శ్రీరామ
up-arrow

శ్రీ రుక్మణీ కళ్యాణము

ముందుమాట:- మన తెలుగుల పుణ్యపేటి, జాతీయ మహా కవి, సహజ కవి, బమ్మెఱ పోతనామాత్యుల వారి ప్రణీతమైన శ్రీమద్భాగవతము నందలి అనేక అద్భుతమైన ఉపాఖ్యానములలో రుక్మిణీ కళ్యాణము (దశము స్కంధము - పూర్వ భాగము), గజేంద్ర మోక్షణము (అష్టమ స్కంధము), ప్రహ్లాద చరిత్ర (సప్తమ స్కంధము), వామన చరిత్ర (అష్టమ స్కంధము), కుచేలోపాఖ్యానము (దశమ స్కంధము - ఉత్తర భాగము) అను అయిదూ పంచ రత్నాలుగా బహుళ ప్రసిద్ధి పొందాయి.
ఈ రుక్మిణీ కల్యాణము తెలుగులకు మిక్కిలి ప్రీతిపాత్ర మైనది. పూర్వము నుండి దీనిని పారయణ చేయు సంప్రదాయము కలదు. కళ్యాణము విఘ్నాలు లేకుండా శీఘ్రమే జరుగుటకు రుక్మిణీ కళ్యాణ పారయణను ప్రయోగించి సత్ఫలితములను పొందు సంప్రదాయం తెలుగు కుటుంబాలలో సర్వసాధారణమే.
జాలతెలుగులారా! ఇట్టి రత్నాన్ని, మీరు ఆనందంగా ఆస్వాదిస్తారని అందిస్తున్నాము.

రుక్మిణీకల్యాణ కథారంభము

1
శ్రీకంఠచాప ఖండన!
పాకారిప్రముఖ వినుత భండన! విలస
త్కాకుత్స్థవంశమండన!
రాకేందు యశోవిశాల! రామనృపాలా!
టీక:- శ్రీకంఠచాపఖండన = శ్రీరామ {శ్రీకంఠ చాప ఖండనుడు - శ్రీకంఠుని (కఱ కంఠుడు యైన శివుని) చాప (విల్లును) ఖండనుడు (విరిచినవాడు), రాముడు}; పాకారిప్రముఖ వినుత భండన = శ్రీరామ {పాకారి ప్రముఖ వినుత భండనుడు - (పాకాసురుని శత్రువైన ఇంద్రుడు) మున్నగువారి చేత వినుత (పొగడబడిన) భండన (యుద్ధము కలవాడు), రాముడు}; విలసత్కాకుత్థ్స వంశ మండన = శ్రీరామ {విలసత్కాకుత్థ్స వంశ మండనుడు - విలసత్ (ప్రసిద్ధి కెక్కిన) కాకుత్థ్సవంశ (కకుత్థ్స మహరాజ వంశమునకు) మండనుడు (అలంకారమైనవాడు), రాముడు}; రాకేందు యశోవిశాల = శ్రీరామ {రాకేందు యశోవిశాలుడు - రాకేందు (నిండు పున్నమి చంద్రుని) వంటి యశః (కీర్తి) విశాలుడు (విరివిగా కలవాడు), రాముడు}; రామ = రాముడు అనెడి {నిండుపున్నమి చంద్రుని పదహారు కళలు - 1అమృత 2మానద 3పూష 4తుష్టి 5పుష్టి 6రతి 7ధృతి 8శశిని 9చంద్రిక 10కాంతి 11జ్యోత్స్న 12శ్రీ 13ప్రీతి 14అంగద 15పూర్ణ 16పూర్ణామృత}; నృపాల = రాజా.
భావము:- శ్రీరామచంద్ర ప్రభు! నీవు శివధనుస్సు విరిచిన మొనగాడవు. ఇంద్రుడు మొదలైన దేవతలు సైతం కీర్తించేలా యుద్ధం చేసిన వాడవు. ప్రసిద్ధమైన కాకుత్థ్స వంశానికి అలంకారమైన వాడవు. నిండు పదహారు కళల పూర్ణచంద్రుని లాంటి కీర్తి మెండుగా వ్యాపించిన వాడవు. ప్రజలకి ఆనందం పంచే మహారాజువి.

2
నాథుం డమరేంద్రు గెల్చి సుధ మున్ గైకొన్న చందంబునన్
తీనాథులఁ జైద్యపక్షచరులన్ సాళ్వాదులన్ గెల్చి భ
ద్రగుఁడై చక్రి వరించె భీష్మకసుతన్ రాజీవగంధిన్ రమా
వత్యంశభవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్.
టీక:- ఖగనాథుండు = గరుత్మంతుడు {ఖగనాథుడు - పక్షుల ప్రభువు, గరుత్మంతుడు}; అమరేంద్రున్ = దేవేంద్రుని; గెల్చి = జయించి; సుధ = అమృతమును; మున్ = పూర్వము; కైకొన్న = తీసుకొన్న; చందంబునన్ = విధముగా; జగతీనాథులన్ = రాజులను; చైద్య = శిశుపాలుని {చైద్యుడు - చేది దేశ ప్రభువు, శిశుపాలుడు}; పక్ష = పక్షము నందు; చరులన్ = వర్తించువారిని; సాళ్వ = సాళ్వుడు; ఆదులన్ = మొదలగువారిని; గెల్చి = జయించి; భద్రగుడు = శుభమును పొందువాడు; ఐ = అయ్యి; చక్రి = కృష్ణుడు {చక్రి - చక్రాయుధము కలవాడు, కృష్ణుడు, విష్ణువు}; వరించెన్ = వివాహమాడెను; భీష్మక = భీష్మకుని యొక్క; సుతన్ = కుమార్తెను; రాజీవ = పద్మములవంటి; గంధిన్ = సువాసన కలామెను; రమా = లక్ష్మీ; భగవతి = దేవి యొక్క {భగవతి - షడ్గుణములచే (1మహత్వ 2ధైర్య 3కీర్తి 4శ్రీ 5జ్ఞాన 6వైరాగ్యములుచే) ఐశ్వర్యురాలు, దేవి}; అంశ = అంశతో; భవన్ = పుట్టిన ఆమెను; మహా = గొప్ప; గుణ = సుగుణము లనెడి {సుగుణములు - శమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానము ఆది గొప్ప మంచి గుణములు}; మణిన్ = రత్నములు కలామెను; బాలా = కన్యక లందు; మణిన్ = శ్రేష్ఠురాలను; రుక్మిణిన్ = రుక్మిణిని.
భావము:- పూర్వం గరుత్మంతుడు ఇంద్రుణ్ణి గెలిచి అమృతం గ్రహించి నట్లు, శిశుపాలుని పక్షం వారైన రాజు లందరిని గెలిచి, శ్రీకృష్ణుడు రుక్మిణిని పెండ్లాడేడు. ఈమె భీష్మకుడు అనే మహారాజు కూతురు. ఈమె బహు చక్కటిది, గొప్ప సుగుణాలరాశి, లక్ష్మీదేవి అంశతో పుట్టినామె.

3
అనిన రాజిట్లనియె “మున్ను రాక్షసవివాహంబున స్వయంవరమునకు వచ్చిన హరి రుక్మిణిం గొనిపోయెనని పలికితివి; కృష్ణుం డొక్కరుం డెవ్విధంబున సాళ్వాదుల జయించి తన పురంబునకుం జనియె; అదియునుం గాక.
^ అష్టవిధ వివాహములు
టీక:- అనినన్ = అనగా; రాజు = పరీక్షిన్మహారాజు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; మున్ను = ఇంతకు ముందు; రాక్షస = రాక్షసము అనెడి {రాక్షసము - బలాత్కారమున కన్యను అపహరించి వివాహమాడు పద్ధతి}; వివాహంబునన్ = వివాహ పద్ధతిని {అష్టవిధవివాహములు - 1బ్రాహ్మము 2దైవము 3ఆర్షము 4ప్రాజాపత్యము 5ఆసురము 6గాంధర్వము 7రాక్షసము 8పైశాచము}; స్వయంవరంబున్ = స్వయంవరమున {స్వయంవరము - క్షత్రియ కన్య ఇష్టానుసారము భర్తను ఎంచుకొని వరించుట}; కున్ = కు; వచ్చిన = వచ్చినట్టి; హరి = కృష్ణుడు; రుక్మిణిన్ = రుక్మిణిని; కొనిపోయెన్ = తీసుకొనివెళ్ళెను; అని = అని; పలికితివి = చెప్పితివి; కృష్ణుండు = కృష్ణుడు; ఒక్కరుండున్ = ఒక్కడు; ఏ = ఏ; విధంబునన్ = విధముగా; సాళ్వ = సాళ్వుడు; ఆదులన్ = మున్నగువారిని; జయించి = గెల్చి; తన = తన యొక్క; పురంబున్ = పట్టణమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; అదియునున్ = అంతే; కాక = కాకుండా.
భావము:- అలా శుకమహర్షి చెప్పగా పరీక్షిత్తు ఇలా అడిగాడు “స్వయంవరాని కొచ్చిన కృష్ణుడు రాక్షస వివాహ పద్దతిలో రుక్మిణిని తన ద్వారకాపట్టణానికి తీసుకుపోయేడని చెప్పావు. కృష్ణుడు ఒంటరిగా సాళ్వుడు మొదలైనవారి నందరిని ఎలా జయించాడు. అంతేకాకుండా. .

4
ల్యాణాత్మకమైన విష్ణుకథ లార్ణించుచున్ ముక్త వై
ల్యుం డెవ్వఁడు తృప్తుఁ డౌ; నవి వినంగాఁ గ్రొత్త లౌచుండు సా
ల్యం బేర్పడ భూసురోత్తమ! యెఱుంగం బల్కవే; రుక్మిణీ
ల్యాణంబు వినంగ నాకు మదిలోఁ గౌతూహలం బయ్యెడిన్.
టీక:- కల్యాణాత్మకము = శుభములు కలది; ఐన = అయిన; విష్ణు = విష్ణుమూర్తి యొక్క; కథలున్ = కథలను; ఆకర్ణించుచున్ = వినుచు; ముక్త = విడువబడిన; వైకల్యుండు = వికలత్వము కలవాడు; ఎవ్వడు = ఎవరు మాత్రము; తృప్తుడు = తృప్తిచెందినవాడు; ఔన్ = అగును; అవి = వాటిని; వినంగన్ = వినుచుండగా; క్రొత్తలు = అపూర్వమైనవిగా; ఔచుండున్ = అనిపించును; సాకల్యంబు = సమస్తము; ఏర్పడన్ = విశద మగునట్లు; భూసుర = బ్రాహ్మణ; ఉత్తమ = శ్రేష్ఠుడా; ఎఱుంగన్ = తెలియ; పల్కవే = చెప్పుము; రుక్మణీ = రుక్మిణీ దేవి యొక్క; కల్యాణంబున్ = కల్యాణ కథనమును; వినంగన్ = వినవలెనని; నా = నా; కున్ = కు; మది = మనసు; లోన్ = అందు; కౌతూహలంబు = కుతూహలము కలుగుట; అయ్యెడిన్ = పుట్టుచున్నది.
భావము:- శుకమహర్షి! ముక్తి కోరేవాడికి శుభకరమైన విష్ణు కథలు ఎంత విన్నా తృప్తి తీరదు కదా. వాటిని విన్నకొద్దీ తెలుసుకొన్న కొద్దీ నిత్య నూతనంగా ఉంటయి కదా. రుక్మిణీ కల్యాణం వినాలని కుతూహలంగా ఉంది, వివరంగా చెప్పు.

5
భూణములు చెవులకు బుధ
తోణము లనేక జన్మదురితౌఘ విని
శ్శోణములు మంగళతర
ఘోణములు గరుడగమను గుణభాషణముల్."
టీక:- భూషణములు = అలంకారములు; చెవుల్ = శ్రవణేంద్రియముల; కున్ = కు; బుధ = జ్ఞానులకు; తోషణముల్ = సంతోషమును ఇచ్చునవి; అనేక = పెక్కు; జన్మ = జన్మలకు చెందిన; దురిత = పాపముల; ఓఘ = సమూహములను; వినిశ్శోషణములు = మిక్కిలి ఆవిరి జేయునవి; మంగళతర = మిక్కిలి శుభకరమైన; ఘోషణములు = పలుకులు; గరుడగమను = విష్ణుమూర్తి యొక్క; గుణ = దివ్యగుణములు; భాషణముల్ = తెలిపెడి మాటలు.
భావము:- గరుడవాహనుడు విష్ణుమూర్తి కథలు చెవులకు కర్ణాభరణాలు, బుద్ధిమంతులకు సంతోషం కలిగించేవి, జన్మజన్మ పాపాలని పోగొట్టేవి, మిక్కిలి శుభకరమైనవి."

6
అని రా జడిగిన శుకుం డిట్లనియె.
టీక:- అని = అని; రాజు = రాజు; అడిగినన్ = అడుగగా; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా పరీక్షిత్తు అడుగగా, శుకముని ఇలా చెప్పసాగాడు.

రుక్మిణీ జననంబు

7
"వినుము; విదర్భదేశమున వీరుఁడు, కుండినభర్త భీష్మకుం
ను నొక దొడ్డరాజు గలఁ; డాతని కేవురు పుత్రు; లగ్రజుం
ఘుఁడు రుక్మి నాఁ బరఁగు; నందఱకుం గడగొట్టు చెల్లెలై
నుజవరేణ్య! పుట్టె నొక మానిని రుక్మిణినాఁ బ్రసిద్ధయై.
టీక:- వినుము = వినుము; విదర్భ = విదర్భ అను; దేశమునన్ = దేశమునందు; వీరుడు = యోధుడు; కుండిన = కుండిన పట్టణమునకు; భర్త = రాజు; భీష్మకుండు = భీష్మకుడు; అను = అనెడి; ఒక = ఒక; దొడ్డ = గొప్ప; రాజు = రాజు; కలడు = ఉన్నాడు; అతని = అతని; కిన్ = కి; ఏవురు = ఐదుగురు (5); పుత్రుల్ = కొడుకులు; అగ్రజుడు = పెద్దవాడు {అగ్రజుడు - ముందు పుట్టినవాడు, పెద్దవాడు}; అనయుడు = చెడ్డవాడు; రుక్మినాన్ = రుక్మి అను పేరుతో; పరగు = ప్రసిద్ధుడై ఉండెను; అందఱ = అందరిలో; కున్ = కి; కడగొట్టు = కడపటి; చెల్లెలు = చెల్లెలు; ఐ = అయ్యి; మనుజవరేణ్య = రాజా; పుట్టెను = పుట్టెను; ఒక = ఒక; మానిని = స్త్రీ; రుక్మిణినాన్ = రుక్మిణి అనుపేరుతో {రుక్మిణి - రుక్మమస్యాసీతి రుక్మిణి (వ్యుత్పత్తి), సువర్ణి}; ప్రసిద్ధ = ప్రసిద్ధురాలు; ఐ = అయ్యి.
భావము:- “విను. విదర్భ దేశపు కుండిన నగర రాజు భీష్మకుడు గొప్పవాడు. అతనికి ఐదుగురు కొడుకులు {రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులు}. పెద్దవాడు రుక్మి. అందిరికన్న చిన్నది రుక్మిణి వారు ఐదుగురికి చెల్లెలై పుట్టింది.

8
బాలేందురేఖ దోఁచిన
లాలిత యగు నపరదిక్కులాగున, ధరణీ
పాలుని గేహము మెఱసెను
బాలిక జన్మించి యెదుగ భాసుర మగుచున్.
టీక:- బాలేందురేఖ = నెలవంక {బాలేందురేఖ - నెల మొదటిరోజు (అమావాశ్య వెళ్ళిన పాడ్యమి నాటి) చంద్రబింబము యొక్క వంక, నెలవంక}; తోచినన్ = ఉదయించగా; లాలిత = మనోజ్ఞముగా; అగున్ = అయ్యెడి; అపరదిక్కు = పడమర; లాగునన్ = వలె; ధరణీపాలుని = రాజు యొక్క; గేహము = గృహము, నివాసము {గృహము (ప్ర) - గేహము (వి)}; మెఱసెను = ప్రకాశించెను; బాలిక = ఆడపిల్ల; జన్మించి = పుట్టి; యెదుగన్ = పెరుగుచుండగా; భాసురము = మిక్కిలి ప్రకాశము కలది; అగుచున్ = అగుచు.
భావము:- ఈమె పుట్టిననాటి నుండి ఆ రాజగృహం, చంద్ర రేఖ ఉదయించిన పడమటి ఆకాశంలా, ప్రకాశవంతంగా మెరిసిపోతోంది.
{ఆమె కుటుంబంలో జన్మించింది అనినను, అందరికి పరమైనది కనుక, ఇతరమైనవి అన్నీ అపరములే కనుక. పరాదేవి అపరమైన అంతటిని ప్రకాశంపజేస్తుంది కనుక అపర దిక్కు ప్రయోగించారా?}

9
మఱియును దినదినప్రవర్ధమాన యై.
టీక:- మఱియునున్ = ఇంకను; దినదిన = నానాటికి; ప్రవర్ధమాన = పెరుగుచున్నది; ఐ = అయ్యి.
భావము:- అలా రుక్మిణి దినదినప్రవర్థమానంగా ఎదుగుతోంది.

10
పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు;
బలలతోడ వియ్యంబు లందు;
గుజ్జెనఁ గూళులు గొమరొప్ప వండించి;
చెలులకుఁ బెట్టించుఁ జెలువు మెఱసి;
మణీయ మందిరారామ దేశంబులఁ;
బువ్వుఁ దీగెలకును బ్రోది చేయు;
దమల మణిమయ సౌధభాగంబుల;
లీలతో భర్మడోలికల నూఁగు;


బాలికలతోడఁ జెలరేగి బంతు లాడు;
శారికా కీర పంక్తికిఁ దువు సెప్పు;
ర్హి సంఘములకు మురిములు గఱపు;;
దమరాళంబులకుఁ జూపు మందగతులు.
టీక:- పేర్వేరన్ = పేరుపేరున; బొమ్మల = ఆయా బొమ్మలకు; పెండ్లిండ్లు = పెళ్ళిళ్ళు; చేయుచున్ = చేస్తూ; అబలల = బాలికల; తోడన్ = తోటి; వియ్యంబులు = సంబంధములు; అందున్ = చేయును; గుజ్జెనగూళులున్ = గుజ్జెనగూళ్ళు {గుజ్జెనగూళ్ళు - పిల్లలు ఆటలందు చిన్నచిన్న గిన్నెలలో తయారుచేసుకొను ఆహారపదార్థములు}; కొమరొప్ప = చక్కగా; వండించి = తయారుచేయించి; చెలుల్ = స్నేహితుల; కున్ = కు; పెట్టించున్ = పెట్టించును; చెలువు = చక్కదనములు; మెఱసి = పెంపొందగా; రమణీయ = అందమైన; మందిర = గృహములందలి; ఆరామ = ఉద్యానవనములోని; దేశంబులన్ = ప్రదేశములందు; పువ్వుతీగెల్ = పూలతీవల; కున్ = కు; ప్రోది = పోషించుట, మొక్కలకు కట్టు గొప్పులు; చేయున్ = చేయును; సదమల = మిక్కిలి నిర్మలమైన; మణి = రత్నాలు; మయ = పొదిగిన; సౌధ = మేడలపై (డాబాల); భాగంబులన్ = భాగముల; లీల = విలాసముల; తోన్ = తోటి; భర్మ = బంగారు; డోలికలన్ = ఊయలలందు; ఊగున్ = ఊగును.
బాలికల = బాలల; తోడన్ = తోటి; చెలరేగి = విజృంభించి; బంతులు = బంతులాటలు; ఆడున్ = ఆడును; శారికా = గోరువంకల; కీర = చిలుకల; పంక్తి = సమూహముల; కిన్ = కు; చదువున్ = పలుకులు పలుకుట; చెప్పున్ = చెప్పును; బర్హి = నెమళ్ళ; సంఘముల్ = సమూహముల; కున్ = కు; మురిపెములున్ = నడకల వయ్యారములు; కరపున్ = నేర్పును; మద = మదించిన; మరాళంబుల్ = హంసల; కున్ = కు; చూపున్ = నేర్పును; మంద = మెల్లని; గతులు = నడకలు.
భావము:- బొమ్మల పెళ్ళిళ్ళు చక్కగా చేసి చెలికత్తెలతో వియ్యాలందే ఆటలాడుతోంది. గుజ్జెన గూళ్లు వండించి పెడుతోంది. అందమైన తోటల్లో పూతీగెలకి గొప్పులు కడుతోంది. సౌధాలలో బంగారపు టుయ్యాలలు ఊగుతోంది. చెలులతో బంతులాట లాడుతోంది. చిలక పలుకులు, నెమలి మురిపాలు, మదగజాల మందగతులతో అతిశయిస్తోంది

11
అంత.
టీక:- అంతన్ = అంతట.
భావము:- అలా రుక్మిణీదేవి దినదినప్రవర్దమాన అయి ఎదుగుతున్నప్పుడు.

12
దేవకీసుతు కోర్కి తీఁగలు వీడంగ;
వెలఁదికి మైదీఁగ వీడఁ దొడఁగెఁ;
మలనాభుని చిత్తమలంబు వికసింపఁ;
గాంతి నింతికి ముఖమల మొప్పె;
ధువిరోధికి లోన దనాగ్ని పొడచూపఁ;
బొలఁతికి జనుదోయి పొడవు జూపె;
శౌరికి ధైర్యంబు న్నమై డయ్యంగ;
లజాక్షి మధ్యంబు న్నమయ్యె;


రికిఁ బ్రేమబంధ ధికంబుగాఁ, గేశ
బంధ మధిక మగుచు బాలకమరెఁ;
ద్మనయను వలనఁ బ్రమదంబు నిండార
నెలఁత యౌవనంబు నిండి యుండె.
టీక:- దేవకీసుతు = కృష్ణుని యొక్క {దేవకీసుతుడు - దేవకీదేవి పుత్రుడు, కృష్ణుడు}; కోర్కి = కోరికలు అనెడి; తీగెలు = తీవెలు; వీడంగన్ = కొనసాగగా, వర్ధిల్లగా; వెలది = స్త్రీ; కిన్ = కి; మై = దేహము అనెడి; తీగ = తీవె; వీడన్ = వర్థిల్ల, వికసింప; తొడగెన్ = మొదలెట్టెను; కమలనాభుని = కృష్ణుని యొక్క {కమలనాభుడు - కమలము (బ్రహ్మ పుట్టిన) బొడ్డున కలవాడు, విష్ణువు}; చిత్త = మనసు అనెడి; కమలంబు = పద్మము; వికసింపన్ = వికసించునట్లు; కాంతిన్ = ప్రకాశముతో; ఇంతి = సుందరి; కిన్ = కి; ముఖ = ముఖము అనెడి; కమలము = పద్మము; ఒప్పెన్ = చక్కనయ్యెను; మధువిరోధి = కృష్ణుని {మధువిరోధి - మధుఅనెడి రాక్షసుని శత్రువు, విష్ణువు}; కిన్ = కి; లోనన్ = మనసులో; మదన = మన్మథ; అగ్ని = తాపము; పొడచూపన్ = కనబడగా; పొలతి = సుందరి; కిన్ = కి; చను = స్తనముల; దోయిన్ = ద్వయము; పొడవు = వృద్ధిచెందుట; చూపెన్ = కనబడెను; శౌరి = కృష్ణుని {శౌరి - శూరుని మనుమడు, కృష్ణుడు}; కిన్ = కి; ధైర్యంబు = తాలిమి; సన్నము = తక్కువ; ఐ = అయ్యి; డయ్యంగన్ = పొందగా; జలజాక్షి = సుందరి యొక్క {జలజాక్షి - పద్మముల వంటి కన్నులామె, స్త్రీ}; మధ్యంబు = నడుము; సన్నమున్ = సన్నముగా; అయ్యెన్ = అయినది.
హరి = కృష్ణుని; కిన్ = కి; ప్రేమ = ప్రేమమీద; బంధము = ఆసక్తి; అధికంబు = పెరుగుతున్నది; కాన్ = అగుచుండగా; కేశ = తలవెంట్రుకల; బంధము = సమూహము; అధికము = సమృద్ధి; అగుచున్ = పొందుతు; బాల = బాలిక; కున్ = కు; అమరెన్ = ఒప్పినది; పద్మనయను = కృష్ణుని {పద్మనయనుడు - పద్మాక్షుడు, కృష్ణుడు}; వలన = వైపు; ప్రమదంబు = సంతోషములు; నిండారన్ = సమృద్ధి యగుచుండగ; నెలత = సుందరి; యౌవనంబున్ = ప్రాయము; నిండి = పరిపూర్ణమై; ఉండె = ఉన్నది.
భావము:- కృష్ణుడి కోరికలు విప్పారేలా, రుక్మిణి మేని మెరుపులు విరిసాయి. మనస్సు వికసించేలా, ముఖపద్మం వికసించింది. మదనతాపం కలిగేలా, స్తనసంపద ఉదయించింది. ధైర్యం సన్నగిల్లేలా, నడుం సన్నబడింది. ప్రేమ పెరిగి పొంగేలా, శిరోజాలు చక్కగా వృద్ధిచెందేయి. కృష్ణుడికి సంతోషం కలిగించేలా, రుక్మిణికి నిండు యౌవనం తొణకిస లాడుతోంది.
ప్రజల నాలుకలపై నానుతుండే ఒక వృత్తాంతము చూద్దాము. పోతన గారు ఈ పద్యం వ్రాస్తూ, “బాల కమరె” వరకు వ్రాసారుట. అదే సమయంలో వారి , ఇంట్లో ఆడుకుంటున్న చిన్నపిల్ల, నిప్పులపై పడిందిట. జుట్టు కాలుతుందని అందరూ కంగారు పడుతున్నారట. (కమరె అంటే కాలు అనే అర్థం ఉంది కదా.) ఇంతలో, ఇదేమీ తెలియని పోతనగారు తన సహజధోరణిలో “బద్మనయను వలనఁ బ్రమదంబు నిండార నెలఁత యౌవనంబు నిండి యుండె”. అని పూరించగానే ఏ ఇబ్బంది లేకుండ పిల్ల నిప్పులనుంచి బయటపడిందట.

13
ఇట్లు రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రు లను నేవురకుం జెలియలైన రుక్మిణీదేవి దన యెలప్రాయంబున.
టీక:- ఇట్లు = ఈ విధముగ; రుక్మి = రుక్మి; రుక్మరథ = రుక్మరథుడు; రుక్మబాహు = రుక్మబాహువు; రుక్మకేశ = రుక్మకేశుడు; రుక్మనేత్రులు = రుక్మనేత్రుడులు; అను = అనెడి; ఏవురు = ఐదుగుర (5); కున్ = కు; చెలియలి = చెల్లెలు; ఐన = అయినట్టి; రుక్మిణీ = రుక్మిణి అనెడి; దేవి = దేవి; తన = తన యొక్క; యెల = లేత; ప్రాయంబునన్ = యౌవనమునందు.
భావము:- ఇలా రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులనే ఐదుగురికి ముద్దుల చెల్లెలైన రుక్మిణి నవ యౌవనంలో ప్రవేశించింది.

14
తండ్రి గేహమునకుం
నుదెంచుచు నున్న యతిథినులవలనఁ గృ
ష్ణుని రూప బల గుణాదులు
విని, "కృష్ణుఁడు దనకుఁ దగిన విభుఁ"డని తలఁచెన్.
టీక:- తన = తన యొక్క; తండ్రి = తండ్రి యొక్క; గేహమున్ = ఇంటి; కున్ = కి; చనుదెంచుచున్ = వస్తూ; ఉన్న = ఉన్నట్టి; అతిథి = అతిథులుగావచ్చు; జనుల = వారి; వలనన్ = ద్వారా; కృష్ణుని = కృష్ణుని యొక్క; రూప = రూపసౌందర్యము; బల = శక్తిసామర్థ్యములు; గుణ = సుగుణములు; ఆదులున్ = మొదలగువాటిని; విని = విని; కృష్ణుడు = కృష్ణుడు; తన = ఆమె; కున్ = కు; తగిన = సరిపడు; విభుడు = భర్త; అని = అని; తలచెన్ = ఎంచెను.
భావము:- తన పుట్టింటికి వచ్చే పోయే వాళ్ళ వల్ల కృష్ణుడి అందం, బలం, సుగుణాలు తెలిసి భర్తగా వరించింది.

15
లన రూపు, బుద్ధియు,
శీము, లక్షణము, గుణముఁ జింతించి తగన్
"బాలారత్నముఁ దన కి
ల్లాలుగఁ జేకొందు" ననుచు రియుం దలఁచెన్.
టీక:- ఆ = ఆ యొక్క; లలన = సుందరి యొక్క; రూపు = రూపసౌందర్యము; బుద్ధియున్ = చక్కటి ప్రజ్ఞ; శీలము = నడవడిక; లక్షణము = మంచి లక్షణములు; గుణమున్ = సుగుణములు; చింతించి = విచారించి; తగన్ = తగినట్లు; బాలా = బాలికలలో; రత్నమున్ = శ్రేష్ఠురాలిని; తన = అతని; కిన్ = కి; ఇల్లాలుగన్ = భార్యగా; చేకొందును = చేపట్టెదను; అనుచున్ = అని; హరియున్ = కృష్ణుడు కూడ; తలచెన్ = భావించెను.
భావము:- ఆ సుందరి అందచందాలు, మంచిబుద్ధి, శీలం, నడవడిక, సుగుణాలు, తెలిసి కృష్ణుడు కూడా రుక్మిణీ కన్యకా రత్నాన్ని పెళ్ళి చేసుకుందా మనుకొన్నాడు.

16
అంత.
టీక:- అంత = అప్పుడు.
భావము:- అలా రుక్మిణి యౌవనంలో ప్రవేశిస్తున్న ఆ సమయంలో

17
బంధువు లెల్లఁ "గృష్ణునకు బాలిక నిచ్చెద" మంచు శేముషీ
సింధువులై విచారములు చేయఁగ, వారల నడ్డపెట్టి దు
స్సంధుఁడు రుక్మి కృష్ణునెడఁ జాల విరోధముఁ జేసి "మత్త పు
ష్పంయవేణి నిత్తు శిశుపాలున" కంచుఁ దలంచె నంధుఁడై.
టీక:- బంధువులు = చుట్టములు; ఎల్లన్ = అందరు; కృష్ణున్ = కృష్ణుని; కున్ = కి; బాలికను = కన్యకను, రుక్మిణిని; ఇచ్చెదము = పెండ్లిచేయుదము; అంచున్ = అని; శేముషీ = సద్బుద్ధి; సింధువులు = సముద్రమంత కలవారు; ఐ = అయ్యి; విచారములు = ఆలోచనలు; చేయగన్ = చేయుచుండగా; వారలన్ = వారిని; అడ్డపెట్టి = అడ్డుకొని; దుస్సంధుడు = చెడ్డ ప్రతిజ్ఞ కలవాడు; రుక్మి = రుక్మి; కృష్ణున్ = కృష్ణుని; ఎడన్ = అందు; చాల = అధికముగా; విరోధమున్ = శత్రుత్వము; చేసి = పెట్టుకొని; మత్త = మదించిన; పుష్పంధయ = తుమ్మెదలవంటి {పుష్పంధయము - పూలలోని మధువును గ్రోలునది, తుమ్మెద}; వేణిన్ = జడ కలామెను, రుక్మిణిన్; ఇత్తున్ = వివాహమున ఇచ్చెదను; శిశుపాలున్ = శిశుపాలుని; కిన్ = కి; అంచున్ = అని; తలచెన్ = ఎంచెను; అంధుడు = కన్నుగానని వాని వలె; ఐ = అయ్యి.
భావము:- రుక్మిణిని బంధువు లంతా మిక్కిలి సద్భుద్దితో కృష్ణుడి కిద్దాం అనుకుంటున్నారు; కాని దుష్టులతో స్నేహంపట్టి జ్ఞానహీనుడైన రుక్మి వారిని కాదని, కృష్ణుడి యందు యెంతో విరోధం పెట్టుకొని, మూర్ఖంగా చేదిదేశపు రాజు శిశుపాలుడికి గండుతుమ్మెదల పిండు వలె నల్లని శిరోజాలు గల సుందరవేణి అయిన తన చెల్లెలు రుక్మిణిని ఇస్తానంటున్నాడు.

రుక్మిణి సందేశము పంపుట

18
న్న తలంపు తా నెఱిఁగి, న్నవనీరజగంధి లోన నా
న్నత నొంది, యాప్తుఁడగు బ్రాహ్మణు నొక్కనిఁ జీరి "గర్వ సం
న్నుఁడు రుక్మి నేడు ననుఁ జైద్యున కిచ్చెద నంచు నున్నవాఁ,
డెన్నివిధంబులం జని బుధేశ్వర! చక్రికి విన్నవింపవే.
టీక:- అన్న = సోదరుని; తలంపున్ = ఆలోచనలను; తాన్ = ఆమె; ఎఱిగి = తెలిసి; ఆ = ఆ యొక్క; నవనీరజగంధి = రుక్మిణి {నవనీరజగంధి - తాజా పద్మముల వంటి సువాసనలు ఉన్నామె, పద్మినీ జాతి సుందరి, రుక్మిణి}; లోనన్ = మనసులోపల; ఆపన్నతన్ = ప్రమాదస్థితిని; ఒంది = పొంది; ఆప్తుడు = కావలసినవాడు; అగు = ఐన; బ్రాహ్మణున్ = బ్రాహ్మణుడను; ఒక్కనిన్ = ఒకతనిని; చీరి = పిలిచి; గర్వ = గర్వముచేత; సంఛన్నుడు = కప్పబడినవాడు; రుక్మి = రుక్మి; నేడు = ఇప్పుడు; ననున్ = నన్ను; చైద్యున్ = శిశుపాలుని {చైద్యుడు - చేది దేశపువాడు, శిశుపాలుడు}; కిన్ = కి; ఇచ్చెదను = వివాహమున ఇచ్చెదను; అంచున్ = అనుచు; ఉన్నవాడు = ఉన్నాడు; ఎన్నివిధంబులన్ = ఏవిధముగానైన; చని = పోయి; బుధ = పండితులలో; ఈశ్వరా = ఉత్తముడా; చక్రి = కృష్ణుని; కిన్ = కి; విన్నవింపవే = మనవిచేయుము.
భావము:- పరీక్షిన్మహారాజా! తన అన్న ఆలోచన తెలిసి, క్రొందామరల సుగంధాలు వెదజల్లే దేహం కలిగిన (పద్మినీజాతి సుందరి యైన) రుక్మిణి, మేలుకోరేవాడు అయిన అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుని పిలిచి ఇలా చెప్పింది “బుద్ధిమంతుడా! గర్వంతో కన్నులుగానక మా అన్న రుక్మి నాకు చేదిదేశపువాడైన శిశుపాలుడితో ఎలాగైనా పెళ్ళి చేసేస్తా నంటున్నాడు. ఏ విధాగానైనా చక్రాయుధుడు శ్రీకృష్ణుడి దగ్గరకి వెళ్ళి పరిస్థితి తెలియ జెప్పుము.

19
య్యా! కొడుకు విచారము
య్యయు వారింపఁ జాలఁ టు గాకుండన్
నెయ్య మెఱిఁగించి చీరుము
య్యన నిజసేవకానుసారిన్ శౌరిన్."
టీక:- అయ్యా = నాయనా, పూజ్యుడా; కొడుకు = పుత్రుని యొక్క; విచారముల్ = ఆలోచనలను; అయ్యయున్ = తండ్రికూడ; వారింపన్ = నిలువరింప; చాలడు = నేరడు; అటు = ఆ విధముగ; కాకుండన్ = జరుగనీయకుండుటకు; నెయ్యమున్ = నా స్నేహమును, నా ప్రేమ; ఎఱిగించి = తెలిపి; చీరుము = పిలువుము; చయ్యనన్ = శీఘ్రముగా; నిజ = తన యొక్క; సేవక = భక్తులును; అనుసారిన్ = అనుసరించువానిని; శౌరిన్ = కృష్ణుని.
భావము:- ఓ బ్రాహ్మణోత్తమా! కొడుకుమాట మా నాన్న కూడ కాదనలేడు. అలా కాకూడదు. కనుక, నాప్రేమ తెలియజేసి భక్తుల వెంట నుండు వాడు, శూరుని మనుమడు అయిన శ్రీకృష్ణుణ్ణి వెంటనే రమ్మని పిలు.”

