱజోదు  - పూల బాణముల వీరుడు, మన్మథుడు :-
[9-388-త.]

3273} పువ్వుబోడి  - పూల వంటి సుకుమారమైన స్త్రీ, అందగత్తె :-
[9-175-ఆ.]

3274} పువ్వుబోణి  - పూల వంటి సుకుమారమైన స్త్రీ, అందగత్తె :-
[6-255.1-తే.]

3275} పుష్కరనాభుడు  - పుష్కర (తామర) నాబిన కలవాడు, విష్ణువు :-
[4-371-వ.]

3276} పుష్కరము  - 1. మెట్టతామర, 2. ఒక తీర్థము, 3. పండ్రెండేండ్లకొకసారి వచ్చు జీవనదుల పండుగ. :-
[5.2-69.1-ఆ.]

3277} పుష్కరవైరి  - తామరల శత్రువు, చంద్రుడు :-
[10.1-1321-వ.]

3278} పుష్కరిణి  - తామర కొలను, కోనేఱు, ఆడ ఏనుగు :-
[4-390-వ.]

3279} పుష్టి  - బలము, సమృద్ధి :-
[4-28-వ.]

3280} పుష్పంధయము  - పూలలోని మధువును గ్రోలునది, తుమ్మెద :-
[10.1-1466-ఉ., 10.1-1697-ఉ., 10.2-153.1-తే.]

3281} పుష్పసాయకుడు  - పుష్పముల బాణములు కల వాడు, మన్మథుడు :-
[3-451.1-తే.]

3282} పుష్పాంజలి  - పుష్పములు గల దోసిలి జోడించి చేయు నమస్కారము :-
[4-17-వ.]

3283} పుష్పార్ణుడు  - పుష్పముల అర్ణుడు (సముద్రమైనవాడు). వత్సరుని కొడుకు :-
[4-390-వ.]

3284} పుష్ఫాస్త్రుడు  - పుష్పములు అస్త్రములుగ కలవాడు, మన్మథుడు :-
[3-732-క.]

3285} పూబోడి  - పూలవంటి సౌకుమార్యము కలామె, స్త్రీ :-
[4-791-మ., 10.1-372.1-ఆ., 10.2-183.1-తే.]

3286} పూయోదము  - చీము నెత్తురు మొదలగువాని యందు శిక్షించుట, నరక విశేషము :-
[5.2-136-వ.]

3287} పూరకము  - ప్రాణవాయువు అంతర్గతముగ నిలుపుట, ప్రాణాయామ ప్రక్రియ :-
[3-921-వ.]

3288} పూరుడు  - తండ్రి యైన యయాతి జరాభారమును ధరించిన వాడు, తరువాతి తరంవారు కురువు, కౌరవులు, పాండవులు, పరీక్షిత్తు :-
[3-11-చ., 4-812.1-తే.]

3289} పూరుషుడు  - కారణభూతుడు, విష్ణువు :-
[1-60-త.]

3290} పూర్ణకుక్షి  - నిండిన కడుపు కల వాడు, తృప్తుడు :-
[10.1-570-త.]

3291} పూర్ణిమ  - చంద్రుని పూర్ణ బింబము కల తిథి, పున్నమి :-
[4-7.1-తే., 6-507-వ.]

3292} పూర్ణుడు  - విశ్వమంతా నిండియున్నవాడు, పరిపూర్ణమైనవాడు, విష్ణువు :-
[4-702.1-తే.]

3293} పూర్ణేందుబింబానన  - పూర్ణ (నిండు) ఇందు (చంద్రుని) బింబ (బింబమువంటి) ఆనన (మోము కలామె), స్త్రీ :-
[10.1-827-శా.]

3294} పూర్ణేందుముఖి  - నిండు చంద్రునివంటి మోము కలామె, స్త్రీ. :-
[9-613-క.]

3295} పూర్తములు  - వాపీ (నడబావి) కూప (బావి) తటాక (చెరువు) ఆరామ (ఉపవనము) దేవాలయ (గుడి) నిర్మాణములు మరియు అన్నదానము (ధర్మసత్రము) :-
[2-222-వ., 10.2-465-వ.]

3296} పూర్వచిత్తి  - ముందు చిత్తము ఆలోచన కలామె, ఒక అప్సరస :-
[5.1-26-వ.]

3297} పూర్వదిగ్గజము  - తూర్పు దిక్కు నందలి ఏనుగు, ఐరావతము :-
[10.1-1615-వ.]

3298} పూవింటిజోదు  - పూల ధనుస్సు యోధుడు, ప్రద్యుమ్నుడు, మన్మథుడు :-
[10.2-23-క.]

3299} పృథివీతలేశుడు  - పృథివీ తలము (భూమి)కి ఈశుడు, రాజు :-
[4-657.1-తే.]

3300} పృథివీపతి  - భూమికి భర్త, రాజు :-
[9-491-క.]

3301} పృథివీవరశేఖర  - పృథివి (భూమి)కి వరుడు రాజు వారిలో శేఖరుడు (శ్రేష్ఠుడు), మహారాజు :-
[7-413-ఉ.]

3302} పృథివ్యాది  - (అ) పంచభూతములు, 1పృథివి 2అప్పు 3తేజస్సు 4వాయువు 5ఆకాశము, (ఆ) సత్త్వములు, 1పృథివి 2అప్పు 3తేజము 4వాయువు 5ఆకాశము 6కాలము 7దిక్కు 8ఆత్మ 9మనస్సు :-
[3-344-వ., 7-266.1-తే., 11-52-వ.]

3303} పృథివ్యాది, పంచభూతములు  - 1.భూమి 2.జలము 3తేజస్సు 4.వాయువు 5,ఆకాశము "పృథివ్యాపస్తేజో వాయురాకాశమితి భూతాని"[గౌతమన్యాయసూత్రములు 1 1 13] :-
[12-24-వ.]

3304} పృథు  - పృథుచక్రవర్తి :-
[3-44-ఉ.]

3305} పృథులాత్ముడు  - పృథుల (విరివియైన, మహా) ఆత్ముడు, విష్ణువు :-
[8-503.1-తే.]

3306} పృథ్విరూపకుడు  - పృథ్వి (పెద్ద, బృహతి) రూపము కలవాడు, ఉరుగాయుడు, విష్ణువు :-
[4-702.1-తే.]

3307} పృథ్వీపతి  - పృథ్వి (భూమి)కి పతి (ప్రభువు), రాజు :-
[8-18.1-ఆ.]

3308} పృథ్వీశ్వరుడు  - పృథివికి ఈశ్వరుడు, రాజు. :-
[1-380-మ.]

3309} పృశ్నిగర్భుడు - అన్నం, నీరు, వేదం మొదలైన సమస్తం తన గర్భంలోనే ఉంటాయి కనుక దేవుడే పృశ్నిగర్భుడు. పృశ్ని అంటే కిరణం. పారమార్థిక పదకోశం 2010 (పొత్తూరి వేంకటేశ్వరరావు) :-
[10.1-131-వ.]

3310} పృశ్నిగర్భుడు  - పృశ్ని (అదితి పూర్వజన్మ నామము) పుత్రుడు, విష్ణువు, :-
[8-503.1-తే., 10.1-236-వ., 11-77-వ.]

3311} పెందెరువు  - పెంపు (ఉత్కృష్టమైన) తెరువు (దారి), పరమపదము, మోక్షము :-
[10.1-134-క.]

3312} పెంద్రోవ  - పెన్ (గొప్ప) త్రోవ (స్థితి), మోక్షము, పరమపదము :-
[10.1-957-ఉ.]

3313} పెటపెట  - పళ్ళు కొరుకుట యందలి ధన్వనుకరణ :-
[10.2-300-వ.]

3314} పెరుగు  - పాలు తోడుకొనుటచే ఏర్పడును, నీరు కలిపిన మజ్జిక అగును, చిలికిన వెన్న కలుగును. :-
[10.1-900-మ.]

3315} పెలుకుఱ  - భయముచేత అవయవములు స్వాధీనము తప్పుట, మిక్కిలి భయపడుట :-
[10.2-1290-చ.]

3316} పైతామహము  - తాతలకు సంబంధించినది, అనువంశికము :-
[1-228-వ.]

3317} పొంతనము  - మైత్రి కలిగించునది, గ్రహమైత్రి :-
[9-363-క.]

3318} పొట్టు  - గింజల యొక్క పై పొర :-
[5.1-129-వ.]

3319} పొడసూపు  - పొడవు చూపు, కనబడు :-
[11-124-చ.]

3320} పొత్తికలు  - పురుటికందులు, బొమ్మలు మొదలగువాని కొరకు వాడు మెత్తని గుడ్డలు, పొత్తిళ్ళు :-
[1-366.1-ఆ.]

3321} పొత్తిళ్ళు  - 1. మెత్తని సన్నని పాతవస్త్రములు; 2. పురిటికందులు, బొమ్మలు ఉంచు మెత్తటి గుడ్డల దొంతరలు, పొత్తికలు :-
[2-175-క.]

3322} పొలియజేయు  - చంపు, రుద్ర రూపమున సర్వమును తమోగుణముతో లయము చేయుట :-
[10.1-1180.1-ఆ.]

3323} పొల్తు  - పొలతి, స్త్రీ :-
[10.2-1068-చ.]

3324} పోకలు  - పంచకృత్యములు (1సృష్టి 2స్థితి 3లయ 4తిరోధాన 5అనుగ్రహములు) లోని వర్తించుట :-
[10.1-1236-దం.]

3325} పోరామి  - రాకపోకలు కొనసాగించడం, స్నేహము :-
[8-182-వ.]

3326} పౌండ్రకవాసుదేవుడు  - పౌండ్రక దేశ అధిపతి తనే వాసుదేవుని అసలు అవతారమని విఱ్ఱవీగినవాడు :-
[2-190-చ.]

3327} పౌగండము  - 5 నుండి 10 సంవత్సరముల బాల్యము :-
[10.1-1392.1-తే.]

3328} పౌత్రుడు  - పుత్రుని పుత్రుడు, మనవడు. :-
[3-491-వ.]

3329} పౌరంధ్రి  - పురందరుని (ఇంద్రుని) కొడుకు, అర్జునుడు :-
[10.2-1304-ఉ.]

3330} పౌరవముఖ్యుడు  - పురువంశస్థులలో ముఖ్యుడు, పరీక్షిత్తు. :-
[10.2-196-క.]

3331} పౌరవేంద్ర  - పురువంశస్థులలోశ్రేష్ఠుడ, పరీక్షిన్మహారాజు :-
[2-29.1-ఆ.]

3332} పౌరాణికుడు  - పురాణములు చెప్పువాడు, సూతుడు :-
[1-391-వ., 12-45-వ.]

3333} పౌరులు  - పురమున నుండెడివారు :-
[4-768-వ.]

3334} పౌలోమి  - పులోముని పుత్రిక, ఇంద్రుని భార్య, శచీదేవి :-
[6-507-వ., 8-487-మ., 10.1-1306.1-తే.]

3335} పౌలోములు  - మారీచునకు పులోమ యందు కలిగిన 60,00 దానవ సంతతి :-
[8-182-వ.]

3336} ప్రకటభవ్యభుజాభుజగేంద్రుడు  - ప్రకట (ప్రసిద్ధమైన) భవ్య (శుభమైన) భుజ (భుజము లనెడి) భుజగేంద్రుడు (గొప్ప సర్పములు గలవాడు), రాముడు :-
[4-974-చ.]

3337} ప్రకల్పితశయ్యాఫణి  - ప్రకల్పిత (చక్కగా ఏర్పరుపబడిన) శయ్య (పడక యైన) ఫణి (ఆదిశేషుడు గలవాడు), విష్ణువు :-
[6-34-క.]

3338} ప్రకాశత్వము  - శబ్ద స్పర్శాది వ్యాపారములందు ప్రవర్తించునట్లు చేయుట :-
[10.1-683-వ.]

3339} ప్రకృతి  - 1.చావు పుట్టుకల చక్రము లక్షణముగ కలది, 2. స్వభావముచేతనే, 3. సప్తాంగములు (1స్వామి 2మంత్రులు 3మిత్రులు 4కోశము 5రాష్ట్రము 6దుర్గము 7సైన్యము) :-
[1-381-వ., 4-457-వ.]

3340} ప్రకృతికంటెఁబరుడు  - పకృతికంటెను ఇంతరమైనవాడు, విష్ణువు :-
[3-874-వ.]

3341} ప్రకృతికారణవాదులు  - అవ్యక్త నామక ప్రకృతియే మూల కారణభూతము అనెడివారు :-
[10.2-1220-వ.]

3342} ప్రకృతిగుణములు  - త్రిగుణ సమ్మేళనము వలన పుట్టిన వ్యక్తిగతమైన ప్రత్యేక స్వభావము నందలి గుణములు :-
[4-355-వ.]

3343} ప్రకృతిచతుర్వింశతితత్త్వములు  - పంచ భూతములు (1పృథివి 2జలము 3అగ్ని 4వాయువు 5ఆకాశము), పంచ తన్మాత్రలు (6శబ్దము 7స్పర్శము 8రూపము 9రుచి 10వాసన), పంచ జ్ఞానేంద్రియములు (11చర్మము 12కన్ను 13ముక్కు 14చెవి 15నాలుక), పంచ కర్మేంద్రియములు (16వాక్కు 17చేతులు 18కాళ్ళు 19గుదము 20ఉపస్థు), అంతఃకరణ చతుష్టయము (21మనస్సు 22బుద్ధి 23చిత్తము 24అహంకారము) :-
[3-891-వ.]

3344} ప్రకృతులు  - 1మాయ 2మహత్తు 3అహంకారము మరియు పంచతన్మాత్రలు ఐదు (5) :-
[7-237-వ.]

3345} ప్రక్షీణులు  - మిక్కిలి క్షీణించినవారు (ఆపదలవలన), ఆపన్నులు :-
[8-698-క.]

3346} ప్రఘాణము  - తలవాకిటికి పక్కన ఉండెడి చిన్నగది, కొట్టుగది :-
[10.1-1597-శా.]

3347} ప్రచండము - ప్రచండతరము ప్రచండతమము :-
[10.1-470-మ.]

3348} ప్రచండము  - మిక్కిలి తీవ్రమైనది, భయంకరమైనది :-
[10.1-1558-వ.]

3349} ప్రచేతసులు  - ప్ర (గొప్ప) చేతస్సు (చైతన్యము) కలవారు :-
[4-379-వ., 4-385.1-తే., 4-684-వ.]

3350} ప్రజాగరుడు  - ప్రజల యొక్క మగతనము యైనవాడు :-
[4-810-వ.]

3351} ప్రజాపతి  - జీవుల ఉత్పత్తికి అధిపతి, ప్రజ (సంతానసృష్టికి) పతి, బ్రహ్మ, వీరు 9మంది, నవబ్రహ్మలు :-
[2-86-వ., 2-89-వ., 2-105-ఉ., 2-117.1-తే., 2-119-చ., 8-480-వ.]

3352} ప్రజాపతిపతి  - ప్రజాపతులందరికిని పతి (ప్రభువు), విష్ణువు :-
[6-197.1-తే.]

3353} ప్రజ్ఞాలభ్యుడు  - బుద్ధిబలముచేత అందని వాడు, విష్ణువు :-
[7-148-శా.]

3354} ప్రజ్వారుడు  - పెద్ద జ్వరమైనవాడు, సంకేతము :-
[4-817-వ., 4-820-క.]

3355} ప్రణతవత్సలుడు  - ప్రణత (కొలిచెడివారికి) వత్సలుడు (వాత్సల్యము చూపువాడు), విష్ణువు :-
[8-483.1-తే.]

3356} ప్రణతామ్నాయుడు  - నమస్కరించిన వేదములు కలవాడు, కృష్ణుడు :-
[10.2-240-మ.]

3357} ప్రతిపక్షవిపక్షదూరుడు  - ప్రతిపక్ష (శత్రుపక్షము) యందును విపక్ష (వైరము) విదూర (లేనివాడు), విష్ణువు :-
[8-92-ఉ.]

3358} ప్రతిలోమకులములు  - అశాస్త్రీయమైన వివాహములవలన పుట్టిన వంశములు, సమాన లేదా నిమ్న వర్ణమునుండి భార్యను పొందుట శాస్త్ర ధర్మము దానికి వ్యతిరేకము ప్రతిలోమము :-
[3-255.1-తే.]

3359} ప్రతిషిద్ధము  - అదికూడదు అని చెప్పెడిది, నిషిద్ధము :-
[5.2-132-వ.]

3360} ప్రతోషుడు  - 1. సంతతివలన తుష్టి కలవాడు, 2. మిక్కిలి సంతోషము కలవాడు :-
[4-6-వ.]

3361} ప్రత్యక్షము  - ప్రతి (ఎదురుగ) అక్షము (కంటికి) ఐ ఉన్నది, నమ్మకమైన ప్రమాణము :-
[3-294.1-తే.]

3362} ప్రత్యక్షాదిప్రమాణములు(8)  - 1ప్రత్యక్షము 2అనుమానము 3ఉపమానము 4శాబ్దము 5అర్థాపత్తి 6అనుపలబ్ధి 7సంభవము 8ఐతిహ్యము. వీనిలో మొదటి 4 తార్కికులమతము 6వేదాంతులమతము 8పౌరాణికుల మతము ప్రకారము ఎంచబడును :-
[10.1-554-క.]

3363} ప్రత్యగాత్ముడు  - ఎదురుగకనబడువాడు, ప్రత్యక్ (ప్రత్యక్షముగ) ఆత్ముడు (ఆత్మ), విష్ణువు :-
[4-359.1-తే., 6-343-వ.]

3364} ప్రత్యయములు  - అనుభవమునకు వచ్చునవి :-
[6-343-వ.]

3365} ప్రత్యాలీఢపాదము  - విలుకాడు ఎడమ కాలు ముందరికి చాచి నిలుచు స్థితి :-
[10.2-179-మ.]

3366} ప్రదక్షిణ  - కుడివైపుగా (సవ్యముగ) చుట్టును తిరుగుట :-
[4-111-చ., 10.1-894-వ.]

3367} ప్రదరాసనము  - ప్రదరము (బాణము)నకు ఆసనము, ధనస్సు :-
[4-462-చ.]

3368} ప్రదోష  - సూర్యాస్తమయము తరువాతి కాలము. మునిమాపు, రాత్రి ప్రారంభకాలము :-
[4-390-వ.]

3369} ప్రద్యుమ్నుడు  - చతుర్వ్యూహములలోని ప్రద్యుమ్నుండు, అహంకారము సంజ్ఞగా కలవాడు, ప్రకర్షణేద్యుమ్నంద్రవిణం అన్యేతి ప్రద్యుమ్నః (వ్యుత్పత్తి), ప్రసిద్ధముగ ప్రజ్ఞాన మనెడి ధనము కలవాడు, విష్ణువు :-
[4-705-వ., 10.2-4-వ., 11-77-వ.]

3370} ప్రధానపూరుషుడు  - ప్రధాన (ముఖ్యమైన, ఆది) పూరుషుడు (కారణాత్మకమైనవాడు, పురుషము (కారణభూతము) తానైనవాడు), విష్ణువు :-
[7-459-ఉ., 10.1-103-మత్త.]

3371} ప్రధానము  - 1. మూలప్రకృతులు ఇరవైనాలుగు. ఆ పైన ఇరవైయైదోవాడు పురుషుడు, 2. త్రిగుణాత్మకం, అవ్యక్తం, నిత్యం, సదసదాత్మకం అను ప్రకృతి లక్షణములకు ఆధారమైనది, వేదములలో అదితి అనబడును :-
[3-886.1-తే., 3-890-క.]

3372} ప్రప  - చలిపందిరి, పానీయశాలిక :-
[10.1-1597-శా.]

3373} ప్రపంచకములు  - పంచభూతములు పంచతన్మాత్రలు పంచేంద్రియములు మొదలగు పంచకములు :-
[3-297-వ.]

3374} ప్రపంచము  - పంచపంచముల వలన వ్యాపించినది, పంచ (5) పంచములు (1పంచభూతములు 2పంచకర్మేంద్రియములు 3పంచజ్ఞానేంద్రియములు 4పంచతన్మాత్రలు 5పంచవాయువులు)చేత ఏర్పడిన సృష్టి, జగము :-
[2-89-వ., 3-210-క., 3-244-వ., 4-64-వ., 10.1-560.1-తే.]

3375} ప్రపత్తి  - నీవేతప్ప వేరు దిక్కు లేదను భక్తి :-
[11-41-వ.]

3376} ప్రపన్నానీకరక్షామణి  - ప్రపన్న (ప్రపత్తిని [భక్తులు చేయు శరణాగతిని] పొందిన వారి) అనీక (సమూహమును, గుంపును) రక్షా (రక్షించునట్టి) మణి (శ్రేష్ఠుడు), విష్ణువు. :-
[10.1-574-మ.]

3377} ప్రపన్నార్తిహరుడు  - ప్రపన్నుల (శరణుకోరినవారి) ఆర్తిని (బాధలను) హరుడు (నాశనము చేయువాడు), విష్ణువు :-
[3-143-క., 3-722-వ.]

3378} ప్రబోధమాత్రుడు  - జ్ఞానముచే మాత్రమే తెలియబడువాడు, భగవంతుడు :-
[2-207-క.]

3379} ప్రభ  - వెలుగు, పగలు :-
[4-390-వ.]

3380} ప్రభంజనతనయుడు  - ప్రభంజన (వాయుదేవుని) తనయుడు, భీముడు :-
[9-230-వ.]

3381} ప్రభంజననందనుడు  - ప్రభంజన (వాయుదేవుని) నందనుడు, భీముడు :-
[10.2-668-వ.]

3382} ప్రభవిష్ణుడు, ప్రభవిష్ణువు  - అవతరించు శీలము కలవాడు, సృష్టిగా పుట్టుకువచ్చే స్వభావము కలవాడు, విష్ణువు :-
[1-290-చ., 3-148-మ., 10.2-67-వ.]

3383} ప్రభాకరుడు  - ప్రకాశము కలుగజేయువాడు, సూర్యుడు :-
[11-99-వ.]

3384} ప్రభాసము  - మిక్కిలి భాసించునది, ద్వారకాపురికి సమీపమున ఉండు ఒకానొక పుణ్యతీర్థము, :-
[1-389-వ., 10.1-1416-శా.]

3385} ప్రభువు  - ప్రభుత్వము కలవాడు, అధికారి, ఏలిక, సమర్థుడు, విష్ణువు :-
[1-428-వ., 3-373-మ., 10.2-119-మ.]

3386} ప్రమథగణములు  - ప్రమథనము (వధించుట) చేసెడి శివుని భటుల గణములు (సమూహములు) :-
[10.2-402-చ.]

3387} ప్రమద  - సుఖమును ఇచ్చునామె, యౌవ్వనాది మదము గలామె, స్త్రీ :-
[3-729-చ., 4-747-వ., 4-756-వ., 10.1-787-మ., 10.1-1091-మ., 10.1-1458-మ.]

3388} ప్రమదప్రదుడు  - ప్రమద (సంతోషము)ను ప్రదుడు (ఇచ్చెడివాడ), విష్ణువు :-
[4-924-చ.]

3389} ప్రమదారత్నము  - స్త్రీలలో శ్రేష్ఠురాలు, లక్ష్మి :-
[10.1-1461-శా.]

3390} ప్రమదోత్తమ  - ప్ర (మిక్కిలి) మద (మదించిన, మత్తు కలి గుండెడి) ఆమె (స్త్రీ) వారిలో ఉత్తమురాలు, ఉత్తమస్త్రీ, బుద్ధికి సంకేతముగా వాడబడెను. :-
[4-853-వ.]

3391} ప్రమాణములు  - 1 ప్రత్యక్షము 2అనుమానము 3ఉపమానము 4శాబ్దము 6అర్థాపత్తి 7అనుపలబ్ధి 8ఐతిహ్యము, వీనిలో మొదటి నాలుగు (4) తార్కికుల మతమునందు ఆరు (6) వేదాంతుల మతమునందు ఎనిమిది (8) పౌరాణికుల మతమందు చెల్లును :-
[10.2-477-ఆ.]

3392} ప్రమోదము+అందుచున్  - ప్రమోదమందుచున్, ఉకార సంధి. :-
[10.2-1271-చ.]

3393} ప్రయాగ  - త్రివేణీసంగమముగల చోటు :-
[7-451-వ.]

3394} ప్రయాసంబు+కున్  - ప్రయాసంబునకున్, నుగాగమ సంధి :-
[10.2-1254-వ.]

3395} ప్రలంబవైరి  - ప్రలంబాసురిని శత్రువు, బలరాముడు :-
[10.1-760-శా.]

3396} ప్రలంబుడు  - ఒక అసురుడు, ప్ర (మిక్కిలి) లంబుడు (పొడవుగా ఉన్న వాడు), బలరాముని చేతిలో మరణించెను :-
[2-190-చ., 10.1-727-వ.]

3397} ప్రవర్గ్యము  - మహావీతము అగ్నిష్ఠోమాది యాగములకు విభాగములలో ఒకరకమైన యాగము, యాగవిశేషము, సోమయాగమునకు ముందు చేయబడునొక యజ్ఞ క్రతువు, గానమునకు ముందు గాత సంకల్పమునకు సంకేతము :-
[3-425.1-తే., 5.1-42-వ.]

3398} ప్రవిమలము - ప్రవిమలతరము ప్రవిమలతమము :-
[3-734.1-తే.]

3399} ప్రవిమలశుభమూర్తి  - మిక్కిలి నిర్మలమైన శుభకరమైన రూపము కలవాడు, శ్రీరాముడు :-
[8-744-మాలి.]

3400} ప్రవిమలాకారుడు  - మిక్కిలి నిర్మలమైన ఆకారము కలవాడు, విష్ణువు :-
[3-308.1-తే., 10.2-257.1-తే.]

3401} ప్రవిమలానందుడు  - మిక్కిలి నిర్మలమైన ఆనందమైనవాడు, విష్ణువు :-
[4-179.1-తే., 4-286.1-తే.]

3402} ప్రశాంతకీలహుతాశనము  - ప్రశాంత (చల్లారిన) కీలన్ (మంటలు) కల హుతాశన (అగ్ని), నివురుగప్పిననిప్పు :-
[4-388.1-తే.]

3403} ప్రశాంతదివ్యమంగళవిగ్రహుడు  - ప్రశాంతమైన దివ్యమైన మంగళ (శుభ) కరము ఐన విగ్రహుడు (స్వరూపము కలవాడు), విష్ణువు :-
[3-524-వ.]

3404} ప్రశ్రయము  - అనునయము, ఓదార్చుట :-
[4-28-వ.]

3405} ప్రసంఖ్యలసేనలు  - పదకొండు ఇంద్రియ వృత్తులకు సంకేతము :-
[4-771.1-తే.]

3406} ప్రసన్నుడు  - అనుకూలమైనవాడు, విష్ణువు :-
[3-748-క.]

3407} ప్రసవసాయకుడు  - ప్రసవ (పూల) సాయకుడు (బాణములవాడు), మన్మథుడు :-
[10.2-342-చ.]

3408} ప్రసాదము  - 1. ప్రసన్నత, 2. అనుగ్రహము, 3. కోపాదులు లేక సౌమ్యతతో యుండుట, 4. భగవంతునికి సమర్పించిన నైవేద్యం :-
[4-28-వ., 7-413-ఉ.]

3409} ప్రసూతి  - శిశుప్రసవము, కానుపు :-
[4-6-వ.]

3410} ప్రసేనుడు  - సత్రాజిత్తు తమ్ముడు :-
[10.2-55-చ.]

3411} ప్రస్థ  - తూము మొదలగు ఘనపరిమాణ కొలమానములోనిదైన కొలత :-
[3-346-వ.]

3412} ప్రహరణములుఐదు  - పంచకర్మేంద్రియములకు సంకేతము :-
[4-771.1-తే.]

3413} ప్రహ్లాదుడు  - పరమ విష్ణుభక్తుడు, మిక్కిలి హ్లాదము (సంతోషము)గలవాడు, హిరణ్యకశిపుని పుత్రుడు :-
[5.2-114.1-ఆ., 7-250-వ.]

3414} ప్రాకటలక్ష్మీకళత్రుడు  - ప్రాకట (ప్రసిద్ధమైన) లక్ష్మీదేవికి కళత్రుడు (భర్త), శ్రీకృష్ణ :-
[5.1-1-క.]

3415} ప్రాకారచక్రము  - కోట యొక్క సరిహద్దుగా కల గోడ, బురుజులు, కందకము మున్నగు రక్షణ వలయములు :-
[10.1-1532-వ.]

3416} ప్రాకృతప్రళయము, ప్రాకృతికప్రళయము  - బ్రహ్మ రాత్రి వచ్చునది, మరియొక విధముగ బ్రహ్మ జీవితకాలాంతమున జరుగు మహా ప్రళయము ప్రకృతి సృష్టి సమస్తము నాశనమగుట :-
[12-22-వ., 12-24-వ.]

3417} ప్రాక్కర్మసాక్షి  - ప్రాక్ (సృష్టిలో మొదటి)కర్మకి సాక్షియైనవాడు, విష్ణువు :-
[4-569.1-తే.]

3418} ప్రాగాది  - తూర్పు మొదలగు నాలుగు దిక్కులు, 1 తూర్పు 2 దక్షిణము 3 పడమర 4 ఉత్తరము అను నాలుగు దిక్కులు :-
[3-388-వ.]

3419} ప్రాగ్జోతిషపురము  - నరకాసురుని పట్టణము :-
[10.2-156-వ.]

3420} ప్రాగ్వంశము  - యజ్ఞశాల ప్రాంత గృహము :-
[4-118-వ.]

3421} ప్రాచీనబర్హి  - తూర్పునకు పరచిన దర్భలు కలవాడు :-
[4-680.1-తే.]

3422} ప్రాణదశకము  - 1 ప్రాణము 2 అపానము 3 వ్యానము 4 ఉదానము 5 సమానము 6 నాగము 7 క్రుకరము 8 కూర్మము 9 దేవదత్తము 10 ధనంజయము అను దశప్రాణవాయువులు :-
[3-246.1-తే., 10.1-91.1-తే.]

3423} ప్రాణనిరోధము  - ముక్కుమొదలగు ప్రాణద్వారములను బందించుట, నరక విశేషము :-
[5.2-136-వ.]

3424} ప్రాణము  - ఓంకారము ఉచ్ఛారణ తరువాతి మౌనరూపము :-
[7-467-వ.]

3425} ప్రాణములు, దశవాయువులు  - పంచవాయువులు ఐదు (ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు) పంచ ఉపవాయువులు ఐదు (నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయములు) :-
[10.1-682.1-తే.]

3426} ప్రాణవల్లభ  - ప్రాణములతో సమానమైన వల్లభ (ప్రియురాలు), భార్య :-
[8-546-వ., 9-173.1-ఆ.]

3427} ప్రాణవల్లభుడు  - ప్రాణముతో సమానమైన వల్లభుడు(ప్రియుడు ఇష్టము గలవాడు), భర్త :-
[7-417-క.]

3428} ప్రాణహాని  - ప్రాణములు హాని (నష్టమగుట), చావు :-
[7-213-వ.]

3429} ప్రాణాయామము  - ప్రాణము (ముక్కుపుటముల యందు సంచరించెడి వాయువు) ద్వారా పంచప్రాణములను నియమించుట :-
[3-471-వ.]

3430} ప్రాణుడు  - ప్రాణము కలవాడు, విధాతకు నియతియందు పుట్టిన కొడుకు. వేదశిరుని తండ్రి. :-
[4-26-వ.]

3431} ప్రాణేశుడు  - ప్రాణములకు ఈశుడు (ప్రభువు), భర్త :-
[1-266-మ., 3-470-క., 7-42-శా., 9-246-శా., 9-590.1-తే., 10.2-151-శా.]

3432} ప్రాతః  - ఉదయము, పుష్పార్ణుడు భార్య దోషల ముగ్గరు కొడుకులలో ఒకడు. వారు ప్రాతః, మధ్యందిన, సాయం. :-
[4-390-వ., 6-507-వ.]

3433} ప్రాతస్సంగమము  - పొద్దు పొడుచుటకు ముందు మూడుగడియల కాలము, ఉదయసంధ్య :-
[6-307-వ.]

3434} ప్రాదేశ  - బొటకన వేలు చూపుడు వేలు చాపినంత పొడుగు, జాన పొడుగు, జత్తిలి :-
[2-26-వ.]

3435} ప్రాపితసనకాదితతుడు  - ప్రాపిత (తనను పొందిన) సనక (సనకుడు) ఆది (మొదలగువారి) తతుడు (సమూహము గలవాడు), విష్ణువు :-
[6-32-క.]

3436} ప్రాభవము  - ప్రభావము కలిగి ఉండుట ప్రభావము చేయ కలవాడు ప్రభువు అతని తత్వము ప్రభుత్వము :-
[2-18.1-తే.]

3437} ప్రాయశ్చిత్తము  - పొరపాటు జరిగిన దాని దోష విమోచనమునకైన విధానములు :-
[3-388-వ.]

3438} ప్రాయోపభేదములు  - 1బాల (16సం. వరకు) 2యౌవన (30సం. వరకు) 3పౌఢ (40సం. వరకు) 4లోల (40సం. పైన) ఆయా ప్రాయోబేధమును అనుసరించి ఉపచారలక్షణములు ఉండును :-
[10.1-1495-ఉ.]

3439} ప్రాయోపవిష్టుడు  - ఆహారాదులు మాని మరణమునకు ఎదురుచూచుట అను నిష్ఠలో ఉన్నవాడు :-
[1-508-వ., 7-2-వ., 9-2-వ., 11-2-వ.]

3440} ప్రాయోపవేశము  - అన్నపానాదులు విడిచి మరణమున కెదురు చూచుచుండు నిష్ఠ, ఆమరణనిరాహారదీక్ష :-
[1-499-వ., 8-22-వ.]

3441} ప్రారబ్ధకర్మములు  - ఆగామి సంచిత కర్మములు, పునర్జన్మకు కారణములైన కర్మములు :-
[10.1-555-శా.]

3442} ప్రాహ్ణము  - ఉదయము మొదలు పదిగడియలు వరకు గల కాలము, లేబగలు :-
[6-307-వ.]

3443} ప్రియ - ప్రియతరము ప్రియతమము :-
[2-255-క.]

3444} ప్రియధరిత్రీనాథుడు  - ప్రియమైన భూదేవికి భర్త, శ్రీకృష్ణ :-
[5.1-181-మ.]

3445} ప్రియము - ప్రియతరము ప్రియతమము :-
[3-397-క., 4-624-వ.]

3446} ప్రియలు - ప్రియతరులు ప్రియతములు :-
[4-698.1-తే.]

3447} ప్రియవ్రతుడు  - ప్రియమే వ్రతముగా కలవాడు, స్వాయంభువ మనువు శతరూపల పెద్దకొడుకు :-
[4-217-తే., 4-968-వ.]

3448} ప్రియాంగన  - ప్రియమైన అంగన (స్త్రీ), భార్య :-
[4-810-వ.]

3449} ప్రియుడు - ప్రియతరుడు ప్రియతముడు :-
[3-196-వ., 3-561.1-తే., 3-564-క., 4-878-వ.]

3450} ప్రియుడు  - ప్రియమైనవాడు, భర్త :-
[2-23-వ.]

3451} ప్రీత  - సర్వులకు ప్రీతి యైనవాడు, ప్రసన్నము నొందినవాడు; సంతోషించినవాడు; తృప్తి నొందినవాడు. విష్ణువు :-
[8-503.1-తే.]

3452} ప్రీతివిశేషములు  - శృంగారశాస్త్ర పారిభాషిక పదం, 1అభ్యాసయోగము 2అభిమానయోగము 3సంప్రత్యయోగము 4వైషయికము 5స్వభావసాత్వికము :-
[10.1-1495-ఉ.]

3453} ప్రేతనాయకుడు  - శవములకు నాయకుడు, యముడు :-
[6-69-క.]

3454} ప్రేతములు  - పిశాచబేధము, పీనుగు :-
[5.2-103-క., 6-307-వ.]

3455} ప్రేషవాక్యము  - యజ్ఞములలో దేవతలనాహుతి గ్రహించుటకై పిలిచెడి పిలుపు :-
[12-26-వ.]

3456} ప్లక్షము  - జువ్విచెట్టు :-
[5.2-61-క.]

3457} ప్లవంగము  - దాటుచు పోవునది, కోతి :-
[10.2-541.1-తే.]

3458} ఫణి  - ఫణములు (పడగలు) కలది, సర్పము :-
[10.1-1515-మ.]

3459} ఫణిపతి  - ఫణి (సర్పములకు) పతి (రాజు), ఆదిశేషుడు :-
[7-120-క.]

3460} ఫణిరాజమండనుడు  - ఫణి (సర్పములలో) రాజ (శ్రేష్ఠములచే) మండన (అలంకరింపబడిన వాడు), శివుడు :-
[8-49.1-ఆ.]

3461} ఫణిరాజు  - సర్పములకు రాజు, ఆదిశేషువు :-
[2-265.1-తే., 3-309.1-తే., 3-413.1-తే.]

3462} ఫలము  - ఫలితము :-
[3-401-చ.]

3463} ఫలి  - ఫలములనిచ్చునది, చెట్టు :-
[10.2-94-క.]

3464} ఫల్గున  - ఉత్తర ఫల్గుని నక్షత్రము నందు పుట్టినవాడు, వేగముగా పాదరసం వలె ప్రసరించువాడ, అర్జున :-
[1-371-క.]

3465} ఫాలక్షుడు - నుదుట కన్ను కలవాడ, శివుడు, అహంకారేంద్రియమునకు అధిదేవత :-
[10.1-572.1-తే.]

3466} ఫాలనయనుడు  - ఫాల (నుదుట) నయనుడు (కన్నుగలవాడు), శివుడు. :-
[8-227-ఆ., 10.2-832-క.]

3467} ఫాలలోచనుడు  - ఫాలము (నుదురు) యందు లోచనుండు (కన్ను కలవాడు), శివుడు :-
[4-170-వ., 10.2-352-మ., 10.2-1241-వ.]

3468} ఫాలాక్షుడు  - ఫాలమున (నుదుట) అక్షుడు (కన్ను గలవాడు), శివుడు :-
[1-366.1-ఆ., 8-177-క., 9-229-ఆ., 10.1-1334-మ., 12-36-మ.]

3469} ఫుల్లసరోజపత్రనేత్రుడు  - వికసించిన (ఫుల్ల) పద్మముల (సరోజ) రేకులు (పత్ర)వంటి నేత్రములు కలవాడు, విష్ణువు :-
[3-236-చ.]

3470} ఫుల్లసరోరుహపత్రనేత్రుడు  - ఫుల్లన్ (వికసించిన) సరోరుహ పత్రము (తామర రేకు)లవంటి నేత్రుడు (కన్నులు) ఉన్నవాడు, విష్ణువు :-
[3-595-ఉ.]

3471} బంతెనగుండ్లు  - భోజనపంక్తిలో ఒకరికొకరు విసరుకొను బంతి+ఎన+గుండ్లు, గుండులు (బంతుల వంటి అన్నపు ముద్దలు) :-
[10.1-496.1-ఆ.]

3472} బంధుపోషప్రవర్తి  - ఆత్మీయులను పోషించెడి వాడు, శ్రీరాముడు :-
[8-744-మాలి.]

3473} బంధురము - బంధురతరము బంధురతమము :-
[10.1-1542-క.]

3474} బకవైరి  - బకాసురుని శత్రువు, కృష్ణుడు :-
[10.1-465-క.]

3475} బకారాతి  - బకాసురుని శత్రువు, కృష్ణుడు :-
[10.1-1126-శా.]

3476} బకాసురుడు  - అతి పెద్ద బకము (కొంగ) రూపమున బాల కృష్ణుని వధించవచ్చిన వాడు :-
[2-190-చ.]

3477} బదరి  - రేగుచెట్టు, ఒక పుణ్యక్షేత్రం :-
[3-171-వ.]

3478} బదరిక  - రేగుపళ్ళు, రేగుచెట్టు :-
[2-127-క., 3-160-మ.]

3479} బదరికాశ్రమము  - రేగు చెట్లవనమున కల ఆశ్రమము, వ్యాసుడు ఉండు ఆశ్రమము :-
[3-174-క.]

3480} బదరీ  - రేగుపళ్ళు :-
[2-126-క.]

3481} బద్దుడు  - ప్రకృతి పాశములచేత కట్టుబడువాడు, మాయకు లోబడువాడు :-
[10.1-683-వ.]

3482} బయలాలకించు  - బయలు (శూన్యములోనికి) ఆలకించు (విను), నిశ్చేష్టమగు :-
[8-93-వ.]

3483} బర్హిర్ముఖుడు  - వ్యు. (బర్హిః ముఖమ్ అస్య ), బ.వ్రీ., నోటియందు అగ్ని కల దేవత, (శబ్దరత్నాకరము) అగ్నిదేవుడు :-
[3-612-వ.]

3484} బర్హిషదులు  - పంచచత్వారింశత (49) అగ్నులలోని వారు, బర్హి (దర్భ)లందు ఉండు అగ్నులు? :-
[4-34-వ.]

3485} బర్హిష్మదుడు  - దర్భలు కలిగి మిక్కిలిన వాడు, యజించువాడు :-
[4-679-వ.]

3486} బలభిత్తు  - బలాసురుని ధ్వంసము చేసినవాడు, ఇంద్రుడు :-
[12-36-మ.]

3487} బలభేది  - బల (బలాసురుని) భేదించిన (సంహరించిన) వాడు, ఇంద్రుడు :-
[1-39-వ., 6-430-వ., 11-64-తే.]

3488} బలరాముడు  - బలముచే రమింపజేయువాడు, కృష్ణుని అన్న :-
[10.1-1556-చ.]

3489} బలరిపుడు  - బలాసురుని శత్రువు, ఇంద్రుడు :-
[10.1-738-క., 10.1-925-క.]

3490} బలసూదనుడు  - బలాసురుని సంహరించిన వాడు, ఇంద్రుడు :-
[10.1-740-క.]

3491} బలానుజుడు  - బలరాముని సోదరుడు, కృష్ణుడు :-
[10.1-1348-వ.]

3492} బలాభీలహరి  - బలుడు అభీలుడను రాక్షసులను హరి (సంహరించిన వాడు), విష్ణువు :-
[6-33-క.]

3493} బలారాతి  - బలి యొక్క అరాతి (శత్రువు), ఇంద్రుడు :-
[8-182-వ.]

3494} బలారి  - బలి (బలాసురుని) శత్రువు, ఇంద్రుడు :-
[10.1-936-మ.]

3495} బలి  - 1. కోరికలు తీర్చుటకు పెట్టునవి, 2. దైత్యఛక్రవర్తి :-
[10.2-249-వ.]

3496} బలిచక్రవర్తి  - దైత్య ఛక్రవర్తి, వామనునకు దానమిచ్చిన మహాదానశీలి, ప్రహ్లాదుని మనుమడు. :-
[2-204.1-తే.]

3497} బలినందనుడు  - బలిచక్రవర్తి యొక్క కొడుకు, బాణుడు. :-
[10.2-318-వ.]

3498} బలిభంజనుడు  - బలిని శిక్షించిన వాడు, వామనుడు :-
[10.1-905-వ.]

3499} బలివిద్వేషి  - బలికి శత్రువు, ఇంద్రుడు :-
[8-487-మ.]

3500} బలుడు  - బలము కలవాడు, బలరాముడు :-
[10.1-1577-ఉ.]

3501} బహిరంగవీధులు  - అంతర బాహ్య శబ్ద దృశ్యాది విషయ పంచక మార్గములు, బాహ్యప్రదేశములు :-
[10.1-553.1-ఆ.]

3502} బహిరన్తరాత్మ  - పరమాత్మ మరియు అంతరాత్మ అయినవాడు, విష్ణువు :-
[4-704-తే.]

3503} బహు - బహుతర బహుతమ :-
[9-327.1-తే.]

3504} బహు - బహుతరము బహుతమము :-
[7-217-వ., 10.1-762.1-తే.]

3505} బహుజగదవనుడు  - అనేక లోకములను రక్షించువాడు, విష్ణువు :-
[10.1-1629.1-తే.]

3506} బహుతరధృతి  - బహుతర (అనేకమైన) ధృతి (ధీరత్వం కల వాడు), విష్ణువు :-
[6-32-క.]

3507} బహుపాదులు  - అనేక పాదములు కలవి, కీటకాదులు :-
[4-853-వ., 11-91-వ.]

3508} బహుప్రభావప్రతీతుడు  - క. నానా దేహోపాధుల, నానాత్వ భ్రాంతినొంది నానీదనుచున్, నానాభిమానములచే, నానావిభవంబులాయె నారాయణుఁడే (రామస్తవరాజము) :-
[10.1-683-వ.]

3509} బహురసాన్నములు  - అనేకమైన రస (రుచులు) కలిగిన ఆహార పదార్థములు, షడ్రసోపేతములు :-
[10.1-889.1-తే.]

3510} బహుళము - బహుళతరము బహుళతమము :-
[7-464.1-తే., 10.1-1677-వ.]

3511} బహుసన్నుతలోకాళి  - బహు (అనేకమైన) సన్నుత (స్తుతించెడి) లోక (లోకముల) ఆళి (సమూహములు గలామె), పార్వతి :-
[6-7-క.]

3512} బాణదనుజేంద్రకూఁతుపతి  - బాణాసుర పుత్రిక (ఉషాకన్య) పతి, అనిరుద్ధుడు :-
[1-348.1-తే.]

3513} బాణుడు  - 1. హర్షచరిత్ర, చండికా శతకము, పార్వతీ పరిణయం మున్నగునవి వ్రాసిన హర్షవర్థనుని ఆస్థాన కవి, 2. బలి పెద్దకొడుకు, ఇతని కూతురు ఉషాకన్య కలలో చూసి అనిరుద్ధుని వరించింది. :-
[6-11.1-తే.]

3514} బాదరాయణి  - బదరీవనమున ఉండువాడు బాదరాయణుడు (వ్యాసమహర్షి) వారి పుత్రుడు బాదరాయణి (శుకమహర్షి) :-
[1-55-మ., 1-140-క., 3-11-చ., 3-78-క., 5.2-3-క., 6-444-వ., 8-693-వ., 10.2-1203-వ., 10.2-1338-క., 11-26-వ.]

3515} బాదరాయణుడు  - బదరీవనములో నుండు వాడు, వ్యాసుడు :-
[1-136-వ., 1-206-వ., 2-257.1-తే., 3-234-వ., 9-669-ఉ.]

3516} బారువ  - ఇరవై (20) మణుగుల బరువు, ఒక మణుగు ఎనిమిది వీశల బరువు :-
[10.2-51-వ.]

3517} బాలచంద్రభూషణుడు  - బాలచంద్రుడు (చంద్రవంక) భూషణముగ కలవాడు, శివుడు :-
[4-138.1-తే.]

3518} బాలుడు  - విష్ణువు లోకోత్పత్తి కారణమైన ప్రథమస్ఫురణ రూపమైనవాడు కనుక బాలుడు :-
[10.1-901-క.]

3519} బాలేందుముఖి  - బాల ఇందు (బాల చంద్రుని వంటి) ముఖి (మోముకలామె), స్త్రీ. :-
[4-746.1-తే.]

3520} బాలేందురేఖ  - నెల మొదటిరోజు (అమావాశ్య వెళ్ళిన పాడ్యమి నాటి) చంద్రబింబము యొక్క వంక, నెలవంక :-
[10.1-1688-క.]

3521} బాల్యము  - 1 నుండి 5 సం., కౌమారము, పసితనము :-
[10.1-1392.1-తే.]

3522} బావ  - భార్య/ భర్త యొక్క అన్న, మేనత్త మేనమామల పుత్రుడు. :-
[10.2-304-క.]

3523} బాహ్యేంద్రియములు  - వెలుపలి కన్ను మొదలగు పంచేంద్రియములు :-
[3-180.1-తే.]

3524} బిందువు  - ఓం లోని ఓ తరువాతి పూర్ణానుస్వారం :-
[7-467-వ.]

3525} బింబోష్ఠి  - దొండపండు వంటి పెదవి కలామె, స్త్రీ :-
[10.2-212.1-ఆ.]

3526} బిలము  - భూమి లేదా కొండల యందలి ఖాళీస్థలము లేదా కన్నము. గుహ, రంద్రము :-
[5.2-105-వ.]

3527} బిసరుహనేత్రుడు  - బిసరుహము (పద్మము) లవంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు :-
[3-693-క.]

3528} బిసరుహసంభవుడు  - బిసరుహము (పద్మము)న సంభవుడు (జనించినవాడు), బ్రహ్మ :-
[5.2-100-క.]

3529} బీజన్యాసముచేయుట  - ద్వాదశాక్షరి (ఓంనమో భగవతే వాసుదేవాయః) మున్నగు జప మంత్రమును ప్రణవాదిగా అంగన్యాస సహితంగా (లలాటాది స్థానములను తాకుట కలదిగా) ఆచరించుట :-
[10.1-236-వ.]

3530} బీడు  - నిస్సారమైన భూమి, దున్ననిభూమి :-
[9-281-క.]

3531} బీష్మకవరపుత్రి  - భీష్మకుని ఉత్తమమైన కుమార్తె, రుక్మిణి :-
[10.2-243-క.]

3532} బుద్ధి - మతి (దీని లక్షణములు 1శుశ్రూష 2శ్రవణము 3గ్రహణము 4ధారణము 5ఊహము 6అపోహము 7అర్థవిజ్ఞానము 8తత్త్వజ్ఞానము) :-
[6-307-వ.]

3533} బుద్ధి  - నిశ్చయాత్మకమైన అంతఃకరణము, మతి (దీని లక్షణములు 1శుశ్రూష 2శ్రవణము 3గ్రహణము 4ధారణము 5ఊహము 6అపోహము 7అర్థవిజ్ఞానము 8తత్త్వజ్ఞానము) :-
[10.1-682.1-తే., 10.1-1472.1-తే., 10.2-1203-వ.]

3534} బుద్ధుడు  - శాక్యముని, జ్ఞానోదయము పొందిన శుద్ధోదనుడు, బుద్ధావతారము, 1ఆదిబుద్దుడు ఋషభుడు (సుగతుడు), 2రెండవ బుద్ధుడు భరతుడు (సద్గతుడు), 3మూడవ బుద్ధుడు సుమతి (రెండవ సుగతుడు), ... 6ఆరవ బుద్ధుడు గౌతమ బుద్దుడు (తథాగతుడు), 7ఏడవ బుద్ధుడు మైత్రేయ బుద్ధుడు (భవిష్యత్తులో రాబోవువాడు) :-
[5.2-5-క., 10.1-1236-దం.]

3535} బుధమాన్యచరిత్రపవిత్రుడు  - బుధ (మంచివారి)చే మన్నింపబడు చరితము (వర్తనము) వలన పరిశుద్ధమైనవాడు, విష్ణువు :-
[3-212-చ.]

3536} బుధవంద్యుడు  - బుధులచే నమస్కరింపబడువాడు, బ్రహ్మదేవుడు :-
[3-335-ఉ.]

3537} బుధాగ్రగణ్యుడు  - బుధ (జ్ఞానులలో) అగ్రగణ్య (మొదటి లెక్కించ బడువాడు, శ్రేష్ఠుడు), కృష్ణుడు. :-
[10.2-108.1-తే.]

3538} బృందావనభాసురుడు  - బృందావనమునందు ప్రకాశించువాడు, శ్రీకృష్ణుడు :-
[5.1-181-మ.]

3539} బృందావనము  - 1. బృంద (సమూహము) ఆవనము (రక్షించుట), 2. బృంద (తులసి) వనము (తోట), 3. యమున ఈవలి ఒడ్డున పశ్చిమతీరమున మధుర దగ్గఱ బృందావనం ఉంది. ఆవలి ఒడ్డున (అనఁగా యమున తూర్పు గట్టున) గోకులము ఉంది. అక్కడ కృష్ణుడు గోపకన్యకలతో అనేకలీలలు సలిపాడు. :-
[2-188.1-తే.]

3540} బృహత్కాలము  - దినములోని భాగములు సూక్ష్మకాలములు, వాటికి పెద్దవి బృహత్కాలములు :-
[2-222-వ.]

3541} బృహస్పతి  - బ్రహ్మవిద్యకు అధిపతి, దేవతలకు గురువు :-
[4-26-వ.]

3542} బృహస్పతిసవనము  - వాగుచ్ఛారణ ప్రధానమైన యాగము :-
[4-54-వ.]

3543} బేతాళ  - పిశాచ భేదము. భూతావశిష్ట మృత శరీరము :-
[2-274.1-తే., 10.1-1757-వ., 10.2-418-వ.]

3544} బోధ  - పరమాత్మ స్వస్వరూపమై తెలిసి యుండుట, జ్ఞానము :-
[10.1-567.1-ఆ.]

3545} బోరగిలపడుట  - బోర (పొట్ట) కిందపడేలా పడుట, బోర్లాపడుట :-
[10.2-943-చ.]

3546} బ్రహ్మ - బృహిర్బహ్మ వృద్ధౌ బృహతేర్ధాతోః అర్థానుగమాత్ దేశతః కాలతః స్వరూపతః అపరిచ్ఛిన్నం యద్వస్తు తద్బ్రహ్మ (వ్యుత్పత్తి), శ్రీకృష్ణుడు :-
[10.1-942-ఆ.]

3547} బ్రహ్మకూకటిముట్టెదను  - 1. బ్రహ్మయొక్క జుట్టును అందుకొనెదను, 2. అంతెత్తు ఆనందం పొందెదను 3. మహానందపడెదను :-
[8-566-ఆ.]

3548} బ్రహ్మగాయత్రి  - ప్రణవము, ఓంకారము :-
[3-471-వ.]

3549} బ్రహ్మచర్యాది  - చతురాశ్రమములు, బ్రహ్మచర్య గృహస్త వానప్రస్త సన్యాస ఆశ్రమములు :-
[2-222-వ.]

3550} బ్రహ్మణ్యత  - బ్రహ్మ(వేదము)లను అనుసరించి జీవించుట, బ్రాహ్మణుల యెడ హితవు :-
[1-403-వ.]

3551} బ్రహ్మదండనము  - బ్రహ్మ (అతి పెద్దదైన) దండనము (శిక్ష), మరణశిక్ష :-
[4-393-వ.]

3552} బ్రహ్మదేవుడు  - బుద్ధీంద్రియమునకు అధిదేవత, జగత్తు సృష్టికర్త :-
[10.1-572.1-తే.]

3553} బ్రహ్మదేవునిపదుగురుకొడుకులు  - 1 అంగుష్టమున, దక్షుడు 2 ఊరువుల, నారదుడు 3 నాభిన, పులహుడు 4 కర్ణముల, పులస్త్యుడు 5 త్వక్కున, భృగువు 6 హస్తమున, క్రతువు 7 నాస్యంబున, అంగిరసుడు 8 ప్రాణమున, వసిష్టుడు 9 మనమున, మరీచుడు 10 కన్నుల అత్రి పుట్టిరి. :-
[3-376-తే.]

3554} బ్రహ్మనగరంబు  - బ్రహ్మదేవుని పట్టణము, సత్యవతి :-
[10.1-1593-ఆ.]

3555} బ్రహ్మపుత్రుడు - నారదుడు, బ్రహ్మదేవుని మానస పుత్రుడు :-
[7-476-వ.]

3556} బ్రహ్మబంధుడు  - బ్రష్టుపట్టిన బ్రాహ్మణునికి వాడే జాతీయము :-
[4-101.1-తే.]

3557} బ్రహ్మమయుడు - బ్రహ్మ స్వరూపుడు, శివుని. :-
[4-138.1-తే.]

3558} బ్రహ్మము  - 1. దేశకాలవస్తువులచే విభాగింపరానిది, పరబ్రహ్మము, భగవంతుడు, 2. పరబ్రహ్మ స్వరూపుడు, విష్ణువు :-
[2-210-ఉ., 3-720.1-తే., 4-195-చ., 7-478-మ., 10.1-962-మ.]

3559} బ్రహ్మరంధ్రము - నడినెత్తిన మాడుపట్టు వద్ద ఉండునది :-
[2-29.1-ఆ.]

3560} బ్రహ్మరాతుడు  - బ్రహ్మముచే అనుగ్రహింపబడిన వాడు, శుకబ్రహ్మ :-
[2-222-వ.]

3561} బ్రహ్మలు  - బ్రహ్మజ్ఞాన స్వరూపులైన గణదేవతా విశేషము. నవబ్రహ్మలు 1 మరీచి 2 భరద్వాజుడు 3 అంగీరసుడు 4 పులస్త్యుడు 5 పులహుడు 6 క్రతువు 7 దక్షుడు 8 వశిష్టుడు 9 వామదేవుడు, పాఠ్యంతరములు కలవు :-
[3-150-వ.]

3562} బ్రహ్మవేత్తలు  - వేద ధర్మములు బాగుగనెరినవారు, బ్రాహ్మణులు, శ్రు. బ్రహ్మై వేద బ్రహ్మవిద్భవతి, బ్రహ్మవేత్తలు బ్రహ్మమే (నీ స్వరూపులే) ఐయున్నారు :-
[4-465.1-తే., 10.1-577-క.]

3563} బ్రహ్మహత్య  - బ్రాహ్మణుని చంపుట, పంచ మహా పాతకములలో ఒకటి (1స్వర్ణస్తేయము 2సురాపానము 3బ్రహ్మహత్య 4గురుపత్నీగమనము 5ఇవి చేసేవారితో స్నేహము) :-
[6-316-వ., 10.2-931-క.]

3564} బ్రహ్మాండభాండము  - సకల లోకములు కల బ్రహ్మాండాలు తనలో గల అతి పెద్దదైన అండ స్వరూప భాండము :-
[6-307-వ.]

3565} బ్రహ్మాండము  - ఒక పెద్ద గుడ్డు ఆకారమున ఉండు భూగోళ ఖగోళాదికములు కల పెద్ద అండము (గోళము) :-
[5.2-75-వ., 10.1-340-క., 10.1-916-క.]

3566} బ్రహ్మాత్ముడు  - బ్రహ్మపదార్థమే తానైన వాడు :-
[2-110-మ.]

3567} బ్రహ్మావర్తము  - బ్రహ్మ జ్ఞానులు తిరిగెడి నేల, సరస్వతీ దృషద్వతీ నదులకు నడిమి దేశము, ప్రస్తుతపు ఢిల్లీ నగరమునకు వాయవ్యభాగపు దేశ విశేషము. :-
[5.1-64-వ.]

3568} బ్రాహ్మణాదులు  - చతుర్వర్ణములు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములు :-
[2-222-వ.]

3569} బ్రాహ్మణాననుడు  - బ్రాహ్మణులే అననుడు (ముఖముగా, నోరుగా గలవాడు), విష్ణువు :-
[7-448-వ.]

3570} బ్రాహ్మణుడు  - వ్యుత్పత్తి, బ్రహ్మణి పరబ్రహ్మణి నిష్ఠావత్త్వాత్ బ్రాహ్మణః. బ్రహ్మదేవుని ఉత్కృష్టమైన దైవమనెడి నిష్ఠ యందుండువాడు, విప్రుడు :-
[10.1-889.1-తే.]

3571} బ్రాహ్మబంధువు  - భ్రష్టుడైన బ్రాహ్మణునకు జాతీయము :-
[1-171-ఉ.]

3572} బ్రాహ్మి  - బ్రహ్మ దేవుని భార్య, సరస్వతి :-
[1-7-శా.]

3573} భక్తకల్పకుడు  - భక్తులకు కల్పవృక్షమువంటి వాడు, విష్ణువు. :-
[4-730-చ.]

3574} భక్తకల్మషవల్లికాపటులవిత్రుడు  - భక్త (భక్తుల యొక్క) కల్మష (పాపములు) యనెడి వల్లికా (లతలకు) పటు (గట్టి) లవిత్ర (కొడవలివంటివాడు), విష్ణువు. :-
[7-376.1-తే.]

3575} భక్తజననుతగాత్రుడు  - భక్తజన (భక్తులైనవారి)చేత నుత (స్తోత్రములు)చేయబడుతున్న గాత్రుడు (దేహము కలవాడ), శ్రీకృష్ణ. :-
[5.1-182-క.]

3576} భక్తజనపోషణభూషణుడు  - భక్తులైనవారిని కాపాడుట అను భూషణములు కలవాడు, శ్రీరాముడు :-
[10.2-1340-చ.]

3577} భక్తజనపోషపరితోషుడు  - భక్తులు అయిన జనులను పోషించుట యందు సంతోషము కలవాడు, విష్ణువు :-
[3-308.1-తే.]

3578} భక్తజనపోషుడు  - భక్తులయినవారిని కాపాడువాడ, శివుడు :-
[4-147.1-తే.]

3579} భక్తజనబృందప్రాభవాలంకరిష్ణుడు  - భక్తజనుల బృంద (సమూహములను) ప్రాభవ (గొప్పదనము)తో అలంకరిష్ణుడు (అలంకరించెడి వాడు), విష్ణువు :-
[8-105-మ.]

3580} భక్తజనలోకమందార  - భక్తులైనజనులు సమస్తమునకు కల్పవృక్షమువంటివాడు, విష్ణువు :-
[4-555.1-తే.]

3581} భక్తజనానురూపసందర్శనుడు  - భక్తులు ఐన జనులకు అను(ధ్యానించిన)రూపమున సందర్శనుండు (చక్కగా కనిపించువాడు), విష్ణువు :-
[3-722-వ.]

3582} భక్తజనార్తిహరుండు  - భక్తులైనవారి ఆర్తి (బాధలను) హరించువాడు, విష్ణువు :-
[4-347.1-తే.]

3583} భక్తజలధితరంగుడు  - భక్త (భక్తులు అనెడి) జలధి (సముద్రపు) తరంగుడు (కెరటములు గలవాడు), రాముడు :-
[4-975-క.]

3584} భక్తనతపదయుగళుడు  - భక్తులుచే నుతింపబడు పాదముల జంట కలవాడు, విష్ణువు. :-
[11-108-క.]

3585} భక్తనిధానుడు  - భక్తులకు నిధానుడు (నిధియైనవాడు), కృష్ణుడు :-
[5.2-167-మత్త.]

3586} భక్తపరతంత్రుడు  - భక్తుల యెడ సాభిప్రాయము కలవాడు, విష్ణువు :-
[10.2-204-చ.]

3587} భక్తపరిపాలుడు  - భక్తులను చక్కగా పాలించువాడు, విష్ణువు :-
[3-523-చ.]

3588} భక్తపాలనకరుడు  - భక్తులను పాలించుట చేయువాడు, విష్ణువు :-
[4-937-త.]

3589} భక్తపాలనుడు  - భక్త (భక్తులను) పాలన (పోషణ చేసెడివాడు), రాముడు. :-
[4-974-చ., 10.2-315-ఉ.]

3590} భక్తప్రపోషుడు  - భక్తులను చక్కగా పోషించువాడు, విష్ణువు :-
[3-922.1-తే.]

3591} భక్తప్రసన్నుడు  - భక్తుల యెడ ప్రసన్నముగ యుండువాడు, శివుడు :-
[4-138.1-తే., 4-173.1-తే.]

3592} భక్తఫలప్రదాయకుడు  - భక్త(భక్తులకు) ఫల (మంచి ఫలితములను) ప్రదాయకుడు (చక్కగా యిచ్చువాడ), విష్ణువు. :-
[3-312-చ., 4-922-చ.]

3593} భక్తమందారుడు  - భక్తుల ఎడ కల్పవృక్షము వంటివాడు, కృష్ణుడు :-
[3-304.1-తే., 10.2-257.1-తే.]

3594} భక్తమానసవశంకరుడు  - భక్తుల మనసులను వశపరచుకొనువాడు, శివుడు :-
[10.2-315-ఉ.]

3595} భక్తమిత్రుడు  - భక్తులకు ఆప్తుడు, విష్ణువు. :-
[10.1-407-ఉపేం.]

3596} భక్తరంజనుడు  - భక్తులను రంజనుడు (రంజింపజేయువాడు), శివుడు. :-
[6-2-ఉ.]

3597} భక్తలోకపరిగ్రహప్రకటశీలుడు  - భక్తుల లోక (అందరను) పరిగ్రహ (అనుగ్రహించు) శీలము (వ్యక్తిత్వము, ప్రవర్తన) కలవాడు, విష్ణువు :-
[3-924.1-తే.]

3598} భక్తలోకపరిపాలనశీలుడు  - భక్తులు లోక (సర్వులను) పరిపాలన (పాలించెడి) శీలుడు (వర్తన గలవాడు), విష్ణువు :-
[6-173-చ.]

3599} భక్తలోకోపకారి  - భక్తులను లోక (ఎల్లరకు) ఉపకారి (ఉపకారము చేయువాడు), శ్రీరాముడు :-
[10.1-1791-మాలి.]

3600} భక్తవత్సలుడు  - భక్తులయెడ వాత్సల్యము కలవాడు, విష్ణువు, శ్రీకృష్ణుడు, శివుడు :-
[3-154-క., 3-545-చ., 4-233.1-తే., 4-697-వ., 5.1-181-మ., 6-343-వ., 7-122.1-తే., 7-281-వ., 7-308-చ., 7-377-వ., 7-397-వ., 10.1-439-క., 10.1-572.1-తే., 10.1-1204-క., 10.1-1516-మ., 10.2-246-క.]

3601} భక్తవరదుడు  - భక్తులకు వరములను ప్రసాదించువాడు, భగవంతుడు, విష్ణువు :-
[3-576.1-తే., 6-342-ఆ., 6-397.1-ఆ., 10.1-689-ఆ.]

