పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : నగజకు నెఱుకఁ దెలుపుట

  •  
  •  
  •  

2-190-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కంటఁ గరుణ వొడమఁగ
డఁతుక సఖు లెందఱేనిఁ రివేష్టింపన్
మృడుసతియును నెఱుకతతో
డిగిన కృత్యంబు చెప్ప గు గతి గలదే.

టీకా:

కడకన్ను = కంటి చివర; పొడము = పుట్టు; పడతుక = స్త్రీ; పరివేష్టించు = చుట్టూ ఉండు; మృడుడు = సుఖింప చేయువాడు, శివుడు; గతి = విధము.

భావము:

కన్నుల నిండా జాలి కలుగగా, చెలులందరూ చుట్టూ చేరగా శివసతి ఎఱుకసానితో “అడిగిన కార్యమయ్యే విధానాన్ని చెబుతావా”?...

2-191-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికి హిరణ్య మణి మరకత వజ్ర వైడూర్య ఖచితంబు నగు విలసి తాసనంబునం గూర్చుండి దేవేంద్ర కమలసంభవ నారాయణ ప్రముఖు లైన దేవతలు నెఱుంగరు భవదీయ చిత్తంబున నేది యేనియుం దలంపు చెప్పెద నదియునుం గాక విను మని యిట్లనియె.

టీకా:

కమలసంభవుడు = బ్రహ్మ; భవదీయ = మీ యొక్క.

భావము:

అని పార్వతీదేవి పలుకగాస మణి, మరకత, వజ్ర, వైఢూర్యములు తాపించిన బంగారు సింహాసనముపై ఆసీనురాలై “దేవేంద్రుడు, బ్రహ్మదేవుడు, నారాయణుడు మొదలైన గొప్పగొప్ప దేవతలుకూడా తెలుసుకోలేరు కానీ. మీ మనసులో ఏమాలోచన యున్నదో. నేను చెప్తాను. అదీకాక విన" మంటూ ఇలా అన్నాడు ఎఱుక రూపంలో యున్న శివుడు.

2-192-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చింతించి యా బ్రహ్మ సృష్టిఁ బుట్టించుచో;
నెలనాఁగ! ననుఁ గాంచి యెఱుక లడిగె
గములు సాధింప గభేది రావించి;
యెలనాఁగ! ననుఁ గాంచి యెఱుక లడిగె
నుజుల నిర్జింప నుజారి పోవుచో;
నెలనాఁగ! ననుఁ గాంచి యెఱుక లడిగె
ఱి హలాహలవహ్ని దెలి వేల్పుల మూక;
యెలనాఁగ! ననుఁ గూర్చి యెఱుక లడిగె
2-192.1-ఆ.
రమమునులు యతులు రమయోగీంద్రులు
భల మున్ను నన్ను సంతసమున
నెఱుక లడిగె కాదె యెల్ల శుభంబులు
లిగి యుండు టెల్ల మలనేత్ర!”

టీకా:

ఎలనాగ = యువతి; నగభేది = ఇంద్రుడు; దనుజులు = రాక్షసులు; దనుజారి = విష్ణుమూర్తి; తెరలు = కలతచెందు; మున్ను= ముందు.

భావము:

“ఓ యువతీ! ఆ బ్రహ్మదేవుడు సృష్టిని సృజియించాలని యనుకుని నన్ను పిలిచి ఎఱుకలడిగాడు. ఓ సుందరీ! కొండలను సాధించడానికి ఇంద్రుడు నన్ను రప్పించి ఎఱుకలడిగాడు. ఓ ఇంతీ! రాక్షసులను నాశనంచేయడానికి విష్ణుమూర్తి వెళ్తూ నన్ను ఎఱుకలడిగాడు. ఓ పడతీ! ఇంకా హాలాహలాగ్నికి కలతచెందిన దేవతలందరూ చేరి నన్ను ఎఱుకలడిగారు. కమలనేత్రా! మహా మునులు, గొప్ప యతులు, పరమ యోగీంద్రులు యాగసభలలో ముందు నన్ను సంతోషముగా ఎఱుకలనడిగే ఆ యాగాలు చేయడం వలననే కదా అంతా అన్ని శుభాలనూ పొందడం జరిగింది.”

2-193-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని మఱియు సముచితాలాపంబులు పలుకఁ పరమయోగీంద్రు ప్రోడం గనుంగొని "యొక తలంపు దలంచెదఁ జెప్పు"మని కనకమయ పాత్రంబున ముక్తాఫలంబు లమరించి వానింజూచి భావంబున నిట్లని తలంచె.

టీకా:

సముచిత = తగిన; ప్రోడ = ప్రౌఢ; కనకము = బంగారము; ముక్తాఫలములు= ముత్యములు.

