పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రధమ స్కంధము : నగజను శివునికి శుశ్రూష చేయ నప్పగించుట

  •  
  •  
  •  

1-221-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధా రీశ్వర! విన్నపంబు మదిలో నాలించి రక్షింపుమీ
యువిదారత్నముఁ బెట్టి పోయెదను మీ యొద్దన్ భవద్ధాసి యై
తివుటన్ వర్తన సేయుచుండెడిని ప్రీతిం దీని రక్షింపుడీఁ
విరోధంబున లీలఁ బంపి పరిచర్యల్ చాల సేయింపుఁడీ.

టీకా:

అవధార = చిత్తగించు; ఆలించి= విని; ఉవిద= స్త్రీ; భవద్ధాసి (భవత్ దాసి)= మీ యొక్క దాసి; తివుట= కోరిక; వర్తన చేయు= ప్రవర్తించు; అవిరోధము= మిత్రత్వము; లీల= విధము; పంపు= నియోగించు, పురమాయించు; పరిచర్యలు= సేవలు.

భావము:

"ఈశ్వరా ! మనస్సునందు బాగా ఆలోచించి నా మనవి విని కాపాడుము. ఈ స్త్రీరత్నమును మీ వద్ద విడిచి వెళ్ళెదను. కోరి మీయెక్క దాసియై ప్రవర్తించే ఈమెను అభిమానంతో కాపాడండి. స్నేహముతో ఈమె చేత సేవలు చేయించుకోండి-.

1-232-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కొండిక బాలిక యెఱుఁగదు
సుండీ యెంతయును ముగుద సుండీ యనుచున్
ఖండేందుబింబమౌళికిఁ
గొంలరా జప్పగించెఁ గూఁతుం గౌరిన్.

టీకా:

కొండిక = చిన్న; సుండి= ఔను సుమా; ముగుద =ముగ్ధ; ఖండేందుబింబమౌళి = చంద్రభాగమును సిగపై ధరించినవాడు; కొండలరాజు= హిమవంతుడు.

భావము:

"ఈమె చిన్న పిల్ల. ఏమీ తెలియదు సుమా. ముగ్ధ సుమా." అంటూ హిమవంతుడు తన కుమార్తె ఐన గౌరిని చంద్రమౌళి యైన శివునకు అప్పగించాడు.

1-223-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇ వ్విధంబునం బరమేశ్వరునకుఁ బరిచర్యలు సేయ న మ్మహాదేవిని సమర్పించి యతం డ ద్దేవునకు వెండియు దండప్రణామంబు చేసి తన మందిరంబునకుఁ జనియె నంతఁ.

టీకా:

"ఈమె చిన్న పిల్ల. ఏమీ తెలియదు సుమా. ముగ్ధ సుమా." అంటూ హిమవంతుడు తన కుమార్తె ఐన గౌరిని చంద్రమౌళి యైన శివునకు అప్పగించాడు.

భావము:

ఈ విధముగా పరమేశ్వరునకు సేవలు చేయడానికి ఆ మహాదేవిని సమర్పించిన పిమ్మట హిమవంతుడు శివునకు మరల దండప్రణామము చేసి తన మందిరానికి వెళ్ళిపోయాడు.

1-224-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శివుఁ జూచుం దమకించి సిగ్గు నగుడున్ జిక్కం గరంగున్ మదిన్
వుఁ జేరం గమకించుఁ జంచలపడుం భావించు నెంచున్ వడిం
యంగాఁబడు నాథుఁ గౌఁగిటను సింగారింతునో యంచు నో
శి రమ్మా యని పిల్తునా యనుచు రాజీవాక్షి సంరబ్ధయై.

టీకా:

తమకించి = తత్తరపడి; అగుడు= అగడు, తొట్రుపడు; గమకించు= ప్రయత్నించు సంరబ్దము= ఉత్తేజము.

భావము:

గౌరి; శివుని చూసి, తత్తరపడి సిగ్గుతో తొట్రుపడుతుంది, మనసులో చిక్కగా కరగిపోతుంది. భవుని చేరడానికి ఆయత్తం అయి, చలించిపోతుంది. రమించుటకు వేగంగా వచ్చు నాథుని కౌగిలి అలంకరించనా అంటూ కోరి భావిస్తుంది. "శివా! రమ్మా! " అని పిలువనా? అనుకుంటూ ఎర్రకలువలవంటి కన్నుల చిన్నది ఉత్తేజితురాలయ్యేది.