3602} భక్తవిధేయుడు  - భక్తులకు అనుకూలముగ ఉండువాడు, విష్ణువు. :-
[3-143-క.]

3603} భక్తవ్రాతచింతామణి  - అనన్య భక్తుల సమూహమునకు చింతామణి (తలచిన కోరికలు తీర్చెడి మణి) వంటివాడు, విష్ణువు. :-
[10.1-1507-శా.]

3604} భక్తసంఘాతముఖపద్మపద్మమిత్ర  - భక్త (భక్తుల) సంఘాత (సమూహముల) యొక్క ముఖములు యనెడి పద్మ (కమలములకు) పద్మమిత్ర (సూర్యుని వంటివాడ), విష్ణువు :-
[7-376.1-తే.]

3605} భక్తసులభుడు  - భక్తులకు సులువుగా లభించువాడు, శివుడు :-
[3-473-వ.]

3606} భక్తహృదయుడు  - భక్తుల హృదయమున ఉండెడివాడ, విష్ణువు :-
[4-924-చ.]

3607} భక్తార్తిసంహరణాలోకనుడు  - భక్తుల ఆర్తి (బాధలను) సంహరణ (నాశము) చేయుటకు ఆలోకనుడు (చూసెడివాడు), విష్ణువు :-
[4-177-మ.]

3608} భక్తార్తిహరణకరణుడు  - భక్తుల ఆర్తిని పోగొట్టుటను చేయువాడు, విష్ణువు :-
[3-307.1-తే.]

3609} భక్షణాదులు  - పంచభక్ష్యము (1భక్ష 2భోజ్య 3లేహ్య 4చోష్య 5పానీయము) లతో కూడిన పరమ (శ్రేష్ఠమైన) అన్నములు (ఆహార పదార్థములు) :-
[10.1-870.1-తే.]

3610} భక్ష్యములు  - కొఱికి తినవలసినవి, అరిసెలు, బూరెలు, పిండివంటలు వంటివి :-
[4-510-వ.]

3611} భగవంతుడు  - (అ). షడ్గుణైశ్వర్యముల (మహత్వ ధైర్య యశో శ్రీ జ్ఞాన వైరాగ్యములు అనెడి ఐశ్వర్యములు)తో సంపన్నుండు (సమృద్ధిగా కలవాడు), (ఆ). శ్లో. ఉత్పత్తించ వినాశంచ భూతానామా గతింగతిం, వేత్తి విద్యామవిద్యాంచ షణ్ణాంభగ ఇతీరితః. ఈ ఆరు కలవాడు భగవంతుడు, (ఇ). వ్యు. (భగ + మతుప్ + మస్య వః) త. ప్ర. 1) సమగ్రములైన ఐశ్వర్యము, వీర్యము, సిరి, యశస్సు, జ్ఞానము, వైరాగ్యము అను ఆరును కలవాడు, 2) విశ్వమునకు భగము (పుట్టుకకు స్థానము) అయినవాడు, విష్ణువు :-
[1-61-వ., 2-23-వ., 2-68.1-తే., 2-89-వ., 2-99-క., 2-174-వ., 2-211-ఉ., 2-224-వ., 2-248-వ., 2-252-వ., 2-257.1-తే., 2-269-వ., 2-269-వ., 2-280-వ., 3-19-చ., 3-184-వ., 3-198.1-తే., 3-334-వ., 3-373-మ., 3-465-క., 3-473-వ., 3-524-వ., 3-582-క., 3-754-వ., 3-833-క., 3-836-చ., 3-1025-వ., 4-280-వ., 4-347.1-తే., 4-359.1-తే., 4-370.1-తే., 4-421-వ., 4-468-వ., 4-468-వ., 4-509.1-తే., 4-697-వ., 4-834-వ., 4-936-వ., 5.2-64-వ., 5.2-74.1-తే., 6-229-తే., 7-109-వ., 7-217-వ., 7-239-వ., 7-453-వ., 8-660-వ., 9-23-వ., 10.1-236-వ., 10.1-580-వ., 10.1-1099-వ., 10.2-102-క., 10.2-127-వ.]

3612} భగవంతుని జన్మములు - స్థావర జంగమ జీవులన్ని తనే కనుక అసంఖ్యాకంబులు :-
[10.1-1653.1-ఆ.]

3613} భగవంతునిగుణములు  - 1. సంభర్తృత్వము, 2. భర్తృత్వము, 3. సర్వనేతృత్వము, 4. గమయతృత్వము, 5. స్రష్టృత్వము, 6. సర్వశరీరత్వము, 7. సర్వభూతాంతరాత్మత్వము, 8. నిరస్త నిఖిలదోషత్వము, 9.షాడ్గుణ్యపూర్ణత్వము మొదలగునవి పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879 :-
[10.1-1653.1-ఆ., 10.1-1704.1-తే.]

3614} భగవంతునిగుణషట్కములు  - 1ఐశ్వర్యము 2వీర్యము 3యశము 4శ్రీ 5జ్ఞానము 6వైరాగ్యములు :-
[7-365-మ., 7-384-వ.]

3615} భగవంతునిసద్గుణములు  - సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వ సర్వభోక్తృత్వ సర్వాంతర్యామిత్వ సర్వస్రష్టృత్వ సర్వపాలకత్వ సర్వసంహారకత్వాది సుగుణములు :-
[10.2-110-మ.]

3616} భగవతి  - షడ్గుణములచే (1మహత్వ 2ధైర్య 3కీర్తి 4శ్రీ 5జ్ఞాన 6వైరాగ్యములుచే) ఐశ్వర్యురాలు, దేవి :-
[10.1-809-క., 10.1-1682-మ.]

3617} భగవత్పాది  - భగవంతుని పాదము లందు పుట్టినది, గంగానది :-
[5.2-32-వ.]

3618} భగవదనుభవప్రకారములు  - 1శ్రవణము 2మననము 3నిదిధ్యాసనము (మఱి మఱి తలచుట, మనస్సును పరిపరి విధాల పోకుండా చేయడం నిదిధ్యాస ప్రయోజనం), పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010 :-
[10.2-249-వ.]

3619} భగవన్నారాయణుడు  - భగవంతుడు అయిన నారాయణుడు, విష్ణువు :-
[6-343-వ.]

3620} భగుడు  - అదితి సంతానము పన్నెండుగురులో ఒకడు, జనులచే పూజింపబడువాడు, సూర్యుడు (విద్యార్థికల్పతరువు) :-
[6-506.1-ఆ., 12-43-వ.]

3621} భజనీయపాదారవిందుండు  - భజనీయ (పూజింప దగిన) పాదపద్మములు కలవాడు, విష్ణువు :-
[4-366-వ.]

3622} భద్ర/పద్మఆసనం  - పాదములను తొడల పైకి ముడిచిన ఒక యోగ ఆసనము :-
[2-27.1-తే.]

3623} భద్రకాళి  - భద్రేశ్వర క్షేత్రమున భద్రకాళి (నిత్యమంగళ స్వరూపము నీలవర్ణము కలామె) :-
[10.1-61-వ.]

3624} భద్రము  - శుభకార్యములందు పురప్రచార యోగ్య మైనది ఈ జాతి ఏనుగు / గజము వీనిలో జాతులు ప్రధానంగా భద్రము, మందము, మృగము అని మూడు :-
[10.1-1721-మ.]

3625} భద్రసేన  - శుభము అధికముగ కల ప్రదేశము, భరతవర్షమందలి తొమ్మిది దేశాలలో ఒకటి :-
[5.1-64-వ.]

3626} భద్రాయతనములు  - భద్రములు (మంగళముల) కి ఆయతనములు (ఇళ్ళు), మేలుకలిగించెడివి :-
[10.1-245-క.]

3627} భద్రాసనము  - 1. రాజు కూర్చొనెడి పీఠము, సింహాసనము 2. ఒక యోగ ఆసనము రెండు అరికాళ్లు ఎదురుబెదురుగా కలిపి, రెండుమోకాళ్ళు భూమికి సమాంతరంగా ఉంచి, రెండు అరచేతులవేళ్ళతోమూసి ఆ అరికాళ్ళను పట్టుకుని భద్రముగా కూర్చొను ఆసనము (భద్రాసనము) :-
[6-259.1-తే.]

3628} భద్రుడు  - క్షేమము కలవాడు, యజ్ఞుడు దక్షిణల పన్నెండుగురు కొడుకులలో ఒకడు :-
[4-6-వ.]

3629} భయము  - జరగబోవుదాని గురించి ఆందోళన :-
[4-215-వ.]

3630} భరతముఖ్యుడు  - భరత వంశము నందలి రాజులలో ముఖ్యుడు, పరీక్షిత్తు. :-
[10.1-1021.1-ఆ.]

3631} భరితశుభచరిత్రుడు  - భరిత (నిండైన) శుభచరిత్ర కలవాడు, శ్రీకృష్ణుడు :-
[5.1-183-మాలి.]

3632} భర్గుడు  - భరించువాడు, శివుడు :-
[5.1-74.1-తే.]

3633} భర్మాచలము  - బంగారుకొండ, మేరుపర్వతము :-
[10.1-1296-క.]

3634} భర్మాచలేంద్రము  - భర్మ (బంగారు) అచల (కొండ)లలో ఇంద్రము (శ్రేష్ఠమైనది), మేరుపర్వతము :-
[6-218.1-ఆ.]

3635} భల్లూకేశ్వరుడు  - భల్లూకముల (ఎలుగుబంట్ల)కు ప్రభువు, జాంబవంతుడు :-
[10.2-66-శా., 10.2-70-క.]

3636} భవచ్ఛేదకుండు  - భవత్ (సంసార బంధములను) చేదించువాడు, విష్ణువు :-
[4-366-వ.]

3637} భవదుఃఖహరుడు  - భవ (సంసారము)యొక్క దుఃఖములను హరుడు (హరించెడివాడ), విష్ణువు :-
[4-920-ఉ.]

3638} భవదూరుడు  - భవబంధములను దూరము చేయువాడు, విష్ణువు :-
[6-123-ఉ.]

3639} భవప్రహారి  - భవ (సంసార) బంధములను తెగగొట్టువాడు, విష్ణువు :-
[3-335-ఉ.]

3640} భవబంధవిమోచనుడు  - సంసారబంధనములనుండి విముక్తిని ప్రసాదించువాడు, విష్ణువు :-
[4-917-చ.]

3641} భవభయనివారకుడు  - భవ (సంసారము) వలని భయ (భయమును) నివారకుడు (పోగొట్టువాడు), విష్ణువు :-
[5.2-1-క.]

3642} భవవిదూరుడు  - భవ (సంసార బంధనములను) విదూరుడు (తొలగించెడివాడు), విష్ణువు :-
[4-555.1-తే., 6-342-ఆ.]

3643} భవాని  - భవుని భార్య, పార్వతి :-
[10.1-1743-వ.]

3644} భవుడు  - శివుడు, (వ్యు. భూ+అప్ కృ.ప్ర. ప్రపంచము ఈతనినుండి పొడమినది కావున ఈ వ్యవహారము) :-
[3-243-చ., 3-365-క., 4-52-వ., 8-239-మ., 8-681-వ., 10.1-1743-వ., 12-24-వ.]

3645} భవ్యగాత్రుడు  - దివ్యమంగళమైన గాత్ర (దేహముగలవాడు), విష్ణువు :-
[7-376.1-తే.]

3646} భవ్యచరిత్రుడు  - దివ్యమైన వర్తనలు గలవాడు, శ్రీకృష్ణ :-
[5.1-1-క.]

3647} భస్మదండలింగఘనజటాజినధరుడు  - భస్మము (విభూతి) దండము లింగము ఘన (గొప్ప)జటలు అజిన(లేడిచర్మము) ధరించినవాడు, శివుడు :-
[4-138.1-తే.]

3648} భాండీరకము  - 1. భాండీరము అంటే మఱ్ఱిచెట్టు కనుక చిన్న మఱ్ఱిచెట్టు, 2. ఒక రకమైన కుంభము (కుండ), నవద్వారకలిత దేహమనవచ్చు, 3. భాణ్డీరః అంటే భర్మనిర్మిత వాసః :-
[10.1-749-వ.]

3649} భాగవతము  - భగవంతునికి సంబంధించినది, ఒక మహాపురాణము, భాగవత గ్రంథరూప పరబ్రహ్మ. :-
[1-85.1-ఆ.]

3650} భాగవతుడు  - భాగవత సంప్రదాయము అనుసరించువాడు, భగవంతునికి చెందినవాడు, భక్తుడు :-
[1-391-వ., 3-88-మ., 3-147-వ., 3-496-క., 3-715-వ., 3-921-వ., 5.2-58-వ.]

3651} భాగీరథి  - భగీరథుని ప్రయత్నము వలన భూలోకానికి వచ్చిన నది, గంగానది :-
[1-176-వ., 12-48-వ.]

3652} భానుడు  - 1. ప్రకాశించువాడు, సూర్యుడు, 2. ఊరుభంగం మున్నగు అద్భుత నాటకాలు వ్రాసిన గొప్ప సంస్కృత కవి, :-
[6-11.1-తే., 10.1-1101-వ., 10.1-1236-దం., 10.1-1556-చ., 10.2-579-ఉ., 11-58-వ.]

3653} భానుశశాంకలోచనుడు  - భాను (సూర్యుడు) శశాంక (చంద్రుడు) లోచనుడు (కన్నులుగా కలవాడు), కృష్ణుడు :-
[5.2-165-చ.]

3654} భామ  - 1. సులభముగా కోపము వచ్చెడి స్త్రీ, 2. గొల్లభామ, 3. వీధిభాగవతములో నాయికాపాత్ర :-
[10.1-1096.1-ఆ.]

3655} భామామనోహారి  - భామా (స్త్రీల) మనః (మనస్సులను) హారి (హరించువాడు), కృష్ణుడు :-
[10.2-80-మ.]

3656} భామిని  - క్రీడాసమయమునందు కోపము చూపునామె, స్త్రీ :-
[3-1023-చ.]

3657} భారత  - భరతవంశమున పుట్టినవాడ, పరీక్షిత్తు :-
[9-592-క.]

3658} భారతీధనుడు  - భారతీదేవికి ధనము వంటివాడు, బ్రహ్మదేవుడు :-
[3-709-చ.]

3659} భారతీవిభుడు  - భారతీదేవి యొక్క విభుడు (భర్త), బ్రహ్మదేవుడు :-
[3-739.1-తే., 3-742.1-తే.]

3660} భారతీశ్వరుడు  - భారతీదేవి యొక్క భర్త, బ్రహ్మదేవుడు :-
[3-49-చ.]

3661} భారము  - అధికమైన బరువు మీదనుండుట :-
[10.1-1523.1-ఆ.]

3662} భారవి  - కిరాతార్జునీయం వ్రాసిన దక్షిణభారతదేశానికి చెందిన సంస్కృత మహాకవి :-
[6-11.1-తే.]

3663} భార్గవకుమారకులు  - భార్గవ (శుక్రుని) కుమారకులు (పుత్రులు), చండామార్కులు :-
[7-220-ఉ.]

3664} భార్గవముఖ్యుడు  - భృగువు వంశంలో ముఖ్యుడు, శౌనక మహర్షీ. :-
[1-441-క.]

3665} భార్గవరాముడు  - భార్గవుని యొక్క రాముడు, భృగుమహర్షి వంశములో పుట్టిన రాముడు, పరశురాముడు :-
[1-63-వ., 3-1-క., 9-264-క., 10.2-949-క.]

3666} భార్గవి  - భృగు వంశస్థురాలు, దేవయాని. :-
[9-527-శా.]

3667} భార్గవుడు  - భృగువు వంశములో పుట్టినవాడు, శౌనకుడు, శుక్రుడు, పరశురాముడు :-
[1-263-మ., 3-44-ఉ., 6-270.1-తే., 6-292-క., 8-523-మ., 8-590-శా., 9-458-క.]

3668} భార్గవులు  - భార్గవుని (శుక్రుని) కొడుకులు, చండామార్కులు :-
[7-145-శా.]

3669} భార్గవోత్తముడు  - భృగువు వంశంలో పుట్టినవారిలో ఉత్తముడు, శౌనకుడు. :-
[1-306-చ.]

3670} భావజుడు  - భావము (సంకల్పము)న పుట్టువాడు, మన్మథుడు :-
[9-390-ఉ., 10.1-1713.1-ఆ., 10.2-1170-చ.]

3671} భావభవారి  - భావభవుని (మన్మథుని) అరి (శత్రువు), శివుడు :-
[10.2-317-ఉ.]

3672} భావభవుడు  - వ్యు. మనస్సులో పుట్టువాఁడు, మన్మథుడు :-
[2-127-క., 3-381-ఉ.]

3673} భావభేదములు  - 1శ్లథ 2ఘన 3ప్రౌఢ 4బాల భావములు, :-
[10.1-1495-ఉ.]

3674} భావాభావమధ్యంబు  - భావ(ఉందో) అభావ (లేదో) మధ్యంబు (సందేహాస్పదమైనది), ఉందో లేదో తెలియనిది, స్త్రీల నడుము వర్ణనకు కవిసమయం :-
[10.1-1713.1-ఆ.]

3675} భాషాపతి  - భాషా (భాషకి దేవత సరస్వతి) యొక్క పతి (భర్త), బ్రహ్మ :-
[7-120-క., 11-71-వ.]

3676} భాసురగోపికామనోహర  - భాసుర (ప్రకాశవంతమైన) గోపికా (గోపికల యొక్క) మనః (మనసులను) హర (దొంగిలించినవాడ), శ్రీకృష్ణ :-
[5.1-182-క.]

3677} భాస్కరకులవార్ధిచంద్రుడు  - భాస్కరకుల (సూర్యవంశము అను) వార్ధి (సముద్రమునకు) చంద్రుడు, శ్రీరాముడు :-
[10.2-1340-చ.]

3678} భాస్కరసుతుడు  - భాస్కర (సూర్యుని) సుతుడు (పుత్రుడు), 4.శనీశ్వరుడు, 1.వైవస్వతుడు (శ్రాద్ధదేవుడు), 2.యముడు, 3.సూర్యసార్ణి, :-
[5.2-90-క.]

3679} భాస్కరాబ్జారినేత్రా  - భాస్కర (సూర్యుడు) అబ్జారి (పద్మములకు శత్రువైన చంద్రుడు) వంటి నేత్రా (కన్నులు కలవాడ), శ్రీకృష్ణ :-
[5.1-183-మాలి.]

3680} భాస్కరుడు  - 1. భాసత్ +కరుడు వెలుగునకు కారకుడు, సూర్యుడు, 2, రామాయణం ఆంధ్రీకరించిన మహాకవి :-
[2-92-క., 6-11.1-తే.]

3681} భిక్షాశనుడు  - భిక్షమెత్తుకొని ఆశనుడు (తినువాడు), శివుడు :-
[3-467.1-తే.]

3682} భిదురపాణి  - భిదురము (వజ్రాయుధము) పాణి (చేతపట్టినవాడు), ఇంద్రుడు :-
[6-390-వ., 6-521-వ.]

3683} భీకరము - భీకరతరము భీకరతమము :-
[1-503-క.]

3684} భీకరశరధారాకంపితదానవేంద్రుడు  - భీకర (భయంకర మైన) శర (బాణముల) ధారా (పరంపరలచే) ఆకంపిత (వణికింపబడిన) దానవేంద్రుడు (రాక్షస ప్రభువులు కలవాడు), రాముడు :-
[10.2-1-క.]

3685} భీభత్సుడు  - బీభత్సము (అతి క్రూరత్త్వము)గా యుద్ధము చేయువాడు, అర్జునుడు :-
[1-151-శా.]

3686} భీముడు  - 1. భయము కలిగించువాడు. 2.భయంకరుడు, పంచపాండవులలో 2వ వాడు :-
[10.2-354-మ., 10.2-1092-క.]

3687} భీష్మభూవరసుతుడు  - భీష్మకమహారాజు కొడుకు, రుక్మి :-
[10.2-281.1-తే.]

3688} భీష్ముడు  - కురువృద్దుడు భీష్మ (అతి భయంకర మైన) ప్రతిజ్ఞ చేసిన కురువంశ మహాపురుషుడు :-
[2-204.1-తే.]

3689} భుక్తభోగము  - భుక్త (భుజింపబడినట్టి) భోగము (పిండివంట) ఇక మిగిలినది, ఎంగిలి మెతుకులు :-
[3-914-వ.]

3690} భుజంగమతల్పకుడు  - భుజంగమ (సర్పము, ఆదిశేషు)ని తల్పముగా కలవాడు, విష్ణువు :-
[4-730-చ.]

3691} భుజంగమము అంటే పాము  - శ్వాసకు గుర్తు :-
[4-829-వ.]

3692} భుజంగమము  - భుజములచే పాకునది, పాము :-
[9-520-వ.]

3693} భుజగరిపుడు  - సర్పములకు శత్రువైనవాడు, గరుత్మంతుడు :-
[11-72.1-తే.]

3694} భుజగాంతకుడు  - సర్పముల పాలిటి యముడు, గరుత్మంతుడు :-
[10.2-147-చ.]

3695} భుజగేంద్రారాతి  - సర్పశ్రేష్ఠముల శత్రువు, గరుత్మంతుడు :-
[10.2-215-మ.]

3696} భువనకారణుడు  - భువనముల సృష్టికి కారణము ఐనవాడు, బ్రహ్మదేవుడు :-
[3-330-క.]

3697} భువనత్రయము  - ముల్లోకములు, భూర్భువస్సువ ర్లోకములు 1భూ 2భువః 3సువః అను మూడు లోకములు. పాఠ్యంతరమున 1భూలోకము 2స్వర్గలోకము 3పాతాళలోకములు :-
[3-355.1-తే., 7-91-వ.]

3698} భువనపావనచరిత్రుడు  - భువన (జగత్తును) పావన (పవిత్రముచేయు) చరిత్ర కలవాడు, విష్ణువు :-
[4-629.1-తే.]

3699} భువనభరణచిత్తోత్కంఠుడు  - భువన (లోకములన) భరణ (కాపాడుటయందు) చిత్త (హృదయమున) ఉత్కంఠుడు (ఉత్కంఠగలవాడు), శివుడు. :-
[7-393-క.]

3700} భువనభరనివారుడు  - భూభారమును నివారించెడివాడు, శ్రీరాముడు :-
[8-744-మాలి.]

3701} భువనరక్షదక్షుడు  - జగత్తును రక్షించు సమర్థత కలవాడు, విష్ణువు :-
[10.2-697.1-తే.]

3702} భువనాతీతగుణాశ్రయుడు  - భువన (లోకములు అన్నిటికిని) అతీతమైన గుణములకు ఆశ్రయుడు (నిలయమైనవాడు), కృష్ణుడు :-
[5.2-166-క.]

3703} భువనాధీశుడు  - భువన (జగత్తునకు) అధీశుడు (ప్రభువు), విష్ణువు :-
[8-506-మ.]

3704} భువనాధీశ్వరుడు  - భువనములకు అధీశ్వరుడు (ప్రభువు), బ్రహ్మ :-
[7-79-మ.]

3705} భువిఁదనకార్యాంశము - కాలము, సృష్టికార్యములోని (ఒక) భాగము, కాలము :-
[3-345.1-తే.]

3706} భూకాంతాకాంత  - భూకాంతుని (రాజు) కాంత (భార్య), రాణి :-
[10.2-804-వ.]

3707} భూచరులు  - భూమిపై చరించువారు, మానవులు, జంతువులు :-
[9-301-క.]

3708} భూజనములు  - భూలోకమన ఉండు జనులు, మానవులు :-
[3-940-తే.]

3709} భూజనులు  - భూ (రాజ్యము నందలి) జనులు, ప్రజలు :-
[4-454.1-తే., 10.2-757-ఉ.]

3710} భూజము  - భూమినుండి జము (పుట్టునది), వృక్షము :-
[5.1-74.1-తే., 7-36.1-ఆ., 10.2-549-చ.]

3711} భూతగణములు  - భూతములు ప్రేతములు పిశాచములు మొదలగు వాని సమూహములు :-
[3-461-మ.]

3712} భూతతన్మాతలు, పంచతన్మాత్రలు  - 1శబ్దము 2స్పర్శ 3 దృక్కు (చూపు) 4ఘ్రాణము (వాసన) మరియు 5రస (రుచి) వాని మూల తత్వములు (5) :-
[3-903-వ.]

3713} భూతధాత్రి  - భూత (జీవులను) ధాత్రి (ధరించునది), భూమి :-
[9-31-ఆ.]

3714} భూతనాథుసతి  - భూతనాథు (శివు)ని సతి, పార్వతి :-
[10.1-1709.1-తే.]

3715} భూతపంచకము  - పంచభూతములు, 1ఆకాశము 2 తేజస్సు 3వాయువు 4 జలము 5 పృథివి :-
[3-718.1-తే., 7-237-వ.]

3716} భూతపంచకములు  - పంచభూతములు, 1ఆకాశము 2 తేజస్సు 3వాయువు 4 జలము 5 పృథివి :-
[2-112-వ.]

3717} భూతపతి  - సమస్త భూతములకు నాథుడు, శివుడు :-
[4-51.1-తే.]

3718} భూతభావనరూపుడు  - జీవులకు కారణరూపమైనవాడు, శివుడు :-
[8-222.1-ఆ.]

3719} భూతభావనుడు  - సమస్తప్రాణులచేత ధ్యానించబడువాడు, విష్ణువు :-
[4-357-వ., 7-381.1-తే., 8-659.1-తే.]

3720} భూతభేతాళములు  - పిశాచవిశేషములు, భూతములు (శ్మశానవాసులు). భేతాళములు (యమకింకరులు) :-
[9-306.1-ఆ.]

3721} భూతములు  - 1. పిశాచభేదము, 2. దేహము విడచినను కోరికలు వదలక వర్తించు ఆత్మ, వాసం శ్మశానం 3. అహంకారము మహత్తు మరియు పంచభూతములు, 4. ఆ భూతజన్యములైన జీవులు, 5. ప్రస్తుతము ఐ (పుట్టి) ఉన్నవి (అశాశ్వతమైనవి), జీవులు :-
[2-274.1-తే., 4-654-వ., 5.2-103-క., 6-307-వ., 6-307-వ., 7-467-వ., 10.1-681-వ., 10.1-887-వ., 10.1-1757-వ., 10.2-405-చ.]

3722} భూతలోకేశ్వరుడు  - భూతలోక (సమస్తమైన ప్రాణులకు) ఈశ్వరుడు, విష్ణువు :-
[8-659.1-తే.]

3723} భూతశరణ్యుడు  - ఆశ్రయించిన ప్రజలకు శరణము ఇచ్చువాడు, రాజు. :-
[1-378-క.]

3724} భూతసూక్ష్మేంద్రియాత్ముడు  - జీవులకు సూక్ష్మేంద్రియములు (తన్మాత్రలు, ఇంద్రియములు) తానైన వాడు, విష్ణువు :-
[4-702.1-తే.]

3725} భూతాత్మకుడు  - జీవుల యందు ఆత్మగ ఉండువాడు, విష్ణువు :-
[4-357-వ., 8-222.1-ఆ., 10.1-942-ఆ.]

3726} భూతిభూషణుడు  - విభూతిచే అలంకరింపబడిన వాడు, శివుడు :-
[10.1-1101-వ.]

3727} భూతిలిప్తాంగుడు  - భూతి (బూడిద, విభూతి)ను లిప్త పూసుకొనిన) అంగుడు (దేహము కలవాడు), శివుడు :-
[3-467.1-తే.]

3728} భూతేశుడు  - సర్వ భూతములకు ప్రభువు, విష్ణువు, శివుడు :-
[4-357-వ., 4-502-వ., 8-222.1-ఆ.]

3729} భూతేశ్వరుడు  - భూతములు (సకల జీవులు) కి ఈశ్వరుడు (ప్రభువు), విష్ణువు, భూతనాథుడు, శివుడు :-
[2-222-వ., 10.2-1262-క.]

3730} భూదేవతలు  - భూమికి దేవతలు, బ్రాహ్మణులు :-
[2-38-వ.]

3731} భూదేవులు  - భూమికి దేవతలు, బ్రాహ్మణులు :-
[1-291-వ.]

3732} భూధవుడు  - భూమికి భర్త, రాజు :-
[5.1-95.1-తే.]

3733} భూనాథుడు  - భూ (రాజ్యమునకు) నాథుడు (ప్రభువు), రాజు :-
[5.1-3-క., 7-119-మ.]

3734} భూనాయకుడు  - భూమి (రాజ్యమువ)కు నాయకుడు, రాజు :-
[4-259-క., 6-453-క., 9-243-క.]

3735} భూనుతుడు  - భూలోకమునంతా స్తుతింపబడువాడు, గొప్పవాడు :-
[11-53-ఉ.]

3736} భూప  - భూమికి పతి, రాజు. :-
[2-263-తే.]

3737} భూపతి  - భూమికి భర్త, రాజు :-
[3-71.1-తే., 4-448-క.]

3738} భూపతికాంత  - భూ (భూమికి) పతి (ప్రభువు యొక్క) కాంత (భార్య), రాణి :-
[6-450-త.]

3739} భూపవరేణ్యుడు  - భూప (రాజు)లలో వరేణ్యుడు (ముఖ్యుడు), మహారాజు :-
[5.2-51-క., 11-55-క.]

3740} భూపవర్యుడు  - భూపు (రాజు)లలో వర్యుడు (ఉత్తముడు), మహారాజు :-
[5.2-42.1-తే.]

3741} భూపాలకుడు  - భూ (రాజ్యమును) పాలకుడు (ఏలెడివాడు), రాజు :-
[3-87-వ., 5.1-171-వ., 7-53.1-ఆ., 10.1-1381-క., 10.1-1550-క.]

3742} భూపాలుడు  - భూమిని పాలించెడివాడు, రాజు :-
[4-460.1-తే., 4-833-తే., 5.1-175-వ.]

3743} భూపాలోత్తముడు  - భూపాలు (రాజు)లలో ఉత్తముడు, మహారాజు :-
[1-522-ఉ., 7-471-శా.]

3744} భూపుడు - భూమికి పతి, రాజు :-
[6-267-ఆ.]

3745} భూపౌత్రుడు  - భూదేవి కొడుకైన నరకుని కొడుకు, భగదత్తుడు :-
[10.2-352-మ.]

3746} భూమండలోద్ధరణుడు  - భూమండలమును ఉద్దరించినవాడు, కృష్ణుడు :-
[5.2-167-మత్త.]

3747} భూమి  - భరించునది, వ్యు. భూ+మిక్+ఙీప్, భవంతి అస్మిన్ భూతాని, దీనియందు ప్రాణులు వుందురు. :-
[4-426-క.]

3748} భూమిపతి  - భూమి(రాజ్యాని)కిపతి, రాజు :-
[9-72-ఆ.]

3749} భూమిపాలకుడు  - భూమిని పరిపాలించువాడు, రాజు :-
[3-255.1-తే.]

3750} భూమిభృత్  - భూమికి భర్త, రాజు :-
[1-416-శా.]

3751} భూమియొక్కటి  - మన్ను ఒకటే ఐన కుండలు అనేకములు ఐనట్లు అను తత్వవిచారసూత్రము సూచన :-
[10.2-1122-వ.]

3752} భూమిరుహము  - భూమి యందు పుట్టునది, చెట్టు :-
[10.2-544.1-తే.]

3753} భూమివరుడు  - భూమికి భర్త, రాజు :-
[9-148-ఆ.]

3754} భూమిసుత  - భూదేవి యొక్క పుత్రిక, సీత :-
[6-306.1-తే.]

3755} భూమిసుతుడు  - భూదేవి కొడుకు, నరకుడు :-
[10.2-199-శా.]

3756} భూమిసురుడు  - భూమికిదేవత, విప్రుడు :-
[9-138-క.]

3757} భూమీశుడు  - భూమి (రాజ్యము)నకు ఈశుడు, రాజు :-
[4-742.1-తే., 4-830.1-తే., 4-852-క., 9-8.1-తే., 10.1-1311-క.]

3758} భూమీశ్వరుడు  - భూమికి ఈశ్వరుడు (ప్రభువు), రాజు :-
[3-63-తే., 3-230-క., 5.1-87-క.]

3759} భూమీసురులు  - భూమి మీది దేవతలు, బ్రాహ్మణులు :-
[4-42.1-తే.]

3760} భూరమణుడు  - భూమికి రమణుడు (భర్త), రాజు :-
[3-431-మ., 4-888-చ., 6-38-క.]

3761} భూరి భూరితరము భూరితమము - :-
[2-260-క.]

3762} భూరి  - 1. ఒకటి (1) తరువాత 34 సున్నాలు కల సంఖ్య అదే కోటైతే తరువాత ఏడు (7) సున్నాలు. 2. చాలా ఎక్కువ, 3. అత్యధికమైన :-
[1-364-శా., 3-804-ఉ., 3-859.1-తే., 3-869-ఉ., 3-1001.1-తే., 3-1028.1-తే., 4-14-చ., 4-71-ఆ., 4-578-చ., 4-610-చ., 4-764-చ., 8-116-శా., 9-111-ఆ., 9-279-శా., 10.2-552-మత్త., 10.2-611-తే.]

3763} భూరిభవబంధవిమోచనుడు  - భూరి (అత్యధికమైన) భవ(సంసారమనెడి) బంధ (బంధనములను) విమోచనుడు (విడిపించువాడు), విష్ణువు :-
[7-106-ఉ.]

3764} భూరిశివేతరాపహవిభూతిసమేతుడు  - భూరి (గొప్ప) శివ (శుభములకు) ఇతర (వ్యతికర మైనవాటిని) అపహ (పోగొట్టెడి) విభూతి (వైభవము) సమేతుడు (తో కూడి ఉండెడివాడు), విష్ణువు :-
[4-923-ఉ.]

3765} భూరిసంసారతాపనివారగుణకథామృతాపూర్ణుడు - అత్యధికమైనసంసారతాపములను నివారించుగుణముకల కథల అమృతమున నిండినవాడు, విష్ణువు :-
[4-282.1-తే.]

3766} భూరుహము  - భూమి నుండి పుట్టునది, వృక్షము :-
[3-289-ఉ., 5.1-74.1-తే.]

3767} భూర్భువరాది  - భూ భువర్ సువర్ లోకములు మూడు :-
[3-356-ఉ.]

3768} భూవనితామణి  - భూమి అనెడి స్త్రీలలో మణి వంటి యామె, భూదేవి :-
[4-499-క.]

3769} భూవరుడు  - భూమికిభర్త, రాజు :-
[1-369-చ., 1-392-క., 1-411-వ., 1-461-వ., 3-32-ఉ., 3-42-చ., 3-775-మ., 3-791-క., 4-398-క., 4-627-ఉ., 4-784-తే., 5.1-25-మ., 5.1-63.1-తే., 7-123-శా., 7-193-ఉ., 9-143-మత్త., 9-428-వ., 10.1-1518-ఉ.]

3770} భూవరేంద్రుడు  - భూవర (రాజులలో) ఇంద్ర (శ్రేష్ఠుడు), మహారాజు :-
[2-5-ఆ., 7-452-ఆ., 8-247-ఆ., 8-689-తే., 9-365-తే.]

3771} భూవరేణ్యుడు  - భూవరు (రాజులలో) వరేణ్యుడు (గొప్పవాడు), మహారాజు. :-
[2-136.1-తే., 10.1-239-ఆ.]

3772} భూవల్లభుడు  - భూమి (రాజ్యమున)కు వల్లభుడు (భర్త), రాజు. :-
[5.1-92-మ., 8-123-మ., 10.1-973-మ.]

3773} భూవినుతుడు  - భూలోకమున కీర్తింపబడు వాడు :-
[12-33-క.]

3774} భూవిభుడు  - భూమికి ప్రభువు, రాజు :-
[3-65-మ., 3-65-మ.]

3775} భూషము  - స్వాప్నికమైన విచిత్ర సృష్టి, ఆభరణము, కైసేత :-
[4-771.1-తే.]

3776} భూసుతుడు  - భూదేవి కొడుకు, నరకుడు :-
[10.2-185-క.]

3777} భూసురుడు  - భూమికి సురుడు (దేవుడు), బ్రాహ్మణుడు :-
[1-289-వ., 1-289-వ., 1-296-వ., 1-357-క., 1-502-ఉ., 1-504-క., 2-213-చ., 3-135-ఉ., 3-184-వ., 3-216-క., 3-524-వ., 3-560-చ., 3-1037-క., 4-113.1-తే., 4-589.1-తే., 5.1-54-వ., 6-74-క., 7-34.1-తే., 7-380-వ., 8-522-వ., 10.1-711-క., 10.1-1700-వ., 10.2-668-వ.]

3778} భూసురోత్తములు  - భూసురు (బ్రాహ్మణు)లలో ఉత్తములు, బ్రాహ్మణోత్తములు :-
[1-391-వ.]

3779} భృంగము  - నీలిమను వహించునది, తుమ్మెద, స్త్రీలింగము భృంగి :-
[10.1-1460-శా., 11-99-వ.]

3780} భృంగి  - శివుని ప్రమథగణములలో ఒకడు :-
[6-490.1-తే.]

3781} భృగువు  - భృగుమహర్షి, తెల్లని తేజస్సు :-
[4-26-వ.]

3782} భృగుసత్కులాభిరాముఁడు  - భృగువు యొక్క సత్కుల (చక్కటి వంశమునకు) అభిరాముడు (మనోహరమైనవాడు), పరశురాముడు :-
[6-305-క.]

3783} భేరీ  - పెద్ద డప్పు వంటి వాయిద్యము, దుందుంభి, రాండోళ్ళు వంటి వాయిద్యము :-
[3-130-వ.]

3784} భోగవతి  - 1 భోగుల (పాముల)కి నివాసము, 2. భోగవతి అనెడి నాగలోకపు ముఖ్యపట్టణము. 3. పాతాళలోకమున పారు గంగ, 4. పాతాళము :-
[4-744.1-తే., 10.2-663-మ.]

3785} భోగవతీనగరము  - 1 భోగుల (పాముల)కి నివాసము, 2. భోగవతి అనెడి నాగలోకపు ముఖ్యపట్టణము. :-
[1-256-వ.]

3786} భోగాష్టకములు  - 1పుష్పమాలిక 2గంధము 3వస్త్రము 4అన్నము 5శయ్య 6తాంబూలము 7స్త్రీ 8గానములు, (స్రక్చందనాదులు) :-
[7-241-వ.]

3787} భోగి  - 1. సర్పము, 2. హరి నివాసమున శయ్యగా ఉండునది, ఆదిశేషుడు :-
[3-513-మ.]

3788} భోగినాయకుడు  - భోగి (సర్పము)లకు నాయకుడు, శేషుడు :-
[6-336.1-తే.]

3789} భోగిభూషణుడు  - భోగి (పాము)లను భూషణుడు (అలంకారముగాగలవాడు), శివుడు :-
[8-221-వ.]

3790} భోగిరాట్కంకణుడు  - భోగిరాట్ (సర్పరాజు, వాసుకి) కంకణముగా కలవాడు, శివుడు :-
[10.2-315-ఉ.]

3791} భోజరాజు  - భోజదేశమునకు రాజు, కంసుడు :-
[10.1-148.1-తే.]

3792} భోజసింహుడు  - భోజులలో సింహము వంటివాడు, కంసుడు :-
[10.1-1327-క.]

3793} భోజేంద్రుడు  - భోజవంశపు ప్రభువు, కంసుడు :-
[10.1-1311-క.]

3794} భోజేశ్వరుడు  - భోజరాజు వంశము వారిలో శ్రేష్ఠుడు, కంసుడు. :-
[10.1-28-మ.]

3795} భోజ్యముు  - భుజింపఁదగినది, కొరకనక్కర లేక తినునది, పాయసము, అన్నము మొదలగునవి :-
[4-510-వ.]

3796} భౌతికములు  - భూమికి చెందినవి, భౌతిక స్వరూపము కలవి, సమస్త సృష్టి :-
[2-252-వ., 2-252-వ.]

3797} భ్రమరజానువర్తన  - రెండు మోకాళ్ళను ఒకసారిగా ఎత్తిఎత్తి పెట్టుచు నటించుట, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

3798} భ్రమరము  - భ్రమించుచు ఉండునది, తుమ్మెద, భ్రమింప చేయునది :-
[10.1-1458-మ.]

3799} భ్రమి  - భ్రమించెడిది, భ్రమణము, తిరుగుడు. :-
[4-322-వ.]

3800} భ్రాంతి  - లేనిది ఉన్నదనుకొనుట :-
[3-950-వ.]

3801} మంగళతీర్థపాదుడు  - శుభకరమైన తీర్థము (గంగ) పాదములవద్ద కలవాడు, విష్ణువు :-
[9-142-మ.]

3802} మంగళాభరణములు  - నుదుట తిలకము, మెడలో మంగళసూత్రములు, చేతులకు గాజులు, కాళ్ళకి పట్టీలు, కాలి వేళ్ళకి మట్టెలు మొదలగు శుభకరమైన స్త్రీలు ధరించెడి ఆభరణములు :-
[6-521-వ.]

3803} మంజులవాణి  - మృదువుగా మాటలాడెడి యామె, స్త్రీ. :-
[10.1-329-క.]

3804} మండలతానకము  - నటనము చేయుచు నృత్యమండలమును చుట్టి వచ్చుట, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

3805} మంత్రము  - 1.గాయత్రి వంటివి, మంతారం త్రాయత ఇతి మంత్రః. (వ్యుత్పత్తి), 2. తలచుట (మననము) చేయు వానిని దుఃఖమునుండి రక్షించునది మంత్రము 3. ఉపాయము చూపునది, ఇది చేయువాడు మంత్రి :-
[9-170.1-తే., 10.1-1228-వ.]

3806} మంత్రి  - మంత్రాంగమున సహాయము చేయువాడు :-
[1-370.1-తే.]

3807} మంద  - యాదవులు మొదలైన జాతులవారి జనవాసము, ఊరుకంటె చిన్నది, పల్లె :-
[3-104-క.]

3808} మందగమన  - మెల్లని నడక కలామె, స్త్రీ :-
[10.1-841-వ., 10.1-968-వ.]

3809} మందరధరుడు  - మందర పర్వతమును ధరించినవాడు, కృష్ణుడు, విష్ణువు :-
[3-96-క., 10.2-1059-క.]

3810} మందాకిని  - దివిని పారు గంగ, మందముగ వక్రగమనముతో ప్రవహించునది, ఆకాశగంగ. :-
[9-226-మ., 10.2-663-మ.]

3811} మందాకినీనందనుడు  - గంగాదేవి పుత్రుడు, భీష్ముడు :-
[1-216-వ., 1-218-వ.]

3812} మందారుడు  - కల్పవృక్షము (మందారము) వలె కోరికలు తీర్చు వాడు :-
[1-528-క.]

3813} మందిరపతి  - మందిరము (నివాసము)నకధిపతి, గృహస్తుడు :-
[4-608-చ.]

3814} మందిరము+కున్  - మందిరమునకున్, నుగాగమ సంధి :-
[10.2-1263-వ.]

3815} మంద్ర  - (అ) 1. నాభిస్థానమున పలుకు ధ్వని మంద్ర, 2. హృదయ స్థానమున పలుకు ధ్వని మధ్య, 3. మూర్థమునందు పలుకు ధ్వని తారా, ఇవి సంగీత పారిభాషిక పదములు, (ఆ) గంభీరమైన స్వరము :-
[2-188.1-తే.]

3816} మకరకుండలములు  - కర్ణాభరణ విశేషములు, మకర (మొసలి ఆకృతిలో గల) కుండలములు :-
[7-285-వ., 8-507-వ., 10.2-516.1-తే.]

3817} మకరకేతనాత్మజుడు  - మకరకేతనుడు (మన్మథుడు) ప్రద్యుమ్నుడు యొక్క ఆత్మజుడు (కొడుకు), అనిరుద్ధుడు :-
[10.2-844-చ.]

3818} మకరకేతనుడు  - మకరము (మొసలి) కేతనము (జండాపై) గుర్తుకల జండా కలవాడు, మన్మథుడు :-
[3-941.1-తే., 9-230-వ.]

3819} మకరద్వజుడు  - మకరము (మొసలి గుర్తు) ధ్వజము (జండా) పైగలవాడు, మన్మథుడు :-
[5.2-125-వ.]

3820} మకరాకరము  - మకరముల (మొసళ్ళ)కి ఆకరము (నివాసము), సముద్రము, సరస్సు :-
[8-701-వ.]

3821} మకరాలయము  - మొసళ్ళకు నిలయము, సముద్రము, సరస్సు :-
[8-114-క.]

3822} మగధనాథుడు  - మగదదేశాధీశుడు, జరాసంధుడు :-
[10.1-1535-ఆ.]

3823} మగధుడు  - మగధదేశాధీశుడు, జరాసంధుడు :-
[10.1-1549-ఉ.]

3824} మగధేశ్వరుడు  - మగధ దేశపు రాజు, జరాసంధుడు :-
[10.1-1670-చ.]

3825} మగ్నాంగుడు  - మునిగినదేహము కలవాడు, నీటిలో మునిగిన వాడు :-
[10.1-1231-శా.]

3826} మఘాద్యష్టనక్షత్రములు  - 1మఘ 2పుబ్బ 3 ఉత్తర 4హస్త 5చిత్త 6స్వాతి 7విశాఖ 8అనూరాధ అనెడి ఎనిమిది నక్షత్రములు :-
[5.2-97-వ.]

3827} మచ్చెకంటి  - చేపవంటి కన్నులు కలామె, స్త్రీ :-
[9-619-వ.]

3828} మడుగు  - ఏటిలో లోతైన నిడుపాటి ప్రాంతము, హ్రదము :-
[10.1-636.1-తే.]

3829} మణిగ్రీవుడు  - మణి (శ్రేష్ఠమైన) గ్రీవుడు (కంఠము) కలవాడు, కుబేరుని కొడుకులలో ఒకఁడు, నారదుని శిష్యుఁడైన గంధర్వకుమారుఁడు. నలకూబరుని సహోదరుఁడు. వీరిద్దరూ అత్యంత అందమైనవారుగా చెప్పబడుదురు. నారదశాపంతో జంటమద్దులై శైశవకృష్ణుని వలన శాపవిమోచనం పొందారు :-
[10.1-391-వ.]

3830} మణిపర్వతము  - ఇంద్రుడు కొలువుదీరు మేరుపర్వత ప్రదేశము :-
[10.2-150-వ.]

3831} మణిపూరక చక్రము - మూలాధారాది షట్చక్రములలో నాభితలమున ఉండునది :-
[2-29.1-ఆ.]

3832} మణిసన్నద్ధుడు  - అణిమాదిసిద్ధుడు :-
[4-460.1-తే.]

3833} మతల్లిపార్థివచారము  - ప్రతి పర్యాయమున కాళ్ళు ముందు వెనుకలుగా ఎత్తి పెట్టుచు పోవుట, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

3834} మత్తకాశిని  - మదముచేత ప్రకాశించు ఆమె, స్త్రీ :-
[1-391-వ., 10.2-208-వ., 10.2-344-వ., 10.2-804-వ., 10.2-1172-వ.]

3835} మత్తదైత్యనివారణడు  - మత్త (మదించిన) దైత్య (రాక్షసులను) నివారణుడు (నిరోధించెడివాడు), కృష్ణుడు :-
[5.2-167-మత్త.]

3836} మత్తద్విరేఫాలక  - మత్తుగొన్న తుమ్మెదలవంటి ముంగురులు కల స్త్రీ. :-
[10.2-350-మ.]

3837} మదనాంతకుండు  - మన్మథుని దేహము అంతము చేసినవాడు, శివుడు :-
[10.2-388-క.]

3838} మదనారాతి  - మన్మథుని శత్రువు, శివుడు :-
[10.2-1246-క.]

3839} మదనుడు  - మదింపజేయువాడు, మన్మథుడు :-
[10.1-967.1-ఆ.]

3840} మదము  - 1కొవ్వు 2గర్వము, అష్టవిధమదములు 1విత్త 2వయో 3రూప 4విద్యా 5బల 6ఐశ్వర్య 7కర్మ 8జన్మల సంబంధించిన మదములు :-
[8-661.1-తే.]

3841} మదవతి  - యౌవనమదము కలామె, స్త్రీ :-
[10.1-1091-మ.]

3842} మదిరాక్షి  - మదము కప్పిన అక్షి (కన్నులు కలది), మత్తిల్లిన కాటుక పిట్ట వంటి కన్నులు గల స్త్రీ, అందగత్తె :-
[4-99-క.]

3843} మదిరాక్షిసతి  - మదిరాక్షి (అందమైన) సతి (భార్య) :-
[4-832-తే.]

3844} మదోద్ధతరాజకులోత్సాదుడు  - మద (గర్వముతో) ఉద్దత (అతిశయించిన) రాజ (రాజుల) కుల (వంశములను) ఉత్సాదుడు (పెల్లగించి వేయువాడ), విష్ణువు :-
[6-528-క.]

3845} మద్రపతిసుత  - మద్రదేశ రాజు యొక్క పుత్రిక, లక్షణ, కృష్ణుని అష్టమహిషలలో ఒకతె. :-
[10.2-1083.1-తే.]

3846} మద్రరాజకన్యక  - మద్రదేశపు రాకుమారి, లక్షణ, కృష్ణుని అష్టమహిషలలో ఒకతె. :-
[10.2-1082-వ.]

3847} మధు విరోధి - మధుడు అనెడి రాక్షసుని శత్రువు, హరి :-
[4-869-క.]

3848} మధునిషూదనుడు  - మధు అను రాక్షసుని నిషూద (సంహరించిన)వాడు, విష్ణువు :-
[3-170-క., 4-617.1-తే.]

3849} మధుపము  - మధువు తాగునది, తుమ్మెద, కల్లు తాగుటచేత వలె మనసును కలతపెట్టునది :-
[10.1-1459-మ.]

3850} మధురిపుడు  - మధు యనెడి రాక్షసుని శత్రువు, విష్ణువు :-
[6-156-క., 7-253-క., 9-82.1-తే.]

3851} మధువిదారి  - మధు యనెడి రాక్షసుని విదారి (సంహరించినవాడు), విష్ణువు :-
[6-146.1-తే.]

3852} మధువిరోధి  - మధు అనెడి రాక్షసుని శత్రువు, విష్ణువు :-
[10.1-1692.1-ఆ.]

3853} మధువైరి  - మధు యనెడి రాక్షసుని వైరి (శత్రువు), విష్ణువు :-
[7-169.1-తే., 10.1-236-వ.]

3854} మధువ్రతము  - మధు (తేనె) గ్రహించెడి వ్రతము కలది, తుమ్మెద, చక్కటి వర్తన కలది :-
[3-291-క., 10.1-1464-ఉ.]

3855} మధుసూదనుడు  - మధు అనెడి రాక్షసుని సంహరించినవాడు, విష్ణువు, మధుసూదన మధుం సూదయతి నాశయతి, అసుర స్వభావ సంహారకత్వాత్, అసుర స్వభావమును నశింప చేయునది (ఆంధ్ర వాచస్పతము) :-
[2-228.1-తే., 3-496-క., 4-371-వ., 4-969-క., 10.1-1402-క., 10.2-262-వ.]

3856} మధ్యందినము - మధ్యాహ్నము :-
[4-390-వ.]

3857} మధ్యమపూజ్యుడు  - 1. ఉత్కృష్టము కాక, అపకృష్టము కాక మధ్యస్థముగా పూజింపబడువాడు, 2. ప్రప్రథమంగా పూజింపబడువాడు కాకుండా మధ్యమముగా పూజిపబడువాడు. :-
[4-51.1-తే.]

3858} మధ్యమలోకము  - లోకత్రయము (స్వర్గ భూ నరక లోకముల)లో నడుమది, భూలోకము :-
[9-230-వ., 10.2-347.1-తే.]

3859} మనసాది,ఏకదశేంద్రియములు  - 1మనస్సు 5జ్ఞానేంద్రియములు 5కర్మేంద్రియములు. :-
[10.1-539-వ.]

3860} మనసిజుడు  - మనసున పుట్టువాడు, మన్మథుడు :-
[3-469-క., 4-795-క.]

3861} మనసుకట్టి  - మనసును ఇంద్రియ వ్యాపారములందు ప్రవర్తింపనీయక నిలిపికొనుట, మనసును స్వాధీనమున ఉంచుకొనుట :-
[10.1-1662-ఆ.]

3862} మనస్సు  - సంకల్పరూపమైనది, సంకల్పాత్మకమైన అంతఃకరణము :-
[10.1-682.1-తే., 10.1-1472.1-తే., 10.2-1203-వ.]

3863} మనుచరిత  - శాశ్వతముగా జీవించు వర్తన కలవాడు, ధర్మరాజు :-
[10.2-702-క.]

3864} మనుజనాథుడు  - మనుజులకు నాథుడు (ప్రభువు), రాజు :-
[8-687-తే.]

3865} మనుజనాయకుడు  - మనుజల (మానవుల) యొక్క నాయకుడు, రాజు :-
[4-760.1-తే.]

3866} మనుజపతి  - మనుజుల (మానవుల)కు పతి (ప్రభువు), రాజు :-
[9-75-క., 9-200.1-తే.]

3867} మనుజవరేణ్యుడు  - మానవులలో గౌరవనీయుడు, రాజు. :-
[3-8-క., 3-40-క.]

3868} మనుజవల్లభుడు  - మానవులకు భర్త, రాజు :-
[1-370.1-తే.]

3869} మనుజవిభుడు  - మనుజులకు విభుడు రాజు, పరీక్షిత్తు. :-
[1-459.1-తే., 4-559.1-తే.]

3870} మనుజవిశేషభోజనులు  - మానవులను విశేషముగా తినెడివారు, రాక్షసులు :-
[6-276-చ.]

3871} మనుజాధీశుడు  - మనుజులకు అధీశుడు, రాజు. :-
[1-359-క., 7-94-క., 10.2-45-క.]

3872} మనుజుడు - మనువు యొక్క వంశము వారు :-
[4-663-క.]

3873} మనుజేంద్రుడు  - మనుజులకు ఇంద్రునివంటివాడు, రాజు :-
[3-78-క., 3-123.1-తే., 3-129.1-తే., 4-482-క., 4-531.1-తే., 4-593-క., 4-760.1-తే., 8-16.1-ఆ., 10.1-838-క., 10.1-1333-మ.]

3874} మనుజేశుడు  - మనుజులకు ఈశుడు (ప్రభువు), రాజు :-
[5.2-23-ఆ.]

3875} మనుజేశ్వరుడు  - మానవులకు ప్రభువు, రాజు :-
[1-464-చ.]

3876} మనువు  - వైవస్వాది చతుర్దశ మనువు లందలివాడు, సృష్ట్యాదియందు భగవన్నియామకుఁడు అయి భూమిని పాలించు రాజు. :-
[5.1-13-ఆ.]

3877} మనువులు  - పద్నాలుగురు, 1 స్వాయంభువుడు 2 స్వారోచిషుడు 3 ఉత్తముడు 4 తామసుడు 5 రైవతుడు 6 చాక్షుసుడు 7 వైవస్వతుడు 8 సూర్యసావర్ణి 9 దక్షసావర్ణి 10 బ్రహ్మసావర్ణి 11 ధర్మసావర్ణి 12 భద్రసావర్ణి 13 దేవసావర్ణి 14 ఇంద్రసావర్ణి ( పాఠాంతరములు కూడ కలవు) ప్రస్తుతము వైవశ్వత మన్వంతరము జరుగుచున్నది. :-
[2-97-చ., 3-249-తే., 3-305-త.]

3878} మనుష్యులు  - మనసుతో బ్రతుకు జీవులు :-
[2-222-వ.]

3879} మనుసుత  - (స్వాయంభువ) మనువు యొక్క సుత (పుత్రిక), దేవహూతి :-
[3-956-చ.]

3880} మనోజాతుడు  - మనసున పుట్టువాడు, మన్మథుడు :-
[3-477-మ.]

3881} మనోజుడు  - మనసున పుట్టువాడు, మన్మథుడు :-
[9-560-శా., 10.1-1735-వ.]

3882} మనోనిరోధము  - మనస్సును విషయాసక్తము కానీకుండ లోబరచుకొనుట :-
[10.1-1474-ఆ.]

3883} మనోభవుడు  - మనసున పుట్టువాడు, మన్మథుడు :-
[9-541-ఉ., 10.1-1734-మ.]

3884} మనోరంజనుడు  - మనసును రంజింప చేయువాడు, ఇష్టుడు :-
[10.1-590-క.]

3885} మనోరథము  - కోరిక, మనస్సును అటు ఇటు తీసుకుపోయే రథము, మనసున రథ (తిరుగునది), :-
[1-396-వ., 3-751-వ., 4-68-వ.]

3886} మనోరథవరదానసుశీలుడు  - మనోరథ (మనసులోకలిగిన)(కోరిన) వరములను దాన (ఇచ్చు) సుశీలుడు (మంచిగుణము) కలవాడు, విష్ణువు :-
[3-748-క.]

3887} మనోవల్లభ  - మనసునకు వల్లభ (నాయిక), సతి :-
[8-474-వ.]

3888} మనోవల్లభుడు  - మనసుకు వల్లభుడు (నాయకుడు), భర్త :-
[10.2-236-వ.]

3889} మనోవృత్తులు  - 1.మనసున కేర్పడు వృత్తులు 2. క్షిప్త, మూఢ, విక్షిప్త, ఏకాగ్ర, నిరుద్ధ. 3. ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్ర, స్మృతి. :-
[5.1-155-వ.]

3890} మనోహరము  - మనసును దొంగిలించెడిది, అందమైనది :-
[4-688-క.]

3891} మనోహరుడు  - మనః (మనసును) హరుడు (దొంగిలించినవాడు), భర్త :-
[8-102-శా.]

3892} మన్మథమన్మథుడు  - మన్మథునికే మోహము పుట్టించువాడు, కృష్ణుడు :-
[10.1-1467.1-తే.]

3893} మన్మథుడు  - మనసును కలత పెట్టువాడు, రతీదేవి భర్త, వ్యు. యత్ బుద్ధిః తాం మంథాతీతి మన్మథః :-
[10.1-1014.1-ఆ.]

3894} మన్మథునిపంచబాణములు  - 1మోహనము 2ఉన్మాదము 3సంతపనము 4శోషణము 5నిశ్చేష్టీకరణము :-
[10.1-787-మ., 10.2-1168-ఆ.]

3895} మన్వంతరము  - ఒక మనువు పాలించు కాలపరిమితి, డెబ్బైయొక్క మహాయుగములు :-
[1-63-వ., 7-372.1-ఆ.]

3896} మన్వంతరములు  - పద్నాలు, 1 స్వాయంభువ 2 స్వారోచిష 3 ఉత్తమ00 4 తామస 5 రైవత 6 చాక్షుస 7 వైవస్వత 8 సూర్యసావర్ణి 9 దక్షసావర్ణి 10 బ్రహ్మసావర్ణి 11 ధర్మసావర్ణి 12 భద్రసావర్ణి 13 దేవసావర్ణి 14 ఇంద్రసావర్ణి ( పాఠాంతరములు కూడ కలవు) ప్రస్తుతము వైవశ్వత మన్వంతరము జరుగుచున్నది. :-
[4-945-వ.]

3897} మమత  - మమకారము (నాది యనెడి భావము) :-
[1-304-క., 4-818.1-తే.]

3898} మమత్వము  - మమకారము, ఇది నాది అను అభాస భావము యొక్క బంధనములు :-
[2-203-వ.]

3899} మయాదిశక్తులు  - 1పరాశక్తి 2ఆదిశక్తి 3జ్ఞానశక్తి 4ఇచ్చాశక్తి 5క్రియాశక్తి, పంచవిధశక్తులు. త్రివిధ మాయలు, 1. అవిద్య, 2. ఆవరణము, 3. విక్షేపము. నవవిధ శక్తులు 1. ప్రభ, 2. మాయ, 3. జయ, 4. సూక్ష్మ, 5. త్రిశుద్ధ, 6. నందిని, 7. సుప్రభ, 8. విజయ, 9. సిద్ధిద [కృష్ణుడు శక్తీశ్వరుడు] (సంకేత పదకోశము (రవ్వా శ్రీహరి) 2002) [పాండురంగమహాత్మ్యము 3 134] :-
[10.1-537-వ.]

3900} మయుడు  - దానవ శిల్పి :-
[10.2-837-వ.]

3901} మయూఖమాలి  - కిరణములు కలవాడు, సూర్యుడు :-
[1-2-ఉ.]

3902} మయూరలలితకరణము  - నెమలి వలె ఒయ్యారముగా మెడను నిక్కించి కదలించుట, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

3903} మయూరుడు - ఒక సంస్కృత కవి. ఇతఁడు అంధుఁడు అయి సూర్యశతకము చేసి కన్నులు పడసినాఁడు అని వాడుదురు. :-
[6-11.1-తే.]

3904} మరకతాచలము  - మలయపర్వతము :-
[3-287.1-తే.]

3905} మరీచి  - మరీచిమహర్షి, కిరణము, వ్యు. మృ+ఈచి, మ్రియంతే నశ్యంతి క్షుద్రజంతవః తమాంసి చ అనేన, దీనితో (క్షుద్ర) చిన్న జంతువులు మరియు చీకటి నశింపబడును. కిరణము., :-
[4-7.1-తే., 5.2-10-వ.]

3906} మరీచ్యాదులు  - నవబ్రహ్మలు, 1 మరీచి 2 అత్రి 3 అంగీరసుడు 4 పులస్త్యుడు 5 పులహుడు 6 క్రతువు 7 వసిష్టుడు పాఠ్యంతరం నవబ్రహ్మలు, 1 మరీచి 2 భరద్వాజుడు 3 అత్రి 4 అంగీరసుడు 5 పులస్త్యుడు 6 పులహుడు 7 క్రతువు 8 వసిష్టుడు 9 వామదేవుడు :-
[3-305-త.]

3907} మరుత్తు  - మారుతము (వాయువునకు) అధిపతి, వాయుదేవుడు, వ్యు. మృ+ఉతి, మ్రియతే ప్రాణినః అస్య అభావాత్, ఇది లేకపోయినచో ప్రాణులు మరణించును. వాయువు, గాలి దేవత. :-
[4-426-క.]

3908} మరుత్తులు  - 1.సప్తసప్త సంఖ్యు లగు వేల్పులు, ఏడు గణములలో ఏడుగురు చొప్పున 49 మంది వాయువులు. 2.అగ్నిష్వాత్తులు, బర్హిషదులు, సౌమ్యులు, పితలు, ఆజ్యపులు, సాగ్నులు, విరగ్నులు అని ఏడు విధాలైన ఆ అగ్నులు, 3.దితికి కశ్యపమహర్షివలన పుట్టిన వాయవేల్పులు. (శబ్దకల్పద్రుమము నందు వీరి పేర్లు ఇవ్వబడినవి) :-
[2-38-వ., 6-286.1-ఆ., 6-448-ఉ., 8-634-వ.]

3909} మరుత్సుతుడు  - వాయుపుత్రుడు, హనుమంతుడు :-
[9-325-మ.]

3910} మరుత్సూనుడు  - మరుత్ (వాయుదేవుని) సూనుడు (పుత్రుడు), భీముడు :-
[10.2-731-ఉ.]

3911} మరుదశనపతిశయనుడు  - మరుత్ (గాలిని) అశన (భక్షణముచేసెడి వారి)( సర్పముల) పతి (ప్రభువైన ఆదిశేషుని పైన) శయనుడు (పరుండువాడు), విష్ణువు :-
[12-1-క.]

3912} మరున్నగరము  - మరుత్ (దేవతల) నగరము, స్వర్గము :-
[9-231-మ.]

3913} మర్త్యులు  - మరత (మరణించు లక్షణము) కలవారు, మానవులు :-
[2-194-చ., 3-346-వ., 3-946.1-తే., 7-241-వ., 10.1-903-శా.]

3914} మర్దితపాదకర్మలు  - బంకమన్ను కలియదొక్కునట్లు అడుగులెత్తి వేయుట, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

3915} మర్మములు  - ప్రాణములు దాగిన దేహభాగములు, జీవస్థానములు :-
[4-335-చ.]

3916} మర్మర  - గాలికి వస్త్రములు, ఆకులు చేసెడి ధ్వన్యనుకరణ :-
[10.1-766-వ.]

3917} మలయకేతనుడు  - 1.మలయ (విష్ణుభక్తి ప్రధానముగా కల దక్షిణ దేశము) అందు కేతనుడు (శ్రేష్ఠుడు), పురంజనోపాఖ్యానంలో, 2.విదర్భ రాకుమారిగా పుట్టిన పురంజయుని భర్త, 3. పాండ్యదేశపురాజు. :-
[4-830.1-తే.]

3918} మలయకేతు  - 1.భరతవర్షంలోని తొమ్మిది దేశాలలో ఒక దేశము. 2.మలయు (తపసు చేయుటకు) కేతు (గుర్తు కలది), తపో భూమి, :-
[5.1-64-వ.]

3919} మలయజము  - మలయ పర్వతమున పుట్టిన మంచి గంధము :-
[10.2-1143.1-తే.]

3920} మలహరుడు  - మల (దోషములను) హరుడు (తొలగించెడివాడు), శంకరుడు :-
[9-515-చ.]

3921} మలినోపాధులు  - చెడ్డవృత్తులు ఉదా. దొంగతనము, వేశ్యావృత్తి, వడ్డీవ్యాపారము మొదలైనవి :-
[2-222-వ.]

