పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శర్యాతి వృత్తాంతము

  •  
  •  
  •  

9-51-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్యాతి యను రాజు నియించె బ్రహ్మప-
రుండైన మనువుకు రూఢితోడ;
తఁ డంగిరుని సత్రమందు రెండవనాఁటి-
విహితకర్మము లెల్ల వెలయఁ జెప్పె;
తని కూఁతురు సుకన్యక యను వనజాక్షి-
న తండ్రితోఁ దపోనికి నరిగి,
చ్యవనాశ్రమముఁ జేరి, ఖులును దానును-
లపుష్పములు గోయఁ బాఱి, తిరిగి

9-51.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యొక్కపుట్టలోన నొప్పారు జ్యోతుల
రెంటిఁ గాంచి, వాఁడి ముంటఁ బొడిచెఁ;
న్య ముగుద మఱచి, ద్యోతయుగ మంచు,
దైవవశముకతనఁ మకి యగుచు.

టీకా:

శర్యాతి = శర్యాతి; అను = అనెడి; రాజు = రాజు; జనియించెన్ = పుట్టి; బ్రహ్మపరుండు = బ్రహ్మజ్ఞానియైనవాడు; ఐన = అయిన; మనువు = మనువు; కున్ = కు; రూఢిన్ = నిశ్చయించి; అతడు = అతడు; అంగిరుని = అంగిరుని; సత్రము = యజ్ఞము; అందున్ = లో; రెండవ = రెండవ (2); నాటి = దినమున; విహిత = చేయవలసిన; కర్మములు = కర్మకాండ; ఎల్లన్ = అంతటిని; వెలయన్ = ప్రసిద్ధముగా, వివరించి; చెప్పెన్ = చెప్పెను; అతని = అతనియొక్క; కూతురు = పుత్రిక; సుకన్యక = సుకన్యక; అను = అనెడి; వనజాక్షి = స్త్రీ {వనజాక్షి - వనజము (పద్మము)ల వంటి అక్షి (కన్నులుగలామె), స్త్రీ}; తన = తనయొక్క; తండ్రి = నాన్న; తోన్ = తోటి; చ్యవన్ = చ్యవనుని; ఆశ్రమమున్ = ఆశ్రమమును; చేరి = వెళ్ళి; సఖులునున్ = చెలికత్తెలు; తానున్ = తను; ఫల = ఫండ్లు; పుష్పములున్ = పూలు; కోయన్ = కోసుకొనుటకు; పాఱి = వెళ్ళి; తిరిగి = అక్కడ సంచరించి.
ఒక్క = ఒక; పుట్ట = వల్మీకము; లోనన్ = అందు; ఒప్పారు = చక్కగానున్న; జ్యోతులన్ = వెలుగుతున్నవానిని; రెంటిన్ = రెండింటిని (2); కాంచి = చూసి; వాడి = సూదిగానున్న; ముంటన్ = ముల్లుతో; పొడిచెన్ = పొడిచెను; కన్య = చిన్నపిల్ల; ముగుద = ముగ్ధత్వము; మఱచి = మరిచిపోయి; ఖద్యోత = మిణుగురు పురుగుల; యుగమున్ = జంట; అంచున్ = అనుచు; దైవవశమున = దైవనిర్ణయము; కతన = వలన; తమకి = తొందరబాటుగలామె; అగుచున్ = అగుచు.

భావము:

బ్రహ్మజ్ఞాని అయిన మనువుకు శర్యాతి అనె రాజు పుట్టాడు. అతడు అంగిరుని యజ్ఞములో రెండవ (2) దినం చేయవలసిన కర్మకాండ అంతటిని నిశ్చయించి, చక్కగా వివరించి చెప్పాడు. అతని పుత్రిక సుకన్యక. ఆమె తన తండ్రితో చ్యవనుని ఆశ్రమానికి వెళ్ళి, చెలికత్తెలుతో కలిసి పూలు పండ్లు కోసుకొనుటకు వెళ్ళింది. అక్కడ ఒక పుట్టలో చక్కగా ప్రకాశిస్తున్న రెండింటిని (2) చూసి, ఆ చిన్నది సుకన్యక ముగ్ధత్వము మరిచి మిణుగురు పురుగుల జంట అంటూ, సూదిగా ఉన్న ముల్లుతో పొడిచింది, దైవనిర్ణయము వలన ఆమె అలా తొందరబాటు పని చేసింది.

9-52-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జ్యోతుల ముంటం బొడిచిన,
వాతుల నెత్తురులు గురిసె, సుధేశభట
వ్రాముల కెల్ల నచ్చట,
నా ఱి మలమూత్రబంధయ్యె; నరేంద్రా!

