పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : ఋశ్యశృంగుని వృత్తాంతము

  •  
  •  
  •  

9-697-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆ రోమపాదునకుఁ జతురంగుఁడును, జతురంగునకుఁ బృథులాక్షుండును, బృథులాక్షునికి బృహద్రథుండు, బృహత్కర్ముండు బృహద్భానుండు ననువారు మువ్వురు పుట్టి; రందు బృహద్రథునకు బృహన్మనసుఁడు, బృహన్మనసునకు జయద్రథుండు, జయద్రథునకు విజయుండు, విజయునకు సంభూతి యను భార్యయందు ధృతియు, నా ధృతికి ధృతవ్రతుండు, ధృతవ్రతునకు సత్యకర్ముండు, సత్యకర్మునకు నతిరథుండును జన్మించిరి.

టీకా:

ఆ = ఆ; రోమపాదున్ = రోమపాదుని; కున్ = కి; చతురంగుడున్ = చతురంగుడు; చతురంగున్ = చతురంగుని; కున్ = కి; పృథులాక్షుండును = పృథులాక్షుడు; పృథులాక్షుని = పృథులాక్షుని; కిన్ = కి; బృహద్రథుండున్ = బృహద్రథుడు; బృహత్కర్ముండున్ = బృహత్కర్ముడు; బృహద్భానుండున్ = బృహద్భానుడు; అను = అనెడి; వారున్ = వారు; మువ్వురు = ముగ్గురు (3); పుట్టిరి = జనించిరి; అందున్ = వారిలో; బృహద్రథున్ = బృహద్రథున; కున్ = కు; బృహన్మనసుడు = బృహన్మనసుడు; బృహన్మనసున్ = బృహన్మనసున; కున్ = కు; జయద్రథుండున్ = జయద్రథుడు; జయద్రథున్ = జయద్రథున; కున్ = కు; విజయుండున్ = విజయుడు; విజయున్ = విజయున; కున్ = కు; సంభూతి = సంభూతి; అను = అనెడి; భార్య = భార్య; అందున్ = ఎడల; ధృతియున్ = ధృతి; ఆ = ఆ; ధృతి = ధృతి; కిన్ = కి; ధృతవ్రతుండున్ = ధృతవ్రతుడు; ధృతవ్రతున్ = ధృతవ్రతున; కున్ = కు; సత్యకర్ముండున్ = సత్యకర్ముడు; సత్యకర్మున్ = సత్యకర్మున; కున్ = కు; అతిరథుండును = అతిరథుడు; జన్మించిరి = పుట్టిరి.

భావము:

ఆ రోమపాదునికి చతురంగుడు; చతురంగునికి పృథులాక్షుడు; పృథులాక్షునికి బృహద్రథుడు, బృహత్కర్ముడు, బృహద్భానుడు అని ముగ్గురు కలిగారు. వారిలో బృహద్రథునకు బృహన్మనసుడు; బృహన్మనసునకు జయద్రథుడు; జయద్రథునకు విజయుడు; విజయునకు భార్య సంభూతి ఎడల ధృతి; ఆ ధృతికి ధృతవ్రతుడు; ధృతవ్రతునకు సత్యకర్ముడు; సత్యకర్మునకు అతిరథుడు పుట్టారు.