పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శర్యాతి వృత్తాంతము

  •  
  •  
  •  

9-53-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వారలంజూచి, రాజర్షి యగు శర్యాతి విస్మితుండై, “మీర లియ్యాశ్రమ దూషణంబు చేయనోపుదు; రది కారణంబుగా మీకీ నిరోధంబు సిద్ధించె” నని పలుకు నవసరంబునఁ దండ్రికి సుకన్యక యిట్లనియె.

టీకా:

వారలన్ = వారిపరిస్థితిని; చూచి = చూసి; రాజర్షి = రాజఋషి; అగు = ఐన; శర్యాతి = శర్యాతి; విస్మితుండు = ఆశ్ఛర్యపడినవాడు; ఐ = అయ్యి; మీరలు = మీరు; ఈ = ఈ; ఆశ్రమ = ఆశ్రమమునకు; దూషణంబున్ = అపరాధము; చేయనోపుదురు = చేసి ఉంటారు; అది = దాని; కారణంబుగా = వలన; మీ = మీ; కున్ = కు; ఈ = ఇట్టి; నిరోధంబు = స్తంబించుట; సిద్ధించెను = కలిగినది; అని = అని; పలుకు = చెప్పుతున్న్; అవసరంబునన్ = సమయమునందు; తండ్రి = (తన) నాన్న; కిన్ = కి; సుకన్యక = సుకన్యక; ఇట్లు = ఇలా; అనియె = చెప్పెను.

భావము:

వారి పరిస్థితిని చూసి రాజఋషి శర్యాతి ఆశ్ఛర్యపడ్డాడు. “మీరు ఈ ఆశ్రమనికి అపరాధము చేసి ఉంటారు. కనుకనే మీకు ఇలా స్తంబించుట కలిగింది.” అని అంటుంటే సుకన్యక తన తండ్రికి ఇలా చెప్పింది.