పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : రతీదేవి శివునిపైఁ బోవల దని మన్మథుని మందలించుట

  •  
  •  
  •  

2-71-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనవుడు నక్కాంతాతిలకంబు విస్మయాకుల చిత్తయై మూర్ఛిల్లి తెలువొంది నగవును గోపంబును దైన్యంబును సుడివడుచుండ నిట్లనియె.

టీకా:

కాంతాతిలకము = కాంతలలో శ్రేష్ఠమైనది, రతీదేవి; విస్మయము = ఆశ్చర్యము; ఆకుల = క్షోభ చెందినది; మూర్ఛిల్లి = సొమ్మసిల్లినదై; దైన్యము = దీనత్వము.

భావము:

అనగా విని ఆ రతీదేవి యాశ్చర్యము, బాధతో కలతచెంది, సొమ్మసిల్లి తేరుకునన్నది. నవ్వు, కోపము, దీనత్వము పెనగగొనగా ఇలా అన్నది.

2-72-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లా మన్మథ! యిట్లుపల్కఁ దగవా? యీ చందముల్ మేలె? నీ
వేలా మూఢుఁడవైతి? నీదుమది దానెచ్చోటికిం బోయె? మి
థ్యాలాపంబులఁ బల్క నీకుఁ దగ భవ్యంబౌ రతిక్రీడయే
కాలారిఁద్రిపురారిఁజేరవశమే? కందర్ప! నీబోటికిన్.

టీకా:

చందము = విధము; మది = బుద్ధి; మిథ్య = అసత్యము, భ్రాంతి; భవ్యము = శుభమైన; కాలారి = యముని సంహరించినవాడు, శివుడు; త్రిపురారి = త్రిపురాసురుని సంహరించినవాడు, శివుడు.

భావము:

“ఎందుకు మన్మథా! ఇలా మాట్లాడుతున్నావు? ఇది మంచి పద్ధతాదా? నీవెలా తెలివితక్కువవాడిలా అయ్యావు? ఇలా భ్రాంతిభాషణలు పలుకుటకు నీ బుద్ధి ఎక్కడకు వెళ్ళింది? . యిది ఏమైనా శుభమైన రతిక్రీడా? యముని, త్రిపురాసురుని సంహరించిన శివుని చేరుట కందర్పా! నీవంటివారికి వశమా?......

2-73-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదియునుం గాక.

భావము:

అంతేగాక.

2-74-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిఖిల ప్రపంచంబు నిర్మించి శోభిల్లు;
రమేష్ణి కంటె నీ లము బలమె?
మూఁడు వేల్పులఁ బట్టి మూలకుఁ జొనిపిన;
రివైరికంటె నీ వెవు వెరవె?
న భీకరాటోపలితుఁడై వర్తిల్లు;
యకాలుకంటె నీ లావు లావె?
లదైవములనెల్ల ఖండించి మించిన;
యంతకుకంటె నీ రుదు యరుదె?
2-74.1-ఆ.
యెట్టి ఘనులఁ బట్టి యెనయంగఁ దలకొని
తెచ్చి విఱిచి త్రుంచి చ్చినాఁడు
లదు శంభుతోడ వైరంబు మన్మథ!
యూరకుండి చచ్చువారు గలరె.

టీకా:

నిఖిలము = సమస్తము; శోభిల్లు = ప్రకాశించు; పరమేష్ఠి = బ్రహ్మ; మూడు వేల్పులు = బ్రహ్మ, ఉపేంద్రుడు, ఇంద్రుడు; కరివైరి = గజాసురవైరి, శివుడు; వెరవు= ఉపాయము, నేర్పు; ఆటోపము = వేగిరపాటు; లయకాలుడు = శివుడు; లావు = బలము; ఖలుడు = అదముడు; అరుదు = దుర్లభము; ఎనయగ = పొంది; తలకొని = ఎదుర్కొని.

భావము:

సమస్త ప్రపంచాన్నీ సృష్టించే బ్రహ్మదేవునికంటే నీ బలము గొప్పదా? త్రిమూర్తులను మూలకు తోసే శివునికంటె నీ నేర్పు గొప్పదా? మహా భయంకర యాటోపముతో మెలగెడి ఆ లయకారునికంటె నీ బలము గొప్పదా? అదములైన దైవాలను ఖండించినవాని కంటె దుర్లభమైనదా నీశక్తి? ఎంతటి గొప్పవారినైనాతలపడి త్రుంచి వచ్చువాడు. తీరికూచుని చావు తెచ్చుకుంటారా ఎవరైనా? శివుడితో వైరము వద్దు మన్మథా!

2-75-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లువలరాజు పువ్వు, కడికంచము బ్రహ్మకపాల, మన్ను వ
న్నె పులితోలు చీర, పదనిర్మల పద్మము, విష్ణువమ్ము, వే
లవిభుండు కంకణము, ప్పని లెంకలు దేవ సంఘనుల్,
లిత మమ్మహామహిమ ర్వము వాని గణింపవచ్చునే.

టీకా:

కలువలరాజు = చంద్రుడు; కడి = (కబళము) భోజనము; మన్ను = మట్టి; వన్నె = రంగు; చీర = వస్త్రము; వేదలలవిభుడు = వేయి తలల ఆదిశేషుడు; కంకణము = ముంజేతి ఆభరణం; లెంకలు = సేవకులు; సలలితము = రమణీయము.

భావము:

శంకరునికి చంద్రుడు శిగపూవు. బ్రహ్మ కపాలము భోజన కంచము. మట్టిరంగు పులితోలు వస్త్రము. పాదములు నిర్మలమైన పద్మములు. విష్ణువు బాణము. శేషుడు కంకణము. దేవతలు సేవకులు.మహామహిమంతా బహు రమణీయము అంతటి ఆ పరమశివుని నుతించగలమా?

2-76-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పుట్టించున్ భువనంబునల్మొగములన్ పొల్పారఁగా ధాతయై
ట్టై రక్షణసేయుచుండును సుధార్యంకుఁడై రుద్రుఁడై
ట్టల్కం దెగటార్చు నిట్లు మఱియుం ర్వించి లీలాగతిం
ట్టా! యిట్లు మహేశుమీఁద నరుగంగాఁ బాడియే? మన్మథా!

టీకా:

పొల్పారు = వెలయు; పట్టు = ఆధారము; పర్యంకం = మంచము; రుద్రుడు = శివుని అష్టమూర్తులలో ఒకటి, శివుడు; కట్టా = కటకటా; అల్కం= అలుకతో; తెగటార్చు= నశింపచేయు; పాడి = ధర్మము.

భావము:

నాలుగు ముఖములతో వెలయు ధాతయై లోకాలను పుట్టిస్తాడు, పాలసముద్రంలో శేషసాయి, విష్ణువుగా ఆధారమై రక్షణ చేయుచుండును, రుద్రుడై కోపంతో ఇలా నశింపచేస్తాడు. మన్మథా ! ఇంచతెలిసీ, గర్వముతో విలాసంగా శివుని మీదకు వెళ్ళడం ధర్మమా?

2-77-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని చెప్పవచ్చు నతఁ డెంతటివాఁ డని పల్కవచ్చునీ
భూమియు నాకసంబు జలపూరము నాత్మయు నగ్ని గాలియున్
సోముఁడు చండభానుఁడగుసూర్యుఁడు నాతఁడు దాను బ్రహ్మయుం
దారసాక్షుఁడున్ నతని త్త్వముఁ గానరు నీకుశక్యమే?

టీకా:

తామరసాక్షుడు = విష్ణువు.

భావము:

ఏమని చెప్పగలము? ఎంతటివాడని పలుకగలము? ఈ భూమి, ఆకాశం, జలము, ఆత్మ, అగ్ని, గాలి, చంద్రుడు, చండభానుడైన సూర్యుడు, బ్రహ్మ, విష్ణువు కూడా ఆ శివుని తత్వమును తెలుసుకోలేరు. ఇంక నీవల్లవుతుందా?

2-78-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దువుల్ మంత్రములుం బురాణ చయముల్ శాస్త్రంబులుం గూడి య
మ్ముదుకం గానఁగలేక తోఁచినగతిం మోదించి వర్ణించు నా
దువుల్ పూర్వులుకన్నవిన్న తపసుల్ స్రష్ట్రండముల్ కుక్షిలో
నుయంబైనవి గాన నమ్మహిమ దా నూహింపరా దేరికిన్.

టీకా:

చదువులు = వేదాలు; చయము= సమూహము; ముదుకన్ = చిక్కటిదైవం, ఆదిముసని, ఆదిశివుడిని; మోదించి = ఆనందించి; స్రష్ట = బ్రహ్మ; స్రష్ట్రండముల్ = బ్రహ్మాండములు; కుక్షి = కడుపు; ఏరికిన్ = ఎవరికీ.

భావము:

వేదములు, మంత్రములు, పురాణ సమూహములు, శాస్త్రములు అన్నీ పఠించిన పూర్వులు తపస్సులు, కూడా ఆ పరమశివుని సరిగా దర్శించలేక తోచిన విధముగా వర్ణిస్తారు., బ్రహ్మాండములు శివుని కడుపులోనుండి పుట్టినవి. కావున ఆతని మహిమను ఊహించుట ఎవరి తరమూ కాదు.

2-79-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ల్లోలధ్వని మంత్రజాలములునుం, గాయంబు బాఠీనముల్,
ల్లాలిత్యతతిద్విజుల్, మణులు నక్షత్రావళల్ ఫేనముల్,
తెల్లం బైన త్రిమూర్తు లూర్ములు గతుల్, దివ్యప్రభావంబు రం
జిల్లంగా జలపూర సంకుల మహాశ్రీకంఠవారాశికిన్.”

టీకా:

కాయము = శరీరము; జాలము = సమూహము; పాఠీనము = పెద్దచేప, తిమింగలం; సల్లాలిత్యము = మంచి సౌందర్యము, జ్ఞానముతో; తతి = సమూహము; ద్విజులు = బ్రాహ్మణులు; ఫేనము = సముద్రపు నురుగు; ఊర్ములు = కెరటాలు; గతులు = కదలికలులు; సంకుల = వ్యాపించిన; శ్రీకంఠుడు = శివుడు; వారాశి = సముద్రము.

భావము:

కల్లోల ధ్వనులే మంత్ర సమూహములుగా, శరీరమే తిమింగలాలుగా, జ్ఞానులైన బ్రాహ్మణులే మణులుగా, సముద్రపు నురుగే నక్షత్రాలుగా, త్రిమూర్తులే కెరటాలుగా కదలికలే మహా ప్రభావాలుగా శోభిల్లుతుంటాడు ఆ శివుడు అనే జలము సంపూరిత మహా సముద్రము.”

2-80-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నిట్లనియె.

భావము:

రతీదేవి మన్మథునితో ఇంకా ఇలా అంది.

2-81-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"భూకాంత తేరును బూవులతేరును;
నిర్ఝరసుభటులు న్గీరభటులు;
నకాచలము నిల్లు డు తియ్య నగు విల్లు;
మేటి నంది పడగ మీనుపడగ;
హుమంత్రవాజులు చ్చని వాజులు;
పెక్కు దలల నారి భృంగనారి;
లుమొగంబుల యంత వవసంతుఁడు యంత;
పురుషోత్తముం డమ్ము పూవు టమ్ము;
2-81.1-ఆ.
వెలయ రేయుఁ బగలు వెలిఁగించు కన్నులు
మ్మి కండ్లు; త్రిపురదైత్యకోటి
గురి విట వ్రజము గురి; యతనికి నీకు
నేమి సెప్పవచ్చు? నెంత కెంత.

టీకా:

భూకాంత = భూమి; నిర్జరులు = దేవతలు; కీరము = చిలుక; కనకాచలము = మేరు పర్వతం; పడగ = ధ్వజము; మీను = చేప; వాజులు = గుఱ్ఱాలు; పెక్కుతలలనారి = శేషుడు నారి; భృంగము = తుమ్మెద; యంత = సారథి; పురుషోత్తముడు = విష్ణువు; వెలయు = ప్రకాశించు; తమ్మి = తామరపూవు; దైత్యులు = రాక్షసులు; విటులు = వేశ్యాలోలురు; వ్రజము = సమూహము.

భావము:

శివుని రథం భూమి. నీ రథం పూలరథం. అతని భటులు దేవతలు. నీ భటులు చిలుకలు. అతని విల్లు మేరుపర్వతం. నీ విల్లు చెఱకు. అతని ధ్వజము మహా నంది. నీ ధ్వజము చేప. అతని గుఱ్ఱాలు వేదాలు. నీ గుఱ్ఱాలు రామచిలుకలు. అతని వింటినారి ఆదిశేషుడు. నీ వింటినారి తుమ్మెద. అతని రథసారథి బ్రహ్మ. నీ రథసారథి వసంతుడు. అతని బాణము విష్ణువు. నీది పూలబాణము. రాత్రి పగళ్ళకు కాంతినిచ్చే సూర్యచంద్రులు అతని కన్నులు. నీ కన్నులు తామరపూలు. అతని గురి త్రిపురాసురులవంటి రాక్షసులపైన. నీ గురి విటులమీద. అతనెక్కడ, నీవెక్కడ. అసలు పొలికెక్కడ. ఎంతకుఎంత?