టీకా:

జ్యోతులన్ = వెలుగుతున్నవాటిని; ముంటన్ = ముల్లుతో; పొడిచినన్ = పొడవగా; వాతులన్ = నోటినుండి; నెత్తురులున్ = రక్తములు; కురిసెన్ = వర్షించెను; వసుధేశభట = రాజభటుల; వ్రాతముల్ = సమూహముల; కున్ = కి; ఎల్లన్ = అందరకు; అచటన్ = అక్కడ; ఆ = ఆ; తఱిన్ = సమయమునందు; మలమూత్ర = మలమూత్రములు; బంధము = స్తంభించిపోయినవి; అయ్యెన్ = అయినవి; నరేంద్రా = రాజా {నరేంద్రుడు - నరులకు ప్రభువు, రాజు}.

భావము:

రాజా! అలా వెలుగుతున్నవాటిని మిణుగురులు అనుకుని ముల్లుతో పొడవగా వాటినుండి రక్తాలు కారాయి. రాజభటులు అందరికి అక్కడ ఆ సమయంలో మలమూత్రాలు స్తంభించిపోయాయి.

9-53-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వారలంజూచి, రాజర్షి యగు శర్యాతి విస్మితుండై, “మీర లియ్యాశ్రమ దూషణంబు చేయనోపుదు; రది కారణంబుగా మీకీ నిరోధంబు సిద్ధించె” నని పలుకు నవసరంబునఁ దండ్రికి సుకన్యక యిట్లనియె.

టీకా:

వారలన్ = వారిపరిస్థితిని; చూచి = చూసి; రాజర్షి = రాజఋషి; అగు = ఐన; శర్యాతి = శర్యాతి; విస్మితుండు = ఆశ్ఛర్యపడినవాడు; ఐ = అయ్యి; మీరలు = మీరు; ఈ = ఈ; ఆశ్రమ = ఆశ్రమమునకు; దూషణంబున్ = అపరాధము; చేయనోపుదురు = చేసి ఉంటారు; అది = దాని; కారణంబుగా = వలన; మీ = మీ; కున్ = కు; ఈ = ఇట్టి; నిరోధంబు = స్తంబించుట; సిద్ధించెను = కలిగినది; అని = అని; పలుకు = చెప్పుతున్న్; అవసరంబునన్ = సమయమునందు; తండ్రి = (తన) నాన్న; కిన్ = కి; సుకన్యక = సుకన్యక; ఇట్లు = ఇలా; అనియె = చెప్పెను.

భావము:

వారి పరిస్థితిని చూసి రాజఋషి శర్యాతి ఆశ్ఛర్యపడ్డాడు. “మీరు ఈ ఆశ్రమనికి అపరాధము చేసి ఉంటారు. కనుకనే మీకు ఇలా స్తంబించుట కలిగింది.” అని అంటుంటే సుకన్యక తన తండ్రికి ఇలా చెప్పింది.

9-54-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"య్య! యీ పుట్టచేరువ నాడి యాడి,
యిందులో రెండు జ్యోతుల నేను గాంచి,
కంటకంబునఁ బొడువ రక్తంబు గురిసె,
నే విధంబునఁ గురిసెనో? యెఱుఁగు మీవు."

టీకా:

అయ్య = తండ్రి; ఈ = ఈ; పుట్ట = వల్మీకము; చేరువన్ = దగ్గర; ఆడియాడి = బాగాఆడి; ఇందు = దీని; లోన్ = లోని; జ్యోతులన్ = వెలుగులను; నేనున్ = నేను; కాంచి = చూసి; కంటకంబునన్ = ముల్లుతో; పొడవన్ = పొడవగా; రక్తంబున్ = రక్తములు; కురిసెన్ = వర్షించెను; ఏ = ఏ; విధంబునన్ = కారణముచేత; కురిసెనో = వర్షించినవో; ఎఱుగము = తెలిసికొనుము; ఈవు = నీవు.

భావము:

“తండ్రి! ఈ వల్మీకము దగ్గర ఆడుకుని, దీనిలో రెండు జ్యోతులను చూసి, నేను ముల్లుతో పొడవగా వాటినుండి రక్తాలు కారాయి. నీవు కారణం ఏమిటో తెలిసికొనుము.”

9-55-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన శర్యాతి భీతుండై కూఁతుం దోడ్కొని, వల్మీకంబు కడకుం జని, యందుఁ దపంబు జేయుచున్న చ్యవనునిం గని, తన నేర్పున నతని వలనఁ బ్రసన్నత పడసి తపసి చిత్తంబు నెఱింగి, తన పుత్రిక నిచ్చి, యెట్టకేలకుం బ్రదికినవాఁడై, మునీశ్వరుని వీడ్కొని, పురంబునకుం జనియె; నంత.