భావము:

ఆ ఎఱుక అలా చెప్పి ఇంకా కొన్ని తగిన పలుకులు పలికింది, అంతట, పరమయోగీంద్రుడైన ఆ(ఎఱుకలసాని) యువతిని చూసి పార్వతీదేవి ”ఒక విషయం తలుచుకుంటాను. దాని గురించి చెప్పు” అంటూ బంగారు పాత్రలో ముత్యములు పోసి, వానిని చూసి మనసులో ఇలా తలచింది.

2-194-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గరాజుపురమున నా కెన్ని దినములు;
నిశ్చయంబుగ నేను నిలువవలయు
టమీఁదఁ దడసిన డవులలోపల;
శివునికై తప మెంత సేయవలయు
పము గావించినఁ దాపసాధీశ్వరుం;
మరంగ నెంతకామున మెచ్చు
మెచ్చిన పిమ్మట మీనధ్వజారాతి;
కేలిచ్చి నన్ను నే క్రియ వరించుఁ
2-194.1-ఆ.
ప్పకుండఁ జెప్పు ర్మదేవత! యని
బల చెలులతోడ నుమతించి
లఁపు తథ్యమేని లకొని చెప్పుమా”
నుచు నిజము గోరి ద్రిపుత్రి.

2-195-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు నియమింపఁ దలచిన.

టీకా:

నియమించు = ఆజ్ఞాపించు.

భావము:

ఇలా ఆనతిద్దామని అనుకుంటుండగానే.

2-196-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“నాకు వాకువచ్చె లినాక్షి! రమ్మిటఁ
రముదెమ్ము నాదు రము వట్టి
నుచుఁ బ్రేమతోడ డల ప్రాణిగ్రహ
మ్ముఁ జేసెఁ గపటనాటకుండు.

టీకా:

వాకు = పలుకు; నలినాక్షి = సుందరి; కరము = చేయి; అడలన్ = బెదిరేలా, కంగారుగా; పాణిగ్రహణము= పెండ్లి.

భావము:

“నాకు పలుకు అందింది. తామర కన్నుల సుందరీ! ఇలా రా! చెయ్యి ఇలాతే. నా చేతిలో పెట్టు.” అంటూ ప్రేమతో కంగారుగా పాణిగ్రహణం చేసాడు ఆ మాయా నాటకుడు పరమశివుడు.

2-197-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మాటు గరము లంటుచు
నొమాటు లతాంగి చిత్త మూరించుచు వే
ఱొమాటు కుచము లంటుచు
ప్రటించుచు నెఱుక చెప్పెఁ బార్వతిసతికిన్.

టీకా:

ఊరించు = ఆశ కలుగునట్లు చేయు; ప్రకటించు = ప్రకాశముగా చెప్పు .

భావము:

ఆ మాయా నాటకుడు శివుడు, ఒకమాటు ఆమె చేతులను తాకుచూ, ఒకమాటు ఆమె మనసు ఊరిస్తూ, వేరొకమాటు వక్షములను తాకుతూ, పార్వతీ సతికి ప్రకాశముగా ఇలా ఎఱుక చెప్పెను.

2-198-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుఁ గూర్చి తలఁచితి వంబుజలోచన! ;
లఁపు లన్యులమీఁది లఁపుగాదు
శైలాధిపతి యింట తి వసించెద నన్నఁ;
లఁపు వేడ్కలమీఁది లఁపుగాదు
ఘోరాటవులలోనఁ గ్రుమ్మరియెద నన్న;
లపు వేఱొకచోటిఁ లఁపుగాదు
రమేశు నర్చించి భార్య నయ్యెద నన్న;
లఁపు లెవ్వరిమీఁదు లఁపుగాదు
2-198.1-ఆ.
కాదు నిశ్చయంబు గంగాధరునిమీఁది
క్తి గలదు నీకు రిత మగుచు
నాతి! నీ తలంపు నా మాటయును నేక
గుట యెల్లఁ దలఁపు మంబుజాక్షి!

టీకా:

తలపు = ఆలోచన; అన్యులు = ఇతరులు; భరితము = పూరితము.

భావము:

పద్మనేత్రా! నీ ఆలోచన ఇతరులమీద కాదు, హరుని తలచావు. సతీ! పర్వతరాజు ఇంట నివసించడం వేడుక కోసం కాదు. ఘోరారణ్యములలో తిరుగుతాననడం ఆ తలపు వేరే ఎక్కడా నిలపడానికి కాదు. నీ తలపులు ఎవ్వరి మీదా కాదు, పరమేశుని కొలిచి భార్యనవ్వాలనే. నిశ్చయమిది. నీకు పూర్తిగా ఆ గంగాధరునిపై భక్తి కలదు. నీ తలపు, నా మాటా ఒక్కటే కదా అంబుజాక్షీ.

2-199-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదియునం గాక.

భావము:

అదీ కాక.

2-200-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నా కేమి మెచ్చు వెట్టెదు
నీకున్ సిద్ధించు మేలు నిర్ణయమై నా
వాకునకఁ దోఁచుచున్నది
వీఁను నెఱిఁగింతు నీకు విమలేందుముఖీ!

టీకా:

వాకు = పలుకు; వీక = గర్వము, ఉత్సాహము; విమల = నిర్మలమైన; ఇందుముఖి = చంద్రుని వంటి ముఖము కలది.

భావము:

ఓ సుందరీ! గర్వంగా నీకు తెలియచేస్తాను. మెచ్చుకొని నాకేమిస్తావు? నీకు మేలు జరుగుతుందని నిశ్చయముగా నా పలుకున తోచుచున్నది.

2-201-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన విని పార్వతీదేవి యి ట్లనియె.

భావము:

అలా ఆ మాయా ఎఱుక అనగా విని పార్వతీ దేవి ఇలా అంది.

2-202-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణికేయూరము లిచ్చెద
ణితాటంకంబు లిత్తు మంజులవాణీ!
ణులుం గనకము లిచ్చెద
ణికోటీరములు నీకు ఱియున్నిత్తున్.

టీకా:

కేయూరములు = భుజకీర్తులు; తాటంకములు = చెవి కమ్మలు; కోటీరము = కిరీటము.

భావము:

ఒప్పిదంగా మాటలాడుదానా! ఎఱుకా! మణులు తాపించిన భుజకీర్తులిస్తాను. మణులు తాపించిన చెవి కమ్మలిస్తాను. మణులు, బంగారమును ఇస్తాను. ఇంకా నీకు మణి కిరీటము లిస్తాను.

2-203-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనవుడు నక్కపట వెలఁది యిట్లనియె.

భావము:

పార్వతీదేవి అలా అనగా విని ఆ మాయా ఎఱుకలసాని ఇలా అన్నది.

2-204-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణికేయూరము లొల్లను
ణితాటంకంబు లొల్ల మంజులవాణీ!
ణులుం గనకము లొల్లను
ణికోటీరంబు లొల్ల న్నన లొల్లన్.

టీకా:

ఒల్లను = ఇష్టపడను; మంజులవాణి = చక్కని పలుకుల సుందరి; మన్నన = గౌరవము.

భావము:

“తగిన మాటన్నావు కానీ నాకు మణికేయూరములు వద్దు. మణి తాటంకములొద్దు. మణులూ, కనకాలూ వద్దు. మణికిరీటము వద్దు. గౌరవాలు వొద్దు.

2-205-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుఁ గూడి తిరుగ నొసఁగుము
ములు నా కేమి సేయు నములు వేలున్
నినుఁ గూడి యుంటఁ బోలునె
వుఁడు నగుగాకఁ జెప్పు ని సతి యనియెన్.

టీకా:

ఒసగు = కలిగించు.

భావము:

నాతో కలసి తిరగాలి. ధనములు నాకెందుకు? ఎన్ని వేల ధనములైనా నీతో కలసి యుండడంతో సమానమా చెప్పు?” అనగా సతీదేవి “సరేలే కానీ చెప్పు” అన్నది.

2-206-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనవుడు నా ప్రోడ యిట్లనియె.

టీకా:

ప్రోడ = ప్రౌఢ, నేర్పరి.

భావము:

అప్పుడు ఆ యెఱుక ఇట్లనెను.

2-207-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కువలయలోచన! కొన్నిదినంబులు;
కొండలరాజింట నుండఁ గలవు
ఉండి వనంబున నువిదతో నేఁగియు;
శివునికై తప మర్థిఁ జేయఁ గలవు
ప మర్థి జేసినఁ రళాక్షి! నినుఁ గూర్చి;
మీనాంకవైరియు మెచ్చఁ గలఁడు
మెచ్చి సంభావించి మీ తండ్రి యింటను;
వేడుక నినుఁ బెండ్లియా గలఁడు
2-207.1-అ.
మరఁ బెండ్లియాడి ర్థాంగలక్ష్మి వై
కల భువన రాజ్య సంపదలను
లిగి మోము లాఱు ల సుతుఁ గాంచి మో
మున నుండగలవు వళనేత్ర!”

టీకా:

కువలయము = కలువ; ఉవిద = స్త్రీ; ఏగు = వెళ్ళు; అర్థి = కోరిక; తరళాక్షి = చలించే కన్నులు కలది; మీనాంకవైరి = శివుడు; సంభావించు = గౌరవించు; అమరన్ = అమరునట్లు; కాంచు = ప్రసవించు; ధవళాక్షి = తెల్లని కన్నులు కలది.

భావము:

“కలువకన్నులదానా! కొన్నాళ్ళు పర్వతరాజింట్లో ఉంటావు. అలా యుండి చెలికత్తెతో అడవులకు వెళ్ళి శివుని కోరి తపము చేస్తావు. చలించే కన్నులు కలదానా! కోరి తపము చేసిన నిన్ను శివుడు మెచ్చుకుంటాడు. మెచ్చుకుని గౌరవంగా మీ తండ్రి ఇంట వేడుకగా వివాహమాడతాడు. ఆ దేవుని పెండ్లియాడి అర్థాంగ లక్ష్మివై సకల భువన రాజ్య సంపదలనూ పొందుతావు. పొంది ఆరు ముఖములు గల కుమారుని కని సంతోషంగా ఉంటావు.”

