పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రధమ స్కంధము : కథాప్రారంభము

 •  
 •  
 •  

1-45-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మత్సమర్పితం బగు వితతవిస్ఫురిత వీరభద్రవిజయాంచిత కథా ప్రసంగ ప్రారంభం బెట్టి దనిన; మహిత మాతులుంగ మందార చందన సాల భల్లాతకీ ప్రముఖరాజిత కుంభినీ విరాజితంబును; కురువింద కుందమ హిమ్లాత మధుక శతపత్ర కమల కల్హార కరవీర మల్లి కాది వల్లీ సంఫుల్ల పుష్పవల్లీ లలిత పరిమళ సుగంధబంధుర దిగంతరాళంబును; నిజ విరోధంబుఁ దొరంగినగతి వసియించు చంచరీక శారికా కీరనాకీల చక్రవాక నీలకంఠ కనకనయన కంక నాళలింగ క్రౌంచ కారంభ కారండ కానకపోత పారావత శకుని భరద్వాజ చకోర లావుక జీవంజీవవాయ సారాతి కోయష్టిక డిండిభసార సశాతఖండ నారంగత్పదారంగ గణనాద ప్రమోదితంబును; మండిత గడభేరుండ వేదండ కంఠీరవ శరభ శార్దూల శంబర జంబూక గవయ వరారోహ ప్లవంగ శల్య సారంగ చమరీమృగ గోకర్ణ వృకాది మహామృగ మందిరంబును; దందశూక గాధేయ మార్జాల మూషక నివాసంబును; సకల పుణ్య తరంగిణీ మంగళ సంగమంబును; వినిర్మల సరోవర విలసితంబును; అనుపమ మునినాద నిరంతర బహుళ పాఠ నిఖిల నిగమ కలకలారావ ఘటిత గగన తలంబును; ధర్మ తపోధన ధాన్య దాన తాపసోత్తమ సంతత సంతుష్ట హోమ ధూమ సమ్మిళిత బృందారకాలోకనంబును; సర్వభువన మహారణ్యరత్నంబును; సకల మునిజనస్తోత్ర పాత్రంబును నగు నైమిశారణ్యపుణ్యక్షేత్రంబు నందు.

1-46-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పెనుపగు దీర్ఘసత్ర మను పేరిట యాగము జేసి పుణ్యులై
మును లొక కొంద ఱుత్తములు మోదముతో సుఖగోష్ఠి నుండ న
య్యనిలుఁడు వచ్చి శైవకథ న్నియు నిచ్చలుఁ జెప్పుచుండఁగా
రుచు నొక్కనాఁ డచటి తాపసు లెల్లను వాయుదేవుతోన్.

1-47-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

శైకథా ప్రసంగములు శైవజనంబుల దివ్యకీర్తనల్
శైపురాణసారములు శైవరస్యములున్ మహాయశ
శ్శ్రీర! నీకు మానసము సిద్దము నీ వెఱుగంగరాని యా
శైము లేదు రూపమును సారము నీకు ముఖస్థ మారయన్.

1-48-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

శికథ లెల్ల వేదములచేత నెఱింగిన మేటి వీవ యో
నసురా! సురేంద్రనుత! భాసురపుణ్య! సురాగ్రగణ్య! యా
విళ వీరభద్రవిజయాకర సారసుధారసంబు మా
చెవులకు మన్మనోరథము చెల్వముగాఁ జిలికింపవే దయన్.

1-49-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని మఱియు బహుప్రకారంబుల నమ్మహామునులు సంస్తుతింప న వ్వాయుదేవుం డగణిత సంతోషమానసుం డై యిట్లనియె.

1-50-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దేవాదిదేవుని తెఱఁగిట్టి దందమా
తెఱఁగు లెల్లన బుట్టు తెఱఁగు దాన;
దనమదారాతిఁ దివెద మందమా
దువుల కెల్లను మొలు దాన;
బ్రహ్మాదివంద్యుని రికింత మందమా
బ్రహ్మాదులకు నైన బ్రహ్మ దాన;
దేవతారాధ్యుని దెలిసెద మందమా
తెలిసిన మీఁదటిధృతియుఁ దాన;

1-50.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

యెం యనఁగ నేర్తు నేమని వర్ణింతు
నేది యాది యంత్య మేది యరయ
లమునకు నతని సంతతానందంబు
నెఱిఁగి కొలఁదిసేయ నెట్లుచ్చు?

1-51-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఐనను నానేర్చువిధంబున మీ యడిగిన యర్థంబు సవిస్తరంబుగా వినిపింతు" నని య మ్మహామునులకు వాయుదేవుం డిట్లనియె.

1-52-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

తొల్లి యుగాదు లందు భవదూరుఁడు చంద్రవిభూషణుం డుమా
ల్లభుఁ డాదినాయకుఁడు వాసవవంద్యుఁడు వెండికొండపై
నెల్లఁ గణంబులున్ గొలువ నేర్పునఁ ర్వతరాజపుత్రితో
ల్లలితాత్ముఁ డై సకలసంపదలం గొలువుండె సొంపుతోన్.

