పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : హిమవంతుఁడు మునులం బూజించుట

  •  
  •  
  •  

3-38-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అత్యంత సంభ్రమంబునఁ దన యనుంగు మొగపాలకుఁ బఱతెంచి వారలం గని, వినయంబునఁ బ్రణామంబులు చేసి, యమ్మహత్ములఁ దన యంతఃపురంబునకుం గొనిపోయి ప్రియ వూర్వకంబుగా నర్ఘ్య పాద్యాది విధులం బూజించి కనకరత్న పీఠంబుల నుండ నియోగించి నిజకరంబులు మొగిడ్చి మంద మధురాలాపంబుల ని ట్లనియె.

టీకా:

అనుంగు = ప్రియమైన; మొగసాల = నగరి తలవాకిటి చావడి, ఇంటి ముందరి పంచ; అర్ఘ్యము = చేతులు కడుగుకొనుకు ఇచ్చు నీరు; పాద్యము = పాదములు కడుగుకొనుటకు ఇచ్చు జలము; అర్ఘ్యపాద్యాది = పదునాఱు ఉపచారములు - ఆవాహనము, ఆసనము, పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, నమస్కారము, ఉద్వాసనము. (16); మొగిడ్చు = జోడించు; మంద = నెమ్మది.

భావము:

హిమవంతుడు ఎంతో సంబరంగా తన తలవాకిటికి వచ్చిన సప్తర్షులను చూసి, వేగంగా వెళ్ళి, వినయముగా నమస్కరించెను. ఆ మహాత్ములను తన అంతఃపురమునకు తీసికొని వెళ్ళి, ఎంతో ఇష్టముతో అర్ఘ్య పాద్యాది విధులతో పూజించెను. రత్నములు పొదిగిన బంగారు ఆసనములపై కూర్చుండజేసి, చేతులు జోడించి, నెమ్మదిగా, మధురంగా ఇలా అన్నాడు.

3-39-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“నన్నున్బెద్ధరికంబు చేసికరుణన్ నాయింటికిన్ మీర లి
ట్లెన్నండేనియు రానివారలు ప్రియం బేపార వేంచేసి నేఁ
డున్నారిచ్చట నెంత పుణ్యుఁడ నొకో యోమౌనులారా! మిమున్
న్నారం గనుఁగొంటి మంటి విలసత్కల్యాణలోలుండ నై.

భావము:

“నన్ను గౌరవించి దయతో నా యింటికి మీరు వచ్చారు. ఇంతకు ముందు ఎన్నడూ రానివారు సంతోషంగా వచ్చి యున్నారు. నేనెంత పుణ్యాత్ముడనో కదా! మునులారా! మిమ్ములను కళ్ళారా చూడగలిగాను. తొణికిసలాడే కల్యాణ భావనలు కలుగుతున్నాయి

3-40-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మునీంద్రులారా! మీరు వేంచేయుటకుఁ గారణం బేమి యానతిత్తురు గాక” యనవుఁడు నద్దివ్యసంయము లిట్లనిరి

3-41-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డురాజధరుఁడు శంభుఁడు
మృడుఁడు మహేశ్వరుఁడు శివుడు మీ యింటికిఁ బెం
రఁగ నీ సుతఁ బార్వతి
డుగఁగ బుత్తెంచె మమ్ము చలాధిపతీ!

టీకా:

ఉడురాజధరుడు = నక్షత్రములు 27గురుకి పతి యైన చంద్రుని ధరించిన శివుడు; మృడుడు = సుఖింపచేయువాడైన శివుడు; మహేశ్వరుడు = గొప్ప ప్రభువైన శివుడు; అడర = అతిశయించగా; సుత = కూతురు; పుత్తెంచు = పంపించు; అచలము = కదలనిది (కొండ).

భావము:

“పర్వతరాజా! హిమవంతా! చంద్రధరుడు, శంభుడు, మృడుడు, మహేశ్వరుడు, శివుడు మీ యింటికి మిక్కిలి అతిశయముతో నీ కుమార్తె పార్వతిని తన కోసం అడగమని మమ్మల్ని పంపించాడు.”

3-42-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన విని సర్వాంగ పులకాంకితుం డై భక్తిసంభ్రమ పరమానంద చిత్తుం డై కైలాసపర్వతంబు దెసం గనుంగొని కరంబులు మొగిడ్చి తన మనంబునఁ బరమేశ్వరునకుఁ బ్రణామంబు చేసి యిట్లనియె.

