పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : రైవతుని వృత్తాంతము

  •  
  •  
  •  

9-73.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేవదేవుండు హరి, బలదేవుఁ డనఁగ
భూమి భారంబు మాన్పంగఁ బుట్టినాఁడు;
కలభూతాత్మకుఁడు నిజాంశంబుతోడ
యువతిమణి నిమ్ము జనమణి కున్నతాత్మ!"

టీకా:

మనుజేశ = రాజ; దీని = ఈమె; కై = కోసము; మది = మనసు; లోనన్ = అందు; తలచిన = భావించిన; వారలు = వారు; ఎల్లన్ = అందరును; కాలవశతన్ = చచ్చి {కాలవశత - కాలమునకు లొంగుట, చావు}; చనిరి = పోయిరి; వారల = వారియొక్క; బిడ్డలన్ = పిల్లలను; వారల = వారియొక్క; మనునలన్ = పిల్లలపిల్లలను; వారల = వారియొక్క; గోత్రంబు = వంశపు; వారిన్ = వారిని; ఐనన్ = అయినప్పటికిని; వినము = ఎవరుచెప్పలేరు; మేదిని = భూమి; మీదన్ = పైన; వినుము = తెలుసుకొనుము; నీవు = నీవు; వచ్చిన = ఇక్కడకొచ్చిన; ఈ = ఈకొద్దికాలము; లోనన్ = అందే; ఇఱువదియేడు = ఇరవైయేడు (27); మాఱులు = ఆవృత్తులు; ఒక్కొక్కటి = ఒక్కోటి; నాలుగు = నాలుగు (4); యుగములున్ = యుగములుచొప్పున; చనియెన్ = గడిచిపోయినవి; నీవు = నీవు; అటుగాన = అందుచేత; ధరణి = భూలోకమున; కిన్ = కు; అరుగుము = వెళ్ళు; ఇపుడు = ఇప్పుడు.
దేవదేవుండు = నారాయణుడు {దేవదేవుడు - దేవుళ్ళకే దేవుడు, విష్ణువు}; హరి = నారాయణుడు; బలదేవుడు = బలదేవుడు; అనగన్ = అనిపేరుగలవానిగా; భూమి = భూమాతకు; భారంబున్ = భారమును; మాన్పంగన్ = పోగొట్టుటకు; పుట్టినాడు = జన్మించెను; సకల = సమస్తమైన; భూత = జీవులలోను; ఆత్మకుడు = ఉండెడివాడు; నిజ = తన స్వంత; అంశంబు = అంశ; తోడన్ = తోటి; యువతి = స్త్రీ; మణిన్ = రత్నమువంటామెను; ఇమ్ము = భార్యగా ఇయ్యి; జనమణి = పురుషోత్తముని; కిన్ = కి; ఉన్నత = గొప్ప; ఆత్మ = మనసుకలవాడా.

భావము:

“ఓ రాజ! ఈమె కోసం నువ్వు అనుకున్న వారు అందరు చచ్చిపోయిరి. వారి పిల్లలు, వారిపిల్లల పిల్లలు, వారి వంశపు వారిని ఎవరినీ భూలోకంలో ఇప్పుడు ఎవరు చెప్పలేరు. తెలుసుకొనుము. నీవు ఇక్కడకు వచ్చిన ఈ కొద్ది సమయంలో ఇరవైయేడు (27) ఆవృత్తులు ఒక్కోటి నాలుగు యుగాలు చొప్పున గడిచిపోయాయి. అందుచేత, నీవు భూలోకానికి వెళ్ళు. ఇప్పుడు నారాయణుడు తన అంశతో బలదేవుడు అనే పేరుతో భూభారం తొలగించుటకు జన్మించాడు. ఈ స్త్రీరత్నాన్ని ఆయనకు భార్యగా ఇయ్యి.”