1-53-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లు పరమేశ్వరుండు రజతధరణీధరశిఖరంబున నగణ్యరమ్యతర రత్నసింహాసనంబునం గొలు వున్న సమయంబున.

1-54-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రునకుఁ దమ పనులన్నియు
రుసన్విన్నపము సేయలె నని దేవా
సు ముని గంధార్వాధిపు
యఁగఁ గైలాసమునకు రిగిరి ప్రీతిన్.

1-55-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దువులు పెక్కులు గల వా
దువులకును మొదలు నాల్గుదువులు
దువులకు మొదలుగలిగిన
దువులు గల శంభుఁ గొలువఁ దువులు వచ్చెన్.

1-56-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

న్నగవైరి నెక్కి యిరుపక్కియన్మును లర్థిఁ గొల్వఁగా
న్నుతి నారదాది యతి సంఘము సేయగ నభ్రవీధి పై
నున్నతమై మణుల్వెలుఁగ నూర్జితకీర్తి రమావిభుండు దాఁ
న్నగ కంకణుం గొలువ భాసురుఁ డై చనుదెంచె నెమ్మితోన్.

1-57-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

తా తుషార హార హిమధామ సితాంబుజ శారదాభ్రమం
దా నిభోజ్జ్వలం బగుచుఁ దద్దయు వేగ మరాళవాహుఁడై
భూరిగుణాకరుం డమృతభుక్పతివంద్యుఁడు ధాత వచ్చె వి
స్ఫారుఁడు భారతీవిభుఁడు పార్వతినాథునిఁ గొల్వ భక్తితోన్.

1-58-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దేజనాధినాథులును దేవగురుండును సంస్తుతింప నై
రాణదంతి నెక్కి తగు రాజకదంబము చక్రవర్తులున్
వావిరిఁ గొల్వఁగా నిగమవంద్యునిఁ గొల్వ శచీవిభుండు స
ద్భావుఁడు నాకవల్లభుఁడు ధన్యుఁడు చ్చె నగణ్యపుణ్యుఁ డై.

1-59-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

శి లయ్యేడును వెల్గఁగ
సుతర మగు నజము నెక్కి శోభిల్లుచుఁ ద
న్నఖిల మునులు నుతి సేయఁగ
ఖిలేశ్వరుఁ గొల్వ వచ్చె నలుఁడు ప్రీతిన్.

1-60-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దంప్రచండహస్తులు
మండితగతిఁ దన్నుఁ గొలువ దమహి షారూ
ఢుండై వచ్చెఁ గృతాంతుఁడు
ఖండితశుండాలదనుజు డకుం గొలువన్.

1-61-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మిక్కిలి విభవము మెఱయఁగ
గ్రక్కున మానవుని నెక్కి డు వేడుకతోఁ
క్కని నైరృతి వచ్చెను
చుక్కలరాయనిధరించు సుభగునిఁ గొలువన్.

1-62-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మీనంబు నెక్కి వరుణుఁడు
కానుక లెన్నేని గొనుచుఁ గాంతలు గొలువన్
దా రుగుదెంచె రాజిత
మీద్వజహరుని గొలువ మించిన భక్తిన్.

1-63-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

గౌరీనాయకుఁ గొలువగ
సారంగధ్వజుఁడు నగుచు సంభ్రమలీలం
దారాపథమున వచ్చెను
దారాచలశిఖరమునకుఁ ద్దయు వేడ్కన్.

1-64-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మంళదివ్యసంపదలు మానుగ న్నియుఁ గొంచు గిన్నరుల్
ముంలఁ బేర్మితో నడువ మోదముఁ బొంది తురంగవాహుఁ డై
సంతి సిద్ధులున్నరులు సంయములుం దను గారవింపఁగా
సండికానిఁ గొల్వ నతి సంపద నేఁగెఁ గుబేరుఁ డాఢ్యుఁడై.

1-65-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నాథులు కొల్వఁగ గో
పతివాహనుఁడు భుజగకంకణుఁ గొలువన్
ణుతింపరాని వేడుక
ణిధరుఁ డీశానుఁ డరిగె వ్యాత్మకుఁ డై.

1-66-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇవ్విధంబున.

1-67-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

విశిఖాదండాది పాశ ధనుః ఖడ్గ
శూల చక్రా దండ సుభగు లగుచు;
హంస తార్క్ష్య వృషాది రి హయ మృగ ఝష
కాషాయవేషిత మను లగుచు;
సిజ కింకరాసుధునీలఘు చిత్త
నభూతి శ్రీరాజి లితు లగుచు;
సంవ్యదయోదండమంగమిత్రాభ్రస
త్యప్రభాభోగ నిత్యాత్ము లగుచు;

1-67.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రిశిఖి యమ దైత్య వరుణ చంద్ర కుబేర
శివ హరి యజు లాదిశివుని గొలువ
రుగుదెంచి రంత నానంద మైన కై
లాసమునకు శివునివాసమునకు.