2-82-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిరుపమ నిర్మల నిశ్చల
మ మహాదివ్య యోగరిత నిజాంతః
ణుఁడు శివునిం గెల్చుట
విహులఁ బొరిగొంట కాదు విరహారాతీ!

టీకా:

నిరుపమ = సాటిలేని; భరిత = పూరితము; పొరిగొను = జయించుట; విరహ+ఆరాతి = విరహిజనులకు శతృవు, మన్మథుడు.

భావము:

సాటిలేని, పరిశుద్ధమైన, నిశ్చలమైన, మిక్కిలి గొప్పదైన దివ్య యోగము పూరిత అంతఃకరణము కలవాడు. అట్టి శివుడిని గెలుచుట విరహులను గెలవటం వంటిది కాదు విరహారాతీ! మన్మథుడ!.

2-83-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ద్యోత బృందంబు ర్వింప వచ్చునే;
రఁగ దేజః ప్రదీపంబుమీఁద;
రఁగఁ దేజః ప్రదీపంబు శోభిల్లునే;
యాభీల ఘోర దావాగ్నిమీఁద;
భీల ఘోర దావాగ్ని పెంపేర్చునే;
వలింటి భానుబింబంబుమీఁద;
వలింటి భానుబింబంబు వెలుంగనే;
ప్రళయకాలానల ప్రభలమీఁద;
2-83.1-తే.
ప్రళయకాలగ్ని కోటిచేఁ బ్రజ్వరిల్లు
మంటఁ గలకంఠఁ బరఁగు ముక్కంటిమీఁద;
వ్రాల నేరదు నీ పెంపు దూలుఁ గాని
జితజగజ్జనసంఘాత చిత్తజాత!”

టీకా:

ఖద్యోతబృందము = మిణుగురు పురుగులు; పరగ = ఒప్పుగా; తేజము = ప్రకాశము; ప్రదీపము = వెలుగుతున్న దీపము; శోభిల్లు = ప్రకాశించు; ఆభీల = భయంకరమైన; ఘోర = భయంకరమైన; దావాగ్ని = అడవులను కాల్చే అగ్ని, కార్చిచ్చు; పెంపేర్చు = అతిశయించు; పవలు = పగలు; ఇంటి = వసించు; అనలము = అగ్ని; పరగు = ప్రవర్తిల్లు; వ్రాలు = మీఱు; దూలు = నింద; జితజగజ్జనసంఘాత = జిత = జయించిన; జగజ్జన = లోకులు; సంఘాత = సమూహము కలవాడు, మన్మథుడు; చిత్తజాత = మనస్సు నందు పుట్టెడివాడు, మన్మథుడు.

భావము:

పెద్ద తేజస్సునిస్తున్న దీపం మీద, మిణుగురు పురుగులు గర్వం చూపవచ్చునా?? భయంకర దావాగ్ని మీద ప్రకాశించే దీపం శోభిల్లుతుందా? భయంకర దావాగ్ని పగటి సూర్యబింబం కంటె ప్రకాశించగలదా? ప్రళయ కాలాగ్నిని మించి, పగటి సూర్యబింబం వెలుగ గలదా? మంటమండే గరళం కంఠముననున్న పరమశివునిమీద, ఎంతటి ప్రళయకాలాగ్నులైనా మించి ప్రజ్వరిల్లి గెలవగలవా? ఇవేవీ మీఱలేవు. నీవు ఎంతటి లోకంలోని జనులందరినీ జయించగలవాడవైనా, ఎంత మనసులో పుట్టువాడవైనా ఓ మన్మథ! నీ గొప్పదనం పరమశివుని ముందు వెలవెలబోతుంది తప్ప ఎందుకూ పనిచేయదు.”

2-84-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని నేర్పు మెఱసి పలుమరుఁ
కుం గడు బద్ధిచెప్పు దామరసాక్షిం
కర్మపాశ హతఁ డై
సతికి మనోభవుండు దా నిట్లనియెన్.

టీకా:

తామరసాక్షి = తామరపూలవంటి కన్నులు కలామె, రతీదేవి; కర్మపాశహతుడై = కర్నపాశమునకు చిక్కుకొన్నవాడై.

భావము:

అంటూ నేర్పుగా పలుమార్లు తనకు బుద్ధిచెబుతున్న రతీదేవిని చూసి కర్మపాశబద్ధుడై తన భార్యతో మన్మథుడు యిలా అన్నాడు.

2-85-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“బభేద్యాదిసురాళితోఁ బలుకు నాపంతంబు చెల్లింప ను
త్పగంధీ! తలఁపొండె గాని యతఁ డీబ్రహ్మాండభాడావళుల్
లఁగంజేయు సదాశివుం డని యెఱుంగంజాలుదుం జాలునే
కంఠీరవ! కంబుకంఠి! శివువక్కాణింప నింకేటికిన్.”

టీకా:

బలభేది = బలాసురుని భేదించినవాడు, ఇంద్రుడు; ఆది= మొదలగు; సురాళి = దేవతల సమూహము; ఉత్పలగంధి = కలువల వాసన గలామె, రతీదేవి; తలపు = ఆలోచన; బ్రహ్మాండభాండావళులు= బ్రహ్మాండలతో నిండి ఉండే బ్రహ్మాండభాండముల సమూహాలు; కలగజేయు = కలతపొందించు; కలకంఠీరవ = కోకిల వంటి స్వరము కలామె, రతీదేవి; కంబుకంఠి = శంఖము వంటి మెడ కలామె, రతీదేవి; వక్కాణించు = నొక్కి చెప్పు; ఏటికి = ఎందులకు.

భావము:

“ఉత్పలగంధీ! కలకంఠీరవ! కంబుకంఠి!రతీదేవీ! ఇంద్రాది దేవతలతో పలికిన నా పంతము చెల్లించడం ఒక్కటే ఆలోచిస్తున్నాను. కానీ యతను ఈ బ్రహ్మాండ సమూహాలను కలచివేయగల సదాశివుడని తెలియదా నాకు? చాలునే! ఇంకా ఎందుకు శివుని గూర్చి నొక్కి మాట్లాడతావు?”.

2-86-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పల్కి మరుండు మదాంధ సింధురంబునుం బోలె నతులిత మదోద్రేక్రమానసుండై తదవసరంబున.

టీకా:

సింధురము = ఏనుగు; అతులిత = అసమానమైన, సాటిలేని; ఉద్రేకము = ఆవేశము.

భావము:

అని రతీదేవితో పలికి, మన్నథుడు మదపుటేనుగు వలె అసమాన ఆవేశపూరితమైన మనసు కలిగి ఆ సమయంలో....

2-87-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఖండేందుధరునిమీఁదను
దండెత్తఁగవలయ ననుచుఁ న బలములఁ బి
ల్వుం ని కాలరి తమ్మెద
తంములన్ మరుఁడు పంపెఁ ద్దయు వేడ్కన్.

టీకా:

ఖండేందుధరుడు= చంద్రవంకను ధరించినవాడు, శివుడు; కాలరి = పదాతి బంటు; తండము = గుంపు; తద్దయు = మిక్కిలి; వేడ్క = వేడుక, అభిలాష, వినోదము.

భావము:

శివుని పైకి దండెత్తాలంటూ తన సైన్యమును పిలువమని పదాతి దళాలైన తుమ్మెద గుంపును మరుడు తో పంపెను.

2-88-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పంపినఁ గాలరుల్గదలి పంకజరేణువు రేగునట్లు గా
వింపుచుఁ బోయి జుమ్మరని పిల్చినఁ దద్బలముల్ చెలంగఁగాఁ
గంపితులై పతింగొలువ గ్రక్కున నప్పుడు వచ్చిరోలిమైఁ
దెంపును సొంపు గ్రాలఁ గడు దీవ్రగతిం రతినాథుఁ గానగన్.

టీకా:

పంకజరేణువు = పద్మముల పరాగరేణువులు; తద్బలములు = ఆసైన్యాలు; చెలంగు = ఉత్సాహము; గ్రక్కున = వెంటనే; ఓలిమి = చాటు, అడ్డపాటు; తెంపు = సాహసము; క్రాలు = సంభ్రమించు; తీవ్రగతి = మిక్కిలి వేగము; కానగన్ = చూచుటకు.

భావము:

పంపిన కాల్బలం కదలి పద్మ పరాగరేణువులు రేగునట్లుగా వెళ్ళి, ఝుమ్మని పిలువగానే, యజమానిని సేవించుటకు ఆ సైన్యములు ఉత్యాహంగా కదలిపోతూ వెంటనే అడ్డపాటుగా సాహసముగా సంభ్రమించి బయలుదేరారు. అప్పుడు చలా వేగముగా రతీనాథుని దర్శనమునకు వచ్చిరి.

2-89-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ములఁ గొలఁకులఁ దిరిగెడి
కోకిల కీర భృంగ కాదంబ తతుల్
నుదెంచి కొల్చె పశ్చిమ
తర శైలార్కతేజుఁ గామనిఁ గడఁకన్.

టీకా:

కొలకు = కొలను, సరస్సు; కాదంబము = హంస; తతి = సమూహము; శైలము = కొండ; అర్కుడు = సూర్యుడు; కాముడు = మన్మథుడు.

భావము:

ఉద్యానవనములలో సరస్సులలో తిరిగే గొప్పగొప్ప కోకిలల, చిలుకల, తుమ్మెదల, హంసల గుంపులు; అస్తమయ సమయ సూర్యునికి సమానమైన తేజస్సు గల మన్మథుని వద్దకు వచ్చి సేవించెను.

2-90-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అయ్యవసరంబున.

భావము:

ఆ సమయములో.

2-91-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లము నేర్పులతోడఁ న్నించి తెం డని;
డవాలు కోకిల పంక్తిఁ బంపె;
భేరీ మృదం గాది చారు నాదంబులు;
నెనయఁ దుమ్మెదల మ్రోయింపఁ బంపె;
రాకీరములఁ గట్టి థ మాయితము సేయ;
సంగడికాని వసంతుఁ బంపె;
హనీస మగుచున్న న బలంబుల నెల్ల;
మనింపు మని కమ్మ గాలిఁ బంపె;
2-91.1-ఆ.
మేలు బలమువాఁడు మీనుటెక్కమువాఁడు
నిఖిల మెల్లఁ గలఁచు నేర్చువాఁడు
చ్చవింటివాఁడు రగఁ బల్పువుటమ్ము
లుగువాఁడు ప్రౌఢతులవాఁడు.

టీకా:

పన్నించి = పద్ధతిగా పేర్చి; పడవాలు = సేనాధిపతి; చారు = మనసుకు సంతోషం కలిగించేది; ఎనయు = సరిపోలు; ఆయితము = సన్నాహము; సంగడికాడు = చెలికాడు; బలుపుటమ్ము = బలమైన బాణము; ప్రౌఢ = యువకుడు, దిట్ట, నిపుణుడు.

భావము:

సైన్యమును నేర్పుగా సిద్ధంచేసి తెమ్మని సేనాధిపతులైన కోకిల గుంపును పంపెను. భేరీ మృదంగములవలె వీనులవిందుగా నాదముచేయడానికి తుమ్మెదలను పంపెను. రామచిలుకలను కట్టి రథము సిద్ధము చేయడానికి చెలికాడైన వసంతుని పంపెను. గొప్పదైన మన సైన్యాన్నంతా గమనించమని కమ్మని గాలిని పంపెను. ఇలా సకల సైనిక ఏర్పాట్లు మంచి బలము గలవాడు, మీన ధ్వజము గలవాడు, సకల ప్రాణులనూ కలవరపరచే నేర్పు గలవాడు, పచ్చని విల్లు గలవాడు, ఒప్పుగా బలమైన బాణము గలవాడు, నిపుణవర్తనల వాడు మన్మథుడు చేశాడు.

2-92-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తేజము తన బలమును
గర్వము తన మదంబు న సంపదయున్
తరముగ నచ్చెరువుగఁ
నిగొని పరమేశుమీఁదఁ బైనంబయ్యెన్.

టీకా:

తేజము = కాంతి; అచ్చెరువు = ఆశ్చర్యము; పనిగొను = వినియోగించు, ప్రయత్నించు; పయనము = ప్రయాణము.

భావము:

తన కాంతి, బలము, గర్వము, పొగరు, సంపదలతో మహా ఆశ్చర్యంగా వినియోగింస్తూ పరమేశ్వరుని పై ప్రయోగించడాని ప్రయాణమయ్యాడు.

2-93-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత

భావము:

అంతట...

2-94-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మలషండము నున్నఁగాఁ జేసి యిరుసుగాఁ;
గావించి కెందమ్మికండ్లఁ గూర్చి;
నించు మోసుల నొలుగాఁ గావించి;
ర మొప్పఁ గేదెఁగికాడి వెట్టి;
సంపెంగమొగ్గల నుగొయ్య లొనరించి;
ల్లవంబులు మీఁదఁ ఱపుఁ జేసి;
చెలువైన పొగడదంచేత బిగియించి;
యెలదీఁగె పలుపులు లీలఁ జొనిపి;
2-94.1-ఆ.
తెఱఁగు లరసి పువ్వుతేనెఁ గందెన వెట్టి;
గండురాజకీరములఁ గట్టి;
మెఱయ చిగురుగొడుగు మీనుటెక్కము గ్రాలఁ
దేరు బన్ని సురభి తెచ్చె నపుడు.