2-208-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని మఱియును.

భావము:

అని ఇంకనూ.

2-209-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“నిన్నుఁ బొందఁదలఁచి నెలఁత! యువ్వీళ్ళూరు
చున్నవాఁడు శంభుఁడుగ్రమూర్తి
శంకరుండు భవుఁడు శాశ్వతుం డఖిలాండ
క్రవర్తియైన చంద్రధరుఁడు.

టీకా:

నెలత = ,వనిత.

భావము:

ఓ వనితా! శంభుడు, ఉగ్రమూర్తి, శంకరుడు, భవుడు, శాశ్వతుడు, అఖిలాండ చక్రవర్తియైన చంద్రధరుడు నిన్ను పొందాలని ఉవ్విళ్ళూరుచున్నాడు.

2-210-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇందేల యున్నదానవు వనవాస ప్రయాణంబు చేసి పరమేశ్వరు నేలుకొమ్ము నీకుం గానరాఁడు పరమేశ్వరుండు వీఁడే నినుఁ జూచి పోవుచున్నాఁడు నిశ్చయం" బని చెప్పి వీడ్కొని తన పూర్వ ప్రకారంబుఁ దాల్చి కైలాసంబునకుం జనియె నంత న చ్చెలియు నొక్కనాఁడు తన మనంబున ఖండేందుభూషణుం దలఁచి కామమోహావేశంబున నిట్లని తలపోయం దొడంగె.

టీకా:

ఖండేందు భూషణుడు = చంద్రధరుడు, శివుడు.

భావము:

ఇంకా ఇక్కడెందుకున్నావు? అడవులకు వెళ్ళి పరమేశ్వరునేలుకో. ప్రస్తుతం, నీకు కనబడడు కానీ, యదార్థంగా ఆ పరమేశ్వరుడే నిన్ను చూసి పోతున్నాడు.” అని చెప్పి తన నిజరూపంతో కైలాసానికి వెళ్ళిపోయాడు. ఆ పార్వతి ఒకనాడు తన మనసులో శివుని తలచి కామమోహావేశముతో ఇలా అనుకోసాగింది.

2-211-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“లోత నాకు వల్లభుఁడు లోఁబడి ప్పి సమాధినిష్ఠమై
సోలెడి కాయముం గరఁగఁజూచుచు నుండు సుఖంబుగాన శ్రీ
శైనివాసునొద్దఁ బరిచర్యలు సేయఁగలేదు చెల్లరే!
మేల్కొనఁ గూడికూడి యిటు మిన్నక పోయె నిఁకేమిచేయుదున్.

టీకా:

లోలత్వము = చాంచల్యము; సోలు = తూలు; శ్రీశైలవాసుడు = శివుడు; చెల్లరే = అయిపోయింది; మేలు = శుభము; మిన్నక = అప్రయత్నంగా.

భావము:

వల్లభుడు చాంచల్యము లేక సమాధి నిష్ఠలోనే శరీరాన్ని కరిగిస్తూ సుఖంగా యుంటాడు. అయ్యో అయిపోయింది. శివుని వద్ద సేవలు చెయ్యనేలేదు. ఇంకేమి చేస్తాను. శుభం కలగాలంటే ఇక ఈ దారిలోనే వెళ్తాను.

2-212-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వినరమ్మ నా మాట విశ్వేశ్వరునిఁ బాసి
నిలువంగ నేరనో నెలఁతలార!
నాగేంద్రధరుమీఁద నా కోరికలు పర్వి
పాయంగ నేరనో భామలార!
లరాజు వెసఁ దోఁచి లరుల బాణంబు
లేసి నొప్పించెనో యింతులార!
గముల రాజుతో నా ప్రకారం బెల్లఁ
దెలియంగఁ జెప్పరే తెరవలార!
2-212.1-ఆ.
మణులార నిలువరా దింకఁ దాపంబు
రసిజాక్షులార! సైఁపరాదు
క్క దినము గడచు టొక్క వత్సరము దాఁ
డచు టయ్యె నాకుఁ గాంతలార!

టీకా:

నెలత, భామ, ఇంతి, తెఱవ, రమణి, సరసిజాక్షి, కాంత = స్త్రీ; పర్వి= వ్యాపించు; పాయు = తొలగు; సైపు = ఓర్పు

భావము:

చెలికత్తెలారా నా మాట వినండి. శివుని విడిచి నేనుండలేను. నాగేంద్రధరుని మీద నా కోరికలు పరచుకున్నాయి ఇక తొలగలేవు. మన్మథుడు వేసిన అందమైన బాణాలు నన్ను బాధిస్తున్నాయి. పర్వత రాజుకి నా వివరాలు తెలియపరచండి. తాపము సహించలేకున్నాను. ఓర్చుకోలేకున్నాను. ఒక రోజు గడవడమంటే ఒక సంవత్సరం గడచినట్లుంది.

