పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : వసుదేవుని వంశము

  •  
  •  
  •  

9-721-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని తగ నియ్యకొల్పి లలితాంగికి గర్భము చేసి మింటికిం
నియె దినేశ్వరుం డపుడు క్కని రెండవసూర్యుడో యనం
రెడు పుత్రుఁ గాంచి కృప ప్పి జగజ్జనవాదభీతయై
యుని నీటఁ బోవిడిచి తా నరిగెం బృథ దండ్రి యింటికిన్.

టీకా:

అని = అని; తగన్ = చక్కగ; ఇయ్యకొల్పి = ఒప్పించి; లలితాంగి = అబల; కిన్ = కి; గర్భమున్ = గర్భము; చేసి = చేసి; మింటికిన్ = ఆకాశమున; కిన్ = కి; చనియెన్ = వెళ్ళిపోయెను; దినేశ్వరుండు = సూర్యభగవానుడు; అపుడున్ = అప్పుడు; చక్కని = అందమైన; రెండవ = రెండవ; సూర్యుడో = సూర్యుడేమో; అనన్ = అనట్లుగ; తనరెడు = అతిశయించెడి; పుత్రున్ = కుమారుని; కాంచి = కని; కృపదప్పి = దయమాలి; జగత్ = లోకములోని; జన = ప్రజల; వాద = నిందలకు; భీత = భయపడినది; ఐ = అయ్యి; తనయుని = పుత్రుని; నీటన్ = నీటిప్రవాహమునందు; పోవిడిచి = వదలి; తాన్ = ఆమె; అరిగెన్ = వెళ్ళిపోయెను; పృథ = పృథ; తండ్రి = తండ్రి యొక్క; ఇంటి = నివాసమున; కిన్ = కు.

భావము:

అని చక్కగా ఒప్పించి ఆ అబల కుంతికి గర్భం చేసి, సూర్యభగవానుడు ఆకాశానికి వెళ్ళిపోయాడు. అప్పుడు, రెండవ సూర్యుడేమో అన్నట్లుగా ప్రకాశిస్తున్న అందమైన కుమారుని ఆమె కన్నది. దయమాలి లోకనిందకు భయపడి, ఆ పుత్రుని నీటిలో వదలి, పృథ తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది.