పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : నందివాహనుం డై శంకరుండు పరిణయంబునకుం జనుట

  •  
  •  
  •  

3-102-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని గణనాధ చక్రవర్తిని గై సేసి.

టీకా:

కైసేసి = అలంకరించి, పూజించి.

భావము:

అని గణపతిని చక్కగా ఒప్పించి.

3-103-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గనవాహిని కప్పు కుటంబు ధరియించి
లేఁ వెన్నెలఁ బువ్వుభాతిఁ దుఱిమి
ప్రాఁత పాములనెల్ల రిహారమును చేసి
ఱి క్రొత్త పాములణులు దొడిగి
దందశూకాధిశుఁ లచుట్టుగాఁ జుట్టి
పొలుపార నెద భూతిపూతఁ బూసి
పొడల నున్నని క్రొత్తపుట్టంబు ధరియించి
యేనుగుచర్మంబు మేనఁ గప్పి
3-103.1-ఆ.
నీలకంధరబున నెమ్మితోఁ బటికంపుఁ
బూససరులు వైచి పొలుపు మిగులఁ
జెలువు చేసి యిట్లు శివుడు చతుర్ధశ
భువనరాజ్యలక్ష్మి పొలుపు మిగుల.

టీకా:

గగనవాహిని = గంగ; మకుటము = కిరీటము; భాతి = వలె; దందశూకము = సర్పము; పొడ = చుక్క; పుట్టము = వస్త్రము; నెమ్మి = సంతోషము; పటిక = స్పటికము; సరులు = దండలు; పొలుపు = ఒప్పు.

భావము:

గంగను కప్పేలా కిరీటం ధరించాడు. దానిపై పువ్వులా చంద్రరేఖను తురిమాడు. పాత పాములను తీసేసి కొత్త పాముల మణులు తొడిగాడు. శేషుడిని తలచుట్టగా చుట్టి విభూతి పూసుకున్నాడు. నున్నని చుక్కల కొత్త వస్త్రము ధరించి ఒంటిపై ఏనుగు చర్మము కప్పుకున్నాడు. నీలకంఠం చుట్టూ సంతోషంగా స్పటికపూసల దండలు వేసుకున్నాడు. ఈవిధముగా పదునాలుగు భువనాల రాజ్యలక్ష్మీ ఒప్పే విధముగా తయారయ్యాడు.

3-104-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియును శృంగారవారాశి యై మారారాతి మహామోదంబున.

టీకా:

వారాశి = సముద్రము.

భావము:

పరమ శివుడు ఇలా అందముగా అలంకరించుకొని మిక్కిలి సంతోషముతో.

3-105-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణిఘణిల్లున వైచు న మైన ఱంకెలఁ
గుశైలగుహలు ఘూర్నిలి చెలంగ
హితవాలోద్దూత మారుతవశమున
దిక్కులు చొరుగు లై తిరుగుచుండ
కొండలు కోరాడు కొమ్ముల నమ్మేటి
ధారాధరంబులు గులుపడఁగ
దఘట్టనమున భూభారదక్షుం డగు
శేషాహి యల్లన శిరము వంపఁ
3-105.1-ఆ.
గొమరుశృంగములును ఖురములుఁ గింకిణీ
ఘంటలును జెలంగఁ డఁకతోడ
నందమైన యట్టి నందికేశ్వరు నెక్కి
పుష్పవృష్టి గురియ భూతవిభుఁడు.

టీకా:

ఘూర్ణిల్లు = మ్రోగు; చెలగు = శబ్దించు; వాలము = తోక ; ఉద్ధూత = ఊపబడినది; చొరుగు = ఎండుటాకు; కోరాడు = కొమ్ములతో నేల పొడిచి దుమ్ము పైకి జల్లు; ధారాధరము = పర్వతము; అల్లన = మెల్లగా; కొమరు = అందమైన; శృంగములు = కొమ్ములు; ఖురములు = కాలి డెక్కలు (గిట్టలు); కింకిణీ ఘంటలు = చిరు గంటలు; కడక = ప్రయత్నము, పూనిక.

భావము:

నందీశ్వరుడు ఘణేలు ఘణేలుమని రంకెలు వేస్తుంటే కులపర్వత గుహలు ప్రతిధ్వనిస్తున్నాయి. గొప్పదైన తోక ఊపితుంటే ఆ గాలికి దిక్కులు ఎండుటాకుల్లా ఎగురుతున్నాయి. కొమ్ములతో చిమ్ముతుంటే పెద్ద పెద్ద కొండలు వాటికి చిక్కుకుంటున్నాయి. అడుగుల భారానికి భూ భారాన్ని మోసే శేషుని తల వంగుతోంది. అందమైన కొమ్ములకు, కాలిగిట్టలకు అలంకరించిన చిరుగంటలు శబ్దము చేస్తున్నాయి. శంకరుడు పూని ఆ నందీశ్వరునెక్కి పూలవాన కురియుచుండగా....

