పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రధమ స్కంధము : పీఠిక

  •  
  •  
  •  

1-8-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీరామాయణ కథ భువి
వాక నిర్మించినట్టి వాల్మీకి మన
స్ఫారుఁబరాశరనందను 
శ్రీమ్యునిఁ బాయ కెపుడుఁ జింతింతు మదిన్.

టీకా:

వారక = వదలకుండా; మనస్ఫారున్ = గొప్ప మనస్సు కలవానిని; పరాశరనందను = వ్యాసుని; శ్రీరమ్యుని = అందమైన కీర్తి కలవానిని; వాయక = వదలక.

భావము:

రామాయణ కథను రచించి లోకంలో నిలిపిన వాల్మీకిని, గొప్పమనస్సు కీర్తి కలిగిన వ్యాస మహర్షిని నా మనస్సులో నిరంతరం స్మరిస్తాను.

1-9-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బాణు సంచితశబ్దపారీణు నసమాన
వితాగుణావాసుఁ గాళిదాసు
మాఘు వాక్యామోఘు ణిభద్రు శివభద్రు
మణీయతర కవిరాజు భోజుఁ 
బ్రకటిత విమలప్రభారవి భారవి
నున్నత గుణధుర్యు నన్నపార్యు
సేవితకవిరాజి శ్రీసోమయాజిని
శృంగారకవినాథు రంగనాథు

1-9.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నవని రెండవ శారదయైవెలుంగు
వైభవోద్దాము వేములవాడ భీము
నాదిగాఁ గల కవులను ధికభక్తిఁ
లఁచి వర్ణించి తత్ప్రసాదంబు వడసి.

టీకా:

అంచిత శబ్దపారీణున్ = చక్కని శబ్దనైపుణ్యం కలవానిని; వాక్య + అమోఘు = సార్థకమైన వాక్యాలు కలవానిని; ప్రభారవి = సూర్యకాంతి కలవాడు; గుణధుర్యు = గుణాలతో శ్రేష్ఠుడైనవానిని; సేవిత కవిరాజి = కవుల సమూహంతో పూజింపబడినవాడు; ప్రసాదంబు = దయ; పడసి = పొంది.

భావము:

శబ్దసంపన్నుడైన బాణుని, సాటిలేని కవిత్వగుణాలు కల కాళిదాసును, సార్థక వాక్యాలు వ్రాసిన మాఘుని, మణిభద్రుని, శివభద్రుని, అందమైన కవిత్వం చెప్పిన భోజరాజును, సూర్యకాంతితో ప్రకాశించే భారవిని, గొప్ప సుగుణాలున్న నన్నయను, కవుల సేవలు పొందే తిక్కన సోమయాజిని, శృంగార కవి అయిన శ్రీనాథుని, రంగనాథుని, సరస్వతీ స్వరూపమై వెలిగే వేములవాడ భీమకవిని మిక్కిలి భక్తితో తలచుకొని, వారి దయను పొంది....

1-10-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విఁజూడక భవి డాయక
వుపదములు గొల్చి ఘోరవభంజనులై
దూరులైన పుణ్యుల
వునర్చన చేసి పరము డసినవారిన్.

టీకా:

భవిన్ = సంసారాన్ని; డాయక = సమీపించక; భవు = శివుని యొక్క; భవ భంజనులై = సంసార బంధాలను త్రెంచుకున్నవారై.

భావము:

సంసారాన్ని పట్టించుకొననివారిని, దాని జోలికి వెళ్ళనివారిని, శివుని పాదాలను పూజించి సంసార బంధాలను త్రెంచుకొన్నవారిని, సంసారానికి విముఖులైన పుణ్యాత్ములను పూజించి మోక్షాన్ని పొందినవారిని...

1-11-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శిరియాలుఁ గరికాలుఁ జేరమనుద్భటు
బాణుఁ గేశవరాజు సవరాజుఁ
న్నప్ప జన్నయ్య రయూరచోడయ్య
కుమ్మరగుండయ్య నెమ్మినాథుఁ
బండితారాధ్యుని ల్లాణు నమినంది
మాహేశు నుడివాలుమాచిరాజుఁ
చేరమరాజయ్య చిరుతొండనోహాళి
సాంఖ్యతొండని సురిముడ దేవు

1-11.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వెలయ మఱియుఁ గల్గు వీరమాహేశ్వరా
చారపరుల వీరత్య వ్రతుల
వీరసచ్చరితుల వీరవిక్రములను
రఁగ మ్రొక్కి తలఁచి క్తితోడ.