టీకా:

అనినన్ = అనగా; శర్యాతి = శర్యాతి; భీతుండు = భయపడినవాడు; ఐ = అయ్యి; కూతున్ = పుత్రికను; తోడ్కొని = కూడాతీసుకొని; వల్మీకంబు = పుట్ట; కడ = వద్ద; కున్ = కు; చని = వెళ్ళి; అందున్ = దానిలో; తపంబున్ = తపస్సు; చేయుచున్న = చేస్తున్న; చ్యవనునిన్ = చ్యవనుని; కని = కనుగొని; తన = తనయొక్క; నేర్పునన్ = నేర్పరితనముచేత; అతని = అతని; వలన = నుండి; ప్రసన్నతన్ = అనుకూల్యతను; పడసి = పొంది; తపసి = మునియొక్క; చిత్తంబున్ = మనసును; ఎఱింగి = తెలిసికొని; తన = తనయొక్క; పుత్రికను = కుమార్తెను; ఇచ్చి = పెండ్లిచేసి; ఎట్టకేలకున్ = చిట్టచివరకి; బ్రదికినవాడు = బైటపడినవాడు; ఐ = అయ్యి; మునీశ్వరునిన్ = ఋషివద్ద; వీడ్కొని = సెలవుతీసుకొని; పురంబున్ = నగరమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; అంత = అంతట.

భావము:

అనగా శర్యాతి భయపడి పుత్రికను వెంటబెట్టుకుని పుట్ట వద్దకు వెళ్ళి, దానిలో తపస్సు చేస్తున్న చ్యవనుని కనుగొని, తన తెలివితేటలతో అతనిని ప్రసన్నుని చేసుకున్నాడు. ముని మనసును తెలిసికొని తన కుమార్తెను ఇచ్చి పెండ్లిచేసి చిట్టచివరకి ఆ ప్రమాదం నుండి బైటపడ్డాడు. పిమ్మట ఋషివద్ద సెలవు తీసుకొని తన నగరానికి వెళ్ళాడు. అంతట.....

9-56-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రమకోపుఁ డయిన భార్గవుఁ బతిఁ జేరి
మిగులఁ బనుల యెడల మెచ్చఁ దిరిగి
తని పర్ణశాల నా సుకన్యక యను
గువ గొన్ని యేండ్లు నువు మనియె.

టీకా:

పరమ = మిక్కిలి; కోపుడు = కోపిష్టి; అయిన = ఐనట్టి; భార్గవున్ = చ్యవనమహర్షిని; పతిన్ = భర్తగాచేసుకొని; చేరి = వద్దకువెళ్లి; మిగులన్ = మిక్కిలిగ; పనులన్ = గృహకృత్యముల; ఎడలన్ = అందు; మెచ్చన్ = మెప్పుపొందునట్లుగా; తిరిగి = నడచుకొనుచు; అతని = అతనియొక్క; పర్ణశాలన్ = ఆశ్రమమును, పాకను {పర్ణశాల - పర్ణ (ఆకుల) శాల (ఇల్లు), ఆశ్రమము}; ఆ = ఆ; సుకన్యక = సుకన్యక; అను = అనెడి; మగువ = ఇంతి; కొన్ని = కొద్ది; ఏండ్లు = సంవత్సరములు; మనువు = కాపురము; మనియె = చేసెను.

భావము:

మిక్కిలి కోపిష్టి అయిన చ్యవనమహర్షిని భర్తగా చేసుకొని, సుకన్యక దరిచేరి, మెప్పుపొందేలా ఆయన ఆశ్రమ పర్ణశాలలో గృహకృత్యములు శ్రద్దగా చేస్తూ, మంచి నడతతో కొంత కాలం కాపురము చేసింది.

9-57-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత నొకనాఁ డయ్యాశ్రమంబునకు వేల్పువెజ్జులైన నాసత్యు లిద్దఱు వచ్చిన వారలం బూజించి, తన ముదిమి జూపి, చ్యవనుం డిట్లనియె “మీకు మున్ను యాగభాగంబుల లేని సోమపానంబు నేఁడు గల్పించి యిచ్చెద; సోమపాన సమయంబునఁ బానపాత్రంబు మీకు నందిచ్చెద, నా ముదిమి మానుపుం” డని యిట్లనియె.

టీకా:

అంతన్ = అంతట; ఒక = ఒక; నాడు = దినమున; ఆ = ఆ; ఆశ్రమంబున్ = ఆశ్రమమున; కున్ = కు; వేల్పు = దేవతలయొక్క; వెజ్జులు = వైద్యులు; ఐన = అయిన; నాసత్యులు = అశ్వినీదేవతలు; ఇద్దఱున్ = ఇద్దరు (2); వచ్చినన్ = రాగా; వారలన్ = వారిని; పూజించి = కొలిచి; తన = తనయొక్క; ముదిమిన్ = ముసలితనమును; చ్యవనుండు = చ్యవనుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; మీ = మీ; కున్ = కు; మున్ను = ఇంతకుముందు; యాగభాగంబులన్ = హవిర్భాగములలో; లేని = లేనట్టి; సోమపానంబున్ = సోమపానమును; నేడున్ = ఇప్పుడు; కల్పించి = కలుగజేసి; ఇచ్చెదన్ = ఇస్తాను; సోమపాన = సోమపానముచేసెడి; సమయంబునన్ = సమయమునందు; పాన = తాగుటకైన; పాత్రన్ = పాత్రను; మీ = మీ; కున్ = కును; అందిచ్చెదన్ = చేతికిచ్చెదను; నా = నాయొక్క; ముదిమిన్ = ముసలితనమును; మానుపుడు = పోగొట్టండి; అని = అని; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలకెను.