20
అని కొన్ని రహస్యవచనంబులు చెప్పిన విని బ్రాహ్మణుండు ద్వారకా నగరంబునకుం జని, ప్రతిహారుల వలనఁ దనరాక యెఱింగించి య న్నగధరుం డున్న నగరు ప్రవేశించి, యందుఁ గనకాసనాసీనుండయి యున్న పురుషోత్తముం గాంచి “పెండ్లికొడుకవు గ” మ్మని దీవించిన ముసిముసి నగవులు నగుచు బ్రహ్మణ్యదేవుండైన హరి తన గద్దియ దిగ్గన డిగ్గి, బ్రాహ్మణుం గూర్చుండ నియోగించి, తనకు దేవతలు చేయు చందంబునం బూజలు చేసి, సరసపదార్థ సంపన్నంబైన యన్నంబుఁ బెట్టించి, రెట్టించిన ప్రియంబున నయంబున భాసురుండైన భూసురుం జేరి లోకరక్షణ ప్రశస్తంబైన హస్తంబున నతని యడుగులు పుడుకుచు మెల్లన నతని కిట్లనియె.
టీక:- అని = అని; కొన్ని = కొన్ని, సరిపడెడి; రహస్య = రహస్యమైన; వచనంబులున్ = మాటలు; చెప్పినన్ = చెప్పగా; విని = విని; బ్రాహ్మణుండున్ = బ్రాహ్మణుడు; ద్వారకానగరంబున్ = ద్వారకాపట్టణమున; కున్ = కు; చని = వెళ్ళి; ప్రతిహారుల = ద్వారపాలకుల; వలనన్ = ద్వారా; ఎఱింగించి = తెలిపి; ఆ = ఆ ప్రసిద్ధుడైన; నగధరుండు = కృష్ణుడు {నగధరుడు - నగ (గోవర్ధన పర్వతమును) ధరుడు (ధరించినవాడు), కృష్ణుడు}; ఉన్న = ఉన్నట్టి; నగరు = అంతఃపురము; ప్రవేశించి = లోనికివెళ్ళి; అందున్ = దానిలో; కనక = బంగారు; ఆసనా = ఆసనముపై; ఆసీనుండు = కూర్చున్నవాడు; అయి = ఐ; ఉన్న = ఉన్నట్టి; పురుషోత్తమున్ = కృష్ణుని; కాంచి = చూసి; పెండ్లికొడుకవు = పెండ్లికొడుకువైనవాడవు; కమ్ము = అగుము; అని = అని; దీవించినన్ = ఆశీర్వదించగా; ముసిముసినగవులు = చిరునవ్వులు; నగుచున్ = నవ్వుతు; బ్రహ్మణ్య = వైదికకర్మలందు; దేవుండు = పూజ్యుడైనవాడు; ఐన = అయినట్టి; హరి = కృష్ణుడు; తన = అతని యొక్క; గద్దియన్ = ఆసనమును, పీఠమును; దిగ్గనన్ = చటుక్కున; డిగ్గి = దిగి; బ్రాహ్మణున్ = విప్రుని; కూర్చుండన్ = కూర్చుండుము అని; నియోగించి = చెప్పి; తన = అతని; కున్ = కి; దేవతలు = దేవతలు; చేయు = చేయునట్టి; చందంబునన్ = విధముగ; పూజలున్ = మర్యాదలుచేయుట; చేసి = చేసి; సరస = రసవంతములైన; పదార్థ = వస్తువులు; సంపన్నంబు = సమృద్ధిగా కలవి; ఐన = అయిన; అన్నంబున్ = భోజనము; పెట్టించి = పెట్టించి; రెట్టించిన = దిగ్విణీకృతంబైన; ప్రియంబునన్ = ప్రేమతో; నయంబునన్ = నమ్రతతో; భాసురుండు = తేజస్సు కలవాడు; ఐన = అయిన; భూసురున్ = విప్రుని {భూసురుడు - భూమిపైని దేవుడు, బ్రాహ్మణుడు}; చేరి = దగ్గరకు వెళ్ళి; లోక = సర్వలోకములను; రక్షణ = కాపాడుటలో; ప్రశస్తంబు = శ్లాఘింపదగినది; ఐన = అగు; హస్తంబునన్ = చేతితో; అతని = అతని యొక్క; అడుగులు = పాదములను; పుడుకుచున్ = వత్తుతు; మెల్లనన్ = మెల్లిగా; అతని = అతని; కిన్ = ఉద్దేశించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా చెప్పి కొన్ని రహస్య సంకేతాలు చెప్పి పంపింది. ఆ బ్రాహ్మణుడు ద్వారకకు వెళ్ళాడు. ప్రతీహారుల ద్వారా తన రాక తెలిపాడు. అంతఃపురంలో బంగారు ఆసనం మీద ముసిముసి నవ్వుతూ ఉన్న కృష్ణుణ్ణి దర్శించి “కల్యణ ప్రాప్తిరస్తు” అని దీవించాడు. సంతోషించిన కృష్ణుడు గద్దె దిగి, ఆసీనుణ్ణి చేసి, భక్తిగా పూజించి, మంచి రుచికరమైన భోజనం పెట్టించేడు. ద్విగుణీకృతమైన ప్రేమతో తేజోరాశిలా ఉన్న బ్రాహ్మణుని దరిజేరి లోకాల్ని కాపాడే తన చేత్తో కాళ్ళొత్తుతూ, కృష్ణుడు మెల్లగా ఇలా అన్నాడు.

21
"గతీసురేశ్వర! సంతోషచిత్తుండ;
వై యున్న నీ ధర్మ తిసులభము
వృద్ధసమ్మత మిది విత్త మెయ్యది యైనఁ;
బ్రాపింప హర్షించు బ్రాహ్మణుండు
న ధర్మమున నుండుఁ రలఁ డా ధర్మంబు;
గోరిక లతనికిఁ గురియుచుండు
సంతోషిగాఁ డేని క్రుఁడైన నశించు;
నిర్ధనుండైనను నింద్రుఁ బోఁలు


సంతసించెనేని, ర్వభూతసుహృత్త
ములకుఁ బ్రాప్తలాభ ముదిత మాన
సులకు శాంతులకును సుజనులకును గర్వ
హీనులకును వినతు లే నొనర్తు.
టీక:- జగతీసుర = విప్రులలో {జగతీసురుడు - భూలోకమునకు దేవుడు, బ్రాహ్మణుడు}; ఈశ్వరా = శ్రేష్ఠుడా; సంతోష = సంతోషముతోకూడిన; చిత్తుండవు = మనసు కలవాడవు; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; నీ = నీ యొక్క; ధర్మము = స్వభావము; అతి = మిక్కిలి; సులభము = ఆమోదయోగ్యమైనది; వృద్ధ = పెద్దలచే; సమ్మతము = అంగీకరింపబడినది; ఇది = ఇది; విత్తము = ధనము; ఎయ్యది = ఏది; ఐనన్ = అయినప్పటికి; ప్రాప్తింపన్ = లభించినచో; హర్షించున్ = సంతోషించును; బ్రాహ్మణుండున్ = విప్రుడు; తన = అతని యొక్క, స్వ; ధర్మమునన్ = ధర్మమునందే; ఉండున్ = నిలుకడగా ఉండును; తరలడు = తప్పుకొనడు; ధర్మంబున్ = స్వధర్మమును; కోరికలు = కోరినవి; అతని = అతని; కిన్ = కి; కురియుచున్ = సమృద్ధిగా దొరకుచు; ఉండున్ = ఉండును; సంతోషి = సంతోషించినవాడు; కాడేని = కానిపక్షమున; శక్రుడు = ఇంద్రుడు; ఐనన్ = అయినను; నశించున్ = నశించిపోవును; నిర్దనుండు = మిక్కిలి బీదవాడు; ఐననున్ = అయినను; నిద్రపోవున్ = సుఖముగా నిద్రించును.
సంతసించెనేని = సంతోషించినచో; సర్వ = సమస్తమైన; భూత = ప్రాణులకు; సుహృత్తముల్ = మేలు కోరువారల; కున్ = కు; ప్రాప్త = పొందబడిన; లాభ = లాభములచేతనే; ముదిత = సంతోషించునట్టి; మానసుల్ = మనసులు కలవారి; కున్ = కు; శాంతుల్ = శాంతస్వభావము కలవారి; కును = కి; సుజనుల్ = మంచివారి; కును = కి; గర్వ = గర్వము; హీనుల్ = లేనివారి; కును = కి; వినతులు = నమస్కారములు; ఏన్ = నేను; ఒనర్తు = చేయుదును.
భావము:- “ఓ బ్రాహ్మణుడా! లోకులందరిచే గౌరవింపబడువాడ! నీ పద్దతి చక్కటిది, తీరైనది, పెద్దలు అంగీకరించేది. బ్రాహ్మణుడు దొరికిన ధనంతోనే తృప్తిపడతాడు. తన దర్మాన్ని వదలిపెట్టడు. ఆ ధర్మమే అతనికి కావలసినవన్నీ సమకూరుస్తుంది. విప్రుడు తృప్తి చెందకపోతే ఇంద్రుడైనా నాశనమైపోతాడు. తృప్తి చెందాడా, దరిద్రుడు కూడ యెంతో సుఖంగా ఉంటాడు. నేను సకల జీవులకు ఆప్తులు, దొరికిన దానితోనే తృప్తిచెందే వారు, శాంతస్వభావులు, మంచివారు, గర్వహీనులు అయిన విప్రులకి నమస్కరిస్తాను.

22
వ్వని దేశమం దునికి; యెవ్వనిచేఁ గుశలంబు గల్గు మీ
కెవ్వని రాజ్యమందుఁ బ్రజలెల్ల సుఖింతురు వాఁడు మత్ప్రియుం
డివ్వనరాశి దుర్గమున కెట్లరుదెంచితి రయ్య! మీరు? లే
వ్వులుగావు; నీ తలఁపునం గల మే లొనరింతు ధీమణీ!"
టీక:- ఎవ్వని = ఎవరి; దేశము = రాజ్యము; అందున్ = లో; ఉనికి = ఉండుట; ఎవ్వని = ఎవరి; చేన్ = వలన; కుశలంబున్ = క్షేమము; కల్గున్ = కలుగును; మీ = మీ; కున్ = కు; ఎవ్వని = ఎవరి; రాజ్యము = రాజ్యము; అందున్ = లో; ప్రజలు = జనులు; ఎల్లన్ = అందరు; సుఖింతురు = సుఖించెదరు; వాడు = అతడు; మత్ = నా యొక్క; ప్రియుండు = ఇష్టుడు; ఈ = ఈ; వనరాశి = సముద్రపు; దుర్గమున్ = కోటకు; కున్ = కు; ఏల = ఎట్లు; అరుదెంచితిరి = వచ్చిరి; అయ్య = తండ్రి; మీరున్ = మీరు; లే = లేత; నవ్వులు = నవ్వులకు; కావు = చెప్పినవికావు; నీ = నీ యొక్క; తలపునన్ = మనసునందు; కల = ఉన్న; మేలున్ = మంచివాటిని; ఒనరింతున్ = చేసెదను; ధీమణీ = విఙ్ఞులలో ఉత్తముడా.
భావము:- బుద్ధిశాలీ! మీరే దేశంలో ఉంటారు. ఎవని రాజ్యంలో నైతే మీరు కులాసాగా ఉంటారో, ప్రజలంతా సుఖంగా ఉంటారో వాడు మాకు ఇష్టుడు. సముద్రంలో ఉన్న ఈ కోట లోకి రావటం అంత సుళువైనపని కాదు. మీరెలా వచ్చేరు. మీరు కోరిన మేలు తప్పక చేకూరుస్తాను.” అని శ్రీకృష్ణుడు సందేశం పట్టుకొని వచ్చిన విప్రుని పలకరించాడు.

23
అని యిట్లు లీలాగృహీతశరీరుండైన య ప్పరమేశ్వరుం డడిగిన ధరణీసురవరుం డతనికి సవినయంబుగ నిట్లనియె “దేవా! విదర్భదేశాధీశ్వరుండైన భీష్మకుండను రాజుగలం; డా రాజుకూఁతురు రుక్మిణి యను కన్యకామణి; గల ద య్యిందువదన నీకుం గైంకర్యంబు జేయం గోరి వివాహమంగళ ప్రశస్తంబయిన యొక్క సందేశంబు విన్నవింపు మని పుత్తెంచె నవదరింపుము.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; లీలా = విలాసముగా; గృహీత = గ్రహించిన; శరీరుండు = దేహము కలవాడు; ఐన = అయిన; ఆ = ఆ ప్రసిద్ధుడైన; పరమేశ్వరుండు = శ్రీకృష్ణుడు; అడిగినన్ = అడుగగా; ధరణీసుర = విప్ర; వరుండు = ఉత్తముడు; అతని = అతని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; దేవా = స్వామీ; విదర్భదేశ = విదర్భదేశమునకు; అధీశ్వరుండు = ప్రభువు; అయిన = ఐన; భీష్మకుండు = భీష్మకుడు; అను = అనెడి; రాజు = రాజు; కలండు = ఉన్నాడు; ఆ = ఆ; రాజు = రాజు యొక్క; కూతురు = కుమార్తె; రుక్మిణి = రుక్మిణి; అను = అనెడి; కన్యక = కన్యకలలో; మణి = శ్రేష్ఠురాలు; కలదు = ఉన్నది; ఆ = ఆ యొక్క; ఇందువదన = చంద్రముఖి, రుక్మిణి; నీ = నీ; కున్ = కు; కైంకర్యంబున్ = సేవించుట; చేయన్ = చేయవలెనని; కోరి = కోరుకొని; వివాహ = పెండ్లికి సంబంధించిన; మంగళ = శుభకరము; ప్రశస్తంబు = శ్లాఘింపదగినది; అయిన = ఐన; ఒక్క = ఒకానొక; సందేశంబున్ = సమాచారమును; విన్నవింపుము = మనవిచేయుము; అని = అని; పుత్తెంచెను = పంపించినది; అవధరింపుము = వినుము.
భావము:- ఇలా ఆ లీలామానవదేహధారి అయిన శ్రీకృష్ణపరమాత్మ అడుగగా, రుక్మిణీదేవి సందేశం తెచ్చిన ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు “భగవాన్! విదర్భ దేశానికి రాజు భీష్మకుడు. ఆ రాజు కూతురు రుక్మిణి. ఆ అందమైన కన్య ఒక వివాహ మంగళంబైన గొప్ప సందేశం నీకు విన్నవించమని పంపింది. సావధానంగా విను.

24
నీ గుణములు కర్ణేంద్రియంబులు సోఁక;
దేహతాపంబులు దీఱిపోవు
నే నీ శుభాకార మీక్షింపఁ గన్నుల;
ఖిలార్థలాభంబు లుగుచుండు
నే నీ చరణసేవ యే ప్రొద్దు చేసిన;
భువనోన్నతత్వంబుఁ బొందఁ గలుగు
నే నీ లసన్నామ మే ప్రొద్దు భక్తితోఁ;
డవిన బంధసంతులు వాయు


ట్టి నీ యందు నా చిత్త నవరతము
చ్చి యున్నది నీ యాన నాన లేదు,
రుణఁ జూడుము కంసారి! లవిదారి!
శ్రీయుతాకార! మానినీచిత్తచోర!
టీక:- ఏ = ఎట్టి; నీ = నీ యొక్క; గుణములున్ = గొప్పగుణములు {భగవంతుని గుణములు - 1సర్వజ్ఞత్వము 2సర్వేశ్వరత్వము 3సర్వభోక్తృత్వము 4సర్వనియంతృత్వము 5సర్వాంతర్యామిత్వము 6సర్వసృష్టత్వము 7సర్వపాలకత్వము 8సర్వసంహారకత్వము మొదలగునవి}; కర్ణేంద్రియంబులు = చెవులను; సోకన్ = తాకినంతనే; దేహ = శారీరక; తాపంబులు = బాధలు, తాపత్రయములు {తాపత్రయము - 1 ఆధ్యాత్మికము 2ఆదిదైవికము 3ఆదిభౌతికము అనెడి మూడు ఇడుములు}; తీఱిపోవున్ = నశించిపోవునో; ఏ = ఎట్టి; నీ = నీ యొక్క; శుభ = శోభనకరమైన; ఆకారమున్ = స్వరూపమును; ఈక్షింపన్ = చూచినచో; కన్నుల్ = కళ్ళ; కున్ = కు; అఖిల = సమస్తమైన; అర్థ = ప్రయోజనములు; లాభంబు = లభించుట; కలుగుచుండున్ = పొందుతుండునో; ఏ = ఎట్టి; నీ = నీ యొక్క; చరణ = పాదములను; సేవన్ = కొలచుటచే; ఏప్రొద్దున్ = ఎల్లప్పుడు; చేసినన్ = చేసినచో; భువన = లోకమునందు; ఉన్నతత్వంబు = అధిక్యము; పొందగలుగు = లభించునో; ఏ = ఎట్టి; నీ = నీ యొక్క; లసత్ = మంచి; నామమున్ = పేరులను; ఏప్రొద్దున్ = ఎల్లప్పుడు; భక్తి = భక్తి; తోన్ = తోటి; తడవినన్ = తలచిన ఎడల; బంధ = సంసారబంధముల {సంసారబంధములు - అష్టబంధములు, 1దయ 2జుగుప్స 3మోహము 4భయము 6సంశయము 7కులము 8శీలము}; సంతతులు = సమూహములన్ని; వాయున్ = తొలగునో; అట్టి = అటువంటి.
నీ = నీ; అందున్ = ఎడల; నా = నా యొక్క; చిత్తము = మనస్సు; అనవరతము = ఎల్లప్పుడు; నచ్చి = ఇష్టపడి; ఉన్నది = ఉన్నది; నీ = నీ మీద; ఆన = ఒట్టు; నాన = సిగ్గుపడుట; లేదు = లేదు; కరుణన్ = దయతో; చూడుము = చూడు; కంసారి = శ్రీకృష్ణా {కంసారి - కంసుని సంహరించినవాడు, కృష్ణుడు}; ఖలవిదారి = శ్రీకృష్ణా {ఖల విదారి - దుర్జనులను సంహరించువాడు, కృష్ణుడు}; శ్రీయుతాకార = శ్రీకృష్ణా {శ్రీయుతాకారుడు - సౌందర్య సంపదలతో కూడి ఉన్న వాడు, కృష్ణుడు}; మానినీచిత్తచోర = శ్రీకృష్ణా {మానినీచిత్తచోరుడు - స్త్రీల మనసులను అపహరించు వాడు, కృష్ణుడు}.
భావము:- శ్రీకృష్ణప్రభూ! కంసాది ఖలులను సంహరించినవాడ! మంగళాకారా! మనస్వినిల మనసులు దోచేవాడా! నీ గురించి చెవులలో పడితే చాలు దేహతాపాలన్నీ తీరిపోతాయి. నీ శుభాకారం చూస్తే చాలు సకలార్థ లాభాలు కలుగుతాయి. నీ పాదసేవ చేసుకొంటే చాలు లోకోన్నతి దక్కుతుంది. భక్తిగా నీ నామస్మరణ ఎడతెగకుండా చేస్తే చాలు భవబంధాలన్నీ పటాపంచ లౌతాయి. అలాంటి నీ మీద మనసు పడ్డాను. నీ మీదొట్టు. సమయం లేదు. దయతో చిత్తగించు.

25
న్యున్ లోకమనోభిరాముఁ గుల విద్యా రూప తారుణ్య సౌ
న్యశ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను నే
న్యల్గోరరు? కోరదే మును రమాకాంతా లలామంబు రా
న్యానేకపసింహ! నా వలననే న్మించెనే మోహముల్?
టీక:- ధన్యున్ = కృతార్థుండు; లోక = లోకుల; మనః = మనసులను; అభిరామున్ = నచ్చువాడు; కుల = వంశముచేత; విద్యా = విజ్ఞానముచేత; రూప = సౌందర్యముచేత; తారుణ్య = యౌవనశోభచేత; సౌజన్య = మంచితనముచేత; శ్రీ = సంపదలచేత; బల = శక్తిచేత; దాన = ఈవిచేత; శౌర్య = వీరత్వముచేత; కరుణా = దయచేత; సంశోభితున్ = మిక్కిలి ప్రకాశవంతుడు; నిన్నున్ = నిన్ను; ఏ = ఏ; కన్యల్ = కన్యలు మాత్రము; కోరరు = కావలనుకొనరు; కోరదే = వరించలేదా; మును = పూర్వము; రమా = లక్ష్మీదేవి యనెడి; కాంతాలలామంబు = శ్రేష్ఠురాలు; రాజ = రాజులలో; అన్య = శత్రువు లనెడి; అనేకప = ఏనుగులకు; సింహ = సింహమువంటివాడ; నా = నా ఒక్కర్తె; వలననే = యందే; జన్మించెనే = పుట్టినవా, పుట్టలేదు; మోహముల్ = మోహించుటలు.
భావము:- ముకుందా! రాజులనే మత్తేభాల పాలిటి సింహమా! నీవు ధన్యుడవు. అందరి మనసులు అలరించే వాడవు. కులం, రూపం, యౌవనం, సౌజన్యం, శ్రీ, బలం, దాన, పరాక్రమం, కరుణాది సకల సుగుణ సంశోభితుడవు. అలాంటి నిన్ను ఏ కన్యలు కోరకుండా ఉంటారు. మోహించకుండా ఉంటారు. పూర్వం కాంతామణి లక్ష్మీదేవి నిన్ను వరించ లేదా. అయినా లోకంలో రుక్మిణి అనబడే నా ఒక్కదాని వలననే మోహం అనేది పుట్టిందా ఏమిటి.

26
శ్రీయుతమూర్తి! యో పురుషసింహమ! సింహముపాలి సొమ్ము గో
మాయువు గోరు చందమున త్తుఁడు చైద్యుఁడు నీ పదాంబుజ
ధ్యాయిని యైన నన్ను వడిఁ దాఁ గొనిపోయెద నంచు నున్నవాఁ
డా ధమాధముం డెఱుఁగఁ ద్భుతమైన భవత్ప్రతాపమున్
టీక:- శ్రీ = లక్ష్మీదేవితో, సంపదలతో; యుత = కూడియున్న; మూర్తి = స్వరూపుడా; ఓ = ఓయీ; పురుష = పురుషులలో; సింహమా = శ్రేష్ఠుడా; సింహము = సింహమునకు; పాలి = చెందిన; సొమ్మున్ = పశువును; గోమాయువున్ = నక్క; కోరు = ఆశించెడి; చందమునన్ = విధముగ; మత్తుడు = మిక్కిలి గర్వము కలవాడు; చైద్యుడు = శిశుపాలుడు {చైద్యుడు - చేది దేశపువాడు, శిశుపాలుడు}; నీ = నీ యొక్క; పద = పాదము లనెడి; అంబుజ = పద్మము లందు; ధ్యాయిని = ధ్యానించుదానను; ఐన = అయిన; నన్నున్ = నన్ను; వడిన్ = వేగముగా, తీవ్రముగా; తాన్ = అతను; కొనిపోయెదను = తీసుకుపోయెదను; అంచున్ = అని; ఉన్నవాడు = ఉన్నాడు; ఆ = ఆ యొక్క; అధమ = నీచులలో; అధముండు = నీచుడు; ఎఱుగడు = ఎరుగడు; అద్భుతము = దివ్యము; ఐన = అయిన; భవత్ = నీ యొక్క; ప్రతాపమున్ = పరాక్రమమును.
భావము:- ఓ శుభాకారా! పురుషోత్తమ! శ్రీకృష్ణా! సింహానికి చెందవలసిన దానిని నక్క కోరినట్లు, గర్విష్ఠి ఐన శశిపాలుడు నీ పదభక్తురాలు ఐన రుక్మిణిని, నన్ను తీసుకుపోతాను అంటున్నాడు. అద్భుతమైన నీ మహిమ తెలియని పరమనీచుడు వాడు.

27
వ్రముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దానధర్మాదులున్
జన్మంబుల నీశ్వరున్ హరి జగత్కళ్యాణుఁ గాంక్షించి చే
సితి నేనిన్ వసుదేవ నందనుఁడు నా చిత్తేశుఁ డౌఁ గాక ని
ర్జితు లై పోదురుగాక సంగరములోఁ జేదీశ ముఖ్యాధముల్.
టీక:- వ్రతముల్ = నోములు; దేవ = దేవతలను; గురు = పెద్దలను; ద్విజన్మ = విప్రులను; బుధ = జ్ఞానులను; సేవల్ = కొలచుటలు; దాన = దానము లిచ్చుటలు; ధర్మ = దర్మాచరణములు; ఆదులున్ = మున్నగువానిని; గత = పూర్వ; జన్మంబులన్ = జన్మములలో; ఈశ్వరున్ = సర్వము ఏలువాడిని; హరిన్ = విష్ణుమూర్తిని; జగత్ = లోకమునకు; కల్యాణున్ = మేలు చేయువానిని; కాంక్షించి = కావాలని, కోరి; చేసితినేనిన్ = చేసినచో; వసుదేవనందనుడు = కృష్ణుడు {వసుదేవ నందనుడు - వసుదేవుని కొడుకు, కృష్ణుడు}; నా = నా యొక్క; చిత్తేశుడు = భర్త {చిత్తేశుడు - మనసునకు ప్రభువు, భర్త}; ఔగాక = అగును గాక; నిర్జితులు = ఓడిపోయినవారు; ఐపోదురుగాక = అయ్యెదరుగాక; సంగరము = యుద్ధము; లోన్ = అందు; చేదీశ = శిశుపాలుడు {చేదీశుడు - చేది దేశపు ప్రభువు, శిశుపాలుడు}; ముఖ్య = మొదలగు; అధముల్ = నీచులు.
భావము:- రుక్మిణీదేవి అను నేను కనక గత జన్మలలో భగవంతుడు లోకకల్యాణుడు ఐన నారాయణుని కోరి వ్రతాలు చేసి ఉన్నట్లైతే; దేవతల, గురువుల, విప్రోత్తముల సేవ చేసి ఉన్నట్లైతే; దాన ధర్మాలు మొదలైనవి చేసి ఉన్నట్లైతే; వసుదేవుని కొడుకైన కృష్ణుడు నాకు భర్త ఔగాక! యుద్ధంలో శశిపాలాది అధములు ఓడిపోవుదురు గాక!

28
అంకిలి జెప్పలేదు; చతురంగబలంబులతోడ నెల్లి యో!
పంజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి నా
వంకు వచ్చి రాక్షసవివాహమునన్ భవదీయశౌర్యమే
యుంకువ చేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము వచ్చెదన్.
టీక:- అంకిలి = అడ్డు; చెప్పన్ = చెప్పుటకు; లేదు = లేదు; చతురంగబలంబుల్ = చతురంగసైన్యము {చతురంగబలము - 1రథములు 2ఏనుగులు 3గుఱ్ఱములు 4పదాతిదళము అనెడి నాలుగు అంగములు (విభగములు) కల సేన}; తోడన్ = తోటి; ఎల్లి = రేపు; ఓ = ఓయీ; పంకజనాభ = కృష్ణా {పంకజనాభుడు - పద్మము నాభి యందుగలవాడు, విష్ణువు}; నీవు = నీవు; శిశుపాల = శిశుపాలుడు; జరాసుతులన్ = జరాసంధులను; జయించి = గెలిచి; నా = నా; వంక = వైపు, సహాయపడుట; కున్ = కు; వచ్చి = వచ్చి; రాక్షస = రాక్షసము పద్ధతి; వివాహమునన్ = వివాహమునందు; భవదీయ = నీ యొక్క; శౌర్యమున్ = పరాక్రమమును; ఉంకువ = ఓలిగా {ఉంకువ - అల్లుడు కన్యకార్థముగా మామ కిచ్చెడి ద్రవ్యము, శుల్కము}; చేసి = చేసి; కృష్ణ = కృష్ణ; పురుష = పురుషులలో; ఉత్తమ = శ్రేష్ఠుడా; చేకొనిపొమ్ము = తీసుకుని వెళ్ళుము; వచ్చెదన్ = నేను వస్తాను.
భావము:- ఓ పద్మనాభ! కృష్ణ! మహాత్మ! అడ్డుచెప్పడానికి లేదు; నీ పరాక్రమం చూపి, రేపు నీవు చతురంగ బలాలతో సహా వచ్చి, శిశుపాలుడు జరాసంధులను జయించి, నా దగ్గరకు వచ్చి, నన్ను (రుక్మిణిని) రాక్షస వివాహమున తీసుకుకొని వెళ్ళవయ్య! నేను సంతోషంగా నీతో వచ్చేస్తాను.

29
"లోపలి సౌధంబులోన వర్తింపంగఁ;
దేవచ్చునే నిన్నుఁ దెత్తునేని
గావలివారలఁ ల బంధువులఁ జంపి;
కాని తేరా" దని మలనయన!
భావించెదేని యుపాయంబు చెప్పెద;
నాలింపు కులదేవయాత్రఁ జేసి
గరంబు వెలువడి గజాతకును మ్రొక్కఁ;
బెండ్లికి మునుపడఁ బెండ్లికూఁతుఁ


నెలమి మావారు పంపుదు రేను నట్లు
పురము వెలువడి యేతెంచి భూతనాథు
తికి మ్రొక్కంగ నీవు నా మయమందు
చ్చి కొనిపొమ్ము నన్ను నవార్యచరిత!
టీక:- లోపలి = లోపలికి ఉన్న; సౌధంబు = అంతఃపురము; లోనన్ = అందు; వర్తింపంగా = తిరుగుచుండగా; తేవచ్చునే = తీసుకురాగలమా; నిన్నున్ = నిన్ను; తెత్తునేని = తీసుకొని వచ్చినను; కావలివారలన్ = కాపలాదారులను; కల = అక్కడున్న; బంధువులన్ = చుట్టములను; చంపి = సంహరించి; కాని = కాని; తేరాదు = తీసుకురాలేము; అని = అని; కమలనయన = పద్మాక్షుడా, కృష్ణా; భావించెదేని = తలచెడి పక్షమున; ఉపాయంబు = సుళువుమార్గమును; చెప్పెదన్ = తెలిపెదను; ఆలింపు = వినుము; కులదేవ = ఇలవేల్పుని కొలుచుట కైన; యాత్ర = ప్రయాణము; చేసి = అయ్యి; నగరంబు = అంతఃపురము; వెలువడి = బయలుదేరి; నగజాత = పార్వతీదేవి; కును = కి; మ్రొక్కన్ = పూజించుటకు; పెండ్లి = వివాహమున; కిన్ = కు; మునుపడన్ = ముందుగా; పెండ్లికూతున్ = పెళ్ళికూతురును; ఎలమి = ప్రీతితో.
మావారు = మావాళ్ళు; పంపుదురు = పంపించెదరు; ఏనున్ = నేను కూడ; అట్లు = ఆ విధముగనే; పురము = అంతఃపురము; వెలువడి = బయలుదేరి; ఏతెంచి = వచ్చి; భూతనాథుసతి = పార్వతీదేవి {భూతనాథు సతి - భూతనాథు (శివు)ని సతి, పార్వతి}; కిన్ = కి; మ్రొక్కగన్ = పూజించుచుండగా; నీవున్ = నీవు; ఆ = ఆ యొక్క; సమయము = సమయము; అందున్ = అందు; వచ్చి = చేరవచ్చి; కొనిపొమ్ము = తీసుకుని వెళ్ళు; నన్నున్ = నన్ను; అవార్యచరిత = నివారింపరానివాడా.
భావము:- ఓ కమలాల వంటి కన్నులున్న కన్నయ్యా! “నీవు కన్యాంతఃపురంలో ఉంటావు కదా రుక్మిణీ ! నిన్ను ఎలా తీసుకుపోవాలి. అలా తీసుకెళ్ళాలంటే కాపలావాళ్ళను, అప్పు డక్కడ ఉన్న మీ బంధుజనాలను చంపాల్సివస్తుంది కదా” అని నీవు అనుకుంటే, దీనికి ఒక ఉపాయం మనవిచేస్తాను. చిత్తగించు. పెళ్ళికి ముందు మా వారు పెళ్ళికూతురును మా ఇలవేల్పు మంగళగౌరిని మొక్కడానికి పంపిస్తారు. నేను కూడ అలాగే నగరి వెలువడి మొక్కుచెల్లించడానికి ఊరి వెలుపల ఉన్న దుర్గగుడికి బయలుదేరి వస్తాను. అడ్డగింపరాని నడవడిక కలవాడా! కృష్ణా! ఆ సమయానికి దారికి అడ్డంగా వచ్చి నన్ను నిరాటంకంగా తీసుకొనిపో!

30
ను లాత్మీయ తమోనివృత్తికొఱకై గౌరీశుమర్యాద నె
వ్వని పాదాంబుజతోయమందు మునుఁగన్ వాంఛింతు రే నట్టి నీ
నుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ నూఱుజన్మంబులున్
నినుఁ జింతించుచుఁ బ్రాణముల్ విడిచెదన్ నిక్కంబ, ప్రాణేశ్వరా!
టీక:- ఘనులు = గొప్పవారు; ఆత్మీయ = తమ యొక్క; తమః = అజ్ఞానమును; నివృత్తి = తొలగించుకొనెడి; వృత్తిన్ = ఉపాయము; కొఱకు = కోసము; ఐ = అయ్యి; గౌరీశు = శివుని {గౌరీశుడు - గౌరి యొక్క ప్రభువు, శివుడు}; మర్యాదన్ = వలెనే; ఎవ్వని = ఎవరి యొక్క; పాద = పాదములనెడి; అంబుజ = పద్మముల; తోయము = తీర్థము; అందున్ = అందు; మునుగన్ = స్నానము చేయవలె నని; వాంఛింతురు = కోరుదురో; ఏనున్ = నేను కూడ; అట్టి = అటువంటి; నీ = నీ యొక్క; అనుకంపన్ = దయచేత; విలసింపనేని = ప్రకాశింపకపోతే, క్రీడింపకపోతే; వ్రత = వ్రతదీక్ష; చర్యన్ = వంటి కార్యముగా; నూఱు = వంద (100); జన్మంబులున్ = రాబోవు జన్మములులో; నినున్ = నిన్ను; చింతించుచున్ = తలచుచు; ప్రాణముల్ విడిచెదన్ = చనిపోయెదను; నిక్కంబు = ఇది తథ్యము; ప్రాణేశ్వరా = నా పాణమునకు ప్రభువా.
భావము:- జీవితేశ్వరా! నాథా! పార్వతీపతి పరాత్పరుని పాదపద్మాల యందు ప్రభవించిన పవిత్ర గంగాజలాలలో ఓలలాడుతుంటాడు. మహాత్ములు అజ్ఞానరాహిత్యం కోరి, శంకరుని వలెనే, ఆ పరాత్పరుని పదజనిత గంగాజలాలలో ఓలలాడాలని కోరుతుంటారు. అటువంటి తీర్థపాదుడ వైన నీ అనుగ్రహాన్ని అందుకొని మనలేని ఎడల, బ్రహ్మచర్యదీక్షా వ్రతనిష్ఠ వహించి వంద జన్మలు కలిగినా సరే, నీవే నా పతివి కావాలని నిన్నే ధ్యానిస్తూ, తప్పక నా ప్రాణాలు నీకే అర్పిస్తాను సుమా!
రుక్మిణీ సందేశంలోని సుమథురమైన పద్యరాజం యిది. భాగవతమే మహా మహిమాన్వితం, అందులో రుక్మిణీ కల్యాణం మహత్వం ఎవరికైనా చెప్పతరమా. – ఆత్మేశ్వరా! పరమాత్మా! ఆత్మజ్ఞాన సంపన్నులు కూడ తమ హృదయాలలోని అవశిష్ఠ అజ్ఞానాంధకార నివారణ కోసం సాత్వికగుణం అభివృద్ధి చేసి తమోగుణం గ్రసించే బ్రహ్మవేత్త లాగ ఏ పరబ్రహ్మ అనే పవిత్ర జ్ఞాన గంగలో లయం కావాలని కోరతారో అట్టి పరబ్రహ్మతో ఈ జన్మలో ఉపరతి జెందలేనిచో ఎన్ని జన్మ లైనా పట్టుబట్టి విడువ కుండా మళ్ళీ మళ్ళీ మరణించే దాకా తపిస్తూనే ఉంటాను అంటున్నది రుక్మిణి అనే జీవాత్మ.

31
ప్రాణేశ! నీ మంజు భాషలు వినలేని;
ర్ణరంధ్రంబుల లిమి యేల?
పురుషరత్నమ! నీవు భోగింపఁగా లేని;
నులతవలని సౌంర్య మేల?
భువనమోహన! నిన్నుఁ బొడగానఁగా లేని;
క్షురింద్రియముల త్వ మేల?
యిత! నీ యధరామృతం బానఁగా లేని;
జిహ్వకు ఫలరససిద్ధి యేల?


నీరజాతనయన! నీ వనమాలికా
గంధ మబ్బలేని ఘ్రాణ మేల?
న్యచరిత! నీకు దాస్యంబు జేయని
న్మ మేల? యెన్ని న్మములకు."
టీక:- ప్రాణేశా = నా పాణమునకు ప్రభువా; నీ = నీ యొక్క; మంజు = మృదువైన; భాషలున్ = మాటలు; వినలేని = వినజాలని; కర్ణరంధ్రంబుల = చెవులు అనెడివి; కలిమి = ఉండి; ఏలన్ = ఎందుకు; పురుష = పురుషులలో; రత్నమ = శ్రేష్ఠుడా; నీవున్ = నీవు; భోగింపగా = రమించుట; లేని = లేనట్టి; తను = దేహమనెడి; లత = తీగ; వలని = అందలి; సౌందర్యము = అందము; ఏలన్ = ఎందుకు; భువన = ఎల్లలోకములను; మోహన = మోహింపజేయువాడ; నిన్నున్ = నిన్ను; పొడగానగాలేని = చూడజాలని; చక్షురింద్రియముల = కళ్ళకున్; సత్వము = పటుత్వము; ఏలన్ = ఎందుకు; దయిత = ప్రియా; నీ = నీ యొక్క; అధరామృతంబు = పెదవుల తీయదనమును; ఆనగాలేని = ఆస్వాదించజాలని; జిహ్వ = నాలుక; కున్ = కు; ఫల = పండ్లను; రస = రుచిచూచుట; సిద్ధి = లభించుట; ఏలన్ = ఎందుకు.
నీరజాతనయన = పద్మాక్షుడా, కృష్ణా; నీ = నీ యొక్క; వనమాలికా = పూల చిగుళ్ళ మాల యొక్క; గంధము = సువాసన; అబ్బలేని = లభింపజాలని; ఘ్రాణము = ముక్కు; ఏలన్ = ఎందుకు; ధన్య = కృతార్థమైన; చరిత = నడవడి కలవాడా; నీ = నీ; కున్ = కు; దాస్యంబు = సేవ; చేయని = చేయజాలని; జన్మము = జీవించుట; ఏలన్ = ఎందుకు; ఎన్ని = ఎన్ని; జన్మములకు = జన్మలెత్తినను {జన్మలెత్తు - పునర్జన్మలు పొందుట}.
భావము:- శ్రీకృష్ణ! నీ మనోఙ్ఞమైన పలుకులు వినలేని చెవులు ఎందుకు దండగ; పురుషోత్తమ! నీవు భోగించని వంటికి అంద మెందుకు దండగ; ప్రాణేశా! నిన్ను చూడలేని కళ్ళకి చూపెందుకు దండగ; ప్రభూ! నీ అధరామృతం అందని నాలుకకు రుచెందుకు దండుగ; పద్మాక్షా! నీ మెడలోని పూలహారం వాసన చూడలేని ముక్కు ఎందుకు దండగ; మహాత్మా! కృష్ణభగవాన్! ఎన్నిజన్మలకైనా నీ సేవచేయలేని దండగమారి జన్మ ఎందుకు; నాకు వద్దయ్యా!”