టీకా:

వెలయ = ప్రసిద్ధికెక్కగా; పరఁగ = చెలగి.

భావము:

వీరశైవ దీక్షాపరులూ గొప్ప సత్యవ్రతులూ పుణ్యులూ పరాక్రమవంతులూ అయిన శిరియాలుని, కరికాలుని, చేరమ ఉద్భటుని, బాణుని, కేశవరాజును, బసవరాజును, కన్నప్పను, జన్నయ్యను, కరయూర చోడయ్యను, కుమ్మరి గుండయ్యను, నెమ్మినాథుని, పండితారాధ్యుని, భల్లాణుని, నమినంది మాహేశుని, సుడివాలు మాచిరాజును, చేరమ రాజయ్యను, చిరుతొండని, ఓహాళిని, సాంఖ్యతొండని, సూరిచముడ దేవుని భక్తితో తలచుకొని మ్రొక్కి...

1-12-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తత్ప్రసాద కరుణావిశేష ప్రవర్ధమాన కవితామహత్వసంపన్నుండనై మదీయాంతరంగంబున.

టీకా:

ప్రవర్ధమాన = గొప్పగా వర్ధిల్లిన.

భావము:

వారి దయతో వర్థిల్లిన గొప్ప కవిత్వసంపద కలవాడనై నా మనస్సులో...

1-13-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పుణ్యకథ చెప్పి యీభూమితలములోఁ
బాపసంచయ మెల్లఁ బాయవచ్చు
నేపుణ్యకథ చెప్పి యితరులు వొగడంగఁ
గోటిపుణ్యంబులు గూర్పవచ్చు
నేపుణ్యకథ చెప్పి యితరలోకంబులోఁ
రమకళ్యాణంబుఁ డయవచ్చు
నేపుణ్యకథ చెప్పి యింద్రాదిసురలచేఁ
బొలుపార సత్పూజఁ బొందవచ్చు

1-13.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నెట్టికథ రచించి యెవ్వరు నెఱుఁగని
యీశు నాదిదేవు నెఱుఁగవచ్చు
నేమి కథ యొనర్చి యిలలోన సత్కీర్తిఁ
నరవచ్చు నంచుఁ లఁచి తలఁచి.

టీకా:

పాపసంచయము = పాపసమూహం.

భావము:

“ఏ కథ చెప్పి లోకంలో పాపాలన్నీ తొలగించవచ్చు? అందరు పొగడే విధంగా ఏకథ చెప్పి కోటి పుణ్యాలు పొందవచ్చు? ఏకథ చెప్పి పరలోక శుభాలను పొందవచ్చు? ఏకథ చెప్పి ఇంద్రాది దేవతలచేత పూజలందుకోవచ్చు? ఏకథ చెప్పి ఎవ్వరూ తెలిసికొనలేని శివుని గురించి తెలుసుకొనవచ్చు? ఏకథ చెప్పి ఈలోకంలో సత్కీర్తిని పొందవచ్చు?”; అని ఆలోచించి...

1-14-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తదీయ విచారచిత్తుండనై తత్కథారంభం బూహించుచున్న సమయంబున.

భావము:

ఆకథ గురించి మనస్సులో ఆలోచిస్తూ దానిని ఏవిధంగా ప్రారంభించాలా అని ఊహించుకుంటున్న సమయంలో...

1-15-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రమభద్రాసన ప్రముఖమార్గంబుల
యోగీంద్రు లితఁ డాదియోగి యనఁగ
వీరవ్రతంబున వీరమాహేశులు
వీరమాహేశ్వరవిభుఁ డనంగ
సంతతానుష్ఠాన త్కర్మనిరతిమై
బ్రాహ్మణు లుత్తమబ్రాహ్మణుఁ డన
వేదాంతసిద్ధాంతవిమలుఁడై చెలఁగుచో
నులెల్ల ధర్మశానుఁ డనంగ

1-15.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వెలయు శంభుమూర్తి వీరమాహేశ్వరా
చారవిభుఁడు భక్తిసాగరుండు
నఘుఁ డివ్వటూరి యారాధ్యచంద్రుండు
సోమనాథసముఁడు సోమగురుఁడు.