భావము:

అనగా విని, హిమవంతుడు శరీరమంతా పులకించగా భయభక్తులతో, పరమానందభరితుడై, కైలాసపర్వతము వైపు చూసి చేతులు జోడించి తన మనస్సులో పరమేశ్వరునకు నమస్కరించి, ఇలా అన్నాడు.

3-43-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శివుఁడు మునులచేత శీతాచముకూఁతు
డుగఁ బంపె ననఁగ నవనిలో
న్నుఁ బెద్దచేసి మన్ననసేయంగఁ
లఁచెఁ గాక యేను దనకు నెంత.

టీకా:

అవని = భూమి; మన్నన = గౌరవము; ఏను = నేను.

భావము:

“శివుడు మునుల చేత హిమవంతుని కూతురును అడగడానికి పంపాడంటే లోకమంతా నన్ను గౌరవించేలా చేయాలనుకొనడం తప్పించి, నేను తనముందు ఎంతవాడిని?

3-44-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదియునుం గాక.

3-45-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వ్వరిసొమ్ము తలోదరి
యెవ్వరి దాసుండ నేను నెల్లప్పుడు మా
కెవ్వఁడు దైవము శంభుఁడు
ర్వేశుఁడు దానె కాదె కలవిధములన్.

టీకా:

తలోదరి = పలుచని ఉదరము కలామె యైన పార్వతి; దాసుడు = సేవకుడు; సకల = సర్వము.

భావము:

పార్వతీదేవి ఎవరి సొత్తు? నేను ఎవరి దాసుడను? ఎల్లప్పుడూ మా దైవము ఎవరు? శంభుడు మాకు అన్ని విధాలుగానూ సర్వేశ్వరుడే కదా!.

3-46-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మమ్ము నే ప్రకారంబుల నైనఁ గారుణ్యభావంబున రక్షించు గాక” యని పలికినఁ దుహినశైలేంద్రు నకు నమ్మునీంద్రు లి ట్లనిరి.

భావము:

మమ్ములను అన్నవిధములుగానూ శివుడు కరుణతో రక్షించుగాక.” అన్న హిమవంతునితో ఆ మునీంద్రులు ఇలా అన్నారు.

3-47-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“అయంగన్ శివభక్తి యింత కలదే యౌనౌ జగన్మాత నీ
రితం బిట్టిది గానఁ గాక యిచటన్ న్మించునే తొల్లి త
త్పుజిత్తుండును మమ్ము నొండెడలకున్ బుత్తెంచునే ధారుణీ
మాత్రంబుల కింత కీర్తి గలదే? ధాత్రీధరేంద్రోత్తమా!

టీకా:

అరయు = విచారించు; తొల్లి = పూర్వము; తత్ = ఆయొక్క; పురజిత్తుడు = త్రిపురారియైన శివుడు; పుత్తెంచు = పంపు, పురమాయించు; ధారుణీధరము = కొండ.

భావము:

“హిమవంతా! నీ శివభక్తి ఇంత గొప్పది కనుకనే జగన్మాత నీయింట పుట్టింది. పూర్వము శివుడు ఇలా మమ్మల్ని ఎక్కడికీ పంపించ లేదు. ఏ పర్వతాలకూ ఇంతటి కీర్తి లేదు.

3-48-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిన్నుఁ బోల వశమె నీయంత పుణ్యుండు
ఖిలజగము లందు రయఁ గలఁడె?
యీశ్వరేశుపంపు నింతఁ బాటింతువె?
యిట్టిభక్తి గలదె? హిమనగేంద్ర!

టీకా:

అరయు = విచారించు; పాటించు = ఆదరించు.

భావము:

హిమ పర్వత రాజా! నీతో సమానమైనవారు ఎవరూ లేరు. సమస్త లోకాల్లోనూ నీయంత పుణ్యాత్ముడు లేడు. సర్వేశ్వరుడు పంపించాడని మమ్మల్ని ఎంతోగొప్పగా ఆదరించావు? ఇతరులు ఎవ్వరికీ ఇంత భక్తి సాధ్యం కాదు కదా.

3-49-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శంర దేవుఁడు మాతో
నుంకు వడిగి నంత పెట్టు మువిదకు నన్నాఁ
డింకిట నెయ్యది గొనియెదు
కొంక మాతోడఁ జెప్పు కుధరాధిపతీ!