3922} మల్లుడు  - మల్లయుద్దము (కుస్తీ) జట్టీ, కంసుని ఆస్థాన మల్లయోధుడు :-
[2-190-చ.]

3923} మహతి  - నారదుని వీణ యొక్క పేరు, నూఱుతంతులుగల నారదునివీణ; :-
[6-239.1-ఆ., 10.2-1083.1-తే.]

3924} మహత్తత్త్వము  - పంచభూతాది సృష్టికంటె ముందు స్థితిలోని సృష్టితత్త్వము :-
[3-201.1-తే.]

3925} మహత్తు - మహత్తరము మహత్తమము :-
[4-559.1-తే., 4-578-చ.]

3926} మహత్తుడు - మహత్తరముడు మహత్తముడు :-
[4-559.1-తే.]

3927} మహత్త్వాదులు  - చతుర్వింశతితత్వంబులు, (1)మహత్తు (1)పురుషుడు (1)ప్రకృతి (5)పంచభూతములు (5)పంచతన్మాత్రలు (5)పంచకర్మేంద్రియములు (5)పంచజ్ఞానేంద్రియములు మరియు (1)అంతఃకరణము మొత్తము 1+1+1+5+5+5+5+1 24 ... పందవింశతి తత్త్వములు చతుర్వింశతి తత్తవములు + బుద్ధి :-
[1-67-వ.]

3928} మహదాది  - చతుర్వింశతితత్వంబులు, (1)మహత్తు (1)పురుషుడు (1)ప్రకృతి (5)పంచభూతములు (5)పంచతన్మాత్రలు (5)పంచకర్మేంద్రియములు (5)పంచజ్ఞానేంద్రియములు మరియు (1)అంతఃకరణము మొత్తము 1+1+1+5+5+5+5+1 24 ... పందవింశతి తత్త్వములు చతుర్వింశతి తత్తవములు + బుద్ధి :-
[2-222-వ., 3-950-వ., 4-271.1-తే., 10.1-119.1-ఆ., 11-113-వ.]

3929} మహనీయతేజోనిధి  - మహిమాన్వితమైన తేజస్సునకు నిధి వంటివాడు, కృష్ణుడు :-
[3-150-వ.]

3930} మహనీయము - మహనీయతరము మహనీయకమము :-
[4-566.1-తే.]

3931} మహా - మహత్తరము మహత్తమము :-
[10.1-1317-శా.]

3932} మహాకల్పము  - బ్రహ్మ ఉదయము నుండి అస్తమయము వరకు గల కాలపరిమాణము, ఒక సృష్టి మొత్తము (చక్రము) యొక్క కాలపరిమాణ పరిణామములు. :-
[2-30-వ., 2-222-వ.]

3933} మహాత్మ - గొప్ప ఆత్మ కలవాడ , శ్రీకృష్ణ :-
[5.1-182-క.]

3934} మహాత్మకుడు  - గొప్ప ఆత్మ కలవాడు, గొప్పవాడు :-
[2-109-చ.]

3935} మహాత్ముడు  - మహా (గొప్ప) ఆత్ముడు (ఆత్మ గలవాడు), గొప్పవాడు, మహత్తత్వ అవ్యక్తములను మీరిన గొప్పరూపము కలవాడు విష్ణువు, శ్రీకృష్ణుడు :-
[2-133-వ., 3-143-క., 3-293.1-తే., 3-473-వ., 3-579-తే., 3-839-వ., 4-19-వ., 4-923-ఉ., 7-109-వ., 7-459-ఉ., 10.1-4-క., 10.1-284-క., 10.1-681-వ., 10.1-942-ఆ., 10.1-1180.1-ఆ.]

3936} మహాత్ములు - గొప్ప ఆత్మ కలవారు, గొప్పవారు :-
[1-213-ఆ.]

3937} మహాదేవుడు  - మహా (గొప్ప) దేవుడు, శివుడు :-
[8-222.1-ఆ.]

3938} మహాద్భుతవిక్రమశౌర్యభండనుడు  - మహా(గొప్ప) అద్భుత(అద్భుతమైన) విక్రమ(పరాక్రమము) శౌర్య (వీరత్వము)లతో భండనుడు (యుద్ధముచేయువాడు), రాముడు :-
[7-482-చ.]

3939} మహానసము  - అధికమైన వాసనలు వచ్చునది, పాకస్థానము :-
[10.2-6-వ.]

3940} మహానుగ్రహశీలుడు  - గొప్పగా అనుగ్రహించు శీలము (ప్రవర్తన) కలవాడు, శంకరుడు :-
[3-473-వ.]

3941} మహానుభావుడు  - గొప్ప దైన భావమువాడు, విష్ణువు :-
[3-897.1-తే., 6-343-వ.]

3942} మహాపన్నశరణ్యుడు  - మహా (గొప్ప) ఆపన్న (ఆపదలను పొందినవారికి) శరణ్యుడు (శరణము నిచ్చువాడు), విష్ణువు :-
[7-193-ఉ.]

3943} మహాపురుషలక్షములు  - సాముద్రిక శాస్త్రమున చెప్పబడిన శంఖ చక్ర వజ్ర పద్మ హలాది చిహ్నములు :-
[10.1-125-వ.]

3944} మహాపురుషుడు  - విరాట్పురుషుడు, విష్ణువు :-
[7-109-వ., 10.2-627-మ.]

3945} మహాప్రళయము  - రెండు మహాకల్పముల నడిమి కాలము, బ్రహ్మ అస్తమయం నుండి ఉదయము వరకు గల కాలపరిమాణము, :-
[2-222-వ.]

3946} మహాబాహుడు  - గొప్ప బాహువులు కలవాడు, మహాపరాక్రమశాలి. :-
[4-322-వ.]

3947} మహాభాగుడు  - గొప్ప భాగుడు (వైభవములు కలవాడు), విష్ణువు :-
[4-421-వ.]

3948} మహాభుజుడు  - గొప్ప భుజబలము కలవాడు, కృష్ణుడు :-
[10.1-1321-వ.]

3949} మహాభూతపంచకములు  - పంచమహా భూతములు, 1భూమి 2నీరు 3వాయువు 4అగ్ని 5 ఆకాశము అనెడి ఐదు భూతములు :-
[2-68.1-తే.]

3950} మహాభూతములు  - పంచమహా భూతములు, 1భూమి 2నీరు 3వాయువు 4అగ్ని 5 ఆకాశము అనెడి ఐదు భూతములు, పాఠ్యంతరమున ఈ ఐదు మఱియు మనస్సు :-
[1-61-వ., 1-62.1-తే., 2-84-వ., 2-84-వ., 2-238-వ., 2-252-వ., 2-252-వ., 7-241-వ.]

3951} మహామహిముడు  - గొప్ప మహిమ ఉన్నవాడు :-
[2-89-వ.]

3952} మహామోహనము  - అంతర్యామిత్వమును మరగుపరచునది తగువర్తన తెలిసినను ఆత్మ తత్త్వము తెలియని పరిస్థితి :-
[3-721.1-తే.]

3953} మహాయుగము  - ఒక చతుర్యుగపర్యంత కాలము (1కృతయుగము 1728000, 2త్రేత 1298000, 3ద్వాపర 864000 కలి 432000, మొత్తం 4320000 మానవ సంవత్సరముల కాలమునకు సమానము) :-
[10.1-1654-వ.]

3954} మహారథి  - 1) మహారథి పదకొండువేలమంది (11000) విలుకాండ్రతో పోరాడెడి యోధుడు, తనను సారథిని గుఱ్ఱములను కాపాడుకొనుచు పోరాడెడి యోధుడు 2)అతిరథి పెక్కువిలుకాండ్రతో పోరాడెడి యోధుడు 3)సమరథి ఒకవిలుకానితో సరిగనిలిచి పోరాడెడి యోధుడు 4)అర్థరథి ఒక్కవిలుకానితో పోరాడెడి యోధుడు :-
[6-370-వ.]

3955} మహారథుడు  - 1) మహారథుడు పదకొండువేలమంది (11000) విలుకాండ్రతో పోరాడెడి యోధుడు, తనను సారథిని గుఱ్ఱములను కాపాడుకొనుచు పోరాడెడి యోధుడు 2)అతిరథుడు పెక్కువిలుకాండ్రతో పోరాడెడి యోధుడు 3)సమరథుడు ఒకవిలుకానితో సరిగనిలిచి పోరాడెడి యోధుడు 4)అర్థరథుడు ఒక్కవిలుకానితో పోరాడెడి యోధుడు :-
[1-432-వ., 4-325-చ., 10.2-20-వ., 10.2-114-వ.]

3956} మహారౌరవము  - మిక్కిలి రురు రూపమున కల ప్రాణులచేత బాధింప పెట్టునది, నరక విశేషములు :-
[5.2-136-వ.]

3957} మహార్ణవము  - మహా (గొప్ప) అర్ణవము (ఉదకమునకు స్థానము, సముద్రము), మహాసముద్రము :-
[8-701-వ.]

3958} మహితగుణాలవాలుడు  - మహిత (గొప్ప) గుణాల (గుణముల)అలవాల (పాదువంటివాడు), శివుడు :-
[4-149.1-తే.]

3959} మహితయశోవిలాసగుణమండనుడు  - గొప్ప కీర్తితో విరాజిల్లు గుణములతో ప్రసిద్ధమైనవాడు, విష్ణువు) :-
[3-552-చ.]

3960} మహితాఖిలేంద్రియమార్గనిరవధిగతమార్గుడవు - మహిత (గొప్ప) అఖిల (సర్వ) ఇంద్రియముల (నడవడికకు) నిరవధిక (ఎడతెగని) గత (వెళ్ళిన మార్గమున) (అధిగతుతుడవు), విష్ణువు :-
[4-918.1-తే.]

3961} మహితాత్ముడు  - మహిత (మహిమ గల) ఆత్ముడు (స్వరూపము గలవాడు), విష్ణువు :-
[4-282.1-తే., 7-387-క.]

3962} మహిపతి  - మహి (భూమి)కి పతి, రాజు :-
[4-473-క.]

3963} మహిషి  - స్వంతబుద్ధికి సంకేతంగా వాడబడినది, పట్టపురాణి, గేదె (ఎనుము) :-
[4-772-వ.]

3964} మహీజ  - మహి+జ భూమిని పుట్టినది చెట్టు, సీతాదేవి :-
[2-91.1-ఆ.]

3965} మహీజము  - మహిన్ (నేలపై) పుట్టునది, చెట్టు :-
[10.2-552-మత్త.]

3966} మహీధరము  - మహి (భూమి)ని ధరము ధరించెడిది), పర్వతము :-
[6-326-వ., 10.1-1321-వ., 10.1-1753-వ.]

3967} మహీధవుడు  - మహి (భూమికి) ధవుడు (ప్రభువు), రాజు :-
[6-449-వ.]

3968} మహీపతి  - మహి (భూమి, రాజ్యాని)కి పతి, రాజు :-
[4-416-చ., 10.1-1581-వ.]

3969} మహీపాలుడు  - మహి (భూమి)ని పాలించువాడు, రాజు :-
[9-230-వ.]

3970} మహీరుహము  - భూమినందు పుట్టునది, చెట్టు :-
[3-344-వ., 10.1-1599-ఉ.]

3971} మహీవరుడు  - మహీ (భూమి)కి వరుడు, రాజు :-
[4-394.1-తే., 5.2-59.1-ఆ.]

3972} మహీవిభుడు  - మహి (భూమి)కి విభుడు(ప్రభువు), రాజు. :-
[9-83-వ.]

3973} మహీశుడు  - మహి (భూమి, రాజ్యము)నకు ఈశుడు (ప్రభువు), రాజు. :-
[10.1-752-క.]

3974} మహీశ్వరుడు  - మహి (భూమి)కి ఈశ్వరుడు (ప్రభువు), రాజు. :-
[6-438-చ.]

3975} మహీసురుడు  - భూమిపై దేవత, విప్రుడు :-
[10.1-1371-ఉ., 10.2-51-వ.]

3976} మహేంద్రజుడు  - మహేంద్రుని పుత్రుడు, అర్జున :-
[1-371-క.]

3977} మహేంద్రనగరము  - ఇంద్రుడి యొక్క నగరము, అమరావతి :-
[1-256-వ.]

3978} మహేంద్రాదిదివిజమండలచూడామణి  - మహేంద్ర (ఇంద్రుడు) ఆది (మొదలగు) దివిజ (దేవతల) మండలి (సమూహ మంతటికి) చూడామణి (తలమానిక మణి వంటివాడు), విష్ణువు :-
[6-34-క.]

3979} మహేంద్రాశ  - మహేంద్రుని యొక్క ఆశ (దిక్కు), తూర్పు :-
[10.1-110-క.]

3980} మహేంద్రుడు  - మహా (గొప్ప) ఇంద్రుడు, దేవేంద్రుడు :-
[8-489-క.]

3981} మహేశుడు  - మహ (గొప్ప) ఈశుడు, మహాంశ్ఛాసావీశ్వరశ్చ మహేశ్వరః (వ్యుత్పత్తి), దేవతలలో శ్రేష్ఠుడు, శివుడు :-
[6-2-ఉ., 7-359-ఉ., 8-225-క., 9-16.1-తే., 10.1-1744-ఉ., 10.2-529-క.]

3982} మహేశ్వరుడు  - మహ (గొప్ప) ఈశుడు, మహాంశ్ఛాసావీశ్వరశ్చ మహేశ్వరః (వ్యుత్పత్తి), దేవతలలో శ్రేష్ఠుడు, శివుడు :-
[7-394-వ.]

3983} మహోజ్జ్వలసారయశస్సాంద్రుడు  - మహా (గొప్ప) ఉజ్జ్వల (ప్రకాశవంతమైన) సార (చేవగలిగిన) యశస్ (కీర్తి) సాంద్రుడు (దట్టముగాగలవాడు), రాముడు :-
[9-1-క.]

3984} మహోద్ధాముడు  - మహా (గొప్ప) ఉద్ధాముడు (ఉద్ధరించెడివాడు), రాముడు :-
[8-1-క.]

3985} మహోరగము  - మహా (పెద్ద) ఉరగము (పాము), కొండచిలువ, అజగరము :-
[7-436-మ.]

3986} మాఁడుద్రబ్బెడ  - అన్నదులు మాడిపోయిన పెచ్చులు :-
[5.1-129-వ.]

3987} మాండవ్యుడు  - ఒక ఋషి ఇతను తపము చేసికొనుచుండగా రాజు దొంగయని వానింబట్టి కొరతవేయించెను ఆ ముని వెళ్ళి యమునితో నిష్కారణముగా నన్నిట్లు శిక్షించితివి కనుక శూద్రుడవై భూమిమీద పుట్టుము అని శపించెను ఆ యముడే విదురుడుగా పుట్టెను :-
[3-196-వ.]

3988} మాంథాత  - సూర్యవంశ రాజు, షోడశమహారాజులలో ఒకడు, సం. విణ. గొప్పవాడు, వ్యు. (మామ్ ధే తృచ్) కృ. ప్ర., నన్ను ఈతడు తొలగించగలడు అని దేవేంద్రుడు వెఱపొందినందున ఈతనికి ఈ వ్యవహార నామము :-
[2-204.1-తే., 9-167-వ.]

3989} మాగధుడు  - మగధదేశము ప్రభువు, జరాసంధుడు, వంశావళి చదువువాడు, వంశవీర్యాదులను పొగడి జీవించెడివాడు, బిరుదులను ఉగ్గడించి కీర్తించుచు జీవించువాడు, గాయకుడు, :-
[3-123.1-తే., 4-558-వ., 10.1-1533-మ., 10.1-1579-వ., 10.1-1581-వ., 10.2-86-ఉ., 10.2-450-వ., 10.2-714-తే.]

3990} మాగధోర్వీశుడు  - మాగధ ఉర్వీశుడు (దేశ ప్రభువు), జరాసంధుడు :-
[10.1-1674-శా.]

3991} మాఘుడు  - శిశుపాలవధ వ్రాసిన గొప్ప సంస్కృత పండితుడు :-
[6-11.1-తే.]

3992} మాటిమాటికి  - ప్రతిమాటకు, అస్తమాను, మరల మరల :-
[7-193-ఉ.]

3993} మాడ  - అరవరహా, ఒక సువర్ణనాణెము :-
[8-550-మ.]

3994} మాణవకుడు  - వ్యు. మను + అణ్ (అల్పార్థే) + క. ణత్వమ్, నిపా, త.ప్ర., పిల్లవాడు, ఆంధ్ర శబ్ధ రత్నాకరము :-
[8-520-వ.]

3995} మాతంగము  - మదగజము, మతంగుడను ఋషివలన పుట్టినది, ఏనుగు :-
[7-241-వ., 10.1-1562-వ.]

3996} మాతలి  - ఇంద్రుని సారథి పేరు :-
[9-298-క.]

3997} మాతృక  - ఎడమపక్క కొమ్ము చెవి మున్నగునవి కొరవడిన ఏనుగు, దీని వలన అధిపతికి దారిద్ర్యము కలుగును :-
[10.1-236-వ.]

3998} మాతృగణ  - అమ్మవార్లు, గ్రామదేవతలు :-
[2-274.1-తే.]

3999} మాత్రలు,పంచతన్మాత్రలు  - 1శబ్దము 2స్పర్శము 3రూపము 4రసము 5గంధము :-
[10.1-682.1-తే.]

4000} మాద్రి  - పాండురాజు రెండవ భార్య, మద్రరాజు కూఁతురు. శల్యుని చెల్లెలు. మిక్కిలి సౌందర్యవతి. పాండురాజు యొక్క రెండవభార్య. ఈమె తన మగనితో సహగమనము చేసెను. ఈమెకు అశ్వినీదేవతల ప్రసాదమువలన నకులుఁడు, సహదేవుఁడు అను కవలలు పుట్టిరి.పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879. పాండురాజు మొదటి భార్య కుంతీదేవి :-
[10.2-354-మ.]

4001} మాద్రేయులు  - మాద్రి యొక్క కొడుకులు, నకలుడు సహదేవుడు :-
[10.2-687-వ.]

4002} మాధవలోకము  - విష్ణుమూర్తి యొక్క పదము, వైకుంఠము :-
[12-25-ఉ.]

4003} మాధవి  - శ్రీశైలక్షేత్రమున మాధవి (మధ్నాతీతి మాధవి, శత్రువులైన రాక్షసులను శిక్షించునామె) :-
[10.1-61-వ.]

4004} మాధవుడు - మా (లక్ష్మీదేవికి) ధవుడు (ప్రభువు), విష్ణువు :-
[3-298-మ,]

4005} మాధవుడు  - 1. మా (లక్ష్మీదేవి) ధవ (భర్త ఐనవాడు) , 2. మధు అను రాక్షసుని జయించినవాడు విష్ణువు, 3. మనసును రంజింపజేయువాడు, 4. మాధవి భర్త, 5. యదువు తరువాతి తరపు మధువు యొక్క వంశము వాడు, శ్రీకృష్ణుడు, :-
[1-153-మ., 1-272-మత్త., 1-292-శా., 1-336-క., 1-344-మ., 1-348.1-తే., 1-368-మ., 1-370.1-తే., 1-382-క., 2-51.1-ఆ., 2-71-మ., 2-187-శా., 3-19-చ., 3-400-మ., 3-435-చ., 3-445-చ., 3-484-చ., 3-665-మ., 3-753.1-తే., 4-171.1-తే., 7-108-ఉ., 8-739-ఆ., 9-3.1-తే., 9-170.1-తే., 10.1-127-ఉ., 10.1-181-క., 10.1-236-వ., 10.1-428-క., 10.1-610.1-ఆ., 10.1-772-మ., 10.1-868-మ., 10.1-943-శా., 10.1-1014.1-ఆ., 10.1-1093-చ., 10.1-1187-ఉ., 10.1-1223-మ., 10.1-1467.1-తే., 10.2-79-ఆ., 10.2-128-క., 10.2-752-చ., 10.2-1188-ఉ.]

4006} మాధ్యస్థ్యము  - మధ్యవర్తిత్వ న్యాయమును, మంచి మర్యాద :-
[3-65-మ.]

4007} మానకవీచి  - కొండపైనుండి విసరెడి శిక్షలు, నరక విశేషము :-
[5.2-155.1-తే.]

4008} మానవతి  - మానము కలామె, స్త్రీ :-
[4-777-క.]

4009} మానవతులు  - మానము (శీలము) కల స్త్రీలు :-
[10.1-843-వ., 10.1-984-క.]

4010} మానవాధీశ్వరుడు  - మానవులకు అధీశ్వరుడు (ప్రభువు), రాజు :-
[8-18.1-ఆ.]

4011} మానవుడు  - మనువు వలన పుట్టినవాడు, మనుష్యుడు :-
[5.1-74.1-తే., 7-408.1-ఆ., 10.1-1410-శా.]

4012} మానవేంద్రుడు  - మానవులకి ఇంద్రునివంటి వాడు, రాజు :-
[1-294.1-తే., 4-861-చ., 5.2-9.1-ఆ., 7-464.1-తే., 10.1-48-ఆ., 10.1-631.1-ఆ.]

4013} మానవేశ్వరుడు  - మానవులకు ప్రభువు, రాజు :-
[10.1-636.1-తే.]

4014} మానారీమనోహారుడు  - మానారీ (లక్ష్మీదేవియొక్క) మనోహారుడు (మనస్సును దొంగిలించువాడు), విష్ణువు, కృష్ణుడు. :-
[10.1-1046-మ.]

4015} మానిని  - మంచిమానము కలామె, స్త్రీ, మానస్యో ఇతి మానినీ (వ్యుత్పత్తి) :-
[1-26-ఉ., 1-27-క., 4-79.1-తే., 10.1-788-ఉ., 10.1-1236-దం.]

4016} మానిని  - మంచిమానము కలామె, స్త్రీ, మానస్యో ఇతి మానినీ (వ్యుత్పత్తి), రుక్మిణి :-
[10.2-267-ఉ.]

4017} మానినీచిత్తచోరుడు  - స్త్రీల మనసులను అపహరించు వాడు, కృష్ణుడు. :-
[10.1-1704.1-తే.]

4018} మాన్యుడు  - మన్నింప దగినవాడు, పూజ్యుడు :-
[10.1-1311-క.]

4019} మాయ  - 1. అభాస, అసత్యమై సత్యము వలె భాసించునవి, 2. మాయానగరక్షేత్రమున మాయ (లక్ష్మీదేవిచే కొలువబడెడి యామె, అజ్ఞానులకు కనబడని యామె) :-
[2-199-వ., 10.1-61-వ., 10.1-541-వ., 10.1-1180.1-ఆ.]

4020} మాయావతి  - శంబరాసురుని యింట పాతివ్రత్యమును నడుపుతూ ఉన్న రతీదేవి :-
[10.2-11-వ.]

4021} మారిష - మరులు (కామమును) కలిగించునది, మారిష (స్త్రీ), దక్షుని తల్లి, ప్రచేతసుల భార్య, కండుఁడు అను ఒక మహర్షికి ప్రమ్లోచ అను అప్సరస యందు పుట్టిన కన్య. :-
[6-203-వ.]

4022} మారీచభూరిమాయానీరంధ్రమహాంధకారనీరేజహితుడు  - మారీచుడను రాక్షసుని భూరి (మిక్కుటమైన) మాయలు అనెడి నీరంధ్ర (దట్టమైన) మహా (గొప్ప) అంధకార (చీకటికి) నీరేజహిత (పద్మములకు మిత్రుడు, సూర్యుడు), శ్రీరాముడు :-
[10.2-1341-క.]

4023} మారీచుడు  - 1. మరీచి మహర్షి కొడుకు, మరీచి బ్రహ్మమానసపుత్రులలో ఒకఁడు. ఇతనికి కర్దముని కూఁతురు కళయందు కశ్యపుడు అను కొడుకు, పూర్ణిమ అను కూఁతురు పుట్టిరి. 2. ఒక రాక్షసుడు, తాటక కొడుకు. సుబాహుని అన్న. మిక్కిలి టక్కులమారి. మాయలేడిగా వచ్చి రామునిచేతిలో మరణించినవాడు. :-
[3-476-క.]

4024} మారుడు  - విరహిజనులను మరణింప చేయువాడు, మన్మథుడు :-
[10.1-967.1-ఆ.]

4025} మారుతపుత్త్రుడు  - వాయుదేవుని పుత్రుడు, భీముడు :-
[1-189.1-తే.]

4026} మారుతి  - వాయుపుత్రుడు, హనుమంతుడు, భీముడు :-
[1-334-మ., 9-275-క.]

4027} మార్కండేయుడు  - మార్కము (మృత్యువు)ను జయించినవాడు :-
[4-26-వ.]

4028} మార్జాలగతి  - ఎప్పుడు ఏమగునో అను భీతిచేత పిల్లివలె :-
[10.2-259-క.]

4029} మార్తాండమండలమధ్యసంస్థితుడు  - మార్తాండ (సూర్య) మండలమునకు మధ్యన సంస్థిత (స్థిరముగ నుండువాడు), కృష్ణుడు :-
[5.2-167-మత్త.]

4030} మార్తాండుడు  - మండుతుండే అండము రూపము వాడు, సూర్యుడు, మృతుండు అనువాని పుత్రుడు, బ్రహ్మాండము మృతి (ముక్కచెక్కలగునప్పుడు) పుట్టినవాడు, సూర్యుని సుష్మమ్న అను రశ్మి యొక్క అవతారము సూర్యుడు :-
[3-346-వ., 7-397-వ., 10.1-1531-క., 10.2-941-ఉ., 12-41-వ.]

4031} మాఱుదేహము  - భోగసాధనమైన దేవ నర పశు పక్షి మృగాది భౌతిక రూపము :-
[10.1-29.1-ఆ.]

4032} మాలి  - 1. మాలలు ధరించిన వాడు, కృష్ణుడు, 2. ఇంద్రుడొసగిన మాల కంఠమున ధరించినవాడు, వాలి :-
[9-273-క.]

4033} మావిభుడు  - మా (లక్ష్మీదేవి) విభుడు (ప్రభువు), హరి :-
[4-347.1-తే.]

4034} మాష  - మాషము, బంగారు తూనిక కొలతలలో ఒకటి, ఐదు గురివిందగింజల యెత్తు; తులములో పన్నెండవ భాగము. :-
[3-346-వ.]

4035} మింటితెరువరులు  - మింటి (ఆకాశ) తెరువు (మార్గమున) సంచరించెడి వరులు (ఉత్తములు), దేవతలు :-
[10.1-479-వ.]

4036} మిత్రుడు  - 1.హితుడు, 2.కొలతలు వేయుటలో నేర్పరి, 3.సూర్యుని వలె నిస్వార్థం గలవాడు, 4.అర్జునుడు, 5.మితము అను దేశ, కాల, ద్రవ్య ముల కొలతలకు అధిదేవత, 6.ద్వాదశాదిత్యులలో ఒకడు, సూర్యుడు :-
[1-371-క., 2-86-వ., 4-26-వ., 6-507-వ., 12-41-వ.]

4037} మిథిలానగరము  - విదేహరాజ్య ముఖ్యపట్టణము :-
[10.2-92.1-తే.]

4038} మిథిలేశ్వరుడు  - మిథిలానగరానికి రాజు, జనక మహారాజు, సీతాదేవి తండ్రి :-
[2-204.1-తే., 10.2-1184-వ.]

4039} మిథునకర్మ  - స్త్రీపురుష మిథునము కలసి చేయు పని, మైథునము :-
[3-722-వ.]

4040} మిథునక్రియ  - భార్యాభర్తల విధానము, సంభోగము :-
[3-744.1-తే.]

4041} మిథ్య  - అభాస భ్రాంతి లేనిది ఉన్నట్లు అనిపించుట :-
[2-224-వ.]

4042} మిద్దెచరచు  - స్లాబులులాంటివి వేయుటకు రాటలు నిలబెట్టి మిద్దెలా ఖాళీలేకుండ కట్టుట :-
[10.1-479-వ.]

4043} మిన్నందు  - ఆకాసమునకు ఎగసిపడు, గర్వించు :-
[9-280-వ.]

4044} మిఱుమిట్లుకొలుపు  - మిక్కిలి అధికమైన కాంతిని చూచుటాదులచేత కన్నులందు చీకట్లు కమ్ముట :-
[10.2-401-వ.]

4045} మిహికావసుధాధరసూతిసన్నుతస్ఫురితచరిత్రుడు  - మిహికా హిమవత్, వసుధాధర పర్వతుని, సూతి కూతురిచేత, సన్నుత స్తుతించబడిన, స్ఫురిత ప్రకాశవంతమైన, చరిత్రుడు నడవడి కలవాడు, పార్వతీదేవిచే కొనియాడబడిన చరిత్ర గలవాడు , శ్రీరాముడు :-
[10.2-1340-చ.]

4046} మీనకేతనుడు  - చేపగుర్తు కల జండా కలవాడు, ప్రద్యుమ్నుడు :-
[10.2-881-మ.]

4047} మీననయన  - మీన (చేపలవంటి) నయన (కన్నులు కలామె), సుందరి :-
[10.1-757-వ.]

4048} మీమాంసకులు  - పూర్వ మీమాంస యను మార్గానువర్తులు :-
[1-428-వ.]

4049} ముకుందుడు  - 1.ఎఱ్ఱతామర మాలలచే అలంకృతుడు, 2.ముకుందము (కుందురస్కము అనెడి సుగంధ ద్రవ్యము) వలె మంచిని వ్యాపింపచేయువాడు, 3.మోక్షప్రదుడు, వ్యు. (ముకుమ్ + దా + క) ముకుమ్ మకారాంతమైన అవ్యయము,మోక్షవాచకము, మోక్షమును ఇచ్చు వాడు, (ఆంద్ర శబ్దరత్నాకరము), విష్ణువు :-
[3-156-వ., 3-203-దం., 3-262-చ., 3-392-క., 3-427-క., 3-485-తే., 3-753.1-తే., 7-248-క., 7-413-ఉ., 8-131-వ., 10.1-101-క., 10.2-477-ఆ., 10.2-615-వ., 12-11-వ.]

4050} ముకుళచూడ్కులు  - చిట్లించిన చూపులు, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

4051} ముక్కంటి  - మూడు కన్నులు ఉన్నవాడు, శివుడు :-
[1-353-శా., 2-91.1-ఆ., 10.1-88-వ., 10.2-1272-క.]

4052} ముక్కంటికింగనరానియొక్కటి  - శివునికి కూడ చూచుటకురాని ఏకేశ్వరుడు, విష్ణువు :-
[3-146-మత్త.]

4053} ముక్తదేహుడు  - దేహము విడిచిన వాడు, మరణించినవాడు :-
[5.1-91.1-తే.]

4054} ముక్తసంగుడు  - ముక్త (విడువబడిన) సంగుడు (తగులములు కలవాడు) :-
[1-58-వ., 1-504-క., 5.1-155-వ.]

4055} ముక్తి  - భవబంధాలు నుండి పూర్తి విడుదల, మోక్షము :-
[3-441-చ., 7-419-వ.]

4056} ముక్తినాయకుడు  - మోక్షమునకు ప్రభువు, విష్ణువు. :-
[4-924-చ.]

4057} ముక్తివిధానము  - ముక్తినిచేరు మార్గము, విష్ణువు :-
[3-146-మత్త.]

4058} ముక్తులు  - సంసారబంధములనుండి విముక్తి పొందినవారు :-
[8-83.1-ఆ.]

4059} ముఖ్యకారణుడు  - సమస్త విశ్వమునకు ప్రధానమైన కారణమైనవాడు, విష్ణువు :-
[6-529-త.]

4060} ముఖ్యచరితుడు  - ముఖ్య (ఉత్తమమైన) చరితుడు (వర్తన కలవాడు), పరీక్షిత్తు. :-
[10.1-1022-ఆ.]

4061} ముగురుఅమ్మలు  - లక్ష్మి సరస్వతి పార్వతి :-
[1-10-ఉ.]

4062} ముగ్ధ(ప్ర)  - ముగుద (వి), 1.స్వీయాంతర్భేదవిశిష్ట నాయికా విశేషము. 2.ఉదయించుచున్న యౌవనముగలది. 3.పండ్రెండేండ్ల పర్యంతమైన వయసుగలది. :-
[10.2-181.1-ఆ.]

4063} ముచుకుందుడు  - సూర్యవంశపు మాధాత కుమారుడు, దేవతల నుండి నిద్ర వరముగా కోరుకుని గుహలో యుగముల పర్యంతం నిద్రలో నున్నవాడు. కృష్ణుని తరుముకు వచ్చిన కాలయవనుడు వీరిని తన్ని నిద్రాభంగము చేసి, వీరి కంటిచూపుతో కాలిబూడిదైపోయాడు. :-
[2-204.1-తే.]

4064} ముజ్జగములు  - 1. భూ భువర్ సువర్ లోకములు 2. భూమి ఊర్థ్వ అథో లోకములు మూడు :-
[3-337-తే.]

4065} ముత్తైదువ  - భర్త జీవించి ఉన్న యామె, పునిస్త్రీ :-
[10.1-1743-వ.]

4066} ముదము  - సంతోషము, హర్షము :-
[4-28-వ.]

4067} ముదిత  - ముదము (సంతోషమును) ఇచ్చునది, స్త్రీ :-
[4-79.1-తే.]

4068} ముదితబలినిహితపదుడు  - ముదిత (సంతోషము నొందిన) బలిచక్రవర్తిని నిహిత (తొక్కిన) పదుడు (పాదములు కలవాడు), వామనుడు :-
[11-72.1-తే.]

4069} ముదుకచదువులవేల్పు  - ముదుక (పరిపక్వమైన) చదువుల(జ్ఞానముల)కి వేల్పు (దేవుడు), బ్రహ్మదేవుడు. :-
[6-177-క.]

4070} ముని  - 1. మౌనము(అంతర్యామి తత్త్వమునకు తప్ప దేనికిని వర్తింపక ఉండుట)ను అభ్యసించు వారు, 2. జ్ఞానముచేత మౌనము వహించువాడు, 3.వ్యు. మన్+ఇన్+ఉ, మనుతే జానాతి. :-
[3-203-దం., 10.2-766.1-ఆ., 10.2-1195-క.]

4071} మునికుంజరబాలకుఁడు  - మునులలో ఏనుగువంటి (శ్రేష్ఠుడైన) శమీకుని కుమారుడు, శృంగి :-
[1-472-క.]

4072} మునికులాగ్రణి  - ముని జనములలో అగ్రమైన (పెద్ద) వాడు, మైత్రేయ మహాముని :-
[3-394-క.]

4073} మునిజననుతచరితుడు  - మునలగు జనములచే నుత (స్తుతింబడిన) చరితుడు (నడవడిక కలవాడు), విష్ణువు :-
[3-841-క.]

4074} మునిపూజితుడు  - మునులచే పూజింపబడువాడు, రాముడు :-
[9-1-క.]

4075} మునివరేణ్యుడు  - మునులలో శ్రేష్ఠుడు, నారదుడు :-
[6-239.1-ఆ.]

4076} మునిశరణ్యవరేణ్యుడు  - మునులకు రక్షణ ఒసగు శ్రేష్ఠుడు, విష్ణువు :-
[3-590-ఉ.]

4077} మునీంద్రనుతుడు  - మునులలో శ్రేష్ఠులచే నుతింపబడువాడు, శివుడు :-
[4-138.1-తే.]

4078} మునీశ్వరమనోహరుడు  - మునీశ్వరుల మనసులను హర (దొంగిలించినవాడు), విష్ణువు :-
[8-92-ఉ.]

4079} ముప్పిరిగొను  - 1. ముప్పిరి ( మూడు పిరులు, రెట్లు) కొను (అగు), 2. అతిశయించు, 3. పెనఁగొను :-
[3-397-క., 3-438-క., 3-793-చ., 4-32-క.]

4080} ముప్పోకలు  - (అ).మూడుపోకడలు, (ఆ) 1సత్త్వగుణము 2రజగుణము 3తమోగుణములుకల మూడువిధములు, (ఇ) 1శ్రవణ 2అధ్యయన 3ఉపన్యాస అనెడి మూడు విద్యలు, (ఈ) 1ముందుకు 2వెనుకుక 3పక్కలకు అనెడి మూడు గమనములు :-
[8-552.1-తే.]

4081} ముమ్మడిగొను  - మూడురెట్లుగా పెరిగిపోవు :-
[5.1-134.1-తే.]

4082} ముయ్యెడు  - మూడు ఏడులు, ఇరవైఒకటి :-
[9-479-మ., 10.2-1037.1-తే.]

4083} ముర  - 1. ముర అను అసురుడు 2. వీనిని సంహరించి కృష్ణుడు మురారి అను పేరు పొందెను, ముర్+క, మురతి వేష్టతే పాపమ్, పాపము ఆవహించినవాడు. 3.ఒక రాక్షసుడు; :-
[2-190-చ.]

4084} మురదమనుడు  - మురాసురుని చంపినవాడు, కృష్ణుడు :-
[11-72.1-తే.]

4085} మురదైత్యమదవిభేది  - మురాసురునిగర్వమును తొలగించిన వాడు, కృష్ణుడు :-
[10.2-697.1-తే.]

4086} మురదైత్యహరుని  - ముర అను రాక్షసుని సంహరించినవాడు, విష్ణువు :-
[3-96-క.]

4087} మురభేది  - మురాసురుని భేదించిన వాడు, విష్ణువు :-
[3-166-క.]

4088} మురమర్ధనుడు  - ముర యనెడి రాక్షసుని సంహరించినవాడు, విష్ణువు :-
[6-397.1-ఆ.]

4089} మురముర  - అణగుట యందలి ధ్వన్యనుకరణ :-
[10.2-161-క.]

4090} మురరిపుడు  - మురాసురుని శత్రువు, కృష్ణుడు :-
[11-55-క.]

4091} మురవిదారణుడు  - ముర యనెడి అసురుని విదారణ (సంహరించిన వాడు), విష్ణువు :-
[6-529-త.]

4092} మురవిభేది  - మురాసురుని సంహరించినవాడు, కృష్ణుడు :-
[10.2-1137.1-తే.]

4093} మురవైరి  - ముర అను దానవుని శత్రువు, కృష్ణుడు :-
[2-51.1-ఆ., 10.2-188-వ.]

4094} మురశాసనుడు  - ముర యను రాక్షసుని శాసించినవాడు, నారాయణుడు :-
[4-14-చ.]

4095} మురసంహరుడు  - మురాసురుని సంహరించిన వాడు, కృష్ణుడు :-
[10.2-989-క.]

4096} మురహరి  - మురాసురుని సంహరించిన వాడు, కృష్ణుడు :-
[10.2-246-క.]

4097} మురహరుడు  - మురాసురుని సంహరించినవాడు, కృష్ణుడు :-
[10.2-195-ఆ., 10.2-1262-క.]

4098} మురాంతకాత్మజుడు  - మురాసురుని సంహరించిన కృష్ణుని యొక్క పుత్రుడు, ప్రద్యుమ్నుడు :-
[10.2-415-చ.]

4099} మురాంతకుడు  - ముర అను రాక్షసుని సంహరించిన వాడు, కృష్ణుడు :-
[1-345-వ., 1-423-చ.]

4100} మురారి  - మురాసురుని శత్రువు, కృష్ణుడు :-
[1-246-మత్త., 1-334-మ., 3-122-ఉ., 10.2-614-క., 10.2-650-క., 10.2-1077-క.]

4101} మురాసురభేది  - ముర అనే రాక్షసుని సంహరించిన వాడు, కృష్ణుడు :-
[3-31-ఉ.]

4102} మురాసురవిభేది  - మురాసురుని సంహరించిన వాడు, కృష్ణుడు :-
[10.2-424.1-తే.]

4103} మురాసురారి  - మురాసురుని శత్రువు, కృష్ణుడు :-
[10.2-1182-చ.]

4104} మురాసురుడు  - 1.ము (ఆనందము) ర (నశింపజేయు) అసురుడు (అజ్ఞానాహంకారుడు), 2. ముర్+క, మురతి వేష్టతే పాపమ్, పాపము ఆవహించినవాడు. ఒక రాక్షసుడు; :-
[10.2-156-వ.]

4105} ముల్లోకములు  - 1భూలోకము 2భువర్లోకము 3సువర్లోకము :-
[3-309.1-తే., 4-241-వ., 4-793-క., 5.2-77-ఆ., 8-227-ఆ., 10.1-292-క., 10.1-592.1-ఆ., 10.1-592.1-ఆ., 10.1-952.1-తే., 10.2-346-వ.]

4106} ముల్లోకములు, జగతిత్రితయము  - 1భూలోకము 2భువర్లోకము 3సువర్లోకము :-
[7-258-శా.]

4107} ముల్లోకములు, జగత్రయము  - 1భూలోకము 2భువర్లోకము 3సువర్లోకము :-
[3-847-క.]

4108} ముల్లోకములు, త్రిజగములు  - 1భూలోకము 2భువర్లోకము 3సువర్లోకము :-
[3-892-క.]

4109} ముల్లోకములు, త్రిలోకములు  - 1భూలోకము 2భువర్లోకము 3సువర్లోకము :-
[4-860-మ., 10.1-1414-క.]

4110} ముల్లోకములు, త్రైలోక్యములు  - 1భూలోకము 2భువర్లోకము 3సువర్లోకము :-
[4-378-క., 7-74-వ.]

4111} ముల్లోకములు, ముజ్జగములు  - 1భూలోకము 2భువర్లోకము 3సువర్లోకము :-
[6-167.1-తే., 6-327.1-తే.]

4112} ముల్లోకములు, లోకత్రయము  - 1భూలోకము 2భువర్లోకము 3సువర్లోకము :-
[1-513-వ., 5.2-114.1-ఆ.]

4113} మువ్వంకలు  - 1దొడ్డికాళ్ళు 2గూని 3మెడవంకర :-
[10.1-1280.1-ఆ.]

4114} ముష్టాముష్టి  - పరస్పరము గుద్దులతో చేయు యుద్ధము :-
[10.2-66-శా.]

4115} ముష్టికాసురారి  - ముష్టికాసురుని చంపినవాడు, బలరాముడు :-
[10.2-956.1-తే.]

4116} ముష్టికుడు  - కంసుని ఆస్థాన మల్లయోధులు :-
[2-190-చ.]

4117} ముసలాయుధుడు  - ముసలము (రోకలి) ఆయుధముగా కలవాడు, బలరాముడు :-
[10.2-299-ఉ.]

4118} ముసలి  - ముసలము (రోకలి) ఆయుధముగా కలవాడు, బలరాముడు :-
[1-348.1-తే., 10.2-92.1-తే.]

4119} ముహుర్తము  - అల్పకాలము, 2 గడియల కాలము, 12 క్షణముల కాలము, సుమారు 45 నిమిషములు :-
[3-461-మ., 5.1-101-వ., 10.2-430-వ.]

4120} మూఢుడు - మూఢతరుడు మూఢతముడు :-
[3-244-వ., 10.1-121-ఆ.]

4121} మూఢుడు  - సృష్టిని చూసి సృష్టికర్తను, అంతర్యామిని మరచినవాడు :-
[2-20-వ.]

4122} మూపురము  - ఎద్దు యొక్క భుజశిఖరము, కకుదము :-
[10.1-1137.1-తే.]

4123} మూర్చనలు  - స్వర సమూహముల భేదములు, సంగీత పారిభాషిక పదం :-
[2-188.1-తే.]

4124} మూర్తి  - అందము, స్వరూపము :-
[4-28-వ., 4-28-వ.]

4125} మూలకారణభూతము  - అవ్యక్త మహతత్త్వాది కార్యములకు కారణమైన పరబ్రహ్మము సూచన :-
[10.2-1122-వ.]

4126} మూలతత్త్వవిచారణుడు  - ఆదిమూల తత్త్వవిచారణకి స్వరూపమైనవాడు, విష్ణువు :-
[6-529-త.]

4127} మూలప్రకృతి  - మూలాధార (ప్రధాన) ప్రకృతి (ఉపాదానభూతము కారణవిశేషము) ఐనవాడు, సర్వకారణములకు కారణమైనది :-
[8-79.1-ఆ., 10.1-681-వ.]

4128} మూలాధారచక్రము - కుండలినీ శక్తికి సంబంధించిన షడ్చక్రములలో గుదస్థానమున ఉండునది మూలాధార చక్రము. :-
[2-29.1-ఆ.]

4129} మృకండుజుడు - మృకండమహర్షి కొడుకు, మార్కండేయుడు :-
[10.2-1117-ఉ.]

4130} మృకండుడు - మృకండ (మృత్యువు) కలవాడు :-
[4-26-వ.]

4131} మృగధరుడు  - లేడి రూపును బింబమున ధరించినవాడు, చంద్రుడు :-
[10.1-1747-వ.]

4132} మృగపతి  - మృగములకు ప్రభువు, సింహము :-
[5.1-112-వ., 10.2-60-మ.]

4133} మృగమదము  - కస్తూరి మృగము నుండి తీయబడు ఒక సుగంధద్రవ్యము, కస్తూరి :-
[3-507-వ.]

4134} మృగములు  - అడవిజంతువులు :-
[2-16-వ.]

4135} మృగరాజు  - మృగము లందు రాజు వంటిది, సింహము :-
[4-642-వ., 4-710.1-తే., 10.1-1187-ఉ., 10.1-1371-ఉ., 10.1-1748-మ., 10.2-1109-ఉ.]

4136} మృగలాంఛనుడు  - లేడి చిహ్నముగా కలవాడు, చంద్రుడు :-
[9-597-క.]

4137} మృగశాబనేత్ర  - లేడివంటి కన్నులు కలామె, స్త్రీ :-
[4-42.1-తే.]

4138} మృగాక్షి  - మృగ (లేడి)వంటి అక్షి (కన్నులు కలామె), అందమైన స్త్రీ. :-
[4-749-క., 8-233-క., 10.1-42-క., 10.1-319-క., 10.2-234-క.]

4139} మృగాదనము  - మృగములను తినునది, సివంగి :-
[9-595-క.]

4140} మృగీలోచన  - మృగి (లేడి వంటి) కన్నులు కల స్త్రీ :-
[10.2-207-మ.]

4141} మృగేంద్రము  - మృగములలో గొప్పది, సింహము :-
[1-293-వ., 9-599.1-తే.]

4142} మృగేంద్రుడు - మృగములలోఇంద్రుడు, సింహము :-
[1-396-వ.]

4143} మృగేంద్రుడు  - మృగములలో ఇంద్రునివంటిది, సింహము :-
[5.1-111-క.]

4144} మృగేక్షణ  - మృగ (లేడివంటి) ఈక్షణ (చూపులు గలామె), స్త్రీ :-
[8-467-క.]

4145} మృతసంజీవని  - మృత (మరణించినవారిని) సంజీవని (బతికించెడిది) :-
[9-531.1-తే.]

4146} మృత్యువు  - మరణము, మృత్యుస్వరూపుడు, విష్ణువు :-
[4-215-వ., 4-703.1-తే.]

4147} మృదువు - మృదుతరము మృదుతమము :-
[10.1-1057-క.]

4148} మృష  - అసత్యము, అబద్ధము :-
[4-215-వ.]

4149} మెరమెర  - 1. మనోవ్యధ, చింత 2. కంటిలోగాని, మనసులోగాని మెదలడం :-
[10.2-161-క.]

4150} మెఱము  - కదల్చు, ఇటునటు మెదలు :-
[10.1-449-శా.]

4151} మెఱుగుబోడి  - మెఱుగు (మెఱుపు, మేలైన) పోడి (పడతి), అందగత్తె :-
[10.1-110-క.]

4152} మేదిని  - మధుకైటభుల మేధస్సు (మెదడు) చే తడపబడునది, భూమి :-
[12-27-చ.]

4153} మేదినీకాంతుడు  - మేదిని (భూమి)కి కాంతుడు (భర్త), రాజు :-
[9-89-వ.]

4154} మేదినీజములు  - మేదిని (భూమి) నుండి జములు (జనించునవి), వృక్షములు :-
[6-195.1-తే.]

4155} మేదినీదయితుడు  - మేదిని (భూమికి) దయితుడు (భర్త), రాజు :-
[8-722-మ.]

4156} మేదినీవరుడు  - మేదిని (భూమి)కి వరుడు (పతి), రాజు. :-
[4-544.1-తే.]

4157} మేదినీవల్లభుడు  - మేదిని (భూమి)కి వల్లభుడు, (పతి), రాజు. :-
[9-183-వ.]

4158} మేదినీశుడు  - మేదిని (భూమికి) ఈశుడు (ఫ్రభువు), రాజు. :-
[9-22.1-తే.]

4159} మేదినీశ్వరుడు  - మేదిని (భూమి)కి ఈశ్వరుడు (ప్రభువు), రాజు :-
[4-306.1-తే.]

4160} మేదినీసురులు  - మేదిని (భూమి)కి సురులు, బ్రాహణులు :-
[4-562.1-తే.]

4161} మేధ  - చురుకుదనముగల బుద్ధి (జ్ఞాపకశక్తి కలదికానిది) :-
[4-28-వ., 9-84.1-ఆ.]

4162} మేధానిధి  - బుద్ధిబలమునకు నిధివంటివాడు, జ్ఞాని :-
[4-927-ఉ.]

4163} మేధి  - ధాన్యము నూర్చునప్పుడు ఎడ్లను తిప్పుటుకు నడుమ పాతెడి రాట, కట్రాట :-
[4-290-వ.]

4164} మేనంగన్నులవేల్పు  - మేనన్ (దేహమున) కన్నుల (కళ్ళు గల) వేల్పు (దేవుడు), ఇంద్రుడు :-
[6-177-క.]

4165} మేనత్త  - తండ్రికి సోదరి :-
[10.2-124-వ., 10.2-694-వ.]

4166} మేనమరదలు  - మేనత్త కూతురు :-
[10.2-145-మ.]

4167} మేను  - అన్నము వలన పుట్టి అన్నమువలననే వృద్ధి పొందునది, శరీరము :-
[10.1-11-ఆ.]

4168} మేరువు  - మేరుపర్వతము, వెన్నుపూస :-
[4-26-వ.]

4169} మైగప్పికొని  - మేను దాచుకొని, ఒదిగి :-
[8-173-క.]

4170} మైత్రి  - స్నేహము, మిత్ర భావము :-
[4-28-వ.]

4171} మైనాకుడు  - హిమవంతుని కుమారుడుు, సముద్ర మధ్యమున ఉండు పర్వతరాజము, ఇంద్రుడు పర్వతాల రెక్కలు ఖండిచునప్పుడు తప్పించుకున్న వాడు :-
[3-290-మ.]

4172} మోక్షదాయకుడు  - మోక్షము (ముక్తిని) దాయకుడు (ఇచ్చువాడు), విష్ణువు :-
[3-824-వ.]

4173} మోక్షము  - సంసారబంధములనుండి విమోచనము, ముక్తి :-
[10.1-1504.1-ఆ.]

4174} మోదకహస్తుడు  - మోదక (కుడుములు) హస్తుడు (చేతిలో గలవాడు), విఘ్నేశ్వరుడు :-
[6-4-ఉ.]

4175} మోపు  - కట్టెలు, గడ్డి మొదలగు వాని పెద్ద కట్ట :-
[2-51.1-ఆ.]

4176} మోహనాకారుడు  - మోహము పుట్టించెడి ఆకారము కలవాడు, కృష్ణుడు :-
[10.2-128-క.]

4177} మోహము  - నిజము కానిదాని యందు తగులము ఏర్పడుట, ప్రజ్ఞను మరగుపరచునది, తగువర్తన తెలిసినను భౌతికములందు మిక్కిలి సంగము లేదా మమకారము :-
[2-252-వ., 3-721.1-తే., 10.1-575-క.]

4178} మోహినీదేవత  - లోకమును మోహింపజేసెడి దేవత :-
[10.1-1747-వ.]

4179} మౌంజి  - మూడు పేటల ముంజి, దర్భల (గడ్డి) మొలతాడు, ముంజి :-
[7-421-వ.]

4180} మౌర్యులు  - ముర అనునామె వంశము వారు :-
[12-4-వ.]

4181} యంత్రము(ప్ర)  - జంత్రము (వి) :-
[10.1-1761-వ.]

4182} యక్షులు  - సంచారులు, దేవయోని విశేషము, ఖేచరులు, కశ్యపునికి సురసయందు జనియించినవారు. వీరు కుబేరాదులు, యక్షుడు (ప్ర) జక్కుడు (వి) :-
[2-274.1-తే.]

4183} యజమానశాల  - యజమాని (యజ్ఞమును చేయువాని) యొక్క శాల :-
[4-118-వ.]

4184} యజురధీశ్వరుండు  - యజుర్వేదమునకు అధికారి, భగవంతుడు :-
[3-451.1-తే.]

4185} యజ్ఞపతి  - యజ్ఞములకు పతి (ప్రభువు), విష్ణువు :-
[4-510-వ., 6-438-చ.]

4186} యజ్ఞపురుషుడు  - యజ్ఞమే తానైన పురుషుడు, విష్ణువు :-
[4-399-తే., 5.2-64-వ.]

4187} యజ్ఞభుజుడు  - అన్ని హవిర్భాగములను (ఆయా దేవతా రూపములలో) తినువాడు, విష్ణువు :-
[10.1-236-వ.]

4188} యజ్ఞమూర్తి  - యజ్ఞములు తన స్వరూపముగా కలవాడు, విష్ణువు :-
[3-400-మ.]

4189} యజ్ఞరేతస్సుడు  - యజ్ఞమునకు రేతస్సువంటివాడు (కారణుడు), విష్ణువు :-
[4-702.1-తే.]

4190} యజ్ఞవరాహమూర్తి  - యజ్ఞమే తానైన వరాహ స్వరూపము కలవాడు, విష్ణువు :-
[3-407.1-తే., 3-439-ఉ.]

4191} యజ్ఞవిభుడు  - యజ్ఞములకు ప్రభువు, విష్ణువు. :-
[3-425.1-తే.]

4192} యజ్ఞాంగుడు  - యజ్ఞమే దేహముగా కలవాడు, విష్ణువు :-
[4-509.1-తే.]

4193} యజ్ఞాధిపతి  - యజ్ఞములకు అధిపతి, విష్ణువు :-
[6-254-వ.]

4194} యజ్ఞాధీశుడు  - యజ్ఞాధికారి, విష్ణివి :-
[9-170.1-తే.]

4195} యజ్ఞుడు  - యజ్ఞకర్మ యజ్ఞకర్త యజ్ఞభోక్త తానైన వాడు, విష్ణువు :-
[11-77-వ.]

4196} యజ్ఞేశుడు  - యాగములకు ఈశుడు (ప్రభువు), విష్ణువు :-
[2-236-మ., 4-557.1-తే., 8-483.1-తే., 9-84.1-ఆ., 10.1-550-క.]

4197} యజ్ఞేశ్వరుడు  - యజ్ఞములకు ఈశ్వరుడు, విష్ణువు :-
[5.2-58-వ., 9-420-క.]

4198} యతి  - ఇంద్రియములను నియమించి, అధిపత్యము పొందినవాడు, సన్యాసి :-
[2-27.1-తే., 10.1-1084-వ.]

4199} యదుకుమారవరేణ్యుడు  - యదువంశపు వారిలో వరేణ్యుడు (శ్రేష్ఠుడు), కృష్ణుడు :-
[10.2-108.1-తే.]

4200} యదుకులేశ్వరుడు  - యదు వంశమునందలి ప్రభువు, కృష్ణుడు :-
[10.2-697.1-తే.]

4201} యదుపుంగవుడు  - యాదవ వంశస్థులలో శ్రేష్ఠుడు, కృష్ణుడు :-
[10.1-1729-ఉ.]

4202} యదుపుత్రుడు  - యదువంశమున పుట్టినవాడు, కృష్ణుడు :-
[10.2-49-క.]

4203} యదుప్రవరుడు  - యదు వంశావళిలోని వాడు, కృష్ణుడు :-
[10.2-987-చ.]

4204} యదుభూషణుడు  - యదు వంశమునకు భూషణము వంటి వాడు, కృష్ణుడు :-
[1-201-శా.]

4205} యదువంశమండనుడు  - యాదవ వంశమునకు అలంకారమైన వాడు, కృష్ణుడు :-
[10.1-1467.1-తే.]

4206} యదువల్లభుడు  - యాదవ వంశపు ప్రభువు, కృష్ణుడు :-
[10.2-62-క., 10.2-694-వ.]

4207} యదువులు  - యయాతి కొడుకు యదువు వంశస్తులు :-
[1-305-క.]

4208} యదుసింహుడు  - యాదవులలో సింహము వంటి వాడు, కృష్ణుడు :-
[10.1-1634-క.]

4209} యమతనూభవుడు  - యమధర్మరాజు యొక్క పుత్రుడు. ధర్మరాజు :-
[3-89.1-తే.]

4210} యమదండము  - యముని ఆయుధము :-
[5.1-147.1-తే.]

4211} యమనియమాది  - అష్టాంగయోగముమార్గములు, 1 యమము 2 నియమము 3 ఆసనము 4 ప్రాణాయామము 5 ప్రత్యాహారము 6 ధారణ 7 ధ్యానము 8 సమాధి :-
[6-224-వ.]

4212} యమము  - అంతరింద్రియ నిగ్రహము, నిషిద్ధములను ఆచరించకుండుట, ఇది దశవిధము అవి సత్యము, దయ, క్షమ, ధృతి (ధైర్యము), మితాహారము, ఆర్జవము (ఋజువర్తన), బ్రహ్మచర్యము, అస్తేయము (దొంగతనములేమి), అహింస, శౌచము (శుచిత్వము, నైర్మల్యము). :-
[2-253.1-తే., 4-618-వ.]

4213} యముడు(ప్ర)  - జముడు (వి), 1.మృత్యుదేవత, 2.కాలుఁడు, 3.తగిన దండనలతో దండించుట ద్వారా పాపముల ప్రక్షాళనము చేయువాడు, 4. దక్షిణదిశ దిక్పాలుడు, 5. సూర్యపుత్రుడు, 6 సోదరి యమున, 7. లోకం నరకం, 8. పట్టణము సంయమని, 9. భార్య ధూమవర్ణ, 10. కరణము చిత్రగుప్తుడు. :-
[10.1-1430-వ., 10.1-1502-క.]

4214} యయాతి  - చంద్రవంశపు రాజు, నహుషుని కొడుకు. ఇతని కొడుకు యదువు. యానము చేయువాడు, య+యాతి, యస్య వాయురివ యాతి సర్వత్ర, వాయువు వలె అంతట సంచరించువాడు. యయాతి చక్రవర్తి. :-
[2-204.1-తే., 4-812.1-తే.]

4215} యవనిక(ప్ర)  - జవనిక (వి), తెర, మరుగు నిచ్చుటకు వేదిక యందు కట్టుదురు. :-
[10.1-1747-వ.]

4216} యవనులు  - తురుష్కులు, యవనదేశము వారు, మహ్మదీయులు తొలుత యవన (గ్రీరు) దేశపువారు. :-
[4-814-క., 4-817-వ., 4-817-వ., 4-819-వ.]

4217} యశోదపాపడు  - యశోదాదేవి పిల్లవాడు, కృష్ణుడు :-
[10.1-725-క.]

4218} యశోవిహారుడు  - యశః (కీర్తి)తో విహారుడు (విహరించువాడు), విష్ణువు :-
[3-924.1-తే.]

4219} యాతన  - తీవ్రవేదన, విపరీతమైన కష్టం :-
[4-215-వ.]

4220} యాతనాశరీరము  - మరణ సమయమున భౌతిక దేహము విడిచి యమలోకపు శిక్షలకు అనువగుటకు జీవుడు దాల్చు దేహము :-
[3-984-వ.]

4221} యాతుధాన  - నిరృతి, రాక్షసవిశేషము, యాతనలు కలిగించు శక్తులు :-
[2-274.1-తే.]

4222} యాత్ర  - యోగుల నియమమును అనుసరించి ఏకస్థలమున ఉండరాదు కనుక వారు చేయు ప్రయాణములు. :-
[1-108-వ.]

4223} యాదవకుంజరుడు  - యదువంశపు శ్రేష్ఠుడు, కృష్ణుడు :-
[10.1-1145-ఉ.]

4224} యాదవవంశపయోధిచంద్రుడు  - యాదవవంశము అను సముద్రమున (ఉప్పొంగుట)కు చంద్రుని వంటి వాడు. :-
[10.2-750-ఉ.]

4225} యాదవవల్లభుఁడు  - యాదవులకు ప్రియమైనవాడు, కృష్ణుడు :-
[1-410-క.]

4226} యాదవసింహము  - యదువంశమున సింహము వంటి వాడు, బలరాముడు :-
[10.2-303-వ.]

4227} యాదవులు  - చంద్రవంశలోని నహుషుని కొడుకైన యదువు వంశము వారు, కృష్ణుడు, బలరాముడు :-
[1-396-వ., 10.1-1525-శా.]

4228} యాదవేంద్రుడు  - యాదవుల ప్రభువు, కృష్ణుడు, , బలరాముడు :-
[10.1-1387.1-తే., 10.1-1619-వ., 10.1-1679-వ., 10.1-1783-వ., 11-105-వ.]

4229} యామ  - కాలవిభాగమైన యామమును నిర్ణయించినవాడు, దేవతాయోని :-
[1-63-వ.]

4230} యామినీచరుడు  - రాత్రి తిరుగువాడు, రాక్షసుడు :-
[3-694-క.]

4231} యుగద్వయము  - 1సంవత్సరము 2వయస్సులు :-
[4-771.1-తే.]

4232} యుద్ధధర్మము  - ఆయుధము జారిన లేదా దీనుడైన శత్రువుపైకి వెళ్శరాదు అనెడిది ఒక యుద్ధనీతి :-
[6-411-ఆ.]

4233} యుధిష్ఠిరుడు  - ధర్మరాజు అసలుపేరు, పాండురాజు పెద్దకొడుకు :-
[1-308-వ., 10.2-668-వ.]

4234} యువతి  - యౌవనమున ఉన్నామె, స్త్రీ :-
[1-256-వ.]

4235} యూపదారువు  - యజ్ఞము నందు పశుబంధనార్థము నాటిన పైపట్టలేని కొయ్య (స్తంభము) :-
[4-520-చ.]

4236} యోగమాయ  - యోగింపగల మాయ, అవినాభావముగా భగవంతుని యందు వెలిగెడి అవ్యక్త నామక ప్రకృతి :-
[2-223.1-తే., 10.1-566-ఆ.]

4237} యోగాదేశము  - రుద్రోపదిష్టమైన విష్ణు స్తోత్రము యోగాదేశ స్తోత్రము :-
[4-732-వ.]

4238} యోగి  - యమనియమాది అష్టాంగములు కల యోగాభ్యాసము ప్రధానమార్గముగా కల ఋషి, చిత్తనిరోధముగలవాడు :-
[7-453-వ., 10.2-1195-క.]

4239} యోగికులాబ్ధిచంద్ర  - యోగి (యోగుల) కుల (జనులు అనెడి) అబ్ధి (సముద్రమునకు) చంద్రుడు (చంద్రుని వంటి వాడు), మహాయోగి. :-
[4-635.1-తే.]

4240} యోగిజనంబుడెందము  - యోగుల మనసులో ఉండు వాడు, యోగులకు ఇష్టుడు, విష్ణువు :-
[3-146-మత్త.]

4241} యోగిమానససరోవాసుడు  - యోగి (యోగుల యొక్క) మానస (మనసు లనెడి) సరః (సరస్సు లందు) వాసుడు (నివసించెడివాడు), విష్ణువు :-
[3-922.1-తే., 6-124.1-ఆ.]

4242} యోగిరాజు  - పరమయోగులలో శ్రేష్ఠుడు, విష్ణువు :-
[10.1-566-ఆ.]

4243} యోగివంద్యుడు  - యోగులచే స్తుతింపబడు వాడు, విష్ణువు :-
[10.1-949-క.]

4244} యోగిహృత్పంకజపంకజాప్తుడు  - యోగుల హృదయములను పంకజ (పద్మముల)కు పంకజాప్తుడు (సూర్యుని వంటి వాడు), శివుడు :-
[10.2-315-ఉ.]

4245} యోగీంద్రచేతస్సరోహంస  - యోగీంద్రుల (యోగులలో శ్రేష్ఠుల) చేతస్ ( మనసు) అను సరస్(సరోవరము) న ఉండు హంస, విష్ణువు :-
[3-203-దం.]

4246} యోగీంద్రహృద్వనజాతైకచరిష్ణుడు  - యోగులలో శ్రేష్ఠు లైనవారి హృదయపద్మములందు ముఖ్యుడై చరించువాడు, విష్ణువ :-
[3-148-మ.]

4247} యోగీంద్రహృద్వనవర్తిష్ణుడు  - యోగీంద్రుల హృదయము లనెడి వన (తోటలలో) వర్తిష్ణుడు (మెలగెడువాడు), విష్ణువు :-
[8-105-మ.]

4248} యోగీశుడు  - యోగులకు ప్రభువు, విష్ణువు :-
[10.1-1180.1-ఆ.]

4249} యోగీశ్వరుడు  - యోగులలో ఈశ్వరుడు, కపిలావతారుడు, విష్ణువు :-
[10.1-236-వ., 11-77-వ.]

4250} యోగీశ్వరేశ్వరుడు  - యోగులలో శ్రేష్ఠులను పాలించువాడు, విష్ణువు :-
[2-237-మ., 3-100-వ., 3-753.1-తే., 10.1-975-వ., 10.1-1003-వ., 10.2-1137.1-తే.]