టీకా:

కమలషండము = కమలము యొక్క మధ్యభాగము; కెందమ్మి = ఎఱ్ఱ తామర; కండ్లు = చక్రములు; ఇంచు = చెఱకు; మోసు = మోపు; నొగ = కాడిమానికి ఆధారమై బండిలో నదువాని మొదటనుండెడు నిడుపాటి మ్రాను, కూబరము; కరమొప్పు = మిక్కిలి ప్రకాశించు; గేదగి = పచ్చని మొగిలి పూవు, కేతకి; చను గొయ్యలు = బండి చట్రమునకు ఇరువైపులా నుండు కొయ్యలు; పల్లవములు = లేత చిగుళ్ళు; చెలువైన = అందమైన; ఎలతీగ = లేతతీగ; పలుపు = పశువుల మెడకు కట్టు తాడు; తెఱగులు = విధములు; అరసి = తెలుసుకొని; పువ్వుతేనె = మకరందం; కందెన = బండి ఇరుసునకు పూయు చిక్కటి నూనె; గండురాజకీరములు = మగరామచిలుకలు; గములుగట్టు = గుంపుగాకట్టు; టెక్కెము = జండా; క్రాలు = అల్లలాడు(ఊగు); తేరు = రథము; సురభి = వసంతఋతువు, వసంతుడు.

భావము:

కమలములోని దిమ్మెను నున్నగా చేసి ఇరుసుగా చేసి ఎఱ్ఱతామరలను చక్రాలుగా చేశాడు.లేత చెఱకు గడలతో నొగలు చేసి ప్రకాశించేలా మొగలితో కాడి తయారు చేశాడు.సంపంగి మొగ్గలతో చనుగొయ్యి కూబరముగా చేసి దానిపై లేత చిగురులతో పరుపు చేశాడు. అందమైన పొగడపూల దండలచే బిగించి లేత తీగెలతో లీలగా పలుపును తయారు చేశాడు. తెలవిగా పూమకరందాన్ని కందెనగా పూసాడు. మగరామచిలుకలను గుంపుగా కట్టి, చిగురు గొడుగు మెరయుచుండగా మీన ధ్వజము రెపరెపలాడుచుండగా రథమును సిద్ధపరచి వసంతుడు అప్పుడు తీసుకువచ్చెను.

2-95-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు మహిమాతిశయం బగు సుమరథం బాయత్తంబు చేసి వసంతుఁ డనంత వైభవంబున నంగసంభవుం గాంచి దేవర యానతిచ్చిన విధంబునఁ దే రాయత్తంబు చేసి తెచ్చితి; నదియునుం గాక పిక మధుర మరాళ సేనా నాయకుల దండు గండు మొనలై రతీంద్రా! నీ రాక గోరుచు మొగసాల నున్నవా రని విన్నవించిన నవధరించి పురారాతిమీఁద దండు గమకించి మెయి వెంచి విజృంభించి సమంచిత పుష్ప బాణానన తూణీర సమేతుండును; ద్రిభువన భవ నాభినవ సుందరుండును; రంగద్భృంగ మంగళ సంగీత పాఠ కానేక నిర్మల మహనీయ నాద మోదిత మానసుండును; భూరి కీర కైవార నిజ గుణాలంకారుండును; కలహంస నాద గణ పరివృతుండును; నగణ్య పుష్ప రథారూఢుండును; జగన్మోహనుండును; నగోచర చారు శృంగారుండును; హార కేయూర మణిమకు టాభిరాముండును; రమణీయ రతిరామా సంయుతుండును; కలకంఠ కీర సేనాధిష్ఠితుండును; బల్లవ ఛత్ర చామర కేత నాలంకృతుండు నై నభోభాగంబునం బోవు చుండె నయ్యవసరంబున.

టీకా:

మహిమాతిశయం = గొప్పదైన; సుమరథం = పూలరథం; ఆయత్తంబు చేసి = సిద్ధపరచి; అనంత వైభవము = గొప్ప వైభవం; దేవర = ప్రభువు; పికము = కోకిల; మరాళము = హంస; దండు = సేనా సమూహము; గండు = పౌరుషము; మొన = సేనాముఖము; మొగసాల = వాకిట; అవధరించి = విని; పురారాతుడు = శివుడు; మెయివెంచి = శరీరాన్ని పెంచి (ఉత్సాహంతో ఉబ్బి); అంచిత= గౌరవింపబడిన; తూణీరము = అమ్ములపొది; రంగము = యుద్ధరంగము; భృంగము= తుమ్మెద; పరివృతుడు = చుట్టబడినవాడు; అగణ్య = లెక్కింపరాని; అగోచరము = తెలియరాని; అభిరామము = మనోజ్ఞమైన; నభము = ఆకాశము.

భావము:

ఈ విధంగా గొప్ప పూలరథం సిద్ధపరచి వసంతుడు అత్యంత వైభవంతో మన్మథుని చూసి “స్వామీ! మీరు ఆజ్ఞాపించిన విధముగా రథమును సిద్ధంచేసి తెచ్చాను. అంతేగాక మధురమైన కోయిలలు, హంసల సేనా నాయకుల సమూహములు పౌరుషంగల సేనాముఖములు ముందు నిలచి రతీంద్రా! మీరాక కోసం వాకిట వేచి యున్నారు” అని విన్నవించాడు. అది విని శివునిపై దండెత్తే సైన్యాన్ని గమనించి ఉబ్బి విజృంభించి గౌరవప్రదమైన పుష్పబాణాలుండే తూణీరముతో కూడినవాడై, ఆ ముల్లోకాలలోనూ అందమైనవాడు యుద్ధమునకు వెళ్ళునపుడు మ్రోగించే తుమ్మెదల మంగళ సంగీత పాఠాలను నిర్మలంగా ఆస్వాదిస్తున్న మనసు కలవాడై, గొప్ప రామచిలుకల సేనా సమేతుడై, కలహంస రవములతో చుట్టు ముట్టినవాడై, లెక్కలేనన్ని పుష్పాలతో తయారుచేసిన రథము ఎక్కినవాడై, ఆ జగన్మోహనుడు తెలియరాని ప్రకాశవంతమైన శృంగారము కలవాడై హారములు, కేయూరములు, మణులతో కూడినకిరీటములతో మనోజ్ఞమైన అందమైన రతీనాథుడు కోయిల రాచిలుకల సేనా సమేతుడై లేత చిగురులచే చేయబడిన గొడుగు, విసనకర్ర కేతనము లతో అలంకరించుకొని ఆకాశమార్గంలో వెళ్తున్నాడు. ఆ సమయంలో.....

2-96-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నియెం గాముఁడు మాతులుం కదళీ ఖర్జూర పున్నాగ చం
జంబీర కదంబ రంనియెం గాముఁడు మాతులుంగ కదళీర్జూర పున్నాగచం
 జంబీరకదంబ రంభ ఫలినీ దాడీమమందార కాం
 నాగార్జునబింబ కంటక ఫలానంతప్రవాళావళీ
 సంరంభము శీతవంతమును శర్వాణీప్రియోపాంతమున్.>భ ఫలినీ దాడీమ మందార కాం
నాగార్జున బింబ కంక ఫ లానంతప్రవాళావళీ
సంరంభము శీతవంమును శర్వాణీ ప్రియోపాంతమున్.

టీకా:

కనియెను = చూసెను; కాముడు = మన్మథుడు; మాతులుంగ = మాదీఫల; కదళి = అరటి; జంబీర = నారింజ; కదంబ = కడిమి; రంభ = అరటి; ఫలినీ = (తరిగొర్ర చెట్టు), ప్రేంకణపు చెట్టు; దాడిమి = దానిమ్మ; బింబ కంటక ఫలము = పనస పండు; ప్రవాళము = చిగురు; సంరంభము = అతిశయము; శర్వాణి = పార్వతి; ఉపాంతము = సమీపము.

భావము:

మన్మథుడు మాదీఫలం, అరటి, ఖర్జూరం, పున్నాగ, చందన, నారింజ, కడిమి, అరటి, ప్రేంకణము, దానిమ్మ, మందార, కాంచన, నాగ (నాగ గన్నేరు), అర్జున (ఏఱుమద్ది), కంటకఫలం మొదలైన ఫలవృక్షములు చిగుళ్ళ వరుసలతో వనాతిశయమును చల్లదనమును పార్వతీ సమీపమున చూసెను.

2-97-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కని యమ్మహావనంబు దరియం జొచ్చి.

టీకా:

కని= చూసి; దరియంజొచ్చి= దగ్గరకు వచ్చి.

భావము:

చూసి ఆ గొప్ప వనము వద్దకు వచ్చి.

2-98-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న మనోవీథి పై ర్పంబు రెట్టించి;
చెన్నొంద వెడవిల్లుఁ జేతఁ బట్టి;
ట్టపు మొల్లలు లజొమ్మికము వెట్టి;
సొంపారఁ బూవులజోడుఁ దొడిగి;
బలంబుల నెల్ల మొలుగాఁ గావించి;
లువలు తూణీరములు ధరించి;
క్కజముగ మీన టెక్కె మెత్తించి; రా;
చిల్కల తేరెక్కి; చివురు గొడుగు
1-98.1-ఆ.
బాలకోకిలంబు ట్టంగఁ గడువేడ్క
గీర చయము తన్నుఁ గీర్తి సేయ
మ్మగాలితోడఁ దన సన్నద్ధుఁ డై
కాముఁ డేగె సోమజూటు కడకు.

టీకా:

మనోవీధి = మనస్సు; దర్పము = గర్వము; చెన్ను= అందము; వెడ = అల్పము; జోడు = కవచము; మొనలు = పదును; తూణీరము= అమ్ములపొద; అక్కజము= ఆశ్చర్యము; కదనము =యుద్ధము; సోమజూటుడు= (చంద్రుని జటయందు ధరించినవాడు) శివుడు.

భావము:

తన మనస్సునందు గర్వము రెట్టింపుకాగా, అందముగా తేలికైన (చెరుకు) విల్లును చేతబట్టి, మొల్లలను దట్టముగా తలకు చుట్టి, సొంపుగా పూల కవచం ధరించి, తన సైన్యమును వ్యూహాత్మకంగా తీర్చి, కలువలను అమ్ములపొదిగా ధరించి, అద్భుతంగా మీనధ్వజమెత్తించి, రామచిలుకల రథమెక్కి, చివురు గొడుగును బాలకోకిలలు పట్టగా, చాలా వేడుకగా చిలుక సమూహములు తనను పొగడుచుండగా, మలయమారుతముతో యుద్ధానికి సిద్ధమై, కాముడు శివుని వద్దకు వెళ్ళెను.

2-99-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇవ్విధంబున నత్యంక సమ్మదంబున సకల సన్నాహ బల పరివృతుండై నిదురబోయిన పంచాననంబు నందంద మేలుకొలుపు మదగజంబు చందంబున నిందిరానందనుండు నిరుపమ నిర్వాణ నిర్వంచక నిర్విషయ నిరానంద మానసుండును; సకల బ్రహ్మాండ భాండ సందోహ విలంబిత నిర్మల పరమ భద్రాసీన దివ్యయోగధ్యాన సంతత భరితాతంరంగుండును; నిర్గుణుండును; నిర్వికారుండునునై తన్నుందాన తలపోయుచు నశ్రాంత సచ్చిదానంద హృదయుం డగు నమ్మహేశ్వరుం గాంచి యల్లనల్లన డాయం బోయి తదీయాభిముఖుండై మనోభవుండు.

టీకా:

పంచాననము = (విశాలమగు ముఖము గలది) సింహము; నిరుపమ = సాటిలేని; నిర్వాణ = ముక్తి; నిర్వంచక = మోసములేని; నిర్విషయ = ఇంద్రియ విషయములు లేక; నిరానందమానసుడు = ఆనందానుభవుడు; సందోహ = సమూహము; విలంబిత = వ్రేలాడునది; సంతత = నిరంతరం; భరితాంతరంగుడు = నిండిన మనస్సు కలవాడు; నిర్గుణుడు = ప్రత్యేకించి ఏ గుణమూ లేనివాడు; నిరాకారుడు = ఆకారములేనివాడు; అశ్రాంత = విశ్రాంతిలేని; సచ్చిదానందము = ఎల్లప్పుడు మనసునందు ఆనందము కలవాడు; అల్లనల్లన = మెల్లమెల్లగా; డాయంబోయి = దగ్గరకు వెళ్ళి; అభిముఖం = ఎదురుగా.

భావము:

ఈ విధముగా చాలా ఉత్సాహంగా సకల సన్నాహపూరిత సైన్యములు చుట్టూకూడి బయలుదేరాడు. అలా బయలుదేరి నిదురపోయిన సింహమును అనయము మేలుకొలిపే మదగజము వలె లక్ష్మీపుత్రుడైన మన్మథుడు పరమేశ్వరుని సమక్షంలోకి మెల్లమెల్లగా వెళ్ళి నిలిచాడు. ఆ పరమేశ్వరుడు సామాన్యుడు కాదు అనన్య మోక్షవిషయుడు; నిర్విషయుడు; నిత్యానందుడు; బ్రహ్మాండభాండములన్నియు వ్రేలునంతటి నిర్మలమైన వీరాసీనుడై యుండువాడు; మహా యోగధ్యానముచే సచ్చిదానందుడై యుండువాడు; గుణరహితుడు; వికారవిహీనుడు; తనను తానే ధ్యానిస్తూ సంతతానందరూపుడు; అలా నిలిచి.....