32
అని యిట్లు రుక్మిణీదేవి పుత్తెంచిన సందేశంబును, రూప సౌంద ర్యాది విశేషంబులును బ్రాహ్మణుండు హరికి విన్నవించి “కర్తవ్యం బెద్ది చేయ నవధరింపు” మని సవర్ణనంబుగా మఱియు నిట్లనియె.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; రుక్మిణీదేవి = రుక్మిణీదేవి; పుత్తెంచిన = చెప్పి పంపించిన; సందేశంబులున్ = వృత్తాంతములు; రూప = రూపము నందలి; సౌందర్య = అందము; ఆది = మున్నగు; విశేషంబులున్ = ప్రత్యేకతలను; బ్రాహ్మణుండు = విప్రుడు; హరి = కృష్ణుని; కిన్ = కి; విన్నవించి = చెప్పి; కర్తవ్యంబు = చేయదగ్గపని; ఎద్ది = ఏదైతే అది; చేయన్ = చేయవలెనని; అవధరింపుము = నిశ్చయించుకొనుము; అని = అని; సవర్ణనంబుగాన్ = రుక్మిణి సౌందర్య వర్ణనల సహితముగా; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా శ్రీకృష్ణునికి బ్రాహ్మణుడు రుక్మిణీదేవి పంపిన సందేశం, ఆమె అందచందాది విశేషాలు వివరంగా చెప్పి “ఏం చేయాలో చూడు” అని విన్నవించి, కుండిన పుత్రిని వర్ణిస్తూ ఇంకా ఇలా చెప్పాడు . .

33
"ల్లవ వైభవాస్పదములు పదములు;
నకరంభాతిరస్కారు లూరు;
రుణప్రభామనోరములు గరములు;
కంబు సౌందర్య మంళము గళము;
హిత భావాభావ ధ్యంబు మధ్యంబు;
క్షురుత్సవదాయి న్నుదోయి;
రిహసితార్ధేందు టలంబు నిటలంబు;
జితమత్త మధుకరశ్రేణి వేణి;


భావజాశుగముల ప్రాపులు చూపులు;
కుసుమశరుని వింటికొమలు బొమలు;
చిత్తతోషణములు చెలువ భాషణములు;
లజనయన ముఖము చంద్రసఖము.
టీక:- పల్లవ = చిగురాకుల యొక్క; వైభవ = గొప్పదనములకు; ఆస్పదములు = ఉనికిపట్లు; పదములున్ = పాదములు; కనక = బంగారపు; రంభా = అరటిబోదెలను; తిరస్కారులు = తిరస్కరించునవి; ఊరులు = తొడలు; అరుణ = ఎఱ్ఱనైన; ప్రభా = కాంతులతో; మనోహరములు = అందమైనవి; కరములు = చేతులు; కంబు = శంఖము వంటి; సౌందర్య = చక్కదనముచేత; మంగళము = శుభప్రదమైనది; గళము = కంఠము; మహిత = గొప్ప; భావాభావమధ్యంబు = బహుసన్ననిది {భావాభావమధ్యంబు - భావ(ఉందో) అభావ (లేనిది) మధ్యంబు (సందేహాస్పదమైనది), ఉందో లేదో తెలియనిది}; మధ్యంబు = నడుము; చక్షుః = కన్నులకు; ఉత్సవ = సంతోషమును; దాయి = ఇచ్చునవి; చన్ను = స్తనముల; దోయి = ద్వయము; పరిహసిత = ఎగతాళి చేయబడిన; అర్ధేందు = అర్ధచంద్రుల యొక్క; పటలంబు = సమూహము కలది; నిటలంబు = నుదురు; జిత = గెలువబడిన; మధుకర = తుమ్మెదల; శ్రేణి = సమూహములు వంటిది; వేణి = జడ
భావజ = మన్మథుని {భావజుడు - సంకల్పము చేత పుట్టువాడు, మన్మథుడు}; ఆశుగముల = బాణముల యొక్క; ప్రాపులు = ఉనికిపట్లు; చూపులు = దృష్టులు; కుసుమశరుని = మన్మథుని {కుసుమశరుడు - పుష్ప భాణములు కలవాడు, మన్మథుడు}; వింటి = ధనుస్సు యొక్క; కొమలు = భాగములు; బొమలు = కనుబొమ్మలు; చిత్త = మనస్సును; తోషణములు = సంతోషింపజేయునవి; చెలువ = అందగత్తె; భాషణములు = మాటలు; జలజనయన = పద్మాక్షి; ముఖము = ముఖము; చంద్ర = చంద్రబింబమునకు; సఖము = మిత్రము, వంటిది.
భావము:- “ఆ పద్మాక్షి రుక్మిణీదేవి పాదాలు చిగురాకుల వంటివి. తొడలు బంగారు అరటిబోదెల కన్న చక్కటివి. చేతులు ఎఱ్ఱటి కాంతులతో మనోహరమైనవి. అందమైన కంఠం శుభకరమైన శంఖం లాంటిది. నడుము ఉందా లేదా అనిపించేంత సన్నటిది. స్తనాల జంట కనువిందు చేస్తుంది. నుదురు అర్థచంద్రుడి కంటె అందమైనది. జడ మత్తెక్కిన తుమ్మెదల బారు లాంటిది. చూపులు మన్మథ బాణాలకి సాటైనవి. కనుబొమలు మన్మథుని వింటి కొమ్ములు. ఆ సుందరి పలుకులు మనసును సంతోషపెట్టేవి. ఆమె మోము చంద్రబింబం లాంటిది.

34
యెలనాగ నీకుఁ దగు; నంగనకుం దగు దీవు మా యుపా
ధ్యాయుల యాన పెండ్లి యగుఁ; ప్పదు జాడ్యములేల? నీవు నీ
తోమువారిఁ గూడుకొని తోయరుహాననఁ దెత్తుగాని వి
చ్చేయుము; శత్రులన్ నుఱుముజేయుము; చేయుము శోభనం బిలన్."
టీక:- ఆ = ఆ యొక్క; ఎలనాగ = యువతి {ఎలనాగ - లేత వయస్కురాలు, వనిత}; నీకున్ = నీకు; తగున్ = సరిపడును; అంగన = వనిత {అంగన - మంచి అంగములు కలామె, స్త్రీ}; కున్ = కు; తగుదువు = సరిపడుదువు; ఈవు = నీవు; మా = మా యొక్క; ఉపాధ్యాయుల = గురువుల మీద; ఆన = ఒట్టు; పెండ్లి = వివాహము; అగున్ = జరుగును; తప్పదు = తథ్యమిది; జాడ్యములు = ఆలసించుటలు; ఏలన్ = ఎందుకు; నీవున్ = నీవు; నీ = నీ యొక్క; తోయమువారిన్ = సేనతో; కూడుకొని = కలిసి; తోయరుహాననన్ = పద్మాక్షిని; తెత్తుగాని = తీసుకువచ్చెదవుగాని; విచ్చేయుము = రమ్ము; శత్రులన్ = విరోధులను; నుఱుము = పొడిగా, మర్ధించుట; చేయుము = చేయుము; చేయుము = చేయుము; శోభనంబు = శుభములను; ఇలన్ = లోకమునకు.
భావము:- ఆ యువతి రుక్మణీదేవి నీకు తగినది. ఆమెకు వాసుదేవ! నీవు తగిన వాడవు. మా గురువులము ఇస్తున్న ఆనతి ఇది. మీ పెళ్ళి జరిగి తీరుతుంది. ఇంక ఆలస్యం ఎందుకు. నువ్వు నీ సేనతో కలిసి కన్యను తీసుకొచ్చెదవుగాని రమ్ము. శత్రువుల్ని నుగ్గునుగ్గుచేయుము. లోకానికి శుభాలు కలిగించుము.”

వాసుదే వాగమన నిర్ణయము

35
అని యిట్లు పలికిన బ్రాహ్మణునివలన విదర్భరాజతనయ పుత్తెంచిన సందేశంబును, రూప సౌందర్యాదివిశేషంబులును విని, యవధరించి నిజకరంబున నతని కరంబుఁబట్టి నగుచు న య్యాదవేంద్రుం; డిట్లనియె
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; పలికిన = చెప్పిన; బ్రాహ్మణుని = విప్రుని; వలన = వలన; విదర్భరాజతనయ = రుక్మిణీదేవి {విదర్భ రాజ తనయ - విదర్భరాజు (భీష్మకుడు) యొక్క పుత్రిక, రుక్మిణి}; పుత్తెంచిన = పంపించిన; సందేశంబున్ = సమాచారము; రూప = చక్కదనము; సౌందర్య = అందము; ఆది = మున్నగు; విశేషంబులున్ = విశిష్టతలను; విని = విని; అవధరించి = సమ్మతించి; నిజ = తన యొక్క; కరంబునన్ = చేతితో; అతని = అతని యొక్క; కరంబున్ = చేతిని; పట్టి = పట్టుకొని; నగుచున్ = నవ్వుతు; ఆ = ఆ యొక్క; యాదవేంద్రుండు = కృష్ణుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా పలికిన బ్రాహ్మణుడి ద్వారా రుక్మిణి పంపిన సందేశం, ఆమె చక్కదనాలు అవి గ్రహించి, శ్రీకృష్ణుడు అతని చేతులో చేయ్యేసి నవ్వుతూ ఇలా అన్నాడు.

36
"న్నియమీఁద నా తలఁపు గాఢము; కూరుకురాదు రేయి నా
కెన్నఁడు; నా వివాహము సహింపక రుక్మి దలంచు కీడు నే
మున్నె యెఱుంగుదున్; బరులమూఁక లడంచి కుమారిఁ దెత్తు వి
ద్వన్నుత! మ్రానుఁ ద్రచ్చి నవహ్నిశిఖన్ వడిఁదెచ్చు కైవడిన్.
టీక:- కన్నియ = కన్యక; మీదన్ = పైన; నా = నా యొక్క; తలపు =కోరిక; గాఢము = దృఢముగా నున్నది; కూరుకు = నిద్ర; రాదు = రాదు; రేయి = రాత్రు లందు; నా = నా; కున్ = కు; ఎన్నడున్ = ఎప్పుడు; నా = నా తోడి; వివాహమున్ = పెండ్లిని; సహింపక = ఓర్వజాలక; రుక్మి = రుక్మి; తలంచున్ = తలపెట్టును; కీడు = చెరుపును; నేన్ = నేను; మున్న = ముందుగనే; ఎఱుంగుదున్ = తెలిసియుంటిని; పరుల = శత్రువుల; మూక = సమూహమును; వధించి = చంపి; కుమారిన్ = కన్యకను; తెత్తున్ = తీసుకు వచ్చెదను; విద్వన్ = విద్వాంసులచేత; నుత = పొగడబడువాడ; మ్రానున్ = కఱ్ఱను; త్రచ్చి = మథించి; నవ = కొత్త; వహ్ని = అగ్ని; శిఖన్ = మంటను; వడిన్ = వేగముగా; తెచ్చు = తీసుకు వచ్చెడి; కైవడిన్ = విధముగ.
భావము:- “విద్వాంసుల ప్రసంశలు గైకొన్న బ్రాహ్మణోత్తమా ! రుక్మిణిపై నాకు గాఢానురక్తి గలదు. ఆమెపైన తలపులవలన నాకు నిద్ర రాదు. ఆమెతో నా వివాహము నోర్చని రుక్మి యొక్క దురాలోచనలు నాకు తెలుసు. శత్రుమూకల నణచి , కట్టెను మథించి దీపశిఖను తెచ్చునట్లు ఆమెను నేను తీసుకువస్తాను.

37
చ్చెద విదర్భభూమికిఁ;
జొచ్చెద భీష్మకుని పురము; సురుచిరలీలన్
దెచ్చెద బాలన్ వ్రేల్మిడి
వ్రచ్చెద నడ్డంబు రిపులు చ్చినఁ బోరన్."
టీక:- వచ్చెదన్ = వస్తాను; విదర్భ = విదర్భ అనెడి; భూమి = దేశమున; కిన్ = కు; చొచ్చెదన్ = చొరబడెదను; భీష్మకునిపురము = కుండిననగరమునందు; సురుచిర = మనోహరమైన; లీలన్ = విధముగ; తెచ్చెదన్ = తీసుకు వచ్చెదను; బాలన్ = బాలికను; వ్రేల్మిడిన్ = చిటికలో; వ్రచ్చెదన్ = చించెదను; అడ్డంబున్ = అడ్డగించుటకు; రిపులు = శత్రువులు; వచ్చినన్ = వచ్చినచో; పోరన్ = యుద్ధమునందు.
భావము:- విదర్భలోని భీష్మకుని కుండినపురానికి వస్తాను. రుక్మిణీబాలను అలవోకగా తీసుకు వస్తాను. అడ్డం వచ్చే శత్రువులను యుద్ధము చేసి చిటికలో చీల్చి చెండాడుతాను.” అని విప్రునితో అంటున్నాడు శ్రీకృష్ణుడు.

38
అని పలికి, రుక్మిణీదేవి పెండ్లినక్షత్రంబుఁ దెలిసి, దన పంపున రథసారథి యైన దారకుండు సైబ్య సుగ్రీవ మేఘ పుష్పవలాహకంబు లను తురంగంబులం గట్టి రథమాయత్తంబు చేసి తెచ్చిన నమోఘ మనోరథుండైన హరి తానును, బ్రాహ్మణుండును రథారోహణంబు సేసి యేకరాత్రంబున నానర్తకదేశంబులు గడచి, విదర్భదేశంబునకుఁ జనియె; నందు కుండినపురీశ్వరుండైన భీష్మకుండు కొడుకునకు వశుండై కూఁతు శిశుపాలున కిత్తునని తలంచి, శోభనోద్యోగంబులు చేయించె; నప్పుడు.
టీక:- అని = అని; పలికి = చెప్పి; రుక్మిణీదేవి = రుక్మిణీదేవి యొక్క; పెండ్లి = వివాహపు; నక్షత్రంబున్ = ముహూర్తమును; తెలిసి = తెలిసికొని; తన = అతని యొక్క; పంపునన్ = ఆజ్ఞ ప్రకారము; రథ = రథమును; సారథి = నడుపువాడు; ఐన = అయిన; దారకుండు = దారకుడు; సైబ్య = సైబ్య; సుగ్రీవ = సుగ్రీవ; మేఘపుష్ప = మేఘపుష్ప; వలాహకంబులు = వలాహకము; అను = అనెడి; తురంగంబులన్ = గుఱ్ఱములను; కట్టి = కట్టి; రథమున్ = రథమును; ఆయత్తంబు = సిద్ధము; చేసి = చేసి; తెచ్చినన్ = తీసుకురాగా; అమోఘ = తిరుగులేని; మనోరథుండు = కోరిక కలవాడు; ఐన = అయిన; హరి = కృష్ణుడు; తానును = అతను; బ్రాహ్మణుండును = విప్రుడు; రథ = రథమును; ఆరోహణంబున్ = ఎక్కుట; చేసి = చేసి; ఏక = ఒకే; రాత్రంబునన్ = రాత్రిలోనే; ఆనర్తకదేశంబులన్ = ఆనర్తకదేశములను {ఆనర్తము – పశ్చిమ సముద్ర తీరమున ద్వారక సమీపమున గల దేశము} గడచి = దాటి; విదర్భదేశంబున్ = విదర్భ అనెడి దేశమున {విదర్భ – ఇప్పటి బీరారు, బీదరు ప్రాంతము}; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; అందున్ = అక్కడ; కుండినపుర = కుండిన నగరమునకు; ఈశ్వరుండు = ప్రభువు; ఐన = అయిన; భీష్మకుండు = భీష్మకుడు; కొడుకున్ = పుత్రుని; కున్ = కి; వశుండు = లొంగినవాడు; ఐ = అయ్యి; కూతున్ = కుమార్తెను; శిశుపాలున్ = శిశుపాలుడి; కున్ = కి; ఇత్తున్ = భార్యగా ఇచ్చెదను; అని = అని; తలచి = ఎంచి; శోభన = శుభకార్య; ఉద్యోగంబులు = ప్రయత్నములు; చేయించెన్ = చేయించెను; అప్పుడు = ఆ సమయమునందు.
భావము:- ఇలా చెప్పి, రుక్మిణి పెళ్ళి ముహుర్తం కృష్ణుడు తెలుసు కొన్నాడు. కృష్ణుని ఉత్తర్వు ప్రకారం రథసారథి యైన దారకుడు "సైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకము" లనే గుఱ్ఱములు నాలుగింటిని కట్టిన రథం సిద్దం చేసాడు. వాసుదేవుడు బ్రాహ్మణునితోబాటు రథ మెక్కాడు. ఒక్క రాత్రిలోనే ఆనర్తకదేశాలు దాటి కుండినపురం చేరాడు. ఆ సమయములో అక్కడ, కొడుకునకు వశవర్తుడు అయిన భీష్మకుడు కూతుర్ని చైద్యునికి ఇద్దామనుకుంటు పెళ్ళి ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

39
చ్చలు గ్రంతలు రాజమార్గంబులు;
విపణిదేశంబులు విశదములుగఁ
జేసిరి; చందనసిక్త తోయంబులు;
లయంగఁ జల్లిరి; లువడములు
మణీయ వివిధతోణములుఁ గట్టిరి;
కల గృహంబులు క్కఁ జేసి;
ర్పూర కుంకు మారుధూపములు పెట్టి;
తివలుఁ బురుషులు న్ని యెడల


వివిధవస్త్రములను వివిధమాల్యాభర
ణానులేపనముల మరి యుండి
ఖిల వాద్యములు మహాప్రీతి మ్రోయించి
రుత్సవమున నగర మొప్పియుండె.
టీక:- రచ్చలు = రథ్యలు, రథబాటలు; క్రంతలు = చిన్నవీధులు, సందులు; రాజమార్గంబులు = ప్రధానమార్గములు; విపణి = వ్యాపార; దేశంబులున్ = ప్రదేశములు; విశదములుగా = శుభ్రపరచినవిగా; చేసిరి = చేసిరి; చందన = మంచిగంధము; సిక్త = కలిపిన; తోయంబులున్ = నీళ్ళు; కలయన్ = అంతటను, కళ్ళాపి; చల్లిరి = చల్లిరి; కలువడములు = కలువలసరములు {కలువడములు - స్తంభమునకు వేలాడదీసిన కలువపూల దండ}; రమణీయ = అందమైన; వివిధ = నానావిధములైన; తోరణములున్ = తోరణములను; కట్టిరి = కట్టిరి; సకల = ఎల్ల; గృహంబులున్ = గృహములను; చక్కజేసి = బాగుపరచి; కర్పూర = పచ్చకర్పూరము; కుంకుమ = కుంకుమపువ్వు; అగరు = అగరుచెక్కల; ధూపములున్ = పొగధూపములను; పెట్టిరి = పట్టించిరి; అతివలు = ఆడవారు; పురుషులున్ = మగవారు; అన్ని = సర్వ; ఎడలన్ = ప్రదేశములందు.
వివిధ = రకరకముల; వస్త్రములను = బట్టలు; వివిధ = అనేకరకములైన; మాల్య = పూదండలు; ఆభరణ = భూషణములు; అనులేపనములన్ = మైపూతలతో; అమరి = అలంకరించుకొని; ఉండిరి = ఉన్నారు; అఖిల = ఎల్ల; వాద్యములున్ = వాయిద్యములను; మహా = మిక్కిలి; ప్రీతిన్ = ప్రేమతో; మ్రోయించిరి = వాయించిరి; ఉత్సవమునన్ = వేడుకలతో; నగరము = పట్టణము; ఒప్పి = చక్కగానై; ఉండె = ఉండెను.
భావము:- ఆ కుండిన నగర మంతా ఉత్సాహంతో వెలిగిపోతోంది. వీధులు, సందులు, రాజమార్గాలు, బజార్లు అన్ని శుభ్రం చేసారు. మంచి గంధం కలిపిన నీళ్ళు కళ్ళాపి జల్లారు. కలువపూల దండలు మనోహరమైన తోరణాలు కట్టారు. నగరంలోని ఇళ్ళన్ని శుభ్ర పరచారు. సుగంధ ధూపాలు పట్టారు. ప్రతిచోట రకరకాల పూలు, బట్టలు, అలంకారాలు స్త్రీ పురుషులు ధరించారు. ప్రజలు సంతోషంతో మంగళ వాద్యాలు అన్నిటిని గట్టిగా వాయిస్తున్నారు.

40
అంత నా భీష్మకుండు విహితప్రకారంబునం బితృదేవతల నర్చించి బ్రాహ్మణులకు భోజనంబులు పెట్టించి, మంగళాశీర్వచనంబులు చదివించి, రుక్మిణీదేవి నభిషిక్తంజేసి వస్త్రయుగళభూషితం గావించి రత్నభూషణంబు లిడంజేసి, ఋగ్యజుస్సామధర్వణ మంత్రంబుల మంగళాచారంబు లొనరించి, భూసురులు రక్షాకరణంబు లాచరించిరి; పురోహితుండు గ్రహశాంతికొఱకు నిగమనిగదితన్యాయంబున హోమంబు గావించె; మఱియు నా రాజు దంపతుల మేలుకొఱకుఁ దిల ధేను కలధౌత కనక చేలాది దానంబులు ధరణీదేవతల కొసంగెను; అయ్యవసరంబున.
టీక:- అంతన్ = అంతట; ఆ = ఆ యొక్క; భీష్మకుండు = భీష్మకుడు; విహిత = పద్దతి; ప్రకారంబునన్ = ప్రకారముగా; పితృదేవతలన్ = పితృ దేవతలను; అర్చించి = పూజించి; బ్రాహ్మణుల్ = విప్రుల; కున్ = కు; భోజనంబులున్ = అన్నములు; పెట్టించి = పెట్టించి; మంగళ = శుభప్రదమైన; ఆశీర్వచనంబులున్ = దీవనల తోడి మంత్రములను; చదివించి = పఠింపజేసి; రుక్మిణీదేవినిన్ = రుక్మిణిని; అభిషిక్తన్ = స్నానమాచరింపబడి నామెగ; చేసి = చేసి; వస్త్ర = వస్త్రముల; యుగళ = జతచేత; భూషితన్ = అలంకరింపబడి నామెగా; కావించి = చేసి; రత్న = రత్నాల; భూషణంబులు = ఆభరణములు; ఇడి = పెట్టి, ధరింపజేసి; ఋక్ = ఋగ్వేద; యజుః = యజుర్వేద; సామ = సామవేద; మంత్రంబులన్ = మంత్రములచేత; మంగళ = శుభ; ఆచారంబులన్ = కార్యములను; ఒనరించి = చేసి; భూసురులు = విప్రులు; రక్షాకరణంబులు = రక్షజేయుటలు; ఆచరించిరి = చేసిరి; పురోహితుండు = ఆస్థాన విప్రుడు; గ్రహశాంతి = నవగ్రహముల శాంతి; కొఱకు = కోసము; నిగమ = వేదములలో; నిగదిత = చెప్పబడిన; న్యాయంబునన్ = ప్రకారముగా; హోమంబు = అగ్నిహోత్రమును; కావించె = నిర్వహించెను; మఱియున్ = ఇంకను; ఆ = ఆ; రాజు = రాజు; దంపతుల = నవదంపతుల; మేలు = శ్రేయస్సు; కొఱకు = కోసము; తిల = నువ్వులు; ధేను = గోవులు; కలధౌత = రజత (వెండి); కనక = స్వర్ణ (బంగారము); చేలా = వస్త్రములు; ఆది = మున్నగు; దానంబులున్ = దానములను; ధరణీదేవతల్ = బ్రాహ్మణుల; కున్ = కు; ఒసంగెను = ఇచ్చెను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు.
భావము:- భీష్మకుడు పద్ధతి ప్రకారం పితృదేవతలని పూజించి, విప్రులకి భోజనాలు పెట్టించాడు. ఆశీర్వచనాలు చదివించాడు. రుక్మిణికి స్నానం చేయించి, కొత్తబట్టలు, రత్నాభరణలుతో అలంకరించారు. బ్రాహ్మణులు వేద మంత్రాలతో రక్షాకరణాలు చేసారు. పురోహితుడు వేదాల్లో చెప్పిన విధంగా హోమం చేసాడు. దంపతులకు శుభం కోసం విప్రులకు తిలా, గో, రజత, స్వర్ణ, వస్త్రాది దానాలు చేసాడు. అప్పుడు.
మన సంప్రదాయాలను ఎంతో అలవోకగా వర్ణించిన చక్కటి వచనం యిది. ఏదైనా శుభకార్యం ఆరంభించే సమయంలో, పెద్దలను సన్మానించాలి, విప్రులను తృప్తిపరచాలి, వారి ఆశీర్వచనాలు తీసుకోవాలి, అభ్యంగన స్నానాలు చేయాలి, శుభ్రమైన వస్త్రాలు, సకల శోభనకర అలంకారలు అలంకరించుకోవాలి, శాంతులు పూజలు దానాలు చేయాలి. ఈ సత్సంప్రదాయాలు ఎన్నో శతాబ్దాలనుండి ఆచరణలో ఉన్నాయి. సంకల్ప బల, పారిశుధ్య విలువలతో కూడిన మన సదాచారాలు కాలపరీక్షకు తట్టుకొని నిలబడ్డాయి. కనుక వాటిని వదలరాదు.

41
సంఘంబులతో రథావళులతో ద్రేభయూథంబుతోఁ
టువేగాన్విత ఘోటకవ్రజముతో బంధుప్రియశ్రేణితోఁ
టుసంరంభముతో విదర్భతనయం గైకొందు నంచున్ విశం
వృత్తిం జనుదెంచెఁ జైద్యుఁడు గడున్ ర్వించి య వ్వీటికిన్.
టీక:- భటసంఘంబుల్ = పదాతిదళముల; తోన్ = తోటి; రథా = రథముల; ఆవళుల్ = దళముల; తోన్ = తోటి; భద్ర = భద్రజాతి {భద్రము - శుభకార్యములందు పురప్రచార యోగ్యమైనది ఈ జాతి ఏనుగు}; ఇభ = గజ {త్రివిధగజజాతులు - 1భద్రము 2మందము 3మృగము}; యూథంబు = దళముల; తోన్ = తోటి; పటు = మిక్కుటమైన; వేగ = వేగముగా పోవుట; ఆన్విత = కలిగిన; ఘోటక = అశ్వ; వ్రజము = దళముల; తోన్ = తోటి; బంధు = బంధువుల; ప్రియ = ఇష్టుల; శ్రేణి = సమూహముల; తోన్ = తోటి; కటు = అధికమైన; సంరంభము = ఆటోపము; తోన్ = తోటి; విదర్భతనయన్ = రుక్మిణిని {విదర్భతనయ - విదర్భరాజు కుమార్తె, రుక్మిణి}; కైకొందున్ = చేపట్టెదను; అంచున్ = అని; విశంకటవృత్తిన్ = గొప్పగా; చనుదెంచెన్ = వచ్చెను; చైద్యుడు = శిశుపాలుడు; కడున్ = మిక్కిలి; గర్వించి = అహంకరించి; ఆ = ఆ యొక్క; వీటి = ఊరున, కుండినగరమున; కిన్ = కు.
భావము:- విదర్భ రాకుమారి రుక్మిణిని పెళ్ళాడతానంటు శిశుపాలుడు ఎంతో గర్వంగా చతురంగ బలాలతో, ఎందరో కాల్బంటులుతో, రథాల వరుసలుతో, భద్రగజాల సమూహంతో, మిక్కిలి వేగవంతమైన గుఱ్ఱాల సైన్యంతో, బంధువులతో, చెలికాళ్ళతో గొప్ప అట్టహాసంగా ఆ కుండిన నగరానికి వచ్చాడు.

42
"బంధులఁ గూడి కృష్ణబలద్రులు వచ్చినఁ బాఱదోలి ని
ర్మంర వృత్తిఁ జైద్యునికి మానినిఁ గూర్చెద" మంచు నుల్లస
త్సింధుర వీర రథ్య రథ సేనలతోఁ జనుదెంచి రా జరా
సంధుఁడు దంతవక్త్రుఁడును సాల్వ విదూరక పౌండ్రకాదులున్.
టీక:- బంధులన్ = బంధువులతో; కూడి = కలిసి; కృష్ణ = కృష్ణుడు; బలభద్రులున్ = బలరాములు; వచ్చినన్ = వచ్చినచో; పాఱదోలి = తరిమి వేసి; నిర్మంథర = త్వరగా పోవు {నిర్మంథరము - మంథరము (మెల్లగా సాగుట) లేకుండునది}; వృత్తిన్ = విధానములో; చైద్యున్ = శిశుపాలుని; కున్ = కి; మానిని = వనితను; కూర్చెదము = కలిపెదము; అంచున్ = అని; ఉల్లసత్ = ఉత్సహించుచున్న; సింధుర = ఏనుగుల; వీర = శూరులైన భటుల; రథ్య = అశ్వ; రథ = రథ; సేనల = సైనికదండు; తోన్ = తోటి; చనుదెంచిరి = వచ్చిరి; ఆ = ఆ యొక్క; జరాసంధుడు = జరాసంధుడు; దంతవక్త్రుడును = దంతవక్త్రుడు; సాల్వ = సాల్వుడు {సాల్వుడు - సాల్వదేశాధీశుడు}; విదూరక = విదూరకుడు; పౌండ్రక = పౌండ్రకవాసుదేవుడు; ఆదులున్ = మొదలగువారు.
భావము:- జరాసంధుడు, దంతవక్త్రుడు, సాల్వుడు, విదూరకుడు, పౌండ్రకుడు మొదలైన వాళ్ళంతా “బలరామ కృష్ణులు బంధువు లందరను తోడు తెచ్చుకొని వచ్చినా సరే తరిమేస్తాం. శిశిపాలుడికి బాలికను ఇచ్చి ఏ ఇబ్బంది లేకుండా కట్ట బెడతాం.” అంటూ చతురంగబలాలతో వచ్చారు.

43
మఱియు నానాదేశంబుల రాజు లనేకు లేతెంచి; రందు శిశుపాలు నెదుర్కొని పూజించి భీష్మకుం డొక్కనివేశంబున నతని విడియించె; నంతఁ దద్వృత్తాంతంబు విని.
టీక:- మఱియున్ = ఇంకను; నానా = పెక్కు; దేశంబుల = దేశములకు చెందిన; రాజులు = ఏలికలు; అనేకులు = అనేకమంది; ఏతెంచిరి = వచ్చిరి; అందున్ = వారిలో; శిశుపాలున్ = శిశుపాలుని; ఎదుర్కొని = ఎదురువెళ్ళి; పూజించి = గౌరవించి; భీష్మకుండు = భీష్మకుడు; ఒక్క = ఒకానొక; నివేశంబునన్ = నివాసమునందు; అతనిన్ = అతనిని; విడియించెన్ = విడిదిలో ఉంచెను; అంతన్ = తరువాత; తత్ = ఆ యొక్క; వృత్తాంతంబు = విషయము; విని = విని.
భావము:- ఇంకా వివిధదేశాలనుండి అనేకమంది రాజులు వచ్చారు. భీష్మకుడు వారిలో శిశుపాలుడికి ఎదుర్కోలు మొదలైన మర్యాదలు చేసి తగిన విడిది ఏర్పాటు చేసాడు. ఈ విషయాలు తెలిసి.

44
"రి యొకఁ డేగినాఁడు మగధాదులు చైద్యహితానుసారులై
పతు లెందఱేనిఁ జనినారు కుమారికఁ దెచ్చుచోట సం
మగుఁ దోడు గావలయుఁ గంసవిరోధికి" నంచు వేగఁ దా
రిగె హలాయుధుండు గమలాక్షుని జాడ ననేక సేనతోన్.
టీక:- హరి = కృష్ణుడు; ఒకడు = ఒక్కడే; ఏగినాడు = వెళ్ళాడు; మగధ = జరాసంధుడు; ఆదులున్ = మున్నగువారు; చైద్య = శిశుపాలునికి; హితానుసారులు = మేలుకోరువారు; ఐ = అయ్యి; నరపతులు = రాజులు; ఎందఱేని = ఎంతోమంది; చనినారు = వెళ్ళిరి; కుమారికన్ = కన్యకను; తెచ్చుచోటన్ = తీసుకువచ్చే టప్పుడు; సంగరము = యుద్ధము; అగున్ = జరుగును; తోడు = సహాయము; కావలయున్ = అవసర మగును; కంసవిరోధి = కృష్ణుని; కిన్ = కి; అంచున్ = అని; వేగన్ = వేగముగా; తాన్ = అతను; అరిగెన్ = వెళ్ళెను; హలాయుధుండు = బలరాముడు {హలాయుధుడు - హల (నాగలి) ఆయుధము కలవాడు, బలరాముడు}; కమలాక్షుని = పద్మాక్షుని, కృష్ణుని; జాడన్ = దారిని, వెనుకనే; అనేక = పెక్కు; సేన = సేనల; తోన్ = తోటి.
భావము:- బలరాముడు “అయ్యో! కృష్ణుడు ఒంటరిగా వెళ్ళాడు జరాసంధుడు మున్నగువారు శిశుపాలునికి సాయంగా వెళ్ళారు; బాలికను తెచ్చేటప్పుడు యుద్ధం తప్పదు; కృష్ణుడికి సాయం అవసరం” అంటూ బలరాముడు కృష్ణుడు వెళ్ళిన దారి వెనుక సైన్యం తీసుకొని వెళ్ళాడు.

45
లోపల నేకతమున
నాలోలవిశాలనయన గు రుక్మిణి ద
న్నా లోకలోచనుఁడు హరి
యాలోకము చేసి కదియఁ ని శంకితయై.
టీక:- ఆలోపలన్ = ఆ సమయమునందు; ఏకతమునన్ = ఏకాంతముగ; ఆలోల = చలించెడి; విశాల = పెద్దపెద్ద; నయన = కనులు గలామె; అగు = ఐన; రుక్మిణి = రుక్మిణీదేవి {రుక్మిణి - రుక్మము (బంగారము) కలిగినామె}; తన్నున్ = ఆమెను; ఆ = ఆ ప్రసిద్ధుడైన; లోకలోచనుడు = కృష్ణుడు {లోకలోచనుడు - లోకప్రకాశకులైన సూర్య చంద్రులు కన్నులుగా కలవాడు, విష్ణువు}; హరి = కృష్ణుడు; ఆలోకము = చూసి; కదియడు = సమీపించడు; అని = అని; శంకిత = సంశయము కలది; ఐ = అయ్యి.
భావము:- ఇంతట్లో చలించుతున్న పెద్ద పెద్ద కళ్ళున్న ఆ రుక్మిణీదేవి తనలోతాను తన ఏకాంతమందిరంలో “సూర్యచంద్రులు కన్నులుగా ఉండుట వల్ల లోకాలకు చూసే శక్తిని ఇచ్చేవాడైన కృష్ణుడు ఏకారణంచేతనైనా తన మీద దృష్టిపెట్టి తనను చేరరాడేమో” నని బెంగపెట్టుకుంది. ఇంకా ఇలా అనుకోసాగింది . . .

46
"గ్నం బెల్లి; వివాహముం గదిసె, నేలా రాఁడు గోవిందుఁ? డు
ద్విగ్నం బయ్యెడి మానసంబు; వినెనో వృత్తాంతమున్? బ్రాహ్మణుం
గ్నిద్యోతనుఁ డేటికిం దడసె? నా త్నంబు సిద్ధించునో?
గ్నంబై చనునో? విరించికృత మెబ్భంగిన్ బ్రవర్తించునో?
టీక:- లగ్నంబున్ = ముహూర్తము; ఎల్లి = రేపు; వివాహమున్ = పెండ్లిసమయము; కదిసెన్ = దగ్గరైనది; ఏలా = ఎందుకు; రాడు = రాలేదు; గోవిందుడు = కృష్ణుడు {గోవిందుడు - గోవులకు ఒడయుడు, కృష్ణుడు}; ఉద్విగ్నంబు = కలవరపడినది; అయ్యెడిన్ = అగుచున్నది; మానసంబున్ = మనస్సు; వినెనో = విన్నాడో లేదో; వృత్తాంతమున్ = సమాచారమును; బ్రాహ్మణుండు = విప్రుడు; అగ్నిద్యోతనుడు = అగ్నిద్యోతనుడు; ఏటికి = ఎందుచేత; తడసెన్ = ఆలస్యము చేసెను; నా = నా యొక్క; యత్నంబున్ = ప్రయత్నము; సిద్ధించునో = ఫలించునో లేదో; భగ్నంబై = చెడిపోయినది; ఐచనునో = అయిపోవునేమో; విరించి = బ్రహ్మదేవుని {విరించి - వివరముగా రచించువాడు, బ్రహ్మ}; కృతము = వ్రాసిపెట్టినది; ఎబ్భంగి = ఏ విధముగ; ప్రవర్తించునో = నడచునో.
భావము:- “నా మనసు ఉద్విగ్నంగా ఉంది. లగ్నం రేపే. ముహూర్తము దగ్గరకు వచ్చేసింది. వాసుదేవుడు ఇంకా రాలేదు ఎందుకో? నా మాట విన్నాడో లేదో? బ్రాహ్మణుడు అగ్నిద్యోతనుడు ఎందుకింత ఆలస్యం చేస్తున్నాడు? నా ప్రయత్నం ఫలిస్తుందో లేదో? బ్రహ్మదేవుడు ఏం రాసిపెట్టాడో? – (అంటు రుక్మిణి డోలాయమాన మనసుతో సందేహిస్తోంది.)

