పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : రైవతుని వృత్తాంతము

 •  
 •  
 •  

9-70-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నర్తునకు రైవతాహ్వయుం డుదయించె-
తఁడు కుశస్థలి ను పురంబు
నీరధిలోపల నిర్మించి; పెంపుతో-
నానర్తముఖ విషయంబులేలె;
నియెఁ గకుద్మి ముఖ్యంబైన నందన-
తము; రైవతుఁడు విశాలయశుడు,
న కూఁతు రేవతి ధాత ముందటఁ బెట్టి-
గు వరు నడిగెడి లఁపుతోడఁ

9-70.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

న్యఁ దోడ్కొని బ్రహ్మలోమున కేగి
చట గంధర్వ కిన్నరు జుని మ్రోల
నాటపాటలు సలుపఁగ, వసరంబు
గాక నిలుచుండె, నతఁ డొక్క క్షణము తడవు.

టీకా:

ఆనర్తున్ = ఆనర్తుని; కున్ = కి; రైవత = రైవతుడు యనెడి; ఆహ్వయుండు = పేరుగలవాడు; ఉదయించెన్ = పుట్టెను; అతడు = అతను; కుశస్థలి = కుశస్థలి; అను = అనెడి; పురంబున్ = నగరమును; నీరధి = సముద్రము; లోపల = అందు; నిర్మించి = నిర్మాణముచేసి; పెంపు = అతిశయము; తోన్ = తోటి; ఆనర్త = ఆనర్తము; ముఖ = మున్నగు; విషయంబులున్ = దేశములను; ఏలెన్ = పరిపాలించెను; కనియెన్ = పొందెను; కకుద్మి = కకుద్మి; ముఖ్యంబు = మొదలగువారు; ఐన = అయిన; నందన = పుత్రులను; శతమున్ = నూరుమందిని; రైవతుడు = రైవతుడు; విశాల = గొప్ప; యశుడు = కీర్తిమంతుడు; కూతున్ = కూతురును; రేవతిన్ = రేవతిని; ధాత = బ్రహ్మదేవుని; ముందటన్ = ఎదురుగా; పెట్టి = నిలబెట్టి; తగు = తగినట్టి; వరున్ = పెండ్లికొడుకును; అడిగెడి = అడుగుదామనెడి; తలపు = భావము; తోడన్ = తోటి; కన్యన్ = అవివాహితను; తోడ్కొని = కూడాతీసుకెళ్ళి.
బ్రహ్మలోకమున్ = బ్రహ్మలోకమున; కున్ = కు; ఏగి = వెళ్ళి; అచటన్ = అక్కడ; గంధర్వ = గంధర్వులను; కిన్నరుల్ = కిన్నరులు; అజుని = బ్రహ్మదేవుని; మ్రోలన్ = ముందు; ఆట = నృత్య; పాటలన్ = సంగీతములను; సలుపగన్ = చేయుచుండెడి; అవసరంబు = చూడ అవకాశము; కాక = కుదరక; నిలుచుండెన్ = ఆగెను; అతడు = అతడు; ఒక్క = ఒక; క్షణము = కొద్ది; తడవు = కాలము.

భావము:

ఆనర్తునికి రైవతుడు పుట్టాడు. అతను కుశస్థలి అనె నగరం సముద్రంలో నిర్మించి, ఆనర్తము మున్నగు దేశములను పరిపాలించాడు. రైవతుడికి కకుద్మి మొదలగు పుత్రులు నూరుమంది, రేవతి అని కూతురుపుట్టారు. ఆ రేవతికి తగిన వరుడు ఎవరో చెప్పమని బ్రహ్మదేవుడిని అడుగుదామని ఆ కన్యకతో బ్రహ్మలోకం వెళ్ళాడు. అప్పుడు అక్కడ బ్రహ్మదేవుని ముందు గంధర్వులు కిన్నరులు నృత్య సంగీతాలను ప్రదర్శిస్తూ ఉన్నారు. అవకాశం కుదరక ఆయన కొద్ది సమయం ఆగాడు.