2-100-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

2-100-లయగ్రాహి
ఇంచువిలుకాఁడు వెస నించువిలుఁ జూచి మెయిఁ;
బెంచి తమకమ్మినుమడించి గుణముల్మ్రో
యించి దివిజారి నలయించి విట చిత్తములు;
చించి పువుటమ్ము మెఱయించి కడిమిన్ సం
ధించి శివు నేయఁ గమకించి తన చిత్తమునఁ;
బంముఖు మానస సమంచితము నాలో
కించి వెఱఁగంది గుఱి యించుకయుఁ గానక చ;
లించి నిలిచెన్ గళవళించి భయవృత్తిన్.

టీకా:

ఇంచువిలుకాడు = మన్మథుడు; ఇంచు = చెఱకు; వెస = వేగము; తమకము = మత్తు; ఇనుమడించి = రెట్టింపై; గుణము = అల్లెత్రాడు; దివిజారి = సూర్యుని శత్రవు, కలువపూలు; అలయించి = ఎక్కుపెట్టి; కడిమి = అతిశయము; గమకించి = ప్రయత్నించి; పంచముఖుడు = ఐదుమోముల వేలుపు, శివుడు; సమంచితము = అంచితము, ఒప్పిదము; ఆలోకించి= చూసి; వెఱగంది = భయపడి, బెదరి; యించుక = కొంచెము; కళవళము= కలవరము.

భావము:

మదనుడు వేగముగా తనచెఱకు విల్లును చూసుకుని ఉబ్బిపోయాడు; తమకం ఇనుమడించిది; అల్లెతాడు మ్రోగించి, కలువపూలబాణం ఎక్కుపెట్టాడు; ఆ పూలబాణమును లాగిపెట్టి గట్టిగా సంధించి శివునిపై వేబోయాడు’ తన మనస్సులో పరమశివుని మానసిక యొప్పిదమును కాంచి బెదిరాడు గురి కుదరక వణకి కలవరముతో నిలబడిపోయాడు. భయముతో....

2-101-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విలు జూచున్ వెలిజూచుఁ జూచు సురలన్ విశ్వేశ్వరుం జూచుఁ గొం
మందుం దలపోయఁజొచ్చుఁ గడిమిన్ ర్వీకరాలంకృతో
జ్జ్వవిభ్రాజితనిత్యనిర్గుణతపోవారాన్నిధం జెచ్చెరం
పం జూచుఁ గలంపలేక తలకుం గామండు నిశ్చేష్టుఁడై.

టీకా:

వెలి = బయటకు; విశ్వేశ్వరుడు = శివుడు; కొందలమందు = కలతపడు; కడిమిన్ = అతిశయము; దర్వీకరము= పాము పడగ; విభ్రాజితము = మిక్కిలి ప్రకాశవంతమైన; నిర్గుణ = గుణరహితుడు; వారాన్నిధి = సముద్రము; జెచ్చెర = వేగము, శీఘ్రము; తలకు = వణకు; నిశ్చేష్టుడు= చేష్టలుడిగినవాడు.

భావము:

మన్మథుడు తన చెరుకు విల్లును చూస్తాడు. పైకి చూస్తాడు. దేవతలను చూస్తాడు. శివుని చూస్తాడు. కంగారు పడతాడు. ఆలోచనలో పడతాడు. చివరికి పాము పడగలను అలంకారంగా ధరించి ఉజ్వలంగా ప్రకాశిస్తున్న నిర్గుణ తపో సముద్రుని శీఘ్రంగా కదపాలని చూసిన ఆ మన్మథుడు కదపలేక ఏమీ చేయలేక నిశ్చేష్టుడై వెనుదీసాడు.

2-102-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అం శివార్చన సేయగఁ
గాంతాతిలకంబు శైలన్నియ వచ్చెన్
కంతునిదీపమొ యనఁగా
నెంయు లావణ్యమున మహేశ్వరుకడకున్.

టీకా:

శైలకన్నియ = పార్వతి.

భావము:

అంతలో శివుని సేవించుటకు పార్వతితీకాంతారత్నం, మన్మథుని దీపమా యన్నట్లు, ఎంతో లావణ్యముతో మహేశ్వరుని వద్దకు చేర వచ్చెను.

2-103-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గిరినందన డాయం జని
రుదుగ మఱి పూజసేయ త్తఱి మౌళిన్
గిరిజ కరంబులు సోఁకినఁ
మేశుని చిత్త మెల్లఁ రవశ మయ్యెన్.

టీకా:

డాయంజను = దగ్గరకుచేరు; అరుదుగ = అపురూపంగా; అత్తఱి = ఆసమయంలో;గిరిజ శివుని దగ్గరకు వెళ్ళి అపురూపంగా పూజ చేయుచున్నది. ఆ సమయంలో శివునకు గిరిజ చేతులు తాకగా పరమేశుని మనసంతా పరవశించెను. మౌళి = శివుడు; సోకిన= తగిలిన.

భావము:

గిరిజ శివుని దగ్గరకు వెళ్ళి అపురూపంగా పూజ చేయుచున్నది. ఆ సమయంలో శివునకు గిరిజ చేతులు తాకగా పరమేశుని మనసంతా పరవశించెను.

2-104-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆ సమయంబున.

భావము:

ఆ సమయంలో

2-105-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

టంకారధ్వని నింగినిండ వెడవింటం పుష్పబాణంబుని
శ్శంకంబూని సురేంద్రు కిచ్చిన ప్రతిఙ్ఝాసిద్ధిగాఁజేసి తాఁ
గింన్విల్లెగఁదీసి గౌరి శివునిం గేలెత్తి పూజించుచో
హుంకారించుచు నీశు నేసె మదనుం డుజ్జృంభసంరంభుఁడై.

టీకా:

టంకారము = నారి శబ్దము; నిశ్శంక = అనుమానం లేకుండా; సిద్ధిగాజేయు = నెరవేర్చు; కింకను = కోపముతో; కేలు = చేయి; జృంభము = ఒళ్ళువిరుచుకొను, వికాసము; సంరంభం = వేగిరపాటు.

భావము:

గౌరీదేవి శివుని చేయెత్తి పూజించు ఆసమంయలో, ఇంద్రునికిచ్చిన ప్రతిజ్ఞ నెరవేర్చుటకు మన్మథుడు కినుకతో విల్లును పైకిలేపాడు; నారి ధ్వని ఆకాశంలో వ్యాపించింది; వికసించిన వేగిరపాటుతో, నిశ్శంకగా శీఘ్రమే శివునిపై పుష్ప బాణము వేసెను .

2-106-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుం డేసిన బాణము
హృయంబునఁ గాడి పార నీశుఁడు దన్నున్
చెరించె నెవ్వఁ డక్కడ
చిత్తుఁడు ఘోరకర్మమానసుఁ డనుచున్.

టీకా:

గాడిపారు = గాయంచేయు.

భావము:

మదనుడు వేసిన బాణము మనసును గాయపరచగా ఈశ్వరుడు “ఎవడక్కడ? నన్ను చలింపచేసాడు; ఘోరపాపియైన ఆ మదచిత్తుడు ఎవడువాడు?”

2-107-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సియు నంతటఁ దనియక
భాసిలి వెండియును బుష్పబాణము నారిం
బోసిన మానససంభవు
నీశుఁడు గను విచ్చి చూచె నెవ్వఁ డొ యనుచున్.

టీకా:

ఏసియు = బాణము వేసికూడా; తనియు = తృప్తిచెందు; భాసిలు = ప్రకాశించు; వెండియును = మరియు; మానససంభవుడు = మన్మథుడు.

భావము:

(మన్మథుడు శివునిపై) బాణము వేసినా కూడా తృప్తి పడక ఇంకొక పుష్పబాణమును ప్రకాశించి నారిని సంధించాడు ఆ మన్మథుని ఈశ్వరుడు ”ఎవరా?” యని కన్నులు విప్పి చూసాడు.

2-108-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు చూచిన.

2-109-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కుశైలంబులుభేదిలన్ జలనిధుల్కోలాహలంబైవెసం
లఁగన్దిక్కులుఘూర్ణిలన్ జగములాకంపింపవిశ్వంభరా
స్థ మల్లాడనభస్థలిం గరుడగంర్వామరాధీశ్వరుల్
లుమాఱుంబెగడొందఁజుక్క లురలన్బ్రహ్మాదులున్భీతిలన్.

టీకా:

కులశైలంబులు = కులపర్వతములు; భేదిలన్ = పగులగా; జలనిధులు = మహాసముద్రాలు; కోలాహలం = కలకలం; వెసంగలగ = వేగము కలుగగా; ఘూర్ణిలన్ = ప్రతిధ్వనించగా; కంపించు = వణకు; విశ్వంభరాస్థలము = భూమి; అల్లాడు = ఊగు; నభముస్థలి = ఆకాశము; బెగడు = భయపడు; భీతిల్లు = భయపడు.

భావము:

(అలా శివుడు మూడవ కన్ను తెరవడంతో,) కుల పర్వతాలు బీటలువారాయి; సముద్రాలు ఎగిసిపడ్డాయి; దిక్కులు ప్రతిధ్వనించాయి’ లోకాలు అల్లల్లాడాయి; భూమి కంపించింది; స్వర్గంలో గరుడులు, గంధర్వులు, దేవతలు మిక్కిలిగా భయపడుతున్నారు; నక్షత్రాలు రాలుతున్నాయి. బ్రహ్మాదులు భయపడుతున్నారు.

2-110-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భుభుగ యను పెను మంటలు
భగ మని మండ నంత బ్రహ్మాండంబున్
దిగుదిగులు దిగులుదిగు లనఁ
దెగి మరుపైఁ జిచ్చుకన్ను దేవుఁడు విచ్చెన్.

టీకా:

పెను = పెద్ద; తెగ = విధము; చిచ్చుకన్నుదేవుడు= అగ్నినేత్రం అయిన మూడవ కన్నుకల శివుడు, ముక్కంటి; విచ్చు= విప్పు, తెరచు.

భావము:

భుగభుగమంటూ పెద్ద పెద్ద మంటలు భగభగమని మండెను. దానితో బ్రహ్మాండమంతా దిగులు దిగులుగా యుండెను. ఈ విధముగా మహాదేవుడు పరమశివుడు తన అగ్నినేత్రాన్ని మదనునిపై తెరిచెను.

2-111-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దిక్కు లెఱ మంటఁ గప్పెను
మిక్కిలిగా మింట నెగయు మిడుఁగురు గములున్
గ్రక్కదలి రాల వడిగాఁ
జుక్కలు ధరఁ బడఁగ మింట సురలుం గలఁగన్.

టీకా:

ఎఱమంట = ఎర్రనిమంట; మిన్ను= ఆకాశం; గ్రక్కదలు = ఎక్కువగా కదలు; కలగు= కలతచెందు.

భావము:

(అలా శివు మన్మథునిపై మూడవకన్ను తెరవడంతో,) మిడుగురులు (అగ్నికణాలు) గుంపులు గుంపులుగా వేగముగా కదలుచూ రాలగా, చుక్కలు వేగముగా భూమిపై రాలి పడగా, ఆకాశంలో దేవతలు కలత చెందగా. దిక్కులను ఎర్రనిమంట కప్పివేసెను. మంటలు ఆకాశానికి ఎగయుచుండెను.

2-112-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత.

2-113-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లహంసములతోడ గండుగోయిలలతో;
మేలైన కమ్మ దెమ్మెరల తోడ;
చిలుకల గములతో రుల తేరుతో;
రము పూన్చిన శరానముతోడ;
పుష్పహారములతోఁ బుష్పవస్త్రములతోఁ;
నరారు మకరకేనముతోడ;
పువ్వులజోడుతోఁ బువ్వులదొనలతోఁ ;
గొమరారు చిగురాకుగొడుగుతోడ;
2-113.1-ఆ.
ఱియుఁ దగినయట్టి హితశృంగారంబు
తోడఁ గూడి వేగఁ దూలి తూలి
శివుని నుదుటికంటి చిచ్చుచే సుడివడి
పంచవింటిజోదు స్మమయ్యె

టీకా:

అలరులు = పుష్పములు; శరాసనము = ధనుస్సు; తనరారు = అతిశయించు; జోడు = కవచము; దొన = అమ్ములపొది; కొమరారు = అందముగనుండు; మహిత = గొప్ప; తూలు = ఊగు, తూలిపడుట; జోదు= శూరుడు.

భావము:

కలహంసలతో, గండుకోయిలలతో, మలయమారుతాలతో, చిలుకల గుంపుతో, పూలరథంతో, శరము పూన్చిన ధనుస్సుతో, పూలమాలలతో, పూలవస్త్రములతో, అతిశయించే మీనధ్వజముతో, పూల కవచముతో, పూల అమ్ములపొదితో, అందమైన చిగురుటాకుల గొడుగుతో ఇంకను తగినట్టి గొప్ప శృంగారముతో వేగముగా వచ్చిన పంచబాణముల శూరుడు మన్మథుడు, శివుని నుదుటి కంటి అగ్నిచే చుట్టబడి తూలిపడిఅంతటి శూరుడు బూడిదాయెను.

