పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : రైవతుని వృత్తాంతము

  •  
  •  
  •  

9-74-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యానతిచ్చిన బ్రహ్మకు నమస్కరించి, భూలోమునకుఁ జనుదెంచి, సోదర స్వజన హీనంబగు తన నగరంబున కా రాజు వచ్చి, బలభద్రుం గాంచి, రేవతీకన్య నతని కిచ్చి, నారాయణాశ్రమంబగు బదరికావనంబునకు నియమంబునఁ దపంబు జేయం జనియె.

టీకా:

అని = అని; ఆనతిచ్చినన్ = చెప్పిన; బ్రహ్మ = బ్రహ్మదేవుని; కున్ = కి; నమస్కరించి = మొక్కి; భూలోకమున్ = బూలోకమున; కున్ = కు; చనుదెంచి = వచ్చి; సోదర = తోటివారు; స్వజన = తనవారు; హీనంబు = లేనట్టిది; అగు = ఐన; తన = తనయొక్క; నగరంబున్ = పట్టణమున; కున్ = కు; ఆ = ఆ; రాజు = క్షత్రియుడు; వచ్చి = చేరి; బలభద్రునిన్ = బలరాముని; కాంచి = చూసి; రేవతీ = రేవతి యనెడి; కన్యన్ = అవివాహితను; అతను = అతని; కిన్ = కి; ఇచ్చి = భార్యగా ఇచ్చి; నారాయణ = నారాయణునికి; ఆశ్రమంబు = నివాసమైనట్టిది; అగు = ఐన; బదరికావనంబున్ = బదరికావనమున; కున్ = కు; నియమంబునన్ = నిష్ఠగా; తపంబున్ = తపస్సు; చేయన్ = చేయుటకు; చనియె = వెళ్ళెను.

భావము:

అలా చెప్పిన బ్రహ్మదేవునికి మొక్కి, భూలోకానికి వచ్చి తనవారు ఎవరు లేని తన పట్టణం చేరి, బలరామునికి రేవతిని భార్యగా ఇచ్చి, బదరికావనానికి తపస్సు చేసుకొనుటకు వెళ్ళాడు.