47
ను డా భూసురు డేగెనో? నడుమ మార్గశ్రాంతుఁడై చిక్కెనో?
విని, కృష్ణుం డిది తప్పుగాఁ దలఁచెనో? విచ్చేసెనో? యీశ్వరుం
నుకూలింపఁ దలంచునో తలఁపడో? యార్యామహాదేవియున్
ను రక్షింప నెఱుంగునో? యెఱుఁగదో? నా భాగ్య మెట్లున్నదో?"
టీక:- ఘనుడు = గొప్పవాడు; ఆ = ఆ యొక్క; భూసురుడు = విప్రుడు; ఏగెనో = వెళ్ళాడో లేదో; నడుమన్ = మధ్యలో; మార్గ = ప్రయాణపు; శ్రాంతుడు = బడలిక చెందినవాడు; ఐ = అయ్యి; చిక్కెనో = చిక్కుబడిపోయెనేమో; విని = విన్నవాడై; కృష్ణుండు = కృష్ణుడు; అది = దానిని; తప్పు = తప్పు; కాన్ = అయినట్లు; తలచెనో = భావించెనేమో; విచ్చేసెనో = వచ్చెనేమో; ఈశ్వరుండు = భగవంతుడు; అనుకూలింపన్ = అనుకూలించవలెనని; తలంచునో = ఎంచునో; తలపడో = ఎంచకుండునో; ఆర్యామహాదేవియున్ = పార్వతీదేవి {ఆర్య - శ్రేష్ఠురాలు, పార్వతి, మహాదేవి - పార్వతి}; ననున్ = నన్ను; రక్షింపన్ = కాపాడవలెనని; ఎఱుంగునో = గుర్తించినదో; ఎఱుగదో = గుర్తించలేదో; నా = నా యొక్క; భాగ్యము = అదృష్టము; ఎట్లున్నదో = ఎలా ఉందో.
భావము:- ఆ బ్రాహ్మణుడు అసలు వెళ్ళాడో లేదో? లేకపోతే దారిలో ఎక్కడైనా చిక్కుకు పోయాడేమో? నా సందేశం విని కృష్ణుడు తప్పుగా అనుకున్నాడేమో? పార్వతీదేవి నన్ను కాపాడలనుకుందో లేదో? నా అదృష్టమెలా ఉందో?”
అంటు ఎంతో ఆత్మవిశ్వాసంతో బ్రాహ్మణుని పంపిన రుక్మిణీదేవి, డోలాయమాన స్థితి పొందుతోంది. ఆ స్థితికి తగ్గ ఈ పద్యం చెప్పిన మన పోతన్నకి ప్రణామములు.

48
అని వితర్కించుచు.
టీక:- అని = అని; వితర్కించుచున్ = తనలోతాను అనుకొనుచు.
భావము:- అంటు రుక్మిణి డోలాయమాన మనసుతో సందేహిస్తూ ఇంకా ఇలా అనుకోసాగింది.

49
"పోఁ"ను "బ్రాహ్మణుండు యదుపుంగవు వీటికి; వాసుదేవుఁడున్
"రాఁ" ను;"నింకఁ బోయి హరి మ్మని చీరెడి యిష్టబంధుడున్
"లేఁ" ను;"రుక్మికిం దగవు లే, దిటఁ జైద్యున కిత్తు నంచు ను
న్నాఁ" ను;"గౌరి కీశ్వరికి నావలనం గృపలేదు నే" డనున్.
టీక:- పోడు = వెళ్ళి ఉండడు; అనున్ = అనును; బ్రాహ్మణుండు = విప్రుడు; యదుపుంగవు = కృష్ణుని {యదుపుంగవుడు - యాదవ వంశస్థులలో శ్రేష్ఠుడు, కృష్ణుడు}; వీటి = నగరమున; కిన్ = కు; వాసుదేవుడున్ = కృష్ణుడు {వాసుదేవుడు - వసుదేవుని కొడుకు, కృష్ణుడు}; రాడు = వచ్చుటలేదు; ఇంకన్ = ఇంకను; పోయి = వెళ్ళి; హరిన్ = కృష్ణుని; రమ్ము = రావలసినది; అని = అని; చీరెడు = పిలిచెడు; ఇష్ట = ఆప్తుడైన; బంధుడున్ = మేలుకోరువాడు; లేడు = ఎవడు లేడు; అనున్ = అనును; రుక్మి = రుక్మి {రుక్మి - రుక్మిణి పెద్దన్న}; కిన్ = కి; తగవు = న్యాయము; లేదు = లేదు; ఇటనే = ఇక్కడ; చైద్యున్ = శిశుపాలుని; కిన్ = కి; ఇత్తున్ = ఇస్తాను; అంచున్ = అనుచు; ఉన్నాడు = ఎంచి ఉన్నాడు; అనున్ = అనును; గౌరి = పార్వతీదేవి {గౌరి - గౌరవర్ణము కలామె, పార్వతి}; కిన్ = కి; ఈశ్వరి = పరమేశ్వరి; కిన్ = కి; నా = నా; వలనన్ = ఎడల; కృప = దయ; లేదు = లేదు; నేడు = ఇవాళ; అనున్ = అనును.
భావము:- “మాధవుని మథురకి బ్రాహ్మణుడు అసలు వెళ్ళే వెళ్ళి ఉండడు. వాసుదేవుడు ఇంక రాడు. పిలుచుకు వచ్చే ప్రియ బాంధవుడు ఇంకొకడు లేడు. అన్న రుక్మికి అడ్డేం లేదు. శిశుపాలుడికి ఇచ్చేస్తానంటున్నాడు. ఇవాళ పార్వతీదేవికి నామీద దయలేదు కాబోలు” అని రకరకాలుగా మథనపడుతోంది.

50
చెప్పదు తల్లికిం దలఁపు చిక్కు; దిశల్ దరహాస చంద్రికం
ప్పదు; వక్త్రతామరసగంధ సమాగత భృంగసంఘమున్
రొప్పదు; నిద్ర గైకొన; దురోజ పరస్పర సక్త హారముల్
విప్పదు; కృష్ణమార్గగత వీక్షణపంక్తులు ద్రిప్ప దెప్పుడున్.
టీక:- చెప్పదు = తెలుపదు; తల్లి = తల్లి; కిన్ = కి; తలపుచిక్కు = మనసులోని విచారమును; దిశల్ = దిక్కు లందు; దరహాస = చిరునవ్వుల; చంద్రికం = వెన్నెలను; కప్పదు = ఆవరింపజేయదు; వక్త్ర = ముఖము అనెడి; తామరస = పద్మము యొక్క; గంధ = సువాసనచే; సమాగత = చేరిన; భృంగ = తుమ్మెదల; సంఘమున్ = సమూహమును; రొప్పదు = అదిలించదు; నిద్రన్ = నిద్రపోవుట; కైకొనదు = చేయదు; ఉరోజ = వక్షస్థలమునందు; పరస్పర = ఒకదానితో నొకటి; సక్త = చిక్కుకొన్న; హారముల్ = దండలను; విప్పదు = విడదీసుకొనదు; కృష్ణ = కృష్ణుని; మార్గ = వచ్చుదారి యందు; గత = లగ్నమైన; వీక్షణ = చూపుల; పంక్తులున్ = వరుసలను; త్రిప్పెదు = మరలింపదు; ఎప్పుడున్ = క్షణకాలమైన.
భావము:- రుక్మిణీ దేవి, ముకుందుని రాకకై ఆతృతగా ఎదురు చూస్తూ అటునుండి చూపులు తిప్పడం లేదు. తన మనసు లోని వేదనలు తల్లికి కూడ చెప్పటం లేదు. చిరునవ్వులు చిందించటం లేదు. ముఖపద్మానికి మూగిన తుమ్మెదలని తోలటం లేదు. వక్షస్థలం మీది గొలుసుల చిక్కులను విడదీయటం లేదు.

51
తుడువదు కన్నులన్ వెడలు తోయకణంబులు; కొప్పు చక్కఁగా
ముడువదు; నెచ్చెలిం గదిసి ముచ్చటకుం జన; దన్న మేమియుం
గుడువదు; నీరముం గొనదు; కూరిమిఁ గీరముఁ జేరి పద్యముం
నొడువదు; వల్లకీగుణవినోదము సేయదు; డాయ దన్యులన్.
టీక:- తుడువదు = తుడుచుకొనదు; కన్నులన్ = కళ్ళమ్మట; వెడలు = కారెడి; తోయకణంబులున్ = నీటిబిందువులను; కొప్పు = జుట్టుముడిని; చక్కగా = సరిగా; ముడువదు = చుట్టుకొనదు; నెచ్చెలిన్ = స్నేహితురాలిని; కదిసి = చేరి; ముచ్చట = కబుర్లు ఆడుట; కున్ = కు; చనదు = వెళ్ళదు; అన్నము = భోజనము; ఏమియున్ = ఏ కొంచెము కూడ; కుడువదు = తినదు; నీరమున్ = నీళ్ళైనా; కొనదు = తాగదు; కూరిమిన్ = ప్రీతితో; కీరమున్ = చిలుకను; చేరి = వద్దకు వెళ్ళి; పద్యమున్ = పద్యములను; నొడువదు = చెప్పదు; వల్లకీ = వీణ యొక్క; గుణ = తీగలను మీటెడి; వినోదమున్ = వేడుకలు; చేయదు = చేయదు; డాయదు = సమీపించదు; అన్యులన్ = ఇతరులను.
భావము:- తనను తీసుకుపోవడానికి శ్రీకృష్ణుడు వస్తున్నాడో లేదో అని మథనపడుతున్న రుక్మిణీదేవి, కన్నీరు తుడుచుకోటం లేదు. జుట్టు సరిగా ముడవటం లేదు. నెచ్చెలులతో ముచ్చటలు చెప్పటం లేదు. అన్నపానీయాలు తీసుకోవటం లేదు. ఇష్టమైన చిలుకకి పద్యాలు చెప్పటం లేదు. వీణ వాయించటం లేదు. ఎవ్వరి దగ్గరకు పోటం లేదు.
రుక్మిణి ఇంత గాఢంగా కృష్ణుని ప్రేమిస్తోంది కనుకనే తనను తీసుకు వెళ్ళి రాక్షస వివాహం చేసుకో మని సందేశం పంపించింది. అష్టవిధ వివాహాలలో రాక్షసం ఒకటి. దీనిలో ఉన్న రాక్షసం కన్య పెద్దల అంగీకారంతో సంబంధంలేకుండా, అంగీకరించిన కన్యను ఎత్తుకు వచ్చి వివాహమాడుట వరకు. కన్య అంగీకారంతో కూడ సంబంధలేకుండా చేసేది పైశాచికం.

52
మృగనాభి యలఁదదు మృగరాజమధ్యమ;
లకము లాడదు లజగంధి;
ముకురంబుఁ జూడదు ముకురసన్నిభముఖి;
పువ్వులు దుఱుమదు పువ్వుఁబోఁడి;
నకేళిఁ గోరదు నజాతలోచన;
హంసంబుఁ బెంపదు హంసగమన;
తలఁ బోషింపదు తికా లలిత దేహ;
తొడవులు తొడువదు తొడవు తొడవు;


తిలకమిడదు నుదుటఁ దిలకినీతిలకంబు;
మలగృహముఁ జొరదు మలహస్త;
గారవించి తన్నుఁ రుణఁ గైకొన వన
మాలి రాఁడు తగవుమాలి" యనుచు.
టీక:- మృగనాభి = కస్తూరి; అలదదు = రాసుకొనదు; మృగరాజ = సింహమువంటి; మధ్యమ = నడుము కలామె; జలకములాడదు = స్నానము చేయదు; జలజ = పద్మములవంటి; గంధి = సువాసన కలామె; ముకురంబున్ = అద్దములో; చూడదు = చూసుకొనదు; ముకుర = అద్దము; సన్నిభ = లాంటి; ముఖి = మోము కలామె; పువ్వులున్ = పూలను; తుఱుమదు = తలలోపెట్టుకోదు; పువ్వు = పూలవంటి; పోడి = దేహము కలామె; వన = వనములలో; కేళిన్ = విహారములను; కోరదు = ఇష్టపడదు; వనజాత = పద్మము వంటి; లోచన = కన్నులు కలామె; హంసంబున్ = హంసలను; పెంపదు = సాకదు; హంస = హంసవంటి; గమన = నడక కలామె; లతలన్ = తీగలను; పోషింపదు = పెంచదు; లతికా = తీగవలె; లలిత = మనోజ్ఞమైన; దేహ = దేహము కలామె; తొడవులు = ఆభరణములను; తొడువదు = తొడుగుకొనదు, ధరించదు; తొడవు = భూషణములకే; తొడవు = భూషణప్రాయమైనామె.
తిలకము = తిలకముబొట్టు; ఇడదు = పెట్టుకొనదు; నుదుటన్ = నుదురుమీద; తిలకినీ = స్త్రీలలో {తిలకిని - తిలకము ధరించునామె, స్త్రీ}; తిలకంబు = ఉత్తమురాలు; కమలగృహమున్ = చెరువులందు {కమలగృహము - పద్మములకు నిలయము, సరస్సు}; చొరదు = ప్రవేశింపదు; కమల = పద్మరేఖ; హస్త = చేతిలో కలామె; గారవించి = మన్నించి; తన్నున్ = ఆమెను; కరుణన్ = దయతోటి; కైకొనన్ = చేపట్టుటకు; వనమాలి = కృష్ణుడు {వనమాలి - వనమాల ధరించువాడు, కృష్ణుడు}; రాడు = వచ్చుటలేదు; తగవు = న్యాయము; మాలి = లేనివాడై; అనుచున్ = అని.
భావము:- అన్యాయంగా కృష్ణుడు తనను ప్రేమతో కరుణించ డానికి రావటం లేదు అన్న తలపుల పరధ్యాన్నంలో పడి, ఆ సింహపు నడుము చిన్నది కస్తూరి రాసుకోడం లేదట. పద్మగంధం లాంటి మేని సువాసనలు గల పద్మగంధి జలకా లాడటం లేదట. అద్దం లాంటి మోముగల సుందరి అద్దం చూట్టం లేదట. పువ్వులాంటి సుకుమారి పువ్వులే ముడవటం లేదట. పద్మాల్లాంటి కళ్ళున్న పద్మాక్షి జలక్రీడకి వెళ్ళటం లేదట. హంస నడకల చిన్నది హంసలను చూట్టం లేదట. లత లాంటి మనోఙ్ఞమైన కోమలి లతలని చూట్టం లేదుట. అలంకారాలకే అలంకారమైన అందగత్తె అలంకారాలు చేసుకోవటం లేదుట. చక్కటిచుక్క లాంటి వనితాశిరోమణి బొట్టు పెట్టుకోటం లేదట. కమలాల లాంటి చేతులున్న సుందరి సరోవరాలలోకి దిగటం లేదట.

53
మఱియును.
టీక:- మఱియును = ఇంతేకాకుండా.
భావము:- ఇంతేకాకుండా.

54
లఁగున్ మెల్లని గాలికిం; బటునటన్మత్త ద్విరేఫాలికిం
లఁగుం; గోయల మ్రోఁతకై యలఁగు; నుద్యత్కీరసంభాషలం
లఁగున్; వెన్నెలఁవేడిమి న్నలఁగు; మాకందాంకురచ్ఛాయకుం
దొలఁగుం; గొమ్మ మనోభవానలశిఖా దోధూయ మానాంగియై.
టీక:- మలగున్ = చలించును; మెల్లని = మెల్లగా వీచెడి; గాలి = గాలి; కిన్ = కి; పటు = మిక్కిలి; నటత్ = చరించుచున్న; మత్త = మత్తుగొన్న; ద్విరేఫా = తుమ్మెదల {ద్విరేఫము - తన పేరైన భ్రమరమునందు రెండు రేఫలు (రకారలు) కలది, రేఫ (రకారము) వంటి రెక్కలు రెండు కలది, తుమ్మెద}; ఆళి = సమూహమున; కిన్ = కు; తలగున్ = తప్పుకొనును; కోయిల = కోకిల; మ్రోత = కూతల; కై = వలన; అలగున్ = చిరాకుపడును; ఉద్యత్ = పుట్టుచున్న; కీర = చిలుకల; సంభాషలం = పలుకులకు; కలగున్ = కలతపడును; వెన్నెల = వెన్నెల యొక్క; వేడిమిన్ = తాపమునకు; నలగున్ = బడలికచెందును; మాకంద = తియ్యమామిడి; అంకుర = చిగుర్ల; ఛాయకున్ = నీడకు; తొలగున్ = తప్పించుకొనిపోవును; కొమ్మ = ఇంతి; మనోభవ = మన్మథ {మనోభవ - మనసునందు పట్టువాడు, మన్మథుడు}; అనల = అగ్ని యొక్క; శిఖా = మంటలచేత; దోధూయమాన = చలింపజేయబడిన; అంగి = దేహము కలామె; ఐ = అయ్యి.
భావము:- మన్మథతాపాగ్నిలో వేగిపోతున్న మగువ పిల్లగాలికి అలసి పోతుంది. దోగాడే తుమ్మెదలకి తొలగిపోతుంది. కోయిల కూసినా చిరాకు పడుతుంది. చక్కటి చిలక పలుకులకి ఉలికి పడుతుంది. వెన్నెల వేడికి వేగిపోతుంది. మామిడి చెట్టు నీడకి తప్పుకుంటుంది.

వాసుదే వాగమనంబు

55
ఇట్లు హరిరాక కెదురుచూచుచు, సకల ప్రయోజనంబులందును విరక్త యయి, మనోజానలంబునం బొగులు మగువకు, శుభంబు చెప్పు చందంబున, వామోరు లోచన భుజంబు లదరె; నంతఁ గృష్ణు నియోగంబున బ్రాహ్మణుండు చనుదెంచిన, నతని ముఖలక్షణం బుపలక్షించి, యా కలకంఠకంఠి మహోత్కంఠతోడ నకుంఠిత యై, మొగంబునం జిఱునగవు నిగుడ, నెదురు జని, నిలువంబడిన, బ్రాహ్మణుం డిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; హరి = కృష్ణుడు; రాక = వచ్చుట; కిన్ = కై; ఎదురుచూచుచు = ప్రతీక్షించుచు; సకల = సమస్తమైన; ప్రయోజనంబులున్ = పనులు; అందును = ఎడల; విరక్త = ఇచ్ఛలేనిది; అయి = ఐ; మనోజ = మన్మథ {మనోజుడు - మనసున పుట్టువాడు, మన్మథుడు}; అనలంబున్ = తాపముచేత; పొగులు = తపించుచున్న; మగువ = వనిత; కున్ = కు; శుభంబున్ = రాబోవు మేలు; చెప్పు = సూచించు; చందంబునన్ = విధముగ; వామ = ఎడమపక్క; ఊరువు = తొడ; లోచన = కన్ను; భుజంబుల్ = భుజములు; అదరెన్ = అదరినవి; అంతన్ = అంతట; కృష్ణు = కృష్ణుని చేత; నియోగంబునన్ = ఆజ్ఞ ప్రకారము; బ్రాహ్మణుండు = విప్రుడు; చనుదెంచినన్ = రాగా; అతని = అతని; ముఖ = ముఖము; లక్షణంబు = ఉండినరీతిని; ఉపలక్షించి = పరిశీలనగాచూసి; ఆ = ఆ యొక్క; కలకంఠి = కోకిల కంఠము వంటి; కంఠి = కంఠము కలామె; మహా = మిక్కిలి; ఉత్కంఠ = తహతహ; తోడన్ = తోటి; అకుంఠిత = వికాసము కలది {అకుంఠిత - కుంఠిత (మూఢురాలు) కాని యామె, వికాసము కలామె}; అయి = అయ్యి; మొగంబునన్ = ముఖము నందు; చిఱునగవు = దరహాసము; నిగుడన్ = వ్యాపించగా; ఎదురుజని = ఎదురు వెళ్ళి; నిలువం బడినన్ = నిలుచుండగా; బ్రాహ్మణుండు = విప్రుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా కృష్ణుని రాకకి ఎదురు చూస్తూ సర్వం మరచి మన్మథతాపంతో వేగిపోతున్న సుందరి రుక్మిణికి శుభ సూచకంగా ఎడంకన్ను, ఎడంభుజం, ఎడంకాలు అదిరాయి; అంతలోనే అగ్నిద్యోతనుడు కృష్ణుడు పంపగా వచ్చేడు; అతని ముఖకవళికలు చూసి మిక్కిలి ఉత్సుకతతో రుక్మిణి చిరునవ్వుతో ఎదురు వెళ్ళింది; అప్పుడా బ్రాహ్మణుడు ఇలా అన్నాడు. . .

56
"మెచ్చె భవద్గుణోన్నతి; కమేయ ధనావళు లిచ్చె నాకుఁ; దా
చ్చె సుదర్శనాయుధుఁడు వాఁడె; సురాసురు లెల్ల నడ్డమై
చ్చిననైన, రాక్షసవివాహమునం గొనిపోవు నిన్ను; నీ
చ్చరితంబు, భాగ్యమును, ర్వము నేడు ఫలించెఁ గన్యకా!"
టీక:- మెచ్చెన్ = మెచ్చుకొనెను; భవత్ = నీ యొక్క; గుణ = సుగుణముల; ఉన్నతిన్ = మేలిమి; కిన్ = కి; అమేయ = అంతులేని; ధనా = సంపదల; ఆవళుల్ = సమూహములను; ఇచ్చెన్ = ఇచ్చెను; నా = నా; కున్ = కు; తాన్ = అతను; వచ్చెన్ = వచ్చెను; సుదర్శనాయుధుడు = కృష్ణుడు {సుదర్శ నాయుధుడు - సుదర్శన మను చక్రాయుధము కలవాడు, విష్ణువు, కృష్ణుడు}; వాడె = అతనే; సురాసురులు = దేవదానవులు; ఎల్లన్ = అందరు; అడ్డమై = అడ్డుపడుటకు; ఐ = అయ్యి; వచ్చిననైన = వచ్చినప్పటికి; రాక్షసవివాహమునన్ = రాక్షసవివాహ పద్ధతిని; కొనిపోవు = తీసుకు వెళ్ళును; నినున్ = నిన్ను; నీ = నీ యొక్క; సత్ = మంచి; చరితంబు = వర్తనల; భాగ్యమును = ఫలములు; సర్వమున్ = అంతా; నేడు = ఇవాళ; ఫలించెను = ఫలితముల నిచ్చినవి; కన్యకా = బాలికా.
భావము:- “నీ సుగుణాల్ని మెచ్చుకున్నాడమ్మా. అమ్మాయీ! అంతులేని ధనాన్ని నాకు ఇచ్చాడు. చక్రి తానే స్వయంగా విచ్చేసాడు. దేవదానవు లడ్డమైనా సరే నిన్ను తీసుకు వెళ్తాడు. నీ మంచి తనం అదృష్టం ఇవాళ్టికి ఫలించాయమ్మా.” అని దూతగా వెళ్ళిన విప్రుడు అగ్నిద్యోతనుడు రుక్మిణికి శుభవార్త చెప్పాడు.

57
అనిన వైదర్భి యిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; వైదర్భి = రుక్మిణీదేవి {వైదర్భి - విదర్భ దేశమునకు చెందినామె, రుక్మిణి}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అలా శుభవార్త చెప్పిన విప్రునితో విదర్భ రాకుమారి రుక్మిణి ఇలా అంది.

58
"జాతేక్షణుఁ దోడితెచ్చితివి, నా సందేశముం జెప్పి; నన్
నిలువం బెట్టితి; నీ కృపన్ బ్రతికితిన్; నీ యంత పుణ్యాత్మకుల్
రే? దీనికి నీకుఁ బ్రత్యుపకృతిం గావింప నే నేర; నం
లిఁ గావించెద; భూసురాన్వయమణీ! ద్బంధుచింతామణీ!"
టీక:- జలజాతేక్షణున్ = పద్మాక్షుని, కృష్ణుని; తోడి = కూడా; తెచ్చితివి = తీసుకు వచ్చావు; నా = నా; సందేశమున్ = సమాచారమును; చెప్పి = తెలిపి; నన్నున్ = నన్ను; నిలువంబెట్టితి = రక్షించావు; నీ = నీ యొక్క; కృపన్ = దయతోటి; బ్రతికితిన్ = కాపాడబడితిని; నీ = నీ; అట్టి = లాంటి; పుణ్యాత్మకుల్ = పుణ్యాత్ములు; కలరే = ఉన్నారా; దీని = దీని, (ఈ పని); కిన్ = కి; నీ = నీ; కున్ = కు; ప్రత్యుపకృతిన్ = ప్రత్యుపకారము; కావింపన్ = చేయుటకు; నేన్ = నేను; నేరన్ = చాలను; అంజలి = నమస్కారము; కావించెదన్ = చేసెదను; భూసుర = బ్రాహ్మణ; అన్వయ = వంశ; మణీ = శ్రేష్ఠుడా; సద్బంధు = మంచికి బంధువులైన వారి; చింతామణి = చింతామణి వంటివాడ {చింతామణి - చింతించగానే కోరికలను సిద్ధింపజేసెడి మణి}.
భావము:- “ఓ సద్భ్రాహ్మణ శ్రేష్ఠుడా! ప్రియబాంధవోత్తముడా! నా సందేశం అందించి పద్మాక్షుడిని వెంటబెట్టుకొచ్చావు. నా ప్రాణాలు నిలబెట్టావు. నీ దయ వలన బతికిపోయాను. దీనికి తగిన మేలు చేయలేనయ్య. నమస్కారం మాత్రం పెడతాను.”

59
అని నమస్కరించె; నంత రామకృష్ణులు దన కూఁతు వివాహంబునకు వచ్చుట విని, తూర్యఘోషంబులతో నెదుర్కొని, విధ్యుక్తప్రకారంబునం బూజించి, మధుపర్కంబు లిచ్చి, వివిధాంబరాభరణంబులు మొదలైన కానుక లొసంగి, భీష్మకుండు బంధుజనసేనా సమేతులైన వారలకుం దూర్ణంబున సకల సంపత్పరిపూర్ణంబులైన నివేశంబులు కల్పించి, విడియించె; నిట్లు కూడిన రాజుల కెల్లను వయోవీర్య బలవిత్తంబు లెట్లట్ల కోరిన పదార్థంబు లెల్ల నిప్పించి, పూజించె; నంత విదర్భపురంబు ప్రజలు హరిరాక విని, వచ్చి చూచి, నేత్రాంజలులం దదీయ వదనకమల మధుపానంబుఁ జేయుచు.
టీక:- అని = అని; నమస్కరించెన్ = నమస్కారము చేసెను; అంతన్ = అటుపిమ్మట; రామ = బలరాముడు; కృష్ణులు = శ్రీకృష్ణులు; తన = అతని; కూతు = పుత్రిక; వివాహంబున్ = పెండ్లి; కున్ = కి; వచ్చుట = వచ్చుట; విని = విని; తూర్య = వాయిద్యముల; ఘోషంబు = ధ్వని; తోన్ = తోటి; ఎదుర్కొని = ఎదురువెళ్ళి; విధ్యుక్త = పద్ధతి; ప్రకారంబునన్ = ప్రకారముగా; పూజించి = గౌరవించి; మధుపర్కంబులు = పెరుగుతో కలిపిన తేనెలు; ఇచ్చి = ఇచ్చి; వివిధ = అనేకరకముల; అంబర = వస్త్రములు; ఆభరణంబులున్ = భూషణములు; మొదలైన = మున్నగు; కానుకలు = బహుమతులు; ఒసంగి = ఇచ్చి; భీష్మకుండు = భీష్మకుడు; బంధు = బంధువుల; జన = సమూహములు; సేనా = సైన్యములతో; సమేతులు = కలిసి ఉన్నవారు; ఐన = అయిన; వారల = వారి; కున్ = కి; తూర్ణంబ = శీఘ్రమే; సకల = ఎల్ల; సంపత్ = వసతులతో; పరిపూర్ణంబులు = నిండినవి; ఐన = అయిన; నివేశంబులు = నివాసములు; కల్పించి = ఏర్పరచి; విడియించి = విడిదులుగా దింపి; ఇట్లు = ఈ విధముగ; కూడిన = చేరిన; రాజులు = రాజులు; కిన్ = కి; ఎల్లను = అందరికి; వయః = వయస్సు; వీర్య = శూరత్వము; బల = సైనికబలములు; విత్తంబులు = ధనములను; ఎట్లట్ల = అనుసరించి; కోరిన = అడిగిన; పదార్థంబులు = వస్తువులు; ఎల్లన్ = అన్నిటిని; ఇప్పించి = సమకూర్చి; పూజించెన్ = గౌరవించెను; అంతన్ = అటుపిమ్మట; విదర్భపురంబు = కుండిననగరము యొక్క {విదర్భపురము - విదర్భదేశపు పట్టణము, కుండిన}; ప్రజలు = పౌరులు; హరి = కృష్ణుని; రాకన్ = వచ్చుటను; విని = తెలిసి; వచ్చి = వచ్చి; చూచి = దర్శనము చేసికొని; నేత్ర = కళ్ళు అనెడి; అంజలులన్ = దోసిళ్ళతో; తదీయ = అతని; వదన = ముఖము అనెడి; కమల = పద్మము యొక్క; మధు = మకరందమును; పానంబుజేయుచు = తాగుతు.
భావము:- ఇలా రుక్మిణి, విప్రునికి నమస్కరించింది. ఈలోగా భీష్మకుడు బలరామ కృష్ణులు తన పుత్రిక పెళ్ళికి వచ్చారని విని మంగళవాద్యాలతో ఆహ్వానించాడు. తగిన మర్యాదలు చేసి మధుపర్కాలు ఇచ్చాడు. అనేక రకాల వస్త్రాలు, ఆభరణాలు మొదలైన కానుకలు ఇచ్చాడు. వారికి వారి బంధువులకి సైన్యానికి తగిన నిండైన విడిదులు ఏర్పాటు చేసాడు. వారివారి శౌర్య బల సంపదలకి వయస్సులకు అర్హమైన కోరిన పదార్ధాలన్ని ఇప్పించి మర్యాదలు చేసాడు. అప్పుడు చక్రి వచ్చాడని విదర్భలోని పౌరులు వచ్చి దర్శనం చేసుకొని, అతని మోము తిలకించి ఇలా అనుకోసాగారు. .

60
"గు నీ చక్రి విదర్భరాజసుతకుం; థ్యంబు వైదర్భియుం
గు నీ చక్రికి; నింత మంచి దగునే? దాంపత్య, మీ యిద్దఱిం
గులం గట్టిన బ్రహ్మ నేర్పరిగదా? ర్పాహతారాతియై
గఁడౌఁ గావుతఁ! జక్రి యీ రమణికిన్ మా పుణ్యమూలంబునన్."
టీక:- తగున్ = సరిపడును; ఈ = ఈ యొక్క; చక్రి = కృష్ణుడు; విదర్భ = విదర్భ దేశపు; రాజసుత = రాకుమారి; కున్ = కి; తథ్యంబు = నిజముగా; వైదర్భియున్ = రుక్మిణికూడ; తగున్ = సరిపోవును; ఈ = ఈ యొక్క; చక్రి = కృష్ణుని; కిన్ = కి; ఇంతమంచిదగునే = చాలా మంచిది అగును; దాంపత్యము = ఆలుమగలకూడిక; ఈ = ఈ; ఇద్దఱన్ = ఇద్దరిని; తగులంగట్టినన్ = కూర్చినట్టి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; నేర్పరి = మంచినేర్పు గలవాడు కదా; దర్ప = దర్పముచేత; ఆహత = కొట్టబడిన; ఆరాతి = శత్రువులు కలవాడు; ఐ = అయ్యి; మగడు = భర్త; ఔగావుత = అగునుగాక; చక్రి = కృష్ణుడు; ఈ = ఈ; రమణి = ఇంతి; కిన్ = కి; మా = మా యొక్క; పుణ్య = పుణ్యముల; మూలంబునన్ = వలన.
భావము:- “ఈ చక్రాయుధుడైన శ్రీకృష్ణుడు మా విదర్భరాకుమారి రుక్మిణికి తగినవాడు. ఇది సత్యం. ఈమె అతనికి తగినామె. ఈ రుక్మిణీ కృష్ణులు ఒకరికొకరు సరిపోతారు, ఎంత మంచి జంటో. వీరిద్దరిని కూర్చిన బ్రహ్మదేవుడు కడు సమర్థుడే మరి. మా పుణ్యాల ఫలంగా ఈ వాసుదేవుడు పగవారి పీచమణచి మా రుక్మిణిని పెళ్ళాడు గాక.”

61
అని పలికి రా సమయంబున.
టీక:- అని = అని; పలికిరి = వారిలోవారు అనుకొనిరి; ఆ = ఆ యొక్క; సమయంబునన్ = సమయమునందు.
భావము:- రుక్మిణీ స్వయంవరానికి వచ్చినప్పుడు కృష్ణుని దర్శించుకున్న కుండిన నగర పౌరులు వారిలో వారు ఇలా అనుకున్నారు.