1-225-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రమేశు రూపంబు లుమాఱు నందంద
వాడిచూపులఁ జూచు వాని మిగులఁ
బులకించు దలఁకించుఁ బొలఁతి విచారించుఁ
జేరి పూవులఁ బూజసేయు నబల
పంపక యటమున్న రిచర్య లొనరించుఁ
రిమిన చిత్తంబు రగఁబట్టు
దేవర మనసు దాఁ దెఱఁగొప్ప వర్తించు
డు నప్రమత్త యై న్య మెలఁగు

1-225.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కాముతాపుల ధాటికిఁ గాక శంభు
నంటి యొక్కొక్క మాటొత్త ప్పళించుఁ
దెంపు సేయంగ వెఱచు న ద్దేవి యిట్లు
శివుని కెప్పుడు పరిచర్య సేయుచుండె.

టీకా:

పులకించు = గగుర్పొడుచు; తలకించు= చలించు; పొలతి= అందమైన స్త్రీ; చేరి= సమీపించి; విచారించు= ఆలోచించు; అటమున్న =అంతకుముందు; తరిమిన = మెలిపెట్టే (తరిమిన, తరివెనబట్టు - తరినబట్టు కర్రను త్రాటిచే త్రిప్పుచుండగా దానిపై రూపులు తీర్చుట, తెలంగాణ నెల్లూరు మాండలికము, మాండలిక పదకోశము); తరగబెట్టు = తగ్గునట్లు చేయు; తెఱగు ఒప్పు= విధము నప్పునట్లు;
కాముతాపులు= (మన్మథుని తన్నులు) మన్మథబాణములు ; ధాటి =దాడి, విజృంభణము; అప్పళించు= ప్రయత్నించి; తెంపు =విడదీయు ; వెఱచు= భయపడు.

భావము:

పరమేశు రూపమును పలుమార్లు మరలా మరలా చురుకుగా చూసేది. గౌరి పొలతి శివుని తలచుకొని పులకించేది, చలించిపోయేది. ఆ అబల హరుని దగ్గరకు చేరి పూవులలో పూజించేది. చెప్పక ముందే వలసిన పరిచర్యలు చేసేది. మనసున మెలిపెట్టే మోహాన్ని అదిమిపట్టేది. ఆదేవదేవుని మనసు నప్పే విధముగా ప్రవర్తించేది. ఆ కన్య మిక్కిలి అప్రమత్తతతో ప్రవర్తించేది. మన్మథబాణముల దాడికి లొంగక శంభుని చూసి, ఒక్కొక్క మాటు తాకలనుకొనీ తెగించలేక భయపడేది. ఈవిధంగా ఆ మహాదేవి గౌరి శివునికి సేవలు చేసేది.

1-226-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రొద్దున వచ్చి నిచ్చలును బొల్పగు శీతశిలాతలంబునం
గ్రద్దన నిల్చియుండి కఱకంఠుఁడు యోగసమాధినిష్ఠ మైఁ
బెద్దయుఁ బ్రొద్దు నిల్చుటయుఁ బిమ్మట గౌరియు నిర్మలాత్మ యై
ప్రొద్దున వచ్చి వల్లభుని పూజలుసేయు ననేక భంగులన్.

టీకా:

నిచ్చలు = నిరంతరంగా; పొల్పగు= ప్రకాశించు; శీతశిలాతలంబు= చల్లని మంచుగడ్డ; గ్రద్దన = తీవ్రముగ; పెద్దయు = ఎక్కువ; భంగి= విధము.

భావము:

నీలకంఠుడు ఉదయాన్నే వచ్చి ప్రకాశించే మంచుగడ్డపై కూర్చుని నిరంతరంగా తీవ్ర యోగసమాధిలోకి వెళ్ళి ఎక్కువ సమయం అలాగే ఉండిపోతాడు. అటుపిమ్మట, ప్రొద్దున (ఆయన సమాధినుండి బయటకు వచ్చాక) గౌరి వచ్చి నిర్మలాత్మతో భర్తని అనేక రకాలుగా పూజించేది.

1-227-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విడువక పూజలు సేయఁగ
నుడుగక యోగంబుమీఁద నుండఁగఁ దలఁపు
ల్పొముటయ కాని కానం
దెంతయు సంగమంబు తికిన్ సతికిన్.

టీకా:

నుడుగు =మాట్లాడు; తలపులు =ఆలోచనలు.

భావము:

గౌరి విడువకుండా పూజలు చేస్తూనే ఉండేది. శివుడు మాట్లాడకుండా యోగంలోనే ఉండేవాడు. ఊహలలోనే కానీ ఆ పతికి సతికి మాత్రం సంయోగం కనబడదు.

1-228-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇ వ్విధంబున గొంతకాలంబు దేవి దేవరకుం బరిచర్యయలు సేయు చుండె" నని చెప్పి.

భావము:

ఈ విధంగా కొంతకాలము గౌరి శివునకు సేవలు చేయుచూ యుండెను" అని చెప్పెను.