భావము:

అంతట, ఒకనాడు ఆ ఆశ్రమానికి దేవతా వైద్యులు అయిన అశ్వినీదేవతలు ఇద్దరు రాగా వారిని చక్కగా కొలిచి, చ్యవనుడు ఇలా పలికెను. “మీకు ఇంతకు ముందు హవిర్భాగములలో లేనట్టి సోమపానమును ఇప్పుడు కలుగజేస్తాను. సోమపాన పాత్రను మీ చేతికిస్తాను. నా ముసలితనము పోగొట్టండి.” అని మరల ఇలా అన్నాడు.

9-58-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నకంబగు ప్రాయంబున
రాండ్రఁ గరంచు మేని క్కఁదనంబున్
శితరముగఁ గృప జేయుఁడు
దివిజాధిప వైద్యులార! దీవింతు మిమున్."

టీకా:

నవకంబు = లేతది, కోమలము; అగు = ఐన; ప్రాయంబునన్ = వయసునందు; జవరాండ్రన్ = స్త్రీలను; కరంచు = వశీకరించుకొనగల; మేని = దేహపు; చక్కదనంబున్ = అందముతో; శివతరముగ = మంగళకరమగునట్లు; కృపజేయుడు = దయచేయండి; దివిజాధిప = దేవేంద్రుని; వైద్యులారా = వైద్యులు; దీవింతున్ = దీవించెదను; మిమున్ = మిమ్ములను.

భావము:

“దేవవైద్యులారా! మిమ్మల్ని దీవిస్తాను. నా దేహాన్ని తరుణ వయసు కలిగి, స్త్రీలను వశీకరించుకొనగల అందంతో మంగళకరం అయ్యేలా చేయండి.”

9-59-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన నశ్వినిదేవతలు సంతోషించి “సిద్ధనిర్మితంబయిన యీ మడుఁగున మునుఁగు” మని పలికి.

టీకా:

అనినన్ = అనగా; అశ్వినిదేవతలు = అశ్వినీదేవతలు; సంతోషించి = ఆనందించి; సిద్ద = సిద్ధులచే; నిర్మితంబు = తయారుచేయబడినది; అయిన = ఐన; ఈ = ఈ; మడుగునన్ = చెరువునందు; మునుగుము = స్నానముచేయుము; అని = అని; పలికి = చెప్పి.

భావము:

ఇలా చ్యవనుడు అనగా, అశ్వినీదేవతలు ఆనందించి “ఈ సిద్ధసరోవరములో స్నానము చేయుము.” అని చెప్పి.

9-60-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ముసలితాపసుఁ బట్టి, మొగి నెత్తుకొనిపోయి-
ముగురు నా మడుఁగున మునిఁగి లేచి,
నితాజనుల నెల్ల లపించువారలై-
సుందర మూర్తులై, సుభగు లగుచుఁ,
మలమాలికలతోఁ, నకకుండలముల-
తోఁ, మంచిచీరలతోడఁ దుల్యు
లై సూర్యతేజస్కులై యున్నవారల-
మువ్వురఁ బొడగాంచి, ముగుద బాల

9-60.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యిందుఁ బెనిమిటి వీఁ డని యెఱుఁగ లేక
రిత గావున నిజనాథుఁ గానఁ గోరి
"సుభగమతులార! నా నాథుఁ జూపుఁ" డనుచు
శ్విదేవతల కపు డ య్యబల మ్రొక్కె.

టీకా:

ముసలి = ముసలివాడైన; తాపసున్ = ఋషిని; పట్టి = పట్టుకొని; మొగిన్ = పూనికతో; ఎత్తుకొనిపోయి = తీసుకెళ్ళి; ముగురున్ = ముగ్గురు (3); ఆ = ఆ; మడుగునన్ = సరస్సునందు; మునిగి = ములిగి; లేచి = బయటికి వచ్చి; వనితాజనులన్ = ఆడవారిని; ఎల్లన్ = అందరను; వలపించు = ఆకర్షించెడి; వారలు = వారువలె; ఐ = అయ్యి; సుందర = అందమైన; మూర్తులు = రూపములుగలవారు; ఐ = అయ్యి; సుభగులు = మనోహరులు; అగుచున్ = ఔతూ; కమల = పద్మముల; మాలికలు = దండల; తోన్ = తోటి; కనక = బంగారపు; కుండలముల్ = చెవికుండలముల; తోన్ = తోటి; మంచిచీరల = మంచి బట్టలతో; తోడన్ = తోటి; తుల్యులు = సమానమైనవారు; ఐ = అయ్యి; సూర్య = సూర్యుని వంటి; తేజస్కులు = తేజస్సుగలవారు; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; వారలన్ = వారిని; మువ్వురన్ = ముగ్గురిని; పొడగాంచి = గమనించి; ముగుద = ముగ్ధ, అమాయకురాలైన; బాల = పిన్నవయసామె.
అందున్ = వారిలో; పెనిమిటి = (తన) భర్త; వీడు = ఇతడు; అని = అని; ఎఱుగలేక = తెలిసికొనలేక; గరిత = పతివ్రత; కావున = కనుక; నిజ = తనయొక్క; నాథున్ = భర్తను; కానన్ = చూడవలెనని; కోరి = ఆశించి; సుభగ = పుణ్యవంతమైన; మతులారా = జ్ఞానులు; నా = నాయొక్క; నాథున్ = భర్తను; చూపుడు = చూపించండి; అనుచు = అంటూ; అశ్విదేవతల్ = అశ్వినీదేవతల; కు = కు; అపుడు = అప్పుడు; ఆ = ఆ; అబల = స్త్రీ; మ్రొక్కె = ప్రార్థించెను.