2-114-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హో దారుణతమ మిది
యాహో మరుఁ డీల్గె నీల్గె ని శివమదనో
గ్రావము చూచి మింటను
హాహానాదంబు లిచ్చి మరేంద్రాదుల్.

టీకా:

దారుణము – దారుణతరము -దారుణతమము; ఈల్గు= చనిపోవు; ఆహవము= యుధ్ధము.

భావము:

“అయ్యో! మహాదారుణమిది. ఆయ్యయ్యో! మరుడు మరణించె మరణించె.” అంటూ శివ, మదనుల ఉగ్రమైన యుద్ధము చూసి ఆకాశంలో హాహాకారములు చేశారు ఇంద్రాదులు.

2-115-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు న య్యవసరంబున ఫాలలోచనాభీలపావక కరాళజ్వాలావళీ పాత భస్మీభూతుం డై చేతోజాతుండు దెగుటఁ గనుంగొని విస్మ యాకుల చిత్త యై యతని సతి యైన రతీదేవి జల్లని యుల్లంబు పల్లటిల్ల నొల్లంబోయి మూర్ఛిల్లి యల్లన తెలివొంది శోకంపు వెల్లి మునింగి కలంగుచుఁ దొలంగరాని బలు వగల పాలై తూలుచు వదనంబును శిరంబును వదనగహ్వరంబు నందంద మోదుకొనుచు మదనుండు వొలిసిన చోటికి డాయం బోయి యిట్లని విలపింపం దొడంగె.

టీకా:

ఆభీల = భయంకరమైన; పావక = అగ్ని; కరాళ = భయంకరమైన; జ్వాలావళి = మంటలవరుసలు; అపాత = పడుటచే; చేతోజాతుడు = (మనస్సునందు పుట్టువాడు) మన్మథుడు; తెగుట = చనిపోవుట; ఉల్లము = హృదయము; పల్లటిల్లు = చలించు; ఒల్లఁబోలు = చేష్టలుదక్కు; అల్లన = మెల్లగా; వెల్లి = ప్రవాహము; కలంగు = కలతచెందు; తొలంగరాని = దాటరాని; వగలు = కష్టాలు; తూలు = దుఃఖించు; వదనము = ముఖము; శిరము = తల; వదన గహ్వరము = నోరు; అందంద = మరలమరల; ఒలియించు = చంపు; డాయంబోయి= సమీపించి.

భావము:

మరియు ఆ సమయంలో ఫాలలోచనుని భయంకరాగ్నిచే పుట్టిన దారుణమైన మంటలలో బూడిదై మన్మథుడు మరణించాడని చూసి, యాశ్చర్యపోయి మిక్కిలి వ్యాకులత పొందిన అతని భార్య రతీదేవి చల్లని మనసు చలించిపోయింది; ఆమె కుప్పకూలి, మూర్ఛపోయి, మెల్లిగా తెలివొంది శోక ప్రవాహంలో మునిగి కలతచెందింది; తీర్చలేని దుఃఖంతో తూలిపోయింది; మాటిమాటికీ నెత్తి, నోరు మొత్తుకుంటూ, మొహం మొత్తుకుంటూ పొయి మదనుడు బూడిదైన చోటుకు చేరి ఇలా విలపింట సాగింది....

2-116-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హా లరాజ! హామదన! హామథురాయతచారులోచనా!
హా విటలోకమానసనిరంతర తాపలసత్ప్రతాపమా!
హా నజాతనేత్రతనయాయెట డాఁగితి? నాకుఁజెప్పుమా
సేవితమైననీబలముచెల్వము మంటలలోనదాఁగెనో?

టీకా:

వల = కామము; ఆయత = దీర్ఘమైన; చారు = సుందరమైన; విటలోక మానస = విటులమనసులలో; తాపము = బాధ; లసత్ = ప్రకాశమానమైన; వనజాతము = పద్మము; చెలువము = అందము.

భావము:

“హా! కామరాజా! మదనా! మనోజ్ఞమైన, చక్కటి విశాలమైన, కన్నులు కలవాడా! విటులకు ఎడతెగని తాపాన్ని కలిగించే ప్రతాపశాలీ! విష్ణుపుత్రా! ఎక్కడ దాగావు? నాకు చెప్పు. నిను సేవించే నీ బలము, అందము మంటలలో దాగాయా?.

2-117-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టా దేవరకంటిమంటలు నినుం గారించుచో మన్మథా!
చుట్టాలం దలిదండ్రులం దలఁచితో శోకంబునుం బొందితో
ట్టంజాలని శోకవార్థిఁ బడి నీప్రాణేశ్వరిం బిల్చితో?
యెట్టుం బోవఁగలేక మంటలకునై యేమంటివో? మన్మథా!

టీకా:

కట్టా = కటకటా, అయ్యో; దేవర = శివుడు; కారించు = బాధించు; వార్ధి = సముద్రము.

భావము:

కటకటా! మన్మథా! శివుని కంటి మంటలు బాధించునపుడు బంధువులను, తలిదండ్రులను తలచి ఎంత దుఃఖము పొందావో కదా! పట్టరాని శోకసముద్రంలో పడి నీ ప్రాణేశ్వరిని నన్ను పిలిచావో? తప్పించుకొనలోని ఆ మంటలలో పడి ఎంత బాధపడ్డావో?

2-118-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గ్రక్కున రావె నా మదన! కానవె నా వలరాజ! నన్ను నీ
క్కఁదనంబు మోహమును శౌర్యము నేఁగతిఁ దూలిపోయె నీ
వెక్కడఁబోయి తింక నది యెక్కడ నున్నది బాపదైవమా!
క్కట! చెల్లఁబో! కటకటాయిది వ్రాఁతఫలంబు తప్పునే?

టీకా:

దూలిపోవు = నశించు.

భావము:

మదనా! వెంటనే రా. నా వలరాజా నన్ను చూడు. నీ యందము, మోహము, శౌర్యము ఏ విధంగా మట్టిగొట్టుకు పోయాయి? నీ వెక్కడకు పోయావు? ఇంక ఆ పాపపుదైవం యెక్కడ యున్నది? అయ్యో! అయ్యయ్యో! కటకటా! ఇదీ నా తలరాత. తప్పుతుందా?....

2-119-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పొరిఁబొరిఁ బుంఖానుపుంఖంబు లై తాఁకు;
పుష్పబాణము లెందుఁ బోయె నేఁడు;
రేడు జగముల నేపుమైఁ గరగించు;
డిఁది యెచ్చట దూలి గ్రాఁగె నేఁడు;
కాముకవ్రాతంబు ర్వంబు గబళించు;
టంకార రవ మెందు డాఁగె నేఁడు;
విటుల గుండెలలోన విదళించు చిగురాకు;
సంపెటవ్రే టెందు మసె నేఁడు;
1-119.1-ఆ.
నిన్నుఁ గాన నిపుడు నీ వెందుఁ బోయితీ
ప్రాణనాథ! నన్ను బాయఁ దగునె
విరహి చిత్త చోర! విఖ్యాత సుకుమార!
మర శైలధీర! రికుమార!

టీకా:

పొరిపొరి = పదేపదే; పుంఖానుపుంఖములు= ఒకదాని వెంట నింకొకటి; ఈరేడు = పదునాలుగు; ఏపు = బాధ; కడిది = ఆపద; క్రాగు = కాలు; వ్రాతము = సమూహము; రవము = ధ్వని; విదళించు = మొత్తు; సంపెట = (ఇనుమును సాగదీయు పెద్ద సుత్తి) సమ్మెట; వ్రేటు = దెబ్బ; అమరశైలము = మేరు పర్వతము.

భావము:

ఓ ప్రాణనాథా! విరహుల మనస్సు దోచేవాడా! ప్రసిద్ధి పొందిన సుకుమారువాడా! మేరు పర్వతము అంతధైర్యము కలవాడా! శ్రీహరిపుత్రా! నన్ను యిలా వదలి పోవచ్చునా? పదేపదే ఒకదానిమీదొకటి తాకే నీ పుష్పబాణములు ఈనాడు ఏమైపోయాయి? చతుర్దశ భువనాలనూ బాధించి మైమరపించే నీ అసాధ్యసామర్థ్యము నేడిచ్చట మట్టిలో కాలిపోయిందా? విటుల గర్వమును కబళించే నీ వింటినారి ధ్వని నేడెక్కడ దాగింది? విటుల గుండెలమీద మోదే నీ చిగురాకు సమ్మెటదెబ్బ నేడు నశించిందా? నేను నిన్ను కనలేకపోతున్నాను. నీవెక్కడకు పోయావయ్యా?మన్మథా

2-120-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వాక నిఖిల జనంబుల
నీసమున సతులఁ బతుల నేచి కలంపన్
నేరిచి శివునిఁ గలంపఁగ
నేరువలే వైతి మదన నిన్నే మందున్.
2-121-శా.
ల్లిందండ్రియుఁ దాతయుం గురుఁడునుం దైవంబు నా ప్రాణమున్
ల్లంబందున నీవె కాఁ దలచి నే నొప్పారగాఁ నియ్యెడన్
జెల్లంబో నిను నమ్మియుండఁగను వే శ్రీకంఠుపై వచ్చి నీ
పొల్లై పోవుట నేనెఱుంగుదునె నీ పుణ్యంబు లిట్లయ్యెనే.

టీకా:

వారక = ఎడతెగక; నిఖిలజనంబు = అందరులోకులు; ఏచు= బాధించు.
ఒప్పారు = చక్కగానుండు; చెల్లబో = అయ్యో; వే= వేగముగా; పొల్లుపోవు = అబద్ధమైపోవు, వ్యర్థమైపోవు.

భావము:

ఎప్పుడూ సకల లోకాలలోని భార్యాభర్తలను, నీ శృంగార రసముచే నేర్పుగా కలచేవాడివి. శివుని కలచుట నేర్వలేకపోయావా? మదనా! నిన్నేమనాలి?
తల్లి, తండ్రి, దాత, గురువు, దైవము, నా ప్రాణము నీవే కదా యని నా మనసున తలచి నీ యందు చక్కగా నమ్మియుండగా శివునిపైకి వచ్చి నీవు మసైపోతావు అనుకోలేదయ్యా! అయ్యో! నీవు చేసిన పుణ్యాలన్నీ యిలా అయిపోయాయా?..

2-122-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ల్లులు పుణ్యగేహినులు దండ్రులు పుణ్యజనంబులంచు నా
యుల్లమునందు నేఁ దలతు నోసురగేహినులార! మీరు నా
ల్లులు నేను గూఁతురను ర్మపు నోములదానఁ గాన మీ
ల్లుని నిచ్చి నన్మరల నైదువఁ జేయరె మీకు మ్రొక్కెదన్.

టీకా:

గేహిని = ఇల్లాలు; ఉల్లము = మనస్సు; ధర్మము = పుణ్యము; ఐదువ = మాంగల్యము గల స్త్రీ.

భావము:

ఓ దేవతలారా! మిమ్మల్ని తల్లులు పుణ్యసతులు, తండ్రులు పుణ్యమూర్తులు అంటూ నా మనస్సులో తలుచుకుంటూ యుంటాను. ఓ దేవలోకపు ఇల్లాళ్ళారా! మీరు నా తల్లులు. నేను కూతురను. పుణ్యమైన నోములు నోచినదానను. కావున మీ యల్లుని బ్రతికించి యిచ్చి నన్ను మరలా ముత్తైదువగా చేయండి. మీకు నమస్కరిస్తాను.

2-123-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేతలార! మీకొఱకు ధీరగతిం వెడవింటిజోదు దా
దేరచేతఁ జచ్చె వనదేవత లెల్లను సాక్షి నాకు నా
దేర మీకు నీఁదగవు తెల్లముగా శివుఁ గొల్చి యిచ్చినన్
గారె ప్రోవరే వగపు గ్రక్కునఁ బాపరె మీకు మ్రొక్కెదన్.

టీకా:

వెడ = అల్పము; తగవు = న్యాయము; తెల్లము = స్పష్టము.

భావము:

దేవతలారా! మీకోసం నా భర్త మన్మథుడు ధైర్యంగా తన చిన్ని విల్లుతో శూరుడు వెళ్ళి తాను పరమేశ్వరుని వలన మరణించాడు. వనదేవతలంతా సాక్షి. నాకు నా ప్రభువును ఇచ్చుట న్యాయము. చక్కగా శివుని కొలిచి రక్షించండి. వెళ్ళండి. నాబాధను త్వరగా పోగొట్టండి. మీకు నమస్కరిస్తాను.

2-124-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

 లరాజుభార్యను, నుపేంద్రుని కోడల శంభుచేత నా
దేరఁ గోలుపోయి కడుదీనత నొందుచునున్నదానఁ రం
డో వినువీథినున్న ఖచరోత్తములార! దిగీంద్రులార! రం
డో నవాసులార! వినరో మునులార! యనాథవాక్యముల్.

