పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శర్యాతి వృత్తాంతము

 •  
 •  
 •  

9-51-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ర్యాతి యను రాజు నియించె బ్రహ్మప-
రుండైన మనువుకు రూఢితోడ;
తఁ డంగిరుని సత్రమందు రెండవనాఁటి-
విహితకర్మము లెల్ల వెలయఁ జెప్పె;
తని కూఁతురు సుకన్యక యను వనజాక్షి-
న తండ్రితోఁ దపోనికి నరిగి,
చ్యవనాశ్రమముఁ జేరి, ఖులును దానును-
లపుష్పములు గోయఁ బాఱి, తిరిగి

9-51.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

యొక్కపుట్టలోన నొప్పారు జ్యోతుల
రెంటిఁ గాంచి, వాఁడి ముంటఁ బొడిచెఁ;
న్య ముగుద మఱచి, ద్యోతయుగ మంచు,
దైవవశముకతనఁ మకి యగుచు.

టీకా:

శర్యాతి = శర్యాతి; అను = అనెడి; రాజు = రాజు; జనియించెన్ = పుట్టి; బ్రహ్మపరుండు = బ్రహ్మజ్ఞానియైనవాడు; ఐన = అయిన; మనువు = మనువు; కున్ = కు; రూఢిన్ = నిశ్చయించి; అతడు = అతడు; అంగిరుని = అంగిరుని; సత్రము = యజ్ఞము; అందున్ = లో; రెండవ = రెండవ (2); నాటి = దినమున; విహిత = చేయవలసిన; కర్మములు = కర్మకాండ; ఎల్లన్ = అంతటిని; వెలయన్ = ప్రసిద్ధముగా, వివరించి; చెప్పెన్ = చెప్పెను; అతని = అతనియొక్క; కూతురు = పుత్రిక; సుకన్యక = సుకన్యక; అను = అనెడి; వనజాక్షి = స్త్రీ {వనజాక్షి - వనజము (పద్మము)ల వంటి అక్షి (కన్నులుగలామె), స్త్రీ}; తన = తనయొక్క; తండ్రి = నాన్న; తోన్ = తోటి; చ్యవన్ = చ్యవనుని; ఆశ్రమమున్ = ఆశ్రమమును; చేరి = వెళ్ళి; సఖులునున్ = చెలికత్తెలు; తానున్ = తను; ఫల = ఫండ్లు; పుష్పములున్ = పూలు; కోయన్ = కోసుకొనుటకు; పాఱి = వెళ్ళి; తిరిగి = అక్కడ సంచరించి.
ఒక్క = ఒక; పుట్ట = వల్మీకము; లోనన్ = అందు; ఒప్పారు = చక్కగానున్న; జ్యోతులన్ = వెలుగుతున్నవానిని; రెంటిన్ = రెండింటిని (2); కాంచి = చూసి; వాడి = సూదిగానున్న; ముంటన్ = ముల్లుతో; పొడిచెన్ = పొడిచెను; కన్య = చిన్నపిల్ల; ముగుద = ముగ్ధత్వము; మఱచి = మరిచిపోయి; ఖద్యోత = మిణుగురు పురుగుల; యుగమున్ = జంట; అంచున్ = అనుచు; దైవవశమున = దైవనిర్ణయము; కతన = వలన; తమకి = తొందరబాటుగలామె; అగుచున్ = అగుచు.

భావము:

బ్రహ్మజ్ఞాని అయిన మనువుకు శర్యాతి అనె రాజు పుట్టాడు. అతడు అంగిరుని యజ్ఞములో రెండవ (2) దినం చేయవలసిన కర్మకాండ అంతటిని నిశ్చయించి, చక్కగా వివరించి చెప్పాడు. అతని పుత్రిక సుకన్యక. ఆమె తన తండ్రితో చ్యవనుని ఆశ్రమానికి వెళ్ళి, చెలికత్తెలుతో కలిసి పూలు పండ్లు కోసుకొనుటకు వెళ్ళింది. అక్కడ ఒక పుట్టలో చక్కగా ప్రకాశిస్తున్న రెండింటిని (2) చూసి, ఆ చిన్నది సుకన్యక ముగ్ధత్వము మరిచి మిణుగురు పురుగుల జంట అంటూ, సూదిగా ఉన్న ముల్లుతో పొడిచింది, దైవనిర్ణయము వలన ఆమె అలా తొందరబాటు పని చేసింది.