పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రధమ స్కంధము : దేవతా ప్రార్థన

 •  
 •  
 •  

1-0-శ్లో.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నమామి నారాయణ పాద పంకజం
వదామి తనారాయణ నామనిర్మలం
భజామి నారాయణ తత్త్వమవ్యయం
కరోమి నారాయణ పూజనం సదా

భావము:

నారాయణ పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. అతని పవిత్ర నామాన్ని పలుకుతున్నాను. శాశ్వతమైన అతని తత్త్వాన్ని స్తుతిస్తున్నాను. ఎల్లప్పుడు అతని పూజ చేస్తున్నాను. ొ

1-0.1- శ్లో.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఆలోక్య సర్వ శాస్త్రాణి
విచార్యచ పునః పునః
ఇదమేకం సునిష్పన్నం
ధ్యాయేన్నారాయణం సదా

భావము:

శాస్త్రాలన్నీ చూశాను (చదివాను). మళ్ళీ మళ్ళీ పరిశీలించాను. సిద్ధించిన పరమార్థం ఒక్కటే. అది “ఎల్లప్పుడు నారాయణుని ధ్యానించాలి”.

1-1-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

శ్రీలితంపు భూతియును శేష విభూషణమున్ శిరంబు పై
వేలుపు టేరు పాపటను వెన్నెల పాపఁడు మేన గొండరా
చూలియుఁ గేల ముమ్మొనల శూలము నీలగళంబు గల్గు నా
వేలుపు శ్రీమహానగము వేలుపు మాకు ప్రసన్నుఁ డయ్యెడున్.

టీకా:

శ్రీలలితంపు = అందమైన; భూతి = భస్మం; వేలుపుటేరు = గంగ; వెన్నెల పాపఁడు = చంద్రుడు; మేన = శరీరంలో; కొండరాచూలి = పర్వతరాజైన హిమవంతుని కూతురు (పార్వతి); ముమ్మొనల = మూడు మొనలున్న; నీల = నల్లని; శ్రీమహానగము = శ్రీశైలం (కైలాసం).

భావము:

అందంగా విభూతిని రాసుకున్నవాడు, శేషనాగం ఆభరణంగా కలవాడు, తలపై గంగను నుదుట నెలవంకను అర్ధశరీరంలో పార్వతిని చేత త్రిశూలాన్ని ధరించి నల్లని కంఠం కలవాడైన శ్రీశైల మల్లికార్జునుడు (కైలాస వాసి అయిన శంకరుడు) మాకు ప్రసన్ను డగును గాక!

1-2-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

సిరియును వాణి గౌరి యను జెన్నగు కన్యకు మేను, వాక్కుఁ, బె
న్నుమును నుంకువిచ్చి ముదమొప్ప వరించి జగంబు లన్నియుం
దిములు సేయఁ, బ్రోవఁ, దుది దీర్పఁగఁ ద్ర్యష్ట యుగేక్షణుండునై
రివిధి, శంభుమూర్తియగునాఢ్యుడు మాకుఁ బ్రసన్నుఁడయ్యెడున్.

టీకా:

చెన్ను+అగు = అందమైన; పెన్నురమునున్ = వక్షఃస్థలాన్ని; ఉంకువు+ఇచ్చి = కన్యాశుల్కమిచ్చి; తిరములు + సేయ = స్థిరంగా సృష్టించడానికి; పోవన్ = రక్షించడానికి; తుదిన్ = చివరకు (ప్రళయకాలంలో); తీర్పఁగన్ = ముగించడానికి; త్రి + అష్ట + యుగ + ఈక్షణుండునై = మూడు ఎనిమిది రెండు కన్నులు కలవాడై (శివుడు బ్రహ్మ విష్ణు రూపుడై); విధి = బ్రహ్మ; ఆఢ్యుఁడు = గొప్పవాఁడైన ప్రభువు

భావము:

లక్ష్మి, సరస్వతి, పార్వతి అనే పేర్లు కలిగిన కన్యకు వక్షఃస్థలాన్ని, నాలుకను, అర్థశరీరాన్ని కన్యాశుల్కంగా ఇచ్చి సంతోషంగా వరించి లోకాలన్నింటినీ సృష్టించడానికి ఎనిమిది కన్నులతో బ్రహ్మరూపంలో, కాపాడడానికి రెండు కన్నులతో విష్ణురూపంలో, నశింపజేయాడానికి మూడు కన్నులతో శివుని రూపంలో ఉండే ప్రభువు మాకు ప్రసన్ను డగును గాక!

1-3-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని నిఖిలదేవతా ప్రార్థనంబుఁ జేసి.

టీకా:

నిఖిల = సర్వ.

భావము:

అని సర్వదేవతలను ప్రార్థించి.