1-68-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇ ట్లరుగుదెంచి సకలభువనప్రధానదేవతలును, సప్తలోకపాలురును, సనకసనంద నాది యోగీంద్రులును, సిద్ధ కిన్నర కింపురుష గరుడ గంధర్వ విద్యాధరులును, మార్కండేయ ఘటజ మరీచి గౌతమ కశ్యప వామదే వాత్రి భృగు దధీ చ్యుపమన్యు దుర్వాస నారదాదులగు మహామునులును, ననంత సంతసంబునఁ గలధౌతకుధర శిఖరంబుఁ బ్రవేశించి దేవదేవుని దివ్యాలయంబు డాయం బోయి తదీయ ద్వారంబున నందఱుం బాదచారులై దౌవారికు లగు జయవిజయుల నాలోకించి యిట్లనిరి.

1-69-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

చ్చట నున్నవాఁడు శివుఁ డేమివిధంబున నున్నవాఁడొకో
చ్చితి మెల్లవారమును వారిజలోచనుఁ డాదిగాఁగ మా
చ్చినరాక నిన్ గొలువవచ్చినవా రని చంద్రమౌళికిం
జెచ్చెర మీరు విన్నపముచేసి తగన్ మఱుమాట చెప్పుఁడా.

1-70-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని పలికిన వారును "నగుఁగా" కని శంకరు నాస్థానమండపంబు దరియంజొచ్చి య ద్దేవునకు నమస్కారంబు లాచరించి యిట్లనిరి.

1-71-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

శ్రీనితావిభుండు, సరసీరుహర్భుఁడు, నింద్రుఁ డాదిగా
దేతలున్మునీంద్రులును దేవరఁ న్గొన వచ్చినారు దు
ర్గావిభు కిప్పుడే యవసరం బని శ్రీమొగసాలి నున్న వా
రేవిధ మింక వారలకు నేర్పడ నానతి యీవె శంకరా!

1-72-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అనవుఁడు న వ్విన్నపం బవధరించి "వారలం దోడితెం"డని యానతిచ్చిన వారును జని దేవతల కిట్లనిరి.

1-73-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మీరాక విన్నవించిన
గౌరీపతి కొలువులోనఁ గారుణ్యముతో
వాలఁ బుత్తెమ్మనియెను
మీలు చనుఁ డవసరంబు మే లని పలుకన్.

1-74-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ముమున హరియును నజుఁడును
దువులు మును లాదిగాఁగ కలజనంబుల్
నారిఁ గొలువ వచ్చిరి
పడి సంభ్రమము భయము క్తియుఁ గదురన్.

1-75-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇవ్విధంబునఁ గొలువుచొచ్చి యమ్మహాదేవునింగాంచి సాష్టాంగదండ ప్రణామంబు లాచరించి నిటలతట సంఘటిత ముకుళిత కరకమలులును, సర్వాంగ పులకాంకితులును నై యిట్లని స్తుతియింపం దొడంగిరి.

1-76-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

జయ గౌరీవల్లభ!
జయ గంగావతంస! య నిస్సంగా!
జయ గోపతివాహన!
జయ వేదాంతవేద్య! య పరమేశా!

1-77-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

జయ పరమపరాయణ!
జయ భవ్యానుభావ! య సర్వేశా!
జయ త్రిపురాసురహర!
జయ లోకాధినాథ! య శ్రీకంఠా!

1-78-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని మఱియు ననేకవిధంబుల నుతియించి తత్ప్రసాద కరుణా విశేషంబుల నానందించి యుచితాసనంబుల నుండి; రక్కొలు వగమ్య రమ్య నిఖిల దేవతాజన కిరీట కీలిత దివ్యమణి ప్రభాపటల దేదీప్యమాన తేజోమహిమాభిరామంబును, అగణిత గణాలంకృతం బును, నసమాన మానితంబును, అనంత వైభవ ప్రమోదితంబును నై యొప్పుచున్న సమయంబున.

1-79-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రి! లాభంబె; శిఖీ! సుఖంబె; యమ! నిత్యానందమే; నైరృతీ!
యివే; పార్థివ! మేలె; మారుతి! సుఖంబే; కిన్నరాధీశ్వరా!
రిణామంబె; శివా! శివంబె; ,ద్రుహిణా! భద్రంబె; గోవింద! శ్రీ
మే; యంచు దయాళుఁడై డిగె శ్రీకంఠుండు దేవాదులన్.

1-80-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లు పరమేశ్వరుం డడిగిన నందఱు నాలాగునఁ దమతమ పరిణామంబులు విన్నవించి "దేవా! భవదీయకరుణావిశేషంబున సర్వ సంపన్నం బై యుండుఁ గావున; మాకు నే కార్యంబును నప్రతిహతంబై చెల్లుచుండు" నని పలికి సుఖగోష్ఠి నున్న సమయంబున.