భావము:

ఆ ముసలి ఋషిని పట్టుకొని పూనికతో తీసుకెళ్ళి ముగ్గురు ఆ సరస్సునందు ములిగి, స్త్రీలను మిక్కిలి ఆకర్షించే అందంతో మనోహరులుగా అయి బయటికి వచ్చారు. ముగ్ధ, అమాయక సుకన్యక, పద్మముల దండలు, బంగారు చెవికుండలముల తోటి మన్మథునితో సమానమైన అందంతో, సూర్యుని వంటి తేజస్సుతో ఉన్నట్టి వారిని ముగ్గురిని చూసింది. వారిలో తన భర్త ఎవరో తెలిసికొనలేక పోయింది. పతివ్రత కనుక, అప్పుడు తన భర్తను చూపించండి అంటూ పుణ్యులు అశ్వినీదేవతలను ప్రార్థించింది.

9-61-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వార లా పతివ్రత నిజమరితనంబునకు మెచ్చి, వయోరూపసంపన్నుం డయిన చ్యవనుం జూపి, దంపతుల వీడ్కొని, విమానారూఢులై వేలుపుల ప్రోలికిం జని రంత.

టీకా:

వారలున్ = వారు; ఆ = ఆ; పతివ్రత = పతివ్రతయొక్క; నిజమరితనంబున్ = సత్యశీలమున; కున్ = కు; మెచ్చి = మెచ్చుకొని; వయస్ = యౌవనము; రూప = అందములనెడి; సంపన్నుండు = అధికముగాగలవాడు; అయిన = ఐన; చ్యవనున్ = చ్యవనుని; చూపి = చూపించి; దంపతులన్ = భార్యాభర్తలవద్ద; వీడ్కొని = సెలవుతీసుకొని; విమాన = విమానమును; ఆరూఢులు = ఎక్కినవారు; ఐ = అయ్యి; వేలుపులప్రోలు = స్వర్గమున {వేలుపులప్రోలు - వేలుపుల (దేవతలయొక్క) ప్రోలు (పట్టణము), స్వర్గము}; కిన్ = కి; చనిరి = వెళ్ళిరి; అంత = అంతట.

భావము:

వారు ఆ పతివ్రత సత్యశీలాలను మెచ్చుకొని మిక్కిలి యౌవనం అందం కలిగిన చ్యవనుని చూపించి భార్యాభర్తల వద్ద సెలవుతీసుకొని విమానమును ఎక్కిన స్వర్గానికి వెళ్ళిపోయారు. అంతట....

9-62-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యాగంబు చేయంగ ర్థించి శర్యాతి-
చ్యవనమునీంద్రు నాశ్రమము కడకుఁ
గూఁతు నల్లునిఁ దోడుకొనిపోవు వేడుక-
చ్చి పుత్రికకుఁ బార్శ్వంబు నందు
సూర్యతేజంబున సొంపారు వరుఁ గని-
  "వీ డెవ్వఁడో దీని విభుఁడు గాఁడు,
చెల్లరే!"యని పుత్రి చేసిన ప్రియములు-
మొక్కులు నొల్లక మోము వాంచి

9-62.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మాఱుమాటాడ దీవింప నసు రోసి
"చ్యవనుఁ డధికుండు మునిజన త్తముండు
భువన సన్నుతుఁ డతఁ డెందు బోయె నాతఁ
డెట్లు వంచింపఁబడియె? వీఁడెవ్వఁ? డబల!

