పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీకృష్ణావతార కథా సూచన

  •  
  •  
  •  

9-732-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గుమొగమున్ సుమధ్యమును ల్లనిదేహము లచ్చి కాటప
ట్టగు నురమున్ మహాభుజము లంచితకుండలకర్ణముల్ మదే
తియు నీలవేణియుఁ గృపారసదృష్టియుఁ గల్గు వెన్నుఁ డి
మ్ముగఁ బొడసూపుఁగాత గనుమూసిన యప్పుడు విచ్చునప్పుడున్."

టీకా:

నగుమొగమున్ = మగుమోము; సు = చక్కటి; మధ్యమును = నడుము; నల్లని = నల్లటి; దేహము = శరీరము; లచ్చి = లక్ష్మీదేవి; కిన్ = కి; ఆటపట్టు = నివాసము; అగు = ఐన; ఉరమున్ = వక్షస్థలము; మహా = గొప్ప; భుజముల్ = భుజములు; అంచిత = అలంకరింపబడిన; కుండల = చెవికుండలముల; కర్ణముల్ = చెవులు; మత్ = మదించిన; ఇభ = ఏనుగువంటి; గతియున్ = నడకలు; నీల = నల్లని; వేణియున్ = శిరోజములు; కృపారస = దయారసము ఒలికెడి; దృష్టియున్ = చూపులు; కల్గు = ఉన్నట్టి; వెన్నుడు = విష్ణువు; ఇమ్ముగన్ = కనులనిండుగా; పొడసూపుగాత = కనిపించిగాక; కను = కళ్ళు; మూసిన = మూసెడి; అప్పుడున్ = సమయమునందు; విచ్చున్ = తెరచు; అప్పుడున్ = సమయమునందు.

భావము:

చిరునవ్వులతో కూడిన ముఖము, చక్కని నడుము, నల్లని దేహము, లక్ష్మీదేవి వసించే వక్షస్థలము, గొప్ప భుజములు, అలంకరింపబడిన కర్ణకుండలాలు చెవులు, మదపుటేనుగ వంటి నడక, నల్లని కురులు, దయా రసం తొణకిసలాడు చూపులు కలిగిన శ్రీమహావిష్ణువు సదా కన్నులు మూసినప్పుడు తెరిచినప్పుడు కన్నుల పండువుగా కనుపించుగాక."