62
న్నద్ధులై బహు స్త్ర సమేతులై;
లిసి చుట్టును వీరటులు గొలువ
ముందట నుపహారములు కానుకలు గొంచు;
ర్గంబులై వారనిత లేఁగఁ
బుష్ప గంధాంబర భూషణ కలితలై;
పాడుచు భూసురభార్య లరుగఁ
ణవ మర్దళ శంఖ టహ కాహళ వేణు;
భేరీధ్వనుల మిన్ను పిక్కటిలఁగఁ


గిలి సఖులు గొల్వఁ ల్లులు బాంధవ
తులు దోడ రాఁగ వినయముగ
గరు వెడలి నడచె గజాతకును మ్రొక్క
బాల చికుర పిహిత ఫాల యగుచు.
టీక:- సన్నద్ధులు = పోరుటకు సిద్ధపడినవారు; ఐ = అయ్యి; బహు = అనేకమైన; శస్త్ర = శస్త్రములుతో; సమేతులు = కూడినవారు; ఐ = అయ్యి; బలిసి = ఆవరించి; చుట్టును = నాలుగువైపులా; వీర = శూరులైన; భటులు = సైనికులు; కొలువన్ = సేవించుచుండగా; ముందఱన్ = ముందువైపు; ఉపాహారములు = నైవేద్య వస్తువులను; కానుకలు = మొక్కులు; కొంచున్ = తీసుకొని; వర్గంబులు = గుంపులుగ; ఐ = కూడి; వారవనితలు = వేశ్యాస్త్రీలు; ఏగన్ = పోవుచుండగా; పుష్ప = పూలు; గంధ = గంధముపూతలు; అంబర = వస్త్రములు; భూషణ = ఆభకణములు; కలితలు = కలిగినవారు; ఐ = అయ్యి; పాడుచున్ = పాటలు పాడుతు; భూసుర = విప్రుల; భార్యలు = ఇల్లాళ్ళు; అరుగన్ = పోతుండగా; పణవ = తప్పెట్లు, ఉడుకలు; మర్దళ = మద్దెలలు; శంఖ = శంఖములు; పటహ = ఢంకాలు; కాహళ = తుతారలు, బాకాలు; వేణు = పిల్లనగ్రోవులు; భేరీ = పెద్దనగారాలు యొక్క; ధ్వనులన్ = శబ్దములవలన; మిన్ను = ఆకాశము; పిక్కటిలగన్ = నిండిపోగా; తగిలి = కూడా.
సఖులున్ = పరిచారికలు; కొల్వన్ = సేవించుచుండగా; తల్లులున్ = తల్లులు; బాంధవ = బంధువుల; సతులు = స్త్రీలు; తోడన్ = కూడా; రాగ = కూడా వస్తుండగా; సవినయముగన్ = వినయపూర్వకముగా; నగరున్ = అంతఃపురమునుండి; వెడలి = బయలుదేరి; నడచెన్ = వెళ్ళను; నగజాత = పార్వతీదేవి {నగజాత - నగ (పర్వతుని) జాత (పుట్టినామె), పార్వతి}; కున్ = కి; బాల = యువతి; చికుర = ముంగురులచేత; పిహిత = కప్పబడిన; ఫాల = నుదురుకలామె; అగుచున్ = అగుచు.
భావము:- అప్పుడు, రుక్మిణి గౌరీ పూజ చేయడానికి నగరం బయటకి బయలు దేరింది; ఆమె నుదిటి మీద ముంగురులు ఆవరించాయి; సర్వాయుధాలతో సర్వసన్నద్ధంగా ఉన్న శూరులు చుట్టు కొలుస్తున్నారు; వారవనితలు ఫలహారాలు కానుకలు పట్టుకొని వరసలు కట్టి ముందర నడుస్తున్నారు; సర్వాలంకార శోభిత లైన విప్రుల భార్యలు పాటలు పాడుతు వస్తున్నారు; మద్దెలలు, తప్పెట్లు, శంఖాలు, బాకాలు, వేణువులు, భేరీలు మొదలైన మంగళవాయిద్యాల చప్పుళ్ళు మిన్నంటుతున్నాయి; చెలికత్తెలు చేరి కొలుస్తున్నారు; తల్లులు, బంధువులు, అంతఃపుర స్త్రీలు కూడా వస్తున్నారు;

63
మఱియు, సూత మాగధ వంది గాయక పాఠక జను లంతంత నభినందించుచుఁ జనుదేర మందగమనంబున, ముకుంద చరణారవిందంబులు డెందంబునం దలంచుచు నిందుధరసుందరీ మందిరంబు చేరి సలిల ధారా ధౌత చరణ కరారవింద యై వార్చి శుచియై, గౌరీసమీపంబునకుం జనియె నంత ముత్తైదువలగు భూసురోత్తముల భార్యలు భవసహితయైన భవానికి మజ్జనంబు గావించి, గంధాక్షత లిడి, వస్త్రమాల్యాది భూషణంబుల నలంకరించి ధూపదీపంబు లొసంగి నానావిధోపహారంబులు సమర్పించి, కానుకలిచ్చి, దీపమాలికల నివాళించి రుక్మిణీదేవిని మ్రొక్కించి; రప్పుడు.
టీక:- మఱియున్ = ఇంకను; సూత = కీర్తించువారు; మాగధ = ప్రతాపము వర్ణించువారు; వంది = స్తోత్రములు చేయువారు; గాయక = పాటలు పాడువారు; పాఠక = వంశావళి చదువువారు; జనులు = ప్రజలు; అంతంతన్ = అక్కడక్కడ; అభినందించుచున్ = పొగడుతు; చనుదేర = రాగా; మంద = మెల్లని; గమనంబునన్ = నడకలతో; ముకుంద = శ్రీకృష్ణుని; చరణ = పాదము లనెడి; అరవిందంబులున్ = పద్మములను; డెందంబునన్ = మనసునందు; తలచుచు = స్మరించుతు; ఇందుధరసుందరీ = పార్వతీదేవి యొక్క {ఇందుధర సుందరి - ఇందుధరుని (శివుని) యొక్క సుందరి (భార్య), పార్వతి}; మందిరంబున్ = గుడిని; చేరి = దగ్గరకు వెళ్ళి; సలిల = నీటితో; ధౌత = కడగబడిన; చరణ = కాళ్ళు; కర = చేతులు అనెడి; అరవింద = పద్మములు కలామె; ఐ = అయ్యి; వార్చి = ఆచమనము చేసి; శుచి = పరిశుద్ధురాలు; ఐ = అయ్యి; గౌరీ = పార్వతీదేవి; సమీపంబున్ = దగ్గర; కున్ = కు; చనియె = వెళ్ళెను; అంతన్ = అంతట; ముత్తైదువలు = పునిస్త్రీలు {ముత్తైదువ - భర్త జీవించి ఉన్న వృద్దురాలు , పునిస్త్రీ}; అగు = ఐన; భూసుర = బ్రాహ్మణ; ఉత్తముల = శ్రేష్ఠుల; భార్యలు = స్త్రీలు; భవ = శివునితో {భవుడు - సమస్తము తానే అగువాడు, శివుడు}; సహిత = కలిసి ఉన్నామె; ఐన = అయిన; భవాని = పార్వతీదేవి {భవాని - భవుని భార్య, పార్వతి}; కిన్ = కి; మజ్జనంబు = అభిషేకము; కావించి = చేసి; గంధ = సుగంధ ద్రవ్యములు; అక్షతలు = అక్షింతలు {అక్షతలు - పసుపు కలిపిన బియ్యము గింజలు}; ఇడి = వేసి; వస్త్ర = బట్టలు; మాల్య = పూలదండలు; ఆది = మున్నగు; భూషణంబులన్ = ఆలంకారములచేత; అలంకరించి = అలంకారము చేసి; ధూప = ధూపము; దీపంబులు = దీపములను; ఒసంగి = ఇచ్చి; నానా = అనేక; విధ = రకములైన; ఉపహారంబులున్ = నైవేద్యములను; సమర్పించి = ఇచ్చి; కానుకలు = కానికలు; ఇచ్చి = ఇచ్చి; దీప = దీపముల; మాలికలన్ = వరుసలను; నివాళించి = హారతులిచ్చి; రుక్మిణీదేవిని = రుక్మిణీదేవిచేత; మ్రొక్కించిరి = నమస్కరింపజేసిరి; అప్పుడు = అప్పుడు.
భావము:- అక్కడక్కడ సూత వంది మాగధులు వంశకీర్తి, పరాక్రమం వర్ణిస్తున్నారు స్తోత్రాలు చేస్తున్నారు, గీతాలు పాడేవాళ్ళు పాడుతున్నారు, పద్యాలు చదివేవాళ్ళు చదువుతున్నారు. స్వయంవర పెళ్ళికూతురు, రుక్మిణి మెల్లగా నడుస్తూ చక్రి పాదాలు స్మరిస్తూ ఉమాసతి గుడికి చేరింది. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని, గౌరీదేవి దగ్గరకు వెళ్ళింది. బ్రాహ్మణ ముత్తైదువలు శివపార్వతులకు అభిషేకం చేసి, అక్షతలు పూలమాలలు వస్త్రాభరణాలు అలంకరించారు. కానుకలు దీపాలు నివేదించారు. రుక్మిణిచేత మొక్కించారు, అప్పుడు.

64
"మ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్
మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె
ద్దమ్మ! దయాంబురాశివి గమ్మ! హరిం బతిఁ జేయుమమ్మ! ని
న్నమ్మినవారి కెన్నటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!"
టీక:- నమ్మితిన్ = నమ్మినాను; నా = నా యొక్క; మనంబునన్ = మనసునందు; సనాతనులు = శాశ్వతులు; ఉమా = పార్వతీ {ఉమ - అనత్యీత్యుమా అవసంరక్షణే (వ్యుత్పత్తి), రక్షించునామె, పార్వతి}; మహేశులన్ = పరమేశ్వరులను {మహేశుడు - మహాంశ్ఛాసావీశ్వరశ్చ మహేశ్వరః (వ్యుత్పత్తి), దేవతలలో శ్రేష్ఠుడు, శివుడు}; మిమ్మున్ = మిమ్ములను; పురాణదంపతులన్ = పురాతనమైన దంపతుల; మేలు = చక్కగా; భజింతున్ = పూజించెదను; కదా = కదా; అమ్మ = తల్లీ; మేటి = గొప్ప; పెద్దమ్మ = గొప్పతల్లీ; దయా = దయకు; అంబురాశివి = సముద్రమువంటి ఆమెవు; కదా = కదా; అమ్మ = తల్లీ; హరిన్ = కృష్ణుని; పతిన్ = భర్తగా; చేయుము = కావింపుము; అమ్మ = తల్లీ; నిన్నున్ = నిన్ను; నమ్మిన = నమ్ముకొన్న; వారి = వారల; కిన్ = కి; ఎన్నటికిన్ = ఎప్పటికి; నాశము = చెరుపు; లేదు = లేదు; కద = కదా; అమ్మ = తల్లి; ఈశ్వరీ = పార్వతీదేవి.
భావము:- “తల్లుల కెల్ల పెద్దమ్మ! పార్వతీదేవి! ఆదిదంపతులు పురాణదంపతులు ఐన ఉమామహేశ్వరులను మిమ్మల్ని మనస్ఫూర్తిగా నమ్మి భక్తిగా పూజిస్తున్నా కదమ్మ. ఎంతో దయామయివి కదమ్మా. నిన్ను నమ్మినవారికి ఎప్పటికి హాని కలుగదు కదమ్మ. నాకు ఈ వాసుదేవుణ్ణి భర్తని చెయ్యి తల్లీ!” అంటు గౌరీపూజచేసిన రుక్మిణీదేవి ప్రార్థించుకుంటోంది. (గమనిక: రుక్మిణికి కృష్ణుడు వచ్చేడని తెలుసు కాని ఇంకా కలవలేదు.)

65
అని గౌరీదేవికి మ్రొక్కి పతులతోడం గూడిన బ్రాహ్మణభార్యలకు లవణాపూపంబులును, తాంబూల కంఠసూత్రంబులును, ఫలంబులు, నిక్షుదండంబులు నిచ్చి రుక్మిణీదేవి వారలం బూజించిన.
టీక:- అని = అని; గౌరీదేవి = పార్వతీదేవి; కిన్ = కి; మ్రొక్కి = నమస్కరించి; పతుల = భర్తల; తోడన్ = తోటి; కూడిన = కలసి ఉన్న; బ్రాహ్మణ = బ్రాహ్మణుల; భార్యలు = భార్యల; కున్ = కు; లవణ = ఉప్పు; అపూపంబులున్ = అప్పములను; తాంబూల = తాంబూలములు {తాంబూలము - తమలపాకులు వక్కలు ఆదులు కూడినది}; కంఠసూత్రంబులును = మెడనూళ్ళు; ఫలంబులున్ = పండ్లు; ఇక్షు = చెరకు; దండంబులున్ = గెడలు; ఇచ్చి = ఇచ్చి; రుక్మిణీదేవి = రుక్మిణీదేవి; వారలన్ = వారిని; పూజించినన్ = ఆర్చించగా.
భావము:- రుక్మిణిదేవి దుర్గమ్మకు అలా మొక్కింది. బ్రాహ్మణదంపతులకు ఉప్పు, అప్పాలు, తాంబూలాలు, మెడలో వేసుకొనే తాళ్ళు, పళ్ళు, చెరకు గడలు దానం చేసి పూజించింది.

66
వార లుత్సహించి లనొప్ప దీవించి
సేస లిడిరి యువతి శిరమునందు;
సేస లెల్లఁ దాల్చి శివవల్లభకు మ్రొక్కి
మౌననియతి మాని గువ వెడలె.
టీక:- వారలు = వారు; ఉత్సహించి = సంతోషించి; వలనొప్పన్ = బహుచక్కగా; దీవించి = ఆశీర్వదించి; సేసలు = అక్షింతలు; ఇడిరి = వేసిరి; యువతి = బాల; శిరమున్ = తల; అందున్ = మీద; సేసలు = అక్షింతలు; ఎల్లన్ = అన్నిటిని; తాల్చి = ధరించి; శివవల్లభ = పార్వతీదేవి {శివవల్లభ - శివుని భార్య, పార్వతి}; కున్ = కి; మ్రొక్కి = నమస్కరించి; మౌననియతిన్ = మౌనవ్రతమును; మాని = విడిచిపెట్టి; మగువ = యువతి; వెడలెన్ = బయలుదేరెను.
భావము:- వారు ఉత్సాహంతో చక్కగా దీవించి, ఆమె తల మీద అక్షతలు వేసారు. రుక్మణి ఆ ఆశీర్వచనాలు ధరించి పార్వతీదేవికి నమస్కారాలు పెట్టింది. మౌనవ్రతం వదలి బయటకు వచ్చింది.

67
ఇట్లు మేఘమధ్యంబు వెలువడి విలసించు క్రొక్కారు మెఱుంగు తెఱంగున, మృగధరమండలంబు నిర్గమించి చరించు మృగంబు చందంబునఁ, గమలభవ నర్తకుం డెత్తిన జవనిక మఱుఁగు దెరలి పొడచూపిన మోహినీదేవత కైవడి, దేవదానవ సంఘాత కరతల సవ్యాపసవ్య సమాకృష్యమాణ పన్నగేంద్ర పాశ పరివలయిత పర్యాయ పరిభ్రాంత మందరాచల మంథాన మథ్యమాన ఘూర్ణిత ఘుమఘుమాయిత మహార్ణవమధ్యంబున నుండి చనుదెంచు నిందిరాసుందరీ వైభవంబున, బహువిధ ప్రభాభాసమానయై యిందుధరసుందరీ మందిరంబు వెడలి మానసకాసార హేమకమల కానన విహరమాణ మత్తమరాళంబు భంగి మందగమనంబునఁ గనకకలశ యుగళ సంకాశ కర్కశ పయోధరభార పరికంప్యమాన మధ్యయై, రత్నముద్రికాలంకృతంబైన కెంగేల నొక్క సఖీలలామంబు కైదండఁ గొని, రత్ననివహ సమంచిత కాంచన కర్ణపత్ర మయూఖంబులు గండభాగంబుల నర్తనంబులు సలుప నరవింద పరిమళ కుతూహలావతీర్ణ మత్తమధుకరంబుల మాడ్కి నరాళంబులైన కుంతలజాలంబులు ముఖమండలంబునఁ గ్రందుకొన, సుందర మందహాస రోచులు దిశలందు బాలచంద్రికా సౌందర్యంబు నావహింప నధర బింబఫలారుణ మరీచిమాలికలు రదనకుంద కుట్మంబుల కనురాగంబు సంపాదింప, మనోజాతకేతన సన్నిభంబైన పయ్యెదకొంగు దూఁగ; సువర్ణమేఖలాఘటిత మణి కిరణపటలంబు లకాల శక్రచాప జనకంబులై మెఱయఁ జెఱుకువిలుతుం డొరఁ బెఱికి వాఁడి యిడి జళిపించిన ధగద్ధగాయానంబులగు బాణంబుల పగిది, సురుచిర విలోకన నికరంబులు రాజవీరుల హృదయంబులు భేదింప, శింజాన మంజు మంజీర నినదంబులు చెవుల పండువులు సేయఁ, బాద సంచారంబున హరిరాక కెదురుచూచుచు వీరమోహినియై చనుదెంచుచున్న సమయంబున.
టీక:- ఇట్లు = ఈ విధముగ; మేఘ = మబ్బుల; మధ్యంబున్ = నడుమనుండి; వెలువడి = బయటపడి; విలసించు = ప్రకాశించునట్టి; క్రొక్కారు =తొలకరి; మెఱుంగు = మెరుపుల; తెఱంగున = వలె; మృగధర = చంద్ర {మృగధరుడు - లేడి రూపును బింబమున ధరించినవాడు, చంద్రుడు}; మండలంబున్ = మండలమునుండి; నిర్గమించి = వెలువడి; చరించు = తిరుగుచున్నట్టి; మృగంబు = లేడి; చందంబునన్ = వలె; కమలభవ = బ్రహ్మదేవుడు అనెడి; నర్తకుండు = నాటకము లాడించువాడు; ఎత్తిన = పైకెత్తిన; జవనిక = తెర {యవనిక (ప్ర) - జవనిక (వి)}; మఱుగు = చాటునుండి; తెరలి = బయటకు వచ్చి; పొడచూపిన = కనబడిన; మోహినీదేవత = మోహినీదేవత {మోహినీదేవత - లోకమును మోహింపజేసెడి దేవత}; కైవడిన్ = వలె; దేవ = దేవతల; దానవ = రాక్షసుల; సంఘాత = సమూహము యొక్క; కరతల = అరచేతులచేత; సవ్యాపసవ్య = కుడిఎడమల తిరుగునట్లు; సమాకృష్యమాణ = లాగబడుచున్న; పన్నగేంద్ర = వాసుకిసర్పరాజు అను {పన్నగేంద్రుడు - పన్నగ (సర్పము)లకు రాజు, వాసుకి}; పాశ = తాడుచేత; పరివలయిత = చుట్టబడుటచేత; పర్యాయ = క్రమముగా; పరిభ్రాంత = తిరుగుచున్నట్టి; మందర = మందర అను; అచల = పర్వతము అను; మంథాన = కవ్వముచేత; మథ్యమాన = చిలుకబడుతున్న; ఘూర్ణిత = తిరుగుటలువలన; ఘమఘమ = ఘమఘమ అనెడి ధ్వని; ఆయిత = చేయుచున్న; మహార్ణవ = మహాసముద్రము; మధ్యంబునన్ = నడిమి; నుండి = ముండి; చనుదెంచు = వచ్చుచున్న; ఇందిరాసుందరీ = లక్మీదేవివంటి; వైభవంబునన్ = వైభవముతో; బహు = అనేక; విధ = రకముల; ప్రభా = కాంతులచేత; ప్రభాసమాన = మిక్కిలి ప్రకాశించునది; ఐ = అయ్యి; ఇందుధరసుందరీ = పార్వతీదేవి {ఇందుధర సుందరి - ఇందుధర (శివుని) సుందరి, పార్వతి}; మందిరంబున్ = గుడినుండి; వెడలి = బయలుదేరి; మానసకాసార = మానససరోవరములోని; హేమ = బంగారు; కమల = పద్మముల; కానన =నివాసము లందు; విహారమాణ = విహరించుచున్న; మత్త = మదించిన; మరాళంబు = హంస; భంగిన్ = వలె; మంద = మెల్లని; గమనంబునన్ = నడకతో; కనక = బంగారు; కలశ = కలశముల; యుగళ = జంటతో; సంకాశ = సరిపోలునట్టి; కర్కశ = కఠినములైన; పయోధర = స్తనముల {పయోధరము - పయః (పాలను) ధరించునది, కుచము}; భార = బరువుచేత; పరికంప్యమాన = మిక్కిలి ఊపబడుతున్న; మధ్య = నడుము కలామె; ఐ = అయ్యి; రత్న = మణులు పొదిగిన; ముద్రికా = ఉంగరములుచే; అలంకృతంబు = అలకరింపబడినది; ఐన = అయిన; కెంపు = ఎఱ్ఱని; కేలన్ = చేతితో; ఒక్క = ఒక; సఖీ = చెలికత్తెలలో; లలామ = శ్రేష్ఠురాలు; కైన్ = చేతిని; దండగొని = అసరాతీసుకొని; రత్న = మణుల; నివహ = సమూహముల; సమంచిత = చక్కగా అలంకరించిన; కాంచన = బంగారు; కర్ణపత్ర = చెవికమ్మల; మయూఖంబులు = కాంతులు; గండభాగంబులన్ = చెక్కిళ్ళపై; నర్తనంబులు = నాట్యములు; సలుపన్ = చేయుచుండగా; అరవింద = పద్మములయొక్క; పరిమళ = సువాసనలందలి; కుతూహల = కౌతుకముచేత; అవతీర్ణ = వాలిన; మత్త = మదించిన; మధుకరంబులన్ = తుమ్మెదల; మాడ్కిన్ = వలె; అరాళంబులు = ఉంగరాలు తిరిగినవి; ఐన = అయిన; కుంతల = తలవెంట్రుకల; జాలంబులు = సమూహములు; ముఖిన్ = ముఖము అను; మండలంబునన్ = బింబమునందు; క్రందుకొనన్ = కమ్ముకొనగా; సుందర = అందమైన; మందహాస = చిరునవ్వుల; రోచులు = కాంతులు; దిశలు = నలుదిక్కుల; అందున్ = అందు; బాల = లేత; చంద్రికా = వెన్నెలల; సౌందర్యంబున్ = అందమును; ఆవహింపన్ = కలుగజేయగా; అధర = కిందపెదవి అనెడి; బింబఫల = దొండపండు వంటి; అరుణ = ఎఱ్ఱనైన; మరీచి = కిరణ, కాంతి; మాలికలు = సమూహములు; రదన = పండ్లు అనెడి; కుంద = మల్లె; కుట్మంబుల్ = మొగ్గల; కున్ = కు; అనురాగంబున్ = అనురక్తి, ఎఱ్ఱదనము; సంపాదింపన్ = కలుగజేయగా; మనోజాత = మన్మథుని; కేతన = జండాను; సన్నింభంబు = సరిపోలునట్టిది; ఐన = అయిన; పయ్యెద = పైట; కొంగు = అంచు; తూగన్ = వేలాడుచుండగా; సువర్ణ = బంగారు; మేఖలా = మొలనూలు యందు; ఘటిత = కూర్చబడిన; మణి = మణుల; కిరణ = కాంతుల; పటలంబులు = సమూహములు; అకాల = కాలము కాని కాలములోని; శక్రచాప = ఇంద్రధనుస్సు; జనకంబులు = పుట్టించునవి; ఐ = అయ్యి; మెఱయన్ = ప్రకాశించుచుండగా; చెఱకువిలుతుండు = మన్మథుడు {చెఱకు విలుతుడు - చెరకుగడ ధనుస్సుగా కలవాడు, మన్మథుడు}; ఒరన్ = ఒరనుండి; పెఱకి = దూసి; వాడి = పదునైన; ఇడి =ఉంచి; జళిపించినన్ = చలింపజేయగా; ధగద్ధగ = ధగద్ధగమనెడి మెరుపులు; ఆయమానంబులు = కలుగునవి; అగు = ఐన; బాణంబులన్ = బాణముల; పగిదిన్ = వలె; సు = మిక్కిలి; రుచిర = కాంతివంతమైన; విలోకన = చూపుల; నికరంబులున్ = సమూహములు; రాజ = రాజుల; వీరుల = శూరుల; హృదయంబులున్ = మనస్సులను; భేదింపన్ = బద్దలుకొడుతుండగా; శింజాన = శింజా అని (శింజ - అందెలధ్వని అందలి ధన్వన్యనుకరణ); మంజు = మనోజ్ఞములైన; మంజీర = కాలిఅందెల; నినదంబులు = శబ్దములు; చెవులన్ = చెవులకు; పండువులు = వేడుకలు; చేయన్ = కలిగించుచుండగా; పాదసంచారంబున = కాలినడకతో; హరి = కృష్ణుడు; రాక = వచ్చుటకు; ఎదురుచూచుచు = ఎదురుచూస్తు; వీర = వీరులను; మోహిని = మోహింపజేయునామె; ఐ = అయ్యి; చనుదెంచుచున్న = వస్తున్న; సమయంబునన్ = సమయమునందు.
భావము:- ఇలా రుక్మిణీదేవి ఉమామహేశ్వరుల గుడినుంచి బయటకు వస్తోంది. అప్పుడు ఆమె తొలకరిమేఘాల్లోంచి బయటకు వచ్చి మెరసే మేఘంలా, లేడి చిహ్నమున్న చంద్రమండలంలోంచి బయటకు వచ్చిన లేడిలా ఉంది. బ్రహ్మదేవుడనే దర్శకుడు ఎత్తిన నాటకాల తెర మరుగునుంచి బయటకు వచ్చి వేషం ధరించిన మోహినీదేవతలా ఉంది. సముద్రమథన సమయంలో దేవదానవులు చేతులు కలిపి వాసుకి అనే కవ్వం తాడు కట్టిన మందర పర్వతమనే కవ్వం చిలుకుతుండగా పాలసముద్రం లోంచి వెలువడ్డ లక్మీదేవి లాంటి వైభవంతో, మానస సరోవరంలోని బంగారు కమలాల సమూహంలో విహరిస్తున్న కలహంసలా మందగమనంతో వస్తోంది. బంగారు జంట కలశాల్లాంటి స్తనద్వయం బరువుకి నడుము ఊగుతూంది. రత్నాల ఉంగరాలు అలంకరించిన చెయ్యి ఒక చెలికత్తె భుజం మీద వేసింది. రత్నాల బంగారు కర్ణాభరణాల కాంతులు చెక్కిళ్ళపై పరచు కుంటున్నాయి. పద్మాల సువాసనలకి మత్తెక్కిన తుమ్మెదల్లా ముంగురులు మోముపై కదుల్తున్నాయి. అందమైన చిరునవ్వుల కాంతులు నల్దిక్కుల లేతవెన్నెలలా ప్రకాశిస్తున్నాయి. దొండపండు లాంటి పెదవి కాంతుల వల్ల తెల్లని మల్లెమొగ్గల్లాంటి దంతాలు ఎఱ్ఱబారాయి. మన్మథుని జండాలా పైటకొంగు ఊగుతుంది. బంగారపు వడ్డాణం లోని రత్నాల కాంతులు అకాల ఇంద్రధనుస్సు మెరుపులు పుట్టిస్తున్నాయి మన్మథుడి ఒరలోంచి దూసిన బాణముల మెరపులలా ఆమె మనోహరమైన చూపులు రాకుమారుల మనస్సులను ఛేదిస్తున్నాయి. మోగుతున్న కాలిగజ్జెల మనోఙ్ఞమైన గలగలలు చెవులకు పండుగ చేస్తున్నాయి. అలా కృష్ణుడిరాక కోసం ఎదురు చూస్తూ వీరమోహినిలా రుక్మిణీదేవి వస్తోంది. అప్పుడు.

68
ళినీలాలకఁ బూర్ణచంద్రముఖి, నేణాక్షిం, బ్రవాళాధరం,
కంఠిన్, నవపల్లవాంఘ్రియుగళన్, గంధేభకుంభస్తనిం,
బులినశ్రోణి నిభేంద్రయాన, నరుణాంభోజాతహస్తన్, మహో
త్ప గంధిన్, మృగరాజమధ్యఁ గని విభ్రాంతాత్ములై రందఱున్.
టీక:- ఇట్లు = ఈ విధముగ; మేఘ = మబ్బుల; మధ్యంబున్ = నడుమనుండి; వెలువడి = బయటపడి; విలసించు = ప్రకాశించునట్టి; క్రొక్కారు =తొలకరి; మెఱుంగు = మెరుపుల; తెఱంగున = వలె; మృగధర = చంద్ర {మృగధరుడు - లేడి రూపును బింబమున ధరించినవాడు, చంద్రుడు}; మండలంబున్ = మండలమునుండి; నిర్గమించి = వెలువడి; చరించు = తిరుగుచున్నట్టి; మృగంబు = లేడి; చందంబునన్ = వలె; కమలభవ = బ్రహ్మదేవుడు అనెడి; నర్తకుండు = నాటకము లాడించువాడు; ఎత్తిన = పైకెత్తిన; జవనిక = తెర {యవనిక (ప్ర) - జవనిక (వి)}; మఱుగు = చాటునుండి; తెరలి = బయటకు వచ్చి; పొడచూపిన = కనబడిన; మోహినీదేవత = మోహినీదేవత {మోహినీదేవత - లోకమును మోహింపజేసెడి దేవత}; కైవడిన్ = వలె; దేవ = దేవతల; దానవ = రాక్షసుల; సంఘాత = సమూహము యొక్క; కరతల = అరచేతులచేత; సవ్యాపసవ్య = కుడిఎడమల తిరుగునట్లు; సమాకృష్యమాణ = లాగబడుచున్న; పన్నగేంద్ర = వాసుకిసర్పరాజు అను {పన్నగేంద్రుడు - పన్నగ (సర్పము)లకు రాజు, వాసుకి}; పాశ = తాడుచేత; పరివలయిత = చుట్టబడుటచేత; పర్యాయ = క్రమముగా; పరిభ్రాంత = తిరుగుచున్నట్టి; మందర = మందర అను; అచల = పర్వతము అను; మంథాన = కవ్వముచేత; మథ్యమాన = చిలుకబడుతున్న; ఘూర్ణిత = తిరుగుటలువలన; ఘమఘమ = ఘమఘమ అనెడి ధ్వని; ఆయిత = చేయుచున్న; మహార్ణవ = మహాసముద్రము; మధ్యంబునన్ = నడిమి; నుండి = ముండి; చనుదెంచు = వచ్చుచున్న; ఇందిరాసుందరీ = లక్మీదేవివంటి; వైభవంబునన్ = వైభవముతో; బహు = అనేక; విధ = రకముల; ప్రభా = కాంతులచేత; ప్రభాసమాన = మిక్కిలి ప్రకాశించునది; ఐ = అయ్యి; ఇందుధరసుందరీ = పార్వతీదేవి {ఇందుధర సుందరి - ఇందుధర (శివుని) సుందరి, పార్వతి}; మందిరంబున్ = గుడినుండి; వెడలి = బయలుదేరి; మానసకాసార = మానససరోవరములోని; హేమ = బంగారు; కమల = పద్మముల; కానన =నివాసము లందు; విహారమాణ = విహరించుచున్న; మత్త = మదించిన; మరాళంబు = హంస; భంగిన్ = వలె; మంద = మెల్లని; గమనంబునన్ = నడకతో; కనక = బంగారు; కలశ = కలశముల; యుగళ = జంటతో; సంకాశ = సరిపోలునట్టి; కర్కశ = కఠినములైన; పయోధర = స్తనముల {పయోధరము - పయః (పాలను) ధరించునది, కుచము}; భార = బరువుచేత; పరికంప్యమాన = మిక్కిలి ఊపబడుతున్న; మధ్య = నడుము కలామె; ఐ = అయ్యి; రత్న = మణులు పొదిగిన; ముద్రికా = ఉంగరములుచే; అలంకృతంబు = అలకరింపబడినది; ఐన = అయిన; కెంపు = ఎఱ్ఱని; కేలన్ = చేతితో; ఒక్క = ఒక; సఖీ = చెలికత్తెలలో; లలామ = శ్రేష్ఠురాలు; కైన్ = చేతిని; దండగొని = అసరాతీసుకొని; రత్న = మణుల; నివహ = సమూహముల; సమంచిత = చక్కగా అలంకరించిన; కాంచన = బంగారు; కర్ణపత్ర = చెవికమ్మల; మయూఖంబులు = కాంతులు; గండభాగంబులన్ = చెక్కిళ్ళపై; నర్తనంబులు = నాట్యములు; సలుపన్ = చేయుచుండగా; అరవింద = పద్మములయొక్క; పరిమళ = సువాసనలందలి; కుతూహల = కౌతుకముచేత; అవతీర్ణ = వాలిన; మత్త = మదించిన; మధుకరంబులన్ = తుమ్మెదల; మాడ్కిన్ = వలె; అరాళంబులు = ఉంగరాలు తిరిగినవి; ఐన = అయిన; కుంతల = తలవెంట్రుకల; జాలంబులు = సమూహములు; ముఖ = ముఖము అను; మండలంబునన్ = బింబమునందు; క్రందుకొనన్ = కమ్ముకొనగా; సుందర = అందమైన; మందహాస = చిరునవ్వుల; రోచులు = కాంతులు; దిశలు = నలుదిక్కుల; అందున్ = అందు; బాల = లేత; చంద్రికా = వెన్నెలల; సౌందర్యంబున్ = అందమును; ఆవహింపన్ = కలుగజేయగా; అధర = కిందపెదవి అనెడి; బింబఫల = దొండపండు వంటి; అరుణ = ఎఱ్ఱనైన; మరీచి = కిరణ, కాంతి; మాలికలు = సమూహములు; రదన = పండ్లు అనెడి; కుంద = మల్లె; కుట్మంబుల్ = మొగ్గల; కున్ = కు; అనురాగంబున్ = అనురక్తి, ఎఱ్ఱదనము; సంపాదింపన్ = కలుగజేయగా; మనోజాత = మన్మథుని; కేతన = జండాను; సన్నింభంబు = సరిపోలునట్టిది; ఐన = అయిన; పయ్యెద = పైట; కొంగు = అంచు; తూగన్ = వేలాడుచుండగా; సువర్ణ = బంగారు; మేఖలా = మొలనూలు యందు; ఘటిత = కూర్చబడిన; మణి = మణుల; కిరణ = కాంతుల; పటలంబులు = సమూహములు; అకాల = కాలము కాని కాలములోని; శక్రచాప = ఇంద్రధనుస్సు; జనకంబులు = పుట్టించునవి; ఐ = అయ్యి; మెఱయన్ = ప్రకాశించుచుండగా; చెఱకువిలుతుండు = మన్మథుడు {చెఱకు విలుతుడు - చెరకుగడ ధనుస్సుగా కలవాడు, మన్మథుడు}; ఒరన్ = ఒరనుండి; పెఱకి = దూసి; వాడి = పదును; ఇడి =ఉంచి; జళిపించినన్ = చలింపజేయగా; ధగద్ధగ = ధగద్ధగమనెడి మెరుపులు; ఆయమానంబులు = కలుగునవి; అగు = ఐన; బాణంబులన్ = బాణముల; పగిదిన్ = వలె; సు = మిక్కిలి; రుచిర = కాంతివంతమైన; విలోకన = చూపుల; నికరంబులున్ = సమూహములు; రాజ = రాజుల; వీరుల = శూరుల; హృదయంబులున్ = మనస్సులను; భేదింపన్ = బద్దలుకొడుతుండగా; శింజాన = శింజా అని (శింజ - అందెలధ్వని అందలి ధన్వన్యనుకరణ); మంజు = మనోజ్ఞములైన; మంజీర = కాలిఅందెల; నినదంబులు = శబ్దములు; చెవులన్ = చెవులకు; పండువులు = వేడుకలు; చేయన్ = కలిగించుచుండగా; పాదసంచారంబున = కాలినడకతో; హరి = కృష్ణుడు; రాక = వచ్చుటకు; ఎదురుచూచుచు = ఎదురుచూస్తు; వీర = వీరులను; మోహిని = మోహింపజేయునామె; ఐ = అయ్యి; చనుదెంచుచున్న = వస్తున్న; సమయంబునన్ = సమయమునందు.
భావము:- తుమ్మెదల వంటి నల్లని ముంగురులు, పూర్ణ చంద్రుడు వంటి గుండ్రటి ముఖము, లేడి కన్నులు, పగడాల లాంటి పెదవులు, కోకిల కంఠధ్వని, కొంజిగురుల వంటి పాదములు, మదగజాల కుంభస్థలాల లాంటి స్తనాలు, ఇసుక తిన్నెల లాంటి పిరుదులు, దిగ్గజాల నడక లాంటి నడక, క్రెందామరల లాంటి అరచేతులు, గొప్ప కలువల సువాసనలు, సింహం నడుము కల ఆ రుక్మిణిని చూసి అందరు విభ్రాంతి చెందారు.

69
మఱియు న య్యింతి దరహాస లజ్జావనోకంబులం జిత్తంబు లేమఱి ధైర్యంబులు దిగనాడి, గాంభీర్యంబులు విడిచి, గౌరవంబులు మఱచి, చేష్టలు మాని, యెఱుక లుడిగి, యాయుధంబులు దిగవైచి, గజ తురగ రథారోహణంబులు చేయనేరక, రాజులెల్ల నేలకు వ్రాలి; రా యేణీలోచన తన వామకర నఖంబుల నలకంబులు దలఁగం ద్రోయుచు నుత్తరీయంబు చక్కనొత్తుచుఁ గడకంటి చూపులం గ్రమంబున నా రాజలోకంబు నాలోకించుచు.
టీక:- మఱియున్ = అంతేకాకుండా; ఆ = ఆ యొక్క; ఇంతి = పడతి, స్త్రీ; దరహాస = చిరునవ్వులతో; లజ్జా = సిగ్గుతో కూడిన; అవలోకనంబులన్ = చూపులచేత; చిత్తంబులు = మనస్సులు; ఏమఱి = పరాకుపడి; ధైర్యంబులు = తాలుములు; దిగనాడి = విడిచి; గాంభీర్యంబులు = పెద్దరికములు; విడిచి = వదలి; గౌరవంబులు = గొప్పతనములు; మఱచి = మరిచిపోయి; చేష్టలు = అవయవముల కదలికలు; మాని = లేనివారై; ఎఱుకలు = తెలివిడి; ఉడిగి = నశించి; ఆయుధంబులున్ = ఆయుధములను; దిగవైచి = జారవిడిచి; గజ = ఏనుగులు; తురగ = గుఱ్ఱములు; రథా = రథములు; ఆరోహణంబులు = ఎక్కుటలు; చేయనేరక = చేయలేక; రాజులు = రాజులు; ఎల్లన్ = అందరు; నేల = భూమి; కున్ = మీదకి; వ్రాలిరి = ఒరగిరి; ఆ = ఆ యొక్క; ఏణీలోచన = సుందరి {ఏణీలోచన - లేడివంటి కన్నులు కలామె, స్త్రీ}; తన = ఆమె యొక్క; వామ = ఎడమ; కర = చేతి; నఖరంబులన్ = గోళ్ళతో; అలకంబులన్ = ముంగురులను; తలంగద్రోయుచున్ = ఎగదోసికొనుచు; ఉత్తరీయంబున్ = పైబట్ట, పైటను; చక్కన్ = చక్కగా; ఒత్తుచున్ = సవరించుకొనుచు; కడకంటి = కడకన్నుల; చూపులన్ = చూపులచేత; క్రమంబునన్ = క్రమముగా; ఆ = ఆ యొక్క; రాజ = రాజుల; లోకంబున్ = సమూహమును; ఆలోకించుచు = చూస్తు.
భావము:- అంతేకాదు. అలా గౌరీపూజ పూజచేసి దేవాలయం బయటకు వచ్చిన రుక్మిణీవనిత సౌందర్యానికి విభ్రాంతులైన అక్కడి రాజులందరు ఆమె చిరునవ్వులకి, సిగ్గులతో కూడిన ఓరచూపులకి మనసులు కరిగిపోయి, ధైర్యాలు వదిలారు; గాంభీర్యాలు విడిచిపెట్టి. గౌరవమర్యాదలు మరిచారు; చేష్టలుదక్కి మైమరచారు; ఆయుధాలు జారవిడిచారు; ఏనుగులు గుఱ్ఱాలు రథాలు ఎక్కలేక నేలకు వాలారు; ఆ లేడి కన్నుల చిన్నదేమో తన ఎడంచేతి గోరుతో ముంగురులు సరిచేసుకుంటోంది; పైట సర్దుకుంటోంది; కడగంటి చూపులతో ఆ రాజ సమూహాన్ని పరిశీలిస్తోంది.