టీకా:

ఉంకువ = కన్యాశుల్కము; కొంకు = సంకోచించు; కుధరము = పర్వతము.

భావము:

పర్వతరాజా! హిమవంతా! శివుడు మాతో నీవడిగినంత కన్యాశుల్కము ఇవ్వమని చెప్పాడు. కనుక, ఏమి కావలయునో సంకోచించక మాతో చెప్పు.”

3-50-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనవుఁ డి ట్లనియె “మిమ్ముఁ బార్వతీదేవికి నుంకువ యిచ్చి రండని యానతిచ్చె నేని, మునీంద్రులారా! వీఁడు నా వాఁడని యెల్ల భంగు లందును నిరంతర కరుణాయత్తచిత్తుం డై నన్ను మన్నించుటయ నాకు నా కుఁతురకును పదివే లుంకువలు పెట్టుట యగు మీ యానసుండీ మీకుం దగినపని చేయుదు బాలిక నాలోకింపవలయు” నని కుమారీతిలకంబు నలంకరించిన.

భావము:

ఋషులు ఇలా అనగా హిమంతుడు ఇట్లనెను. “మిమ్మల్ని పార్వతీదేవికి శుల్కమిచ్చి రమ్మని ఆజ్ఞాపించినా మునులారా! వీడు నా వాడని శివుడు దయాపూర్ణుడై నన్ను మన్నించడం నాకూ, నా కూతురుకూ పదివేల శుల్కము లిచ్చినట్లు. మీ మీదొట్టు సుమా! మీరు చెప్పినట్లు చేస్తాను. కన్యను చూడండి.

3-51-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నితామణి రూపమునకుఁ
నుచాటుగఁ జేర్చి కప్పు ప్పినభంగిన్
కుసుమగంధ నవమణి
కాంబరములను చాలఁ గైసేసి రొగిన్.

టీకా:

కైసేయు = అలంకరించు; ఒగిన్ = చక్కగా.

భావము:

అమ్మవారి అందాన్ని దాచడానికి యన్నట్లు గొప్పగొప్ప పుష్పాలూ, గంధాలూ, నవరత్నాలూ, బంగారు నగలూ, వస్త్రములూ చక్కగా అలంకరించారు.

3-52-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మానిను లిరుదెసఁ గొల్వఁగ
జానుగ నల్లల్ల శైలను దోకొనుచున్
మేక చనుదెంచుటయును
మౌనులతో శైలవిభుఁడు ఱి యిట్లనియెన్.

టీకా:

మానిని = మానము గల స్త్రీ, పార్వతీదావి; జానుగ = సొగసుగా; అల్లల్ల = మెల్లమెల్లగా; తోకొను = వెంటబెట్టుకొను.

భావము:

చెలికత్తెలు రెండువైపులా వస్తూ యుండగా, రాజసంగామెల్లమెల్లగా శైలజను వెంటబెట్టుకొని మేనక రాగా, మునులతో హిమవంతుడుఇలా అన్నాడు.

3-53-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దె మా బాలిక వచ్చెను
మలతరహృదయులార! ర్వేశునకున్
ముదితకు నీడుగఁ జూడుఁడు
పడి శుభలక్షణములు రికింపుఁ డొగిన్.

టీకా:

సదమలతరము = మిక్కిలి చక్కనైన నిర్మలమైనది; పదపడి = తరువాత; పరికించు = పరీక్షించు; ఒగిన్ = చక్కగా.

భావము:

“ఓ ఋషులారా! మిక్కిలి నిర్మలమైన హృదయము కలవారా! అదిగో! మా బాలిక వచ్చింది. శివునకు, పార్వతికి ఈడు చూడండి. తరువాత చక్కగా శుభలక్షణాలను పరీక్షించండి”.

3-54-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన విని మునీంద్రులు కుమారి నాలోకించి జగదభినవ కల్యాణరూపంబునకు నాశ్చర్యామోఘ హృదయు లై యిట్లనిరి.

భావము:

అనగా విని మునీంద్రులు కుమారిని చూసి, లోకంలోనే ఆ నవశుభకర రూపానికి ఆశ్చర్యము, అమోఘము యైన మనసుతో ఇలా అన్నారు.