4251} యోజనము  - యోజనమునకు సరైన విలువ పాత దూరమానములతో పాటు ప్రస్తుతము లభించుటలేదు, రకరకముల సమాధానములు అందబాటులో ఉన్నాయి. నాలుగుకోసుల దూరము, పిలుపునకు అందనిది; వాచస్పతము; ఎనిమిది మైళ్ళ దూరం, పది లేక పన్నెండు మైళ్ళ దూరం; తెలుగు వ్యుత్పత్తి కోశం. :-
[5.1-19.1-తే.]

4252} రంకె,ఱంకె  - ఎద్దు అరుపు :-
[10.1-898-క.]

4253} రంగధాముడు  - రంగ (శ్రీరంగము) ధాముడు (నివాసముగా ఉండువాడు), శ్రీరంగనాయకుడు :-
[10.2-952-స్రగ్ద.]

4254} రంతిదేవుడు  - మహాదానశీలి, ఇతని దానశీల మహత్యము వలన ముంగిసకు బంగారు శరీరము వచ్చినది, భరధ్వాజుని మనుమడైన నరుని మనుమడు. :-
[2-204.1-తే.]

4255} రంభాదికాంతలు  - అప్సరసలు (రంభ ఊర్వశి తిలోత్తమ అలంబుస మున్నగువారు ) :-
[10.1-107-క.]

4256} రంభాదులు  - రంభమున్నగువారు, ఏకత్రిశంతి యప్సరసలు :-
[10.1-485-వ.]

4257} రక్కసులగొంగచక్రము  - రాక్షసుల గొంగ (శత్రువు) చక్రము, విష్ణుచక్రము :-
[9-139-వ.]

4258} రక్షించెదవు  - విష్ణుమూర్తి రూపమున సత్వదుణముతో లోకములను పాలించెదవు :-
[10.1-1180.1-ఆ.]

4259} రక్షితకరి  - రక్షిత (కాపాడబడిన) కరి (గజేంద్రుడు గలవాడు), విష్ణువు :-
[6-33-క.]

4260} రక్షోగణభోజనము  - రాక్షస గణములచే భుజింపబడు శిక్షలు, నరక విశేషము :-
[5.2-136-వ.]

4261} రక్షోనాథసంహర్తుడు  - రక్షస్ (రాక్షసుల యొక్క) నాథ (రాజులను) సంహర్తుడు (చంపెడి వాడు), విష్ణువు :-
[10.1-876-మ.]

4262} రక్షోవంశాధీశ్వరుడు  - రక్షః (రాక్షస) వంశా (కులమునకు) అధీశ్వరుడు (ప్రభువు), హిరణ్యకశిపుడు :-
[7-161-క.]

4263} రక్షోవిభుడు  - రక్షః (రాక్షస) విభుడు (ప్రభువు), హిరణ్యకశిపుడు :-
[7-84-వ.]

4264} రక్షోవైరి  - రాక్షసుల వైరి (శత్రువు), విష్ణువు :-
[3-697-వ., 10.1-1348-వ.]

4265} రక్షోహంత  - రక్షః (రాక్షసులను) హంత (సంహరించువాడు), విష్ణువు :-
[3-665-మ., 10.1-666-శా.]

4266} రఘుకులతిలకుడు  - రఘుకుల (రఘువంశమునకు) తిలకుడు (వన్నె తెచ్చినవాడు), రాముడు. :-
[7-480-క., 11-125-క.]

4267} రఘుకులరాముడు  - రఘు వంశపు రాముడు. :-
[3-1-క.]

4268} రఘుపుంగవుడు  - రఘువంశములో శ్రేష్ఠుడు, రాముడు :-
[9-354-వ.]

4269} రఘుప్రవరుడు  - రఘువు యొక్క ప్రవర (వంశము)లో పుట్టినవాడు, రాముడు :-
[9-308-ఉ.]

4270} రఘువరుడు  - రఘు వంశపు శ్రేష్ఠుడు, రాముడు :-
[9-332-వ.]

4271} రఘువు  - సూర్యవంశపు మహారాజు దిలీపుని పుత్రుడు, వీరి పేరనే రాఘవరాముడు :-
[2-204.1-తే.]

4272} రఘుసత్తముడు  - రఘువంశ శ్రేష్ఠుడు, శ్రీరాముడు :-
[10.2-1340-చ.]

4273} రజకుడు  - బట్టలు ఉతుకువాడు, రజత్ (తెల్లగా మెరయుట) చేయువాడు, చాకలి :-
[10.1-1257-వ.]

4274} రజతగిరిపతి  - రజతగిరి (కైలాసపర్వతము) పై నుండు పతి (ప్రభువు), శివుడు :-
[11-72.1-తే.]

4275} రజతభూధరము  - రజత (వెండి, తెల్లని) భూధరము (కొండ), కైలాసపర్వతము :-
[6-489-క.]

4276} రజతాచలము - రజతము (వెండి వలె తెల్లగా ఉండెడి) అచలము (కొండ), కైలాసపర్వతము కైలాసపర్వతము. :-
[10.2-601-వ.]

4277} రజతాద్రి  - వెండి కొండ, కైలాస పర్వతము :-
[3-413.1-తే.]

4278} రజని  - రాత్రి :-
[5.2-62-వ.]

4279} రజనీనాథుడు  - రాత్రికి ప్రభువు, చంద్రుడు :-
[10.2-354-మ.]

4280} రజనీశుడు  - రాత్రికి నాయకుడు, చంద్రుడు :-
[10.2-949-క.]

4281} రజోగుణవిహీనుడు  - రజోగుణము లేనివాడు, విష్ణువు :-
[3-145.1-తే.]

4282} రణత్  - శబ్దముచేయుచున్న, గజ్జలు శబ్దము :-
[3-726.1-తే.]

4283} రతీశ్వరుడు  - 1. మాయాదేవిగా ఉన్న రతీదేవి భర్త, ప్రద్యుమ్నుడు (మన్మథుని అవతారం), 2. రతీదేవి భర్త, మన్మథుడు. :-
[10.2-454.1-తే.]

4284} రత్నగర్భ  - రత్నములు గర్భమునగలది, సముద్రము :-
[8-224.1-తే.]

4285} రత్నగర్భుడు  - రత్నములు గర్భమున గలవాడు, సముద్రుడు :-
[3-290-మ.]

4286} రత్నాకరము  - రత్నములు ఉండు స్థానము, సముద్రము :-
[10.1-700-వ.]

4287} రత్నాకరుడు  - రత్నముల సమూహము కలవాడు, సముద్రుడు :-
[4-266-క.]

4288} రథము  - 1. వాహనవిశేషము, తేరు, 2. దేహము, 3. పురంజనోపాఖ్యానంలో రథము దేహమునకు సంకేతము, 4. బృహస్పతిరథము నీతిఘోషము, అర్జునునిరథము నందిఘోషము, విష్ణురథము శతానందము :-
[4-771.1-తే.]

4289} రథము(ప్ర)  - అరదము (వి) :-
[10.2-1174-వ.]

4290} రథాంగపాణి  - రథాంగ (చక్ర) పాణి (చేత ధరించినవాడు), కృష్ణుడు :-
[10.2-433-వ.]

4291} రథాంగము  - రథముయొక్క అంగము (భాగము) వలె ఉండునది, చక్రము :-
[3-679-వ.]

4292} రథి  - రథమునెక్కి యుద్ధము చేయు యోధుడు, (మహారథుడు పదకొండువేలమంది (11000) విలుకాండ్రతో పోరాడెడి యోధుడు, తనను సారథిని గుఱ్ఱములను కాపాడుకొనుచు పోరాడెడి యోధుడు 2)అతిరథుడు పెక్కువిలుకాండ్రతో పోరాడెడి యొధుడు 3)సమరథుడు ఒకవిలుకానితో సరిగనిలిచి పోరాడెడి యోధుడు 4)అర్ధరథుడు ఒక్కవిలుకానితో పోరాడెడి యోధుడు) :-
[6-370-వ., 10.2-842-చ.]

4293} రథికులు  - రథముపై నుండి యుద్ధము చేయు వీరులు :-
[1-216-వ.]

4294} రమణి  - రమ్యము (మనోజ్ఞము) ఐనామె, క్రీడించునామె, క్రీడింపదగినామె, స్త్రీ, :-
[3-789-క., 4-778-ఉ., 4-788-చ., 9-18-ఆ., 10.1-806-శా., 10.1-1091-మ., 10.1-1472.1-తే.]

4295} రమణుడు  - మనోజ్ఞమైన వాడు, కృష్ణుడు :-
[10.1-1050-ఆ.]

4296} రమాధినాథుడు  - రమ (లక్ష్మీదేవి)కి అధినాథుడు (భర్త), విష్ణువు :-
[7-22-క.]

4297} రమాధిపుడు  - రమ (లక్ష్మీదేవి) యొక్క అధిపుడు (భర్త), విష్ణువు :-
[2-214-మ., 4-189-చ.]

4298} రమాధీశుడు  - రమ (లక్ష్మీదేవి) అధీశుడు (భర్త), విష్ణువు :-
[2-219-మ., 2-275-మ., 3-203-దం.]

4299} రమాధీశ్వరుడు  - రమ (లక్ష్మీదేవి)కి అధీశ్వరుడు (భర్త), విష్ణువు :-
[3-779-క.]

4300} రమానాథుడు  - లక్ష్మీదేవికి భర్త, విష్ణువు :-
[10.1-1485-వ.]

4301} రమాపతి  - రమ (లక్ష్మీదేవి యొక్క) పతి (భర్త), విష్ణువు. :-
[3-174-క., 3-186-క., 4-892-చ., 11-16-మత్త.]

4302} రమామండనుడు  - రమ (లక్ష్మీదేవి)చే మండనుండు (అలంకారముగా గలవాడు), విష్ణువు :-
[3-45-ఉ.]

4303} రమామనోహరుడు  - రమ (లక్ష్మీదేవి) మనోహరుడు (భర్త), విష్ణువు :-
[4-307-చ.]

4304} రమారమణీమణి  - రమ (లక్ష్మీ) అను రమణీ (స్త్రీలలో) మణి (ఉత్తమురాలు), లక్ష్మీదేవి :-
[3-595-ఉ.]

4305} రమారమణీసుమనోహరుడు  - రమారమణి (లక్ష్మీదేవి) సుమనోహరుడు (భర్త), విష్ణువు :-
[4-438-కవి.]

4306} రమాలలనాకళత్రుడు  - లక్ష్మీదేవిని కళత్రుడు (భర్త), విష్ణువు. :-
[4-286.1-తే.]

4307} రమావరుడు  - రమ+వరుడు లక్మీదేవిభర్త, విష్ణువు :-
[2-97-చ., 3-103-చ.]

4308} రమావిభుడు  - రమా (లక్ష్మీదేవి యొక్క) విభుడు (భర్త), విష్ణువు :-
[3-665-మ.]

4309} రమాసతీహృదయహారి  - రమాసతి (లక్ష్మీదేవి) హృదయమునకు మనోహరుడు, విష్ణువు :-
[3-335-ఉ.]

4310} రమాహృదయేశుడు - రమ (లక్ష్మీదేవి) హృదయమునకు ప్రభువు, విష్ణువు :-
[4-285-చ., 10.2-647-ఉ.]

4311} రమాహృదీశుడు  - రమ (లక్ష్మీదేవి)కి హృదీశుడు (భర్త), విష్ణువు :-
[4-937-త.]

4312} రమేశుడు  - రమ (లక్ష్మీదేవి)కి భర్త, విష్ణువు. :-
[2-105-ఉ., 2-121.1-తే., 3-302-తే., 3-748-క., 4-193.1-తే., 4-550-చ., 6-152-మ., 8-725-ఉ., 10.2-752-చ., 11-66-చ.]

4313} రమేశ్వరుడు  - రమ (లక్ష్మీదేవి)కి భర్త, విష్ణువు. :-
[3-433-చ., 3-599-ఉ., 4-509.1-తే., 5.2-117-చ., 8-186-క.]

4314} రమ్యము - రమ్యతరము రమ్యతమము :-
[10.1-997.1-ఆ.]

4315} రవి  - కిరణములు కలవాడు, రూయతేస్తూ యత ఇతి రవిః, సూర్యుడు :-
[4-426-క., 10.1-1131-మ.]

4316} రవికులాబ్ధిచంద్రుడు  - సూర్య వంశము అనెడి సముద్రమునకు చంద్రుని వంటివాడు, రాముడు :-
[9-355-ఆ.]

4317} రవిసుత  - సూర్యుని పుత్రిక, యమున :-
[10.1-1481-శా.]

4318} రవిసుతుడు  - రవి (సూర్యుని) సుతుడు (కుమారుడు), శనీశ్వరుడు, యముడు :-
[5.2-91-క.]

4319} రసాతనయాహృదయాబ్జరంజనుడు  - రసాతనయ (సముద్రునికూతురైన లక్ష్మీదేవి) యొక్క హృదయ (హృదయముయనెడి) అబ్జ (పద్మమును) రంజనుడు (రంజింపజేయువాడు), రాముడు :-
[7-482-చ.]

4320} రసాతలము  - పాతాళాది సప్త అధోలోకములు యందలి ఒక లోకము :-
[3-435-చ.]

4321} రహస్యము  - దాచుకొనదగ్గది :-
[1-66-ఆ., 1-68-చ.]

4322} రాకా  - పూర్ణిమా భేదము, నిండుపున్నమి, సంపూర్ణ కళలుగల చంద్రునితోగూడిన పౌర్ణమి :-
[4-25-క., 5.2-62-వ., 6-507-వ.]

4323} రాకేందుయశోవిశాలుడు  - రాకేందు (నిండు పున్నమి చంద్రుని) వంటి యశః (కీర్తి) విశాలుడు (విరివిగా కలవాడు), రాముడు :-
[10.1-1-క.]

4324} రాక్షసకులాంతకుడు  - రాక్షస కుల (వంశమును) అంతకుడు (నాశనముచేయువాడు), విష్ణువు :-
[7-153-చ.]

4325} రాక్షసము  - బలాత్కారమున కన్యను అపహరించి వివాహమాడు పద్ధతి. ఇది అష్టవిధవివాహములు యందు ఒకటి. రాక్షస వివాహంలో ఉన్న రాక్షసం కన్య పెద్దల అంగీకారంతో సంబంధంలేకుండా, అంగీకరించిన కన్యను ఎత్తుకు వచ్చి వివాహమాడుట వరకు. కన్య అంగీకారంతో కూడ సంబంధలేకుండా చేసేది పైశాచికం. :-
[10.1-1683-వ.]

4326} రాక్షసుడు  - ప్రమాణము శ్లో:: వృక్షాన్ ఛిత్వా పశూన్ హత్వా కృత్వా రుధిరకర్దమం: బ్రాహ్మణావ యమిత్యేవం మౌస్యంతే రాక్షసాః కలౌ: రాక్షసాః కలిమాశ్రిత్య జాయంతే బ్రహ్మయోనిషు: బ్రాహ్మణానేవ బాధంతే పరిత్యక్తాఖిలాగమాః :-
[2-274.1-తే., 10.1-727-వ.]

4327} రాక్షసుడు(ప్ర)  - రక్కసుడు(వి) :-
[10.2-20-వ.]

4328} రాగద్వేషములు  - 1రాగము 2ద్వేషము 3కామము 4క్రోధము 5లోభము 6మోహము 7మదము 8మాత్సర్యము 9ఈర్ష్య 10అసూయ 11దంభము 12దర్పము 13అహంకారము :-
[10.1-575-క., 10.2-1177.1-తే., 10.2-1232.1-తే.]

4329} రాగద్వేషాదిశూన్యుడు  - రాగము ద్వేషము మున్నగునవి లేనివాడు, విష్ణువు :-
[5.2-55-వ.]

4330} రాగద్వేషాదులు  - 1రాగము 2ద్వేషము 3కామము 4క్రోధము 5లోభము 6మోహము 7మదము 8మాత్సర్యము 9ఈర్ష్య 10అసూయ 11దంభము 12దర్పము 13అహంకారము :-
[7-241-వ., 7-465-వ., 10.1-31-ఆ.]

4331} రాగవైరాగ్యోపాధులు  - వేదాంతశాస్త్ర సాంకేతిక పదాలు. రాగముతో అనురక్తులగుదురు, వైరైగ్యము రాగ రాహిత్యము విరక్తి, ఉపాధి ధర్మచింత ఆధారము కారణము ఆధారము :-
[1-216-వ.]

4332} రాఘవరాముడు  - రాఘవ (రఘు వంశమునకు చెందిన) రామ, శ్రీరామ. :-
[4-1-క., 8-743-క.]

4333} రాఘవుడు  - రఘువంశమున పుట్టినవాడు, రాముడు :-
[2-169-మ., 2-170-క., 9-274-క.]

4334} రాఘవేంద్రుడు  - రఘువంశపు ప్రభువు, రాముడు :-
[9-311-వ., 9-321.1-తే.]

4335} రాచపూబోడి  - రాచ (రాజ) పూబోడి (స్త్రీ), రాకుమారి :-
[9-25-వ.]

4336} రాజకులావతంసుడు  - రాజ (చంద్ర) కులా (వంశమున) అవతంసుడు (సిగబంతివలె శ్రేష్ఠుడు), కృష్ణుడు :-
[10.2-206-ఉ.]

4337} రాజకులైకవిరాముఁడు  - రాజ (రాజుల) కుల (వంశమునకు) ఏక (సమస్తమును) విరాముడు (తొలగించువాడు), పరశురాముడు :-
[6-305-క.]

4338} రాజకొడుకు  - రాజ (చంద్రుని) కొడుకు, బుధుడు :-
[9-26-ఆ.]

4339} రాజత్వము  - రాజు అను తత్వము, భావము :-
[1-63-వ.]

4340} రాజధరార్చితుడు  - రాజధరుని (చంద్రధరుడైన శివుని)చే అర్చితుడు, శ్రీరాముడు :-
[8-743-క.]

4341} రాజధాని  - రాజుండెడిపట్టణము, ముఖ్యపట్టణము :-
[10.1-1467.1-తే.]

4342} రాజముఖి  - రాజ (చంద్రునివంటి) ముఖి (మోములుగలస్త్రీ), సుందరి :-
[9-180-క., 9-398-ఆ.]

4343} రాజరాజు  - రాజ (వైభవములకు) రాజు అధిపతి, కుబేరుడు :-
[4-442.1-తే.]

4344} రాజర్షి  - వైదిక సంప్రదాయ అనువర్తి యైన రాజు :-
[1-78-వ., 1-142-వ., 1-411-వ.]

4345} రాజవదన  - రాజు (చంద్రునివంటి) వదన (మోముగలామె), సుందరి :-
[9-26-ఆ.]

4346} రాజశేఖరుడు  - రాజులలో (శ్రేష్ఠమైనవాడు), రాముడు :-
[4-974-చ.]

4347} రాజసూయము  - ఒకరాజు తక్కిన రాజులను జయించి చేసెడి యజ్ఞము :-
[7-9-వ.]

4348} రాజస్తుత్యుడు  - రాజులచేత స్తుతింపబడువాడు, శ్రీరాముడు :-
[8-743-క.]

4349} రాజాన్వయుడు  - రాజ (చంద్ర) అన్వయుడు (వంశమువాడు), ఉద్ధవుడు :-
[10.1-1452-శా.]

4350} రాజావతంసుడు  - రాజులందరిలోను తలమానికమైనవాడు, శ్రీరాముడు :-
[8-743-క.]

4351} రాజితఫణివిభూషణుడ  - విరాజిల్లుతున్న నాగులతో చక్కగ అలంకరింపబడినవాడు, శివుడు. :-
[4-147.1-తే.]

4352} రాజీవదళనేత్ర  - రాజీవదళ (పద్మదళముల వంటి) నేత్ర (కన్నులు గలామె), అందగత్తె :-
[9-26-ఆ.]

4353} రాజీవభవాదిదేవరాజివినుతుడు  - రాజీవభవ (బ్రహ్మదేవుడు) ఆది (మున్నగు) దేవ (దేవతల) రాజి (సమూహములచే) నుతుడు (స్తుతింపబడినవాడు), రాముడు :-
[7-480-క.]

4354} రాజీవభవుడు  - రాజీవము (ఎఱ్ఱకలువ) యందు భవ (పుట్టిన) వాడు, బ్రహ్మదేవుడు :-
[3-331-తే., 3-381-ఉ., 3-411-తే., 3-791-క.]

4355} రాజీవము  - రాజును (చంద్రుని) అనుసరించి జీవించునది, పద్మము :-
[10.2-7-క.]

4356} రాజీవరాజపూజ్యశ్రీజితగోపీకటాక్షసేవాంతరవిభ్రాజితమూర్తి  - రాజీవ (తామరపూలలో) రాజ (శ్రేష్ఠమైనవానిచే) పూజ్య (అర్చిందగిన) శ్రీ (వైభవమును) జిత (నెగ్గెడి) గోపీ (గోపికల) కటాక్ష (కడగంటి చూపు లనెడి) సేవ (సేవించుట యందలి) అంతరము (గొప్పదనముచే) విభ్రాజిత (ప్రకాశించెడి) మూర్తి (స్వరూపమ), విష్ణువు :-
[6-528-క.]

4357} రాజీవసంభవుడు  - రాజీవము (పద్మము) న సంభవుడు (పుట్టిన వాడు), బ్రహ్మదేవుడు :-
[3-395.1-తే.]

4358} రాజీవసదృశనయనుడు  - రాజీవ (పద్మముల) సదృశ (వంటి) నయన (కన్నులు కలవాడు), రాముడు :-
[11-125-క.]

4359} రాజీవసదృశలోచనుడు  - రాజీవ (తామరల) సదృశ(వంటి) లోచనుడు, కన్నులుగలవాడు, రాముడు :-
[7-480-క.]

4360} రాజీవాక్షుడు  - రాజీవ (కలువలవంటి) అక్షుడు (కన్నులు కలవాడు), కృష్ణుడు, విష్ణువు :-
[3-409-క., 10.1-559-క., 10.1-924-క., 10.2-128-క.]

4361} రాజీవేక్షణ  - రాజీవ (కలువలవంటి) ఈక్షణ (కన్నులు కలామె), పద్మాక్షి, స్త్రీ :-
[10.1-1499-క.]

4362} రాజు  - రజియింతి రాజః, రంజింపజేయువాడు రాజు, పరిపాలకుడు :-
[10.2-46-వ., 10.2-147-చ.]

4363} రాజేంద్రచంద్రుడు  - రాజులలో ఇంద్రుని వంటి చంద్రుని వంటి వాడు, మహారాజు. :-
[10.2-1329.1-తే.]

4364} రాజేంద్రుడు  - రాజులలో ఇంద్రుని వంటివాడు, మహారాజు, శ్రీరాముడు :-
[8-743-క., 10.1-581-క.]

4365} రాజ్యము  - 1స్వామి 2అమాత్య 3సుహృత్త్ 4కోశ 5రాష్ట్ర 6దుర్గ 7బలంబులు అనెడి సప్తాంగములు కలది :-
[10.1-1643-మ.]

4366} రాధేయుడు  - రాధపుత్రుడు, కర్ణుడు :-
[10.2-1092-క.]

4367} రామ  - రమించెడి ఆమె, రమింప జేయునట్టి స్త్రీ, సుందరి :-
[4-777-క., 9-182-క., 10.1-792-మ., 10.1-1089-క., 10.1-1461-శా.]

4368} రామచంద్రనరేంద్రుడు  - రాముడనెడి చంద్రునివంటివా డైన నరేంద్రుడు (రాజు), రాముడు. :-
[9-1-క.]

4369} రామచంద్రమహీశుడు  - రామచంద్రుడనెడి మహీశుడు (రాజు), రాముడు. :-
[12-1-క.]

4370} రామచంద్రుడు  - రాముడు అను చక్కటి (చల్లటి) వాడు. :-
[2-171.1-తే.]

4371} రామనరేంద్రుడు  - రాముడు అనెడి నరేంద్రుడు (రాజు), రాముడు. :-
[10.2-1-క.]

4372} రామనృపాలుడు  - రాముడు అను రాజు. :-
[11-1-క.]

4373} రామభద్రుడు  - చక్కటి భద్రతను ఇచ్చువాడు, రాముడు :-
[2-163-క.]

4374} రామరాజాఖ్యనిధీ  - రామరాజు (రామరాజు) ఆఖ్య (పేరును) నిధి (ఆశ్రితులకు నిధిగా ఇచ్చినవాడ), విష్ణువు. :-
[6-528-క.]

4375} రామవినోదుడు  - రామ (పరబ్రహ్మము, ప్రమాణము శ్లో. రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని, ఇతి రామపదేనాసౌ పరబ్రహ్మాభియతే.) అందు వినోదించువాడు, పరీక్షిత్తు. :-
[10.1-1089-క.]

4376} రామాజనకాముడు  - రామా (రమించునట్టి వారైన, స్త్రీ జన (జనులకు) కాముడు (మన్మథుని వంటివాడు, కోరబడు వాడు), రాముడు :-
[8-1-క.]

4377} రామాజనము  - రామా (ఆనందమును) ఇచ్చువారైన జనము, స్త్రీలు :-
[4-777-క.]

4378} రామానుజుడు  - బలరాముని తోబుట్టువు, కృష్ణుడు :-
[10.1-1089-క.]

4379} రాముడు  - శ్రు:: రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని: ఇతి రామ పదేనాసౌ పరబ్రహ్మాభియతే, పరమానందము నిచ్చెడి పరబ్రహ్మ :-
[10.1-728-క.]

4380} రామునిసహజన్ముడు  - బలరాముని యొక్క సోదరుడు, కృష్ణుడు :-
[10.1-728-క.]

4381} రావణుడు  - రవము కలవాడు, వ్యు. రు+ణిచ్+ల్యుట్, రావయతి భీషయతి శత్రూన్ శత్రువులను భయపెట్టువాడు. :-
[4-26-వ.]

4382} రాష్ట్రాధిపతి  - రాష్ట్రము (దేశము, దేహము)నకు అధిపతి :-
[4-421-వ.]

4383} రాసకేళి  - ఒకరి చేతులొకరు పట్టుకొని గుండ్రముగ పాటలకు లయబద్దముగ తిరుగు నాట్యవిశేషము, జంటలు జంటలుగ ఉండి వర్తులాకారముగా మెలగుచు చేసెడి నృత్యవిశేషము :-
[2-188.1-తే.]

4384} రాసము  - ఒకరి చేతులొకరు పట్టుకొని గుండ్రముగ పాటలకు లయబద్దముగ తిరుగు నాట్యవిశేషము, జంటలు జంటలుగ ఉండి వర్తులాకారముగా మెలగుచు చేసెడి నృత్యవిశేషము :-
[10.1-1084-వ.]

4385} రాసలీలలు  - ఒకరి చేతులొకరు పట్టుకొని గుండ్రముగ పాటలకు లయబద్దముగ తిరుగు నాట్యవిశేషము, జంటలు జంటలుగ ఉండి వర్తులాకారముగా మెలగుచు చేసెడి నృత్యవిశేషము, నిరంతర సంసార (జన్మ మరణ) చక్ర భ్రహణమునకు సంకేతము. :-
[3-91-వ.]

4386} రాహిత్యులు  - రహితములు కలవారు, లేనివారు, ఉదా. శోభనరాహిత్యులు :-
[2-198-మ.]

4387} రిక్త(ప్ర)  - రిత్త (వి), శూన్యమైనది, వట్టి :-
[10.2-752-చ.]

4388} రిపుమానవిమర్దనుడు  - రిపు (శత్రువుల) మాన (అభిమాన)మును విమర్దనుడు (బాగుగ అణచువాడు), విష్ణువు :-
[3-666-చ.]

4389} రుక్మవతి  - రుక్మిణి అన్న యైన రుక్మి కూతురు :-
[10.2-281.1-తే.]

4390} రుక్మి  - రుక్మిణి అన్న, రుక్మిణి వివాహ సమయమున అవమానం చెందిన ఆమె పెద్దన్న, రుక్మి కూతురు రుక్మవతి ప్రద్యుమ్నుని భార్య, రుక్మి మనవరాలు రుక్మలోచన అనిరుద్ధుని భార్య :-
[2-190-చ., 10.1-1729-ఉ., 10.2-279-వ.]

4391} రుక్మిణి  - రుక్మమస్యాసీతి రుక్మిణి (వ్యుత్పత్తి), సువర్ణి :-
[10.1-1687-చ., 10.1-1725-క.]

4392} రుచి  - 1. ప్రకాశము, దృశ్యప్రపంచ రూపమైన ఇదంవృత్తి 2. చవి, నాలుక స్పర్శజ్ఞానము, 3. ఇచ్చ, 5. రుచి ప్రజాపతి :-
[4-3.1-తే., 10.1-682.1-తే.]

4393} రుచిరము - రుచిరతరము రుచిరతమము :-
[11-72.1-తే.]

4394} రుచులునాలుగు  - తీపి, పులుపు, కారము, చేదు. :-
[10.1-91.1-తే.]

4395} రుద్రగణములు  - రౌద్రస్వభావము కల సమూహములు, రుద్రుని పరిచరులు :-
[3-371-ఉ.]

4396} రుద్రపారిషదులు  - రుద్రుని అనుచరులు, రుద్రగణములు :-
[3-215-వ.]

4397} రుద్రాణి  - రుద్రుని (శివుని) రాణి (భార్య), పార్వతి :-
[4-751.1-తే.]

4398} రుద్రుడు  - రౌద్ర రూపము కల వాడు, వ్యుత్పత్తి. రుద్ సాంసార దుఃఖం ద్రావయతి నాశయతీతి రుద్రః. సంసారదుఃఖమును నశింపజేయువాడు, శివుడు :-
[3-215-వ., 3-473-వ., 4-47-వ., 4-54-వ., 4-159-క., 4-357-వ., 4-695-మ., 4-703.1-తే., 4-732-వ., 7-307-వ., 9-78-వ., 10.2-1243-క.]

4399} రుద్రునిఏకాదశస్థానములు  - 1 చంద్రుడు 2 సూర్యుడు 3 అగ్ని 4 వాయువు 5 జలము 6 ఆకాశము 7 భూమి 8 ప్రాణములు 9 తపస్సు 10 హృదయము 11 ఇంద్రియములు. :-
[3-369-తే.]

4400} రూపవతులు  - (మంచి) రూపము కల వారు, అందగత్తెలు :-
[2-173.1-తే.]

4401} రెండుమూడమ్ములయేటుకాడు  - ఐదు (2+3) బాణముల వాడు, పంచబాణుడు, మన్మథుడు :-
[10.1-1058-ఉ.]

4402} రేచకము  - ప్రాణవాయువు ముక్కుద్వారా బయటకు పంపుట, ఒక ప్రాణాయామ ప్రక్రియ :-
[3-921-వ.]

4403} రేచితఅంగహారము  - వేళ్ళ కదలికలతో సూచించునవి, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

4404} రేతఃపానము  - ఇంద్రియమును తాగించెడి శిక్షలు, నరక విశేషము :-
[5.2-136-వ.]

4405} రొప్పుట  - గట్టిగా ఆయాసము వలె శబ్దము చేస్తూ ఊపిరి తీయుట :-
[3-413.1-తే.]

4406} రోచనుడు  - (కంటికి) వెలుగు యైనవాడు, యజ్ఞుడు దక్షిణల పన్నెండు మంది కొడుకులలో చిన్నవాడు :-
[4-6-వ.]

4407} రోచిష్ణుడు  - ప్రకాశించెడి స్వభావము గల వాడు, విష్ణువు. :-
[2-236-మ., 3-148-మ., 8-105-మ.]

4408} రోలంబము.  - రోడ్బ అంటే ఉన్మాదం, అంబచ్ అంటే కలది కనుక మకరందాలు మిక్కిలిగా త్రాగి మదించేది తుమ్మెద రోలంబము. :-
[10.1-1462-శా.]

4409} రోలు  - ధాన్యాదులను దంచుటకైన గుండ్రటి రాతి లేదా కఱ్ఱ సాధనము, రోలు యందు పోస్తూ రోకలితో దంచుతారు. :-
[10.1-310-మత్త.]

4410} రోహిణీవిభుడు  - రోహిణి (27 నక్షత్రములలోను ఒకటి, రోహిణి దక్షుడు చంద్రునికి ఇచ్చిన ఇరవైఏడుగురు పుత్రికలలో చిన్నది, చంద్ర కళలకు కారణం ఈమె అంటే చంద్రునికి గల బహు ప్రీతి అంటారు) యొక్క విభుడు, చంద్రుడు :-
[8-115-మ.]

4411} రౌక్మిణేయుడు  - రుక్మిణి కొడుకు, ప్రద్యుమ్నుడు :-
[10.2-842-చ.]

4412} రౌద్రము  - భయంకరమైన తీక్షణమైన కోపము వంటి నవరసములలోని ఒక రసము :-
[3-371-ఉ.]

4413} రౌరవములు  - రురురూపమున కల ప్రాణులచేత బాధింప పెట్టునవి, నరక విశేషములు :-
[5.2-136-వ., 5.2-140-వ., 5.2-140-వ.]

4414} లంకేశాసురసంహారచతురుడు  - లంకేశ్వరుని (రావణాసురుని) సంహరించుటలో చతురుడు, రాముడు :-
[11-1-క.]

4415} లంకేశుడు  - లంకకు ప్రభువు, రావణుడు :-
[9-432-మ.]

4416} లంబోదరుడు  - లంబ (దీర్ఘమైన, వ్రేలాడెడి) ఉదరుడు (పొట్ట గలవాడు), విఘ్నేశ్వరుడు :-
[6-4-ఉ.]

4417} లక్షణవతులు  - శుభలక్షణములు కల స్త్రీలు :-
[10.1-849.1-ఆ.]

4418} లక్షణాంగి  - శుభలక్షణములుగల అవయవములు గలామె, సౌభాగ్యవతి :-
[9-373-ఆ.]

4419} లక్ష్మీకాంతుడు  - లక్ష్మీదేవి యొక్క కాంతుడు (భర్త), విష్ణువు :-
[6-210-వ., 6-307-వ.]

4420} లక్ష్మీకాముడు  - లక్ష్మీదేవిచే కాముడు (కోరబడువాడు), విష్ణువు :-
[3-592-క.]

4421} లక్ష్మీనాథుడు  - లక్ష్మీదేవికి భర్త, విష్ణువు :-
[3-431-మ., 7-242-క., 10.2-408-శా.]

4422} లక్ష్మీపతి  - లక్ష్మీ యొక్క పతి, విష్ణువు :-
[3-310-క., 3-407.1-తే., 10.1-1237-మ.]

4423} లక్ష్మీమనఃపల్వలక్రోడ  - లక్ష్మీదేవి మనసు అను పల్వలము (నీటిగుంట) యందు క్రీడించు క్రేడ (వరాహమూర్తి), విష్ణువు :-
[3-203-దం.]

4424} లక్ష్మీమహిళాథినాథుడు  - లక్ష్మీ మహిళ (దేవి) అథినాథుడు (పతి), విష్ణువు :-
[3-490-ఉ.]

4425} లక్ష్మీయుతవక్షుడు  - లక్ష్మీదేవి వక్షస్థలమున ఉన్నవాడు, విష్ణువు :-
[2-237-మ.]

4426} లక్ష్మీయుతుడు  - లక్ష్మీదేవితో కూడి ఉండువాడు, విష్ణువు :-
[3-145.1-తే.]

4427} లక్ష్మీవరుడు  - లక్ష్మీదేవి భర్త, విష్ణువు :-
[4-367.1-తే.]

4428} లక్ష్మీశుడు  - లక్ష్మీదేవికి ఈశుడు (భర్త), విష్ణువు :-
[3-795.1-తే., 3-935-మ., 6-414.1-తే.]

4429} లక్ష్మీశ్వరుడు  - లక్ష్మీ ఈస్వరుడు (పతి), విష్ణువు :-
[3-373-మ.]

4430} లక్ష్మీసంభావ్యుడు  - లక్ష్మీదేవి చేత సంభావ్యుడు (సేవింప దగినవాడు), విష్ణువు :-
[7-5-శా.]

4431} లఘు - లఘుతర లఘుతమ :-
[7-336-క.]

4432} లజ్జావతి  - లజ్జ (సిగ్గు) కలామె, స్త్రీ :-
[3-816-క.]

4433} లతాంగి  - లతల వంటి సున్నిత దేహము కల స్త్రీ :-
[2-117.1-తే., 4-35.1-తే., 4-661.1-తే., 5.1-33-క., 9-479-మ., 10.1-216-మ., 10.1-311-క., 10.1-977-శా., 10.1-1007-ఉ., 10.1-1036-మ.]

4434} లతాతన్వి  - లతల వంటి సున్నిత దేహము కల స్త్రీ :-
[10.1-1488-మ.]

4435} లయ  - నృత్త గీత వాద్యముల మూడింటి సామ్యము, తాళము యొక్క కాలము :-
[10.1-1084-వ.]

4436} లయము  - జీవాత్మ బ్రహ్మాత్మలో లయించుట :-
[1-236-వ.]

4437} లలన  - విలసనశీల యైన స్త్రీ, వ్యు. లల్+ల్యుట్, లాలయతి క్రీడతి తస్య భావః కర్మ వా :-
[3-727-క., 4-758-క., 4-787-క., 4-795-క., 10.1-1131-మ.]

4438} లలాటతిలకకరణము  - మొగము చిట్లించుట ద్వారా కనుబొమల వెంట్రుకలు నుదిటిబొట్టువలె కనబడ చేయుట, రాసక్రీడా పారిభాష పదం :-
[10.1-1084-వ.]

4439} లలాటనేత్రుడు  - నుదుట కన్ను కలవాడు :-
[2-158.1-తే.]

4440} లలాటోగ్రాక్షుచాపము  - లలాట (నుదుట) ఉగ్ర (భయంకరమైన) అక్షున్ (కన్నుగలవాని) (శివుని) చాపము (విల్లు), శివధనుస్సు :-
[9-262-మ.]

4441} లలితచూడ్కులు  - మనోహరభ్రూవిలాసాదులు కల చూపులు, రాసక్రీడా పారిభాషిక పదం :-
[10.1-1084-వ.]

4442} లలితదైవమండలము  - చేతులను మీదికి చాచి తిన్నగాను చక్కగాను తిప్పుట, రాసక్రీడా పారిభాషిక పదం :-
[10.1-1084-వ.]

4443} లలితబాలేందుకళామౌళి  - మనోజ్ఞమైన బాలచంద్రుని రేఖతోడి శిఖ కలవాడు, శివుడు :-
[10.2-443.1-తే.]

4444} లలితశ్రీవత్సలక్ష్మాంగుడు  - లలిత (సుందరమైన) శ్రీవత్సము అనెడి లక్ష్యము (పుట్టుమచ్చ కల) దేహము కలవాడు, విష్ణువు :-
[3-574-మ.]

4445} లలితాంగి  - మృదువైన శరీరము కలామె, స్త్రీ :-
[10.1-340-క.]

4446} లసద్భూతవర్తి  - లసత్ (ప్రకాశిస్తున్న) భూతములు (జీవులు మహాభూతములు) అందును వర్తి (వర్తించువాడు), విష్ణువు :-
[3-203-దం.]

4447} లాంగూలకరభావము  - తోకవలె అనామిక తప్ప తక్కిన వేళ్ళను సగము వంచి ఎడముగలవిగా చేసి అరచేయి పల్లముగా ఏర్పడునట్లు పట్టునది, శ్లో. పద్మకోశేనామికా చేన్నమ్రాలాంగూలకోభవేత్., రాసక్రీడా పారిభాషిక పదం :-
[10.1-1084-వ.]

4448} లాలాభక్షణము  - లాలాజలమును భక్షింపజేయుట, నరక విశేషము :-
[5.2-136-వ.]

4449} లాలిత  - లలి (క్రమము) ప్రకారము చేయునది, ఆనవాయితీ, లల్+క్త, లాలితః స్నిగ్ధః అభిలక్షితః, లాలింపబడినది, లలిత (మనోహరత్వము) కలది :-
[2-183-క.]

4450} లాలితసద్గుణాలంకరిష్ణుడు  - లాలిత (మనోహరత కలిగిన) సద్గుణములచే అలంకరించబడినవాడు, విష్ణువు :-
[3-924.1-తే.]

4451} లింగదేహము  - తనను గుర్తించుకొను కర్మమయ భావమయ దేహము, ప్రజ్ఞా మాత్రమగు సుక్ష్మ శరీరము, పూర్వసంస్కారములచే చేయబడిన దేహము, లింగము (సంజ్ఞ నామ రూపాది)లచే తెలియబడునది :-
[3-918.1-తే., 4-889-వ., 5.1-69-వ., 6-228-తే.]

4452} లింగశరీరభంగము  - లింగశరీరము కల్పాంత ప్రళయమున పరబ్రహ్మములో లీనమగుట, మోక్షము పొందిన వారి లింగశరీరము పరబ్రహ్మములో లీనమగును :-
[2-222-వ.]

4453} లింగశరీరము  - తనను గుర్తించుకొను కర్మమయ భావమయ దేహము, ప్రజ్ఞా మాత్రమగు సుక్ష్మ శరీరము, పూర్వసంస్కారములచే చేయబడిన దేహము, లింగము (సంజ్ఞ నామ రూపాది)లచే తెలియబడునది :-
[1-381-వ., 2-222-వ., 4-355-వ., 4-885-వ., 4-885-వ., 4-885-వ., 7-39.1-ఆ.]

4454} లీల  - ప్రయత్నరహితముగను, లేనిది ఉన్నట్లనిపింప జేయునవి, భగవంతుని క్రీడ, భగవదవతారుని మానుషాతీత, మానుష కార్యములు, :-
[2-248-వ.]

4455} లీలాకారము  - క్రీడకై ధరించిన రూపమును :-
[1-408-క.]

4456} లీలావతి  - 1. హిరణ్యకశిపుని భార్య, ప్రహ్లాదుని తల్లి, 2. సరస్వతిపచ్చ, 3. అందమైన స్త్రీ, 4. దుర్గాదేవి పేరు :-
[7-102-శా.]

4457} లేడగు  - ఎప్పటికి లేనివాడు అగు, మరణించు :-
[10.1-1416-శా.]

4458} లేడు  - దేవుడు త్రికాలములు భూత భవిష్యత్ వర్తమానము లందు లేడు :-
[10.1-683-వ.]

4459} లేమ  - లేత యౌవనము గల స్త్రీ :-
[8-464-ఆ., 10.1-783-శా., 10.1-1096.1-ఆ., 10.2-172-క., 10.2-181.1-ఆ.]

4460} లేహ్యములు  - నాలుక వాడి తినుటకు వీలైనవి, బెల్లపు పాకము, తేనె మొదలగునవి :-
[4-510-వ.]

4461} లోకగురుడు  - ఎల్లలోకములకు గురుడు, తండ్రి, విష్ణువు :-
[4-509.1-తే., 10.2-607-క.]

4462} లోకచక్షువు  - లోకమునకు నేత్రమువంటివాడు, సూర్యుడు :-
[12-41-వ.]

4463} లోకత్రయము  - భూః భువః సువః లోకములు, ముల్లోకములు :-
[4-290-వ., 11-48-వ.]

4464} లోకద్రోహినరేంద్రవంశదహనుడు  - దుష్టరాజవంశముల నాశనము చేయువాడు, కృష్ణుడు :-
[1-201-శా.]

4465} లోకపాలనకలితుడు  - లోకములను పాలించువాడు, శివుడు :-
[4-149.1-తే.]

4466} లోకలోచనుడు  - లోకప్రకాశకులైన సూర్య చంద్రులు కన్నులుగా కలవాడు, విష్ణువు :-
[10.1-1725-క.]

4467} లోకశరణ్యుడు  - లోకములన్నిటికిని శరణ్యము యైనవాడు, విష్ణువు :-
[4-274-క.]

4468} లోకస్తుత్యుడు  - సర్వలోకముల స్తుతింపబడువాడు, విష్ణువు. :-
[8-656-క.]

4469} లోకస్వరూపుడు  - లోక (జగత్తే) స్వరూపుడు (తన రూపమైనవాడు), విష్ణువు :-
[8-483.1-తే.]

4470} లోకాతీతుడు  - భువనములకు అతీతమైనవాడు, శ్రీకృష్ణడు :-
[5.1-1-క.]

4471} లోకాధీశుడు  - లోకా (లోకములన్నిటికి) అధీశ (ప్రభువు), బ్రహ్మదేవుడు :-
[7-90-శా.]

4472} లోకాభినుతుడు  - లోకములచే అభినుతుడు (కీర్తింపబడువాడు), నరసింహుడు :-
[7-347-ఉ.]

4473} లోకాయతికులు  - చార్వాకులు, స్వభావమును అనుసరించి లోకములు ప్రాప్తించుననెడి వారు, లోకాయత మతస్థుఁడు. :-
[1-428-వ.]

4474} లోకాలోకపర్వతము  - లోక (చూడబడునది.) అలోక (చూడబడనిది.) పర్వతము :-
[5.2-73-వ.]

4475} లోకాలోకప్రచార  - లోక (చూడబడునది.) అలోక (చూడబడనిది) రెంటి యందు ప్ర (చక్కగా) చార (వర్తించెడివాడు), లోకాలోక పర్వతముల వరకు ప్రచారము గలవాడు, విష్ణువు :-
[5.2-1-క.]

4476} లోకుడు  - లోకము స్వరూపముగ కలవాడు, విష్ణువు :-
[4-702.1-తే.]

4477} లోకేశుడు  - లోకములకు ప్రభువు, బ్రహ్మదేవుడు :-
[3-173.1-తే., 9-108-శా., 9-517-శా.]

4478} లోకేశ్వరుడు  - లోకములకు ఈశ్వరుడు, కృష్ణుడు :-
[1-201-శా., 5.2-1-క., 10.1-218-శా.]

4479} లోకేశ్వరేశుడు  - లోకేశ్వరుల (సర్వలోకపాలకుల)కు ఈశుడు (ప్రభువు), విష్ణువు. :-
[10.1-939.1-తే.]

4480} లోకైకనాథుడు  - లోకమునకు ఒకడే ఐన ప్రభువు, విష్ణువు :-
[3-244-వ.]

4481} లోకోన్నతుడు  - అణోరణీయాన్ మహతో మహియాన్ (శ్రుతి) కనుక లోకముకంటె ఉన్నతుడు సూక్ష్ముడు, విష్ణువు :-
[10.1-1631.1-ఆ.]

4482} లోన  - శరీరులకు లోపలది, అంతర సంసారము (కామ క్రోధాది) :-
[10.1-8-ఆ.]

4483} లోభము  - వస్తువులు ధనాదులందు అపరిమితంగా సంపాదించుట విడువలేకపోవుట అనెడి చిత్తవృత్తి, పిసినారితనము :-
[10.1-1659-ఆ.]

4484} లోభి, లోభుడు  - పిసినారి, వ్యు. లోభ+ఇని, లోభః అస్తి అస్య, ఆశ కలవాడు. లోభి. :-
[4-215-వ.]

4485} లోలలోచన  - చలించెడి కన్నులు కల స్త్రీ :-
[10.1-360-వ.]

4486} లోలాక్షీ  - చలించెడి కన్నులు కల స్త్రీ :-
[10.2-233-క.]

4487} లోలుపుడు  - మిక్కిలి ఇచ్చకలవాడు, లోలుడు, వ్యు, లుప్+యజ్+అచ్, గర్హితుం లుంపతి, అతిశయమైన ఆశ కలవాడు. :-
[3-722-వ.]

4488} లోహితము  - ఎఱ్ఱనిది, రక్తము :-
[3-903-వ.]

4489} లౌకికము  - లోకమునకు సంబంధించినది :-
[3-131.1-తే.]

4490} వంచించు  - వంచు (లొంగు) ఇంచు(తీయు), మోసగించు :-
[2-150.1-తే.]

4491} వందారుకల్పుడు  - సేవకులకు కల్పవృక్షము వంటివాడు, విష్ణువు :-
[10.1-1236-దం.]

4492} వంది  - వందించుచు (వంశావళి స్తుతి పాఠములు చదువుతూ) జీవించువారు వారు :-
[1-396-వ., 4-558-వ., 10.1-1579-వ., 10.2-450-వ.]

4493} వంశోద్భవులు  - వంశమున, కుటుంబమున, ఉద్భవులు (పుట్టినవారు), సంతానము :-
[4-432-వ.]

4494} వచ్చుటెఱుగలేక  - వచ్చుట + ఎఱుగలేక, అకార సంధి :-
[10.2-1276.1-తే.]

4495} వజ్రంబుజళిపించివ్రాలువానిప్రాణవల్లభ  - ఇంద్రుని భార్య, శచీదేవి :-
[1-350.1-తే.]

4496} వజ్రకంటకశాల్మలి  - వజ్ర (వజ్రమువలె కఠినమైన) కంటక (ముళ్ళు కల) శాల్మలి (బూరుగు చెట్లు)తో శిక్షించునది, నరక విశేషము :-
[5.2-136-వ.]

4497} వజ్రాకారబంధము  - వజ్రాయుధపు అంచుల వలె ఎదురెదురుగాను వాలుగాను నిలిచి పరస్పరము హస్త విన్యాసాదులను కనబరచునది, రాసక్రీడా పారిభాషిక పదం :-
[10.1-1084-వ.]

4498} వజ్రాయుధము  - ఇంద్రుని ఆయుధము, పిడుగు ఆయుధము :-
[5.1-147.1-తే.]

4499} వజ్రాయుధముజళిపించువాడు  - ఇంద్రుడు :-
[1-350.1-తే.]

4500} వజ్రి  - వజ్రము ఆయుధముగా గలవాడు, ఇంద్రుడు :-
[3-697-వ., 6-293-క., 6-386-వ., 6-411-ఆ., 9-68-క., 9-662.1-ఆ., 10.1-882-ఆ.]

4501} వజ్రిగజము  - వజ్రి (ఇంద్రుని) యొక్క గజము (ఏనుగు), ఐరావతము :-
[8-66-ఆ.]

4502} వటవృక్షము  - మఱ్ఱిచెట్టు, సాంసారమునకు సంకేతము :-
[10.1-749-వ.]

4503} వడవడ  - వణకు టందలి ధ్వన్యనుకరణ :-
[10.2-237.1-తే.]

4504} వత్సము  - ఒక సంవత్సరములోపు దూడ, లేగ లేక లేగదూడ క్రొత్తగా పుట్టిన దూడ :-
[10.1-439-క.]

4505} వత్సరము  - సంవత్సరము, ఋతుచక్ర కాలం., సౌరమానముతో సంవత్సరము; బార్హస్పత్యమానముతో పరీవృతము; సావనమానముతో ఇడావత్సరము ; చాంద్రమానముతో అనువత్సరము; నక్షత్రమానముతో వత్సరము అని ఋతుచక్ర కాల కాలము ఐదు రకములు :-
[4-322-వ.]

4506} వత్సాసురుడు  - గోవత్స రూపమున బాలకృష్ణుని అలమందలో చేరిన అసురుడు :-
[2-190-చ.]

4507} వనచరము  - అడవిలోతిరుగునది, కోతి :-
[9-278-వ.]

4508} వనచారి  - వనము (నీటి)యందు చారి (చరించునది), మొసలి :-
[8-66-ఆ.]

4509} వనజగేహము  - వనజము (తామరలకు) గేహము (నివాసము), సరోవరము :-
[8-49.1-ఆ.]

4510} వనజజుడు  - వనజము (తామర)న జుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[3-720.1-తే., 3-741-క., 4-27-క., 4-39-క., 4-216-క., 6-204-క., 10.2-1154.1-తే.]

4511} వనజదళాక్షి  - వనజము (తామర) దళ (ఆకు) వంటి అక్షి (కన్నులు) కలవారు, స్త్రీ :-
[4-842-చ., 10.2-1070-చ.]

4512} వనజదళాక్షుడు  - వనజ (తామర) యొక్క దళ (రేకు) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు :-
[3-545-చ., 3-707-చ.]

4513} వనజనాభుడు  - వనజము (తామర) నాభి (బొడ్డు)న కలవాడు, విష్ణువు :-
[3-331-తే., 3-686.1-తే.]

4514} వనజనేత్ర  - తామరలవంటి కన్నులు గలామె, పద్మాక్షి, స్త్రీ :-
[10.1-1033.1-తే.]

4515} వనజనేత్రుడు  - వనజ (తామర) వంటి నేత్ర (కన్నులుగలవాడు), విష్ణువు :-
[7-376.1-తే.]

4516} వనజభవాండము  - వనజము (తామర)న పుట్టినవాడు (బ్రహ్మ) + అండము, బ్రహ్మాండము :-
[3-487-క.]

4517} వనజము - వనమున (నీట) పుట్టినది, తామర :-
[3-280-క., 3-553-క., 3-635-క., 3-993-క., 4-208-క.]

4518} వనజము  - వనము (నీటి)లో జము(పుట్టునవి), తామర :-
[10.2-319-తే.]

4519} వనజలోచనుడు  - వనజము (తామర) వంటి లోచనములు కలవాడు, పద్మనేత్రుడు, విష్ణువు :-
[6-55.1-తే.]

4520} వనజసంభవుడు  - వనజము (తామర)న సంభవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[3-746-క.]

4521} వనజహితాహితులు  - వనజ (తామర)నకు హిత (ఇష్టుడు, సూర్యుడు) అహిత (అయిష్టుడు, చంద్రుడు) :-
[3-774.1-తే.]

4522} వనజాక్షి  - వనజము (తామరల వంటి) అక్షి (కన్ను గలామె), స్త్రీ :-
[4-763-క., 9-51.1-ఆ., 9-202.1-తే., 10.1-71.1-తే., 10.1-147-క., 10.2-212.1-ఆ.]

4523} వనజాక్షుఁడు  - వనజము (తామర) వంటి కన్నులు యున్నవాడు, విష్ణువు :-
[2-198-మ., 2-215-క., 4-896-క., 4-970-క., 9-730-క., 10.1-147-క., 10.1-443-ఆ., 10.1-528-క.]

4524} వనజాతనేత్రుడు  - వనజాతము (తామర వంటి) నేత్రుడు (కన్నులు గలవాడు), విష్ణువు :-
[7-459-ఉ.]

4525} వనజాతప్రభవుడు  - వనజాతము (తామర)న ప్రభవించినవాడు, బ్రహ్మదేవుడు :-
[3-280-క., 3-315-మ.]

4526} వనజాతము  - వనమున (నీట) పుట్టినది, తామర :-
[3-277-చ., 3-933-క.]

4527} వనజాతలోచనుడు  - వనజాతము (తామర) వంటి లోచనుడు (కన్నులు గలవాడు), విష్ణువు :-
[8-466-ఆ.]

4528} వనజాతాప్తుడు  - తామరల హితుడు, సూర్యుడు :-
[10.2-851-మ.]

4529} వనజాయతనేత్ర  - వనజ (తామర వలె) ఆయత (విస్తారమైన) నేత్రములు కల స్త్రీ :-
[10.2-613-క.]

4530} వనజాసనుడు  - వనజము (తామర) న ఆసనుడు (ఆసీనుడై ఉన్నవాడు), బ్రహ్మదేవుడు :-
[3-600-క., 3-736-క., 4-700-క., 10.2-291-క.]

4531} వనజేక్షణ  - వనజ (తామరలవంటి) ఈక్షణ (కన్నులు కలామె), సుందరి :-
[10.1-1470-క.]

4532} వనజేక్షణుడు  - వన (నీటిలో) జ (పుట్టినది) (తామర) వంటి ఈక్షణుడు (కన్నులు కలవాడు), కృష్ణుడు :-
[10.1-1454-చ.]

4533} వనజోదరుడు  - వనజము (తామర) ఉదరమున కలవాడు, విష్ణువు :-
[3-169-క., 3-389-క., 3-714-క., 4-965-క., 5.2-47-క., 10.2-526-క.]

4534} వనజోదరుడు  - వనజము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు :-
[4-700-క.]

4535} వనధి  - వనము (నీటి)కి నిధి, సముద్రము :-
[2-142.1-తే., 8-208-వ., 8-496-క.]

4536} వననిధి  - వనము అనగా నీటికి, నిధానము ఐనది, సముద్రము :-
[2-163-క., 4-826-క., 8-201-క., 10.1-766-వ., 11-99-వ.]

4537} వననిధిభంగుడు  - వననిధి (సముద్రమునకు) భంగుడు (గర్వభంగము చేసినవాడు), రాముడు. :-
[4-975-క.]

4538} వనమాలి  - వనమాలలు ధరించువాడు, కృష్ణుడు :-
[10.1-1631.1-ఆ., 10.1-1732.1-ఆ.]

4539} వనమాలిక  - ఆకులు పూలుతో కట్టిన మాలిక (చిన్నమాల) :-
[3-937-వ., 4-251.1-తే., 4-711-వ., 6-219.1-ఆ., 8-507-వ., 10.2-747.1-తే.]

4540} వనరుహగర్భాండభాండము  - వనరుహగర్భ (బ్రహ్మ) అండముల భాండముు (గుంపు), బ్రహ్మాండభాండము :-
[8-496-క.]

4541} వనరుహనాభుడు  - పద్మనాభుడు, విష్ణువు. :-
[11-14-క.]

4542} వనరుహనేత్ర  - వనరుహ (పద్మములవంటి) నేత్రములు కలామె, స్త్రీ :-
[10.1-358-క.]

4543} వనరుహపత్రలోచనుడు  - వనరుహము (తామర) యొక్క పత్రము (ఆకు)ల వంటి లోచనుడు (కన్నులు గలవాడ), విష్ణువు :-
[4-933-చ.]

4544} వనరుహము  - వనము (నీటి) లో పుట్టినది, పద్మము :-
[2-246-క., 3-337-తే., 10.2-269-క.]

4545} వనరుహసంజాతుడు  - వనరుహము (నీట పుట్టిన, పద్మము) నందు చక్కగా పుట్టిన వాడు, బ్రహ్మదేవుడు :-
[3-314-క.]

4546} వనరుహసంభవుడు  - వనరుహము (పద్మము)న సంభవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[2-246-క., 3-711-క.]

4547} వనరుహసంభూతుడు  - వనరుహము (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు :-
[3-641-క.]

4548} వనరుహాక్షుడు  - వనరుహా (పద్మాలలాంటి) అక్షుడు (కన్నులు కలవాడు), కృష్ణుడు :-
[11-13-క.]

4549} వనస్పతులు  - పూలు పువ్వకుండగ కాచెడు చెట్లు వనస్పతులు, మర్రి, రావి, మేడి, పనస మొదలగునవి (వానస్పత్యములు పూలుపూచి కాయలు కాచెడివి, మామిడి, జామ మొదలగునవి), :-
[4-502-వ., 6-196-తే.]

4550} వనాటము - అడవిలో చరించునది, ఏనుగు :-
[8-19-క.]

4551} వనిత - సేవింపబడినామె, మిక్కిలి అనురాగస్తురాలు, స్త్రీ :-
[4-792-క., 10.1-793-ఆ.]

4552} వయున  - జ్ఞానము, తెలివి కలామె, వయ+ఉనచ్, వియతే గమ్యతే ప్రాప్యతే అనేన, దీనితో పొందుదురు. జ్ఞానము. (యజు. 5.36) దక్షపుత్రిక స్వధ యందు అగ్నులకు వయున, ధారిణి అని ఇద్దరు పుత్రికలు పుట్టారు. :-
[4-34-వ.]

4553} వయ్యాసి  - వ్యాసుని పుత్రుడు, శుకుడు :-
[10.1-12-వ.]

4554} వర  - ఉత్తమ, ఇయ్యబడిన :-
[4-460.1-తే.]

4555} వరకుంతలు  - చక్కటి శిరోజములు కలవారు, సుందరీమణులు :-
[10.2-149-క.]

4556} వరకుమారకవయఃపరిపాకుడు  - వర (ఉత్తమమైన) కుమారక వయస్సుతోడి పరువము కలవాడు, విష్ణువు :-
[3-924.1-తే.]

4557} వరజనకసుతానుషంగుడు  - వర (ఉత్తమురాలైన) జనకసుత (జానకి యందు) అనుషంగుడు (ప్రేమ గలవాడు), రాముడు :-
[4-975-క.]

4558} వరద  - వరములను ద (ప్రసాదించు) వాడు, విష్ణువు :-
[3-294.1-తే., 3-311.1-తే., 3-423.1-తే., 3-428-తే., 3-748-క., 4-175-చ., 4-935-మ., 5.1-50-క., 6-515-ఆ., 7-240.1-తే., 8-92-ఉ., 10.1-844-మ., 10.1-942-ఆ., 10.2-477-ఆ., 10.2-749-ఆ.]

4559} వరయోగిమానసాంతఃకరణసుధాంభోధిభావకల్లోలలసత్పరతత్త్వశేషశాయి - వర (ఉత్తమ) యోగి (యోగుల) మానస (మనసుల) అంతఃకరణములు యనెడి సుధాంభోధి (పాలసముద్రము నందలి) భావము లనెడి కల్లోల (కెరటములపై) లసత్ (ప్రకాశించుతున్న) పరతత్త్వ (పరబ్రహ్మ స్వరూపుడైన) శేష (ఆదిశేషుడు) శాయి (శయ్యగ గలవాడు), విష్ణువు :-
[6-36-క.]

4560} వరారోహ  - గొప్ప పిరుదులు గలామె, ఉత్తమస్త్రీ :-
[4-776-వ., 10.1-1751-వ.]

4561} వరాహమూర్తి  - ఆదివరాహ రూపములో ఉన్నవాడు, విష్ణువు :-
[3-419-మ.]

4562} వరీయాంసుడు  - కోరదగినవారిలో గొప్పవాడు, సామర్థ్యము గలవాడు :-
[4-26-వ.]

4563} వరుణుడు  - 1.అదితి సంతానము పన్నెండుగురులో ఒకడు. ఈ ద్వాదశాదిత్యులు; ధాత, అర్యముడు, మిత్రుడు, వరుణుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, త్వష్ట, విష్ణువు, అర్యముడు, భగుడు,పూషుడు, క్రతువు. , 2.జనులచే వరములు కోరబడువాడు పడమటి వేలుపు 3. జలములకు అధిపతి. 4. భార్య శ్యామలాదేవి, పట్టణము శ్రద్ధావతి, ఆయుధము పాశము, వాహనము మొసలి హంస :-
[6-507-వ., 6-507-వ., 8-147-క., 12-41-వ.]

4564} వరుణుపురము  - వరుణదేవుని పట్టణము, శ్రద్ధావతి :-
[10.1-1593-ఆ.]

4565} వర్గమూలము  - ఏ సంఖ్యనైతే దానిని దానితోనే గుణించగా వచ్చెడి సంఖ్య యొక్క వర్గమూలము ఆ సంఖ్య. ఉదా. 3x 3 9 కనుక, 9 వర్గమూలము 3. వర్గము అంటే సంఖ్యను దానితోనే హెచ్చవేసిన వచ్చు సంఖ్య. 3 కు వర్గము 9 (3x3) :-
[9-230-వ.]

4566} వర్ణచతుష్కము  - 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్ర వర్ణములు, నాలుగు వర్ణములు :-
[12-9-క.]

4567} వర్ణధర్మములు  - 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్ర అనెడి చతుర్వర్ణముల ధర్మములు :-
[4-147.1-తే.]

4568} వర్ణములు  - 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్ర అనెడి చాతుర్వర్ణములు :-
[3-775-మ., 4-421-వ., 5.2-86-వ.]

4569} వర్ధిష్ణుడు  - వృద్ధి చేయు స్వభావము కలవాడు, పెరిగెడివాడు :-
[2-236-మ., 10.1-1182-శా.]

4570} వర్షనిధి  - వర్షపు నీటికి నిధివంటిది, సరస్సు :-
[5.2-36-వ.]

4571} వలగొను  - వలను(దక్షిణమువైపు) తీసుకొను, ప్రదక్షిణముచేయు :-
[8-677-వ.]

4572} వలమాన - తిరుగుచున్న :-
[8-208-వ.]

4573} వలఱేడు  - వలపులకు అధిపతి, మన్మథుడు, రతీదేవి భర్త :-
[10.1-967.1-ఆ., 10.1-1131-మ.]

4574} వలాహకము  - ప్రళయ భయంకరమైన మేఘము. సప్తమేఘములు లోనిది. అవి 1. సంవర్తము, 2. భీమనాదము, 3. ద్రోణము, 4. చండము, 5. బలాహకము, 6. విద్యుత్పతాకము, 7. శోణము. :-
[3-114-చ., 11-52-వ.]

4575} వలితతానకము  - ఇరుపార్శ్వములకు మొగ్గ వాలినట్లు దేహమును వాల్చుచు నటించుట, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

4576} వలీముఖము  - ముడుతలతో కూడిన ముఖము కలది, కోతి :-
[10.2-555-క.]

4577} వల్లవరాజనందనులు  - వల్లవరాజు (నందుని) నందనులు, బలరాముడు కృష్ణుడు :-
[10.1-1371-ఉ.]

4578} వల్లవీవల్లభుడు  - గోపికలకు ప్రియుడు, కృష్ణుడు :-
[10.1-1348-వ.]

4579} వషట్కారము  - వేల్చునపుడు హవిస్సు త్యాగము చేయుచు వౌషట్ అని పలుకుట :-
[2-94.1-తే., 9-10.1-తే.]

4580} వసంతములాడుట  - వినోదముగా ఉత్సవాదు లందు ఒకరిపైనొకరు జలము మున్నగునవి జల్లుకొనుట :-
[10.1-810-క.]

4581} వసంతాది  - షడృతువులు 1వసంత 2గ్రీష్మ 3వర్ష 4శరత్ 5హేమంత 6శిశిర ఋతువులు :-
[6-88-వ.]