2-213-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బాశశాంకభూషణునిఁ బాసి చరించుట దుస్తరంబు నీ
లాకలార! చంద్రముఖులార! తపోవనభూమిలోపలన్
జా తపంబుచేసి హరు శంకరు సన్నిధిఁ గాంతు నింక మీ
కే విచారముల్ హిమనగేంద్రునితో వినుపింతు నింతయున్.

టీకా:

దుస్తరము = కష్టము; నీలాలకలు = నల్లని వెంట్రుకలు; చంద్రముఖి = చంద్రుని వంటి ముఖము కలది.

భావము:

చెలులారా! నీలాలకలారా! చంద్రముఖులారా! బాలశశాంకభూషణుని విడిచి యుండడం తట్టుకోలేను. తపోవన భూమిలో గట్టి తపస్సు చేసి హరుడైన శంకరుని చేరతాను. ఇంక మీకేల విచారము? ఈ విషయమంతా హిమవంతునకు వినిపిస్తాను.

2-214-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని నిశ్చయంబు చేసి.

భావము:

అని నిర్ణయించుకొని.

2-215-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చెలులుం దానును గూడివచ్చి కడఁకన్ శీతాచలాధీశ్వరున్
నారత్నము గాంచి మ్రొక్క వినయాలాపంబులన్ శీతలా
లుఁడున్ మన్నన చేసెఁ జేసెడితఱిన్ చంద్రాస్య హస్తంబుజం
బులు ఫాలంబునఁజేర్చిపల్కె వినయంబున్ భక్తియున్ రంజిలన్.

టీకా:

కడక = యత్నము; మన్నన = గౌరవము; తఱి = సమయము; చంద్రాస్య = చంద్రుని వంటి ముఖము కలది; హస్తము = చేయి; అంబుజము = తామరపూవు; ఫాలము = నుదురు; రంజిల్లు = అనురాగము పొందు.

భావము:

చెలులు, తానూ కలసి పూనికతో వచ్చి శీతాచలాధీశ్వరుని, మేనకాదేవిని చూసి, నమస్కరించారు. వినయంగా మాట్లాడుతున్న గౌరిని హిమవంతుడు మన్నించే సమయంలో ఆ చంద్రాస్య హస్త కమలములను జోడించి నుదుటికి తాకించి వినయముతో అనురాగముతో ఇలా అంటోంది....

2-216-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సార పుష్ప చందన
కాంబర భూష ణాది న వైభవముల్
యింట నేమి గొఱఁతయుఁ
నుఁగొనఁగా రాదు మిగులఁ లవు గిరీంద్రా!

టీకా:

ఘనసారము = కర్పూరము; కనకాంబరము = పట్టు వస్త్రము; భూషణములు = ఆభరణము, చతుర్విధ అలంకారాలు (వస్త్రము, భూషణము, మాల్యము, అనులేపనము),

భావము:

“కర్పూరము, పూలు, గంధము, పట్టు వస్త్రాలు, అలంకారాలు మొదలైన గొప్ప వైభవాలకు మన ఇంట లోపము లేదు. కావలసినన్ని ఉన్నాయి గిరీంద్రా!

2-217-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లయినను.

భావము:

అయినప్పటికీ.

2-218-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శిదేవుం దలపోయఁజొచ్చు నభవున్ జింతించు దేవేశ్వరున్
ళాంగుం ఫణిరాజకంకణధరున్ ర్కించుఁ గాంక్షించు వై
ముం జేయదు నా మనంబు దప మొప్పంజేసి నీ పంపునన్
భునాధీశ్వరు గాంచి వత్తు ననుచున్ భూమీధరేంద్రోత్తమా!

టీకా:

తలపోయు = ఊహించు; చింతించు = ఆలోచించు; ధవళాంగుడు = తెల్లని దేహము వాడు, శివుడు; తర్కించు = వివరించు; కాంక్షించు = కోరు; వైభవము = పెనుపు; భూమీధరేంద్రుడు = పర్వతరాజు, హిమవంతుడు.

భావము:

శివదేవుని గురించే ఊహిస్తున్నాను. భవుని గురించే ఆలోచిస్తున్నాను. దేవేశ్వరుని, ధవళాంగుని, ఫణిరాజ కంకణధరుని గురించే తర్కిస్తున్నాను. శివుని గూర్చి కోరిక నా మనస్సులో పెరిగిపోతోంది. భూమీధరేంద్రోత్తమా! మీరు పంపిస్తే తపస్సు చేసి,భువనాధీశ్వరుని చూసి వస్తాను” ని హిమవంతా!.

2-219-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మిచెప్పనేర్తు నేనేమి సేయుదు
నా వశంబుగాక నా మనంబు
లోకనాథుఁ దవిలి లోఁబడి పాయదు
భ్రాంతిఁ దపముసేయఁ నుపు మయ్య!

