పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : పార్వతీపరిణయమునకు బ్రహ్మది దేవతలు వచ్చుట

  •  
  •  
  •  

3-76-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేవా! మానేర్చు ప్రకారంబున నీ యనుగ్రహంబున మీకుఁ బరిణయంబుగా నిశ్చయించి పార్వతీదేవికి ముద్రారోహణంబు చేసి వచ్చితిమి; యింకఁ దడయ నేల? వివాహలగ్నంబు నిర్ణయించి హిమనగేంద్రుఁ డున్న చోటికి లేఖలు పంపుదురు గాక; మహత్మా! గరళకంధరా! మీ కల్యాణమహిమాభిరామంబు చూడ వచ్చెదము; సోమశేఖరా! శరణం” బని విన్నవించిన మునినాథుల ననుకంప సొంపు మిగుల నానంద రసంబుల నోలలార్చి యమ్మహేశ్వరుండు.

టీకా:

నేర్చు = తెలియు; ముద్రారోహణముచేయు = నిశ్చితార్థముచేయు; తడయు = ఆలస్యము; అభిరామము = కమనీయము; అనుకంపనము = దయ; సొంపు = ప్రసన్నత; ఓలలార్చి = విహరింపచేసి.

భావము:

“దేవా! మహాత్మా! గరళకంధరా! సోమశేఖరా! శివా! మాకు చేతనైనట్లు నీ దయవలన మీ పెండ్లి నిశ్చయించి పార్వతీదేవికి నిశ్చితార్థము చేసి వచ్చాము. ఇంక ఆలస్యమెందుకు వివాహ ముహూర్తము నిర్ణయించి హిమవంతునకు లేఖలు పంపండి. మీ కమనీయమైన కల్యాణమును చూడడానికి వస్తాము. ఇక శరణు.” అని విన్నవించిన మునుల దయకు చాలా సంతోషించి ఆనందరసములలో విహరించి ఆ మహేశ్వరుడు.

3-77-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేవిఁ బెండ్లియాడ దిన మేది లెస్స యో
యెఱుఁగవలయు నంచు నీశ్వరుండు
భారతీశుఁ దలఁచె బాలేందుజూఁటుని
లఁపుతోనఁ గూడ ధాత వచ్చె.

టీకా:

లెస్స = యోగ్యము; భారతీశుడు = బ్రహ్మదేవుడు; బాలేందుడు = బాలచంద్రుడు; ధాత = బ్రహ్మదేవుడు.

భావము:

పార్వతీదేవిని పెండ్లియాడుటకు యోగ్యమైన దినమేదో తెలుసుకోవాలని ఈశ్వరుడు బ్రహ్మదేవుడిని తలచుకొనెను. అలా శివుడు తలచుకోగానే బ్రహ్మదేవుడు విచ్చేసెను.

3-78-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు చనుదెంచి బ్రహ్మ తనకుం బ్రణామంబు చేసి నిలచినఁ గనుంగొని; సముచిత ప్రకారంబుల గారవించి; యతని నప్పరమేశ్వరుండు విధ్యుక్త ప్రకారంబుల వివాహ లగ్నంబు నిర్ణయించి తన పెండ్లికి రమ్మని చతుర్దశభువనంబు లందుఁ జాటింపం బంచిన.

టీకా:

గనుంగొని = తెలుసుకొని; సముచితము = తగిన; విధ్యుక్త ప్రకారము = యధావిధిగా; చతుర్దశ = పదునాలుగు.

భావము:

ఈ విధంగా వచ్చి తనకు నమస్కరించి నిలబడిన బ్రహ్మదేవుని పరమేశ్వరుడు తగిన విధముగా గౌరవించి వివాహ ముహూర్తము నిర్ణయించి తన పెండ్లికి రమ్మని పద్నాలుగు లోకాల్లోనూ చాటింపమని ఆనతిచ్చెను.

3-79-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేర పెండ్లి నేఁ డనుచుఁ దేజము సొంపున భోగరాయఁడై
దేత లందఱుం గొలువ దేవమునుల్ నుతి సేయఁగా శచీ
దేవియుఁ దాను గూడి చనుదెంచె మహేంద్రుఁడు పెంపు తోడ నై
రాణదంతి నెక్కి మునిరంజనుకొండకు వెండికొండకున్.