4582} వసుంధర  - వసు (సంపదలను) ధర (ధరించెడిది), భూమి :-
[5.2-10-వ., 10.1-1321-వ.]

4583} వసుంధరాధరము  - వసుంధర (భూమిని) ధరించెడిది, పర్వతము :-
[7-285-వ., 8-208-వ.]

4584} వసుంధరాధిపుడు  - భూమికి అధిపతి, రాజు :-
[11-6-మ.]

4585} వసుదేవకుమారుడు  - వసుదేవుని కుమారుడు, శ్రీకృష్ణుడు :-
[3-304.1-తే.]

4586} వసుదేవనందనుడు  - వసుదేవుని కొడుకు, కృష్ణుడు :-
[10.1-1707-మ.]

4587} వసుదేవుడు  - కృష్ణుని తండ్రి, ధనాదికముచే ప్రకాశించువాడు :-
[10.1-1208-మ.]

4588} వసుదేవునిభార్యలు  - కృష్ణుని తల్లులు దేవకీదేవి మున్నగువారు ఏడుగురు , బలరాముని తల్లులు రోహిణీ మున్నగువారు ఏడుగురు, మరొక నలుగురు కూడా ఉన్నారు :-
[1-260-వ., 1-348.1-తే., 10.1-59.1-ఆ.]

4589} వసుధ  - వసు (సంపదల)ను ధరించునది, భూమి :-
[10.1-1330-క.]

4590} వసుధాకళత్రుడు  - భూమి భార్యగా కలవాడు, విష్ణువు :-
[10.2-358.1-తే.]

4591} వసుధాధరము  - వసుధ (భూమిని) ధరము (ధరించునది), పర్వతము :-
[8-189-క.]

4592} వసుధాధీశుడు  - వసుధ (భూమి)కి అధీశుడు (పతి), రాజు :-
[4-432-వ., 7-23-క., 9-713-క., 10.1-147-క., 10.1-528-క.]

4593} వసుధామరుడు  - భూమికి దేవత, విప్రుడు, బ్రాహ్మణుడు :-
[5.2-89.1-ఆ., 9-423.1-ఆ.]

4594} వసుధేశుడు  - వసుధ (భూమికి) ఈశుడు (ప్రభువు), రాజు :-
[5.1-17.1-తే.]

4595} వసుధేశ్వరుడు  - వసుధ (భూమి)కి ఈశ్వరుడు (ఫ్రభువు), రాజు :-
[9-205.1-తే.]

4596} వసుభృద్ధ్వానుడు  - వసు (సంపదలను) భృత్ (భరించు) ధ్వానుడు (ధ్వానము కలవాడు) :-
[4-26-వ.]

4597} వసుమతి  - బంగారము గర్భమున కలది, భూమి :-
[10.1-1519.1-ఆ.]

4598} వసుమతీనాథుడు  - వసుమతి (భూమి)కి నాథుడు (పతి), రాజు :-
[2-265.1-తే., 4-629.1-తే.]

4599} వసుమతీపతి  - వసుమతి (భూమి)కి పతి, రాజు :-
[4-641-క.]

4600} వసుమతీశుడు  - భూమికి ప్రభువు, రాజు :-
[9-500-ఆ.]

4601} వసువు  - కిరణరూపమున ఉండు ఒక రకమైన గణదేవత, సంపద కలవాడు. అష్టవసువులు 1 అవుడు 2 ధ్రువుడు 3 సోముడు 4 అధర్వుడు 5 అనిలుడు 6 ప్రత్యూషుడు 7 అనలుడు 8 ప్రభాసుడు :-
[3-150-వ., 4-390-వ.]

4602} వస్త్వంతరపరిశూన్యుఁడు  - తనుకాని వస్తువుఏదియు (మరియొకటి) అసలు లేనివాడు, విష్ణువు :-
[3-198.1-తే.]

4603} వహ్ని  - హవిస్సులను వహించువాడు, అగ్నిదేవుడు :-
[2-86-వ., 4-6-వ., 4-426-క.]

4604} వాక్కుసుమంబులంబూజించు  - మాట లనెడి పూలతో పూజించు, స్తోత్రము చేయు :-
[10.2-205-వ.]

4605} వాక్పతి  - వాక్కు (సరస్వతీదేవి)కి భర్త, బ్రహ్మదేవుడు :-
[4-89-చ.]

4606} వాగగోచరుడు  - వాక్కు వలన తెలియరానివాడు, విష్ణువు :-
[1-125-వ.]

4607} వాగాది  - పంచజ్ఞానేద్రియములు, 1వాక్కు 2కన్నులు 3ముక్కు 4 చెవులు 5చర్మము :-
[3-903-వ.]

4608} వాగ్దేవీమనోనేత  - వాగ్దేవి (సరస్వతీ దేవి)యొక్క మనస్ (మనస్సున) కు నేత (ప్రభువు), బ్రహ్మ :-
[7-85-మ.]

4609} వాగ్విభూతుడు  - వాక్కు అనెడి విభూతి కలవాడు, విష్ణువు :-
[4-703.1-తే.]

4610} వాచంయముడు  - మౌనవ్రతము గలవాడు, మౌని, వాచ్+యం+ఖచ్+ముమ్, వాచం నియచ్ఛతి, వాక్కును అదుపులో వుంచువాడు. మితభాషి. :-
[8-8-మ.]

4611} వాజపేయము  - ఆహారస్వీకార ప్రథానమైన యాగము :-
[4-54-వ.]

4612} వాజినిశాటుడు  - గుఱ్ఱపు రూపున ఉన్న రాక్షసుడు, కేశి :-
[10.1-1174-ఉ.]

4613} వాజులనీరాజనములు  - యుద్ధములకు పోబోవునప్పుడు గుఱ్ఱములు ఏనుగులు రథములు మున్నగు వానికి నీరాజనము (హారతి) ఇచ్చు ఆచారమును వాజుల నీరాజనము అందురు. హారతి మంటలు సవ్యముగా చలించిన జయము కలుగును అని భావించెడి వాడుక కలదు :-
[10.1-767-క.]

4614} వాణీలలామ  - వాణి (వాక్కునకు దేవి) అనెడి లలామ (ఉత్తమ స్త్రీ), సరస్వతీదేవి :-
[4-442.1-తే.]

4615} వాణీవరుడు  - వాణి (సరస్వతీదేవి) కి వరుడు (భర్త), బ్రహ్మదేవుడు :-
[3-500-ఉ.]

4616} వాణీశుడు  - వాణి (సరస్వతి) కి ఈశుడు (భర్త), బ్రహ్మ :-
[2-216-క.]

4617} వాతాది  - త్రిధాతువులు వాతము పిత్తము శ్లేష్మము :-
[3-297-వ.]

4618} వాతాశి  - వాయుభక్షకుడు, సర్పము, అఘాసురుడు :-
[10.1-1627-మ.]

4619} వాత్సల్యగుణుడు  - వాత్యల్య(సంతానము యెడనుండు స్నేహభావము) పూరితమైన గుణములు కలవాడు, శివుని :-
[4-138.1-తే.]

4620} వాత్సల్యము  - వత్స (సంతానము) ఎడల నుండెడి లాంటి కూర్మి :-
[4-474-వ.]

4621} వానరుడు  - వానర రూపమున వచ్చి పాచికలాడుతున్న బలరాముని చికాకు పరచిన అసురుడు, ద్వివిదుడు :-
[2-190-చ.]

4622} వామాక్షి  - వామమైన (అందమైన) అక్షి (కన్నులు కలామె), స్త్రీ :-
[6-522.1-తే., 10.1-844-మ.]

4623} వాయుజుండు  - వాయుపుత్రుడు, హనుమంతుడు :-
[9-278-వ.]

4624} వాయుతనయుడు  - వాయుదేవుని కుమారుడు, భీముడు :-
[3-60-తే.]

4625} వాయువు  - వ్యాపించునది, గాలి :-
[2-277.1-తే.]

4626} వాయువునందలిభేదములు  - 1గోగంధనము (ఎదురు గాలి) 2వాసంతము (తెమ్మెర) 3చారము (వడగాలి) 4కించులుకము (మీదిగాలి) 5ఇరింగణము (వడిగాలి) 6ఝంఝ (గాలివాన) 7చూషకము (సరిగాలి) 8వాత్య (సుడిగాలి) :-
[10.1-1321-వ.]

4627} వారజనులు  - భోగమువారు, కుటుంబవ్యవస్త నుండి దూరముగ నుండువారు :-
[1-256-వ.]

4628} వారణము  - శత్రు బలమును వారించునది, ఏనుగు :-
[10.1-1321-వ., 10.1-1560-క.]

4629} వారాశి  - వారి (నీటి) రాశి, సముద్రము :-
[8-143-మ., 8-575-శా., 8-720.1-తే.]

4630} వారిచరము  - వారి (నీటి) చరము (జంతువు), మొసలి :-
[8-109-మ.]

4631} వారిజగంధి  - వారిజ (పద్మముల)యొక్క గంధి (సువాసనగలామె) ఉత్తమస్త్రీ, పద్మినీజాతి స్త్రీ :-
[1-372-క., 7-474-క.]

4632} వారిజనయనుడు  - వారిజము (పద్మముల) వంటి నయనుడు (కన్నులుగలవాడు), విష్ణువు :-
[8-189-క.]

4633} వారిజనాభుడు  - పద్మనాభుడు, విష్ణువు :-
[10.2-647-ఉ.]

4634} వారిజనివాసిని  - వారిజ (పద్మమునందు) నివాసిని (నివసించెడియామె), లక్ష్మి :-
[7-344-వ.]

4635} వారిజనేత్రుఁడు  - పద్మములవంటి కన్నులు కలవాడు, కృష్ణుడు :-
[1-372-క., 1-427-ఉ.]

4636} వారిజరిపువంశుడు  - వారిజరిపుని (చంద్రుని) వంశమువాడు, అక్రూరుడు :-
[10.1-1512-క.]

4637} వారిజలోచన  - వారిజ (పద్మములవంటి) లోచన (కన్నులు కలామె), స్త్రీ :-
[10.1-814-క.]

4638} వారిజసంభవుడు  - వారిజ (పద్మమునందు) సంభవుడు (పుట్టినవాడు), బ్రహ్మ :-
[3-335-ఉ., 7-344-వ.]

4639} వారిజాక్షి  - వారిజము (పద్మము) వంటి అక్షి (కన్నులున్నామె), స్త్రీ :-
[8-461.1-ఆ., 8-585-ఆ.]

4640} వారిజాక్షుడు  - వారిజ(పద్మమువంటి) అక్షుడు(కన్నులుగలవాడు), విష్ణువు :-
[7-381.1-తే., 8-139.1-తే.]

4641} వారిజోద్భవుడు - వారిజము (పద్మము)న భవుడు (పుట్టినవాడు), బహ్మ :-
[10.1-14.1-తే.]

4642} వారిధరములు  - నీటిని కలిగియుండునవి, మేఘములు :-
[1-211-ఉ.]

4643} వారిధిగర్వాతిరేకవారణబాణుడు  - వారిధి (సముద్రుని) గర్వాతిరేక(గర్వాతిశయమును) వారణ (వారించిన) బాణుడు (బాణముగలవాడు), రాముడు :-
[9-1-క.]

4644} వారినిధి  - నీటికి నివాసము, సముద్రము :-
[3-281-మ.]

4645} వారిప్రచారోత్తము  - వారి (నీటి)యందు ప్రచార (తిరిగెడి) ఉత్తము, మొసలి :-
[8-71-శా.]

4646} వారిరుహదళాక్షుడు  - వారిరుహ (పద్మముల) దళా (రేకులవంటి) అక్షుడు (కన్నులు కలవాడు), కృష్ణుడు :-
[10.1-908-క.]

4647} వారిరుహదళాయతాక్షుడు  - వారిరుహ (కలువ) దళ (పత్రముల)వంటి విశాలమైన కన్నులు కలవాడు, కృష్ణుడు :-
[10.2-1182-చ.]

4648} వార్ధి  - నీటికి నిధి, కడలి :-
[10.1-1572-క.]

4649} వార్ధిపుడు  - వార్ధి (సముద్రము)నకు ప్రభువు, వరుణుడు :-
[3-774.1-తే.]

4650} వాలఖిల్యులు  - 1. (వాలము) తోక (భిల్ ఉంఛే అవశేషే చ ఖిలతి, మిగులుట కల వారు ఖిల్యులు) మిగిలినవారు, 2. అంతరిక్షమున సుర్యుని స్తోత్రము చేయుచు తలక్రిందులుగనుండు వారు, 3 అంగుష్టమాతులు, 4. ఒక ఋషిగణు. 5. వానప్రస్తులలో విశేషము, 6. అహోరాత్రము అరువది గడియలు, ఒక్కొక గడియ వేయి వాలఖిల్యములు అని ఒక కాలమానము :-
[4-26-వ.]

4651} వాలుఁగన్నులక్రేవలు  - దీర్ఘములైనకన్నుల చివరలు, కడకన్నులు :-
[10.2-1025.1-తే.]

4652} వాలుగంటి  - వాలుచూపులు ఉన్నది, స్త్రీ (ద్రౌపది) :-
[1-360-క., 9-616-వ.]

4653} వాల్మీకి  - రామాయణ కర్త, వల్మీక+ఇఞ్, వల్మీకే భవః, పుట్టలో పుట్టినవాడు. :-
[6-11.1-తే.]

4654} వాశ్చరము  - వారి చరము, మొసలి :-
[2-148-మ.]

4655} వాసరమణి  - వాసర (దినమునకు) మణి, సూర్యుడు :-
[10.2-82-క.]

4656} వాసవనందనుడు  - వాసవు (ఇంద్రుని) కొడుకు, అర్జునుడు :-
[10.2-763-వ.]

4657} వాసవవందితుడు  - ఇంద్రునిచే పొగడబడువాడు, కృష్ణుడు :-
[10.2-258-క.]

4658} వాసవవర్ధకి  - విశ్వకర్మ, దేవతాశిల్పి, త్వష్ట, (వాసవ) ఇంద్రుని (వర్ధకి) రథకారుఁడు, వడ్లంగి. :-
[8-183.1-తే.]

4659} వాసవసూనుడు  - ఇంద్రుని కొడుకు, అర్జునుడు :-
[10.2-123-ఉ.]

4660} వాసవారి  - వాసవుని (ఇంద్రుని) అరి (శత్రువు), రాక్షసుడు :-
[8-737-ఆ.]

4661} వాసవీనందనుడు  - వాసవి యొక్క పుత్రుడు, వ్యాసుడు :-
[1-86.1-ఆ.]

4662} వాసవుడు  - వసువులు (రత్నములు) కలవాడు, ఇంద్రుడు :-
[8-471.1-ఆ., 9-68-క., 9-161.1-తే., 12-26-వ.]

4663} వాసవుపురి  - వాసవుని (ఇంద్రుని) పట్టణము, అమరావతి :-
[10.1-1593-ఆ.]

4664} వాసుదేవమూర్తి  - వాసుదేవ (వసుదేవుని పుత్రుడు) యొక్క మూర్తి (విగ్రహము), శ్రీకృష్ణుడు :-
[5.2-55-వ.]

4665} వాసుదేవాది  - వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షులు అనెడి చతుర్వ్యూహములు (మనోబుద్ధిచిత్తాహంకారములు ఈ నామములకు ఒప్పును) :-
[10.1-1236-దం.]

4666} వాసుదేవుడు  - 1.ఆత్మలందు వసించెడి దేవుడు, 2.విష్ణువు, 3.కృష్ణుడు, 4.వసుదేవుని పుత్రుడు, 5.వ్యు. వాసుదేవః సర్వత్రాసౌ వసత్యాత్మ రూపేణ, విశంభరత్వాదితి, (ఆంధ్ర వాచస్పతము) ఆత్మ యందు వసించు దేవుడు, 6. చతుర్వ్యూహముల లోని వాసుదేవుడు, బుద్ధికి అధిష్టానదేవత :-
[1-61-వ., 1-98-వ., 1-110-వ., 1-178-వ., 1-188-వ., 1-293-వ., 1-389-వ., 1-447-క., 2-7.1-ఆ., 2-23-వ., 2-84-వ., 3-644.1-తే., 3-720.1-తే., 3-866-వ., 3-1025-వ., 4-18.1-తే., 4-702.1-తే., 4-834-వ., 4-918.1-తే., 4-936-వ., 5.1-69-వ., 5.1-97-వ., 5.1-181-మ., 6-343-వ., 6-442.1-తే., 6-514-వ., 7-121-వ., 7-239-వ., 7-240.1-తే., 7-479-వ., 9-257-మ., 9-499-వ., 10.1-406-క., 10.1-724-క., 10.1-942-ఆ., 10.1-952.1-తే., 10.1-1653.1-ఆ., 10.1-1729-ఉ., 10.2-201-వ., 10.2-202.1-ఆ., 10.2-477-ఆ., 10.2-749-ఆ., 11-77-వ., 11-91-వ., 12-2-వ., 12-18-వ.]

4667} వాహిని  - 1. వాహిని అనే సేనావిశేషమునకు 81 రథములు 81 ఏనుగులు 243 గుఱ్ఱములు 405 కాల్బలము, 2. నది :-
[1-396-వ., 10.1-1547.1-తే.]

4668} వికచకమలనయన  - విరిసిన పద్మముల వంటి కన్నులు కలామె, స్త్రీ :-
[10.1-361-ఆ.]

4669} వికచజలజనయనుడు  - వికసించిన పద్మము (జలజము), వంటి నయనములు (కన్నులు) ఉన్నవాడు, విష్ణువు :-
[3-254-తే.]

4670} వికచతామరసాక్షుడు  - వికచ (వికసించిన) తామర (పద్మముల) స (వంటి) అక్షుడు (కన్నులు ఉన్నవాడు), విష్ణువు :-
[3-705-క.]

4671} వికచాంభోరుహలోచనుడు  - వికచ (వికసించిన) అంభోరుహము (పద్మము) లవంటి లోచనుడు (కన్నులుకలవాడు), విష్ణువు :-
[3-752-క.]

4672} వికచాబ్జముఖి  - వికచ (వికసించిన) అబ్జ (పద్మము) వంటి ముఖి (ముఖముగలామె), అందమైన స్త్రీ. :-
[8-237-క.]

4673} వికత్థనము  - తననుతాను పొగడుకొనుట, స్వోత్కర్ష, వి+కత్థ+ల్యుట్, విశేషేణ కథ్యతే శ్లాఘతే ఆత్మానం తత్. :-
[3-656-క.]

4674} వికవిక  - విరగబడి నవ్వుటలోని ధ్వన్యనుకరణ :-
[10.1-313-క.]

4675} వికారము  - (అ) షోడశవికారములు కర్మేద్రియములు (5) జ్ఞానేంద్రియములు (5) మనస్సు భూతపంచకము (5) మొత్తము 16, (ఆ).షడ్వికారములు (1)పుట్టుట, (2)పెరుగుట, (3)ముదియుట, (4) చిక్కుట, (5)చచ్చుట, (6)గర్భనరకస్థితి. (ఇ) మానసిక లేదా స్వరూపములలో కలుగు మార్పు లేదా అసమక్రమత. (ఈ) శబ్దస్పర్శాది విషయ చాంచల్యములు (ఉ) తెవులు :-
[3-231-క.]

4676} వికారములు  - 1.షోడశవికారములు కర్మేద్రియములు (5) జ్ఞానేంద్రియములు (5) మనస్సు భూతపంచకము (5) మొత్తము 16, 2.షడ్వికారములు (1)పుట్టుట, (2)పెరుగుట, (3)ముదియుట, (4) చిక్కుట, (5)చచ్చుట, (6)గర్భనరకస్థితి. 3.మానసిక లేదా రూపములలో కలుగు మార్పు లేదా అసమక్రమత. 4.శబ్దస్పర్శాది విషయ చాంచల్యములు 5. తెవులు :-
[7-237-వ., 7-356-వ., 10.1-30-క., 10.2-1079.1-తే.]

4677} వికారవిదూరుడు  - వికారములకు (షోడశాది) మిక్కిలి దూరముగ ఉండువాడు, విష్ణువు :-
[3-212-చ., 3-402-ఉ., 4-167-చ.]

4678} వికాసచూడ్కులు  - చక్కగా తెరచిన చూపులు, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

4679} విగతకలుషపోషుడు  - విగతకలుష (కళంకరహితులను) పోషించువాడు, రాముడు :-
[9-735-మాలి., 12-53-మాలి.]

4680} విగతజీవునిచేయు  - విగత (పోయిన) జీవుని (ప్రాణములు కలవానిని) అగునట్లు చేయు, సంహరించు :-
[10.1-620-వ.]

4681} విగతమోహుడు  - విగత (వదలిపెట్టేసిన) మోహము కలవాడు, విష్ణువు :-
[3-924.1-తే.]

4682} విగతరజస్తమోగుణుడు  - వదలిన రజోగుణమును తమోగుణములు గుణములు కలవాడు :-
[3-506-చ.]

4683} విచిత్రదైవమండలము  - చేతులను మీదికి చాచి నానావిధములుగాను వింతగాను తిప్పుట, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

4684} విజయ  - వరాహశైల క్షేత్రమున విజయ (చండ మండ భండాసురులను గెల్చినామె) :-
[10.1-61-వ.]

4685} విజయయాత్ర  - 1. జైత్రయాత్ర, 2. సాధనపరిపక్వత :-
[4-460.1-తే.]

4686} విజయుడు  - విజయశీలము కలవాడు, అర్జునుడు :-
[1-371-క., 10.2-112-మ.]

4687} విజయుపౌత్రుడు  - అర్జునుని మనుమడు , పరీక్షితు :-
[1-432-వ.]

4688} విజితాశ్వుడు  - విజిత (విశిష్ఠముగ జయించిన) అశ్వుడు (అశ్వము కలవాడు), కాకుత్సుడు, పృథు మహారాజునకు అర్చియందు కలిగిన వాడు. తండ్రి యాగాశ్వాన్ని ఇంద్రుడు తీసుకుపోతుంటే వెనక్కి తెచ్చినవాడు :-
[4-640-వ., 4-675-క.]

4689} విజితేంద్రియుడు  - ఇంద్రియ జయము సాధించినవాడు, మహాపురుషుడు :-
[11-49-క.]

4690} విజ్ఞానమయుడు  - విజ్ఞాన స్వరూపమైన వాడు, విజ్ఞానం బ్రహ్మేతి వ్యజనాత్ (శ్రుతి) విజ్ఞానమే పరబ్రహ్మ, విష్ణువు :-
[10.1-942-ఆ.]

4691} విజ్ఞానము  - 1.విశిష్ట జ్ఞానము, సర్వమునందును భగవంతుని అస్థిత్వమును జ్ఞప్తియందు ఉంచుకొనుట 2. అపరవిద్య, అవిద్య, లౌకిక విషయములను తెలుపునది :-
[3-203-దం., 3-845.1-తే.]

4692} విటపి  - విటపములు (కొమ్మలు) గలది, చెట్టు :-
[5.1-26-వ.]

4693} వితతయోగీంద్రనికరగవేష్యమాణచరణసరసిజయుగళు  - విస్తారమైన యోగీంద్ర సమూహములచే గవేష్యమాణ (వెదకబడుతున్న) పాదపద్మముల యుగళము (ద్వయము) కలవాడు, విష్ణువు :-
[4-233.1-తే.]

4694} వితతసంధ్యాభ్రరుచివిడంబితవినూత్నరక్తవర్ణుడు  - వితత (విస్తారమైన) సంధ్యాకాల అభ్ర (మేఘము) ని పోలిన వినూత్న (ప్రశస్తమైన) రక్త(ఎఱ్ఱని) వర్ణుడు (రంగువాడు), శివుడు :-
[4-138.1-తే.]

4695} విదర్భ  - 1. రుక్మిణీదేవి తండ్రి భీష్మకుని దేశము 2. ఆనర్తకభూముల సమీప దేశము 3.ఇప్పటి బీరారు, బీదరు ప్రాంతము 4.విశిష్టమైన దర్భలుగల దేశము, 3. కర్మప్రధానమని భావించెడివారుండు దేశము. :-
[4-829-వ., 5.1-64-వ., 10.1-1718-వ.]

4696} విదర్భతనయ  - విదర్భరాజు కుమార్తె, రుక్మిణి :-
[10.1-1721-మ.]

4697} విదర్భపుత్రి  - విదర్బ దేశపు రాకుమారి, రుక్మిణి :-
[10.2-29-ఉ.]

4698} విదర్భపురము  - విదర్భదేశపు పట్టణము, కుండిన :-
[10.1-1739-వ.]

4699} విదర్భరాజతనయ  - విదర్భరాజు (భీష్మకుడు) యొక్క పుత్రిక, రుక్మిణి :-
[10.1-1715-వ.]

4700} విదర్భుడు  - విదర్భదేశము వాడు, రుక్మి :-
[10.2-293-క.]

4701} విదర్భేశుడు  - విదర్భకు రాజు, రుక్మి :-
[10.2-281.1-తే.]

4702} విదురుడు  - 1. యమధర్మ రాజు అవతారము, 2. కురు పాండవుల పినతండ్రి 3. విచిత్రవీర్యుని భార్య అంబిక యందు ధృతరాష్ట్రుడు, అంబాలిక యందు పాండురాజు. ఆమె దాసి యందు విదురుడు వ్యాసుని వలన జన్మించారు. :-
[2-204.1-తే.]

4703} విదూరభూరిసంసారి  - మిక్కిలి దూరముగా ఉంచబడిన విస్తారమైనట్టి సంసారము కలవాడు, విష్ణువు :-
[3-335-ఉ.]

4704} విదూరుడు  - విగత దూరము కలవాడు, దూరము దగ్గరలు లేనివాడు :-
[3-273-తే.]

4705} విదేహరాజవినుత  - విదేహ దేశపు రాజు (జనకుని)చే వినుత (స్తుతింపబడినవాడు), రాముడు :-
[11-125-క.]

4706} విద్యాధరులు  - దేవయోని విశేషము, గ్రహణ, ధారణాది శక్తుల కధిపతులు :-
[2-274.1-తే.]

4707} విధాత  - 1. బ్రహ్మదేవుడు, సమస్త సృష్టికి విధిని నిర్ణయించు వాడు, 2. సూర్యుడు, ద్వాదశాదిత్యులలో ఒకడు, 3. మన్మథుడు, రాత్రికి అధిపతి :-
[2-225.1-తే., 3-404-తే., 4-26-వ., 6-507-వ., 9-108-శా., 12-22-వ.]

4708} విధి  - జీవుల విధిని నిర్ణయించువాడు (నుదుట వ్రాయువాడు), బ్రహ్మదేవుడు :-
[3-447.1-తే., 3-933-క.]

4709} విధుంతుదుడు  - చంద్రుని బాధపెట్టు వాడు, రాహువు :-
[10.2-858-చ.]

4710} వినంబలుకు  - వినునట్లు పలుకు, చెప్పు :-
[3-445-చ.]

4711} వినివర్తితతానకము  - పాదము వెలి పక్కకు అడ్డముగా తిప్పి మడమలు పిరుదులు సోకునట్లు నిలిచి నర్తించుట, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

4712} వినిశ్చలనిర్మలధర్మమూర్తి  - వినిశ్చల (మిక్కిలి చాంచల్యరహితమైన) నిర్మల (కల్మషరహితమైన) ధర్మమూర్తి (ధర్మము యొక్క స్వరూపము అయినవాడు), విష్ణువు :-
[3-506-చ.]

4713} వినుతగుణోత్తరుండు  - వినుత (స్తుతింపబడిన) గుణములతో విశిష్టుడు, విష్ణువు :-
[3-1022-చ.]

4714} వినుతనిఖిలబృందారకుడు  - వినుత (స్తుతించుచున్న) నిఖిల (సమస్తమైన) బృందారకుడు (దేవగణములు కలవాడు), విష్ణువు :-
[3-723-క.]

4715} వినుతమంగళయశోవిభవుడు  - స్తోత్రము చేయబడుతున్న శుభకరమైన కీర్తి యొక్క వైభవము కలవాడు, విష్ణువు :-
[4-553.1-తే.]

4716} వినుతమందారుడు  - వినుత (స్తుతించువారికి) మందారుడు (కోరికలు వర్షించువాడు), విష్ణువు :-
[8-483.1-తే.]

4717} వినుతాసూనుడు  - వినుత యొక్క పుత్రుడు, గరుత్మంతుడు, అరుణుడు :-
[3-101-మ.]

4718} విపక్షక్షమాభృత్సహస్రాక్షుడు  - విపక్ష (శత్రువులు) అను పర్వతములకు ఇంద్రునివంటివాడు, విష్ణువు :-
[3-203-దం.]

4719} విపత్తు  - సంపత్తు x విపత్తు, ఆపద,ఇడుము, రోగములు అవమానములు, మృత్యువు, అప్పులు మొదలగునవి, వీనికి కారణములు ఆదిభౌతికము, ఆధిదైవికము, ఆధ్యాత్మికములు :-
[3-242-చ.]

4720} విపత్పయోధితరి  - విపత్తు (ఆపదలనెడి) పయోధి (సముద్రమును) తరి (దాటించువాడు), విష్ణువు :-
[10.2-80-మ.]

4721} విపన్నుడు  - తాపత్రయములచేత విపత్తు పొందినవాడు. విపత్తులో ఉన్నవాడు :-
[10.1-1664-వ.]

4722} విప్రగ్రహములు  - పిశాచబేధము :-
[6-307-వ.]

4723} విప్రచిత్తి  - దానవులలో ప్రదానుడు, కశ్యపునికి దనువునందు పుట్టిన పుత్రుఁడు, సింహిక అను రాక్షసి భర్త, కొడుకులు రాహువు, కేతువు, నముచి, వాతాపి, ఇల్వలుఁడు, నరకుఁడు, స్వర్భానుఁడు, పులోముఁడు, వక్త్రయోధి మొదలగువారు. :-
[7-29-వ.]

4724} విప్రాది  - చతుర్వర్ణములు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములు :-
[3-246.1-తే.]

4725} విబుధగేహము  - విబుధులు (దేవతలు) గోహము (నివాసము), స్వర్గము :-
[9-504.1-ఆ.]

4726} విబుధలోకేశుడు  - దేవతల ప్రభువు, ఇంద్రుడు :-
[10.2-10.1-తే.]

4727} విబుధాధిపుడు  - దేవతలకు ప్రభువు దేవేంద్రుడు :-
[2-126-క.]

4728} విబుధాహితులు  - విబుధ (దేవతలకు) అహితులు (శత్రువులు), రాక్షసులు :-
[7-216-ఆ.]

4729} విబుధులు  - విశిష్టమైన బుద్ధి కలవారు, దేవతలు, జ్ఞానులు :-
[4-461-క.]

4730} విబ్రాజితకీర్తిలతావృతరాజీవభవాండభాండుడు  - విభ్రాజిత(మిక్కిలి మెరయుచున్న) కీర్తి (కీర్తి యనెడి) లతా (తీగలచే) ఆవృత (చుట్టబడిన) రాజీవభవాండ (బ్రహ్మాండము అనెడి) భాండుడు (భాండము గలవాడు), రాముడు :-
[7-480-క.]

4731} విభావరి  - 1. వరుణుని ముఖ్యపట్టణము (విభా (వైభవముతో) వరి (శ్రేష్ఠమైనది)), 2. ఒక సంవత్సరం పేరు :-
[3-617-చ.]

4732} విభావసుడు  - 1. విశేషమైన కాంతియను ధనము కలవాడు, సూర్యుడు, 2. అష్టవసువలలో ఒకడు :-
[10.1-1648-మ., 12-48-వ.]

4733} విభీషణుడు  - రావణాసురుని తమ్ముడు, రామునకు శరణాగతి యైనవాడు, మిక్కిలి భయంకరుడు :-
[2-204.1-తే., 4-26-వ.]

4734} విభుడు  - ప్రభువు, భగవంతుడు, సర్వవ్యాపకుడు, విష్ణువు, శ్రుతి. నతత్ర సూర్యోభాతి న చంద్రతారకం, నేమా విద్యుతోభాంతి కుతోయమగ్నిః, తమేవ భాంతిమనుభాతి సర్వం, తస్య సర్వమిదం విభాతి., వ్యు. వి+భూ+డు, విశేషేణ భవతి సర్వగతః, విశేషంగా వుండువాడు; అంతట వుండు సర్వవ్యాపకుడు. భగవంతుడు, :-
[2-108-క., 2-207-క., 3-236-చ., 4-6-వ., 4-509.1-తే., 8-94-ఆ., 10.1-540-ఉ., 10.1-819-శా., 10.1-1497-మ.]

4735} విభ్రాజితకీర్తిసుధావృతరాజీవభవాండభాండుడు  - విభ్రాజిత (ప్రకాశించెడి) కీర్తి అనెడి సుధ (అమృతము)చేత ఆవృత (ఆవరింపబడిన) రాజీవభవ అండభాండ (బ్రహ్మాండభాండము కలవాడు), రాముడు :-
[11-125-క.]

4736} విభ్రాజితము  - మిక్కిలి రాజిత మగుట, వెలుగొందుట, పురంజయోపాఖ్యానంలో విభ్రాజితములు దృశ్యములకు సంకేతం :-
[4-768-వ.]

4737} విమతుడు  - వ్యతిరేకమైన ఆలోచనా విధానములు కలవాడు, శత్రువు :-
[3-937-వ., 10.1-71.1-తే., 10.1-1556-చ.]

4738} విమల  - రాగద్వేషాలులేని, నిర్మలమైన, వి+మల, విగతః మలః పాపం యస్మాత్, పాపము లేనిది. :-
[10.2-255-మ.]

4739} విమలగుణసంఘాతుడు  - విమల (స్వచ్ఛమైన) గుణ (సుగుణముల) సంఘాత (సమూహములు కలవాడు), శ్రీరాముడు. :-
[10.1-1790-క.]

4740} విమలచరిత్రుడు  - నిర్మలమైన నడవడి కలవాడు, పరీక్షిత్తు. :-
[10.2-1261-క.]

4741} విమలప్రభావుడు  - విమల (స్వచ్ఛమైన) ప్రభావుడు (మహిమ గలవాడు), విష్ణువు :-
[8-92-ఉ.]

4742} విమలము - విమలతరము విమలతమము :-
[10.2-506-క.]

4743} విమలాస్య  - తేటయైన అస్య (మోముగలామె), స్త్రీ :-
[10.1-71.1-తే.]

4744} విమలేందుముఖి  - స్వచ్ఛమైన చంద్రుని వంటి మోము కలామె, స్త్రీ. :-
[10.1-328-క.]

4745} విమానము  - 1.చక్రవర్తి సౌధము, 2.ఆకాశయాన సాధనము :-
[3-45-ఉ.]

4746} విముక్తలింగుడు  - లింగదేహము (ప్రజ్ఞా మాత్రమగు సుక్ష్మ శరీరము) నుండి విడువబడినవాడు, పరమహంస :-
[5.1-89-వ.]

4747} విముక్తుడు  - ప్రకృతి పాశములనుండి విముక్తి పొందినవాడు :-
[10.1-683-వ.]

4748} వియచ్చరులు  - వియత్ + చరులు (శ్చుత్వ సంధి), ఆకాశ గమనులు, దేవతలు :-
[10.1-753-వ., 10.1-1089-క., 10.1-1677-వ., 10.2-1039-వ.]

4749} వియన్నది  - వియత్ + నది (శ్చుత్వ సంధి), వియత్ (ఆకాశ) నది, గంగ :-
[10.2-396.1-తే.]

4750} విరక్తి  - దేని అందు తగులము లేకపోవుట :-
[1-317-వ.]

4751} విరజము  - రజస్తమో గుణులు లేనిది, సాత్వికము :-
[3-471-వ.]

4752} విరజుడు  - రజోగుణము లేనివాడు :-
[4-7.1-తే., 4-26-వ.]

4753} విరటజ  - విరటుని సంతానము, ఉత్తర :-
[1-185-మ.]

4754} విరటుపుత్త్రిక  - విరటరాజు పుత్రిక, ఉత్తర :-
[1-189.1-తే.]

4755} విరాజితసుగుణుడు  - విరాజిత (ప్రకాశించెడి) సుగుణుడు (సుగుణాలు కలవాడు), రాముడు :-
[11-125-క.]

4756} విరాటకన్యక  - ఉత్తర, విరాట రాకుమారి, అభిమన్యు భార్య, పరీక్షిత్తు తల్లి :-
[1-530-గ.]

4757} విరాట్చరీరుడు  - విరాట్ (విశ్వము సమస్తమును) దేహముయైన వాడు, విశ్వరూపుడు, విష్ణువు. :-
[4-703.1-తే.]

4758} విరాట్పురుషుడు  - విశ్వము స్వరూపముగ కలవాడు, విష్ణువు :-
[2-258-వ., 2-260-క., 3-1025-వ.]

4759} విరాట్ప్రభువు  - విరాట్టు స్వరూపమై ప్రభావము చూపువాడు, విష్ణువు :-
[3-246.1-తే.]

4760} విరాడ్రూపంబు  - విరాట్టు (భగవంతుని) స్వరూపమైనది, జగత్తు :-
[11-52-వ.]

4761} విరించి  - వివరముగ రచించువాడు, బ్రహ్మదేవుడు :-
[2-79-వ., 4-16-చ., 7-303-వ., 8-249-క., 10.1-950-వ., 10.1-1726-శా.]

4762} విరూపాక్షుడు  - విరూపమైన కన్నులుకలవాడు, శివుడు :-
[4-685.1-తే.]

4763} విరోచననందనుడు  - విరోచనుని పుత్రుడు, బలి :-
[8-182-వ.]

4764} విలసత్కాకుత్థ్సవంశమండనుడు  - విలసత్ (ప్రసిద్ధి కెక్కిన) కాకుత్థ్సవంశ (కకుత్థ్స మహరాజ వంశమునకు) మండనుడు (అలంకారమైనవాడు), రాముడు :-
[10.1-1-క.]

4765} విలసత్పద్మాకళత్రుడు  - ప్రకాశమానమైన పద్మ (లక్ష్మీదేవి) కళత్రుడు(భర్త), విష్ణువు :-
[3-284-మ.]

4766} విలసన్నుతసూరి  - విలసత్ (చక్కగా) నుత (కీర్తించు) సూరి (జ్ఞానులు) కలవాడు, విష్ణువు :-
[3-335-ఉ.]

4767} విలసితవామాంకవిన్యస్తదక్షిణచరణారవిందుడు  - విలాసముగా ఎడమతొడపైన ఉంచిన కుడికాలు యొక్క పాదము అను పద్మము కలవాడు, విష్ణువు :-
[3-145.1-తే.]

4768} విలాసవతి  - విలాసవంతమైన స్త్రీ :-
[10.2-543-చ.]

4769} వివశుడు  - 1. మరణకాలము సమీపించుట చేత కలత పొందిన బుద్ధి కలవాడు, 2. 2. స్వవశముగాని బుద్ధిగలవాఁడు :-
[9-304-క.]

4770} వివస్వంతుడు  - కాంతిచేనన్నిటిని కప్పెడువాడు, సూర్యుడు, ద్వాదశాదిత్యులలో ఒకడు. :-
[12-41-వ.]

4771} వివిధప్రాణిలలాటలేఖనమహావిద్యానుసంధాత  - వివిధ (అఖిలమైన) ప్రాణి (జీవుల) లలాట (నొసటి) లేఖన (వ్రాయుట యందు) మహా (గొప్ప) విద్యా (విద్యను) అనుసంధాత (కలిగినవాడు), బ్రహ్మ :-
[7-85-మ.]

4772} వివేకము  - దేహాత్మాది బేధ జ్ఞానము కలిగి యుండుట (ఆంధ్ర వాచస్పతము), యుక్తాయుక్త నిర్ణయ బుద్ధి (శబ్దార్థ చంద్రిక), యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము :-
[4-372-ఉ.]

4773} వివ్వచ్చుడు  - అర్జునుడు, భీభత్సుడు, వివచ్చము (భీభత్సము) గా యుద్ధము చేయువాడు :-
[10.2-116-వ.]

4774} విశసనము  - నరకుటలు, నరక విశేషము, విశసన అంటే కత్తి :-
[5.2-136-వ.]

4775} విశాలము - విశాలతరము విశాలతమము :-
[10.1-523-చ.]

4776} విశాలము - విశాలాంతరము విశాలాంతము :-
[10.1-997.1-ఆ.]

4777} విశాలవక్షుడు  - విశాలమైన వక్షస్థలము కలవాడు, కృష్ణుడు :-
[10.1-1251-క.]

4778} విశిఖము  - ముల్లులేని బాణము :-
[10.1-1767-వ.]

4779} విశుద్ధ చక్రము - కుండలినీ షట్ చక్రములలో వక్షస్థానమున ఉండునది :-
[2-29.1-ఆ.]

4780} విశుద్ధజ్ఞానానందమయుడు  - విశుద్ధ (స్వచ్ఛమైన) జ్ఞానముయొక్క రూపుడు (స్వరూపమైనవాడు), విష్ణువు :-
[7-109-వ.]

4781} విశుద్ధజ్ఞానుడు  - పరిశుద్ధమైన జ్ఞానము కల వాడు :-
[2-110-మ.]

4782} విశ్రుతచారుయశుడు  - ప్రసిద్ధికెక్కిన చక్కని కీర్తి కలవాడు :-
[3-506-చ.]

4783} విశ్వంభరుడు  - విశ్వము (జగత్తును) భరుడు (ప్రోచువాడు), విష్ణువు, కృష్ణుడు :-
[1-198-మ., 1-396-వ., 7-24-వ., 7-239-వ., 8-483.1-తే., 8-586-మ., 8-719-వ., 9-230-వ.]

4784} విశ్వకర్మశాస్త్రము  - విశ్వ (నిర్మించుట) చేయు విద్య, నిర్మాణవిద్య :-
[3-388-వ.]

4785} విశ్వక్షేమంకరుడు  - విశ్వమునకు క్షేమము (శుభము)ను కరుడు (చేయువాడు) ,విష్ణువు :-
[3-723-క.]

4786} విశ్వగర్భుడు  - విశ్వము గర్భమున కలవాడు, విష్ణువు :-
[3-198.1-తే., 3-524-వ., 8-158-వ., 8-501-తే., 10.1-77-ఆ.]

4787} విశ్వగురుడు  - 1.విశ్వమునకు గురువు (పెద్దవాడు), బ్రహ్మదేవుడు 2.జగద్గురువు, విష్ణువు :-
[3-370-వ., 3-539-వ.]

4788} విశ్వతోముఖుడు  - విశ్వమంతయు వ్యాపించిన వాడు, విష్ణువు :-
[3-1048.1-తే., 4-285-చ.]

4789} విశ్వద్రష్ట  - విశ్వమునందు సమస్తమును ద్రష్ట (చూసెడివాడు, సాక్షి), విష్ణువు :-
[4-556-వ.]

4790} విశ్వప్రభోధుడు  - జగతికి చైతన్యము కలిగించువాడు, విష్ణువు :-
[4-702.1-తే.]

4791} విశ్వబంధువు  - లోకమునకు మంచి కోరువాడు, శివుడు :-
[4-138.1-తే.]

4792} విశ్వభరణుడు  - విశ్వమును భరించువాడు, విష్ణువు :-
[3-307.1-తే.]

4793} విశ్వభవస్థితివ్యయాస్పదమహితావతారుఁడు  - విశ్వము యొక్క పుట్టుక మనుగడ అంతములు అను కార్యములు చేయు గొప్ప అవతారములు కలవాడు, విష్ణువు :-
[3-194-చ.]

4794} విశ్వభావనుడు  - విశ్వ (లోకమంతటిచే) భావనుడు (ధ్యానింపదగిన వాడు), విష్ణువు :-
[3-570-ఉ., 6-224-వ., 10.1-949-క.]

4795} విశ్వభావనోదారుడు  - విశ్వ (జగత్తును) భావన (కల్పన) లో ఉదారుడు (అతిశయించిన వాడు) :-
[2-211-ఉ.]

4796} విశ్వభావాభావసందర్శనము  - భగవంతుడు ప్రపంచోత్పత్తికి ముందు లయము తరువాత నుండువాడు కనుక ఉండుట లేకపోవుటలు రెండు చూచును :-
[10.1-683-వ.]

4797} విశ్వమయుడు  - జగత్తంతను నిండి యున్నవాడు, హరి :-
[8-94-ఆ.]

4798} విశ్వము  - వ్యు. విశ్+క్వన్, విశతి ప్రవిశతి స్వకారణం మూలప్రకృతిమ్, కారణమైన మూలప్రకృతిని ప్రవేశించునది. జగత్తు, :-
[10.1-576-ఆ.]

4799} విశ్వమూర్తి  - విశ్వ (జగత్తు, ఓంకార) మూర్తి (స్వరూపుడు), విష్ణువు. :-
[10.1-576-ఆ.]

4800} విశ్వయోని  - విశ్వమునకు ఉత్పత్తిస్థానమైనవాడు, విష్ణువు :-
[4-702.1-తే.]

4801} విశ్వరూపుడు  - సమస్తమైన విశ్వము తన రూపమైన వాడు, విరాట్పురుషుడు, విష్ణువు :-
[9-105-ఆ., 10.1-748-ఉ., 11-77-వ.]

4802} విశ్వవిభుడు  - సకలలోకాలకి ప్రభువు, విష్ణువు. :-
[11-76-ఆ.]

4803} విశ్వసంపాద్యుడు  - విశ్వ (లోకములను) సంపాద్యుడు (సంపాదింపదగినవాడు), విష్ణువు :-
[4-233.1-తే.]

4804} విశ్వసంబోధ్యుడు - విశ్వ (లోకమునకు) సంబోధ్యుడు (మేల్కొలుపువాడు), విష్ణువు :-
[4-179.1-తే.]

4805} విశ్వసంవేద్యుడు  - విశ్వమంతటిని సంవేద్యుడు (చక్కగా తెలిసిన వాడు), విష్ణువు :-
[10.2-460-తే.]

4806} విశ్వసన్నుతుడు  - లోకములచే (సన్నుతుడు) స్తుతింపబడువాడు, విష్ణువు :-
[12-35-తే.]

4807} విశ్వస్తుత్యుడు  - విశ్వ (లోకముల) చేత స్తుత్యుడు (స్తుతింపబడువాడ), విష్ణువు :-
[3-755-మ.]

4808} విశ్వాకృతి  - ప్రపంచమే తన రూపమైన వాడు, విశ్వంవిష్ణుః (శ్రుతి) :-
[10.1-949-క.]

4809} విశ్వాత్ముడు  - విశ్వమునకు ఆత్మ ఐనవాడు, పరమాత్మ, విశ్వమే తానైనవాడు, భగవంతుడు :-
[2-106-మ., 2-207-క., 4-126-తే., 4-193.1-తే.]

4810} విశ్వేదేవతలు  - దేవయోని విశేషము, ధర్మునకుగల పదిమంది భార్యలలో విశ్వ యందు జన్మించినవారు :-
[9-707-వ.]

4811} విశ్వేదేవము  - విశ్వేదేవతల గురించి చేసెడి హోమాధికము :-
[9-76-వ.]

4812} విశ్వేశుడు  - విశ్వమునకు ఈశుడ (ప్రభువు), హరి :-
[1-198-మ., 9-725-క., 10.1-949-క., 10.1-1469-మ., 12-35-తే.]

4813} విశ్వేశ్వరుడు  - విశ్వమునకు ఈశ్వరుడు, విష్ణువు :-
[2-89-వ., 9-113.1-ఆ., 10.1-1182-శా.]

4814} విశ్వోద్భవస్థితివిలయకారణభూతుడు  - విశ్వ (జగత్తునకు) ఉద్భవ (సృష్టికి) స్థితికి విలయ (నాశమునకు) కారణభూతుడైనవాడు, విష్ణువు :-
[8-483.1-తే.]

4815} విషగళసఖుడు - విషగళు (శివు)ని సఖుడు, విష్ణువు :-
[10.1-233-క.]

4816} విషగళుడు  - విషమును కంఠమున ధరించినవాడు, శంకరుడు :-
[10.1-233-క.]

4817} విషధరము  - విషము ధరించునది, సర్పము. :-
[2-274.1-తే.]

4818} విషధరరిపుగమనుడు - విషధరరిపు (గరుత్మంమతు)నిపై గమనుడు (పోవువాడు), విష్ణువు :-
[10.1-233-క.]

4819} విషధరరిపుడు  - విషధర (సర్పములకు) రిపుడు (శత్రువు), గరుత్మంతుడు :-
[10.1-233-క.]

4820} విషధి  - విషము (నీటి)కి నిధి, సాగరము :-
[8-175.1-ఆ.]

4821} విషభవభవజనకుడు - విషభవభవు (బ్రహ్మదేవు) నికి జనకుడు, విష్ణువు :-
[10.1-233-క.]

4822} విషభవభవుడు  - విష (నీటియందు) భవ (పుట్టెడిది) యైన పద్మమున భవ (పుట్టినవాడు), బ్రహ్మ :-
[10.1-233-క.]

4823} విషముని  - రాగద్వేషాదిగుణములచే విషమమైన బుద్ధి కలవాడు :-
[7-3.1-ఆ.]

4824} విషయత్వములేనిది  - విషయత్వము (ఇంద్రియార్థములైన 1శబ్ద 2స్పర్శ 3రూప 4రస 5గంధ లక్షణము లేవియును) లేనిది, ఇంద్రియముల కందనిది, విష్ణుదేవుని నిర్గుణ శ్రీవిభూతి. :-
[10.1-553.1-ఆ.]

4825} విషయములు  - ఇంద్రియములకు గోచరము అగునవి, ఇంద్రియార్థములు :-
[1-130-వ., 1-329-వ., 3-308.1-తే., 3-346-వ., 3-756-వ.]

4826} విషరుహలోచనుడు  - విషరుహ (నీటపుట్టు పద్మము)ల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు :-
[10.1-655-క.]

4827} విషశయనుడు  - విష (జలము)పై శయనుడు, విష్ణువు :-
[10.1-233-క.]

4828} విషువు  - పగలు రాత్రి సమానముగ నుండు దినములు, (1)మార్చి21న వచ్చెడి ఉత్తర (వసంత) విషువు మొదటిది, (2)సెప్టంబరు 21న వచ్చెడి దక్షిణ (శరత్) విషువు రెండవది, వ్యు, విషు+వా+క, విషు దినరాత్ర్యోః సామ్యం వాతి :-
[5.2-78-వ.]

4829} విషూచి  - 1. మనసు, విష్వచ్ఛ, విషూచీన, (విష్వ అంటే వ్యాపతౌ, వాచస్పతం) అన్ని వైపులకు (పరిపరి విధాల) పోవునది, 2. వ్యు. విశిష్టా సూచీ ఇవ ప్రాదిన, అజీర్ణ ప్రకుపితమైన వాయువుచే ఒడలెల్ల సూదులు గ్రుచ్చినట్లగు వ్యాధి :-
[4-768-వ., 4-853-వ.]

4830} విష్కంభఅంగహారము  - విషయమును విరివిగా సూచించునవి, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

4831} విష్ణుచక్రము  - విష్ణుమూర్తి యొక్క చక్రాయుధము, పేరు సుదర్శన చక్రము. :-
[5.2-108-తే.]

4832} విష్ణునిఅష్టాయుధములు  - 1 శంఖము పాంచజన్యము 2 చక్రము సుదర్శనము. 3 విల్లు శారజ్ఞము, 4కత్తి నందకము 5పద్మము 6 గద కౌమోదకి 7 దండము 8శూలము :-
[4-902.1-తే.]

4833} విష్ణుపది  - విష్ణుమూర్తి పాదమున పుట్టినది, గంగ :-
[1-499-వ., 10.1-13-క.]

4834} విష్ణుపరిచరులు  - జయ, విజయ, సునందుడు, నందుడు, కుముదుడు మున్నగువారు :-
[4-371-వ.]

4835} విష్ణుమూర్తి పరికరాదులు  - (అ)ఆయుధములు 1ధనుస్సు శాఙ్గము 2గద కౌమోదకి 3శంఖము పాంచజన్యము 4చక్రము సుదర్శనము 5కత్తి నందకము (ఆ)రథము శతానందము (ఇ)సేనానాయకుడు విష్వక్సేనుడు :-
[8-98-మ.]

4836} విష్ణుమూర్తిగద  - కౌమోదకి, వ్యుత్పత్తి. కుం భూమిం మోదయతి హర్షయతీతి కుమోదకో విష్ణుః తస్యేయం కౌమోదకీ, తా. భూమిని సంతోషింపజేయు విష్ణు సంబంధమయినది :-
[10.2-157-మ.]

4837} విష్ణుమూర్తిసాధనములు  - 1చక్రము (సుదర్శనము) 2గద (కౌముదకి) 3శంఖము (పాంచజన్యము) 4ఖడ్గము (నందకము) 5చర్మము (డాలు) (శతచంద్రము) 6విల్లు (శార్ఙ్గము) :-
[6-307-వ.]

4838} విష్ణురాతుడు  - విష్ణువు చే కాపాడబడిన వాడు, పరీక్షితుడు :-
[2-222-వ.]

4839} విష్ణువు  - 1. శ్రీమన్నారాయణుడు, హరి, 2. సృష్టికి లోపల బయట నిండి (వ్యాపించి) ఉన్నవాడు, 3. ద్వాదశాదిత్యులలో ఒకడు., 4వ్యు. విష వ్యాప్తౌ + నుక్, విశ ప్రవేశే + నుక్ పృషో, అన్నింటిలోనూ వ్యాపించిన యున్నవాడు, అన్నింటిలోనూ ప్రవేశించి యున్నవాడు :-
[1-185-మ., 1-290-చ., 2-236-మ., 2-269-వ., 3-96-క., 3-148-మ., 3-197-క., 3-365-క., 3-400-మ., 3-448-క., 4-16-చ., 4-702.1-తే., 7-169.1-తే., 7-195-వ., 7-246-క., 8-94-ఆ., 8-105-మ., 9-3.1-తే., 9-82.1-తే., 9-170.1-తే., 10.1-4-క., 10.1-14.1-తే., 10.1-109-క., 10.1-187-ఉ., 10.1-582-ఆ., 10.1-1182-శా., 10.2-67-వ., 10.2-130-ఆ., 10.2-906-క., 11-76-ఆ., 11-77-వ.]

4840} విష్ణువుయెప్పుడునుండుచోటులు  - వైకుంఠము, సత్పురుషుల హృదయములు మున్నగునవి :-
[10.2-256-వ.]

4841} విష్వక్సేనుడు  - 1. విష్ణుమూర్తి యొక్క సేనాని, ఇతనినే వైష్ణవ సంప్రదాయమున విఘ్నేశ్వరుడందురు, ఇతను బృహదిషుని వంశస్థుడైన బ్రహ్మదత్తుని కొడుకు. 2. అంతటను వ్యాపించిన సేన కలవాడు, విష్ణువు :-
[4-642-వ., 5.2-74.1-తే., 10.1-1341-శా.]

4842} విస్ఫురద్రాజకళాధరుడు  - బాగా కనబడుతున్న చంద్రకళను ధరించినవాడు, శివుడు :-
[10.2-1147-ఉ.]

4843} విహంగకులరాజు  - విహంగ (పక్షుల) కులమునకు రాజు, గరుత్మంతుడు :-
[7-290-వ.]

4844} విహంగకులేశ్వరుడు  - విహంగ (పక్షుల) కులమునకు ప్రభువు, గరుడుడు :-
[4-278.1-తే.]

4845} విహంగవిభుడు  - పక్షులకు ప్రభువు, గరుత్మంతుడు :-
[3-123.1-తే.]

4846} విహగపరివృఢుడు  - విహగ (పక్షులకు) పరివృఢుడు (ప్రభువు), గరుత్మంతుడు :-
[8-136-వ.]

4847} విహగేంద్రుడు  - విహగము (పక్షి)లందు ఇంద్రుడు (శ్రేష్ఠుడు), గరుడుడు :-
[10.1-705-ఉ.]

4848} విహ్వలము  - భయాదులచేత అవయవముల స్వాధీనము తప్పుట :-
[8-95-మ.]

4849} విహ్వలుడు - భయాదులచే అవయవముల పట్టు తప్పినవాడు :-
[1-432-వ.]

4850} వీణ  - విపంచి, తంత్రీవాద్య విశేషము (సరస్వతి వీణ 'కచ్ఛపి', నారదుని వీణ 'మహతి', తుంబురుని వీణ పేరు 'కళావతి', వినాయకుని వీణ పేరు 'లకుమి'. విశ్వ వసువు వీణ పేరు 'బృహతి', రావణబ్రహ్మ 'రుద్రవీణ' ప్రసిమైనవి 'బొబ్బిలివీణ', 'తంజావూరు వీణ', 'సరస్వతీ వీణ') :-
[10.2-181.1-ఆ.]

4851} వీధులు  - ఇండ్లవరుసల మధ్యనుండు దారులు, మార్గములు :-
[10.1-1247-మ.]

4852} వీరమోహిని  - వీరులను మోహింపజేయు నామె, వీరత్వమును మోహించునామె :-
[10.2-1168-ఆ.]

4853} వీరవర్యాభిలాషుడు  - వీరవర్యులచేత అభిలషింపదగినవాడు, రాముడు :-
[12-53-మాలి.]

4854} వీరవిద్యాభిలాషుడు  - వీరత్వము చూపుటందు ఆసక్తికలవాడు, రాముడు :-
[9-735-మాలి.]

4855} వీరశార్దూలుడు  - వీరులలో పులి వంటి వాడు, కృష్ణుడు :-
[10.2-140-ఉ.]

4856} వీరాసనము  - యోగాసనములలో నొకటి, పాదములు రెండును రెండవ తొడపక్కకి వచ్చెడి భంగిమగల ఆసనము :-
[5.1-131-ఆ.]

4857} వీరుడు  - వీరత్వము అదికముగా కలవాడు, కృష్ణుడు :-
[10.1-1187-ఉ.]

4858} వీర్యము  - రేతస్సు, శుక్రము :-
[5.2-111.1-తే.]

4859} వృకము  - తోడేలు వ్యు. వృక్+క, వారకః మార్గస్య, మార్గమునకు అడ్డు తగులునది. :-
[4-640-వ.]

4860} వృకుడు+అను  - వృకుడను, ఉకార సంధి :-
[10.2-1237-క.]

4861} వృకోదరుడు  - వృకము వంటి పొట్ట ఉన్నవాడు, భీముడు :-
[1-234-వ.]

4862} వృక్షరాజము  - వృక్షములలో రాజు వంటివి, మహావృక్షములు :-
[5.2-20-వ.]

4863} వృత్రారి  - వృత్రాసురుని చంపినవాడు, ఇంద్రుడు :-
[10.2-624-క.]

4864} వృద్ధశ్రవుడు  - వృద్ధ (పండితుల)చే శ్రవుడు (కీర్తింపబడు) వాడు, ఇంద్రుడు :-
[3-176-క.]

4865} వృషభము  - ఎద్దు, ఋషభము (ప్రకృతి) వృషభము (వికృతి), ఋషభము రేఫ, ఈశానుని (శివుని) వాహనము, వ్యు, వృష+అభచ్, వర్షతి కామాన్, కోరికలను పూరించునది. వ్యు. ఋష్+అభచ్, ఋషతి గచ్ఛతి శ్రేష్ఠశ్చ, వెళ్లునది; శ్రేష్ఠమైనది. ఎద్దు. :-
[2-139-వ.]

4866} వృషభాసురుడు  - ఎద్దు రూపమున ఉన్న అసురుడు :-
[2-190-చ.]

4867} వృషభేంద్రము  - వృషభము (ఆబోతులలో) ఇంద్రము (శ్రేష్ఠము), నంది, శివుని వాహనము :-
[4-16-చ., 10.2-403.1-తే.]

4868} వృషలి  - వ్యు. వృష (వర్షణే) + కలచ్ (జీష్), కృ.ప్ర., శూద్రజాతిస్త్రీ, కన్యక, రజస్వల అయి తండ్రి ఇంట ఉన్న పడచు :-
[6-96-క., 6-135.1-ఆ.]

4869} వృషలుడు  - శూద్రునికి బ్రాహ్మణస్త్రీ యందు పుట్టినవాడు :-
[6-521-వ.]

4870} వృషాకపి  - 1. విష్ణువు, వ్యు. వృష+న+కంప+ఇన్, న ో పః, కృప్ర., 2. ధర్మమునకు లోపము రానీయనివాడు. 3. శంకరుని అంశతో పుట్టిన భూతునకు సురూప అనే భార్య వల్ల పుట్టిన అనేకులలో వృషాకపి ఒకరు, వారు కోట్లకొలది రుద్రగణాలు, రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాముడు, అగ్రుడు, వృషాకపి, అజైకపాత్తు, అహిర్బుధ్న్యుడు, బహురూపుడు, మహాంతుడు, రుద్రపారిషదులు, ప్రేతలు, వినాయకులు. :-
[11-77-వ.]

4871} వృష్ణికులప్రదీపకుడు  - వృష్ణి కులమును ప్రకాశింపజేయువాడు, ఉద్ధవుడు. :-
[3-50-చ.]

4872} వృష్ణికులాంభోజసూర్యుడు  - వృష్ణి అనెడి కుల (వంశము) అనెడి అంభోజ (పద్మము)నకు సూర్యునివంటివాడు, కృష్ణుడు :-
[10.1-579-క.]

4873} వృష్ణిపుంగవుడు  - వృష్ణి వఁశమున శ్రేష్ఠుడు, ఉద్దవుడు. :-
[3-53-చ.]

4874} వృష్ణులు  - వృష్ణివంశపు యాదవులు :-
[7-18-శా.]

4875} వెంటంబడి  - వెంబడించి, చతుర్దశేంద్రియ వ్యాపారములను విష్ణుని యందె చేర్చి వెంటబడుట పరమ భక్తి :-
[10.1-555-శా.]

4876} వెక్కిరించు  - వికారపు చేష్టలతో అపహాస్యము చేయుట :-
[10.2-544.1-తే.]

4877} వెడవిలతుడు  - వెడ (పూల) విలతుడు (ధనుస్సు కలవాడు), మన్మథుడు, వ్యు. (వెడ + విల్లు కలవాడు) బ.వ్రీ :-
[9-569-క.]

4878} వెన్నుడు(వి)  - విష్ణువు (ప్ర) :-
[10.1-335-వ., 10.1-960-వ., 10.1-1400-క., 10.1-1443-శా., 10.2-196-క.]

4879} వెలచేడియ  - ధరకు స్త్రీ, వేశ్య :-
[9-378-ఉ.]

4880} వెలది  - వెలది (నిర్మలము)గలామె, స్త్రీ, భార్య :-
[7-416.1-ఆ., 10.1-1252.1-తే.]

4881} వెలయాలు  - వెలయు (ఆవిధమగ నటించునది) ఆలు, వెలకి వచ్చు ఆలు (స్త్రీ), వేశ్య :-
[3-477-మ.]

4882} వెలి  - శరీరములకు వెలుపలది, బాహ్యసంసారము (ఆలుబిడ్డాలాది) :-
[10.1-8-ఆ.]

4883} వెలుగుఱేడు  - వెలుగు (కాంతులు)గల ఱేడు (రాజు), చంద్రుడు :-
[7-434.1-ఆ., 9-717-వ.]

4884} వేదత్రయము  - 1ఋగ్వేదము 2యజుర్వేదము 3సామవేదము :-
[7-425-వ.]

4885} వేదమయుడు  - వేదములు స్వరూపముగా కలవాడు, విష్ణువు :-
[9-420-క.]

4886} వేదమాత  - వేదములకు తల్లి వంటిది, గాయత్రి :-
[3-56-క.]

4887} వేదమునకు శాఖలు  - ఋక్ యజుస్ సామ అధర్వణ అని 4 శాఖలు :-
[1-63-వ.]

4888} వేదములు  - చతుర్వేదములు, అవి నాలుగు ఋక్ ,యజు, సామ, అధర్వణ వేదములు :-
[1-85.1-ఆ.]

4889} వేదరూపుడు  - వేదములు తన రూపమైనవాడు, విష్ణువు. :-
[12-35-తే.]

4890} వేదవిదులు - వేదాంతార్థములు తెలిసిన బ్రహ్మవేత్తలు :-
[10.1-537-వ.]

4891} వేదవేద్యుడు  - వేదములచే వేద్యుడు (తెలియబడువాడు), విష్ణువు :-
[4-179.1-తే., 6-124.1-ఆ., 10.2-1187-తే.]

4892} వేదవ్యాసునితనయుడు  - శుకయోగి :-
[3-195-క.]

4893} వేదశిరుడు  - వేదమునకు శిరస్సు, ఓంకారము పేరుగల ఒక ముని :-
[4-26-వ.]

4894} వేదసారుడు  - వేదముల యొక్క సారమైనవాడు, విష్ణువు :-
[8-483.1-తే.]

4895} వేదాంగములు  - షడంగములు, 1శిక్ష 2వ్యాకరణము 3చంధస్సు 4నిరుక్తము 5జ్యోతిషము 6కల్పము. పాఠ్యంతరములు కలవు :-
[8-136-వ., 10.1-1412-శా.]

4896} వేదాంతవిభుడు  - వేదాంతములు (ఉపనిషత్తాదులు) యందలి విభుడు (ప్రభువు), విష్ణువు :-
[6-124.1-ఆ.]

4897} వేదాంతవీధులు  - శో. బ్రహ్మానారాయణః శివశ్చ నారాయణః శక్రశ్చ నారాయణః సర్వం నారాయణః నిష్కళంకో నిరంజనో నిర్వికారో నిరాకారో శుద్ధై కో నారాయణఃనద్వితీయోస్థి (నారయణోపనిషత్తు) వంటి ప్రతిపాదనల మార్గములు :-
[10.1-608.1-ఆ.]

