పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : ఋశ్యశృంగుని వృత్తాంతము

  •  
  •  
  •  

9-696-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నృపాలచంద్రుఁ నపత్యుఁడై యుండ
నెఱిగి మునికులేంద్రుఁ డింద్రుఁగూర్చి
యిష్టి చేసి సుతుల నిచ్చె నాతని కృపఁ
బంక్తిరథుఁడు పిదపఁ డసె సుతుల.

టీకా:

ఆ = ఆ; నృపాల = రాజులలో; చంద్రుడు = చంద్రుని వంటివాడు; అనపత్యుడు = కొడుకులు లేనివాడు; ఐ = అయ్యి; ఉండన్ = ఉండగా; ఎఱిగి = తెలిసికొని; ముని = మునుల; కుల = అందరిలోను; ఇంద్రుడు = ఇంద్రుడు; ఇంద్రున్ = దేవేంద్రుని; గూర్చి = గురించి; ఇష్టి = యజ్ఞము; చేసి = చేసి; సుతులన్ = పుత్రులను; ఇచ్చెన్ = కలుగజేసెను; ఆతని = అతని యొక్క; కృపన్ = కరుణచేతనే; పంక్తిరథుడున్ = దశరథుడుకూడ; పిదపన్ = ఆ తరువాత; పడసెన్ = పొందెను; సుతులన్ = పుత్రులను.

భావము:

ఆ రోమపాదరాజచంద్రుడు అపుత్రకుడు అని తెలిసికొని ఋష్యశృంగ మహాముని దేవేంద్రుని గురించి పుత్రకామేష్టియాగం చేసి పుత్రులు కలిగేలా చేసాడు. పిమ్మట అతని కరుణతోనే దశరథుడుకూడ పుత్రకామేష్టి చేసి పుత్రులను పొందాడు.