పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : రైవతుని వృత్తాంతము

  •  
  •  
  •  

9-72-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"చాల ముద్దరాలు, వరాలుఁ గొమరాలు
నీ శుభాత్మురాలి కెవ్వఁ డొక్కొ
గఁడు? చెప్పు" మనిన ది చూచి పకపక
వ్వి భూమిపతికి లువ పలికె.

టీకా:

చాల = మిక్కిలి; ముద్దరాలున్ = ముగ్ధ, అమాయకురాలు; జవరాలున్ = యౌవ్వనవతి; కొమరాలున్ = సౌందర్యవతి {కొమరాలు - కొమరు (మనోజ్ఞత) రాలు (కలామె), సుందరి}; ఈ = ఈ; శుభాత్మురాలి = మంచిమనసుగలామె; కిన్ = కు; ఎవ్వడున్ = ఎవరైనా; ఒక్క = ఒక; మగడు = భర్తను; చెప్పుము = తెలుపుము; అనిన్ = అనగా; అది = దానిని; చూచి = చూసి; పకపక = పకపకమని; నవ్వి = నవ్వి; భూమిపతి = రాజున {భూమిపతి - భూమి(రాజ్యాని)కిపతి, రాజు}; కిన్ = కు; నలువ = బ్రహ్మదేవుడు {నలువ - నలు(చతుర్) వ(ముఖుడు), బ్రహ్మ}; పలికె = చెప్పెను.

భావము:

“ముగ్ధ, అమాయకురాలు, యౌవ్వనవతి, సౌందర్యవతి, మంచిమనసుగల ఈ నా కూతురుకు తగిన భర్తను తెలుపుము.” అన్నాడు. దానికి బ్రహ్మదేవుడు పకపకమని నవ్వి రాజుతో ఇలా చెప్పాడు.