4898} వేదాత్మకుడు  - వేదస్వరూపుడు, విష్ణువు :-
[9-205.1-తే.]

4899} వేదాధ్యయనము  - చతుర్వేదములు షష్టాంగకములు ఆదులను అధ్యయనము చేయుట :-
[10.1-1474-ఆ.]

4900} వేధ  - పరబ్రహ్మ స్వరూపము యైనవాడు, విష్ణువు, వ్యు. వి + ధా + అనున్ వేధాదేశః, కృ.ప్ర. :-
[4-704-తే., 4-920-ఉ.]

4901} వేనుడు  - పృథుచక్రవర్తి తండ్రి, అంగుని కొడుకు. క్రూరత్వంతో బ్రాహ్మణ శాపగ్రస్తుడై ప్రాణం వీడెను. కళేబరం తొడలు మధించగా నిషాదుని రూపమున పాపము బయటకు పోయింది. అంత బాహువులు మధించగా విష్ణుమూర్తి అంశతో పృథుచక్రవర్తి పుట్టెను. :-
[7-11-ఉ.]

4902} వేయికన్నులవాడు  - వెయ్యి కన్నులు గలవాడు, సహస్రాక్షుడు, ఇంద్రుడు :-
[8-49.1-ఆ.]

4903} వేయిగన్నులుగలగఱువ  - వేయి (వెయ్యి, 1000) కన్నులు గల గఱువ (ఘనుడు), ఇంద్రుడు :-
[7-228-వ.]

4904} వేయువేలు  - వెయ్యివెయ్యిలు, సహస్రసహస్రములు, పదిలక్షలు, పద్మములు 10,00,000 లు. :-
[10.2-945-క.]

4905} వేయుశిరములభోగి  - వేయు (వెయ్యి (1,000)) శిరముల (తలల) భోగి (పడగల వాడు, దేహము కల వాజు, భోగించువాడు), ఆదిశేషుడు :-
[6-477-తే.]

4906} వేలు  - వేయికి బహువచనము :-
[9-113.1-ఆ.]

4907} వేలుపులతల్లి  - దేవతల అమ్మ, అదితి :-
[8-684-క.]

4908} వేలుపులప్రోలు  - వేలుపుల (దేవతలయొక్క) ప్రోలు (పట్టణము), స్వర్గము :-
[9-61-వ.]

4909} వేల్చుట  - అగ్నిహోత్రమున నేయి మొదలగునవి సమర్పించుట :-
[5.2-58-వ.]

4910} వేల్పుగమికాడు  - వేల్పు (దేవత)లకు గమికాడు (నాయకుడు), బ్రహ్మదేవుడు :-
[10.1-543-వ.]

4911} వేల్పులపెద్ద  - దేవతలందరి లోను అధికుడు , బ్రహ్మదేవుడు :-
[10.1-353.1-ఆ.]

4912} వేల్పులఱేడు  - వేల్పుల(దేవతల) ఱేడు (ప్రభువు), ఇంద్రుడు :-
[7-230-వ.]

4913} వైకారికములు  - సాత్విక అహంకారము, రాజస అహంకారం, తైజసము, తామసాహంకారం తామసము :-
[3-202-వ.]

4914} వైకుంఠనాథుడు  - వైకుంఠమునకు ప్రభువు, విష్ణువు :-
[2-261-క.]

4915} వైకుంఠపురము+కున్  - వైకుంఠపురమునకున్, నుగాగమ సంధి :-
[10.2-1276.1-తే.]

4916} వైకుంఠభర్త  - వైకుంఠమునకు భర్త (ప్రభువు), విష్ణువు :-
[6-486.1-తే.]

4917} వైకుంఠమందిరుడు  - వైకుంఠము నివాసముగా కలవాడ, విష్ణువు, శ్రీకృష్ణుడు :-
[5.1-181-మ.]

4918} వైకుంఠము  - విష్ణులోకము, అక్షయ స్థానము, పరమపదము, వ్యు. వివధాః కుంఠాః ( మాయాః) అస్మిన్ వి+కుంఠ+ (స్వార్థే) అమ్, త.ప్ర., తత్ప్రాప్తికి పెక్కు విరోధములు కలది. :-
[1-50.1-ఆ., 3-203-దం., 9-114-వ., 12-39-వ.]

4919} వైకుంఠుడు  - విష్ణువు, వైకుంఠవాసుడు, చాక్షుస మన్వంతరంలో వికుంఠ అనే ఆమెకు జన్మించినవాడు, కుంఠనము (మొక్కపోవుట) లేని వాడు, వ్యు., వికుంఠమే (జ్ఢానమ్) + అణ్, త.ప్ర., జడమైన ప్రకృతికి జ్ఞానమొసగి యుద్దరించిన వాడు. :-
[1-295-భు., 1-384-క., 1-388.1-తే., 3-921-వ., 5.2-58-వ., 6-55.1-తే., 6-331-వ., 7-3.1-ఆ., 7-30-శా., 7-145-శా., 7-170.1-ఆ., 7-239-వ., 7-240.1-తే., 7-259-శా., 7-389-క., 10.1-236-వ., 11-77-వ., 12-18-వ.]

4920} వైఖానసులు  - 1. వానప్రస్థులలో ఒక శాఖ వీరు అకృష్ట (దున్నకుండ లభించినవి) పచ్య (వండినవి) ఐన ఆహారులు (ఆహారం తినువారు) (4 388 వ.) 2. అర్చకులలో విష్ణు అర్చకులలో ఒక తెగవారు. మఱియొక తెగవారు పాంచరాత్రులు మఱియొక తెగ భాగవతులు. 3. విఖనస ధర్మ శాస్త్రాలను అనుసరించే వారు. :-
[4-645-వ.]

4921} వైడూర్యము  - విడూర దేశమున పుట్టిన రత్నములు, పిల్లి కన్ను మణి, :-
[2-230.1-తే.]

4922} వైతరణి  - యమలోకపు దారిలోని నిప్పుల నది, వ్యు. వితరణముల (దానముల)చే దాటబడునది :-
[2-24-మ., 2-26-వ., 5.2-136-వ., 7-364-వ.]

4923} వైదర్భి  - విదర్భదేశ రాకుమారి, భీమకుని పుత్రిక, రుక్మిణి :-
[10.1-1737-వ., 10.2-831.1-తే.]

4924} వైదిక  - వేదంలో చెప్పబడ్డది. వైదిక విధి. :-
[3-131.1-తే.]

4925} వైదికధర్మమార్గనిర్ణేత  - వైదిక (వేదశాస్త్రము లందలి) ధర్మ (ధర్మబద్ధమైన) మార్గ (విధానములను) నిర్ణేత (నిర్దేశించెడివాడు), బ్రహ్మదేవుడు :-
[6-278-ఉ.]

4926} వైదేహుడు  - విదేహరాజ్యమునకు ప్రభువు, జనకుడు :-
[10.2-92.1-తే.]

4927} వైనతేయుడు  - వినతా దేవి యొక్క పుత్రుడు, గరుత్మంతుడు :-
[3-538.1-తే., 3-751-వ.]

4928} వైన్యుడు  - వేనుని పుత్రుడు, పృథువు :-
[4-438-కవి., 4-444-వ., 4-454.1-తే., 4-468-వ., 4-637-ఆ.]

4929} వైమానికులు  - విమానము లందు సంచరించువారు, దేవయోని విశేషములు :-
[8-686-వ., 10.1-153-వ.]

4930} వైయాసి  - వ్యాసుని పుత్రుడు, శుకుడు :-
[2-52-వ.]

4931} వైరాగ్యము  - రాగబంధనములు లేకపోవుట. :-
[2-10-క., 3-203-దం.]

4932} వైరాజపురుషుడు  - (విశ్వముగ) విరాజిల్లుతున్న సామర్థ్య రూపుడు (పురుషుడు), విష్ణువు :-
[3-213-వ.]

4933} వైరోచని  - విరోచనుని పుత్రుడు, బలి :-
[8-180-వ., 8-551-వ., 10.1-1236-దం.]

4934} వైరోచనుడు  - విరోచనునిపుత్రుడు, బలి :-
[8-618-వ.]

4935} వైవస్వతుడు  - వివస్వతుని (సూర్యుని) కుమారుడు, యముడు :-
[10.2-474-వ.]

4936} వైశాఖతానకము  - కిందు మీదుగ శాఖల వలె చేతులు చాచి వేళ్ళు తాడించుకొనుచు నటించుట, రాసక్రీడా పారిభాషిక పదము. :-
[10.1-1084-వ.]

4937} వైష్ణవాలయము  - 1. విష్ణువు యొక్క నివాసము, వైకుంఠము, 2. విష్ణువు ఆరాధించు కోవెల, గుడి :-
[8-558-వ.]

4938} వైష్ణవి  - మాతృకాక్షేత్రమున వైష్ణవి (సర్వ లోకములకు వెలుపల లోపల ఉండెడియామె) :-
[10.1-61-వ.]

4939} వ్యసనము  - కామక్రోధములవలన పుట్టిన దోషము, [ఇవి యేడు. పానము, స్త్రీ, మృగయ, దూతము, (ఇవి కామమువలనఁ బుట్టినవి.) వాక్పారుష్యము, దండపారుష్యము, అర్థదూషణము. (ఇవి కోపమువలనఁబుట్టినవి.)] :-
[1-512-మ., 4-284-చ.]

4940} వ్యాపకము  - ఇది హిందూ తర్క పారిభాషిక పదము. 1. నియత సాహచర్యము వ్యాప్తి, 2. అవినాభావ రూప సంబంధము వ్యాప్తి, 3. ధూమము వ్యాప్యము, 4. అగ్ని వ్యాపకము, 5. వ్యాప్తిసహితమైనది వ్యాప్య మనబడును. 6. వ్యాప్తి నిరూపకము వ్యాపక మనబడును. 7. వ్యాపకమెప్పుడును వ్యాప్యమునకంటె నెక్కుడు ప్రదేశ మాక్రమించుకొని యుండును, అగ్ని లేనిది ధూమ ముండదు. కాని ధూమము లేనిది అగ్ని యుండును. :-
[4-540-వ.]

4941} వ్యాప్యము  - ఇది హిందూ తర్క పారిభాషిక పదము. 1. నియత సాహచర్యము వ్యాప్తి, 2. అవినాభావ రూప సంబంధము వ్యాప్తి, 3. ధూమము వ్యాప్యము, 4. అగ్ని వ్యాపకము, 5. వ్యాప్తిసహితమైనది వ్యాప్య మనబడును. 6. వ్యాప్తి నిరూపకము వ్యాపక మనబడును. 7. వ్యాపకమెప్పుడును వ్యాప్యమునకంటె నెక్కుడు ప్రదేశ మాక్రమించుకొని యుండును, అగ్ని లేనిది ధూమ ముండదు. కాని ధూమము లేనిది అగ్ని యుండును. :-
[4-540-వ.]

4942} వ్యాసనందనుడు  - వ్యాసుని యొక్క కొడుకు, శుకమహర్షి. :-
[9-3.1-తే., 10.1-595-వ.]

4943} వ్యాసునితనయుడు  - వేదవ్యాసుని పుత్రుడు, శుకమహర్షి :-
[3-443-క.]

4944} వ్యాసునిసుతుడు  - శుకమహర్షి :-
[3-261-క.]

4945} వ్యాహృతులు  - 1భూః 2భువః 3సువః వ్యాహృతి త్రయం, 1. భూః, 2. భువః, 3. సువః, 4. మహః, 5. జనః, 6. తపః, 7. సత్యమ్ సప్త వ్యాహృతులు :-
[3-388-వ., 5.1-122-వ.]

4946} వ్యుష్టము  - తెల్లవారకపూర్వపు కాలము, వేకువ :-
[4-390-వ.]

4947} వ్యూహచతుష్టయములు, చతుర్వ్యూహములు - 1వాసుదేవ 2సంకర్షణ 3ప్రద్యుమ్న 4అనిరుద్ధ అనబడు నాలుగు :-
[10.1-1558-వ.]

4948} వ్యూహము  - 1. విశేషమైన శత్రుదుర్భేధ్యమైన సేనా రచనలు, 2. అయిదు విధములైన శ్రీమన్నాకాయణుని స్వరూపములలో 2 వది వ్యూహము, మిగతావి 1. వరము, 3. విభవము, 4. అంతర్యామి, 5. అర్చామూర్తి :-
[10.1-1558-వ.]

4949} వ్రతము  - నిష్ఠ ధరించి చేసెడిది, ఉపవాసాది పుణ్యకర్మము,, వ్యు. వ్రజ (గతౌ)+ఘ జన్య తః, వృషో. కృ.ప్ర. :-
[6-521-వ.]

4950} వ్రాత్యుడు  - ఉపనయనాది సంస్కారములు లేని ద్విజుడు, సంస్కారరహితుడు :-
[12-8-వ.]

4951} వ్రేపల్లె  - రామ కృష్ణులు చిన్నతనము గడపిన నందుని మంద :-
[10.2-483.1-తే.]

4952} వ్రేల్మిడి  - చిటికవేసినంత తొందరగా, త్రుటి :-
[6-512-తే.]

4953} శంకరుడు  - సుఖమును కలుగజేయువాడు, శివుడు :-
[8-219-మ., 10.2-315-ఉ., 10.2-832-క., 12-39-వ.]

4954} శంఖబంధము  - మొదట ఒకరు ఆవల ఇరువురు వారికవతల ముగ్గురునుగా రెండుపక్కల నిలబడి నడుమనుండువారికి హస్త విన్యాసాదులను చూపునట్టిది, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

4955} శంఖాతీతము  - శంఖమునకు (మిక్కిలి పెద్ద సంఖ్యకు అనగా 10 ప్రక్కన 18 సున్నాలుండు సంఖ్యకు) మించినది, బహుఎక్కువైనది :-
[1-247-శా.]

4956} శంబరమృగము  - ఎఱ్ఱనివన్నెగల చిన్న జింక :-
[10.2-112-మ.]

4957} శంబరవిద్వేషి  - శంబరాసురుని విద్వేషి (శత్రువు), మన్మథుడు, ప్రద్యుమ్నుడు :-
[6-446.1-తే.]

4958} శంబరాంతకుడు  - శంబరాసురుని సంహరించిన వాడు, మన్మథుడు, ప్రద్యుమ్నుడు :-
[10.1-967.1-ఆ.]

4959} శంబరారాతి  - శంబరుని శత్రువు, మన్మథుడు, ప్రద్యుమ్నుడు :-
[9-230-వ.]

4960} శంబరారి  - శంబరాసురుని శత్రువు, ప్రద్యుమ్నుడు :-
[10.2-288-చ., 10.2-873-ఆ.]

4961} శంబరాసురభంజనుడు  - శంబరాసురుని శత్రువు, ప్రద్యుమ్నుడు. :-
[1-348.1-తే.]

4962} శంబరుడు  - ఒక అసురుడు, శంబ+అరచ్, శంబతి సజ్జనాన్ విరుద్ధం గచ్ఛతి, సజ్జనులకు విరుద్ధంగా వెళ్లువాడు. శంబరాసురుడు. :-
[2-190-చ., 7-29-వ.]

4963} శంభుడు  - శం+భూ+డు, శం మంగళం భవతి అస్మాత్, ఇతని నుండి శుభము జరుగును. శివుడు; :-
[10.2-413-క.]

4964} శకటవదనపార్థివచారము  - ముందరి వైపున బండిచక్రము వలె కనబడునట్లు పాదములను తిప్పితిప్పి పెట్టుచు పోవుట, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

4965} శకటాసనజానువర్తన  - బండి నిలిచినట్టు ఒక కాలు వంచి దానిలో మరియొక కాలు చొప్పించి నిలిచి నటించుట, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

4966} శకుని  - గాంధార దేశపు రాజు అగు సుబలుని కొడుకు. గాంధారికి సోదరుఁడు. దుర్యోధనుని మేనమామ. :-
[3-34-క., 7-29-వ.]

4967} శక్తి  - 1) చర్నాకోల, 2) బలిమి 3) ఇచ్ఛాది (ఇచ్ఛాశక్తి / ద్రవ్యశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి), 4) ఉత్సాహాది (ఉత్సాహము, ప్రభుత్వము, మంత్రము), 6) సత్వాది (సత్వము, రజస్సు, తమస్సు), 6. సర్వజ్ఞత్వాది, 7. పార్వతి, 8. పరాశరుని తండ్రి :-
[8-222.1-ఆ., 10.2-165-వ., 10.2-401-వ., 10.2-517-క.]

4968} శక్తినికరము  - అవ్యక్త, మహదహంకారాది శక్తుల సమూహము, సర్వజ్ఞ సర్వతంత్ర అనాదిబోధ నిత్యతృప్తి నిత్యలుప్త అనంతాది శక్తుల సమూహము :-
[10.1-1071-వ.]

4969} శక్తిమనుమడు  - పరాశరుని తండ్రి శక్తి కనుక అతని మనవడు, వ్యాసుడు :-
[10.2-929-వ.]

4970} శక్తులు  - సర్వజ్ఞత్వాది శక్తులు :-
[10.2-594-తే.]

4971} శక్రవైరి  - శక్రుడు (ఇంద్రుడు) యొక్క వైరి (శత్రువు), హిరణ్యకశిపుడు :-
[7-250-వ.]

4972} శక్రసూనుడు  - ఇంద్రుని పుత్రుడు, అర్జునుడు :-
[1-173-శా.]

4973} శక్రుడు - శక్రము (వజ్రాయుధము) కలవాడు, వజ్రి, ఇంద్రుడు :-
[6-507-వ.]

4974} శక్రుడు  - దుష్టులను శిక్షించు శక్తి కలవాడు, శక్+రక్, శక్నోతి దైత్యాన్ నాశయితుమ్, రాక్షసులను నశింపజేయు సామర్థ్యము కలవాడు. ఇంద్రుడు :-
[7-391-క., 9-135-ఆ., 10.1-888-శా., 10.1-945-వ., 10.2-407-మ., 10.2-438-చ.]

4975} శచీధవుడు  - శచీదేవి భర్త, ఇంద్రుడు :-
[3-113-మ.]

4976} శతచంద్రము  - నూరు చంద్రుళ్ళుకల ఒక డాలు పేరు, విష్ణువు చర్మము (డాలు) పేరు :-
[4-443.1-తే.]

4977} శతధృతి  - శత (నూరు)(100) ధృతి (యజ్ఞములు) :-
[4-684-వ.]

4978} శతబాహుడు  - ఒక అసురుడు, శత (నూరు) బాహుడు (చేతులు గలవాడు), హిరణ్యకశిపుని సేనలోని వాడు. :-
[7-29-వ.]

4979} శతరూపపతి  - శతరూప యొక్క భర్త, స్వాయంభువుడు :-
[8-8-మ.]

4980} శతానందుడు  - బ్రహ్మదేవుడు, వ్యు.శత+ఆ+నంద+అణ్, కృ.ప్ర., పలువురిని ఆనందపెట్టువాడు :-
[11-113-వ.]

4981} శత్రుభీకరచక్రశంఖగదాపద్మవిహితచతుర్భాహుడు  - శత్రువులకు భయంకరమైన చక్రము శంఖము గదా పద్మములు తో విహిత (కూడిన) చతుర్ (నాలుగు 4) బాహుడు (చేతులు కలవాడు) , విష్ణువు :-
[3-924.1-తే.]

4982} శత్రులోకప్రహారుడు  - శత్రువుల సమూహమును సంహరించువాడు, రాముడు :-
[9-735-మాలి., 12-53-మాలి.]

4983} శబ్దబ్రహ్మ  - ఆకాశ మనబడు దేవుడు, పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనబడు నాలుగు వాక్కులుగ శబ్దబ్రహ్మ ఉచ్చరింపబడును :-
[4-194-వ.]

4984} శబ్దము  - ధ్వని. ఆకాశ లక్షణము, శ్రవణేంద్రియముచే గ్రహింపబడునది, :-
[3-202-వ.]

4985} శబ్దాది  - 1శబ్దము 2స్పర్శము 3రూపము 4రసము 5గంథములు, ఇంద్రియవిషయములు :-
[4-286.1-తే., 7-464.1-తే.]

4986} శబ్దాదివిషయపంచకము  - 1శబ్దము 2స్పర్శము 3రూపము 4రసము 5గంథములు, ఇంద్రియవిషయములు :-
[3-756-వ.]

4987} శబ్దాదులు  - 1శబ్దము 2స్పర్శము 3రూపము 4రసము 5గంథములు, ఇంద్రియవిషయములు :-
[6-461-వ.]

4988} శమనుండు  - యముడు, శమ్+ణిచ్+ల్యుట్, శమయతి తస్య భావః కర్మ వా. శమింప చేయువాడు., పాపములను, ప్రాణములను శమింప (అణగునట్లు) జేయువాడు. :-
[4-426-క., 4-442.1-తే., 5.2-136-వ., 7-257.1-తే., 10.1-1429-క.]

4989} శమము  - శాంతగుణము, మనోవ్యాపారంబులను ఉపశమింపచేయుట, కామక్రోధాదులు లేక ఉండుట, శాంతి :-
[4-241-వ., 5.1-99-వ., 11-54-వ.]

4990} శమ్యాప్రాసము  - సరస్వతీ నదికి పడమటి ఒడ్డున కల ఋష్యాశ్రమము, శమము యను ఆహారము గలది, ఇక్కడనే వ్యాసునికి నారదుడు భాగవతం ఉపదేశించారు. :-
[1-136-వ.]

4991} శరణాగతసంగతజాడ్యహరుడు  - శరణ (శరణని) ఆగత (వచ్చినవారికి) సంగత (కలిగిన) జాడ్య (జడత, జిడ్డు) హరుడు (నశింపజేసెడివాడు), విష్ణువు :-
[6-530-తో.]

4992} శరణాగతామరానోకహుడు  - శరణాగత (శరణువేడినవారికి) అమర (దేవ, కల్ప) అనోకహుడు (వృక్షమువంటివాడు), విష్ణువు :-
[8-92-ఉ.]

4993} శరణ్యత  - శరణుజొచ్చుటకు తగి ఉండుట :-
[1-403-వ.]

4994} శరధిమదవిరాముడు  - శరధి (సముద్రము యొక్క) మద (గర్వమును) విరాముడు (అణచినవాడు), శ్రీరాముడు :-
[10.2-1342-మాలి.]

4995} శరనిధికన్యకామణి  - శరము (నీరు) కి నిథి వంటివాని, సముద్రుని కన్యకామణి (శ్రేష్ఠమైన పుత్రిక), లక్ష్మీదేవి :-
[3-534-చ.]

4996} శరనిధిగర్వభంజనుడు  - శరనిధి (సముద్రుని) గర్వ (గర్వమును) భంజనుడు (పోగొట్టినవాడు), రాముడు :-
[7-482-చ.]

4997} శరభము  - సింహములను తినునది, మీద కళ్ళు, 8 కాళ్ళు ఉండెడి జంతువు, మీగండ్లమెకము :-
[1-122-క., 9-595-క., 10.1-1610-క.]

4998} శరవిదళితసారంగుడు  - శర (బాణముచే) విదళిత (మిక్కిలిగా బేధింపబడిన) సారంగుడు (లేడిగలవాడు), రాముడు :-
[4-975-క.]

4999} శరీరధారులు  - దేహము ధరించినవారు, మానవులు :-
[7-142-ఉ.]

5000} శరీరము  - శౄ+ఈరన్, శీర్యతే రోగాదినా. రోగాదులచే క్షీణింపబడును. శీర్యతే శరీర, దేహము, మేను :-
[10.2-721-క.]

5001} శరీరులు  - శరీరము ధరించిన వారు, మానవులు :-
[2-210-ఉ.]

5002} శర్వాగ్రజన్ములు  - సృష్టాదిని బ్రహ్మదేవుడు సనకాదుల సృష్టించెను. తరువాత అతని కనుబొమముడినుండి రుద్రరూపమున శివుడు జన్మించెను. అందుచేత శివుని యగ్రజన్ములు సనకాదులు. :-
[4-604.1-తే.]

5003} శర్వాణి  - శర్వుని (శివుని) భార్య, సతి :-
[4-79.1-తే.]

5004} శర్వుడు  - ప్రళయమున భూతలములను హింసించువాడు, శౄ+వ, శృణాతి హినస్తి దుఃఖాని, దుఃఖములను పోగొట్టువాడు. శివుడు, శంకరుడు :-
[8-672.1-తే., 9-112-వ.]

5005} శశధరుండు  - శశము (కుందేలు)ను ధరించినవాడు, చంద్రుడు :-
[6-85.1-తే.]

5006} శశాంక  - శశ (కుందేలు) గుర్తు కలవాడు, చంద్రుడు :-
[1-2-ఉ.]

5007} శశి  - శశ (కుందేలు) గుర్తుగలవాడు, చంద్రుడు :-
[4-426-క., 10.1-340-క., 10.1-1648-మ.]

5008} శశికులతిలకుడు  - శశి (చంద్ర) కుల (వంశమునకు) తిలకుడు (ముఖ్యాభరణమైన వాడు), ధర్మరాజు. :-
[7-442-క.]

5009} శశిచూడామణి  - శశి (చంద్రుడు) చూడామణిగా (శిరోమణిగా) కలవాడు, శివుడు :-
[10.1-1648-మ.]

5010} శశిముఖి  - చంద్రునివంటి ముఖము కల స్త్రీ :-
[1-265-క.]

5011} శశిమౌళి  - చంద్రుడు సిగలో కలవాడు, ఈశానుడు, ఈశాన్య దిక్పతి, శివుడు :-
[10.2-773-చ.]

5012} శశ్వత్ప్రకాశుడు  - శశ్వత్ (శాశ్వతమైన) ప్రకాశకుండు (ప్రకాశము కలవాడు), విష్ణువు :-
[3-145.1-తే., 3-991.1-తే., 4-233.1-తే.]

5013} శశ్వత్ప్రదీపుడు  - శశ్వత్(శాశ్వతమైన) ప్రదీపుడు (వెలుగును ప్రసాదించువాడు), విష్ణుమూర్తి. :-
[3-294.1-తే.]

5014} శశ్వత్ప్రశాంతుడు  - శాశ్వతమైన ప్రశాంతి కలవాడు, భగవంతుడు :-
[2-207-క.]

5015} శశ్వత్స్వరూపుడు  - శాశ్వతమైన స్వరూపము కలవాడు, విష్ణువు :-
[3-302-తే.]

5016} శశ్వద్విలాసుడు  - శశ్వత్ (శాశ్వతముగా) విలాసుడు (విరాజిల్లువాడు), విష్ణువు :-
[8-483.1-తే.]

5017} శశ్వన్మూర్తి  - శశ్వత్ మూర్తి, శాశ్వతమే మూర్తీభవించిన వాడు :-
[2-110-మ.]

5018} శస్త్రరాజము  - శస్త్రములలో శ్రేష్ఠమైనది, చక్రము :-
[3-693-క.]

5019} శాంకరి  - సుఖప్రదాయిని, శివుని భార్య, పార్వతీదేవి, శం+కృ+అచ్, శం సుఖం కల్యాణం కరోతి, కల్యాణము కూర్చు దేవి :-
[12-39-వ.]

5020} శాంతకుడు  - మరణము కలుగ జేయువాడు, యముడు :-
[7-295-మ.]

5021} శాంతము  - కామక్రోధాది రాహిత్యము, శమ్+క్త, జాత శమః, ఓర్పు కల్గి ఉండుట; ప్రసత; సౌమ్యము; శాంతరసము. :-
[9-637-క.]

5022} శాంతవిగ్రహుని  - శాంతమైన స్వరూపము కలవానిని, శివుని :-
[4-138.1-తే.]

5023} శాంతి  - శమము, కామక్రోధాది రాహిత్యము, వ్యు. శమ (ఉశమే) క్తిన్, కృ.ప్ర., శమ్+క్తిన్, శామ్యతి తస్య భావః కర్మ వా] శాంతి; చిత్తోపశమనము; ఇంద్రియ నిగ్రహము. :-
[4-6-వ., 4-28-వ.]

5024} శాంతుడు  - శాంతముకలవాడు, విష్ణువు :-
[4-702.1-తే., 6-327.1-తే.]

5025} శాకము  - 1. టేకు (వృక్షము) 2. కూర (ఆకు, పువ్వు, కాయ మున్నగువాని లోనిది, 3. శాక ద్వీపము :-
[5.2-67.1-తే.]

5026} శారద  - బ్రహ్మక్షేత్రమున శారద (నలుపు (తమోగుణము) తెలుపు (సత్త్వగుణము) ఎరుపు (రజోగుణము) లను శారను కలిగించునామె) :-
[10.1-61-వ.]

5027} శార్ఙ్గపాణి  - శార్ఙ్గము అనెడి విల్లు ధరించువాడు, విష్ణువు :-
[4-347.1-తే., 4-373-ఆ.]

5028} శార్ఙ్గము  - శృంగముతో చేయబడినది, విష్ణువు యొక్క విల్లు :-
[10.2-516.1-తే.]

5029} శార్ఙ్గి  - శార్ఙ్గము అను విల్లు కలవాడు, విష్ణువు :-
[10.1-1612.1-తే.]

5030} శాల్మలి  - 1. బూరుగు చెట్టు, దీని నుండే బూరుగు దూది వస్తుంది, ఈ దూదితో మెత్తని పరుపులు చేస్తారు, పట్టుదూది 2. శాల్మలి ద్వీపము :-
[5.2-61-క.]

5031} శాశ్వతుడు  - శాశ్వతముగానుండు వాడు, రాముడు, భగవంతుడు :-
[2-207-క., 11-1-క.]

5032} శింజని  - ధనుస్సుకు సంధించెడి తాడు, అల్లెతాడు, వింటినారి :-
[10.1-1557-మ.]

5033} శింశుమారచక్రము  - హరిపథము, ఓంకారపథము, జ్యోతిశ్చక్రము, గ్రహ నక్షత్ర మండలములు తిరిగెడు చక్రము :-
[2-30-వ., 4-322-వ.]

5034} శింశుమారము  - 1.మొసలి, 2.జ్యోతిశ్చక్రము, శింశుమార ఛక్రము :-
[5.2-92-క.]

5035} శిఖి  - సిగలు కలది, 1. అగ్ని 2. నెమలి :-
[10.1-340-క., 10.1-548.1-ఆ., 10.2-773-చ.]

5036} శితికంఠుడు  - శితి (నల్లని, తెల్లని) కంఠుడు (కంఠముకలవాడు), శివుడు :-
[4-183-చ.]

5037} శితివాసము  - ఒక పర్వతము, మేరుపర్వతం తామరదుద్దు, దాని చుట్టూ కేసరాలుగా ఉన్న పర్వతలలో ఒకటి. శితి (నల్లని, తెల్లని) వాసము (నివాసము కలది) :-
[5.2-30-వ.]

5038} శిపివిష్టుడు  - వ్యు. శిపి + విశ + క్త కృ.ప్ర., వెలుగై వ్యాపించువాడు, కిరణముల స్వరూపమున అంతటను వ్యాపించి యున్నవాడు, యజ్ఞపశువునందు వ్యాపించి యున్నవాడు, విష్ణువు (శబ్దరత్నాకరము) :-
[4-400-వ., 8-503.1-తే.]

5039} శిబిక  - మనుష్యులు మోసెడి వాహనము, పల్లకి, వ్యు. శివం కరోతి శివ(ణిచ్) + ణ్వుల్ అక అతః ఇత్వమ్ వశ్య టాప్, కృ.ప్ర. సుఖమును కలుగజేయునది :-
[5.1-139.1-తే.]

5040} శిబిచక్రవర్తి  - కపోతరూపుని కిచ్చిన శరణము కొరకు తన కండలు కోసి ఇచ్చినవాడు, శిబి ఒక దేశము. :-
[2-204.1-తే.]

5041} శిరోమణి  - శిరసున ధరించు రత్నాభరణము వంటిది, ఉత్తమురాలు :-
[3-835-మ.]

5042} శిరోరుహములు  - శిరస్సున రుహములు పుట్టునవి, శిరోజములు, తలవెంట్రుకలు :-
[7-421-వ.]

5043} శిలీముఖము  - శల్యము (ముల్లు) కొనయందు కలది, ఇనప ముల్లు (ఉక్కుముఖము) బాణము :-
[10.1-1757-వ., 10.1-1766.1-ఆ., 10.2-436-ఉ.]

5044} శిలోంఛనము  - గృహస్థాశ్రమంలో ఒక వృత్తి, పొలం కోసేటప్పుడు రాలిన గింజలను ఏరుకుని జీవనోపాధి పొందుట శింలోఛనము. వ్యు. శిలోంఛ ఊల్+ఉఛి+ఘఞ్, శిలేన ఉంఛ ఉపాత్త సస్యాత్ క్షేత్రాత్ శేషాపచయనమ్] క్షేత్రములో పంటను కోసిన తరువాత మిగిలి వున్న ధాన్యము. :-
[3-388-వ.]

5045} శివ  - 1. శివునిభార్య, పార్వతి, వ్యు, శో+వన్, శ్యతి విశినష్టి అమంగళమ్, అమంగళమును పోగొట్టుదేవి. పార్వతి, మంగళ. 2. అమంగళమును పోగొట్టువాడు, శివుడు :-
[9-16.1-తే.]

5046} శివగురుపుత్రుడు  - శివుని గురువు అంగిరసుడు అతని కొడుకు బృహస్పతి :-
[9-377-వ.]

5047} శివము - శివతరము శివతమము :-
[3-312-చ., 4-553.1-తే.]

5048} శివవల్లభ  - శివుని భార్య, పార్వతి :-
[10.1-1746-ఆ.]

5049} శివుడు  - 1.శివము (మంగళము, సుఖము, మోక్షము) ప్రదుడు (కలిగించువాడు), త్రిమూర్తులలో లయకారుడు 2.అహంకారేంద్రియమునకు అధిదేవత, 3. శో+వన్, శ్యతి విశినష్టి అమంగళమ్] అమంగళమును పోగొట్టువాడు. శివుడు :-
[4-18.1-తే., 5.2-38.1-ఆ., 8-242-మ., 10.1-1236-దం.]

5050} శిశిరఋతువు  - మాఘ ఫాల్గుణమాసములు, చలిఋతువు :-
[7-448-వ.]

5051} శిశిరకిరణుడు  - శిశిర(చల్లని) కిరణుడు (కిరణములుగలవాడు), చంద్రుడు :-
[7-285-వ.]

5052} శిశిరము  - చల్లనిది, మాఘ ఫాల్గుణమాసములు, చలిఋతువు :-
[5.2-30-వ.]

5053} శిశుపాలుడు  - కృష్ణుని మేనల్లుడు, చైద్యదేశపు యువరాజు :-
[2-190-చ., 3-87-వ., 3-97-చ., 7-9-వ.]

5054} శిష్టనాథుడు  - శిష్టు (సదాచారు)లకు నాథుడు (రక్షకుడు), విష్ణువు :-
[4-703.1-తే.]

5055} శీతకరముఖి  - చంద్రముఖి, స్త్రీ :-
[10.1-1496-క.]

5056} శీతకరుడు  - చల్లని కరుడు (కిరణములవాడు), చంద్రుడు :-
[9-382-క.]

5057} శీతకిరణుడు  - చల్లని కిరణములు కలవాడు, చంద్రుడు :-
[10.1-1291-క.]

5058} శీతభానుడు  - శీత (చల్లగా) భానుడు (ప్రకాశించువాడు), చంద్రుడు :-
[8-61-ఆ.]

5059} శీతాంశుడు  - చల్లని కిరణాలు కలవాడు, చంద్రుడు :-
[1-144-మ., 3-421-తే.]

5060} శీతాంశుబింబానన  - శీతాంశుబింబ (చంద్రబింబమువంటి) ఆనన (మోము కలామె), సుందరి. :-
[10.2-137-శా.]

5061} శీతుంశుముఖి  - చంద్రముఖి, శీతాంశు (చంద్రుని వంటి) ముఖి (మోము కలామె), స్త్రీ. :-
[10.1-314-క.]

5062} శీలవిరహితుడు  - నిత్యనిర్మలుడు నిష్కర్ముడు కనుక మంచి చెడు నడవడికలకు అతీతుడు, విష్ణువు :-
[10.1-901-క.]

5063} శుండాలము  - శిండ (తొండము)తో నీరు గ్రహించునది, ఏనుగు :-
[10.1-1321-వ.]

5064} శుకతుండకరభావము  - చిలుకముక్కు వలె బొటనవేలిని తర్జనీ అనామికలను వంచి పట్టునది, శ్లో. అస్మిన్ననామికా వక్రాశుకతుండ కరోభవేత్, రాసక్రీడా పారిభాషిక పదము. :-
[10.1-1084-వ.]

5065} శుకుడు  - వ్యాసపుత్రుడు, భాగవత పురాణ ప్రయోక్త, శ్రోత పరీక్షిత్తు. :-
[6-11.1-తే.]

5066} శుక్తిపార్థివచారము  - అడుగులు వంపుగా బోరగిలం చేర్చి పెట్టుచు పోవుట, రాసక్రీడా పారిభాషిక పదము. :-
[10.1-1084-వ.]

5067} శుక్రకుమారకులు  - శుక్రాచార్యుని కుమారులు, చండామార్కులు :-
[7-134-ఉ.]

5068} శుక్లపక్షము  - తెల్ల (వెన్నెల) రాత్రులు ఉండు పక్షము, పూర్ణిమకు ముందరిరోజులు కల పక్షము (పదిహేను రోజులు) :-
[3-346-వ., 7-448-వ.]

5069} శుచి  - పరిశుద్ధుడైన వ్యక్తి. :-
[4-34-వ.]

5070} శుద్దాంతమందిరము  - అంతఃపురము, వ్యు. శుద్ధః అంతః అస్య, బ.వ్రీ. ఎట్టి ఉపద్రవములు లేకుండ శోధింపబడు ప్రాంతము గల మందిరము, శుద్ధస్య (శుద్ధే) అంతః ష.త. మందిరము (నివాసము) :-
[3-532-మ.]

5071} శుద్ధసత్త్త్వగుణుడు  - పరిశుద్ధమైన సత్త్త్వగుణము కలవాడును, విష్ణువు :-
[3-506-చ.]

5072} శుద్ధుడు  - పరిశుద్ధమైనవాడు, విష్ణువు :-
[4-936-వ.]

5073} శుభగుణములు  - సర్వజ్ఞత్వాది గుణములు :-
[10.2-1203-వ.]

5074} శుభప్రదుడు  - శుభకరుడు, విష్ణువు :-
[3-669-క.]

5075} శుభమూర్తి  - శుభములు (మేలైనవృత్తి) స్వరూపమైన వాడు, కృష్ణుడు :-
[10.1-787-మ.]

5076} శుభరాజీవాక్షుడు  - శుభ (చక్కని) రాజీవ (పద్మదళముల) వంటి అక్షుడు (కన్నులుగలవాడు), హరి :-
[6-1-శా.]

5077} శుభస్వరూపములు  - సచ్చిదానందాది స్వరూపములు :-
[10.2-1203-వ.]

5078} శుభాంగుడు  - శోభనకరమైన (చక్కని) దేహము కలవాడు, కృష్ణుడు :-
[10.1-1331.1-తే.]

5079} శూన్యప్రవృత్తుడు  - శూన్యమైన ప్రవృత్తులు కలవాడు, విష్ణువు :-
[4-703.1-తే.]

5080} శూరసుతుడు  - శూరుని యొక్క పుత్రుడు, వసుదేవుడు :-
[10.1-146-క.]

5081} శూరసేనుడు  - శ్రీకృష్ణుని తాత, వసుదేవుని తండ్రి :-
[3-49-చ.]

5082} శూలప్రోతము  - శూలము పైన గుచ్చి శిక్షించుట, నరక విశేషము :-
[5.2-136-వ.]

5083} శూలము  - పొడవైన సన్నని కడ్డీ చివరన కొన బాగా సూదిగా ఉండెడి దళసరిగా నున్న ఆకు రూపు ఆయుధవిశేషము :-
[10.2-165-వ.]

5084} శూలి  - శూలాయుదము కలవాడు, శివుడు :-
[7-384-వ., 9-514.1-ఆ., 10.2-278-తే.]

5085} శృంగారరత్నాకరుడు  - శృంగార రసమునకు సముద్రము వంటివాడు, కృష్ణుడు :-
[1-201-శా.]

5086} శేషశాయి  - శేష (ఆదిశేషుని)పై శాయి (శయనించువాడు), విష్ణువు :-
[7-169.1-తే.]

5087} శేషుడు  - అనంతు డనెడి వేయిపడగలు కల సర్పరాజు, మహాప్రళయమున సర్వంసహా లయమైన తరువాత శేషముగా మిగిలి విష్ణుని సేవయందుండు వాడు, విష్ణువు పాలసముద్రమున శేషుడు శయనించుటకు పాన్పుగా ఉండును. :-
[5.2-107-వ., 10.1-16-క., 10.1-1232-ఉ.]

5088} శైలభేదనుశరాసనము  - శైలభేదను (పర్వతములను కొట్టెడివాని, ఇంద్రుని) శరాసనము (విల్లు), ఇంద్రధనుస్సు :-
[10.1-762.1-తే.]

5089} శైలము  - శిలలగుట్ట, కొండ :-
[10.1-921-శా.]

5090} శైవలిని  - నాచుగలది, నది :-
[9-275-క.]

5091} శోణపురము  - బాణాసురుని పట్టణము :-
[10.2-318-వ.]

5092} శోభనచారిత్రుడు  - శుభకరమైన నడవడిక కలవాడు, విష్ణువు :-
[3-284-మ.]

5093} శోభనభాస్వత్పరిపూర్ణయౌవనకళాభ్రాజిష్ణు  - శుభకరమై ప్రకాశిస్తున్న నిండుజవ్వనము యొక్క శోభచే ప్రకాశించువాడు, విష్ణువు :-
[3-148-మ.]

5094} శోభనములు+కని  - శోభనములుగని, గసడదవాదేశ సంధి :-
[10.2-1235-క.]

5095} శౌచము  - నిర్మలత్వము, శుచిత్వము, ముఱికి లేకుండుట, పారిశుద్ధ్యము, ఇది భాహ్య, అభ్యంతర శౌచములని రెండు విధములు. :-
[12-20-వ.]

5096} శౌచాచారములు  - బాహ్యభ్యంతర శౌచము ఆచరించునవి, స్నానము, నీరు పుక్కిలించుట, వేదపారాయణము, దీక్షలుపట్టుట, నియమములు పాటించుట, అగ్నిహోత్రాది సేవించుటలు మొదలగునవి. :-
[5.1-121-మ.]

5097} శౌనకుడు  - శునకుడను ఋషివర్యుని పుత్రుడు, ఒక మహర్షి, భాగవతాది పురాణ ప్రవక్త సూతునికి శ్రోత శౌనకుడు :-
[4-973-క.]

5098} శౌరి  - శూరుని వంశపు వాడు, 1.శూరుని మనవడు, శ్రీకృష్ణుడు. 2.శూరిని పుత్రుడు, వసుదేవుడు :-
[8-109-మ., 9-229-ఆ., 9-463-క., 9-728.1-తే., 10.1-41-క., 10.1-144-క., 10.1-211-వ., 10.1-305.1-తే., 10.1-750-క., 10.1-1021.1-ఆ., 10.1-1171-ఉ., 10.1-1321-వ., 10.1-1363-క., 10.1-1454-చ., 10.1-1498-ఆ., 10.1-1692.1-ఆ., 10.2-47-ఆ., 10.2-88.1-తే., 10.2-159-శా., 10.2-534.1-తే., 10.2-614-క.]

5099} శౌర్యము - శౌర్యతరము శౌర్యతమము :-
[3-479-క.]

5100} శ్రవణమంగళనామధేయుడు  - శ్రవణ (వినినంతనే) మంగళ (శుభములను కలిగించెడి) నామధేయుడు (పేరు గలవాడు), విష్ణువు :-
[8-483.1-తే.]

5101} శ్రవణేంద్రియములు  - వినుటకైన సాధనములు, చెవులు :-
[2-86-వ.]

5102} శ్రితజనత్రాణైకపారీణుడు  - ఆశ్రయించిన జనుల త్రాణము (రక్షించుట) అను మిక్కిలి నేర్పు కలవాడు, విష్ణువు :-
[3-373-మ.]

5103} శ్రితభయహరణుడు  - శ్రిత (ఆశ్రయించినవారి) భయ (భయమును) హరణుడు (హరించువాడు), విష్ణువు :-
[3-841-క.]

5104} శ్రితమందారుడు  - ఆశ్రయించినవారికి కల్పవృక్షము వంటి వాడు, విష్ణువు. :-
[8-657-క.]

5105} శ్రితవదనాలంకరిష్ణుడు  - శ్రిత (ఆశ్రయిచినవారి) వదన (మోములను) అలంకరిష్ణుడు (వికాసవంతము చేయు శీలముగల వాడు, ఆనందింపజేయు శీలముగల వాడు), విష్ణువు :-
[10.1-109-క.]

5106} శ్రియఃపతి  - శ్రియస్ (శ్రేయస్సు) నిచ్చు పతి (ప్రభువు), విష్ణువు) :-
[2-236-మ.]

5107} శ్రీ  - సంపద, భార్గవి (భృగువుసుత), లక్ష్మీదేవి, బ్రహ్మవిద్య :-
[4-26-వ., 10.1-1236-దం.]

5108} శ్రీకంఠచాపఖండనుడు  - శ్రీకంఠుని (కఱ కంఠుడు యైన శివుని) చాప (విల్లును) ఖండనుడు (విరిచినవాడు), రాముడు :-
[10.1-1-క.]

5109} శ్రీకంఠుడు  - కఱకంఠుడు, వ్యు. శ్రీ కఠే అస్య, బ.వ్రీ., కంఠమున వన్నెకలవాడు, శివుడు :-
[7-389-క., 7-393-క., 9-227-మ.]

5110} శ్రీకరుడు  - శ్రీ (శుభములను, సంపదలను) కరుడు (కలిగించెడివాడ), విష్ణువు, కృష్ణుడు, రాముడు :-
[5.1-1-క., 5.1-181-మ., 6-400-ఉ., 6-530-తో., 10.2-1-క.]

5111} శ్రీకాంతాతిలకము  - శుభకరమైన స్త్రీలలో ఉత్తమురాలు, శ్రేష్ఠురాలు శ్రీకాంత (లక్ష్మీదేవి), లక్ష్మి :-
[2-234-శా.]

5112} శ్రీకాంతాహృదయప్రియుడు  - శ్రీకాంత (లక్ష్మీదేవి) యొక్క హృదయమునకు ప్రియుడు (ప్రియమైనవాడు), విష్ణువు :-
[5.2-1-క.]

5113} శ్రీకాంతుడు  - శ్రీ (లక్ష్మీదేవి) కాంతుడు (భర్త), విష్ణువు :-
[6-188.1-ఆ.]

5114} శ్రీకారము  - శ్రీ అను అక్షరము యొక్క రూపము, శుభకరము :-
[3-288-వ.]

5115} శ్రీతరుణీహృదయస్థితుడు  - శ్రీతరుణీ (లక్ష్మీదేవిని) హృదయమందు స్థితుడు (నిలుపుకున్నవాడు), కృష్ణుడు :-
[5.2-166-క.]

5116} శ్రీదయితాచిత్తచోరుడు  - శ్రీ (లక్ష్మి) దయిత (దేవి)యొక్క చిత్తచోర (మనసు దొంగిలించిన వాడు), విష్ణువు :-
[8-657-క.]

5117} శ్రీదయితుడు  - శ్రీ (లక్ష్మీదేవి) దయితుడు (భర్త), విష్ణువు, :-
[9-498-క.]

5118} శ్రీదేవుడు  - లక్ష్మీదేవి (శ్రీ) యొక్క దేవుడు, విష్ణువు :-
[3-227-క.]

5119} శ్రీధరుడు  - శ్రీ (లక్మీదేవిని) (వక్షమున) ధరుడు (ధరించినవాడు), విష్ణువు :-
[6-324-లగ్రా.]

5120} శ్రీనాథనాథుడు  - శ్రీ (లక్ష్మీదేవి)కి నాథ (భర్త) ఐన నాథుడు (ప్రభువు), విష్ణువు :-
[3-203-దం.]

5121} శ్రీనాథుడు  - 1. శ్రీ (లక్ష్మీదేవి)కి నాథుడు (భర్త), విష్ణువు. 2. శ్రీ (చిచ్ఛక్తి యైన లక్ష్మీదేవి)కి నాథుడు (భర్త), విష్ణువు, 3. మరుత్తరాట్చరిత్ర, కాశీఖండము, హరవిలాసము మున్నగునవి వ్రాసిన ప్రౌఢకవి, వీరు పోతనకు మేనమామ అని నానుడి :-
[4-451-క., 6-11.1-తే., 7-169.1-తే., 10.1-66-క., 10.1-1651-శా.]

5122} శ్రీనాయకుడు  - శ్రీ (లక్ష్మీదేవికి) నాయకుండు (ప్రభువు), విష్ణువు :-
[5.1-43.1-తే., 11-17-క.]

5123} శ్రీనికేతనుడు  - శ్రీ (సిరికి, లక్ష్మీదేవికి) నికేతనుడు (నివాసమైనవాడు), విష్ణువు :-
[3-507-వ.]

5124} శ్రీనిధి  - సంపదలకు నిలయమైనవాడు, కృష్ణుడు :-
[10.2-1019-ఉ.]

5125} శ్రీనిలయశరీరుడు  - శ్రీ (సంపదలకు) నిలయమైన శరీరముగలవాడు, కృష్ణుడు :-
[5.2-165-చ.]

5126} శ్రీపతి  - శ్రీ (లక్ష్మీదేవి) పతి (భర్త), విష్ణువు :-
[3-56-క., 3-106-క., 6-32-క., 6-121-క., 6-179-క., 10.2-651-క.]

5127} శ్రీపు  - శ్రీ (లక్ష్మీదేవి) పతి, విష్ణువు :-
[5.1-98.1-తే.]

5128} శ్రీభర్త  - శ్రీ (లక్ష్మీదేవి)కి భర్త (పెనిమిటి), విష్ణువు :-
[10.1-876-మ.]

5129} శ్రీభవనుడు  - సంపదలకు నిలయమైన వాడు, కాలయవనుడు :-
[10.1-1639-ఉ.]

5130} శ్రీమన్నాముడు - శ్రీమత్ (మంగళవంతమైన) నామ (పేరు గలవాడు), రాముడు :-
[8-1-క.]

5131} శ్రీమన్నారాయణదేవుడు - అత్యంత శుభకరమైన నారాయణు డగు దేవుడు :-
[1-63-వ.]

5132} శ్రీమన్నారాయణుడు  - శ్రీమత్ (అణిమాది సంపదలతో కూడినవాడు) ఐన నారాయణుడు (విష్ణువు) :-
[5.2-164-వ., 6-258-వ., 6-507-వ., 10.1-19-క.]

5133} శ్రీమహితోన్నతుడు  - శ్రీ (శుభకరమైన) మహిత (గొప్ప) ఉన్నతుడు (ఉన్నతమైనవాడు), పరశురాముడు :-
[6-305-క.]

5134} శ్రీమహిళ  - శ్రీ (సంపదలకు) మహిళ (దేవి), లక్ష్మిదేవి :-
[7-359-ఉ.]

5135} శ్రీమహిళాధిపుడు  - శ్రీ (లక్ష్మీ) మహిళ (దేవి) యొక్క అధిపుడు (భర్త), విష్ణువు :-
[3-505-ఉ.]

5136} శ్రీయుతాకారుడు  - సౌందర్య సంపదలతో కూడి ఉన్న వాడు, కృష్ణుడు :-
[10.1-1704.1-తే.]

5137} శ్రీయుతుడు  - శ్రీ (లక్ష్మీదేవి, సంపదల)తో యుతుడు (కూడి యుండువాడు), విష్ణువు :-
[9-420-క., 10.1-1243-క.]

5138} శ్రీరమణీమనోవిభుడు  - శ్రీరమణీ (లక్ష్మీదేవి) మనసునకు విభుడు, విష్ణువు :-
[3-109-ఉ.]

5139} శ్రీరమణీరమణుడు  - శ్రీరమణీ (లక్ష్మీదేవి) రమణుడు (భర్త), విష్ణువు :-
[6-38-క., 12-47-క.]

5140} శ్రీరమణీశ్వరుడు  - శ్రీ (లక్ష్మీ) రమణి (దేవి) యొక్క ఈశ్వరుడు (భర్త), విష్ణువు :-
[3-154-క., 3-503-క.]

5141} శ్రీరమణుడు  - శ్రీ (లక్ష్మీదేవి) రమణుడు (భర్త), విష్ణువు :-
[3-142-క.]

5142} శ్రీరమాధిపుడు  - లక్ష్మీవల్లభుడు, విష్ణువు :-
[11-90-క.]

5143} శ్రీరమేశుడు  - శ్రీరమ (శ్రీకరమగు లక్ష్మీదేవి)కి ఈశుడు (భర్త), విష్ణువు :-
[5.2-112.1-ఆ.]

5144} శ్రీరాజితుడు  - శ్రీ (రాచరికము, బుద్ధి)చేత రాజితుడు (ప్రకాశించెడి వాడు), రాముడు :-
[9-1-క.]

5145} శ్రీలలనేశుడు  - శ్రీకరమైన స్త్రీ రుక్మిణికి భర్త, కృష్ణుడు :-
[1-402-క., 1-408-క., 3-520-క.]

5146} శ్రీవత్సము  - విష్ణుమూర్తి వక్షస్థలముపైనుండెడి పుట్టుమచ్చ :-
[5.1-43.1-తే., 6-219.1-ఆ.]

5147} శ్రీవత్సలాంఛనుడు  - శ్రీవత్సము అనెడి పుట్టుమచ్చ గలవాడు, విష్ణువు :-
[6-217-వ.]

5148} శ్రీవత్సాంకితకౌస్తుభస్ఫురితలక్ష్మీచారువక్షస్థలశ్రీవిభ్రాజితుడు  - శ్రీవత్స మనెడి పుట్టుమచ్చ అంకిత (గుర్తుగాగలిగి) కౌస్తుభమణిచే స్ఫురిత (ప్రకాశిస్తున్న) లక్ష్మీదేవితోకూడిన చారు (అందమైన) వక్షస్థలసంపదచే విభ్రాజితుడు (విశేషముగా ప్రకాశించుచున్నవాడు), హరి :-
[6-1-శా.]

5149} శ్రీవనితాధిపుడు  - లక్ష్మీ ( శ్రీవనిత) పతి (అధిపుడు), విష్ణువు :-
[3-192-క.]

5150} శ్రీవరుడు  - శ్రీ (లక్ష్మీదేవి) యొక్క వరుడు (భర్త), హరి :-
[6-74-క.]

5151} శ్రీవల్లభుడు  - శ్రీ (లక్ష్మీదేవి) వల్లభుడు (భర్త), విష్ణువు :-
[1-275-క., 7-122.1-తే., 8-206-ఆ., 9-127-మ., 10.1-940-క., 10.1-1295-క.]

5152} శ్రీవిభుడు  - శ్రీ (లక్ష్మీదేవి, సంపదలు) కి విభుడు, విష్ణువు :-
[3-791-క.]

5153} శ్రీవిలసితధరణీతనయావదనసరోజవాసరాధిప  - శ్రీ (లక్ష్మీదేవివలె, శుభకరమైన) విలసిత (ప్రకాశముగల) ధరణీ (భూదేవి యొక్క) తనయా (పుత్రిక, సీతాదేవి) వదన (మోము అనెడి) సరోజ (పద్మమునకు) వాసరాధిప (వాసరములకు (పగళ్ళకు) అధిపతి, సూర్యుడా), శ్రీరామ :-
[4-1-క.]

5154} శ్రీశ  - శ్రీ (లక్ష్మి) ఈశ (పతి), విష్ణువు. :-
[8-727-క.]

5155} శ్రీహరి  - శోభనకరమైన హరి, విష్ణువు :-
[3-447.1-తే.]

5156} శ్రుతకీర్తి  - కృష్ణుని మేనత్త, వసుదేవుని చెలియలు. కేకయరాజైన ధృష్టకేతుని భార్య. ఈమె కొడుకులు ప్రతర్దనాదులు అయిదుగురు. :-
[10.2-145-మ.]

5157} శ్రుతధరుడు  - శ్రుతులను (వేదములను, వినుటను) ధరించినవాడు :-
[4-768-వ., 4-768-వ.]

5158} శ్రుతము  - వినబడినది, శాస్త్రము :-
[4-28-వ.]

5159} శ్రుతి - శ్రు. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి. :-
[10.2-1150-క.]

5160} శ్రుతినితంబినీసీమంతవీధి - వేదములనెడి స్త్రీల పాపిట ప్రదేశములు, ఉపనిషత్తులు :-
[10.1-1084-వ.]

5161} శ్రుతివధూసీమంతవీధులు  - శ్రుతి (వేదములు అనెడి) వధూ (స్త్రీ యొక్క) సీమంత (పాపిట) వీధులు (ప్రదేశములు), ఉపనిషత్తులు :-
[10.1-1031.1-ఆ.]

5162} శ్రేష్ఠము - శ్రేష్ఠతరము శ్రేష్ఠతమము :-
[4-26-వ.]

5163} శ్రోతలు  - (చదువులను) వినెడివారు, చదువుకొనువారు :-
[7-133-వ.]

5164} శ్వపచుడు  - కుక్క మాంసము తినువారు, అపరిశుభ్రులు :-
[3-556-చ., 3-1037-క., 7-351-మ.]

5165} శ్వఫల్కతనూభవుడు  - చంద్రవంశపు శ్వఫల్కుని కొడుకు, అక్రూరుడు :-
[10.2-844-చ.]

5166} శ్వేతద్వీపపతి  - శ్వేతద్వీపవాసిని (లక్ష్మీదేవి) పతి (భర్త), విష్ణువు :-
[10.1-236-వ.]

5167} షట్కర్మలు  - 1యజనము 2యాజనము 3అధ్యయనము 4అధ్యాపనము 5దానము 6ప్రతిగ్రహము అనెడి ఆరు రకముల పనులు :-
[11-99-వ.]

5168} షట్పదము  - ఆరుకాళ్ళు గలది, తుమ్మెద :-
[5.1-30-చ., 10.1-1463-శా., 10.2-125-క.]

5169} షడంగములు  - వేదము నందలి ఆరు అంగములు 1 శిక్ష 2 వ్యాకరణము 3 ఛందస్సు 4 నిరుక్తము 5 జ్యోతిషము 6 కల్పము :-
[3-121-మ., 7-425-వ., 9-669-ఉ.]

5170} షడింద్రియములు  - 1కన్ను 2ముక్కు 3చెవి 4నాలుక 5 చర్మము 6మనస్సు :-
[7-460-వ.]

5171} షడూర్ములు  - 1ఆశన (ఆకలి) 2పిపాస (దాహము) 3శోక (దుఃఖము) 4మోహ (మోహము) 5జరా (ముసలితనము) 6మరణములు (చావు) అనెడి ఆరు బాధలు :-
[10.1-91.1-తే., 10.2-429.1-ఆ.]

5172} షడ్గుణములు  - భగవంతుని షడ్గుణములు ఐశ్వర్యాది (అ) 1ఐశ్వర్యము 2వీర్యము 3యశము 4శ్రీ 5జ్ఞానము 6వైరాగ్యము, (ఆ) 1వాత్సల్యము 2భవశోషణము 3ఉదారత్వము 4అభయప్రదానము 5ఆపత్కాల సంరక్షణము 6అక్షయపదము, (ఇ) 1. జ్ఞానము, 2. శక్తి, 3. ఐశ్వర్యము, 4. బలము, 5. వీర్యము, 6. ఓజస్సు. :-
[3-856.1-తే., 3-893.1-తే., 6-39.1-తే., 6-343-వ., 8-81.1-ఆ., 10.1-809-క., 10.2-1204.1-తే., 11-103-వ.]

5173} షడ్గుణైశ్వర్యములు  - (అ)1మహత్వము 2ధైర్యము 3కీర్తి 4శ్రీ 5జ్ఞాన 6వైరాగ్యములు, (ఆ)1శక్తి 2జ్ఞానము 3బలము 4ఐశ్వర్యము 5వీర్యము 6తేజస్సు :-
[10.1-809-క., 10.2-925-వ.]

5174} షడ్గుణైశ్వర్యసంపన్నుడు  - షట్ (ఆరు) గుణములు అను ఐశ్వర్యము సమృద్దిగా కలవాడు, శంకరుడు :-
[3-473-వ.]

5175} షడ్జమము(స)  - "స, రి, గ, మ, ప, ద, ని" అను సప్తస్వరములలో (1) మొదటి స్వరమునకు శాస్త్రరీత్యా ఇచ్చిన నామము షడ్జమము. దీనికి సంకేత అక్షరము "స". సప్తస్వరములలో ఋషభాది (6) ఆరు స్వరములును షడ్జము ఆధారముగా జనించుటచే ఏర్పడిన పేరు. (షడ్జమ్ షట్ + జమ్, షట్ నాసిక, కంఠము, ఉరస్సు, తాలువు, జిహ్వ, దంతములు (6) ఆరు స్థానుములందు జమ్ జనించు ధ్వనికి షడ్జమ్ అని పేరు కలిగెను.) :-
[10.1-773-శా.]

5176} షడ్జాది  - "స, రి, గ, మ, ప, ద, ని" అని సంకేతములు గల షడ్జ, ఋషభ, గాంధార, మధ్యమ, పంచమ, ధైవత, నిషాద అను ఏడు (7) స్వరములు షడ్జాది అనబడును. పాఠ్యంతరము అ.) 1. నిషాదము, 2. ఋషభము, 3. గాంధారము, 4. షడ్జము, 5. మధ్యమము, 6. ధైవతము, 7. పంచమము. "నిషాదర్షభ గాంధార షడ్జ మధ్యమ ధైవతాః, పంచమశ్చేత్యమీ సప్తతంత్రీ కంఠోత్థితాః స్వరాః" [అమరకోశము 1 6 1] :-
[3-388-వ.]

5177} షడ్రసములు  - 1కషాయము (వగరు) 2మధురము (తీపి) 3లవణము (ఉప్పు) 4కటువు (కారము) 5తిక్తము (చేదు) 6ఆమ్లము (పులుపు) :-
[3-819.1-తే., 10.1-630-వ., 10.1-889.1-తే.]

5178} షడ్విధవికారములు  - (అ)1జన్మ(పుట్టుట) 2సంస్థాన (నిలబడుట) 3వర్ధన (పెరుగుట) 4అపక్షయ (బలియుట) 5పరిపాక (పరిక్వమగుట) 6నాశము (నశించుట) అనెడి ఆరు మార్పులు, (ఆ) 1ఆకలి 2దప్పిక 3శోకము 4మోహము 5ముసలితనము 6చావు :-
[7-237-వ., 10.1-126.1-ఆ., 10.1-405.1-తే., 10.1-553.1-ఆ., 10.2-207-మ.]

5179} షణ్ణవతి  - షట్ (ఆరు, 6) నవతి (తొంభై, 90) 96 :-
[5.2-109-చ.]

5180} షణ్ముఖుడు  - షట్ (ఆరు (6)) ముఖుడు, ముఖములుగలవాడు, కుమారస్వామి :-
[5.2-65.1-ఆ.]

5181} షష్టవిధహాసములు  - 1. సిత్మము (కొద్ది నేత్రవికాసము, అధర చలనము గలది ), 2. హసితము (దంతములు ప్రకటింపబడునది), 3. విహసితము (మధురస్వర సంయుక్తము), 4. ఉపహసితము (అంస, శిరః కంపసమేతము), 5. అపహసితము (బాష్పయుక్తము), 6. అతిహసితము (శరీరకంపయుక్తము). [భరతనాట్యశాస్త్రము 6 52] :-
[10.2-1255-చ.]

5182} షోడశకర్మములు  - 1గర్భాదానము 2పుంసవనము 3సీమంతము 4జాతకర్మము 5నామకరణము 6అన్నప్రాశనము 7చౌలము 8ఉపనయనము 9ప్రాజాపత్యము 10సౌమ్యము 11ఆగ్నేయము 12వైశ్వదేవము 13గోదానము 14సమావర్తము 15వివాహము 16అంత్యకర్మము :-
[7-409-వ., 10.1-173-వ.]

5183} షోడశకర్మలు  - 1గర్భాదానము 2పుంసవనము 3సీమంతము 4జాతకర్మము 5నామకరణము 6అన్నప్రాశనము 7చౌలము 8ఉపనయనము 9ప్రాజాపత్యము 10సౌమ్యము 11ఆగ్నేయము 12వైశ్వదేవము 13గోదానము 14సమావర్తము 15వివాహము 16అంత్యకర్మము :-
[6-449-వ.]

5184} షోడశచంద్రకళలు  - 1అమృత 2మానద 3పూష 4తుష్టి 5సృష్టి 6రతి 7ధృతి 8శశిని 9చంద్రిక 10కాంతి 11జ్యోత్స్న 12శ్రీ 13ప్రీతి 14అంగద 15పూర్ణ 16పూర్ణామృత :-
[10.1-1779-వ.]

5185} షోడశతిథులు  - 1 అమావాస్య 2 పౌర్ణమి 3 పాడ్యమి 4 విదియ 5 తదియ 6 చవితి 7 పంచమి 8 షష్టి 9 సప్తమి 10 అష్టమి 11 నవమి 12 దశమి 13 ఏకాదశి 14 ద్వాదశి 15 త్రయోదశి 16 చతుర్దశి :-
[3-388-వ.]