టీకా:

తవిలించు = తగుల్చు; పాయు = విడుచు; భ్రాంతి = భ్రమ.

భావము:

ఏమి చెప్పను? ఏమి చేయను? నా మనస్సు నా ఆధీనములో లేదు. ఆ లేకనాథుని తగులుకొని భ్రమ విడువదు. తపస్సుకు నన్ను పంపండి.

2-220-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

య్యాసిద్ధము దాఁటరాదు మదిలో నాలింప మీయానతిన్
నెయ్యం బొప్పఁగ మీరు నన్ బనుపఁగా నే నిష్టమైయుంట యొ
ప్పయ్యెన్ వే ననుఁ బంపు మన్న విని యత్యానందచిత్తంబుతో
ధీయ్యుక్తిం గిరిరాజు కూర్మితనయన్ దీవించి కీర్తించుచున్.

టీకా:

సిద్ధము = వాస్తవము; నెయ్యము = సంతోషము; వే = వేగము; ధీయుక్తిన్ = మంచి పద్ధతిలో; కూర్మి = ప్రేమ; తనయ = కుమార్తె; కీర్తించు = పొగడు.

భావము:

తండ్రీ! నిజానికి మీ ఆజ్ఞను జవదాటలేను. సంతోషంగా మీరు నన్ను పంపిస్తే నా ఇష్టాన్ని పాటిస్తాను. సంతోషంగా నన్ను శీఘ్రమే పంపండి”. అన్న మాటలు విని మిక్కిలి ఆనందించి గిరిరాజు ప్రేమగా తన కుమార్తెను పొగిడి దీవిస్తూ....

2-221-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తినీ వాక్యము వేదవాక్యముసుమీ! చంద్రాస్య! యాతండెపో
తి యంచున్ దననాథు నేడు గడయుంగాఁజూచి సేవింపఁగా
ధృతిమై నుత్తమ కన్య యండ్రు మృగనేత్రిం గన్నయా తండ్రియున్
తిలో సజ్జనమాన్యుఁ డంచు జగముల్ న్నించుఁ గాంతామణీ!

టీకా:

చంద్రాస్య = చంద్రుని వంటి ముఖము కలామె; ధృతి = ధైర్యము; మృగనేత్రి = లేడికన్నులవంటి నేత్రములు కలామె; సజ్జనమాన్యుడు = మంచివారిచే పూజింపబడువాడు; మన్నించు = గౌరవించు.

భావము:

“ఓ గౌరీసతీ! నీ మాటలు వేదవాక్యములేనమ్మా. చంద్రాస్యా! అతడే గతి యంటూ తన నాథుని సమస్తముగా చూసి సేవిస్తే ఉత్తమకన్య అంటారు. కాంతామణీ! ఆమెను కన్న తండ్రిని కూడా గొప్ప గౌరవనీయుడు అంటూ లోకాలన్నీ గౌరవిస్తాయి.

2-222-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్రిశారాధితవై జగజ్జననివై దేవేంద్రసంపూజ్యవై
నారాతికిఁ బ్రాణవల్లభవునై మాయాప్రపంచాత్మవై
ది మోదించిన నీవు కూఁతురవునై న్నించితీ పెంపు చా
దె పుణ్యాత్ముఁడనైతినీ కరుణఁ గళ్యాణీ! కృపాంభోనిధీ!

టీకా:

త్రిదశలు = దేవతలు; అంబోనిధి = సముద్రము.

భావము:

దేవతలచే ఆరాధింపబడే దానివై, లోకాలకు తల్లివై, ఇంద్రాదులకు పూజ్యురాలివై, మన్మథవైరైన శివునికి ప్రాణమైన భార్యవై, మాయాప్రపంచస్వరూపానివై, ఆనందించిన మనసుతో నీవుంటే అటువంటి కూతురుకు నీ దయవలన తండ్రినై పుణ్యాత్ముడనయ్యాను. కళ్యాణీ! దయాసాగరీ! గౌరీసతి ఈ పెంపు చాలదా?.

2-223-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నితా! నా విన్నప మిది
వినుము మదిన్నీకుఁ బోవ వేడుక పుట్టెన్
రఁగ నీ వేడుక మై
మున వర్తించు మనుచు గపతి పల్కెన్.

టీకా:

వనిత = స్త్రీ; విన్నపము = మనవి; తనరు = అతిశయించు; నయము = మేలు.

భావము:

ఓ వనితా! గౌరీ! నా మనవి వినుము. మదిలో నీకు వెళ్ళాలని కోరిక పుట్టింది. చక్కగా నీ ఇష్టప్రకారం చక్కగా ప్రవర్తించు” అంటూ పర్వతరాజు చెప్పెను.