టీకా:

ఏ = నేను; వలరాజు = మన్మథుడు; ఉపేంద్రుడు = హరి; శంభుడు = శివుడు; వినివీథి = ఆకాశం; వనము = అడవి; వనవాసులు = తాపసులు; ఖచరులు= ఆకాశంలో విహరించేవారు, దేవతలు; దిగీంద్రులు = దిక్పాలకులు; అనాథ = భర్తలేని.

భావము:

నేను మన్మథుని భార్యను. హరి కోడలిని. శివునివలన నా పతిని పోగొట్టుకొని చాలా దీనతను పొందుతున్నదానిని. రండి. ఓ! వినువీధిలో ఆకాశంలో విహరించే దేవతలారా! దిక్పాలకులారా! రండి. ఓ! వనవాసులారా! ఓ!మునులారా! అనాథనైన నా మొర వినండి.

2-125-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పురుష బిక్షము వెట్టి పుణ్యంబు సేయరే;
పము సేయుచునున్న పసులార!
ర్మ మెంతయు భర్తృదానంబు సేయరే;
దివి నున్న యింద్రాది దివిజులార!
నా వల్లభుని నిచ్చి న్ను రక్షింపరే;
లలెత్తి చూచి గంర్వులార!
దిక్కుమాలినదాన దిక్కయి కావరే;
ర్మమానసు లగు తండ్రులార!
2-125.1-తే.
మర శరణంబు వేడెద న్నలార!
ధిపుఁ గోల్పడి కడుదీన నైనదానఁ
రుణఁ గావంగ నింక నెవ్వరును లేరు
పుణ్య మౌను మొరాలించి ప్రోవరయ్య.

టీకా:

అమర = వేల్పు; అధిపు = ప్రభువు, భర్త..

భావము:

తపము చేస్తున్న తపసులారా! పతిభిక్ష పెట్టి పుణ్యం చేయండి. స్వర్గంలోనున్న ఇంద్రాది దేవతలారా! భర్తృదానము యెంతో పుణ్యమది చేయండి. గంధర్వులారా! తలలెత్తి చూచి నా వల్లభునిచ్చి నన్ను రక్షించండి. ధర్మ మానసులైన తండ్రులారా! దిక్కమాలినదానిని. దిక్కయి కాపాడండి. వేల్పులారా! శరణమంటున్నాను. అన్నలారా! ప్రభువును కోల్పోయి చాలా దీనురాలినయ్యాను. నన్ను కరుణించడాని కింకెవరూ లేరు. పుణ్యముంటుంది. నా మొరవిని నన్ను కాపాడండి.

2-126-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రారే; యేడుపు మాన్పరే; మధురిపున్ ప్పింపరే; కావరే;
పోరే కుయ్యెరిగింపరే సిరికి నాపుణ్యంబు విన్పింపరే;
తేరే దేవర వేడి నా పెనిమిటిన్ దీర్ఘాయుషోపేతుగా
నీరే] మంగళసూత్రబంధనము మీ కెంతేని పుణ్యంబగున్.

టీకా:

ఏడుపు = రోదనము; మధురిపుడు = విష్ణువు; కుయ్యో = ఆర్తనాదాన్ని వ్యక్తం చేసే ధ్వని, మొర; ఎఱిగించు = తెలియచేయు; సిరి = లక్ష్మీదేవి; పుణ్యము = సుకృతము; వేడు = ప్రార్థించు; దీర్ఘాయుషు = చిరకాలము బ్రతుకు; ఉపేతి = కలిగియుండుట.

భావము:

రండి. నా ఏడుపు మాన్పించండి. విష్ణువును పిలవండి. అయ్యో! వెళ్ళి లక్ష్మక్ష్మీదేవికైనా చెప్పండి. నా సుకృతాన్ని వినిపించండి. శివుని ప్రార్థించి చిరకాలం బ్రతికేలా నా ప్రభువును తెండి. నా మంగళసూత్రం నాకీయండి. మీకెంతైనా పుణ్యముంటుంది.

2-127-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రమేశుఁ డనియెడి డమటి కొండపైఁ
సుమబా ణార్కుండు గ్రుంకె నేఁడు
గౌరీశుఁ డనియెడు గంభీర వార్థిలో
రిగి మన్మథ కలం విసె నేఁడు
ఫాలాక్షుఁ డనియెడి డబానలములోనఁ
గంధర్ప కాంభోధి గ్రాఁగె నేఁడు
లహరుఁ డనియెడు హిత మార్తాండుచే
ద నాంధకారము మ్రగ్గె నేఁడు
2-127.1-ఆ.
నేఁడు మునుల తపము నిష్కళంకత నొందె
నేఁడు యతుల మనసు నిండి యుండె
నేఁడు జగము లెల్ల నిర్మలాత్మక మయ్యె
నేమి సేయ నేర్తు నెందుఁ జొత్తు.

టీకా:

అర్కుడు = సూర్యుడు; క్రుంకు = అస్తమించు; వార్థి = సముద్రము; అవియు = పగులు, బద్దలగు; బడబానలము = సముద్రంలో ఉండే అగ్ని; అంబుధి = సముద్రము; క్రాగు = కాగు, ఆవిరి యగు; మలహరుడు = శివుడు; మార్తాండుడు = సూర్యుడు; అంధకారము = చీకటి; మ్రగ్గు = అణగు.

భావము:

పరమేశ్వరుడనే పడమటి కొండపై కుసుమబాణుడనే సూర్యుడు అస్తమించాడు. గౌరీశుడనే లోతైన సముద్రంలోనికి వెళ్ళి మన్మథుడు అను పడవ బద్దలైది పొంగింది. ఫాలాక్షుడనే బడబానలముచే కందర్పుడనే సముద్రం మరగిపోయింది. మలహరుడనే గొప్ప సూర్యునిచే మదనుడనే చీకటి అణగిపోయింది. నేటి నుండి మునుల తపస్సులకు కళంకం లేదు. నేడు సన్యాసుల మనసు (భక్తితో) నిండిపోయింది. నేడు లోకాలన్నీ నిర్మలమైన మనసుతో యున్నాయి. ఇంక నేనేమి చేయగలను? ఎక్కడకు పోగలను?..

2-128-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఱిముఱిఁ జిన్ననాఁడు చెలులందఱు గొల్వగఁ గూడియాడ నీ
చిఱుతది పుణ్యకాంత యని చేతుల వ్రాఁతలు చూచి పెద్ద లే
మెఱుగుదు మంచు చెప్పుటలు యెంతయు తథ్యము గాకపోవునే
యెఱుకలు మాలి పోఁ బిదప నే విలపించుట తెల్లమయ్యెఁ బో.

టీకా:

అఱిముఱిన్ = తరచుగా, దట్టంగా; చిఱుతది= చిన్నది; ఎఱుగుదుము= తెలుసును; తథ్యము= సత్యము; ఎఱుకలు= తెలియడాలు; మాలిన= పనికిమాలిన; పిదప= తరువాత; తెల్లము= స్పష్టము.

భావము:

బాల్యంలోసేవిస్తున్న స్నేహితురాండ్రుతో కలసి అస్తమానూ యాడుచుండగా, హస్తసాముద్రికం తెలిసిన పెద్దలు చూసి, “ఈ చిన్నది నిశ్చయంగా పుణ్యకాంత” యని చెప్పినవన్నీ నిజం కాదేమో? అదంతా తెలివితక్కువ మాటలేనేమో. తరువాత ఇప్పుడు నేను దుఃఖించుటంతో అది స్పష్టమయ్యింది యేమో.

2-129-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చిత మార్గంబున నుపలాలనము జేసి;
యెలమి రక్షించువా రెవ్వ రింక
టవారు నిటవారు య్యేడుగడయు నై;
యెలమి నన్నేలువా రెవ్వ రింక
లీల నర్థించిన లే దని పలుకక;
యిష్టంబు లిచ్చువా రెవ్వ రింక
ర్ణంబులకు నింపు గా నిష్ట వాక్యంబు;
లేపారఁ బల్కువా రెవ్వ రింక ఉచిత మార్గంబున నుపలాలనము జేసి;
యెలమి రక్షించువా రెవ్వ రింక
టవారు నిటవారు య్యేడుగడయు నై;
యెలమి నన్నేలువా రెవ్వ రింక
2-129.1-ఆ.
నేఁడు నాథ! నీవు నీ ఱైన పిమ్మట
తివిరి నన్నుఁ గావ దిక్కు లేమి
లఁపులోనఁ దలఁపఁ గ దయ్యె చెల్లబో
వీరమాకళత్ర! విష్ణుపుత్ర!

టీకా:

ఉచిత = తగిన; ఉపలాలనము = బుజ్జగించు; ఎలమి = ప్రేమ; ఏడుగడ = (గురువు,తల్లి,తండ్రి, పురుషుడు,విద్య, దైవము, దాత యని సప్త ప్రకారములు గల) రక్షకము; ఏడుగడ = సమస్తము; లీల = విలాసము; అర్థించు = కోరు; కర్ణములు = చెవులు; ఏపారు = అతిశయించి; నీరగు = నశించు, మరణించు; తివిరి = ప్రయత్నించి; వీరసూ = వీరుని కన్నతల్లి; కళత్రము = భార్య.

భావము:

నాథా! మన్మథా! నీవు పోయాక, ఇప్పుడు నాకు, చక్కగా బుజ్జగించి ప్రేమగా రక్షించువారెవరింక? అత్తవారు, పుట్టింటివారు అందరూతానేయై ప్రేమగా నన్నేలువారెవరింక? విలాసంగా అడిగినా లేదనక ప్రియముగా నిచ్చు వారెవ్వరింక? చెవులకింపుగా ప్రియ వాక్యములు పలుకువారెవ్వరింక? నన్ను కోరి రక్షించే దిక్కెవ్వరు? అయ్యో! నాకు వీరమాత కావాలని అనుకోడానికి కూడా అవకాశంలేదు కదయ్యా!

2-130-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంజ! నే నను మాటలు
వెంలి యై వినవె కాక వేగమ నీకుం
సంరరంగములోపల
గంగాధరుఁ గవయఁ దరము గాదంటిఁ గదే.

టీకా:

అంగజుడు = మన్మథుడు; వెంగలి = అవివేకి; కవయు= ఎదిరించు.

భావము:

మన్మథా! యుద్ధములో శివుడిని యెదిరించుట నీ తరం కాదని చెప్పాను కదయ్యా! నేను చెప్పిన మాటలు అవివేకివై వినలేదు నువ్వు.

2-131-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కొదిన్ మీఱిన శంభుయోగ శరధిం గుప్పింప రాదంటిఁగాఁ
లోనైనను నొప్పనంటి భవుఁదాఁకన్ వద్దువద్దంటి దు
ర్భమై యూరకవచ్చి శూలి రుషకుంబాలైతివే యక్కటా!
తొలి నేనోచిననోములిప్పుడు భవద్దూరంబు గావించెనే.

టీకా:

కొలది = పరిమితి, శక్యము; ఒప్పు = తగు; దుర్బలము = బలహీనము; రుష = కోపము; పాలు = వశము; భవత్ = (మీరు)నీవు.

భావము:

వలనుమీఱి నీకు శివయోగిపై బాణములు కుప్పించరాదన్నాను కదా! కలలోనైనా ఒప్పుకోనన్నాను. శివుని తాకవద్దు తాకవద్దన్నాను. యూరకవచ్చి శివుని కోపము బారిన పడ్డావే. అయ్యో! నేను నోచిననోములిపుడు నిన్ను నాకు దూరం చేసాయా?....

2-132-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్పుడు గోపించి యెనయంగ యోగంబు;
మానునో యీయంగ మాయ గొంత
యెప్పడు మరుని దా నీక్షించి తెలిసెనో;
ధృతిఁ బుట్టువులు లేని తిరిపజోగి
యెప్డు విజృంభించి యెఱమంట లెగయంగ;
ముక్కన్ను దెఱచెనో ముదుకతపసి
యెప్పుడు గృపమాలి యెప్పుడు గాల్చెనో;
కులగోత్రములు లేని గూఢబలుఁడు
2-132.1-ఆ.
నుచు నెంత వైర నుచు నెద్దియుఁ జూడ
నుచు మదనువనిత వనిమీఁద
మూర్చవోయి తెలిసి మోమెత్తి బిట్టేడ్చెఁ
డఁగి శోకవార్థి డలుకొనఁగ.

టీకా:

ఎనయు= పొందు; మాయ= తొలిదేవర, శివునిలోనే ఉండి, శివుడి ఇచ్ఛ ప్రకారం నడచుకొనే ఒక వృత్తి అని శైవమతానుయాయుల నిర్వచనం. [పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010]; ఈక్షించు= చూచు; ధృతి= భోగము; తిరిప= అడుక్కొనేవాడు; ముదుక= వృద్ధుడు; గూఢ= దాచబడిన; అవని= నేల; బిట్టు= మిక్కిలి; కడంగు= వలె; వార్ధి= సముద్రము; గడలువడుడు= చెవుల్లోకి నీళ్ళుపోయి ఒకరకంగా శబ్దం రావడం.