5186} షోడశవికారములు  - ఏకాదశేంద్రియములు 11 [పంచ జ్ఞానేంద్రియములు (కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము), పంచ కర్మేంద్రియములు (కాళ్ళు, చేతులు, వాక్కు, గుదము, గుహ్యేంద్రియము), బుద్ధి] మరియు పంచ భూతములు 5 (భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశము) :-
[3-363-వ., 4-889-వ., 10.1-119.1-ఆ.]

5187} షోడశాత్మక  - 5 పంచభూతములు, 5 జ్ఞానంద్రియములు, 5 కర్మేంద్రియములు మరియు 1 మనస్సు మొత్తం 16 :-
[2-68.1-తే.]

5188} షోడశోపచారములు  - 1ఆవాహనము 2ఆసనము 3పాద్యము 4అర్ఘ్యము 5ఆచమనీయము 6 స్నానము 7వస్త్రము 8యజ్ఞోపవీతము 9గంధము 10పుష్పము 11ధూపము 12దీపము 13నైవేద్యము 14తాంబూలము 15నమస్కారము 16ప్రదక్షిణము :-
[11-60-వ., 11-115-వ.]

5189} షోడశ్యుక్థ్యములు  - షోడశ (పదహారు, 16) తిథులకు యుక్తములు (అనుసరించ వలసినవి) యైన నియమములు దీక్షలు :-
[3-388-వ.]

5190} సంకరజాతులు  - అసమాన స్త్రీపురుషలవలన కలిగిన జాతులు :-
[7-419-వ.]

5191} సంకర్షుణుడు  - చతుర్వూహములలోని (1వాసుదేవ 2ప్రద్యుమ్న 3అనిరుద్ధ 4సంకర్షణ) సంకర్షణమనబడెడి వ్యూహము., సంకర్షణవ్యూహం: వైకారికమైన సాత్త్వికాహంకారాన్ని అధిష్ఠించి సంకర్షణవ్యూహం ఒప్పుతుంటుంది. వేయి పడగలతో ప్రకాశించేవాడూ, అనంతుడూ అయిన సంకర్షణ పురుషుడు మహానుభావుడై పంచభూతాలతో, పంచేంద్రియాలతో, మనస్సుతో నిండి ఉంటాడు. కర్త, కార్యం, కారణం అనే రూప భేదాలు కలిగి శాంతత్వం, ఘోరత్వం, మూఢత్వం మొదలైన లక్షణాలతో ఉల్లాసంగా ఉంటాడు. ఈ మేటి వ్యూహమే రెండవదైన సంకర్షణ వ్యూహం. దీనినుంచే మనస్తత్త్వం పుట్టింది. :-
[3-265.1-తే., 4-702.1-తే., 5.2-122.1-ఆ., 11-77-వ., 12-20-వ., 12-23.1-తే.]

5192} సంకేతస్థలము  - సంకేతము (రహస్యముగ ఏర్పాటు చేసుకొన్న గుర్తు)గా పెట్టుకొన్న చోటు :-
[10.1-1439-క.]

5193} సంక్రందనుడు  - శత్రువులను ఆక్రందనము (మొఱలు) పెట్టించు వాడు. దేవేంద్రుడు :-
[6-429-ఉ., 10.1-1562-వ.]

5194} సంక్రమణము  - సూర్యుడు ఒకరాశినుండి మరియొక రాశికి మారుట, దాటుట ఉదా. మకరసంక్రమణము :-
[4-383-తే.]

5195} సంగత్వము  - సంగములు (తగులములు) కల స్థితి :-
[1-498-క.]

5196} సంచితము - పోగుపడినవి వ్యు. సంచితి ప్రోగు (సమ్ + చి + క్తిన్), కృ.ప., గుంపు :-
[3-818-క.]

5197} సంచితము  - జన్మజన్మములకు పోగుచేయబడు పుణ్య, పాప, లేదా ఉభయ 4కర్మములు, అనారబ్దమైన కర్మము, ఆగామి సంచితము ప్రారబ్దము అని కర్మములు మూడు విధములు. వ్యు. సం + చి (చయనే) + క్త, కృ.ప్ర. :-
[10.2-701-చ.]

5198} సంతతక్లేశనాశనుడవు  - నిత్యము క్లేశముల (చిక్కుల)ను నాశనముచేయువాడవు, విష్ణువు :-
[4-918.1-తే.]

5199} సంతతభాగధేయుడు  - ఎడతెగని కర్మఫలముల రూపమైన వాడు, విష్ణువు :-
[4-286.1-తే.]

5200} సంతతభువనరక్షుడు  - సంతత (ఎల్లప్పుడు) భువన (జగత్తును) రక్షకుడు (రక్షించువాడు), విష్ణువు. :-
[3-309.1-తే., 4-193.1-తే.]

5201} సంతతానందుడు  - సంతత (ఎడతెగని) ఆనందుడు (ఆనందము గలవాడు), విష్ణువు :-
[8-483.1-తే.]

5202} సంతతాశ్రితనిర్వక్రము  - సంతతా (ఎల్లప్పుడును) ఆశ్రిత (ఆశ్రయించినవారికి) నిర్వక్రము (అనుకూలమైనట్టిది, వెనుదీయనిది), విష్ణుచక్రము :-
[3-678-మ.]

5203} సంతానవిస్తరార్థము  - కుమారు లున్నను ఇంకను కుమారులు పొందుటకు :-
[4-3.1-తే.]

5204} సంతోషుడు  - సంతోషము కలవాడు :-
[4-6-వ.]

5205} సందంశము  - పట్టుకొని కరచుటలు, నరక విశేషము :-
[5.2-136-వ.]

5206} సంధ్య  - పగలు రాత్రుల మధ్య కాలము సంధ్య అనబడును. ప్రొద్దుపొడుచుటకు ముందైదుగడియలవఱకును ప్రొద్దుగ్రుంకిన వెనుక మూడుగడియలవఱకును గల కాలము; :-
[3-727-క.]

5207} సంప్రదాయము  - తరతరములుగా ఇవ్వబడుచున్నది :-
[3-271-వ.]

5208} సంభూతులు  - సంభవించినవారు, భూతకాలము కలవారు :-
[2-84-వ.]

5209} సంయమని  - యముని పట్టణము :-
[10.2-601-వ.]

5210} సంయమి  - సంయమనము కలవాడు, ఋషి :-
[10.2-598-చ., 10.2-633-క., 11-9-క.]

5211} సంయమీశ్వరులు  - సంయమము (హింసాదులవలన విరమించుట) కలవారు, ముని :-
[7-349-మ.]

5212} సంవర్తకము - సవర్త (దీని యందు జగత్తు లయమగును) మేఘము, ప్రళయకాల మేఘ విశేషము :-
[11-52-వ.]

5213} సంవర్తకాది,నవమేఘములు  - 1సంవర్తకము 2ఆవర్తకము 3పుష్కరము 4ద్రోణము 5కాలము 6నీలము 7అరుణము 8తమస్సు 9వారుణము అనెడి మేఘములు :-
[10.1-899-వ.]

5214} సంశుద్ధుడు  - పరిశుద్ధమైన వాడు :-
[2-207-క.]

5215} సంసారబంధములు  - అష్టబంధములు, 1దయ 2జుగుప్స 3మోహము 4భయము 6సంశయము 7కులము 8శీలము :-
[10.1-1704.1-తే.]

5216} సంసారభయవిదూరుడు  - సంసారము (భవ) వలని భయములను మిక్కిలి దూరము చేయువాడు, విష్ణువు. :-
[3-308.1-తే., 4-179.1-తే., 4-286.1-తే.]

5217} సంసారము  - జననమరణముల పరంపర, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీజఠరే శయనం, ఆలుబిడ్డలతోడి యునికి :-
[10.1-568-వ.]

5218} సంసారి  - సంసారముగల గృహస్థు.డు :-
[10.2-268-వ.]

5219} సంసేవ్యుడు  - సం (చక్కగా) సేవ్యులు (సేవింపదగినవాడు), ప్రభువు :-
[7-55-మ.]

5220} సంస్కార  - ఆ పంచభూతముల విషయములైన శబ్ద స్పర్శాదులుగా నుండుట, అనుభూతార్థ స్మృతిపాకము :-
[10.1-537-వ.]

5221} సంస్కారములు  - గర్భాదానాది షోడశసంస్కారములు, 1. గర్భాధానము, 2. పుంసవనము, 3. సీమంతోన్నయనము, 4. జాతకర్మ, 5. నామకరణము, 6. నిష్క్రమణము, 7. అన్నప్రాశనము, 8. చౌలము, 9. ఉపనయనము, వేదవ్రత చతుష్టయము, 10. మహానామ్నీ వ్రతము, 11. మహావ్రతము, 12. ఉపనిషద్వ్రతము, 13. గోదానము, 14. కేశాంతము, 15. సమావర్తనము, 16. వివాహము. :-
[3-39-క.]

5222} సంస్కృతంబుగుణమగుట  - సంస్కృతమూలపదాల ప్రయోగం ఎక్కువ వుంటే నచ్చుట :-
[1-20-క.]

5223} సంస్తిమితము  - శబ్దస్పర్శాదివ్యాపారశూన్యములైన, వాటిపని అవి చేయలేని :-
[10.1-540-ఉ.]

5224} సకలకార్యములు  - అవ్యక్తము మహత్తత్వము అహంకారము పంచతన్మాత్రలు పంచభూతము అనెడి చతుర్దశ కార్యములు, శ్లో. కార్యోపాధిర యం జీవః, కారణోపాధిరీశ్వరః. :-
[10.1-683-వ., 10.2-660-వ.]

5225} సకలజగదీశ్వరుడు  - సమస్తమైన జగత్తులకు ఈశ్వరుడు, విష్ణువు :-
[4-421-వ.]

5226} సకలజీవులకెల్లఁబ్రకటదేహము  - సమస్త జీవులకన్నిటియందు వ్యక్తమగు రూపముకలవాడు, విష్ణువు :-
[3-198.1-తే.]

5227} సకలదిక్పాలభాస్వత్కిరీటన్యస్తపద్మరాగారుణపాదపీఠుఁడు  - సమస్త దిక్పాలుల కిరీటములు హత్తించిన పద్మరాగముల వంటి అరికాళ్ళు కలవాడు, విష్ణువు :-
[3-99.1-తే.]

5228} సకలనియంత  - సమస్తమును నియమించువాడు, విష్ణువు :-
[3-19-చ.]

5229} సకలభక్తచింతామణి  - సకల (సమస్తమైన) భక్త (భక్తులకు) చితామణి (కోరిన కోరికల నిచ్చు మణి వంటివాడు), విష్ణువు :-
[6-36-క.]

5230} సకలభూతనికాయగుహాశయుడు  - సకల (సమస్తమైన) భూతనికాయము (జీవజాలము) యొక్క గుహ (హృదయము) నందు శయుడు (పడుకొని ఉండువాడు), విష్ణువు :-
[3-861-క.]

5231} సకలభూతాతంరాత్ముడు  - సమస్తమైన భూతము (ప్రాణు) లందును ఆత్మరూపమున ఉండువాడు, విష్ణువు :-
[3-753.1-తే.]

5232} సకలలోకనమస్కృతచరణకమలు  - సమస్తమైన లోకులచేతను నమస్కారింపబడిన పాదపద్మములు కలవాడు, విష్ణువు :-
[3-924.1-తే.]

5233} సకలలోకేశ్వరుడు  - ఎల్లలోకములకు ప్రభువు, శివుడు :-
[7-394-వ.]

5234} సకలసంపూర్ణుడు  - సమస్తమునందు నిండి యుండువాడు, విష్ణువు :-
[10.1-1180.1-ఆ.]

5235} సకామజనఫలప్రాపకుడు  - కోరికలుకల జనులకు ఫలితము పొందించువాడును, శంకరుడు :-
[3-473-వ.]

5236} సగముచేసె  - అర్థ దేహము కలవానిగా చేసెను, అర్థనారీశ్వరునిగ చేసెను :-
[10.2-10.1-తే.]

5237} సగరుడు  - సూర్యవంశపు మహారాజు, విషముతోపాటు పుట్టినవాడు, ఇతని పుత్రులు తవ్వగ నేర్పడినదే సాగరము :-
[2-204.1-తే., 5.2-58-వ., 9-202.1-తే.]

5238} సగుణవిలాసి  - గుణత్రయముయొక్క విలాసముచే, సత్వగుణమువలన సకల దేవతల రూపములను రజోగుణముచేత సకల భూలోకజీవులను తమోగుణముచేత భౌతిక రూపములైన భూమి పర్వతములు శిలలు మున్నగునవి ధరించినవాడు :-
[10.1-553.1-ఆ.]

5239} సగుణుడు  - దివ్యగుణములు కలవాడు, విష్ణువు :-
[4-359.1-తే.]

5240} సచరాచరము  - స (కలిసి యున్న) చర (కదలికగలవి) అచర (కదలికలేనివి) కలది, ప్రపంచ మంతయు :-
[5.1-75-క.]

5241} సచరాచరములు  - చర (చరించగలవి) అచర (చరించలేనివి) కలిసిన మొత్తము, సకలజీవులు అన్నీ :-
[10.2-1070-చ.]

5242} సచ్చిదానందమయుడు  - సత్ (సత్య మైనది శాశ్వతమైనది) చిత్ (శుద్ధ చైతన్యమైనది) ఆనంద (ఆనందము) లతో మయుడు(నిండినవాడు), బ్రహ్మ :-
[7-87.1-ఆ.]

5243} సచ్చిదానందుడు - 1. పరమాత్మ, 2. విష్ణువు వ్యు. సత్ (నిత్య) చిత్ (జ్ఞాన) ఆనంద (సుఖ) స్వరూపమైనవాడు :-
[10.1-537-వ.]

5244} సజ్జనవిధేయుడు  - సత్ (మంచి) జన (వారికి) విధేయుడు (వశమైనవాడు), విష్ణువు :-
[7-459-ఉ.]

5245} సటి  - జూలు కలది, అడవిపంది, సింహము :-
[3-698-క.]

5246} సతతప్రసన్నస్మితవదనాంభోజుడు  - సతత (ఎల్లప్పుడును) ప్రసన్న (ప్రసన్నమైన) స్మిత (చిరునవ్వుతో కూడిన) వదన (మోము అనెడి) అంభోజుడు (పద్మము కలవాడు), విష్ణువు :-
[3-922.1-తే.]

5247} సతతోద్యజ్జయశబ్దసన్ముఖరభాస్వచ్ఛక్రము  - సంతత (ఎల్లప్పుడును) ఉద్యత్ (గట్టిగపలకబడు) జయ అను శబ్దముచేయు సత్ (మంచి) ముఖర (వాడియైన పళ్లు) కల భాస్వత్ (ప్రకాశించు) చక్రము, విష్ణుచక్రము :-
[3-678-మ.]

5248} సతి  - సత్ అను అస్తిత్వము యైన శక్తిరూపి :-
[4-35.1-తే.]

5249} సతీదేవిపతి  - పార్వతీపతి, శంకరుడు :-
[3-473-వ.]

5250} సత్కృపామూర్తి  - మంచి దయకు స్వరూపము ఐనవాడు, విష్ణువు :-
[3-311.1-తే.]

5251} సత్తపోనివహాభీష్టవరప్రదాత  - సత్ (మంచి, సత్యమైన) తపః (తపస్వుల) నివహా (సమూహముల) అభీష్ట (కోరిన) వర (వరములను) ప్రదాత (ప్రసాదించువాడు), బ్రహ్మ :-
[7-85-మ.]

5252} సత్త్వగుణగరిష్ఠుడు  - సత్త్వగుణములు కలవారిలో గొప్పవాడు, విష్ణువు :-
[3-145.1-తే.]

5253} సత్త్వగుణాశ్రయుడు  - సత్త్వగుణములను ఆశ్రయించి యుండువాడు, విష్ణువు :-
[4-195-చ.]

5254} సత్త్వగుణుడు  - సత్త్త్వగుణము గలవాడు, విష్ణువు :-
[4-918.1-తే.]

5255} సత్త్వమూర్తి  - సత్త్వ గుణము స్వరూపమైనవాడు, విష్ణువు :-
[4-936-వ.]

5256} సత్త్వాకరుడు  - సత్త్వగుణమునకు ఆకరుడు (ప్రధానుడు), విష్ణువు :-
[7-354.1-తే.]

5257} సత్త్వాది  - సత్త్వ రజస్తమో గుణములు అనెడి త్రిగుణములు :-
[2-217.1-తే., 2-222-వ., 3-215-వ., 3-889-వ., 4-179.1-తే., 4-193.1-తే., 10.2-1203-వ.]

5258} సత్పుణ్యభూరివర్చస్సు  - సత్(సత్యమైన) భూరి గొప్ప వర్చస్సు (పర్కాశముగలవాడు, విష్ణువు :-
[4-703.1-తే.]

5259} సత్పురుషుడు  - సత్ (సత్యవర్తనుడైన) పురుషుడు, సత్తునందు వర్తించు పురుషుడు, విష్ణువు :-
[3-246.1-తే.]

5260} సత్యంపరంధీమహి  - జ్ఞాని సత్యమే ఉత్కృష్ట మైనది :-
[1-35-వ.]

5261} సత్యకనందనుడు  - సాత్యకి, సత్యకుని కొడుకు, కృష్ణుని రథసారథి :-
[1-348.1-తే.]

5262} సత్యము  - సర్వకాలసర్వావస్తలందు వికారములు లేనిది, సత్తు, నిత్యము అనంతము అనితరము అవిభక్తము అవిభాజ్యము ఐనది సత్యము అదే పరబ్రహ్మము అని విచారించుట సత్యశోధన :-
[10.1-567.1-ఆ., 10.1-962-మ., 10.1-1474-ఆ.]

5263} సత్యుడు  - సత్తు అయినవాడు :-
[2-23-వ.]

5264} సత్రములు  - సత్రయాగములు 13 మొదలు 100 దినముల వరకు జరుగు యాగములు :-
[3-426-వ.]

5265} సత్రయాగము  - 13 మొదలు 100 దినముల వరకు చేసెడి యజ్ఞబేధము :-
[9-76-వ.]

5266} సత్వములు  - 1దేవ 2మనుజ 3నాగ 4యక్ష 5గంధర్వ 6పిశాచ 7వాయస 8వానర 9గార్దభ 10కూర్మ 11పర్యటన సత్వములు :-
[10.1-1495-ఉ.]

5267} సత్వాది, గుణత్రయము  - త్రిగుణములు సత్త్వ రజస్ తమస్ అను మూడుగుణములు :-
[10.2-248.1-తే., 12-24-వ.]

5268} సత్సుకరుడు  - సత్ (మంచి) సుకరుడు (మేలు) కరుడు (కలిగించువాడు), విష్ణువు :-
[9-142-మ.]

5269} సదసత్పూరుషుడు  - సత్ లోను అసత్ లోనూ నివసించు వాడు, భగవంతుడు :-
[2-207-క.]

5270} సదసద్విచారులు  - సత్ (సత్తును, సత్యమును) అసత్ (అసత్యమును, చిత్తును) విచారులు (తర్కించుకొనువారు), తత్వజ్ఞులు :-
[4-591.1-తే.]

5271} సదస్యశాల  - సభాస్థలిగల శాల, సభ్యులు ఉండు శాల :-
[4-118-వ.]

5272} సదానందమూర్తి  - శాశ్వత ఆనందమునకు స్వరూపము అయినవాడు, విష్ణువు :-
[3-203-దం.]

5273} సదాయాంతరంగుడు  - సత్ (మిక్కిలి) దయా (కృపగల) అంతరంగుడు (మనసు గలవాడు), విష్ణువు :-
[4-900-క.]

5274} సదారాముడు  - సదా (ఎల్లప్పుడును) ఆరాముడు (ఆనందమున యుండువాడు), శివుడు :-
[4-685.1-తే.]

5275} సదాశివభ్రాత  - సదాశివుని భ్రాత (సోదరుడు), కుబేరుడు :-
[4-361-తే.]

5276} సదాశివుడు  - శాశ్వతమైన శుభము యైనవాడు, శంకరుడు :-
[4-93-వ., 4-735-క.]

5277} సదుపాయము  - సత్ (మంచి) ఉపాయము (ఏర్పాటు, ఉపాయము), సౌకర్యము :-
[4-471-క.]

5278} సద్గణావళులు  - స (మంచి) గుణా ( గణముల) ఆవళి (సమూహములు) లు (కలవారు) :-
[2-211-ఉ.]

5279} సద్ధితఫలరూపకుడు  - సత్ (మంచివారి)కి ఫలితమే రూపము యైనవాడు, విష్ణువు :-
[4-703.1-తే.]

5280} సనకసనందనాదులు  - కుమారచతుష్కము, 1సనక 2సనందన 3సనత్కుమార 4సనత్సుజాతులుఅను బ్రహ్మదేవుని కుమారులు :-
[7-21-వ., 11-105-వ.]

5281} సనకాదులు  - 1సనక 2సనందన 3సనత్కుమార 4సనత్సుజాతులు అనెడి ఆది యోగులు, బ్రహ్మదేవుని కొడుకులు, కుమారచతుష్కము :-
[3-502-క., 3-526-క., 4-509.1-తే., 4-543-క., 4-598-క., 4-604.1-తే., 4-636-వ., 4-695-మ., 7-453-వ., 10.1-383-క., 10.1-694-క., 10.1-1046-మ., 10.1-1234.1-ఆ., 10.1-1497-మ., 10.2-110-మ., 10.2-1071.1-తే., 10.2-1203-వ.]

5282} సనత్కుమారాదులు  - కుమార చతుష్కయము, 1సనకుడు 2సనందనుడు 3సనత్కుమారుడు 4సనత్సుజాతుడు :-
[6-476-వ.]

5283} సనాతనుడు  - శాశ్వతుడు, పురాతనుడు, శివుడు, విష్ణువు :-
[4-138.1-తే., 4-900-క.]

5284} సన్నియామకుడు  - సత్ (సత్యమైన) నియామకుడు, విష్ణువు :-
[4-704-తే.]

5285} సన్మహితవివేకశాలి  - మంచి మరియు గొప్ప వివేకము కలవాడు, విష్ణువు :-
[3-572-చ.]

5286} సన్ముక్తి  - సత్ + ముక్తి, మోక్షము, శ్లో. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః....భజగోవిందం... (ఆదిశంకరాచార్యులవారు) :-
[10.1-1663.1-తే.]

5287} సన్యాసము  - సర్వసంగపరిత్యాగము కలగిన ఆశ్రమము, చతురాశ్రమములలో నాలుగవది. :-
[7-460-వ.]

5288} సపత్నలు  - భూమికి పత్నులు (భర్తలు) కనుక తోటి (శత్రు) రాజులు సపత్నులు, సవితులు :-
[10.2-74-క.]

5289} సప్తగోదావరి  - గోదావరి సముద్రమున కలియుటకు ముందు సప్తర్షుల నామములతో ఏడు పాయలుగా ప్రవహిస్తుంది. దానిని సప్తగోదావరి అంటారు. :-
[10.2-950-ఆ.]

5290} సప్తచ్ఛందస్సులు  - 1గాయత్రి 2ఉష్టిక్ 3త్రిష్టుప్ 4అనుష్టుప్ 5జగతీ 6పంక్తి 7బృహతి అనెడి ఏడు ఛందస్సులు :-
[5.2-83-వ.]

5291} సప్తద్వీపములు  - 1జంబూ(జంబూద్వీపము) 2ప్లక్ష(ప్లక్షద్వీపము) 3శాల్మలి(శాల్మలీద్వీపము) 4కుశ(కుశద్వీపము) 5క్రౌంచ(క్రౌంచద్వీపము) 6శాక(శాకద్వీపము) 7పుష్కరములు(పుష్కరద్వీపములు) :-
[5.1-18-వ., 5.1-19.1-తే., 5.1-19.1-తే., 5.1-22-వ., 5.1-89-వ., 7-104.1-తే., 8-574-క., 9-81-శా., 9-205.1-తే., 9-560-శా.]

5292} సప్తధాతువులు  - అ)వసాదులు (వస, అసృక్కు, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్లములు) ఆ) రోమాది (రోమ, త్వక్, మాంస, అస్థి, స్నాయువు, మజ్జ, ప్రాణములు) (ఇ) త్వగాది (1త్వక్, మాంస, రుధిర, మేధో, మజ్జ, అస్థి, శుక్లములు) :-
[2-269-వ., 3-426-వ., 3-992-వ., 8-155-వ., 8-224.1-తే., 10.1-91.1-తే.]

5293} సప్తప్రకృతులు  - (అ) పృథివ్యాది (1పృథివి 2అప్పు 3తేజస్ 4వాయుః 5ఆకాశః 6మహత్ 7అహంకారములు) (ఆ) అమాత్యాది (1అమాత్యులు 2జనపద 3దుర్గ 4ద్రవిణ 5సంచయ 6దండ 7మిత్రములు) :-
[6-449-వ., 6-449-వ.]

5294} సప్తర్షిమండలము  - సప్తర్షులు నక్షత్రముల రూపముననుండెడి మండలము, :-
[9-488-క.]

5295} సప్తర్షులు  - 1మరీచి 2అత్రి 3అంగిరుడు 4పులస్త్యుడు 5పులహుడు 6క్రతువు 7వసిష్ఠుడు (మరియొక క్రమమున) 1కశ్యపుడు 2అత్రి 3భరద్వాజుడు 4విశ్వామిత్రుడు 5గౌతముడు 6జమదగ్ని 7వసిష్ఠుడు :-
[5.2-32-వ., 5.2-91-క., 9-488-క.]

5296} సప్తవరూధము  - వరూధము అంటే కవచము సప్తవరూధమును సప్తధాతువులుకు ప్రతీకగా పురంజయనోపాఖ్యానంలో ప్రయోగించారు :-
[4-771.1-తే.]

5297} సప్తవాయువులు  - (అ) ప్రవాహాది (1ప్రవహము 2వివహము 3ఆవహము 4ప్రతివహము 5ఉద్వహము 6సంవహము 7పరివహము), (ఆ) గగనాది (1గగనము 2స్పర్శనము 3వాయువు 4అనిలము 5ప్రాణము 6ప్రాణేశ్వరము 7జీవము) :-
[10.2-165-వ.]

5298} సప్తవింశతితత్త్వములు  - 5 పంచభూతములు 5 పంచతన్మాత్రలు 5 పంచకర్మేంద్రియములు 5 పంచజ్ఞానేంద్రియములు 4 చతురంతఃకరణములు మరియు 1 పురుషుడు 1 ప్రకృతి 1 మహత్తు మొత్తము 5+5+5+5+4+1+1+1 27 :-
[3-204.1-తే.]

5299} సప్తవ్యసనములు  - కామక్రోధముల వలన కలిగెడు దోషములు ఇవి ఏడు (1పానము 2స్త్రీ 3మృగయ 4ద్యూతము (ఇవి కామమువలన పుట్టినవి) 5వాక్పారుష్యము 6దండపారుష్యము 7అర్థపారుష్యము (ఇవి కోపమువలన పుట్టునవి) :-
[6-192-వ.]

5300} సప్తసంతానములు  - తటాకము, నిధి, అగ్రహారము, దేవాలయము, వనము, ప్రభందము, పుత్రుడు. :-
[2-227.1-తే.]

5301} సప్తసముద్రములు, సప్తజలధులు, సప్తసాగరములు  - 1క్షార(కారపు సముద్రము) 2ఇక్షురస(చెరకురసముసముద్రము) 3సుర(సురాసముద్రము) 4ఆజ్య(నేయ్యిసముద్రము) 5క్షీర(పాలసముద్రము) 6దధి(పెరుగుసముద్రము) 7ఉదకంబులు(నీటిసముద్రము) :-
[3-603-తే., 5.1-18-వ., 5.1-19.1-తే., 5.1-22-వ., 7-73-మ., 9-333.1-ఆ., 10.1-106.1-తే.]

5302} సప్తస్కంధములు  - 1ఆవహము 2ప్రవహము 3సంవహము 4ఉద్వహము 5నివహము 6పరివహము 7పరావహము యనెడి సప్తవిధవాయువులు, 1.కాళి, 2. కరాళి, 3. విస్ఫులింగిని, 4. ధూమ్రవర్ణ, 5. విశ్వరుచి, 6. లోహిత, 7. మనోజవ ఇవి సప్తస్కంధశిఖలు :-
[7-285-వ.]

5303} సప్తస్కంధశిఖలు  - ఏడు నాలుకల అగ్ని శిఖలు అగ్ని ఏడు నాలుకలు కాళి, కరాళి, విస్ఫులింగిని, ధూమ్రవర్ణ, విశ్వరుచి, లోహిత, మనోజవ :-
[2-185-శా.]

5304} సప్తస్వరములు  - సంగీత స్వరములు ఏడు, స, రి, గ, మ, ప, ద, ని. (షఢ్జమ, ఋషభ, గాంధార, మధ్యమ, పంచమ, ధైవత, నిషాదములు) :-
[3-388-వ.]

5305} సప్తార్చి  - సప్త (ఏడు, 7) అర్చి (జ్వాలలుగలవాడు), అగ్ని :-
[8-14.1-ఆ.]

5306} సప్తావరణలు  - 1మహత్తు 2అహంకారము 3పంచభూతములు ఐదు అనెడి ఈ ఏడు (7) ఆవరణలు :-
[3-972-వ.]

5307} సప్తాశ్వస్పురత్  - ఏడు గుఱ్ఱములతో వెలుగొందునది (సూర్యమండలము), సప్తాశ్వాల పేర్లు గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి. :-
[2-185-శా.]

5308} సఫలంబులు  - తగిన ప్రయోజనములు గలవి, సార్థకములు :-
[7-366-వ.]

5309} సభ  - అనేకులు చేరిన కూటమి. కొలువు కూటము, పరిషత్తు, సంసత్తు, సంస్థ, సదము, సదస్సు, సమజ్య, సమావేశము. :-
[10.1-1359-ఆ., 10.1-1597-శా.]

5310} సభార్యులు  - సభా (సదస్సునకు) ఆర్యులు (పెద్దలు) :-
[4-55-చ.]

5311} సమతలము  - మిట్టపల్లములు లేని ప్రదేశము :-
[10.1-1310.1-ఆ.]

5312} సమత్వము  - కష్ట సుఖములెడ సమభావము :-
[1-403-వ.]

5313} సమదమూషకవాహనుడు  - సమద (మదించిన, బలమైన) మూషక (ఎలుక) వాహనుడు (వాహనముగా గలవాడు), విఘ్నేశ్వరుడు :-
[6-4-ఉ.]

5314} సమదర్శనము  - సర్వభూతములను సమముగ చూచుట, ఆత్మీయ పరకీయ భ్రాంతి లేకుండుట :-
[7-409-వ.]

5315} సమపాదతానకము  - రెండు కాళ్ళు సమముగా ఉంచి నటించుట, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

5316} సమపాదపార్థివచారము  - సరిగా అడుగులుంచుచు పోవుట, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

5317} సమలోష్టహేముడు  - సమ (సమదృష్టి) లోష్ట (మట్టిపెళ్ళలు) హేమ (బంగారము)లందు గలవాడు, సమదృష్టిగలవాడు :-
[9-84.1-ఆ.]

5318} సమవాయికారణము  - సృష్టికి / ఏపనికైనా మూడు (3) కారణములు అవసరము అవి 1 ఉపాదానకారణము (సమవాయికారణము, ముఖ్యకారణము. వివ. ఘటమునకు మృత్తిక, వస్త్రమునకు తంతువులు ఉపాదాన కారణములు) 2 అసమవాయికారణము (వస్త్రమునకు తంతువులు సంయోగము) 3 నిమిత్తకారణము (కార్యోత్పత్తికి సాధనమైనది, వస్త్రమునకు మగ్గము మున్నగునవి, కుండకు కుమ్మరి సారె మున్నగునవి) :-
[3-345.1-తే.]

5319} సమస్తచేతననికాయహృదీప్సితదాయి  - సమస్తమైన చేతనుల (జీవుల) నికాయము (సమూహము)లకును హృద (హృదయములకు) దీప్సిత (కోరికను) దాయి (ఇచ్చువాడు), విష్ణువు :-
[3-844-చ.]

5320} సమస్తపావనుడు  - సమస్తమును పావనము చేయువాడు, విష్ణువు :-
[3-570-ఉ.]

5321} సమస్తభూతపతి  - సమస్తమైన భూత (జీవులకు) పతి (భర్త), శంకరుడు :-
[3-473-వ.]

5322} సమస్తము  - ద్రష్ట దృక్ దృశ్య మయమైన సమస్తము :-
[10.1-682.1-తే.]

5323} సమస్తలోకైకశరణ్యుడు  - సమస్తమైన చతుర్దశ భువనములకు ఒక్కడే ఐన రక్షకుడు, విష్ణువు :-
[10.1-688-ఉ.]

5324} సమస్తశేషకారణుడు  - సమస్తము తనలోని భాగము కాగా శేషము(మిగిలినదాని)నకు కారణము యైనవాడు, విష్ణువు :-
[4-705-వ.]

5325} సమస్తహితుడు  - సమస్త మైన వారికి హితుడు, విష్ణువు :-
[6-216-ఉ.]

5326} సమస్తార్థలిఙ్గము  - సమస్త ప్రయోజనములకు లింగము (చిహ్నము) యైనవాడు, విష్ణువు :-
[4-704-తే.]

5327} సమానాధికవిరహితుండు  - సమానమైన లేదా అధికమైన వారు ఎవ్వరూ లేనివాడు, విష్ణవు :-
[3-99.1-తే.]

5328} సమాశ్రితచింతామణి  - సమ (చక్కగా) ఆశ్రిత (ఆశ్రయించిన వారికి) చింతామణి (కోరిన కోరిక లనుగ్రహించు మణి వంటి వాడు), విష్ణువు :-
[6-34-క.]

5329} సమీరనందనుడు  - సమీర (వాయు) నందనుడు, భీముడు :-
[10.2-742-వ.]

5330} సమీరసఖుడు  - వాయువు మిత్రుడు, అగ్ని :-
[10.2-1174-వ.]

5331} సమీరసూతి  - వాయుదేవుని కొడుకు, భీముడు :-
[3-26-చ.]

5332} సమీరుడు  - లెస్సగా చరించువాడు, వాయువు, వాయవ్య దిక్పతి :-
[10.2-773-చ.]

5333} సముడు  - సర్వము యెడల సమమైన భావము గలవాడు, విష్ణువు :-
[2-207-క., 4-936-వ., 6-327.1-తే.]

5334} సముదంచితహారి  - చక్కగా ఒప్పుచున్న హారములు ధరించిన వాడు, విష్ణువు :-
[3-335-ఉ.]

5335} సముద్ధతి  - గురువు దగ్గర శిక్షింపబడని వానివలె, చూపు మిక్కిలి ఆటోపము :-
[1-189.1-తే.]

5336} సముద్రము  - వ్యు. సమ్+ఉద్+ద్రు+ఘఞ్, సముద్రవంతి అస్మాత్ భూతాని, సమువంతి ఏనం భూతాని, ప్రాణులు, భూతములు ఇక్కడ నుండి పుట్టును, దీని యందు లీనమగును. (అథ. 4.30.7) :-
[10.2-4-వ., 11-26-వ.]

5337} సమ్యగ్భోగము  - చక్కటి అనుభవము :-
[1-381-వ.]

5338} సరభసము  - వేగముగా, త్వరగా పోవునది, కాలము. :-
[4-771.1-తే.]

5339} సరసదయాపాంగుడు  - సరస (చక్కటి) దయా (దయతోకూడిన) అపాంగుడు (కటాక్షముగలవాడు), రాముడు :-
[4-975-క.]

5340} సరసవచోవిలాసుడు  - సరస (మనోహర మైన) వచస్ (పలుకలతో) విలాసుడు (శోభిల్లువాడు), రామ :-
[4-974-చ.]

5341} సరసవినుతగుణసూరి  - సరస (రసస్ఫూర్తితో) వినుత (స్తుతించెడి) గుణ (సుగుణములు గల) సూరి (పండితులు గలవాడు), రాముడు :-
[4-976-మాలి.]

5342} సరసహృదయవాసుడు  - సరసుల హృదయము లందు వసించెడివాడు, శ్రీకృష్ణ :-
[5.1-183-మాలి.]

5343} సరసి  - సరసున పుట్టునది, పద్మము :-
[2-243-చ.]

5344} సరసిగర్భుడు  - సరసి (పద్మము)న పుట్టిన వాడు, బ్రహ్మ దేవుడు :-
[2-243-చ., 2-260-క.]

5345} సరసిజగర్భసన్నుతుడు  - సరసిజగర్భ (బ్రహ్మదేవునిచే) సన్నుతుడు (కీర్తింపబడు వాడు), రాముడు :-
[7-482-చ.]

5346} సరసిజగర్భుడు  - సరసిజ (పద్మము)న గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[3-672-క., 3-777-క., 4-38-చ.]

5347} సరసిజజని  - సరసిజ (పద్మము)నందు జని (పుట్టినవాడు), బ్రహ్మ :-
[8-152-క.]

5348} సరసిజదళనేత్రుడు  - సరసిజ (పద్మము యొక్క) దళ (రేకు)లవంటి నేత్రములు కలవాడ, శ్రీకృష్ణ :-
[5.1-182-క.]

5349} సరసిజదళము  - సరసున జ (పుట్టినది, పద్మము) యొక్క దళ (రేకులు) :-
[2-287-మాలి.]

5350} సరసిజనయనుడు  - సరసిజము (పద్మము) వంటి నయనుడు (కన్నులు ఉన్నవాడు), విష్ణువు :-
[3-832-క.]

5351} సరసిజనాభనందనుడు  - పద్మనాభుని (కృష్ణుని) కొడుకు, ప్రద్యుమ్నుడు :-
[10.2-872-చ.]

5352} సరసిజనాభుడు  - సరసిజము (పద్మము) నాభి (బొడ్డు)న కలవాడు, విష్ణువు :-
[3-1003-చ., 4-718-చ., 5.1-61-చ.]

5353} సరసిజనిభహస్తుడు  - సరసిజ (పద్మము) నిభ (వంటి) హస్తుడు (అరచేతులు కలవాడు), శ్రీరాముడు :-
[10.1-1791-మాలి.]

5354} సరసిజనేత్రుడు  - సరసిజముల (పద్మము) వంటి నేత్రములు కలవాడు, విష్ణువు :-
[3-242-చ., 3-510-చ., 3-677-క.]

5355} సరసిజపత్త్రనేత్రుడు  - పద్మపత్రములవంటి నేత్రములు కలవాడు, శ్రీరాముడు :-
[10.2-1340-చ.]

5356} సరసిజపత్రలోచనుడు  - తామర రేకుల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు :-
[10.2-1095-చ.]

5357} సరసిజభవుడు  - సరసిజము (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు :-
[3-158-క., 3-365-క., 3-737-క.]

5358} సరసిజము  - సరసునందు జనించునది, కమలము :-
[3-224-క., 10.1-915-క.]

5359} సరసిజముఖి  - సరసిజము (సరసున పుట్టు పద్మము) వంటి ముఖము కలామె, స్త్రీ :-
[4-84-క.]

5360} సరసిజలోచనుడు  - సరసిజముల (పద్మము) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు :-
[3-52-క., 3-157-క., 3-526-క.]

5361} సరసిజహితుడు  - పద్మబంధువు, సూర్యుడు :-
[12-42-క.]

5362} సరసిజాక్షి  - సరసిజము (పద్మముల) వంటి అక్షి (కన్నులు కల వాడు), స్త్రీ :-
[4-844-చ.]

5363} సరసిజానన  - సరసిజము (పద్మముల) వంటి ఆనన (కన్నులు కలామె), స్త్రీ :-
[10.2-822.1-తే.]

5364} సరసిజాసనుండు  - సరసిజము (పద్మము) ఆసనుండు (ఆసనముగా గలవాడు), బ్రహ్మదేవుడు :-
[5.1-12-ఆ.]

5365} సరసిజోదరుడు  - సరసిజము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు :-
[3-937-వ., 4-753.1-తే., 6-55.1-తే.]

5366} సరసిరుహోదరుడు  - సరసిరుహ (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు :-
[3-235-క., 3-629-చ., 4-888-చ.]

5367} సరసీరుహజాతుడు  - సరసీరుహము (పద్మము)న జాతుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[4-124-చ.]

5368} సరసీరుహము  - సరసునందు రుహము(పుట్టునది), పద్మము :-
[1-2-ఉ., 3-180.1-తే., 3-505-ఉ., 4-31.1-తే., 4-917-చ.]

5369} సరసీరుహాక్షుడు  - సరసీరుహము (పద్మముల) వంటి అక్షుడు (కన్నులుకలవాడు), విష్ణువు :-
[3-845.1-తే.]

5370} సరసీరుహాసనుడు  - సరసీరుహము (పద్మము)న ఆసీనుడు (కూర్చుండువాడు), బ్రహ్మదేవుడు :-
[4-436.1-తే.]

5371} సరసీరుహోదరుడు  - సరసీరుహము (పద్మము) ఉదరమున గలవాడు, విష్ణుమూర్తి :-
[3-185-త., 3-191-క.]

5372} సరస్వతి  - జ్ఞానమును ప్రసరించునది, సరస్+మతుప్, సరః విజ్ఞాన విద్యతే అస్మిన్, విద్య కలది. వాణి, సరస్వతి :-
[2-67-మ.]

5373} సరస్వతీరమణుడు  - సరస్వతీదేవి రమణ (భర్త), బ్రహ్మదేవుడు :-
[3-156-వ.]

5374} సరోజకేసరపిశఙ్గవినిర్మలదివ్యభర్మవస్త్రుడు  - సరోజ (పద్మము)ల కేసరముల వలె పిశంగ (పసుపు రంగు) గల వినిర్మల (స్వచ్ఛమైన) దివ్య (దివ్యమైన) భర్మ (బంగారు) వస్త్రుడు (బట్టలు ధరించినవాడు), విష్ణువు :-
[4-920-ఉ.]

5375} సరోజగర్భుడు  - సరోజ (పద్మము)న పుట్టినవాడు :-
[3-354-క., 7-359-ఉ.]

5376} సరోజజుడు  - సరోజము (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు :-
[3-321-క., 3-336-తే.]

5377} సరోజదళనిభాక్షుడు  - సరోజ (పద్మముల) దళముల నిభ (వంటి) అక్షుడు (కన్నులున్నవాడు), విష్ణువు :-
[3-256-చ.]

5378} సరోజనాభుడు  - సరోజము (పద్మము) నాభిని కలవాడు, విష్ణువు :-
[3-91-వ.]

5379} సరోజభవుడు  - సరోజ (పద్మమున) భవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[3-380-ఉ., 4-163.1-తే., 4-965-క.]

5380} సరోజము  - సరస్సున పుట్టినది, పద్మము :-
[2-93-ఉ., 3-288-వ., 3-550-చ., 3-558-క., 11-12.1-తే.]

5381} సరోజలోచన  - సరోజ (పద్మముల)వంటి లోచన (కన్నులు కల స్త్రీ) :-
[10.2-693-మ.]

5382} సరోజలోచనుడు  - సరోజము (పద్మము)ల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు, కృష్ణుడు :-
[3-46-చ., 3-152-చ., 3-442-ఉ., 4-550-చ., 10.2-493-మ.]

5383} సరోజసంభవుడు  - సరోజ (పద్మము) అందు పుట్టిన వాడు, బ్రహ్మదేవుడు :-
[2-243-చ.]

5384} సరోజాక్షుడు  - సరోజము (పద్మము) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు, కృష్ణుడు :-
[3-71.1-తే., 3-99.1-తే., 3-757-మ., 4-832-తే.]

5385} సరోజాతభవుడు  - సరోజాతము (పద్మము)న భవుడు (పుట్టిన వాడు), బ్రహ్మదేవుడు :-
[3-644.1-తే.]

5386} సరోజాతము  - సరసున జాతము (పుట్టునది), పద్మము :-
[3-281-మ., 3-485-తే., 3-862-క., 4-88-క.]

5387} సరోజాతాక్షుసూనుడు  - సరోజాతాక్షుడు (కృష్ణుడు) యొక్క సూనుడు (కొడుకు), సాంబుడు :-
[10.2-564-శా.]

5388} సరోజానన  - సరోజ (పద్మముల వంటి) ఆనన (మోముకలామె), స్త్రీ. :-
[10.1-797-మ.]

5389} సరోజాయతలోచనుడు  - సరోజ (పద్మముల) వంటి ఆయత (పెద్ద) లోచనుడు (కన్నులుగలవాడ), విష్ణువు :-
[4-925.1-తే.]

5390} సరోరుహనయనుడు  - సరోరుహము (పద్మము) వంటి నయనుడు (కన్నులుగలవాడు), విష్ణువు :-
[4-910.1-తే.]

5391} సరోరుహనాభుడు  - సరోరుహము (పద్మము) నాబిన కలవాడు, విష్ణువు :-
[3-120-ఉ.]

5392} సరోరుహమాలికుడు  - సరోరుహ (పద్మము)ల మాలిక ధరించినవాడ, విష్ణువు :-
[4-920-ఉ.]

5393} సరోరుహము  - సరసున రుహము (పుట్టినది), పద్మము :-
[1-227-మ., 3-937-వ., 4-124-చ., 10.1-597-వ., 10.2-1069-చ.]

5394} సరోరుహసంభవుడు  - సరోరుహము (పద్మము)న సంభవించినవాడు, బ్రహ్మదేవుడు :-
[4-730-చ.]

5395} సరోరుహాక్షుడు  - సరోరుహము (పద్మము) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు :-
[3-270-క., 3-662-మ., 3-684-క.]

5396} సరోరుహానన  - పద్మముఖి, స్త్రీ. :-
[10.2-343-చ.]

5397} సరోరుహోదరుడు  - సరోరుహము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు :-
[3-114-చ., 3-511-చ.]

5398} సర్పపరిపంథి  - సర్ప (పాములకు) పరిపంథి (శత్రువు), గరుత్మంతుడు :-
[7-290-వ.]

5399} సర్పాంతకుడు  - పాములకు యముని వంటి వాడు, గరుత్మంతుడు :-
[10.1-703.1-తే.]

5400} సర్వంబునెఱుగు  - సృష్టి స్థితి లయ తిరోధానానుగ్రహము లనెడి పంచకృత్యములు మొదలైనవానిని అన్నిటిని దేముడు ఎరుగును :-
[10.1-683-వ.]

5401} సర్వంసహా  - సమస్తమును భరించునది, భూమి :-
[10.1-1521-శా.]

5402} సర్వంసహావల్లభుడు  - సర్వంసహా (భూమికి) రాజు, ప్రభువు. :-
[1-377-మ.]

5403} సర్వకాలములు  - భూతభవిష్యద్వర్తమాన కాలములు, నిమేషమాది మహాప్రళయాంతము వరకు కల సమస్తమైన కాలములు, సమస్తమైన కాలములు :-
[10.1-1631.1-ఆ.]

5404} సర్వగతుడు  - సర్వ (సమస్త మందు) గతుడు (ఉండెడి వాడు), విష్ణువు :-
[6-220-క.]

5405} సర్వగుడు  - ఎల్ల యెడల నిండి ఉండువాడు, విష్ణువు. :-
[6-220-క., 10.1-944-మ.]

5406} సర్వజగజ్జయాంగజభ్రాత  - సర్వ (అఖిల) జగత్ (లోకములను) జయ(జయించెడి) అంగజ (మన్మథుని) భ్రాత (సోదరుడు), బ్రహ్మ :-
[6-278-ఉ.]

5407} సర్వజ్ఞనిధి  - సర్వజ్ఞత్వమున (సమస్తము ఎరుగుట, జ్ఞానము)కు నిధివంటివాడు, విష్ణువు. :-
[11-112-క.]

5408} సర్వజ్ఞుడు  - సమస్తమైన జ్ఞానము కలవాడు, విష్ణువు :-
[4-705-వ.]

5409} సర్వదాసత్యభాషి  - ఎల్లప్పుడు సత్యమును పలుకువాడు, రాముడు . :-
[9-735-మాలి., 12-53-మాలి.]

5410} సర్వదేవమయుడు  - సమస్తమైన దేవతలు తానైన వాడు, విష్ణువు :-
[9-342.1-తే.]

5411} సర్వదేవుడు  - సమస్తమును (దివయింతి ఇతి దేవః) ప్రకాశింపజేయువాడు, విష్ణువు :-
[11-77-వ.]

5412} సర్వద్రష్ట  - సర్వమును సరిగ చూచువాడు, పరమాత్మ :-
[2-84-వ.]

5413} సర్వనియామకుడు  - సర్వులను నియమించువాడు, కృష్ణుడు :-
[4-468-వ.]

5414} సర్వపుణ్యుడు  - సమస్తమైన సుకృతముల రాశియైన వాడు, విష్ణువు :-
[10.1-942-ఆ.]

5415} సర్వప్రభువు  - సర్వులను (బ్రహ్మాది పిపీలక పర్యంతమును) ప్రభావము చూపు (నియమించు) వాడు, విష్ణువు :-
[10.1-1497-మ.]

5416} సర్వభూతగణావాసుడు  - సమస్తమైన జీవరాశి యందును ఆత్మరూపమున ఉండువాడు, విష్ణువు :-
[3-373-మ.]

5417} సర్వభూతనివాసి  - సర్వ (సకల) భూతముల (జీవుల) యందును నివసించెడివాడు, విష్ణువు :-
[4-918.1-తే.]

5418} సర్వభూతభవవృద్ధివినాశనహేతుభూతుడు  - సర్వమైన భూతముల యొక్క భవ (సృష్టి) వృద్ధి ( స్థితి) నాశన (లయము) లకు మూలకారణమైనవాడు, విష్ణువు :-
[3-599-ఉ.]

5419} సర్వభూతభావనుడు  - సమస్తమైన భూతముల (జీవుల)ను భావనుడు (భావించి సృష్టించువాడు), విష్ణువు :-
[4-421-వ.]

5420} సర్వభూతాంతరాత్ముడు  - సమస్తమైన జీవుల అంతరాత్మ అయినవాడు, విష్ణువు :-
[3-407.1-తే.]

5421} సర్వభూతాంతర్యామి  - అఖిల జీవులకును అంతర్యామి (లోపల ఉండెడి వాడు), విష్ణువు :-
[4-964-వ.]

5422} సర్వభూతాత్మకుడు  - సమస్త జీవుల ఆత్మలందు నిండి ఉండువాడు, విష్ణువు :-
[11-77-వ.]

5423} సర్వభూతాత్మవిగ్రహుడు  - సర్వమైన భూత (జీవుల) ఆత్మ (ఆత్మలను) విగ్రహుడు (నియమించువాడు), విష్ణువు :-
[4-366-వ.]

5424} సర్వభూతాధారుడు  - సమస్తమైన (స్థావర జంగమ) జీవులకు ఆధారభూతమైనవాడు, విష్ణువు :-
[10.1-1180.1-ఆ.]

5425} సర్వమంగళ  - సర్వులకు మంగళము కలిగించునది, పార్వతి :-
[8-241-క.]

5426} సర్వమయుడు  - సకల భువనములు కలిగినవాడు, విశ్వంభరుడు :-
[2-89-వ., 6-220-క., 10.1-120-క.]

5427} సర్వరసాత్మ  - సమస్త రసములకు అంతర్యామి, విష్ణువు :-
[4-703.1-తే.]

5428} సర్వర్థి  - 1. వత్సరుని భార్య పుష్పార్ణుని తల్లి. 2. సమస్తమైన ప్రయోజనములు తానైనామె :-
[4-390-వ.]

5429} సర్వలోకజిష్ణుడు  - సర్వ (అఖిలమైన) లోక (భువనములను) జిష్ణుడు (జయించెడి శీలము గలవాడు), విష్ణువు :-
[6-307-వ.]

5430} సర్వలోకపాలావళిమౌళిభూషణుండు  - సమస్తమైన లోకములను పాలించువారి ఆవళి (సమూహము) కిని మౌళి (శిరస్సు)నకు భూషణుడు (భూషణము వంటివాడు), బ్రహ్మదేవుడు :-
[3-500-ఉ.]

5431} సర్వలోకపావనుడు  - సర్వ (అఖిలమైన) లోకములను పావనుడు (పవిత్రము జేయువాడు), కృష్ణుడు :-
[5.2-166-క.]

5432} సర్వలోకప్రజాధిపుడు  - సమస్తమైన లోకముల ప్రజలకును ప్రభువు, విష్ణువు :-
[3-546.1-తే.]

5433} సర్వలోకప్రశస్తుడు  - సర్వ (సమస్తమైన) లోక (లోకములలోను) ప్రశస్తుడు (శ్లాఘింపబడువాడు), శ్రీరాముడు :-
[10.1-1791-మాలి.]

5434} సర్వలోకశరణ్యుడు  - సర్వ (సమస్తమైన) లోక (లోకములకు) శరణ్యుడు (అభయము నిచ్చువాడు), విష్ణువు :-
[6-330-తే., 10.2-1318-చ.]

5435} సర్వలోకహితదాత  - సర్వ (అఖిల) లోక (లోకముల) హిత (హితమును) దాత (కలిగించెడి వాడు), బ్రహ్మ :-
[6-278-ఉ.]

5436} సర్వలోకాభిరాముడు  - ఎల్ల లోకములకు అభిరాముడు (మనోజ్ఞుడు), శ్రీరాముడు :-
[10.2-1342-మాలి.]

5437} సర్వలోకేశ్వరుడు  - సమస్తమైన లోకములకు ప్రభువు, విష్ణువు :-
[7-376.1-తే.]

5438} సర్వలోకేశ్వరేశుడు  - అఖిల లోకపాలకులకు ఈశ్వరుడు, విష్ణువు :-
[10.2-247-తే.]

5439} సర్వలోకోపకారి  - సర్వ (సమస్తమైన) లోక (లోకములకు) ఉపకారి (ఉపకారము చేయువాడు), రాముడు :-
[4-976-మాలి.]

5440} సర్వవ్యాపారప్రవర్తకము  - సమస్తమైన పంచవ్యాపారముల (1సృష్టి 2స్థితి 3లయ 4తిరోధాన 5అనుగ్రహములు) యందు విచిత్రముగ వ్యాపించగలుగుట :-
[10.1-681-వ.]

5441} సర్వశక్తి  - సర్వమునకు శక్తి యైనవాడు, విష్ణువు :-
[3-212-చ.]

5442} సర్వశక్తియుక్తుడు  - సమస్తమైన శక్తులుకలవాడు, విష్ణువు :-
[4-703.1-తే.]

5443} సర్వశబ్దవాచ్యుడు  - సర్వ శబ్దముచే తెలియబడు వాడు, ప్రమాణ శ్లో. సర్వగత్వాదనంతస్య సఏవాహ మనస్థితః, మత్తస్సర్వమహం సర్వం మయి సర్వం సనాతనః., విష్ణువు :-
[10.2-1203-వ.]

5444} సర్వశరణ్యుడు  - అందరకును శరణ్యుడు (శరణుజొచ్చుటకు తగినవాడు), విష్ణువు :-
[3-19-చ., 3-552-చ., 3-623-ఉ., 4-276-చ., 4-917-చ.]

5445} సర్వసంగపరిత్యాగము  - సర్వ (సమస్తమైన) సంగ (తగులములను) పరిత్యాగము (పూర్తిగా విడిచివేయుట) :-
[5.1-163-వ., 11-105-వ.]

5446} సర్వసంపదలు  - అష్టైశ్వర్యములు, 1దాసీజనము 2భృత్యులు 3పుత్రులు 4మిత్రులు 5బంధువులు 6వాహనములు 7ధనము 8ధాన్యము :-
[10.2-205-వ.]

5447} సర్వసత్తుడు  - అఖిలమైన సత్తువలు (సామర్థ్యములు) తానైన వాడు, విష్ణువు :-
[4-704-తే.]

5448} సర్వసాక్షి  - సమస్తమునకు సాక్షీభూతుడు, విష్ణువు :-
[4-918.1-తే.]

5449} సర్వస్వామి  - అందరకును స్వామి (ప్రభువు), విష్ణువు :-
[3-935-మ.]

5450} సర్వాతిశాయి  - సమస్తమును అతిశయించి (మించి) ఉండువాడు, విష్ణువు :-
[2-214-మ.]

5451} సర్వాత్మ - జగత్తు అంతయు తానైన వాడు, విష్ణువు :-
[10.2-1014-క.]

5452} సర్వాత్మకుడు  - సమస్తమునందు ఆత్మగ ఉండువాడు సర్వాంతర్యామి, విష్ణువు :-
[2-84-వ., 4-367.1-తే., 4-509.1-తే., 6-327.1-తే., 7-148-శా., 8-477-మ., 9-283-శా.]

5453} సర్వాత్ముడు  - సర్వ (అఖిల జీవులకు) ఆత్ముడు (అంతరాత్మ యైన వాడు), విష్ణువు :-
[3-355.1-తే., 6-220-క., 7-167-మ., 8-122-మ., 10.1-120-క., 10.1-343-ఆ.]

5454} సర్వానుగతుడు  - అఖిలమును అనుసరించు వాడు, విష్ణువు :-
[6-216-ఉ.]

5455} సర్వార్థసాధకులు  - సర్వోత్తమైన ప్రయోజనమనకై (పరమహంస పదవికై) సాధన చేయువారు :-
[7-88-వ.]

5456} సర్వులు  - బ్రహ్మాది పిపీలక పర్యంతము బ్రహ్మ మొదలు క్రిమివరకు కల సమస్తమైన మూర్తులు :-
[10.1-1450.1-ఆ.]

5457} సర్వేశుడు  - సర్వులను (పిపీలకాది బ్రహ్మ పర్యంతము), పంచకృత్యములను (సృష్టి స్థితి లయ తిరోధానానుగ్రహములను) నియమించు ప్రభువు, విష్ణువు, భగవంతుడు :-
[2-221.1-తే., 2-262-క., 3-220-క., 3-307.1-తే., 3-532-మ., 3-755-మ., 6-220-క., 6-397.1-ఆ., 6-414.1-తే., 6-497.1-తే., 7-354.1-తే., 10.1-557.1-తే., 10.1-572.1-తే., 10.1-578-క., 10.1-693.1-తే., 10.1-943-శా., 11-85-తే.]

5458} సర్వేశ్వరుడు  - సమస్తమునకు అధిపతి, భగవంతుడు, విష్ణువు, కృష్ణుడు :-
[1-215.1-తే., 1-380-మ., 2-89-వ., 2-89-వ., 2-222-వ., 2-267-వ., 3-91-వ., 3-293.1-తే., 3-412-వ., 3-416-వ., 3-507-వ., 3-524-వ., 3-539-వ., 3-896-వ., 3-921-వ., 3-921-వ., 3-972-వ., 3-992-వ., 3-1020.1-తే., 4-162-వ., 4-357-వ., 4-359.1-తే., 4-421-వ., 4-670-వ., 4-963.1-తే., 5.1-51-వ., 6-221-వ., 6-327.1-తే., 7-365-మ., 9-728.1-తే., 10.1-120-క., 10.2-1203-వ., 11-60-వ.]

5459} సర్వోపాధివర్జితుడు  - సమస్తమైన ఉపాధులను (ఆధారములను, జాతి గుణ క్రియా సంజ్ఞా రూపమైనవి) వర్జితుడు (వదలినవాడు), విష్ణువు :-
[4-367.1-తే.]

5460} సలలితశ్రీవత్సకలితవక్షుడు  - సలలిత (అందమైన) శ్రీవత్స (శ్రీవత్సము అనెడి పుట్టుమచ్చ) కలిత (కలిగిన) వక్షుడు (వక్షస్థలము కలవాడు) , విష్ణువు :-
[3-922.1-తే.]

5461} సలలితానర్ఘ్యరత్నకుండలకిరీటహారకంకణకటకకేయూరముద్రికాతులాకోటిభూషుడు - సలలితా (అంద మైన) అనర్ఘ్య (వేలకట్టలేని) రత్నములు తాపిన కుండలములు కిరీటములు హారములు కంకణములు కటక (కడియము)లు కేయూర (భుజకీర్తులు) ముద్రికా (ఉంగరములు) తులాకోటి (అందెలు) లతో భూషితుడు (అలంకరింపబడినవాడు), విష్ణువు :-
[3-922.1-తే.]

5462} సవనమయస్తబ్ధరోముడు  - సవన (యజ్ఞ) మయ స్తబ్ధ రోముడు (నిక్కబొడుచుకున్న వెండ్రుకలు గలవాడు , వరాహుడు), విష్ణువు :-
[3-633-క.]

5463} సవనములు+తనున్  - సవనములుదనున్, గసడదవాదేశ సంధి :-
[10.2-1322-క.]

5464} సవితృడు  - ద్వాదశాదిత్యులు పన్నెండుగురులో ఒకడు :-
[6-506.1-ఆ.]

5465} సవిరళదంష్ట్రాభిరాముడు  - స (కలిగిన) అవిరళ (దట్టమైన) దంష్ట్తా (కోరలతో) అభిరాముడు (ఒప్పిదమైన వాడు, మనోజ్ఞమైన వాడు), ఆదివరాహావతారుడు :-
[3-633-క.]

5466} సవిశేషోత్సవసంవిధాత  - సవిశేష (విశిష్టలతోకూడిన) ఉత్సవ (సంతోషమును) సంవిధాత (చక్కగాకలిగించెడివాడు), బ్రహ్మ :-
[7-85-మ.]

5467} సవ్యసాచి  - రెండు చేతులతో బాణములు వేయగలవాడు, అర్జునుడు :-
[11-122-వ.]

5468} సష్టృ  - సృష్టికర్తలు, బ్రహ్మలు, వ్య. సృజ్+తృచ్, సృజతి జగత్ అసౌ, ప్రపంచమును సృష్టించువాడు. బ్రహ్మదేవుడు. :-
[3-248-క.]

5469} సహజకోపనులు  - సహ (కూడా) జ (పుట్టిన) (సహజసిద్ధంగా) కోపనులు (కోప స్వభావము కలవారు), పాములు :-
[10.1-693.1-తే.]

5470} సహజము  - తోడపుట్టినది, స్వభావము. :-
[2-21.1-తే.]

5471} సహస్రకిరణుడు  - సహస్ర (అనంతమైన) కిరణములు కలవాడు, సూర్యుడు :-
[12-44-క.]

5472} సహస్రనయనుడు  - వెయ్యి కన్నులు కలవాడు, ఇంద్రుడు :-
[10.1-1101-వ.]

5473} సహస్రాక్షుడు  - సహస్ర (వేయి 1,000) అక్షుడు (కన్నులు గలవాడు), ఇంద్రుడు :-
[6-437-వ.]

5474} సహిష్ణుడు  - సహజమైన యోర్పు గలవాఁడు, సుఖదుఃఖముల మానావమానముల జ్ఞానాజ్ఞానముల ఎడ మిక్కిలి ఓర్పుగలవాడు, ద్వంద్వాతీతుడు, విష్ణువు :-
[2-236-మ., 4-26-వ., 8-105-మ., 10.1-445-ఉ., 10.1-1182-శా.]

5475} సాంఖ్యము  - సాంఖ్యశాస్త్రము, తత్త్వదర్శనములలో నొకటి, బ్రహ్మజ్ఞానమును ఎంచి లెక్కించి తరచి తరచి చూసెడి మార్గమున అభ్యసించుట. :-
[1-63-వ., 2-5-ఆ., 2-119-చ., 10.1-1474-ఆ.]

5476} సాంఖ్యాయనుడు  - 1. సంకర్షణుడు భాగవతమును సనత్కుమారునికి ఉపదేశించాడు. ఆయన సాంఖ్యాయనునకు, ఆయన పరాశరునికి, ఆయన బృహస్పతికి, ఆయన మైత్రేయునికి ఉపదేశించారు. 2. ఋగ్వేదము చదివిన ఒక ఋషి, :-
[3-268-తే.]

5477} సాందీపని  - 1. బలరామకృష్ణుల గురువు, అవంతి నివాసి. కొడుకు స్నానం చేస్తుంటే పంచజని అను రాక్షసుడు నీటిలోకి ఎత్తుకుపోయాడు. అట్లు మరణించిన కొడుకును బలరామ కృష్ణులు తెచ్చి గురుదక్షిణగా సమర్పించారు. 2. వేదవ్యాసుడు మైత్రేయుడు సాందీపని యీ ముగ్గురును పరాశరమహర్షి శిష్యులు, బాల్యసఖులు :-
[3-121-మ.]

5478} సాంబుడు  - జాంబవతీ కృష్ణుల కొడుకు :-
[10.2-404-వ.]

5479} సాక్షాత్కారము  - భగవంతుడు కంటికెదురుగ అగబడుట, కంటపడుట :-
[4-619.1-తే.]

5480} సాక్షి  - అంటకుండ కనుగొనువాడు, కాల వస్తు స్థితి స్వభావముల ప్రభావములకు లోనుగాక చూచువాడు :-
[10.1-681-వ., 10.2-1230-వ.]

5481} సాగరకన్య  - సాగరము (సముద్రము) యొక్క కన్య (పుత్రిక), లక్ష్మీదేవి :-
[4-586-చ.]

5482} సాగరకన్యక  - సాగరము (సముద్రము) యొక్క కన్యక (పుత్రిక), లక్ష్మీదేవి :-
[3-750.1-తే.]