2-224-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు పలుకు వల్లభుఁ జూచి య గ్గిరీంద్రవల్లభ యగు మేనకాదేవి గౌరీదేవి కిట్లనియె.
2-225-క.
“ఏమియుఁ గొఱత దపోవన
భూములలోఁ దపము సేయఁ బోయెద ననుచు
న్వేరు భాషించెదవో
భామానిన్నడవి కెట్లు పంపుదుఁ జెపుమా?

టీకా:

వల్లభుడు = భర్త; వల్లభ = భార్య.
వేమరు = మాటిమాటికి.

భావము:

ఇలా అంటున్న భర్త మాటలను విన్న పర్వతరాజు భార్య మేనకాదేవి గౌరితో ఇలా అన్నది.
“ఏమి తక్కువైనదని తపోవనములలో తపము చేయడానికి వెళ్తానని మాటిమాటికి అంటున్నావు? భామా! నిన్ను అడవికి ఎలా పంపిస్తాను చెప్పు?.

2-226-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వాలాయించి వనంబుల
నే మ్మ! తపంబు సేయ నిభకుంభకుచా!
హాలాహలభక్షుఁడు మన
లీలావన భూము లందు లేఁడే చెపుమా.

టీకా:

వాలాయించి = ఉద్దేశపూర్వకంగా; నిభము = సమానము; కుంభము = కడవ; లీల = వినోదము.

భావము:

ఓ సతీదేవీ! తపము చేయుటకు కోరిఉద్దేశపూర్వకంగా అడవుల కెందుకమ్మా వెళ్ళడం? శివుడు మన ఉద్యాన వనములలో లేడా చెప్పు!.

2-227-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నా! వనభూములలో
హరు వెదుకంగ నేల మంజులవాణీ!
చిన చోటనె శంభుఁడు
లుగుట సందేఙ మమ్మ కంజాతమఖీ!

టీకా:

మలహరుడు = శివుడు; కంజాతము = పద్మము.

భావము:

పార్వతీదేవీ! వన భూములలో శివుని వెతకడమెందుకు? వలచిన చోటే శివుడుండడం విషయంలో సందేహమా తల్లీ?.

2-228-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీ ముద్దులు నీ మాటలు
నీ ధురాలాపములును నీ మురిపంబుల్
రామా! చూచిన పిమ్మట
నా ది యెట్లుండ నేర్చు లినదళాక్షీ!

టీకా:

ఆలాపములు = మాటలు; రామా = స్త్రీ; నలినదళాక్షి = తామరరేకుల వంటి కన్నులు కలామె.

భావము:

నీ ముద్దులు, నీ మాటలు, నీ తియ్యనైన మాటలు, నీ మురిపెములు చూసాక (నీవు అడవులలో ఉండడానికి) నా మనసెలా ఒప్పుతుంది? తల్లీ!

2-229-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గంగావతంసునిఁ రము మజ్జన మార్ప
గంగాజలంబులు లవు మనకు
ననాగకంకణుఁ రమలంకారింప
న కంకణంబులు లవు మనకు
గంధేభదనుజారిఁ ఱకంఠు నలఁదింప
గంధంబు లెన్నియుఁ లవు మనకు
లరుసాయకవైరి లరించి పూజింప
లరు లెన్నెన్నియొ లవు మనకు
2-229.1-ఆ.
ఱియు నేమి యైన లహరుఁ బూజింపఁ
మలనేత్ర! మనకు లిగి యుండఁ
గాననముల కేఁగఁ లకంఠి! యే లమ్మ!
నము లేడ? ముగ్ధనిత లేడ?”

టీకా:

వతంసము = సిగబంతి; మజ్జనమార్చు = స్నానము చేయించు; గందేభము = మదజల గంధము గల ఏనుగు; అలరు = పుష్పము; సాయకము = బాణము; కాననము = అడవి.

భావము:

గంగను సిగబంతిగా కలవానిని అభిషేకించుటకు గంగాజలము మనకున్నది. గొప్పవైన నాగులు కంకణములుగా కలవానిని అలంకరించడానికి గొప్ప కంకణములు మనకున్నవి. గజాసురవైరి యొక్క గరళకంఠమునకు అలదుటకు గంధములెన్నో మనవద్ద ఉన్నవి. పుష్పబాణవైరిని సంతోషించేలా పూజించుటకు మన వద్ద పూలెన్నో ఉన్నవి. కమలనేత్రా! ఇన్ని యున్నా శివుని పూజించుటకు వనముల కెందుకమ్మా వెళ్ళడం? కలకంఠీ! అడవులెక్కడ? అమాయకపు ముగ్ధ ఆడపిల్లెక్కడ?.”

2-230-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనవుఁడు కుమారీతిలకంబు తల్లి కిట్లనియె.

టీకా:

కుమారీతిలకము = ఉత్తమమైన కన్య.

భావము:

అనగా విని ఆ కన్య తల్లితో ఇలా అన్నది.