టీకా:

భద్రాసనము = పాదాలను తొడక్రిందకు చేర్చి కూర్చోవడం; వీరవ్రతంబు = కంఠంలో వ్రేలాడే శివలింగాన్ని అర్చించడం, శివుని కంటె మరొక దైవం లేడని భావించడం; అనుష్ఠానము = విహితకర్మలను ఆచరించడం; నిరతిమై = మిక్కిలి ఆసక్తి కలిగి ఉండడం వల్ల; చెలఁగుచో = ఉండగా.

భావము:

సోమనాథ గురుదేవుడు ఇవ్వటూరి వంశస్థుడు, ఆరాధ్యుడు. శివస్వరూపుడు. వీరశైవాచారాలను పాటించేవాడు. ఇతడు భద్రాసనంలో ఉండగా చూసిన యోగులు ఆదియోగి అంటారు. వీరవ్రతాన్ని పాటిస్తున్న ఇతన్ని వీరశైవులు వీరశైవప్రభు వంటారు. ఎల్లప్పుడూ అనుష్ఠానాలు మొదలైన సత్కర్మలను చేసే ఇతన్ని బ్రాహ్మణులు ఉత్తమ బ్రాహ్మణు డంటారు. వేదాలు ప్రతిపాదించిన సిద్ధాంతాలను ఆచరిస్తూ పవిత్రుడైన ఇతన్ని జనులంతా ధర్మశాసను డంటారు.

1-16-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సుల్ పెద్దలు నీతిమంతులు కవుల్ జాణల్ బుధుల్ బంధువుల్
దొలుం జాలఁ బురోహితుల్ హితులు మంత్రుల్గాయకుల్ పాఠకుల్
స్వవేదుల్ భరతజ్ఞు లాశ్రితులు దైజ్ఞుల్ పురాణజ్ఞులున్
నాథుల్ శివభక్తులున్నిరుపమానందాత్ములై కొల్వఁగన్. 

టీకా:

సరసుల్ = రసజ్ఞులు; జాణల్ = నేర్పరులు; బుధుల్ = పండితులు; చాలన్ = పెక్కు; స్వరవేదుల్ = సంగీతజ్ఞులు; భరతజ్ఞులు = నాట్యకళాకారులు; దైవజ్ఞుల్ = జ్యోతిశ్శాస్త్రజ్ఞులు; నరనాథుల్ = రాజులు; నిరుపమ = సాటిలేని.

భావము:

రసజ్ఞులు, పెద్దలు, నీతిమంతులు, కవులు, నేర్పరులు, పండితులు, బంధువులు, నాయకులు, పురోహితులు, మిత్రులు, మంత్రులు, గాయకులు, పాఠకులు, సంగీతజ్ఞులు, నాట్యకళాకారులు, ఆశ్రితులు, జ్యోతిశ్శాస్త్రజ్ఞులు, పురాణజ్ఞులు, రాజులు, శివభక్తులు సాటిలేని ఆనందాన్ని పొందుతూ సేవిస్తూ ఉండగా...

1-17-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఒక్కనాఁ డసమానమానసుండై యగమ్యరత్నాంచితమగు వేదికాతలంబున సమున్నతకనకాసనంబున సుఖం బుండి శైవపురాణ ప్రసంగాంతరంగుండై నన్ను రావించిన.

టీకా:

అసమాన మానసుండై = ఉద్విగ్నమనస్సు కలవాడై; అగమ్యరత్న+ అంచితమగు = చెప్పరాని వెలగల రత్నాలతో కూడినదైన; వేదికాతలంబున = గద్దెపైన.

భావము:

ఒకరోజు ఉద్విగ్నమనస్సు కలవాడై, గొప్ప రత్నాలు పొదిగిన గద్దెమీద ఎత్తైన బంగారు ఆసనంపై సుఖంగా కూర్చుండి శివపురాణాలను వినే కోరిక కలవాడై నన్ను రప్పించగా...

1-18-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యము సంభ్రమంబు క్తియుఁ గదురంగ
తని పాదయుగము ల్లఁ జేరి
పాణియుగము ఫాలభాగంబుఁ గదియించి
ముదముతోడ నేను మ్రొక్కియున్న. 