70
నియెన్ రుక్మిణి చంద్రమండలముఖుం, గంఠీరవేంద్రావల
గ్ను, వాంభోజదళాక్షుఁ, జారుతరవక్షున్, మేఘసంకాశదే
హు, గారాతి గజేంద్రహస్త నిభ బాహుం, జక్రిఁ, బీతాంబరున్,
భూషాన్వితుఁ గంబుకంఠు, విజయోత్కంఠున్ జగన్మోహనున్.
టీక:- కనియెన్ = చూసెను; రుక్మిణి = రుక్మిణీదేవి; చంద్రమండల = చంద్రబింబము వంటి; ముఖున్ = ముఖము కలవానిని; కంఠీరవ = సింహ; ఇంద్ర = శ్రేష్ఠము వంటి; అవలగ్నున్ = నడుము కలవానిని; నవ = సరికొత్త; అంభోజ = తామర; దళ = రేకులవంటి; అక్షున్ = కన్నులు కలవానిని; చారుతర = మిక్కిలి అందమైన {చారు - చారుతరము - చారుతమము}; వక్షున్ = వక్షస్థలము కలవానిని; మేఘ = మేఘములను; సంకాశ = పోలిన; దేహున్ = దేహము కలవానిని; నగారాతిగజేంద్ర = ఐరావతము యొక్క {నగారాతిగజేంద్రము - నగ (పర్వతములకు) ఆరాతి (శత్రువు) ఐన ఇంద్రుని గజశ్రేష్ఠము, ఐరావతము}; హస్త = తొండము; నిభ = వంటి; బాహున్ = చేతులు కలవానిని; చక్రిన్ = చక్రాయుధుని, కృష్ణుని; పీతాంబరున్ = పసుపువన్నె వస్త్రము వాని; ఘన = గొప్ప; భూష = ఆభరణములు; ఆన్వితున్ = కూడినవానిని; కంబు = శంఖము వంటి; కంఠున్ = మెడ కలవానిని; విజయ = జయించుట యందు; ఉత్కంఠున్ = ఉత్కంఠము కలవానిని; జగత్ = లోకములను; మోహనున్ = మోహింపజేయువానిని.
భావము:- రుక్మిణీదేవి కృష్ణుణ్ణి కనుగొంది; అప్పుడు కృష్ణుడు చంద్రమండలం లాంటి మోము, సింహం లాంటి నడుము, నవనవలాడే పద్మదళాల్లాంటి కన్నులు, విశాలమైన వక్షస్థలము, మేఘం లాంటి శరీరవర్ణం, దేవేంద్రుని ఐరావతం యొక్క తొండం లాంటి చేతులు, శంఖం లాంటి మెడ కలిగి ఉన్నాడు; పీతాంబరాలు, గొప్ప భూషణాలు ధరించి ఉన్నాడు; విజయం సాధించాలనే ఉత్సాహంతో సర్వ లోక మనోహరంగా ఉన్నాడు;

రుక్మిణీ గ్రహణంబు

71
కని తదీయ రూప వయో లావణ్య వైభవ గాంభీర్య చాతుర్య తేజో విశేషంబులకు సంతసించి, మనోభవశరాక్రాంతయై రథారోహణంబు గోరుచున్న య వ్వరారోహం జూచి, పరిపంథి రాజలోకంబు చూచుచుండ మందగమనంబున గంధసింధురంబు లీలం జనుదెంచి ఫేరవంబుల నడిమి భాగంబుఁ గొనిచను కంఠీరవంబు కైవడి, నిఖిల భూపాలగణంబుల గణింపక దృణీకరించి, రాజకన్యకం దెచ్చి హరి తన రథంబుమీఁద నిడికొని భూనభోంతరాళంబు నిండ శంఖంబు పూరించుచు బలభద్రుండు తోడ నడవ, యాదవవాహినీ పరివృతుండై ద్వారకానగర మార్గంబు పట్టి చనియె; నంత జరాసంధవశు లైన రాజు లందఱు హరిపరాక్రమంబు విని సహింప నోపక.
టీక:- కని = చూసి; తదీయ = అతని; రూప = రూపసౌందర్యము; వయః = యౌవనపు; లావణ్య = దేహకాంతి; వైభవ = వైభవములు; గాంభీర్య = గంభీరత; చాతుర్య = నేర్పులు; తేజః = తేజస్సుల; విశేషంబుల్ = విశిష్టతల; కున్ = కు; సంతసించి = సంతోషించి; మనోభవ = మన్మథుని; శరా = బాణములచేత; ఆక్రాంత = ఆక్రమింపబడినామె; ఐ = అయ్యి; రథా = రథమును; ఆరోహణంబున్ = ఎక్కుటను; కోరుచున్న = కోరుకుంటున్న; ఆ = ఆ యొక్క; వరారోహన్ = సుందరిని {వరారోహ - శ్రేష్ఠమైన పిరుదులు కలామె, స్త్రీ}; చూచి = చూసి; పరిపంథి = శత్రు; రాజ = రాజుల; లోకంబున్ = సమూహము; చూచుచుండన్ = చూస్తుండగా; మంద = మెల్లని; గమనంబునన్ = నడకలతో; గంధ = మదించిన; సింధురంబు = ఏనుగు; లీలన్ = వలె; చనుదెంచి = వచ్చి; ఫేరవంబుల = నక్కల; నడిమి = మధ్యన గల; భాగంబున్ = అమిష ఖండమును; కొని = తీసికొని; చను = పోవు; కంఠీరవంబు = సింహము; కైవడిన్ = వలె; నిఖిల = ఎల్ల; భూపాల = రాజుల; గణంబులన్ = సమూహములను; గణింపక = లెక్కజేయక; తృణీకరించి = తృణప్రాయముగా ఎంచి; రాజకన్యకన్ = రాకుమారిని; తెచ్చి = తీసుకు వచ్చి; హరి = కృష్ణుడు; తన = అతని యొక్క; రథంబు = రథము; మీదన్ = పై; ఇడుకొని = పెట్టుకొని; భూనభోంతరాళంబు = భూమ్యాకాశమధ్యనంతా; నిండన్ = నిండునట్లు; శంఖంబున్ = శంఖమును; పూరించుచున్ = ఊదుతూ; బలభద్రుండు = బలరాముడు; తోడన్ = వెంట; నడవ = రాగా; యాదవ = యాదవుల; వాహినీ = సేనలచే; పరివృతుండు = చుట్టును ఉన్నవాడు; ఐ = అయ్యి; ద్వారకా = ద్వారకా; నగర = పట్టణము; మార్గంబున్ = దారి; పట్టి = వెంబడి; చనియెన్ = వెళ్ళెను; అంత = అప్పుడు; జరాసంధ = జరాసంధునికి; వశులు = లోబడి ఉన్నవారు; ఐన = అయిన; రాజులు = రాజులు; అందఱున్ = ఎల్లరు; హరి = కృష్ణుని; పరాక్రమంబున్ = పరాక్రమ వృత్తాంతము; విని = విని; సహింపన్ = ఓర్వ; ఓపక = చాలక.
భావము:- అలా గౌరీపూజ చేసుకొని బయటకు వచ్చిన రుక్మిణి, కృష్ణుని చూసింది. అతని సౌందర్యం, యౌవనం, లావణ్యం, వైభవం, గాంభీర్యం, నేర్పరితనం, తేజస్సుల అతిశయానికి సంతోషించింది. మన్మథ బాణాలకు గురై రథం ఎక్కాలని ఆశ పడుతున్న ఆమెను చూసాడు కృష్ణమూర్తి. సింహం తిన్నగా వచ్చి నక్కల మధ్యన ఉన్న ఆహారాన్ని పట్టుకు పోయినట్లు శత్రుపక్షం రాజులందరు చూస్తుండగా వాళ్ళని లెక్కచేయకుండా రాకుమారిని రథం ఎక్కించుకొని భూమ్యాకాశాలు నిండేలా శంఖం పూరిస్తూ ద్వారకకు వెళ్ళే దారి పట్టాడు. బలరాముడు యాదవ సైన్యాలు అనుసరిస్తున్నారు. అప్పుడు కృష్ణుని పరాక్రమం చూసి జరాసంధుని పక్షం రాజులు సహించలేకపోయారు.

72
" సింహంబుల కీర్తి నీచమృగముల్ గైకొన్న చందంబునన్
కీర్తుల్ గొని బాలఁ దోడ్కొనుచు నున్మాదంబుతో గోపకుల్
నుచున్నా రదె; శౌర్య మెన్నటికి? మీ స్త్రాస్తముల్ గాల్పనే?
నుమధ్యన్ విడిపింపమేని నగరే ధాత్రీజనుల్ క్రంతలన్."
టీక:- ఘన = గొప్ప; సింహంబుల = సింహముల యొక్క; కీర్తిన్ = కీర్తిని; నీచ = అల్పమైన; మృగముల్ = జంతువులు; కైకొన్న = తీసుకొన్న; చందంబునన్ = విధముగ; మన = మన యొక్క; కీర్తుల్ = కీర్తులను; కొని = తీసుకొని; బాలన్ = కన్యను; తోడ్కొనుచున్ = కూడ తీసుకొని; ఉన్మాదంబు = ఒళ్ళు తెలియని తనము; తోన్ = తోటి; గోపకుల్ = గొల్లవారు; చనుచున్నారు = పోవుచున్నారు; అదె = అదిగో; శౌర్యము = పరాక్రమము; ఎన్నటికిన్ = ఇక ఎప్పుడు చూపాలి; మీ = మీ యొక్క; శస్త్ర = శస్త్రములు; అస్త్రములు = అస్త్రములు; కాల్పనే = దేనికి తగులబెట్టుటకా; తనుమధ్యన్ = యువతిని {తనుమధ్య - తను (సన్నని) మధ్య (నడుము కలామె), స్త్రీ}; విడిపింపమేని = విడిపించకపోయినచో; నగరే = నవ్వరా, ఎగతాళిచేయరా; ధాత్రీ = రాజ్యంలోని, భూలోక; జనుల్ = ప్రజలు; క్రంతలన్ = వీధులలో.
భావము:- "గొప్ప గొప్ప సింహాల పరువు నీచమైన జంతువులు తీసేసినట్లు, మన పరువు తీసి కృష్ణుడు రుక్మిణీ పడతిని పట్టుకు పోతున్నాడు. అదిగో చూడండి, గొల్లలు ఉద్రేకంగా పారిపోతున్నారు. రాకుమారిని విడిపించ లేకపోతే మన పరాక్రమా లెందుకు. మన అస్త్రశస్త్రా లెందుకు దండగ. లోకులు నవ్వరా." అని జరాసంధాదులు తమలో తాము హెచ్చరించుకోసాగారు.

73
అని యొండొరులఁ దెలుపుకొని, రోషంబులు హృదయంబుల నిలుపుకొని, సంరంభించి, తనుత్రాణంబులు వహించి, ధనురాది సాధనంబులు ధరియించి, పంతంబులాడి, తమతమ చతురంగబలంబులం గూడి, జరాసంధాదులు యదువీరుల వెంటనంటఁ దాఁకి, "నిలునిలు"మని ధిక్కరించి పలికి, యుక్కుమిగిలి, మహీధరంబుల మీఁద సలిలధారలు కురియు ధారాధరంబుల చందంబున బాణవర్షంబులు గురియించిన యాదవసేనలం గల దండనాయకులు కోదండంబు లెక్కిడి, గుణంబులు మ్రోయించి, నిలువంబడి; రప్పుడు.
టీక:- అని = అని; ఒండొరులన్ = ఒకరికొకరు; తెలుపుకొని = చెప్పుకొని; రోషంబులు = పౌరుషములు; హృదయంబులన్ = మనసులలో; నిలుపుకొని = ఉంచుకొని; సంరంభించి = ఆటోపించి; తనుత్రాణంబులున్ = కవచములను; వహించి = ధరించి; ధనుః = ధనుస్సు; ఆది = మొదలగు; సాధనంబులున్ = ఆయుధములు; ధరియించి = ధరించి; పంతంబులు = బింకములు; ఆడి = పలుకుచు; తమతమ = వారివారి; చతురంగబలంబులన్ = చతురంగసైన్యముల; కూడి = తో కలిసి; జరాసంధ = జరాసంధుడు; ఆదులు = మున్నగువారు; యదు = యాదవ; వీరుల = సైనికుల; వెంటన్ = వెంబడి; అంటదాకి = దరిచేరి; నిలునిలుము = ఆగిపొండి; అని = అని; ధిక్కరించి = గద్దించి; పలికి = కేకలువేసి; ఉక్కుమిగిలి = విజృంభించి; మహీధరంబులన్ = కొండల {మహీధరంబులు - నేలను ధరించునవి, కొండలు}; మీదన్ = పైన; సలిల = నీటి; ధారలు = జల్లులు; కురియు = వర్షించు; ధారాధరంబులు = మేఘముల {ధారాధరంబులు - నీటిధారలను కలిగి ఉండునవి, మేఘములు}; చందంబునన్ = వలె; బాణ = బాణముల; వర్షంబులున్ = వానలను; కురియించినన్ = కురిపించగా; యాదవ = యాదవుల; సేనలన్ = సైన్యములలో; కల = ఉన్న; దండనాయకులు = సేనానాయకులు; కోదండంబులు = విల్లులను; ఎక్కిడి = ఎక్కుపెట్టి; గుణంబులున్ = అల్లెతాడులను; మ్రోయించిరి = టంకారములు చేయించిరి; నిలువంబడిరి = అడ్డుపడ్డారు; అప్పుడు = ఆ సమయమునందు.
భావము:- అలా కృష్ణుడు రుక్మిణిని తీసుకుపోతుంటే, జరాసంధుడు మొదలైనవారు ఒకరినొకరు హెచ్చరించుకొని, రోషాలు పెంచుకొన్నారు. కవచాలు, బాణాలు, ఆయుధాలు ధరించారు, పంతాలేసుకొని తమతమ చతురంగ సైన్యాలతో యాదవుల వెంటబడ్డారు. “ఆగక్కడ ఆగక్కడ” అని హుంకరించారు. మేఘాలు కొండలమీద కురిపించే వానధారల్లా బాణ వర్షాలు కురిపించారు. యాదవ సేనానాయకులు విల్లులెక్కుపెట్టి, వింటి తాళ్ళు మోగించి అడ్డుకున్నారు.

74
రిబల భట సాయకముల
రిబలములు గప్పఁబడిన డరెడు భీతిన్
రిమధ్య సిగ్గుతోడను
రివదనముఁ జూచెఁ జకితరిణేక్షణయై.
టీక:- అరి = శత్రువుల; బల = సైన్యములోని; భట = సైనికుల; సాయకములన్ = బాణములచేత; హరి = కృష్ణుని; బలములున్ = సైన్యములు; కప్పబడినన్ = ఆవరింపబడగా; అడరెడు = అతిశయించెడి; భీతిన్ = భయముతో; హరిమధ్య = సుందరి {హరిమధ్య - సింహము వంటి నడుము కలామె, స్త్రీ}; సిగ్గు = సిగ్గు; తోడను = తోటి; హరి = కృష్ణుని; వదనమున్ = ముఖమును; చూచెన్ = చూసెను; చకిత = బెదరిన; హరిణ = లేడి వంటి; ఈక్షణ = చూపులు కలామె; ఐ = అయ్యి.
భావము:- ప్రతిపక్ష సైన్యాల బాణాలు కృష్ణుని సైన్యాన్ని కప్పేస్తుంటే చూసి, సుకుమారి రుక్మిణీదేవి బెదిరిన లేడి చూపులతోను భయంతోను సిగ్గుతోను ముకుందుని కృష్ణుని ముఖం వైపు చూసింది.

75
ఇట్లు చూచిన.
టీక:- ఇట్లు = ఈ విధముగ; చూచినన్ = చూడగా.
భావము:- ఇలా చకితహరిణేక్షణ యై ఆమె కృష్ణుని చూడగా, అతడు ఇలా చెప్పసాగాడు. .

76
"వచ్చెద రదె యదువీరులు
వ్రచ్చెద రరిసేన నెల్ల వైరులు పెలుచన్
నొచ్చెదరును విచ్చెదరును
చ్చెదరును నేఁడు చూడు లజాతాక్షీ!"
టీక:- వచ్చెదరు = ముందుకు వస్తున్నారు; అదె = అదిగో; యదు = యాదవ; వీరులు = సైనికులు; వ్రచ్చెదరు = భేదించెదరు; అరి = శత్రు; సేనన్ = సైన్యమును; ఎల్లన్ = అంతటిని; వైరులున్ = శత్రువులు; పెలుచన్ = మిక్కుటముగ; నొచ్చెదరు = దెబ్బతినెదరు; విచ్చెదరును = చెల్లాచెదురు అగుదురు; చచ్చెదరును = మరణించెదరు; నేడు = ఇవాళ; జలజాతాక్షీ = పద్మాక్షీ, రుక్మిణి.
భావము:- ఇలా చకితహరిణేక్షణ యై ఆమె కృష్ణుని చూడగా “కమలనయనా! రుక్మిణీదేవి! కంగారు పడకు. యాదవ శూరులు వస్తారు. శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడుతారు. పగవారు బాగా నష్టపోతారు, ఓడి చెల్లాచెదరౌతారు, చచ్చిపోతారు చూస్తుండు.” అని ఊరడించసాగాడు.

77
అని రుక్మిణీదేవిని హరి యూరడించె; నంత బలభద్ర ప్రముఖులైన యదువీరులు ప్రళయవేళ మిన్నునం బన్ని బలుపిడుగు లడరించు పెనుమొగుళ్ళ వడువున జరాసంధాది పరిపంథిరాజచక్రంబు మీఁద నవక్ర పరాక్రమంబున శిఖిశిఖా సంకాశ నిశిత శిలీముఖ, నారాచ, భల్ల ప్రముఖంబులైన బహువిధ బాణపరంపరలు గురియ నదియును విదళిత మత్త మాతంగంబును, విచ్ఛిన్న తురంగంబును విభిన్న రథవరూధంబును, వినిహత పదాతియూధంబును, విఖండిత వాహ వారణ రథారోహణ మస్తకంబును, విశకలిత వక్షోమధ్య కర్ణ కంఠ కపోల హస్తంబును, విస్ఫోటిత కపాలంబును, వికీర్ణ కేశజాలంబును, విపాటిత చరణ జాను జంఘంబును, విదళిత దంత సంఘంబును, విఘటిత వీరమంజీర కేయూరంబును, విభ్రష్ట కుండల కిరీట హారంబును, విశ్రుత వీరాలాపంబును, విదార్యమాణ గదా కుంత తోమర పరశు పట్టిస ప్రాస కరవాల శూల చక్ర చాపంబును, వినిపాతిత కేతన చామర ఛత్రంబును, విలూన తనుత్రాణంబును, వికీర్యమాణ ఘోటకసంఘ రింఖాసముద్ధూత ధరణీపరాగంబును, వినష్ట రథ వేగంబును, వినివారిత సూత మాగధ వంది వాదంబును, వికుంఠిత హయహేషా పటహ భాంకార కరటిఘటా ఘీంకార రథనేమి పటాత్కార తురగ నాభిఘంటా ఘణఘణాత్కార వీరహుంకార భూషణ ఝణఝణాత్కార నిస్సాణ ధణధణాత్కార మణినూపుర క్రేంకార కింకిణీ కిణకిణాత్కార శింజనీటంకార భట పరస్పరధిక్కార నాదంబును, వినిర్భిద్యమాన రాజసమూహంబును, విద్యమాన రక్తప్రవాహంబును, విశ్రూయమాణ భూతబేతాళ కలకలంబును, విజృంభమాణ ఫేరవ కాక కంకాది సంకులంబును, బ్రచలిత కబంధంబును బ్రభూత పలల గంధంబును బ్రదీపిత మేదో మాంస రుధిర ఖాదనంబును, బ్రవర్తిత డాకినీ ప్రమోదంబును, నయి యుండె; నప్పుడు.
టీక:- అని = అని; రుక్మిణీదేవిని = రుక్మిణీదేవిని; హరి = కృష్ణుడు; ఊరడించెను = విచారము తగ్గించెను; బలభద్ర = బలరాముడు; ప్రముఖులు = మొదలగువారు; ఐన = అయినట్టి; యదు = యాదవ; వీరులు = శూరులు; ప్రళయవేళ = ప్రళయకాలమునందు; మిన్నునన్ = ఆకాశము నందు; పన్ని = కమ్మి; బలు = బలమైన; పిడుగులన్ = పిడుగులను; అడరించు = వ్యాపింపజేసెడి; పెను = గొప్ప; మొగుళ్ళ = మేఘముల; వడువునన్ = వలె; జరాసంధ = జరాసంధుడు; ఆది = మున్నగు; పరిపంథి = శత్రు; రాజ = రాజుల; చక్రంబు = సమూహము, వ్యూహము; మీదన్ = పైన; అవక్ర = తిరుగులేని; పరాక్రమంబునన్ = శౌర్యముతో; శిఖి = అగ్ని; శిఖా = జ్వాలలతో; సంకాశ = సమానమైన; నిశిత = వాడియైన; శిలీముఖ = ఉక్కు అలుగు బాణము {శిలీముఖము - శల్యము (ముల్లు) కొనయందు కలది, ఇనప ముల్లు బాణము}; నారాచ = ఇనుప బాణము {నారాచము - నరసమూహము ఆచమించునది, అచ్చము ఇనుప బాణము}; భల్ల = భల్లములు, వెడల్పైన ముల్లు కలవి; ప్రముఖంబులు = మొదలగునవి; ఐన = అయిన; బహు = పెక్కు; విధ = విధములైన; బాణ = బాణముల; పరంపరలు = వరుసలను; కురియన్ = జల్లులా వేయగా; అదియును = ఆ శత్రుసేన; విదళిత = నరకబడిన; మత్త = మదపు; మాతంగంబును = ఏనుగులు కలది; విచ్ఛిన్న = మిక్కిలి ఛేదింపబడిన; తురంగంబును = గుఱ్ఱములు కలది; విభిన్న = విరగగొట్టబడిన; రథ = తేరుల యొక్క; వరూధంబును = పైకప్పులు కలది; వినిహత = చంపబడిన; పదాతి = కాల్బలముల; యూధంబును = సమూహము కలది; విఖండిత = నరకబడిన; వాహ = గుఱ్ఱములను; వారణ = ఏనుగులను; రథా = రథములను; ఆరోహణ = ఎక్కిన యోధుల; మస్తకంబును = తలలు కలది; విశకలిత = విచ్ఛేదము చేయబడిన; వక్షః = వక్షస్థలములు; మధ్య = నడుములు; కర్ణ = చెవులు; కంఠ = మెడలు; కపోల = చెక్కిళ్ళు; హస్తంబునున్ = చేతులు కలది; విస్ఫోటిత = పగులగొట్టబడిన; కపాలంబును = తల (పుఱ్ఱె)లు కలది; వికీర్ణ = చెదిరిన; కేశ = తలవెంట్రుకల; జాలంబును = సమూహములు కలది; విపాటిత = విరగగొట్టబడిన; చరణ = పాదములు; జాను = మోకాళ్ళు; జంఘంబునున్ = పిక్కలు కలది; విదళిత = రాలగొట్టబడిన; దంత = దంతముల; సంఘంబును = సమూహము కలది; విఘటిత = విదలగొట్టబడిన; వీర = వీరుల యొక్క; మంజీర = కాలి అందెలు; కేయూరంబును = భుజకీర్తులు కలది; విభ్రష్ట = మిక్కిలి జారిపోయిన; కుండల = చెవికమ్మలు; కిరీట = కిరీటములు; హారంబునున్ = మెడలోని దండలు; విశ్రుత = వినబడిన; వీరాలాపంబును = బింకపు మాటలు కలది; విదార్యమాణ = చెక్కులెగయబడిన; గదా = గదలు; కుంత = ఈటెలు; తోమర = చిల్లకోలు, సర్వలలు, అయిదారు తాళ్ళు కలిగిన కొరడా; పరశు = గండ్రగొడ్డళ్ళు; పట్టిస = పట్టాకత్తులు; ప్రాస = బల్లెములు; కరవాల = కత్తులు; శూల = శూలములు; చక్ర = చక్రాయుధములు; చాపంబును = విల్లులు కలది; వినిపాతిత = కూలగొట్టబడిన; కేతన = టెక్కెములు, జండాలు; చామర = వింజామరలు; ఛత్రంబును = గొడుగులు కలది; విలూన = చీల్చివేయబడిన; తనుత్రాణంబునున్ = కవచములు కలది; వికీర్యమాణ = చెల్లాచెదురు అగుచున్న; ఘోటక = గుఱ్ఱముల {ఘోటకము - భూమి యందు పొరలునది, గుఱ్ఱము}; సంఘ = సమూహముల యొక్క; రింఖా = గిట్టలచే; సముద్ధూత = రేగగొట్టబడిన; ధరణీపరాగంబును = దుమ్ము కలది; వినష్ట = చెడగొట్టబడిన; రథ = తేరుల యొక్క; వేగంబును = వేగము కలది; వినివారిత = నివారింపబడిన; సూత = కీర్తించువారి; మాగధ = ప్రతాపము వర్ణించువారి; వంది = స్తోత్రములు చేయువారి; వాదంబును = పఠించుటలు కలది; వికుంఠిత = మొక్కపోని, తక్కువపడని; హయ = గుఱ్ఱముల; హేషా = సకిలింతలు; పటహ = డప్పు వాయిద్యముల; భాంకార = భాం అనుటలు; కరణి = ఏనుగు; ఘటా = గుంపుల యొక్క; ఘీంకార = గీకలనెడి అరుపులు; రథ = రథముల; నేమి = చక్రముల కమ్ముల; పటాత్కార = పటపట అనుటలు; తురగ = గుఱ్ఱముల; నాభి = బొడ్డు సమీపమున కట్టిన; ఘంటా = గంటల యొక్క; ఘణఘణాత్కార = గణగణ అనుటలు; వీర = యోధుల యొక్క; హుంకార = హుం అనుటలు; భూషణ = ఆభరణముల యొక్క; ఝణఝణత్కార = ఝణఝణ అనుటలు; నిస్సాణ = ఢంకాల యొక్క; ధణధణాత్కార = ధణధణ అనుటలు; మణి = రత్నాల; నూపుర = అందెల; క్రేంకార = క్రేం అనుటలు; కింకిణీ = గజ్జల, చిరుగంటల; కిణకిణత్కార = కిణకిణ అనుటలు; శింజనీ = వింటినారుల యొక్క; టంకార = టం అనుటలు; భట = సైనికులు; పరస్పర = ఒకినొకరు; ధిక్కార = ధిక్కరించుకొనెడి; నాదంబును = ధ్వనులు కలది; వినిర్భిద్యమాన = మిక్కిలి భేదింపబడుతున్న; రాజ = రాజుల యొక్క; సమూహంబును = గుంపులు కలది; విద్యమాన = తెలియబడుతున్న; రక్త = రక్తపు; ప్రవాహంబును = కాలువలు కలది; విశ్రూయమాణ = వినబడుతున్న; భూత = భూతముల యొక్క {భూతము - పిశాచ భేదము}; బేతాళ = బేతాళముల యొక్క {బేతాళము - పిశాచ భేదము}; కలకలంబును = కలకల ధ్వనులు కలది; విజృంభమాణ = చెలరేగుతున్న; ఫేరవ = నక్కలు; కాక = కాకులు; కంక = రాపులుగు, బోరువ; ఆది = మున్నగునవి; సంకులంబును = వ్యాపించినది; ప్రచలిత = మిక్కిలి కదులుతున్న; కబంధంబును = తుళ్ళుతుండెడి తలలేని మొండెములు కలది; ప్రభూత = పుట్టుచున్న; పలల = మాంసము యొక్క; గంధంబును = వాసన కలది; ప్రదీపిత = ప్రకాశింపజేయబడిన; మేదః = మెదడు; మాంస = మాంసము; రుధిర = రక్తముల; ఖాదనంబును = తినుటలు కలది; ప్రవర్తిత = నడపబడుతున్న; డాకినీ = డాకినుల {డాకిని - పిశాచ భేదము}; ప్రమోదంబునున్ = సంతోషములు కలది; అయి = అయ్యి; ఉండె = ఉండెను; అప్పుడు = ఆ సమయమునందు.
భావము:- ఇలా చెప్పి మాధవుడు రుక్మిణిని ఊరడించాడు. ఈలోగా ప్రళయం వచ్చినప్పుడు ఆకాశమంతా కప్పేసి పెద్దపెద్ద పిడుగులు కురిపించే కారు మబ్బులు లాగ బలరాముడు మొదలైన యాదవులు విజృంభించారు. జరాసంధుడు మొదలైన పరపక్ష రాజులందరి మీద అవక్ర పరాక్రమంతో విరుచుకు పడ్డారు. అగ్నికీలలతో సరితూగే ఉక్కుబాణాలు మొదలైన వాడి బాణాలు కురిపించారు. అప్పుడు శత్రు సేనలో ఏనుగులు కూలిపోయాయి, గుఱ్ఱాలు చెల్లాచెదు రయ్యాయి. రథాలు ముక్క లయ్యాయి, కాల్భంట్లు బెదిరి పోయారు, గజాశ్వ రథారోహకుల తలలు తెగి పోయాయి. గుండెలు, నడములు, చెవులు, కంఠాలు, చెక్కిళ్ళు, చేతులు తునాతునక లయ్యాయి. కపాలాలు పగిలిపోయాయి, తలవెంట్రుకల చిక్కులు రాలాయి. పాదాలు, మోకాళ్ళు, పిక్కలు తెగిపోయాయ. దంతాలు రాలిపోయాయి. వీరుల కాలి యందెలు, భుజ కీర్తులు పడిపోయాయి. చెవిపోగులు, కిరీటాలు, కంఠహారాలు జారిపోయాయి. వీరుల సింహనాదాలు మూగబోయాయి. గదలు, బల్లేలు, గుదియలు, గండ్రగొడ్డళ్ళు, అడ్డకత్తులు, ఈటెలు, ఖడ్గాలు, శూలాలు, చక్రాలు, విల్లులు విరిగిపోయాయి. జండాలు, గొడుగులు, వింజామరలు ఒరిగి పోయాయి. కవచాలు పగిలిపోయాయి. గుఱ్ఱాల కాలి గిట్టల తాకిడికి రేగిన దుమ్ము కమ్మేసింది. రథాల వేగం నెమ్మదించింది. వందిమాగధ వైతాళికుల స్తోత్ర పఠనాలు ఆగిపోయాయి. గుఱ్ఱాల సకిలింపులు, భేరీల భాంకారాలు, ఏనుగుగుంపుల ఘీంకారాలు, రథచక్రాల పటపట శబ్దాలు, గుఱ్ఱాల నడుములకు కట్టిన గంటల గణగణలు, వీరుల హుంకారాలు, ఆభరణాల గలగలలు, నగారాల ధణధణలు, మణిమంజీరాల క్రేంకారాలు, మువ్వల గలగలలు, అల్లెతాళ్ళ టంకారాలు, భటులు ఒకరినొకరు ధిక్కరించుకోవడాలు ఆణిగిపోయాయి. రాజ సమూహం చెదిరిపోయింది. నెత్తుటేరులు పారాయి. భూత బేతళాల కలకల ధ్వని వినిపిస్తోంది. నక్కలు, కాకులు, గద్దలు, రాబందులు మొదలైన వాని అరుపులు చెలరేగాయి. తల తెగిన మొండెములు తుళ్ళుతున్నాయి, మాంసం కంపు గొట్టింది. మెదడు, మాంసం తింటూ రక్తం తాగుతూ ఉన్న డాకినీ మొదలైన పిశాచాలకి ఆ రణరంగం ఆనందం కలిగిస్తోంది.

రాజలోక పలాయనంబు

78
గిడి చలించి పాఱుచును మాగధ ముఖ్యులు గూడి యొక్కచో
చుచు నాలిఁ గోల్పడినవాని క్రియం గడు వెచ్చనూర్చుచున్
మొమునఁ దప్పిదేరఁ దమ ముందటఁ బొక్కుచునున్న చైద్యుతోఁ
"తుర చేతిలోఁ బడక ప్రాణముతోడుత నున్నవాఁడవే."
టీక:- మగిడి = వెనుదిరిగి; చలించి = బెదిరిపోయి; పాఱుచును = పారిపోవుచు; మాగధ = జరాసంధుడు; ముఖ్యులున్ = మున్నగువారిని; కూడి = కలిసి; ఒక్క = ఒక; చోన్ = చోట; వగచుచున్ = దుఃఖించుచు; ఆలిన్ = భార్యను; కోల్పడిన = పోగొట్టుకున్న; వాని = వాడి; క్రియన్ = వలె; కడున్ = చాలా; వెచ్చనూర్చుచున్ = వేడినిట్టూర్పులు విడుస్తు; మొగమునన్ = ముఖముమీద; దప్పిదేరన్ = శ్రమము కనబడుతుండ; తమ = వారి; ముందటన్ = ఎదురుగా; పొక్కుచున్న = తపించుచున్న; చైద్యున్ = శిశుపాలుని; తోన్ = తోటి; పగతుర = శత్రువుల; చేతిన్ = చేతికి; లోబడకన్ = చిక్కకుండ; ప్రాణము = ప్రాణాల; తోడుతన్ = తోటి; ఉన్నవాడవే = ఉన్నావా.
భావము:- కృష్ణుని యాదవసేనచేతిలో ఓడి, వెనుదిరిగి పారిపోతున్న జరాసంధుడు మొదలైన వారు ఒకచోట కలిసారు. పెళ్ళం పోయిన వాడిలా ఏడుస్తూ వేడి నిట్టూర్పులు నిట్టూరుస్తూ వడలిన ముఖంతో తమ ముందు వెక్కుతున్న శిశిపాలుడిని చూచారు. “పోన్లే; శత్రువు చేతిలో చావకుండా బతికే ఉన్నావు కదా” అని ఓదార్చేరు.

79
అని మఱియును.
టీక:- అని = అని; మఱియును = ఇంకను.
భావము:- కృష్ణుని యాదవసేనచేతిలో ఓడి, వెనుదిరిగి పారిపోతున్న జరాసంధుడు మొదలైన వారు అతనిని ఓదారుస్తూ,

80
"బ్రతుకవచ్చు నొడలఁ బ్రాణంబు లుండినఁ;
బ్రతుకు గలిగెనేని భార్య గలదు;
బ్రతికితీవు; భార్యట్టు దైవమెఱుంగు;
గవ వలదు చైద్య! లదు వలదు."
టీక:- బ్రతుకవచ్చు = జీవింపగలము; ఒడలన్ = ఒంట్లో; ప్రాణంబులు = ప్రాణములు; ఉండినన్ = ఉన్నచో; బ్రతుక = జీవించి ఉండుట; కలిగెనేనిన = జరిగినచో; భార్య = భార్య; కలదు = ఎక్కడనైన దొరకును; బ్రతికితివి = జీవించి ఉన్నావు; నీవు = నీవు; భార్యన్ = భార్యను; పట్టు =విషయము; దైవము = దేవునికే; ఎఱుంగు = తెలియునులే; వగవన్ = విచారించుట; వలదు = వద్దు; చైద్య = శిశుపాలుడా; వలదువలదు = వద్దేవద్దు.
భావము:- ఇంకా ఇలా చెప్పసాగారు “నాయనా చేదిరాజ! శిశుపాలా! దుఃఖించకు. ఒంట్లో ప్రాణలుంటే ఎలాగైనా బతక వచ్చును. బతికుంటేనే కదా భార్య ఉండేది. పెళ్ళాం మాట దేవుడెరుగు నువ్వు బతికున్నావు. వద్దు. ఇంక అసలు దుఃఖించ వద్దు.