5483} సాగరకన్యకాకుచకుంకుమాంకితవిపులబాహాంతరుడు  - సాగర (సముద్రము)నకు కన్యకా (పుత్రిక) కుచములకు రాసుకొన్న కుంకుమ అంకిత (అంటిన) విపుల (విస్తారమైన) బాహాంతరము (వక్షము) కలవాడు, విష్ణువు :-
[3-99.1-తే.]

5484} సాగరతనయాహృదీశుఁడు  - సాగరతనయ (లక్ష్మీదేవి) హృదీశుడు (భర్త), విష్ణువు :-
[3-212-చ.]

5485} సాగరతనూజ  - సాగర (సముద్రుని) తనూజ (పుత్రిక), లక్ష్మి :-
[4-555.1-తే.]

5486} సాగరము  - సగరపుత్రులచే తవ్వబడినది, సముద్రము :-
[12-48-వ.]

5487} సాగరమేఖలామహీభరణధురంధురుడు  - సాగర (సముద్రములే) మేఖలా (సరిహద్దులుగా గల) మహీ (భూమండలమును) భరణ (పాలించుటఅను) ధురంధరుడు (భారము వహించు వాడు), రాముడు :-
[4-974-చ.]

5488} సాగిలపడుట  - సాష్టాంగ నమస్కారము చేయుట :-
[10.1-116-ఆ.]

5489} సాగ్నులు  - పంచచత్వారింశత (49) అగ్నులలోని వారు, మంటలతో నుండువారు, సహ+అగ్ని, సహ అగ్నినా, సహ యజ్ఞాగ్నినా, యజ్ఞ అగ్ని కల అగ్నులు? :-
[4-34-వ.]

5490} సాత్యకి  - 1. కృష్ణుని రథ సారథి, 2. శిని కొడుకైన సత్యకుని కొడుకు. :-
[10.2-404-వ.]

5491} సాత్యవతేయుడు  - సత్యవతికి పరాశరుని వలన కలిగిన పుత్రుడు, వ్యాసుడు :-
[3-196-వ., 10.2-766.1-ఆ., 10.2-1117-ఉ.]

5492} సాత్వతాంపతి  - 1. సాత్వతులకు ప్రభువు, 2. కృష్ణుడు సాత్వత వంశములో పుట్టెను :-
[2-236-మ.]

5493} సాత్వతులు - 1. పరబ్రహ్మను భగవంతుడు అనువారు, 2. సత్వగుణులు, 3. బలరాముడు ఆదిగురువుగా ఒక ప్రత్యేకమైన భక్తితత్వాన్ని అవలంభించే యాదవులను సాత్వతులంటారు, 4. కృష్ణునికి 8 తరాల పూర్వపు సాత్వతుని వంశము వారు, (సాత్వతుడు , భజమానుడు , విడూరధుడు , శిని , భోజుడు , హృదీకుడు , శూరుడు (దేవమీఢుడు) , వసుదేవుడు , కృష్ణుడు) :-
[2-59-వ.]

5494} సాత్వికాహంకారము  - సత్త్వగుణముతో కూడిన అహంకారము :-
[3-202-వ.]

5495} సాధనంబులు  - సాధించుటకు ఉపయోగపడునవి, పనిముట్లు :-
[3-1025-వ.]

5496} సాధుసంరక్షణుడు  - సజ్జనులను కాపాడువాడు, కృష్ణుడు. :-
[10.1-951-మ.]

5497} సాధ్యులు  - (1) గణదేవతాభేదము. ధర్మునికి సాధ్యయందు పుట్టినవారు. (సిద్ధిగలవారు అని శబ్దార్థము.) వీరు పన్నిద్దఱు.(2) ద్వాదశ సాధ్యులు 1. మనువు, 2. అనుమంత, 3. ప్రాణుడు, 4. నరుడు, 5. నారాయణుడు, 6. వృత్తి, 7. తపుడు, 8. హయుడు, 9. హంసుడు, 10. ధర్ముడు, 11. విభుడు, 12. ప్రభుడు. [సాం.పు. 18 18] :-
[2-38-వ., 2-274.1-తే.]

5498} సాధ్వి  - పతివ్రత, సాధుస్వభావురాలు, స్త్రీ, సాధు+ఙీప్, సాధు వ్యవహరతి, చక్కగా వ్యవహరించుస్త్రీ. :-
[4-42.1-తే., 4-657.1-తే.]

5499} సామగానములు  - గానము చేయుటకు అనువైన సామవేద మంత్రములు :-
[8-536.1-తే.]

5500} సామజము  - సామవేదముల వలన పుట్టినది, ఏనుగు :-
[10.1-1532-వ.]

5501} సామోపాయము  - (అ)అనుకూలప్రవర్తన, (ఆ)సామము, దానము, భేదము, దండము అను చతురుపాయములలోనిది, ఇది అయిదు విధములు 1పరస్పరోపాకారము కనిపింపజేయుట 2మంచితనము చూపుట 3గుణములను కొనియాడుట 4సంబంధములునెరపుట 5నేను నీవాడనని మంచిమాటలాడుట :-
[8-637-క.]

5502} సాయకము  - అమ్ము, బాణము, వ్యు. పో సో, అంతఃకర్మణి, కృ,ప్ర. చంపునది. :-
[3-469-క.]

5503} సాయము  - సాయంత్రము, సో+ణమ్, స్యతి సమాయతి దినమ్, దినమును సమాప్తి చేయునది. :-
[4-390-వ., 6-507-వ.]

5504} సాయుజ్యము  - సహయోగము చెందుట, సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము, సార్ష్టి అను పంచవిధ మోక్షములలోనిది :-
[12-45-వ., 12-48-వ.]

5505} సారథి  - రథము తోలువాడు :-
[4-327-ఉ.]

5506} సారమేయము  - సరమ యందు కశ్యపునకు పుట్టినది, కుక్క :-
[10.1-1199-వ.]

5507} సారమేయాదనము  - కుక్కలచే శిక్షించుట, నరక విశేషము :-
[5.2-136-వ.]

5508} సారసము  - సరస్సుల ఉండునది, తామర, పద్మము, బెగ్గురు పక్షి :-
[10.1-1101-వ.]

5509} సారసాకరము  - సారస (తామరలకు, బెగ్గురు పక్షులకు) ఆకరము (నెలవైనది), చెరువు :-
[3-513-మ.]

5510} సార్ఙ్గకోదండడు  - సార్ఙ్గ్యము యనెడి ఖడ్గము కోదండము యనెడి విల్లు మొదలగు ఆయుధములు గలవాడు, విష్ణువు :-
[7-171.1-తే.]

5511} సార్వభౌముడు  - సర్వ భూములకు ప్రభువు, చక్రవర్తి :-
[6-455-వ., 6-456.1-ఆ., 10.1-1661-ఆ.]

5512} సాలగ్రామము  - విష్ణుమూర్తి చిహ్నిత శిలావిశేషము, హిమాలయాలలోని గండకీనది (సాలగ్రామమనెడి) యందు లభించు పవిత్రమైన శిలాజములు, :-
[5.1-98.1-తే.]

5513} సాల్వుడు  - సాల్వ దేశపు రాజు, శిశుపాలుని తమ్ముడు, శిశుపాలుని మరణానికి ప్రతీకారానికై శివుని వరంతో సౌంభకము అను విమానము పొంది, దండెత్తగా, కృష్ణుఁడు వీనిని సంహరించెను. :-
[2-190-చ., 10.1-1722-ఉ.]

5514} సావధానము  - అవధరించుటను కలిగిఉండుట, శ్రద్ధ :-
[2-284-వ.]

5515} సావిత్రము  - సవితను ఉపాసించుట :-
[3-388-వ.]

5516} సాష్టాంగదండప్రణామము  - అష్ట (ఎనిమిది 1నుదురు 2కళ్ళు 3ముక్కు 4చెవులు 5 గడ్డము 6రొమ్ము 7ఉదరము 8కాళ్ళు) అంగములతోను దండము (కఱ్ఱ) వలె నేలపై పండుకొని చేయు నమస్కారము :-
[3-751-వ., 3-1027-వ., 4-17-వ., 5.1-146-వ., 7-346-వ., 9-317-వ., 10.2-433-వ., 11-60-వ.]

5517} సింధురభంజనుడు  - సింధుర (కువలయాపీడం అను ఏనుగును) భంజనుడు సంహరించినవాడి, కృష్ణుడు :-
[10.2-918-చ.]

5518} సింధురవైరి  - సింధుర (ఏనుగు, కువలయాపీడం)కు వైరి (శత్రువు), సింహము :-
[10.2-349-ఉ.]

5519} సింహమధ్యముడు  - సింహము వంటి నడుము కలవాడు, కృష్ణుడు :-
[10.1-1467.1-తే.]

5520} సింహాసనము  - 1) రాజు కూర్చొనెడి పీఠము, 2) గుహ (పై పోట్ట యందు పక్కటెముకల క్రింద ఉండు గుహ వంటి (గుండె, హృదయము) స్థానమని యోగశాస్త్రార్థము), ఈ గుహలో ఆసీనుడైన భగవంతుని ధ్యానించుట యోగ సాధనమార్గము లలో ముఖ్యమైనది. ఉదా. నరుల గుహలో నుండు వాడు నృసింహుడు, :-
[2-238-వ., 6-260.1-తే.]

5521} సింహిక  - సింహిక ప్రహ్లాదుని సోదరి, హిరణ్యకశిపుని కూతురు, స్వర్భానుని తల్లి, స్వర్భానుడు దొంగతనంగా అమృతం తాగుతుంటే విష్ణువు చక్రంతో తల నరికాడు అలా రాహువు కేతువులుగా అయ్యి గ్రహాలు అయ్యారు; నీడను బట్టి లాగి మింగే ఆ సింహికను హనుమంతుడు సముద్ర లఘనంలో సంహరించాడు :-
[10.1-1621.1-ఆ.]

5522} సిగ్గు  - స్తుత్యాదులచే కలుగు సంకోచము :-
[10.2-578-వ.]

5523} సితకరిగమనుడు  - సితకరి (తెల్ల ఏనుగు, ఐరావతము) పై గమనడు (తిరుగువాడు), ఇంద్రుడు. :-
[10.1-947-క.]

5524} సితగిరి  - సిత (తెల్లని) గిరి (పర్వతము), కైలాసపర్వతము :-
[6-487-మ.]

5525} సితరాజీవదళనయనుడు  - సిత (తెల్లని) రాజీవ (తామరపువ్వు) దళ (రేకుల) వంటి నయనుడు (కన్నులు గల వాడు), శ్రీరామ :-
[4-1-క.]

5526} సితాంబుజాక్షుడు  - తెల్లని అంబుజ (తామరలవంటి) అక్షుడు కన్నులు కలవాడు, కృష్ణుడు :-
[10.2-677-ఆ.]

5527} సిద్ధరసము  - సిద్ధి (వాంఛిత ప్రాప్తి) కలిగించెడి రసము (ఔషధము, రసాయనము) :-
[5.2-110-వ.]

5528} సిద్ధి  - 1. పరిపక్వము, 2. ఒక గ్రహయోగము. 3. అణిమాదులు సిద్ధించుట. :-
[3-348-ఉ.]

5529} సిద్ధులు  - 1. సిద్ది పొందినవారు, 2. దేవతలలో ఒక తెగవారు. 3. అణిమాది సిద్ధిగలవారు, 4. అతీంద్రియ శక్తులు :-
[2-30-వ., 2-274.1-తే., 10.1-107-క.]

5530} సినివాలి  - చంద్రకళ కాన వచ్చెడి అమావాస్య, అమావాస్యా భేదము, అంతకు ముందు తెల్లవారుఝామున సన్నటి చంద్రరేఖ తూర్పున కనబడు అమావాస్య :-
[4-25-క., 5.2-62-వ., 6-507-వ.]

5531} సిరిపెనిమిటి  - సిరి (లక్ష్మీదేవి) భర్త, విష్ణువు, కృష్ణుడు :-
[10.2-43-క.]

5532} సీత  - సీత (నాగేటి చాలు)న పుట్టినామె, సీతాదేవి :-
[9-373-ఆ.]

5533} సీతాపతి  - జానకీ వల్లభుడు, రాముడు :-
[11-1-క.]

5534} సీతారామాశ్రమము  - సీతరాములు కొన్నాళ్ళు కాపురమున్న పంచవటిలోని ఒక ప్రదేశము :-
[7-451-వ.]

5535} సీతేశుడు  - సీతాదేవి యొక్క భర్త, రాముడు :-
[10.1-144-క.]

5536} సీరధ్వజుడు  - సీరము (నాగలి) ధ్వజుడు (గుర్తుగా గలవాడు), జనకుడు, సీతాదేవి భర్త :-
[9-373-ఆ.]

5537} సీరి  - సీరము (నాగలి) ఆయుధమును ధరించివాడు, బలరాముడు :-
[10.1-1575-శా., 10.2-293-క., 10.2-486-క.]

5538} సుందరాంగి  - అందమైన అంగి (దేహము) కల స్త్రీ :-
[6-259.1-తే., 10.2-1165.1-తే.]

5539} సుందరాకారుడు  - సుందరమైన ఆకారము కలవాడు , విష్ణువు :-
[3-145.1-తే., 3-924.1-తే.]

5540} సుందరీమానహారుడు  - అందగత్తెల అభిమానమును అపహరించువాడు, రాముడు :-
[9-735-మాలి., 12-53-మాలి.]

5541} సుందరీలోకకాముడు  - సుందర స్త్రీసమూహములకు మన్మథుడు, శ్రీరాముడు :-
[10.2-1342-మాలి.]

5542} సుందరీశంబరారుడు  - సుందరీ (అందమైన వారికి) శంబరారుడు (శంబరాసురుని శత్రువు యైన మన్మథుడు వంటివాడు), రాముడు :-
[4-976-మాలి.]

5543} సుకర్ములు  - మంచి పనులు చేయువారు, పుణ్యాత్ములు :-
[3-511-చ.]

5544} సుకుమారాంగని  - సుకుమారమైన దేహముగల స్త్రీ :-
[6-102-క.]

5545} సుఖము - సుఖతరము సుఖతమము :-
[4-732-వ.]

5546} సుగుణభ్రాజితుడు  - సద్గుణములతో విలసిల్లు వాడు :-
[3-373-మ.]

5547} సుగుణములు  - శమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానము ఆది గొప్ప మంచి గుణములు :-
[10.1-112.1-తే., 10.1-1682-మ.]

5548} సుగుణవనవిహారుడు  - సుగుణముల వన (సమూహము) నందు విహరించువాడు, రాముడు :-
[9-735-మాలి., 12-53-మాలి.]

5549} సుగుణస్తోముడు  - సుగుణముల సమూహము గలవాడు, పరశురాముడు :-
[6-305-క.]

5550} సుగుణుడు  - సుగుణములు గలవాడ, విష్ణువు :-
[4-920-ఉ.]

5551} సుగుణోత్తముడు  - సుగుణములు గల ఉత్తముడు, విష్ణువు :-
[8-92-ఉ.]

5552} సుచికాంగహారము  - అభిప్రాయమును సూచించునవి, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

5553} సుత్య  - సుత్యస్నపనము, స్నానము, సోమలతను కొట్టిపిడుచుట, సోమపానము (అని కొంధఱు) :-
[8-638-వ.]

5554} సుత్రాముడు  - లోకములను లెస్సగా రక్షించువాడు, ఇంద్రుడు :-
[2-160-క., 10.2-949-క.]

5555} సుదతి  - మంచి పలువరుస కల స్త్రీ :-
[4-747-వ., 4-790-వ., 10.1-184-ఆ., 10.1-317-క., 10.1-860-క., 10.2-117-మ., 11-20-ఉ.]

5556} సుదర్శనకరుడు  - సుదర్శన చక్రము చేతకలవాడు, విష్ణువు :-
[3-748-క.]

5557} సుదర్శనధరుడు  - సుదర్శనము అను చక్రాయుధము ధరించువాడు, విష్ణువు :-
[10.1-727-వ.]

5558} సుదర్శనాయుధుడు  - సుదర్శన మను చక్రాయుధము కలవాడు, విష్ణువు, కృష్ణుడు :-
[10.1-1736-ఉ.]

5559} సుదాంశుడు  - అమృతము వంటి కిరణములు కలవాడు, చంద్రుడు :-
[10.2-640-చ.]

5560} సుదాముడు  - సు (మంచి) దామములు (దండలు) వాడు, మాలాకారుడు, శ్రీకృష్ణునకు మంచి మాలలను ఇచ్చిన మధురానగరములోని మాలాకారుడు :-
[10.1-1267-వ.]

5561} సుదేవుడు  - మంచిదేవుడు, యజ్ఞుడు దక్షిణలకు పుట్టిన పన్నెండుగురు కొడుకులలో చిన్నవాడు. వీరు యామ నామ దేవతలు. :-
[4-6-వ.]

5562} సుధర్మసభ  - ఇంద్రుడు కృష్ణునికి గోవర్ధనగిరి ధరించిన పిమ్మట బహూకరించిన దేవ సభ :-
[10.2-393-వ.]

5563} సుధాంధసమౌనిమనోజ్ఞఖేలనుడు  - సుంధాంధస (దేవతల) మౌని (మునుల)కు మనోజ్ఞ (ప్రియముగ) ఖేలనుడు (క్రీడించువాడు), రాముడు) :-
[7-482-చ.]

5564} సుధాంధసులు  - సుధా (అమృతమును) అంధసులు (అన్నముగా కలవారు), దేవతలు :-
[1-184-మ., 8-109-మ.]

5565} సుధాంధువులు - సుధ (అమృతము)ను అంధుస్సు (అన్నము)గా కలవారు, దేవతలు :-
[8-66-ఆ.]

5566} సుధాంశుడు  - సుధ (అమృతము) అంశుడు (అంశగా గలవాడు), చంద్రుడు :-
[6-384-ఉ.]

5567} సుధాంశుమౌళి  - సుధాంశువు (చంద్రుని) మౌళి (శిరోలంకారముగా ధరించినవాడు), శివుడు :-
[4-933-చ.]

5568} సుధాకరార్కసునేత్రుడు  - సుధాకర (చంద్రుడు) అర్క (సూర్యుడు) సు (చక్కగా) నేత్రుడు (కన్నులుగా కలవాడు), విష్ణువు, కృష్ణుడు :-
[5.2-167-మత్త.]

5569} సుధాకరుడు  - సుధ (వెన్నెల)ని ఆకరుడు (కలుగ జేయువాడు), సుధా (అముతముతో కూడిన) కరుడు (కిరణములు కలవాడు), చంద్రుడు :-
[1-521-వ., 3-535-చ., 4-567-వ.]

5570} సుధాశనముఖ్యస్తుతిపాత్రుడు  - సుధాశన (దేవతలు) ముఖ్య (మొదలగువారి)చే స్తుతింపబడుటకు పాత్రుడు (అర్హుడు), విష్ణువు :-
[3-284-మ.]

5571} సుధాశనరిపుఖండనుడు  - సుధాశనరిపు (రాక్షసులను) ఖండనుడు (సంహరించిన వాడు), బలరాముడు :-
[10.2-489-కవి.]

5572} సుధాశనవంద్యుడు  - సుధాశన (దేవతలు)కు వంద్యుడు (వందనము చేయతగ్గవాడు), విష్ణువు :-
[3-315-మ.]

5573} సుధాశనులు  - సుధ (అమృతము) అశనము (భోజనము) గా గలవారు, దేవతలు :-
[3-338-క., 10.2-347.1-తే.]

5574} సుధాహారులు  - సుధ (అమృతము) ఆహారులు (భోజనముగా గలవారు), దేవతలు :-
[10.2-628-క.]

5575} సుధీజనతావనుడు  - సుధీ (మంచి) జనతా (జనుల యొక్క) అవనుడు (రక్షకుడు), విష్ణువు :-
[3-570-ఉ.]

5576} సుధీవరుడు  - శ్రేష్ఠమైన జ్ఞానవంతుడు, కృష్ణుడు :-
[10.2-1185-చ.]

5577} సునందము  - బలరాముని ముసలాయుధము పేరు, సుందరము ఆనందము కలుగజేయునది. :-
[10.2-551-చ.]

5578} సునందాదిపరిజనులు  - సునంద, నంద, జయ, విజయ, జయంత మున్నగు విష్ణుమూర్తి పరిజనులు :-
[10.2-1313-వ.]

5579} సునాభాస్త్రుడు  - సునాభము(అను చక్రము) ఆయుధముగా గలవాడు, విష్ణువు :-
[3-101-మ.]

5580} సునాసీరుడు  - శ్రేష్ఠమైన సేనాగ్రభాగము కలవాడు, ఇంద్రుడు, సు+నా+సీర, సుష్ఠు నాసీరః సైన్యాగ్రం యస్య. :-
[11-69-వ.]

5581} సునీతి  - ధ్రువుని తల్లి, ఉత్తానపాదుని పెద్దభార్య, సునీతి (ధర్మము కలామె) :-
[4-218-క.]

5582} సునీథ  - పుణ్యాత్మురాలు, ధార్మికురాలు, మంచిది, సు + నీ (ప్రాపణే) థక్, కృప్ర., ధర్మశీలన కలామె (ఆంధ్ర శబ్ధాకరము) :-
[4-390-వ.]

5583} సుపర్ణుడు  - సు (మంచి) పర్ణుడు (రెక్కలుకలవాడు) గరుత్మంతుడు :-
[4-166-చ., 4-502-వ.]

5584} సుపర్యారాతి  - సుపర్వులు (దేవతలు)కు ఆరాతి (శత్రువు), హిరణ్యకశిపుడు :-
[7-105-వ.]

5585} సుపర్వమహీజము  - సుపర్వు (దేవత)ల మహీజము (చెట్టు), కల్పవృక్షము :-
[3-442-ఉ.]

5586} సుపర్వులు  - మంచి పుణ్యులు, దేవతలు :-
[2-223.1-తే., 3-722-వ., 10.1-1188-ఉ.]

5587} సుభగయోగసమాధినిష్ఠుడు  - సౌభాగ్యములకైన యోగసమాధి యందు నిష్ఠలో యుండువాడు :-
[4-680.1-తే.]

5588} సుభగుడు  - సౌభాగ్యస్వరూపుడు, సౌభాగ్యము కలవాడు, కృష్ణుడు :-
[1-242-ఉ., 3-99.1-తే.]

5589} సుభిక్షము  - సు (చక్కటి) భిక్షము దొరకునది, సుసంపన్నము :-
[5.1-60-వ.]

5590} సుమనుస్సులు  - మంచి మనసున్నవారు, దేవతలు :-
[1-39-వ.]

5591} సుమనోగణములు  - దేవగణములు ఇవి ఇంద్రియ అధిదేవతలు మొదలగునవి :-
[3-344-వ.]

5592} సుమాస్త్రుడు  - పూలబాణముల వాడు, మన్మథుడు :-
[6-106-క.]

5593} సురకంటకుడు  - దేవతలకు శత్రువు, రాక్షసుడు :-
[10.2-381-చ.]

5594} సురకరువలి  - సుడిగాలి, వ్యు. సుర (గాలిసుడి ధన్వనుకరణ) కరువలి (వాయువు), :-
[10.1-264-క.]

5595} సురగురుడు  - సుర (దేవతల)కి గురుడు (గురువు), బృహస్పతి :-
[3-269-క., 6-259.1-తే.]

5596} సురతరువు  - దేవతల చెట్టు, కల్పవృక్షము :-
[4-319.1-తే.]

5597} సురతానుకూలకాలములు  - జాతి (యామము) 1హస్తిని (మొదటి) 2శంఖిణి (రెండవ) 3చిత్తిని (మూడవ) 4పద్మిని (నాల్గవయామము, తెల్లవారగట్ల) మిక్కిలి అనుకూలము :-
[10.1-1495-ఉ.]

5598} సురద్విపము  - దేవతల ఏనుగు, ఐరావతము :-
[10.1-951-మ.]

5599} సురనాథుడు  - సుర (దేవతలకు)నాథుడు, ఇంద్రుడు :-
[6-404-క., 8-249-క., 10.1-951-మ.]

5600} సురపతి  - సుర (దేవతల) పతి (ప్రభువు), ఇంద్రుడు :-
[6-264-క., 8-147-క.]

5601} సురపతివీడు  - సురపతి (ఇంద్రుడు) యొక్క వీడు (పట్టణము), అమరావతి :-
[4-436.1-తే.]

5602} సురపాలుడు  - సుర (దేవతలను) పాలుడు (పరిపాలించెడివాడు), ఇంద్రుడు :-
[6-294-ఉ.]

5603} సురప్రభువు  - దేవతలరాజు, ఇంద్రుడు :-
[9-504.1-ఆ.]

5604} సురభయపరిహర్త  - సుర (దేవతల) భయ (భయమును) పరిహర్త (పోగొట్టినవాడు), రాముడు :-
[7-481-మాలి., 11-126-మాలి.]

5605} సురభిత్తు  - దేవతల శత్రువు, రాక్షసుడు :-
[10.2-193-మ.]

5606} సురభులు  - చీలిన గిట్టలు గల జంతువులు, ఆవులు ఎద్దులు మున్నగునవి, సురభి అంటే ఆవు :-
[6-257.1-తే.]

5607} సురమాత  - సుర (దేవత) మాత, అదితి :-
[8-461.1-ఆ.]

5608} సురరక్షకుడు  - సుర (దేవతలకు) రక్షకుడు, విష్ణువు :-
[7-169.1-తే.]

5609} సురరాజసుతుడు  - ఇంద్రుని కొడుకు, అర్జునుడు :-
[1-159-క.]

5610} సురరాజు  - సురలు (దేవతలు)కి రాజు, దేవేంద్రుడు :-
[4-501.1-తే., 5.1-117-ఉ., 10.2-1147-ఉ.]

5611} సురరాజునగరి  - సురరాజు (ఇంద్రుని) నగరి (పట్టణము), అమరావతి :-
[10.1-786-క.]

5612} సురరిపుడు  - సుర (దేవత)లకు రిపుడు (శత్రువు), రాక్షసుడు :-
[3-645-క.]

5613} సురరిపువిషభీముడు  - సురరిపు (రాక్షసులు అను) విషమునకు భీముడు (శివుడు), శ్రీరాముడు :-
[10.2-1342-మాలి.]

5614} సురలతల్లి  - దేవతల మాత, అదితి :-
[8-492-వ.]

5615} సురలు  - సురాపానము చేయువారు, దేవతలు :-
[2-274.1-తే., 3-184-వ., 4-426-క.]

5616} సురవందితుడు  - దేవతలచే వందనీయుడు, విష్ణువు :-
[3-156-వ.]

5617} సురవంద్యుడు  - సుర (దేవతలచే) వంద్యుడు (మొక్కబడినవాడు), విష్ణువు :-
[7-122.1-తే.]

5618} సురవర్తము  - దేవతలు తిరుగునది, ఆకాశము :-
[4-440-క.]

5619} సురవిమతవిదారుడు  - సుర (దేవతలకి) విమత (శత్రువులైన వారిని) విదారుడు (సంహరించినవాడు), రాముడు :-
[4-976-మాలి.]

5620} సురవిరోధి  - సుర (దేవత)లకు విరోధి (శత్రువు), హిరణ్యకశిపుడు :-
[7-125-వ.]

5621} సురవృషభుడు  - సుర (దేవతలలో) వృషభుడు (శక్తి గలవాడు), ఇంద్రుడు :-
[6-425-వ.]

5622} సురవైరి  - సురల (దేవతల) వైరి (శత్రువు), రాక్షసుడు, కంసుడు, రావణుడు :-
[3-686.1-తే., 9-285-క., 10.1-275-క., 10.2-188-వ., 10.2-320.1-తే.]

5623} సురశత్రుడు  - సురల(దేవతల)కు శత్రుడు, రాక్షసుడు :-
[6-303-చ.]

5624} సురశాత్రవుడు  - సురలు (దేవతలు)కి శత్రువు, హిరణ్యాక్షుడు :-
[3-709-చ., 7-227-ఉ.]

5625} సురాచార్యుడు  - దేవతల గురువు, బృహస్పతి :-
[9-377-వ.]

5626} సురాధిపుడు  - సురలు (దేవతల)కి అదిపతి, ఇంద్రుడు :-
[4-522-ఉ.]

5627} సురారాతిజీవనసంపత్తినిరాకరిష్ణుడు  - సుర (దేవతల) ఆరాతి (శత్రువుల యొక్క) జీవనసంపత్తి (బ్రతుకుదెరువు)ను నిరాకరిష్ణుడు (నిరాకరించెడివాడు), విష్ణువు :-
[8-105-మ.]

5628} సురారి  - సురల (దేవతల)కు అరి (శత్రువు), రాక్షసుడు :-
[3-676-తే., 6-387-మ., 9-539-ఉ., 10.2-377-క.]

5629} సురారికులేంద్రుడు  - సుర (దేవతల) అరి (శత్రువుల) కుల (వంశము లంన్నిటికి) ఇంద్ర (ప్రభువు), హిరణ్యకశిపుడు :-
[7-81-మత్త.]

5630} సురారితనయుడు  - సురారి (రాక్షసు, హిరణ్యకశిపు)ని తనయుడు (పుత్రుడు), ప్రహ్లాదుడు :-
[7-123-శా.]

5631} సురారిరాజసుతుడు  - సురారి (రాక్షసరాజు యొక్క) సుతుడు (పుత్రుడు), ప్రహ్లాదుడు :-
[7-134-ఉ.]

5632} సురారిహరుడు  - సురారుల (రాక్షసుల)ను హరుడు (హరించువాడ), విష్ణువు :-
[4-920-ఉ.]

5633} సురారులు  - సుర (దేవతల) అరులు (శత్రువులు), రాక్షసులు, దైత్యులు :-
[1-10-ఉ., 2-285-ఉ.]

5634} సురాలయము  - సురల (దేవతల) ఆలయము (నివాసము), స్వర్గము :-
[6-324-లగ్రా.]

5635} సురుచి  - సు (మంచి) కాంతి కలామె, ఉత్తానపాదుని రెండవ భార్య, ధ్రువుని సవితితల్లి :-
[4-218-క.]

5636} సురుచిరగుణధాముడు - సు (మిక్కిలి) రుచిర (మనోజ్ఞమైన) గుణ (సుగుణములకు) ధాముడు (ఉనికిపట్టైన వాడు), శ్రీరాముడు :-
[10.2-1342-మాలి.]

5637} సురుచిరద్వారకాపురసమాశ్రయుడు  - మనోహరమైన ద్వారకానగరమునకు చక్కటి ఆశ్రయిము అయినవాడు, కృష్ణుడు :-
[3-145.1-తే.]

5638} సురేంద్రశాఖి  - ఇంద్రుని చెట్టు, కల్పవృక్షము :-
[10.1-1084-వ.]

5639} సురేంద్రారాతి  - సురేంద్ర (దేవేంద్రుని) ఆరాతి (శత్రువు), హిరణ్యకశిపుడు :-
[7-136-శా.]

5640} సురేంద్రుడు  - దేవేంద్రుడు, దేవతల ప్రభువు, ఇంద్రుడు :-
[2-209-చ., 10.1-947-క., 10.2-631-క.]

5641} సురేశ్వరుడు  - సురలకు ఈశ్వరుడు, ఇంద్రుడు :-
[8-171-క.]

5642} సురోచి  - సు (మంచి) రోచి (వెలుగు కలవాడు), వసిష్ఠునికి ఊర్జ అనే భార్యవల్ల కలిగిన చిత్రకేతుడు, సురోచి, విరజుడు, మిత్రుడు, ఉల్బణుడు, వసుభృద్ధ్యానుడు, ద్యుమంతుడు అనే ఏడుగురు ఋషులలో ఒకడు :-
[4-26-వ.]

5643} సుశాశ్వతములు  - ఎల్లప్పుడును మంచి కలవి, వేదములు :-
[2-194-చ.]

5644} సుశ్రీకాంతుడు  - సు (శుభకరమైన) శ్రీ (లక్ష్మీదేవి) కాంతుడు (భర్త), విష్ణువు :-
[9-562-శా.]

5645} సుశ్లోకుడు  - 1. సు (మంచివారిచే) శ్లోకుడు (కీర్తింపబడువాడు), 2. విష్ణువు :-
[3-270-క., 3-924.1-తే., 4-386-క., 5.2-1-క., 6-422-ఉ.]

5646} సుషిరము  - బెజ్జము కలది, పిల్లనగ్రోవి మొదలగునది :-
[11-57.1-తే.]

5647} సుషుమ్న  - మనోజ్ఞమును ఇచ్చునది, ఒక నాడి, వెన్నుపాము వెలుపల ఇడా పింగళ నాడుల మధ్యనుండు నాడి, సుషు అని అవ్యక్త శబ్దము చేయుచుండును, మేరుదండబాహ్యే ఇడాపింగలానాడీమధ్యస్థ నాడీవిశేషః, :-
[2-30-వ.]

5648} సుషుమ్ననాడిమార్గము  - రొమ్ము మొదలుకొని శిరస్సువరకు వ్యాపించుచున్న నాడీమార్గము :-
[10.2-1214.1-తే.]

5649} సుస్థిరత  - మిక్కిలి స్థిరముగా నుండుట. :-
[2-275-మ.]

5650} సుహృత్తముడు  - మంచి ఆప్తుడైన వాడు, విష్ణువు :-
[3-523-చ.]

5651} సూకరము  - వరాహము, పంది :-
[3-361-వ.]

5652} సూకరముఖము  - సూకరము (పందుల) ముఖము (నోటి) యందు పడుట, నరక విశేషము :-
[5.2-136-వ.]

5653} సూక్ష్మకాలము  - దినములోని భాగములు సూక్ష్మకాలములు, వాటికి పెద్దవి బృహత్కాలములు :-
[2-222-వ.]

5654} సూక్ష్మరూపము  - కంటికి కనిపించని సూక్ష్మ స్థాయిలోని ఆత్మైకరూపము :-
[2-250.1-ఆ.]

5655} సూక్ష్మస్వరూపుడు  - సూక్షమమైన రూపము కలవాడు, విష్ణువు :-
[3-874-వ.]

5656} సూక్ష్ముడు  - సూక్ష్మమే తానైనవాడు, విష్ణువు :-
[4-702.1-తే.]

5657} సూచికాభేధ్యము  - సూచిక (సూది) అభేద్యము (గుచ్చుటకు సందులేనిది), ఎడతెగనిది :-
[10.2-999.1-తే.]

5658} సూచీముఖము  - సూదిమొనలచే శిక్షించుట, నరక విశేషము :-
[5.2-136-వ.]

5659} సూచీవ్యోమాచారి  - మొనవేళ్ళు నేలను తాకునట్లు మెలగుట, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

5660} సూత్రాత్మకుడు  - పువ్వులలోని దారము పువ్వులకు ఆధారమైన విధమగువాడు, ఆధారభూతుడు :-
[4-457-వ.]

5661} సూరి  - పదునైన బుద్ధికలవాడు, పండితుడు :-
[3-234-వ.]

5662} సూరిచేతోవిహర్తుడు  - సూరి (జ్ఞానుల) చేతః (చిత్తములలో) విహర్తుడు (క్రీడించువాడు), రాముడు. :-
[7-481-మాలి., 11-126-మాలి.]

5663} సూరిత్రాణుడు  - సూరి (పండితులను) త్రాణుడు (కాపాడెడివాడు), రాముడు :-
[9-1-క.]

5664} సూర్యతనయ  - 1. సూర్యుని పుత్రిక, యమున, 2. సూర్యుని పుత్రుడు, 1సుగ్రీవుడు 2కర్ణుడు, 3. యముడు :-
[9-230-వ.]

5665} సూర్యవంశాబ్ధిసోముడు  - సూర్యవంశము అను అబ్ధి (సముద్రమునకు) సోముడు (చంద్రుడు), శ్రీరాముడు. :-
[10.2-1342-మాలి.]

5666} సూర్యసుత  - సూర్యుని కుమారుడు, కర్ణుడు :-
[1-368-మ.]

5667} సూర్యాదిఅధిష్ఠానదేవతలు  - కంటికి చూపునకు సూర్యుడు, నాలుకకు రుచికి అగ్ని, ముక్కునకు వాసనకు వాయువు, చెవికి శబ్దమునకు ఆకాశము, చర్మమునకు స్పర్శకి భూమి అధిష్ఠాన దేవతలు :-
[2-267-వ.]

5668} సృష్టికారణుడు  - సృష్టికి కారణము అయినవాడు, బ్రహ్మదేవుడు. :-
[3-499-చ.]

5669} సెలగోల  - కఱ్ఱచివర తాడువంటిది ఉండి గుఱ్ఱబ్బండి ఆదుల తోలు కొరడాకఱ్ఱ, చెర్నాకోల, అట్టి ఆయుధము :-
[10.1-362-మ.]

5670} సేచన  - నైష్ఠిక కర్మలలో మంత్రోదకాన్ని చిలకరించుట, చల్లుట, తడుపుట, ఇది ప్రోక్షణ, అవోక్షణ, అభ్యుక్షణ అని మూడు విధములు :-
[8-630-మ., 10.2-269-క.]

5671} సేవకనవకల్పము  - సేవించువారికి కొత్త కల్పవృక్షము వంటివాడు, విష్ణువు :-
[3-19-చ.]

5672} సైంధవము  - సింధుదేశమున పుట్టినది, ఉత్తమజాతిగుఱ్ఱము :-
[9-16.1-తే.]

5673} సైంహకేయుడు  - సైంహకేయుడు అంటే సింహిక యొక్క కొడుకు, రాహువు; సింహిక ఎవరంటే హిరణ్యకశిపుని కూతురు, ఆమె కుమారుడు స్వర్భానుడు, ఇతను దొంగతనంగా అమృతం తాగుతుంటే విష్ణువు చక్రంతో తల నరికాడు ఆ రాహువు కేతువులుగా గ్రహాలు అయ్యారు; :-
[10.1-1621.1-ఆ., 10.1-1621.1-ఆ.]

5674} సైరంధ్రి  - సైరంధ్రీ పరవేశ్మస్థా స్వవశా శిల్పకారికా. (అమరము), శృంగారించు టాదుల కైన పనిగత్తె :-
[10.1-1494-మ., 10.1-1500-క.]

5675} సోzహమ్మమేతి  - సోzహం (వాడు నేను) మమ (నాది) ఇతి (అనెడి), భేదభావము :-
[4-359.1-తే.]

5676} సోమపానము  - 1.సోమరసము తాగుట, 2.సామవేదమునందలి స్తోత్రము 3.స్తోమము స్తోభము నుమ్నము శస్త్రము మొదలగువాని గానము ఆస్వాదించుట :-
[5.2-10-వ.]

5677} సోమపులు  - యాగముచేసి అవశిష్టమైన సోమలతరసములు తాగినవారు, సోమయాజులు :-
[4-210.1-తే.]

5678} సోమము  - వ్యుత్పత్తి. షు ను (అభిషవే), షూ సూ (ప్రేరణే ప్రసవే) సు సూ + మన్, కృ.ప్ర. అమృతము ఒసగువాడు, ప్రేరకుడు, చంద్రుడు (ఆంధ్రశబ్దరత్నాకరము) :-
[3-426-వ.]

5679} సోమయాజి  - యజ్ఞము చేసినవాడు :-
[5.2-156-ఆ.]

5680} సోమరూపుడు  - సోమము (అమృతము) వంటి రూపము కలవాడు, విష్ణువు :-
[4-702.1-తే.]

5681} సోమలోకము  - సోములు అనెడి గంధర్వుల లోకము :-
[4-104-వ.]

5682} సోమార్ధధరుడు  - సోమ (చంద్ర) అర్ధ (ఖండమును) ధరుడు (ధరించినవాడు), శివుడు. :-
[8-230-క.]

5683} సోముడు  - చంద్రుడు, అమృత ప్రేరకుడు :-
[3-44-ఉ., 10.1-1236-దం.]

5684} సోల్లుంఠము  - మర్మభేదకములైన మాటలు, దెప్పిపొడుపుమాటలు, ఆక్షేపణ, సహ+ఉల్లంఠ, సహ ఉల్లంఠేన వ్యంగ్యేన] వ్యంగ్యముతో కూడినది. :-
[10.1-1577-ఉ.]

5685} సౌందర్యాంగులు  - సౌందర్యముతో కూడిన అంగములు (అవయవములు) కలవారు :-
[4-24-క.]

5686} సౌజన్యనిధి  - సుజనుల లక్షణములకు నిధి వంటి స్త్రీ. :-
[3-939-క., 3-954-క.]

5687} సౌజన్యము  - సుజనుల లక్షణము, మంచితనము :-
[2-113-ఉ., 2-264-క.]

5688} సౌత్రామణి  - సుత్రాముడైన ఇంద్రుని సంబంధమైన హోమము :-
[10.1-854-క.]

5689} సౌధము  - సున్నముతో కట్టిన ఇండ్లు, మేడ, రాజప్రసాదము :-
[3-45-ఉ., 8-95-మ., 10.1-1597-శా.]

5690} సౌభకపతి  - సౌభక విమానమునకు పతి, సాల్వుడు :-
[10.2-888-వ.]

5691} సౌభకము  - సాల్వుని విమానం. శశిపాలుని మరణానికి ప్రతీకారం తీర్చుకోడానికి అతని తమ్ముడు సాల్వుడు తపస్సు చేసి శివుని నుండి సౌభకము అని విమానం పొందాడు. అది కామగమనాది ప్రత్యేకతలు కలది. (సాల్వదేశ రాజధాని సౌభము) :-
[10.2-888-వ.]

5692} సౌభద్రబంధము  - వారివారికి అనువైన చొప్పున హస్త విన్యాసాదులను చూపునది, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

5693} సౌభపతి  - సౌభకము యజమాని, సాల్వుడు :-
[10.2-851-మ.]

5694} సౌభాగ్యములు  - సౌభాగ్య చిహ్నములైన తలకట్టు తిలక ధారణాదులు :-
[1-363-మ.]

5695} సౌమల్లికుడు  - మహాకవి కాళిదాసు అంతటి వానిచే సబహుమానంగా పేర్కొనబడిన అంతకు పూర్వకవి :-
[6-11.1-తే.]

5696} సౌమిత్రి  - సుమిత్రకొడుకు, లక్ష్మణుడు :-
[9-319.1-ఆ.]

5697} సౌమ్యుడు  - సోముని (చంద్రుని) పుత్రుడు, బుధుడు :-
[5.2-88.1-తే.]

5698} సౌమ్యులు  - పంచచత్వారింశత (49) అగ్నులలోని వారు, సౌమ్యము (శాంతము) గనుండు అగ్నులు? :-
[4-34-వ.]

5699} స్కంధము  - సమూహము, శరీరము, సంస్కారము, గ్రంథములోని భాగము :-
[12-47-క.]

5700} స్తంబేరము  - స్తంబముల (పొదల) యందు రమించునది, ఏనుగు :-
[11-99-వ.]

5701} స్తబ్ధరోమము  - వ్యు. స్తబ్ధాని రోమాణి అవ్య., బ.వ్రీ,, నిక్కబొడిచిన రోమములు కలది, అడవిపంది, వరాహము. :-
[3-408.1-తే.]

5702} స్తవము  - సాకార నిరాకారముల మహిమలను తెలిపెడి స్తోత్రము :-
[10.1-5-క.]

5703} స్త్రీజాతులు  - 1పద్మిని 2శంఖిణి 3చిత్తిని 4హస్తిని :-
[10.1-1495-ఉ.]

5704} స్థాణుడు  - స్థిరముగ నుండువాడు, ప్రళయకాలమునను నుండువాడు, శివుడు :-
[10.1-1341-శా., 10.2-312-క., 10.2-445-వ.]

5705} స్థాపత్యము  - స్థలములను (ఆవరణలు, నిర్మాణములు మొదలగునవి) ఏర్పరచుట నిర్మించుటాదికి సంబంధించిన శాస్త్రము, స్థపతి యొక్క పని :-
[3-388-వ.]

5706} స్థావరములు  - స్థిరముగ ఒకే స్థలమున ఉండునవి, 2.చురుకుదనము లేనివి, వృక్షములు మొదలైనవి, వ్యు. స్థా స్థా(గతి నివృతో) + వరచ్, కృ,ప్ర. :-
[1-435-వ., 3-338-క., 3-344-వ., 3-432.1-తే., 3-905-క., 3-997-వ., 3-1019-మ.]

5707} స్థిరము(ప్ర)  - తిరము (వి) :-
[10.2-1182-చ.]

5708} స్థూలరూపము  - కంటికి కనిపించు పంచభూతాత్మక స్వరూపము :-
[2-250.1-ఆ.]

5709} స్పర్శములు  - క నుండి మ వరకు కలవి ఇవి ఐదేసి చొప్పున ఐదు వర్గములుగా ఉంటాయి (1క ఖ గ ఘ ఙ 2చ ఛ జ ఝ ఞ 3ట ఠ డ ఢ ణ 4త థ ద ధ న 5ప ఫ బ భ మ) :-
[12-30-వ.]

5710} స్పృహణీయుడు - స్పృహణీయతరుడు స్పృహణీయతముడు :-
[4-712.1-తే.]

5711} స్మయము  - గర్వము, ఆశ్చర్యము :-
[4-28-వ.]

5712} స్మృతి  - జ్ఞాపకము :-
[4-28-వ.]

5713} స్రష్ట  - సమస్తమును సృజించువాడు, బ్రహ్మదేవుడు :-
[1-425-క., 11-81-క.]

5714} స్రుక్కు  - హోమము కొరకు నేతిని తీయు తెడ్డు, గరిటి :-
[3-425.1-తే.]

5715} స్రువము  - హోమము చేయునప్పుడు నేతిని అగ్నిలో వేయుటకైన తెడ్డు, గరిటి :-
[3-425.1-తే.]

5716} స్వకృతంబులు  - అపౌరుషేయములు హరి తన (భగవంతుని)చేత చేసినవి, వేదములు. :-
[2-194-చ.]

5717} స్వగురుహృదయతోషుడు  - తన గురువుల మనసులను సంతోషపరచువాడు, రాముడు :-
[9-735-మాలి., 12-53-మాలి.]

5718} స్వతంత్రుడు  - ఇతరుల అదుపులేక తన సంకల్పా నుసారం తను వర్తించువాడు, విష్ణువు :-
[4-132-వ., 10.1-942-ఆ.]

5719} స్వధ  - పితృదేవతలకు సమర్పించు హవిస్సు / హవిర్దానము :-
[4-34-వ., 4-204-వ.]

5720} స్వప్రకాశుడు  - సాధనాంతరము లేక స్వయముగా ప్రకాశించువాడు :-
[10.1-541-వ.]

5721} స్వయంజ్యోతి  - స్వయం ప్రకాశుడు, పరంజ్యోతి, విష్ణువు :-
[3-874-వ., 10.1-567.1-ఆ.]

5722} స్వయంజ్యోతిషుడు  - స్వయం ప్రకాశము కలవాడు, విష్ణువు :-
[4-702.1-తే.]

5723} స్వయంప్రకాశుడు  - స్వయం ప్రకాశము కలవాడు, శంకరుడు :-
[3-473-వ.]

5724} స్వయంభువుడు  - తనంత తాను పుట్టిన వాడు, బ్రహ్మదేవుడు :-
[3-390-క., 6-224-వ.]

5725} స్వయంవరము  - అష్టవిధ వివాహాలు ఇతరమైనది. ఇది క్షత్రియులకు విధితం. క్షత్రియ కన్య స్వయంవర సభలో నచ్చిన వరుని వరించుట, :-
[3-123.1-తే., 3-124-చ., 10.1-1683-వ., 10.2-124-వ.]

5726} స్వరధీశ్వరుడు  - స్వర్ (స్వర్గలోకము)నకు అధిపతి, ఇంద్రుడు :-
[4-426-క.]

5727} స్వరములు  - అకారాది, అచ్చులు, అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ అలు అలూ ఎ ఏ ఐ ఒ ఓ ఔ ఇవి షోడశ (16) స్వరాలు :-
[12-30-వ.]

5728} స్వరాట్టు  - (1) స్వయముగ ప్రకాశించువాడు. (2)భగవంతుడు, (3) విరాట్పురుషుని నుండి ఆవిర్భవించినవాడు :-
[3-388-వ.]

5729} స్వర్గాపర్గసుద్వారము  - స్వర్గమునకు అపవర్గము (మోక్షము)నకు మంచి ద్వారము వంటివాడు, విష్ణువు :-
[4-703.1-తే.]

5730} స్వర్భానుడు  - రాహువు, స్వర్భానుడు ప్రహ్లాదుని మేనల్లుడు, సింహిక కొడుకు, హిరణ్యకశిపుని దైహిత్రుడు; జగన్మోహిని అమృతం పంచుతున్నప్పుడు, ఇతను దొంగతనంగా అమృతం తాగుతుంటే సూర్య చంద్రులు సైగ చేసారు. విష్ణుస్వరూపం ఎత్తి చక్రంతో తల నరికా డు. అప్పటికే, అ అమృతం నాలికకు తగులట వలన, చావలేదు. బ్రహ్మదేవుడు ఆ తల, మొండాలను రాహువు కేతువులుగా గ్రహాలు ఉండమని అనుగ్రహించాడు.. :-
[8-51.1-తే.]

5731} స్వర్భువనాధినాథుడు  - స్వర్భువన (స్వర్గలోకపు) అధినాథుడు (ప్రభువు), ఇంద్రుడు :-
[7-227-ఉ.]

5732} స్వామి  - వస్తు స్వాతంత్ర్యము గలవాడు, విష్ణువు :-
[6-229-తే.]

5733} స్వాయంభువుడు  - ప్రథమ మనువు, స్వయంభువుడు ( స్వయముగ పుట్టినవాడు, బ్రహ్మదేవుడు) కుమారుడు :-
[3-388-వ., 3-390-క., 4-3.1-తే., 4-216-క.]

5734} స్వారోచిషుడు  - రెండవ మనువు, స్వ (తనంతతాను) రోచిష (ప్రకాశము కలవాడు) :-
[4-25-క.]

5735} స్వాశ్రయుండు  - స్వయం (తనకు తనే) ఆశ్రయమైన వాడు, విష్ణువు :-
[6-229-తే.]

5736} స్వేదజము  - స్వేదమునుండి పుట్టునవి, పురుగులోనగునవి :-
[8-150-క.]

5737} స్వైరిణి  - స్వేచ్ఛగా (విచ్చలవిడిగా) తిరుగునట్టి స్త్రీ, తిరుగుబోతు :-
[10.2-262-వ.]

5738} హంస  - (1) బ్రహ్మదేవుని వాహనము, (2) సన్యాసాశ్రమములలో ఉన్నతమైనది. (3) పరమాత్మ :-
[4-16-చ.]

5739} హంసతురంగము  - హంసను తురంగము (వాహనము) గాగలవాడు, బ్రహ్మ :-
[6-3-ఉ.]

5740} హంసవాహనుడు  - హంస వాహనముగా కలవాడు, బ్రహ్మ :-
[7-86-వ.]

5741} హంసుడు  - పరమాత్మ తానైనవాడు, విష్ణువు :-
[11-77-వ.]

5742} హతదితిసుత  - సంహరించిన దితిసుతులు (దైత్యులు) కలవాడు, శ్రీకృష్ణుడు :-
[5.1-182-క.]

5743} హనుమద్వజుడు  - హనుమంతుని జండాపై కలవాడు, అర్జున :-
[1-371-క.]

5744} హయగ్రీవుడు  - హయ (గుఱ్ఱపు) గ్రీవుడు (శిరస్సు గలవాడు) :-
[2-139-వ., 7-29-వ.]

5745} హరపటుచాపఖండనుడు  - హర (శివుని) పటు (గట్టి) చాప (విల్లును) ఖండనుడు (విరిచినవాడు), రాముడు :-
[7-482-చ.]

5746} హరి  - సర్వ దుఃఖములను, పాపములను హరించు వాడు, ప్రళయకాలమున సర్వము తన గర్భమున హరించుకొనువాడు, విష్ణువు, హకారముతో కూడిన నిశ్వాసము రేఫతో కూడిన కంఠనాదము ఓంకారము :-
[1-186-వ., 1-218-వ., 1-227-మ., 2-30-వ., 2-103-క., 2-117.1-తే., 2-117.1-తే., 2-121.1-తే., 2-139-వ., 2-144-మ., 2-148-మ., 2-150.1-తే., 2-151-చ., 2-173.1-తే., 2-181-క., 2-199-వ., 2-209-చ., 2-214-మ., 2-217.1-తే., 2-225.1-తే., 2-247-చ., 2-257.1-తే., 2-262-క., 2-275-మ., 3-19-చ., 3-48-క., 3-54-క., 3-73-క., 3-99.1-తే., 3-105-క., 3-105-క., 3-143-క., 3-149-క., 3-158-క., 3-166-క., 3-196-వ., 3-212-చ., 3-222-ఉ., 3-336-తే., 3-366-క., 3-373-మ., 3-400-మ., 3-447.1-తే., 3-488-తే., 3-510-చ., 3-647-క., 3-688-క., 3-697-వ., 3-836-చ., 3-897.1-తే., 4-426-క., 6-33-క., 7-217-వ., 7-241-వ., 7-248-క., 8-18.1-ఆ., 8-116-శా., 8-477-మ., 9-15-వ., 9-82.1-తే., 9-420-క., 10.1-5-క., 10.1-11-ఆ., 10.1-16-క., 10.1-54-మ., 10.1-232-క., 10.1-543-వ., 10.1-580-వ., 10.1-670-క., 10.1-949-క., 10.1-1015.1-ఆ., 10.2-432-చ., 10.2-477-ఆ., 10.2-630-క., 10.2-630-క., 10.2-749-ఆ., 10.2-773-చ., 10.2-1204.1-తే., 11-77-వ., 11-77-వ.]

5747} హరిజుడు  - కృష్ణుని పుత్రుడు, ప్రద్యుమ్నుడు :-
[10.2-17-మ.]

5748} హరిణాక్షి  - హరిణము (లేడి)వంటి అక్షి (కన్నులు కలామె), స్త్రీ :-
[8-236-క., 10.2-174-క.]

5749} హరిణీనయన  - లేడివంటి కన్నులు కలామె, స్త్రీ :-
[10.1-1087-క.]

5750} హరిణీలోచన  - లేడివంటి కన్నులు కలామె, స్త్రీ :-
[10.1-1213-మ.]

5751} హరిణీసుతుడు  - విభాండకమునికి లేడి యందు కలిగినవాడు, ఋశ్యశృంగుడు :-
[9-695-వ.]

5752} హరితత్త్త్వవేది  - హరి (భగవంతుని) తత్త్వమును వేది (తెలిసినవాడు), భాగవతుడు :-
[3-157-క.]

5753} హరితత్పరుడు  - తను కానిది హరి మాత్రమే అని నడచువాడు :-
[1-140-క.]

5754} హరిదశ్వుడు  - హరిత (పచ్చని) అశ్వుడు (అశ్వములు గలవాడు), సూర్యుడు :-
[6-419-క.]

5755} హరిదిభేంద్రము  - హరిత్ (దిక్కు లందలి) ఇభ (గజము) ఇంద్రము (శ్రేష్ఠమైనది), దిగ్గజము :-
[8-40.1-తే.]

5756} హరినయన  - లేడి వంటి కన్నులు కలామె, రుక్మావతి :-
[10.2-284-వ.]

5757} హరిపదము  - విష్ణుమూర్తి స్థానము, వైకుంఠము :-
[4-668-క., 4-690-తే.]

5758} హరిమధ్య  - సింహము వంటి నడుము కల స్త్రీ :-
[4-317-మ., 10.1-837-వ., 10.1-1754-క., 10.2-28-క., 10.2-120-వ.]

5759} హరిహయదిక్కు  - ఇంద్రుని యొక్క దిక్కు, తూర్పు :-
[10.1-1615-వ.]

5760} హరిహయుడు  - 1. హరి (ఐరావతము అనెడి ఏనుగు) వాహనముగ కలవాడు, ఇంద్రుడు, 2. పచ్చని గుఱ్ఱములు కలవాడు, సూర్యుడు :-
[4-524.1-తే., 10.1-938-వ., 10.1-1025-క.]

5761} హరుడు  - లయకారుడు, ప్రళయకాలమున సర్వమును హరించువాడు, శివుడు :-
[3-465-క., 4-95-చ., 4-149.1-తే., 4-426-క., 4-697-వ., 7-387-క., 8-247-ఆ., 10.2-402-చ., 10.2-410-ఉ.]

5762} హర్యక్షము  - పచ్చకన్నుల మృగము, సింహము :-
[10.2-979.1-తే.]

5763} హర్యశ్వుడు  - హరి (పచ్చని) రంగు కల గుఱ్ఱము కలవాడు :-
[4-640-వ.]

5764} హలధరుడు  - నాగలి ఆయుధము ధరించువాడు, బలరాముడు :-
[3-105-క., 3-129.1-తే., 10.1-737-క., 10.2-298-క.]

5765} హలపాణి  - నాగలి ఆయుధము ధరించువాడు, బలరాముడు :-
[10.2-590-క.]

5766} హలాయుధుడు  - హల (నాగలి) ఆయుధము కలవాడు, బలరాముడు :-
[10.1-1561-శా., 10.1-1724-చ., 10.2-296-ఉ., 10.2-357-ఉ., 10.2-578-వ., 11-103-వ.]

5767} హలి  - హలాయుధము కలవాడు, బలరాముడు :-
[1-348.1-తే., 10.1-1564-లవి., 10.2-94-క., 10.2-417-మ., 10.2-554-క.]

5768} హవిర్ధానుడు  - హవిస్సును ధరించినవాడు, తండ్రి విజితాశ్వుడు, తల్లి నభస్వతి, భార్య హవిర్ధాని, పుత్రులు బర్హిష్మదుడు, గయుడు, శుక్రుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు అని ఆరుగురు. :-
[4-675-క.]

5769} హవిర్భాగములు  - హవిస్సులు (యజ్ఞకుండమున దేవతలకై వేల్చబడిన అన్నము నెయ్యి) అందలి దేవతల వారివారి భాగములు :-
[2-16-వ., 3-742.1-తే.]

5770} హవిర్భుక్కు  - హవిస్సు (హోమద్రవ్యము) భుజించునది, అగ్ని :-
[4-26-వ.]

5771} హవిర్ముఖి  - ప్రకటమైన ముఖం కలది, గొప్ప వెలుగు కలది, కుడికన్నుకు సంకేతంగా పురంజనోపాఖ్యానంలో వాడబడింది :-
[4-768-వ.]

5772} హవిస్సు  - అగ్నిహోత్రమున హోమము చేయు ద్రవ్యములు (ఇగర్చబెట్టినఅన్నము నెయ్యి) :-
[4-394.1-తే., 4-589.1-తే., 5.2-58-వ., 9-10.1-తే.]

5773} హవ్యభుక్కు  - హవ్యములను భుజించువాడు, అగ్నిహోత్రుడు :-
[4-38-చ.]

5774} హవ్యము  - అగ్నిహోత్రమున హోమము చేయు ద్రవ్యములు (ఇగర్చబెట్టినఅన్నము నెయ్యి) :-
[3-738-వ., 4-197-మ., 7-455-వ.]

5775} హవ్యవాహనలోచనుడు  - హవ్యవాహనుడు (అగ్ని) లోచనుడు (కన్నుల గలవాడు), శివుడు :-
[4-940-చ.]

5776} హవ్యవాహనుడు  - హవిస్సులను తీసుకుపోవువాడు, అగ్నిదేవుడు :-
[2-277.1-తే., 4-682-చ., 12-34-వ.]

5777} హవ్యవాహుడు  - హవిస్సులను తీసుకుపోవువాడు, అగ్నిదేవుడు :-
[11-105-వ.]

5778} హస్తిదురవస్థావక్రి  - హస్తి (ఏనుగు యొక్క) దురవస్థ (ఆపదను) వక్రి (మరలించెడివాడు), విష్ణువు :-
[8-107-మ.]

5779} హస్తిలోకనాథుడు  - ఏనుగుల సమూహమునకు పతి, గజేంద్రుడు :-
[8-121.1-ఆ.]

5780} హాసమాత్రము  - నవ్వుఒక్కదానితో, అవలీలగా :-
[8-545-ఉ.]

5781} హింస  - మనస్సుచేగానీ, మాటచేగానీ, శరీరం చేత గానీ ప్రాణులను నొప్పించడం, చంపడం. ఇది సమంజసమైతే శిక్ష, కాకపోతే హింస. :-
[4-215-వ.]

5782} హింసనడంచుబ్రహ్మము  - హింసను అణచివేసెడి పరబ్రహ్మ, బ్రహ్మదేవుడు :-
[6-3-ఉ.]

5783} హింసాపరపరమస్తకమాంసకరాళితగదాభిమతహస్తుడు  - హింసపర (హింస యందు లగ్నమైన) పర (శత్రువుల) మస్తక (శిరస్సు లందలి) మాంస (మాంసము) కరాళిత (క్రూరము గల) గద (గదాయుధమును) అభిమత (కోరి ధరించిన) హస్తుడు (హస్తము గలవాడు), విష్ణువు :-
[6-35-క.]

5784} హితుడు  - హితము కోరెడివాడు, విష్ణువు :-
[6-438-చ.]

5785} హిమకరుడు  - చల్లదనము ఇచ్చు వాడు, చంద్రుడు :-
[2-164-క., 10.1-579-క.]

5786} హిరణ్మయాండము  - హిరణ్య (బంగారము, గొప్పతనము) మయ (నిండిన) అండము (గుడ్డు) :-
[3-719-వ.]

5787} హిరణ్యకశిపుడు  - బంగారు వస్త్రము ధరించు వాడు :-
[1-63-వ.]

5788} హిరణ్యగర్భుడు  - హిరణ్య (బంగారు అండము) నందు గర్భుడు (జనించిన వాడు), బ్రహ్మదేవుడు :-
[1-58-వ., 2-112-వ., 4-426-క., 8-658-వ.]

5789} హిరణ్యవీర్యుడు  - హిరణ్యగర్భాండమునకు వీర్యము (కారణభూతము) యైనవాడు, విష్ణువు :-
[4-703.1-తే.]

5790} హిరణ్యాక్షుడు  - హిరణ్య (బంగారము) వంటి కన్నులు ఉన్నవాడు, హిరణ్యాక్షుడు అను రాక్షసుడు :-
[3-447.1-తే.]

5791} హుతాశనుడు  - అగ్నిదేవుడు, హుత+అశ్+అణ్, హుతం ద్రవ్యం అశ్నాతి, హోమ ద్రవ్యమును భుజించువాడు. అగ్ని. :-
[2-277.1-తే., 3-631-చ., 4-589.1-తే., 4-619.1-తే., 7-295-మ.]

5792} హృదయగ్రంధి  - 1. హృదయమున ఉండు గ్రంధి (ముడి, సంధి), సందేహము, హృత్+అయమ్ ఇదిగో ఇక్కడున్నా, 2. అనాహతచక్రము :-
[3-889-వ.]

5793} హృదయబంధకములు  - హృదయమును జ్ఞానము వంక పోనీయక కట్టివేసెడివి, తగులములు :-
[7-371-వ.]

5794} హృదయేశుడు  - హృదయ (ఆత్మలకు) ఈశ (ప్రభువు), విష్ణువు, భర్త :-
[3-482-క., 8-727-క.]

5795} హృదయేశ్వరుడు  - మనసు నందు అధికారము కలవాడు, భర్త :-
[3-507-వ.]

5796} హృదీశుడు  - హృదయేశ్వరుడు, మనసునకు దేవుడు, భర్త :-
[3-458-క.]

5797} హృదీశ్వరుడు  - హృదయములకు ఈశ్వరుడు, విష్ణువు, భర్త :-
[3-930-చ.]

5798} హృద్గ్రంథి  - హృదయమునందలి యజ్ఞానము యనెడి ముడి :-
[4-619.1-తే.]

5799} హృన్నాథుడు  - హృదయమునకు ప్రభువు, భర్త :-
[9-246-శా.]

5800} హృషీకేశుడు  - హృషీకములు (ఇంద్రియములు)కు ఈశుడు, విష్ణువు, వ్యు. హృషీకేశః హృషీకాణాం (ఇంద్రియాణాం) ఈశః (నియామకుడు) :-
[1-188-వ., 2-89-వ., 3-400-మ., 4-355-వ., 7-109-వ., 7-149-తే., 8-136-వ., 10.1-236-వ., 10.1-683-వ., 10.2-427-తే., 10.2-629-ఆ.]

5801} హేతు  - ఆ అహంకార వృత్తియే జననకారణముగా గల అపంచీకృత పంచమహాభూత రూపముగా నుండుట :-
[10.1-537-వ.]

5802} హేమంతఋతువు  - మార్గశిర పుష్యమాసములు :-
[7-448-వ.]

5803} హేమక్ష్మాధరము  - హేమ (బంగారు) క్ష్మాధరము (కొండ), మేరుపర్వతము :-
[8-112-శా.]

5804} హేమగిరీంద్రచారుకోదండుడు  - హేమగిరీంద్ర (మేరుపర్వతోత్తమును) చారు (అందమైన) కోదండుడు (విల్లుగా గలవాడు), శివుడు :-
[6-2-ఉ.]

5805} హేమవాసుడు  - బంగారు అంబరములను ధరించువాడు, విష్ణువు :-
[6-124.1-ఆ.]

5806} హేమాద్రి  - బంగారు కొండ, మేరు పర్వతము :-
[3-413.1-తే.]

5807} హోత  - ఋగ్వేదము తెలిసిన ఋత్విక్కు :-
[8-536.1-తే., 9-10.1-తే., 9-342.1-తే.]

5808} హ్రీ  - లజ్జ, హ్రీ+క్విప్, జిహ్రీయతి తస్య భావః కర్మ వా. :-
[4-28-వ.]