పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రధమ స్కంధము : దాక్షాయణి దేహంబుఁ దొఱఁగుట

 •  
 •  
 •  

1-160-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నుచు మహేశ్వరి మరులు బెగడంగఁ
బూని భద్రాసనాసీ యగుచు
శంకర శ్రీపాదపంకజ యుగళంబుఁ
న మనస్సరసిలోఁ నర నిలిపి
వెలుఁగు మూలాధార వేదిపై శివయోగ
హ్ని మేల్కొలిపి యవ్వలను మిగిలి
నుఁ దాన చింతించి రణి చంద్రుల వడి
రుగంగనీక ఘోరాగ్నిఁ దెచ్చి

1-160.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

యందు నిల్చి దివ్య మగు త మైదీఁగె
రాజహంసగమన రాజదన
రమయోగశక్తి భస్మంబుగాఁ జేసి
పుణ్యతనువు తరుణి పొందె పుడు.

1-161-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

తులు వగు దక్షు నింట మఱి తోఁచిన వేఁడిమి మంచుకొండలోఁ
దొలువకపోవ దన్న క్రియఁ దోయజలోచన గౌరి లోలయై
లితలతావరాంగసవిలాసిని యై కొమరాలు నై విని
ర్మగతి నేఁగెఁ గొండలకు రా జగు కొండకు మంచుకొండకున్.

1-162-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అంతఁ దత్ప్రకారంబు వీక్షించి దక్ష మఖమంటపంబున సుఖాసీనులై యున్న బ్రహ్మ విష్ణు సూర్య చంద్ర దేవేంద్ర దండధర వరుణ కుబేరాది దేవజనంబులు మహాభీత చిత్తు లైరి; మూర్తిమంతంబు లైన మంత్రంబులు తంత్రంబులు చాలించె; పాప కర్ముం డగు దక్షుని నిందించి బ్రహ్మ తన లోకంబునకుఁ బోయె; మఱియుఁ దక్కిన వార లందఱు తమతమ నివాసంబులకుం జనిరి తత్సమయంబున.