81
"వినుము, దేహధారి స్వతంత్రుండు గాఁడు, జంత్రగానిచేతి జంత్రపుబొమ్మకైవడి నీశ్వరతంత్ర పరాధీనుండై, సుఖదుఃఖంబులందు నర్తనంబులు సలుపుఁ; దొల్లి యేను మథురాపురంబుపైఁ బదియేడు మాఱులు పరాక్రమంబున విడిసి, సప్తదశవారంబులు చక్రిచేత నిర్మూలిత బలచక్రుండనై కామపాలుచేతం బట్టుబడి కృష్ణుండు గరుణ చేసి విడిపించి పుచ్చిన వచ్చి; క్రమ్మఱ నిరువదిమూ డక్షౌహిణులం గూడుకొని పదునెనిమిదవ మాఱు దాడిచేసి శత్రువులం దోలి విజయంబు చేకొంటి; నిట్టి జయాపజయంబులందు హర్షశోకంబులం జెంద నే నెన్నండు; నేటి దినంబున నీ కృష్ణు నెదిరి పోర మన రాజలోకం బెల్ల నుగ్రాక్షుం గూడికొని పోరిన నోడుదు; మింతియ కాక దైవయుక్తంబైన కాలంబునం జేసి లోకంబులు పరిభ్రమించుచుండు; నదియునుం గాక.
టీక:- వినుము = శ్రద్ధగా వినుము; దేహధారి = పురుషుడు {దేహధారి - శరీరము ధరించినవాడు, పురుషుడు}; స్వతంత్రుడు = స్వతంత్రత కలవాడు; కాడు = కాలేడు; జంత్రగాని = సూత్రధారి {యంత్రము (ప్ర) - జంత్రము (వి)}; చేతి = చేతిలోని; జంత్రపుబొమ్మ = కీలుబొమ్మ; కైవడిన్ = వలె; ఈశ్వర = భగవంతుని; తంత్ర = పాలనకు; పరాధీనుండు = ఆధీనుడు; ఐ = అయ్యి; సుఖ = సుఖములను; దుఃఖంబులు = దుఃఖములు; అందు = లో; నర్తనంబులు = నాట్యములు; సలుపున్ = చేయుచుండును; తొల్లి = పూర్వము; ఏను = నేను; మథురాపురంబు = మథురానగరి; పైన్ = మీదికి; పదియేడు = పదిహేడు (17); మాఱులు = పర్యాయములు; పరాక్రమంబునన్ = శౌర్యముతో; విడిసి = చుట్టుముట్టి, దాడిచేసి; సప్తదశ = పదిహేడు (17); వారంబులున్ = పర్యాయములు; చక్రి = కృష్ణుని; చేతన్ = చే; నిర్మూలిత = నాశనముచేయబడిన; బల = సేనా; చక్రుండను = సమూహము గలవాడను; ఐ = అయ్యి; కామపాలు = బలరాముని; చేతన్ = చేతిలో; పట్టుబడి = చిక్కుకొని; కృష్ణుండు = కృష్ణుడు; కరుణ = దయ; చేసి = చూపి; విడిపించి = విడుదల చేయించి; పుచ్చినన్ = పంపగా; వచ్చి = వచ్చి; క్రమ్మఱన్ = మరల; ఇరువదిమూడు = ఇరవైమూడు (23); అక్షౌహిణులన్ = అక్షౌహిణులసేనలు; కూడుకొని = కూడగట్టుకొని; పదునెనిమిదవ = పద్దెనిమిదవ (18); మాఱు = సారి; దాడిచేసి = దండెత్తి; శత్రువులన్ = పగవారిని; తోలి = తఱిమి; విజయంబున్ = విజయమును; చేకొంటిన్ = పొందితిని; ఇట్టి = ఇటువంటి; జయ = గెలుపు; అపజయంబులు = ఓటములు; అందున్ = అందు; హర్ష = సంతోషము; శోకంబులన్ = దుఃఖములను; చెందన్ = పొందను; నేన్ = నేను; ఎన్నడున్ = ఎప్పుడు కూడ; నేటి = ఇవాళ్టి; దినంబునన్ = రోజు; ఈ = ఈ యొక్క; కృష్ణున్ = కృష్ణుడిని; ఎదిరి = ఎదిరించి; పోరన్ = యుద్ధము చేసినచో; మన = మన యొక్క; రాజ = రాజుల; లోకంబు = సమూహము; ఎల్లను = అంత; ఉగ్రాక్షున్ = పరమశివుని {ఉగ్రాక్షుడు - ఉగ్రమైన కన్నులు కలవాడు, శివుడు}; కూడుకొని = కూడగట్టుకొని; పోరినన్ = యుద్ధముచేసినను; ఓడుదుము = ఓడిపోదుము; ఇంతియ = ఇంతే; కాక = కాకుండ; దైవ = దేవుని నిర్ణయమునకు; యుక్తంబు = తగినది; ఐన = అయిన; కాలంబునన్ = కాలము; చేసి = వలన; లోకంబులున్ = సర్వలోకములు; పరిభ్రమించుచున్ = తిరుగుతు; ఉండును = ఉండును; అదియునున్ = అంతే; కాక = కాకుండ.
భావము:- "ఇంకా విను. పురుషుడు స్వతంత్రుడు కాడు. కీలు బొమ్మలాడించే వాడి చేతిలోని కీలుబొమ్మ లాగ ఈశ్వర మాయకు లోనై సుఖదుఃఖాలలో నర్తిస్తుంటాడు. ఇంతకు ముందు నేను మథుర మీద పదిహేడు సార్లు దండెత్తాను. పదిహేడు సార్లు మాధవుని చేతిలో ఓడి బలాల్ని నష్టపోయాను. బలరాముడి చేతికి చిక్కితే కృష్ణుడు దయచూపి విడిపించాడు. పద్దెనిమిదో సారి ఇరవైమూడు అక్షౌహిణుల సేనతో దాడి చేసి శత్రువులని పారదోలి విజయం సాధించా. ఇలాంటి గెలుపోటములకు ఎప్పుడు మోదఖేదములు చెందను. ఇవాళ కనక రుద్రుణ్ణి కూడగొట్టుకొని మన రాజు లందరం కలిసి పోరాడినా కృష్ణుణ్ణి గెలవలేము. ఇది ఇంతే. కాల మహిమని బట్టే లోకం నడుస్తుంటుంది. అంతేకాక

82
కుం గాలము మంచిదైన మనలం ద్రైలోక్య విఖ్యాతి వి
క్రములన్ గెల్చిరి యాదవుల్ హరి భుజార్వంబునన్ నేడు; కా
ము మేలై చనుదెంచెనేని మనమున్ క్షించి విద్వేషులన్
రక్షోణి జయింత; మింతపనికై శంకింప నీ కేటికిన్."
టీక:- తమ = వారి; కున్ = కి; కాలము = కాలము; మంచిది = అనుకూలమైనది; ఐన = కాగా; మనలన్ = మనలను; త్రైలోక్య = ముల్లోకములకు; విఖ్యాతి = ప్రసిద్ధిచెందిన; విక్రములన్ = పరాక్రమము కలవారిని; గెల్చిరి = జయించిరి; యాదవుల్ = యదువంశమువారు; హరి = కృష్ణుని; భుజా = భుజబలము యొక్క; గర్వంబునన్ = అతిశయముచేత; నేడు = ఇవాళ; కాలము = కాలము; మేలు = మనకి అనుకూలము; ఐ = అయ్యి; చనుదెంచినేని = వచ్చినచో; మనమున్ = మనముకూడ; లక్షించి = గురిపెట్టి; విద్వేషులన్ = శత్రువులను; సమరక్షోణిన్ = యుద్ధభూమిలో; జయింతము = గెలుతుము; ఇంత = ఇంతమాత్రపు; పని = విషయము; కై = కోసము; శంకింపన్ = సంకోచపడుట; నీవు = నీ; కున్ = కు; ఏటికిన్ = ఎందుకు.
భావము:- ఇవాళ వారికి కాలం అనుకూలమైంది. ముల్లోకాలలో ప్రసిద్ధికెక్కిన మనల్ని కృష్ణుడి అండతో యాదవులు జయించారు. కాలం కలిసి వస్తే మనం కూడ పగవారిని యుద్ధం లో పడగొడతాం. ఇంతోటి దానికి విచారించడం ఎందుకు.”

రుక్మి యనువాని భంగంబు

83
అని యిట్లు జరాసంధుండు నతని యొద్ది రాజులును శిశుపాలుని పరితాపంబు నివారించి, తమతమ భూములకుం జనిరి; శిశుపాలుండు ననుచర సేనాసమేతుండయి తన నగరంబునకుం జనియె నంత రుక్మి యనువాఁడు కృష్ణుండు రాక్షసవివాహంబునం దన చెలియలిం గొనిపోవుటకు సహింపక, యేకాక్షౌహిణీబలంబుతోడ సమరసన్నాహంబునం గృష్ణుని వెనుదగిలి పోవుచుఁ దన సారథితో యిట్లనియె.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; జరాసంధుండున్ = జరాసంధుడు; అతని = అతని; ఒద్ది = దగ్గరున్న; రాజులును = రాజులు; శిశుపాలుని = శిశుపాలుడు యొక్క; పరితాపంబున్ = విచారమును; నివారించి = పోగొట్టి; తమతమ = వారివారి; భూముల్ = రాజ్యముల; కున్ = కు; చనిరి = వెళ్ళిపోయిరి; శిశుపాలుండున్ = శిశుపాలుండు కూడ; అనుచర = అనుసరించుతున్న; సేనా = సైన్యముతో; సమేతుండు = కూడినవాడు; అయి = ఐ; తన = తన యొక్క; నగరంబున్ = పట్టణమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళిపోయెను; అంత = అటుపిమ్మట; రుక్మి = రుక్మి; అనువాడు = అనెడివాడు; కృష్ణుండు = కృష్ణుడు; రాక్షసవివాహంబున = రాక్షస పెండ్లి పద్దతిలో; తన = అతని; చెలియలిన్ = చెల్లెలును; కొనిపోవుట = తీసుకుపోవుట; కున్ = కు; సహింపకన్ = ఓర్చుకొలేక; ఏక = ఒక; అక్షౌహీణీ = అక్షౌహిణుల; బలంబు = సేనల; తోడన్ = తోటి; సమర = యుద్ధ; సన్నాహంబునన్ = ప్రయత్నముతో; కృష్ణుని = కృష్ణుని; వెనుదగిలి = వెంబడించి; పోవుచున్ = వెళ్తూ; తన = తన యొక్క; సారథి = రథసారథి; తోన్ = తోటి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా చెప్పి శిశుపాలుడి మనోవేదన పోగొట్టి జరాసంధుడు అక్కడి రాజులు తమతమ దేశాలకి వెళ్ళిపోయారు. శిశుపాలుడు తన సేనతో తన పట్టణానికి వెళ్ళిపోయాడు. ఇంతలో రుక్మిణీదేవి అన్న రుక్మి అనువాడు, కృష్ణుడు తన చెల్లెలిని తీసుకుపోవడం సహించక, యుద్ధానికి సిద్ధమై ఒక అక్షౌహిణి సేనతో చక్రి వెంటబడి సారథితో ఇలా అన్నాడు.

84
"ల్లిదు, నన్ను భీష్మజనపాల కుమారకుఁ జిన్నచేసి నా
చెల్లెలి రుక్మిణిం గొనుచుఁ జిక్కని నిక్కపు బంటుబోలె నీ
గొల్లఁడు పోయెడిన్; రథము గూడఁగఁ దోలుము; తేజితోల్లస
ద్భల్ల పరంపరన్ మదముఁ బాపెదఁ జూపెద నా ప్రతాపమున్."
టీక:- బల్లిదున్ = బలవంతుడను; నన్నున్ = నన్ను; భీష్మ = భీష్మక; జనపాల = రాజు యొక్క; కుమారకున్ = పుత్రుని; చిన్నచేసి = చిన్నబుచ్చి; నా = నా యొక్క; చెల్లెలిన్ = సోదరిని; రుక్మిణిన్ = రుక్మిణిని; కొనుచున్ = తీసుకుపోవుచు; చిక్కని = పటుత్వముగల; నిక్కపు = నిజమైన; బంటు = శూరుని; బోలెన్ = వలె; ఈ = ఈ యొక్క; గొల్లడు = యాదవుడు; పోయెడిన్ = వెళ్ళిపోతున్నాడు; రథమున్ = తేరును; కూడగన్ = చేరునట్లు; తోలుము = వేగముగ నడుపుము; తేజిత = వాడిగా చేయబడిన; ఉల్లసత్ = ప్రకాశించుచున్న; భల్ల = బాణముల; పరంపరన్ = వరుసలచే; మదమున్ = గర్వమును; పాపెదన్ = పోగొట్టెదను; చూపెదన్ = చూపించెదను; నా = నా యొక్క; ప్రతాపమున్ = పరాక్రమమును.
భావము:- “బలవంతుడను. భీష్మకమహారాజు కొడుకుని. రుక్మిని, నన్ను చిన్నబుచ్చి ఈ గొల్లవాడు కృష్ణుడు తానేదో మహా శూరుడిని అనుకుంటు నా చెల్లెలు రుక్మిణిని పట్టుకు పోతున్నాడు. సారథి! వాని వెంటనంటి రథం తోలు. నా ప్రతాపం చూపిస్తా. పదునైన బాణాలతో వాని మదం తీస్తా.”

85
అని యిట్లు రుక్మి హరి కొలంది యెఱుంగక సారథి నదలించి రథంబుఁ గూడం దోలించి "గోపాలక! వెన్నమ్రుచ్చ! నిమిషమాత్రంబు నిలు నిలు” మని ధిక్కరించి, బలువింట నారి యెక్కించి మూడు వాఁడి తూపుల హరి నొప్పించి యిట్లనియె.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; రుక్మి = రుక్మి; హరి = కృష్ణుని; కొలంది = సామర్థ్యము; ఎఱుంగక = తెలియకపోవుటచేత; సారథిన్ = సారథిని; అదలించి = హెచ్చరించి; రథంబున్ = రథమును; కూడన్ = చేరునట్లు; తోలించి = వేగముగా నడిపింపజేసి; గోపాలక = గొల్లవాడా; వెన్నమ్రుచ్చ = వెన్నదొంగ; నిమిషమాత్రంబు = ఒక నిమిషముపాటు; నిలునిలుము = ఆగిపొమ్ము; అని = అని; ధిక్కరించి = తిరస్కారముగా మాట్లాడి; బలు = బలమైన; వింటన్ = విల్లునందు; నారిన్ = అల్లెతాడును; ఎక్కించి = ఎక్కుపెట్టి; మూడు = మూడు (3); వాడి = వాడి యైన; తూపులన్ = బాణములచేత; హరిన్ = కృష్ణుని; నొప్పించి = కొట్టి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా పలికి. రుక్మి మాధవుని మహిమ తెలియక రథం మీద వెనుదగిలి పోయి “ఓ గొల్లవాడా! వెన్న దొంగ! ఒక్క నిమిషం ఆగు” అని అదలించాడు. పెద్ద వింటిని సంధించి మూడు వాడి తూపులతో చక్రిని కొట్టాడు.

86
"మా సరివాఁడవా మా పాపఁ గొనిపోవ? ;
నేపాటి గలవాడ? వేది వంశ?
మెందు జన్మించితి? వెక్కడఁ బెరిగితి? ;
వెయ్యది నడవడి? యెవ్వఁ డెఱుఁగు?
మానహీనుఁడ వీవు; ర్యాదయును లేదు;
మాయఁ గైకొని కాని లయ రావు;
నిజరూపమున శత్రునివహంబుపైఁ బోవు;
సుధీశుఁడవు గావు వావి లేదు;


కొమ్మ నిమ్ము; నీవు గుణరహితుండవు
విడువు; విడువవేని విలయకాల
శిఖిశిఖా సమాన శిత శిలీముఖముల
ర్వ మెల్లఁ గొందుఁ లహమందు."
టీక:- మా = మాతో; సరివాడవా = సమానుడవా; మా = మా యొక్క; పాపన్ = బాలికను; కొనిపోవన్ = తీసుకుపోవుటకు; ఏపాటి = ఏమాత్రము; కలవాడవు = అర్హతలు కలవాడవు; ఏది = ఏది; వంశము = నీ వంశము; ఎందున్ = ఎక్కడ; జన్మించితివి = పుట్టితివి; ఎక్కడ = ఎక్కడ; పెరిగితివి = పెద్దవాడవైతివి; ఎయ్యది = ఎలాంటి; నడవడిన్ = నడవడికలవాడవు; ఎవ్వడు = ఎవరు; ఎఱుగున్ = తెలియును; మాన = శీలము; హీనుడవు = లేనివాడవు; ఈవు = నీవు; మర్యాదయును = గౌరవముకూడ; లేదు = లేనివాడవు; మాయన్ = మాయమార్గములు; కైకొని = చేపట్టి; కాని = తప్పించి; మలయన్ = సంచరింప; రావు = చాలవు; నిజ = స్వ; రూపమునన్ = స్వరూపముతో; శత్రు = శత్రువుల; నివహంబు = సమూహము; పైన్ = మీదికి; పోవు = యుద్ధమునకు వెళ్ళవు; వసుధీశుడవు = రాజువు; కావు = కావు; వావి = బంధుత్వము, పద్ధతి; లేదు = లేదు.
కొమ్మన్ = ఇంతిని; ఇమ్ము = ఇచ్చివేయుము; నీవు = నీవు; గుణ = సుగుణములు; రహితుండవు = లేనివాడవు; విడువు = వదలిపెట్టుము; విడువవేని = వదలిపెట్టనిచో; విలయకాల = ప్రళయకాలపు; శిఖి = అగ్ని; శిఖా = మంటలకు; సమాన = సమానమైన; శిత = తీక్ష్ణమైన; శిలీముఖములన్ = బాణములచేత {శిలీముఖము - ఉక్కుముఖములు కల బాణము}; గర్వమున్ = మదము; ఎల్లన్ = సర్వమును; కొందు = అపహరింతును; కలహము = యుద్ధము; అందున్ = లో.
భావము:- నువ్వు మాతో సమానుడవా ఏమిటి (భగవంతుడు కదా మాకన్న అధికుడవు). ఎంత మాత్రం వాడివి (మేరకందని వాడవు). వంశ మేదైనా ఉందా (స్వయంభువుడవు). ఎక్కడ పుట్టావు (పుట్టు కన్నది లేని శాశ్వతుడవు). ఎక్కడ పెరిగావు (వికారరహితుడవు కనుక వృద్ధిక్షయాలు లేనివాడవు). ప్రవర్తన ఎలాంటిదో ఎవరికి తెలుసు (అంతుపట్టని నడవడిక కలవాడవు). అభిమానం లేదు (సాటివారు లేరుకనుక మానాభిమానాలు లేని వాడవు). హద్దు పద్దు లేదు (కొలతలకు అందని హద్దులు లేని వాడవు). మాయ చేయకుండ మెలగవు (మాయ స్వీకరించి అవతారాలు ఎత్తుతావు). స్వస్వరూపాన్ని పగవారికి చూపవు (నిర్గుణ నిరాకారుడవు). క్షత్రియుడవు కావు (జాతి మతాలకు అతీతుడవు). వావివరసలు లేవు (అద్వితీయుడవు ఏకోనారాయణుడవు). అసలు నీకు గుణాలే లేవు (త్రిగుణాతీతుడవు). అలాంటి నీకు ఆడపిల్ల ఎందుకు. మా పిల్లని మాకు ఇచ్చెయ్యి. విడిచిపెట్టు. విడువకపోతే యుద్ధంలో ప్రళయకాల అగ్ని కీలల వంటి వాడి బాణాలతో నీ పీచమణుస్తా.”

87
అని పలికిన నగధరుండు నగి, యొక్క బాణంబున వాని కోదండంబు ఖండించి, యాఱు శరంబుల శరీరంబు దూఱనేసి, యెనిమిది విశిఖంబుల రథ్యంబులం గూల్చి, రెండమ్ముల సారథింజంపి, మూడువాఁడి తూపులం గేతనంబుఁ ద్రుంచి మఱియు నొక్క విల్లందినం ద్రుంచి, వెండియు నొక్క ధనువు పట్టిన విదళించి క్రమంబునఁ బరిఘ పట్టిస శూల చర్మాసి శక్తి తోమరంబులు ధరియించినం దునుకలు సేసి క్రమ్మఱ నాయుధంబు లెన్ని యెత్తిన నన్నియు శకలంబులు గావించె; నంతటం దనివిజనక వాఁడు రథంబు డిగ్గి ఖడ్గహస్తుండై దవానలంబుపైఁ బడు మిడుత చందంబునం గదిసిన ఖడ్గ కవచంబులు చూర్ణంబులు చేసి, సహింపక మెఱుంగులు చెదర నడిదంబు పెఱికి జళిపించి వాని శిరంబు తెగవ్రేయుదు నని గమకించి, నడచుచున్న నడ్డంబు వచ్చి రుక్మిణీదేవి హరిచరణారవిందంబులు పట్టుకొని యిట్లనియె.
టీక:- అని = అని; పలికినన్ = పలుకగా; నగధరుండు = కృష్ణుడు {నగధరుడు - (గోవర్థన)నగమును ధరించినవాడు, కృష్ణుడు}; నగి = నవ్వి; ఒక్క = ఒక; బాణంబునన్ = బాణముతో; వాని = అతని; కోదండంబున్ = ధనుస్సును; ఖండించి = ముక్కలుచేసి; ఆఱు = ఆరు (6); శరంబులన్ = బాణములతో; శరీరంబున్ = దేహమునందు; దూరన్ = దూరునట్లుగా; ఏసి = వేసి; ఎనిమిది = ఎనిమిది (8); విశిఖంబులన్ = బాణములచేత {విశిఖము - ముల్లులేని బాణము}; రథ్యంబులన్ = రథగుఱ్ఱములను; కూల్చి = పడగొట్టి; రెండు = రెండు (2); అమ్ములన్ = బాణములచేత; సారథిన్ = రథసారథిని; చంపి = చంపి; మూడు = మూడు (3); వాడి = వాడి యైన; తూపులన్ = బాణములచేత; కేతనంబు = జండా; త్రుంచి = తెంచివేసి; మఱియున్ = ఇంక; ఒక్క = ఒక; విల్లున్ = ధనుస్సును; అందినన్ = అందుకొనగా; త్రుంచి = తునకలుచేసి; వెండియున్ = మరల; ఒక్క = ఒక; ధనువున్ = వింటిని; పట్టినన్ = పూనగా; విదళించి = చీల్చేసి; క్రమంబునన్ = వరుసగా; పరిఘ = ఇనపకట్లగుదియ; పట్టిస = అడ్డకత్తి; శూల = శూలము; చర్మ = డాలు; అసి = ఖడ్గము; శక్తి = శక్తి; తోమరంబులు = చర్నాకోలలు; ధరియించినన్ = చేపట్టగా; తునుకలు = ముక్కలు; చేసి = చేసి; క్రమ్మఱన్ = మరల; ఆయుధంబులున్ = ఆయుధములను; ఎన్ని = ఎన్ని; ఎత్తినన్ = చేపట్టినను; అన్నియును = అన్నిటిని; శకలంబులు = ముక్కలుగా; కావించెన్ = చేసెను; అంతట = అటుపిమ్మట; తనివి = తృప్తి; చనక = తీరక; వాడు = అతడు; రథంబున్ = రథమును; డిగ్గి = దిగి; ఖడ్గ = కత్తిని; హస్తుండు = చేతపట్టుకొన్నవాడు; ఐ = అయ్యి; దవానలంబు = కార్చిచ్చు; పైన్ = మీద; పడు = పడెడి; మిడుత = మిడుత; చందంబునన్ = వలె; కదిసినన్ = దగ్గరకురాగా; ఖడ్గ = కత్తిని; కవచంబులున్ = కవచములను; చూర్ణంబులు = పొడిపొడిగా; చేసి = చేసి; సహింపక = ఓరిమిపట్టలేక; మెఱుంగులు = కాంతులు, నిప్పురవ్వలు; చెదరన్ = వ్యాపించగా; అడిదంబు = కత్తిని; పెఱికి = ఒరనుండిబైటికితీసి; జళిపించి = చలింపజేసి; వాని = అతని; శిరంబున్ = తలను; తెగవ్రేయుదును = నరికెదను; అని = అని; గమకించి = సిద్ధపడి; నడచుచున్న = వెళ్ళుతుండగా; అడ్డంబు = అడ్డముగా; వచ్చి = వచ్చి; రుక్మిణీదేవి = రుక్మిణీదేవి; హరి = కృష్ణుని; చరణ = పాదములు అనెడి; అరవిందంబులున్ = పద్మములను; పట్టుకొని = పట్టుకొని; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా రుక్మిప్రగల్భాలు పలుకుతుంటే, గోవర్దనగిరిధారి కృష్ణుడు నవ్వి, ఒక బాణంతో వాని విల్లు విరిచాడు. ఆరు బాణాలు శరీరంలో దిగేసాడు. ఎనిమిది బాణాలతో రథాశ్వాలని కూల్చేసాడు. రెండింటితో సారథిని చంపాడు. మూడు బాణాలతో జండాకఱ్ఱ విరిచాడు. ఇంకొక విల్లు తీసుకొంటే దానిని విరిచాడు. అలా వరసగా పట్టిన ఇంకో ధనుస్సు, పరిఘ, అడ్డకత్తి, శూలం, కత్తి, డాలు, శక్తి, తోమరం అన్నిటిని ముక్కలు చేసాడు. రుక్మి అంతటితో పారిపోక కార్చిచ్చు పై వచ్చి పడే మిడతలా, రథం దిగి కత్తి పట్టి రాగా కత్తి, కవచం పిండిపిండి చేసేసాడు. ఒరలోని కత్తి దూసి నిప్పురవ్వలు రాల్తుండగా జళిపించి వాని తల నరకబోగా, రుక్మిణి పరమపురుషుని పాదాలు పట్టుకొని ఇలా వేడుకొంది.

88
"నిన్నునీశ్వరు దేవదేవుని నిర్ణయింపఁగ లేక యో
న్నుతామలకీర్తిశోభిత! ర్వలోకశరణ్య! మా
న్న యీతఁడు నేడు చేసె మహాపరాధము నీ యెడన్
న్ను మన్నన చేసి కావు మనాథనాథ! దయానిథీ!
టీక:- నిన్నున్ = నిన్ను; ఈశ్వరున్ = సర్వనియామకుని; దేవదేవుని = బ్రహ్మాది దేవతలకు దేవుని; నిర్ణయింపగన్ = నిర్ధారించుకొనగ; లేక = లేక; ఓ = ఓయి; సన్నుత = కొనియాడబడిన; అమల = నిర్మలమైన; కీర్తి = యశస్సుచేత; శోభిత = శోభిల్లువాడ; సర్వ = సమస్తమైన; లోక = భువనములకు; శరణ్య = రక్షణనిచ్చువాడ; మా = మా యొక్క; అన్న = సోదరుడు; ఈతడు = ఇతను; నేడు = ఇవాళ; చేసెన్ = చేసెను; మహా = పెద్ద; అపరాధమున్ = తప్పును; నీ = నీ; యెడన్ = అందు; నన్నున్ = నన్ను; మన్నన = మన్నించుట; చేసి = చేసి; కావుము = కాపాడుము; అనాథ = దిక్కులేనివారికి; నాథ = దిక్కయినవాడ; దయానిథీ = దయకు ఉనికి పట్టైనవాడ.
భావము:- "ఓ సత్పురుషులచే కీర్తింపబడేవాడ! సకల లోకాలని కాపాడేవాడా! దిక్కులేని వారికి దిక్కైనవాడ! దయామయా! శ్రీకృష్ణ! వీడు రుక్మి మా అన్న. నిన్ను ఈశ్వరునిగా దేవదేవునిగా గుర్తించలేక చాలా పెద్ద తప్పు చేసాడు. నన్ను మన్నించి వీనిని క్షమించు" అంటు రుక్మిణీదేవి ఇంకా ఇలా విన్నవించసాగింది.

89
ల్ల లేదని విన్నవించుట గాదు వల్లభ! యీతనిన్
బ్రల్లదుం దెగఁజూచితేనియు భాగ్యవంతుల మైతి మే
ల్లుఁ డయ్యె ముకుందుఁ డీశ్వరుఁ డంచు మోదితు లైన మా
ల్లిదండ్రులు పుత్ర శోకముఁ దాల్చి చిక్కుదు రీశ్వరా!"
టీక:- కల్ల = తప్పు; లేదు = చేయలేదు; అని = అని; విన్నవించుట = చెప్పుట; కాదు = లేదు; వల్లభ = ప్రియమైనవాడ; ఈతనిన్ = అతనిని; ప్రల్లదున్ = దుష్టుని; తెగజూచితేనియున్ = చంపబోయితివేని; భాగ్యవంతులము = అదృష్టవంతులము; ఐతిమి = అయ్యాము; మేము = మేము; అల్లుండు = అల్లుడు {అల్లుడు - కూతురు భర్త}; అయ్యెన్ = అయ్యెను; ముకుందుడు = మోక్షము నిచ్చువాడు; ఈశ్వరుడు = ఐశ్వర్యవంతుడు, కృష్ణుడు; అంచున్ = అని; మోదితుల = సంతోషించినవారు; ఐన = అయిన; మా = మా యొక్క; తల్లిదండ్రులు = తల్లిదండ్రులు; పుత్ర = కొడుకు మరణించిన; శోకమున్ = దుఃఖమును; తాల్చి = పొంది; చిక్కుదురు = కృశింతురు; ఈశ్వరా = స్వామీ.
భావము:- ప్రభూ! మా అన్న రుక్మి యందు దోషం లేదని మనవిచేయటం లేదు. నిజమే యితను చేసినది నేరమే. కాని మోక్షమునిచ్చేవాడు జగన్నాయకుడు హరి మాకు అల్లుడు అయ్యా డని, మేము అదృష్టవంతుల మైనామని సంతోషిస్తున్న మా తల్లిదండ్రులు, ఇతగాడు దుష్టుడు కదా అని సంహరించే వంటే, పుత్రశోకంతో పొగిలిపోతారు నాథా!"

90
ని డగ్గుత్తికతో మహాభయముతో నాకంపితాంగంబుతో
విత శ్రాంత ముఖంబుతో శ్రుతిచలద్వేణీ కలాపంబుతోఁ
నుదోయిన్ జడిగొన్న బాష్పములతోఁ న్యాలలామంబు మ్రొ
క్కి రుక్మిం దెగ వ్రేయఁబోక మగిడెన్ గృష్ణుండు రోచిష్ణుఁడై.
టీక:- అని = అని; డగ్గుతిక = బొంగురుగొంతుక; తోన్ = తోటి; మహా = మిక్కిలి; భయము = భయము; తోన్ = తోటి; ఆకంపిత = మిక్కిలి వణుకుతున్న; అంగంబు = శరీరము; తోన్ = తోటి; వినత = వంచిన; శ్రాంత = బడలిన; ముఖంబు = ముఖము; తోన్ = తోటి; శ్రుతిన్ = చెవిమీద; చలత్ = చలించుతున్న; వేణీ = జడ, జడపాయ అను; కలాపంబు = అలంకారము; తోన్ = తోటి; కను = కళ్ళ; దోయిన్ = జంటనుండి; జడిగొన్న = ధారగాకారుతున్న; బాష్పముల్ = కన్నీటి; తోన్ = తోటి; మ్రొక్కినిన్ = నమస్కరించగా; రుక్మిన్ = రుక్మిని; తెగవ్రేయబోక = నరకబోవక; మగిడెన్ = మానెను; కృష్ణుండు = కృష్ణుడు; రోచిష్ణుడు = ప్రకాశము కలవాడు; ఐ = అయ్యి.
భావము:- ఇలా రుక్మిణి గద్గదస్వరంతో మిక్కిలి భయ కంపితురాలై వేడుకొంది. అప్పుడు ఆమె దేహం వణుకుతోంది. వంచిన వదనం వడలింది. చెవుల మీదకి శిరోజాలు వాలాయి. కన్నీటి జడికి గుండెలు తడిసాయి. అప్పుడు కృష్ణుడు రుక్మిని చంపక వెనుదిరిగేడు.

91
ఇట్లు చంపక "బావా! ర" మ్మని చిఱునగవు నగుచు వానిం, బట్టి బంధించి, గడ్డంబును మీసంబునుం దలయును నొక కత్తివాతి యమ్మున రేవులువాఱఁ గొఱిగి విరూపిం జేసె; నంతట యదువీరులు పరసైన్యంబులం బాఱఁదోలి, తత్సమీపంబునకు వచ్చి; రప్పుడు హతప్రాణుండై కట్టుబడి యున్న రుక్మిం జూచి కరుణజేసి, కామపాలుండు వాని బంధంబులు విడిచి హరి డగ్గఱి యిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; చంపక = సంహరింపకుండ; బావా = బావా; రమ్ము = ఇటు రావలసినది; అని = అని పిలిచి; చిఱునగవు = చిరునవ్వు; నగుచున్ = నవ్వుతు; వానిన్ = అతనిని; పట్టి = పట్టుకొని; బంధించి = కట్టివేసి; గడ్డంబును = గడ్డము; మీసంబును = మీసము; తలయున్ = తలమీదిజుట్టు; ఒక = ఒక; కత్తివాతియమ్మునన్ = అర్ధచంద్రబాణముతో (ఆంధ్రవాచస్పతము) { కత్తివాతియమ్ము = కత్తివంటి; వాతి (పదునుగల) అమ్ము (బాణము), అర్ధచంద్రబాణముతో }; రేవులు = చారలు; పాఱన్ = ఏర్పడునట్లు; గొఱిగి = గీసి; విరూపిన్ = వికారరూపునిగా; చేసెన్ = చేసెను; అంతట = అటుపిమ్మట; యదు = యాదవ; వీరులు = యోధులు; పర = శత్రువుల; సైన్యంబులన్ = సేనలను; పాఱదోలి = తరిమి వేసి; తత్ = వారి; సమీపంబున = దగ్గర; కున్ = కు; వచ్చిరి = వచ్చిరి; అప్పుడు = అప్పుడు; హతప్రాయుండు = సగము చచ్చినవాడు; ఐ = అయ్యి; కట్టుబడి = బంధింపబడి; ఉన్న = ఉన్నట్టి; రుక్మిన్ = రుక్మిని; చూచి = చూసి; కరుణజేసి = దయచూపి; కామపాలుండు = బలరాముడు; వాని = అతని; బంధంబులున్ = కట్టు; విడిచి = విప్పదీసి; హరిన్ = కృష్ణుని; డగ్గఱి = చేరి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా చంపడం మాని, శ్రీకృష్ణుడు వానిని “బావా! రా” అని పిలుస్తూ చిరునవ్వులు నవ్వుతు పట్టి బంధించాడు. ఓ అర్థచంద్రాకారబాణంతో అతని గడ్డం మీసాలు తలకట్టు చారలు చారలుగా గీసి వికృతరూపిని చేసాడు. అంతలో యాదవ సైన్యాలు శత్రువులను తరిమి వేసి అక్కడకి వచ్చాయి. అప్పుడు బలరాముడు బంధించబడి దీనావస్థలో ఉన్న రుక్మిని చూసి జాలిపడి విడిపించాడు. మాధవునితో ఇలా అన్నాడు.

92
"త మనక భీష్మనందనుఁ
యును మూతియును గొఱుగఁ గవే? బంధుం
యును మూతియు గొఱుగుట
తఱుఁగుటకంటెఁ దుచ్ఛరము మహాత్మా!
టీక:- తలము = తప్పుకొనుము; అనక = అనకుండ; భీష్మ = భీష్మకుని; నందనున్ = కొడుకు యొక్క; తలయును = శిరోజములు; మూతియున్ = మూతిమీది మీసములు; గొఱుగన్ = తీసివేయుట; తగవే = ధర్మమా, కాదు; బంధున్ = బంధువు యొక్క; తలయును = శిరోజములు; మూతియున్ = మూతిమీదిమీసములు; గొఱుగుట = తీసివేయుట; తలన్ = శిరస్సును; తఱుగుట = నరుకుట; కంటెన్ = కంటెను; తుచ్ఛతరము = మిక్కిలినీచము {తుచ్ఛము - తుచ్ఛతరము - తుచ్ఛతమము}; మహాత్మా = గొప్పవాడా.
భావము:- "కృష్ణా! మహాత్మా! రుక్మిని తప్పుకోమనకుండ ఇలా తల మూతి గుండు చేయటం తగిన పని కాదు కదా. బావమరిదికి ఇలా గుండు గీసి అవమానించుట చంపుటకంటె తుచ్ఛమైన పని." అని బలరాముడు చెప్పసాగాడు

93
కొంఱు రిపు లని కీడును;
గొంఱు హితు లనుచు మేలుఁ గూర్పవు; నిజ మీ
వంఱి యందును సముఁడవు;
పొందఁగ నేలయ్య విషమబుద్ధి? ననంతా!"
టీక:- కొందఱున్ = కొంతమంది; రిపులు = శత్రువులు; అని = అని; కీడును = చెడును; కొందఱున్ = కొంతమంది; హితులు = ఇష్ఠులు; అనుచున్ = అని; మేలున్ = మంచిని; కూర్పవు = కలిగింపవు; నిజము = సత్యము ఇది; ఈవు = నీవు; అందఱి = అందరి; అందును = ఎడల; సముడవు = సమభావము కలవాడవు; పొందగన్ = పొందుట; ఏలన్ = ఎందుకు; అయ్య = తండ్రీ; విషమ = భేద; బుద్ధిన్ = బుద్ధిని; అనంతా = కృష్ణా {అనంతుడు - దేశ కాల వస్తువులచేత మేరలేని వాడు, విష్ణువు}.
భావము:- శాశ్వతుడవైన దేవా! నిజానికి నీవు సర్వ సముడవు. ఎవరిని శత్రువులుగా చూసి కీడు చేయవు. ఎవరిని కావలసినవారుగా చూసి మేలు చేయవు. అలాంటి నీకు ఎందుకయ్య ఇలాంటి భేదబుద్ధి." - రుక్మి శిరోజములు తొలగించిన కృష్ణునితో బలరాముడు ఇలా అన్నాడు.

94
అని వితర్కించి పలికి రుక్మిణీదేవి నుపలక్షించి యిట్లనియె.
టీక:- అని = అని; వితర్కించి = ఆక్షేపించి; పలికి = చెప్పి; రుక్మిణీదేవిన్ = రుక్మిణిని; ఉపలక్షించి = ఉద్దేశించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా కృష్ణుని విమర్శించిన బలరాముడు, రుక్మిణితో ఇలా అన్నాడు

95
"తోడంబుట్టినవాని భంగమునకున్ దుఃఖించి మా కృష్ణు నె
గ్గాడం జూడకు మమ్మ! పూర్వభవ కర్మాధీనమై ప్రాణులం
గీడున్ మేలునుఁ జెందు; లేఁ డొకఁడు శిక్షింపంగ రక్షింప నీ
తోడంబుట్టువు కర్మశేష పరిభూతుం డయ్యె నే డీ యెడన్."
టీక:- తోడంబుట్టినవానిన్ = సోదరుని; భంగమున్ = అవమానమున; కున్ = కు; దుఃఖించి = విచారించి; మా = మా యొక్క; కృష్ణున్ = కృష్ణుని; ఎగ్గాడన్ = నిందింప; చూడకుము = భావింపకుము; అమ్మ = తల్లీ; పూర్వ = మునుపటి; భవ = జన్మములందు జేసిన; కర్మ = కర్మములకు; అధీనము = అనుసరించునది; ఐ = అయ్యి; ప్రాణులన్ = జీవులకు; కీడున్ = ఆపద; మేలున్ = మంచి; చెందున్ = కలుగును; లేడు = లేడు; ఒకడు = వేరొకడు; శిక్షింపంగన్ = శిక్షించుటకు; రక్షింపన్ = కాపాడుటకు; నీ = నీ యొక్క; తోడంబుట్టువు = అన్న; కర్మ = పూర్వజన్మకర్మఫలముల; శేష = మిగిలినదానిచేత; పరిభూతుండు = అవమానింపబడినవాడు; అయ్యెన్ = అయ్యెను; నేడు = ఇవాళ; ఈ = ఈ యొక్క; ఎడన్ = చోటునందు.
భావము:- “అన్నకు జరిగిన అవమానానికి దుఃఖించకు. మా కృష్ణుడిని నిందించబోకు తల్లీ! పూర్వజన్మలలోని కర్మానుసారం జీవులకు మంచిచెడులు సంభవిస్తాయి. శిక్షించడానికి కాని రక్షించడానికి కాని కర్త ఎవరు లేరు. నీ అన్న అనుభవించ వలసిన శేష కర్మఫలం వలన ఇప్పుడు ఈ పరాభవం పొందాడు.