టీకా:

యాగంబున్ = యజ్ఞమును; చేయంగన్ = చేయవలెనని; అర్థించి = అనుకొని; శర్యాతి = శర్యాతి; చ్యవన = చ్యవనుడు యనెడి; ముని = మునులలో; ఇంద్రున్ = ఇంద్రుని వంటివాని; ఆశ్రమమున్ = ఆశమము; కడ = వద్ద; కున్ = కు; కూతున్ = పుత్రికను; అల్లునిన్ = అల్లుడిని; తోడ్కొనిపోవు = తీసుకెళ్ళెడి; వేడుకన్ = కుతూహలముతో; వచ్చి = వచ్చి; పుత్రిక = కూతురు; పార్శ్వంబున్ = చెంత; అందున్ = లో; సూర్య = సూర్యునితో సమానమైన; తేజంబునన్ = తేజస్సుతో; సొంపారు = సుందరముగానున్న; వరున్ = యువకుని; కని = చూసి; వీడు = ఇతను; ఎవ్వడో = ఎవరో; దీని = ఈమెయొక్క; విభుడు = భర్త; కాడు = కాడు; చెల్లరే = అయ్యో; అని = అని; పుత్రి = కూతురు; చేసిన = ఆచరిస్తున్న; ప్రియములు = మర్యాదలు; మొక్కులు = పూజలు; ఒల్లక = అంగీకరింపక; మోము = ముఖము; వాంచి = వంచుకొని.
మాఱు = సమాధానము; మాటాడన్ = చెప్పుటకు; దీవింపన్ = దీవించుటకు; మనసున్ = మనసు; రోసి = వ్యతిరేకిస్తుండగా; చ్యవనుడు = చ్యవనుడు; అధికుండు = గొప్పవాడు; ముని = మునుల; జన = అందరిలోను; సత్తముండు = శ్రేష్ఠుడు; భువన్ = లోకములచే; సన్నుతుడు = కీర్తింపబడువాడు; ఎందున్ = ఎక్కడకు; పోయెన్ = వెళ్ళెను; ఆతడు = అతని; ఎట్టు = ఎలా; వంచింపబడియెన్ = మోసగింపబడెను; వీడు = ఇతను; ఎవ్వడు = ఎవరు; అబల = స్త్రీ {అబల - బలము లేనామె, స్త్రీ}.

భావము:

యాగం చేయాలని సంకల్పించి శర్యాతి పుత్రికను అల్లుడిని తీసుకెళ్దామని, చ్యవనుని ఆశ్రమానికి వచ్చాడు. అలా వచ్చి కూతురు చెంత సూర్యుసమ తేజస్సుతో బహు సుందరంగా ఉన్న యువకుని చూసి “ఇతను ఎవరో పరాయివాడులా ఉన్నాడు. ఈమె భర్త ఐతే కాడు. అయ్యో!” అని కూతురు చేస్తున్న మర్యాదలు పూజలు అంగీకరింపక సమాధానం చెప్పక, దీవించక, ముఖం వంచుకొని ఉన్నాడు. “ముని చ్యవనుడు ఎక్కడకు వెళ్ళాడు. అంతటి వానిని ఎలా మోసగించావు, ఇతను ఎవరు...

9-63-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వే? ధర్మమె? శీలమే? కులజ వై, ర్పించి మోదింప, నా
దారాధ్యునిఁ, బుణ్యశీలుఁ, దపసిన్, సాధ్వీమనస్సమ్మతున్,
నిన్ మాని, భుజంగుఁ బొందఁ దగునే? మానంబు వాటింపఁగా
దే? దుర్గతిఁ ద్రోచితే కఠిన వై తండ్రిం బతిం గూఁతురా!

టీకా:

తగవే = న్యాయసమ్మతమా, కాదు; ధర్మమె = ధర్మబద్ధమా, కాదు; శీలమే = మంచినడతా, కాదు; కులజవు = ఉత్తమవంశస్థురాలవు; ఐ = అయ్యి; దర్పించి = ఉద్ధతినొంది; మోదింపన్ = సంతోషించేలాగ; ఆ = ఆ; జగత్ = లోకముచే; ఆరాధ్యునిన్ = పూజింపబడువానిని; పుణ్యు = పవిత్రమైన; శీలున్ = నడవడికగలవానిని; తపసిన్ = ఋషిని; సాధ్వీ = పతివ్రతల; మనస్ = మనసులకు; సమ్మతున్ = అంగీకారమైనవానిని; మగనిన్ = భర్తను; మాని = వదలిపెట్టి; భుజంగున్ = విటుని; పొందగాన్ = చేరుట; తగునే = తగినపనా, కాదు; మానంబున్ = మానమును; పాటింపగాన్ = పాటించుట; తగదే = వలదా, వలెను; దుర్గతిన్ = నరకమార్గమున; త్రోచితే = పడవేసితివికదే; కఠినవు = దయమాలినదానవు; ఐ = అయ్యి; తండ్రిన్ = నాన్నను; పతిన్ = మొగుడుని; కూతురా = పుత్రీ.

భావము:

పుత్రీ! ఉత్తమవంశస్థురాలవు కదా? నీకు ఇది న్యాయమూ కాదు, ధర్మమూ కాదు, మంచిదీ కాదు. ధర్మం వదలి ఆ లోకపూజితుడు పవిత్రుడు అయిన చ్యవనుని భర్తను వదలిపెట్టి ఇలా విటుని చేరడం తగదు, మాన మర్యాదలు తప్పుట తగదు. దయమాలి తండ్రిని, మొగుడుని నరకమార్గాన పడవేసావు కదే.

