పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రధమ స్కంధము : దక్షుఁడు దాక్షాయణిం దిరస్కరించుట

 •  
 •  
 •  

1-131-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ట్టివిధము చూచి యాత్మలోఁ గోపంబు
పుట్టుటయును ధీరబుద్ధి నద్రి
న్యయైన మేటి గావున సైరించి
సామవృత్తి నాదిభామ పలికె.

1-132-శా.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

తండ్రీ! నీ దగు నోము చూడఁ దగమా? తర్కింప నా పిన్న చె
ల్లెండ్రం బిల్చియు నన్ను జీరవు; మదీయాధీశు నీ యున్న య
ల్లుండ్రం బిల్చియుఁ బిల్వరావు; యిలవేల్పుల్ ర్తలే? పూజనల్
వీండ్రం జేసిన నేమి గల్గు? చెపుమా విశ్వేశ్వరుం డుండఁగన్.

1-134-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దేవు కతన విష్ణుం
డే దేవుని కతన బ్రహ్మ యీడేరిరి; తా
మే దేవుఁ గూర్చి బ్రతికిరి;
యా దేవుఁడు రాక వీరి రుగం దగవే?

1-135-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వుడు దక్షుం డదరుచుఁ
లుచుఁ గోపించి చూచి మలదళాక్షీ!
విను నీకంటెను నెక్కుడు
నిశము నీ యున్న కూఁతు లందఱు గౌరీ!

1-136-త.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

గ నీ తనయాధినాథులు భాగ్యవంతులు, శ్రీయుతుల్,
రుసఁ దల్లియుఁ దండ్రియుం గవారు, నిత్యమహావ్రతుల్;
ణిలోఁ గులగోత్రవంతులు తద్ఙ్ఞు లెందుఁ దలంపఁగన్;
రుణి యిన్నియు నేల నీ పతి తల్లిదండ్రులఁ జెప్పుమా?

1-137-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ట్టంగ దిక్కులే కాని కోకలు లేవు;
పూయ గంధము లేదు భూతి గాని;
కాలకూటమె కాని కంఠమాలిక లేదు;
ణి గాని తొడుగంగ ణులు లేవు;
లినాకసమె కాని లవెండ్రుకలు లేవు;
కుఁ బువ్వులు లేవు నెయ కాని;
కుడువ గంచము లేదు వెద పున్కయ కాని;
యొక్క గుఱ్ఱము లేదు యెద్దు గాని;

1-137.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మూడుమూర్తు లందు మొగి నెవ్వడును గాఁడు;
జాతిలేదు పుట్టుజాడ లేదు;
ముఁ డొంటిగాఁడు; బ్రహ్మాదు లెఱుఁగరు;
తిరుగు జోగిఁ దగునె దేవుఁ నగ?

1-138-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లోములోన లేఁడు; నృపలోకములోనన లేఁడు; కుండలి
ళ్లోములోన లేఁడు; మునిలోకములోనన లేఁడు; దేవతా
లోములోన లేఁడు; సురలోకములోనన లేఁడు; వెఱ్ఱిము
ప్పోలఁ బోవు టే నెఱిఁగి పూజలు సేయఁగ నెంతవాఁడొకో?

1-139-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

తా నెక్కడ? నే నెక్కడ?
తా నాకుం దలప సరియె? నుఁ గొలువంగా
నే నాఁడు వచ్చి నిలిచిన
తా నాకుఁ బ్రియంబు సేయఁ లఁచెనె చెపుమా?

1-140-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నీ నాయకుఁ డల్లుం డగుఁ
గాని మమున్ ధిక్కరించెఁ గాక; భవానీ!
మానుగఁ గనియును నీవును
కానిగతి నుండ లేల ర్వము లేలా?

1-141-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

చెలువా పిలువక ముందట
నఱి మా యింటి కేల చ్చితి చెపుమా;
పిలువని పేరంటము పని
వారునుబోలె సిగ్గు గాదే రాఁగన్?

1-142-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అనవుఁడు న మ్మహాదేవి కోపవివశ యై య య్యాగమంటపంబున సుఖాసీనులై యున్న సభాపతుల నవలోకించి యిట్లనియె.

1-143-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నిమములార! ధర్మపదనిర్ణయులార! మునీంద్రులార! యో
నిమమహాత్ములార! ఘననిర్ణయులార! దిగీంద్రులార! భూ
నచరాదులార! భవఖండనులార! యతీంద్రులార! యే
నిమము లందుఁ జెప్పె శివనింద యెఱింగితి రేనిఁ జెప్పరే?