96
"చంపెడి దోషము గలిగినఁ
జంపఁ జనదు బంధుజనులఁ ను విడువంగాఁ
జంపిన దోషము సిద్ధము
చంపఁగ మఱి యేల మున్న చ్చిన వానిన్.
టీక:- చంపెడి = చంపదగిన; దోషము = తప్పు; కలిగినన్ = జరిగినను; చంపన్ = చంపివేయుట; చనదు = ధర్మముకాదు; బంధు = బంధువులైన; జనులన్ = వారిని; చనున్ = తగినపని; విడువంగాన్ = విడిచిపెట్టుట; చంపినన్ = చంపివేసినచో; దోషము = పాపము; సిద్ధము = తప్పకుండా కలుగును; చంపగన్ = చంపుట; మఱి = ఇంకా; ఏలన్ = ఎందుకు; మున్ను = ముందుగనే; చచ్చిన = (అవమాన భారంతో) చచ్చిపోయిన; వానిన్ = వాడిని.
భావము:- చంపదగ్గ తప్పు చేసినా సరే బంధువులను చంపరాదు. వదిలెయ్యాలి. అలాకాక చంపితే పాపం, తప్పదు. అసలే అవమాన భారంతో ముందే చచ్చినవాడిని వేరే చంపటం దేనికి.

97
బ్రహ్మచేత భూమితుల కీ ధర్మంబు
ల్పితంబు రాజ్యకాంక్షఁ జేసి
తోడిచూలు నైనఁదోడఁ బుట్టినవాఁడు
చంపుచుండుఁ గ్రూర రితుఁ డగుచు.
టీక:- బ్రహ్మ = బ్రహ్మదేవుని; చేత = వలన; భూమిపతుల్ = రాజుల; కున్ = కు; ఈ = ఇలాంటి; ధర్మంబు = ఆచారము; కల్పితంబు = ఏర్పరచబడినది; రాజ్య = రాజ్యాధికారమునందలి; కాంక్షన్ = గట్టికోరిక; చేసి = వలన; తోడిచూలున్ = తోడబుట్టినవారిని; ఐనన్ = అయినప్పటికి; తోడబుట్టినవాడు = సోదరుడు; చంపుచున్ = చంపేస్తూ; ఉండున్ = ఉండును; క్రూర = క్రూరమైన; చరితుడు = నడవడిక కలవాడు; అగుచున్ = అగుచు.
భావము:- రాజ్యకాంక్షతో తోబుట్టినవానిని అయినాసరే, తోడబుట్టిన వాడు క్రూరంగా చంపేస్తాడు. ఇది బ్రహ్మచేత క్షత్రియులకు కల్పించబడిన ధర్మం.

98
భూమికి ధన ధాన్యములకు
భాలకును మానములకుఁ బ్రాభవములకుం
గామించి మీఁదుఁ గానరు
శ్రీ దమున మానధనులు చెనఁకుదు రొరులన్.
టీక:- భూమి = రాజ్యము; కిన్ = కోసము; ధన = సిరి; ధాన్యముల్ = సంపదల; కున్ = కోసము; భామల్ = స్త్రీల; కును = కోసము; మానముల్ = గౌరవముల; కున్ = కోసము; ప్రాభవముల = వైభవముల; కున్ = కోసము; కామించి = కోరి; మీదున్ = రాబోవు నరకాదులను; కానరు = విచారింపరు; శ్రీ = సంపద; మదమునన్ = గర్వముచేత; మానధనులు = మానమే ధనంగా కలవారు; చెనకుదురు = హింసించెదరు; ఒరులన్ = ఇతరులను.
భావము:- మానవంతులు ధనమదాంధులు అయ్యి, రాజ్యం కోసం ధనధాన్యాల కోసం, స్త్రీల కోసం, పరువు కోసం, అధికారాల కోసం అఱ్ఱులు చాచి కిందు మీదు కానరు. ఇతరులను హింసిస్తారు.

99
వినుము, దైవమాయం జేసి దేహాభిమానులైన మానవులకుం బగవాఁడు బంధుండు దాసీనుండు నను భేదంబు మోహంబున సిద్ధం బయి యుండు జలాదుల యందుఁ జంద్రసూర్యాదులును ఘటాదులందు గగనంబును బెక్కులై కానంబడు భంగి దేహధారుల కందఱకు నాత్మ యొక్కండయ్యును బెక్కండ్రై తోఁచు; నాద్యంతంబులు గల యీ దేహంబు ద్రవ్య ప్రాణ గుణాత్మకంబై, యాత్మ యందు నవిద్య చేతఁ గల్పితంబై, దేహిని సంసారంబునం ద్రిప్పు సూర్యుండు తటస్థుండై యుండం బ్రకాశమానంబులైన దృష్టి రూపంబులుంబోలె నాత్మ తటస్థుండై యుండ దేహేంద్రియంబులు ప్రకాశమానంబు లగు నాత్మకు వేఱొక్కటితోడ సంయోగవియోగంబులు లేవు వృద్ధి క్షయంబులు చంద్రకళలకుంగాని చంద్రునికి లేని కైవడి జన్మనాశంబులు దేహంబునకుంగాని యాత్మకుఁ గలుగనేరవు; నిద్రబోయినవాఁ డాత్మను విషయఫలానుభవంబులు చేయించు తెఱంగున నెఱుక లేని వాఁడు నిజము గాని యర్థంబు లందు ననుభవము నొందుచుండుఁ; గావున.
టీక:- వినుము = శ్రద్ధగా వినుము; దైవమాయన్ = వైష్ణవమాయ {మాయ - భ్రమకారకము}; చేసి = వలన; దేహాభిమానులు = శరీరాభిమానులు {దేహాభిమానులు - దేహమే తానను అభిమానము కలవారు}; ఐన = అయిన; మానవుల్ = మనుషుల; కున్ = కు; పగవాడు = శత్రువు; బంధుండు = మిత్రుడు; ఉదాసీనుడు = సంబంధములేనివాడు; అను = అనెడి; భేదంబు = తేడా; మోహంబునన్ = మాయామోహమువలన; సిద్ధంబు = తప్పక కలుగునవి; అయి = ఐ; ఉండున్ = ఉండును; జల = నీళ్ళు (అద్దము); ఆదుల = మున్నగువాని; అందున్ = లో; చంద్ర = చంద్రబింబము; సూర్య = సూర్యబింబము; ఆదులున్ = మున్నగునవి; ఘటా = కుండ; ఆదులున్ = మున్నగువాని; అందున్ = లో; గగనంబును = ఆకాశము; పెక్కులు = అనేకములు; ఐ = అయి; కానంబడు = కనబడెడు; భంగిన్ = విధముగ; దేహధారుల్ = సకలజీవుల {దేహధారులు - శరీరముధరించి ఉండువారు, జీవులు}; కున్ = కు; అందఱ = అందరి; కున్ = కి; ఆత్మ = పరమాత్మ {పరమాత్మ - ఏకమేవాద్వితీయంబ్రహ్మ (శ్రుతి), ఏకము కనుక సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనిది అద్వితీయము కనుక ఇతరము (తనుకానిది) లేనిది పరమాత్మ}; ఒక్కండు = ఒక్కడే; అయ్యున్ = అయినప్పటికి; పెక్కండ్రు = అనేకులు; ఐ = అయినట్లు; తోచున్ = అనిపించును; ఆద్యంతంబులు = జన్మనాశనములు; కల = ఉన్నట్టి; ఈ = ఈ యొక్క; దేహంబు = శరీరము; ద్రవ్య = నవద్రవ్యములు {నవద్రవ్యములు - పృథ్వ్యాది, 1పృథివి 2అప్పు 3తేజము 4వాయువు 5ఆకాశము 6కాలము 7దిక్కు 8ఆత్మ 9మనస్సు}; ప్రాణ = పంచప్రాణములును {పంచప్రాణములు - 1ప్రాణము 2అపానము 3సమానము 4ఉదానము 5వ్యానము}; గుణ = పంచభూతగుణములు {పంచభూతగుణములు - శబ్దాది, 1శబ్దము 2స్పర్శము 3రూపము 4రసము 5గంధము}; ఆత్మకంబు = స్వరూపమునకలది; ఐ = అయ్యి; ఆత్మ = పరమాత్మ; అందున్ = అందు; అవిద్య = అజ్ఞానము; చేతన్ = వలన; కల్పితంబు = లేనివి కలుగజేయబడినవి; ఐ = అయ్యి; దేహిని = జీవుని; సంసారంబునన్ = సంసారమునందు; త్రిప్పున్ = తిప్పుచుండును; సూర్యుండు = సూర్యుడు; తటస్థుండు = సాక్షి {తటస్థుడు - కార్యకారణముల ప్రభావము తనపై లేనివాడు, సాక్షి}; ఐ = అయ్యి; ఉండన్ = ఉండగా; ప్రకాశమానంబులు = కనబడునవి; ఐన = అయినట్టి; దృష్టి = నేత్రములు; రూపంబులున్ = ఆకృతులను; బోలెన్ = వలె; ఆత్మ = పరమాత్మ; తటస్థుండు = సాక్షీభూతుడు; ఐ = అయ్యి; ఉండన్ = ఉండగా; దేహ = దేహములు {దేహములు - స్థూల సూక్ష్మ కారణ దేహములు}; ఇంద్రియంబులు = చతుర్దశేంద్రియములు {చతుర్దశేంద్రియములు - ఙ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదు మరియు అంతఃకరణ చతుష్టయము (1మనస్సు 2బుద్ధి 3చిత్తము 4అహంకారము) నాలుగు}; ప్రకాశమానంబులు = తెలియబడునవి; అగున్ = అగును; ఆత్మ = పరమాత్మ; కున్ = కు; వేఱొక్కటి = మరియొక దాని; తోడన్ = తోటి; సంయోగ = కూడుట; వియోగంబులు = ఎడబాయుటలు; లేవు = కలుగవు; వృద్ధి = పెరుగుట; క్షయంబులున్ = తరుగుటలు; చంద్రకళలు = షోడశచంద్రకళల {షోడశచంద్రకళలు - 1అమృత 2మానద 3పూష 4తుష్టి 5సృష్టి 6రతి 7ధృతి 8శశిని 9చంద్రిక 10కాంతి 11జ్యోత్స్న 12శ్రీ 13ప్రీతి 14అంగద 15పూర్ణ 16పూర్ణామృత}; కున్ = కు; కాని = తప్పించి; చంద్రుని = చంద్రుని; కిన్ = కి; లేని = లేనట్టి; కైవడిన్ = విధముగ; జన్మ = ఆది; నాశంబులు = అంతములు; దేహంబున్ = శరీరమున; కున్ = కు; కాని = తప్పించి; ఆత్మ = పరమాత్మ; కలుగన్ = కలుగ; నేరవు = చాలవు; నిద్రపోయినవాడు = నిద్రించినవాడు; ఆత్మను = తనయందు; విషయ = ఇంద్రియార్థముల; ఫల = మేలుకీడుల; అనుభవంబులున్ = భోగములను; చేయించు = కలిగించు; తెఱంగునన్ = విధముగ; ఎఱుక = ఆత్మజ్ఞానము; లేనివాడు = లేనివాడు; నిజము = సత్యము; కాని = కానట్టి; అర్థంబుల్ = విషయముల; అందున్ = లో; అనుభవమున్ = అనుభవమును; ఒందుచుండున్ = పొందుచుండును; కావున = కనుక.
భావము:- రుక్మిణీ! శ్రద్దగా విను. దేహాభిమానం కల మానవులకు దైవమాయ వలన మోహం జనిస్తుంది. దానితో శత్రువు మిత్రుడు ఉదాసీనుడు అనే భేదబుద్ధి కలుగుతుంది. జలం మొదలైన వానిలో సూర్యచంద్రులు, కుండలు మొదలైనవానిలో ఆకాశం అనేకములుగా అనిపిస్తాయి. అలాగే దేహధారు లందరికి ఆత్మ ఒక్కటే అయినా అనేకము అయినట్లు కనిపిస్తుంది. పుట్టుక చావులు కల ఈ దేహం పంచభూతాలైన పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే ద్రవ్యములతో ఏర్పడి, పంచ ప్రాణాలైన ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అనే ప్రాణము పోసుకొని, త్రిగుణా లైన సత్త్వగుణం, రజోగుణం, తమోగుణం అనే గుణాలుతో కూడినదై, అవిద్య అనే అజ్ఞానం వలన ఆత్మయందు కల్పించబడింది. ఈ దేహం దేహిని సంసారచక్రంలో తిప్పుతుంది. సూర్యుడు ఏ సంబంధం లేకుండా తటస్థంగా ఉండగా గోచర మయ్యే దృష్టి, రూపం అనే వాని వలె ఆత్మ ఉదాసీనుడై ఉండగా దేహము దశేంద్రియాలు ప్రకాశమనమౌతాయి. ఆత్మకు మరొక దానితో కూడిక కాని ఎడబాటు కాని లేదు. పెరగటం తగ్గటం చంద్రకళలకే కాని చంద్రుడుకి ఉండవు. అలాగే చావుపుట్టుకలు దేహనికే కాని ఆత్మకు కలగవు. నిద్రించినవాడు విషయాల వలని సుఖదుఃఖాలు ఆత్మను అనుభవింపజేస్తాడు. అలానే అజ్ఞాని సత్యంకాని విషయార్థాలలో అనుభవం కలిగించు కొంటాడు. అందుచేత.

100
జ్ఞానజ మగు శోకము
విజ్ఞానవిలోకనమున విడువుము నీకుం
బ్రజ్ఞావతికిం దగునే
జ్ఞానుల భంగి వగవ, నంభోజముఖీ!"
టీక:- అజ్ఞాన = అజ్ఞానమువలన; జము = కలుగునది, పుట్టునది; అగు = ఐన; శోకము = దుఃఖమును; విజ్ఞాన = ఆత్మజ్ఞానము అనెడి; విలోకనమునన్ = దృష్టిచేత; విడువుము = వదలివేయుము; నీ = నీ; కున్ = కు; ప్రఙ్ఞావతి = సమర్థురాలు; కిన్ = కి; తగునే = తగినదా, కాదు; అజ్ఞానుల = అజ్ఞానుల; భంగిన్ = వలె; వగవన్ = దుఃఖించుట; అంభోజముఖీ = పద్మాక్షి, రుక్మిణీ.
భావము:- పద్మం లాంటి ముఖము కలదానా! రుక్మిణీ! అజ్ఞానము వలన కలిగే దుఃఖాన్ని విజ్ఞానదృష్టితో విడిచిపెట్టు. నీ లాంటి సుజ్ఞానికి అజ్ఞానులలాగ దుఃఖించుట తగదు. అంటు బలరాముడు రుక్మిణిని సముదాయించసాగాడు.
– బహు కఠినమైన జ్ఞకార ప్రాసతో, అది అచ్చు ఆ కూడ ప్రాసగా సమానంగా ఉంచి, అజ్ఞాన విజ్ఞాన, ప్రజ్ఞానాలతో ఇలా అమృత గుళికను అందించిన పోతనగారికి ప్రణామములు.

101
ఇట్లు బలభద్రునిఁచేతఁ దెలుపంబడి రుక్మిణీదేవి దుఃఖంబు మాని యుండె; నట రుక్మి యనువాఁడు ప్రాణావశిష్టుండై, విడువంబడి తన విరూపభావంబునకు నెరియుచు "హరిం గెలిచికాని కుండినపురంబుఁ జొర" నని ప్రతిజ్ఞ చేసి, తత్సమీపంబున నుండె; నివ్విధంబున.
టీక:- ఇట్లు = ఈ విధముగ; బలభద్రుని = బలరాముని; చేతన్ = చేత; తెలుపంబడి = జ్ఞానము కలుగజేయబడి; రుక్మిణీదేవి = రుక్మిణి; దుఃఖంబున్ = దుఃఖమును; మాని = విడిచి; ఉండెన్ = ఉండెను; అట = అక్కడ; రుక్మి = రుక్మి; అనువాడు = అనెడివాడు; ప్రాణ = ప్రాణములు మాత్రము; అవశిష్టుండు = మిగిలినవాడు; ఐ = అయ్యి; విడువంబడి = బంధవిముక్తుడై; తన = అతని; విరూపభావంబున్ = రూపవికారత్వమున; కున్ = కు; ఎరియుచున్ = తపించుచు; హరిన్ = కృష్ణుని; గెలిచి = జయించి; కాని = కాని; కుండినపురంబున్ = కుండిననగరమును; చొరను = ప్రవేశించను; అని = అని; ప్రతిజ్ఞ = శపథము; చేసి = చేసి; తత్ = దాని; సమీపంబునన్ = దగ్గరలో; ఉండెన్ = ఉండెను; ఇవ్విధంబునన్ = ఈ విధముగ.
భావము:- ఇలా బలరామునిచేత ప్రబోధింపబడి, రుక్మిణి దుఃఖము విడిచిపెట్టింది. అక్కడ రుక్మి ప్రాణాలతో విడువబడి, అవమానంతో తన వికృత రూపానికి చింతిస్తూ “కృష్ణుని గెలచి కాని కుండినపురం ప్రవేశించ” నని ప్రతిఙ్ఞ చేసి, పట్టణం బయటే ఉన్నాడు.

రుక్మిణీ కల్యాణంబు

102
రాజీవలోచనుఁడు హరి
రాసమూహముల గెల్చి రాజస మొప్పన్
రాజిత యగు తన పురికిని
రాజాననఁ దెచ్చె బంధురాజి నుతింపన్.
టీక:- రాజీవలోచనుడు = పద్మాక్షుడు, కృష్ణుడు; హరి = కృష్ణుడు; రాజ = రాజుల; సమూహములన్ = సమూహములను; గెల్చి = జయించి; రాజసము = గొప్పదనము; ఒప్పన్ = చక్కగా కనబడుతుండ; రాజిత = ప్రకాశించునది; అగు = ఐన; తన = అతని; పురి = పట్టణమున; కిన్ = కు; రాజాననన్ = చంద్రముఖిని, రుక్మిణిని; తెచ్చెన్ = తీసుకు వచ్చెను; బంధు = బంధువుల; రాజిత = సమూహము; నుతింపన్ = పొగడుతుండగా.
భావము:- పద్మాక్షుడు కృష్ణుడు రాజుల నందరిని జయించి రాజస ముట్టిపడేలా విభ్రాజితమైన తన పట్టణానికి ఇందుముఖి రుక్మిణిని చేపట్టి తీసుకు వచ్చేడు. బంధువు లంతా పొగిడారు.

103
అంత నయ్యాదవేంద్రుని నగరంబు సమారబ్ధ వివాహకృత్యంబును బ్రవర్తమాన గీత వాద్య నృత్యంబును, బ్రతిగృహాలంకృత విలసితాశేష నరనారీ వర్గంబును, బరిణయ మహోత్సవ సమాహూయమాన మహీపాల గజఘటా గండమండల దానసలిలధారా సిక్త రాజమార్గంబును బ్రతిద్వార మంగళాచార సంఘటిత క్రముక కదళికా కర్పూర కుంకుమాగరు ధూపదీప పరిపూర్ణకుంభంబును, విభూషిత సకల గృహవేదికా కవాట దేహళీ స్తంభంబును, విచిత్ర కుసుమాంబర రత్నతోరణ విరాజితంబును, సముద్ధూత కేతన విభ్రాజితంబును నై యుండె; న య్యవసరంబున.
టీక:- అంతన్ = అటుపిమ్మట; ఆ = ఆ యొక్క; యాదవేంద్రుని = కృష్ణుని {యాదవేంద్రుడు - యాదవులలో ఉత్తముడు, కృష్ణుడు}; నగరంబు = పట్టణము; సమారబ్ధ = ప్రారంభింపబడిన; వివాహ = పెండ్లి; కృత్యంబునున్ = పనులు కలది; ప్రవర్తమాన = జరుగుచున్న; గీత = పాటలుపాడుట; వాద్య = వాద్యములు వాయించుట; నృత్యంబున్ = నృత్యము లాడుటలు కలది; ప్రతి = అన్ని; గృహ = ఇంటిలోను; అలంకృత = అలంకరింపబడిన; విలసిత = విలసిల్లుతున్న; అశేష = ఎల్ల; నర = పురుషుల; నారీ = స్త్రీల; వర్గంబును = సమూహములు కలది; పరిణయ = పెండ్లి యొక్క; మహా = గొప్ప; ఉత్సవ = వేడుకకు; సమాహూయమాన = పిలువబడుచున్న; మహీపాల = రాజుల యొక్క; గజ = ఏనుగుల; ఘటా = సమూహము యొక్క; గండమండల = చెక్కిలి ప్రదేశములందలి; దాన = మద; సలిల = జల; ధారా = ధారలచేత; సిక్త = తడిసిన; రాజమార్గంబునున్ = ప్రధానవీధులు కలది; ప్రతి = ఎల్ల; ద్వార = గుమ్మము లందు; మంగళాచార = శుభకార్యమునకై; సంఘటిత = కట్టబడిన; క్రముక = పొకమానులు; కదళికా = అరటిచెట్లు; కర్పూర = కర్పూరము; కుంకుమ = కుంకుమ; అగరు = అగరు (సుగంధద్రవ్యము); ధూప = ధూపములు; దీప = దీపములు; పరిపూర్ణ = నిండు; కుంభంబును = కుంభములు కలది; విభూషిత = అలంకరింపబడిన; సకల = సమస్తమైన; గృహ = ఇండ్ల యొక్క; వేదికా = అరుగులు; కవాట = తలుపులు; దేహళీ = గడపలు; స్తంభంబును = స్తంభములు కలది; విచిత్ర = విశేషమైన; కుసుమ = పూలు; అంబర = వస్త్రములు; రత్న = మణులు; తోరణ = తోరణములచేత {తోరణము - వరుసగా కట్టిన ఆకులు పూలు వంటివి కట్టిన పొడుగైన తాడు}; విరాజితంబును = విలసిల్లుచున్నది; సముద్ధూత = బాగుగా మీది కెగురుతున్న; కేతన = జండాలచేత; విభ్రాజితంబును = మిక్కిలి ప్రకాశించుచున్నది; ఐ = అయ్యి; ఉండెన్ = ఉండెను; ఆ = ఆ యొక్క; అవసరంబునన్ = సమయమునందు.
భావము:- అంతట ద్వారకానగరంలో పెళ్ళి పనులు మొదలయ్యాయి. పాటలు, వాయిద్యాలు, నాట్యాలు చెలరేగాయి. ప్రతి ఇంటి నిండా అలంకరించుకున్న స్త్రీ పురుషులు గుంపులు గూడుతున్నారు. కల్యాణ మహోత్సవానికి ఆహ్వానించబడిన ఎంతోమంది రాజులు వస్తున్నారు. వారి వారి ఏనుగుల గండభాగాల నుండి కారుతున్న మదజలంతో రాజమార్గాలు కళ్ళాపిజల్లినట్లు తడుస్తున్నాయి. ప్రతి ద్వారానికి రెండు పక్కల మంగళాచారంకోసం పోకమొక్కలు అరటిబోదెలు కట్టారు. కర్పూరం, కుంకుమ, అగరుధూపాలు, దీపాలు, పూర్ణకుంభాలు ఉంచారు. ఇంటి అరుగులు, తలుపులు, గడపలు, స్తంభాలు చక్కగా అలంకరించారు. రంగురంగుల పూలు, బట్టలు, రత్నాలుతో తోరణాలు కట్టారు. జండాలు ఎగరేసారు. అప్పుడు.

104
ధ్రుకీర్తిన్ హరి పెండ్లియాడె నిజ చేతోహారిణిన్ మాన వై
గాంభీర్య విహారిణిన్ నిఖిల సంత్కారిణిన్ సాధు బాం
సత్కారిణిఁ బుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్
సువిభూషాంబర ధారిణిన్ గుణవతీ చూడామణిన్ రుక్మిణిన్.
టీక:- ధ్రువ = శాశ్వతమైన; కీర్తిన్ = కీర్తితో; హరి = కృష్ణుడు; పెండ్లి = వివాహము; ఆడెన్ = చేసుకొనెను; నిజ = తన యొక్క; చేతః = మనసును; హారిణిన్ = అపహరించినామెను; మాన = చిత్తౌన్నత్యము; వైభవ = ఐశ్వర్యము; గాంభీర్య = నిబ్బరములు కలిగి; విహారిణిన్ = విహరించెడి ఆమెను; నిఖిల = సర్వ; సంపత్ = సంపదలను; కారిణిన్ = కలిగించెడి ఆమెను; సాధు = మంచివారిని; బాంధవ = బంధువులను; సత్కారిణిన్ = సత్కరించునామెను; పుణ్య = మంచి; చారిణిన్ = నడవడిక కలామెను; మహా = గొప్ప; దారిద్ర్య = పేదరికములను; సంహారిణిన్ = నశింపజేయునామెను; సు = మంచి; విభూష = ఆభరణములను; అంబర = వస్త్రములు; ధారిణిన్ = ధరించు నామెను; గుణవతీ = సుగుణవంతురాలలో; చూడామణిన్ = శ్రేష్ఠురాలును; రుక్మిణిన్ = రుక్మిణీదేవిని.
భావము:- రుక్మిణీదేవి ఆత్మోన్నత్యం, మహావైభవం, గాంభీర్యాలతో మెలగుతుంది. సకల సంపదలు కలిగిస్తుంది. సాధువులను బంధువులను చక్కగ సత్కరిస్తుంది. పుణ్యకార్యాలు చేస్తుంది, మహాదరిద్రాన్ని పోగొడు తుంది. చక్కటి భూషణాలు వస్త్రాలు ధరించిన, అలాంటి సుగుణాల నారీ శిరోమణి, తన మనోహారి యైన రుక్మణిని ఆ శుభ సమయంలో వివాహమాడాడు. శాశ్వతమైన యశస్సు పొందాడు.

105
తులుం దారునుఁ బౌరులు
హిమతిఁ గానుకలు దెచ్చి యిచ్చిరి కరుణో
న్న వర్ధిష్ణులకును మా
ని రోచిష్ణులకు రుక్మిణీకృష్ణులకున్.
టీక:- సతులున్ = భార్యలు; తారునున్ = తాము కలిసి; పౌరులు = పురజనులు; హితమతిన్ = ఇష్టపూర్వకముగా; కానుకలున్ = బహుమతులు; తెచ్చి = తీసుకు వచ్చి; ఇచ్చిరి = ఇచ్చిరి; కరుణ = దయచేత; ఉన్నత = గొప్పవహించిన; వర్ధిష్ణుల్ = వృద్ధిపొందు గుణము కల వారి; కును = కు; మానిత = మన్నింపదగిన; రోచిష్ణుల = ప్రకాశవంత స్వభావము కల వారి; కున్ = కి; రుక్మిణీ = రుక్మిణీదేవి; కృష్ణుల = కృష్ణుడుల; కును = కు.
భావము:- అపార కృపా వర్ధిష్ణులు, అఖండ తేజో విరాజితులు రుక్మిణీ శ్రీకృష్ణులకు ద్వారకాపుర వాసులు తమ భార్యలతో వచ్చి మనస్ఫూర్తిగా కానుకలు తెచ్చి ఇచ్చారు.

106
రి పెండ్లికిఁ గైకేయక
కురు సృంజయ యదు విదర్భ కుంతి నరేంద్రుల్
మానందముఁ బొందిరి
ణీశులలోన గాఢ తాత్పర్యములన్.
టీక:- హరి = కృష్ణుని; పెండ్లి = వివాహమున; కిన్ = కు; కైకేయ = కైకేయ వంశపు; కురు = కురు వంశపు; సృంజయ = సృంజయ వంశపు; యదు = యదు వంశపు; విదర్భ = విదర్భ దేశపు; కుంతి = కుంతి భోజుని వంశపు; నరేంద్రులు = రాజులు; పరమ = అధికమైన; ఆనందమున్ = సంతోషమును; పొందిరి = పొందిరి; ధరణీశుల = రాజుల {ధరణీశుడు - ధరణి (భూమికి) ఈశుడు (ప్రభువు), రాజు}; లోనన్ = అందలి; గాఢ = దృఢమైన; తాత్పర్యములన్ = మంచి అభిప్రాయములతో.
భావము:- శ్రీకృష్ణమూర్తి కల్యాణానికి, రాజు లందరి లోను కైకయ, కురు, సృంజయ, యదు, విదర్భ, కుంతి దేశాల రాజులు అధికమైన పరమానందం పొందారు.

107
రి యీ తెఱఁగున రుక్మిణి
రుదుగఁ గొనివచ్చి పెండ్లియాడుట విని దు
ష్కకృత్య మనుచు వెఱగం
దిరి రాజులు రాజసుతులు దిక్కుల నెల్లన్.
టీక:- హరి = కృష్ణుడు; ఈ = ఈ; తెఱగునన్ = విధముగ; రుక్మిణిన్ = రుక్మిణీదేవిని; అరుదుగన్ = అపురూపముగా; కొనివచ్చి = తీసుకు వచ్చి; పెండ్లి = వివాహము; ఆడుట = చేసికొనుట; విని = విని; దుష్కర = అసాధ్యమైన; కృత్యము = పని; అనుచు = అని; వెఱగందిరి = ఆశ్చర్యపడిరి; రాజులున్ = రాజులు; రాజసుతులున్ = రాకుమారులు; దిక్కులన్ = అన్నివైపుల ఉన్నవారు; ఎల్లన్ = అందరును.
భావము:- ముకుందుడు శ్రీకృష్ణుడు రుక్మణీదేవిని అపూర్వంగా తీసుకొని వచ్చి యిలా వివాహమాడిన విధము, బహు దుస్సాధ్య మైన విషయం అనుచు ప్రపంచంలోని రాజులు, రాకుమారులు, అందరు అచ్చరువొందారు. అంటు పరీక్షిత్తునకు శుకుడు చెప్పసాగాడు.

108
నఘ! యాదిలక్ష్మి యైన రుక్మిణితోడఁ
గ్రీడ సలుపుచున్న కృష్ణుఁ జూచి
ట్టణంబులోని ప్రజ లుల్లసిల్లిరి
ప్రీతు లగుచు ముక్తభీతు లగుచు."
టీక:- అనఘ = పుణ్యుడా; ఆదిలక్ష్మి = ఆదిలక్ష్మి; ఐన = అయినట్టి; రుక్మిణి = రుక్మిణీదేవి; తోడన్ = తోటి; క్రీడన్ = క్రీడించుట; సలుపుచున్న = చేయుచున్న; కృష్ణున్ = కృష్ణుని; చూచి = చూసి; పట్టణంబు = నగరము; లోని = అందలి; ప్రజలు = జనులు; ఉల్లసిల్లిరి = ఆనందించిరి; ప్రీతులు = సంతోషము కలవారు; అగుచున్ = అగుచు; ముక్త = విడువబడిన; భీతులు = భయము కలవారు; అగుచున్ = అగుచు.
భావము:- పుణ్యాత్ముడైన పరీక్షిన్మహారాజా! ఆదిలక్ష్మి యొక్క అవతారమైన రుక్మిణితో క్రీడిస్తున్న శ్రీకృష్ణమూర్తిని చూసి ద్వారకానగరం లోని పౌరులు భయాలు విడనాడి యెంతో సంతోషంతో విలసిల్లారు."

పూర్ణి

109
కులయరక్షాతత్పర!
కులయదళ నీలవర్ణ కోమలదేహా!
కులయనాథ శిరోమణి!
కులయజన వినుత విమలగుణ సంఘాతా!
టీక:- కువలయరక్షాతత్పర = శ్రీరామా {కువలయ రక్షా తత్పరుడు - కు (భూమి) వలయ (మండలమును) రక్షా (కాపాడుట యందు) తత్పరుడు (ఆసక్తి కలవాడు), శ్రీరాముడు}; కువలయదళనీలవర్ణకోమలదేహా = శ్రీరామా {కువలయ దళ నీలవర్ణ కోమల దేహుడు - కువలయ (నల్లకలువ) యొక్క దళ (రేకులవంటి) వర్ణ (రంగు కలిగిన) కోమల (మృదువైన) దేహుడు (శరీరము కలవాడు), శ్రీరాముడు}; కువలయనాథశిరోమణి = శ్రీరామా {కువలయనాథ శిరోమణి - కు (భూమి) వలయ(మండలమును) నాథ (ఏలువారిలో) శిరోమణి (తలమీది మణివలె శ్రేష్ఠమైన వాడు), శ్రీరాముడు}; కువలయజనవినుత = శ్రీరామా {కువలయజన వినుత - కువలయ (భూమండలము యొక్క) జన (సర్వ ప్రజలచేత) వినుత (స్తుతింపబడువాడు), శ్రీరాముడ}; విమలగుణసంఘాతా = శ్రీరామా {విమల గుణ సంఘాతుడు - విమల (స్వచ్ఛమైన) గుణ (సుగుణముల) సంఘాత (సమూహములు కలవాడు), శ్రీరాముడు}.
భావము:- భూమండలాన్ని రక్షించటంలో ఆసక్తి కలవాడా! కలువ రేకుల వంటి నల్లని కాంతితో విరాజిల్లే మృదువైన దేహం కలవాడా! భూమండలంలోని భూపతు లందరికి శిరోభూషణ మైన వాడా! పుడమి మీదనుండే జనులందరిచే పొగడబడే సుగుణాల సమూహం కలవాడా! శ్రీ రామచంద్ర ప్రభో! నీకు వందనం.
ఈ శ్రీరాముని ప్రార్థనలోని చమత్కర మాధుర్యం తొణికిసలాడుతోంది. కువలయ అని నాలుగు పాదాలు ఆరంభిస్తు లోకం, కలువలు, రాజులు, మానవులు అని నాలుగు రకాల అర్థబేధంతో యమకం పండించిన తీరు అద్భుతం. రెండు గాని అంతకంటె ఎక్కువ అక్షరాలు ఉన్న పదాలు, అర్థభేదం కలిగి, మరల మరల వస్తూ ఉంటే యమకాలంకారం.

110
సిజనిభ హస్తా! ర్వలోక ప్రశస్తా!
నిరుపమ శుభమూర్తీ! నిర్మలారూఢ కీర్తీ!
హృదయ విదారీ! క్తలోకోపకారీ!
గురు బుధజన తోషీ! ఘోరదైతేయ శోషీ!
టీక:- సరసిజనిభహస్తా = శ్రీరామా {సరసిజనిభహస్తుడు - సరసిజ (పద్మము) నిభ (వంటి) హస్తుడు (అరచేతులు కలవాడు), శ్రీరాముడు}; సర్వలోకప్రశస్తా = శ్రీరామా {సర్వలోకప్రశస్తుడు - సర్వ (సమస్తమైన) లోక (లోకములలోను) ప్రశస్తుడు (శ్లాఘింపబడువాడు), శ్రీరాముడు}; నిరుపమశుభమూర్తీ = శ్రీరామా {నిరుపమశుభమూర్తి - నిరుపమ (సాటిలేని) శుభ (మేళ్ళు కలిగించెడి) మూర్తి (ఆకృతి కలవాడు), శ్రీరాముడు}; నిర్మలారూఢకీర్తీ = శ్రీరామా {నిర్మలారూఢకీర్తి - నిర్మల (పరిశుద్ధమైన) ఆరూఢ (నిలకడైన) కీర్తి (కీర్తి కలవాడు), శ్రీరాముడు}; పరహృదయవిదారీ = శ్రీరామా {పరహృదయవిదారి - పర (విరోధుల) హృదయ (గుండెలను) విదారి (చీల్చెడి వాడు), శ్రీరాముడు}; భక్తలోకోపకారీ = శ్రీరామా {భక్తలోకోపకారి - భక్తులను లోక (ఎల్లరకు) ఉపకారి (ఉపకారము చేయువాడు), శ్రీరాముడు}; గురుబుధజనతోషీ = శ్రీరామా {గురుబుధజనతోషి - గురు (గొప్ప) బుధ (ఙ్ఞానము కల) జన (వారికి) తోషి (సంతోషము కలిగించు వాడు), శ్రీరాముడు}; ఘోరదైతేయశోషీ = శ్రీరామా {ఘోరదైతేయశోషి - ఘోర (క్రూరమైన) దైతేయ (రాక్షసులను) శోషి (నశింపజేయు వాడు), శ్రీరాముడు}.
భావము:- పద్మాల వంటి హస్తములు కలవాడా! ఎల్లలోకాలలోను శ్రేష్ఠతమమైన వాడా! సాటిలేని మంగళ స్వరూపము కలవాడా! స్వచ్ఛమైన వన్నెకెక్కిన కీర్తి కలవాడా! శత్రువుల గుండెలను ఖండించు వాడా! భక్త సమూహానికి మేలు చేయువాడా! పెద్దలను, పండితులను సంతోషపరచేవాడా! భయంకరులైన రక్కసులను నాశనము చేయువాడా! శ్రీరామచంద్రప్రభూ! వందనములు.

111
ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసనమంత్రి పుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతం బయిన శ్రీ రుక్మిణీ కల్యాణం బను కథ సమాప్తము.
టీక:- ఇది = ఇది; శ్రీ = సంపత్కరమైన; పరమేశ్వర = భగవంతుని; కరుణా = దయతో; కలిత = జన్మించిన; కవితా = కవిత్వము చెప్పుటలో; విచిత్ర = అద్భుతమైనవాడు; కేసనమంత్రి = కేసనమంత్రి; పుత్ర = కుమారుడు; సహజ = సహజసిద్ధముగ; పాండిత్య = పాండిత్యము కలవాడు; పోతన = పోతన; అమాత్య = మంత్రిచేత; ప్రణీతంబు = చెప్పబడినది; అయిన = ఐన; శ్రీ = గొప్పదైన; రుక్మిణీ = రుక్మణీదేవి యొక్క; కల్యాణంబు = పెండ్లి; అను = అనెడి; కథ = కథ; సమాప్తము = పూర్తి అగుట
భావము:- ఇది సంపత్కరమైన భగవంతుని దయతో జనించిన అద్భుత కవితా నిపుణుడు, కేసనమంత్రి పుత్రుడు, సహజ సిద్ధ పాండిత్య ప్రావీణుడు అయిన పోతనామాత్యునిచేత చెప్పబడిన శ్రీ రుక్మణీదేవి కల్యాణము అనెడి కథ సమాప్తము అగుట.

ఓం ఓం ఓం
ఓం శాంతిః శాంతిః శాంతిః
సర్వే జనాః సుఖినో భవంతు