పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : మరుత్తుని చరిత్ర

  •  
  •  
  •  

9-44-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దిష్టుని కొడుకు నాభాగుం డనువాఁడు కర్మవశంబున వైశ్వత్వంబు నొందె; నా నాభాగునికి హలంధనుండు కలిగె; నతనికి వత్సప్రీతియు, వత్సప్రీతికిఁ బ్రాంశువు, నతనికిఁ బ్రమతియుఁ, బ్రమతికి ఖమిత్రుండు, ఖమిత్రునికిఁ జాక్షుషుండు, నతనికి వివింశతియు, వివింశతికి రంభుండు, రంభునికి ధార్మికుండైన ఖనినేత్రుండు, నతనికిఁ గరంధనుండు, గరంధనున కవిక్షిత్తు, నా యవిక్షిత్తునకు మరుత్తుండు జనియించి; రా మరుత్తుండు చక్రవర్తి యయ్యె; నతని చరిత్రంబు వినుము.

టీకా:

దిష్టుని = దిష్టునియొక్క; కొడుకు = పుత్రుడు; నాభాగుండు = నాభాగుడు; అను = అనెడి; వాడు = వాడు; కర్మవశంబునన్ = తన కర్మవశాత్తు; వైశత్వంబున్ = వైశ్యుడుగానగుటను; ఒందెన్ = పొందెను; ఆ = ఆ; నాభాగున్ = నాభాగుని; కిన్ = కి; హలంధనుండు = హలంధనుడు; కలిగెన్ = పుట్టెను; అతని = అతని; కిన్ = కి; వత్సప్రీతియున్ = వత్సప్రీతి; వత్సప్రీతి = వత్సప్రీతి; కిన్ = కి; ప్రాంశువు = ప్రాంశువు; అతని = అతని; కిన్ = కి; ప్రమతియున్ = ప్రమతి; ప్రమతి = ప్రమతి; కిన్ = కి; ఖమిత్రుండున్ = ఖమిత్రుడు; ఖమిత్రుని = ఖమిత్రుని; కిన్ = కి; చాక్షుసుండున్ = చాక్షుసుడు; అతని = అతని; కిన్ = కి; వివింశతియున్ = వివింశతి; వివింశతి = వివింశతి; కిన్ = కి; రంభుండు = రంభుడు; రంభున్ = రంభుని; కిన్ = కి; ధార్మికుండును = ధార్మికుండు; ఐన = అయినట్టి; ఖనినేత్రుండున్ = ఖనినేత్రుడు; అతని = అతని; కిన్ = కి; కరంధనుండున్ = కరంధనుడు; కరంధనున్ = కరంధనుని; కున్ = కి; అవిక్షిత్తున్ = అవిక్షిత్తు; ఆ = ఆ; అవిక్షిత్తున్ = అవిక్షిత్తుని; కున్ = కి; మరుత్తుండున్ = మరుత్తుడు; జనియించిరి = పుట్టిరి; ఆ = ఆ; మరుత్తుండున్ = మరుత్తుడు; చక్రవర్తి = చక్రవర్తి; అయ్యెన్ = అయ్యెను; అతని = అతనియొక్క; చరిత్రంబు = చరిత్రను; వినుము = వినుము.

భావము:

దిష్టుని పుత్రుడు నాభాగుడు. వాడు తన కర్మవశాత్తు వైశ్యుడుగా అయ్యాడు. ఆ నాభాగుడికి హలంధనుడు పుట్టాడు; అతనికి వత్సప్రీతి; వత్సప్రీతికి ప్రాంశువు; అతనికి ప్రమతి; ప్రమతికి ఖమిత్రుడు; ఖమిత్రునికి చాక్షుసుడు; అతనికి వివింశతి; వివింశతికి రంభుడు; రంభునికి ధార్మికుడు అయిన ఖనినేత్రుడు; అతనికి కరంధనుడు; కరంధనునికి అవిక్షిత్తు; ఆ అవిక్షిత్తునికి మరుత్తుడు పుట్టారు. ఆ మరుత్తుడు చక్రవర్తి అయ్యాడు. అతని చరిత్ర చెప్తాను శ్రద్ధగా విను.