1-145-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వేము లం దెఱింగిన వివేకము లెక్కడఁ బోయె? నేఁడు పు
ణ్యోయబుద్ధి యెం దణఁగి యున్నది నేఁడు? దపంబుఁ బొల్ల యే
నీ గు దక్ష తాద్భుతము నీతియు నెక్కడ దాఁగె నేఁడు? బ్ర
హ్మాదులఁ బోలు ప్రఙ్ఞ యది యారడి వోయెనె నీకు? నక్కటా!

1-146-శా.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రా దక్ష! యదక్షమానస! వృథా యీ దూషణం బేలరా?
యోరీ పాపము లెల్లఁ బో విడువరా; యుగ్రాక్షుఁ జేపట్టరా;
వైరం బొప్పదురా; శివుం వలఁపరా వర్ణింపరా; రాజితో
త్కారాతుం డగు నీలకంఠుఁ దెగడంగా రాదురా; దుర్మతీ!

1-147-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దువులు నాలుగు శివుఁ గని
యెమంచును వెదకుఁ గాని యెబ్బంగులఁ ద
త్సమలరూపముఁ గానక
పడి తమలోనఁ జిక్కుడ్డవి దక్షా!

1-148-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లయ నీరేడులోముల దొంతులతోడఁ;
బాగొప్ప మూఁడు రూములతోడ;
మూఁడు మంత్రములతో మూఁడు కాలములతో;
భ్రమయించు పుణ్యపాములతోడ;
లలిత ఖేచరార జంతుకోటితో;
భూరితేజములతో భూతితోడఁ;
జంద్రానలావనీ ల వాయు గగనాత్మ
రణులతోడఁ; జిత్రములతోడ;

1-148.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ర్గదివ్యమహిమ బ్రహ్మాంములు సేయుఁ
గాచు నడఁచుఁ గాని కానరాదు
నిఖిల మెల్లఁ దాన నీవును నేనును
దాన కాన నింద దగదు సేయ.

1-149-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అదియునుం గాక.

1-150-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దేతలు మునులు గృతమిడి
దేవుఁడు పరమేశుఁ డైన దేవుం డనుచున్
భావించినచోఁ జదువులు
దేవుఁడు శ్రీకంఠుఁ డనుచుఁ దెలిపెనొ లేదో?

1-151-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఱి యాగంబులలోపల
బుదనుజారాతి ప్రథమ పూజ్యం డెలమిన్
సులకు నందలిహవ్యము
యఁగ నతఁ డెలమి నిచ్చె నంతయు వినమే?

1-152-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

విశ్వములోపలఁ దనరెడు
శాశ్వత మగు వేదసంజ్ఞ ద్విజ్ఞునకున్
శ్వద్వైఖరి చెల్లున్
యీశ్వరుమహిమాబ్ది నీకు నెఱుఁగన్వశమే?

1-153-మత్త.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

సాసంబున మందరంబును సారె కవ్వముఁ జేసి తా
రూ క్షీరపయోధిఁ ద్రచ్చుచు నున్న శ్రీరమణాదులన్
దాదోహల నీలవర్ణులఁ ద్దయున్వడిఁ జేయు హా
లాలమ్మఱచేతఁ బట్టి గళంబులోన ధరింపడే?

1-154-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

బ్రహ్మశిరంబును ద్రుంచుట
బ్రహ్మాండము లతని యందుఁ బ్రభవించుటయున్
బ్రహ్మాదు లెఱుఁగకుండుట
బ్రహ్మాదులచేత వినవె ర్గునిమహిమల్?

1-155-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

శివుఁ డెచ్చట వేంచేయును
శితర మచ్చోటు వినుతిసేయఁగ వశమే
శివుఁ డెచ్చట వేంచేయఁడు
శివుఁ డెచ్చో నిండిలేఁడు సిద్ధము దక్షా!

1-157-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఖండేందుబింబభూషణు
నొండొరులకు నెఱుఁగవశమె యోహో వినుమా;
మండిత మగు నీ యాగము
పండిన తుదిఁ బండు పండు ర్గుఁడు కాఁడే?

1-158-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ట్టి మహేశ్వరుఁ డిచటికి
నెట్టన రాఁగలఁడు చెఱుప నీ యఙ్ఞము నీ
పుట్టిన దేహముతోఁడను
ట్టున శివుఁ జేరరాదు రమార్థ మిలన్.

1-159-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

యొడలు రోతఁ గాదే
పాక పరమేశు నొందఁ ని సేయంగా
వేయును నేటికి మాటలు
పోయెదరా కీడు నొంది పొగిలి దురాత్మా?