1-4-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వభక్తు లగువారిఁ బాటించి చూచుచోఁ
ల్లని సంపూర్ణచంద్రుఁ డనఁగ; 
రణార్థు లగువారిఁ జాల రక్షించుచో
లలితవజ్రపంర మనంగ; 
లుశివద్రోహుల స్మీకరించుచో
ద్భుత ప్రళయకాలాగ్ని యనఁగ; 
బ్రహ్మాండముల నంటఁట్టి ధట్టించుచో
డరి విజృంభించు రుఁ డనంగ;

1-4.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వెలయునట్టి దేవు వీరభద్రేశ్వరు; 
ఖిల దేవ గర్వ హరణ శూరు
నాత్మఁ దలఁచి మ్రొక్కి యద్దేవు రుణ నా
నములోన నమ్మి మహిమతోడ.

టీకా:

భవభక్తులు = శివభక్తులు; పాటించి = ఆదరించి; సలలిత = అందమైన; అంటఁబట్టి = బంధించి; ధట్టించుచో = బెదరించడంలో.

భావము:

వీరభద్రుడు భక్తులను కరుణించడంలో చల్లని వెన్నెల కురిపించే నిండు చందమామ. శరణు కోరిన వారిని రక్షించడంలో అందమైన వజ్రపంజరం. శివ ద్రోహులను భస్మం చేయడంలో ప్రళయకాలపు అగ్ని. బ్రహ్మాండాన్ని పట్టి బెదరించడంలో శివుడు. సర్వ దేవతల గర్వాన్ని అణచిన శూరుడు. అటువంటి దేవుణ్ణి నా మనస్సులో తలచుకొని, మ్రొక్కి, అతని మహిమను నమ్ముకున్నాను.

1-5-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

తల మల్లఁ జూచి పులకండము నెయ్యియుఁ బిండి యుండ్రముల్
పొరిఁబొరిఁగళ్ళు సేయుచును బుగ్గలఁ బెట్టుచుఁ బావుకొంచు న
చ్చెరువుగ లీలతో నమిలి చిక్కుచు సొక్కుచు గౌరి ముందఱన్
గురువులువారు వ్రేఁగడుపుఁ గుఱ్ఱఁడు మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడిన్.

టీకా:

అల్లన్ = తిన్నగా; పులకండము = కండచక్కెర; పొరిఁబొరిన్ = పైపైన; గురువులువారు = వేగంగా పరుగెత్తే; వ్రేఁగడుపుఁ గుఱ్ఱఁడు = పెద్దపొట్ట కలిగిన వినాయకుడు.

భావము:

చేతిలో కండచెక్కెర నేయి దట్టించిన ఉండ్రాళ్ళను పైపైన మాటిమాటికి చూస్తూ, బుగ్గలో పెట్టుకుంటూ, తీస్తూ, నములుతూ పార్వతి ముందు అందంగా పరుగెత్తే వినాయకుడు మాకు ప్రసన్ను డగును గాక!

1-6-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ల్పవల్లియుఁ బోలు కౌఁదీఁగె నునుకాంతి
మెఱుఁగుఁదీగెలతోడ మేలమాడ; 
సిఁడికుండలఁ బోలు పాలిండ్లుకవకట్టు
క్రవాకములతో సాటిసేయ; 
గండుమీలను బోలు న్నుల చెలువంబు
నీలోత్పలంబుల గేలిసేయ; 
నిండుచందురుఁ బోలు నెమ్మోము దీధితి
మలపత్రంబుల కాంతి నవ్వ;

1-6.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మొనసి నిఖిలభువనమోహలక్ష్మియై
రఁగుచున్న పద్మపాణి వాణి
న్ను నమ్మినారు నావారు వీరని
వాకు లిచ్చుగాత మాకు నెపుడు.

టీకా:

కల్పవల్లి = కల్పలత; కౌఁదీగె = తీగవంటి నడుము; కవకట్టు = జతకట్టే; చక్రవాకములతో = జక్కవ పక్షులతో; దీధితి = కాంతి; మొనసి = పూని; వాకులు = మాటలు.

భావము:

కల్పలత వంటి సన్నని నడుము యొక్క కాంతి మెరుపుతీగలను పరిహాసం చేస్తుండగా, బంగారు కుండలవంటి పాలిండ్లు జక్కవల జంటకు సమానం కాగా, గండుచేపల వంటి కళ్ళ అందం నల్ల కలువలను గేలి చేస్తుండగా, నిండు చంద్రుని వంటి ముఖం యొక్క కాంతి తామరరేకుల కాంతిని చూసి నవ్వుతుండగా పద్మాల వంటి చేతులతో భువనమోహన లక్ష్మివలె ఉన్న సరస్వతి “వీరు నన్ను నమ్మిన నావారు”; అంటూ మా కెల్లప్పుడు వాగ్వైభవాన్ని ఇచ్చుగాక!

1-7-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని యిష్టదేవతాప్రార్థనంబు సేసి..

భావము:

అని ఇష్టదేవతలను ప్రార్థించి...