టీకా:

తేజము = ప్రకాశము; సొంపు = సొగసు, సౌందర్యము; భోగరాయడు = భోగము పొందువాడు, సుఖవంతుడు; నుతి = పొగడ్త; పెంపు = అతిశయము; ఐరావణ = ఐరావత; దంతి = ఏనుగు; రంజన = సంతోషించునది.

భావము:

శివ ప్రభువు పెండ్లి నేడే అంటూ ఇంద్రుడు భార్య శచీదేవి తానూ కలసి మహా భోగియై. దేవతలు సేవిస్తుండగా దేవమునులు పొగుడుతుండగా ఐరావతమెక్కి వెండికొండకు బయలుదేరి వెళ్ళెను.

3-80-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాలుగుశృంగముల్ మెఱయనాలుక లేడు వెలుంగఁగోర్కులన్
దేలుచు మూఁడు పాదములు తేటపడన్ నిజ వైభవోన్నతిన్
వ్రాలుచు నేగుదెంచె నజవాహన మెక్కి ధనంజయుండు ని
ల్లాలును దానుఁ గూడి త్రిపురాంతకు కొండకు వెండికొండకున్.

టీకా:

శృంగములు = భుజములు; నాలుకలేడు = సప్తజిహ్వలు - కాళి, కరాళి, విస్ఫులింగిని, ధూమ్రవర్ణ, విశ్వరుచి, లోహిత, మనోజవ.; తేటపడు = స్పష్టమగు; వ్రాలు = వాలు; ధనంజయుడు = అగ్ని; ఇల్లాలు = భార్య; త్రిపురాంతకుడు = శివుడు.

భావము:

చతుర్భుజములతో, మెరుస్తున్న సప్తజిహ్వలను ఏడు మంటలతో, కోరికలలో తేలుతూ, మూడు పాదములుతో మహావైభవంగా గొర్రె వాహనమెక్కి అగ్నిదేవుడు, ఆయన భార్య స్వాహాదేవితో కలసి కైలాసమునకు వేగంగా వెళ్ళెను.

3-81-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దంధరుల్ మహాఘనులుగ్రులు కింకరులోలిఁ గొల్వ ను
ద్దంలులాయవాహుఁ డయి ర్బముతో మణిభూషణాంగుఁ డై
దంధరుండు వచ్చె ఘనదండము కేల వెలుంగఁ గామినీ
మండితుఁ డై మనోజమదర్దనుకొండకు వెండికొండకున్.

టీకా:

దండము = దుడ్డుకర్ర; ఉదగ్రము = భయంకరమైన; కింకరులు = సేవకులు; ఓలి = వరుస; ఉద్దండ = పొడవైన; లులాయము = కారు ఎనుబోతు; మనోజ = మన్మధుడు.

భావము:

యమధర్మరాజు, దండములు ధరించిన మహాభయంకరమైన సేవకులు సేవిస్తుండగా, భీకరమైన నల్లని దున్నపోతు వాహనమునెక్కి మణిభూషణాలు ధరించి దండము ధరించి మన్మథుని మదమడిచినవాని కొండయైన వెండి కొండకు భార్య శ్యామలాదేవితో కలసి వచ్చెను.

3-82-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మావు నెక్కి రాక్షసులున్నన నేయఁగ నభ్రవీధి పై
మావకేతనం బడర మానినియున్ దనతోఁడ రాఁగ స
న్మానిత వస్త్రభూషణసమానధరుం డయి వచ్చెఁ బ్రీతితో
దావనాయకుండు జితదైత్యునికొండకు వెండికొండకున్.

టీకా:

అభ్ర = ఆకాశము; కేతనము = ధ్వజం; సన్మానిత = గౌరవించబడిన; దానవనాయకుడు = నిరృతి; జితదైత్యుడు = రాక్షసులను సంహరించినవాడు.

