పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రధమ స్కంధము : దాక్షాయణి హిమవత్ప్రుత్త్రియై పుట్టుట

 •  
 •  
 •  

1-167-శా.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ప్రాలేయాచల వల్లభుండు నియతిం బాటించి సద్భక్తితోఁ
గాళీసుందరిఁ గూఁతుఁ గాఁ దలఁచి వేడ్కల్ ల్లవింపన్ యశ
శ్శ్రీలోలుండు తపంబు సేయ నచటన్ శృంగారసాంగత్యమై
లోలానందము బొంది యున్న నతఁ డాలోకించి సంరంభుఁడై.

1-168-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

చంలనేత్రి! యో ముగుద! చల్లనిచూపులతల్లి! నిన్ను నేఁ
గాంచిన యంతనుండి పులకల్ మెయినిండఁగ నంకురింప నీ
మించినరాకయున్ విభుని మేయు నీ దగు పేరుపెంపు నీ
మంచిగుణంబు లన్నియును మంళవంతము లంచు మ్రొక్కుదున్.

1-169-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అనిన నా కుమారీతిలకం బి ట్లనియె.

1-170-శా.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నా నాథుండు మహేంద్ర దేవమునిరా ణ్ణాగేంద్ర దిగ్రాజవాక్
శ్రీనాథాగ్ర కిరీటకూట విలసత్శృంగార దివ్యప్రభా
నానారత్న నికాయ సంతత లసన్నవ్యస్ఫురత్పాదు కే
శానాలంకృతుఁ డీశుఁ డాతనికి నిల్లాలన్ శివాసుందరిన్.

1-171-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నీకుం గూఁతుర నయ్యెదఁ
జేకొనుమీ తండ్రి! యనుఁడు శ్రీకంఠున కీ
వేకాంత వైన నిజముగ
నీకుం గల రూపు చూపు నీవు కుమారీ!

1-172-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నుడును హిమవంతు నాలోకనముఁ జేసి
తొలఁకు నగవు మొగముఁ దొంగలిం
తండ్రి! నీదు పుత్రి తా నెంతయో కన్ను
లారఁ జూడు మనుచు నంబుజాక్షి.

1-173-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పొలుపారు నీరేడుభువనంబులకు నెల్ల
హితమై దేదీప్యమాన మగుచుఁ;
గ్రొమ్మెఱుంగులమంటఁ గూడియు నెంతయు
వితతమై తాకుఁచు వెనుక రాగ;
చ్చి కూడని భంగి లనించుకయు లేక;
యేరుపఱుపరాక యెఱుఁగరాక;
యేవర్ణమునుగాక యేరూపమునుగాక;
కొలదియు లేకున్ని పొలయునట్లు

1-173.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మలజాండ మెల్ల గన్నియ దాన యై
తోఁచియున్నఁ జూచి తొట్రుపడుచు
మూర్ఛవోయి తెలిసి మోడ్పుఁ గే లెనయంగఁ
డఁతి సన్నుతించె బర్వతుండు.