9-64-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ద్మనయన! మగఁడు ప్రాయంపు వాడైనఁ
గాపు పెట్టి కొంతఁ గావ నేర్చుఁ
డఁగి ముసలి తపసి గావంగ నేర్చునే
యువతి ముదుకఁ గూర్ప నొప్ప దెందు."

టీకా:

పద్మనయన = సుందరీ {పద్మనయన - పద్మములవంటి కన్నులున్నామె, స్త్రీ}; మగడు = భర్త; ప్రాయంపు = వయసులోనున్నట్టి; వాడు = వాడు; ఐనన్ = అయినచో; కాపు = కాపలా; పెట్టి = కాసి; కొంతన్ = కొంతవరకు; కావన్ = కాపడుకొనుట; నేర్చున్ = చేయగలడు; కడగి = ప్రయత్నించి; ముసలి = పెద్దవయసువాడైన; తపసి = ముని; కావంగన్ = కాపాడుట; నేర్చున్ = చేయగలడా, లేడు; యువతిన్ = పడచుపిల్లని; ముదుకన్ = ముసలివానికి; కూర్చన్ = కట్టబెట్టుట; ఒప్పదు = సరిపడదు; ఎందున్ = ఎక్కడా.

భావము:

సుకన్యక! అవునులే, ఎక్కడైనా పడచుపిల్లని ముసలివాడికి కట్టబెట్టరాదు. భర్త వయసులో ఉండి ఉంటే, కాపలా కాసైనా కాపడుకొనేవాడు. ముసలి ముని కాపాడలేడు కదా.”

9-65-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికిన నప్పరమప్రతివ్రతాలలామంబు చిఱునగవు చెక్కుటద్దంబులఁ జిడిముడిపడఁ దండ్రి కిట్లనియె.

టీకా:

అని = అని; పలికిన్ = అనగా; ఆ = ఆ; పతివ్రతా = పతివ్రతలలో; లలామంబు = శ్రేష్ఠురాలు; చిఱునగవు = చిరునవ్వు; చెక్కుటన్ = చెక్కిళ్ళనే; అద్దంబులన్ = అద్దలములపై; చిడిముడిపడన్ = తొణికిసలాడుతుండగా; తండ్రిన్ = కన్నవాని; కిన్ = కి; ఇట్లు = ఇలా; అనియె = చెప్పెను;

భావము:

ఇలా దూరుతున్న తండ్రిని చూసి, ఆ పతివ్రత చిరునవ్వు తొణికిసలాడుతుండగా కన్నతండ్రికి ఇలా చెప్పింది.

9-66-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నియ్యల్లు డితఁడు భార్గవుఁ
య్యా! జారుండు గాఁడు; ర్షముతోడన్
నెయ్యంబు నిల్పు" మంచును
దొయ్యలి సర్వంబుఁ దండ్రితో వినిపించెన్.

టీకా:

నీ = నీయొక్క; అల్లుడు = జామాత; ఇతడు = ఇతను; భార్గవుడు = చ్యవనుడు; అయ్యా = తండ్రి; జారుండు = రంకులాడు; కాడు = కాడు; హర్షము = సంతోషము; తోడన్ = తోటి; నెయ్యంబు = ఆదరమును; నిల్పుము = ఉంచుము; అంచున్ = అనుచు; తొయ్యలి = సుందరి; సర్వంబున్ = అంతటిని; తండ్రి = నాన్న; తోన్ = తోటి; వినిపించెన్ = చెప్పెను.

భావము:

“తండ్రి! ఇతను నీ అల్లుడు చ్యవనుడే. రంకులాడు కాడు. సంతోషంగా ఆదరించు.” అంటూ ఆ సుందరి జరిగింది అంత చెప్పింది.

9-67-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత శర్యాతియు నప్రమత్తుండై, కూఁతుం గౌగలించుకొని, గారవంబున “నయిదువవు గ” మ్మని దీవించె; నంత భార్యాసహితుండై చ్యవనుండు చని, తన మామకు యాగంబు చేయించి, యొక్క పాత్రంబున సోమభాగంబుఁ బట్టి, నిజ తపోబలంబున నశ్విదేవతల కర్పించినం జూచి.

టీకా:

అంత = అంతట; శర్యాతియున్ = శర్యాతి; అప్రమత్తుండు = సంతోషించినవాడు; ఐ = అయ్యి; కూతున్ = కుమార్తెను; కౌగలించుకొని = ఆలింగనముచేసుకొని; గారవంబునన్ = గారాముతో, ప్రీతితో; అయిదువవు = చిరకాలసౌభాగ్యవతివిగ {అయిదువ - 5 వన్నెలు (1మెడలో మంగళసూత్రము 2కాలికి పసుపు 3నుదుట కుంకుమ 4చేతికి గాజులు 5కాలివేళ్ళకి మట్టెలు) కలామె, పునిస్త్రీ}; కమ్ము = ఐ ఉండుము; అని = అని; దీవించెన్ = ఆశీర్వదించెను; అంత = అప్పుడు; భార్యా = పెండ్లముతో; సహితుండు = కూడియున్నవాడు; ఐ = అయ్యి; చ్యవనుండు = చ్యవనుడు; చని = వెళ్ళి; తన = తనయొక్క; మామ = మావగారి; కున్ = కి; యాగంబున్ = యజ్ఞమును; చేయించి = చేయించి; ఒక్క = ఒక; పాత్రంబునన్ = గిన్నెలో; సోమ = సోమరసము; భాగంబున్ = పాలు; పట్టి = చేర్చి; నిజ = తనయొక్క; తపస్ = తపస్సుయొక్క; బలంబునన్ = శక్తివలన; అశ్విదేవతల్ = అశ్వినీదేవతల; కిన్ = కి; అర్పించినన్ = అందించగా; చూచి = చూసి;

భావము:

అప్పుడు, శర్యాతి సంతోషించి, కుమార్తెను ఆలింగనము చేసుకొని గారాముతో, ప్రీతితో “చిరకాల సౌభాగ్యవతివి, పునిస్త్రీవి కమ్ము.” అని ఆశీర్వదించాడు. పిమ్మట, సతితో చ్యవనుడు వెళ్ళి మావగారికి యాగం చేయించాడు. ఒక గిన్నెలో సోమరసం పాలు చేర్చి తన తపోశక్తితో అశ్వినీదేవతలకి అందించాడు. అది చూసి....

9-68-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కోముతోడను వాసవుఁ
డేపున ముని పైని వజ్రమెత్తిన, మరలం
దాసుఁడు వజ్రిభుజమున,
నా వి నిలిపెన్ జగంబు లాశ్చర్యపడన్.

టీకా:

కోపము = కినుక; తోడను = తోటి; వాసవుడు = ఇంద్రుడు {వాసవుడు - వసువులు (రత్నములు) కలవాడు, ఇంద్రుడు}; ఏపునన్ = అతిశయించి; ముని = ఋషి; పైని = మీద; వజ్రమున్ = వజ్రాయుధమును; ఎత్తిన = సంధించగా; మరలన్ = తిరిగి; తాపసుండు = ఋషి; వజ్రి = ఇంద్రుని {వజ్రి - వజ్రాయుధముగలవాడు, ఇంద్రుడు}; భుజమునన్ = భుజముమీద; ఆ = ఆ; పవిన్ = వజ్రాయుధమును {పవి - ఎల్లపుడు చరించునది, కులిశము, వజ్రము}; నిలిపెన్ = స్తంభింపజేసెను; జగంబుల్ = లోకములు; ఆశ్చర్యపడన్ = చకితులగునట్లు.

భావము:

ఇంద్రుడు కినుకతో ఋషి మీద వజ్రాయుధాన్ని సంధించబోగా, తిరిగి ఋషి ఇంద్రుని భుజంమీద ఉన్న ఆ వజ్రాయుధాన్ని అక్కడే స్తంభించేలా చేసాడు. సకల లోకాలలోని జనులు చకితులు అయ్యారు.

9-69-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇవ్విధంబున నశ్విదేవత లిద్దఱు వైద్యులై, సోమపానంబు లేని వారయ్యుఁ, జ్యవను సామర్థ్యంబునఁ బ్రాప్తభాగులయి చనిరి; శర్యాతికి నుత్తానబర్హియు, నానర్తుండును, భూరిషేణుండు నను మువ్వురు గొడుకులు గలిగి; రందు.

టీకా:

ఈ = ఈ; విధంబునన్ = విధముగా; ఆ = ఆ; అశ్విదేవతలు = అశ్వినీదేవతలు; ఇద్దఱున్ = ఇద్దరు (2); వైద్యులు = చికిత్సకులు; ఐ = అయ్యి; సోమ = సోమరసమును; పానంబు = తాగుట; లేని = లేనట్టి; వారు = వారు; అయ్యున్ = అయినప్పటికిని; చ్యవను = చ్యవనుని; సామర్థ్యంబున = నేర్పరితనమువలన; ప్రాప్త = పొందబడిన; భాగులు = భాగము కలవారు; అయి = అయ్యి; చనిరి = పోయిరి; శర్యాతి = శర్యాతి; కిన్ = కి; ఉత్తానబర్హియున్ = ఉత్తానబర్హి; ఆనర్తుండును = ఆనర్తుండు; భూరిషేణుండున్ = భూరిషేణుండు; అను = అనెడి; మువ్వురు = ముగ్గురు; కొడుకులు = పుత్రులు; కలిగిరి = పుట్టిరి; అందున్ = వారిలో.

భావము:

ఈ విధముగా అశ్వినీదేవతలు అంతకు ముందు సోమభాగం లేకపోయినా, చ్యవనునివలన సోమభాగం పొందారు. శర్యాతికి ఉత్తానబర్హి, ఆనర్తుడు, భూరిషేణుడు అని ముగ్గురు పుత్రులు పుట్టారు.