2-231-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ల్లీశంభుఁడులేనిచోటు గలదే ర్కింప సందేహమే
ముల్లోకంబులు శంభుఁడంచుఁ జదువుల్ మ్రోయంగ నెవ్వారికిన్
చెల్లింపం దగ దమ్మ యిండ్లఁద పముల్ చిత్తంబు రెండై ఫలం
బెల్లం జేరకపోవుఁ గాక జననీ! యెన్నెన్ని మార్గంబులన్.

టీకా:

తర్కించుట = తరచిచూచుట; చదువులు = వేదములు; చెల్లించు = పూర్తిచేయు; చిత్తము = మనసు.

భావము:

అమ్మా! తరచి చూస్తే శంభుడు లేని చోటు ఉంటుందా? అనుమానమే. ముల్లోకాల్లోనూ శంభుడున్నాడని వేదాలు ఘోషిస్తున్నాయి. ఎవరూ యిళ్ళల్లో తపస్సు పూర్తిచేయలేరు. ఎన్ని విధాలుగా చేసినా ఇంట్లో చేస్తే మనసు ఏకాగ్రత విరిగి ఫలం దక్కకుండాపోతుంది కదా. తల్లీ!

2-232-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తా రిగిన చిత్తములోఁ
దారుగుఁ జుమీ లతాంగి ద్దయుఁ బ్రీతిన్
తా రుగని చిత్తములో
తారుగఁడు పాయుఁ గాని తామరసాక్షీ!

టీకా:

మరుగు = ఆసక్తమగు; చిత్తము = మనసు; తద్దయు = మిక్కిలి; ప్రీతి = సంతోషము; పాయు = తొలగు; తామరసము = తామర.

భావము:

లతాంగీ! మేనకాదేవీ! శివుడు తనయందు ఆసక్తిగల మనస్సులోకి తాను మిక్కిలి సంతోషంగా వస్తాడు. తనయందు ఆసక్తి లేని మనసులోంచి తొలగిపోతాడు కానీ రాడు.

2-233-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ను వలచినఁ దను వలచును
ను వలువక పాసి యున్నఁ ను వలువఁ డిలన్
దు పటాటోపంబులు
మాయలు పనికి రావు థ్యము తల్లీ!

టీకా:

వలచు = కోరు; పాయు = తొలగు; పటాటోపము = ఆడంబరము; తన = ఆత్మార్థకము; (మన) తథ్యము = సత్యము.

భావము:

మనం అతనిని కోరితే, శివుడు తానూ కోరతాడు. మనం ఇష్టపడక తొలగియుంటే తనుకూడా మనను ఇష్టపడడు. మన దర్పము, మాయలు అతని వద్ద ఏమీ పనికిరావు. నిజమమ్మా!

2-234-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని కందమూలఫలములు
తిని వనటలఁ జాల డస్సి ధీరాత్మకు లై
ములఁ దపములు సలిపెడు
వాసులు వెఱ్ఱు లమ్మ వారిజనేత్రా!

టీకా:

వనట = కష్టము; డయ్యు = అలయు; ధీరాత్మకులు = మిక్కిలి జ్ఞానము కలవారు; వారిజము = కమలము.

భావము:

అమ్మా! పద్మముఖీ! అడవులకు వెళ్ళి కందమూలములను తింటూ కష్టములు పడి అలసి జ్ఞానస్వరూపురై వనములలో తపస్సులు చేసే వనవాసులు వెఱ్ఱివారా?

2-235-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

య నీ లోకంబుల
మీ రెఱుఁగని పనులు గలవె మీకును దగవుల్
వాక చెప్పెడు దాననె
యేరూపం బైన నుద్ధరింపుఁడు నన్నున్.

టీకా:

ఆరయ = విచారించు; తగవు = తీర్పు; వారక = ఎల్లప్పుడు; ఉద్ధరించు = రక్షించు.

భావము:

విచారిస్తే ఈ లోకంలో మీకు తెలియని పనులున్నాయా? మీకు నేను చెప్పగలదాననా? ఎలాగైనా నన్ను రక్షించండి.”

2-236-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనుచున్న గౌరీదేవి పలుకులు విని గిరీంద్రశేఖరుండు మేనకాదేవియుం దానును సంతసిల్లి దేవి యింక మాఱుమాటలు పలుక వెఱతుము భవదీయ మనోరథంబు లెల్ల నమోఘంబులై ఫలించుఁగాక యని కీర్తించి దీవించి వనవాస ప్రయాణంబునకుఁ దల్లిదండ్రు లనుమతించిన.

టీకా:

భవదీయ = మీది; మనోరథము = మనస్సలోని కోరిక; అమోఘము = సఫలము; కీర్తించి = అభినందించి.

భావము:

అంటున్న గౌరీదేవి మాటలు విని హిమవంతుడు, మేనకాదేవి కూడా చాలా సంతోషించి “ఇక మారు మాట్లాడుటకు ఏమీలేదు. నీ కోరికలు సమస్తమూ సఫలమై ఫలించుగాక” అని అభినందించి దీవించి వనవాస ప్రయాణమునకు తల్లిదండ్రులు అనుమతించారు.