భావము:

నిరృతి రాక్షసులు సేవిస్తుండగా మానవ ధ్వజం ఎగురుచుండగా నరవాహనం యెక్కి గొప్ప వస్త్రములు, భూషణములు ధరించి రాక్షసులను సంహరించినవాని కొండయైన వెండికొండకు ఆకాశమార్గంలో భార్య దీర్ఘాదేవితో కూడి వచ్చెను.

3-83-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మోత సప్తసంద్రములుముంగలఁ గొల్వఁ గెలంకులందు గం
గాదిమహానదుల్ సముదయంబుగ రా ఝషకాంత వాహుఁ డై
శ్రీనరార నేఁగె రుచిఁ జెన్నగు కానుక లెల్లఁ గొంచుఁ దాఁ
బైలిఁ గూడి వార్ధిపతి ర్గునికొండకు వెండికొండకున్.

టీకా:

మోదము = సంతోషము; ముంగల = ముందు; కెలకు =ప్రక్క; సముదయము = సమూహము; ఝషకాంత = మొసలికాంత; శ్రీ = అలంకరణ; తనరారు = అతిశయించు; రుచి = కాంతి; చెన్ను = అందము; పైదలి = స్త్రీ, భార్య; వార్ధి = సముద్రము; భర్గుడు = శివుడు.

భావము:

సంతోషంగా సప్త సముద్రములు తన ముందు కొలుస్తుండగా; గంగాది మహానదీ సమూహములు తనకిరువైపులా వస్తూ యుండగా; మొసలికన్య వాహనమెక్కి తన భార్య కాళికాదేవితో కలసి వరుణుడు భర్గుని కొండయైన వెండికొండకు వెళ్ళెను. తనతో అందంగా మెరిసిపోతున్న కానుకలు ఎన్నో తీసుకెళ్ళెను.

3-84-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సండికాని పెండ్లి యని సంతస మందుచు మేలురాజ్యల
క్ష్మిండుఁ దేజరిల్లుచును జెల్వయుఁ దాను దుకూలరత్న మా
తంతురంగ కాంచన కదంబముఁ గొంచుఁ దురంగవాహుఁడై
సంతి నేఁగె విత్తపతి శంకరుకొండకు వెండికొండకున్.

టీకా:

నికరము = సమూహము; గాడ్పు = వీచుగాలి; హరిణవల్లభుడు = మగజింక, లేడి; వల్లభము = ప్రియమైన.

భావము:

ముని సమూహములు సేవించుతుండగా; తమ మనసులలో సంతోషమును పొందుతూ; జనపనార మొక్కలు చిగురించగా; బాగా చల్లని కమ్మని గాలి వీస్తూ; తను తన భార్య అంజనాదేవి లేడి వాహనమెక్కి లోకాలన్నీ పరవశించేలా వాయుదేవుడు ఆ మదనాంతకుడైన శివుని వెండికొండకు వెళ్ళెను.

3-85-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సండికాని పెండ్లి యని సంతస మందుచు మేలురాజ్యల
క్ష్మిం డుఁ దేజరిల్లుచును జెల్వయుఁ దాను దుకూలరత్నమా
తం తురంగ కాంచన కదంబముఁ గొంచుఁ దురంగవాహుఁడై
సంతి నేఁగె విత్తపతి శంకరుకొండకు వెండికొండకున్.

టీకా:

సంగడికాడు = స్నేహితుడు; మేలు = విశేషము, మంచి; చల్వ, చెలువ = అందమైన స్త్రీ, భార్య; దుకూలము = సన్నని వస్త్రము; మాతంగ = ఏనుగు; తురంగము = గుఱ్ఱము; కాంచనము = బంగారము; కదంబము = సముదాయము; కొంచు = తీసికొను; సంగతి = చేరిక; విత్తపతి = కుబేరుడు.

భావము:

స్నేహితుని పెండ్లి అని సంతోషము పొందుచూ విశేషమైన రాజ్యలక్ష్మితో ప్రకాశిస్తూ భార్య చిత్రలేఖ, తానూ సన్నని వస్త్రములు, ఏనుగులు, గుఱ్ఱాలు, బంగారము వంటి సముదాయమును తీసుకొని అశ్వ వాహనుడై చేరికతో కుబేరుడు, శంకరుని వెండికొండకు వెళ్ళెను.