3-106-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుఁ గొల్చి సకలజనములు
మొప్పగ నడువఁ గదలి ణనాథుం డా
రిబొజ్జ పెంచి నిక్కుచు
మురియుచు మూషకము నెక్కి ముందట నడిచెన్.

టీకా:

నిక్కు = వర్ధిల్లు, అతిశయించు; మూషికము = ఎలుక.

భావము:

శివుని సేవిస్తూ అందరూ కూడా నడుచారు. గణనాథుడు బొజ్జ పెంచి వఅతిశయంతో మురుస్తూ ఎలుక వాహనమెక్కి ముందు నడిచెను.

3-107-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు గతశృంగార వైభవాడంబరంబున నప్పరమేశ్వరుండు గోరాజగమనుం డై; గౌరీకళ్యాణం బవధరించు తలంపు మనంబున సందడిప సొంపు మిగిలి తుహినగిరి కుధరంబునకుఁ బ్రయాణంబు సేయ గమకించి; సమంచితాలంకారుం డై తన వూర్వభాగంబునఁ దుంబురు నారదాది వీణానాదంబుల వారును; దివ్య దుందుభి నిస్సాణ శంఖ కాహళ ఘంటికా వాద్యంబుల వారును; దండి చండీశ్వరాది మంగళపాఠక జనంబులుఁ గొలిచి నడువ; వారలం గదసి తానును తన యిరుగెలంకు లందు నాసన్నవర్తు లై తమతమ వాహనంబులతో నారాయణ భారతీశులును; వారలం గదసి దేవేంద్రాగ్ని దినేంద్రతనయ దితిసుత వరుణ వాయు కుబేర ప్రముఖు లైన దిక్పాలకులును; వారల దక్షిణోత్తర భాగంబుల సూర్య చంద్రాది నవగ్రహంబులును; మఱియును దన యుపరి భాగంబున సుబల సుమంత మాండవ్య మరీచి మందపాల మార్కుండేయ దధీచ్యూపమన్య వామదేవ దూర్వాస వసిష్ఠ గౌత మాగస్త్య కౌశిక కణ్వాది ముని జనంబులును; మూర్తిమంతంబు లైన వేదశాస్త్ర తపోధర్మ సత్యంబులును; వారల పిఱుంద వాలఖిల్యాది మహపురాణసిద్ధులును సనక సనందన సనత్కుమారాది యోగీంద్రులును; దివిజముని గరుడ కిన్నర గంధర్వ సిద్ధ విద్యాధర కన్యకా జనంబులును; భృంగిరిటి వీరభద్రాది గణంబులును గతిపయ దూరంబునఁ బ్రమథగణంబులును; దైత్య దానవాధీశ్వరులును బరివేష్టింప; నమ్మహమూకలలోనఁ జొచ్చి యెడనెడ సందడి నేయుచు సూర్యవర్ణసోమవర్ణాది మహాప్రమథ నాయకులు మహాలెక్కలై కొలువ నందంద కుసుమవర్షంబులు విడువక జడివట్ట కురియ నానాలోక రంజనామోద సుగంధ మారుత స్పర్శనంబున జనంబులు మనంబులు పల్లవింప నమ్మహేశ్వరుండు జగన్మోహన మహిమాభిరాముండై వివాహంబునకు వచ్చుచున్న సమయంబున.

టీకా:

తుహిన = మంచు; దుందుభి = భేరి అను చర్మవాద్య విశేషము; నిస్సాణ = చర్మవాద్య విశేషము; కాహళము = బాకా; ఘంటిక = చిరు గంటలు; కెలంకు = ప్రక్క; దినేంద్ర తనయుడు = యమధర్మరాజు; దితిసుతుడు = నిరృతి; ఉపరి = తరువాత; కతిపయ = కొన్ని; లెంక = సేవకుడు.

భావము:

ఇలా అలంకరిచుకొని నందీశ్వరునెక్కి గౌరీ కల్యాణము గురించి మనసులో సంతోషంగా తలుస్తూ శంకరుడు హిమపర్వతమునకు బయలుదేరెను. తన ముందుభాగమున తుంబురుడు, నారదుడు మొదలైన వీణానాదములవారును, దివ్యమైన భేరి, నిస్సాణము శంఖము, కాహళము, ఘంటికా మున్నగు మంగళవాద్యముల వారును, దండి, చండీశ్వరుడు మొదలైన మంగళ పాఠక జనములు సేవిస్తూ వచ్చుచుండిరిన్నారు. తనకు ఇరువైపులా వారివారి వాహనములతో విష్ణువు బ్రహ్మదేవుడు, దిక్పాలకులైన దేవేంద్రుడు, అగ్నిదేవుడు, యమధర్మరాజు,నిరృఋతి, వరుణదేవుడు, వాయుదేవుడు, కుబేరుడు మున్నగు ప్రముఖులు వచ్చుచుండిరి. దక్షిణ ఉత్తర భాగములందును సూర్యచంద్రాది నవగ్రహములు వచ్చుచుండిరి, తన యుపరి భాగమున సుబల, సుమంత, మాండవ్య, మరీచి, మందపాల, మార్కండేయ, దధీచి, ఉపమన్యు, వామదేవ, దుర్వాస, వశిష్ట, గౌతమ, అగస్త్య, కౌశిక, కణ్వ మొదలైన ముని జనములను, రూపుదాల్చిన వేదశాస్త్ర, తపోధర్మ, సత్యములు వచ్చుచుండిరి, వారి వెనుక వాలఖిల్యాది మహాపురుషులును, సనకస, సనంద, సనత్కుమారాది యోగీంద్రులును, దేవ మునులు, గరుడులు, కిన్నెరలు, గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు, కన్యకా జనములు, నందీశ్వరుడు, వీరభద్రాది గణములు వచ్చుచుండిరి. కొంచెము దూరములో ప్రమథ గణములు, గజేవదాన ప్రభువులు వచ్చుచుండిరి, అలా చుట్టూయున్న ఆ మహా జన సమూహములలోనికి వెళ్ళి సూర్యవర్ణ, సోమవర్ణ మొదలైన మహా ప్రమథ నాయకులు అక్కడక్కడా సందడి చేయుచున్నారు. ఎడతెరిపి లేకుండా పూలవాన కురియుచున్నది. నానా రకాల సుగంధములను మోసుకొస్తూ పిల్లగాలులు వీచుచున్నవి అందరి మనస్సులూ ఆనందించుచున్నవి. ఆ విధముగా మహా వైభవముతో పరమేశ్వరుడు వివాహమునకు వచ్చే సమయములో.....

3-108-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హరుఁడును బెండ్లికి రాఁ
వాఁడని మున్నె యెఱిఁగి గౌరవమున బం
ధుకును లేఖలు బంపఁగఁ
లఁచె గిరీంద్రుండు వేగఁ గఁ జారులచేన్.

భావము:

శివుడు పెండ్లికి వస్తాడని ముందే తెలిసి గౌరవంగా బంధువులకు వార్తాహరులచేత గిరీంద్రుడు శుభలేఖలు పంపెను.

3-109-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లహరుఁ డీశుండు న పాప నడుగంగఁ
బుత్తెంచుటయు మేము త్తెఱంగు
హిఁ బెద్ద లగు వారి న్నన బంధుల
ప్పించి తగ విచారంబు చేసి
వామదేవుఁడు తగు రుఁ డని భావించి
నెలఁతకు నీడు గా నిర్ణయించి
యుంకువఁ గొంటిమి యొనరంగ నిటమీఁదఁ
బెండ్లి లగ్నంబు సంప్రీతితోడఁ
3-109.1-తే.
బేర్మి నీ శోభనము చక్కఁ బెట్టవలయుఁ
రుణ వేంచేసి మీ రెల్లఁ ల ఫలంబు
లీలఁ దన్నొంటిఁ జేయక లేఖఁ గన్న
పుడ రండని బ్రీతితో ద్రివిభుఁడు.

టీకా:

శోభనము = శుభకార్యము, పెండ్లి; అద్రివిభుడు = గిరీంద్రుడు, హిమవంతుడు.

భావము:

శివుడు మన పార్వతిని అడుగుటకు పంపగా మేము పెద్దలను రప్పించి విచారించి వామదేవుడు తగిన వరునిగా భావించి పార్వతికి ఈడుగా నిర్ణయించి శుల్కము తీసుకున్నాము. పెండ్లి ముహూర్తము నిర్ణయంచాము. ఈ లేఖ అందగానే మీరందరూ బయలుదేరి వచ్చి ఈ శుభకార్యము చక్కగా జరిపించాలి. మీరందరూ నన్ను ఒంటరివాడిని చేయకుండా నా చుట్టూ ఉండాలి. నాపై ప్రేమతో మీరందరూ రండని గిరీంద్రుడు లేఖలు పంపాడు.

3-110-మత్త.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వెండికొండకుఁ బైఁడికొండకు వింధ్యయన్ బలుకొండకున్
చంభానుఁడు దోఁచుకొండకు సాగరాంతపుఁ గొండకున్
మంనం బన నొప్పు కొండకు మందరం బను కొండకున్
కొంరాయఁడు పంపె లేఖలు కోటి కాలరి పంక్తిచేన్.

టీకా:

కాలరి = సమాచారమును తీసుకు పోయి చెప్పెడువాడు (కాలిబంటు).

భావము:

కైలాసమునకు, మేరు పర్వతానికి, వింధ్య పర్వతానికి, సూర్యుడు యుదయించు తూర్పుకొండకు, సముద్రములోని కొండైన మైనాక పర్వతానికికు, మండన పర్వతానికి,మందర పర్వతానికి, మున్నగు పర్వతరాజులకు హిమవంతుడు కోటి చారులతో శుభలేఖలు పంపెను.