టీకా:

సంభ్రమము = వేగిరపాటు; కదురంగన్ = ఎక్కువ కాగా; కదియించి = చేర్చి.

భావము:

భయం, వేగిరపాటు, భక్తి అతిశయించగా నేను అతని పాదాల చెంత చేరి, సంతోషంగా నమస్కరించగా...

1-19-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అయ్యవసరంబున సోమశేఖరుం డిట్లనియె.

టీకా:

ఆ + అవసరంబున = ఆ సమయంలో.

భావము:

ఆ సమయంలో ఇవ్వటూరి సోమనాథుడు ఇలా అన్నాడు.

1-20-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మయంబు లాఱును ర్చించి చర్చించి
దువులు నాల్గును దివి చదివి
హుపురాణంబులు భాషించి భాషించి
యితిహాసముల నెల్ల నెఱిఁగి యెఱిఁగి
కావ్యంబు లెన్నేని ర్షించి ఘర్షించి
ఖిలవిద్యలు నాత్మ రసి యరసి
నులతో సద్గోష్ఠిఁ గావించి కావించి
కలకృత్యంబులు రిపి జరిపి

1-20.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యున్న నిప్పుడు మాకెల్ల నూహలోన
వింతపండువు బోలెను వీరభద్ర
విజయ మెల్లను వినఁ గడువేడ్క యయ్యె
ది దెలుంగున రచియింపు భిమతముగ.

టీకా:

సమయంబు లాఱు = ఆరు సమయాలు (ఇక్కడ సమయాలంటే మతాలు. షణ్మతాలు - శైవం, వైష్ణవం, కాపాలికం, శాక్తం, సౌరం, గాణాపత్యాలు); చదువులు నాల్గు = చతుర్వేదాలు (ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వవేదాలు); ఘర్షించి = రాపిడి పెట్టి; అరసి = విచారించి (వెదకి); అభిమతముగ = సమ్మతితో.

భావము:

“షణ్మతాలను గురించి విపుల చర్చలు చేసి, వేదాలను బాగా చదివి, పెక్కు పురాణల గురించి వివరంగా చెప్పి, ఇతిహాసాల లన్నింటినీ తెలిసికొని, ఎన్నో కావ్యాలను చక్కగా పరిశీలించి, అన్ని విద్యలను లోతుగా విచారించి, గొప్పవారితో సత్సల్లాపాలు చేసి, అన్ని విధ్యుక్త కర్మలను ఆచరించి ఉన్న నాకు ఇప్పుడు మనస్సులో వీరభద్ర విజయాన్ని వినాలనే కోరిక కలిగింది. అది వినడం ఒక క్రొత్త పండుగ వంటిదే. నా అనుమతితో దానిని తెలుగులో రచించు.

1-21-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పిన్నవాఁడ ననియుఁ బెక్కు సంస్కృతులను
విననివాఁడ ననియు వెఱపు మాను
త్ప్రసాద దివ్యహిమచే నెంతైన
విత చెప్ప లావు లదు నీకు.

టీకా:

వెఱపు = భయం; లావు = శక్తి.

భావము:

చిన్నవాడననీ, అన్ని సంస్కారాలని విననివాడననీ భయం వద్దు. నా దయ, మహిమలచేత ఎంతటి కవిత్వమైనా చెప్పే శక్తి నీకున్నది.

1-22-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదియునుం గాక నీకు వీరభద్రేశ్వర ప్రసాదంబుఁ గలదు కావున వాయుపురాణసారం బగు నీ కథావృత్తాంతం బంతయు దెలుంగున రచియింపు మని యానతిచ్చిన మద్గురుని మధురవాక్యంబులకు నత్యంతానురాగ సంతుష్టుండనై తదీయానుమతంబున మదీయ వంశావళివర్ణనం బొనరించెద.

టీకా:

ప్రసాదంబు = దయ; సంతుష్టుండనై = తృప్తిపడినవాడనై.

భావము:

అంతేకాక నీపై వీరభద్రేశ్వరుని దయ ఉన్నది. కనుక వాయుపురాణసారమైన ఈ కథనంతా తెలుగులో రచించు”; అని ఆజ్ఞాపించడంతో నా గురుదేవుడైన ఇవటూరి సోమనాథుని తీయని మాటలకు మిక్కిలి తృప్తిపడి, ఆయన అనుమతితో మా వంశచరిత్రను వర్ణిస్తాను.