పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : హిమవంతుఁడు పార్వతిఁ జూచి పలుకుట

  •  
  •  
  •  

3-1-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీ గౌరీఘనసుస్తన
భాగాంకితగంధసారభాసుర వక్షో
భా! నిశానాథజటా
భాగా! లోకాధినాథ! పార్వతినాథా!

టీకా:

ఘన = గొప్పదైన; సుస్తన = మంచి వక్షోజములు; భాసుర = ప్రకాశించే; నిశ = రాత్రి; నిశానాథుడు = చంద్రుడు.

భావము:

పార్వతీ దేవి యొక్క గొప్ప వక్షస్థలమందున్న మంచిగంధం అంటుకొనడం వలన ప్రకాశించే వక్షస్థలం కలవాడా! చంద్రుడు జటాభాగంలో కలవాడా! త్రిజగత్పతీ! గిరిజారమణా! పరమశివా!

3-2-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పరమజ్ఞానభావుం డగు వాయుదేవుం డమ్మహామునుల కిట్లనియె; "నవ్విధంబునఁ దనకు బరమేశ్వరుండు ప్రత్యక్షం భై యాదరించిన నోషధిప్రస్థానపురంబున కరుగుదెంచి సుందరీజనంబులుం దానును వినయవినత లై నిలిచినఁ బార్వతీదేవిని గనుంగొని ధరాధరేంద్రుండు నిజసుందరీ సహితుం డై సవినయంబున గౌగిలించుకొని దీవించి యమహాదేవిచిహ్నంబు లవలోకించి యిట్లనియె.

టీకా:

ఓషధీప్రస్థానపురము = హిమవన్నగము; ధరాధరేంద్రుడు = హిమవంతుడు.

భావము:

వాయుదేవుడు ఆ మహామునులతో ఇలా చెప్పాడు. “ఆ విధంగా పార్వతీదేవికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆదరించగా ఓషధి ప్రస్థానపురమునకు తాను, చెలులు వెళ్ళి వినయ విధేయతలతో నిలిచారు. పార్వతీ దేవిని చూసి హిమవంతుడు తనభార్య మేనకతో కూడి కౌగలించుకొని, దీవించి, ఆ తల్లి ముఖకవళికలు గమనించి ఇలా అన్నారు.

3-3-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నా! నీముఖపద్మ మెంతయు మహాలంకార మై కాంతి ని
శ్చమై యున్నది నేడు నీ నయనముల్ సంపుల్లనీలోత్పలం
బుసత్కాంతికి నీడు దోఁచినవి నీ బోట్లందఱున్ సొంపు మై
లుగం బొంగినవార లేమి చెపుమా? కాంతామణీ! ధీమణీ!

టీకా:

లలన = లాలించే స్త్రీ, సతీదేవి; సంఫుల్ల = పూర్తిగా విరిసిన; నీలోత్పలం = నల్లకలువ; బోటి = చెలికత్తె.

భావము:

అమ్మా! విజ్ఞురాలా! సతీదేవీ! నీముఖ పద్మమెంతో శృంగారవంతముగా శాంతమైన కాంతివంతముగా యున్నది. నీ కళ్ళు పూర్తిగా విచ్చుకున్న నల్లకలువల కాంతికి సరిపోలుతూ వున్నవి. నీ చెలులందరూ సంతోషంతో ఉప్పొంగుతూ యున్నారు. విషయం ఏమిటో చెప్పమ్మా?.

3-4-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విదా! నీ తప మీశ్వరుం డెఱిఁగినట్లొప్పారెనే? మించెనే
దూరుండును సన్నిధై నిలచెనే? పాటించి మన్నించెనే?
తివుటం గన్నియ సన్నిధిన్నిలచెనే? తెల్లంబుగా నొండొరుల్
వులన్నిల్చితిరే? యభీష్టములు సంధానంబులై యుండునే?

టీకా:

ఉవిద = స్త్రీ; ఎఱుగు = గ్రహించు; భవము = సంసారము; తివుట = కోరిక; తవులు = తెగులు; సంధానము = కూర్చుట.

భావము:

తల్లీ! నీ తపస్సును ఈశ్వరుడు గ్రహించి ఒప్పుకున్నాడా? సంసారదూరుడైన ఆయన సంతోషించేడా? దర్శనమిచ్చాడా? ఎదురుగ వచ్చి నిలిచేడా? గమనించి ఆదరించేడా? మీరిద్దరూ మీమీ కోరికలకు తగినట్లుగా అనుసంధానం అయ్యాయా?