భావము:

ఈ తొలిదేవర శివుడు ఎప్పుడు కోపంతో కొంత యోగమును విడిచిపెడతాడో కదా! ఈ పుట్టుకలు లేని ఆదిబిక్షువు ఎప్పుడు మరుని చూసి గుర్తించాడో? ఈ వృద్ధ తాపసి ఎప్పుడు విజృంభించి యెఱ్ఱని మంటలు యెగయగా మూడోకన్ను తెఱిచాడో? కులగోత్రాలు లేని గూఢబలుడు జాలి యన్నది లేకుండా ఎప్పుడు కాల్చాడో?” అంటూ “అంత శతృత్వమా? ఏమీ చూసుకో” డంటూ శోకసముద్రంలో మునిగి నేలపై పడి మూర్ఛపోయి తెలివితెచ్చుకునిన రతీదేవి ముఖమెత్తి బిగ్గరగా యేడ్చెను.

2-133-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నత్యంత దురంత సంతాప చింతాక్రాంత యై అంత కంతకు నక్కాంతాతిలకంబు మహాశోకవేగంబున.

టీకా:

దురంతము = అంతులేనిది; చింతాక్రాంత = బాధలో మునిగినది.

భావము:

ఇంకనూ అంతులేని బాధానిమగ్నమైన ఆ రతీదేవి బాధతో..

2-134-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మెఱుఁగుఁదీఁగెయుఁ బోలు మైదీఁగె నులియంగ;
పడి వలికి లోఁ బొలువెట్టు
కోకద్వయముఁలోని కుచకుంభములు గంద;
లినాక్షి కరతాడనంబు సేయు
నీలాలగతిఁ బోలు నీలంపు టలకలు;
ముడివడ యూచి మమ్ముదిత యేడ్చు
ల్హారములఁ బోలు న్నులు గతిచెడఁ;
మలాక్షి కడు నశ్రుణము లొలుక
2-134.1-తే.
ఇంతి విలపించు నత్యంత మేడ్చుఁ బొక్కు
ధిప చనుదెంచి కావవె నుచుఁ జివుకు
స్రుక్కు మూర్ఛిల్లు దెలివొందు సురలఁ దిట్టు
గువ యెంతయు సంతాప గ్న యగుచు.

టీకా:

మెఱగుదీగె = మెరుపుతీగ; మైదీగె = తీగవంటి శరీరము; నులియు = నలుగు; పదపడి = మఱియు, తరువాత; వలి = చలి; పొదలువెట్టు = వర్థిల్లు, పెరుగు; కోకద్వయము = రెండు వస్త్రములు; పోని = పోలిన; కుచకుంభములు = స్తనములు; తాడనము = కొట్టుట; అలకలు = ముంగురులు; కల్హారము = కొంచెము ఎరుపు కలిగి మిక్కిలి పరిమళము గల కలువ; అశృకణములు = కన్నీరు; పొక్కు = దుఃఖించు; చివుకు = మనసు కలతచెందు; స్రుక్కు = భయపడు; మూర్ఛపోవు = సొమ్మసిల్లు; మగ్న = మునిగినది.

భావము:

దుఃఖములో మునిగిన ఆ రతీదేవి మెరుపు తీగె వంటి శరీరం నలిగిపోయేలాగ, మరింత పెరుగుతున్న చలికి వస్త్రద్వయము నందలి కుచకుంభములు కందేలా చేతితో బాదుకుంటోంది. ఆ రతీదేవి నీలాలవంటి నీలంపు ముంగురులు చిక్కులు పడేలా ఊగిపోతూ ఏడుస్తోంది. కలువకన్నులు కనరేలా కన్నీరు కార్చుతున్నది. రతీదేవి విలపిస్తోంది, హోరున ఏడుస్తోంది, దుఃఖిస్తోంది, కలవరపడుతోంది. “ప్రభూ! వచ్చి కాపాడవా” అంటూ ఆ రతీదేవి కలతచెందుతోంది, భయపడుతోంది, సొమ్మసిల్లిపోతోంది, తిరిగి తెలివితెచ్చుకొని దేవతలను నిందిస్తోంది.

2-135-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తన మనంబున నిట్లనియె.

భావము:

రతీదేవి తన మనసులో ఇలా అనుకుంది.

2-136-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“నిను నేభంగుల బాయఁజాల వనితా! నిర్భేదమం దేమియు
న్మ ప్రాణంబులు రెండు నొక్కటిసుమీ నారీమణీ! నమ్ముమీ
ని కావించిన బాసలన్నియును గల్లయ్యెంగదా లక్ష్మినం
యెవ్వారికినైన దైవఘటనల్ ప్పింపఁగావచ్చునే.

టీకా:

ఏ = ఏ యొక్క; భంగి= విధము; పాయు = విడుచు; నిర్భేదించు = విదారించు, చంపు; బాస = ప్రతిజ్ఞ; కల్ల = అసత్యము; ఘటన = కూర్పు.

భావము:

మన్మథుడా! “ఓ వనితా! నారీమణీ! రతీదేవీ! నిన్ను ఏ విధముగానూ విడిచిపెట్టను చివరకి మన ప్రాణములు రెండూ ఒకటే సుమా! నమ్ము” మంటూ నీవు చేసిన ప్రతిజ్ఞలన్నీ అసత్యాలయ్యాయి కదా! ఎవరికైనా దైవ సంకల్పం తప్పిచుకోవడం సాధ్యం కాదుకదా!

2-137-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని విలపించుచుఁ గుందుచుఁ
చేరువ నున్న యట్టి తాపసవర్యున్
నాథమిత్రు నీశ్వరుఁ
నుఁగొని శోకాతురమునఁ న్నియ పలికెన్.

టీకా:

కుందు = క్రుంగు; వర్యుడు = ఉత్తరపదమైన శ్రేష్ఠుడు; ధననాథుడు = కుబేరుడు; ఆతురము = బాధపడునది.

భావము:

అని దుఃఖిస్తూ క్రుంగిపోతూ తన దగ్గరగా యున్నట్టి తాపసశ్రేష్ఠుడు, కుబేరుని మితృడైన ఈశ్వరుని చూసి శోకముతో బాధపడుతున్న రతీదేవి ఇలా అన్నది.

2-138-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గు నంబిక శంభునిఁ గని
మిమ్మిద్ధఱను గూర్పఁ గు నమ్మరుపైఁ
మీఱఁ గృపఁ దలంపఁక
తెగఁ జిచ్చెరకన్ను మీకుఁ దెరువం దగునే.

టీకా:

తగు = యుక్తమగు (తగిన); తగన్ = సరియగు; పగ = విరోధము; కృప = దయ; తెగ = అతిశయిత.

భావము:

పార్వతీ పరమేశ్వరులను చూసి “యక్తమగు మిమ్ములనిద్దరినీ కలప ప్రయత్నించిన ఆ మన్మథునిపై విరోధమెక్కువై జాలి చూపక అతిశయంతో అగ్నినేత్రం మీరు తెరవచుట తగునా?....

2-139-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తొలి నీవు దుష్టజనులం
బొలియింతువు లోకపతులఁ బోషింతువు నిం
లఁ బొందవు మరు నిట్టులఁ
బొలియించుట నాదు నోము పుణ్యము రుద్రా!

టీకా:

తొలి = పూర్వము; దుష్టులు = చెడ్డవారు; పొలియించు = చంపు; పోషించు = రక్షించు; నింద = అపవాదు.

భావము:

ముందునుండీ నీవు చెడ్డవారిని చంపేవాడివి. లోకపాలకులను రక్షించేవాడివి. అపవాదులు పొందేవాడివి కాదు. మన్మథుని నీవిలా చంపడం, నా నోమముల ఫలము ఈశ్వరా!

2-140-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యేచిన మన్మథు దశశత
లోనుఁ డిటు దెచ్చి నీదు లోచన వహ్నిం
ద్రోచెనె యిటుగా నోచితి
యీ చందము లైన నోము లిప్పుడు రుద్రా!

టీకా:

ఏచు = బాధించు; దశశతలోచనుడు = వేయి కన్నులవాడు, ఇంద్రుడు; లోచనము = కన్ను; లోచనవహ్ని = కంటిమంట; చందము = విధము.

భావము:

రుద్రా! నిన్ను బాధించిన మన్మథుని ఇంద్రుడే ఇలా తీసుకువచ్చి నీ కంటిమంటలలోకి తోశాడు. ఈవిధమైన నోములిప్పుడు నేను నోచాను.”

2-141-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ను మాటలు విని శంభుఁడు
మది నీ వనిత శోకతాపాకుల యై
ను నే మని యాడునొ యని
నియెన్ శీఘ్రమున రజతశైలముకడకున్.

టీకా:

శోకము = దుఃఖము; తాపము = సంతాపము; ఆకుల = చెదరినది; ఆడు = నిందించు; చనియె = వెళ్ళెను; శీఘ్రము = త్వరితము; రజతశైలము = వెండికొండ, కైలాసము; కడకు = సమీపమునకు, వద్దకు.

భావము:

అలా అంటున్న రతీదేవి మాటలు విని శంభుడు తన మనస్సులో ఈవనిత చాలా దుఃఖముతో తననింకా ఏమంటుందోనని వెంటనే వెండికొండ వద్దకు వెళ్ళిపోయెను.

2-142-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంతఁ గంతు చెలికాఁడు వసంతుం డిట్లని విలపింప దొణంగె.

టీకా:

కంతు = మన్మథుడు; చెలికాడు = స్నేహితుడు.

భావము:

అపుడు మన్మథుని స్నేహితుడైన వసంతుడు ఇలా శోకింప సాగాడు......

2-143-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సంతితోడ నావలచుజాణఁడు పాంథజనాపహారి నా
సండికాఁడు నన్వలచు ల్లని యేలిక దేవతార్థ మీ
జంముమీఁదవచ్చి బలసంపద నాతనికంటిమంటలన్
సంరభూమిలో మడిసె య్యన దేహముఁబాసి దైవమా!

టీకా:

సంగతి = చేరిక; జాణడు = నేర్పరి; పాంథజనము = బాటసారులు; సంగడికాడు = స్నేహితుడు; ఏలిక = ప్రభువు; దేవతార్థము = దేవతలకొఱకు; జంగము = పరమాత్మ, శివుడు; సంగరము = యుద్ధము; మడియు = చచ్చు; చయ్యన = శీఘ్రముగా; పాయు = త్యజించు.

భావము:

“స్నేహముతో నేనిష్టపడే నేర్పరి. విట చిత్తములను దొంగిలించేవాడు. నా స్నేహితుడు నన్ను ప్రేమించే చల్లని ప్రభువు. దేవతలకోసం ఈ శివుని పైకి సైన్యముతో వచ్చి యుద్ధభూమిలో శివుని కంటిమంటలతో వెంటనే శరీరము వదలెను కదా. దైవమా!...

2-144-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“శంరజోగిఁదెచ్చి సమసారనివాసునిఁజేయకున్నచో
నంకిలిగల్లు నీ జగమున్నియు నిర్జరకోటితోడ నే
వంకు వ్రాలు నంచు సురల్లభుఁ డక్కట తన్నుఁ బంప మీ
నాంకుఁడువచ్చి నేఁడు త్రిపురాంతకుచే దెగటారెఁ జెల్లఁబో.

టీకా:

జోగి = యోగి; సమసారము = సంసారము; అంకిలిపడు = నశించు; నిర్జర = దేవత; వంక = దిక్కు; సురవల్లభుడు = ఇంద్రుడు; అక్కట = అయ్యో; మీనాంకుడు = చేప గుర్తు ధ్వజమువాడు, మన్మథుడు; త్రిపురాంతకుడు = త్రిపురములను ధ్వంసము చేసిన వాడు, శివుడు; తెగటార్చు = నశింపచేయు, చంపు; చెల్లబో = సంతాపార్థకము.

భావము:

“శంకర యోగిని తెచ్చి సంసారవాసునిగా చేయకపోతే నశించెడి యీ లోకాలన్నీ, దేవతలతో సహా యేమై పోతాయో” యని ఇంద్రుడు పంపగా అయ్యో! ఈ మీన ధ్వజుడు, మన్మథుడు వచ్చి ఈనాడు శివునిచే బుగ్గయిపోయాడే

2-145-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మానిని మదనుని యుద్ధము
గానంగా నేర నైతి కాముఁడు రాఁగన్
దా నేల పాసిపోయితి
భూనుతగుణహారుఁ గోలుపోయితి నకటా.

టీకా:

మానిని = మానము గల ఆడుది, రతీదేవి; కానగు = కనపడు; పాసిపోవు = విడివడు; భూనుతము = ప్రసిద్ధమైన; అకటా = అయ్యో.

భావము:

“అయ్యో! రతీదేవీ! మదనుని యుద్ధము చూడలేకపోయాను. కాముడు రాగా నేనెందుకు కూడా రాలేదు. ప్రసిద్ధమైన గుణములు కలవానిని కోల్పోయాను.” అంటూ వసంతుడు విలపించాడు.

2-146-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని యామని విలపింపఁగ
ని తూలుచు మోదికొనుచుఁ డు వగతోడన్
సిజవల్లభ మఱి దా
విను మని యామినికిఁ బలికె విపు లాతుర యై.

టీకా:

ఆమని = వసంతుడు; కని = చూసి; వగ = శోకము; మనసిజ = మన్మథుడు; వల్లభ = భార్య.

