పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పూర్ణి

  •  
  •  
  •  

9-735-మాలి.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దవనవిహారీ! త్రులోకప్రహారీ!
సుగుణవనవిహారీ! సుందరీమానహారీ!
వితకలుషపోషీ! వీరవిద్యాభిలాషీ!
స్వగురుహృదయతోషీ! ర్వదా సత్యభాషీ!

టీకా:

జగదవనవిహారీ = శ్రీరామా {జగదవనవిహారుడు - లోకముల రక్షణకై సంచరించెడివాడు. రాముడు}; శత్రులోకప్రహారీ = శ్రీరామా {శత్రులోకప్రహారుడు - శత్రువులందరిని దండించెడివాడు, రాముడు}; సుగుణవనవిహారీ = శ్రీరామా {సుగుణవనవిహారుడు - సుగుణములనెడి వనమునందు విహరించువాడు, రాముడు}; సుందరీమానహారీ = శ్రీరామా {సుందరీమానహారుడు - అందగత్తెల అభిమానమును అపహరించువాడు, రాముడు}; విగతకలుషపోషీ = శ్రీరామా {విగతకలుషపోషుడు - విగతకలుష (పుణ్యాత్ములను) పోషించువాడు, రాముడు}; వీరవిద్యాభిలాషీ = శ్రీరామా {వీరవిద్యాభిలాషుడు - వీరత్వము చూపుటందు ఆసక్తికలవాడు, రాముడు}; స్వగురుహృదయతోషీ = శ్రీరామా {స్వగురుహృదయతోషుడు - తన గురువుల మనసులను సంతోషపరచువాడు, రాముడు}; సర్వదాసత్యభాషీ = శ్రీరామా {సర్వదాసత్యభాషి - ఎల్లప్పుడు సత్యమునే పలుకువాడు, రాముడు} .

భావము:

లోకరక్షణకై విహరించువాడ! శత్రువు లందరిని దండించువాడ! సుగుణములనే వనముల యందు విహరించువాడ! అందగత్తెల అభిమానం చూరగొనెడివాడ! పుణ్యాత్ములను పోషించువాడ! వీరత్వం చూపు టందు ఆసక్తి కలవాడ! స్వయంగా గురువుల హృదయాలకు సంతోషం కలిగించువాడ! ఎల్లప్పుడు సత్యమునే పలుకువాడ! శ్రీరామ! నీకు నమస్కారములు.