పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : శివుండు వీరభద్రునకుఁ బట్టంబు గట్టుట.

  •  
  •  
  •  

4-221-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికి.

4-222-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భిద్వహ్ని కుబేరభానుజ హరిబ్రహ్మాదులం బిల్చి యీ
లియుం డాఢ్యుఁడు వీరభద్రుఁ డఖిలబ్రహ్మాండభేద్యుండు స
ల్లలితానందుఁడు ముజ్జగంబులకు నెల్లన్ దాన కర్తారుఁడై
వెలుఁగం దైవము మీఁకు నీతఁ డనియెన్ విశ్వేశుఁడత్యున్నతిన్.

టీకా:

బలభిత్తు = ఇంద్రుడు; వహ్ని = అగ్ని; భానుజ = యముడు.

భావము:

ఇంద్రుడు, అగ్ని, కుబేరుడు, యముడు, నారాయణుడు, బ్రహ్మ మొదలైన వారిని పిలిచి “ఈ వీరభద్రుడు బలవంతుడు, పూజ్యుడు, అన్ని లోకాలనూ భేదింపగలవాడు, ఆనందమూర్తి, మూడు లోకాలకూ తానే కర్త. ఇకపై ఇతనే మీ దైవము, విశ్వేశుడు, ఉన్నతుడు” అని శివుడు చెప్పాడు.

4-223-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గిరిజాధీశ్వరు నానతి
రఁగఁగఁ జేపట్టి భువనరదక్షుకుఁ డై
రుణన్ జగంబులన్ని యుఁ
రిపాలన సేయు వీరద్రుం డెలమిన్.

టీకా:

పరగ = ఒప్పుగా; ఎలమి = సంతోషము.

భావము:

శివుని ఆజ్ఞ ప్రకారం వీరభద్రుడు సకలలోక రక్షకుడై దయతో సంతోషంతో లోకాలను పాలిస్తున్నాడు.

4-224-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన విని వీరభద్రవిజయ ప్రకారంబుఁ దెలియ విన్నవించిన వాయుదేవున కమ్మహామును లిట్లినిరి.

టీకా:

విన్నవించు = వివరించు.

భావము:

అనగా విని వీరభద్రవిజయమును వివరించిన వాయుదేవునితో ఆ మహా మునులు ఇలా అన్నారు.

4-225-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వాయుపురాణాంభోనిధి
నాక! శీతాంశుభంగి నానందకరం
బై యున్ననీప్రసంగము
ధీయుత నీచేత నేఁడు దెలిసితి మనఘా!

టీకా:

శీతాంశుడు = చల్లని కిరణములు కలవాడు, చంద్రుడు; ధీయుతుడు = బుద్ధిమంతుడు; అనఘుడు = పాపము లేని వాడు.

భావము:

"వాయుపురాణమనే సముద్రానికి నాయకుడా! నీ ప్రసంగము చల్లని కిరణాల చంద్రునివలె ఆనందకరమై యున్నది. బుద్ధిమంతుడా! పుణ్యాత్ముడా! నీ వలన ఈ విషయాలు తెలుసుకున్నాము.

4-226-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీమ్య మైన యీకథ
వాక వినువారు చదువువారును లిఖిత
ప్రారంభు లైన వారును
వారు గదా శంభు కొల్వువారు సమీరా!

టీకా:

వారక = ఎల్లప్పుడూ; సమీర = వాయువు.

భావము:

వాయుదేవా! అందమైన శుభకరమైన యీ కథను వినువారు, చదువువారు, వ్రాసినవారూ ఎల్లప్పుడూ శివుని కొలువులో ఉంటారు.

4-227-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పంచాననచరితము ని
శ్చంల భక్తిమెయి విన్నఁ దివినఁ జాలున్
కించిన్మాత్రంబై నను
పంమహాపాతకములు పాయు మహాత్మా!

టీకా:

పంచాననుడు = ఐదు ముఖములు కల శివుడు; నిశ్చంచల = కదలని; పాయు = విడచు.

భావము:

మహాత్మా! శివుని చరిత్రను నిశ్చలమైన భక్తితో కొంచమైనా విన్నా, చదివినా పంచమహా పాపములు నశిస్తాయి.”

4-228-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికి సఫలమనోరథు లై వాయుదేవుని స్తుతియించి రని యివ్విధంబున.

టీకా:

మనోరథము = కోరిక.

భావము:

అని పలికి వీరభద్రవిజయము వినాలనే కోరిక తీరినవారై వాయుదేవుని స్తుతించినారు. అని ఈ విధముగా.

4-229-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాకుం దోఁచిన విధమున
నీథఁ గైకొంటిఁ గాక నీలగ్రీవా
నీ థమహిమాతిశయము
వాక్రువ్వఁగ నిందువశమె నజజువశమే.

టీకా:

వాక్రుచ్చు = చెప్పు.

భావము:

"నీలకంఠా! నాకు తోచిన విధముగా నీ కథచెప్పాను. కానీ నీ కథా మహిమను చెప్పడము చంద్రుని వశమా! బ్రహ్మదేవుని తరమా!

4-23-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాలిగిన నేరుపులును
నాలిగిన నేరములును నాగేంద్రధరా!
నీకు సమర్పణ సుమ్మీ
లోకేశ్వర! భక్తజనకలోకాధారా!

టీకా:

జనకుడు = తండ్రి.

భావము:

నాగేంద్రధరా! నాకు కలిగిన నేర్పులు, నేను చేసిన తప్పులు నీకే సమర్పిస్తున్నాను సుమా! జగన్నాథా! భక్తజనులకు తండ్రి వంటి వాడా! జగదాధారా!

4-231-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యెందాఁక; సురేంద్ర పర్వతవిభుం డెందాఁక; బృందారకా
లి యెందాఁక; రవీందుమండలములున్ వారాసు లెందాఁక; ని
చ్చలు నానందకరంబు లై త్రిజగతిం సంధిల్లు నందాఁక; ని
ర్మ మై యీకథ సర్వలోకనుతమై మానిత్యమై యుండెడున్.

టీకా:

సురేంద్ర పర్వత విభుడు = మేరు పర్వతం; బృందారకులు = దేవతలు; వారాశి = సముద్రము; నిచ్చలు = ఎల్లప్పుడూ; సంధించు = కూడు.

భావము:

భూమి ఎంత వరకు యుంటారో, మేరు పర్వతం ఎంత వరకు యుంటుందో, దేవతలెంతవరకు యుంటారో, సూర్యచంద్ర మండలములు సముద్రాలు ఎంతవరకు యుంటాయో, నిత్యానందకరమై మూడులోకాలూ యుంటాయో యంతవరకూ ఈ కథ ఎల్లప్పుడూ సర్వలోకములూ స్తుతించేలా నిత్యమై యుంటుంది.