భావము:

అలా విలపిస్తున్న వసంతుని చూసి తూలుతూ మొత్తుకుంటూ యేడుస్తూ యెంతో యాతురపడుతూ వినమంటూ మన్మథుని భార్య వసంతునితో ఇలా పలికింది.

2-147-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్నా! నీ చెలికాఁ డిటు
వెన్నెలధరుమీఁద వచ్చి వేఁగుట నీకున్
న్నుగ నెవ్వరు చెప్పిరి
న్నారఁగ నట్టివేళ గాంచితొ లేదో.

టీకా:

వెన్నెలధరుడు= శశిధరుడు, శివుడు; వేగు = మండు, కాలు; పన్నుగ = ఒప్పునట్లుగా; కన్నారగ = స్పష్టముగా.

భావము:

అన్నా! నీ స్నేహితుడు ఇలా శివుని పైకి వచ్చి కాలిపోవుట నీకు చక్కగా ఎవరు చెప్పారు? స్పష్టముగా ఆవేళ చూసావో! లేదో!

2-148-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తాకు తపో మహత్వము
నాయ దేవతలు నతని యానందంబున్
గౌరీనాయకు కోపము
కోరిక మరుఁ బట్టి భుక్తిఁ గొనియెం జుమ్మీ.

టీకా:

అరయు = తెలిసికొను; మరుడు = మన్మథుడు; భుక్తిగొను = తిను.

భావము:

తారకాసురుని తపోమహత్వమును తెలుసుకొన్న దేవతలు వారి ఆనందము, శివుని కోపము కోరిక అన్నీ కలసి మన్మథుని తినేశాయి.

2-149-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రాణనాథుఁ బాసి ప్రాణంబు నిలువదు
పోవవలయు నాకుఁ బోవకున్న
సురభి! యింక నీవు సొదఁ బేర్చుఁ వేవేగఁ
జిచ్చుఁ జొత్తు గాముఁ జేరవలసి.

టీకా:

పాయు = విడుచు; సురభి = వసంతుడు; సొద = చితి; చిచ్చు = అగ్ని; చొచ్చు = ప్రవేశించు.

భావము:

ప్రాణనాథుని విడిచి ప్రాణముండదు. పోవాలి. పోకపోతే సురభీ! ఇక నీవు త్వరగా చితి పేర్చు. అగ్నిలో ప్రవేశించి కాముని చేరాలి.

2-150-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ల ముఖంబున సతులకు
నుగమనము చేసి దివికి ధిపుఁడు దానుం
నుట మహాధర్మం బని
వినిపించెడి బుధుల మాట వినవే చెపుమా.

టీకా:

అనలము = అగ్ని; సతి = భార్య; అనుగమనము = సహగమనము; దివి = స్వర్గము; అధిపుడు = ప్రభువు, భర్త; బుధులు = పండితులు.

భావము:

అగ్నిలో భార్యలు సహగమనం చేసి, తానూ భర్తా స్వర్గానికి చేరడం గొప్ప ధర్మమని పండితులు చెప్పినమాట వినలేదా? చెప్పు!

2-151-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన వసంతుండు ప్రలాపించు తదీయ ప్రకారంబుల విచారించి సముచిత ప్రకారంబున నిట్లనియె.

టీకా:

ప్రలాపము = అర్థరహిత వాక్యము; తదీయ = తత్సంబంధమైన, ఆమె యొక్క; విచారించి = దుఃఖించి; సముచితము = తగిన.

భావము:

రతీదేవి ఆ విధంగా చేసిన శోక ప్రలాపనలు విని వసంతుడు దుఃఖించి తగిన విధంగా ఇలా అన్నాడు.

2-152-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యేల నిట్లాడెద వేకచిత్తంబున;
నా మాట వినవమ్మ లిననేత్ర!
గౌరినాయకుఁ డింక గౌరీ సమేతుఁ డై;
సుఖ మున్న నింద్రాది సురలు వచ్చి
నీ ప్రాణనాథుండు నిష్పాపుఁ డని చెప్ప;
రలను బడయు దీ రుదుగాఁగ
దిగాక మన్మథుం మరుల పంపున;
జెడినవాఁడును గానఁ జెప్పి బలిమి
2-152.1-ఆ.
విబుధు లెల్ల విన్నవించిన పరమేశ్వ
రుండు భక్తవత్సలుండు గాన
పంచబాణు నిచ్చు భావింపు మిమ్మాట
వెలఁది! నమ్ము నీవు వేయు నేల.”

టీకా:

ఏకచిత్త = ఏకాగ్రతతో, ఒకే విషయంపై మనస్సు నిలిపినవాడు; పడయు = పొందు; అరుదుగాగ = అపూర్వంగా.

భావము:

ఎందుకిలా మాట్లాడుతున్నావు ఒకవైపే ఆలోచించి? నామాట వినవమ్మా! నలిననేత్రా! గౌరీ నాయకుడు గౌరితో కలసి సుఖముగానుంటే ఇంద్రుడు మొదలుగాగల దేవతలు వచ్చి నీ భర్తకు ఏపాపం తెలియదని చెబితే మరలా నీ భర్తను అపూర్వంగా పొందగలవు. అదీగాక మన్మథుడు దేవతలు పంపగా దేవతలకోసం నశించాడు కావున వేల్పులంతా గట్టిగా మనవిచేస్తే పరమేశ్వరుడు భక్తవత్సలుడు కావడం వలన మన్మథుని తిరిగి ఇస్తాడని భావించు. వెలదీ! వేయి మాటలెందుకు? నువ్వు నమ్ము.

2-153-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని పలికిన పలుకులకును
నుగుణ మై యీ ప్రకార గు నిజ మనుచున్
వినువీథి నొక్క నినదము
నుగుణముగ మ్రోసె జనుల కాశ్చర్యముగన్.

టీకా:

అనుగుణము = తగిన; వినువీధి = ఆకాశ మార్గము; నినదము = ధ్వని; మ్రోయు = ధ్వనించు.

భావము:

అంటూ వసంతుడు పలికిన పలుకులకు తగినట్లు ఈవిధముగా నిజంగా జరుగుతాయంటూ ఆకాశవాణి ఒక ధ్వని ధ్వనించింది ప్రజలాశ్చర్య పడునట్టుగా.

2-154-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు పలికిన గగనవాణి పలుకులును వసంతు పలుకులును నాలించి రతీదేవి యిట్లనియె,

టీకా:

గగనవాణి = ఆకాశవాణి; ఆలించు = విను.

భావము:

ఇలా పలికిన ఆకాశవాణి మాటలు, వసంతుని మాటలు విన్న రతీదేవి ఇలా అన్నది.

2-155-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చ్చటినుండి యిందుధరుఁ డిప్పుడు పార్వతిఁగూఁడుఁ గూఁడెఁబో
యిచ్చునె మన్మథుం దివిజు లెప్పుడు చెప్పుదు రిట్టివాక్యముల్
మెచ్చునె లోకముల్ వినిన మేదినిఁ జచ్చినవారు వత్తురే
చెచ్చెర నిప్పుడీ బయలుచెప్పిన మాటలు నమ్మవచ్చునే?

టీకా:

ఇందుధరుడు = శివుడు; దివిజులు = దేవతలు; మేదిని = భూమి; చెచ్చెర = శీఘ్రముగా; బయలు = ఆకాశము, శూన్యము.

భావము:

ఎప్పడినుండి చంద్రశేఖరు డిప్పుడు పార్వతితో కలుస్తాడు? కూడినా మన్మథుని ఇస్తాడా? దేవతలెప్పుడు ఇలాంటి మాటలు చెప్తారు? ఇది విని లోకములు మెచ్చుకుంటాయా? భూమిపై చనిపోయినవారు తిరిగి వస్తారా? ఆకాశవాణి ఆ మాటలు నమ్మవచ్చునా?

2-156-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

 దురాశ పోవిడువు మెన్నితెఱంగులనైనశోకసం
చాలిత చిత్తనై విధవనై గతిమాలిన దీనురాలనై
తూలుచుఁ గాలుచున్ వగల దుస్థితిఁ బొందఁగఁజాలఁ బావక
జ్వాలఁజొచ్చి నా హృదయల్లభు మన్మథుఁ గానఁబోయెదన్.

టీకా:

పోవిడుచు = వదలు; తెఱంగు = విధము; చాలిత = చలింతిన; విధవ = పెనిమిటి లేని యామె; వగ = దుఃఖము; పావక = అగ్ని; చొచ్చు = ప్రవేశించు.

భావము:

ఎందుకు దురాశ? విడిచిపెట్టు. ఇన్ని విధాలుగా శోకచిత్తముతో, విధవనై, దిక్కులేని దానినై, దీనురాలనై, తూలుతూ, రగులుతూ, దుఃఖముతో హీనగతిని పొందడం చాలు. అగ్ని జ్వాలలలో ప్రవేశించి నాభర్తను మన్మథుని చేరుటకు వెళ్తాను.

2-157-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని బహుప్రకారంబుల రతియును వసంతుండును దమలో నుచి తాలాపంబులు పలుకుచున్న సమయంబున.

టీకా:

ఉచిత = తగిన; ఆలాపములు = మాటలు.

భావము:

అలా రకరకాలుగా రతీదేవియును, వసంతుడు తమలో తాము చాలా మాట్లాడుకొనుచున్న

2-158-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“ఏమృగాక్షి! నాపలుకులేటికి? నమ్మవుశూలికొండరా
చూలి వివాహమైన యెడ శోభన మంగళవృత్తినున్నచో
వేలుపులెల్ల నంగజుఁడు వేఁగుటఁ జెప్పినఁ గామునిచ్చు నా
నీగళాంకుఁ డీవిధము నిక్క మటంచు నభంబు మ్రోయుఁడున్.

టీకా:

మృగాక్షి = లేడి వంటి కన్నులు కలది; ఏటికి = ఎందుకు; శూలి = శివుడు; కొండరాచూలి = పార్వతి; అంగజుడు = మన్మథుడు; వేగుట = మండు, కాలిపోవుట; నీలగళాంకుడు = శివుడు; నిక్కము = యదార్థము; నభము = ఆకాశము; మ్రోయు = ధ్వనించు.

భావము:

“ఏమి? మృగాక్షీ! నా మాటలెందుకు నమ్మవు? శివపార్వతుల వివాహమై శుభముగా మంగళకరంగా యుంటారు. దేవతలంతా మన్మథుడు కాలిపోవుటను గూర్చి తెలియచేస్తారు. యా నీలకంఠుడు కాముని ఇస్తాడు. ఇది యదార్థ” మంటూ ఆకాశవాణి పలకడంతో...

2-159-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మిం నశరీరవాణియుఁ
దొంటి విధంబునను బలికెఁ దోయజనేత్రీ!
వింటివె నీ నాయకుఁ డే
వెంన్మరలంగ వచ్చు వికచాబ్జమఖీ!

టీకా:

మిన్ను = ఆకాశము; అశరీరవాణి = దైవవాణి; తొంటి = పూర్వపు.

భావము:

“ఓ పద్మాక్షీ! రతీదేవి! ఆకాశంలో అశరీరవాణి పూర్వము చెప్పినట్లే మరల చెప్పింది. విన్నావా ఎలాగైనా నీభర్త తిరిగి వచ్చును..

2-160-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని మఱియు ననేక విధంబుల నూరడించి వసంతుని పలుకు లగుం గాక యని నత్యంత విహ్వల చిత్తంబున.

టీకా:

విహ్వల = స్వాధీనత తప్పిన, చెదిరిన.

భావము:

అంటూ ఇంకా అనేక రకాలుగా యూరడించిన వసంతుని మాటలకు సరేయని చెదిరిన

2-161-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తంబు నతుల వేదన
తి బొందుచు హృదయకమల ధ్యము నందున్
తిఁ దలఁచి చింత సేయుచు
తి దా వర్తించె నొండు తి లేని గతిన్.

టీకా:

అతుల = సాటిలేని; రతి = ఆసక్తి.

భావము:

రతీదేవి ఎప్పుడూ అంతులేని బాధను పొందుతూ హృదయములో భర్తనుగూర్చి బాధపడుతూ వేరే యాసక్తి యేమీలేకుండా ప్రవర్తించెను.

2-162-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కాముని బిల్చి పెద్దయును గౌరవ మొప్పఁగ బుజ్జగించి సు
త్రాముఁడు శంభుపై బనుప ర్పకుఁడుం జనుదెంచి యేయుచో
సోకళావతంసుఁడును స్రుక్కక మూఁడవకంటిచూపునన్
గాముని నీఱుసేయుట జగంబుల మ్రోయుటయున్నఖండమై.

టీకా:

సుత్రాముడు = ఇంద్రుడు; సోమకళావతంసనుడు = చంద్రశేఖరుడు, శివుడు; స్రుక్కు =

భావము:

మన్మథుని పిలిచి గొప్పగా గౌరవించి బుజ్జగించి ఇంద్రుడు శివునిపైకి పంపగా కాముడు వెళ్ళి పూలబాణము వేసాడు. శివుడుకూడా వెనుదీయక మూడవకంటి చూపుతో కాముని బూడిద చేయుట సమస్త లోకాలకూ అఖండంగా మార్మోగుట జరిగింది.