3-86-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నొల విభూతిఁ బూసి కడునున్నని యేనుఁగుతోలుఁ గప్పి రా
మున పాములం దొడిగి చారు త్రిశూలపినాకహస్తుఁ డై
యెసఁగిన వేడ్కతోఁ దనదు నింతియుఁ దానును వచ్చె శూలి దా
వని నెక్కి జూటహిమభానునికొండకు వెండికొండకున్.

టీకా:

రాజసము = రాజుకు ఉండే ఠీవి; చారు = సుందరమైన; పినాకము = శివుని విల్లు; ఎసగు = అతిశయించు; శూలి = ఈశానుడు; బసవడు = వృషభము.

భావము:

నుదుట విభూతి రాసుకుని; చాలా నున్నని ఏనుగు చర్మము ధరించి; రాజసంతో పాములను ధరించి; సుందరమైన త్రిశూలము, విల్లు దరించి; అతిశయించిన వేడుకతో ఈశానుడు తన భార్య, తాను వృషభవాహనమెక్కి చంద్రశేఖరుడు శివుని వెండి కొండకు వచ్చెను.

3-87-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శృంగారముతో మహామహిమతోఁ ళ్యాణియుం దాను స
జ్జనితోల్లాసులు పుణ్యభాగవతులున్ సంసారదూరాత్మకుల్
కాదుల్ కడుఁగొల్వ మింట నరిగెన్ సంప్రీతితో మాధవుం
ఘుం డాఢ్యుఁడు వెండికొండకు ఖగేంద్రారూఢుఁ డై రూఢితోన్.

టీకా:

మింట = ఆకాశము; అనఘుడు = పుణ్యాత్ముడు; ఆఢ్యుడు = సంపన్నుడు; ఖగేంద్రము = గరుడుడు; రూఢి = నిశ్చయము.

భావము:

గొప్ప అలంకారములతో మహా మహిమతో లక్ష్మీదేవి, తాను నిత్య సంతోషులు, పుణ్యభాగవతులు, సంసార దూరులైన సనకాదులు చాలా సేవిస్తుండగా పుణ్యాత్ముడు, సంపన్నుడైన మాధవుడు ప్రీతితో గరుడవాహనమెక్కి నిశ్చయంగా వెండికొండకు వెళ్ళెను.

3-88-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నొప్ప మునులు గొలువఁగఁ
హంసాధీశు నెక్కి గ్రక్కున వాణీ
నయుఁ దానును వచ్చెను
జాతభవుండు రజతశైలము కడకున్.

టీకా:

వలనొప్పు = అనుకూలించు; గ్రక్కున = వెంటనే.

భావము:

బ్రహ్మదేవుడు మునులు సేవిస్తుండగా హంసవాహనమెక్కి తనభార్య సరస్వతీదేవి, తాను వెంటనే వెండి కొండకు వచ్చెను.

3-89-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తారాగ్రహములు గొలువఁగఁ
దారాహితకమలహితులు ద్దయు వేడ్కన్
దీరొప్ప నేగు దెంచిరి
తారాచలశిఖరమునకు న్యాత్మకులై.

టీకా:

తార = నక్షత్రము; తారహితుడు = చంద్రుడు; కమలహితుడు = సూర్యుడు.

భావము:

నక్షత్రాలు, గ్రహాలు సేవిస్తుండగా సూర్యచంద్రులు వేడుకతో వెండికొండకు వచ్చిరి.

3-90-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కిన్నర గరుడోరగ
సు దనుజేంద్రాది సిద్ధ సురముని విద్యా
గంధర్వాధీశులు
రుసం గైలాసమునకు చ్చిరి ప్రీతిన్.

టీకా:

ఉరగము = సర్పము.

భావము:

మానవులు, కిన్నెరులు, గరుడులు, నాగులు, సర్పములు, దేవతలు, రాక్షసులు, సిద్ధులు, దేవమునులు, విద్యాధరులు, గంధర్వాధీశులు అందరూ ప్రీతితో కైలాసమునకు వచ్చిరి.