3-55-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దియు నంత్యము దవ్వగు
వేదాతీతుండు శివుఁడు విభుఁడుగఁ బడసెన్
బైలి శుభలక్షణములు
వేదంబులకైనఁ దరమె వివరింపంగన్.

టీకా:

దవ్వు = దూరము; పైదలి = స్త్రీ.

భావము:

“ఆద్యంతదూరులు అనగా వారిలో ఆదీ కనబడదు అంత్యమూ కకనబడదు. ఆద్యంతరహితుడూ వేదాతీతుడు యైన శివుని భర్తగా పొందే ఈ వనిత శుభలక్షణాలు వివరించడానికి వేదాలకు కూడా సాధ్యం కాదు.

3-56-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గిరీంద్రా! యమ్మహదేవి శివదేవునకుఁ బరిణయంబు గాఁ దగు; నిద్ధఱికి నీడయి యున్నది; కార్యంబును గొలికికి వచ్చినది “శుభస్య శీఘ్ర” మ్మని పెద్దలు పలుకుదురు గావున దీనికిఁ దడయనేల సంఘటింపు” మని మునీంద్రులు‍‍ వాంఛితకోమల భావాంకురంబులు వెలుంగ మంగళంబు లగు నాకాశగంగాతరంగిణీ జలంబులును, సల్లలితంబు లగు నళ్వత్ధ పల్లవంబులును తాంబూల కనకకలశ కుసుమ గంధాక్షతంబులును మఱియుఁ దక్కిన మంగళ ద్రవ్యంబులు దెప్పించి; సువర్ణపీఠంబున శుభముహూర్తంబున నక్కాంతాతిలకంబు నుండ నియోగించి; విధ్యుక్త ప్రకారంబున నర్చించి; అధికపుణ్యాహంబు చేసి; పుణ్యాహజలంబులు శిరంబునం బ్రోక్షించుకొని కళ్యాణ వాద్యంబులు చెలంగ ముదితకు ముద్రారోపణంబు చేసి గిరీంద్రునకు నుంకువ ముడుపిచ్చి సంయమీంద్రులు పరమానందంబున.

టీకా:

తడయు = ఆలస్యము చేయు; సంఘటించు = ఏర్పాటుచేయు; సల్లలితము = కోమలము; అశ్వత్థ పల్లవములు = రావి చిగుళ్ళు; ప్రోక్షించు = చల్లు; ముద్రారోహణము = నిశ్చితార్థము.

భావము:

“గిరీంద్రా! ఈమహాదేవికి, శివదేవునకు పరిణయము జరుగుతుంది. ఇద్దరికీ ఈడయ్యింది. పని సఫలమయింది. శుభస్య శీఘ్రము అని పెద్దలంటారు కావున, ఆలస్యమెందుకు కల్యాణానికి ఏర్పాటుచేయుము” అని మునీంద్రులు వారి భావాన్ని తెలిపారు. అపుడు ఆకాశగంగ జలమును, రావి చిగుళ్ళను, తాంబూలములు, బంగారు కలశములు, పూలు, గంధము, అక్షతలు, మరియు మిగిలిన మంగళద్రవ్యములు తెప్పించి బంగారు ఆసనముపై శుభముహూర్తమున పార్వతిని కూర్చుండజేసి యథావిధిగా పూజచేసి అధిక పుణ్యాహవచనము చేసి ఆ జలమును తలపై చల్లుకొని కళ్యాణ వాద్యములు మ్రోగుచుండగా పార్వతికి నిశ్చితార్థము చేసి హిమవంతునకు కన్యాశుల్కము ఇచ్చి ఆ మహర్షులు పరమానందాన్ని పొందారు.

3-57-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పాలకూళ్లు గుడిచి శైలాధిపుని యింట
మణతోడనాఁటి రాత్రి యుండి
గౌరితండ్రి తమకుఁ ట్టంగ నిచ్చిన
త్ప్రియంబుతోడమ్మతించి.

టీకా:

పాలకూడు = పరమాన్నము; కుడిచి = తిని; రమణ = ప్రీతి.

భావము:

హిమవంతుని ఇంట్లో సప్తర్షులు పరమాన్నము భుజించిరి. ఆనందంగా ఆ రాత్రి అక్కడే గడిపిరి. గౌరీదేవి తండ్రి తమకిచ్చిన వస్త్రాలను ఎంతో సంతోషంతో కట్టుకుంటిరి.