పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : రైవతుని వృత్తాంతము

  •  
  •  
  •  

9-71-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత నవసరంబయిన నజునికి నమస్కరించి, రైవతుండు రేవతిం జూపి యిట్లనియె.

టీకా:

అంతన్ = అప్పుడు; అవసరంబు = అవకాశము; అయినన్ = కుదరగా; అజున్ = బ్రహ్మదేవుని; కిన్ = కి; నమస్కరించి = మొక్కి; రైవతుండు = రైవతుడు; రేవతిన్ = రేవతిని; చూపి = చూపించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

పిమ్మట అవకాశం చూసుకుని బ్రహ్మదేవునికి మొక్కి రైవతుడు రేవతిని చూపించి ఈ విధముగ పలికాడు.